• facebook
  • whatsapp
  • telegram

వన్యప్రాణుల సంరక్షణ

అంతరించే దశలో నాలుగు కొమ్ముల జంతువు!

 


 

జీవావరణంలోని ప్రతి జంతువుకూ ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వన్యప్రాణులు సహజ పర్యావరణ వ్యవస్థలో విడదీయలేని భాగం. విస్తృత ఆహార వలయం సక్రమంగా కొనసాగాలంటే వీటి మనుగడ తప్పనిసరి. అయితే అడవుల నిర్మూలన, సహజ ఆవరణ వ్యవస్థల విధ్వంసం లాంటి మానవ చర్యల ఫలితంగా ఎన్నో జీవులు నేడు అంతరించిపోయే స్థితికి చేరాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం కూడా ఇందుకు తోడవుతున్నాయి. అలాంటి పరిణామాలను, ప్రమాదాలను ఎదుర్కొంటున్న జంతువుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వపరంగా వ్యవస్థాగతంగా తీసుకుంటున్న ప్రత్యక్ష, అనుబంధ చర్యలు, రెడ్‌ బుక్‌లో ఉన్న భారత్‌లోని అరుదైన, ప్రత్యేకతలున్న జీవాలు, వాటి ఆవాస ప్రాంతాల గురించి అవగాహనతో ఉండాలి.

 


ప్రపంచవ్యాప్తంగా అంతరించే స్థితిలో ఉన్న జీవజాతులు, ప్రకృతి వనరులను స్థానికంగా పరిరక్షించేందుకు, అందుకు తగిన సూచనలు అందించేందుకు 1948లో స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్‌ నగరంలో ఐయూసీఎన్‌ (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మొదటిసారిగా ప్రపంచంలో మానవ చర్యల వల్ల ప్రమాద స్థితిలో ఉన్న జాతులను గుర్తించింది. అవి అంతరించేందుకు కారణాలు పేర్కొంటూ, వాటి సంరక్షణ చర్యలను సూచిస్తూ రెడ్‌ డేటా బుక్‌ను రూపొందించగా, 1963లో ఇంగ్లండ్‌కు చెందిన పీటర్‌ స్కాట్‌ అనే పక్షి శాస్త్రవేత్త మొదటిసారిగా దాన్ని ప్రచురించారు. ఇందులో వన్యప్రాణుల సంరక్షణకు రెండు రకాల వ్యూహాలు సూచించారు.


1. ఆవాసాంతర సంరక్షణ (ఇన్‌-సిటు కన్సర్వేషన్‌), జాతీయ పార్కులు, బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు, అభయారణ్యాలు.

2. ఆవాసేతర సంరక్షణ (ఎక్స్‌-సిటు కన్సర్వేషన్‌), కణజాల వర్ధన కేంద్రాలు, విత్తన బ్యాంకులు, జన్యు బ్యాంకులు.1.     కిందివాటిలో ఆవాసాంతర సంరక్షణ కానిదేది?

1) జాతీయ పార్కుల ఏర్పాటు      2) రిజర్వ్‌ ఫారెస్ట్‌ల ఏర్పాటు        

3) బయోస్ఫియర్‌ రిజర్వ్‌ల ఏర్పాటు      4) విత్తన బ్యాంకుల ఏర్పాటు


2.     కిందివాటిలో భారతదేశంలో మొదటి జాతీయ పార్కు?    

1) కన్హ       2) హేవి   

3) బంధిపుర్‌        4) జిమ్‌ కార్బెట్‌


3.     ఒక ప్రత్యేక వన్యప్రాణి సంరక్షణ కోసం చట్టపరంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను ...... అంటారు.

1) జాతీయ పార్కులు   2) అభయారణ్యాలు  

3) ఉద్యానవనాలు     4) జంతు ప్రదర్శనశాలలు


4.     కిందివాటిలో ఆవాసేతర సంరక్షణ కానిదేది?

1) జంతు ప్రదర్శనశాలల ఏర్పాటు       2) ఉద్యానవనాల ఏర్పాటు        

3) జాతీయ పార్కుల ఏర్పాటు       4) అక్వేరియాల ఏర్పాటు


5.     రెడ్‌ డేటా బుక్‌ని నిర్వహించే సంస్థ ఏది?

1) IUCN  2) CITES  3) WWF  4) IBWL


6.     మొక్కలు, జంతువులను సంరక్షించే రక్షిత ప్రాంతాలు ఏవి?

1) జాతీయ పార్కు    2) అభయారణ్యాలు 

3) ఉద్యానవనాలు     4) జంతు ప్రదర్శనశాలలు


7. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఉన్న ప్రదేశం?

1) లఖ్‌నవూ         2) తిరువనంతపురం    

3) న్యూఢిల్లీ       4) కోల్‌కతా


8.     జాతీయ వన్యప్రాణులను కిందివాటిలో ఎందులో సంరక్షిస్తారు?

1) వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు       2) జాతీయ పార్కులు   

3) కన్సర్వేటివ్‌ రిజర్వ్‌లు      4) 1, 2


9.     ఒడిశాలోని నందన్‌కానూన్‌ సంరక్షణ కేంద్రం కిందివాటిలో దేనికి ప్రసిద్ధి?

1) సంకరజాతి పులులు       2) సంకరజాతి తెల్లపులులు 

3) సంకరజాతి ఏనుగులు       4) సంకరజాతి సింహాలు


10. నేలగాయి, బట్టమేక తల పిట్ట (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌) జాతులకు ప్రసిద్ధి గాంచిన రక్షిత ప్రాంతమేది?

1) థార్‌లోని డెసెర్ట్‌ నేషనల్‌ పార్కు

2) రాణ్‌ ఆఫ్‌ కఛ్‌ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం

3) జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కు

4) గిర్‌ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం


11. జొన్నలు, శనగలు, వేరుశనగ, కందులు లాంటి పంటల జన్యువులను కిందివాటిలో ఏ పరిశోధనా కేంద్రంలో పరిరక్షిస్తారు?

1) IBPGR - ఇంటర్నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ ప్లాంట్‌  జెనెటిక్‌ రిసోర్సెస్‌

2) ICRISAT - ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెమి ఎరిడ్‌ ట్రాపిక్స్‌ 

3) TBGRI - ట్రాపికల్‌ బొటానికల్‌ గార్డెన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

4) NBPGR - నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ప్లాంట్‌   జెనెటిక్‌ రిసోర్సెస్‌


12. కింది వాటిలో ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్న జాతులు ఏవి?

1) ఇండియన్‌ బస్టర్డ్‌       2) మచ్చల జింక   

3) రెడ్‌ పాండా      4) పైవన్నీ


13. మొక్కల విత్తనాలను భద్రపరచడానికి ఏర్పాటు చేసిన విత్తన బ్యాంకుల్లో అరుదైన మొక్కల విత్తనాలను ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు?

1) -196 °C     2) -183 °

3) -163 °C     4) -146 °C


14. కిందివాటిలో నిజమైన వాటిని గుర్తించండి.

ఎ) జాతీయ పార్కులనేవి రక్షిత ప్రాంతాల పథకం కింద ఏర్పాటు చేసిన భూ, సముద్ర తీర ప్రాంతాలకు చెందిన వన్యజీవుల పరిరక్షణతోపాటు ఆ ప్రాంతంలోని మానవ జీవన చర్యలను పరిరక్షించే సంరక్షణా కార్యక్రమం.

బి) అభయారణ్యాలు శాసనపరంగా పరిధులు నిర్ణయించని ఒక ప్రత్యేక జాతి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన రక్షిత కార్యక్రమం.

సి) బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు అనేవి ఒక ప్రత్యేక వనజీవి ఆవాసాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం

1) ఎ, బి, సి      2) బి మాత్రమే 

3) ఎ, బి        4) ఎ, సి 


15. వన్య, మృగ సంరక్షణా చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1962  2) 1970  3) 1972  4) 1980


16. కిందివాటిలో వన్య జాతులతోపాటు మానవ జీవన చర్యలను పరిరక్షించేందుకు చేపట్టిన ఇన్‌ - సిటు (IN-SITU) కార్యక్రమం ఏది?

1) బయోస్ఫియర్‌ రిజర్వ్‌       2) జన్యు బ్యాంకు 

3) జాతీయ పార్కు          4) ఏదీకాదు 


17. కిందివాటిలో భారతదేశంలో సహజంగా నివసించే జీవ జాతులను గుర్తించండి.

ఎ) నల్లటి మెడ కొంగలు      బి) చిరుతలు   

సి) ఎగిరే ఉడతలు        డి) మంచు చిరుతలు

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి 

3) బి, డి        4) పైవన్నీ


18. ఏ రాష్ట్రంలో జాతీయ పార్కులు, అభయారణ్యాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి?

1) ఉత్తర్‌ప్రదేశ్‌       2) రాజస్థాన్‌   

3) మధ్యప్రదేశ్‌        4) పశ్చిమ బెంగాల్‌


19. హోలాక్‌ గిబ్బన్‌ (India's only ape) అనే హొమినిడే వర్గానికి చెందిన కోతిని దేశంలోని ఏ జాతీయ పార్కులో సంరక్షిస్తున్నారు?

1) కజిరంగా పక్షి సంరక్షణా కేంద్రం       2) హజారీబాగ్‌ జాతీయ పార్కు  

3) జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కు        4) సైలెంట్‌ వ్యాలీ జాతీయ పార్కు


20. ప్రవచనం (ఎ): జాతీయ పార్కులు అనే రక్షిత ప్రాంతాల పరిధి శాసన పరంగా నిర్ధారించి ఉంటుంది.    

కారణం (ఆర్‌): జాతీయ పార్కులుగా ప్రకటించిన ప్రాంతాల నుంచి వంట చెరకు సేకరణ, పశువుల మేత, ఖనిజాల సంగ్రహణ లాంటి చర్యలను అనుమతిస్తారు.

1) ఎ, ఆర్‌ లు నిజమైనవి. ఎ కి ఆర్‌ సరైన    వివరణ.

2) ఎ, ఆర్‌ లు నిజమైనవి. ఎ కి ఆర్‌ సరైన    వివరణ కాదు.

3) ఎ నిజమైంది, ఆర్‌ నిజమైంది కాదు.

4) ఎ నిజమైంది కాదు, ఆర్‌ నిజమైంది.


21. కిందివాటిలో యునెస్కో తన వరల్డ్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ బయోస్ఫియర్‌ రిజర్వ్‌ (డబ్ల్యూఎన్‌బీఆర్‌)లో గుర్తించిన వాటిని పేర్కొనండి.

ఎ) సుందర్‌బన్‌  బి) అగస్త్యమలై   సి) నొక్రెక్‌   

డి) నీలగిరి     ఇ) గ్రేట్‌ నికోబార్‌   ఎఫ్‌) అమర్‌కంటక్‌ - అచానక్‌మర్‌

1) ఎ, బి, డి, ఎఫ్‌     2) ఎ, సి, ఇ, ఎఫ్‌ 

3) ఎ, బి, సి, డి     4) పైవన్నీ


22. ప్రవాళభిత్తికల సంరక్షణ, యాజమాన్య నిర్వహణకు సంబంధించి కిందివాటిలో ఎంపిక చేసిన ప్రాంతాలను గుర్తించండి.

ఎ) గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌    బి) గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌

సి) లక్షద్వీప్‌   డి) అండమాన్, నికోబార్‌ దీవులు

1) ఎ, బి, డి     2) ఎ, సి 

3) పైవన్నీ    4) సి, డి 


23. రామ్‌సర్‌ ఒప్పందానికి సంబంధించి కింద తెలిపిన వాటిలో సరైన వాటిని గుర్తించండి.

ఎ) చిత్తడి ప్రాంతాల సంరక్షణకు సంబంధించిన ఒక అంతర్జాతీయ సమావేశం.

బి) దీన్ని ఇరాన్‌లో కాస్పియన్‌ సముద్ర తీరాన ఉన్న రామ్‌సర్‌ అనే ప్రాంతంలో 1971, ఫిబ్రవరి 2న ఆమోదించారు.

సి) ఈ ఒప్పందం 1973, డిసెంబరు 21 నుంచి అమల్లోకి వచ్చింది.

1) ఎ, బి        2) ఎ, సి  

3) ఎ, బి, సి     4) సి మాత్రమే


24. కింది ప్రవచనాలను పరిశీలించి, వాటిలో నిజమైన వాటిని గుర్తించండి.

ఎ) హంగుల్‌ అనే జింక జాతి కేవలం జమ్ము-కశ్మీర్‌లోనే ఉంటుంది.

బి) సర్పిలాకారంలో ‘వి’ ఆకారపు కొమ్ములున్న కృష్ణజింక కేవలం భారతదేశంలోనే కనిపిస్తుంది.

సి) ప్రపంచంలోనే నాలుగు కొమ్ములున్న ఏకైక జంతువు చౌసింగా.

1) ఎ, బి      2) బి, సి   

3) ఎ, బి, సి      4) సి మాత్రమే


25. కిందివాటిలో ఆవాసేతర సంరక్షణలో భాగంగా చేపట్టే పథకాలను గుర్తించండి.

ఎ) జాతీయ పార్కులు      బి) ఉద్యానవనాలు  

సి) జంతు ప్రదర్శనశాలలు    డి) ఆక్వాకల్చర్‌  

ఇ) వన్యమృగ సంరక్షణ కేంద్రాలు

1) ఎ, బి, సి      2) బి, సి, డి   

3) ఎ, బి, డి, ఇ      4) ఎ, బి, సి, డి, ఇ     


26. కిందివాటిని జతపరచండి.

బయోస్ఫియర్‌ రిజర్వ్‌ జంతు జాతులు
1) పాంచ్‌మర్హి ఎ) నీలగిరి తార్‌
2) సిమ్లిపాల్‌ బి) గౌర్‌
3) అగస్త్యమలై సి) ఉప్పునీటి మొసళ్లు
4) గ్రేట్‌ నికోబార్‌ డి) ఉడతలు

 1) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి     2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి      4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి


27. కిందివాటిని జతపరచండి.

జాబితా - 1 జాబితా - 2
1) సైలెంట్‌ వ్యాలీ జాతీయ పార్కు ఎ)మేఘాలయ
2) పెంచ్‌ జాతీయ పార్కు బి) రాజస్థాన్‌
3) బాల్‌ ఫాక్రం జాతీయ పార్కు  సి) మహారాష్ట్ర
4) రణతంబోర్‌ జాతీయ పార్కు డి) కేరళ

1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి         2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ          4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బిసమాధానాలు


1-4; 2-4; 3-1; 4-3; 5-1; 6-1; 7-4; 8-4; 9-2; 10-1; 11-2; 12-4; 13-1; 14-2; 15-3; 16-1; 17-2; 18-3; 19-2; 20-3; 21-4; 22-3; 23-3; 24-3; 25-2; 26-3; 27-1.


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 
 

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు