సూచనలు (ప్ర. 1 - 16): ప్రశ్నల్లో నిశ్చితం (A), కారణం (R) ఉన్నాయి. కింది ఆప్షన్స్ ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ఎ) A, Rరెండూ సరైనవి, A కి R సరైన వివరణ
బి) A, R రెండూ సరైనవి, A కి R సరైన వివరణ కాదు
సి) A సరైంది కానీ R తప్పు
డి) A సరైంది కాదు కానీ R సరైంది
ఇ) A, R రెండూ సరైనవి కాదు
1. నిశ్చితం (A): సుభాష్ చంద్రబోస్ 1939లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
కారణం (R):సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్య్ర లీగ్‌ను ఆగ్నేయాసియాలో ప్రారంభించేందుకు కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు.
సాధన: నిశ్చితం (A) సరైంది. కానీ కారణం (R) సరైంది కాదు.
సమాధానం: సి
2. నిశ్చితం (A): గ్రాఫైట్‌కి జారుడు స్వభావం ఉంటుంది. దీన్ని కందెనగా ఉపయోగిస్తారు.
కారణం (R): గ్రాఫైట్‌లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉంటాయి.
సాధన: A, R రెండూ సరైనవే. గ్రాఫైట్‌కి జారుడు స్వభావం ఉండటం వల్ల దాన్ని కందెనగా ఉపయోగిస్తారు. దీనికి కారణం స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు కాదు. కాబట్టి A కి R సరైన వివరణ కాదు.
సమాధానం: బి
3. నిశ్చితం (A): క్లోరోఫ్లోరోకార్బన్ల (సీఎఫ్‌సీ) వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు.
కారణం (R):వీటి కారణంగా చర్మ క్యాన్సర్ వస్తుంది.
సాధన: A సరైంది. సీఎఫ్‌సీ వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. కానీ ళి సరైంది కాదు. దీనివల్ల పర్యావరణం కలుషితం అవుతోంది.
సమాధానం: సి
4. నిశ్చితం (A): శీతాకాలంలో తెల్లటి వస్త్రాలు ధరించడానికి ప్రజలు ఇష్టపడతారు.
కారణం (R): తెల్లటి వస్త్రాలు వేడిని పరావర్తనం చేసే మంచి సాధనాలు.
సాధన: A సరైంది కాదు. R సరైంది.
తెల్లటి వస్త్రాలు వేడిని పరావర్తనం చెందించే మంచి సాధనాలు.
సమాధానం: డి
5. నిశ్చితం (A): 21 మార్చి, 23 సెప్టెంబరు రోజుల్లో రాత్రి, పగటి సమయాలు సమానంగా ఉంటాయి.
కారణం (R): భూమధ్య రేఖ రెండు ధృవాలకు సమాన దూరంలో ఉంటుంది.
సాధన: నిశ్చితం (A), కారణం (R) రెండూ సరైనవే. (A), కి (R) సరైన వివరణ.
ఆ రెండు రోజుల్లో భూమధ్య రేఖకు, ధృవాలకు మధ్య దూరం సమానం అవుతుంది.
సమాధానం: ఎ
6. నిశ్చితం (A): ఇథైల్ ఆల్కహాల్ (C2H5OH), నీరు (H2O) మిశ్రమాన్ని పూర్తిగా వేరు చేయొచ్చు.
కారణం (R): నీరు మరిగే స్థానం 100°C. ఆల్కహాల్ మరిగే స్థానం 80°C
సాధన: నిశ్చితం (A) సరైంది కాదు. కారణం (R) సరైంది.
సమాధానం: డి
7. నిశ్చితం (A): ఆనకట్టల్లో నిల్వ చేసిన నీటికి స్థితిశక్తి ఉంటుంది.
కారణం (R): స్థితి, గతిశక్తుల మొత్తం రసాయన శక్తి అవుతుంది.
సాధన: A సరైంది. కానీ R సరైంది కాదు.
భూ ఉపరితలానికి కొంత ఎత్తులో స్థిరంగా ఉన్న వస్తువులు అన్నింటిలో స్థితిశక్తి + గత్తి శక్తి = యాంత్రిక శక్తి
సమాధానం: సి
8. నిశ్చితం (A): కోడిగుడ్డుపై బలం ప్రయోగించినప్పుడు అది పగులుతుంది.
కారణం (R): ప్రమాణ వైశ్యాలంపై ప్రయోగించిన బలాన్ని పీడనం అంటారు.
సాధన: A, R రెండూ సరైనవి. (A) కి (R) సరైన వివరణ ఇస్తుంది.
సమాధానం: ఎ
9. నిశ్చితం (A): ధృవాల వద్ద వస్తువులు అధిక భారాన్ని కలిగి ఉంటాయి.
కారణం (R) : ధృవాల వద్ద భూమి గురుత్వ త్వరణం విలువ గరిష్ఠం.
సాధన: A, R సరైనవి. (A) కి (R) సరైన వివరణ.
సమాధానం: ఎ
10. నిశ్చితం ( A ): న్యూక్లియర్ రియాక్టర్లో భారజలాన్ని మోడరేటర్లా ఉపయోగిస్తారు.
కారణం (R): న్యూక్లియర్ రియాక్టర్లో కేంద్రక విచ్ఛిత్తి కోసం థర్మల్ న్యూట్రాన్లను ఉపయోగిస్తారు.
సాధన: A, R రెండూ సరైనవి A కి R సరైన వివరణ ఇస్తుంది.
సమాధానం: ఎ
11. నిశ్చితం (A):ఎత్తయిన ప్రాంతాల్లో ఆహార పదార్థాలను ఉడికించడానికి ముందు వాటికి ఉప్పు కలుపుతారు.
కారణం (R): ఎత్తయిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కనిష్ఠం.
సాధన: A, R సరైనవి.(A) కి (R) సరైన వివరణ.
సమాధానం: ఎ
12. నిశ్చితం (A): O గ్రూప్ బ్లడ్ ఉన్నవారు విశ్వగ్రహీతలు.
కారణం (R): O గ్రూప్ బ్లడ్‌లో ప్రతిజనకాలు ఉండవు.
సాధన: A సరైంది కాదు, కానీ R సరైంది. O గ్రూప్ బ్లడ్ వారిని విశ్వదాతలు అంటారు.
ఎందుకంటే O గ్రూప్ రక్తంలో ప్రతిజకాలు ఉండవు. అవి ప్రతి రక్షకాలను ఏర్పరచుకోవు. కాబట్టి ఈ రకం రక్తాన్ని ఏ గ్రూప్ రక్తం కలిగిన వారికైనా ఎక్కించవచ్చు.
సమాధానం: డి
13. నిశ్చితం (A): పర్వతాల పైకి వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది.
కారణం (R): వాతావరణంలో పైన ఉండే గాలి శుద్ధంగా ఉంటుంది.
సాధన: A సరైంది కాదు, కానీ R సరైంది. వాతావరణంలో పైకి వెళ్లేకొద్దీ పీడనం పెరుగుతుంది. గాలి శుద్ధంగా ఉంటుంది.
సమాధానం: డి
14. నిశ్చితం (A): ఎయిడ్స్‌కి వ్యాక్సిన్ లేదు.
కారణం (R): ఎయిడ్స్ వాక్సిన్ తయారీకి చాలా ఖర్చు అవసరం.
సాధన: A సరైంది కానీ R సరికాదు. ఎయిడ్స్‌కి కారణమైన వైరస్ దాని జెనెటిక్ కోడ్‌ను (వారసత్వ కోడ్) మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు వ్యాక్సిన్ తయారీ సాధ్యపడలేదు.
సమాధానం: సి
15. నిశ్చితం (A): జేమ్స్ చాడ్విక్ ఎలక్ట్రాన్‌ను కనుక్కున్నారు.
కారణం (R): ఎలక్ట్రాన్ ఆవేశం తటస్థం. కాబట్టి దాన్ని కనుక్కోవడం అసాధ్యం.
సాధన: A ,R రెండూ సరైనవి కాదు. ఎలక్ట్రాన్‌ను జె.జె.థామ్సన్ కనుక్కున్నారు. ఎలక్ట్రాన్ అవేశం రుణాత్మకం.
సమాధానం: ఇ
16. నిశ్చితం (A): కొవ్వులను ఆక్సీకరణం చెందించిప్పుడు అవి విడుదల చేసే శక్తి, కార్బోహైడ్రేట్లను ఆక్సీకరణం చేసినప్పుడు విడుదలయ్యే శక్తిలో సగం ఉంటుంది.
కారణం(R): కార్బోహైడ్రేట్స్‌లో ఉండే ఆక్సిజన్ కంటే కొవ్వుల్లో ఉండే ఆక్సిజన్ తక్కువ.
సాధన: నిశ్చితం (A), కారణం (R) సరైనవి కావు. కార్బోహైడ్రేట్ల ఆక్సీకరణం వల్ల విడుదలయ్యే శక్తి కంటే కొవ్వుల ఆక్సీకరణం వల్ల అధిక శక్తి విడుదల అవుతుంది.
సమాధానం: ఇ
రచయిత
బూసర గణేష్,
విషయ నిపుణులు