• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యాశ్రేణి

ఆ నియమంలోనే సమాధానం!


కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవాలన్నా, వాటిని సాధించాలన్నా విమర్శనాత్మక దృక్పథం ఉండాలి. తార్కిక ఆలోచనా శక్తి కావాలి. అభ్యర్థుల్లో వాటిని పరీక్షించేందుకే పోటీ పరీక్షల్లో లాజికల్‌ రీజనింగ్‌లో భాగంగా ‘సంఖ్యా శ్రేణి’ ప్రశ్నలు ఇస్తారు. ఇచ్చిన సంఖ్యల వరుసలో ఒక నియమం ఇమిడి ఉంటుంది. దాన్ని కనిపెడితే జవాబు వచ్చేస్తుంది. మార్కు తెచ్చేస్తుంది. 


పోటీపరీక్షల్లో ‘సంఖ్యాశ్రేణి’ నుంచి ప్రశ్నలు వస్తాయి. నిర్దిష్ట నియమాన్ని పాటించే సంఖ్యల సమూహంలో ఒకటి లేదా రెండు సంఖ్యలను లోపింపజేసి వాటి స్థానంలో రావాల్సిన సంఖ్యలను కనుక్కోమంటారు. కాబట్టి ముందుగా ఆ నిర్దిష్ట నియమాన్ని గుర్తించాలి. దీనికోసం ప్రధానంగా ప్రాథమిక గణిత పరిక్రియలు, సంఖ్యల రకాలు, వర్గాలు, ఘనాలు లాంటి అంశాలపైన పట్టు సాధించాలి. 

 

రకాలు

పెరుగుదల శ్రేణి

ఉదా: 79, 85, 92, 100, ?


      

సరిసంఖ్యల శ్రేణి

ఉదా: 2, 4, 6, 8, 10, 12, ?

 సమాధానం 14


బేసిసంఖ్యల శ్రేణి

ఉదా: 1, 3, 5, 7, 9, 11, ?

  సమాధానం 13


ప్రధానసంఖ్యల శ్రేణి

ఉదా: 2, 3, 5, 7, 11, 13, ?

  సమాధానం 17


సంయుక్త సంఖ్యల శ్రేణి

ఉదా: 4, 6, 8, 9, 10, 12, ?

  సమాధానం 14


వర్గాల శ్రేణి

ఉదా: 1, 4, 9, 16, 25, 36, 49, ?

    12, 22, 32, 42, 52, 62, 72 కాబట్టి

  సమాధానం 82 = 64


ఘనాల శ్రేణి

ఉదా: 1, 8, 27, 64, 125, ?

    13, 23, 33, 43, 53, కాబట్టి

  సమాధానం 63= 216


గుణాకార శ్రేణి

ఉదా: 5, 15, 60, 300, 1800, ?

       

  సమాధానం 12600


భాగాహార శ్రేణి

ఉదా: 720, 120, 24, 6, 2, ?


           సమాధానం 1


గణిత పరిక్రియల శ్రేణి

ఉదా: 5, 9, 16, 29, 54, ?


   సమాధానం 103


మిశ్రమ శ్రేణి

ఉదా: 3, 7, 8, 14, 14, 28, 21, ?, ?

    ఇందులో రెండు ఉపశ్రేణులు ఉంటాయి. అవి


             సమాధానం 29, 56


N2 ± N శ్రేణి   

ఉదా: 2, 6, 12, 20, 30, ?


మాదిరి ప్రశ్నలు


1. 97, 83, 73, 67, ?

    1) 59       2) 63       3) 57      4) 65

జవాబు: 1

సాధన: ఇచ్చిన శ్రేణిలో సంఖ్యలు 100కు ముందున్న ప్రధాన సంఖ్యలు. 


   

2.    23, 28, 38, 49, 62, ?

    1) 80        2) 82       3) 76       4) 70

జవాబు: 4

సాధన: ఇచ్చిన శ్రేణిలోని సంఖ్యలోని అంకెల మొత్తాన్ని అదే సంఖ్యకు కలపడం ద్వారా తర్వాత సంఖ్య ఏర్పడింది. కాబట్టి


        

4.    1423, 4132, 6857, 8675, 7915, ?

    1) 5179       2) 7159       3) 9751      4) 9157

జవాబు: 3

సాధన: ఇచ్చిన శ్రేణిలో సంఖ్యలోని అంకెల స్థానాలను మార్చడం ద్వారా తర్వాతి సంఖ్య ఏర్పడింది., 

    కాబట్టి 7915   9751


5.    8, 12, 24, 36, ?

    1) 23       2) 60       3) 31       4) 36

జవాబు: 2

సాధన: ఇచ్చిన శ్రేణిలోని సంఖ్యలు కవల ప్రధాన సంఖ్యల మొత్తంగా ఏర్పడ్డాయి.. కాబట్టి

3 + -5 - 8
5 + -7 - 12
11 + 13 - 24
17 + 19 - 36
29 + 31 -  60
  

6. 6, 15, 35, 77, ?

    1) 143       2) 77       3) 72       4) 68

జవాబు: 1

సాధన: ఇచ్చిన శ్రేణిలోని సంఖ్యలు ప్రతి రెండు వరుస ప్రధాన సంఖ్యలను గుణించగా ఏర్పడ్డాయి. అంటే

 

7.    5, 10, 26, 50, ?

    1) 101         2) 82       3) 122       4) 197

జవాబు: 3

సాధన: ఇచ్చిన శ్రేణి వరుస ప్రధాన సంఖ్యలను వర్గం చేసి ఒకటి (1) కలపడం ద్వారా ఏర్పడ్డాయి

    22 + 1 = 5

    32 + 1 = 10

    52 + 1 = 26

    7+ 1 = 50

    112  + 1 = 122


8.    4, 10, ?, 82, 244, 730

    1) 32        2) 36       3) 41        4) 28

జవాబు: 4

        
9.    5, 6, 6, 8, 16, 19, 57, ?, 244, 249

    1) 154        2) 121      3) 91       4) 61

జవాబు: 4

సాధన: ఇచ్చిన శ్రేణిలో రెండు ఉపశ్రేణులు ఉన్నాయి


    


10.  కింది శ్రేణిలో 1458 అనేది ఎన్నో పదం?

    2, 6, 18, 54, 162, ...

    1) 5వ        2) 6వ       3) 7వ       4) 8వ

జవాబు: 3

సాధన: 2, 6, 18, 54, 162, .. 

    ఇది గుణశ్రేణిలో ఉంది.


                  

రచయిత: గోలీ ప్రశాంత్‌ రెడ్డి 

Posted Date : 11-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌