• facebook
  • whatsapp
  • telegram

అటవీ పరిరక్షణ ఉద్యమాలు,విధానాలు 

వనాల రక్షణలో పోరాటాలు.. పథకాలు!
 


సహజ వనరుల్లో ప్రధానమైనవి అడవులు. పర్యావరణ పరిరక్షణ, జీవివైవిధ్య సమతౌల్యానికి వనాలే కేంద్రసానాలు. వన్యమృగాలకు ఆవాసంతో పాటు కోట్లాది ప్రజలకు జీవనోపాధిని అందిస్తున్నాయి. ఆధునిక కాలంలో అడవుల ప్రాధాన్యం, వాటిని విస్తరించాల్సిన అవసరం అంతకంతకూ పెరుగుతోంది. అందుకే ప్రభుత్వాలతోపాటు పౌరసమాజం కూడా అడవులను కాపాడుకోవడానికి కృషి చేస్తోంది. భారత్‌లో అడవుల వర్గీకరణ, విస్తీర్ణం, విస్తరణ తీరు, వనాల రక్షణకు జరిగిన ఉద్యమాల గురించి పోటీ పరీక్షారులకు అవగాహన ఉండాలి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అటవీ విధానాలు, తీసుకొచ్చిన చట్టాలు, అమలుచేస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. 

ఒక భౌగోళిక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలు అధికంగా ఉంటే ఆ ప్రాంతాన్ని అడవి అని పిలుస్తారు. భారతదేశ రాష్ట్రాల అటవీ నివేదిక - 2021 ప్రకారం గుర్తించిన (రిజిస్టర్డ్‌) అటవీ ప్రాంతం అంటే ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో చెట్లతో సంబంధం లేకుండా అడవిగా నమోదైన భౌగోళిక ప్రాంతం. చెట్ల పందిరి సాంద్రత ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరించారు. 70% లేదా అంతకంటే ఎక్కువ పందిరి సాంద్రత ఉన్న భూములను దట్టమైన అడవిగా గుర్తించారు. ఈ రకమైన అడవులు దేశంలో 3% ఉన్నాయి. చెట్ల పందిరి సాంద్రత 40% నుంచి 70% వరకు భూములున్న ప్రాంతాన్ని మధ్యస దట్టమైన అటవీ ప్రాంతంగా గుర్తించారు. ఈ రకమైన అటవీ ప్రాంతం 9.3% ఉంది. చెట్ల పందిరి 10% నుంచి 40% మధ్య ఉన్న భూములను ఓపెన్‌ ఫారెస్ట్‌గా గుర్తించారు. ఈ రకమైనవి 9.34% ఉన్నాయి. 10% కంటే తక్కువ పందిరి సాంద్రత ఉన్న భూములను స్క్రబ్‌ ఫారెస్ట్‌ (పొదలు)గా గుర్తించారు. దేశంలో అవి 1.42% ఉన్నాయి. ఏ రకమైన వర్గానికి చెందని 76.87% ప్రాంతాన్ని అటవీయేతర వర్గంగా గుర్తించారు.

మూడు రకాలు: అటవీ విధానం - 1927 ప్రకారం పరిపాలనా సౌలభ్యం కోసం అడవులను మూడు రకాలుగా వర్గీకరించారు.

1) రిజర్వ్‌ ఫారెస్ట్‌: ఈ రకమైన అడవులు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. వీటిలోకి సామాన్య ప్రజల ప్రవేశం నిషిద్ధం. పశువుల పెంపకం, కలప, చెట్లు నరకడం కూడా నిషేధం. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జమ్ము-కశ్మీర్‌ల్లో ఉన్నాయి.

2) రక్షిత అడవులు: ఇవి ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. ఇందులో ప్రజల సంచారానికి, పశువులు తిరగడానికి, కలప సేకరణకు అనుమతి ఉంటుంది. ఈ అడవులు హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, రాజసాన్, ఒడిశా, బిహార్‌ రాష్ట్రాల్లో ఉన్నాయి.

3) వర్గీకరించని అడవులు: ఈ అడవుల్లో చెట్లను నరకడానికి, పశువుల సంచారానికి ఎలాంటి ఆటంకం ఉండదు. ఇవి ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలోనే దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది షెడ్యూల్డ్‌ తెగల జనాభా నివసిస్తున్నారు. సుమారు 460 జాతులు కూడా జీవిస్తున్నాయి. వీరిలో 92% మందికి ఈ అడవులే జీవనాధారం.

జాతీయ అటవీ విధానం - 1894: ఇది దేశంలో మొదటి అటవీ విధానం. వలస పాలనలో 1894లో డెట్రించ్‌ ప్రతిపాదనల ఆధారంగా దీన్ని రూపొందించారు. 1906లో దెహ్రాదూన్‌లో  ‘ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’   నెలకొల్పారు. దీన్నే తర్వాత ‘ఫారెస్ట్‌ రిసెర్చ్‌    ఇన్‌స్టిట్యూట్‌’ గా మార్చారు.

జాతీయ అటవీ విధానం - 1952: ఇది స్వాతంత్య్రానంతరం వచ్చిన మొదటి అటవీ విధానం. దీనిప్రకారం దేశ విస్తీర్ణంలో సగటున 33% అడవులు ఉండాలి. మైదానాల్లో 20%, కొండ ప్రాంతాల్లో 60% అటవీ విస్తీర్ణం ఉండాలి.

జాతీయ అటవీ విధానం - 1988: దీన్నే సవరించిన అటవీ విధానం అంటారు. పర్యావరణ పరిరక్షణ, జీవివైవిధ్య సమతౌల్యాన్ని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. 1988లో ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ఏర్పాటు చేశారు. 2003లో నేషనల్‌ ఫారెస్ట్‌ కమిషన్‌ను నెలకొల్పారు. ఇది 2006లో నివేదికను సమర్పించింది.

జాతీయ అటవీ విధానం - 2018: దీని ప్రకారం 33.3% అడవుల విస్తీర్ణం లక్ష్యంగా వనాలను  100 మిలియన్‌ హెక్టార్లకు పెంచాలి. పీఠభూముల్లో 60%, మైదానాల్లో 40% అటవీ సంపద వృద్ధి చేయాలి.

అడవుల సంరక్షణ - భారత ప్రభుత్వ చర్యలు: 1954లో యూఎన్‌డీపీ ఆధ్వర్యంలో చంద్రాపుర్, నైనిటాల్‌లో అటవీకరణ చేపట్టారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలోని అడవులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 1976లో నేషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సామాజిక అడవులను ప్రతిపాదించింది. అయిదో పంచవర్ష ప్రణాళికలో భాగంగా ‘సామాజిక అడవుల పెంపకం’ పథకాన్ని చేపట్టారు. దీనికోసం 1978లో సామాజిక అడవుల చట్టం చేశారు. 1980లో అటవీ సంరక్షణ చట్టం చేశారు. మార్చి 21న అటవీ దినోత్సవాన్ని, జులై మొదటి వారం వన మహోత్సవాలు జరుపుతున్నారు. పదో పంచవర్ష ప్రణాళికలో భాగంగా 25% అటవీ విస్తీర్ణ లక్ష్యంతో జాతీయ అటవీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. 1999లో నేషనల్‌ ఫారెస్ట్‌ యాక్షన్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. దీనిద్వారా రానున్న 20 ఏళ్లలో అటవీ విస్తీర్ణాన్ని 33.3% పెంచాలని లక్ష్యం. ప్రభుత్వ - సానిక ప్రజల భాగస్వామ్యంతో వన సంరక్షణ సమితులు ఏర్పాటు చేశారు.

కంపా చట్టం (CAMPA - Compansatory Afforestation fund Management and Planning Authority): 2016లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ఉద్దేశం అటవీకరణను ప్రోత్సహించడం. దీనిలో భాగంగా కాంపెన్‌సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తారు. అటవీ భూములు వాడుకునేవారు ఈ ఫండ్‌ చెల్లించాలి. ఆ డబ్బును అటవీయేతర భూముల్లో అడవులు పెంచడానికి వాడతారు.

మియావాకి నమూనా: ఇది జపాన్‌ దేశ అటవీకరణ పద్ధతి. దీనిలో సానిక చెట్లను గుర్తించి నాలుగు వరుసలుగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తారు. తద్వారా సారాన్ని వృద్ధి చేసి, జీవ ఎరువులను వాడుతూ నేలలో తేమ పెంచుతారు. దీని ముఖ్య ఉద్దేశం పట్టణ, నగర ప్రాంతాల్లో ఉండే కొద్దిపాటి సలాల్లో చిన్నపాటి అడవులను పెంచడం. ఈ పద్ధతిని తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్ట్ర్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి.

హరిత పరపతి పథకం: ఫారెస్ట్‌ అడ్వయిజరీ కమిటీ 2020లో ఈ పథకాన్ని ఆమోదించింది. దీనిద్వారా అటవీ శాఖ ప్రభుత్వేతర సంసల్లో అటవీ పెంపకాన్ని అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో చేయవచ్చు. ఈ కార్యక్రమం వాతావరణ మార్పులను నియంత్రించడంలో, సుసిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇది గ్రీన్‌ ఇండియా మిషన్‌కు తోడ్పాటు అందిస్తుంది.

జాతీయ అటవీకరణ కార్యక్రమం:  దీని ముఖ్య ఉద్దేశం క్షీణించిన అడవులను ప్రజల భాగస్వామ్యంతో పునరుద్ధరింపజేయడం. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య పథకం. ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, జాయింట్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ద్వారా రెండు దశల్లో అమలవుతుంది. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రతిభ చూపిన జాయింట్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు

1) చడ్వాయి (కాగజ్‌నగర్‌)  

2) ఇలపీడిక (కేరళ).

* ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-25లో నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఇటీవల ఎవరు గుర్తింపు పొందారు? (సౌదీ స్మాష్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన ఈమె ఏకంగా  24వ ర్యాంకుకు చేరుకున్నారు.)            

జ: మనికా బత్రా

* సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ (సీడబ్ల్యూయూఆర్‌) - 2024 నివేదిక ప్రకారం భారత్‌లో అగ్రశేణి విద్యాసంసగా ఏది నిలిచింది? (అంతర్జాతీయంగా ఈ విద్యాసంస 410వ ర్యాంకులో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 20,966 విద్యాసంసల నుంచి అత్యుత్తమ విద్యాసేవలు అందించే రెండు వేల వర్సిటీలను గుర్తించి సీడబ్ల్యూయూఆర్‌ ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో భారత్‌కు చెందిన 65 వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలు చోటు పొందాయి. భారత్‌ నుంచి రెండో సానంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు (501వ ర్యాంకు) నిలిచింది. సీడబ్ల్యూయూఆర్‌ - 2024 ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో అన్నీ అమెరికా విశ్వవిద్యాలయాలే నిలిచాయి. తొలి అయిదు సానాల్లో వరుసగా హార్వర్డ్‌ వర్సిటీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌లు నిలిచాయి.)              

జ: ఐఐఎం అహ్మదాబాద్‌

* క్రూరమైన రాచరిక చట్టాలు సహా దేశ న్యాయ వ్యవసలో సంస్కరణల కోసం పోరాటం సాగిస్తున్న ఏ దేశ హక్కుల యువ ఉద్యమ కారిణి నెతిపోర్న్‌ సనేసంగ్‌ఖోమ్‌ (28) 2024, మేలో అక్కడి ఓ జైలులో మరణించారు?    

జ: థాయ్‌లాండ్‌

* అయిదోసారి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్లాదిమిర్‌ పుతిన్‌ 2024, మేలో ఏ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించారు?              

జ: చైనా


రచయిత : గోపగోని ఆనంద్ 

 

Posted Date : 07-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు