• facebook
  • whatsapp
  • telegram

మానవకారక విపత్తు - కొవిడ్‌ - 19

కొవిడ్‌ సంక్షోభంలో రోబోల సేవలు! 

 


చైనాలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా పెను ప్రళయమే సృష్టించింది. రెండు సంవత్సరాలపాటు అన్ని దేశాల వైద్యారోగ్య వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. గతంలో ఎన్నడూ ఎదురుకాని అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. జనజీవనాన్ని, ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని ప్రబలంగా ప్రభావితం చేసిన ఈ జైవిక విపత్తు పరిణామాల గురించి అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. మానవ శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కరోనా వైరస్‌ రూపాంతరాలు, దానిని ఎదుర్కొనే క్రమంలో జరిగిన ఆవిష్కరణలు, టీకాల తయారీలో భాగస్వాములైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, బాధితులకు చికిత్స అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ కాలంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, సంక్షేమ విధానాలపై అవగాహన పెంచుకోవాలి. 

 

 


కొవిడ్‌-19.విపత్తు 2020 సంవత్సరం నుంచి ప్రపంచం మొత్తాన్ని వణికించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రమక్రమంగా ఈ వ్యాధి విజృంభించి, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి. అనేక పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడటంతో నిరుద్యోగం ప్రబలింది. 2021, డిసెంబరు 28 నాటికి ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి బారినపడగా, 54 లక్షల మందికి పైగా మరణించారు. మరణాల్లో అమెరికాది మొదటి స్థానం కాగా, భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.

దక్షిణ చైనాలోని వుహాన్‌ నగరంలో 2019, డిసెంబరు 31న బయటపడిన ఈ వ్యాధి ఏడాది వ్యవధిలోనే ప్రపంచం నలుమూలలకు శరవేగంగా విస్తరించింది. అనేక వేరియంట్లుగా రూపాన్ని మార్చుకుంటూ నేటికీ విస్తరిస్తూనే ఉంది.


మాదిరి ప్రశ్నలు1.    జీ-20 ‘యాక్సెస్‌ టు కొవిడ్‌-19 టూల్స్‌ యాక్సలేటర్‌’ను ఏ దేశం అధ్యక్షతన ప్రారంభించింది?

1) సౌదీ అరేబియా     2) ఖతార్‌ 

3) యూఏఈ     4) ఫ్రాన్స్‌


2.     కొవిడ్‌-19కు సంబంధించి భారతదేశంలో ప్లాస్మా థెరపీని ప్రారంభించిన మొదటి ఆసుపత్రి ఏది?

1) అపోలో హాస్పిటల్స్, చెన్నై

2) ఎయిమ్స్, న్యూదిల్లీ

3) కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీ, ఉత్తర్‌ప్రదేశ్‌

4) ఫోర్టిస్‌ హాస్పిటల్స్, కోల్‌కతా


3.     అతితక్కువ ధరలో ‘రుధార్‌’ అనే మెకానికల్‌ వెంటిలేటర్‌ను రూపొందించిన సంస్థ?

1) ఐఐటీ, బాంబే     2) ఐఐటీ, ఖరగ్‌పుర్‌ 

3) ఐఐటీ, కాన్పుర్‌     4) ఐఐటీ, హైదరాబాదు


4.     ప్రపంచ వ్యాప్తంగా ‘పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్య దినోత్సవం’ ఏ రోజున పాటిస్తారు?

1) జూన్‌ 25     2) జూన్‌ 28 

3) మే 28     4) ఏప్రిల్‌ 4


5.     ఔషధాలను నేరుగా ఇంటి వద్దకు అందించే ‘ధన్వంతరి’ అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?

1) కేరళ     2) అస్సాం 

3) కర్ణాటక     4) తమిళనాడు


6.     కొవిడ్‌-19 రోగులకు సేవలందించడానికి ‘కర్మి - బోట్‌’ అనే రోబోను అభివృద్ధి చేసిన రాష్ట్రం ఏది?

1) పంజాబ్‌ 2) రాజస్థాన్‌ 3) గుజరాత్‌ 4) కేరళ


7.     2020, ఏప్రిల్‌ 24 నుంచి 30 వరకు ‘ప్రపంచ రోగనిరోధకత వారం-2020’ను ఏ ఇతివృత్తంతో నిర్వహించారు?

1) అందరికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్లు    2) కరోనాకు వ్యాక్సిన్లు

3) అందరికీ వ్యాక్సిన్లు     4) ప్రపంచానికి వ్యాక్సిన్లు 


8.    భారతదేశంలో మొదటి కొవిడ్‌-19 శాంపిల్‌ కలెక్షన్‌ మొబైల్‌ ల్యాబ్‌ పేరేంటి?

1) కొవిడ్‌ మొబైల్‌ ల్యాబ్‌     2) మొబైల్‌ కొవిడ్‌ ల్యాబ్‌    

3) మొబైల్‌ కేర్‌ ల్యాబ్‌      4) మొబైల్‌ బీఎస్‌ఎల్‌-3 వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌


9.    ‘మోదీ కిచెన్‌’ను ఏర్పాటు చేసిన రాష్ట్రం?

1) తెలంగాణ     2) ఆంధ్రప్రదేశ్‌ 

3) కర్ణాటక     4) తమిళనాడు


10. లాక్‌డౌన్‌ కాలంలో పిల్లలను ఇంటి వద్దే ఉంచడం కోసం యునిసెఫ్‌తో కలిసి ‘మో ప్రతిభ’ అనే ఆన్‌లైన్‌ కల్చరల్‌ కాంపిటీషన్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?

1) గుజరాత్‌  2) కేరళ  3) అస్సాం  4) ఒడిశా


11.     కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ ఐఐటీ బాంబేలోని ‘సొసైటీ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’ వద్ద రూ.56 కోట్ల మొత్తం వ్యయంతో ఒక ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ సెంటర్‌ 'CAWACH' ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే CAWACH పూర్తి రూపం ఏమిటి?.

1) Centre for Augmenting War with Covid- 19 Health Crisis

2) Centre for Augmenting War with Covid- 19 Health Care

3) Control for Augmenting War with Covid-19 Health Crisis

4) Centre for Aiming War with Covid-19 Health Crisis


12. కొవిడ్‌-19పై పోరాడటానికి ప్రధానమంత్రి రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ పేరు ఏమిటి?

1) ఆత్మనిర్భర్‌ భారత్‌     2) వందేభారత్‌ 

3) రీబిల్డ్‌ ఇండియా     4) ఏదీకాదు


13. ‘ఆపరేషన్‌ సంజీవని’లో భాగంగా భారత వైమానిక దళం ఏ దేశానికి 6.2 టన్నుల ఆవశ్యక ఔషధాలు తీసుకెళ్లింది?

1) మాల్దీవులు     2) మయన్మార్‌ 

3) నేపాల్‌     4) శ్రీలంక 


14. కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ‘ఆపరేషన్‌ షీల్డ్‌’ను ప్రారంభించిన రాష్ట్రం?

1) అస్సాం     2) దిల్లీ 

3) బిహార్‌     4) అరుణాచల్‌ ప్రదేశ్‌


15. కొవిడ్‌-19పై పోరాటం కోసం ‘కోరో-ఫ్లూ’ పేరిట వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్లూజెన్, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కన్‌సిన్‌ మాడిసన్‌తో చేతులు కలిపిన భారతదేశ సంస్థ ఏది?

1) ప్రపంచ ఆరోగ్య సంస్థ        2) ఐసీఎంఆర్‌ 

3) భారత్‌ బయోటెక్‌        4) యూఎన్‌డీపీ


16. యూఎస్‌ఏలో కొవిడ్‌-19 సోకిన మొదటి జంతువు ఏది?

1) సింహం     2) ఎలుగుబంటి 

3) పులి     4) చింపాంజీ


17. ‘కరోనా’ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు? దాని అర్థం ఏమిటి?

1) గ్రీకు, ఖాళీ లేదా కిరీటం    2) చైనిస్, ఖాళీ లేదా కిరీటం

3) లాటిన్, ఖాళీ లేదా కిరీటం    4) ఇంగ్లిష్, ఖాళీ లేదా కిరీటం


18.    కరోనా వైరస్‌ కారణంగా మనుషుల్లో వచ్చే సాంక్రమిక వ్యాధి 'SARS' పూర్తి రూపం ఏమిటి?

1) Severe Active Respiratory Syndrome

2) Suspicious Activity Reporting System

3) Severe Acute Respiratory Syndrome

4) Severe Acute Respiratory Safety


19.    వైరల్‌ వ్యాధి 'MERS' పూర్తి నామం?

1) Mobile Emergency Response Support

2) Middle East Respiratory Syndrome

3) Middle East Respiratory System

4) Multiple Effect Respiratory Syndrome


20. సౌదీ అరేబియాలో ఏ సంవత్సరంలో MERS కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది?

1) 2010  2) 2011  3) 2012  4) 2013


21. కొవిడ్‌ - 19 వ్యాధికారక వైరస్‌ పేరు?

1) MERS - Cov2 2) SARS - Cov2

3) Covid - 19 4) SARS - Cov


22. కరోనా వైరస్‌ పరిస్థితుల్లో ఏ జోన్‌ను ‘హాట్‌స్పాట్‌’గా ప్రస్తావిస్తారు? 

1) ఎల్లో జోన్‌     2) రెడ్‌ జోన్‌ 

3) ఆరెంజ్‌ జోన్‌     4) గ్రీన్‌ జోన్‌


23. భారతదేశంలో ఆరోగ్య సేతు యాప్‌ను ఆవిష్కరించిన కేంద్రమంత్రిత్వ శాఖ ఏది? 

1) ఆరోగ్య, కుటుంబ సంక్షేమం  2) హోం అఫైర్స్‌ 

3) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ  4) ఆయుష్‌ మంత్రిత్వ శాఖ


24. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కరోనా వైరస్‌ రోగికి, అప్పటికే కోలుకున్న కొవిడ్‌-19 రోగుల నుంచి రక్తాన్ని ఎక్కించే చికిత్సా విధానం పేరు ఏమిటి?

1) ర్యాపిడ్‌ టెస్టింగ్‌     2) ప్లాస్మా థెరపీ 

3) పీసీఆర్‌ టెస్టింగ్‌     4) రక్తమార్పిడి


25. కరోనా వైరస్‌ మొదటి కేసును ఎక్కడ గుర్తించారు? 

1) బీజింగ్, చైనా    2) షాంఘై, చైనా

3) వుహాన్, హుబే ప్రావిన్స్, చైనా  4) టియాంజిన్, చైనా


26. వుహాన్‌ నుంచి ఉద్భవించిన కరోనా వైరస్‌కు శాస్త్రవేత్తలు నిర్ధారించిన పేరు?

1) కొవిడ్‌-19     2) వుహాన్‌ చైనా వైరస్‌

3) వుహాన్‌ వైరస్‌     4) సార్స్‌-కోవ్‌-2


27. స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి ప్రపంచంలోని మూడింట ఒక వంతు జనాభాకు సోకింది. 1-5 మిలియన్ల మంది ప్రాణాలు హరించిన ఈ వ్యాధి ఎప్పుడు వ్యాపించింది?

1) 1929   2) 1918   3) 1939  4) 1901


28. కొవిడ్‌-19ను కనిపెట్టడానికి నిర్వహించే పరీక్ష ఏది?

1) ప్యాచ్‌ టెస్ట్‌     2) యాంటీబాడీ టెస్ట్‌ 

3) ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌     4) 2, 3


29. కొవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో భారతదేశంలో కర్ఫ్యూ విధించిన మొదటి రాష్ట్రం ఏది?

1) పంజాబ్‌     2) మహారాష్ట్ర 

3) ఒడిశా     4) ఉత్తర్‌ప్రదేశ్‌


30. దేశంలో పూర్తి లాక్‌డౌన్‌ను అమలుచేసిన మొదటి రాష్ట్రం ఏది?

1) హరియాణా     2) రాజస్థాన్‌ 

3) మహారాష్ట్ర     4) కేరళ


31. రిలయన్స్‌ సంస్థ కొవిడ్‌-19 రోగుల చికిత్స కోసం ఏ నగరంలో ఆసుపత్రిని ప్రారంభించింది?

1) ముంబయి     2) పఠాన్‌కోట్‌ 

3) దిల్లీ     4) కాన్పుర్‌


32. కొవిడ్‌ రోగుల చికిత్స కోసం 12 రోజుల్లో 1000 పడకలతో ‘సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కొవిడ్‌-19 హాస్పిటల్‌’ను నిర్మించిన సంస్థ?

1) మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా      2) డీఆర్‌డీఓ

3) ఐసీఎంఆర్‌       4) నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌


33. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ‘ఆపరేషన్‌ నమస్తే’ను ఎవరు ప్రారంభించారు? 

1) భారత సైన్యం     2) భారత నావికాదళం 

3) భారత తీరప్రాంత భద్రతా దళం  4) భారత వైమానికాదళం


34. కొవిడ్‌-19పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న క్యాంపెయిన్‌కు ఎవరిని ఎంచుకున్నారు? 

1) భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ 

2) భారత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సునీల్‌ ఛెత్రి 

3) భారత క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని

4) భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌


35. కొవిడ్‌-19 రోగులతో నర్సులు, వార్డు బాయ్‌లకు భౌతిక స్పర్శను తగ్గించడానికి అభివృద్ధి చేసిన రోబో పేరు?

1) కరోనా బోట్‌      2) కోరో బోట్‌

3) కొవిడ్‌-19 బోట్‌      4) కొవిడ్‌-బోట్‌సమాధానాలు

1-1, 2-3, 3-1, 4-4, 5-2, 6-4, 7-3, 8-4, 9-4, 10-4, 11-1, 12-1, 13-1, 14-2, 15-3, 16-3, 17-3, 18-3, 19-2, 20-3, 21-2, 22-2, 23-3, 24-2, 25-3, 26-4, 27-2, 28-4, 29-1, 30-2, 31-1, 32-2, 33-1, 34-2, 35-2. 
 

Posted Date : 13-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌