• facebook
  • whatsapp
  • telegram

రవాణా సౌకర్యాలు

1. కింది అంశాలను పరిగణించండి.
ఎ) సామాన్య ప్రజల అవసరాలకు, అత్యధిక ప్రయాణికుల రవాణాకు తోడ్పడేవి - రోడ్డు మార్గాలు
బి) అత్యధిక సరుకులు చేరవేసే చౌకైన రవాణా - జలమార్గాలు
సి) మధ్యతరగతి ప్రజలకు, పర్యాటకులకు అనువైనవి; అత్యధిక ఆదాయాన్నిచ్చేవి - రైలు రవాణా.
డి) సుదూర ప్రయాణానికి ఉపయోగపడేది, ఖరీదైంది - వాయు రవాణా

1) ఎ, డి సరైనవి, బి, సి సరైనవి కావు     2) ఎ, బి, సి సరైనవి, డి తప్పు
3) ఎ, బి సరైనవి, సి, డి తప్పు      4) ఎ, బి, సి, డి సరైనవే.


2. భారతదేశ వైశాల్యంలో అత్యధిక శాతం విస్తరించి ఉన్న రవాణా మార్గాలు? 
1) రోడ్డు మార్గాలు          2) రైలు మార్గాలు        
3) జలమార్గాలు            4) వాయు మార్గాలు


3. భారత్‌లో అంతర్జాల వ్యవస్థ, మొబైల్‌ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
1) 1992           2) 1994          3) 1996            4) 1998 


4. ఇండియాలో రవాణా సౌకర్యాలు ఏ బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ కాలంలో అభివృద్ధి చెందాయి?
1) లార్డ్‌ మెకాలే      2) డల్హౌసి       3) కారన్‌ వాలీస్‌        4) రిప్పన్‌


5. కింది అంశాలను జతపరచండి.
 జాబితా - I                                                            జాబితా - II
i) తూర్పు ఇండియా మొదటి రైలుమార్గం    a) సికింద్రాబాద్‌ - వాడీ   
ii) ఆంధ్రప్రదేశ్‌ మొదటి రైలుమార్గం           b) అలహాబాద్‌ - కాన్పూర్‌  
iii) ఉత్తర భారత మొదటి రైలుమార్గం          c) పుత్తూరు - రేణిగుంట
iv) తెలంగాణ మొదటి రైలుమార్గం              d) హౌరా - హుగ్లీ 
1) i-a; ii-b; iii-c; iv-d.              2) i-d; ii-c; iii-b; iv-a
3) i-c; ii-d; iii-a; iv-b.              4) i-d; ii-a; iii-b; iv-c. 


6. ఇండియాలో మొదటి ప్యాసింజర్‌ రైలును 1853 ఏప్రిల్‌ 16న ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించారు? 
1) ముంబయి - థానే            2) హౌరా - హుగ్లీ
3) వయసార్‌పాడి - ఆర్కాట్‌ రోడ్‌ 
4) అలహాబాద్‌ - కాన్పూర్‌


7. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ భారత ప్రభుత్వ గెజిట్‌లో నూతన జాతీయ రహదారుల సంఖ్యా వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రచురించింది?
1) 2008             2) 2010              3) 2012             4) 2014 


8. జాతీయ రహదారులు, అవి కలిసే ప్రాంతాలను జతపరచండి.
i)  NH16     a) ఆంధ్రప్రదేశ్‌ - కర్నూలు- వయా చిత్తూరు - తమిళనాడు - రాణిపేట
ii)- NH65    b) కర్ణాటక - బెంగళూరు - వయా హైదరాబాద్‌ - మహారాష్ట్ర - నాగ్‌పుర్‌ 
iii) NH44    c) మహారాష్ట్ర -పుణె వయా - హైదరాబాద్‌ - ఆంధ్రప్రదేశ్‌ - మచిలీపట్నం
iv)- NH40   d) పశ్చిమ బెంగాల్‌ - దన్కుని వయా - విశాఖపట్నం - తమిళనాడు - చెన్నై
1) i-a; ii-b; iii-c; iv-d            2) i-d; ii-c; iii-b; iv-a
3) i-c; ii-d; iii-a; iv-b           4) i-d; ii-a; iii-c; iv-b 


9. ప్రపంచంలో రెండో అత్యధిక ఎత్తైన మోటారు హైవే ఏ రెండు ప్రాంతాలను అనుసంధానిస్తుంది?
1) లేహ్‌ - మనాలీ     3) కాండ్లా - జోధ్‌పుర్‌    3) కల్క - సిమ్లా      4) సిమ్లా - ద్రాస్‌


10. భారతదేశంలో 87 జాతీయ రహదారులుఉన్నాయి. అయితే పొడవైన జాతీయ రహదారులను అవరోహణ క్రమంలో అమర్చండి.
1) NH-44, NH-27, NH-48, NH-52                 2) NH-52, NH-48, NH-27, NH-44
3) NH-16, NH-30, NH-44, NH-40                4) NH-44, NH-27, NH-52, NH-48 


11. ఉత్తర-దక్షిణ, తూర్పు-పశ్చిమ కారిడార్‌ రహదారులు ఏ ప్రాంతం వద్ద కలుస్తున్నాయి?
1) నాగ్‌పుర్‌     2) ఆగ్రా       3) ఝాన్సీ       4) దిల్లీ


12. కేంద్రప్రభుత్వం 83,677 కి.మీ. నిర్మాణం లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాజెక్టును 2018లో ఏ పేరుతో ప్రారంభించింది?
1) సాగర్‌మాల       2) భారతమాల      3) స్వేచ్ఛతమాల        4) హైవేమాల


13. న్యూదిల్లీ కేంద్రంగా ‘నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ - (NHAI) ను ఎప్పుడు స్థాపించారు?
1) 1988            2) 1999             3) 2009            4) 2019 


14. 2017 - 18 ప్రకారం దేశంలో గ్రామీణ రహదారులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) మహారాష్ట్ర - అసోం - ఒడిశా     
2) మహారాష్ట్ర - యూపీ - గుజరాత్‌
3) ఉత్తర్‌ ప్రదేశ్‌ - మహారాష్ట్ర - ఒడిశా     
4) ఉత్తర్‌ ప్రదేశ్‌ - మహారాష్ట్ర - గుజరాత్‌


15. క్రీ.పూ. 5000 సంవత్సరాల కిందటే మొహంజొదారో శిథిలాల వల్ల రోడ్లు ఉన్నట్లుగా తెలిసింది. అయితే క్రీ.పూ. 300 లో ఏ నగరంలో రోడ్డు నిర్మాణం చేపట్టారు?
1) ఆగ్రా           2) వారణాసి      3) పట్నా         4) జోధ్‌పుర్‌


16. 201718 రహదారుల పట్టిక ప్రకారం దేశంలో అత్యధిక శాతం విస్తరించి ఉన్నవి?
1) గ్రామీణ రహదారులు         2) రాష్ట్ర రహదారులు
3) జిల్లా రహదారులు          4) జాతీయ రహదారులు


17. స్వర్ణచతుర్భుజి రహదారి ఏ నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్‌ నగరాలను కలుపుతోంది?
ఎ) చెన్నై     బి) ఆగ్రా     సి) ముంబయి     డి) హైదరాబాద్‌
ఇ) దిల్లీ     ఎఫ్‌) ఝాన్సీ     జి) కలకత్తా
1) ఎ, బి, సి, డి      2) ఎ, సి, ఇ, జి       3) సి, డి, ఇ, ఎఫ్‌       4) డి, ఇ, ఎఫ్, జి


18. దేశంలో కీలకమైన, వ్యూహాత్మక ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద రహదారుల నిర్మాణం, అభివృద్ధి కోసం భారతప్రభుత్వం సరిహద్దు రహదారుల సంస్థ(BRO) ను ఎప్పుడు ఏర్పాటు చేసింది?
1) 1960             2) 1965          3) 1975           4) 1999 


19. 1999లో ప్రారంభించిన ‘‘జాతీయ రహదారుల అభివృద్ధి పథకం’’  (NHDP) కింద మొత్తం ఏడు దశలున్నాయి. మొదటి దశలో స్వర్ణచతుర్భుజి, రెండో దశలో కారిడార్లను అనుసంధానించగా ఏడో దశలో వేటిని నిర్మిస్తారు?
1) రింగ్‌ రోడ్లు బైపాస్‌లు, సర్వీస్‌ రోడ్లు    
2) 6 లైన్ల జాతీయ రహదారులు 
3) రెండులైన్ల జాతీయ రహదారులు     
4) ఓవర్‌ అండర్‌ బ్రిడ్జిలు, ఆహార, మంచినీటి వసతులు


20. కింది అంశాలను పరిగణించండి.
ఎ) స్వర్ణచతుర్భుజి రహదారిలో అత్యంత పొడవైంది చెన్నై - కోల్‌కత మార్గం, చిన్నది ముంబయి - చెన్నై మార్గం.
బి) ఉత్తర - దక్షిణ రహదారి కారిడార్‌ కన్యాకుమారి - శ్రీనగర్, తూర్పు - పశ్చిమ రహదారి కారిడార్‌ పోర్‌బందర్‌ - సిల్చార్‌లతో అనుసంధానమై ఉంది.
1) ఎ సరైంది               2) బి సరైంది
3) ఎ, బి సరైనవి         4) ఎ, బి రెండూ సరైనవి కావు


21. కింది వ్యాఖ్యానాల్లో ఏది అసత్యం?
1) 1871  ప్రధాన ఓడరేవులైన కలకత్త, ముంబయి, మద్రాస్‌ పట్టణాలను కలుపుతూ రైలు మార్గాలను నిర్మించారు.
2) 1951  భారతీయ రైలు మార్గాలను కేంద్రం జాతీయం చేసింది.
3) 1985  దేశంలో ఆవిరి యంత్రాల స్థానంలో డీజిల్‌ ఇంజిన్లు ప్రవేశపెట్టారు
4) 1995  దేశంలో రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థను కంప్యూటీకరించారు.


22. ఇండియాలో స్వాతంత్య్రానంతరం మొత్తం రైలు మార్గాలను బ్రాడ్‌గేజ్‌ కిందికి మార్చేందుకు చేపట్టిన పథకం?
1) స్టాండర్డ్‌గేజ్‌     2) యూనిగేజ్‌     3) లిఫ్ట్‌గేజ్‌             4) వానోగేజ్‌


23. భారతీయ రైలుమార్గాల్లో ప్రధానంగా ఎన్ని రకాల ట్రాక్‌ గేజ్‌ రవాణా సదుపాయాలుఉన్నాయి?
1) 1           2) 3           3) 4           4) 5

 
24. కిందివాటిని పరిశీలించండి.
ఎ) కేంద్రీయ రైల్వే          బి) దక్షిణ రైల్వే     
సి) పశ్చిమ రైల్వే            డి) దక్షిణ తీర రైల్వే 
ఇ) తూర్పుతీర రైల్వే         
పైవాటిలో మొదటి, చివరి రైల్వే జోన్లను గుర్తించండి.   
1) ఎ, బి        2) బి, సి      3) సి, డి     4) బి, డి


సమాధానాలు: 1-4; 2-1; 3-3; 4-2; 5-2; 6-1; 7-2; 8-2; 9-1; 10-1; 11-3; 12-2; 13-1; 14-1; 15-3; 16-1; 17-2; 18-1; 19-1; 20-3; 21-3; 22-2; 23-3; 24-4.

Posted Date : 12-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌