• facebook
  • whatsapp
  • telegram

ప్రతిబింబ సమయాలు

మనసులో దర్శిస్తే దొరికే జవాబు!
 

 


కొత్త ఇంట్లో ఫర్నిచర్‌ చక్కగా సర్ది పెట్టుకోవాలంటే, ఒకసారి కళ్లు మూసుకొని ఊహించుకుంటారు. గతంలో మిత్రులతో జరిగిన మీటింగ్‌లో ఎవరెవరు ఉన్నారంటే, అలా చూస్తూ ఆలోచించి గుర్తు చేసుకుంటారు. వస్తువు నీడను లేదా నీటిలో దాని ప్రతిబింబాన్ని చిత్రంగా గీసేటప్పుడు మనసులో దర్శించుకుంటారు. ఒక  సమస్యను పరిష్కరించాలంటే దాని ప్రభావాన్ని, ఫలితాలను సమగ్రంగా చూడగలగాలి. ఆ విధంగా ఊహించుకోవడం, గుర్తుచేసుకోవడం, దర్శించుకోవడం మొత్తం మీద పరిస్థితులను సరిగా అర్థం చేసుకొని, సమర్థంగా చక్కబెట్టగలిగే నైపుణ్యాలను అభ్యర్థుల్లో పరీక్షించడానికే రీజనింగ్‌లో ప్రతిబింబ సమయాలపై ప్రశ్నలు అడుగుతుంటారు. మౌలికాంశాలను తెలుసుకొని, ప్రాక్టీస్‌ చేస్తే సమాధానాలను సులభంగా కనుక్కోవచ్చు.  

పోటీపరీక్షల్లో ప్రధానంగా ‘గడియారాలు’ అనే అంశం నుంచి వివిధ కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిలో ఒక ముఖ్యమైన అంశం ‘ప్రతిబింబ సమయాలు’ కనుక్కోవడం. ఇవి ప్రధానంగా రెండు రకాలు.

1) అద్దంలో ప్రతిబింబ సమయం  (Mirror Image Time)

2) నీటిలో ప్రతిబింబ సమయం (Water Image Time)

ప్రశ్నలో వాస్తవ సమయం ఇచ్చి, ప్రతిబింబ సమయం, ప్రతిబింబ సమయం ఇచ్చి వాస్తవ సమయం కనుక్కోమంటారు.

అద్దంలో ప్రతిబింబ సమయం: సాధారణ గడియారం 12 గంటలను, రైల్వే గడియారం 24 గంటలను కలిగి ఉంటుంది. ప్రశ్నలో ప్రత్యేకంగా చెప్పనంతవరకు అది సాధారణ గడియారంగానే భావించాలి. 

ప్రశ్నలో వాస్తవ సమయం ఇచ్చి అద్దంలో ప్రతిబింబ సమయం కనుక్కోమన్నప్పుడు లేదా అద్దంలో సమయం ఇచ్చి ప్రతిబింబ సమయం కనుక్కోమన్నప్పుడు దాన్ని 12 గంటల నుంచి తీసివేయాలి.

గమనిక: 1) 12 గంటలు = 11 గం. 60 ని.

 

2) వాస్తవ సమయం AM అయితే ప్రతిబింబ సమయం కూడా AM అవుతుంది. వాస్తవ సమయం  PM అయితే ప్రతిబింబ సమయం కూడా PM అవుతుంది.

ఉదా 1: ఒక గడియారంలో సమయం 5 : 20 గంటలు. ఆ గడియారాన్ని అద్దంలో చూసినప్పుడు ఏర్పడే ప్రతిబింబ సమయం ఎంత?

 1) 5 : 40           2) 6 : 40      3) 5 : 60            4) 4 : 40 

జ: 2 


ఉదా 2: ఒక గడియారంలో సమయం 3 : 16 గంటలు. ఆ గడియారాన్ని అద్దంలో చూస్తే ఏర్పడే ప్రతిబింబ సమయం ఎంత? 

1) 8 : 44            2) 8 : 40     3) 8 : 60           4) 7 : 44 

 

జ: 1 


నీటిలో ప్రతిబింబ సమయం: ప్రశ్నలో వాస్తవ సమయం ఇచ్చి నీటిలో ప్రతిబింబ సమయం కనుక్కోమన్నప్పుడు లేదా నీటిలో ప్రతిబింబ సమయం ఇచ్చి వాస్తవ సమయం కనుక్కోమన్నప్పుడు దాన్ని 18 : 30 లేదా 17 : 90 గంటల నుంచి తీసివేయాలి.

గమనిక: ప్రశ్నలో ఇచ్చిన నిమిషాలు (M) 


1) M   30 అయితే నీటిలో ప్రతిబింబ సమయం = 18 : 30  బీ : లీ 


2) M >  30 అయితే నీటిలో ప్రతిబింబ సమయం = 17 : 90  బీ : లీ 


ఉదా 1: ఒక గడియారంలో సమయం 4 : 25 తిలీ అయితే నీటిలో ఆ గడియారం ప్రతిబింబ సమయం ఎంత? 

1) 4 : 05          2) 2 : 05      3) 5 : 50           4) 1 : 05  



దీన్ని సాధారణ గడియారంలో తెలిపితే = 2 : 05

జ: 2 


ఉదా 2: ఒక గడియారంలో సమయం 8 : 39 అయితే నీటిలో ఆ గడియారం ప్రతిబింబ సమయం ఎంత? 

1) 9 : 39          2) 9 : 50     3) 9 : 51          4) 8 : 51 


జ: 3


మాదిరి ప్రశ్నలు 


1. ఒక గడియారంలో సమయం 11 : 30 గంటలు. ఆ గడియారాన్ని అద్దంలో చూసినప్పుడు ఏర్పడే ప్రతిబింబ సమయం ఎంత? 

1) 00 : 30           2) 12 : 30      3) 01 : 30          4) 7 : 00

గంటల సమయంలో ‘00’గా వచ్చినప్పుడు 12గా పరిగణించాలి.

12 : 30

జ: 2



2. ఒక గడియారంలో సమయం 6 : 19 గంటలు. అయితే ఆ గడియారాన్ని అద్దంలో చూస్తే ఏర్పడే ప్రతిబింబ సమయం ఎంత? 

 1) 5 : 41           2) 6 : 40     3) 5 : 40           4) 4 : 50 


జ: 1


3. ఒక గడియారాన్ని అద్దంలో చూసినప్పుడు ఏర్పడే ప్రతిబింబ సమయం 3 : 36 గంటలు. అయితే ఆ గడియారంలో వాస్తవ సమయం ఎంత? 

1) 6 : 42           2) 7 : 24        3) 8 : 42          4) 8 : 24


జ: 4


4. ఒక గడియారాన్ని అద్దంలో చూసినప్పుడు ఏర్పడే ప్రతిబింబ సమయం 7 : 23 గంటలు. అయితే ఆ గడియారంలో వాస్తవ సమయం ఎంత? 

1) 5 : 16            2) 4 : 37      3) 4 : 38    4) 5 : 37 


జ: 2

 

5. ఒక గడియారంలో సమయం 08 : 18 గంటలు. ఆ గడియారాన్ని అద్దంలో చూస్తే ఏర్పడే ప్రతిబింబ సమయం 0్ల : 4్వ అయితే ్ల ్ఘ ్వ విలువ ఎంత? 

1) 6    2) 5    3) 1   4) 8 

x =3, y =2

x + y = 3 + 2 = 5

జ: 2


6. ఒక గడియారంలో సమయం 7 : 16 గంటలు. అయితే నీటిలో ఆ గడియారం ప్రతిబింబ సమయం ఎంత? 

 1) 10 : 24           2) 11 : 42       3) 11 : 14           4) 11 : 24 


జ: 3


7. ఒక గడియారంలో సమయం 11 : 37 గంటలు. నీటిలో ఆ గడియారం ప్రతిబింబ సమయం ఎంత? 

   1) 6 : 53           2) 7 : 35        3) 6 : 35           4) 6 : 19 


జ: 1


8. ఒక గడియారంలో సమయం 6 : 43 గంటలు. నీటిలో ఆ గడియారం ప్రతిబింబ సమయం x*1 : yz అయితే  x + y + z విలువ ఎంత? 

 1) 5     2) 0     3) 10    4) 12


x = 1, y = 4, z = 7

x + y + z = 1 + 4 + 7 = 12

జ: 4


9. ఒక గడియారంలో సమయం 8 : 16 అయితే నీటిలో ఆ గడియారం ప్రతిబింబ సమయం ఎంత?

1) 10 : 15           2) 11 : 10      3) 10 : 14           4) 11 : 15


జ: 3


10. ఒక గడియారంలో సమయం 3 : 41 అయితే నీటిలో ఆ గడియారం ప్రతిబింబ సమయం ఎంత? 

  1) 2 : 53           2) 4 : 29        3) 2 : 49           4) 2 : 50 


సాధారణ గడియారంలో సమయం 2 : 49

జ: 3


రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

Posted Date : 25-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌