• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ కాలుష్యం

అటవీకరణతో భూక్షయానికి అడ్డుకట్ట!



 

జీవులు, వాటి చుట్టూ వ్యాపించి ఉన్న పరిసరాలను కలిపి పర్యావరణం అంటారు. ఆ కలయికలో అసమతౌల్యం ఏర్పడి, అవాంతరాలు కలిగితే అదే పర్యావరణ కాలుష్యం.  మానవాళితో పాటు సమస్త ప్రాణికోటి ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. గాలి, నేల, నీటి కాలుష్యాలతో సహజ వనరులకు, సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోంది, ఆ వినాశకర ప్రభావాలను పరీక్షార్థులు అర్థం చేసుకోవాలి. జీవుల మనుగడకు చేటు చేస్తున్న వ్యర్థాలు, రసాయనాలు, వాయువులు, వాటి ఉత్పత్తికి ప్రధాన కారణాలు, నివారణ చర్యలు, ప్రత్యామ్నాయ మార్గాలు, సంబంధిత ప్రభుత్వ చట్టాల గురించి తెలుసుకోవాలి. 

పర్యావరణం అనే పదం ‘ఎన్విరానర్‌’ అనే ఫ్రెంచ్‌ భాషా పదం నుంచి పుట్టింది. ఆ భాషలో ‘ఎన్విరానర్‌’ అంటే ‘చుట్టూ ఆవరించిన’ అని అర్థం. పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ప్రకారం ‘జీవి/జీవుల చుట్టూ పరివేష్ఠితమైన పరిస్థితులే పర్యావరణం.’ పర్యావరణంలో కొన్ని ఇతర పదార్థాలు ఉండాల్సిన గాఢతల కంటే ఎక్కువగా ఉండి తగిన కాలపరిమితి కలిగి, మానవుడు, ఇతర జీవుల మనుగడకు అంతరాయం కలిగించడాన్ని ‘పర్యావరణ కాలుష్యం’ అంటారు. Pollution అనే ఆంగ్ల పదం Pollutonium అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. ‘అపరిశుభ్రత’ అని దీని అర్థం.


కాలుష్యం - వర్గీకరణ

1. సహజ కాలుష్యం - ప్రకృతిలో సహజ ప్రక్రియల వల్ల కలిగేది.

2. కృత్రిమ కాలుష్యం - మానవ కృత్యాల వల్ల కలిగేది.

ప్రధానమైన కాలుష్యాలు: 

1) వాయు కాలుష్యం

2) జల కాలుష్యం

3) భూ/నేల కాలుష్యం.


కాలుష్యకాలు


పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ప్రకారం ‘మానవుడి కార్యకలాపాలు లేదా ప్రకృతి వైపరీత్యాల ద్వారా పర్యావరణంలో కొన్ని పదార్థాల గాఢతలు సాధారణ స్థాయిని మించిపోతాయి. వీటి వల్ల మానవుడు, ఇతర జీవరాశులు.. పర్యావరణంపై దుష్ప్రభావం చూపుతాయి. ఇలాంటి పదార్థాలను ‘కాలుష్యకాలు’ అంటారు.


ఉదా: పాదరసం (Hg), CO, CO2, SO2, DDT (డై క్లోరో డై ఫినైల్‌ ట్రై క్లోరో ఈథేన్‌), ప్లాస్టిక్, భార లోహాలు, రేడియాథార్మిక వ్యర్థాలు, ఇళ్ల నుంచి వచ్చే మురుగు, ఇతర పదార్థాలు.


మాదిరి ప్రశ్నలు


1. పర్యావరణానికి సంబంధించి వ్యక్తిగత జాతుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?

1) అటకాలజీ      2) పైనకాలజీ  

3) డెండ్రోక్రోనాలజీ       4) ఆర్నిథాలజీ


2. ఇన్‌ - సిటు పరిరక్షణ అంటే ఏమిటి?

1) జీవరాశులను వాటి సహజ నివాసాలు, ఆవరణ వ్యవస్థకు దూరంగా ఉంచి పరిరక్షించడం.

2) ఇంటి తోటల్లో జీవరాశుల పరిరక్షణ.

3) వాటి సహజ నివాసాలు, ఆవరణ వ్యవస్థల్లో ఉంచి జీవరాశుల పరిరక్షణ.

4) జూ, బొటానికల్‌ గార్డెన్స్‌లో జీవరాశుల పరిరక్షణ.


3. నేల కాలుష్యానికి కారణమైన ప్రధాన పట్టణ ఘనవ్యర్థ పదార్థం ఏది?

1) బురద       2) మురుగు     3) చెత్త       4) హ్యూమస్‌


4. మోంట్రియల్‌ ప్రోటోకాల్‌ కిందివాటిలో దేనికి సంబంధించింది?

1) ఓజోన్‌ పొర క్షీణతకు కారణమైన పదార్థాల తొలగింపు

2) జీవవైవిధ్య సదస్సు

3) వాతావరణ మార్పుపై చర్చలు    4) న్యూక్లియర్‌ నిరాయుధీకరణ


5. అంతర్జాతీయ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) సెప్టెంబరు 8       2) సెప్టెంబరు 16  

3) అక్టోబరు 24      4) జూన్‌ 5


6. ‘ఫ్లోరో ఆఫ్‌ తెలంగాణ’ గ్రంథ రచయిత?

1) ఆచార్య రామయ్య      2) ఆచార్య రామనాథం 

3) ఆచార్య పురుషోత్తంరెడ్డి  4) ఆచార్య టి.పుల్లయ్య


7. ఎడారీకరణను నియంత్రించే చర్యలు ఏవి?

ఎ) అటవీకరణ  

బి) పంటల పునరావృతం, మిశ్రమ పంటలు  

సి) మురికి కాలువల ద్వారా లవణ లక్షణాలు తొలగించడం

1) ఎ, బి, సి  2) ఎ, బి  3) బి, సి  4) ఎ, సి


8. కిందివాటిలో జీవ వైవిధ్య స్థాయుల్లో చేర్చనిది ఏది?

1) ఆవరణ వ్యవస్థ        2) జన్యు శాస్త్రం    

3) జాతులు        4) జనాభా


9. భూక్షయాన్ని ఏ విధంగా నివారించవచ్చు?

1) పక్షుల జనాభా పెంచడం      2) అటవీకరణ  

3) వృక్ష సంపద నిర్మూలన  4) పశువుల మేతను అధికం చేయడం


10. కింది వాటిని పరిశీలించి, సరైనవి గుర్తించండి.

ఎ) అంతర్జాతీయ ఓజోన్‌ పరిరక్షణ దినాన్ని ఏటా సెప్టెంబరు 16న నిర్వహిస్తారు.

బి) 2017లో అంతర్జాతీయ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవ నేపథ్యం: ‘కేరింగ్‌ ఫర్‌ ఆల్‌ లైఫ్‌ అండర్‌ ది సన్‌’

1) ఎ, బి లు సరైనవి    2) ఎ, బి లు సరైనవి కావు

3) ఎ సరైంది       4) బి సరైంది


11. అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం?

1) ఝార్ఖండ్‌      2) మిజోరం     3) అస్సాం      4) కేరళ


12. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 2017, ఆగస్టు 12న విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో ఏనుగులు అత్యధికంగా ఉన్నాయి?

1) అస్సాం      2) కర్ణాటక  

3) కేరళ      4) మధ్యప్రదేశ్‌


13. జాతీయ అటవీ విధానం - 1988లోని ముఖ్యమైన అంశం -

ఎ) అడవులను రక్షించడం బి) అడవులను సంరక్షించడం సి) అడవులను అభివృద్ధి పరచడం 

కిందివాటిలో సరైన జవాబును ఎంపిక చేయండి.

1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) పైవన్నీ 


14. ప్రవాళ భిత్తికల సంరక్షణార్థం భారత ప్రభుత్వం మెరైన్‌ పార్కుగా ప్రకటించిన ప్రదేశం?

1) గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌     2) లక్షదీవులు 

3) గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌     4) అండమాన్‌ దీవులు


15. వాతావరణంలో సల్ఫర్‌తో కూడిన రసాయనిక  ప్రతిచర్య జరగడం వల్ల ఏ పర్యావరణ సమస్య తలెత్తుతుంది?

1) అటవీ నిర్మూలన     2) పొగమంచు 

3) ఆమ్ల కార్సల్‌   4) ఓజోన్‌ పొరలో రంధ్రాలు


16. క్రిమిసంహారక మందుల వల్ల తలెత్తే సమస్యలను క్రోడీకరిస్తూ రాసిన మొదటి గ్రంథం ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ రచయిత ఎవరు?

1) అల్డో లియోపోల్డ్‌     2) వందనా శివ 

3) రేచల్‌ కార్సన్‌     4) జాక్యూస్‌ కౌసైజౌ


17. నందాదేవి బయోస్ఫియర్‌ ఎక్కడ ఉంది?

1) మధ్యప్రదేశ్‌     2) ఉత్తరాంచల్‌    3) ఛత్తీస్‌గఢ్‌     4) తెలంగాణ


18. ‘డౌన్‌ టూ ఎర్త్‌’ మేగజీన్‌ నడిపేది ఎవరు?

1) సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ 

2) సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ 

3) కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ 

4) మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్‌


19. పర్యావరణం విషయంలో ‘డర్టీ డజన్‌’ అని దేన్ని పిలుస్తారు?

1) అత్యంత హానికరమైన హరిత గృహ వాయువులు

2) 12 ఓజోన్‌ క్షీణత పదార్థాలు 

3) 12 నిరంతర సేంద్రియ కాలుష్యాలు 

4) సముద్రాలను కలుషితం చేస్తున్న 12 దేశాలు


20. కజిరంగా నేషనల్‌ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?

1) పశ్చిమ బెంగాల్‌     2) అరుణాచల్‌ ప్రదేశ్‌

3) అస్సాం     4) జమ్ము-కశ్మీర్‌


21. సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అనే పదానికి  ప్రాధాన్యం ఏ సంస్థలో దొరికింది?

1) ఆహార, వ్యవసాయ సంస్థ     2) ప్రపంచ ఆరోగ్య సంస్థ 

3) ఐక్యరాజ్యసమితి     4) ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్‌


22. కిందివాటిలో గ్రీన్‌హౌస్‌ వాయువు ఏది?

1) H2O    2) CO   3) SO2   4) CO2


23. ‘నర్మదా బచావో ఆందోళన’ ఒక..

1) గిరిజన ఉద్యమం      2) పర్యావరణ ఉద్యమం 

3) రైతు ఉద్యమం        4) అటవీవాసుల ఉద్యమం


24. ఐక్యరాజ్యసమితి శీతోష్ణస్థితి మార్పు సమావేశం - 2015 లో చేసిన తీర్మానం ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రతను ఎంత మేరకు తగ్గించడానికి నిర్ణయించారు?

1) 1O సెంటీగ్రేడ్‌ కంటే తక్కువ     2) 2O సెంటీగ్రేడ్‌ కంటే తక్కువ 

3) 3O సెంటీగ్రేడ్‌ కంటే తక్కువ     4) 4O సెంటీగ్రేడ్‌ కంటే తక్కువ


25. భారతదేశంలోని జీవవైవిధ్య హాట్‌స్పాట్‌ ఏది?

1) ఆరావళి కొండలు     2) పశ్చిమ కనుమలు 

3) పంపా ఘాట్స్‌     4) రెడ్‌ హిల్స్‌


26. కిందివారిలో చిప్కో ఉద్యమ సారథి?

1) మేధా పాట్కర్‌   2) సుందర్‌లాల్‌ బహుగుణ 

3) జగ్గీ వాసుదేవ్‌      4) బృందా కారత్‌


27. ‘నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ను ఏ నగరంలో నెలకొల్పారు?

1) లఖ్‌నవూ     2) హైదరాబాద్‌ 

3) చెన్నై     4) జైపుర్‌


28. ‘ధరిత్రీ దినం’ ఎప్పుడు నిర్వహిస్తారు? 

1) మే 22     2) జూన్‌ 5 

3) ఏప్రిల్‌ 22     4) మార్చి 16


29. కింద పేర్కొన్న మహానగరాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యేది ఏది?

1) కాడ్మియం     2) క్రోమియం 

3) లెడ్‌     4) కాపర్‌


30. ధ్వని కాలుష్యం ఈ డెసిబుల్స్‌ కంటే మించినప్పుడు ప్రమాదకరం-

1) 80    2) 30    3) 100    4) 120


31. ప్రపంచ నీటి దినోత్సవం నిర్వహించే రోజు?

1) మే 24     2) మార్చి 22 

3) ఫిబ్రవరి 23     4) ఏప్రిల్‌ 21


32. పులులు సంచరించే ప్రధాన అభయారణ్యం-

1) థార్‌ ఎడారి     2) నీలగిరి 

3) నామ్‌థాపా     4) సుందర్బన్‌


33. ‘క్యోటో ప్రోటోకాల్‌’ దేనికి సంబంధించింది?

1) వాయు కాలుష్యం     2) జల కాలుష్యం 

3) గ్లోబల్‌ వార్మింగ్‌     4) ఓజోన్‌ క్షీణత


34. సుందర్‌లాల్‌ బహుగుణకు ఏ ఉద్యమంతో సంబంధం ఉంది?

1) చిప్కో ఉద్యమం         2) నర్మదా సరోవర్‌ ఆనకట్ట 

3) పర్యావరణ వ్యాజ్యం 4) జంతువుల పరిరక్షణ


35. ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రదేశానికి మాత్రమే  పరిమితమైన జీవులను ఏమంటారు?

1) అంటువ్యాధి కారకాలు     2) ఎండెమిక్‌ 

3) అంతరించిపోయిన     4) ప్రమాదంలో ఉన్న


36. సంక్లిష్ట, అసంబద్ధమైన వాతావరణ మార్పులను ఏమని పిలుస్తారు?

1) ఎల్‌నినో      2) హరికేన్‌ 

3) టోర్నడో      4) అల్ప పీడనం



సమాధానాలు

1-1; 2-3; 3-3; 4-1; 5-2; 6-4; 7-1; 8-4; 9-2; 10-1;11-2; 12-2; 13-4; 14-1; 15-3; 16-3; 17-2; 18-2; 19-3; 20-3; 21-4; 22-4; 23-2; 24-2; 25-2; 26-2; 27-3; 28-3; 29-3; 30-1; 31-2; 32-4; 33-3; 34-1; 35-2; 36-1


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌
 

Posted Date : 22-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌