• facebook
  • whatsapp
  • telegram

 కార్బోహైడ్రేట్‌లు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. జీవులన్నీ కింది ఏ కార్బోహైడ్రేట్‌ను నేరుగా శ్వాసక్రియలో ఉపయోగించుకుంటాయి?

1) గ్లూకోజ్‌   2) స్టార్చ్‌   3) ఫ్రక్టోజ్‌   4) సెల్యులోజ్‌


2. ఏ కార్బోహైడ్రేట్‌ను జంతువుల్లో నిల్వ ఉండే పిండిపదార్థం అంటారు?

1) పిండిపదార్థం   2) గ్లైకోజన్‌   3) ఇన్యులిన్‌  4) ఇన్సులిన్‌


3. పాలలోని లాక్టోజ్‌లో ఏ చక్కెరలు అంతర్భాగంగా ఉంటాయి?

1) గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌     2) గ్లూకోజ్, సుక్రోజ్‌

3) గ్లూకోజ్, గాలక్టోజ్‌  4) లాక్టోజ్, మాల్టోజ్‌


4. కేంద్రకామ్లాల్లో ఉండే పెంటోజ్‌ చక్కెరకు ఉదాహరణ?

1) అరాబినోజ్‌    2) గ్జైలోజ్‌    3) ఫ్రక్టోజ్‌   4) రైబోజ్‌


5. గ్లూకోజ్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) గ్లూకోజ్‌ హెక్సోజ్‌ చక్కెరకు ఉదాహరణ.

2) గ్లూకోజ్‌ను తక్షణ శక్తినిచ్చే చక్కెర అంటారు.

3) గ్లూకోజ్‌ నేరుగా శ్వాసక్రియలో ఉపయోగపడుతుంది.

4) పైవన్నీ 


6. పత్తిగింజల పిండిలో కింది ఏ చక్కెర ఉంటుంది?

1) మాల్టోజ్‌   2) రాఫినోజ్‌   3) సుక్రోజ్‌   4) లాక్టోజ్‌


7. ధాన్యాలు, బంగాళదుంప, విత్తనాలు లాంటివాటిలో ఏ హోమో పాలిశాకరైడ్‌ నిల్వ ఉంటుంది?

1) గ్లైకోజన్‌    2) పిండిపదార్థం    3) ఇన్యులిన్‌    4) సెల్యులోజ్‌


8. వృక్షరాజ్యంలో నిర్మాణాత్మకంగా భూమిపై అతి ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్‌?

1) సెల్యులోజ్‌   2) ఇన్యులిన్‌  3) అగార్‌  4) పెక్టిన్‌


9. సముద్ర శైవలాల నుంచి లభించే అగార్‌ అనే పదార్థం ఏ విధంగా ఉపయోగపడుతుంది?

1) ఔషధాల తయారీకి      2) ఆహార పరిశ్రమలో రుచికి 

3) జామ్స్, జెల్లీల తయారీలో  4) ఫ్రక్టోజ్‌ తయారీలో


10. ఇన్యులిన్‌ను ఉపయోగించి ఏ చక్కెరను వాణిజ్యపరంగా తయారుచేస్తారు?

1) గ్లూకోజ్‌   2) సుక్రోజ్‌   3) ఫ్రక్టోజ్‌   4) లాక్టోజ్‌

 

సమాధానాలు

 1-1; 2-2; 3-3; 4-4; 5-4; 6-2; 7-2; 8-1; 9-3; 10-3.

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌