• facebook
  • whatsapp
  • telegram

భార‌త్‌లో వివిధ ప‌రిశోధ‌న సంస్థ‌లు

1. పశుపోషణ, పాల ఉత్పత్తికి సంబంధించిన పరిశోధనలు నిర్వహించే ఏ సంస్థ హరియాణాలోని కర్నాల్‌లో ఉంది?
ఎ) నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
బి) ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
సి) సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ బఫెలోస్
డి) ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
జ: (ఎ)

 

2. సెంట్రల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
ఎ) కటక్ బి) భువనేశ్వర్ సి) కర్నాల్ డి) డెహ్రాడూన్
జ: (ఎ)

 

3. ఐసీఎంఆర్‌కు చెందిన ఏ పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి?
ఎ) సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రై లాండ్ అగ్రికల్చర్
బి) నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్
సి) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్
డి) పైవన్నీ
జ: (డి)

 

4. సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
ఎ) లక్నో బి) సిమ్లా సి) కోచి డి) కటక్
జ: (బి)

 

5. కిందివాటిలో దిల్లీలో లేని పరిశోధనా సంస్థ ఏది?
ఎ) ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
బి) ఇండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
సి) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రిసెర్చ్
డి) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రిసెర్చ్
జ: (సి)

 

6. నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ఎక్కడ ఉంది?
ఎ) సిక్కిం బి) హైదరాబాద్ సి) అజ్మీర్ డి) దిల్లీ
జ: (బి)

 

7. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌కు చెందిన ఏ సంస్థ హైదరాబాద్‌లో ఉంది?
ఎ) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
బి) ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రిసెర్చ్ సెంటర్
సి) నేషనల్ సెంటర్ ఫర్ ల్యాబోరేటరి సైన్సెస్
డి) పైవన్నీ
జ: (డి)

 

8. నేషనల్ ఎయిడ్స్ రిసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది?
ఎ) నోయిడా బి) పట్నా సి) పుణె డి) పాండిచ్చేరి
జ: (సి)

 

9. కిందివాటిలో ఐసీఎంఆర్‌కు చెందిన ఏ సంస్థ దిల్లీలో ఉంది?
ఎ) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ
బి) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా cరిసెర్చ్
సి) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్
డి) పైవన్నీ
జ: (డి)

Posted Date : 23-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌