• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. CSIR ఆధారిత సంస్థ CIMAP ఏ నగరంలో ఉంది?
జ: లఖ్‌నవూ

 

2. L మెంథాల్ అనే రసాయన పదార్థానికి క్యాన్సర్‌ను నివారించే లక్షణం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పదార్థం కింది ఏ మొక్కల్లో లభిస్తుంది?
      ఎ) మెంథా  బి) టాక్సస్ బకేటా    సి) మెంథా, టాక్సస్ బకేటా  డి) ఏదీకాదు
జ: సి(మెంథా, టాక్సస్ బకేటా)

 

3. పాలిస్టర్ రసాయన నామం ఏమిటి?
జ: పాలీ ఇథిలీన్ టెరీప్తాలేట్

 

4. పాలిస్టర్‌ను జీవ విచ్ఛిత్తి చేయగల బ్యాక్టీరియల్ రకంగా జపాన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నది...?
జ: ఇడియోనెల్లా సకాయిన్సెస్ 201 - F6

 

5. సిసాంపెలోస్ పరైరా అనే వృక్ష జాతి నుంచి కింది ఏ వ్యాధికి ఔషధాన్ని తయారుచేశారు?
      ఎ) చికెన్ గున్యా       బి) స్వైన్ ఫ్లూ       సి) డెంగీ జ్వరం       డి) ఎబోలా
జ: సి(డెంగీ జ్వరం)

 

6. కింది ఏ పామును శాస్త్రవేత్తలు ఇటీవల కొత్తగా కనుక్కున్నారు?
   ఎ) మెలినోఫిడియం పంక్టేటం                                 బి) మెలినోఫిడియం కైరై     
  సి) మెలినోఫిడియం పంక్టేటం, మెలినోఫిడియం కైరై       డి) ఏదీకాదు
జ: బి(మెలినోఫిడియం కైరై)

 

7. బ్రెయిన్ బహుమతి పొందిన శాస్త్రవేత్త/ శాస్త్రవేత్తలు?
      1) టిమోతీ బ్లిస్   2) గ్రాహమ్ కోలిన్‌గ్రిడ్జ్   3) రిచర్డ్ మోరిస్   4) శామ్యూల్ క్లెమెన్స్
జ: 1, 2, 3

 

8. జికా వైరస్ వాహకం ఏది?
జ: ఎడిస్

 

9. కిందివాటిలో ప్రపంచంలో మొదటి వేగవంతమైన యాంటీ రాబిస్ ఔషధం ఏది?
      ఎ) RMAb       బి) hRIG       సి) RMIG       డి) ఏదీకాదు
జ: ఎ(RMAb)

 

10. CSIR ప్రవేశపెట్టిన మొదటి యాంటీ డయాబెటిక్ ఆయుర్వేద మందు ఏది?
జ: BGR 34

 

11. ఇటీవల ఏ రాష్ట్రం స్వైన్ ఫ్లూ (H1N1) వ్యాధిని ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్‌లో చేర్చింది?
జ: పంజాబ్

 

12. జికా వైరస్‌ను మొదట ఏ దేశంలో గుర్తించారు?
జ: ఉగాండా

 

13. కిర్బ్ గౌరవ్ అనే గేదెను క్లోనింగ్ ద్వారా సృష్టించిన CIRB సంస్థ ఎక్కడ ఉంది?
జ: హిస్సార్

 

14. భారతదేశంలో ప్రప్రథమంగా క్లోనింగ్ ద్వారా గేదెను సృష్టించిన సంస్థ ఏది?
జ: NDRI

 

15. కొత్తగా జీవ కృత్రిమ కాలేయాన్ని అభివృద్ధి చేసి కాలేయ వ్యాధిగ్రస్తులకు అందించిన దేశం ఏది?
జ: చైనా

 

16. కేంద్ర వ్యవసాయ, వ్యవసాయదారుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2016 - 17 సంవత్సరానికి ప్రకటించిన BG-II రకానికి చెందిన బీటీ కాటన్ గరిష్ఠ అమ్మకపు ధర ఎంత?
జ: రూ.800

 

17. 'రొటావాక్' కిందివాటిలో ఏ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్?
      ఎ) ఎల్లో ఫీవర్       బి) ఇన్‌ఫ్లుయెంజా       సి) డయేరియా       డి) జ్వరం
జ: సి(డయేరియా)

 

18. H1N1 వైరస్ కిందివాటిలో ఏ ఉపరకానికి (సబ్ టైప్) చెందింది?
      ఎ) ఇన్‌ఫ్లుయెంజా A       బి) ఇన్‌ఫ్లుయెంజా B      
      సి) ఇన్‌ఫ్లుయెంజా C       డి) ఇన్‌ఫ్లుయెంజా D
జ: ఎ(ఇన్‌ఫ్లుయెంజా)

 

19. H1N1 అంటే...
జ: హీమ్ఎగ్లుటినిక్ టైప్ 1, న్యూరమినిడేజ్ టైప్ 1

 

20. ద్రవరూప పెంటా వాలెంట్ వ్యాక్సిన్ అయిన "ComBE Five"ను ఏ కంపెనీ తయారు చేయనుంది?
జ: బయోలాజికల్ ఇ లిమిటెడ్

 

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌