• facebook
  • whatsapp
  • telegram

చలనం - కాలం 

నిట్టనిలువుగా రాయిని పైకి విసిరితే..!
 


 ఒక వస్తువు స్థానంలో మార్పు కాలంతోపాటు సంభవిస్తే దాన్ని చలనం అంటారు. సంఘటనల మధ్య వ్యవధిని కాలంతో సూచిస్తారు. అవి రెండూ ఒకదాంతో మరొకటి ముడిపడి ఉంటాయి. యంత్రాల పనితీరును, విమానాల ప్రయాణాన్ని, ఖగోళంలో నక్షత్రాలు, గ్రహాల కదలికలను అర్థం చేసుకోవాలంటే చలనం, కాలంపై అవగాహన ఉండాలి. వీటి ఆధారంగా న్యూటన్‌ చలన నియమాలు, సాపేక్ష సిద్ధాంతాల భావనలను తెలుసుకోవచ్చు. ఒక వ్యవస్థ స్థితిని, ప్రవర్తనను వివరించడానికి భౌతిక శాస్త్రంలో సదిశ రాశులు, అదిశ రాశులను ఉపయోగిస్తారు. పరిమాణం, దిశ ఉండే వాటిని సదిశ రాశులు అంటారు. పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉండే వాటిని అదిశ రాశులుగా వ్యవహరిస్తారు. ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక అవగాహన ఉండాలి. స్థానభ్రంశం, వేగం, త్వరణం తదితరాలను అధ్యయనం చేయాలి. 

 

1.  ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తే దానికి ఉండే చలనం?

1) క్రమ చలనం     2) క్రమ రహిత చలనం 

3) అసమ చలనం   4) ఆవర్తన చలనం


2. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణించకపోతే దానికి ఉండే చలనం?

1) క్రమరహిత చలనం   2) ఆవర్తన చలనం 

3) అసమ చలనం     4) క్రమ చలనం 


3.  కిందివాటిలో క్రమ చలనం కానిది?

1) గడియారంలోని ముళ్ల కదలిక    2) భూపరిభ్రమణం 

3) ఎగురుతున్న గాలి పటం    4) కృత్రిమ ఉపగ్రహాల చలనం


4. కిందివాటిలో క్రమరహిత చలనం కానిది?

1) స్వేచ్ఛాపతన వస్తువు చలనం            

2) ఈగ చలనం

3) స్థిరవేగంతో ప్రయాణించే కారు       

4) ఫుట్‌బాల్‌ ఆటలో వ్యక్తి చలనం


5.  కుట్టుమిషన్‌లో కింది వస్తువులకు ఉండే చలనాన్ని గుర్తించండి.

ఎ) చక్రం  1) స్థానాంతర చలనం

బి) సూది      2) భ్రమణ చలనం

సి) కుట్టే వస్త్రం    3) డోలన చలనం

1) ఎ-2, బి-1, సి-3  2) ఎ-2, బి-3, సి-1

3) ఎ-3, బి-1, సి-2   4) ఎ-3, బి-2, సి-1

 

6.  కిందివాటిలో భ్రమణ చలనం కానిది?

1) గ్లోబు చలనం    2) హెలికాప్టర్‌ ప్రొపెల్లర్‌ చలనం 

3) టైపురైటర్‌లో కీ చలనం    4) గడియారంలో ముల్ల్లు చలనం


7.  మీటిన వీణ తీగలో ఉన్న చలనాన్ని గుర్తించండి.

1) స్థానాంతర చనలం  2) వక్రరేఖీయ చలనం 

3) భ్రమణ చలనం   4) కంపన చలనం


8.  వాక్యం: ఎ) భ్రమణ చలనాలన్నీ డోలన చలనాలే.

వాక్యం: బి) ఒక స్థిరబిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు, వెనుకకు లేదా పైకి, కిందకు జరిగే చలనం డోలన చలనం అవుతుంది.

1) ఎ, బి లు సత్యం   2) ఎ సత్యం, బి అసత్యం

3) ఎ అసత్యం, బి సత్యం     4) ఎ, బి లు అసత్యాలు


9. భౌతిక రాశుల పరిమాణంతోపాటు, దిశను కూడా పరిగణనలోకి తీసుకునే రాశులు?

1) మూల రాశులు     2) ఉత్పన్న రాశులు 

3) అదిశ రాశులు     4) సదిశ రాశులు


10. దిశ అవసరం లేని భౌతిక రాశులు?

1) మూల రాశులు      2) సదిశ రాశులు 

3) ఉత్పన్న రాశులు     4) అదిశ రాశులు


11. కింది వాటిలో డోలన చలనం కానిది?

1) విద్యుత్తు గంటలో సుత్తి చలనం 

2) తూగుడు బల్ల మీద బాలుర చలనం

3) లాగి వదిలిన స్ప్రింగ్‌ చలనం 

4) తిరుగుతున్న బొంగరం చలనం


12. వాహనాల వేగాన్ని తెలియజేసే పరికరం?

1) అనిమోమీటర్‌     2) స్పీడోమీటర్‌ 

3) ఒడోమీటర్‌     4) హైడ్రోమీటర్‌ 


13. వాహనాలు ప్రయాణించిన దూరాన్ని తెలిపే సాధనం?

1) స్పీడోమీటర్‌     2) ఒడోమీటర్‌ 

3) హైడ్రోమీటర్‌     4) అనిమోమీటర్‌ 


14. కిందివాటిలో స్థానాంతర, భ్రమణ చలనాలున్న దాన్ని గుర్తించండి.

1) చెక్కకు రంధ్రాలు చేసే బర్మి చలనం

2) భూమి చుట్టూ తిరిగే చంద్రుడి చలనం 

3) కదులుతున్న సైకిల్‌ చక్రాల చలనం

4) పైవన్నీ


15. సదిశ రాశిలో రేఖాఖండం పొడవు దేన్ని సూచిస్తుంది?

1) దిశ      2) పరిమాణం 

3) ఆకారం    4) వైశాల్యం


16. కిందివాటిలో అదిశ రాశి ఏది?

1) స్థానభ్రంశం   2) వేగం      

3) వైశాల్యం   4) భారం

 

17. 7 మీటర్ల వ్యాసార్ధం ఉన్న రన్నింగ్‌ ట్రాక్‌పై ఒక వ్యక్తి పూర్తి భ్రమణం చేస్తే అతడు ప్రయాణించే దూరం ఎంత?

1) 7 మీ. 2) 22 మీ. 3) 44 మీ. 4) 0 మీ.

 

18. ఒక వ్యక్తి A వద్ద నుంచి తూర్పు దిశలో 3 మీ. ప్రయాణించి, అక్కడ నుంచి ఉత్తర దిశగా 4 మీ. ప్రయాణిస్తే, అతడి స్ధానభ్రంశం ఎంత?

1) 3 మీ.  2) 7 మీ.  3) 5 మీ.  4) 0 మీ.


19. దూరం - కాలం గ్రాఫ్‌లో ఏదైనా ఒక బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ వాలు దేన్ని తెలియజేస్తుంది?

1) సరాసరి వడి    2) సరాసరి వేగం    

3) తక్షణ వడి    4) ప్రయాణ కాలం


20. వక్రమార్గంలో ప్రయాణిస్తున్న వస్తువు ప్రయాణ మార్గంలో ఏదైనా బిందువు వద్ద గీసిన?

1) తక్షణ వడి    2) సరాసరి వడి    

3) వేగ దిశ    4) వడి పరిమాణం

 

21. రోడ్డుపై అతివేగంగా ప్రయాణించే వారికి పోలీసులు ...... ఆధారంగా జరిమానా విధిస్తారు.

1) తక్షణ వడి       2) సరాసరి వడి  

3) దూరం    4) స్థానభ్రంశం


22. కిందివాటిలో ఒక వస్తువు త్వరణం పొందని  సందర్భాన్ని గుర్తించండి.

1) చలన దిశ స్థిరంగా ఉంటూ, వడి మారినప్పుడు

2) వడి స్థిరంగా ఉంటూ, చలన దిశ మారినప్పుడు

3) వడి, చలన దిశలు స్థిరంగా ఉన్నప్పుడు

4) వడి, చలన దిశలు మారినప్పుడు


23. ఒక రైలు ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరినట్లయితే, ఆ రైలుకు ఉండే త్వరణం?

1) సమ త్వరణం       2) ధన త్వరణం   

3) రుణ త్వరణం       4) శూన్య త్వరణం


24. కదులుతున్న రైలులో ఒక ప్రయాణికుడు ఒక నాణాన్ని నిట్టనిలువుగా పైకి విసిరితే, అది అతడి వెనుక పడింది. అయితే ఆ రైలుకు ఉండే త్వరణం?

1) ధన త్వరణం   2) రుణ త్వరణం    

3) సమ త్వరణం   4) శూన్య త్వరణం


25. వేగం - కాలం గ్రాఫులో ఏవైనా రెండు బిందువుల మధ్య ఉన్న గ్రాఫ్‌ వాలు దేన్ని తెలియజేస్తుంది?

1) వేగం       2) త్వరణం   

3) తక్షణ వేగం       4) స్థానభ్రంశం


26. స్వేచ్ఛా పతన వస్తువు యొక్క తొలి వేగం?

1) 9.8 మీ./సె.       2) 0 మీ./సె.   

3) 980 మీ./సె.     4) 98 మీ./సె. 


27. ఒక వస్తువు నిశ్చలస్థితి నుంచి 2 మీ./సె.2 సమ త్వరణంతో బయలుదేరితే 4 సెకన్ల తర్వాత దాని వేగం, స్థానభ్రంశం ఎంత?

1) 8 మీ./సె., 12 మీ.   2) 16 మీ./సె., 12 మీ.

3) 8 మీ./సె., 16 మీ.   4) 12 మీ./సె., 8 మీ.


28. నిట్టనిలువుగా పైకి విసిరిన రాయి విషయంలో ఏది అసత్యం? 

1) వస్తువు వేగం, త్వరణం ఒకే దిశలో ఉంటాయి. 2) వస్తువు వేగం, త్వరణం వ్యతిరేఖ దిశలో ఉంటాయి.

3) రాయికి రుణ త్వరణం ఉంటుంది.   4) రాయి అసమ చలనంలో ఉంటుంది.


29. కిందివాటిలో త్వరణానికి సంబంధించి సరికానిది?

1) త్వరణం ఒక సదిశ రాశి.

2) త్వరణ దిశ, వేగంలో మార్పు దిశలో ఉంటుంది.

3) త్వరణానికి S.I. ప్రమాణాలు - మీ./సె.2

4) నిట్టనిలువుగా పైకి విసిరిన రాయిలో ధన త్వరణం ఉంటుంది.

 

30. ఒక కణం R వ్యాసార్ధం ఉన్న వృత్తంలో అర్ధ భ్రమణం చేస్తే ఆ కణ స్థానభ్రంశం?

1) π 2) 2R 3) πR 4) R


31. కిందివాటిలో సరైంది?

1) స్థిర వడితో చలించే వస్తువు వేగం స్థిరం.

2) స్థిర వేగంతో చలించే వస్తువు వడి విభిన్నంగా ఉండొచ్చు.

3) స్థిర వడితో చలించే వస్తువుకు త్వరణం ఉండదు.

4) సరళ రేఖామార్గంలో చలించే వస్తువు వడి, వేగం సమానం.


32. కిందివాటిలో సరైన సమీకరణాన్ని గుర్తించండి.

1) v = u + at    2) u = v + at

3) a = v + ut   4) t = u + av


33. నిశ్చలస్థితి నుంచి బయలుదేరిన ఒక కారు a  సమత్వరణంతో t కాలం సరళ రేఖామార్గంలో ప్రయాణిస్తే, t కాలంలో అది పొందే సరాసరి వడి ఎంత?


34. 18 కి.మీ./గం. = ............ మీ./సె.

1) 1     2) 3      3) 5     4) 9


35. కిందివాటిలో స్థానభ్రంశానికి సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి.

1) ఇది సదిశ రాశి.

2) ఇది ధనాత్మకం/రుణాత్మకం/శూన్యం కావచ్చు.

3) స్థానభ్రంశం విలువ ≥ దూరం విలువ.

4) స్థానభ్రంశం విలువ ≤ దూరం విలువ. 


36. కిందివాటిలో సదిశ రాశిని గుర్తించండి.

1) పని     2) బలం   

3) సాంద్రత    4) సామర్థ్యం


37. కిందివాటిలో అదిశ రాశిని గుర్తించండి.

1) స్థానభ్రంశం   2) వైశాల్యం   

3) వేగం  4) భారం 


38. వాక్యం: ఎ) సరాసరి వడి, సరాసరి వేగం అనేవి నిర్ణీత కాలంలో వస్తువు చలనాన్ని వివరిస్తాయి.

వాక్యం: బి) సరాసరి వడి, సరాసరి వేగం అనేవి నిర్దిష్ట సమయం వద్ద వస్తువు చలనాన్ని వివరించలేవు.

1) ఎ, బి లు సత్యం         2) ఎ సత్యం, బి అసత్యం    

3) ఎ అసత్యం, బి సత్యం   4) ఎ, బి లు అసత్యం


39. 10 మీ. వ్యాసార్ధం ఉన్న రన్నింగ్‌ ట్రాక్‌పై ఒక వ్యక్తి పూర్తి భ్రమణం చేస్తే అతడు పొందిన స్థానభ్రంశం ఎంత? 

1) 10 మీ. 2) 20 మీ.  3) 0 మీ. 4) 15 మీ.


40. రెండు సంఘటనల మధ్య సమయాన్ని ఏమంటారు?

1) వేగం      2) స్థానభ్రంశం  

3) వడి      4) కాలం


41. కాలాన్ని అత్యంత కచ్చితంగా కొలిచే గడియారాలు?

1) స్టాప్‌ వాచ్‌       2) చేతి గడియారం   

3) గోడ గడియారం       4) క్వార్ట్జ్‌ గడియారం


42. సమ వృత్తాకార చలనంలో తిరిగే వస్తువు వడి?

1) ధనాత్మకం      2) రుణాత్మకం   

3) స్థిరం       4) శూన్యం


43. ఆట స్థలంలో కాలాన్ని కచ్చితంగా కొలిచే గడియారం?

1) స్టాప్‌ వాచ్‌       2) క్వార్ట్జ్‌ గడియారం   

3) పరమాణు గడియారం    4) సీజియం గడియారం


44. నిట్టనిలువుగా పైకి విసిరిన వస్తువు పొందే చలనం?

1) సమ చలనం       2) అసమ చలనం   

3) కంపన చలనం      4) భ్రమణ చలనం


సమాధానాలు
 

1-1; 2-1; 3-3; 4-1; 5-2; 6-3; 7-4; 8-3; 9-4; 10-4; 11-4; 12-2; 13-2; 14-4; 15-2; 16-3; 17-1; 18-3; 19-2; 20-3; 21-1; 22-3; 23-2; 24-1; 25-2; 26-2; 27-4; 28-1; 29-4; 30-2; 31-4; 32-1; 33-1; 34-3; 35-3; 36-2; 37-2; 38-1; 39-3; 40-4; 41-4; 42-3; 43-1; 44-2.

Posted Date : 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు