• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానుల యుగ విశేషాలు

మాదిరి ప్రశ్నలు

1.     గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న భూస్వాములను ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏమని పిలిచేవారు? 

1) చౌదరీలు        2) ముఖద్దమ్‌లు         3) పట్వారీలు        4) కుట్‌లు/కుల్ట్‌లు
 

2.     ఢిల్లీలోని భవన నిర్మాణ కార్మికుల గొప్పదనాన్ని కొనియాడిన రచయిత? 

1) అమీర్‌ ఖుస్రూ         2) అల్‌బెరూనీ        3) ఇస్సామీ       4) బరౌనీ
 

3.     సుల్తానుల కాలంలో రాజ్యానికి అధిక ఆదాయాన్ని సమకూర్చిన పన్ను? 

1) జకాత్‌              2) జిజియా             3) ఖరజ్‌              4) ఖామ్స్‌ 
 

4.     సుల్తాను అధీనంలో ఉన్న భూమిని ఏమని పిలిచేవారు? 

1) ఖలీసా             2) ఇక్తా           3) మదద్‌-ఇ-మాష్‌            4) జాగీర్‌    


5.     ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సైనిక వ్యవస్థను ఏవిధంగా పేర్కొనేవారు? 

1) మున్సబ్‌దారీ      2) ఇక్తా పద్ధతి     3) నాయంకర పద్ధతి      4) అమరనాయక పద్ధతి 
 

6.     ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థికమంత్రిని ఏమని పిలిచేవారు? 

1) దివాన్‌ - ఇ - అర్జ్‌       2) దివాన్‌ - ఇ - ఖాజీ     3) దివాన్‌- ఇ - వజీర్‌     4) ఇన్షా


7.     సిద్ధసైన్యాన్ని రూపొందించుకున్న తొలి ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌       2) ఇల్‌టుట్‌మిష్‌     3) అల్లావుద్దీన్‌ ఆలంషా     4) అల్లావుద్దీన్‌ ఖిల్జీ
 

8.     దివాన్‌ - ఇ - కోహి అనే ప్రత్యేక వ్యవసాయశాఖను ఏర్పాటు చేసినవారు? 

1) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌         2) అల్లావుద్దీన్‌ ఖిల్జీ       3) బాల్బన్‌        4) ఫిరోజ్‌షా తుగ్లక్‌
 

9.     ఢిల్లీ సుల్తానుల కాలంలో గ్రామ అధికారిని ఏమనేవారు? 

1) పట్వారీ           2) చౌకీదార్‌         3) ముఖద్దమ్‌          4) పైవన్నీ
 

10.     రాజపుత్ర స్త్రీలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఏమంటారు?

1) సతి పద్ధతి           2) పరదా పద్ధతి          3) షరియత్‌ విధానం          4) జౌహార్‌
 

11.     ఖురాన్‌ ప్రకారం మహ్మదీయులు అందించే న్యాయపాలన? 

1) మజ్లిస్‌         2)  దివాన్‌దరి          3)  షరియత్‌          4) జిల్లీ ఇల్లాహె
 


సమాధానాలు: 1-4    2-1    3-3   4-1    5-2   6-3   7-4   8-1    9-4    10-4    11-3

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌