• facebook
  • whatsapp
  • telegram

తరంగాలు (ధ్వని)

 

* కణాలను కలిగి ఉన్న ప్రావస్థ లేదా పదార్థాలను 'యానకం' అని అంటారు. ఈ యానకం ఘన, ధ్రవ, వాయుస్థితుల్లో ఉండవచ్చు.
             ఘనస్థితి యానకం: మంచు, ఇనుము మొదలైనవి
             ద్రవస్థితి యానకం: నీరు, ఆల్కహాల్ మొదలైనవి
             వాయుస్థితి యానకం: గాలి, హైడ్రోజన్ మొదలైనవి


యానకంలో కలిగే అలజడినే 'తరంగం' (WAVE) అని అంటారు.
* వాస్తవిక, భౌతిక బదిలీ లేకుండా లేదా ద్రవ్యం మొత్తంగా ప్రవహించకుండా చలించే అలజడులను 'తరంగాలు' అంటారు.
* తరంగాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి శక్తిని బదిలీ చేస్తాయి.
* తరంగాలు శక్తి రవాణాలను సూచిస్తాయి.
* అన్ని సంసర్గాలు (Communications) తప్పనిసరిగా తరంగాల ద్వారా జరిగే సంకేతాల ప్రసారాలపై ఆధారపడతాయి.
* తరంగాలు రెండు రకాలు
     1. యాంత్రిక తరంగాలు
     2. విద్యుదయస్కాంత తరంగాలు.
* తరంగ ప్రసరణకు 'యానకం' అవసరమైనటువంటి తరంగాలను యాంత్రిక తరంగాలు అని అంటారు.
* యానకం, శూన్యంలో కూడా ప్రసరించే తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అని పిలుస్తారు.
* యానకం లేని ప్రదేశాన్ని 'శూన్యం' అని అంటారు.
* యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు.
* తీగపై తరంగాలు, నీటి తరంగాలు, ధ్వని తరంగాలు, భూకంప తరంగాలు అనేవి యాంత్రిక తరంగాలు. ఇవి శూన్యంలో ప్రయాణించలేవు. వాటిలో ఆంగిక (Constituent) కణాలకు డోలనాలు ఉంటాయి.
* ఆంగిక కణాలు యానకం స్థితిస్థాపకతపై ఆధారపడి ఉంటాయి.

 

ధ్వని
* ధ్వని ఒక శక్తి స్వరూపం. ఇది కంపిస్తున్న తరంగాల రూపంలో అన్ని దిశల్లో ప్రయాణిస్తుంది. ఈ తరంగాలు మన చెవిలో కర్ణభేరిని 1/10 సెకన్ల కాలంలో తాకినట్లయితే మానవుడికి వినికిడి జ్ఞానం కలుగుతుంది.
* కంపించే కణాలు ఉన్న పదార్థాల్లో మాత్రమే ధ్వని జనించి ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రయాణిస్తుంది.
ఉదా: ఇనుము, ఇత్తడి, రాగి మొదలైనవి.
* కంపించేందుకు వీలులేని కణాలు ఉన్న పదార్థాల్లో ధ్వని జనించదు, ప్రయాణించజాలదు.
ఉదా: స్వచ్ఛమైన ప్లాస్టిక్ వస్తువులు, రబ్బరు, వరిపొట్టు, రంపపు పొట్టు, దూది బట్టలు, థర్మోకోల్ మొదలైనవి.

* ఇటువంటి పదార్థాలను ఉపయోగించి 'సౌండ్ ప్రూఫ్ రూమ్స్‌'ని నిర్మిస్తారు.
* ధ్వని తరంగాలు ప్రయాణించేందుకు యానకం అవసరం కాబట్టి ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశంలో ధ్వని వేగం శూన్యంగా ఉంటుంది. దీన్ని నిరూపించిన వారు 'రాబర్ట్ బాయిల్'.
ఎటువంటి యానకం లేని విశ్వాంతరాళంలో, చంద్రునిపై ధ్వనివేగం శూన్యం.
ఉదా: చంద్రునిపై తూపాకి పేల్చినప్పుడు, అణుబాంబులు విస్ఫోటనం చెందినప్పుడు వెలవడే ధ్వనిని వినలేము.
* చంద్రునిపై అనునాద ప్రయోగం 'రెసోనెన్స్ ఎక్స్‌పరిమెంట్', సంగీత కచేరి చేయలేము.
* చంద్రునిపై వాతావరణం లేకపోవడం వల్ల పగలు, రాత్రి సమయంలో ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుంది.
* చంద్రునిపై సగటు పగటి ఉష్ణోగ్రత 100oC ఉంటుంది.
* కంపించే ప్రతి వస్తువు నుంచి ధ్వని పుడుతుంది.

శ్రావ్య అవధి
* ఆరోగ్యవంతుడైన మానవుడు 20 Hz నుంచి 20,000 Hz వరకు ధ్వని తరంగాలు మాత్రమే వినగలడు. ఈ అవధిని 'శ్రావ్య అవధి' అని ఈ తరంగాలను 'శ్రావ్య తరంగాలు' అని అంటారు.


పరశ్రావ్యాలు
* శ్రావ్య అవధిలో 20Hz కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలను 'పరాశ్రావ్యాలు' అంటారు. వీటిని నేలపై ఉన్న పాము, సముద్రంలో ఉన్న తిమింగలాలు, కుక్కలు వినగలవు.
* పరశ్రావ్యాలు ఉత్పత్తి చేసేందుకు అత్యధిక శక్తి ఉన్న వస్తువులు అవసరం. కాబట్టి ఈ తరంగాలను సాధారణంగా భూమి కంపించినప్పుడు, అణుబాంబులు విస్ఫోటనం చెందినప్పుడు, భారీ వాహనం అత్యధిక లగేజీని మోసుకెళ్తున్నప్పుడు ఈ తరంగాలు జనిస్తాయి.


అతిధ్వనులు
* శ్రావ్య అవధిలో 20,000 Hz కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలను 'అతిధ్వనులు' అంటారు. వీటిని ప్రయోగశాలలో ఫిజో (PIEZEVO) విద్యుత్ ఫలితం పద్ధతిలో తయారు చేస్తారు.
* అతిధ్వనులను కుక్క 50 వేలHZ వరకు, గబ్బిలం, తాబేలు, డాల్ఫిన్లు 1,00,000 Hz వరకు వినగలవు.


అనువర్తనాలు లేదా ఉపయోగాలు
పాలలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నశింపచేసేందుకు
* సముద్రం లోతు కనుగొనేందుకు ఉపయోగించే సోనార్‌లో SONAR: Sound Navigation and Ranging.
* మొదట సోనార్‌ను నిర్మించిన వారు - నిక్సన్ (NIXON).
* 0oCల నీటి ఉపరితలంపై ఈ తరంగాలను పంపినప్పుడు 100oC వద్ద మరుగుతున్న స్థితిని పొందుతుంది.
* దోమలను పారదోలేందుకు, చేపలను వేటాడేందుకు
* విరిగిన దంతాలను తొలగించేందుకు, సోల్డరింగ్‌లో
* కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి
* శరీర అంతర్భాగాలను స్కానింగ్ చేసేందుకు (అల్ట్రా స్కానింగ్)
* లోహఫలకం, పైపులు, బాయిలర్లలో పగుళ్లు ఏర్పడిన వాటిని గుర్తించేందుకు
* సముద్రంలో చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాలను గుర్తించేందుకు ఈ తరంగాలను వాడతారు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌