• facebook
  • whatsapp
  • telegram

నంబర్‌ పజిల్స్‌

చిక్కు ప్రశ్నలను చక్కగా చేసేద్దాం!

సాధారణంగా పోటీ పరీక్షల్లో రీజనింగ్‌ ప్రశ్నలు నిర్దిష్ట సరళిని అనుసరించి ఉంటాయి. కానీ ఒకే రకమైన నియమాలపై ఆధారపడకుండా, ఒకదానికొకటి పోలిక లేకుండా ఉండే కొన్ని రకాల చిక్కు ప్రశ్నలను అనలిటికల్‌ రీజనింగ్‌లో భాగంగా అడుగుతుంటారు. వాటికి సరైన సమాధానాలను కనిపెట్టాలంటే సమాచారాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించడం, నమూనాలను గుర్తించడం, తార్కిక ముగింపును సూచించడం వంటి నైపుణ్యాలను కలిగి ఉండాలి. ప్రధానంగా సంఖ్యల మధ్య సంబంధాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అందుకోసం వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి.  


పోటీ పరీక్షల్లో ‘అనలిటికల్‌ రీజనింగ్‌’లో భాగంగా పలు రకాల పజిల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. వీటిలో వర్డ్‌ పజిల్స్, లాజిక్‌ పజిల్స్, సీక్వెన్స్‌ పజిల్స్, ఇంటర్వ్యూ పజిల్స్, మిస్సింగ్‌ లెటర్‌ పజిల్స్, పిక్చర్‌ పజిల్స్, నంబర్‌ పజిల్స్‌ లాంటివి ముఖ్యమైనవి. ఈ నంబర్‌ పజిల్స్‌ అంశానికి సంబంధించిన ప్రశ్నలకు ఒక నిర్దిష్టమైన సరళి అంటూ ఏమీ ఉండదు. ఇచ్చిన ప్రశ్నల్లో వివిధ రకాల నియమాల ఆధారంగా సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. 


మాదిరి ప్రశ్నలు


 1.  ప్రశ్నార్థకం స్థానంలో రావల్సిన అంకెను కనుక్కోండి.

1) 2    2) 0    3) 5    4) 4 

వివరణ: పై వరుస నుంచి, కింది వరుస వరకు సంఖ్యలను గమనించగా 

9 x 8 = 72

72 x 8 = 576

576 x 8 = 4608

జ: 2


2. ప్రశ్నార్థక స్థానంలోని సంఖ్యను కనుక్కోండి.

1) 9   2) 8   3) 1   4) 17 

వివరణ: కర్ణ మూలాలపైన ఉన్న సంఖ్యలు, వాటి ఎదుటి పాదాల వద్ద ఉన్న సంఖ్యల మొత్తం. 

8 + 5 = 13

5 + 7 = 12

1 + 7 = 8

4 + 1 = 5

7 + 4 = 11

7 + 7 = 14

7 + 9 = 16 కాబట్టి 

9 + 8 = 17

జ: 4


3.    

ప్రశ్నార్థక స్థానంలో రావాల్సిన సంఖ్య ఎంత? 

1) 53   2) 35    3) 55    4) 50

వివరణ: ప్రతి గ్రిడ్‌లో పొందుపరిచిన సంఖ్య ఆ గ్రిడ్‌ స్థానాన్ని సూచిస్తుంది. అంటే 

14 = 1వ అడ్డు వరుస, 4వ నిలువ వరుస

22 = 2వ అడ్డు వరుస, 2వ నిలువు వరుస కాబట్టి 

? = 5వ అడ్డు వరుస, 5వ నిలువు వరుస 

జ: 3


4. 

ప్రశ్నార్థక స్థానంలో రావల్సిన సంఖ్య

1) 12   2) 21    3) 10   4) 14 

వివరణ: మూడు అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం అనేది రెండు అంకెల సంఖ్యగా వచ్చింది అంటే

268 = 2 + 6 + 8 = 16 

359 = 3 + 5 + 9 = 17 

516 = 5 + 1 + 6 = 12 

263 = 2 + 6 + 3 = 11

జ: 1


5. కింది పిరమిడ్‌లో ప్రతీ సంఖ్యా, దాని కింద ఉన్న రెండు సంఖ్యల మొత్తానికి సమానం. అయితే పిరమిడ్‌లో లోపించిన సంఖ్యల మొత్తం ఎంత? 

1) 207   2) 237    3) 183    4) 197 

వివరణ: ప్రతీ సంఖ్యా, దాని కింద ఉన్న రెండు సంఖ్యల మొత్తానికి సమానం కాబట్టి

లోపించిన సంఖ్యల మొత్తం = 2 + 5 + 9 + 3 + 12 + 16 + 12 + 28 + 47 + 103 = 237 

జ: 2


6. ప్రశ్నార్థక స్థానంలో రావల్సిన సంఖ్య-  

2 (38)3 

4 (1524)5 

6 (3548)7 

8 (?)9

1) 6083  2) 6803  3) 6830  4) 6380

వివరణ: బ్రాకెట్‌ లోపల సంఖ్యలు, బయట ఉన్న సంఖ్యలను వర్గం చేసి 1 తగ్గించగా ఏర్పడిన సంఖ్యలు కాబట్టి  

జ: 4


7. కింది పటంలోని రేఖలు ఎన్ని? 

1) 11   2) 10   3) 13   4) 9

వివరణ: ఇచ్చిన పటాన్ని పరిశీలించగా రేఖల సంఖ్య 10 అని తెలుస్తుంది. 

జ: 2 


8. కింది పటంలో లోపించిన భాగాన్ని గుర్తించండి. 

వివరణ: అడ్డు, నిలువు వరుసల్లోని ప్రతి సంఖ్యా, దాని ముందున్న రెండు సంఖ్యల మొత్తానికి సమానం. 

జ: 1


9.  ప్రశ్నార్థక స్థానంలో రావల్సిన సంఖ్యను కనుక్కోండి. 

1) 8  2) 10  3) 6  4) 9

వివరణ: త్రిభుజాల్లోని సంఖ్యల మొత్తం = 11 + 18 + 4 = 33 

వృత్తాల్లోని సంఖ్యల మొత్తం = 12 + 5 +16 = 33 

చతురస్రాల్లోని సంఖ్యల మొత్తం = 8 + 19 + x = 33 

x = 6 

జ: 3 


10. ప్రశ్నార్థక స్థానంలో రావల్సిన సంఖ్య ఎంత?

1) 201    2) 208    3) 301   4) 308 

వివరణ: సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఆ సంఖ్యకు కలపడం ద్వారా ఆ తరువాతి సంఖ్య ఏర్పడింది. 

147 = 1 + 4 + 7 = 12 

147 + 12 = 159 

కాబట్టి

1 + 8 + 6 = 15 

186 + 15 = 201 

జ: 1 

 రచయిత : గోలి ప్రశాంత్ రెడ్డి

 


 

Posted Date : 06-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌