• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ పరిరక్షణ సంస్థలు, ఒప్పందాలు, ఉద్యమాలు

ఆహారభద్రతకు నవధాన్య ఆందోళన!

మానవ వికాసం, ఆధునిక అభివృద్ధి పరిణామ క్రమంలో వనరుల వినియోగం అధికమవడం, జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, సాంకేతికతల వినియోగం వల్ల సహజ పర్యావరణం క్షీణిస్తోంది. భూగోళాన్ని కాలుష్య కారకాల నుంచి కాపాడి, భవిష్యత్తు తరాలకు సహజ పర్యా వరణాన్ని అందించే లక్ష్యంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పలు ఒప్పందాలు, చట్టాలు రూపొంది అమలవుతున్నాయి. కాలుష్య నివారణ, అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలు, ప్రభుత్వాలను చైతన్యపరిచేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రకృతిని కాపాడి, సుస్థిరాభివృద్ధిని సాధించేందుకు జరుగుతున్న ఈ సానుకూల పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశ, విదేశాల్లో జరిగిన ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమాల గురించి తెలుసుకోవాలి.

 

పర్యావరణ కాలుష్యం ఫలితాలైన భూతాపం, ఓజోన్‌ క్షీణత, ఆమ్లవర్షాలు, నేల క్రమక్షయం, జన్యుఆధారిత   కాలుష్యకాలు లాంటి వైపరీత్యాలు మానవాళి మనుగడకే సవాళ్లు విసురుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో పర్యావరణ అంశాలపై ప్రజల్లో అవగాహన  పెరుగుతోంది. 1962లో అమెరికాలోని సిల్వర్‌ స్ప్రింగ్‌ ప్రాంతంలో పంటల చీడపీడల్ని నివారించేందుకు డీడీటీ పురుగుమందులు ఎక్కువగా వినియోగించారు. అందులోని మలినాలు పంట మొక్కల్లో జీవసాంద్రీకృతమవడం  పర్యావరణాన్ని ఎలా దెబ్బతీసిందో ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ అనే పుస్తకంలో ‘రేచల్‌ కార్సన్‌’ అనే ప్రపంచ పర్యావరణవేత్త వెల్లడించారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తి అలవడింది. ఈ క్రమంలో భారతదేశంలోనూ పలు పర్యావరణ ఉద్యమాలు    పుట్టుకొచ్చాయి.


1.    కింది ప్రవచనాలు పరిశీలించి, సరైనవి     గుర్తించండి.

ఎ) క్యోటో ప్రోటోకాల్‌ అనేది ఒక చట్టబద్ధ ఒప్పందం. ఈ ఒప్పందంలో 37 పారిశ్రామిక దేశాలకు, యూరోపియన్‌ దేశాలకు గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి లక్ష్యాలు నిర్దేశించారు.

బి) ఈ ప్రోటోకాల్‌పై అమెరికా, ఆస్ట్రేలియా    సంతకాలు చేయలేదు.

సి) ఈ సమావేశంలో పారిశ్రామిక దేశాలు తాము విడుదల చేసే ఉద్గారాలను 1990లో ఉన్న ఉద్గారాల స్థాయిలో 2008 - 2012 నాటికి  5.3 శాతానికి తగ్గించాలని సూచించారు.

1) ఎ, బి      2) ఎ, సి    3) బి, సి    4) ఎ, బి, సి 2.   కింది ప్రవచనాలు పరిశీలించి, సరైనవి      గుర్తించండి.

ఎ) క్యోటో ప్రోటోకాల్‌లో జరిగిన వాతావరణ  సదస్సులో కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలను  తగ్గించడానికి సంబంధించి అన్ని దేశాలకు ‘ఒకే నిబంధనలు అయితే భిన్నమైన బాధ్యతలు’ అనే సూత్రాన్ని అనుసరించి అభివృద్ధి చెందిన    దేశాలపై అధిక బాధ్యత మోపారు.

బి) క్యోటో ప్రోటోకాల్‌ను 1997, డిసెంబరు 11న ఆమోదించగా 2005, ఫిబ్రవరి 16 నుంచి  అమల్లోకి వచ్చింది.

1) ఎ మాత్రమే    2) బి మాత్రమే    3) ఎ, బి     4) రెండూ కాదు

 


3.  cop-15 (కోపెన్‌ హెగెన్‌ సమావేశం)కు  సంబంధించి కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి?

ఎ)  గ్లోబల్‌వార్మింగ్‌ ప్రభావాన్ని 2ా కంటే తక్కువకు పరిమితం చేయాలి.

బి) ఇదొక చట్టబద్ధ ఆమోద ఒప్పందం.

సి) ఈ సమావేశం డెన్మార్క్‌లోని కోపెన్‌ హెగెన్‌లో 2009లో జరిగింది.

1) ఎ, బి    2) బి, సి    3) ఎ, సి    4) ఎ, బి, సి

 4.  ఐరాస ఆధ్వరంలో 2012లో జీవవైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది?

1) ఖతార్‌      2) దోహా    3) బెంగళూరు     4) హైదరాబాద్‌
5.   ఐరాస ఆధ్వరంలో 2014లో జీవవైవిధ్య సదస్సు జరిగిన ప్రదేశం?

1)  ఖతార్‌    2) దోహా    3) కాన్‌కూన్‌    4) ప్యాంగ్‌యాంగ్‌
6. ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం  ‘వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌’ అనే సంస్థను ఐయూసీఎన్‌ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?

1)  1960     2) 1961     3) 1962     4) 1963
 


7.   గ్రీన్‌పీస్‌ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థను ఏ దేశంలో స్థాపించారు?

1) యూఎస్‌ఏ      2) కెనడా     3) మెక్సికో   4) జర్మనీ

 

 


8.  బి.సి.పంత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌  ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్ర  కార్యాలయం ఎక్కడ ఉంది?

1) నైనిటాల్‌     2) సిమ్లా    3) ఆల్మోరా     cదెహ్రాదూన్‌

 


9.   ‘ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీ’ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) నైనిటాల్‌     2) సిమ్లా     3) ఆల్మోరా    4)  దెహ్రాదూన్‌

 


10. ‘వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ అనే వన్యప్రాణి సంరక్షణ సంస్థను ఎవరు ఏర్పాటు చేశారు?

1) సునీతా నారాయణ్‌     2) మేధాపాట్కర్‌     3) బిలిందా వైట్‌     4) చాందీ ప్రసాద్‌ బిట్టా11. ‘వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’కు   సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) 1982లో దెహ్రాదూన్‌లో స్థాపించారు.

బి) వన్యప్రాణుల సంరక్షణకు పరిశోధనలు చేస్తుంది.

సి) వన్యప్రాణుల సంరక్షణకు నియమితులయ్యే   అధికారులకు శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తుంది.

1) ఎ, సి     2) బి, సి    3) సి మాత్రమే    4) పైవన్నీ

 

 


12. ‘గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫెసిలిటీ’కు     సంబంధించి కిందివాటిలో ఏవి సరైనవి?

ఎ) దీన్ని 1991లో స్థాపించారు.

బి) ప్రధాన కేంద్రకార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.

సి) శీతోష్ణస్థితిలో మార్పు, జీవవైవిధ్యం, నేల - నీటి కాలుష్యం మొదలైన వాటికి సంబంధించిన  ప్రాజెక్టులకు గ్రాంట్లు మంజూరు చేస్తుంది.

1) ఎ, బి     2) బి, సి     3) సి మాత్రమే     4) బి మాత్రమే
 

 


13. ‘పెటా ఇండియా’కి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) దీన్ని 2000లో ముంబయిలో స్థాపించారు.

బి) జంతువులను రక్షించడానికి శాకాహారాన్ని   ప్రోత్సహిస్తుంది.

సి) ‘‘జంతువులున్నది తినడానికి కాదు, ప్రయోగాలు చేయడానికి కాదు, తిట్టడానికి కాదు, అన్ని ప్రాణులూ సమానమే.’’ అనే వినాదంతో  ప్రజలను, పాలకులను జంతుసంరక్షణ దిశగా చైతన్యవంతులను చేస్తుంది.

1) ఎ, బి     2) బి, సి    3) సి మాత్రమే    4) పైవన్నీ

 

 


14. యూఎన్‌ఈపీకి సంబంధించి కిందివాటిలో ఏవి సరైనవి?

ఎ) దీన్ని 1972 లో స్థాపించారు.

బి) ఐరాస ఆధ్వరంలో చేపట్టే పర్యావరణ కార్యక్రమాలను సమన్వయం చేయడం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల అమలుకు సహాయ సహకారాలు అందించడం.

సి) వివిధ దేశాలతో కలిసి పాలసీలు అమలు     చేయడం.

డి) పలు దేశాలకు చెందిన ఎన్జీఓలతో కలిసి   పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనడం.

1) ఎ, బి, సి    2) బి, సి, డి    3) ఎ, సి    4) ఎ, బి, సి, డి 

15. ‘పెటా’కు సంబంధించి సరైన వాక్యాలు     గుర్తించండి.

ఎ) 1980 లో స్థాపించిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ.

బి) యూఎస్‌ఏలోని వర్జీనియా కేంద్ర కార్యాలయంగా ఇంగ్రిడ్‌ న్యూకిర్క్, అలెక్స్‌ పాచెరో అనే  వాలంటీర్లు ఈ సంస్థను స్థాపించారు.

సి) ప్రపంచవ్యాప్తంగా జంతువులను పరిరక్షిస్తూ, పర్యావరణ జీవవైవిధ్య పరిరక్షణ కోసం శాకాహారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.

1) ఎ, బి, సి     2) బి, సి    3) సి మాత్రమే     4) పైవేవీకావు
16. ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ పుస్తక రచయిత?

1) ఎడ్వర్డ్‌ ఆర్నాల్డ్‌      2) ఆల్‌ తుమిమి    3) రేచల్‌ కార్సన్‌      4) సలీం అలీ
17. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో 1964లో ఏర్పాటైన చిప్కో ఉద్యమానికి పునాది వేసిన సంస్థ?

1)  జంగిల్‌ బచావో ఆందోళన్‌    2) దసోలి గ్రామస్వరాజ్‌ మండల్‌

3) నవధాన్య ఉద్యమం    4) అవతార్‌ ఉద్యమం
 


18. చిప్కో ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?

1) 1970      2) 1971       3) 1972     4) 1973 


 


19. రోములస్‌ విట్టేకర్‌ అనే పర్యావరణవేత్త  ఆధ్వరంలో ప్రారంభమైన ఉద్యమం ఏది?

1) నవధాన్య ఉద్యమం     2) సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం

3) అప్పికో చలు వ్యాలీ      4) అవతార్‌ ఉద్యమం 

20. 1978లో కేరళలో ప్రారంభమైన సైలెంట్‌ వ్యాలీ ఉద్యమానికి కారణం?

1) కుంతిపూజ నదిపై హైడ్రోఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం.

2) కొంకణ్‌ రైల్వే నిర్మాణాన్ని సైలెంట్‌ వ్యాలీ మీదుగా నిర్మించడం.

3) మోనోజైట్‌ నిక్షేపాల వెలికితీత.

4) సింహపు తోక కోతుల నిర్మూలనకు వ్యతిరేకంగా

 


21. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో అటవీ నిర్మూలనకు  వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు 1983లో  ప్రారంభించిన ఉద్యమం ఏది?

1) నవధ్యాన ఉద్యమం    2) సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం 

3) అప్పికో చలువ్యాలీ     4) అవతార్‌ ఉద్యమం
22. జన్యుసాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా, సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహారభద్రతలో ప్రముఖపాత్ర వహించే నవధాన్యాలను కాపాడుకోవడానికి, తద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడానికి ‘నవధాన్య ఆందోళన’ ఉద్యమాన్ని ప్రారంభించిన పర్యావరణవేత్త?

1) జె.డి.అగర్వాల్‌     2) రాజేంద్ర సింగ్‌ 

3) వందనా శివ       4) మాధవ్‌ గాడ్గిల్‌

 

 


23. ఒడిశాలో వేదాంత్‌ కంపెనీకి వ్యతిరేకంగా   'అవతార్‌ ఉద్యమం’ నడిపిన గిరిజన తెగ?

1) ఇరుళ     2) బైగాళు    3) గోండులు    4) ఒరాన్స్‌

 

 


24. కిందివాటిలో పుణె కేంద్రంగా 1992లో పర్యావరణ పరిరక్షణ, సుస్థిర సమగ్ర గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా ప్రారంభమైన ఉద్యమం ఏది?

1) వన్‌ రాయ్‌     2) సృష్టి   

3) బీస్‌-నౌ-ఉద్యమం      4) ఝార్ఖండ్‌ జంగిల్‌ బచావో ఆందోళన్‌
 

 


25. బీస్‌-నౌ ఉద్యమాన్ని స్థాపించిన మతగురువు?

1) అమృతాదేవి      2) బిర్సా ముండా 

3) జంబేశ్వర్‌          4) ఎవరూకాదు


 


26. 2006లో అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు హక్కులు కల్పిస్తూ భారత ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని రూపొందించడానికి ప్రేరణ ఇచ్చిన ఆదివాసీల పర్యావరణ ఉద్యమం ఏది?

1) వన్‌ రాయ్‌     2) సృష్టి  

3) బీస్‌-నౌ ఉద్యమం     4) ఝార్ఖండ్‌ జంగిల్‌ బచావో ఆందోళన్‌

 


27. కిందివాటిలో రాజస్థాన్‌లోని ఖేజ్రీ అనే వృక్షాలను పరిరక్షించడం కోసం అమృతాదేవి నాయకత్వంలో ప్రారంభమైన పర్యావరణ ఉద్యమం?

1) బలియాపాల్‌ ఉద్యమం     2) వన్‌రాయ్‌ ఉద్యమం

3) బిష్ణోయి ఉద్యమం    4) అవతార్‌ ఉద్యమం

 

 


28. దేశంలో పురాతనమైన వన్యప్రాణి సంరక్షణ, పరిశోధన కోసం ముంబయిలో ‘బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ’ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1881     2) 1882      3) 1883        4) 1884


 


29. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలోని రూపుదాల్చిన  బలియాపాల్‌ ఉద్యమం కిందివాటిలో దేనికి   వ్యతిరేకంగా ప్రారంభమైంది?

1) బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా

2) పోస్కో స్టీల్‌ కంపెనీకి వ్యతిరేకంగా

3) మాంగ్రూవ్‌ అరణ్యాల నిర్మూలనకు వ్యతిరేకంగా

4) చాందీపుర్‌లో క్షిపణుల పరీక్షా కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా

 


30. న్యూదిల్లీలో ఏర్పాటైన పర్యావరణ పరిశోధన స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు?

1) అనిల్‌ అగర్వాల్‌     2) సునీతా నారాయణ్‌     

3)  వందనా శివ          4) మాధవ్‌ గాడ్గిల్‌

 

సమాధానాలు

1-4;  2-3;   3-3;   4-4;    5-4;   6-2;   7-2;   8-3;   9-4;    10-3;  11-4;   12-4;   13-4;   14-4;   15-4;   16-3;   17-2;   18-4;    19-2;     20-1;    21-3;     22-3;   23-3;    24-1;    25-3;    26-4;   27-3;    28-3;   29-4;   30-2. 

Posted Date : 07-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌