• facebook
  • whatsapp
  • telegram

శరీర పోషణలో శక్తి జనకాలు!

1. మొక్కల దుంపలు, ఫలాల్లో కింది ఏ పాలీశాఖరైడ్‌ కార్బోహైడ్రేట్‌ ఎక్కువగా ఉంటుంది?

1) పిండిపదార్థం    2) గ్లైకోజెన్‌    3) ఇన్యులిన్‌     4) గ్లూకోజ్‌

జ: పిండిపదార్థం

   

2. మానవునిలో నిల్వ ఉండే కార్బోహైడ్రేట్‌ అని దేన్ని అంటారు?

1) ఇన్సులిన్‌    2) గ్లైకోజెన్‌      3) గ్లూకోజ్‌     4) ఫ్రక్టోజ్‌

జ: గ్లైకోజెన్‌ 

   

3. రక్తంలో ఉండే చక్కెర, నేరుగా శోషణం చెందే చక్కెర అని దేన్ని పిలుస్తారు?

1) లాక్టోజ్‌     2) మాల్టోజ్‌      3) గ్లూకోజ్‌      4) సుక్రోజ్‌

జ: గ్లూకోజ్‌ 

   

4. పాలలో ఉండే చక్కెర అయిన లాక్టోజ్‌ కింది వేటి కలయిక?

1) గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌    2) మాల్టోజ్, గ్లూకోజ్‌     3) గాలక్టోజ్, ఫ్రక్టోజ్‌     4) గాలక్టోజ్, గ్లూకోజ్‌

జ: గాలక్టోజ్, గ్లూకోజ్‌

   

5. చెరకు రసంలో ఉండే చక్కెర, రోజూ వాడే చక్కెర అని దేన్ని అంటారు?

1) ఫ్రక్టోజ్‌     2) మాల్టోజ్‌     3) సుక్రోజ్‌      4) లాక్టోజ్‌

జ: సుక్రోజ్‌ 

   

6. ట్రైశాఖరైడ్‌ అయిన రాఫినోజ్‌ కింది వేటిలో ఉంటుంది?

1) పత్తిగింజల పిండి     2) బంగాళాదుంప     3) క్యారెట్‌     4) సముద్ర శైవలాలు

జ: పత్తిగింజల పిండి

   

7. పాలిశాఖరైడ్‌ అయిన సెల్యులోజ్‌ ప్రత్యేకతలు..

1) ఇది మొక్కల కణకవచాల్లో ఉంటుంది      2) ప్రకృతిలో అతి ఎక్కువగా ఉండే సేంద్రియ పదార్థం     3) జనపనార, పత్తిలో ఎక్కువగా ఉంటుంది      4) పైవన్నీ

జ: పైవన్నీ

   

8. జిలిడియం, గ్రాసిలేరియా వంటి శైవలాల నుంచి లభించే పాలిశాఖరైడ్‌

1) సెల్యులోజ్‌     2) ఇన్యులిన్‌     3) అగార్‌     4) గమ్‌అరాబిక్‌

జ: అగార్‌ 
 

Posted Date : 03-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌