• facebook
  • whatsapp
  • telegram

ప్రకటనలు  ఊహలు

అవ్యక్త భావనలను పసిగడితే మార్కులు!

ఏదైనా సమాచారాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించడానికి, తగిన తార్కిక ప్రతిపాదనలు చేయడానికి ముందుగా దానిని అర్థం చేసుకోగలగాలి. అప్పుడే సరైన వాదనలు చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమవుతుంది. ఆ విధమైన సామర్థ్యాలను  అంచనా వేయడానికి రీజనింగ్‌లో భాగంగా ‘ప్రకటనలు - ఊహలు’ పాఠ్యభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. అందులోని ప్రకటనల నుంచి అంతర్లీనంగా, అవ్యక్తంగా ఉన్న భావాలను అభ్యర్థులు గ్రహించాలి. ఇచ్చిన ఊహల్లో సరిపోయే వాటిని గుర్తించాలి. ఈ ప్రశ్నలను వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తే ఆలోచనలు పదునెక్కుతాయి. మార్కులూ దక్కుతాయి.


ప్రశ్నలో భాగంగా ఒక ప్రకటన, ఊహలు (భావించిన అంశాలు) ఇస్తారు. ప్రకటన అనేది ఎందుకు ఇచ్చారో ఊహించాలి. దీని ద్వారా ఏ ఊహ బలంగా ఉందో చెప్పగలగాలి. ఊహ (భావించిన అంశం) - 1 బలంగా ఉంటే సమాధానం ‘ఎ’గా, ఊహ- 2 బలంగా ఉంటే సమాధానం ‘బి’గా, రెండూ బలంగా లేకపోతే సమాధానం ‘సి’గా, రెండు ఊహలు బలంగా ఉంటే సమాధానం ‘డి’గా గుర్తించాలి. 


మాదిరి ప్రశ్నలు

1.  ప్రకటన: నీకు ఏదైనా సమస్య ఉంటే నా వద్దకు రా! 

ఊహలు: (భావించిన అంశాలు): 

1) నీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. 

2) నేను ఏ సమస్యనైనా తీర్చగలను. 

సమాధానం: బి 


ఇక్కడ నీకు ‘ఏదైనా’ సమస్య ఉంటే నా వద్దకు రా. అంటే ‘నేను ఏ విధమైన సమస్యనైనా పరిష్కరించగలుగుతాను’. అని అర్థం కాబట్టి ఆ ప్రకటన చేయడానికి కారణం ఊహ(భావించిన అంశం)-2 సరైంది. 


2.  ప్రకటన: ఆడిటోరియంలో ‘మొబైల్‌ ఫోన్‌ వాడటం నిషిద్ధం. ఒకవేళ మీవద్ద ఉంటే దయచేసి స్విచ్‌ఆఫ్‌ చేయండి’. అని నోటీసు బోర్డుపై రాసి ఉంది. 

ఊహలు: 

1) సాధారణంగా ఆడిటోరియంలోనికి వచ్చే ముందు మొబైల్‌ ఫోన్‌తో రారు. 

2) మొబైల్‌ ఫోన్‌ ఉన్నవారు ఆ ప్రకటన ద్వారా చేసిన ఆజ్ఞను పాటిస్తారు. 

సమాధానం: బి 


3. ప్రకటన: ఈ విజయం తర్వాత కూడా ఒదిగి ఉండు. 

ఊహలు: 

1) విజయం తర్వాత చాలామంది ఒదిగి ఉంటారు. 

2) విజయం తర్వాత ప్రజలు సహజంగా ఒదిగి ఉండరు. 

సమాధానం: బి 


1. ప్రకటన: పొగతాగడం మానేస్తే, బరువు పెరుగుతారు. 

ఊహలు: 

1) పొగతాగడం మానినవారు బరువు పెరుగుతారు. 

2) పొగతాగడం మాననివారు బరువు పెరగరు. 


2. ప్రకటన: ‘నువ్వు ఏదైనా ప్రకటన ఇవ్వదలిస్తే న్యూస్‌పేపర్‌ x లో ఇవ్వు’ అని A, B తో అన్నాడు.

ఊహలు: 

1) B తన ఉత్పత్తులకు ప్రకటన ఇవ్వాలనుకున్నాడు. 

2) న్యూస్‌పేపర్‌ x కి మంచి  పాఠకాదరణ ఉంది. 


3. ప్రకటన: అతడు జ్ఞానవంతుడైతే పరీక్ష తప్పక ఉత్తీర్ణుడవుతాడు. 

ఊహలు:

1) ఉత్తీర్ణుడు అవడానికి తప్పక జ్ఞానవంతుడు కావాలి. 

2)   అతడు ఉత్తీర్ణుడవుతాడు. 


4. ప్రకటన: ‘అతిథులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడమైంది’. అని A,B తో చెప్పాడు.

ఊహలు:

1) అతిథులకు ఈ విషయం చెప్పకపోతే భోజనం చేయరు.

2) అతిథులు భోజన సమయానికి ఉంటారు.


5. ప్రకటన: అన్‌ ఎయిడెడ్‌ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం పెంచుకోనివ్వాలి. 

ఊహలు: 

1) అన్‌-ఎయిడెడ్‌ కాలేజీలు ఆర్థిక సమస్యలో ఉన్నాయి. 

2) ఎయిడెడ్‌ కాలేజీలు ఫీజులు పెంచాల్సిన అవసరం లేదు. 


6. ప్రకటన: పాఠశాల స్థాయిలో కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెట్టాలి. 

ఊహలు:

1) కంప్యూటర్‌ నేర్చుకోవడం సులభం.

2)  కంప్యూటర్‌ విద్య ద్వారా ఉద్యోగాలు సాధించడం సులభం. 


7. ప్రకటన: కంప్యూటర్‌ రంగంలో మేం అత్యంత నాణ్యమైన  శిక్షణను అందిస్తున్నాం.

ఊహలు:

1) కంప్యూటర్‌ ట్రైనింగ్‌ పొందడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

2) ప్రజలు అత్యంత నాణ్యమైన  శిక్షణను కోరుకుంటారు. 


8. ప్రకటన: ‘నేను లేనప్పుడు నా సంస్థ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో.’ అని ఎ, బి తో చెప్పాడు. ఊహలు:

1) ఎ ప్రతిపాదనను బి అంగీకరించాడు.

2) సంస్థను బి చక్కగా నిర్వహించగలడు కాబట్టి. 


9. ప్రకటన: దుస్తులను శుభ్రపరచడానికి సబ్బు వాడాలి. 

ఊహలు:

1) సబ్బు మరకలను సృష్టిస్తుంది. 

2) సబ్బు గ్రీజు, మురికిని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. 


10. ప్రకటన: మున్సిపాలిటీవారు కొత్తగా ప్రవేశపెట్టిన ‘కీప్‌ యువర్‌ సిటీ క్లీన్‌’ అనే   పథకాన్ని పట్టణ వాసులు పెద్దగా పట్టించుకోలేదు. 

ఊహలు:

1) ప్రజలు తమ పట్టణాన్ని    పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనుకోవడం లేదు.  

2) మున్సిపాలిటీ సిబ్బంది పథకం ఆచరణలో విఫలమయ్యారు. 


11. ప్రకటన: దేశంలో 18 సంవత్సరాలు దాటిన యువతకు నిరుద్యోగభృతి కల్పించాలి. 

ఊహలు:

1) దేశంలో ఆర్థిక భరోసా లేని నిరుద్యోగులు ఉన్నారు. 

2) దేశంలోని నిరుద్యోగులందరికీ భృతి కల్పించడానికి ప్రభుత్వం వద్ద డబ్బు ఉంది.


12. ప్రకటన: ‘వర్తమాన విషయాల కోసం నేను రోజూ రాత్రి 9 గంటలకు రేడియో వార్తలు వింటాను.’ అని ఒక వ్యక్తి తన ఇంటర్వ్యూలో చెప్పాడు. 

ఊహలు:    

1) ఆ వ్యక్తి దినపత్రిక చదవడం లేదు. 

2) వర్తమాన వార్తలు రేడియోలో మాత్రమే ప్రసారం చేస్తున్నారు. 


13. ప్రకటన: గత అయిదేళ్లలో   ఇండియాలో ఎయిర్‌ట్రాఫిక్‌ చాలా పెరిగింది. 

ఊహలు: 

1) విమానాల్లో ప్రయాణించడం ఈ రోజుల్లో ఒక గొప్పతనంగా  భావిస్తున్నారు. 

2) చాలామంది విమానాల్లో ప్రయాణానికి అయ్యే ఖర్చును సులభంగా భరించగలుగుతున్నారు.


14. ప్రకటన: మీ వస్తువులను  కప్‌బోర్డులో తాళంవేసి ఉంచండి. అందరినీ మర్యాదపూర్వకంగా పలకరించండి.

ఊహలు: 

1) కప్‌బోర్డులో తాళం వేసిన  వస్తువులు దొంగతనం చేయరు.

2) దొంగతనం ఒక నేరం. 


15. ప్రకటన: ఈ నెల చివరికల్లా ‘వర్షాలు కురవకపోతే, చాలామంది రైతులు ఈ సంవత్సరంలో కష్టాల్లో పడతారు.

ఊహలు:

1) సరైన వర్షాలు, సరైన  సమయంలో వ్యవసాయానికి చాలా అవసరం.

2) సాధారణంగా చాలామంది రైతులు వర్షాలపై ఆధారపడతారు.


16. ప్రకటన: దేశ ఆర్థిక స్థితి విచారకరమైన స్థితి నుంచి మరింత అధ్వానంగా మారింది. 

ఊహలు: 

1) ప్రభుత్వం ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. 

2) ప్రజలు, ప్రభుత్వానికి సహకరించడం లేదు. 


17. ప్రకటన: మీరు ఒకవేళ ఎస్‌ఐ అయితే, మీరు తీర్చాల్సిన ఒక సమస్య మాకు ఉంది. 

ఊహలు: 

1) మాకు ఒక ఎస్‌ఐ అవసరం ఉంది. 

2) మీరొక ఎస్‌ఐ.


18. ప్రకటన: ‘కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. ఆ సమయాని కంటే ముందే మీరు మీ సీట్లలో ఉండాలి.’ అని ఒక ఆహ్వాన పత్రికలో ఉంది.

ఊహలు:

1) ఒకవేళ ఆహ్వానితుడు ( పిలుపు అందుకున్న వ్యక్త్శి)  3 గంటలకు ముందే తన సీటులో లేకపోతే, ఆ కార్యక్రమం ప్రారంభం కాదు. 

2) కార్యక్రమం యధావిధిగా   అనుకున్న సమయానికి    ప్రారంభమవుతుంది.


19. ప్రకటన: ‘మా బూట్లు ఎస్‌ఐలకు మాత్రమే’ అని ఒక షాపు ప్రకటనలో ఉంది. 

 ఊహలు: 

1) చాలామందికి ఎస్‌ఐ కావాలని ఉంటుంది. 

2) ఆ బూట్లు వేసుకోనంతవరకు ఒక వ్యక్తి ఎస్‌ఐ కాలేడు. 


20. ప్రకటన: క్లబ్‌లోనికి ప్రవేశించే ముందు ఈ గమనిక చదవండి. 

ఊహలు:

1) ప్రజలు అక్షరాస్యులు.

2) అంధులు క్లబ్‌లోకి ప్రవేశించలేరు. 


సమాధానాలు: 1-సి; 2-బి; 3-ఎ; 4-బి; 5-ఎ; 6-ఎ; 7-డి; 8-బి; 9-బి; 10-డి; 11-ఎ; 12-సి; 13-బి; 14-ఎ; 15-డి; 16-ఎ; 17-ఎ; 18-బి; 19-ఎ; 20-డి.

 


రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

 

Posted Date : 23-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌