• facebook
  • whatsapp
  • telegram

వైరస్‌లు

* వైరస్‌లలో కణవ్యవస్థ లోపించి ఉంటుంది. అందుకే వీటిని అకణజీవులుగా పేర్కొంటారు.

* పరిపూర్ణంగా ఉండే వైరస్‌ను ‘విరియాన్‌’గా పిలుస్తారు. 

* ఇవి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండటం వల్ల బ్యాక్టీరియాలను వడపోసే కాగితాల నుంచి కూడా బయటకు వస్తాయి.


ఆకారాలు

* వైరస్‌లు వివిధ ఆకారాల్లో వ్యవస్థితమై ఉంటాయి.

ఉదా: i) ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ - ఇటుక ఆకారం

ii) టొబాకో మొజాయిక్‌ వైరస్‌ (TMV)

                                       దండాకారం 

iii) బ్యాక్టీరియో ఫేజ్‌లు - టాడ్‌పోల్‌ ఆకారం

లక్షణాలు

* వైరస్‌లలో జన్యుపదార్థంగా ళివితి లేదా దీవితి ఏదో ఒకటి మాత్రమే వ్యవస్థితమవుతుంది. సందర్భానుసారం వైరస్‌లు నిర్జీవ, సజీవ లక్షణాలు ప్రదర్శిస్తాయి. నిర్జీవులకు, సజీవులకు మధ్య సంధానసేతువులుగా వైరస్‌లను పేర్కొంటారు.

* వైరస్‌లు నిర్మాణరీత్యా బాహ్య కవచం, కాప్సిడ్, జన్యు పదార్థాలను కలిగి ఉంటాయి. అయితే బాహ్యకవచం కొన్ని వైరస్‌లలో మాత్రమే కనిపిస్తుంది. ఇది ప్రోటీన్లు, లిపిడ్లు, కార్బోహైడ్రేట్లతో నిర్మితమై ఉంటుంది. ఈ బాహ్య కవచ ప్రమాణాలను పెప్లోమియర్లు అంటారు. ఈ బాహ్యకవచం లోపించిన వైరస్‌లను నగ్నవైరస్‌లు అంటారు.

* కాప్సిడ్‌ మధ్యలో ఉన్న జన్యుపదార్థాన్ని ఆవరించి ఉంటుంది. దీనిలో నిర్దిష్ట సంఖ్య కలిగిన ఉపప్రమాణాలు అమరి ఉంటాయి. ఈ ప్రోటీన్‌ నిర్మిత ఉప ప్రమాణాలను కాస్పోమియర్లు అంటారు.


జన్యుపదార్థాలు - రకాలు

* వైరస్‌లలో నాలుగు రకాల జన్యు పదార్థాలు ఉంటాయి అవి:

i) ద్విపోచయుత DNA( ds DNA): అడినో వైరస్, కాలీఫ్లవర్‌ మొజాయిక్‌ వైరస్‌ లాంటి వాటిలో ఉంటాయి.

ii) ఏకపోచయుత DNA( ss DNA): కోలీఫేజ్‌ వైరస్‌లలో ఇలాంటి జన్యు పదార్థాన్ని గమనించొచ్చు.

iii) ద్విపోచయుత RNA( ss DNA): రియో వైరస్, ఊండ్‌ ట్యూమర్‌ వైరస్‌లలో ఉంటుంది.

iv) ఏకపోచయుత RNA( ss DNA):

టొబాకో మొజాయిక్‌ వైరస్, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లలో ఉంటుంది.

హానికర వైరస్‌లు

* కొన్ని వైరస్‌లు కొంత పరిమాణంలో ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి.

ఉదా: i) బ్యాక్టీరియో ఫేజ్‌లో లైసోజైమ్‌లు ఉంటాయి. 

       ii)  రిట్రోవైరస్‌లలో రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్టేజెస్‌లు ఉంటాయి.

* వైరస్‌ల కంటే చిన్నవిగా ఉంటూ, అతి తక్కువ అణుభారం కలిగిన RNA ను మాత్రమే కలిగి ఉన్న హానికారకాలను వైరాయిడ్లు అంటారు. వీటిలో ప్రోటీన్‌ నిర్మిత కవచం ఉండదు.

* వైరాయిడ్ల వల్ల పొటాటో స్పిండిల్‌ ట్యూబర్‌ వ్యాధి  ( PSTV వల్ల కలుగుతుంది), సిట్రస్‌ ఎక్సోకార్టిన్‌ లాంటి వ్యాధులు సంభవిస్తాయి. 

*ఇప్పటి వరకు ఉన్న శాస్త్రీయపరిజ్ఞానం మేరకు మానవుల్లో వైరాయిడ్‌ వల్ల కలిగిన వ్యాధి ‘హైపటైటిస్‌’. వైరస్‌ల వృద్ధిని నిరోధించే ప్రోటీన్‌ అణువులుగా ఇంటర్‌ఫెరాన్లను పేర్కొంటారు. క్షీరదాలు, రోడెంట్లు, పక్షుల కణాల్లో ఇవి ఉత్పత్తి అవుతాయి.

* వైరస్‌ వల్ల మొక్కలు, జంతువులు, మనుషుల్లో అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. 

మొక్కల్లో కలిగే వ్యాధులు: టొబాకో మొజాయిక్‌ వ్యాధి, బొప్పాయిలో ఆకుముడత తెగులు, బెండలో పసుపు పచ్చ ఈనెల మొజాయిక్‌ వ్యాధి, రైస్‌ టుంగ్రో వ్యాధి, టమాటాలో ఆకుముడత వ్యాధి మొదలైనవి.

మానవుల్లో సంభవించే వ్యాధులు: చికెన్‌పాక్స్, స్మాల్‌పాక్స్, మీజిల్స్, రేబిస్, AIDS, కొవిడ్‌-19, హైపటైటిస్‌-B మొదలైనవి.


వైరస్‌ల వ్యాప్తి

* కలుషితమైన గాలి, నీరు ఆహారం ద్వారా; ఈగలు, దోమలు లాంటి వాహకాల ద్వారా మనుషుల్లో వైరస్‌ వ్యాపిస్తుంది. 

* మొక్కల్లో వైరస్‌ల వ్యాప్తి కాండ ఛేదనాల ద్వారా; విత్తనాలు, దుంపలు లాంటి శాఖీయ ప్రత్యుత్పత్తి భాగాల ద్వారా; ప్రధానంగా రసం పీల్చే కీటకాల ద్వారా జరుగుతుంది.


 

Posted Date : 11-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌