• facebook
  • whatsapp
  • telegram

వాతావ‌ర‌ణ పీడ‌నం

మాదిరి ప్రశ్నలు


1. భారమితిలో ఒక్కసారిగా పాదరస మట్టం పడిపోవడం దేన్ని సూచిస్తుంది?

1) వర్షం    2) తుపాను    3) మబ్బులతో కూడిన వాతావరణం    4) పొడి వాతావరణం

జ: 2


2. బారోమీటర్‌ క్రమేపీ పెరగడం దేన్ని సూచిస్తుంది?

1) అనుకూల వాతావరణం     2) వెంటనే తుపాను రాక

3) వర్షం వచ్చే సూచన     4) చెప్పుకోదగిన మార్పు ఏదీ సూచించదు

జ: 1


3. వాయువుల ఒత్తిడిని కొలిచే సాధనం?

1) మైక్రోటోమ్‌      2) మైక్రోమీటర్‌     3) మాక్‌ మీటర్‌    4) మానోమీటర్‌

జ: 4


4. సముద్ర స్థాయిలో వాతావరణ ఒత్తిడి?

1) 62 సెం.మీ.    2) 72 సెం.మీ    3) 76 సెం.మీ.    4) 89 సెం.మీ.

జ: 3


5. భూమిపై ఎన్ని పీడన మేఖలాలను గుర్తించారు?

1) 2      2) 3     3) 4      4) 5

జ: 3


6. భారత వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) హైదరాబాద్‌      2) గువాహటి      3) పుణె      4) లఖ్‌నవూ

జ: 3


7. భూమిపై వాతావరణం కలగజేసే పీడనానికి ప్రధాన కారణం?

1) భూమ్యాకర్షణ శక్తి      2) భూభ్రమణం

3) భూపరిభ్రమణం      4) భూతలం అసమానంగా వేడెక్కడం

జ: 1


8. భూమధ్యరేఖ అల్పపీడన మండలం ఏయే అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?

1) 0 - 15°      2) 0 - 10°       3) 20 - 40°        4) 66 1/2 - 90°

జ: 2


9. సంవహన ప్రక్రియ అధికంగా జరిగే మండలం?

1) భూమధ్యరేఖ అల్పపీడన మండలం     2) ఉప ఆయనరేఖ అధిక పీడన మండలం

3) ఉపధృవ అల్పపీడన మండలం     4) ధృవ అధిక పీడన మండలం

జ: 1


10. వాతావరణ పటంపై ఒకే పీడనం గల ప్రాంతాలను కలిపే ఊహారేఖలను ఏమంటారు?

1) ఐసోబార్స్‌      2) ఐసోథర్మ్స్‌      3) ఐసోహైట్స్‌     4) ఐసోహిప్స్‌

జ: 1

రచయిత: సక్కరి జయకర్‌ 
 

Posted Date : 21-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌