• facebook
  • whatsapp
  • telegram

వర్గసమీకరణాలు 

వర్గసమీకరణాలు  (Quadratic Equations) 


ముఖ్యాంశాలు


a, b, cవాస్తవ సంఖ్యలై a ≠ 0  అయితేax2 + bx + c = 0 ను x లో వర్గసమీకరణం అంటారు.


 p(x)ఒక వర్గబహుపది అవుతుంటే,p(x) = 0 రూపంలో ఉన్న వాటిని వర్గసమీకరణాలు అంటారు.


ఉదా:x2 + 4x + 3 = 0,

 2x2 − 3x + 5 = 0 మొదలైనవి.


వర్గసమీకరణ సాధారణ రూపం: a, b, c ∈ R; a ≠ 0అయితే ax+ bx + c = 0 ను వర్గసమీకరణ సాధారణ రూపం అంటారు.


మోనిక్‌ వర్గసమీకరణం: ax2 + bx + c = 0 (a ≠ 0) వర్గసమీకరణంలో a= 1  అయితే ఆ వర్గసమీకరణాన్ని ‘మోనిక్‌ వర్గ సమీకరణం’ అంటారు.


ఉదా: x− 7x + 10 = 0


శుద్ధ వర్గసమీకరణం: ax2 + bx + c = 0 లో b = 0అయితే ఆ వర్గసమీకరణాన్ని శుద్ధవర్గసమీకరణం అంటారు.


ax2 + c = 0ను శుద్ధసమీకరణం  అంటారు.


ఉదా: x2 − 4 = 0, 4x2 − 9 = 0

మాదిరి సమస్యలు


1.  5x− x + 1 = 0వర్గసమీకరణం మూలాలు...


1) వాస్తవాలు, సమానాలు 


2) వాస్తవాలు, అసమానాలు


3) సంకీర్ణాలు      


4) ఏదీకాదు


సాధన: 5x2 − x + 1 = 0 ను   ax2 + bx + c = 0 తో పోలిస్తే, a = 5, b = −1, c = 1


విచక్షణి (∆) = b2 − 4ac

= (−1)2 − 4(5)(1)

= 1 − 20 = −19 < 0 విచక్షణి (∆) < 0, \  కాబట్టి మూలాలు సంకీర్ణాలు.


సమాధానం: 3

2.   3x2 − 6x + 11 = 0అనే వర్గసమీకరణానికి మూలాల మొత్తం, మూలాల లబ్ధం  వరుసగా....

సాధన:

 3x2 − 6x + 11 = 0 ను 

ax+ bx + c = 0  తో పోలిస్తే,  a = 3, b = −6, c = 11 

మూలాల మొత్తం   

   

మూలాల లబ్ధం

సమాధానం: 1

3. x2 − kx + 25 = 0 కి సమాన మూలాలు ఉన్నాయి. అయితే k విలువ.....

1) ± 5   2) ± 10      3) ± 15       4) ± 25 

సాధన: x2 − kx + 25 = 0 ను ax2 + bx + c = 0 తో పోలిస్తే, a = 1, b = −k, c = 25

x2 − kx + 25 = 0 కి సమాన మూలాలు ఉంటే, b− 4ac = 0 అవుతుంది.

⇒ (−k)2 − 4 (1)(25) = 0

⇒ k2 − 100 = 0

⇒ k2 = 100 ⇒ k = √ 100 = ± 10

∴ k = ± 10 

సమాధానం: 2

4. −3, −4 మూలాలుగా ఉన్న వర్గసమీకరణం...

1) x2 + 7x + 12 = 0   2) x2 − 7x + 12 = 0   3) x2 + 7x − 12 = 0   4) x2 − 7x − 12 = 0 

సాధన:  α = −3, β = −4  కావాల్సిన వర్గసమీకరణం 

= x2 − (α + β)x + αβ = 0

⇒ x2 − (−3 −4)x + (−3)(−4) = 0

⇒ x2 + 7x + 12 = 0

సమాధానం: 1

5. √ 3x2 + 6 = 9  ధనాత్మక మూలం....

1) 4        2) 5        3) 6          4) 1 

సాధన: √ 3x2 + 6 = 9

⇒ 3x2 + 6 = 92 = 81

⇒ 3x2 = 81 − 6 = 75 

⇒ x = √ 25 = ± 5

∴ x = 5

సమాధానం: 2

6. 5x2 − kx + 11 = 0 కి ఒక మూలం 3 అయితే kవిలువ ఎంత?

సాధన: 5x2 − kx + 11 = 0 కి ఒక మూలం 3

⇒ 5(3)2 − k(3) + 11 = 0

⇒ 45 − 3k + 11 = 0

⇒ 56 − 3k = 0

⇒ 3k = 56 

సమాధానం: 4

7. 3x2 − kx + 11 = 0  వర్గసమీకరణానికి మూలాల మొత్తం 7/3 అయితే k = ... 

సాధన:  3x2 − kx + 11 = 0 ను ax2 + bx + c = 0 తో పోలిస్తే,

సమాధానం: 1

8. 7(2x − 3)2 − 12(2x − 3) − 4 = 0 వర్గసమీకరణానికి ఒక మూలం....

సాధన: 2x − 3 = t అనుకోండి.

7t2 − 12t − 4 = 0

⇒ 7t2 − 14t + 2t − 4 = 0

⇒ 7t(t − 2) + 2(t − 2) = 0

⇒ (t − 2)(7t + 2) = 0

⇒ t − 2 = 0 లేదా 7t + 2 = 0

సమాధానం: 1

9. sinα, cosα లు   ax2 + bx + c = 0 వర్గసమీకరణానికి మూలాలు అయితే కిందివాటిలో సరైంది ఏది?

1) a2 − b2 = ac

2) a2 + 4ac = b2

3) a2 + 2bc = c2

4) a2 + 2ac = b2 

సాధన: ax2 + bx + c = 0 మూలాలు  = sinα, cosα

10. x2 + 2mx + m2 − 2m + 6 = 0 వర్గసమీకరణ మూలాలు సమానం అయితే m విలువ ఎంత?

1) 3         2) 2       3) 1      4) 0

సాధన: x2 + 2mx + m2 − 2m + 6 = 0నుax2 + bx + c = తో పోలిస్తే,a = 1, b = 2m, c = m− 2m + 6 మూలాలు సమానం కాబట్టి, b2 = 4ac

⇒ (2m)2 = 4(1) (m2 − 2m + 6)

⇒ 4m2 = 4 (m2 − 2m + 6)

⇒ m2 = m2 − 2m + 6

⇒ 2m = 6 

సమాధానం: 1

1) x2 − 2ax + a = 0

2) x2 − 2ax − a = 0 

4) x2 − ax + 1 = 0

α, β మూలాలుగా ఉన్న వర్గసమీకరణం...

x2 − (α + β)x + αβ = 0

సమాధానం: 3

12. px2 − 2x + 2 = 0 వర్గసమీకరణం వాస్తవ మూలాలు కలిగి ఉంది. అయితే p విలువ...

సాధన: px2 − 2x + 2 = 0 ను ax2 + bx + c = 0తో పోలిస్తే,

a = p, b = −2, c = 2

px2 − 2x + 2 = 0 

మూలాలు వాస్తవ మూలాలు అయితే, ∆ ≥ 0 ⇒ b2 − 4ac ≥ 0

⇒ (−2)2 − 4(p)(2) ≥ 0

⇒ 4 − 8p ≥ 0

⇒ −8p ≥ −4

⇒ 8p ≤ 4

సమాధానం: 3

Posted Date : 20-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌