• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యాపోలిక పరీక్ష

పోలిక పట్టుకుంటే... జవాబు చిక్కినట్టే!

  సంఖ్యాపోలిక పరీక్ష అంకగణిత ప్రక్రియలపై ఆధారపడి ఉంది. రెండు సంఖ్యల మధ్య సంబంధాన్ని గుర్తించి, అదే సూత్రాన్ని మిగిలిన వాటికీ ఉపయోగించి సమాధానం కనుక్కోవాలి. తేలిగ్గా కనిపించినా ఒక్కోసారి ప్రశ్నలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఎక్కువ మోడల్‌ ప్రశ్నలను సాధన చేస్తే లాజిక్‌ను త్వరగా గ్రహించడానికి వీలుంటుంది. 

 

a, b ల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో c, d ల మధ్య కూడా అదే సంబంధం ఉంటుంది. 

 

1. 34 : 12 :: 59 : .....

1) 14         2) 47        3) 38         4) 45

జవాబు: 4

సాధన: 3 x 4 = 12 అదేవిధంగా 5 x 9 = 45

 

2. 125 : 64 :: 27 : .....

1) 81        2) 64          3) 125           4) 1

జవాబు: 1

సాధన: చాలా మంది అభ్యర్థులు పై ప్రశ్నను చూసి సులువుగా సమాధానం చేయవచ్చు అనుకుంటారు. ఎందుకంటే 53 : 43 :: 33 : 23 అనుకునే అపోహ ఉంటుంది. అదేవిధంగా అయితే జవాబు 8 ఉండాలి. కానీ అందులో 8 లేదు కాబట్టి కింది విధంగా సాధించాలి.

125 = 1 + 2 + 5 = 82 = 64

27 = 2 + 7 = 92 = 81

 

3. 6 : 18 :: 4 : .....    

1) 2       2) 6     3) 8      4) 16

జవాబు: 3

సాధన: 6 x 3 = 18 అనుకుంటే 4 x 3 = 12 కావాలి. సమాధానాల్లో ఆ సంఖ్య లేదు. కాబట్టి 

 

4. 5 : 150 :: 9 : .....

1) 810       2) 800      3) 720         4) 900

జవాబు: 1 

సాధన: 53 + 52 = 125 + 25 = 150

93 + 92 = 729 + 81 = 810

 

5. కిందివాటిలో (8, 3, 2) కు సరిపోయే జత ఏది?

1) (10, 6, 5)            2) (63, 8, 3)         3) (95, 24, 5)         4) (168, 15, 4)

జవాబు: 2

సాధన: (8, 3, 2) ఏ విధంగా ఉందో అదేపద్ధతిలో దానికి సరిపోయే జతను ఎన్నుకోవాలి.

22 = 4 - 1 = 32 = 9 - 1 = 8 దీన్ని వెనుక నుంచి రాశారు.

అదేవిధంగా 32 = 9 - 1 = 82 = 64 - 1 = 63 కాబట్టి దీన్ని వెనుక నుంచి రాస్తే (63, 8, 3).

 

6. 5 : 100, 4 : 64 :: 4 : 80, 3 : ..... 

1) 26       2) 48      3) 54         4) 60

జవాబు: 2

సాధన: 5 x 20 = 100

  4 x 16 = 64

 అదేవిధంగా 

 4 x 20 = 80

 3 x 16 = 48

 

7. 720 : 840 :: 60 : .....

1) 76          2) 80          3) 70           4) 74

జవాబు: 3

సాధన: 720 ని 120 x 6 గా, 840 ని 120 x 7 గా రాస్తే

ఇందులో 6 : 7 నిష్పత్తి ఉంటుంది.

60 ని 10 x 6 గా, 70 ని 10 x 7 గా రాస్తాం.

కాబట్టి రెండింటి మధ్య 6 : 7 నిష్పత్తి ఉంటుంది.

 

8. 6 : 15 :: 35 : ......

1) 120               2) 80           3) 77        4) 140 

జవాబు: 3

సాధన: 6ను రెండు వరుస ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు.

2 x 3 తర్వాతది 3 x 5 గా రాశారు.

ఇదే పద్ధతిలో 5 x 7 = 35 తర్వాత 7 x 11 = 77 అవుతుంది.

 

9. 30 : 42 :: ..... : 72

1) 56              2) 49             3) 48          4) 64

జవాబు: 1

సాధన: 62 = 36 - 6 = 30

72 = 49 - 7 = 42

82 = 64 - 8 = 56

92 = 81 - 9 = 72

 

10. 27 : 81 :: 125 : .....

1) 625             2) 615          3) 3125          4) 1225

జవాబు: 1

సాధన: 33 = 27, 34 = 81, 53 = 125, 54 = 625

 

11.  

జవాబు: 2

సాధన: 17 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 19 

23 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 29  

43 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 47

అదేవిధంగా 53 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 59  

 

12. 7 : 49 :: 13 : ....

1) 169             2) 91           3) 55         4) అన్నీ

జవాబు: 4

సాధన: 7 x 7 = 49 13 x 7 = 91

72 = 49 132 = 169

7 + 42 = 49 13 + 42 = 55

లాజికల్‌గా చూస్తే పై మూడు సమాధానాలు సరైనవే

 

రచయిత: బిజ్జుల విష్ణువర్ధన్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 దిశ నిర్దేశ పరీక్ష

 సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌

  పజిల్‌ టెస్ట్‌

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 06-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌