• facebook
  • whatsapp
  • telegram

లాజికల్‌ వెన్‌ చిత్రాలు

చిత్రం చెప్పే జవాబు!


వందమంది బృందంలో ఇంజినీరింగ్‌ చేసిన అభ్యర్థులు, సైన్స్‌లో డిగ్రీ, సాధారణ గ్రాడ్యుయేషన్‌ ఉన్నవాళ్లు ఎంతెంతమంది ఉన్నారంటే వెంటనే చెప్పడం కష్టం కావచ్చు. పట్టికలో వివరాలు పొందుపరిచినప్పటికీ అవగాహన చేసుకోడానికి కాస్త సమయం పడుతుంది. కానీ చిత్రాల రూపంలో ఉంటే మాత్రం ఒక్క చూపుతో మొత్తం తెలుసుకోవచ్చు. ఆ విధమైన బొమ్మలను తార్కికంగా అర్థం చేసుకోగలిగిన శక్తిని అంచనా వేసేందుకు లాజికల్‌ రీజనింగ్‌లో భాగంగా ‘వెన్‌ డయాగ్రమ్స్‌’ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతుంటారు. సూటిగా,  స్పష్టమైన సమాచారాన్ని అందించే ఆ చిత్రాల మధ్య సంబంధాలను అభ్యర్థులు గ్రహించి సమాధానాలను గుర్తించాలి.

‘లాజికల్‌ వెన్‌ చిత్రాలు’ అనే అంశానికి సంబంధించి ప్రశ్నలో భాగంగా పలు రకాల జ్యామితీయ పటాల సమ్మేళనంతో కూడిన ఒక చిత్రాన్ని ఇస్తారు. ప్రతీ జ్యామితీయ పటం ఏదో ఒక అంశాన్ని సూచిస్తుంది. ఇచ్చిన చిత్రాన్ని జాగ్రత్తగా గమనించి ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించాలి. ఈ జ్యామితీయ పటాలు సాధారణంగా వృత్తాలు, త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలై ఉంటాయి.


I. (1 - 5):  కింది దత్తాంశాన్ని చదివి, సంబంధిత ప్రశ్నలకు సమాధానం గుర్తించండి.

పై పటంలో త్రిభుజం ‘వార్తాపత్రిక A' ని చదివేవారిని, వృత్తం ‘వార్తాపత్రిక  B ’ని చదివేవారిని, దీర్ఘ చతురస్రం ‘వార్తాపత్రిక C’ని చదివేవారిని సూచిస్తాయి.

1.     వార్తాపత్రిక  'A' మాత్రమే చదివేవారి సంఖ్య ఎంత?

1) 30    2) 47    4) 54    4్శ 69

వివరణ: ‘వార్తాపత్రిక తి’ని త్రిభుజం సూచిస్తుంది. ప్రశ్నలో ‘వార్తాపత్రిక A’ మాత్రమే అని అన్నారు. కాబట్టి కేవలం త్రిభుజంలో ఉన్న సంఖ్యలను కలపాలి.

 10 + 20 = 30        

 జ: 1

 


2. వార్తాపత్రికలు  A, B రెండింటినీ చదివేవారి సంఖ్య?

1) 120    2) 135    3) 145     4) 22

వివరణ: వార్తాపత్రిక  A = త్రిభుజం

              వార్తాపత్రిక B = వృత్తం

త్రిభుజం, వృత్తం రెండింటిలో కామన్‌గా ఉన్న సంఖ్యలను పరిగణించాలి.

=15 + 7 =22                    

జ: 4

 


3.  A, B, C వార్తాపత్రికల్లో ఏదో ఒక్కటి మాత్రమే చదివేవారి సంఖ్య?

1)140   2)125    3)135    4)150

వివరణ: వార్తాపత్రిక A = త్రిభుజం

               వార్తాపత్రిక B = వృత్తం 

              వార్తాపత్రిక C = దీర్ఘచతురస్రం

ఈ మూడు జ్యామితీయ పటాల్లో కేవలం ఒకదానిలో మాత్రమే ఉన్న సంఖ్యలను పరిగణించాలి.

10 + 20 + 25 + 40 + 20 + 20 =135 

 జ: 3



4.   మూడు వార్తాపత్రికలూ చదివేవారి సంఖ్య ఎంత?

1) 32     2) 22    3) 45     4) 15

వివరణ: A, B, Cమూడు పటాల్లో ఉమ్మడిగా ఉన్న సంఖ్యలను మాత్రమే పరిగణించాలి.

  జ: 4



5.  వార్తాపత్రిక B  లేదా C చదివేవారి సంఖ్య ఎంత?

1) 220    2)121   3)174     4) 150

వివరణ: వార్తాపత్రిక తీ లేదా ది అన్నారు కాబట్టి



 


II. (6-8): కింది దత్తాంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానం గుర్తించండి.

 


6. కిందివారిలో పట్టణంలో నివసించని, విద్యావంతులైన పురుషులను ఏ సంఖ్య సూచిస్తుంది?

1) 4   2) 5     3) 9    4) 11

వివరణ: పురుషులు = దీర్ఘచతురస్రం

              విద్యావంతులు = త్రిభుజం

             పట్టణంలో నివసించేవారు = వృత్తం

వృత్తంలో లేకుండా దీర్ఘచతురస్రం, త్రిభుజంలో ఉన్న సంఖ్యలను మాత్రమే పరిగణించాలి.  

జ: 4
 

 

7.    కిందివారిలో పురుషులు కాని, పట్టణాల్లో నివసించే ప్రభుత్వ ఉద్యోగులను ఏ సంఖ్య సూచిస్తుంది?

1)10    2) 7    3) 6    4)11

వివరణ: పురుషులు = దీర్ఘచతురస్రం

              పట్టణాల్లో నివసించేవారు = వృత్తం

              ప్రభుత్వ ఉద్యోగులు = చతురస్రం

దీర్ఘచతురస్రంలో కాకుండా వృత్తం, చతురస్రంలోని సంఖ్యలను పరిగణించాలి.     

       

జ: 1



8.     కిందివారిలో పురుషులు కాని, పట్టణాల్లో నివసించని, విద్యావంతులు కాని ప్రభుత్వ ఉద్యోగులను ఏ సంఖ్య సూచిస్తుంది?

1) 11    2) 7     3) 8     4)12

వివరణ: పురుషులు = దీర్ఘచతురస్రం

               విద్యావంతులు = త్రిభుజం

              ప్రభుత్వ ఉద్యోగులు = చతురస్రం

              పట్టణాల్లో నివసించేవారు = వృత్తం

కేవలం చతురస్రంలో ఉన్న సంఖ్యను మాత్రమే పరిగణించాలి.          

     

జ: 2


III. కింది దత్తాంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానం గుర్తించండి.

9.    కిందివాటిలో ఏది సత్యం?

1) A, B లు అన్ని పటాల్లో ఉన్నాయి.

2) E,A,B,C లు అన్ని పటాల్లో ఉన్నాయి.

3) F, C, D, B, A అన్ని పటాల్లో ఉన్నాయి.

4) B మాత్రమే అన్ని పటాల్లో ఉంది.


 కేవలం B మాత్రమే అన్ని జ్యామితీయ పటాల్లో ఉంది.                      

 జ: 4



IV . కింది దత్తాంశాన్ని చదివి ప్రశ్నకు సమాధానం గుర్తించండి.

10. కిందివాటిలో ఏ సంఖ్య చతురస్రం, వృత్తం, త్రిభుజాల్లో ఉంది? 

1) 7     2) 5     3) 6     4) 4

వివరణ:          
               

కేవలం 7 మాత్రమే చతురస్రం, వృత్తం, త్రిభుజాల్లో ఉంది.                         

జ: 1 

Posted Date : 19-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌