• facebook
  • whatsapp
  • telegram

నాడీ వ్యవస్థ

నియంత్రణ.. సమన్వయాలను నిర్వహించే అద్భుత నిర్మాణం!


నడవడం, పరిగెత్తడం, చదవడం, రాయడం, తెలిసిన వాళ్లను గుర్తుంచుకోవడం, నిప్పు చేతికి తగలగానే బాధను గ్రహించడం మొదలైన వాటినన్నింటినీ నిర్వహించడానికి  శరీరంలో ఒక అద్భుత వ్యవస్థ  ఉంది. అదే మానవ శారీరక విధులను సమన్వయం చేసుకుంటూ, అవసరమైన సమాచారాన్ని అన్ని భాగాలకు చేరవేసే అత్యంత విలువైన నాడీ కణాల నిర్మాణం. ప్రచోదనాలతో ప్రతి చర్యనూ అమలు చేసే ఆ అసాధారణ వ్యవస్థ గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. జీవించడానికి అంత్యంత కీలకమైన హృదయ స్పందన, జీర్ణక్రియ తదితర కార్యకలాపాలను అసంకల్పితంగా కొనసాగించే విధానాన్నీ అర్థం చేసుకోవాలి. 


1. కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి.

ఎ) నాడీవ్యవస్థ బాహ్య ప్రేరణలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తుంది.

బి) మన శరీరంలో సమాచారం నాడీ ప్రచోదనాల రూపంలో ప్రయాణిస్తుంది.

సి) నాడీ ప్రచోదనాలు ఒక ప్రత్యేక మార్గంలోనే ప్రయాణిస్తాయి.    

డి) నాడీ వ్యవస్థ మన శరీరంలో నియంత్రణ,   సమన్వయాన్ని నిర్వహిస్తుంది.

1) ఎ, బి  2) బి, సి 3) సి, డి  4) ఎ, బి, సి, డి


2. నాడీ వ్యవస్థకు సంబంధించిన విధుల్లో సరికాని వాటిని గుర్తించండి. 

ఎ) కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి శరీర భాగాలకు సమాచారాన్ని అందించడం .

బి) శరీర భాగాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు సమాచారాన్ని చేరవేయడం.

సి) సమాచారాన్ని నిల్వ చేస్తుంది, విశ్లేషిస్తుంది.

డి) సమాచారాన్ని నాశనం, విచ్ఛిన్నం చేస్తుంది.

1) ఎ  2) డి  3) సి  4) బి 


3. కింది వాక్యాలను పరిశీలించండి. 

ఎ) నాడీ కణజాలంలోని కణాలు న్యూరాన్‌లు, గ్లియల్‌ కణాలు, న్యూరోసిక్రిటరీ కణాలు.

బి) నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు నాడీ కణాలు.

1) ఎ, బి లు రెండూ సరైనవి. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధాన్ని చూపుతాయి. 

2) ఎ మాత్రమే సరైంది.      

3) బి మాత్రమే సరైంది. 

4) ఎ, బి లు రెండూ సరికావు. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధాన్ని చూపవు.


4. గ్లియల్‌ కణాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.

ఎ) గ్లియల్‌ కణాలనే న్యూరోగ్లియా అని కూడా అంటారు.

బి) ఇవి ఆస్ట్రో గ్లియా, మైక్రో గ్లియా, ఒలిగో డెండ్రో గ్లియా అనే రకాలుగా ఉంటాయి.

సి) ఇవి నాడీ కణాలకు రక్షణ, పోషణను ఇస్తాయి.

డి) నాడీకణాల మధ్య ఉండి జ్ఞాపక శక్తికి ఉపయోగపడతాయి.

1) ఎ, డి   2) ఎ, బి, సి, డి  3) సి, డి   4) బి, సి


5. కిందివాటిలో నాడీకణాలకు సంబంధించి సరికాని జత?

ఎ) సైటాన్‌ - కణ దేహం

బి) డెండ్రైట్స్‌ - పోచల్లాంటి నిర్మాణాలు

సి) ఆక్సాన్‌ - నాడీ ప్రచోదనాల ప్రసారం

డి) మయెలిన్‌ పొర - ఇన్సులేటర్‌లా పనిచేస్తుంది

ఇ) నాడీ కణాల మధ్య ప్రదేశం - రణ్‌వీర్‌ కణుపు

ఎఫ్) సైనాప్స్‌ - నాడీ కణాలపైన ఉండే పొర

1) ఇ, ఎఫ్‌   2) ఎ, బి   3) సి, డి   4) డి, ఇ


6. కిందివాటిలో నాడీ కణాల ప్రత్యేకతలు?

ఎ) నాడీకణాలు మన శరీరంలో అతి పొడవైన కణాలు.

బి) వీటికి విభజన చెందే శక్తి లేదు.

సి) నాడీ కణాలు మూడు రకాలు.

డి) వీటిలో సమాచారం రసాయనిక రూపంలో నిల్వ ఉంటుంది.

1) సి, డి   2) ఎ, డి    3) ఎ, బి   4) బి, డి


7. నాడీ కణాల ద్వారా సమాచార ప్రసారానికి ఉపయోగపడే రసాయనాలకు సంబంధించి సరైన వాక్యం?

ఎ) ఈ రసాయనాలను న్యూరోట్రాన్స్‌ మీటర్లు అంటారు.

బి) ఇవి రెండు నాడీకణాల మధ్య ప్రదేశమైన సైనాప్స్‌లో స్రవిస్తాయి.

సి) సెరటోనిన్, డోపమైన్, ఎసిటైల్‌ కోలిన్‌ లాంటివి న్యూరోట్రాన్స్‌మీటర్లుగా పని చేస్తాయి.

డి) న్యూరోట్రాన్స్‌మీటర్ల లోపం వల్ల పార్కిన్‌సన్‌ వ్యాధి వస్తుంది.

1) ఎ, సి  2) సి, డి  3) ఎ, బి, సి, డి  4) ఎ, డి


8. కిందివాటిలో నాడులకు సంబంధించి సరికాని వాక్యం?

ఎ) నాడీకణాలు కట్టలు, కట్టలుగా కలిసి నాడులను ఏర్పరుస్తాయి.

బి) జ్ఞాన నాడులు జ్ఞానేంద్రియాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు సమాచారాన్ని చేరవేస్తాయి.

సి) చాలక నాడులు శరీర భాగాల నుంచి బయలుదేరి జ్ఞానేంద్రియాలకు సమాచారాన్ని చేరవేస్తాయి.

డి) వెన్ను నాడులు జ్ఞాన నాడులకు ఉదాహరణ.

ఇ) మెదడు నుంచి వెలువడేవి మిశ్రమ నాడులు.

1) సి, డి, ఇ 2) ఎ, బి 3) ఎ, సి   4) బి, డి


9. కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.

1) కేంద్ర నాడీ ఎ) సహానుభూత వ్యవస్థలోని భాగాలు నాడీవ్యవస్థ
2) పరధీయ నాడీ బి) మెదడు, వెన్నుపాము వ్యవస్థలోని భాగాలు    
3) స్వయంచోదిత నాడీ సి) కపాల నాడులు వ్యవస్థలోని భాగాలు 
4) మెదడులోని భాగాలు డి) ఆక్సాన్, డెండ్రైట్‌లు
5) నాడీకణంలోని భాగాలు ఇ) మస్తిష్కం,  అనుమస్తిష్కం

1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ, 5-ఇ

2) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఇ, 5-డి

3) 1-ఎ, 2-సి, 3-ఇ, 4-బి, 5-డి

4) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-బి, 5-సి


10. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) మెదడు నుంచి 12 జతల కపాల నాడులు బయలుదేరతాయి.

బి) వెన్నుపాము నుంచి 31 జతల కశేరు నాడులు బయలుదేరతాయి.

సి) సహానుభూత నాడీవ్యవస్థ ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.

డి) సహానుభూత పరనాడీ వ్యవస్థ లాలాజలం, చెమట గ్రంథుల స్రావాన్ని పెంచుతుంది.

1) ఎ, డి  2) బి, సి  3) సి, డి  4) పైవన్నీ


11. మెదడుకు సంబంధించి కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.

1) మెదడు బరువు   ఎ) ఫ్రీనాలజీ సరాసరి
2) మెదడు ఉపయోగించుకునే బి) మెనెంజస్‌ ఆక్సిజన్‌
3) మెదడు వాడుకునే సి) 1300 గ్రాములు గ్లూకోజ్‌
4) మెదడు చుట్టూ ఉండే డి) 15 శాతం పొరలు
5) మెదడు గురించిన ఇ) 20 శాతం అధ్యయనం

1) 1-సి, 2-ఇ, 3-డి, 4-బి, 5-ఎ

2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ, 5-ఇ

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ

4) 1-ఇ, 2-సి, 3-బి, 4-ఎ, 5-డి


12. కిందివాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి.

ఎ) మెదడు, వెన్నుపాము చుట్టూ వరాశిక, లౌతికళ, మృద్వి అనే పొరలుంటాయి. 

బి) మస్తిష్క మేరుద్రవం మెదడుకు రక్షణ కల్పిస్తుంది.    

సి) ముందు మెదడులో సెరిబెల్లమ్, పాన్స్‌వెరోలి అనే భాగాలుంటాయి.

డి) వెనుక మెదడులో సెరిబ్రమ్, థలామస్‌ అనే భాగాలుంటాయి.

1) ఎ, బి  2) సి, డి  3) ఎ, డి 4) బి, సి, డి


13. మెదడుకు సంబంధించి కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.

1) ఘ్రాణ గ్రాహకాల ఎ) ఆలోచన, తెలివితేటలు, విశ్లేషణ
2) మస్తిష్కం బి) రిలే సెంటర్‌లా పనిచేస్తుంది.
3) థలామస్‌ సి) వాసనను నియంత్రిస్తుంది.
4) హైపోథలామస్‌ డి) మెలటోనిన్‌  హార్మోన్‌ను స్రవిస్తుంది
5) పీనియల్‌ దేహం ఇ) న్యూరోహార్మోన్లను స్రవిస్తుంది.

1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ, 5-ఇ

2) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-డి

4) 1-ఎ, 2-బి 3-డి, 4-సి, 5-ఇ


14. కింది వాక్యాల్లో వెనుక మెదడుకు సంబంధించి సరైంది?

ఎ) వెనుక మెదడులో సెరిబెల్లమ్, మెడుల్లా   అబ్లాంగేటా, పాన్స్‌వెరోలి అనే భాగాలుంటాయి.

బి) సెరిబెల్లమ్‌ను చిన్నమెదడు అని కూడా అంటారు.

సి) మెడుల్లా అబ్లాంగేటా హృదయ స్పందన, శ్వాసక్రియ, దగ్గడం లాంటి వాటిని నియంత్రిస్తుంది.

డి) పాన్స్‌వెరోలి శరీరం రెండు వైపులా ఉండే   కండరాలను సమన్వయం చేస్తుంది.

1) ఎ, బి, సి, డి 2) బి, సి  3) సి, డి 4) ఎ, బి


15. హైపోథలామస్‌ గురించి సరికాని వాక్యం?

ఎ) ఇది న్యూరో హార్మోన్లను స్రవిస్తుంది.

బి) నాడీ వ్యవస్థ, అంతస్రావ వ్యవస్థ మధ్య సంధానకర్తలా పని చేస్తుంది.

సి) మెలటోనిన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

డి) దీన్ని శరీర థర్మోస్టాట్‌ అంటారు.

1) బి   2) సి  3) డి  4) ఎ 


16. వెన్నుపాముకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) ఇది వెన్నుముక ద్వారా ప్రయాణిస్తుంది.

బి) శరీర భాగాల నుంచి మెదడుకు సమాచార   ప్రసరణ నిర్వహిస్తుంది.

సి) అసంకల్పిత ప్రతీకార చర్యలను నిర్వహిస్తుంది.

డి) ఇది కేంద్ర నాడీ వ్యవస్థలో భాగంగా ఉంటుంది.

1) బి, సి  2) సి, డి 3) ఎ, బి, సి, డి  4) ఎ, బి


17. నాడీ వ్యవస్థకు సంబంధించి కింది వ్యాధులను సరైన క్రమంలో అమర్చండి.

1) స్పైనా భిఫిడా   ఎ) నిద్రలేకపోవడం
2) మెనింజైటిస్‌ బి) పాక్షిక లేదా పూర్తి మతిమరుపు
3) అమ్నీషియా సి) బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌
4) పార్కిన్‌సన్‌ వ్యాధి డి) డోపమైన్‌ లోపం
5) ఇన్‌సోమ్నియా ఇ) ఫోలిక్‌ ఆమ్లం లోపం

1) 1-ఎ, 2-సి, 3-డి, 4-ఇ, 5-బి

2) 1-డి, 2-బి, 3-సి, 4-ఇ, 5-ఎ

3) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి

4) 1-ఇ, 2-సి, 3-బి, 4-డి, 5-ఎ


18. కిందివాటిలో వెన్నుపాములో జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య మార్గానికి సంబంధించి సరైంది?

1) అవయవం - వెన్నుపాము - జ్ఞాననాడీ - శరీరభాగం - చాలకనాడీ

2) అవయవం - జ్ఞాననాడీ - వెన్నుపాము - చాలకనాడీ - శరీర భాగం

3) వెన్నుపాము - జ్ఞాననాడీ - అవయవం - చాలకనాడీ - శరీర భాగం

4) చాలక నాడీ - వెన్నుపాము - శరీర భాగం - జ్ఞాననాడీ - అవయవం


19. కిందివాటిలో నాడీవ్యవస్థ వ్యాధులకు సంబంధించి  సరైనవాటిని ఎన్నుకోండి.

ఎ) మెదడులో బీటా అమీలాయిడ్‌ ప్రొటీన్‌ జమకూడటం వల్ల అల్జీమర్స్‌ వ్యాధి వస్తుంది.

బి) అనువంశిక వ్యాధి అయిన ‘హంటింగ్‌టన్‌’ వ్యాధిలో మెదడు కృశిస్తుంది.

సి) మైస్టీనియాగ్రేవిస్‌ అనేది న్యూరోమస్కులర్‌ వ్యాధి.

డి) మల్టిపుల్‌ స్ల్కీసోసిస్‌లో నాడీకణాలపై ఉన్న మయోలిన్‌ పొర నశిస్తుంది.

1) ఎ, బి, సి, డి  

2) బి, సి  

3) సి, డి       

4) ఎ, డి


సమాధానాలు

1-4; 2-2; 3-1; 4-2; 5-1; 6-3; 7-3; 8-1; 9-2; 10-4; 11-1; 12-2; 13-3; 14-1; 15-2; 16-3; 17-4; 18-2; 19-1.


 

రచయిత: డాక్టర్‌ బి. నరేశ్‌ 

Posted Date : 23-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌