• facebook
  • whatsapp
  • telegram

అయస్కాంతత్వం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. దండాయస్కాంత కేంద్రం వద్ద అయస్కాంతత్వం
జ: శూన్యం
 

2. విద్యుదయస్కాంతం తయారీకి వాడేది-
జ: మెత్తటి ఇనుము
 

3. అయస్కాంత ససెఫ్టబిలిటీ ప్రమాణాలు
జ: ప్రమాణాలు లేవు
 

4. అల్యూమినియం ఏ రకమైన పదార్థం?
జ: పారా
 

5. అయస్కాంత బల రేఖలు-
జ: సంవృతాలు
 

6. విద్యుదయస్కాంతాలను దేనిలో ఉపయోగిస్తారు?
1) విద్యుత్ గంట         2) టెలిఫోన్         3) డైనమో         4) అన్నీ
జ: 4(అన్నీ)
 

7. ధ్రువసత్వానికి ప్రమాణాలు-
జ: A.m
 

8. భారతదేశంలో అయస్కాంత భూమధ్యరేఖ కిందివాటిలో ఏ ప్రాంతానికి దగ్గరగా వెళుతుంది?
1) తిరువనంతపురం         2) శ్రీహరికోట         3) అలహాబాద్         4) శ్రీనగర్
జ: 1(తిరువనంతపురం)
 

9. అయస్కాంతత్వానికి కచ్చితమైన పరీక్ష
జ: వికర్షణ
 

10. కిందివాటిలో ఏ రకమైన పదార్థాలు ఘనస్థితిలో లభిస్తాయి?
1) డయా         2) పారా         3) ఫెర్రో         4) అన్నీ
జ: 3(ఫెర్రో)
 

11. గుర్రపునాడ అయస్కాంతాన్ని ఏ పరికరంలో వాడతారు?
జ: టెలిగ్రాం
 

12. పాదరసం, నీరు ఏ రకమైన అయస్కాంత పదార్థాలు?
జ: డయా
 

13. అయస్కాంత పదార్థాలను మొదట ఏ ప్రాంతంలో కనుక్కున్నారు?
జ: మెగ్నీషియా
 

14. 1 m పొడవు ఉన్న దండాయస్కాంతం మధ్య బిందువు వద్ద ఉన్న అయస్కాంత ధ్రువాల సంఖ్య-
జ: 0
 

15. అయస్కాంత సూచిని మొదటిసారి ఎవరు తయారుచేశారు?
జ: చైనీయులు
 

16. 'భూమి పెద్ద అయస్కాంత గోళం' అని ప్రతిపాదించినవారు-
జ: గిల్‌బర్ట్
 

17. అయస్కాంత పదార్థాలను కలిగి ఉండని పరికరం-
జ: ట్యూబ్‌లైట్
 

18. అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత సూచి అపవర్తనం చెందని బిందువులు-
జ: తటస్థ బిందువులు
 

19. అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం-
జ: త్రిమితీయం
 

20. అయస్కాంత ససెప్టెబిలిటి χ  = .........
జ:  
 

21. శూన్యంలో అయస్కాంత ప్రవేశ్యశీలత ఎంత?
జ: 4π × 10-7 H/m

 

 

22. కిందివాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థం-
1) బంగారం         2) కోబాల్టు            3) రాగి 
జ: కోబాల్టు


23. కింది ప్రవచనాలను పరిశీలించండి- 
ఎ) భూ అయస్కాంత క్షేత్ర అక్షం, భూ భౌగోళిక అక్షానికి 231/2º లోపల ఉంటుంది
బి) ఉత్తరార్థ గోళంలో భూఅయస్కాంత ధ్రువం, ఉత్తర కెనడాలోని ద్వీపకల్పం మీద ఉంది
సి) భూఅయస్కాంత భూమధ్యరేఖ, దక్షిణ భారతదేశంలోని తుంబా మీదుగా పోతుంది
పై ప్రవచనాల్లో సరైంది/ సరైనవి?
జ:  బి, సి


24. కిందివాటిలో అయస్కాంత పదార్థం ఏది?
1) కోబాల్టు          2) కాగితం        3) ఇత్తడి 
జ:  కోబాల్టు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌