• facebook
  • whatsapp
  • telegram

మనిషికి తెలిసిన భయంకర వైపరీత్యం!

భూకంపాలు - సునామీలు

 

 

మానవుడు నివారించలేని ప్రకృతి విపత్తుల్లో ప్రధానమైనవి భూకంపాలు, సునామీలు. అయితే తక్షణ స్పందన, సహాయక చర్యలతో ఈ విపత్తుల వల్ల కలిగే నష్టాలను, పర్యవసాలను కొంతవరకు తగ్గించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న విపత్తుల్లో భూకంపాలు, సునామీల వాటా ఎనిమిది శాతం వరకు ఉంది. అనుకోకుండా, అకస్మాత్తుగా విరుచుకుపడే ఈ ప్రకృతి ప్రకోపాలకు కారణాలను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. భూకంపాలకు భూపటలంలోని ఫలకాల కదలికలు కారణమైతే, సునామీలు సర్వసాధారణ భూకంపాలతోనే సంభవిస్తాయి. ఈ అంశాలపై శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు భారత దేశం సహా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలు, ఇప్పటివరకు ఎదురైన విపత్తుల నష్టాలు, సంబంధిత నివేదికలపై అవగాహన పెంచుకోవాలి. 

 

భూకంపం అంటే భూ పటలం లేదా ప్రావారంలో ఉనికిని పొంది నాభి నుంచి జనించే ప్రకంపన తరంగాల పరంపరలు. ఆకస్మిక, అంతర్జనిత బలాల వల్ల శిలలు ఆకస్మికంగా స్థానభ్రంశం చెందినప్పుడు శక్తి వెలువడుతుంది. ఈ శక్తి తరంగాల రూపంలో నలుదిశలా వ్యాపిస్తుంది. ఈ విధంగా ప్రాథమిక, ద్వితీయ, రేఖాంశ (PSL) తరంగాలు వ్యాపించి ప్రకంపనలు కలగజేస్తాయి. దీన్నే భూకంపం అంటారు. భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటారు.

సునామీ అంటే తీర కెరటం అని అర్థం. ఈ పదం జపాన్‌ భాష నుంచి వచ్చింది. ‘సు’ అంటే తీరం, ‘నామి’ అంటే కెరటం. దీన్నే ‘హార్బర్‌ వేవ్‌’ అని పిలుస్తారు. సునామీలు ప్రధానంగా నాలుగు కారణాల వల్ల సంభవిస్తాయి.

1) భూకంపంతో పాటు వచ్చే భ్రంశ చలనాలు (Fault Movements)

2)    జలాంతర్గత భూకంపాలు

3)    భూపాతం (Landslide)

4)    సముద్రంలో అగ్నిపర్వత విస్ఫోటం

5)    సముద్రంలో ఉల్కాపాతం, ఆస్టరాయిడ్స్‌ పడటం


మాదిరి ప్రశ్నలు


1.     భూకంపం ఏ వేళలో సంభవించవచ్చు?

1) ఉదయం       2) మధ్య రాత్రి   

3) మధ్యాహ్నం       4) పైవన్నీ


2. 1997, జూన్‌ 26న సమోవాలో సంభవించిన అతి పెద్ద భూకంపం రిక్టర్‌ స్కేలుపై ఎంతగా నమోదైంది?

1) 8.3   2) 4.3   3) 11.3   4) 9.3


3.     సవరించిన సిస్మిక్‌ జోన్ల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతం ఏది?

1) నల్గొండ       2) గుంటూరు   

3) ఒంగోలు       4) కడప


4.     ఇండియాలో ఉన్న ఐదు సిస్మిక్‌ జోన్లలో ఏది ఎక్కువ వాతావరణ మార్పులకు గురవుతుంది?

1) 5     2) 4     3) 3     4) 2


5.     ప్రపంచంలో నమోదైన ప్రాణాంతకమైన భూకంపం ఎప్పుడు సంభవించింది?

1) 1556  2) 1557  3) 1558  4) 1559


6.     1556లో ప్రపంచంలో నమోదైన ప్రాణాంతకమైన భూకంపం ఏ దేశంలో సంభవించింది?

1) ఇండొనేసియా       2) జపాన్‌   

3) చైనా       4) ఇండియా


7.    ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ఏ సాగరానికి సంబంధించింది?

1) అట్లాంటిక్‌       2) పసిఫిక్‌   

3) ఇండియన్‌       4) అంటార్కిటిక్‌


8.     భూకంపాల వల్ల జరిగే పరిణామాల్లో సమ్మిళితమైంది?

1) కదలిక, నేల పగుళ్లు    2) భూపాతాలు, హిమప్రవాహాలు

3) నేల ద్రవీకరణం    4) పైవన్నీ


9.     ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌’ భూకంపాలు సంభవించడానికి వీలున్న ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించింది?

1) 5      2) 6    3) 7    4) 8


10. 2012, ఏప్రిల్‌ 11న ఏ దేశంలో భారీ భూకంపం సంభవించి తూర్పు తీర ప్రాంతంలోని 28 దేశాల్లో సునామీ హెచ్చరికలకు దారితీసింది?

1) బ్రూనై    2) మలేసియా

3) ఇండొనేసియా    4) ఫిలిప్పీన్స్‌


11. భూకంపం నుంచి సంభవించేవి?

1) కంపనాలు            2) ప్రకంపనాలు    

3) కంపనాలు, ప్రకంపనాలు    4) ప్రకంపనాలు, మంటలు


12. ఏ దేశంలో సాధారణంగా భూకంపాలు సంభవించవు?

1) చిలీ    2) పాకిస్థాన్‌    

3) న్యూజిలాండ్‌    4) ఆస్ట్రేలియా


13. భూకంపాలు, అగ్నిపర్వతాలు దేంతో సహసంబంధాన్ని కలిగి ఉంటాయి?

1) ముడత భ్రంశం చెందిన ప్రాంతం    2) అగాథ సముద్ర మైదానం

3) పీఠభూమి ప్రాంతం    4) సముద్ర తీర ప్రాంతం


14. భారతదేశ రాష్ట్రాల విస్తృత వైపరీత్య వివరణను ప్రతిబింబించే వల్నరబిలిటీ అట్లాసును తయారుచేసింది ఎవరు?

1) బిల్డింగ్‌ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌    2) భారత వాతావరణ శాఖ

3) భారత విపత్తు నిర్వహణ సంస్థ    4) యునెస్కో


15. ‘నిఫే’ అనే పదం దేన్ని సూచిస్తుంది?

1) భూకంపాలు    2) భూమి అంతర్భాగం

3) భూపటలం        4) మహాసముద్రపు అడుగు భాగం


16. 2003, డిసెంబరు 26న ఏ దేశంలో శక్తిమంతమైన భూకంపం వచ్చి విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది?

1) ఇరాన్‌    2) ఇరాక్‌    

3) సౌదీ అరేబియా    4) జోర్డాన్‌


17. ప్రబలమైన సునామీలు ఎక్కువగా వేటి వల్ల కలుగుతాయి?

1) భూకంపాలు     2) వల్కనోలు 

3) భూపాతాలు     4) తుపాన్లు


18. భారతదేశంలో ఏ రాష్ట్రానికి భూకంపాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి?    

1) ఢిల్లీ    2) ఆంధ్రప్రదేశ్‌    

3) గుజరాత్‌    4) కేరళ


19. ఇండియాలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం?

1) అస్సాం    2) బిహార్‌    

3) మేఘాలయ    4) మహారాష్ట్ర


20. రిక్టర్‌ స్కేల్‌ మీద దేన్ని కొలుస్తారు?

1) ద్రవాల సాంద్రత      2) భూకంపాల తీవ్రత

3) తుపానుల వేగం      4) పర్వతాల ఎత్తు


21. కిందివాటిలో పెద్ద భూప్రకంపనం ఏది?

1) చిలీ (27-02-2010) 2) జపాన్‌ (11-03-2011)

3) ఇండొనేసియా (26-12-2004)   4) పైవన్నీ


22. భూకంపం దేనికి దారితీస్తుంది?

1) భూమి కదలికలు       2) భూపాతం   

3) ఉపరితల పగులు      4) పైవన్నీ


23. కిందివాటిలో ఏది సరైంది?

1) భూకంపం అకస్మాత్తుగా జరిగే విపత్తు.    2) భూకంపాన్ని ముందే ఊహించవచ్చు.

3) భూకంపం 25 నిమిషాల పాటు ఉంటుంది.   4) భూకంపం రాత్రి పూట సంభవిస్తుంది.


24. మధ్య అమెరికా దేశమైన నికరాగువాలో ఏ సంవత్సరంలో భూకంపాలు సంభవించి, భారీ నష్టం కలిగింది?

1) 1972  2) 1973   3) 1974  4) 1975


25. ‘సునామీ’ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది?

1) జపనీస్‌       2) రష్యన్‌   

3) అరబిక్‌         4) ఫ్రెంచ్‌


26. సునామీలు తరచుగా ఏ కోస్తా ప్రదేశాల్లో వస్తాయి?

1) తూర్పు కోస్తా ప్రాంతం    2) మలబారు రేవు   

3) గల్ఫ్‌ ఆఫ్‌ కంబాట్‌      4) రాణా ఆఫ్‌ కచ్‌


27. సముద్రం లోపల భూకంపాల వల్ల ఏర్పడేవి?

1) అగ్నిపర్వతాలు      2) భూపాతాలు  

3) సునామీలు      4) వరదలు


28. ఏ రిపోర్టుల నుంచి ఇండియన్‌ సునామీ గురించి పాత రికార్డులు లభించాయి?

1) 1941 భూకంపం  2) 286 బి.సి. భూకంపం   

3) 316 బి.సి. భూకంపం       4) 326 బి.సి. భూకంపం


29. సునామీలు ఎక్కడ ఎక్కువగా సంభవిస్తాయి?

1) హిందూ మహాసముద్రం      2) అట్లాంటిక్‌ మహాసముద్రం

3) పసిఫిక్‌ మహాసముద్రం 4) మధ్యధరా సుముద్రం


30. ఏ రోజున సముద్రం లోపల తీవ్ర భూకంపం సునామీకి దారితీసి జపాన్‌ ఈశాన్య  ప్రాంతాన్ని తాకి 19,000 మంది మరణానికి కారణమైంది?

1) 2011, మార్చి 11       2) 2011, ఫిబ్రవరి 14   

3) 2011, జనవరి 11        4) 2010, మార్చి 14


31. నీటి లోతు ఆధారంగా సునామీ గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది?

1) 600 - 800 కి.మీ.     2) 900 - 1100 కి.మీ. 

3) 800 - 900 కి.మీ.     4) 950 - 1150 కి.మీ.


32. సునామీ అలలు దేనివల్ల ఉద్భవిస్తాయి?

1) సముద్రగర్భ భూకంపాలు    2) అగ్నిపర్వత సంబంధ పగుళ్లు 

3) భూపాతాలు         4) పైవన్నీ


33. 2012, మార్చి 11 నాటికి ఏ దేశపు భూకంపం, సునామీ వల్ల వేలాదిమంది చనిపోయి ఒక సంవత్సరం అయ్యింది?

1) మెక్సికో     2) ఫిలిప్పీన్స్‌ 

3) ఇండొనేసియా     4) జపాన్‌


34. సముద్ర గర్భంలో భూకంపాలు సంభవించడం వల్ల ఏర్పడేవి?

1) తుపాన్లు     2) ఉరుములు 

3) మెరుపులు     4) సునామీలు


35. సునామీ తరంగాలు/అలలు సంభవించే కారణాలు?

1) సముద్రంలో భూకంపాలు     2) అగ్నిపర్వత ఉద్భోదనాలు 

3) భూపాతాలు     4) పైవన్నీ


36. ఏ సంవత్సరంలో ఇండొనేసియాలోని కాక్రటోవా ప్రాంతంలో పర్వత సంబంధ తీవ్ర విస్పోటం వల్ల 40 అడుగుల సునామీలు సంభవించాయి?

 1) 1881   2) 1882  3) 1883   4) 1884


37. భారత్‌లో జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థ (NTWS) ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?

1) 2004  2) 2005  3) 2006  4) 2007


38. జపాన్‌ చరిత్రలో 23 అడుగుల సునామీని కలిగించిన భూకంపం ఎప్పుడు వచ్చింది?

1) 2010, మార్చి 11     2) 2011, మార్చి 11 

3) 2010, ఫిబ్రవరి 11     4) 2011, ఫిబ్రవరి 11


39. సునామీలు అధిక భాగం సంభవించే ప్రాంతం?

1) భూకంపాల ప్రాంతం     2) ఇండొనేసియా ప్రాంతం 

3) ఇండియన్‌ సముద్రం     4) పసిఫిక్‌ సముద్రం


40. మొదటిసారిగా క్రీస్తు పూర్వం ఏ సంవత్సరంలో ఏజియన్‌ సముద్రపు ఉత్తర ప్రాంతంలో సునామీలు సంభవించినట్లు సమాచారం లభ్యమైంది?

1) క్రీ.పూ.450     2) క్రీ.పూ.412 

3) క్రీ.పూ.379     4) క్రీ.పూ.479


41. మనిషికి తెలిసిన భయంకరమైన ప్రకృతికారక వైపరీత్యం?

1) తుపాన్లు     2) సునామీలు 

3) భూపాతాలు     4) గాలివానలు


42. పసిఫిక్‌ సునామీ హెచ్చరిక వ్యవస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 1948      2) 1952  

3) 1949      4) 1947



సమాధానాలు


1-4; 2-1; 3-3; 4-1; 5-1; 6-3; 7-2; 8-4; 9-1; 10-3; 11-3; 12-4; 13-1; 14-1; 15-2; 16-1; 17-1; 18-3; 19-1; 20-2; 21-4; 22-4; 23-1; 24-1; 25-1; 26-1; 27-3; 28-4; 29-3; 30-1; 31-1; 32-4; 33-4; 34-4; 35-4; 36-3; 37-4; 38-2; 39-4; 40-3; 41-2; 42-3.


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 
 

Posted Date : 01-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌