• facebook
  • whatsapp
  • telegram

వైరస్‌లు

మాదిరి ప్రశ్నలు


1. వైరస్‌లకు సంబంధించి కిందివాటిలో సరైనవి?

1) జీవులుగా పరిగణిస్తారు              2) సొంతంగా నకలు చేయొచ్చు           3) సెల్యులార్‌ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి                  4) వీటిని పునరావృతం చేయాలంటే హోస్ట్‌ సెల్‌ లేదా అతిథేయి అవసరం

 

2. వైరస్‌లలో ఉండే జన్యు పదార్థం ఏది?

1) DNA         2)  RNA         3) DNA లేదా RNA        4)  ప్రోటీన్లు

 

3. వైరస్‌ల పరిమాణ పరిధి ఎంత?

1) సూక్ష్మదర్శిని, బ్యాక్టీరియా కంటే చిన్నవి              2)  కంటితో చూడగలం           3) కణాల పరిమాణాన్ని పోలి ఉంటాయి               4) బ్యాక్టీరియా కంటే పెద్దవి

 

4. కిందివాటిలో వైరస్‌ వ్యాప్తికి కారణం కానిది ఏది?

1) ప్రత్యక్ష స్పర్శ      2) గాలిలో బిందువులు           3) జన్యు పరివర్తన                4)  కలుషిత ఉపరితలాలు

 

5. వైరస్‌ బయటి ప్రోటీన్‌ కోటును ఏమంటారు?

1) కాప్సిడ్‌       2) న్యూక్లియస్‌          3) పొర      4)  ఎన్వలప్‌

 

6. కిందివాటిలో వైరస్‌ ఆకారం లేదా నిర్మాణం కానిది ఏది?

1)హెలికల్‌       2) ఐకోసాహెడ్రల్‌          3) గోళాకారం        4) క్యూబాయిడల్‌

 

7. కిందివాటిలో మానవులను ప్రభావితం చేసే వైరల్‌ వ్యాధి ఏది?

1) ఫెలెన్‌ లుకేమియా      2) కుక్కల పార్వోవైరస్‌         3) ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా           4)  ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌

 

8. వైరస్‌ ప్రతిరూపణ చక్రాన్ని ఏ ప్రకటన కచ్చితంగా వివరిస్తుంది?

1) వైరస్‌లు వాటి సొంత సెల్యులార్‌ మిషనరీని ఉపయోగించి పునరావృతం అవుతాయి.        2)  బ్యాక్టీరియాల్లాగానే వైరస్‌లు విభజన చెంది పునరావృతం అవుతాయి.

3) వైరస్‌లు తమ జన్యు పదార్థాన్ని హోస్ట్‌సెల్‌ జన్యువులోకి అనుసంధానిస్తాయి.                4) వైరస్‌లు పునరావృతం జరుపుకోవడానికి హోస్ట్‌సెల్‌ యంత్రాంగాన్ని స్వాధీనం చేసుకుంటాయి.

 

9. కిందివాటిలో రెట్రోవైరస్‌కి ఉదాహరణ ఏది?

1) ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌          2)  హెర్పెస్‌ సింప్లెక్స్‌ వైరస్‌            3) హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్‌ ( HIV)            4) హైపటైటిస్‌ ఎ వైరస్‌


10. HIV అంటే దేనికి సంకేతం?

1) హ్యూమన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌           2)  హ్యూమన్‌ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్‌         3) అత్యంత అంటువ్యాధి వైరస్‌            4)  హ్యూమన్‌ ఇన్ఫెక్షన్‌ వెక్టర్‌


11. బీఖిజు ప్రాథమికంగా ఎలా సంక్రమిస్తుంది?

1) కలుషిత ఆహారాన్ని పంచుకోవడం ద్వారా         2)  సోకిన వ్యక్తితో సాధారణ పరిచయం వల్ల            3) దోమకాటు కారణంగా                4)  సురక్షితం కాని లైంగిక సంపర్కం లేదా ఇంజక్షన్‌ సూదులు పంచుకోవడం వల్ల


12. కింది ఏ శరీర ద్రవం సాధారణంగా HIV ప్రసారంతో సంబంధం కలిగి ఉంటుంది?

1) చెమట     2)  లాలాజలం          3) రక్తం        4)  మూత్రం


13. HIV లైంగిక ప్రసారాన్ని నిరోధించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏమిటి?

1) కండోమ్‌లను వాడటం            2)  యాంటీరెట్రోవైరల్‌ మందులు తీసుకోవడం          3) క్రమం తప్పకుండా HIV పరీక్ష చేయించుకోవడం           4)  ఏదీకాదు


14. కిందివాటిలో బీఖిజు సాధారణ లక్షణం కానిది?

1) నిరంతర జ్వరం           2)  దీర్ఘకాలిక విరేచనాలు         3) తీవ్రమైన తలనొప్పి         4)  వేగంగా బరువు పెరగడం


15. ఎయిడ్స్‌ దేన్ని సూచిస్తుంది?

1) అక్వైర్డ్‌ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌          2)  ఆటో ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌             3) అసిస్ట్‌ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌             4)  ఏదీకాదు


16. HIV సోకిందో లేదో తెలుసుకోవడానికి అత్యంత కచ్చితమైన మార్గం ఏమిటి?

1) శారీరక లక్షణాలను గమనించడం        2)  స్వీయ రిపోర్టింగ్‌పై ఆధారపడటం      3) యాంటీబాడీ పరీక్ష నిర్వహించడం       4)  ఏదీకాదు


17. HIV ని పూర్తిగా నయం చేయొచ్చా?

1) అవును, యాంటీబయాటిక్స్‌ వాడకం ద్వారా చేయొచ్చు.      2)  లేదు, కానీ దీన్ని మందులతో నిర్వహించొచ్చు.          3) అవును, ఆరోగ్యకరమైన జీవనశైలితో అధిగమించొచ్చు.            4) లేదు, ప్రస్తుతం HIV కి చికిత్స లేదు


18. HIV ఎయిడ్స్‌గా మారడానికి సాధారణంగా ఎంత సమయం పడుతుంది?


1) 12 ఏళ్లు     2)  510 ఏళ్లు     3) 2030 ఏళ్లు        4) వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది.


19. గర్భిణి నుంచి ఆమె బిడ్డకు  HIV ఎలా సంక్రమిస్తుంది?

1) తల్లిపాలు ఇవ్వడం ద్వారా          2)  భాగస్వామ్య పాత్రల ద్వారా         3) కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా          4)  గాలిలో కణాల ద్వారా


20. కొవిడ్‌-19 అంటే?

1) ఒకరకమైన ఇన్‌ఫ్లుయెంజా        2)  ఒకరకమైన బ్యాక్టీరియా     3) వైరల్‌ శ్వాసకోశ వ్యాధి     4)  ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి


21. కిందివాటిలో కొవిడ్‌19 సాధారణ లక్షణాలు ఏమిటి?

1) జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు         2)  దగ్గు, శ్వాస ఆడకపోవడం, అలసట        3) విరేచనాలు, వికారం, వాంతులు         4) పైవన్నీ


22. ఏ వయసు వర్గం కొవిడ్‌-19 వల్ల తీవ్రమైన సమస్యలకు ఎక్కువగా గురవుతుంది?

1) పిల్లలు        2)  యువకులు          3) మధ్య వయస్కులు       4)  వృద్ధులు


23. కొవిడ్‌-19 వ్యాప్తి నిరోధానికి కింది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

1) మాస్క్‌ ధరించడం      2)  తరచుగా చేతులు కడుక్కోవడం     3) భౌతిక దూరం పాటించడం      4)  పైవన్నీ


24. సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల కొవిడ్‌-19 వైరస్‌ ఎంత వ్యవధిలో చనిపోతుంది?

1) 5 సెకన్లు        2)  10 సెకన్లు     3) 20 సెకన్లు       4)  30 సెకన్లు

సమాధానాలు

1-4     2-3     3-1     4-3       5-1     6-4       7-3         8-4          9-3           10-2        11-4     12-3      13-1        14-4       15-1        16-3       17-4          18-4          19-1        20-3         21-2          22-4     23-4     24-3 

Posted Date : 11-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌