• facebook
  • whatsapp
  • telegram

భిన్న పరీక్ష 

అన్నింటి కంటే భిన్నంగా!


స్పష్టంగా, విమర్శనాత్మకంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి పరీక్షల్లో  లాజికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు అడుగుతుంటారు. అందులో ప్రధానమైనది భిన్నపరీక్ష. ఇచ్చిన అక్షరాలు, సంఖ్యలు, పదాల్లో భిన్నమైన దానిని కనిపెట్టడం అంత సులువు కాదు. కానీ కొన్ని కిటుకులు తెలుసుకుంటే తేలిగ్గా సమాధానాన్ని గుర్తించవచ్చు. కొంత ప్రాక్టీస్‌ చేస్తే  ప్రశ్నలోని లాజిక్‌ను అర్థం చేసుకోవడం అలవాటవుతుంది. 

 

 

 

ఈ అంశానికి సంబంధించి పరీక్షలో ప్రశ్నలో భాగంగా నాలుగు పదాలు/ సంఖ్యలు ఇస్తారు. వీటిలో మూడు పదాలు లేదా సంఖ్యలు ఒకే నియమాన్ని పాటిస్తూ నాలుగోది భిన్నమైందిగా ఉంటుంది. దాన్ని గుర్తించే పరీక్షే భిన్న పరీక్ష (Odd man out). దీన్నే ‘క్లాసిఫికేషన్‌’ అని కూడా అంటారు.


ఈ అంశానికి సంబంధించిన ప్రశ్నలను సులువుగా సాధించేందుకు అభ్యర్థికి ప్రధానంగా ఆంగ్ల అక్షరాల సంఖ్యలు, వర్గాలు, ఘనాలు, వివిధ రకాల సంఖ్యలు (సరి/బేసి/ప్రధాన/సంయుక్త మొదలైనవి )లాంటి అంశాలతో పాటు భౌతిక, రసాయన, వివిధ సామాజిక అంశాలపై అవగాహన అవసరం.


భిన్న పరీక్ష మూడు రకాలుగా ఉంటుంది.

1) అక్షర భిన్న పరీక్ష (Letter odd man out)

2) సంఖ్యా భిన్న పరీక్ష (Number odd man out)

3) పద భిన్న పరీక్ష (Word odd man out)

 

ఉదాహరణ 1: కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.

 1) PG           2) RM            3) MS            4) PK
  
వివరణ:   PG = 16 + 7 = 23 (బేసి సంఖ్య)

             RM = 18 + 13 = 31 (బేసి సంఖ్య)

             MS = 13 + 19 = 32 (సరి సంఖ్య)

             PK = 16 + 11 = 27 (బేసి సంఖ్య)

సమాధానం: 3


ఉదాహరణ 2: కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.

  1) 670             2) 250              3) 1290              4) 2115


వివరణ: 262 = 676 - 6 = 670

          162 = 256 - 6 = 250

          362 = 1296 - 6 = 1290

          462 = 2116 - 6 = 2110

సమాధానం: 4


ఉదాహరణ 3: కిందివాటిలో భిన్నమైంది ఏది?

   1) శుక్రుడు            2) అంగారకుడు           3) శని              4) చంద్రుడు

వివరణ: చంద్రుడు కాకుండా మిగిలినవన్నీ గ్రహాలు.

సమాధానం: 4


మాదిరి ప్రశ్నలు


1.    కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి.

          1) B, C           2) K, M             3) Q, S             4) V, W
 
సమాధానం: 4


సాధన: B, C = (2, 3)
          K, M = (11, 13)
          Q, S = (17, 19)
          V, W = (22, 23)

       ∴ V = 22 కాకుండా మిగిలిన సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు.

 

2.    కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి.

        1) RU            2) PS              3) LI             4) ZC
    
సమాధానం: 3

 

3. కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి.

1) GJHI        2) LMNO        3) PSQR             4) XAYZ

సమాధానం: 2

సాధన: రెండో ఆప్షన్‌లోని అక్షరాలు మాత్రమే అక్షరమాల క్రమంలో ఉన్నాయి.

 

4. కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి.

1) (M, C, U)       2) (G, N, U)       3) (R, Y, F)       4) (C, J, Q)
  
సమాధానం: 1

 

5. కిందివాటిలో సరిపోలని దాన్ని గుర్తించండి.

   A, D, I, P, T, Y

   1) T       2) I       3) Y        4) P

సమాధానం: 1

సాధన:  A = 1 = 12
           D = 4 = 22
           I = 9 = 32
          P = 16 = 42
          T = 20
         Y = 25 = 52

 

6. కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి.

    1) 3275       2) 4715       3) 7092           4) 9305
    
సమాధానం: 3

సాధన:  3275 = 3 + 2 + 7 + 5 = 17
           4715 = 4 + 7 + 1 + 5 = 17
           7092 = 7 + 0 + 9 + 2 = 18
           9305 = 9 + 3 + 0 + 5 = 17

 

7. కిందివాటిలో భిన్నమైంది గుర్తించండి.

1) 0.00001       2) 0.01         3) 0.0001            4) 0.000001

సమాధానం: 1

సాధన: 0.00001 = కచ్చిత వర్గం కాదు

        0.01 = (0.1)2 

        0.0001 = (0.01)2 

        0.000001 = (0.001)2 

 

8. కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి.

   1) (2, 4, 8)         2) (3, 6, 9)       3) (4, 16, 64)           4) (5, 25, 625)
  
సమాధానం: 2

సాధన: (2, 4, 8) = (2, 22, 23)
(3, 6, 9) = (3, 6, 32)
(4, 16, 64) = (4, 42, 43)
(5, 25, 625) = (5, 52, 53)

 

9. 5042, 5043, 5044, 5045, 5046, 5047, 5048, 5049, 5050, 5051.

     1) 5051       2) 5043          3) 5050             4) 5048

సమాధానం: 1

సాధన: 5051 మాత్రమే ప్రధాన సంఖ్య. మిగిలినవి సంయుక్త సంఖ్యలు.

 

10. కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి.

    1) 35-40      2) 42-48       3)  72-63       4) 56-64 

సమాధానం: 3

సాధన: 35-40 = 35 : 40 = 7 : 8

        42-48 = 42 : 48 = 7 : 8

        72-63 = 72 : 63 = 8 : 7

        56-64 = 56 : 64 = 7 : 8

 

11. కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి.

     LO12, UF06, VE22, ZA26

1) ZA26        2) UE06           3) VE22             4) LO12

సమాధానం: 2

సాధన: ఆంగ్ల అక్షరమాలలో..

    ఎడమ వైపు నుంచి Z, కుడి వైపు నుంచి A స్థానం = 26

   ఎడమ వైపు నుంచి U, కుడి వైపు నుంచి E స్థానం సమానం కాదు

   ఎడమ వైపు నుంచి V, కుడి వైపు నుంచి E స్థానం = 22

  ఎడమ వైపు నుంచి L, కుడి వైపు నుంచి O స్థానం = 12

 

12. కింది పదాల్లో భిన్నమైంది గుర్తించండి.

    1) థైరాక్సిన్‌     2) అడ్రినలిన్‌     3) అయోడిన్‌     4) ఇన్సులిన్‌

సమాధానం: 3

సాధన: అయోడిన్‌ తప్ప మిగిలినవన్నీ హార్మోన్లు

 

13. కింది జతల్లో భిన్నమైంది ఏది?

    1) కారు : రోడ్డు         2) ఓడ : సముద్రం 

    3) రాకెట్‌ : అంతరిక్షం     4) విమానం : పైలెట్‌

సమాధానం: 4

సాధన: కారు రోడ్డుపై ప్రయాణిస్తుంది.

      ఓడ సముద్రంలో ప్రయాణిస్తుంది.

      రాకెట్‌ అంతరిక్షంలో ప్రయాణిస్తుంది.

      కానీ విమానం నడిపేది పైలెట్‌

 

14. భిన్నమైనదాన్ని గుర్తించండి.

    1) తమిళనాడు  దక్షిణం  2) పంజాబ్‌  ఉత్తరం

    3) అస్సాం  ఈశాన్యం    4) కేరళ  వాయవ్యం

సమాధానం: 4

సాధన: భారతదేశ భౌగోళిక చిత్రపటంలో కేరళ కూడా దక్షిణానే ఉంటుంది. 

 

15. కింది జతల్లో భిన్నమైంది గుర్తించండి.

    1) శని  గ్రహం        2) సూర్యుడు  నక్షత్రం    3) చంద్రుడు  ఉపగ్రహం  4) రాకెట్‌  అంతరిక్షం

సమాధానం: 4

సాధన:  శని ఒక గ్రహం

           సూర్యుడు ఒక నక్షత్రం

           చంద్రుడు ఒక ఉపగ్రహం

           కానీ రాకెట్‌ ఒక అంతరిక్షం కాదు.

 

16. భిన్నమైనదాన్ని గుర్తించండి.

 

17. కిందివాటిలో భిన్నమైంది ఏది?


              

రచయిత: గోలి ప్రశాంత్‌రెడ్డి

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌