• facebook
  • whatsapp
  • telegram

లాజికల్‌ వెన్‌ చిత్రాలు - 2

చిత్రాలు చెప్పే బంధాలు!

పోటీ పరీక్షల్లో లాజికల్‌ వెన్‌ చిత్రాలు విభాగం నుంచి తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో భాగంగా వివిధ రకాల అంశాలకు సంబంధించిన మూడు పదాలు ఇస్తారు. అభ్యర్థి వాటి మధ్య సంబంధాన్ని వెన్‌ చిత్రాల ఆధారంగా వ్యక్తపరచాల్సి ఉంటుంది. ప్రశ్నలో ఇచ్చిన ఒక్కో పదాన్ని ఒక్కో వృత్తం రూపంలో తీసుకోవాలి. 

  

లాజికల్‌ వెన్‌ చిత్రాల్లో అడిగే మరో రకం ప్రశ్నల్లో మూడు పదాలు ఇచ్చి సంబంధాన్ని గుర్తించమంటారు. కొన్ని రకాల సమస్యల పరిష్కారానికి సాధారణంగా ఈ కింది చిత్రాలు ఉపయోగపడతాయి. 

* ఇక్కడ వృత్త పరిమాణం ఆ పదాల లేదా కుటుంబాల పరిమాణాన్ని సూచించదు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. కింది పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసే వెన్‌ చిత్రాన్ని ఎన్నుకోండి.

సెకన్లు, నిమిషాలు, గంటలు

 జవాబు: 4

సాధన: ఒక అంశం మరొక అంశంలో పూర్తిగా భాగం అయినప్పుడు ఒక వృత్తంలో మరొక వృత్తాన్ని రాస్తాం. ఇక్కడ సెకన్లు నిమిషాల్లో భాగం, నిమిషాలు గంటల్లో భాగం కాబట్టి వీటి మధ్య సంబంధం ఈ విధంగా ఉంటుంది.

 

2. కింది పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసే వెన్‌ చిత్రాన్ని గుర్తించండి.

తెలంగాణ, హైదరాబాద్, న్యూదిల్లీ

జవాబు: 2

సాధన: హైదరాబాద్‌ తెలంగాణాలో భాగం, ఈ రెండింటికీ న్యూదిల్లీతో సంబంధం లేదు కాబట్టి

 

3. కింది ప్రశ్నలో ఇచ్చిన పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వెన్‌చిత్రాన్ని ఎన్నుకోండి.

పురుషులు, తండ్రులు, డాక్టర్లు 

జవాబు: 3

సాధన: తండ్రులు అందరూ పురుషులే. కొంతమంది తండ్రులు, కొంతమంది పురుషులు డాక్టర్లుగా ఉండవచ్చు.

 

4. రాజకీయ నాయకులు, ఉద్యోగులు, చిన్న పిల్లలు అనే పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వెన్‌చిత్రాన్ని ఎన్నుకోండి.

జవాబు: 4

సాధన: ఈ మూడింటి మధ్య ఎలాంటి సంబంధం లేదు కాబట్టి 

 

5. కింది పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసే వెన్‌ చిత్రాన్ని గుర్తించండి.

వ్యక్తులు, వివాహితులు, ఉపాధ్యాయులు

జవాబు: 1

సాధన: వివాహితులు, ఉపాధ్యాయులు ఇద్దరూ వ్యక్తులే. అదేవిధంగా వివాహితుల్లో కొందరు ఉపాధ్యాయులు కావచ్చు. ఉపాధ్యాయుల్లో కొందరు వివాహితులై ఉండవచ్చు కాబట్టి 

 

6. పాలు, నీరు, ద్రవపదార్థాలు అనే పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసే వెన్‌ చిత్రాన్ని ఎన్నుకోండి.

జవాబు: 2

సాధన: పాలు, నీళ్లు రెండూ ద్రవ పదార్థాలు. కానీ ఈ రెండింటికీ సంబంధం లేదు కాబట్టి

 

7. సాధు జంతువులు, కుక్కలు, పిల్లులు అనే పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వెన్‌చిత్రాన్ని గుర్తించండి.

జవాబు: 4

సాధన: అన్ని కుక్కలు సాధు జంతువులు కాదు. అదేవిధంగా అన్ని పిల్లులు సాధు జంతువులు కాదు. అంటే కుక్కల్లో కొన్ని, పిల్లుల్లో కొన్ని మాత్రమే సాధు జంతువులు.

 

8. కింది పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వెన్‌ చిత్రాన్ని గుర్తించండి.

సంఖ్యలు, సరి సంఖ్యలు, ప్రధాన సఖ్యలు

జవాబు: 2

సాధన: సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు రెండూ కూడా సంఖ్యలే. కొన్ని ప్రధాన సంఖ్యలు సరి సంఖ్యలు అవుతాయి. 2 అనేది సరి ప్రధాన సంఖ్య కాబట్టి

 

9. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు అనే పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వెన్‌ చిత్రాన్ని గుర్తించండి.

జవాబు: 4

సాధన: ఉపాధ్యాయులందరూ విద్యావంతులే. కొంతమంది విద్యావంతులు నిరుద్యోగులుగా ఉండవచ్చు.

 

రచయిత: గోలి ప్రశాంత్‌రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ పదాల తార్కిక అమరిక

 పజిల్‌ టెస్ట్‌

 ప్రవచనాలు - తీర్మానాలు

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 01-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌