• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో మత వైవిధ్యం

మాదిరి ప్రశ్నలు

 

1. వర్ణాశ్రమ ధర్మ పరిరక్షకుడనే బిరుదున్న శాతవాహన చక్రవర్తి ఎవరు?
   ఎ) శ్రీముఖుడు    బి) గౌతమీపుత్ర శాతకర్ణి    సి) హాలుడు    డి) యజ్ఞశ్రీ శాతకర్ణి
జ: (బి)

 

2. వైదిక మతంతోపాటు శాతవాహనులు ఆదరించిన మరో మతం?
   ఎ) బౌద్ధం    బి) జైనం    సి) శైవం    డి) పైవన్నీ
జ: (ఎ)

 

3. శాతవాహనుల కాలంలో సామాన్య ప్రజలు అనుసరించిన మతం?
   ఎ) హిందూ    బి) బౌద్ధం    సి) జైనం    డి) ఏదీకాదు
జ: (బి)

 

4. 'సుహృల్లేఖ'ను రచించింది ఎవరు?
   ఎ) హాలుడు    బి) గుణాఢ్యుడు    సి) నాగార్జునుడు    డి) బాణుడు
జ: (సి)

 

5. మలి శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ ఏ మత కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది?
   ఎ) మహాయానం    బి) హీనయానం    సి) వజ్రాయానం    డి) జైనమతం
జ: (ఎ)

 

6. శ్రీపర్వతం స్తూపాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు?
   ఎ) యజ్ఞశ్రీ శాతకర్ణి    బి) గౌతమీపుత్ర శాతకర్ణి    సి) హాలుడు    డి) శ్రీముఖుడు
జ: (ఎ)

 

7. మహాయాన బౌద్ధ మతానికి కరదీపికగా భావించే గ్రంథం?
   ఎ) ప్రజ్ఞాపారమిత    బి) గాథాసప్తశతి    సి) బృహత్కథ    డి) సుహృల్లేఖ
జ: (ఎ)

 

8. ఇక్ష్వాకుల రాజధాని ఏది?
   ఎ) శ్రీపర్వతం    బి) విజయపురి    సి) అమరావతి    డి) ఎ, బి
జ: (డి)

 

9. అశ్వమేధ, రాజసూయాది యాగాలు చేసిన ఇక్ష్వాక రాజు ఎవరు?
   ఎ) శ్రీశాంతమూలుడు    బి) వీరపురుషదత్తుడు    సి) ఎహూవుల చాంతమూలుడు    డి) ఎవరూ కాదు
జ: (ఎ)

 

10. వీరగళ్‌ల ఆరాధన సంప్రదాయం ఎవరి కాలం నుంచి ప్రారంభమైంది?
   ఎ) శాతవాహనులు    బి) ఇక్ష్వాకులు    సి) విష్ణుకుండినులు    డి) చాళుక్యులు
జ: (బి)

 

11. పదకొండు అశ్వమేధ యాగాలు చేసిన విష్ణుకుండిన పాలకుడు ఎవరు?
   ఎ) గోవింద వర్మ    బి) రెండో మాధవవర్మ    సి) రెండో విక్రమేంద్ర వర్మ    డి) నాలుగో మాధవ వర్మ
జ: (బి)

 

12. విష్ణు కుండినుల కాలంలో ప్రసిద్ధి చెందిన శివ-విష్ణు-శక్తి కేంద్రం ఏది?
   ఎ) మంచికల్లు    బి) విజయపురి    సి) నాగార్జున కొండ    డి) ఏదీకాదు
జ: (ఎ)

 

13. దేవాలయాలను నిర్మించే సంప్రదాయాన్ని ప్రారంభించింది ఎవరు?
   ఎ) ఇక్ష్వాకులు    బి) విష్ణుకుండినులు    సి) చాళుక్యులు    డి) శాతవాహనులు
జ: (బి)

 

14. చాళుక్య పాలకులు ప్రోత్సహించి ప్రాచుర్యం కల్పించిన మతం?
   ఎ) బౌద్ధ    బి) జైన    సి) వైష్ణవం    డి) శైవం
జ: (డి)

 

15. శ్రీశైల క్షేత్రానికి నాలుగు ద్వారాలుగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో కింద ఇచ్చిన ఏ జత సరైంది?
   ఎ) త్రిపురాంతకం-తూర్పు    బి) ఆలంపూర్-దక్షిణం    సి) సిద్దవటం-ఉత్తరం    డి) ఉమామహేశ్వరం-పడమర
జ: (ఎ)

 

16. బుద్ధుడు యోగముద్రలో ఉండి, చుట్టూ విష్ణువు దశావతారాలు చెక్కిన శిల్పాలున్న ప్రసిద్ధ క్షేత్రం ఏది?
   ఎ) ఆలంపూర్    బి) శ్రీశైలం    సి) అమరావతి    డి) విజయపురి
జ: (ఎ)

 

17. బౌద్ధమతం క్రమంగా ఆదరణ కోల్పోవడం ఎవరి కాలం నుంచి ప్రారంభమైంది?
   ఎ) ఇక్ష్వాకులు    బి) విష్ణుకుండినులు    సి) చాళుక్యులు    డి) కాకతీయులు
జ: (సి)

 

18. జైన మతాన్ని విశేషంగా ఆదరించిన చక్రవర్తులు?
   ఎ) చాళుక్యులు    బి) కాకతీయులు    సి) విష్ణుకుండినులు    డి) శాతవాహనులు
జ: (ఎ)

 

19. చాళుక్యుల కాలంలో తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం?
   ఎ) ఆలంపూర్    బి) శ్రీశైలం    సి) కాళేశ్వరం    డి) వేములవాడ
జ: (డి)

 

20. 'త్రిభువన తిలక' అనేది ఒక ... ?
   ఎ) జైన వసతి    బి) బౌద్ధారామం    సి) చాళుక్య ప్రభువు పేరు    డి) ఏదీకాదు
జ: (ఎ)

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌