• facebook
  • whatsapp
  • telegram

పీఠభూములు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఆర్మీనియా పీఠభూమి ఎక్కడ ఉంది?

1) ఆఫ్రికా    2) రష్యా    3) టిబెట్‌    4) ఆస్ట్రేలియా


2. టిబెట్, పామిర్‌ పీఠభూములు ఏ రకమైన పీఠభూములకు ఉదాహరణ?

1) పర్వతాంతర పీఠభూములు    2) గిరిపద పీఠభూములు

3) కలశ పీఠభూములు   4) లావా పీఠభూములు


3. అర్జెంటీనాలో ని పెటగోనియా పీఠభూమి ఏ రకానికి చెందింది?

1) పర్వతాంతర    2) గిరిపద    3) కలశ    4) ఖండాంతర్గత


4. పెటగోనియా పీఠభూమి ఏ ఖండంలో  ఉంది?

1) ఉత్తర అమెరికా   2) దక్షిణ అమెరికా   3) యూరప్‌   4) ఆస్ట్రేలియా


5. ప్రపంచంలో  ఎత్తయిన పీఠభూమి?

1) టిబెట్‌  2) బొలీవియా  3) మంగోలియా  4) కొలరాడో


6. ‘ప్రపంచపు పైకప్పు’ అని ఏ పీఠభూమిని పేర్కొంటారు?

1) పామీర్‌    2) మాల్వా    3) దక్కన్‌   4) కొలరాడో

 

7. ‘రూర్‌ ఆఫ్‌ ఇండియా లేదా ఖనిజాల కాణాచి’ అని పిలిచే పీఠభూమి?

1) బుందేల్‌ ఖండ్‌ 2) బాగల్‌ ఖండ్‌  3) కోడెర్మా పీఠభూమి 4) చోటానాగ్‌పుర్‌ పీఠభూమి


8. కిందివాటిలో పీఠభూమి లక్షణాలకు సంబంధించి సరైంది?

1) ఎక్కువ విస్తీర్ణంతో ఇంచుమించు సమతలంగా ఉండటం. 

2) అంచులు వాలును కలిగి ఉండటం. 

3) 300 మీటర్లు, అంతకంటే కొద్దిగా ఎత్తుగా ఉండటం.  

4) పైవన్నీ  


9. లావా పీఠభూములకు ఉదాహరణ?

1) కొలంబియా 2) రాంచీ పీఠభూమి  3) హజీరాబాగ్‌  4) కొలరాడో పీఠభూమి


10. అమెరికాలోని అర్కన్‌సాస్, బజార్క్‌ పీఠభూములు వేటికి ఉదాహరణ?

1) కలశ పీఠభూములు    2) గిరిపద పీఠభూములు

3) పర్వతాంతర పీఠభూములు   4) ఖండాంతర్గత పీఠభూములు


11. మైకా నిల్వలకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి?

1) రాంచీ   2) కోడెర్మా  3) బాగల్‌ ఖండ్‌   4) మాల్వా 


12. ‘స్నేక్‌ రివర్‌’ పీఠభూమి ఏ దేశంలో ఉంది?

1) అమెరికా    2) భారతదేశం   3) పాకిస్థాన్‌  4) చైనా


13. వికోశీకరణ బలాల శైథిల్య క్రమక్షయ చర్యలకు లోనుకావడం వల్ల శిథిలమై పీఠభూములుగా పరిణామం చెందేవి? 

1) లావా   2) ఖండాంతర్గత   3) అవశిష్ట   4) పర్వతాంతర


14. పన్నా వజ్రపు గనులకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి?

1) టిబెట్‌   2) పామీర్‌  3) మంగోలియా 4) ఏదీకాదు


15. పీఠభూమిని సూచించేది?

1) పర్వతాలతో చుట్టబడిన భూమి     

2) ఇసుకతో కప్పబడిన భూమి 

3) ఒక విశాలమైన సమతలం లేదా సమతల ఉద్గమన ప్రదేశం 

4) అడవులతో నిండిన భూమి

 

సమాధానాలు

1- 3; 2- 1; 3- 2; 4- 2; 5- 1; 6- 1; 7-4; 8-4; 9-1; 10-1; 11-2; 12-1; 13-3; 14-4; 15-3.


 

Posted Date : 22-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌