• facebook
  • whatsapp
  • telegram

మాన‌వ ప్రేరిత వైప‌రీత్యాలు - ఉప‌శమ‌న చ‌ర్య‌లు

పేదవాడి ఆయుధాలు ప్రమాదకరం!

 

 

స్వార్థపూరిత చర్యలు, అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్ల మానవ సంబంధిత వైపరీత్యాలు సంభవిస్తాయి. అవి సమాజం కష్టాలను పెంచడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసి దేశ ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదక సామర్థాన్ని, సుస్థిరాభివృద్ధిని దెబ్బతీస్తాయి. రోడ్డు ప్రమాదాల నుంచి అణుయుద్ధాల వరకు అన్నీ ఆ కోవలోకే వస్తాయి. జపాన్‌పై అణుదాడి నుంచి విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదం వరకు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రధాన మానవకారక విపత్తులు, వాటికి కారణాలు, పరిణామాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. రకరకాల జీవాయుధాలు, విషవాయువులు, వాటి ప్రభావాలపై అవగాహన ఉండాలి. వైపరీత్యాల నివారణకు సంస్థాగతంగా చేస్తున్న ప్రయత్నాలు, అందుకోసం ఉన్న వ్యవస్థలపై పరిజ్ఞానం పెంచుకోవాలి.

 

మానవ ప్రేరిత వైపరీత్యానికి కారణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1. సామాజిక కారణాలు 2. సాంకేతిక కారణాలు. తొక్కిసలాటలు, ఉగ్రవాద చర్యలు, సామాజిక అణచివేత, తిరుగుబాటు మనస్తత్వం ఉండటం, చట్టాలను గౌరవించకపోవడం, పౌర తిరుగుబాట్లు, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ లాంటి చర్యలు సామాజికపరమైనవి. అగ్నిప్రమాదాలు, రోడ్డు, రైల్వే ప్రమాదాలు, అణు దుర్ఘటనలు, పెద్దపెద్ద నిర్మాణాలు కూలిపోవడం, ప్రయోగ సమయాల్లో విష వాయువులు విడుదలవడం లాంటివి సాంకేతిక కారణాలు.

 మాదిరి ప్రశ్నలు


1.  భోపాల్‌ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన రోజు?

1) 1984, డిసెంబరు 2        2) 1984, డిసెంబరు 4    

3) 1984, డిసెంబరు 6         4) 1984, డిసెంబరు 8


2. కిందివాటిలో ‘పేదవాడి ఆయుధాలు’ అని వేటిని అంటారు?

1) అణ్వాయుధాలు    2) రసాయన ఆయుధాలు

3) జీవాయుధాలు     4) అటామిక్‌ ఆయుధాలు


3. ఏ సంఘటన తరువాత సామూహిక జనహనన ఆయుధాలను సాంప్రదాయేతర ఆయుధాలుగా  పిలుస్తున్నారు?

1) 2003లో ఇరాక్‌పై అమెరికా దాడి తరువాత   2) 2005లో ఇరాక్‌పై అమెరికా దాడి తరువాత

3) 2004లో వియత్నాంపై అమెరికా దాడి తరువాత   4) పైవేవీకావు


4. ‘దాగిఉన్న మహమ్మారి’గా వేటిని పిలుస్తారు?

1) రోడ్డు ప్రమాదాలు     2) రైల్వే ప్రమాదాలు     

3) జీవాయుధాలు        4) అణ్వాయుధాలు


5. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన జరిగిన కంపెనీ పేరు?

1) నెరోలాక్‌ కెమికల్‌ కంపెనీ        2) యూనియన్‌ కార్బైడ్‌

3) ఎన్‌రాక్‌ సంస్థ        4) రాజోల్‌ కంపెనీ


6.  మానవ ప్రేరేపిత విపత్తులకు కారణాలు?

1) వనరుల దోపిడీ    2) సామ్రాజ్యవాదం

3) జాతీయాభిమానం     4) పైవన్నీ


7. భోపాల్‌ దుర్ఘటనలో 3 వేల మంది ప్రాణాలు బలిగొన్న వాయువు?

1) ఇథైల్‌ ఐసోసైనేట్‌       2) ఫాస్‌జీన్‌   

3) మిథైల్‌ ఐసోసైనేట్‌    4) సరీన్‌


8.  1945, ఆగస్టు 6న ‘ఎనలాగో’ అనే అమెరికన్‌ విమానం ‘లిటిల్‌ బాయ్‌’ అనే అణ్వాయుధాన్ని ఏ పట్టణంపై వేసింది?

1) నాగసాకి      2) హిరోషిమా 

3) జెరూసలెం        4) టోక్యో


9. ఉక్రెయిన్‌లో ‘చెర్నోబిల్‌’ న్యూక్లియర్‌ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది?

1) 1985   2) 1995  3) 1984 4) 1986


10. డర్టీబాంబ్స్, బ్యాక్‌ ప్యాక్‌ బాంబ్‌లు అని వేటిని పిలుస్తారు?

1) జీవాయుధాలు         2) రేడియోధార్మిక పేలుడు పదార్థాలు

3) పారిశ్రామిక దుర్ఘటనలు       4) పైవేవీకావు


11. సామూహిక జనహనన ఆయుధాల్లో కిందివాటిని గుర్తించండి.

1) అణు ఆయుధాలు     2) రసాయనిక, పారిశ్రామిక ఆయుధాలు

3) జీవాయుధాలు          4) పైవన్నీ


12. దేశంలో అగ్నిప్రమాదాల నివారణ, నియంత్రణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?

1) 2008, నవంబరు       2) 2006, డిసెంబరు  

3) 2009, డిసెంబరు       4) 2009, నవంబరు


13. కిందివాటిలో దేన్ని మానవ కారక విపత్తుగా పేర్కొంటారు?

1) వరద         2) భూకంపం     

3) కరవు         4) అగ్నిప్రమాదం


14. ఏ అడవులు అధికంగా అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి?

1) కోనిఫెరస్‌ అడవులు      2) మడ అడవులు   

3) చిట్టడవులు        4) ఆకురాల్చు అడవులు


15. కిందివాటిలో భూనిర్మితి వల్ల సంభవించే వైపరీత్యం?

1) అగ్నిపర్వత పేలుళ్లు     2) బాంబు విస్ఫోటం     

3) క్షామం          4) అగ్ని ప్రమాదం


16. విమానం అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ప్రయాణికుల్ని నేలకు ఆనుకుని పడుకోమని చెప్పడానికి కారణం?

1) తొక్కిసలాట జరగకుండా        2) పొగపైకి వెళుతుంది కాబట్టి

3) గాజు కిటికీలకు వెళుతుంది కాబట్టి      4) స్థలాభావం వల్ల


17. జాతీయ అగ్నిమాపక సేవల కళాశాల ఎక్కడ ఉంది?

1) నాగ్‌పుర్‌       2) చెన్నై     

3) హైదరాబాద్‌         4) బెంగళూరు


18. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

1) ఆంధ్రప్రదేశ్‌        2) మధ్యప్రదేశ్‌   

3) తమిళనాడు         4) కేరళ


19. 2004, జులై 16న జరిగిన పాఠశాల అగ్నిప్రమాదంలో 93 మంది విద్యార్థులు మరణించిన సంఘటన జరిగిన ప్రాంతం?    

1) తిరువనంతపురం - కేరళ    2) కుంభకోణం - తమిళనాడు

3) ఉడిపి - కర్ణాటక  4) నాంథేడ్‌  - మహారాష్ట్ర


20. 1996, నవంబరు 12న దిల్లీలో ఏ రెండు దేశాల విమానాలు ఢీకొని 349 మంది మరణించారు?

1) రష్యా - అరేబియా       2) ఇండియా - కజకిస్థాన్‌

3) అరేబియా - కజకిస్థాన్‌     4) శ్రీలంక - రష్యా


21. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్యలో మొదటి రాష్ట్రాలు వరుసగా...    

1) ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌   2) మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్‌

3) ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర   4) కేరళ, బిహార్, తమిళనాడు


22. అండమాన్‌ తీరంలో బంగాళాఖాతంలో మునిగి 21 మంది మరణానికి కారణమైన ఆక్వామెరైన్‌ పడవ ప్రమాదం ఎప్పుడు జరిగింది?

1) 2014, జనవరి 26     2) 2014, జులై 17    

3) 2013, జులై 17      4) 2013, ఫిబ్రవరి 9


23. 2014, జులై 17న ఉక్రెయిన్‌ - రష్యా సరిహద్దులో ఉగ్రవాదులు కూల్చివేసిన ఏ దేశ విమానంలో 295 మంది మరణించారు?

1) బోయింగ్‌ విమానం (మలేసియా)    2) ఇండియన్‌ ఎయిర్‌లెన్స్‌ (ఇండియా)  

3) అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌    4) ఎయిర్‌ కొరియా (ఉత్తర కొరియా)


24. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రైల్లో ప్రయాణిస్తున్న మిత్రదేశాల ప్రయాణికులపై జపాన్‌ సైనికులు ప్రయోగించిన విషవాయువు?

1) మస్టర్డ్‌ గ్యాస్‌          2) సరీన్‌          

3) ఫాస్‌జీన్‌            4) లెవిసైడ్‌


25. కిందివాటిలో నాడీవ్యవస్థపై ప్రభావం చూపే విషవాయువు?

1) టబున్‌  2) సరీన్‌  3) సొమన్‌  4) పైవన్నీ


26. రోడ్డుప్రమాదాల నివారణ కోసం తగిన చర్యలు సూచించేందుకు 2014, ఏప్రిల్‌ 22న సుప్రీంకోర్టు ఎంతమందితో కమిటీ వేసింది?

1) ఐదుగురు         2) ఆరుగురు    

3) ముగ్గురు         4) ఏడుగురు


27. వైజాగ్‌ ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ గ్యాస్‌ లీకేజీకి కారణమైన వాయువు?

1) స్టైరీన్‌          2) ఫాస్‌జీన్‌      

3) మిథైల్‌ ఐసోసైనేట్‌     4) సొమన్‌


28. 2005, అక్టోబరు 29న రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైన ప్రదేశం?

1) పానగల్లు - నల్గొండ                2) బొత్తులపాలెం - నల్గొండ

3) నకిరేకల్‌ - నల్గొండ              4) రామన్నపేట - నల్గొండ


29. 2014, ఏప్రిల్‌ 16న జరిగిన దక్షిణ కొరియా పడవ ప్రమాదంలో ఎంతమంది గల్లంతయ్యారు?

1) 300   2) 75   3) 150   4) 200


30. మహబూబ్‌నగర్‌ జిల్లా, పాలెం గ్రామంలో 2013, అక్టోబరు 30న బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న వోల్వో బస్సు దగ్ధం కావడంతో ఎంతమంది మరణించారు?

1) 45    2) 35    3) 55    4) 15


31. జపాన్‌లో 1945, ఆగస్టు 9న నాగసాకి నగరంపై అమెరికా ప్రయోగించిన డర్టీబాంబ్‌ పేరు?    

1) లిటిల్‌ బాయ్‌  2) ఫ్యాట్‌ బాయ్‌     

3) లిటిల్‌ మ్యాన్‌  4) ఫ్యాట్‌ మ్యాన్‌


 

సమాధానాలు

1-1; 2-3; 3-1; 4-1; 5-2; 6-4; 7-3; 8-2; 9-4; 10-2; 11-4; 12-4; 13-4; 14-1; 15-1; 16-2; 17-1; 18-3; 19-2; 20-3; 21-3; 22-1; 23-1; 24-2; 25-4; 26-3; 27-1; 28-4; 29-1; 30-1; 31-4.


రచయిత: ఇ. వేణుగోపాల్‌ 
 

Posted Date : 19-02-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు