• facebook
  • whatsapp
  • telegram

సుస్థిరాభివృద్ధి - భారత ప్రభుత్వం చేపడుతున్న కార్య క్రమాలు

పర్యావరణ మార్పులపై కార్బన్ పాదముద్ర! 


భవిష్యత్తు తరాలకు వనరులను అందించడం, అభివృద్ధిని కొనసాగించడం ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందు ఉన్న ప్రధాన లక్ష్యం. అందుకోసం ఎన్నో దేశాలు పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా భారత ప్రభుత్వం అనేక మిషన్లను అమలు చేస్తోంది. గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ స్థిరమైన ప్రగతిని సాధించడం వాటి ప్రధాన ఉద్దేశాలు. పునరుత్పాదక శక్తి, అడవుల పెంపకం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ అందులో భాగాలే. ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సమ్మిళిత వృద్ధిని సాధించడానికి జరుగుతున్న కృషిపై అవగాహన పెంచుకోవాలి. 


శీతోష్ణస్థితి మార్పులపై భారత్ మొదటి కార్యాచరణ ప్రణాళికను 2008, జూన్ 30న మన్మోహన్ సింగ్ విడుదల చేశారు. దీని ముఖ్య ఉద్దేశం శీతోష్ణస్థితిలో మార్పులకు కారణమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం, కాలపరిమితితో కూడిన కాలుష్యరహిత అభివృద్ధి పథకాల ద్వారా పర్యావరణ పరిరక్షణను చేపట్టడం. ఇందులో భాగంగా భారతదేశం పలు రంగాలకు చెందిన 8 రకాల మిషన్లను చేపట్టి GHG'S ఉద్గారాలను తగ్గించి సుస్థిరాభివృద్ధికి కృషి చేస్తోంది. అవి..


1)   జేఎన్ఎన్ఎస్ఎం (జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ )

2)  ఎన్ఎంఈఈఈ (నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్సడ్ ఎనర్జీ ఎఫిషియన్స్ )

3)  ఎన్ఎంఎస్హెచ్ (నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటట్)

4)  ఎన్డబ్ల్యూఎం (నేషనల్ వాటర్ మిషన్)

5)  ఎన్ఎంఎస్హెచ్ఈ (నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఇకో సిస్టమ్)

6)   ఎన్ఎంజీఐ (నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియ)

7)  ఎన్ఎంఎస్ఏ (నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్  అగ్రికల్చర్)

8)   ఎన్ఎంఎస్కేసీసీ (నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమెట్ ఛేంజ్)


మాదిరి ప్రశ్నలు


1.  శీతోష్ణస్థితి మార్పులపై, సుస్థిరాభివృద్ధి సాధనకు భారత ప్రభుత్వం మొదటి కార్యచరణ ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?

1)  2007, జూన్ 30   2) 2006, జూన్ 30 

3) 2008, జూన్ 30   4) 2005, జూన్ 30



2.  ఎన్ఏపీసీసీకి సంబంధించి కిందివాటిని పరిశీలించి, సరైన సమాధానాలను ఎంచుకోండి.    

ఎ) శీతోష్ణస్థితిలో మార్పులకు కారణమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం.

బి కాల పరిమితిలో కూడిన కాలుష్య రహిత    అభివృద్ధి పథకాల ద్వారా పర్యావరణ పరిరక్షణను  చేపట్టడం.

సి)  వివిధ రంగాలకు చెందిన 8 రకాల మిషన్స్ను చేపట్టి గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించి సుస్థిరాభివృద్ధికి కృషి చేయడం.

1)  ఎ, బి  2)  బి, సి    3) ఎ, సి    4) ఎ, బి, సి 



3. మానవుడు అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టే చర్యల  (రవాణా, పరిశ్రమలు, విద్యుదుత్పాదన, నివాస గృహాల్లో విద్యుత్తు వినియోగం లాంటి రంగాల్లో ఇంధన వనరుల వినియోగం) వల్ల పర్యావరణంలోకి విడుదలయ్యే మొత్తం గ్రీన్హౌస్ వాయువుల పరిమాణాన్ని ఏమని పిలుస్తారు?

1)  భరించగలిగిన సామర్థ్యం   2)  కార్బన్ కొరత 

3) కార్బన్ మిగులు      4) కార్బన్ పాదముద్ర



4.  మానవుడు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల పర్యావరణం, శీతోష్ణస్థితిలో కలిగే మార్పులను తెలుసుకోవడానికి వేటిని సూచికగా ఉపయోగిస్తారు?

1)  భరించగలిగిన సామర్థ్యం  2)  కార్బన్ కొరత 

3)  కార్బన్ మిగులు       4) కార్బన్ పాదముద్ర



5. బచావత్ ల్యాంప్ యోజన పథకానికి సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) సుస్థిరాభివృద్ధిలో భాగంగా ఇంధన పొదుపు కోసం చేపట్టిన కార్యక్రమం.

బి) దీన్ని 2009లో ప్రారంభించారు. సంప్రదాయ బల్బుల స్థానంలో అదే ధరకు సీఎఫ్ఎల్ బల్బులను అందించడం దీని ముఖ్య ఉద్దేశం.

సి) ఈ కార్యక్రమాన్ని క్యోటో ప్రోటోకాల్లోని సీడీఎంను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్నారు.

డి) సీఎఫ్ఎల్ బల్బులు తక్కువ వాట్ సామర్థ్యాన్ని వినియోగించుకుని, ఎక్కువ కాంతినిస్తాయి. అలాగే, ఎక్కువ గంటలు పనిచేయడం, తక్కువ దినీది( వాయువులను విడుదల చేస్తాయి.

1)  ఎ, బి, సి   2) బి, సి, డి   3)  ఎ, సి 4) ఎ, బి, సి, డి



6. భారత్ను 2020 నాటికి ప్రపంచంలో ఒక ‘పర్యావరణ హితమైన సుస్థిరాభివృది దేశం’గా మార్చడానికి ప్రవేశపెట్టిన ‘గ్రీన్బిల్డింగ్ కౌన్సిల్’ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1)  2000    2)  2001  3) 2002  4) 2004



7. దిల్లీలో ప్రవేశపెట్టిన ‘ప్రకాశ్ పధ్’ కార్యక్రమం దేనికి సంబంధించింది?     

1)  సీఎఫ్ఎల్ బల్బులను పంపిణీ చేయడానికి  

2)  ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయడానికి 

3)  దిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరాఫరా చేసేందుకు 

4) పైవన్నీ



8.  ఎల్ఈడీకి సంబంధించి కింది వాటిలో తప్పుగా పేర్కొన్న వాక్యాన్ని గుర్తించండి. 

1)  50 వేల గంటలు పనిచేయడంతోపాటు తక్కువ వాట్ విద్యుత్తు వినియోగించుకుంటుంది. 

2)  మెర్క్యురీని విడుదల చేస్తుంది.

3)  గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేయదు.

4) మన్నిక ఎక్కువ.



9. జీఆర్ఐహెచ్ఏ (గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటేట్ అసెస్మెంట్) ప్రాజెక్టుకు సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. 

ఎ) దీని ముఖ్య ఉద్దేశం హరిత నివాసాల నిర్మాణం.

బి) ఈ ప్రాజెక్టును TERI లో అంతర్భాగంగా అభివృద్ధి చేశారు.

సి) ఈ ప్రాజెక్టు కింద నిర్మించిన గృహాల వల్ల వ్యర్థాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు, నీటి వినియోగం కూడా తక్కువే.

డి) జీఆర్ఐహెచ్ఏ 7వ సదస్సు 2016, ఫిబ్రవరిలో న్యూదిల్లీలో జరిగింది. దీని నినాదం ‘సిటీస్ ఆఫ్ ది ఫ్యూచర్’.

1) ఎ, బి, సి    2)  బి, సి, డి    3)  ఎ, సి    4) ఎ, బి, సి, డి



10. గృహాల్లో వెలుతురు కోసం ఉపయోగించే ఎల్ఈడీ, సీఎఫ్ఎల్ బల్బులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి.

1)  ఎల్ఈడీ కంటే సీఎఫ్ఎల్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎల్ఈడీ విషపూరిత లోహాలతో తయారవుతుంది.

2)  సీఎఫ్ఎల్ కంటే ఎల్ఈడీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సీఎఫ్ఎల్ విషపూరిత లోహాలతో తయారవుతుంది.

3)  రెండూ ప్రయోజనకరమైనవే.

4) రెండూ ప్రమాదకరమైనవే. ఎందుకంటే ఈ రెండింటిలో విషపూరిత లోహ పదార్థాలంటాయి. 



11. ఇకో-మార్క్ అనే గుర్తును భారత ప్రభుత్వం ఏ ఉత్పత్తులపై ముద్రిస్తుంది?            

1)  పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు

2)  పర్యావరణహిత వస్తువులు

3)  ఆర్థిక ప్రయోజనాలున్న వస్తువులు 

4) కలుషిత, కాలుష్యరహిత పదార్థాలు



12. ‘జయప్రకాశ్ మోహన్ కమిటీ’ దేనికి సంబంధించింది?

1)   కార్బన్ డై ఆక్సైడ్ను విడుదల చేసే పరిశ్రమలపై కార్బన్ ట్యాక్స్ను విధించడానికి

2)  కార్బన్ ఫుట్ ప్రింట్ను తగ్గించడానికి  తీసుకోవాల్సిన చర్యల గురించి

3)  కాలుష్య రహిత ఇంధనాలను ఉపయోగించే   విషయానికి సంబంధించి

4) మోటార్ వాహనాల వల్ల విడుదలయ్యే  కాలుష్యాన్ని తగ్గించడానికి యూరో-4  ప్రమాణాలను అమలు చేయడానికి



13. భారత దేశంలో గ్రీన్హౌస్ వాయువుల విడుదలలో ప్రథమ స్థానంలో ఉన్న నగరం?

1)  ముంబయి   2)  దిల్లీ    3)  కోల్కతా    4) చెన్నై



14. దేశంలో గ్రీన్హౌస్ వాయువుల పాదముద్ర   ఎక్కువగా ఉన్న నగరం?

1) ముంబయి  2)  దిల్లీ  3)  కోల్కతా   4) చెన్నై


 

15. ‘హరిత ఆర్థిక వ్యవస్థ’ అనే భావనను యూఎన్ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సమావేశంలో ప్రవేశ పెట్టారు?

1) R10 + 5    2) R10 + 10   3) R10+20    4) కాప్ - 21



16. కిందివాటిలో BSE Greenex చోటు చేసుకోని కంపెనీ?

1)  టాటా స్టీల్     2)  డా.రెడ్డీస్ ల్యాబ్ 

3)  సన్ఫార్మా    4) విశాఖ స్టీల్ ప్లాంట్



17. BSE Greenex అంటే..

1)  కాలుష్యకాలను గ్రహించే వృక్షాలను పెంచే కంపెనీలకు ఇచ్చే ఈక్విటీ ఇండెక్స్ 

2)  కాలుష్యరహిత ఉత్పత్తులను తయారుచేసే కంపెనీలకు ఇచ్చే ఈక్విటీ ఇండెక్స్

3)  పర్యావరణ అనుకూల ఈక్విటీ ఇండెక్స్

4) ఏదీకాదు



18. BSE Greenex ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1)  2009    2)  2010     3)  2011  4) 2012



19. కిందివాటిలో ‘ఇంధన పొదుపు’ కోసం సుస్థిరాభివృద్ధిలో భాగంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది?

1)  బచావత్  ల్యాంప్ యోజన  2)  గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 

3)  జీఆర్ఐహెచ్ఏ    4) ఏదీకాదు



20. ‘ద ఎనర్జీ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టీఈఆర్ఐ)కు సంబంధించి సరైనవి గుర్తించండి.

ఎ) ఇది న్యూదిల్లీ కేంద్రంగా 1974 లో ఏర్పాటు చేసిన ఒక లాభాపేక్ష లేని, స్వయంప్రతిపత్తి ఉన్న పరిశోధన సంస్థ.

బి) దీని స్థాపకుడు ‘దర్బారీ సేథ్ ’కాగా, ప్రస్తుత  డైరెక్టర్ జనరల్ అజయ్ మాధుర్.

సి) ఈసంస్థ ప్రచురిస్తోన్న పత్రిక పేరు ‘టెర్రా గ్రీన్’.

డి) ఈ సంస్థ ఇంధన రంగం, పర్యావరణం, వనరులను పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకుంటూ, సుస్థిరాభివృద్ధి సాధనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేపడుతుంది.

1)  ఎ, బి, సి   2)  బి, సి, డి    3)  ఎ, సి    4) ఎ, బి, సి, డి



21. బయోరిమిడియేషన్ అంటే.....

1)  పర్యావరణ కాలుష్యకాలను, రసాయనాలను ఉపయోగించి కాలుష్య రహితంగా మార్చే ప్రక్రియ.

2)  సూక్ష్మజీవులు, కాలుష్యకాలను ఉపయోగించి  కాలుష్యరహితంగా మార్చే ప్రక్రియ.

3)  ద్రవ పదార్థాల్లోని సూక్ష్మజీవులను తొలగించే ప్రక్రియ.

4) ఏదీకాదు



22. ఆక్సిజన్ సమక్షంలో నేలలోని సూక్ష్మజీవులకు  పోషకాలను అందించడం ద్వారా కాలుష్యకాలను విచ్ఛిన్నం చేసే విధానాన్ని ఏమంటారు?

1)  బయో స్టిమ్యులేషన్  

2)  బయో ఆగ్మెంటేషన్ 

3)  ఇంట్రెన్సిక్ బయోరిమిడియేషన్  

4) ఇన్సిటు బయోరిమిడియేషన్



23. సూక్ష్మజీవులను మృత్తికలోకి పంపించడం ద్వారా కాలుష్యకాలను తొలగించే విధానాన్ని... అని పిలుస్తారు.

1)  బయో స్టిమ్యులేషన్ 

2)  బయో ఆగ్మెంటేషన్ 

3)  ఇంట్రెన్సిక్ బయోరిమిడియేషన్ 

4) ఇన్సిటు బయోరిమిడియేషన్



24. మున్సిపల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటులో ఏ జీవసాంకేతిక విధానాన్ని ఉపయోగించి మురుగు నీటిలోని కాలుష్యకాలను తొలగిస్తారు? 

1)  బయో స్టిమ్యులేషన్      

2) బయో ఆగ్మెంటేషన్

3)  ఇంట్రెన్సిక్ బయో రిమిడియేషన్     

4) ఇన్సిటు బయోరిమిడియేషన్


సమాధానాలు

1-3; 2-4; 3-4; 4-4; 5-4; 6-2; 7-2; 8-2; 9-4; 10-1; 11-2; 12-4; 13-4; 14-2; 15-3; 16-4; 17-3; 18-4; 19-1; 20-4; 21-2; 22-1; 23-2; 24-2. 

Posted Date : 03-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌