• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్తు ప్రవాహం - రసాయన ఫలితాలు

శక్తి ప్రవాహాలతో సమస్త పప్రయోజనాలు 

ఇనుము తుప్పు పట్టకుండా రంగులు వేస్తారు. కొత్త సైకిల్‌ రిమ్ములు మెరవడానికి క్రోమియం వాడతారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ లోహాలపై పూతలు వేయడానికి విద్యుత్తును వినియోగిస్తారు. విద్యుత్తు ప్రవాహం రసాయన చర్యను ప్రేరేపిస్తుంది. విద్యుచ్ఛక్తి రసాయన బంధాలను విచ్ఛిన్నం చేసి, కొత్త రసాయన బంధాలను ఏర్పరుస్తుంది. ఈ రసాయన ఫలితాలను ఉపయోగించుకుని లోహాలను శుద్ధి చేస్తారు. బ్యాటరీల ద్వారా మొబైల్స్‌ తదితరాలను ఛార్జింగ్‌ చేస్తారు. ఈ నేపథ్యంలో నిత్య జీవితంలో పలు ప్రయోజనాలను అందించే విద్యుత్తు ప్రవాహం, దాని స్వభావం, సంబంధిత రసాయ ఫలితాలపై పోటీ పరీక్షారులు అవగాహన పెంచుకోవాలి. ఎల్‌ఈడీలు తక్కువ విద్యుత్తుతో ఎక్కువ వెలుగు ఇవ్వడానికి కారణాలను అరం చేసుకోవాలి.

తడి చేతులతో విద్యుత్తు ఉపకరణాలను తాకవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే తడిచేతులు విద్యుత్తు వాహకాలుగా పనిచేస్తాయి. ఏ పదారాలైతే తమ ద్వారా విద్యుత్తును ప్రసరింపజేస్తాయో వాటిని ‘ఉత్తమ విద్యుత్తు వాహకాలు’ అంటారు. (ఉదా: అల్యూమినియం, రాగి లాంటి లోహాలు). అదేవిధంగా ఏ పదారాలు తమ ద్వారా విద్యుత్తును ప్రసరింపజేయలేవో వాటిని ‘అధమ విద్యుత్తు వాహకాలు’ అంటారు (ఉదా: రబ్బర్, ప్లాస్టిక్, చెక్క లాంటివి). ఒక ఘనపదారంలో విద్యుత్తు ప్రవహిస్తుందో లేదో తెలుసుకోవడానికి టెస్టర్‌ను ఉపయోగిస్తారు. అలాగే ద్రవాలూ విద్యుత్తు వాహకతను ప్రదర్శిస్తాయి. అవి విద్యుత్తు ప్రవాహాన్ని తమ ద్వారా అనుమత్తిసాయో లేదో తెలుసుకోవడానికి కూడా టెస్టర్‌ను వాడవచ్చు. అయితే ఘటం సానంలో బ్యాటరీని అమర్చాలి.

విద్యుత్తు ఉష్ణఫలితం వల్ల ఫిలమెంట్‌ వేడెక్కి ఎక్కువ ఉష్ణోగ్రతకు చేరుకోవడంతో బల్బు వెలుగుతుంది. అయితే వలయం ద్వారా ప్రవహించే విద్యుత్తు ప్రవాహం బలహీనంగా ఉంటే ఫిలమెంట్‌ వేడెక్కకపోవడంతో బల్బు వెలగదు. వాస్తవానికి చాలా పదారాలు కొన్ని ప్రత్యేక పరిసితుల్లో తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. అందువల్ల ఆ పదారాలను వాహకాలు, బంధకాలు అని వర్గీకరించేందుకు బదులు ఉత్తమ వాహకాలు, అధమ వాహకాలు అని వర్గీకరించారు. ఉప్పును స్వేదన జలంలో కరిగించినప్పుడు ఉప్పు ద్రావణం ఏర్పడుతుంది. ఇది మంచి విద్యుత్తు వాహకం అవుతుంది. కుళాయిలు, చేతిపంపులు, బావులు, చెరువుల నుంచి వచ్చే నీరు స్వచ్ఛమైంది కాదు. అందులో చాలా లవణాలు కరిగి ఉంటాయి. స్వతహాగా అందులో తక్కువ మోతాదులో ఖనిజ లవణాలు  ఉంటాయి. ఈ నీరు మంచి విద్యుత్తు వాహకం అవుతుంది. స్వేదన జలంలో లవణాలు ఉండవు. అందుకే ఇది అధమ విద్యుత్తు వాహకంగా ఉంటుంది.

* నీటిలో సహజంగా తక్కువ మోతాదులో ఉన్న ఖనిజ లవణాలు మనిషి ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఈ ఖనిజ లవణాలు నీటిని మంచి విద్యుద్వాహకంగా తయారు చేస్తాయి. అందుకే విద్యుత్తు ఉపకరణాలను తడిచేతులతో/తడి నేలమీద నిలబడి తాకకూడదు.

*ద్రవాల్లో ఎక్కువగా ఆమ్ల, క్షార, లవణ ద్రావణాలే తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి.

* 1800లో బ్రిటిష్‌ రసాయన శాస్త్రవేత్త విలియం నికల్సన్‌ ఎలక్ట్రోడ్‌లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపించినప్పుడు ఆక్సిజన్, హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతాయని నిరూపించారు. బ్యాటరీ ధన ధ్రువానికి కలిపిన ఎలక్ట్రోడ్‌ వద్ద ఆక్సిజన్‌ బుడగలు, మరొక ధ్రువం వద్ద హైడ్రోజన్‌ బుడగలు ఏర్పడతాయి.

విద్యుత్తును ఒక వాహక ద్రావణం ద్వారా పంపినప్పుడు రసాయనిక చర్యకు కారణమవుతుంది.  ఫలితంగా ఎలక్ట్రోడ్‌ల దగ్గర గాలి బుడగలు ఏర్పడతాయి. ద్రావణం రంగులో కూడా మార్పులు రావొచ్చు. ఇది చర్యలో ఉపయోగించిన ద్రావణం, ఎలక్ట్రోడ్‌లపై ఆధారపడి ఉంటుంది.

కూరగాయలు, పండ్లు కూడా తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. ఉదాహరణకు బంగాళాదుంపను రెండు ముక్కలుగా కోసి రాగి తీగలను వాటిలో గుచ్చినప్పుడు ఒక తీగచుట్టూ నీలి ఆకుపచ్చ రంగు గుర్తు ఏర్పడటం వల్ల ఇక్కడ విద్యుత్తు బంగాళదుంపలో రసాయన ప్రభావాన్ని కలిగించిందని చెప్పొచ్చు.


ఎల్‌ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్ )

ఇది వలయంలో తక్కువ విద్యుత్తు ప్రవాహం ఉన్నా కూడా వెలుగుతుంది. అందుకే దీన్ని వస్తువులు పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి టెస్టర్‌గా ఉపయోగిస్తారు. ఇందులో రెండు టర్మినల్స్‌ ఉంటాయి. పొట్టి టర్మినల్‌ను వలయంలోని ఘటం రుణ ధ్రువానికి, పొడవాటి టర్మినల్‌ను ఘటం   ధన ధ్రువానికి కలుపుతారు.

ఎల్‌ఈడీలను రేడియో, టీవీ, గడియారాలు, ఎలక్ట్రానిక్‌ కాలిక్యులేటర్స్‌ లాంటి పరికరాల్లో విరివిగా ఉపయోగిస్తారు.

* ప్రస్తుతం ఎల్‌ఈడీలు అన్ని రంగుల్లో  లభిస్తున్నాయి.

* ఎల్‌ఈడీని ఎక్కువగా ప్రకాశవంతమైన కాంతి కోసం ఉపయోగిస్తారు.

* తెలుపు ఎల్‌ఈడీల సమూహాల గుంపు ఒక ఎల్‌ఈడీ కాంతి జనకాన్ని  తయారుచేస్తుంది.

* సాధారణ బల్బులు, ఫ్లోరసెంట్‌ బల్బుల కంటే ఎల్‌ఈడీలు తక్కువ విద్యుత్తును గ్రహిస్తాయి.

* ఎల్‌ఈడీ బల్బుల జీవితకాలం ఎక్కువ. అందుకే ఇవి క్రమంగా ముఖ్యమైన కాంతి  జనకాలు  అవుతున్నాయి.


ఎలక్ట్రోప్లేటింగ్‌ 

ఒక లోహంతో మరొక లోహంపై పూత పూయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్‌ అంటారు. ఇదొక విద్యుత్తు ప్రవాహం వల్ల ఏర్పడే రసాయన ఫలితానికి ఉదాహరణ. తుప్పుపట్టే అవకాశం ఉన్న లోహాలపై తుప్పు పట్టని లోహాలతో పూత పూయడాన్ని కూడా ‘ఎలక్ట్రోప్లేటింగ్‌’ అంటారు. ఎలక్ట్రో ప్లేటింగ్‌ను విద్యుత్తు విశ్లేషణ పద్ధతి ద్వారా చేస్తారు. విద్యుత్తు విశ్లేషణ అంటే.. ఒక ద్రవం ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తే అది అయాన్‌లుగా విడిపోవడమే.

* కొత్త సైకిల్‌ హ్యాండిల్, చక్రం రిమ్ములు బాగా మెరుస్తూ ఉంటాయి. ఆ విధంగా  మెరవడానికి వాటిపై క్రోమియంతో పూత పూస్తారు.

* ఇత్తడి, వెండి లోహాలపై బంగారంతో పూత  పూయడాన్ని ‘గోల్డ్‌ కవరింగ్‌’ అంటారు.

* వన్‌ గ్రామ్‌గోల్డ్‌ ఆభరణాలను ఎలక్ట్రోప్లేటింగ్‌ పద్ధతిలోనే తయారు చేస్తారు.

* తినుబండారాలను నిల్వ చేసే ఇనుప డబ్బాలకు తగరం అనే లోహంతో పూత పూస్తారు.

* వాహనాల విడి భాగాలు, వంతెనల నిర్మాణంలో ఉపయోగించే ఇనుముకు జింక్‌తో పూత పూస్తారు.

జాగ్రత్తలు: 

* ఎలక్ట్రోప్లేటింగ్‌ జరుగుతున్నంతసేపు విద్యుత్తు నిలకడగా ఉండాలి.

పూత పూసే వస్తువును గరకు కాగితంతో రుద్దాలి.

* పూత పూసే వస్తువును క్యాథోడ్‌ వద్ద తీసుకోవాలి.

* దీనిలో ఉపయోగించే ద్రావణం వాహకతను  పెంచడానికి సజల సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని కలపాలి.

 

రచయిత : చంటి రాజుపాలెం 

Posted Date : 14-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు