• facebook
  • whatsapp
  • telegram

సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌

 కూర్చోబెట్టడం నేర్చుకోండి!

 

ఒక తరగతి గదిలో వందమంది విద్యార్థులు ఉన్నారు. అందరినీ క్రమ పద్ధతిలో కూర్చోబెట్టాలి. ఇంట్లో పార్టీ జరుగుతోంది. అతిథుల్లో పెద్దవాళ్లు, పిల్లలు ఉంటారు. వాళ్లకు హాల్లో సౌకర్యంగా సీట్లు ఏర్పాటు చేయాలి. ఈ పనులు చక్కగా చేయాలంటే కొద్దిగా ఆలోచించాలి. ప్రాధాన్యాలను, పరిధులను గుర్తించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. అందుకు కొన్ని నైపుణ్యాలు కావాలి. పోటీ పరీక్షల అభ్యర్థుల్లో అలాంటి సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రీజనింగ్‌లో భాగంగా ‘సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌’ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రాథమికాంశాలపై అవగాహన పెంచుకొని ప్రాక్టీస్‌ చేస్తే ఆ ప్రశ్నలకు తేలిగ్గా జవాబులు గుర్తించవచ్చు.  

 

వస్తువులు/మనుషులను ప్రశ్నలో ఇచ్చిన నియమాల ఆధారంగా అమర్చాల్సి ఉంటుంది. ఈ అమరిక తర్వాత వస్తువుల స్థానాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రశ్నలను సులభంగా సాధించవచ్చు. 

దీనిలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి.

 1) రేఖీయంగా అమర్చడం

2) వృత్తాకారంగా అమర్చడం

3) బహుభుజాకార పద్ధతిలో అమర్చడం

వస్తువులు/మనుషులను ఒక క్రమంలో అమర్చినప్పుడు దానిలో మొదటి స్థానం, చివరి స్థానం లేదా కచ్చితంగా మధ్య స్థానం లాంటి వాటిని గుర్తించవచ్చు. కానీ వృత్తాకారంగా అమర్చే విధానంలో మొదటి స్థానం, చివరి స్థానం అంటూ ఉండవు.

*  వృత్తాకార అమరికలో ముందుగా ఒక వస్తువును మొదటి స్థానంలో భావించి, ఆ వస్తువు ఆధారంగా మిగతా వస్తువులను అమర్చాల్సి ఉంటుంది.

*  వృత్తాకార అమరికలో ప్రశ్నలో చెప్పనంత వరకు వస్తువులు కేంద్రం వైపు ముఖం పెట్టి ఉన్నాయని భావిస్తాం.
 


మాదిరి ప్రశ్నలు


1.   A, B, C, D,  E, F  అనే ఆరుగురు వ్యక్తులు ఒక వరుసలో కూర్చున్నారు. కుడివైపు చివరన కూర్చున్న D పక్కన C కూర్చోలేదు. E అనే వ్యక్తి A, C ల మధ్య కూర్చున్నాడు. F, D ల పక్కన B లేడు. F, D ల మధ్యB ఉన్నాడు. అయితే A కి వెంటనే కుడివైపు కూర్చున్న వ్యక్తి ఎవరు?

1) C       2) E       3) D       4) F 

వివరణ: కుడివైపు చివరన D కూర్చున్నాడు. అదేవిధంగా CD వీలు కాదు.

A, C ల మధ్య E ఉన్నాడు అంటే  AEC/CEA

A అనే వ్యక్తి D, F ల పక్కన లేడు అంటే AF/FA లేదా AD/DA సాధ్యపడదు. 

F, D ల మధ్య B  ఉన్నాడు అంటే FBD/DBF

పై వివరణ ద్వారా 

జ: 2


2.   A, B, C, D, E, F, G, H  అనే ఎనిమిది మంది సభ్యులు రెండు వరుసల్లో ఎదురెదురుగా కూర్చుంటారు. ప్రతి వరుసలో నలుగురు ఉంటారు.B, C లు ఎదురెదురుగా కూర్చుంటారు. D,E ని  ల మధ్య C కూర్చుంటాడు. E కి వెంటనే ఎడమవైపున H కూర్చుంటాడు. H,F లు కర్ణ దిశలో ఎదురెదురుగా ఉంటారు. G,B లు పక్క పక్కన కూర్చోరు. అయితే తి A ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు?

1) C       2) D       3) E       4) B 

వివరణ: B, C లు ఎదురెదురుగా కూర్చుంటారు

D, E  ల మధ్య ది కూర్చుంటాడు అంటే DCE/ECD 

E కి వెంటనే ఎడమ వైపున H కూర్చుంటాడు. అంటే HE

H, F లు కర్ణ దిశలో ఎదురెదురుగా కూర్చుంటారు అంటే

G, B లు పక్కపక్కన కూర్చోరు

 పై వివరణ ద్వారా 

జ: 3

 


సూచన (3 - 7): P, Q, R, S, T, U, V, Wఅనే వ్యక్తులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు ముఖం పెట్టి కింది నియమాల ఆధారంగా కూర్చున్నారు. 

i) R, V ల మధ్య ఉన్న T కి కుడివైపున రెండో స్థానంలో  P ఉన్నాడు.

ii) S  అనే వ్యక్తి P పక్కన కూర్చోలేదు.

iii) U, V లు పక్కపక్కన ఉన్నారు.

iv) Q అనే వ్యక్తి S, W ల మధ్య కూర్చోలేదు.

v) W అనే వ్యక్తి  U, S ల మధ్య కూర్చోలేదు.


వివరణ: R, V లకు మధ్య ఉన్న T కి కుడివైపున రెండో స్థానంలో P ఉన్నాడు అంటే

S అనే వ్యక్తి P పక్కన కూర్చోలేదు.


*  U, V ల పక్కపక్కన ఉన్నారు అంటే 

*     Q అనే వ్యక్తి S,W ల మధ్య కూర్చోలేదు అంటే

 

 

*   W అనే వ్యక్తి  U, S ల మధ్య కూర్చోలేదు అంటే


    పై వివరణ ద్వారా



 


3.  కిందివారిలో ఎవరు పక్కపక్కన కూర్చోలేదు?

1) RV    2) UV    3) RP    4) QW

జ: 1

 


4.  V కి వెంటనే కుడివైపున ఎవరు ఉన్నారు?

1) P    2) U     3) R    4) T 

జ: 4

 


5.  R కి ఎడమవైపున మూడో స్థానంలో ఎవరు ఉన్నారు?

1) V     2)  W     3) U     4) S

జ: 3

 


6.  T, Qల మధ్య సవ్యదిశలో ఎంతమంది ఉన్నారు?    

  1) 4    2) 2     3) 3    4) చెప్పలేం

జ: 1

 


7.  Q కి ఎదురుగా ఉన్నది ఎవరు?

1)U   2) T     3) V    4) చెప్పలేం

జ: 3

 


8.  A, B, C, D అనే నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు.  A, C; B, D లు భాగస్వాములు C కి కుడివైపున D కూర్చున్నాడు. C అనే వ్యక్తి పడమర దిశకు అభిముఖంగా ఉన్నాడు. అయితే D ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు?

1) ఉత్తరం    2) దక్షిణం   3) తూర్పు  4) చెప్పలేం

వివరణ:  

      

D దక్షిణ దిశకు అభిముఖంగా ఉన్నాడు

జ: 2

 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి 

Posted Date : 29-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌