• facebook
  • whatsapp
  • telegram

విపత్తు నిర్వహణ

పవనాల దిశను సూచించే స్టార్‌ చిత్రాలు!
 

 

అంతరిక్ష సాంకేతికతలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ రిమోట్‌ సెన్సింగ్, జీఐఎస్, జీపీఎస్‌ తదితర టెక్నాలజీలను ప్రజోపయోగ కార్యక్రమాలకు విరివిగా వినియోగిస్తోంది. విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, సమాచార వ్యవస్థల్లో ఈ సాంకేతికతలే ఇప్పుడు కీలకంగా మారాయి. ఇవి పనిచేసే విధానం, వీటిలోని  పరికరాలతోపాటు రాడార్లు, స్కానర్లు, రకరకాల మ్యాపులు సంబంధిత అంశాలపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక అవగాహన ఉండాలి. దేశంలో రిమోట్‌ సెన్సింగ్‌ను వాడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, అవి అందిస్తున్న సేవలు, ఉపగ్రహాల్లో ఉండే వివిధ సెన్సర్లు, వాటి  ప్రయోజనాలు, ప్రత్యేకతల గురించి పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 


మాదిరి ప్రశ్నలు
 

1.  భారతదేశంలో కార్చిచ్చులకు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) భారతదేశంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో 55% ప్రాంతానికి అగ్నిప్రమాదం పొంచి ఉంది.

బి) దేశవ్యాప్తంగా కార్చిచ్చుల కారణంగా సంవత్సరానికి రూ.440 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది.

సి) కార్చిచ్చుల వల్ల వాతావరణంలోకి పెద్దఎత్తున ట్రేస్‌ వాయువులు, ఏరోసాల్‌ పార్టికల్స్‌ విడుదలవుతాయి.

డి) ఈ కార్చిచ్చులు ట్రోపోస్ఫియర్‌లోని రసాయన సమ్మేళనం, శీతోష్ణస్థితిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

1) ఎ, సి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి


2. తుపాను ఏర్పడిన తర్వాత అది పయనించే మార్గాన్ని ఇస్రోకు చెందిన స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌లో అభివృద్ధి చేసిన ఒక గణిత నమూనాను ఉపయోగించి అంచనా వేస్తారు. అయితే స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ ఎక్కడ ఉంది?

1) అహ్మదాబాద్‌ (గుజరాత్‌)  

2) హైదరాబాద్‌ (తెలంగాణ)

3) శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్‌) 

4) దెెహ్రాదూన్‌ (ఉత్తరాఖండ్‌)


3. భారత గృహవ్యవహారాల మంత్రిత్వ శాఖ కింది ఏ మంత్రిత్వ శాఖతో కలిసి జీఐఎస్‌ ఆధారిత ‘నేషనల్‌ డేటాబేస్‌ ఫర్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌’ను అభివృద్ధి పరిచింది?

1) అంతరిక్ష శాఖ      

2) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ

3) కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రిత్వ శాఖ   

4) పైవన్నీ 


4.  ‘నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌’ ఏ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ల కోసం అలర్ట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి పరిచింది?

1) ఆంధ్రప్రదేశ్‌     2) తమిళనాడు 

3) పశ్చిమ బెంగాల్‌      4) బిహార్‌


5.  2001లో గుజరాత్‌ భూకంపం సందర్భంగా సహాయక చర్యల్లో సహాయపడిన సాంకేతిక వ్యవస్థ?

1) జీఐఎస్‌      2) జీపీఎస్‌ 

3) ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ    4) సోషల్‌ మీడియా


6.  జీఐఎస్‌ అనేది ప్రాదేశిక డేటాను విశ్లేషించడంలో కింద పేర్కొన్న ఏ అంశాల సమ్మేళనం?

ఎ) జాగ్రఫీ   బి) కంప్యూటింగ్‌  

సి) కార్టోగ్రఫీ  డి) రిమోట్‌ సెన్సింగ్‌

1) ఎ, బి, సి   2) బి, సి, డి  

3) ఎ, సి, డి   4) ఎ, బి, సి, డి


7. ఇస్రో ఏ రాష్ట్రాల వరదలకు సంబంధించిన జిల్లాస్థాయి వైపరీత్య అట్లాస్‌లను రూపొందించింది?

ఎ) అస్సాం   బి) బిహార్‌ 

సి) ఆంధ్రప్రదేశ్‌    డి) తెలంగాణ

1) ఎ, సి   2) బి, డి   3) ఎ, బి   4) ఎ, బి, సి, డి


8.  వరద ప్రభావిత ప్రాంతాల పరిధిని తెలుసుకోవడానికి అత్యుత్తమ సాధనంగా ఉపయోగపడేవి?

1) శాటిలైట్‌ ఆధారిత ఇమేజరీలు 

2) ఏరోస్పేస్‌ సిస్టమ్‌ల ద్వారా వచ్చిన సమాచారం 

3) పై రెండూ     4) ఏదీకాదు 


9.   భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వేతర సైంటిఫిక్‌ సొసైటీ?

1) ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌   2) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ

3) నేషనల్‌ జియోగ్రాఫికల్‌ సర్వే ఇన్‌స్టిట్యూట్‌   4) ఏదీకాదు


10. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (ఐఐఆర్‌ఎస్‌) ఎక్కడ ఉంది?

1) హైదరాబాద్‌   2) నైనిటాల్‌ 

3) అహ్మదాబాద్‌   4) దెహ్రాదూన్‌ 


11. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌ఎండీఏ) జాతీయ విపత్తు నిర్వహణ సమాచార, కమ్యూనికేషన్‌ వ్యవస్థపై ఏ సంవత్సరంలో మార్గదర్శకాలు విడుదల చేసింది?

1) 2011  2) 2012  3) 2014  4) 2016


12. కిందివాటిలో జియో ఇన్ఫర్మాటిక్స్‌లో భాగమైంది?

1) రిమోట్‌ సెన్సింగ్‌     

2) జీఐఎస్, జీపీఎస్‌ 

3) ఇంటర్నెట్‌ మ్యాపింగ్‌ సర్వీసు 

4) పైవన్నీ


13. స్కేలు అంటే?

1) భూఉపరితలంలో ఊర్ధ్వ ఎత్తు, క్షితిజ సమాంతర ఎత్తు మధ్య ఉండే నిష్పత్తి

2) మానచిత్రంపై చూపిన మొత్తం భూభాగం

3) విశాల ప్రాంతాలను చిన్న ప్రాంతాలుగా చూపడం

4) గ్లోబుపై ఉన్న దూరం, మానచిత్రంపై ఉన్న దూరాల నిష్పత్తి


14. భూమి మొత్తాన్ని అత్యంత కచ్చితంగా ప్రతిబింబింపజేసే విధానం ఏది?

1) ఎయిర్‌ ఫొటోగ్రఫీ    2) గ్లోబ్‌ 

3) మెర్కేటర్‌ ప్రక్షేపం     

4) ఉపగ్రహం నుంచి తీసిన ఫొటోగ్రాఫ్‌


15. రిమోట్‌ సెన్సింగ్‌లో బహువర్ణపట స్కానింగ్‌ వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తాయి?

1) కాంతి విద్యుత్‌ సాధనం 

2) కాంతి రసాయన సాధనం 

3) కాంతి విద్యుత్, రసాయన సాధనాలు 

4) ఏదీకాదు


16. కింద పేర్కొన్న విద్యుదయస్కాంత వర్ణపట భాగాల్లో రిమోట్‌ సెన్సింగ్‌లో ఉపయోగించే భాగం ఏది?

1) దృశ్యమానం     2) పరారుణ 

3) సూక్ష్మతరంగ     4) పైవన్నీ


17. ఆబ్లిక్‌ రకానికి చెందిన రాడార్లను ఏమని పిలుస్తారు? 

1) వెర్టికల్‌ టైప్‌ ఎయిర్‌ రాడార్లు 

2) సైడ్‌ లుకింగ్‌ ఎయిర్‌బార్న్‌ రాడార్‌

3) సైడ్‌ లుకింగ్‌ ఏరియల్‌ రాడార్‌  

4) ఏదీకాదు


18. వివిధ తరంగదైర్ఘ్యాలను ప్రత్యేకంగా వివిధ బ్యాండ్లలో నమోదు చేసే స్కానర్లు?

1) థర్మల్‌ స్కానర్లు     2) ఆప్టికల్‌ స్కానర్లు 

3) మల్టీస్పెక్ట్రల్‌ స్కానర్లు     4) ఏదీకాదు


19. SLAR అంటే?

1) సైడ్‌ లుకింగ్‌ ఎయిర్‌బర్న్‌ రాడార్‌

2) సైడ్‌ లుకింగ్‌ ఏరియల్‌ రాడార్‌  

3) సైడ్‌ లివింగ్‌ ఎయిర్‌బర్న్‌ రాడార్‌ 

4) సోనార్‌ లుకింగ్‌ ఎయిర్‌బర్న్‌ రాడార్‌ 


20. కిందివాటిని జతపరచండి.

జాబితా - 1    జాబితా - 2

ఎ) బసోప్లేత్‌ మ్యాప్‌లు  1) సహజ సముదాయాన్ని చూపడానికి బాగా అనువైనవి 

బి) చుక్కల మ్యాప్‌లు  2) జనాభా విస్తరణను చూపడానికి అనువైనవి 

సి) స్కాటర్‌ గ్రాఫ్‌లు    3) పవనాల దిశను సూచించడానికి అవసరం 

డి) స్టార్‌ చిత్రాలు   4) సాపేక్షంగా క్రమబద్ధమైన మార్పులను వివరించడానికి అనువైనవి

1) ఎ-4, బి-2, సి-3, డి-1 

2) ఎ-2, బి-4, సి-3, డి-1

3) ఎ-4, బి-2, సి-1, డి-3 4) ఎ-2, బి-4, సి-1, డి-3


21. ‘పిక్సెల్స్‌’ రూపంలో సమాచారాన్ని నిల్వ చేసే భౌగోళిక సమాచార వ్యవస్థలోని నమూనా ఏది?

1) రాస్టార్‌    2) వెక్టార్‌  

3) లీనియర్‌     4) పైవన్నీ


22. భౌగోళిక సమాచార వ్యవస్థకు సంబంధించిన వెక్టార్‌ నమూనాలో సమాచారం ఏ రూపంలో నిల్వ ఉంటుంది?

1) బిందువులు 2) రేఖలు 3) బహుభుజి 4) పైవన్నీ


23. కిందివాటిలో జీఐఎస్‌లోని ఒక భాగం కానిది ఏది?

1) హార్డ్‌వేర్‌ 2) సాఫ్ట్‌వేర్‌ 3) ప్రజలు 4) సెన్సర్లు 


24. భూగోళ ఉపరితలానికి సంబంధించిన అన్ని వివరాలను భద్రపరిచే కంప్యూటర్‌ వ్యవస్థను ఏమని పిలుస్తారు?

1) జీఐఎస్‌     2) రిమోట్‌ సెన్సింగ్‌ 

3) గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ 4) ఏదీకాదు


25. కింది వాటిని జతపరచండి. 

జాబితా - 1 (ఐసోలైన్లు)     జాబితా - 2 (లక్షణాలు)

ఎ) ఐసోటోప్‌లు    1) వర్షపాతం 

బి) ఐసోపాచ్‌లు    2) మేఘాల ప్రాతిపదిక 

సి) ఐసోహైట్‌లు   3) సంభావ్య ఉష్ణోగ్రత 

డి) ఐసోహైప్‌లు   4) క్యుములోనింబస్‌

1) ఎ-3, బి-4, సి-1, డి-2 

2) ఎ-4, బి-3, సి-1, డి-2

3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-3, బి-4, సి-2, డి-1 


26. విపత్తుల నిర్వహణలో రిమోట్‌ సెన్సింగ్‌ పాత్రకు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి. 

ఎ) విపత్తు ప్రాంతాలను ఒకటి కంటే ఎక్కువసార్లు నియమిత కాలవ్యవధిలో చిత్రీకరిస్తుంది.

బి) విపత్తు దుర్బలత్వ ప్రాంతాలను గుర్తించి మ్యాపులు ఉన్న అట్లాస్‌లను రూపొందిస్తుంది.

సి) విపత్తు ప్రభావిత ప్రాంత పటాలను అందిస్తుంది.

1) ఎ, బి  2) ఎ, సి 3) బి, సి 4) ఎ, బి, సి


27. నిష్క్రియాత్మక రిమోట్‌ సెన్సింగ్‌ విధానంలో ఉపయోగించే సెన్సర్లకు సంబంధించి కింది ప్రవచనాలు పరిశీలించి, సరైనవి గుర్తించండి. 

ఎ) ఇవి స్వయంగా సూర్యకాంతిని వెలువరిస్తాయి.

బి) ఇవి స్వయంగా సూర్యకాంతిని వెలువరించలేవు.

సి) సూర్యకాంతిని మాత్రమే పరావర్తనం చెందించగలుగుతాయి.

డి) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను, భూమి మీద పేరుకుపోయిన మంచు పొరలను, వాటి మందాలను పరిశీలించడానికి అనువుగా ఉంటాయి.

1) ఎ, బి  2) ఎ, సి  3) సి, డి  4) బి, సి, డి


28. ఉపరితలం మీద ఉన్న పర్వతాలు, లోయలను పరిశీలించడానికి అనువుగా ఉండే రిమోట్‌ సెన్సింగ్‌ విధానాన్ని............... అని పిలుస్తారు. 

1) సక్రియాత్మక విధానం 

2) నిష్క్రియాత్మక విధానం

3) దృశ్య రిమోట్‌ సెన్సింగ్‌ విధానం 

4) ఉష్ణపరారుణ రిమోట్‌ సెన్సింగ్‌ విధానం


29. మైక్రోవేవ్‌ సెన్సర్లకు సంబంధించి కింది వాస్తవాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి. 

ఎ) దృశ్య, పరారుణ కాంతి కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉండే తరంగాలను గ్రహిస్తాయి.

బి) రాత్రి, పగలు అనే తేడా లేకుండా భూఉపరితల దృశ్యాలను పరిశీలించగలవు.

సి) వాతావరణం అలజడులతో కూడి ఉన్నప్పుడు ఇవి భూఉపరితల దృశ్యాలను పరిశీలించలేవు.

డి) రాత్రి సమయాల్లో ఇవి పనిచేయవు.

1) ఎ, బి  2) ఎ, సి  3) సి, డి  4) ఎ, డి


30. థర్మల్‌ సెన్సర్లు అంటే?

1) భూమ్మీద ఉన్న వస్తువుల ఉపరితలం నుంచి పరావర్తనం చెందించేే దృశ్యం, సమీప పరారుణ కాంతులను గ్రహించి పనిచేసే సెన్సర్లు.

2) భూఉపరితలం నుంచి వెలువడే ఉష్ణ పరారుణ కిరణాలను గ్రహించి పనిచేసే సెన్సర్లు.

3) దృశ్య, పరారుణ కాంతి కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం ఉండే కిరణాలను గ్రహించే సెన్సర్లు.

4) పైవన్నీ


31. రిమోట్‌ సెన్సింగ్‌ వ్యవస్థలో స్పష్టమైన, నాణ్యమైన ఫొటోలు అందించే రాడార్లు ఏవి?

1) లంబంగా, నిశ్చలంగా ఉండే కెమెరాలు 

2) ఆబ్లిక్‌ రాడార్లు   3) లీనియర్‌ కెమెరాలు

4) ఏదీకాదు


32. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) అహ్మదాబాద్‌   2) హైదరాబాద్‌ 

3) తుంబ   4) జోధ్‌పూర్‌


సమాధానాలు
 

 1-4; 2-1; 3-4; 4-2; 5-1; 6-4; 7-3; 8-1; 9-1; 10-4; 11-2; 12-4; 13-4; 14-1; 15-4; 16-4; 17-2; 18-3; 19-1; 20-3; 21-1; 22-4; 23-4; 24-1; 25-1; 26-4; 27-4; 28-1; 29-3; 30-2; 31-2; 32-2.

 


 

Posted Date : 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు