• facebook
  • whatsapp
  • telegram

కార్బోహైడ్రేట్‌లు

1. మానవ దేహానికి ప్రాథమిక శక్తి జనకాలుగా పనిచేసే పదార్థాలు ఏవి?
ఎ) విటమిన్‌లు బి) ఖనిజ లవణాలు సి) కార్బోహైడ్రేట్‌లు డి) ప్రొటీన్‌లు
జవాబు: సి

 

2. ఒకే చక్కెర అణువు ఉండే మోనోశాఖరైడ్‌లకు ఉదాహరణ?
ఎ) గ్లూకోజ్ బి) మానోజ్ సి) గాలక్టోజ్ డి) పైవన్నీ
జవాబు: డి

 

3. కిందివాటిలో 5 కర్బన పరమాణువులు ఉన్న రైబోజ్ చక్కెర దేనిలో ఉంటుంది?
ఎ) పాలు బి) కేంద్రకామ్లాలు సి) తేనె డి) పండ్లు
జవాబు: బి

 

4. క్రీడాకారులు తక్షణ శక్తి కోసం ఏ చక్కెరను తీసుకుంటారు?
ఎ) రైబోజ్ బి) ఫ్రక్టోజ్ సి) గ్లూకోజ్ డి) గాలక్టోజ్
జవాబు: సి

 

5. కిందివాటిలో ఫ్రక్టోజ్ చక్కెరకు సంబంధించి సరైంది ఏది?
ఎ) ఇది అత్యంత తియ్యనైన చక్కెర
బి) దీనిలో 3 కర్బన పరమాణువులుంటాయి
సి) ఇది రక్తంలో ఉంటుంది డి) ఈ చక్కెర పాలిశాఖరైడ్
జవాబు:

 

6. ఆరు కర్బన పరమాణువులు ఉండే చక్కెరలకు ఉదాహరణ ఏది?
ఎ) గ్లూకోజ్ బి) ఫ్రక్టోజ్ సి) మానోజ్ డి) పైవన్నీ
జవాబు: డి

 

7. సుక్రోజ్‌ను వాణిజ్యపరంగా దేని నుంచి సంగ్రహిస్తారు?
ఎ) పండ్లు బి) పాలు సి) చెరకు రసం డి) తేనె
జవాబు: సి

 

8. డైశాఖరైడ్ అయిన మాల్టోజ్ చక్కెర కింది వేటి కలయిక ద్వారా ఏర్పడుతుంది?
ఎ) గ్లూకోజ్ + గ్లూకోజ్ బి) గ్లూకోజ్ + గాలక్టోజ్
సి) గ్లూకోజ్ + ఫ్రక్టోజ్ డి) గ్లూకోజ్ + లాక్టోజ్
జవాబు:

 

9. మనం రోజు ఉపయోగించే పంచదారను రసాయనికంగా ఏమంటారు?
ఎ) మాల్టోజ్ బి) రాఫినోజ్ సి) సుక్రోజ్ డి) లాక్టోజ్
జవాబు: సి

 

10. కిందివాటిలో రాఫినోజ్ చక్కెర వేటిలో ఎక్కువగా ఉంటుంది?
ఎ) పత్తిగింజల పిండి బి) పాలు
సి) ధాన్యాలు డి) చెరకు రసం
జవాబు:

 

11. ఒకే రకమైన చక్కెర అణువులు ఉండే హోమో పాలిశాఖరైడ్ కార్బోహైడ్రేట్‌లకు ఉదాహరణ?
ఎ) పిండిపదార్థం బి) గ్త్లెకోజెన్
సి) సెల్యులోజ్ డి) పైవన్నీ
జవాబు: డి
 

Posted Date : 24-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌