• facebook
  • whatsapp
  • telegram

 భార‌త‌దేశం - నేల‌లు/మృత్తిక‌లు

1. దేశంలో విస్తరించి ఉన్న నేలల్లో అత్యంత సారవంతమైనవి ఏవి?
జ: ఒండ్రు నేలలు


2. నీటి ఎద్దడి నెలకొన్నప్పుడు 'పగుళ్లు' ఏర్పడే నేలలు ఏవి?
జ: నల్లరేగడి నేలలు


3. ఎర్ర నేలలు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం?
జ: ఫెర్రస్ ధాతువు


4. కొత్త ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు?
జ: ఖాదర్


5. తోట పంటలకు అనుకూలమైన నేలలు ఏవి?
జ: లాటరైట్ నేలలు


6. ఇసుక నేలలు/ ఎడారి నేలలు అధికంగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది?
జ: రాజస్థాన్


7. 'బసాల్ట్' శిలలు క్రమక్షయం చెందగా ఏర్పడే నేలలు?
జ: నల్లరేగడి నేలలు

 

8. దేశంలో విస్తరించి ఉన్న నేలల్లో సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే మూలకం?

జ: నత్రజని


9. అధిక వర్షపాతం, అధిక నీటిపారుదల పద్ధతుల వల్ల ఏర్పడే నేలలు ఏవి?
జ: లవణ నేలలు


10. కింది ఏ నేలలు నీటిని అధిక కాలం పాటు నిల్వ ఉంచుకోగలవు?
1) నల్లరేగడి నేలలు   2) లాటరైట్ నేలలు    3) లవణ నేలలు    4) పీట్ నేలలు
జ: 1 (నల్లరేగడి నేలలు)


11. నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ...?
జ: పెడాలజీ


12. పప్పు ధాన్యాలకు అనుకూలమైన నేలలు ఏవి?
జ: ఎర్ర నేలలు


13. నదీ నిక్షేపణ వల్ల ఏర్పడే నేలలు ఏవి?
జ: ఒండ్రు నేలలు


14. నల్లరేగడి నేలలు అధికంగా విస్తరించి ఉన్న రాష్ట్రం?
జ: మహారాష్ట్ర


15. జీవ సంబంధ పదార్థం ఎక్కువగా సంచయనం కావడం వల్ల ఏర్పడే నేలలు?
జ: పీట్ నేలలు

Posted Date : 11-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌