• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగ పరిణామ క్రమం 

ఈస్టిండియా కంపెనీ 

బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ - I బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం 1600 డిసెంబరు 31 న 'చార్టర్' ద్వారా అనుమతిని జారీ చేసింది. ఈ చార్టర్ కాలపరిమితి 15 సంవత్సరాలు. దీన్ని తర్వాతి కాలంలో పొడిగిస్తూ వచ్చారు.

*  కంపెనీ (ఈస్టిండియా కంపెనీ) బక్సార్ యుద్ధం (1765) లో విజయం సాధించి, 'బెంగాల్ దివానీ అధికారాన్ని' పొందడం ద్వారా ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది కంపెనీ పాలనకు పునాదైంది. 1765 నుంచి 1773 వరకు ద్వంద్వ ప్రభుత్వం కొనసాగింది.

*  భారతదేశంపై బ్రిటిష్ ప్రభుత్వం తన సార్వభౌమాధికారాన్ని రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా ప్రకటించింది. అనేక మార్పులతో కంపెనీపాలన 1858 వరకు కొనసాగింది. 1858 నుంచి 1947 లో భారతదేశం స్వాతంత్య్రం పొందేవరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలన సాగించింది. బ్రిటిష్ పాలనలో భారతీయుల డిమాండ్లు, విన్నపాలు, చర్చలు, విమర్శలు, ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. ఈ చట్టాల క్రమాన్ని భారత రాజ్యాంగ చరిత్రగా చెప్పవచ్చు.

*  భారత రాజ్యాంగ చరిత్రను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి:

    1) ఈస్టిండియా కంపెనీ పాలన (1773 - 1858)

    2) బ్రిటిష్ ప్రభుత్వ పాలన (1858 - 1947)
 
ఈస్టిండియా కంపెనీ పాలన 

కంపెనీని స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి / చక్రవర్తి సర్వాధికారి. కానీ 1773 నాటికి బ్రిటిష్ పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. దీంతో బ్రిటిష్ పార్లమెంటు ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి, చక్కదిద్దడానికి అనేక చట్టాలు చేసింది. అందులో మొదటిది రెగ్యులేటింగ్ చట్టం 1773.
 
రెగ్యులేటింగ్ చట్టం 1773

 దీన్ని భారతదేశంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు. దీన్ని బ్రిటిష్ పార్లమెంటులో అప్పటి ప్రధాని 'లార్డ్ నార్త్' ప్రవేశపెట్టాడు. ఇది 1773 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే భారత రాజ్యాంగానికి పునాదైంది. 

ముఖ్యాంశాలు: ఈ చట్టం ఇంగ్లండ్, భారతదేశంలో కంపెనీకి సంబంధించి అనేక మార్పులను చేసింది.

ఇంగ్లండ్‌లో వచ్చిన మార్పులు:

* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ (కంపెనీ పాలక వర్గం) పదవీకాలాన్ని ఒక సంవత్సరం నుంచి 4 సంవత్సరాలకు పెంచారు. ప్రతి సంవత్సరం మొత్తం సభ్యుల్లో 1/4 వ వంతు పదవీ విరమణ చేస్తారు. తిరిగి అంతేమంది ఎన్నికవుతారు.

* కంపెనీ ప్రొప్రైటర్లు (యజమానులు) ఓటు హక్కు అర్హత పొందడానికి కనీసం 6 నెలలకు బదులు సంవత్సర కాలం పాటు, 500 పౌండ్లకు బదులు 1000 పౌండ్లకు మించిన వాటాలున్న వారికి పరిమితం చేశారు.

భారతదేశంలో వచ్చిన మార్పులు:

* బెంగాల్ గవర్నర్ హోదాను బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల నిర్వహణపై బెంగాల్ గవర్నర్ జనరల్‌కు పర్వవేక్షణ అధికారాన్ని కల్పించారు. 

* 'గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి'ని ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. గవర్నర్ జనరల్‌కు విధి నిర్వహణలో సాయపడటం దీని ప్రధాన విధి. కౌన్సిల్‌లో నిర్ణయాలు మెజారిటీ ప్రాతిపదికపై తీసుకుంటారు. గవర్నర్ జనరల్‌కు నిర్ణాయక ఓటు (Casting Vote) ను కల్పించారు.

* కలకత్తాలోని ఫోర్ట్ విలియం (బ్రిటిష్ వర్తక స్థావరం)లో సుప్రీంకోర్టు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇది 1774 లో ఏర్పాటైంది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఉంటారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. సుప్రీంకోర్టు తీర్పులపై 'కింగ్ కౌన్సిల్' (రాజు లేదా రాణి కౌన్సిల్ నిర్ణయాలను పాటించడం) కు అప్పీల్ చేసుకోవచ్చు.

* గవర్నర్ జనరల్, కౌన్సిల్ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తులు, ఇతర ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం చేయడాన్ని, స్థానికుల (భారతీయులు) నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బహుమతులు తీసుకోవడాన్ని నిషేధించింది.

* కంపెనీకి 20 సంవత్సరాల కాలపరిమితికి (పొడిగిస్తూ) చార్టర్ జారీ చేశారు.
 
పిట్స్ ఇండియా చట్టం 1784 

 రెగ్యులేటింగ్ చట్టం 1773 లోని లోపాలను సవరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయడమే ఈ చట్టం ఉద్దేశమని అప్పటి ఇంగ్లండ్ ప్రధాని 'విలియం పిట్' తెలియజేశారు. అతడి పేరు మీద ఈ చట్టం 'పిట్స్ ఇండియా' చట్టంగా ప్రాచుర్యం పొందింది. 

ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి 'బోర్డ్ ఆఫ్ కమిషనర్స్' ఏర్పాటైంది. దీన్నే 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అని కూడా అంటారు. దీనికి 'సెక్రటరీ ఆఫ్ స్టేట్' అధ్యక్షుడు. ఇతడికి నిర్ణాయక ఓటును కల్పించారు. సభ్యుల కాల పరిమితి 4 సంవత్సరాలు.

* ఈస్టిండియా కంపెనీ విధులను వాణిజ్య, రాజకీయ విధులుగా విభజించి, వాణిజ్య విధులను పూర్తిగా 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌'కు, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌'కు అప్పగించారు. భారతదేశంలోని కంపెనీ భూభాగాలు, ఆదాయంపై ఈ బోర్డుకు సంపూర్ణ అధికారాన్ని కల్పించారు.

* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి ఆదేశాలను పాటించని గవర్నర్లను, ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.

* 1786 లో జరిగిన సవరణ ఫలితంగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్ జనరల్‌కు వచ్చింది. అంతేకాకుండా గవర్నర్ జనరల్‌నే సర్వసైన్యాధ్యక్షుడిని చేశారు. ఈ సవరణ చట్టంతో గవర్నర్ జనరల్‌కు తన కౌన్సిల్ నిర్ణయాలను 'వీటో' చేసే అధికారం వచ్చింది. గవర్నర్ జనరల్ పదవి, అధికారాలు సుస్థిరం, విస్తృతమయ్యాయి.

* గవర్నర్ జనరల్, గవర్నర్ల కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 3 కు తగ్గించారు.

చార్టర్ చట్టం 1793 

ఫ్రాన్స్ పరిణామాలు (ఫ్రెంచి విప్లవం) ఇంగ్లండ్ వాణిజ్యంపై వ్యతిరేక ప్రభావం చూపడంతో విదేశీ వ్యాపారాన్ని, సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కంపెనీ సహకారం అవసరమైంది.

ముఖ్యాంశాలు: కంపెనీ అధీనంలోని ప్రాంతాలు, వాటిపై వచ్చే ఆదాయాన్ని మరో 20 సంవత్సరాలపాటు కంపెనీకే అప్పగించారు.

¤ స్వదేశీ ఖర్చుల పేరుతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యుల, కార్యాలయ సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చులను కంపెనీ ప్రభుత్వం (భారతదేశం నుంచి వచ్చే రెవెన్యూ) భరించే విధంగా చట్టంలో మార్పు చేశారు. ఇది 1793 నుంచి భారత ప్రభుత్వ చట్టం 1919 అమల్లోకి వచ్చేవరకు కొనసాగింది.

¤ గవర్నర్ జనరల్ కౌన్సిల్ సమావేశాలకు గవర్నర్ జనరల్ లేని సమయంలో 'వైస్ ప్రెసిడెంట్' అధ్యక్షత వహిస్తాడు. వైస్ ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాన్ని గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.

¤ భారతదేశంలో ఆంతరంగిక పాలనకు తగిన నిబంధనలను తయారు చేసే అధికారాన్ని గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కు ఇచ్చారు. భారతీయుల వ్యక్తిగత ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ జారీచేసే నిబంధనలు శాసనాలతో సమానమైన విలువను కలిగి ఉంటాయి. దీని ఆధారంగానే 'కారన్ వాలీస్ కోడ్' రూపొందింది. దీంతో భారతదేశంలో రాతపూర్వక శాసన నిర్మాణం ప్రారంభమైందని చెప్పవచ్చు.

¤ కంపెనీ ఉద్యోగులకు 'సీనియారిటీ' ప్రాతిపదికపై ప్రమోషన్లను కల్పిస్తారు.
 
చార్టర్ చట్టం 1813 

భారత రాజ్యాంగ క్రమపరిణామంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా చెప్పొచ్చు.

ముఖ్యాంశాలు: భారతదేశంలో కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాల పాటు పొడిగించారు. కంపెనీ పాలన కొనసాగినప్పటికీ కంపెనీ ప్రాంతాలపై రాణి / చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా ప్రకటించింది.

* కంపెనీకి ఉన్న వ్యాపార గుత్తాధికారాన్ని తొలగించారు. బ్రిటిష్ పౌరులందరికీ భారతదేశంలో స్వేచ్ఛా వ్యాపారాన్ని అనుమతించింది. అయితే కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా తేయాకు, చైనాతో వ్యాపారంలోనూ కంపెనీకి ఉన్న గుత్తాధికారం కొనసాగింది.

* భారతీయులను సంస్కరించడం, విజ్ఞానవంతులను చేయడం కోసం మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించారు. అవి భారతదేశంలో చర్చ్‌లు, ఆసుపత్రులు, విద్యాలయాలను స్థాపించడం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది.

* భారతీయులకు విజ్ఞానశాస్త్రాన్ని పరిచయం చేయడం, ప్రోత్సహించడం కోసం రూ.1,00,000 తో ఒక నిధిని భారతదేశంలో ఏర్పాటు చేశారు.

* పన్నులను విధించడానికి, వాటిని చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.

* కంపెనీ పరిపాలనలో పనిచేసే సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. పౌర ఉద్యోగులకు హేలీబ్యూరి కాలేజ్‌లోను (ఇంగ్లండ్), సైనికోద్యోగులకు ఎడిస్ కోంబ్‌లోని మిలిటరీ సెమినరీలోను శిక్షణను ఏర్పాటు చేశారు. * ఈ రెండింటినీ 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అధీనంలో ఉంచారు.
 
చార్టర్ చట్టం 1833 

భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం కేంద్రీకృత పాలనా వ్యవస్థను ఏర్పాటుచేసింది. కంపెనీ భూభాగాలు బ్రిటిష్ రాణి లేదా చక్రవర్తి వారసులకు చెందుతాయని ప్రకటించింది.  
ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాలు పొడిగించారు. అయితే తేయాకు, చైనాతో ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. 
* కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
* 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' నిర్మాణంలో మార్పు తెచ్చారు. అనేక మంది మంత్రులు పదవిరీత్యా సభ్యులయ్యారు. ఉదాహరణకు - లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కౌన్సిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ మొదలైనవారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్' హోదాను 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 'విలియం బెంటింక్'.
* గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 3 నుంచి 4 కు పెంచారు. నాలుగో సభ్యుడిగా 'లా మెంబరు'ను చేర్చారు. కౌన్సిల్‌లో మొదటి లా మెంబరు లార్డ్ మెకాలే.
* బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను రద్దు చేశారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కే పూర్తి శాసనాధికారం లభించింది. గవర్నర్ జనరల్ అధ్యక్షతనున్న కౌన్సిల్ శాసనాలు 'బ్రిటిష్ - ఇండియా' మొత్తానికి, అందరు వ్యక్తులకు, న్యాయస్థానాలకు వర్తిస్తాయి.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ 'లా కమిషన్‌'ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
* సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతి (open competition) ని ప్రతిపాదించారు. కానీ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' వ్యతిరేకించడంతో అది అమల్లోకి రాలేదు.
* భారత వ్యవహారాల మంత్రిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా చేశారు.
* భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను గవర్నర్ జనరల్ కౌన్సిల్‌పై ఉంచింది.
* యూరోపియన్లకు భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పరచుకోవడానికి అనుమతించారు.
 
చార్టర్ చట్టం 1853 

బ్రిటిష్ పార్లమెంటు చేసిన చార్టర్ చట్టాల్లో చివరిది. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న, నిర్దిష్ట కాలపరిమితి లేకుండా జారీ చేసిన చట్టం ఇది.

ముఖ్యాంశాలు: గవర్నర్ జనరల్ కౌన్సిల్ విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించి, శాసనాలను రూపొందించడానికి 'ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'ను ఏర్పాటు చేశారు. శాసన నిర్మాణం కోసం 12 మంది సభ్యులు ఉంటారు. ఇది రూపొందించే చట్టాలకు గవర్నర్ జనరల్ ఆమోదం అవసరం. గవర్నర్ జనరల్‌కు వీటో అధికారం ఉంటుంది. 'సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'నే మినీ పార్లమెంటు అంటారు. దీంతో భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థను మొదటిసారిగా పరిచయం చేసినట్లయ్యింది.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ (కేంద్ర శాసన మండలి)లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం 12 మందిలో గవర్నర్ జనరల్, సర్వసైన్యాధ్యక్షుడు, కౌన్సిల్‌లోని నలుగురు సాధారణ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక సాధారణ న్యాయమూర్తి, నలుగురు సభ్యులను మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా నుంచి తీసుకున్నారు.
* బ్రిటిష్ ఇండియాలో సివిల్ సర్వీసు నియామకాలను సార్వజనీన లేదా బహిరంగ పోటీ ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. అంతవరకూ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' నియమించేవారు.
* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సంఖ్యను 24 నుంచి 18 కి తగ్గించారు. వీరిలో ఆరుగురిని నియమించే అధికారం రాణి లేదా చక్రవర్తికి ఇచ్చారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'కు ఉన్న 'గవర్నర్ ఆఫ్ బెంగాల్' అనే హోదాను రద్దు చేశారు.
* భారతదేశంలో వ్యాపార సంస్థగా ప్రారంభమైన ఈస్టిండియా కంపెనీ 1858 నాటికి కేవలం పరిపాలనా సంస్థగానే మిగిలింది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు (లేదా) ప్రథమ స్వాతంత్య్ర పోరాటం తర్వాత రద్దయింది. కంపెనీ స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలనాధికారాలను స్వీకరిస్తూ 1858 నవంబరు 1 న ఒక ప్రకటన జారీ చేసింది.  
 * భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ద్వారా రూపొందించినప్పటికీ ఇది ఒక సుదీర్ఘ చారిత్రక క్రమపరిణామ ఫలితమని చెప్పొచ్చు.
 *  బ్రిటిష్ - ఇండియా ప్రాంతాల పాలన కోసం 1773 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది.
 * ఇవి భారత రాజ్యాంగ రూపకల్పనలో రాజ్యాంగ పరిషత్‌కు ఆధారంగా నిలిచాయి. 

చార్టర్‌ చట్టం, 1813

* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీకి భారత్‌లో 20 ఏళ్ల పాటు వర్తక, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు అనుమతి లభించింది.

* భారత్‌లో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ ‘స్వేచ్ఛా వాణిజ్యాన్ని’ (చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం మినహా) ప్రవేశపెట్టారు.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పించారు.

* భారత్‌లోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశానికి  అవకాశం కల్పించారు. ఇది తర్వాతి కాలంలో మనదేశంలో మతమార్పిడులకు దారితీసింది.

* భారత్‌లో విద్యాభివృద్ధి కోసం సంవత్సరానికి లక్షరూపాయలు కేటాయించారు.

* ‘బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌’ పర్యవేక్షణ అధికారాలను, విధివిధానాలను స్పష్టంగా పేర్కొన్నారు. దీని పరిధిని విస్తృతం చేశారు.

* ప్రైవేట్‌ వ్యక్తులు భూములు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు.

* ఈ చట్టం చేసే సమయంలో ‘మార్క్వస్‌ హేస్టింగ్స్‌’ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నారు.

చార్టర్‌ చట్టం, 1833

* ఈ చట్టం ద్వరా ‘ఈస్టిండియా కంపెనీ’కి మరో 20 ఏళ్ల పాటు భారత్‌లో వర్తక, వాణిజ్య నిర్వహణకు అవకాశం కల్పించారు. దీన్నే ‘సెయింట్‌ హెలీనా’ చట్టంగా పేర్కొంటారు.

* బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ పదవి పేరును ‘భారతదేశ గవర్నర్‌ జనరల్‌’గా మార్చారు. మొట్టమొదటి భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా ‘విలియం బెంటింక్‌’ వ్యవహరించారు. ఇతడికి ఆర్థిక, సివిల్, మిలటరీ అధికారాలు అప్పగించారు.

* భారతదేశంలో ‘బానిసత్వాన్ని’ రద్దు చేయాలని తీర్మానించారు. దీన్ని లార్డ్‌ ఎలిన్‌ బరో వ్యతిరేకించడంతో అమల్లోకి రాలేదు.

* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి లార్డ్‌ మెకాలే అధ్యక్షతన ‘మొదటి లా కమిషన్‌’ను ఏర్పాటు చేశారు.

* బొంబాయి, మద్రాస్‌ ప్రభుత్వాల శాసనాధికారాలను తొలగించారు. కార్యనిర్వాహక మండలితో కూడిన గవర్నర్‌ జనరల్‌కు పూర్తి శాసనాధికారం లభించింది.

* గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను నాలుగుకు పెంచారు. అందులో ఒక న్యాయ సభ్యుడిగా లార్డ్‌ మెకాలేకు ప్రాతినిధ్యం కల్పించారు.

* ‘ఈస్టిండియా కంపెనీ’ వ్యాపార లావాదేవీలను రద్దు చేసి, దాన్ని పరిపాలనా సంస్థగా మార్చారు. తేయాకు, చైనాతో వ్యాపారాన్ని ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యం నుంచి తొలగించారు.

* యూరోపియన్లు భారతదేశానికి వలస వచ్చేందుకు, ఇక్కడ భూమి, ఆస్తులను సంపాదించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. దీంతో బ్రిటిష్‌ వలస రాజ్యస్థాపనకు చట్టబద్ధత కలిగింది. భారతదేశంలో ‘కేంద్రీకృత పాలన’కు తుదిమెట్టుగా ఈ చట్టాన్ని పేర్కొన్నారు.

* సివిల్‌ సర్వీసుల నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. భారతీయులకు ఉద్యోగకల్పనలో వివక్ష చూపకూడదని తీర్మానించారు. దీన్ని ‘కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌’ వ్యతిరేకించడంతో పూర్తిగా అమల్లోకి రాలేదు.

* భారతదేశంలో ముగ్గురు ‘బిషప్‌’లను  నియమించారు. కలకత్తాలోని ‘బిషప్‌’ను  భారతదేశం మొత్తానికీ క్రైస్తవ మతాధిపతిగా ప్రకటించారు.

చార్టర్‌ చట్టం, 1853

* ఇది ‘ఈస్టిండియా కంపెనీ’ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్‌ చట్టం. ఇందులో భారత్‌లో ఈస్టిండియా కంపెనీ హక్కులను పొడిగించే అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో కంపెనీ పాలన త్వరలో అంతమవుతుందని స్పష్టమైంది.

* గవర్నర్‌ జనరల్‌ అధికార విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించారు. శాసనాల రూపకల్పనకు ‘సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్‌ పార్లమెంటులా తన విధులను నిర్వహిస్తుంది.

* కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు. బెంగాల్, బొంబాయి, మద్రాస్, ఆగ్రాల నుంచి నలుగురికి ప్రాతినిధ్యం కల్పించారు.

* సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో జాతి వివక్ష లేకుండా బహిరంగ పోటీ విధానాన్ని ప్రవేశపెట్టారు. 

* 1854లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలపై అధ్యయనం కోసం లార్డ్‌ మెకాలే అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

మూడో దశ (1858-1909)

* 1857లో భారత్‌లో చెలరేగిన సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 నుంచి భారతదేశ పరిపాలన బ్రిటిష్‌ రాజు/ రాణి నియంత్రణలోకి వెళ్లింది. అప్పటి నుంచి రూపొందిన చట్టాలను ‘కౌన్సిల్‌ చట్టాలు’ లేదా ‘భారత ప్రభుత్వ చట్టాలు’గా పేర్కొంటారు.

భారత ప్రభుత్వ చట్టం, 1858:

* 1858, నవంబరు 1న విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడి ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రం, సంక్షేమం తమ లక్ష్యమని ఆమె ప్రకటించారు.

* ఈ చట్టం ద్వారా భారత్‌లో ‘ఈస్టిండియా కంపెనీ పాలన’ రద్దయ్యి, దేశం బ్రిటిష్‌ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది.

* భారతదేశ పరిపాలనకు అవసరమైన శాసనాలను బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందిస్తుంది.

* లండన్‌లో ‘భారతరాజ్య కార్యదర్శి’ ్బళీ’‘౯’్మ్చ౯్వ ్న÷ ళ్మ్చ్మీ’్శ అనే పదవిని ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్‌ కేబినెట్‌లో అంతర్భాగంగా ఉంటూ, మనదేశ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి బ్రిటిష్‌ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

* భారతరాజ్య కార్యదర్శికి పరిపాలనలో సహకరించడానికి 15 మంది సభ్యులతో కూడిన ‘కౌన్సిల్‌’ను ఏర్పాటు చేశారు.

* ‘గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’ హోదాను ‘వైస్రాయ్‌ ఆఫ్‌ ఇండియా’గానూ వ్యవహరించారు. ఈ వ్యక్తిని బ్రిటిష్‌ పాలిత రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు గవర్నర్‌ జనరల్‌గా, స్వదేశీ సంస్థానాలతో వ్యవహరించేటపుడు ‘వైస్రాయ్‌’గా పేర్కొన్నారు.

* మొట్టమొదటి గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌ పదవిని ‘లార్డ్‌ కానింగ్‌’ నిర్వహించారు.

* వైస్రాయ్‌ దేశంలో బ్రిటిష్‌ రాణి మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి. వీరు భారతదేశ పాలనను బ్రిటిష్‌ రాణి పేరుతో నిర్వహిస్తారు. వీరి పదవీకాలం అయిదేళ్లు. పాలనలో సహకరించేందుకు ఒక కార్యనిర్వాహక మండలి ఉంటుంది.

* ఈ చట్టాన్ని ‘గుడ్‌ గవర్నెన్స్‌ ఆఫ్‌ ఇండియా’గా పేర్కొంటారు.

* ఈ చట్టం ద్వారా బ్రిటిష్‌ రాణి ‘భారత సామ్రాజ్ఞి’ అనే బిరుదు పొందారు.

* దీని ద్వారానే భారత రాజ్యాంగ చరిత్ర ప్రాంభమైందని డి.డి.బసు పేర్కొన్నారు.

* బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్, కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ అనే ద్వంద్వపాలన రద్దయ్యింది.

* 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, భారతదేశంలోని యూరోపియన్‌ వడ్డీ వ్యాపారులు తిరుగుబాటు చేశారు. దీన్నే ‘వైట్‌ మ్యుటినీ’ (జ్తూi్మ’ ల్య్మీi-్వ) లేదా  ‘యూరోపియన్‌ తిరుగుబాటు’గా చెప్తారు.

* ఈ చట్టం ప్రకారం భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం కింది విధానాన్ని అనుసరించి, అమలు చేసింది.

రాజ్యాంగ పరిణామ క్రమం - మూడోదశ

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టాలు

భారతదేశంపై తమ పట్టును కొనసాగించడానికి బ్రిటిష్‌వారు అనేక చట్టాలను రూపొందించారు. ఇవి భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో అంతర్భాగంగా ఉపకరిస్తూ, మన రాజ్యాంగ రూపకల్పనకు తోడ్పడ్డాయి. వీటిలో కౌన్సిల్‌ చట్టాలు ముఖ్యమైనవి. భారత రాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్‌ సభ్యుల పేరు మీదుగా వీటిని రూపొందించారు. అందుకే వీటిని కౌన్సిల్‌ చట్టాలుగా పేర్కొంటారు. ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టాలు, వాటిలోని ముఖ్యాంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. 

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861

* లార్డ్‌ కానింగ్‌ భారతదేశ గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌గా ఉన్న కాలంలో ‘ఇండియన్‌  కౌన్సిల్‌ చట్టం, 1861’ని రూపొందించారు.

* ఈ చట్టం ద్వారా భారతీయులకు మొదటిసారి శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. గవర్నర్‌ జనరల్‌కు ‘ఆర్డినెన్స్‌’ను జారీచేసే అధికారాన్ని కల్పించారు.

* మంత్రులకు మంత్రిత్వశాఖలను కేటాయించే ‘పోర్ట్‌ఫోలియో’ విధానానికి చట్టబద్ధత కల్పించారు.

* రెగ్యులేటింగ్‌ చట్టం, 1773 ద్వారా రద్దుచేసిన బాంబే, మద్రాస్‌ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు. 

* ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను వివరించే ‘వార్షిక బడ్జెట్‌’ను ప్రవేశపెట్టే విధానాన్ని ప్రారంభించారు.

* బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సుల్లో నూతన లెజిస్లేటివ్‌ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.

* లార్డ్‌ కానింగ్‌ ‘లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’కు అనధికార సభ్యులుగా కొంతమంది భారతీయులను నామినేట్‌ చేశారు. వీరిలో పటియాలా మహారాజు నరేంద్రసింగ్, బెనారస్‌ మహారాజు దేవ్‌నారాయణ్‌ సింగ్, సర్‌ దినకర్‌రావు మొదలైనవారు ఉన్నారు.

* భారతదేశంలో మొదటి హైకోర్టును 1862లో కలకత్తాలో నెలకొల్పారు. అదే ఏడాది మద్రాస్, బాంబే హైకోర్టులను ఏర్పాటు చేశారు. 

* వివిధ లా కమిషన్ల సిఫార్సుల మేరకు 1859లో ‘సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’ను రూపొందించారు. 1860లో ‘ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’, 1861లో ‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’లను రూపొందించారు.

విభజించు- పాలించు విధానం

* భారత్‌లో అతివాద - మితవాద నాయకుల మధ్య తీవ్రమైన ఘర్షణ ఉండేది. దీన్ని గుర్తించిన ఆంగ్లేయులు అతివాదులను వేరుచేసి, మితవాదులను తమకు అనుకూలంగా తిప్పుకోవాలని ప్రయత్నించారు. 

* ఇందులో భాగంగానే ‘మింటో - మార్లే సంస్కరణల చట్టం’ ద్వారా విభజించు- పాలించు అనే విధానాన్ని బ్రిటిష్‌వారు అనుసరించారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892

* 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) ఏర్పడింది. విద్యావంతులైన భారతీయులు బ్రిటిష్‌ పాలనలోని లోపాలను తెలియజేస్తూ భారతీయుల్లో చైతన్యాన్ని తీసుకురావడం ప్రారంభించారు. దీంతో ఆంగ్లేయులు ఆందోళన చెంది, ఇక్కడి ప్రజలను సంతృప్తిపరచడానికి ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1982ను రూపొందించారు.

* ఈ చట్టం ద్వారా కేంద్ర, రాష్ట్రాలకు చెందిన లెజిస్లేటివ్‌ కౌన్సిళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు.

* కేంద్ర శాసనసభలో భారతీయ సభ్యుల ప్రాతినిధ్యం ఆరుకు పెరిగింది. వారు: గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్‌ బెనర్జీ, రాస్‌బిహారి ఘోష్,  ఫిరోజ్‌షా మెహతా, దాదాబాయ్‌ నౌరోజీ, బిల్‌గ్రామి.

* మనదేశంలో మొదటిసారిగా పరోక్ష పద్ధతిలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.

* కౌన్సిల్‌ సభ్యులకు బడ్జెట్‌పై చర్చించే అవకాశాన్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు అడిగే అధికారాన్ని కల్పించారు.

* కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 10 మందికి తగ్గకుండా, 16 మందికి మించకుండా ఉండాలని నిర్దేశించారు.

* రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల సంఖ్య 8 మందికి తగ్గకుండా 20 మందికి మించకుండా ఉండాలని పేర్కొన్నారు.

నాలుగో దశ (1909-35)

ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1909 

* దీన్నే మింటో - మార్లే సంస్కరణల చట్టం 1909 అని కూడా అంటారు.

* 1909లో అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ మార్లే, గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మింటో ఈ సంస్కరణల చట్టాన్ని రూపొందించారు.

* ఈ చట్టం ద్వారా వైస్రాయ్‌ కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం 16 నుంచి 60కి పెంచారు. 

* మద్రాస్, బెంగాల్, యునైటెడ్‌ ప్రావిన్స్, బిహార్, ఒడిశా రాష్ట్రాల శాసన వ్యవస్థల్లో సభ్యుల సంఖ్యను 50కి పెంచారు.

* కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ పేరును ‘ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’గా మార్చారు.

* గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ఈవిధంగా కౌన్సిల్‌కు వెళ్లిన మొదటి భారతీయుడు సత్యేంద్రప్రసాద్‌ సిన్హా. ఈయన్ను న్యాయసభ్యుడిగా నియమించారు.

* కేంద్ర, రాష్ట్ర శాసనసభ్యులకు అనుబంధ ప్రశ్నలు వేయడానికి, బడ్జెట్‌పై తీర్మానాలు ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించారు.

* మొదటిసారిగా ‘ఎన్నికల పద్ధతి’ని ప్రవేశపెట్టారు. శాసనసమండలిలో అనధికార సభ్యుల ఎన్నికకు ఈ పద్ధతి వర్తిస్తుంది. ఓటర్లను మతాలు, వర్గాలవారీగా విభజించారు.

* ముస్లింలు, వ్యాపార సంఘాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ముస్లింలకు వారి జనాభాకు మించి ప్రాతినిధ్యం కల్పించారు. వీరిని ముస్లిం ఓటర్లే ఎన్నుకునేలా వీలు కల్పించారు. ఇందుకోసం ‘ప్రత్యేక మత నియోజకవర్గాలను’ ఏర్పాటు చేశారు.

* ఈ చట్టం ద్వారా మతతత్వానికి చట్టబద్దత కల్పించారు. అందుకే లార్డ్‌ మింటోను భారత్‌లో ‘మత నియోజకవర్గాల పితామహుడి’గా పేర్కొంటారు.

* 1911లో లార్డ్‌ హార్డింజ్‌ - ఖిఖి కాలంలో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చారు. 

* ఈ చట్టం హిందువులు - ముస్లింల మధ్య వేర్పాటువాదానికి దారితీసి, భారతదేశ విభజనకు కారణమైందని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు.

* 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం‘కేవలం నీడ లాంటి ఆకారాన్ని మాత్రమే అందించిందని, ఇది చంద్రకాంతితో సమానం’’ అని అనేకమంది రాజనీతిజ్ఞులు పేర్కొన్నారు.

* ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచాలని భావించారు. ప్రాథమిక విద్య బాధ్యతను మున్సిపల్‌ వ్యవస్థలకు అప్పగించాలని ప్రయత్నించారు.

* 1913లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో లాలా హరదయాళ్‌ ‘గదర్‌’ పార్టీని స్థాపించారు. ఈ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి ‘దర్శి చెంచయ్య’.

* ‘‘ఈ సంస్కరణలు భారతదేశంలో పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సంబంధించినవి కావు’’ అని లార్డ్‌ మార్లే వ్యాఖ్యానించారు.

* భారతీయుల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని, స్వాతంత్య్ర కాంక్షను నిలువరించే ఉద్దేశంతో ఆంగ్లేయులు అనేక చర్యలు చేపట్టారు. వాటిలో ‘మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919’ కీలకమైంది. ఇందులోని అనేక మౌలికాంశాలు భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించాయి. వీటిపై పరీక్షార్థులకు అవగాహన అవసరం.

మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919

1919లో అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ చెమ్స్‌ఫర్డ్‌ కలిసి ఈ సంస్కరణల చట్టాన్ని రూపొందించారు. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను అందించడం దీని ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు: భారతదేశంలో తొలిసారి పార్లమెంటరీ విధానానికి పునాదులు పడ్డాయి. కేంద్ర శాసనసభలో ‘ద్విసభా విధానాన్ని’ ప్రవేశపెట్టారు.

కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌:

* దీన్ని ‘ఎగువ సభ’గా పేర్కొంటారు. ఇందులోని సభ్యుల పదవీకాలాన్ని 5 సంవత్సరాలుగా నిర్దేశించారు.

* ఈ సభలో ఉన్న సభ్యుల సంఖ్య 60. వీరిలో 34 మంది ఎన్నికైనవారు కాగా, మిగిలిన 26 మందిని గవర్నర్‌ జనరల్‌ నామినేట్‌ చేస్తారు. 

* ఈ సభకు గవర్నర్‌ జనరల్‌ ఎక్స్‌అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీని స్ఫూర్తితోనే మన రాజ్యసభను ఏర్పాటు చేశారు.

లెజిస్లేటివ్‌ అసెంబ్లీ:

* దీన్ని ‘దిగువసభ’గా పేర్కొంటారు. దీనిలోని సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు. 

* ఇందులోని మొత్తం సభ్యుల సంఖ్య 144. వీరిలో 104 మంది ఎన్నికైనవారు కాగా, 40 మంది నామినేట్‌డ్‌ సభ్యులు.

* 1925 ఫిబ్రవరిలో ఈ సభకు మొదటి అధ్యక్షుడిగా సర్‌ ఫెడరిక్‌ వైట్‌ను, ఉపాధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను నియమించారు.

* భారతీయుడైన విఠల్‌భాయ్‌ పటేల్‌ 1925, ఆగస్టులో ఈ సభకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

అధికారాల విభజన: 1919 నాటి మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండు రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు. అవి: 

కేంద్ర జాబితా: ఇందులో 47 అంశాలు ఉన్నాయి. జాతీయ ప్రాధాన్యం ఉన్న విదేశీ వ్యవహారాలు, దేశరక్షణ, పోస్టల్, కరెన్సీ, రైల్వే మొదలైన అంశాలు కేంద్ర జాబితా కిందకి వస్తాయి.

రాష్ట్ర జాబితా: ఇందులో 51 అంశాలు ఉన్నాయి. ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన వ్యవసాయం, నీటి పారుదల, ప్రజారోగ్యం, రోడ్డురవాణా, స్థానిక స్వపరిపాలన మొదలైన అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి.

ద్వంద్వపాలన (Dyarchy): 1919 నాటి మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ద్వారా రాష్ట్రాల్లో ‘ద్వంద్వపాలన’ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రభుత్వ పాలనాంశాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:

రిజర్వ్‌డ్‌ అంశాలు: వీటిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న 28 అంశాలు ఉన్నాయి. భూమి శిస్తు, పరిశ్రమలు, ఆర్థిక, న్యాయ, నీటిపారుదల మొదలైనవి ఇందులో ఉన్నాయి. 

* వీటికి సంబంధించిన వ్యవహారాలను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. వీరికి  ‘కార్య నిర్వాహక మండలి’ సహాయం చేస్తుంది. 

* కార్య నిర్వాహక మండలి సభ్యులు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అంటే వీరికి అధికారాలు మాత్రమే ఉంటాయి, విధులు ఉండవు.

ట్రాన్స్‌ఫర్డ్‌ అంశాలు: వీటిలో ప్రాధాన్యం, అధికారాలు లేని 22 అంశాలు ఉన్నాయి. స్థానిక పాలన, వ్యవసాయం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మొదలైన వాటిని భారతీయ మంత్రుల సహాయంతో సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. 

* ఈ మంత్రులు ఆయా రాష్ట్రాల శాసనసభల్లో సభ్యులుగా ఉండి, తమ విధి నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు.

* మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ద్వారా బ్రిటిష్‌ ఇండియా పరిపాలన కింది విధంగా రూపాంతరం చెందింది.

పాలనా విభాగం కార్య నిర్వాహక వర్గం  శాసన  వ్యవస్థ  న్యాయ వ్యవస్థ   
ఇంగ్లండ్‌ భారత  వ్యవహారాల మంత్రి, భారత  కౌన్సిల్, భారత  హైకమిషనర్‌ పార్లమెంట్‌ ప్రీవి కౌన్సిల్‌
ఇండియా గవర్నర్‌ జనరల్, గవర్నర్‌ జనరల్ కౌన్సిల్ కేంద్ర  శాసనసభ  సుప్రీంకోర్టు
రాష్ట్రం   గవర్నర్‌ రాష్ట్ర  శాసనసభ హైకోర్టు

ఇతర ముఖ్యాంశాలు

* భారతదేశ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ‘భారత హైకమిషనర్‌’ అనే పదవిని సృష్టించి, లండన్‌లో  కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

* భారత రాజ్య కార్యదర్శి జీతభత్యాలను భారతదేశ ఆదాయం నుంచి కాకుండా, బ్రిటిష్‌ ఆదాయం నుంచి చెల్లించాలని నిర్ణయించారు.

* సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. దీని ద్వారా మనదేశంలో మతపరమైన ప్రాతినిధ్యాన్ని విస్తృతం చేశారు.

* పరిమితమైన ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టి, భారతీయులు ప్రత్యక్షంగా పరిపాలనలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించారు.

* కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య; వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారాన్ని వైస్రాయ్‌కి కల్పించారు.

* మొదటిసారిగా కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్రాల బడ్జెట్‌ను వేరు చేశారు. రాష్ట్రాల శాసనసభకు తమ బడ్జెట్‌ను తామే రూపొందించుకునే అధికారాన్ని కల్పించారు.

* ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ‘లీ’ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది 1926లో తన నివేదికను సమర్పించగా కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లను ఏర్పాటు చేశారు.

* సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేశారు.

* 1921లో ‘ప్రభుత్వ ఖాతాల సంఘం’(Public Accounts Committee)ని ఏర్పాటు చేశారు.

* ఆస్తి పన్ను చెల్లింపు, విద్య ప్రాతిపదికన పరిమిత ఓటు హక్కును కల్పించారు. దీంతో మన దేశంలో కేవలం 2.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కు లభించింది.

మహిళలకు ఓటు హక్కు - మార్గదర్శకాలు

* మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ప్రకారం మహిళలకు ఓటు హక్కును ఎప్పుడు, ఎలా కల్పించాలనే అధికారాన్ని ‘ప్రొవిన్షియల్‌ శాసనసభల’కు అప్పగించారు.

* 1920లో ట్రావెన్‌కోర్‌ సంస్థానం మొదటిసారి మహిళలకు ఓటు హక్కు కల్పించింది.

* 1921లో మద్రాస్, బాంబే రాష్ట్రాలు మహిళలకు ఓటు హక్కు కల్పించాయి.

* 1927లో ‘మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’కు డాక్టర్‌ ముత్తులక్ష్మిరెడ్డి ఎన్నికయ్యారు.

విమర్శలు

* మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టాన్ని బాలగంగాధర్‌ తిలక్‌ ‘సూర్యుడు లేని ఉదయంగా’ విమర్శించారు.

* ‘‘భారతదేశంలో ద్వంద్వపాలన అనేది దాదాపు దూషించే మాట అయ్యింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని ‘నీవు డైయార్కివి’ అని అరవడం నేను విన్నాను’’ అని సర్‌ బట్లర్‌ పేర్కొన్నారు.

మడ్డీమాన్‌ కమిటీ, 1924

చిత్తరంజన్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలోని ‘స్వరాజ్య పార్టీ’ కేంద్ర శాసన వ్యవస్థలోకి ప్రవేశించి, బ్రిటిష్‌ వారి ముందు అనేక డిమాండ్లను ఉంచింది. అవి: 

* ద్వంద్వపాలనా విధానాన్ని రద్దు చేయడం.

* రాజకీయ ఖైదీలను విడుదల చేయడం.

* సివిల్, డిఫెన్స్‌ సర్వీసుల్లో భారతీయులకే అవకాశం కల్పించి, స్వపరిపాలన అందించడం.

* భారతీయ పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం.

* స్వరాజ్య పార్టీ, ఇతర జాతీయ నాయకుల ఒత్తిడి కారణంగా బ్రిటిష్‌ వారు 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం అమలు తీరును సమీక్షించాలని నిర్ణయించారు. దీని కోసం 1924లో అలెగ్జాండర్‌ మడ్డీమాన్‌ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

* ఈ కమిటీలో శివస్వామి అయ్యర్, తేజ్‌ బహదూర్‌ సప్రూ, ఆర్‌.పి.పరంజపే, మహ్మద్‌ ఆలీ జిన్నా మొదలైన భారతీయులు కూడా ఉన్నారు.

* ఏకాభిప్రాయంతో నివేదికను ఇవ్వడంలో ఈ కమిటీ విఫలమైంది. ఆంగ్లేయుల ప్రాబల్యం ఉన్న ఈ కమిటీ ద్వంద్వపాలనను సమర్థించింది.

సైమన్‌ కమిషన్‌ 1927

* 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం అమలు తీరును సమీక్షించేందుకు అప్పటి బ్రిటన్‌ ప్రధాని బాల్డ్విన్‌ 1927లో సర్‌ జాన్‌ సైమన్‌ నేతృత్వంలో ఒక కమిషన్‌ను నియమించారు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

* ఈ కమిషన్‌లో ఒక్క భారతీయుడికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. దీంతో దేశ పౌరులంతా ‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదంతో దీన్ని వ్యతిరేకించారు.

* సైమన్‌ కమిషన్‌ భారత్‌లో రెండుసార్లు పర్యటించింది. మొదటిసారి 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు; రెండోసారి 1928, అక్టోబరు 11 నుంచి 1929, ఏప్రిల్‌ 6 వరకు పర్యటించింది. ఈ కమిషన్‌ 1930లో తన నివేదికను సమర్పించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు:

* భారతదేశంలో సమాఖ్య తరహా విధానాన్ని ఏర్పాటు చేయడం.

* 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయడం.

* చట్ట సభల్లో భారతీయులకు ప్రవేశం కల్పించి, వారిని పరిపాలనలో భాగస్వాములను చేయడం.

* భాష ప్రాతిపదికన ఒడిశా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం.

* హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణ ఉండేలా చూడటం

* భారతీయులకు సార్వజనీన వయోజన ఓటు హక్కును, ప్రాథమిక హక్కులను నిరాకరించడం సమంజసమే అని నివేదికలో పేర్కొంది.

* కులాలవారీగా (కమ్యూనల్‌) ప్రాతినిధ్యం కల్పించడం సమంజసం కానప్పటికీ, దీనికి ప్రత్యామ్నాయం లేని కారణంగా కొనసాగించాలని సూచించింది.

బట్లర్‌ కమిటీ, 1927

* బ్రిటిష్‌ వారు 1927లో సైమన్‌ కమిషన్‌తో పాటు హర్‌కోర్ట్‌ బట్లర్‌ అధ్యక్షతన ‘భారత రాజ్యాల కమిటీ’ని ఏర్పాటు చేశారు.

* బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల (సంస్థానాల) మధ్య సంతృప్తికరమైన ఆర్థిక సంబంధాలను సూచించడం దీని లక్ష్యం.

* ఈ కమిటీలో డబ్ల్యూ.ఎస్‌.హాల్‌వర్త్, ఎస్‌.సి.పీల్స్‌ సభ్యులుగా ఉన్నారు. ఇది 16 రాజ్యాల్లో అమల్లో ఉన్న ఆర్థిక సంబంధాలను పరిశీలించి, 1929లో తన నివేదికను సమర్పించింది.

నెహ్రూ రిపోర్ట్, 1928

* సైమన్‌ కమిషన్‌ను బహిష్కరిస్తున్నట్లు 1927, నవంబరు 14న అప్పటి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ అయ్యంగార్‌ ప్రకటించారు. దీంతో అసహనానికి గురైన అప్పటి భారత వ్యవహారాల మంత్రి లార్డ్‌ బిర్కెన్‌హెడ్‌ 1927, నవంబరు 24న బ్రిటిష్‌ ఎగువ సభలో మాట్లాడుతూ ‘‘భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసుకోగలరా?’’ అని సవాలు చేశారు.

* భారత జాతీయ నాయకులు ఈ సవాలును స్వీకరించి, 1928, మే 19న బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్యాంగ రచనకు ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. 9 మంది సభ్యులున్న ఈ సంఘానికి మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షత వహించారు.

* ఈ ఉపసంఘం ఇచ్చిన నివేదికనే నెహ్రూ రిపోర్ట్, 1928గా పేర్కొంటారు.

దీపావళి ప్రకటన, 1929

భారత్‌లో రాజ్యాంగ సంస్కరణలపై చర్చించేందుకు లండన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతుందని, త్వరలోనే భారతదేశానికి స్వయంప్రతిపత్తి కల్పిస్తామని, 1929, అక్టోబరు 31న లార్డ్‌ ఇర్విన్‌ ప్రకటించారు. దీన్నే దీపావళి ప్రకటన అంటారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు

* సైమన్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికలోని అంశాలపై భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతో చర్చించేందుకు బ్రిటిష్‌ వారు లండన్‌లో మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. 

* భారత్‌లో పరిపాలన, భవిష్యత్తులో ప్రవేశపెట్టే పాలనా సంస్కరణల కోసం భారతీయుల అభిప్రాయాలను సేకరించటం ఈ సమావేశాల ఉద్దేశం. 

* బ్రిటన్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌తో చర్చించి ఈ సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు.

మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 1930

* ఈ సమావేశం 1930, నవంబరు 12 నుంచి 1931, జనవరి 19 వరకు జరిగింది. ఇందులో 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు. 

* ‘సంపూర్ణ బాధ్యతాయుత పాలన’పై చర్చిస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రత్యేక హామీని ఇవ్వకపోవటంతో భారత జాతీయ కాంగ్రెస్‌ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.

రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 1931

* ఇది 1931, సెప్టెంబరు 7 నుంచి 1937, డిసెంబరు 1 వరకు జరిగింది.

* 1931, మార్చి 5న గాంధీ - ఇర్విన్‌ ఒడంబడిక జరగడంతో ఈ సమావేశానికి ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ తరఫున గాంధీజీ ప్రాతినిధ్యం వహించారు. 

* ఇందులో 107 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అల్ప సంఖ్యాక వర్గాల సమస్యలపై గాంధీజీ, మహ్మద్‌ అలీ జిన్నా మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 

* బ్రిటిష్‌ వారు అనుసరిస్తున్న ‘విభజించు, పాలించు’ విధానానికి వ్యతిరేకంగా గాంధీజీ ఈ సమావేశాన్ని బహిష్కరించి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆయన్ను ఆంగ్లేయులు అరెస్ట్‌ చేసి ఎరవాడ జైలుకు తరలించారు.

కమ్యూనల్‌ అవార్డ్, 1932: చట్టసభల్లో మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం పెంచాలని 1932, ఆగస్టు 16న ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ ప్రతిపాదించారు. దీన్నే కమ్యూనల్‌ అవార్డ్‌ అంటారు.

* దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్‌లకే కాకుండా షెడ్యూల్డ్‌ కులాల వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ 1932, సెప్టెంబరు 20న పుణెలోని ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

* 1932, సెప్టెంబరులో గాంధీజీ - అంబేడ్కర్‌ మధ్య పుణె ఒడంబడిక జరిగింది. ఈ కారణంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. 

* కమ్యూనల్‌ అవార్డ్‌ కంటే ఎక్కువగా షెడ్యూల్డ్‌ కులాల వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించారు.

మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 1932

* ఈ సమావేశం 1932, నవంబరు 17 నుంచి 1932, డిసెంబరు 24 వరకు జరిగింది. దీనికి 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 

* ఈ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేదు.

* లండన్‌లో జరిగిన ఈ మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు డా. బి.ఆర్‌. అంబేడ్కర్, మహ్మద్‌ అలీ జిన్నా హాజరయ్యారు. రెండో సమావేశంలో సరోజినీ నాయుడు పాల్గొన్నారు.

శ్వేత పత్రం, 1933: రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో చర్చించిన అంశాలతో బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రచురించింది. దీనిలోని ప్రతిపాదనలను లార్డ్‌ లిన్‌లిత్‌గో అధ్యక్షతన గల బ్రిటిష్‌ పార్లమెంట్‌కు చెందిన జాయింట్‌ సెలక్ట్‌ కమిటీ పరిశీలించింది. ఇది 1934, నవంబరు 11న తన నివేదికను సమర్పించింది. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్‌ తిరస్కరించింది.

Posted Date : 30-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ పరిణామ క్రమం (అయిదో దశ)

భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజ్యాంగ రూపకల్పనకు అనేక అంశాలు తోడ్పడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’, ‘ఆగస్టు ప్రతిపాదనలు, 1940’, ‘క్రిప్స్‌ ప్రతిపాదనలు 1942’.

క్రిప్స్‌ ప్రతిపాదనలు, 1942

రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారతీయుల సహకారాన్ని పొందేందుకు బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ను 1942, మార్చి 22న భారతదేశానికి పంపాడు. అతడు కింద పేర్కొన్న అంశాలను ప్రతిపాదించాడు:

* భారతీయులకు అవసరమైన నూతన రాజ్యాంగ రూపకల్పనకు ‘రాజ్యాంగ పరిషత్‌’ ఏర్పాటు.

* రెండో ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడం.

* రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.

* క్రిప్స్‌ ప్రతిపాదనలను గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఇవన్నీ దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందు తేదీ వేసిన చెక్కు లాంటివి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వీటికి నిరసనగా గాంధీజీ 1942, ఆగస్టు 8న క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిస్తూ, ప్రజలకు 'Do or Die' అనే నినాదాన్ని ఇచ్చారు.

భారత ప్రభుత్వ చట్టం 1935

* భారత్‌లో పరిపాలన కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం తయారు చేసిన రాజ్యాంగ సంస్కరణ చట్టాల్లోకెల్లా ఇది సమగ్రమైంది. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందించిన అతిపెద్ద చట్టం ఇది. లండన్‌లో జరిగిన మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల చర్చలు, తీర్మానాలు ఈ చట్టానికి ఆధారం. భారత రాజ్యాంగ రూపకల్పనలో భాగంగా రాజ్యాంగ నిర్మాతలు సుమారు 70% పైగా అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించారు. అందుకే దీన్ని భారత రాజ్యాంగానికి ‘మాతృక’, ‘జిరాక్స్‌ కాపీ’గా పేర్కొంటారు. ఈ చట్టంలో 321 ఆర్టికల్స్, 
10 షెడ్యూల్స్‌ ఉన్నాయి. ఈ చట్టం 1937, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు

అఖిలభారత సమాఖ్య ఏర్పాటు: 

      ఈ చట్టం ద్వారా మనదేశంలో ‘అఖిలభారత సమాఖ్య’ను ప్రతిపాదించారు. ఇందులో 11 రాష్ట్రాలు, 6 చీఫ్‌కమిషనర్‌ ప్రాంతాలు, సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి.

అధికారాల విభజన:

      ఈ చట్టం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు. అవి:

ఫెడరల్‌ జాబితా: దీనిలో 59 అంశాలు ఉన్నాయి. జాతీయ ప్రాధాన్యం ఉన్న దేశ రక్షణ, కరెన్సీ, రైల్వే, విదేశీ వ్యవహారాలు మొదలైన కీలకాంశాలను ఇందులో పేర్కొన్నారు.

రాష్ట్ర జాబితా: దీనిలో 54 అంశాలు ఉన్నాయి. ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న వ్యవసాయం, నీటిపారుదల, స్థానిక స్వపరిపాలన, విద్య మొదలైన అంశాలను ఈ జాబితాలో చేర్చారు.

ఉమ్మడి జాబితా: దీనిలో 36 అంశాలు ఉన్నాయి. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు మొదలైన అంశాలను ఇందులో పొందుపరిచారు.

కేంద్ర శాసన వ్యవస్థలో సభ్యుల సంఖ్య పెంపు:

      ఈ చట్టం ద్వారా కేంద్ర శాసనశాఖలో ద్విసభా విధానాన్ని కొనసాగిస్తూ, వాటిలో సభ్యుల సంఖ్యను పెంచారు.

కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌ (Council of states): దీన్ని ఎగువ సభగా పేర్కొంటారు. ఇందులో సభ్యుల సంఖ్యను 260గా నిర్ణయించారు. వీరిలో 1/3వ వంతు సభ్యులను మనదేశంలోని స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు.

లెజిస్లేటివ్‌ అసెంబ్లీ (Legislative Assembly): దీన్ని దిగువ సభగా పేర్కొంటారు. ఇందులో సభ్యుల సంఖ్యను 375గా నిర్ణయించారు. వీరిలో 1/3వ వంతు సభ్యులను మనదేశంలోని స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు.

రాష్ట్రాల్లో ద్విసభా విధానం:

* భారత ప్రభుత్వ చట్టం, 1935 ద్వారా రాష్ట్రాల్లో ‘ద్విసభా విధానాన్ని’ ప్రవేశపెట్టారు. భారత్‌లో 11 బ్రిటిష్‌పాలిత రాష్ట్రాలు ఉండగా, వాటిలోని 6 రాష్ట్రాల్లో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అవి: అసోం, బెంగాల్, బిహార్, మద్రాస్, ఉత్తర్‌ ప్రదేశ్, బొంబాయి.

*  రాష్ట్రాల్లో ‘లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ను ఎగువసభగా, ‘లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’ని దిగువసభగా పేర్కొన్నారు.

రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనా విధానం రద్దు:

      1919లో ప్రవేశపెట్టిన ‘ద్వంద్వ పాలనా’ విధానాన్ని భారత ప్రభుత్వ చట్టం, 1935 ద్వారా రద్దుచేసి, రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. రాష్ట్రాల్లోని రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్‌ జాబితాలను రద్దుచేసి, రాష్ట్ర జాబితాలో ఉన్న 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు.

కేంద్రంలో ద్వంద్వ పాలనా విధానం ఏర్పాటు:

     భారత ప్రభుత్వ చట్టం, 1935 ద్వారా కేంద్రంలో ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా పాలనాంశాలను 2 రకాలుగా వర్గీకరించారు. అవి:

రిజర్వ్‌డ్‌ అంశాలు: ఇందులో అధికారాలు, ఆదాయవనరులు కలిగిన కీలకాంశాలు ఉన్నాయి. వీటిని గవర్నర్‌ జనరల్‌ నియమించిన ముగ్గురు సభ్యుల కౌన్సిల్‌ సహాయంతో నిర్వహిస్తారు.

ట్రాన్స్‌ఫర్డ్‌ అంశాలు: ఇందులో అంతగా ప్రాధాన్యంలేని అధికారాలు, ఆదాయ వనరులు లేని అంశాలున్నాయి. వీటిని 10 మందికి మించకుండా భారతీయులతో ఏర్పాటు చేసిన మంత్రిమండలి సహాయంతో గవర్నర్‌ జనరల్‌ నిర్వహిస్తారు.

ఫెడరల్‌ కోర్టు ఏర్పాటు:

కేంద్ర, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం దిల్లీలో ఫెడరల్‌ కోర్టును ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. దీనికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్‌ మారిస్‌ గ్వేయర్‌ వ్యవహరించారు. ఈ కోర్టు వెలువరించిన తీర్పులను ఇంగ్లండ్‌లోని ‘‘ప్రీవి’’ (Privy) కౌన్సిల్‌లో అప్పీల్‌ చేసుకోవచ్చు.

ఇతర అంశాలు

* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జాతీయ స్థాయిలో ‘ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ను రాష్ట్ర స్థాయిలో ‘స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేశారు.

* భారతదేశం నుంచి ‘బర్మా’ను వేరు చేశారు.

* కొత్తగా ఒడిశా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

* శాసన వ్యవస్థలో షెడ్యూల్డ్‌ కులాలు, మహిళలు, ఇండియన్‌ క్రిస్టియన్లు, యూరోపియన్లు, కార్మికులు, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటుచేసి, కమ్యూనల్‌ ప్రాతినిధ్యాన్ని విస్తృతం చేశారు.

* ‘‘అడ్వకేట్‌ జనరల్‌’’ పదవిని ఏర్పాటు చేశారు. వీరు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయసలహాదారులుగా ఉంటారు.

* స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం కల్పించి, ప్రాంతీయ పరిపాలనాంశాలను భారతీయ మంత్రుల అధికార పరిధిలోకి తెచ్చారు.

* గవర్నర్‌ జనరల్‌కు విశేషమైన అధికారాలను కల్పించారు. దీని ద్వారా ‘కేంద్ర లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’ చేసిన తీర్మానాలపై ‘వీటో’ (Veto) అధికారాన్ని కల్పించారు. అవసరమైతే గవర్నర్‌ జనరల్‌ సంబంధిత తీర్మానాలను బ్రిటిష్‌ రాణి పరిశీలన కోసం ఇంగ్లండ్‌కు పంపొచ్చు.

* రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణను తగ్గించారు. గవర్నర్లనే రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధ అధిపతులుగా పరిగణించారు.

* భారత ప్రభుత్వం చట్టం, 1935 ప్రకారం 1937లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ విజయం సాధించగా, మిగిలిన 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

* ఆర్థికపరమైన అంశాలను క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)ను ఏర్పాటు చేశారు.

ప్రముఖుల విమర్శలు

* ‘‘ఇది కచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకృతమైంది’’   - మహ్మద్‌ అలీ జిన్నా

* ‘‘మంచి వాహనానికి చక్కటి బ్రేకులు అమర్చి, ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మర్చిపోయారు’’     - జవహర్‌లాల్‌ నెహ్రూ

ఆగస్టు ప్రతిపాదనలు

1940, ఆగస్టు 8న అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ లిన్‌లిత్‌గో రాజ్యాంగ సంస్కరణలపై భారతీయులకు ప్రతిపాదనలు చేశారు. వీటినే  ‘ఆగస్టు ప్రతిపాదనలు’ అంటారు. అవి: 

* అన్ని రాజకీయ పార్టీలు, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహామండలిని ఏర్పాటు చేయడం.

* రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి (Dominion status)తో కూడిన పాక్షిక స్వాతంత్య్రాన్ని కల్పించడం.

* రాజ్యాంగ పరిషత్‌లో అల్పసంఖ్యాక వర్గాలవారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం.

Posted Date : 11-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగం - చారిత్రక పరిణామం

1. భారతదేశంలో ప్రత్యేక మత నియోజక వర్గాలను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
జ: మింటో-మార్లే సంస్కరణల చట్టం - 1909

2. భారత్‌లో మత నియోజక వర్గాల పితామహుడని ఎవరిని పేర్కొంటారు?
జ: లార్డ్‌ మింటో

3. మన దేశంలో రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

4. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడమే లక్ష్యమని ఏ చట్టంలో పేర్కొన్నారు?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

5. కేంద్ర శాసనసభలో మొదటిసారి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

6. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా నియమితులైన తొలి భారతీయుడు?
జ: సత్యేంద్ర ప్రసాద్‌ సిన్హా

7. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919ను ‘సూర్యుడులేని ఉదయం’ అని ఎవరు అభివర్ణించారు?
జ: బాలగంగాధర్‌ తిలక్‌

8. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919కు సంబంధించి సరైంది?
     1) కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు.               
     2) లండన్‌లో భారత హైకమిషనర్‌ పదవిని ఏర్పాటు చేశారు.
     3) సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుచేశారు.         
    4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

9. రాష్ట్రాల్లోని ‘ద్వంద్వ ప్రభుత్వ’ విధానాన్ని ఏ చట్టం రద్దు చేసింది?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935

10. భారత ప్రభుత్వ చట్టం - 1935కు సంబంధించి సరైంది.
     1) కేంద్రం, రాష్ట్రాల మధ్య మూడు రకాల అధికారాల విభజనను పేర్కొటుంది.
     2) రాష్ట్రస్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది.
     3) దిల్లీలో ఫెడరల్‌ కోర్ట్‌ను ఏర్పాటు చేసింది.
     4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ

     మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి? ఇంతకు ముందు ఈ నిర్మాణం ఏవిధంగా ఉండేది? వివిధ సంస్కృతులతో విస్తరించి, భిన్నత్వాన్ని ప్రదర్శించే ఈ భూభాగంలో ఏకత్వాన్ని సాధించడంలో ఎలాంటి కృషి జరిగింది..? ఈ అంశాలను పాలిటీ అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

    స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో రెండు రాజకీయ విభాగాలు ఉండేవి. మొదటిది బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలోని ప్రావిన్సులు. రెండోది బ్రిటిష్‌ సర్వసమున్నతాధికారం కింద స్వదేశీ రాజుల పాలనలో ఉన్న సంస్థానాలు. స్వాతంత్య్రానంతరం పాలనా సౌలభ్యం కోసం దేశాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు.
     భారత యూనియన్‌ కంటే భారత భూభాగం అనే భావన చాలా విస్తృతమైంది. యూనియన్‌లో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. కానీ భారత భూభాగంలో రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు, భారత ప్రభుత్వం ఆర్జించిన ఇతర ప్రాంతాలూ ఉంటాయి. కేంద్రంతో రాష్ట్రాలు అధికారాలను పంచుకుంటాయి. కేంద్రపాలిత ప్రాంతాలు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రత్యక్ష పాలనలో ఉంటాయి.

రాజ్యాంగం ప్రారంభంలో..
    1950 జనవరి, 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి మన దేశంలోని భూభాగాలను నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేశారు.
1) పార్ట్‌ - A రాష్ట్రాలు: గతంలో బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలుగా ఉన్నవాటిని ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. అవి అసోం, బిహార్‌, బాంబే, మధ్యప్రదేశ్‌, మద్రాస్‌, ఒడిశా, పంజాబ్‌, యునైటెడ్‌ ప్రావిన్స్‌, పశ్చిమ్‌బంగ.
2) పార్ట్‌ - B రాష్ట్రాలు: శాసనసభలు లేని స్వదేశీ సంస్థానాలను ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. అవి జమ్మూ-కశ్మీర్‌, మధ్యభారత్‌, హైదరాబాద్‌, మైసూర్‌, పాటియాలా అండ్‌ తూర్పు పంజాబ్‌, రాజస్థాన్‌, సౌరాష్ట్ర, ట్రావెన్‌కోర్‌ కొచ్చిన్‌, వింధ్యప్రదేశ్‌.
3) పార్ట్‌ - C రాష్ట్రాలు: గతంలో చీఫ్‌ కమిషనరేట్‌ ప్రాంతాలుగా ఉన్నవాటిని, కొన్ని స్వదేశీ సంస్థానాలను ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 10. అవి అజ్మీర్‌, భోపాల్‌, బిలాస్‌పూర్‌ కూంచ్‌, కూచ్‌-బిహార్‌, కూర్గ్‌, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, కచ్‌, త్రిపుర, మణిపూర్‌.
4) పార్ట్‌ - D రాష్ట్రాలు: ఈ విభాగంలో అండమాన్‌ నికోబార్‌ దీవులను చేర్చారు.

రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌
1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటుచేయాలని ఉద్యమించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కర్ణాటకలోని బెల్గాంను సందర్శించినప్పుడు ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో తగిన సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం 1953 డిసెంబరులో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. దీనికి ఫజల్‌ అలీ ఛైర్మన్‌గా, కె.ఎం.పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ సభ్యులుగా వ్యవహరించారు. ఈ కమిషన్‌ తన నివేదికను 1955 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

సిఫారసులు:
* పార్ట్‌ - A, B, C, D లుగా ఉన్న రాష్ట్రాలన్నింటినీ రద్దుచేసి వాటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్‌ వ్యవస్థీకరించాలి.
* ఒకే భాష - ఒకే రాష్ట్రం అనే వాదన సమంజసం కాదు.
* దేశాన్ని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలి.
* పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతీయ మండళ్లు (Zonal Councils) గా ఏర్పాటుచేయాలి.
* దిల్లీలో జాతీయ మైనార్టీ భాషల కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలి.

పార్లమెంటు - రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం
ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫారసుల్లో కీలకమైన వాటిని 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత పార్లమెంటు ఆమోదించింది. దీంతో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ఏర్పడి, మన దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి.
1956లో ఏర్పాటైన రాష్ట్రాలు: అసోం, బెంగాల్‌, బిహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌, కేరళ, మైసూర్‌, ముంబయి, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌.
1956లో ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, అమోని, మినికాయ్‌, లాక్‌దీవులు, అండమాన్‌, నికోబార్‌ దీవులు, త్రిపుర, మణిపూర్‌.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భార‌త రాజ్యాంగ ల‌క్ష‌ణాలు

 ఒక దేశంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక పరిస్థితులు.. ఆ దేశ రాజ్యాంగ రచనపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిని ప్రతిబింబించే కొన్ని విశిష్ట లక్షణాలు ఆ రాజ్యాంగానికి ఉంటాయి. భారత రాజ్యాంగ నిర్మాణం కూడా నాటి చారిత్రక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల నేపథ్యంలో రూపొంది కొన్ని విశిష్ట లక్షణాలతో ఉంది. భారత రాజ్యాంగ లక్షణాలు, విశిష్టతలు, ప్రత్యేకతలను తెలిపే అధ్యయన సమాచారం పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం..
భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాల్లోనే అతి పెద్దదిగా అభివర్ణించవచ్చు. మొదటిసారి రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి ఇందులో 395 అధికరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. కాలానుగుణంగా పాలనా అవసరాల దృష్ట్యా రాజ్యాంగ సవరణ ప్రక్రియ ద్వారా కొత్త అధికరణలు చేర్చారు. కొన్ని తొలగించారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 465 అధికరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఇంత సుదీర్ఘంగా లిఖించడానికి వివిధ కారణాలున్నాయి. అవి:
* కేంద్ర ప్రభుత్వ నిర్మాణ వ్యవస్థ, అధికారాలు, విధులతోపాటు, రాష్ట్రాల నిర్మాణ వ్యవస్థకు సంబంధించిన అంశాలను కూడా వివరించడం.
* ప్రాథమిక హక్కులకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ.. వాటిని వివరణాత్మకంగా విశదీకరించి.. పరిమితులను కూడా పేర్కొనడం.
* సంక్షేమ రాజ్యం ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్య ప్రణాళికలకు మార్గదర్శకాలుగా ఆదేశిక సూత్రాలకు రూపకల్పన చేయడం.
* భారత రాజ్యాంగాన్ని లిఖించే నాటికి, ప్రపంచంలో అప్పటికే అమల్లో ఉన్న కొన్ని ప్రముఖ దేశ రాజ్యాంగాల నుంచి, అవి పనిచేసే తీరుతెన్నుల అనుభవాల నుంచి మన దేశానికి ఉపకరించే, అనువుగా ఉండే కొన్ని మంచి అంశాలను సేకరించి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇతర దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి వాటిలోని మంచి, ఉపయుక్తమైన అంశాలను సేకరించేందుకు రాజ్యాంగ పరిషత్తు సలహాదారుగా డాక్టర్ బెనగళ్ నరసింగరావును నియమించారు.

పార్లమెంటరీ ప్రభుత్వ విధానం
భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఏర్పరిచారు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ముఖ్య లక్షణం- కేంద్రంలో ప్రధానమంత్రి సారథ్యంలోని మంత్రి వర్గం, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సారథ్యంలోని మంత్రి వర్గం వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉండగా.. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్‌లు నామమాత్ర కార్యనిర్వహణాధికారులుగా ఉంటారు. ఈ విధానపు మరో ముఖ్య లక్షణం ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు అంతా 'సమష్టి బాధ్యత' సిద్ధాంతం ప్రాతిపదికన కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇదే విధానం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులకు వర్తిస్తుంది.

సార్వభౌమ, సర్వసత్తాక, ప్రజాస్వామ్య...
రాజ్యాంగ ప్రవేశికలో ప్రకటించినట్లుగా భారతదేశం సార్వభౌమ, సర్వసత్తాక, ప్రజాస్వామ్య, సామ్యవాద గణతంత్ర రాజ్యం. సార్వభౌమత్వం అంటే దేశం బాహ్యంగా ఎవరి ఆదేశాలకూ లోనుకాకుండా, అంతర్గతంగా తిరుగులేని అధికారంతో ఉండటం. భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 'సామ్యవాదం' అనే పదాన్ని ప్రవేశికలో చేర్చారు. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన నిర్మించే ప్రక్రియ. సామ్యవాద విధానంలో ఉత్పత్తి శక్తులను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

లౌకిక రాజ్యం
భారతదేశాన్ని మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యంగా రాజ్యాంగంలో పేర్కొన్నారు. లౌకిక రాజ్యంలో ప్రభుత్వం ఏ ఒక్క మతం పట్ల అనుకూల లేదా ప్రతికూల వైఖరి కలిగి ఉండదు. పరిపాలన వ్యక్తుల, మతాలకు అతీతంగా జరుగుతుంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 'లౌకిక' అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు.

దృఢ, అదృఢ లక్షణాల సమ్మిళితం
సమాఖ్య వ్యవస్థ ఉన్న రాజ్యం సాధారణంగా దృఢ రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. అంటే రాజ్యాంగ సవరణ ప్రక్రియ కఠినంగా ఉంటుంది. అయితే భారత రాజ్యాంగాన్ని దృఢ, అదృఢ సమ్మిళిత రాజ్యాంగంగా అభివర్ణించవచ్చు. రాజ్యాంగంలోని 368 అధికరణ పార్లమెంటుకు రాజ్యాంగ సవరణాధికారాలను కల్పించింది. దీని ప్రకారం రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతోనూ, మరికొన్ని అంశాలను 2/3వ వంతు మెజారిటీతో సవరించవచ్చు. అలాగే మరికొన్ని అంశాలను 2/3వ వంతు మెజారిటీతోపాటు సగానికి పైగా రాష్ట్రాల ఆమోదంతో సవరించవచ్చు.

ప్రాథమిక హక్కులు
భారత రాజ్యాంగంలో అత్యంత విశిష్టమైన అంశం ప్రాథమిక హక్కులు. రాజ్యాంగంలోని మూడో భాగంలోని 12-35 వరకు ఉన్న అధికరణాల్లో పౌరులకు / వ్యక్తులకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించారు. ఈ ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్య విధానానికి, రాజ్యాంగ ఔన్నత్యానికి ప్రతీకలు. మౌలికంగా రాజ్యాంగంలో మొత్తం 7 ప్రాథమిక హక్కులుండేవి. వీటిలో ఒకటైన ఆస్తిహక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగంలోనే వేరొక భాగంలో సాధారణ హక్కుగా పేర్కొన్నారు.

స్వతంత్ర న్యాయవ్యవస్థ
పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు.. అలాగే కేంద్ర, రాష్ట్రాలు; శాసన వ్యవస్థలు తమ రాజ్యాంగ పరిధిని అతిక్రమించకుండా పర్యవేక్షించేందుకు రాజ్యాంగం ఒక స్వతంత్ర న్యాయవ్యవస్థను రూపొందించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయసమీక్ష అధికారాన్ని కూడా కలిగి ఉంది.

ఆదేశిక సూత్రాలు
భారత రాజ్యాంగం మరో విశిష్ట లక్షణం సమీకృత రాజ్యాంగ ప్రవేశికలో ప్రకటించిన సమసమాజ స్థాపన. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే లక్ష్యాలను సాధించేందుకు రాజ్యాంగంలోని నాలుగో భాగంలో అధికరణాలు 36 నుంచి 51 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శక సూత్రాలు పొందుపరిచారు. అయితే ఇవి కేవలం మార్గదర్శకాలు మాత్రమే కావడంతో న్యాయ సంరక్షణ పరిధిలోకి రావు. అంటే వీటిని తప్పనిసరిగా పాటించాలని న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదు.

బలమైన కేంద్రం ఉన్న సమాఖ్య రాజ్యాంగం
భారత రాజ్యాంగం ఒక సమాఖ్య రాజ్యానికి ఉండే లక్షణాలైన లిఖిత రాజ్యాంగం, కేంద్ర-రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ, దృఢ రాజ్యం, స్వతంత్ర న్యాయవ్యవస్థ లాంటి లక్షణాలు కలిగి ఉన్నా.. సమాఖ్య రాజ్యంగా ఎక్కడా పేర్కొనలేదు. భారతదేశ చారిత్రక నేపథ్యం దృష్ట్యా, రాజ్యాంగాన్ని సంపూర్ణ సమాఖ్య రాజ్యాంగంగా వ్యవహరించకుండా ఒక రాష్ట్రాల యూనియన్‌గా ప్రకటించారు. అందుకే కె.సి.వియరే భారత రాజ్యాంగాన్ని 'అర్థ సమాఖ్య'గా, గ్రాన్‌విల్ ఆస్టిన్ 'సహకార సమాఖ్య' గాను అభివర్ణించారు.

సార్వజనీన వయోజన ఓటు హక్కు
ప్రజాస్వామ్యానికి ఆయువైన సార్వజనీన వయోజన ఓటు హక్కును రాజ్యాంగంలోని 326వ అధికరణ ద్వారా పౌరులకు కల్పించారు. భారత పౌరులందరికీ కుల, మత, వర్ణ, ప్రాంత, భాష, ఆస్తి, లింగ వివక్షతలు లేకుండా ఓటు హక్కు కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కుకు అర్హులుగా నిర్ణయించారు.

ప్రాథమిక విధులు
మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగంలోని 4ఎ భాగంలో అధికరణం 51-ఎ రూపంలో పొందుపరిచారు. ఈ అధికరణంలో పౌరులు పాటించవలసిన 11 ప్రాథమిక విధులను పేర్కొన్నారు.

ఏక పౌరసత్వం
భారత రాజ్యాంగం ఏక పౌరసత్వ విధానాన్ని మాత్రమే గుర్తించింది. అంటే అమెరికా, స్విట్జర్లాండ్ దేశాల్లో లాగా ద్వంద్వ పౌరసత్వ విధానం కాకుండా, భారతదేశంలోని ప్రజలు ఏక పౌరసత్వం కలిగి ఉంటారు. రాష్ట్రాల వారీ పౌరసత్వం ఉండదు.

అత్యవసర పరిస్థితి
భారత రాజ్యాంగం మరో ప్రత్యేక లక్షణం ఇది.. దేశ ఐక్యతకు, సమగ్రతకు, రక్షణకు, సార్వభౌమత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, రాజ్యాంగంలోని 18వ భాగంలోని అధికరణల (352 నుంచి 360)లో పైన పేర్కొన్న పరిస్థితులు తలెత్తినప్పుడు రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితిని విధించే ప్రత్యేక అధికారాలు ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం అత్యవసర పరిస్థితిని 3 రకాలుగా చెప్పవచ్చు. అవి.. జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణం 352), రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (అధికరణం 356), ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణం 360).

కేంద్ర-రాష్ట్రాల అధికార విభజన
భారత రాజ్యాంగం దేశాన్ని 'రాష్ట్రాల యూనియన్‌'గా ప్రకటించినప్పటికీ సమాఖ్య రాజ్యంలోలాగా కేంద్ర- రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ రాజ్యాంగపరంగా జరిగింది. అధికారాల పంపిణీకి సంబంధించి వివిధ అంశాలను మూడు జాబితాల్లో పేర్కొన్నారు. అవి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ మూడు జాబితాల వివరాలు రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ పరిణామ క్రమం

1. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861’కి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ. భారతీయులకు తొలిసారిగా శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.

బి. ఈ చట్టం రూపకల్పన సమయంలో భారతదేశ గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌గా లార్డ్‌ కారన్‌ వాలీస్‌ వ్యవహరించారు.

సి. గవర్నర్‌ జనరల్‌కు ‘ఆర్డినెన్స్‌’ను జారీచేసే అధికారాన్ని కల్పించారు.

డి. ‘పోర్ట్‌ఫోలియో’ విధానానికి చట్టబద్ధత కల్పించారు.

జ: ఎ, సి, డి 

2. రెగ్యులేటింగ్‌ చట్టం, 1773 ద్వారా రద్దుచేసిన ఏ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861 ద్వారా పునరుద్ధరించారు?

జ: బాంబే, మద్రాస్‌

3. ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861 ప్రకారం 1862లో మనదేశంలో మొదటి హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు?

జ: కలకత్తా 

4. కిందివాటిలో సరైనవి ఏవి?

1) 1859లో ‘సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’ను రూపొందించారు.

2) 1860లో ‘ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’ను రూపొందించారు.

3) 1861లో ‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’ను రూపొందించారు.

జ:  పైవన్నీ

5. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892’ ప్రకారం కేంద్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన భారతీయ సభ్యులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.

జ: లాలాలజపతిరాయ్, మోతీలాల్‌ నెహ్రూ

6. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892’కు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ. బడ్జెట్‌పై చర్చించే అవకాశాన్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు అడిగే అధికారాన్ని కౌన్సిల్‌ సభ్యులకు కల్పించారు.

బి. కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 10 మందికి తగ్గకుండా, 16 మందికి మించకుండా ఉండాలని నిర్దేశించారు.

సి. రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 8 మందికి తగ్గకుండా, 20 మందికి మించకుండా ఉండాలని పేర్కొన్నారు.

జ: ఎ, బి, సి

7. మింటో- మార్లే సంస్కరణల చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ. భారత రాజ్య కార్యదర్శిగా లార్డ్‌ మార్లే వ్యవహరించారు.

బి. గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌గా లార్డ్‌ మింటో వ్యవహరించారు.

సి. వైస్రాయ్‌ కార్యనిర్వాహక కౌన్సిల్‌ సభ్యుల సంఖ్యను 15కు పెంచారు.

డి. గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో మొదటి భారతీయుడిగా సత్యేంద్రప్రసాద్‌ సిన్హాకు ప్రాతినిధ్యం లభించింది.

జ: ఎ, బి, డి     

8. ఏ చట్టం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ పేరును ‘ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’గా మార్చారు?

జ:  ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1909

9. భారత్‌లో ‘ప్రత్యేక మత నియోజకవర్గాలను’ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?

జ: ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1909

10. భారత్‌లో ‘మతనియోజకవర్గాల పితామహుడి’గా ఎవరిని పేర్కొంటారు?

జ: లార్డ్‌ మింటో    

11. ‘గదర్‌’ పార్టీని స్థాపించింది ఎవరు?

జ: లాలా హరదయాళ్‌  

12. 1911లో ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి  మార్చారు?

జ: లార్డ్‌ హార్డింజ్‌-II

13. కేంద్ర శాసన వ్యవస్థలోకి ప్రవేశించిన స్వరాజ్య పార్టీ ఆంగ్లేయుల ముందు కింది ఏ డిమాండ్లను ఉంచింది?

ఎ. రాజకీయ ఖైదీలను విడుదల చేయడం.

బి. ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశ పెట్టడం.

సి. సివిల్, డిఫెన్స్‌ సర్వీసుల్లో భారతీయులకే అవకాశం కల్పించడం.

డి. భారతీయులకు స్వపరిపాలనను అందించడం.

జ:  ఎ, సి, డి     

14. 1924లో ఏర్పాటు చేసిన ఏ కమిటీ భారత్‌లో ద్వంద్వపాలనను సమర్థించింది?

జ: అలెగ్జాండర్‌ మడ్డీమాన్‌ కమిటీ

15. 1927లో సైమన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిన అప్పటి బ్రిటన్‌ ప్రధాని ఎవరు?

జ: బాల్డ్విన్‌

16. సైమన్‌ కమిషన్‌ భారత్‌లో మొదటిసారి ఎప్పుడు పర్యటించింది?

జ: 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 మధ్య 

17. బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల (సంస్థానాల) మధ్య సంతృప్తికరమైన ఆర్థిక సంబంధాలను సూచించడానికి 1927లో ఏర్పాటు చేసిన కమిటీ?

జ: బట్లర్‌ కమిటీ

18. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

జ‌: 1937, ఏప్రిల్‌ 1     

19. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’ ప్రకారం అధికారాల విభజనకు సంబంధించి సరికానిది ఏది?

1) ఫెడరల్‌ జాబితాలో 59 అంశాలు ఉన్నాయి.

2) రాష్ట్ర జాబితాలో 54 అంశాలు ఉన్నాయి.

3) అవశిష్ట జాబితాలో 29 అంశాలు ఉన్నాయి.

4) ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉన్నాయి.

జ‌:  అవశిష్ట జాబితాలో 29 అంశాలు ఉన్నాయి.

20. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’లోని సరైన అంశాన్ని గుర్తించండి.

ఎ) రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.

బి) రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనా విధానాన్ని కొనసాగించారు.

సి) కేంద్రంలో ద్విసభా విధానాన్ని కొనసాగించారు.

డి) కేంద్రంలో ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు.

జ‌:  ఎ, సి, డి

21. దిల్లీలో ఏర్పాటు చేసిన ‘ఫెడరల్‌ న్యాయ స్థానానికి’ మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వ్యవహరించారు?

జ‌: సర్‌ మారిస్‌ గ్వేయర్‌

22. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’లోని అంశానికి సంబంధించి సరికానిది?

1) కొత్తగా ఒడిశా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

2) భారతదేశం నుంచి బర్మాను వేరు చేశారు.

3) భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చారు.

4) రాష్ట్ర స్థాయిలో ‘అడ్వకేట్‌ జనరల్‌’ పదవిని ఏర్పాటు చేశారు.

జ‌:  భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చారు.

23. ‘‘మంచి వాహనానికి చక్కటి బ్రేకులు అమర్చి, ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మరచిపోయారు’’ అని భారత ప్రభుత్వ చట్టం, 1935పై వ్యాఖ్యానించింది ఎవరు?

జ‌:  జవహర్‌లాల్‌ నెహ్రూ 

Posted Date : 11-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం - స్వభావం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కింది వాక్యాల్లో సత్యమైన వాటిని గుర్తించండి.
(A) భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
(B) రాజ్యాంగంలోని 3వ, 4వ భాగాల మధ్య అనుసంధానం ఉండాలని మినర్వామిల్స్ కేసులో పేర్కొన్నారు.
(C) రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు న్యాయ సమీక్ష ఉంది.
(D) ప్రస్తుతం 7 ప్రాథమిక హక్కులు పౌరులకు అమల్లో ఉన్నాయి.
జ: A, B

2. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
 1) భారత ప్రభుత్వ చట్టం 1892 - ఎన్నికల నియమాలు
 2) భారత ప్రభుత్వ చట్టం 1909 - బాధ్యతాయుత ప్రభుత్వం
 3) భారత ప్రభుత్వ చట్టం 1919 - ప్రాదేశిక స్వాతంత్య్రం
 4) భారత ప్రభుత్వ చట్టం 1935 - రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం
జ: 1 (భారత ప్రభుత్వ చట్టం 1892 - ఎన్నికల నియమాలు)

3. కిందివాటిలో ఏ పదాల వరుస క్రమాన్ని భారత రాజ్యాంగ పీఠిక లో పొందుపరిచారు?
1) భారతదేశం ఒక ప్రజాస్వామ్య, స్వతంత్ర, సర్వసత్తాక, సౌభ్రాతృత్వ రాజ్యం
2) భారతదేశం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
3) భారతదేశం ఒక ప్రజాస్వామ్య, సర్వసత్తాక రాజ్యం
4) భారతదేశం ఒక స్వతంత్ర, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
జ: 2 (భారతదేశం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం)

4. మనదేశంలో ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి రాజ్యాంగబద్ద హక్కుగా మార్చారు ఎందుకంటే...
జ: ఆస్తిహక్కు న్యాయ వ్యవస్థ, పార్లమెంటుకు మధ్య వివాదాస్పదంగా మారడం వల్ల

5. ఫిబ్రవరి 21, 1948న రాజ్యాంగ సదస్సుకు సమర్పించిన భారత ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్, షెడ్యూల్స్ వరుసగా...
జ: 295, 8

6. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పరిపాలనను నియంత్రించడానికి ప్రవేశపెట్టిన బ్రిటిష్ మొదటి చట్టం ఏది?
జ: రెగ్యులేటింగ్ చట్టం - 1773

7. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ విధంగా రాశారు?
జ: భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగాన్ని మా రాజ్యాంగ అసెంబ్లీలో ఆమోదించి మా రాజ్యాంగాన్ని మాకు మేమే ఇస్తున్నాం.

8. భారతదేశంలో ప్రాథమిక హక్కులకు రక్షకుడు ఎవరు?
జ: సుప్రీంకోర్టు

9. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
జ: వార్న్‌హేస్టింగ్స్

10. కింది ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల మాగ్నాకార్టాగా పేర్కొంటారు?
1) క్రిప్స్ ప్రతిపాదన    2) విక్టోరియా రాణి ప్రకటన  
3) క్యాబినెట్‌మిషన్ ప్రతిపాదన   4) వేవెల్ ప్రతిపాదన
జ: 2 (విక్టోరియా రాణి ప్రకటన)

11. 1883 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో కిందివాటిలో లేనిది-
1) ఈస్టిండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాలను రద్దుచేసింది.
2) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది.
3) కౌన్సిల్ న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చింది.
4) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు.
జ: 4 (గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు)

12. భారత రాజ్యాంగ తయారీకి రాజ్యాంగసభ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1946, డిసెంబరు 6

13. కుల, మత ప్రాతిపదికగా ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసిన మొదటి చట్టం ఏది?
జ: ఇండియన్ కౌన్సిల్ చట్టం - 1909

14. క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశాన్ని దేనికోసం సందర్శించింది?
జ: రాజ్యాంగ సమస్యకు సరైన పరిష్కారం చూపడానికి

15. ఏ చట్టం ద్వారా భారతదేశ పాలనా వ్యవహారాలు ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి చేతికి వెళ్లాయి?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1858

16. 1949, నవంబరు 26వ తేదీన అమల్లోకి వచ్చిన రాజ్యాంగ నిబంధనలు ఏవి?
I) పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు
II) ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు
III) తాత్కాలిక పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు
IV) ప్రాథమిక హక్కులు
జ: I, II, III

17. కిందివాటిలో దేనికి ప్రభుత్వ శాఖలను వ్యవస్థీకరించే అధికారం ఉంది?
1) పార్లమెంటు       2) లోక్‌సభ        3) కార్యనిర్వాహక వర్గం       4) ఆర్థిక మంత్రిత్వ శాఖ
జ: 3 (కార్యనిర్వాహక వర్గం)

18. కిందివాటిలో ఏ దేశ రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగానికి ఉదాహరణ చెప్పవచ్చు?
1) అమెరికా       2) భారతదేశం       3) కెనడా       4) బ్రిటన్
జ: 1 (అమెరికా)

19. భారత రాజ్యాంగం ఏ తరహాకు చెందిన రాజ్యాన్ని ప్రకటిస్తుంది?
జ: ఏకీకృత, సమాఖ్య లక్షణాలున్న రాజ్యాంగం

20. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ-
జ: 1949, నవంబరు 26

21. భారత రాజ్యాంగం ముసాయిదా రచన మీద ప్రభావం చూపింది-
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935

22. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.

A) మొదటి షెడ్యూల్  I) ప్రమాణ స్వీకార విధానం
B) మూడో షెడ్యూల్       II) అధికార విభజన
C) ఏడో షెడ్యూల్   III) భారత దేశంలోని రాష్ట్రాల-కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక పరిధి
D) ఎనిమిదో షెడ్యూల్     IV) భాషలు

జ: A - III,  B - I,   C - II,  D - IV
 
23. భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో ఎవరికి అధికారం ఉంది?
జ: సుప్రీంకోర్టు

24. కెనడా రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగానికి గ్రహించిన అంశాలేవి?
1) సమాఖ్య పద్ధతి  2) భారత యూనియన్  3) కేంద్రానికి అవశిష్ట అధికారాలు  4) అన్నీ
జ: 4 (అన్నీ)

25. భారత రాజ్యాంగం మనదేశాన్ని ఏవిధంగా వర్ణించింది?
జ: రాష్ట్రాల కలయిక

26. వివిధ రాజ్యాంగాల నుంచి మన రాజ్యాంగానికి గ్రహించిన అంశాల్లో సరైన జతను గుర్తించండి.
 
I) రాజ్యాంగ సవరణ పద్ధతి   A) ఐర్లాండు
II) ఉమ్మడి జాబితా   B) జపాన్
III) చట్టం నిర్ధారించిన పద్ధతి       C) ఆస్ట్రేలియా
IV) రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం   D) దక్షిణాఫ్రికా

జ: I-D, II-C, III-B, IV-A
 
27. భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, భావాలను ప్రతిబింబించేది ఏది?
జ: రాజ్యాంగ ప్రవేశిక

28. కింది లక్షణాల్లో మన రాజ్యాంగం ఏ అంశాల్లో అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంది?
1) ప్రాథమిక హక్కులు  2) అధ్యక్ష పాలన  3) ఏకీకృత పాలన   4) ద్వంద్వ పౌరసత్వం
జ: 1 (ప్రాథమిక హక్కులు)

29. భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?
జ: కేశవానంద భారతి కేసు

30. కిందివాటిలో ఏకకేంద్ర లక్షణం కాని అంశాన్ని గుర్తించండి.
1) దేశం మొత్తానికీ ఒకే రాజ్యాంగం ఉండటం      
2) రాష్ట్రానికి, దేశానికి ఒకే పౌరసత్వం ఉండటం
3) గవర్నర్ నియామకం                             
4) అన్నీ సరైనవే
జ: 4 (అన్నీ సరైనవే)

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ ప్రవేశిక 

      మన రాజ్యాంగానికి ముందు మాటే ప్రవేశిక. రాజ్యాంగం లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలను ప్రవేశిక వివరిస్తుంది. రాజ్యాంగంలో స్థూలంగా, సుదీర్ఘంగా ఉన్న అంశాలను ఇందులో తాత్వికంగా పొందుపరిచారు. రాజ్య స్వభావాన్ని ఇది వివరిస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ ప్రవేశికలో గొప్ప పదజాలాన్ని, భావజాలాన్ని పొందుపరిచారు. ప్రవేశిక రాజ్యాంగానికి తాత్విక పునాదిగా పేర్కొనవచ్చు.
      'భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక (సార్వభౌమాధికార), సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రంగా ప్రకటిస్తున్నాం. భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, నమ్మకం, విశ్వాసం, ఆరాధనలో స్వేచ్ఛను, హోదా, అవకాశాల్లో సమానత్వాన్ని కల్పించి ప్రజలందరిలో సమైక్యతను అఖండతా భావాన్ని, సోదరభావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందిస్తామని, రాజ్యాంగ పరిషత్ ద్వారా ఈ 26 నవంబరు 1949న మాకు మేము రూపొందించుకుని సమర్పించుకుంటున్నాం'.

పై ప్రవేశిక వల్ల మనకు తెలుస్తున్న విషయాలు:
1. రాజ్యాంగ ఆధిక్యానికి ఆధారం: ప్రవేశిక ప్రకారం ఈ దేశంలో రాజ్యాంగ ఆధిక్యానికి, అధికారానికి ప్రజలే ఆధారం. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రజల వల్ల రూపొంది, ప్రజలు తమకు తాము సమర్పించుకున్నదని ప్రవేశికలో పేర్కొన్నారు.
2. రాజ్య స్వభావం: భారతదేశాన్ని ఒక సర్వసత్తాక (సార్వభౌమాధికార), సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మన ప్రవేశిక ప్రకటిస్తోంది.
3. రాజ్యాంగ ఆశయాలు: దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించడమే రాజ్యాంగ ఆశయంగా మనకు కనిపిస్తుంది.

సార్వభౌమాధికారం
      సార్వభౌమాధికారం అంటే రాజ్యం ఒక సర్వ స్వతంత్రమైన వ్యవస్థ అని అర్థం. అంతర్గతంగా భారత రాజ్యం వ్యక్తులందరిపై, సమూహాలన్నింటిపై, సంస్థలన్నింటిపై తన అధికారం కలిగి ఉంటుందని, బహిర్గతంగా ఏ ఒక్క రాజ్యం జోక్యాన్ని సహించదని అర్థం. అయితే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కామన్వెల్త్ సభ్యత్వం స్వీకరించాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది. నెహ్రూ అభిప్రాయం ప్రకారం కామన్వెల్త్ సభ్యత్వం వల్ల దేశ సార్వభౌమాధికారానికి ఎలాంటి ముప్పు వాటిల్లదు. అంతర్జాతీయ సహకారాన్ని ఇచ్చి పుచ్చుకునే తత్వాన్ని దేశాలు పెంపొందించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
* మన దేశంలా స్వతంత్య్రం సంపాదించుకున్న చాలా తృతీయ ప్రపంచ దేశాలకు ప్రచ్ఛన్న యుద్ధం (Cold war) రూపంలో పెద్ద సమస్య తలెత్తింది. అమెరికా, అప్పటి USSR మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధంలో పాలుపంచుకుని తమ దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టుపెట్టకూడదని నెహ్రూ (భారతదేశం), నాజర్ (ఈజిప్ట్), టిటొ (యుగోస్లేవియా), సుకర్ణో (ఇండోనేషియా) లాంటి తృతీయ ప్రపంచ నాయకులు అలీనోద్యమాన్ని (Non-AlignedMovement) తీసుకొచ్చారు. అగ్రరాజ్యాల సామ్రాజ్యవాద కాంక్షలను నిరోధిస్తూ తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ ప్రపంచ శాంతిని నెలకొల్పడం ఈ అలీనోద్యమ ధ్యేయం.

సామ్యవాదం
      ఆస్తిలోనూ, సామాజిక హోదాలోనూ హెచ్చుతగ్గులను నివారించడమే సామ్యవాదం ఉద్దేశం. 1917లో రష్యాలో లెనిన్ సామ్యవాద విప్లవం తీసుకొచ్చిన తర్వాత ఈ రాజకీయ భావజాలం ప్రపంచాన్ని, ముఖ్యంగా తృతీయ ప్రపంచ దేశాలను ఆకర్షించింది.
* 1929 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కేవలం పూర్వపు USSR మాత్రమే తట్టుకుని నిలబడగలిగింది. ఇది గమనించిన మన జాతీయోద్యమ నాయకులు సామ్యవాదం పట్ల ఆకర్షితులయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ వారిలో ప్రముఖులు. మన రాజ్యాంగ రచనలోనూ మనకు సామ్యవాద స్ఫూర్తి కనిపిస్తుంది. ఆదేశిక సూత్రాల్లో సామ్యవాద లక్షణాలను చేర్చారు.
* 'సామ్యవాదం' అనే పదం మన రాజ్యాంగ రచనా సమయంలో ప్రవేశికలో లేదు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాన్ని చేర్చారు. అంతవరకు రాజ్యాంగంలో ఉన్న ఒక అంశాన్ని, విలువను ఒక పదంగా ప్రవేశికలో చేర్చారు.
* 1955లోనే నెహ్రూ ఆవడిలో (ఇప్పటి చెన్నైకి సమీపాన ఉంది) జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 'సామ్యవాద సమాజం' కాంగ్రెస్ లక్ష్యంగా పేర్కొన్నారు. అయితే 1960, 1970 దశకాల్లో ఇందిరాగాంధీ తన రాజకీయ అవసరాల రీత్యా రాజకీయాలకు సామ్యవాద హంగు చేకూర్చారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాలను రద్దు చేయడం, గరీబీ హఠావో నినాదం ఇవ్వడం, ప్రవేశికలో 'సామ్యవాదం' అనే పదాన్ని జోడించటం లాంటి అంశాలను ఇందులో భాగంగానే పరిగణించాలి.

లౌకిక రాజ్యం 
      మత ప్రమేయం లేని రాజ్యాన్ని 'లౌకిక రాజ్యం' అంటారు. మత ప్రమేయం లేనిది అంటే ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించే అవకాశం కల్పించే రాజ్యవ్యవస్థ అని. మన రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో 25 నుంచి 28 వరకు ఉన్న అధికరణాలు మత స్వేచ్ఛ గురించి పేర్కొంటున్నాయి.
* 'లౌకిక' అనే పదాన్ని కూడా 1976లో (సామ్యవాదంలాగే) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు.
* లౌకికత (Secular) అనేది ఆధునిక రాజ్యవ్యవస్థకు ఉండాల్సిన ఒక తప్పనిసరి లక్షణం.
* మాకియవెల్లి లాంటి రాజనీతి శాస్త్రజ్ఞులు మతం నుంచి రాజకీయాలను వేరు చేయాలని గట్టిగా వాదించారు. తర్వాతి కాలంలో జాతీయ రాజ్యాల ఆవిర్భావానికి, పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడటానికి మధ్యయుగాల్లో రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడం ఒక పునాదిగా పేర్కొనవచ్చు.

ప్రజాస్వామ్యం 
      లౌకిక రాజ్యంలాగే ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా మనం పాశ్చాత్య దేశాల నుంచి అందిపుచ్చుకున్న గొప్ప అంశం. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో తొలుత ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థను నెలకొల్పినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో Democracy అంటారు. Demos అంటే ప్రజలు, Kratos అంటే పాలన. పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వం రాణిస్తుంది. అందుకే రూసో 'ప్రజా వాక్కే దైవ వాక్కు' అన్నారు.
* ఇంగ్లండ్ వలస పాలన వల్ల భారత జాతీయోద్యమ నాయకత్వానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం పట్ల అవగాహన ఏర్పడింది. ఇప్పుడు మన దేశమే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ ఓటు వేసేందుకు అర్హులు. (రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇది 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 18 సంవత్సరాలు చేశారు.)

గణతంత్రం 
      రాజ్యాధినేత వంశపారంపర్యంగా కాకుండా (ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ) ఎన్నికైతే అలాంటి రాజకీయ వ్యవస్థను గణతంత్రం అంటారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని సంరక్షించే మహత్తర బాధ్యత కలిగిన రాష్ట్రపతి ఒక ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నికవుతారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి (26 జనవరి 1950) భారతదేశం ఒక బ్రిటిష్ dominio (అధినివేశ ప్రతిపత్తి కలిగిన దేశం)గా కాకుండా ఒక గణతంత్ర రాజ్యంగా ఏర్పడిందని చెప్పొచ్చు.
 
న్యాయం 
      రాజ్యాంగ ప్రవేశిక ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలని ప్రవచిస్తోంది. రాజ్యాంగంలోని 38 (1)వ అధికరణం రాజ్యం ప్రజలందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయబద్ధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను నెలకొల్పాలని అభిప్రాయపడుతోంది.
* సామాజిక న్యాయం కోసం రాజ్యాంగంలో ఎన్నో అంశాలను పొందుపరిచారు.
ఉదా: 17వ అధికరణం అంటరానితనాన్ని నిషేధిస్తుంది.
* ప్రజలందరికీ ఆర్థిక న్యాయం అందాలనే ఉద్దేశంతో వెట్టిచాకిరిని నిషేధించారు. (24 వ అధికరణం)
* ప్రజలందరూ రాజకీయ కార్యకలాపాల్లో స్వేచ్ఛగా పాల్గొంటేనే రాజకీయ న్యాయం సాధించినట్లు. 325 వ అధికరణం ఏ వ్యక్తి అయినా రాజకీయ హక్కుల వినియోగంలో ఎలాంటి మత, జాతి, లింగ వివక్షకు గురికాకూడదని అభిప్రాయపడుతోంది.

స్వేచ్ఛ 
      1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవ నినాదాల్లో 'స్వేచ్ఛ' ముఖ్యమైంది. లాటిన్ పదమైన Liber నుంచి Liberty అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. Liberty (స్వేచ్ఛ) అంటే బానిసత్వం, నియంతృత్వం, నియంత్రణ నుంచి విముక్తి. ప్రజల రోజువారీ జీవితాల్లో ప్రభుత్వ నియంత్రణ, జోక్యం ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని ఉదారవాదులు (స్వేచ్ఛావాదులు) విశ్వసిస్తారు.
* ప్రాథమిక హక్కుల్లో 19 నుంచి 22వ అధికరణం వరకు స్వేచ్ఛా హక్కులను రాజ్యాంగం ప్రతిపాదిస్తోంది.
* 19వ అధికరణం పౌరులకు ఆరు రకాల స్వాతంత్య్రాలను కల్పిస్తోంది. అవి ఉపన్యాస, భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, స్థిర నివాసం ఏర్పరుచుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు, నచ్చిన వృత్తిని, వ్యాపకాన్ని ఎంచుకునే స్వేచ్ఛ.

సమానత్వం 
      ఇది కూడా ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి నినాదం. 'సమానత్వం' అంటే సమానమైన అవకాశాల కల్పన. భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ సమానమైన హక్కులు కల్పించారు. అలాగే ఒక వ్యక్తి లేదా ఒక వర్గం వేరొకరిని పీడించేందుకు వీల్లేదు. రాజ్యాంగం 14 నుంచి 18వ అధికరణం వరకు సమానత్వ హక్కుల గురించి పేర్కొంటోంది. ముఖ్యంగా ఇక్కడ 14వ అధికరణం గురించి చెప్పుకోవాలి. 'చట్టం ముందు అందరూ సమానమే' అని ఈ అధికరణం స్పష్టం చేస్తోంది. ఈ భావనను బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
 
సౌభ్రాతృత్వం 
      స్వేచ్ఛ, సమానత్వంలా ఇది కూడా ఫ్రెంచ్ విప్లవ నినాదమే. సౌభ్రాతృత్వం అంటే సోదరభావం. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం సౌభ్రాతృత్వం పౌరుల్లో జాతీయ ఐక్యత, సమగ్రతా భావాన్ని నింపుతూనే వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఉండాలి. ఇక్కడ సమగ్రత అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అలాగే రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల్లో (51 - A అధికరణం) 5వ అంశం మత, భాష, ప్రాంతీయ వర్గ విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించాలని చెబుతోంది.
 
ప్రవేశిక విశిష్టత 
* ఎర్నెస్ట్ బార్కర్ అనే ప్రముఖ రాజనీతి తత్వవేత్త మన రాజ్యాంగ ప్రవేశికను 'Principles of Social and Political Theory' అనే తన పుస్తకానికి తొలి పలుకుగా ఉపయోగించారు.
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన ఎం. హిదయతుల్లా ప్రవేశిక మన రాజ్యాంగానికి ఆత్మ లాంటిదని పేర్కొన్నారు.
* మహావీర్ త్యాగి లాంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొన్నారు. అలాగే 1960లో సుప్రీంకోర్టు బేరూ-బారీ వివాదంలో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని వివరించింది. అయితే కేశవానంద భారతి వివాదంలో (1978) ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదే విషయాన్ని ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వివాదంలో (1995) మరోసారి పునరుద్ఘాటించింది.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ ప్రవేశిక - మూలతత్వం

   భారత రాజ్యాంగం ప్రవేశిక (Preamble)తో ప్రారంభమవుతుంది. దీన్ని రాజ్యాంగానికి మూలతత్వం, ఉపోద్ఘాతం, ఆత్మ, పీఠికగా పేర్కొంటారు. 1946, డిసెంబరు 13న రాజ్యాంగ పరిషత్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన చారిత్రక లక్ష్యాలు, ఆశయాల తీర్మానం మన రాజ్యాంగ ప్రవేశికకు మూలంగా చెప్పవచ్చు.

   మనదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పునాదులను ఆధారం చేసుకుని, భవిష్యత్తులో మన రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు, ఆశయాలను రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు. ప్రవేశిక భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి దిక్సూచిలా ఉపయోగపడటమే కాకుండా, రాజ్యాంగ తాత్విక పునాదులను వెల్లడిస్తుంది.

ప్రవేశికకు ప్రేరణను అందించిన అంశాలు
* అమెరికా విప్లవం - రాజ్యాంగ ప్రవేశికను అమెరికా నుంచి గ్రహించాం.
* ప్రవేశికకు మూలాధారమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే భావనలను ఫ్రెంచి విప్లవం నుంచి తీసుకున్నాం.

* సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలను రష్యా విప్లవం నుంచి సంగ్రహించాం.
* జవహర్‌లాల్ నెహ్రూ అందించిన 'చారిత్రక లక్ష్యాల, ఆశయాల తీర్మానం' రాజ్యాంగ రూపకర్తలకు ప్రవేశికను రూపొందించడంలో దిక్సూచిలా పనిచేసింది.

ప్రవేశికలోని సారాంశం
  భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వాసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం ఆరాధనల్లో స్వాతంత్య్రాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, అఖండతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి సత్యనిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని 26 నవంబరు, 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.

ప్రవేశిక - అర్థ వివరణ
  భారత రాజ్యాంగ ప్రవేశికను ప్రొఫెసర్ జె.ఆర్. శివాక్ 'నాలుగు' విభాగాలుగా విభజించి అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నారు. అవి:

1. అధికారానికి మూలం:
  భారత ప్రజలమైన మేము చిత్తశుద్ధితో ఈ రాజ్యాంగాన్ని రూపొందించి, అంగీకరించి, చట్టరూపంగా మాకు మేము సమర్పించుకుంటున్నాం. దీని ప్రకారం భారత రాజ్యాంగం ప్రజలకు బాధ్యత వహించే వ్యవస్థను రూపొందించింది. అన్ని ప్రభుత్వ వ్యవస్థల అధికారానికి మూలం 'ప్రజలు'.

2. ప్రభుత్వ స్వరూపం: 'సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర'గా పేర్కొన్నారు.

సార్వభౌమాధికారం:
   భారతదేశం 1947, ఆగస్టు 15న సర్వస్వతంత్ర దేశంగా అవతరించింది. దీని ప్రకారం మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదు. మనదేశం కామన్వెల్త్ దేశాల కూటమిలో సభ్యత్వం పొందినప్పటికీ జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఆ కూటమి నుంచి స్వచ్ఛందంగా మనం బయటకు వచ్చేయొచ్చు. ప్రపంచ దేశాలతో స్నేహం, శాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం ఐక్యరాజ్యసమితి (UNO)లో మనం సభ్యత్వం తీసుకున్నాం. అంతర్జాతీయ సంస్థల్లో భారతదేశం సభ్యత్వం తీసుకున్నప్పటికీ భారతదేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ఆటంకం ఉండదు.

సామ్యవాదం
   1955లో మద్రాసు సమీపంలోని ఆవడి వద్ద జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాద తరహా ప్రజాస్వామ్యం తమ లక్ష్యం అని మన తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికను సవరించి 'సామ్యవాద' అనే పదాన్ని రాజ్యాంగానికి చేర్చింది. దీన్ని సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నారు. 'సామ్యవాదం' అంటే ఆర్థిక న్యాయాన్ని, సమానత్వాన్ని సాధించి, వనరులను సామాజిక ప్రయోజనాలకు వినియోగించడం.
1982లో సుప్రీంకోర్టు డి.ఎస్.నకార Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునిస్తూ, ఆర్థిక, సాంఘిక, జీవన ప్రమాణాల అసమానతలను రూపుమాపడం, కార్మికులందరికీ పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు సరైన జీవన ప్రమాణాన్ని సమకూర్చడమే 'సామ్యవాద లక్ష్యం' అని పేర్కొంది.

లౌకికతత్వం:
   ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లౌకిక (Secular) అనే పదాన్ని రాజ్యాంగానికి చేర్చింది. మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు. దీని ప్రకారం రాజ్యానికి అధికార మతం ఉండదు. మత వ్యవహారాల్లో రాజ్యం తటస్థంగా ఉంటుంది. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ ధనసహాయం పొందే విద్యాలయాల్లో మతబోధన నిషేధం. మనదేశం అనాదికాలం నుంచి మతసామరస్యాన్ని అనుసరిస్తుంది. భారతదేశం బౌద్ధ, జైన మతాలకు పుట్టినిల్లు. విభిన్న మతాలు మనదేశంలో వర్థిల్లుతున్నాయి.
   ఎస్.ఆర్.బొమ్మైVs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ లౌకికతత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక లక్షణమని పేర్కొంది.

ప్రజాస్వామ్యం
  అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యం అంటే 'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం'. ఆర్టికల్ 326 ప్రకారం మనదేశంలో 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ కుల, మత, జాతి, వర్గ, లింగ వివక్షతో సంబంధం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఎన్నికలు నిర్వహించి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రజల విశ్వాసం మేరకే ప్రభుత్వాల మనుగడ కొనసాగుతుంది. దీనిలో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ప్రజలు పౌరులుగా ఎదుగుతారు.

  ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 1952లో జరిగిన తొలి లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో 17.32 కోట్లమంది ఓటర్లు ఉండగా, 2014 నాటి 16వ లోక్‌సభ ఎన్నికల నాటికి వారి సంఖ్య 83 కోట్లకు చేరింది.
 
గణతంత్ర రాజ్యం:
భారతదేశం 1950, జనవరి 26న గణతంత్ర రాజ్యంగా (Republic) అవతరించింది. దీని ప్రకారం సర్వోన్నతాధికారం ప్రజలకు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు ఉంటుంది. రాజ్యాధినేత వారసత్వంగా కాకుండా, నిర్ణీత పదవీకాలానికి ప్రత్యక్ష లేదా పరోక్ష పద్థతిలో ఎన్నిక అవుతాడు.
ఉదా: భారత రాజ్యాధినేత రాష్ట్రపతిని నిర్ణీత పదవీ కాలానికి ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది.

3. రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు:
    ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. సంఘ శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం వీటి లక్ష్యం.
    సామాజిక న్యాయాన్ని సాధించే అంశాలను - ప్రాథమిక హక్కుల్లోనూ
    ఆర్థిక న్యాయాన్ని సాధించే అంశాలను - ఆదేశిక సూత్రాల్లోనూ
    రాజకీయ న్యాయాన్ని సాధించే అంశాలను - ఎన్నికల ప్రక్రియలోనూ పొందుపరిచారు.

4. చట్టం అమల్లోకి వచ్చిన తేది:
1949 నవంబరు, 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950, జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది.

కీలకమైన ఆదర్శాలు

స్వేచ్ఛ (Liberty)
   ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో స్వేచ్ఛ కీలకమైంది. ప్రతి పౌరుడికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో 6 రకాల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను పొందుపరిచారు.

సమానత్వం (Equality)
 పుట్టుకతో మానవులంతా సమానమే. అన్ని రకాల అసమానతలను, వివక్షలను రద్దు చేసి ప్రతి వ్యక్తి తనను తాను అభివృద్ధి పరచుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడమే సమానత్వం.

సౌభ్రాతృత్వం ((Fraternity)
 సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర సోదర భావం, గౌరవ భావం ఉండాలి. 1948, డిసెంబరు 10న ఐరాస విశ్వ మానవ హక్కుల ప్రకటనలో పేర్కొన్న సౌభ్రాతృత్వ భావన ఆధారంగా సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సౌభ్రాతృత్వం అనే భావనను ప్రవేశికలో పొందుపరిచాలని ప్రతిపాదించారు. రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 51 ప్రకారం ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని, స్నేహ భావాన్ని పెంపొందించడానికి కృషి జరుగుతుంది.

జాతీయ ఐక్యత, సమగ్రత (Unity and Integrity)
  దేశంలోని ప్రజలందరూ కలిసి ఉండటానికి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, జాతీయ ఐక్యత తప్పనిసరి.
  సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశికలో పొందుపరిచింది. సమగ్రత ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందిస్తుంది.
  మన దేశంలో 1970వ దశకంలో అనేక ప్రాంతాల్లో ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తాయి. వీటి ఫలితంగా సమగ్రత అనే పదాన్ని ప్రవేశికకు చేర్చారు. దీని ప్రకారం భారత సమాఖ్య నుంచి ఏ ఒక్క ప్రాంతం లేదా రాష్ట్రం విడిపోవడానికి వీల్లేదు. ఐక్యత, సమగ్రతల ప్రధాన లక్ష్యం వేర్పాటువాదాన్ని ఖండించడం.
ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా? కాదా?

బెరుబారి కేసు - 1960
  బెరుబారి అనేది భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న ఒక ప్రాంతం. ఈ భాగాన్ని భారత్ - పాకిస్థాన్ మధ్య మార్పిడి విషయంలో వచ్చిన విభేదాల విషయమై అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆర్టికల్ 143(1) ప్రకారం సుప్రీంకోర్టు సలహాను కోరారు. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

కేశవానంద భారతి కేసు Vs కేరళ రాష్ట్రం - 1973
  ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పేర్కొంది. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చునని, అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకూడదని పేర్కొంది. న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని మౌలిక అంశంగా సుప్రీంకోర్టు పేర్కొంది.

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసు - 1995
  ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పునరుద్ఘాటించింది.

ప్రవేశికపై సమీక్ష
  రాజ్యాంగ ప్రవేశికకు న్యాయస్థానాల రక్షణ లేదు. ప్రవేశికలో పొందుపరిచిన ఆశయాలు, లక్ష్యాలు స్వతంత్రంగా అమల్లోకి రావు. వాటి అమలు కోసం పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. అయితే రాజ్యాంగాన్ని సక్రమంగా వాఖ్యానించడానికి ప్రవేశికలోని సారాంశాన్ని న్యాయస్థానాలు ప్రాతిపదికగా తీసుకుంటాయి.

రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు:
 ''ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగానికి ఆత్మ, రాజ్యాంగానికి బంగారు ఆభరణం, రాజ్యాంగానికి తాళం చెవి లాంటిది" - పండిట్ ఠాకూర్‌దాస్ భార్గవ.
* ''ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ లాంటిది" - డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
* ''ప్రవేశిక అనేది మన కలలకు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం" - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్.
* ''ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది" - జె.డయ్యర్
* ''ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక (key note) లాంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇవి భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను" - ఎర్నెస్ట్ బార్కర్
* ''ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు" - మహావీర్ త్యాగి
* ''ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం" - డాక్టర్ బాబురాజేంద్రప్రసాద్
* ''ప్రవేశిక రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది" - ఎమ్.ఎ.నానీ పాల్కీవా
* ''భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వంతంత్ర ప్రకటనలా రాజ్యాంగ ఆత్మ, ప్రాణం, రాజకీయ వ్యవస్థ, స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు" - జస్టిస్ హిదయతుల్లా
* ''రాజ్యాంగ ప్రధానాంశాల లక్షణ సారం" - ముధోల్కర్
* ''అమెరికా స్వతంత్ర ప్రకటనకు, అమెరికా రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం ఉందో అదేవిధమైన సంబంధం భారత రాజ్యాంగ ప్రవేశికకు, భారత రాజ్యాంగానికి మధ్య ఉంది" - కె.ఆర్. బాంజ్‌వాలా
* ''ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం, హామీ" - జవహర్‌లాల్ నెహ్రూ

ప్రవేశికలోని ప్రధాన పదాలకు వర్తించే భాగాలు, ప్రకరణలు
* సంక్షేమ స్వభావం - 4వ భాగంలోని ఆదేశిక సూత్రాలు
* లౌకికతత్వం - 3వ భాగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న ప్రకరణలు మత స్వాతంత్య్రాన్ని ప్రాథమిక హక్కుగా, లౌకిక భావనలను పెంపొందించడానికి వీలుగా హామీ ఇస్తున్నాయి.
* ప్రజాస్వామికత - 15వ భాగంలోని ఆర్టికల్ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కును, నిర్ణీత కాలానికి ఎన్నికలను జరపడాన్ని తెలియజేస్తుంది.
* గణతంత్ర - 5వ భాగంలోని ఆర్టికల్ 54 ప్రకారం ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నికైన రాష్ట్రపతి దేశాధినేతగా ఉంటారు.
* భావ ప్రకటనా స్వేచ్ఛ - 3వ భాగంలోని ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రాలను కల్పించారు.
* విశ్వాసం, నమ్మకం, ఆరాధనా స్వేచ్ఛ - 3వ భాగంలోని ఆర్టికల్ 25లోని మత స్వాంతంత్య్రాపు హక్కు వీటిని కల్పిస్తుంది.
* హోదా, అవకాశాల్లో సమానత్వం - ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే.
* ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, జాతి, వర్గ, లింగ వివక్షలకు వ్యతిరేకంగా రక్షణ
* ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు
* ఆర్టికల్ 39 ప్రకారం సమాన పనికి సమాన వేతనం
* ఆర్టికల్ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కు
* వ్యక్తి గౌరవం - సౌభ్రాతృత్వం - 3వ భాగంలోని ప్రాథమిక హక్కులు వ్యక్తి గౌరవానికి హామీ ఇస్తున్నాయి.
* 4వ భాగంలోని ఆర్టికల్ 51 (ఇ) - భారత ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించి సోదర భావాన్ని కల్పిస్తుంది.
* ఆర్టికల్ 42 - పనిచేసేచోట సరైన పని పరిస్థితులు కల్పించడం.
* ఆర్టికల్ 43 - గౌరవంతో కూడిన జీవనం, విశ్రాంతితో కూడిన ఉపాధి.

ప్రవేశికను సవరించగలమా?
  1973 నాటి కేశవానంద భారతి కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని పేర్కొంది. ఇంతవరకు రాజ్యాంగ ప్రవేశికను ఒకే ఒక్కసారి సవరించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశికను సవరించి సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చింది.
ప్రవేశికకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు, వాటి సారాంశం

ఎ.కె.గోపాలన్ కేసు - 1950
* ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్థాన్ని, పరిధిని నియంత్రిస్తుంది.

బెరుబారి యూనియన్ కేసు - 1960:
* ప్రవేశిక రాజ్యాంగంలోని అంతర్భాగం కాదు.

గోలక్‌నాథ్ కేసు: 1967
* ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలు, ఆశయాలకు సూక్ష్మరూపం.

కేశవానందభారతి కేసు: 1973
* ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. ఇది మౌలిక నిర్మాణం పరిధిలోకి వస్తుంది.

ఎక్సెల్‌వేర్ కేసు: 1979
* ప్రవేశికలోని సామ్యవాద పదానికి నిర్వచనాన్ని ఇచ్చింది.

మినర్వా మిల్స్ కేసు : 1980
* ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పునరుద్ఘాటించింది.

డి.ఎస్. నకారా కేసు: 1983
* సామ్యవాదం అనేది గాంధీయిజం, మార్క్సిజంల కలయిక.

ఎస్.ఆర్. బొమ్మై కేసు: 1994
* లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసు: 1995
* ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పునరుద్ఘాటించింది.

అశోక్ కుమార్ గుప్తా కేసు: 1997
* సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కు.
* అన్ని మతాల పట్ట సమాన దృక్పధాన్ని కలిగి ఉంటుంది. ఏ మతానికి ప్రత్యేక ఆదరణ కల్పించదు.

ఇందిరాగాంధీ Vs రాజ్‌నారాయణ కేసు: 1975
* ప్రవేశికలోని చట్ట సమానత్వం మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా ఉంటుంది.

పాల్ Vs కొచ్చిన్ యూనివర్సిటీ కేసు
ప్రవేశికలో పొందుపరిచిన అంశాలన్నీ మనకు మార్గదర్శకాలే అయినందున ప్రవేశికను మన రాజ్యాంగానికి మార్గదర్శకంగా భావించవచ్చు.

చరణ్ లాల్ సాహు Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలను ప్రత్యక్షంగా అమలుపరచడం సాధ్యం కాదు. వాటిని అమలు చేయాలంటే ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలను రూపొందించి అమలు చేయాలి.

ఎస్.లింగప్ప Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
సామాజిక న్యాయం అనే అంశం సకారాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటుంది. మన దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు చేయాలి.

అరుణారాయ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* భారతదేశం అనుసరించే లౌకిక విధానం సకారాత్మకమైంది. వివిధ మత ప్రవక్తలకు సంబంధించిన భావాలను పాఠ్య ప్రణాళికలో పొందుపరచడం తప్పేమీ కాదు.

వాసుదేవ్ Vs వామన్‌జీ కేసు
* మన రాజ్యాంగంలోని లౌకికవాదం అనే భావన సకారాత్మకమైంది. అంటే అన్ని మతాల పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఏ మతానికి ప్రత్యేక ఆదరణ కల్పించదు.

కామన్ కాజ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:
 దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా, ప్రైవేటీకరణ కారణంగా సామ్యవాద పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదు.

సహజ న్యాయ సిద్ధాంతం
* సహజ న్యాయం వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలని జస్టిస్ పి.డి.దినకర్ Vs జడ్జస్ ఎంక్వైరీ కమిటీ మధ్య జరిగిన వ్యాజ్యంలో 2011లో సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
''భారత రాజ్యాంగం ఎదుర్కొనే సమస్యలను ప్రవేశిక అనే వెలుగులో పరిష్కరించుకోవాలి" - జస్టిస్ హిదయతుల్లా

రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం
1967 నాటి గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆర్టికల్ 368 ప్రకారం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, వాటిని సవరించాలంటే ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ తీర్పునాటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు. ఈ తీర్పును అధిగమించడానికి పార్లమెంటు 1971లో 24వ రాజ్యాంగ సవరణను చేసింది.

1973 నాటి కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు:
1973 నాటి కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది. ఈ తీర్పునే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రవచించిన కేసుగా ప్రస్తావిస్తారు. ఈ తీర్పునాటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం.సిక్రి.

ఈ కేసు సందర్భంగా మౌలిక స్వరూప లక్షణాలను కింది విధంగా పేర్కొన్నారు:
* రాజ్యాంగ ఆధిక్యం
* ప్రజాస్వామ్య, గణతంత్ర ప్రభుత్వం
* రాజ్యాంగ పరంగా లౌకిక స్వభావం
* శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య అధికార పృథక్కరణ
* సమాఖ్య లక్షణం
* వైయక్తిక స్వేచ్ఛ
* భారతదేశ సార్వభౌమాధికారం, ఏకత్వం
* ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయ వ్యవస్థను కలిగి ఉండటం.
* రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించి 1980 నాటి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కింది అంశాలను మౌలిక స్వరూప లక్షణాలుగా పేర్కొన్నారు.
* పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణాధికారం
* న్యాయసమీక్ష
* ప్రాథమిక హక్కులు, ఆదేశసూత్రాలు మధ్య సమతౌల్యం
* రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని మొదట ప్రవేశపెట్టింది సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు (1965) లో జస్టిస్ జనార్ధన్ రఘునాథ్ ముధోల్కర్.
* ఐ.ఆర్.కొయల్హో Vs తమిళనాడు కేసు (2007)లో కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడిన తర్వాత IXవ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాల రాజ్యాంగ బద్ధతను న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చునని పేర్కొంది.
* 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్లమెంటు సుప్రీంకోర్టు ఉన్న న్యాయసమీక్ష అధికారంపై పరిమితులు విధించింది. దీన్ని సవాల్ చేస్తూ 1980లో మినర్వా మిల్స్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయ సమీక్షాధికారాన్ని పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు లేదని 42వ రాజ్యాంగ సవరణలోని ఆ అంశాన్ని కొట్టివేసింది. న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది.
* వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా కింది అంశాలను అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
* జాతి ఐక్యత, సమగ్రత
* న్యాయసమీక్ష
* రాజ్యాంగ సంక్షేమ స్వభావం
* రాజ్యాంగ లౌకికత్వం
* రాజ్యాంగ ఆధిక్యం
* నిష్పక్షపాత ఎన్నికలు
* సార్వభౌమ, గణతంత్ర, ప్రజాస్వామ్య వ్యవస్థ
* పార్లమెంటరీ వ్యవస్
* రాజ్యాంగ సమాఖ్య స్వరూపం
* సామాజిక, ఆర్థిక న్యాయం
* స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ
* హేతుబద్ధత
* శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య అధికార పృథక్కరణ
* వ్యక్తి స్వేచ్ఛ, ఆత్మగౌరవం
* న్యాయాన్ని పొందే హక్కు
* ప్రాథమిక హక్కులు, నిర్ధేశిత నియమాల మధ్య సమన్వయం
* సమానహోదా, సమాన అవకాశాలు
* వైయక్తిక స్వేచ్ఛ
* ఇందిరాగాంధీ Vs రాజ్‌నారాయణ్ కేసు (1975)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయస్థానం ముందుకు వచ్చిన కేసును బట్టి రాజ్యాంగ మౌలిక లక్షణం నిర్ణయించబడుతుందని పేర్కొంది.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం స్వభావం

రాజ్యాంగం అంటే
ఒక దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టం. దీనిలో ప్రభుత్వ విభాగాలు, దాని స్వరూపం, స్వభావం, లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. రాజ్యాంగం అనేది లేకపోతే పాలనా వ్యవస్థ అదుపు తప్పి అరాచక, అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది.

రాజ్యాంగం - మూలాలు
ప్రపంచంలో రాజనీతిని శాస్త్రీయంగా మొదటిసారిగా అధ్యయనం చేసినవారు గ్రీకు దేశీయులు. రాజనీతిశాస్త్ర పితామహుడు, గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ 158 రాజ్యాంగాలను విస్తృతంగా అధ్యయనం చేసి రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించి, వివరించాడు.

ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం. అయితే ఇది పరిణామాత్మక రాజ్యాంగం. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగం అవతరించింది. రాజ్యాంగాన్ని సవరించడానికి అనుసరించే పద్ధతుల ఆధారంగా దాన్ని దృఢ, అదృఢ రాజ్యాంగంగా పేర్కొంటారు.

దృఢ రాజ్యాంగం
ఏదైనా రాజ్యాంగాన్ని ప్రత్యేక మెజార్టీ ద్వారా అంటే 2/3వ లేదా 3/4వ వంతు మెజారిటీతో సవరించేది. ఈ విధానంలో రాజ్యాంగ సవరణ కఠినం. దీనికి ఉదాహరణ అమెరికా రాజ్యాంగం.

అదృఢ రాజ్యాంగం
ఏదైనా రాజ్యాంగాన్ని సాధారణ మెజార్టీ ద్వారా సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. దీనికి ఉదాహరణ బ్రిటిష్ రాజ్యాంగం.
రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముందుగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్. ప్రపంచంలో మొదటిసారిగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు క్రీ.శ.1787 నాటి అమెరికాలోని

ఫిలడెల్ఫియా కన్వెన్షన్.
మన దేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును తొలిసారిగా ప్రతిపాదించిన భారతీయుడు ఎమ్.ఎన్. రాయ్ (1934) కాగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును ప్రతిపాదించిన తొలి రాజకీయ పార్టీ స్వరాజ్యపార్టీ. 1942 నాటి క్రిప్స్ మిషన్ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును అధికారికంగా ప్రతిపాదించింది. 1918 డిసెంబరులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారతీయ ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

గాంధీజీ అభిప్రాయం
గాంధీజీ 1922, జనవరి 5న యంగ్ ఇండియా అనే పత్రికలో ''స్వరాజ్ అనేది బ్రిటిష్‌వారు ఇచ్చే భిక్షకాదు, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదు" అని అన్నారు. 'రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించగలదు' అని పేర్కొన్నారు. 1937లో ఫైజాపూర్ వద్ద జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు డిమాండ్ చేశారు.

రాజ్యాంగ అభివృధ్ధి క్రమం
భారత రాజ్యాంగ అభివృధ్ధి క్రమాన్ని బి.సి. రావత్ అనే పండితుడు 6 దశలుగా అధ్యయనం చేయవచ్చని పేర్కొన్నాడు. అవి:
    1. మొదటి దశ: క్రీ.శ.1600 నుంచి 1773 వరకు
    2. రెండో దశ: క్రీ.శ.1773 నుంచి 1858 వరకు
    3. మూడో దశ: క్రీ.శ.1858 నుంచి 1909 వరకు
    4. నాలుగో దశ: క్రీ.శ.1909 నుంచి 1935 వరకు
    5. అయిదో దశ: క్రీ.శ.1935 నుంచి 1947 వరకు
    6. ఆరో దశ: క్రీ.శ.1947 నుంచి 1950 వరకు

మొదటి దశ: క్రీ.శ.1600 నుంచి 1773 వరకు
క్రీ.శ.1600 డిసెంబరు 31న ఎలిజబెత్ మహారాణి అనుమతితో బ్రిటన్‌కు చెందిన ప్రైవేట్ వర్తకుల సంఘం ఈస్టిండియా కంపెనీ పేరుతో మన దేశంలో వర్తక, వాణిజ్యం నిర్వహించుకునే అవకాశాన్ని దక్కించుకుంది.
ఈస్టిండియా కంపెనీ తన అధికార విస్తరణలో భాగంగా క్రీ.శ.1773 నాటికి 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంది.
అవి: 1) మద్రాసు
     2) బొంబాయి
     3) బెంగాల్
క్రీ.శ.1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులు ఘన విజయం సాధించి, భారత్‌లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశారు. క్రీ.శ.1764లో జరిగిన బక్సార్ యుద్ధంలో విజయం సాధించిన ఆంగ్లేయులు మొగల్ చక్రవర్తి నుంచి దివానీ హక్కులు పొందారు. ఈస్టిండియా కంపెనీ భారీగా అవకతవకలకు పాల్పడేది.
ఈస్టిండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని వెలికితీయడానికి జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన బ్రిటిష్ ప్రభుత్వం ఒక రహస్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈస్టిండియా కంపెనీలో భారీగా అవినీతి జరగుతుందని పేర్కొంటూ భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ కార్యక్రమాలను క్రమబద్ధం చేయాలని సిఫారసు చేసింది. ఈ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని చేసింది.

రెండో దశ: 1773 నుంచి 1858 వరకు
రెగ్యులేటింగ్ అంటే క్రమబద్ధం చేయడం అని అర్థం. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి మనదేశంలో బ్రిటిష్‌వారు మొదటగా చేసిన చట్టం ఇది.

రెగ్యులేటింగ్ చట్టంలోని ముఖ్యాంశాలు
* ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ 1773, మే 18న బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు.
* ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ (E.I.C.)కి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని మంజూరు చేసింది.
* ఈ చట్టాన్ని అనుసరించి మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలను బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి తీసుకువచ్చారు.
* బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిగా మార్చారు.
* వారన్ హేస్టింగ్స్ 1773 అక్టోబరు 20న బెంగాల్ గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.
* వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న కాలంలోనే మనదేశంలో 1772లో కలెక్టర్ పదవిని సృష్టించారు.
* ఈ చట్టం ప్రకారం 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో తొలిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
* ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులను నియమించారు. వారు:

* బెంగాల్ గవర్నర్ జనరల్‌కు సలహా ఇచ్చేందుకు నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. అందులో క్లావెరింగ్, బార్‌వెల్, ఫిలిప్ ఫ్రాన్సిస్, మాన్‌సన్ ఉన్నారు.
 
సెటిల్‌మెంట్ చట్టం - 1781
* ఈ చట్టం ద్వారా భారత్‌లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని పేర్కొనడం ద్వారా బ్రిటిష్‌వారు అధికారికంగా మనదేశంపై తమ అధికారాన్ని వ్యవస్థాపితం చేశారు.

పిట్స్ ఇండియా చట్టం - 1784
* ఈ చట్టం ద్వారా రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకు ప్రయత్నించారు.
* ఈ చట్టాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ జూనియర్ కాలంలో 1784లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించడం వల్ల దీనికి పిట్స్ ఇండియా చట్టం అనే పేరు వచ్చింది.
* బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్స్ ఉన్న సమయంలో ఈ చట్టాన్ని చేశారు.

పిట్స్ ఇండియా చట్టంలోని ముఖ్యాంశాలు
* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీలో మొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు.
* ఈ చట్టం ద్వారా భారతదేశంలో పరిపాలనాంశాలను 2 రకాలుగా విభజించారు.

1. వ్యాపార వ్యవహారాలు:
* వీటి నియంత్రణకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ఏర్పాటు చేశారు.

2. రాజకీయ వ్యవహారాలు
* వీటి నియంత్రణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ పాలన, న్యాయం, శాంతిభద్రతలు లాంటి వ్యవహారాలను ఇది నియంత్రిస్తుంది.
* ముగ్గురు డైరెక్టర్లతో కూడిన ఒక రహస్య కమిటీ ఈ బోర్డ్ ఆదేశాలను భారతదేశానికి తెలియజేసేది.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని కల్పించారు.

చార్టర్ చట్టం - 1793
* చార్టర్ అంటే 'ఒప్పందం' అని అర్థం.
* ఈ చట్టాన్ని గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ కాలంలో చేశారు.
* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ వ్యాపార హక్కులను మరోసారి 20 సంవత్సరాలు పొడిగించారు.
* గవర్నర్ జనరల్‌కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారాన్ని కల్పించారు.
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లోని సభ్యుల జీతాలు, ఇతర ఖర్చులు భారతదేశ రెవెన్యూ నుంచి చెల్లించేవారు.
* కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లో సభ్యుడు కాదు.

చార్టర్ చట్టం - 1813
* ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లు పొడిగించారు.
* ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ (తేయాకు, చైనాతో వ్యాపారం మినహా) బ్రిటిష్ పౌరులందరికీ స్వేచ్ఛా వ్యాపార అవకాశాలను కల్పించారు.
* స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, అవి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని అప్పగించారు.
* భారతదేశంలో విద్యావ్యాప్తికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కేటాయించారు.
* ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించారు.
* భారత్‌లోకి క్రైస్తవ మిషనరీల రాకను ఆహ్వానించారు.
* ఇది మనదేశంలో మతమార్పిడులకు కారణమైంది.
* కంపెనీ ఆదాయంపై, వ్యాపార లాభాలపై ప్రభుత్వానికి నియంత్రణ కల్పించారు.
* ప్రైవేట్ వ్యక్తులకు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కులు కల్పించారు.
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పరిధిని మరింత విస్తృతపరచారు.

చార్టర్ చట్టం - 1833
* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లపాటు పొడిగించారు.
* బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారతదేశ గవర్నర్ జనరల్‌గా మార్చారు.
* దీని ఫలితంగా బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్ భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్‌గా మారారు.
* ఇతడికి సివిల్, మిలిటరీ, ఆర్థిక అధికారాలు అప్పగించారు.
* రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను రద్దు చేసి, కార్యనిర్వహణ అధిపతియైన గవర్నర్ జనరల్‌కు పూర్తి శాసనాధికారాలను అప్పగించారు.
* కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
* గవర్నర్ కార్యనిర్వాహక మండలి సభ్యులను నాలుగుకు పెంచి, అందులో ఒక న్యాయ సభ్యుడు ఉండేలా సవరణ చేశారు.
* మొదటి న్యాయ సభ్యుడిగా మెకాలేను నియమించారు.
* తేయాకు, చైనాతో వ్యాపారాన్ని కంపెనీ ఆధీనంలో నుంచి తొలగించారు.
* భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్‌బరో వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
* సివిల్ సర్వీసుల నియామకాల్లో సార్వజనీన పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
* ఈ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా అభివర్ణిస్తారు.
* యూరోపియన్లు భారతదేశానికి వలస వచ్చేందుకు; భూమి, ఆస్తులు సంపాదించుకునేందుకు ఉన్న నియంత్రణలను తొలగించి వారికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛను కల్పించారు.
* దీని వల్ల బ్రిటిష్ వలస రాజ్య స్థాపనకు చట్టబద్ధత కల్పించినట్లయ్యింది.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్‌ను ఏర్పరిచారు. దీని మొదటి అధ్యక్షుడిగా లార్డ్ మెకాలేను నియమించారు.
* భారతీయ పాలనలో కోవనెంటెడ్ పోస్టుల్లో ప్రతిభ ఉన్న భారతీయులను నియమించాలని రాజా రామ్ మోహన్‌ రాయ్ మొదటిసారిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
* ఈ చట్టాన్ని సెయింట్ హెలీనా చట్టంగా పేర్కొంటారు.

చార్టర్ చట్టం - 1853
* ఈస్టిండియా కంపెనీ పాలనలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్ చట్టం.
* ఈ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను వేరుచేశారు.
* శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పరిచారు.
* ఇది బ్రిటిష్ పార్లమెంటులా తన విధులను నిర్వహిస్తుంది. అందుకే దీన్ని మినీ పార్లమెంటు అంటారు.
* సివిల్ సర్వీస్ పరీక్షల్లో జాతి వివక్ష లేకుండా భారతీయులకు అనుమతి కల్పించి సార్వజనీన పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికోసం 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. మొత్తం ఆరుగురు శాసన సభ్యుల్లో నలుగురిని మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకున్నారు.
* శాసన నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. అయితే తుది నిర్ణయాధికారం మాత్రం గవర్నర్ జనరల్‌దే.
* వివిధ లా కమిషన్‌ల సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859), ఇండియన్ పీనల్ కోడ్ (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1861)లను రూపొందించారు.
* కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట వ్యవధిని పేర్కొనక పోవడం వల్ల కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి ఈ చార్టర్ చట్టం అవకాశం కల్పించింది.
* 1773 నుంచి 1858 వరకు భారతదేశం ఈస్టిండియా కంపెనీ పాలన కింద ఉండేది. ఈ కాలంలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు.
* 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును ఈస్టిండియా కంపెనీ సమర్థవంతంగా అణిచివేయలేదని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. 1858 నుంచి బ్రిటిష్ రాజు / రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం ప్రారంభమైంది. అందుకే 1858 తర్వాత చేసిన చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలుగా పేరొందాయి.

మూడో దశ: 1858 నుంచి 1909 వరకు

భారత ప్రభుత్వ చట్టం: 1858
*1857 సిపాయిల తిరుగుబాటు అణిచివేత అనంతరం 1858, నవంబరు 1న బ్రిటిష్ రాణి విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనా బాధ్యతలను స్వీకరిస్తూ ఒక ప్రకటనను జారీ చేసింది.

అందులోని మఖ్యాంశాలు:
* ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు డి.డి. బసు ప్రకారం ఈ చట్టంతోనే భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైందని పేర్కొన్నారు.
* భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవిని భారతదేశ వైస్రాయిగా మార్చారు.
* భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయి అనే పదవులను ఒకే వ్యక్తి నిర్వహిస్తారు. మొదటి గవర్నర్ జనరల్, వైస్రాయి లార్డ్ కానింగ్.
* బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ జనరల్‌గా, స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయిగా ఆ వ్యక్తి వ్యవహరిస్తారు.
* వైస్రాయి దేశంలో బ్రిటిష్ రాణి మొదటి ప్రత్యక్ష ప్రతినిధి. ఇతడు దేశ పాలనను బ్రిటిష్ రాణి పేరుతో నిర్వహిస్తాడు.
* ఈ చట్టం ద్వారా మన దేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయింది.
* భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది.
* ఇంగ్లండ్‌లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టించారు.
* భారత రాజ్య కార్యదర్శి బ్రిటిష్ కేబినెట్‌లో భాగంగా భారతదేశ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి బాధ్యత వహిస్తాడు.
* భారత రాజ్య కార్యదర్శికి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి 15 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని (కౌన్సిల్) ఏర్పాటు చేశారు.
* మొదటి భారత రాజ్య కార్యదర్శి: చార్లెస్ ఉడ్.
* భారత పాలనా వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు.
* ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా పేర్కొంటారు.
* ఈ చట్టాన్ని విక్టోరియా మహారాణి భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మాగ్నాకార్టా లాంటిదిగా అభివర్ణించింది.
* ఈ చట్టం ద్వారా మనదేశంలో 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయ్యింది.
* ఈ చట్టం ద్వారా బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి బిరుదు పొందింది.
* భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానంలో భాగంగా క్రమానుగత శ్రేణి పద్ధతి కింది విధంగా ఉంది.

కౌన్సిల్ చట్టం: 1861
* ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం కల్పించింది.
* 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కిందకు వచ్చింది. దీనిలో భాగంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలన్నింటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటారు.
* భారతరాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరుమీద చట్టాలను రూపొందిచడం వల్ల ఈ చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు.
* 1859లో లార్డ్ కానింగ్ కాలంలో మనదేశంలో ప్రవేశపెట్టిన పోర్ట్‌ఫోలియో విధానానికి చట్టబద్దత కల్పించారు.
* ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్‌ఫోలియో విధానం అంటారు.
* 1862లో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో హైకోర్టులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1866లో అలహాబాద్‌లో నాలుగో హైకోర్టును ఏర్పాటు చేశారు.
* 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా రద్దు చేసిన బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీల శాసన అధికారాలను పునరుద్ధరించడం ద్వారా వికేంద్రీకృత పాలనకు బీజాలు వేశారు.
* గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం కల్పించారు.
* 1862లో వైస్రాయి లార్డ్ కానింగ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా నామినేట్ చేశాడు. ఈ విధంగా నామినేట్ అయినవారిలో బెనారస్ రాజు దేవ్ నారాయణ్‌సింగ్, పాటియాలా రాజు నరేంద్రసింగ్, సర్ దినకర్ రావు ఉన్నారు.
* బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సులతో నూతన లెజిస్లేటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు.

కౌన్సిల్ చట్టం: 1892
* 1885లో మనదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ (I.N.C.) ఏర్పడి జాతీయోద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా మితవాద నాయకులు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో పోరాడి ఆంగ్లేయులపై ఒత్తిడి తీసుకొచ్చారు.
* మితవాదులు బ్రిటిష్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ భారతీయ మేధావులను చైతన్యపరచి ప్రజాఉద్యమాన్ని నిర్మించారు. వీరిని ఎదుర్కొనేందుకు ఆంగ్లేయులు 1892 కౌన్సిల్ చట్టాన్ని చేశారు.

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు
* ఈ చట్టం ద్వారా మొదటిసారిగా పరోక్ష పద్ధతిలో శాసన సభ్యులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.
* కేంద్ర శాసనసభలో అనధికార సభ్యులను 10 మందికి తక్కువ కాకుండా, 16 మందికి మించకుండా, అలాగే రాష్ట్ర శాసనసభల్లో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు.
* లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధిని విస్తృతపరిచి భారతీయులకు వైస్రాయి, గవర్నర్ల కౌన్సిళ్లలో స్థానం కల్పించారు. కౌన్సిల్‌లో ఆరుగురు భారతీయులకు ప్రాతినిధ్యం దక్కింది. వారు:
     1. సురేంద్రనాథ్ బెనర్జీ
     2. దాదాభాయ్ నౌరోజీ
     3. గోపాలకృష్ణ గోఖలే
     4. ఫిరోజ్‌షా మెహతా
     5. రాస్‌బిహారి ఘోష్
     6. బిల్‌గ్రామీ

* ఈ చట్టం ద్వారా శాసనమండలి అధికారాలను విస్తృతం చేశారు. బడ్జెట్‌పై చర్చించడం లాంటి అధికారాలను కల్పించారు.
* ప్రజాప్రయోజనాల దృష్ట్యా శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. అయితే ప్రశ్నలు అడగడానికి గవర్నర్, గవర్నర్ జనరల్‌ల ముందస్తు అనుమతి పొందాలి. శాసనసభల్లో తమ స్థానం నామమాత్రమే అని భావించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు.

ఈ దశలోని మరికొన్ని ముఖ్యాంశాలు
* లార్డ్ మెకాలే కృషి వల్ల భారత్‌లో 1835లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.
* మెకాలే లా కమిషన్ చైర్మన్‌గా అనేక చట్టాలను క్రోడీకరించారు.

* 1854 నాటి ఉడ్స్ డిస్పాచ్ భారత్‌లో ఆంగ్ల విద్యావిధానానికి మాగ్నాకార్టాగా పేరొందింది.
* కారన్ వాలీస్ భారత్‌లో సివిల్ సర్వీసులకు ఒక రూపం తీసుకొచ్చారు.
* లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన 1905, అక్టోబరు 16 నుంచి అమల్లోకి వచ్చింది.
* 1906లో ఢాకా నవాబు సలీముల్లాఖాన్ ఢాకాలో ముస్లింలీగ్‌ను ఏర్పరిచాడు. దీని మొదటి అధ్యక్షుడు ఆగాఖాన్.
* 1907లో సూరత్‌లో రాస్‌బిహారి ఘోష్ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది.

నాలుగో దశ: 1909 - 1935

భారత కౌన్సిల్ చట్టం లేదా మింటో - మార్లే సంస్కరణలు: 1909
* 1892 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడం, భారత్‌లో ఉద్ధృతమవుతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడం, మితవాదులను సంతృప్తిపరచడం అనే లక్ష్యాల సాధనగా 1909లో మింటో మార్లే సంస్కరణలు చేశారు.
* ఆనాటి భారత వైస్రాయి మింటో, భారత రాజ్య కార్యదర్శి మార్లే పేర్లతో ఈ చట్టాన్ని చేయడం వల్ల దీన్ని మింటో - మార్లే సంస్కరణల చట్టం అంటారు.

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
* మనదేశంలో మొదటిసారిగా పరిమిత ప్రాతిపాదికన ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా మార్చారు.
* కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు.
* వైస్రాయి కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం 16 నుంచి 60కి పెంచారు.
* మద్రాస్, బెంగాల్, యునైటెడ్ ప్రావిన్స్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల శాసనమండళ్లలో సభ్యత్వ సంఖ్యను 50కి; పంజాబ్, అస్సాం, బర్మాలలో 30కి పెంచారు.
* గవర్నర్ జనరల్ శాసనమండలిలో 4 రకాల సభ్యులుంటారు. వారు:
     1. నామినేటెడ్ అధికార సభ్యులు
     2. నామినేటెడ్ అనధికార సభ్యులు
     3. హోదారీత్యా సభ్యులు
     4. ఎన్నికైన సభ్యులు
* వైస్రాయి, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన మొదటి భారతీయుడు సత్యేంద్రప్రసాద్ సిన్హా (న్యాయసభ్యుడు).
* 1906లో ఏర్పడిన ముస్లిం లీగ్ కృషి మేరకు మనదేశంలో ముస్లింలకు వారి జనాభాకు మించి ప్రత్యేక మత నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ముస్లిం సభ్యులను ముస్లింలే ఎన్నుకునేందుకు వీలైంది. అందుకే లార్డ్ మింటోను భారత్‌లో మత నియోజక వర్గాల పితామహుడిగా పేర్కొంటారు. ఈ విధానం 1947లో దేశ విభజనకు పునాది వేసింది.
* శాసనసభలో బడ్జెట్‌తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని భారతీయులకు కల్పించారు.
* ఈ చట్టం ద్వారా ప్రెసిడెన్సీ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, భూస్వాములు, వ్యాపార సంస్థలకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు.
* కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో పోటీ చేసే అభ్యర్థులకు కచ్చితమైన అర్హతలను నిర్దేశించారు.
* 1911లో రెండో లార్డ్ హార్డింజ్ కాలంలో బెంగాల్ విభజనను రద్దు చేసి, భారతదేశ రాజధానిగా కలకత్తాకు బదులు దిల్లీని నిర్దేశించారు.
* మింటో మార్లే చట్టాన్ని చంద్రకాంతితో పోల్చారు. ఇది కేవలం నీడ లాంటి ఆకారాన్ని మాత్రమే అందించింది. ఈ చట్టం హిందువులు, ముస్లింల మధ్య వేర్పాటు బీజాలు నాటి భారతదేశ విభజనకు కారణమైందని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు.

మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం: 1919
* భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్ జనరల్ చెమ్స్‌ఫర్డ్ ఈ చట్టాన్ని రూపొందిచడం వల్ల దీనికి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం అని పేరు వచ్చింది.

ఈ చట్టం రూపొందించడానికి కారణాలు
* 1916 ఏప్రిల్‌లో పుణె కేంద్రంగా బాలగంగాధర తిలక్, సెప్టెంబరులో మద్రాస్ కేంద్రంగా అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించి భారత జాతీయోద్యమాన్ని బలోపేతం చేయడం.
* 1909 నాటి మింటో మార్లే సంస్కరణల చట్టం భారతీయులను సంతృప్తి పరచలేకపోవడం.
* 1919, ఏప్రిల్ 13న పంజాబ్‌లో జనరల్ డయ్యర్ వికృత చేష్ట జలియన్ వాలాబాగ్ దురంతం వల్ల భారతీయుల్లో పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలను చల్లబరచడం.
* రౌలత్ చట్టాన్ని గాంధీజీ BLACK ACT (నల్ల చట్టం)గా అభివర్ణించి 1919, ఏప్రిల్ 6న జాతిని అవమానించిన దినంగా పాటించాలని భారతీయులకు పిలుపు నివ్వడం.

మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టంలోని ముఖ్యాంశాలు
* భారతదేశంలో తొలిసారిగా బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ విధానం ప్రారంభమైంది.
* భారత రాజ్య కార్యదర్శి వేతనాలను భారత ఆదాయం నుంచి కాకుండా బ్రిటన్ నుంచి చెల్లిస్తారు.
* కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. అవి:

1. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (ఎగువ సభ)
* దీనిలో 60 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 34 మంది ఎన్నికైనవారు. 26 మంది గవర్నర్ జనరల్ నామినేట్ చేసినవారు ఉంటారు.
* వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు.
* దీనికి ఫ్రెడరిక్ వైట్ అధ్యక్షుడిగా పనిచేశారు.
* దీనికి గవర్నర్ జనరల్ ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

2. లెజిస్లేటివ్ కౌన్సిల్ (దిగువ సభ)
* ఈ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 144. వీరిలో 103 మంది ఎన్నికైనవారు కాగా, 41 మంది నామినేటెడ్ సభ్యులు.
* ఈ సభ పదవీకాలం 3 సంవత్సరాలు.
* ఈ సభకు తొలి అధ్యక్షుడు - విఠల్‌భాయ్ పటేల్, తొలి ఉపాధ్యక్షుడు - సచ్చిదానంద సిన్హా.
* కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీలను 1921లో ఏర్పాటు చేశారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పాలనాంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాలుగా విభజించారు.

1. కేంద్ర జాబితా
* ఈ జాబితాలో మొత్తం 47 అంశాలను చేర్చారు.
* జాతీయ ప్రాముఖ్యం గల అంశాలన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.
ఉదా: దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ రుణం, నౌకాయానం, తంతి తపాలా, రక్షణ, కరెన్సీ, ఎగుమతులు, దిగుమతులు.

2. రాష్ట్ర జాబితా
* ఈ జాబితాలో మొత్తం 51 అంశాలను చేర్చారు.
* ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు.
ఉదా: ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, స్థానిక ప్రభుత్వాలు, శాంతి భద్రతలు, రోడ్డు రవాణా, నీటిపారుదల.
* ఈ చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన (Dyarchy)ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రభుత్వ పాలనాంశాలను రెండు జాబితాలుగా వర్గీకరించారు. అవి:

1. రిజర్వ్‌డ్ జాబితా
* దీనిలో మొత్తం 28 పాలనాంశాలను నిర్దేశించారు.
* అత్యంత ప్రాధాన్యం ఉన్న అధికారాలు, ఆదాయమున్న విత్తం, భూమిశిస్తు, న్యాయం, నీటిపారుదల, పరిశ్రమలు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
* ఈ అంశాలకు సంబంధించిన పరిపాలనాంశాలను కార్యనిర్వాహక మండలి సహాయంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. ఈ కార్యనిర్వాహక వర్గ సభ్యులు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

2. ట్రాన్స్‌ఫర్డ్ జాబితా
* దీనిలో మొత్తం 22 అంశాలు ఉంటాయి.
* అధికారాలు లేని, ప్రాముఖ్యం లేని కేవలం బాధ్యతలు మాత్రమే కలిగి ఉండే అంశాలను దీనిలో చేర్చారు.
* స్థానిక పాలన, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం దీనిలో ఉన్నాయి.
* రాష్ట్ర గవర్నర్లు ఈ అంశాల పాలనా వ్యవహారాలను భారతీయ మంత్రుల సహాయంతో నిర్వహిస్తారు. భారతీయ మంత్రులు ఆయా రాష్ట్ర శాసనసభల్లో సభ్యులై ఉంటారు. వీరు తమ విధుల నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు.
* చట్టసభల్లో సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు.
* చట్టసభల్లో క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడం ద్వారా మతపరమైన ప్రాతినిధ్యాన్ని విస్తృతపరిచారు.
* ఆస్తి, పన్నులు చెల్లించే ప్రాతిపదికపై పరిమిత ఓటుహక్కును కల్పించారు.
* ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తనిఖీ చేయడం కోసం ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటుచేశారు.
* లండన్‌లో భారత వ్యవహారాలను పర్యవేక్షించడానికి భారత హైకమిషనర్ అనే పదవిని సృష్టించారు. లండన్‌లో భారత హైకమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
* 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ) ఏర్పాటు చేశారు.
* కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు.
* గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు భారతీయులకు అవకాశం కల్పించారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య; అంతర్ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయికి ఇచ్చారు.
* పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి లీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా 1926లో కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటయ్యాయి.
* రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ నుంచి వేరుచేశారు.
* మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం కేవలం మనదేశంలో 2.6% ప్రజలకు మాత్రమే ఓటుహక్కును కల్పించింది.

1919 చట్టం తర్వాత బ్రిటిష్ ఇండియా పరిపాలన కింది విధంగా ఉంది.

1919 చట్టంపై ఉన్న విమర్శ:
* ''నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కరూ నేరుస్థులే" - గాంధీజీ.
* ఈ చట్టం సూర్యుడు లేని ఉదయం లాంటిది అని బాలగంగాధర్ తిలక్ అభివర్ణించారు.
* 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
* ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.
* భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది చాలావరకు దూషించే మాట అయింది. ''ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని నీవు డైయార్కివి అని అనడం విన్నాను" అని సర్ బట్లర్ అనే రచయిత పేర్కొన్నాడు.
* ద్వంద్వ పాలనను ఎప్పుడూ ఆదర్శంగా భావించలేదు. ఇంకో ఉత్తమ ప్రయోజన స్థితికి ఇది ఒక మెట్టు మాత్రమే. ఈ ఉత్తమ ప్రయోజనం పేరు పరిపూర్ణ స్వపరిపాలిత భారతదేశం అని పలాండే (రచయిత) పేర్కొన్నాడు.
* ద్వంద్వ ప్రభుత్వాన్ని మడ్డీ మాన్ కమిటీ సమర్థించింది.

సైమన్ కమిషన్: 1927
* 1919 నాటి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను సమీక్షించేందుకు నాటి బ్రిటన్ ప్రధాని బాల్డ్విన్ 1927 లో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక కమిషన్‌ను నియమించాడు.
* ఈ కమిషన్‌లో ఒక్క భారతీయుడికి కూడా ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో భారతీయులు దీన్ని వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు.
* సైమన్ కమిషన్ భారతదేశంలో రెండు పర్యాయాలు పర్యటించింది.
    1) 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు
    2) 1928, అక్టోబరు 11 నుంచి 1929, ఏప్రిల్ 6 వరకు
* సైమన్ కమిషన్ తన నివేదికను 1930లో లండన్‌లోని బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది.

సైమన్ కమిషన్ నివేదికలో ముఖ్యాంశాలు:
* భారతదేశంలో సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
* 1919లో రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయాలి.
* మంత్రులందరూ శాసనసభకు బాధ్యత వహించాలి.
* భారతీయులకు ప్రభుత్వ నిర్వహణలో స్వయం ప్రతిపత్తిని కల్పించాలి.
* హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణను ఏర్పరచాలి.
* భాషా ప్రాతిపదికపై ఒరిస్సా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి.
* సార్వత్రిక వయోజన ఓటుహక్కు సాధ్యం కాదు.
* ప్రాథమిక హక్కులను నిరాకరించారు.
* కమ్యూనల్ ప్రాతినిధ్యం సమంజసం కాకపోయినా దీనికి ప్రత్యామ్నాయం లేని దృష్ట్యా కొనసాగించాలి.
* అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్)తో కూడుకున్న స్వాతంత్య్రాన్ని తిరస్కరించాలి.
 సైమన్ కమిషన్ నివేదిక అనేది భారతదేశ సమస్యలపై ఒక సమగ్రమైన అధ్యయనం అని కూప్లాండ్ (రచయిత) పేర్కొన్నాడు.
 1935లో చేసిన భారత ప్రభుత్వ చట్టంలో సైమన్ కమిషన్ సిఫారసులను పొందుపరిచారు.

నెహ్రూ నివేదిక : 1928
* సైమన్ కమిషన్‌ను బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస అయ్యంగార్ ప్రకటించడంతో... భారతరాజ్య క్యార్యదర్శి లార్డ్ బిర్కెన్‌హెడ్ 1927, నవంబరు 24న బ్రిటిష్ ఎగువ సభలో ప్రసంగిస్తూ ''భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన స్వయంగా రచించుకోగలరా'' అని భారతీయులకు సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928, మే 19న బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు భారత రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని నియమించారు.

నెహ్రూ నివేదికలోని ముఖ్యాంశాలు:
* భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వాలి.
* కార్యనిర్వాహక శాఖ శాసనసభకు బాధ్యత వహించాలి.
* ఇందులో 19 ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు.
* దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
* పంజాబ్, బెంగాల్‌లోని ప్రత్యేక మత నియోజక వర్గాలను రద్దు చేయాలి.
* అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసనమండళ్లలో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించాలి.

దీపావళి ప్రకటన:
* సైమన్ కమిషన్ నివేదికపైనా, భారత్‌లో రాజ్యాంగ సంస్కరణలపైనా చర్చించేందుకు లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామని... భారత్‌కు త్వరలోనే స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామని భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ 1929, అక్టోబరు 31న ఒక ప్రకటన చేశాడు. దీన్నే దీపావళి ప్రకటన అంటారు.
* 1929లో బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత లేబర్ పార్టీ గెలుపొంది రామ్‌సే మెక్‌డొనాల్డ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇతడు గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్‌తో సంప్రదింపులు జరిపాడు. సైమన్ కమిషన్‌ను భారతీయులు తిరస్కరించడంతో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రయత్నించాడు. లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.

మొదటి రౌండ్ టేబుల్ సమావేశం:
* ఇది లండన్‌లో 1930, నవంబరు 12 నుంచి 1931, జనవరి 19 వరకు జరిగింది. దీనిలో 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
* ఈ సమావేశంలో ముస్లిం లీగ్ తరఫున జిన్నా, ఆగాఖాన్, మహ్మద్ షఫీ, ఫజల్ హక్; హిందూ మహాసభ తరఫున ఎమ్.ఆర్ .జయకర్, మూంజే; ఉదారవాదుల తరఫున తేజ్‌బహదూర్ సప్రూ, చింతామణి, బి.ఆర్. అంబేడ్కర్, హైదరాబాద్ దివాన్ అక్బర్ హైదర్ కూడా హాజరయ్యారు.
* ఈ సమావేశంలో సంపూర్ణ బాధ్యతాయుత పాలనపై చర్చిస్తామని ఆంగ్లేయులు ప్రత్యేక హామీని ఇవ్వనందున భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. కాంగ్రెస్ పాల్గొనక పోవడం వల్ల ఈ సమావేశం విఫలమైంది. సమావేశంలో పాల్గొనని ప్రజా వర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఈ సమావేశాన్ని ముగించినట్లు ప్రకటించాడు.

గాంధీ - ఇర్విన్ ఒప్పందం:
* కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేనిదే తాము నిర్వహించే సమావేశాలు సఫలం కావని గుర్తించిన ఆంగ్లేయ ప్రభుత్వం రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీని ఒప్పించాలని వైస్రాయి ఇర్విన్‌ను ఆదేశించింది. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్టయిన గాంధీజీని విడుదల చేయడంతో 1931, మార్చి 5న గాంధీ, ఇర్విన్ మధ్య సమావేశం జరిగింది. దీన్నే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు.

దీనిలోని ముఖ్యాంశాలు:
* రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి.
* కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటుంది.
* తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పన్ను లేకుండా ఉప్పును తయారు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి.
* శాసనోల్లంఘన ఉద్యమంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వడం.

రెండో రౌండ్ టేబుల్ సమావేశం:
* ఇది లండన్‌లో 1931, సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు 1 వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గాంధీజీ హాజరయ్యారు. స్వదేశీ సంస్థానాధిపతులతో సహా 107 మంది ప్రతినిధులు, మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు హాజరయ్యారు. బలహీన వర్గాల తరఫున బి.ఆర్.అంబేడ్కర్ పాల్గొన్నారు. అల్పసంఖ్యాక వర్గాల సమస్యలపై గాంధీజీ - మహ్మద్ అలీ జిన్నా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఆంగ్లేయులు విభజించు -  పాలించు సూత్రాన్ని పాటించడం వల్ల గాంధీ సమావేశం నుంచి ఉపసంహరించుకుని భారత్‌కు రావడంతో ఆంగ్లేయులు అతడిని అరెస్ట్ చేశారు.

కమ్యూనల్ అవార్డు: 1932
* ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ 1932, ఆగస్టు 4న కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలను ప్రతిపాదించాడు. దీన్ని వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ పూనాలోని ఎరవాడ కారాగారంలో 1932, సెప్టెంబరు 20న ఆమరణ నిరాహర దీక్షకు పూనుకున్నారు. దీంతో గాంధీజీ - అంబేడ్కర్ మధ్య పూనాలో ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే పూనా ఒప్పందం - 1932 అంటారు. దీని ఫలితంగా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్డు కులాలకు అవకాశాలు లభించాయి. కమ్యూనల్ అవార్డు షెడ్యూల్డ్ కులాలను దళితులుగా పేర్కొంది.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం:
* ఈ సమావేశం లండన్‌లో 1932, నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఈ సమావేశానికి జిన్నా, అంబేడ్కర్‌లతో సహా మొత్తం 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
* మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించి, నిర్ణయించిన అంశాలతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రచురించింది. దీనిలోని ప్రతిపాదనలను లార్డ్ లిన్‌లిత్‌గో అధ్యక్షతన బ్రిటిష్ పార్లమెంటుకు చెందిన సెలెక్ట్ కమిటీ పరిశీలించి... 1934, నవంబరు 11న ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికను కాంగ్రెస్ తిరస్కరించింది. ముస్లిం లీగ్ సమాఖ్య అనే భావనను తిరస్కరించి, ప్రాంతాలకు సంబంధించిన భాగాన్ని ఆమోదించింది.

5వ దశ: 1935 - 1947

భారత ప్రభుత్వ చట్టం - 1935
* బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగ సంస్కరణల చట్టాలన్నింటిలో సమగ్రమైంది, భారత పరిపాలన కోసం రూపొందించిన చట్టాల్లో ముఖ్యమైంది.
* 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదం పొందిన అతిపెద్ద చట్టం.
* ఈ చట్టంలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్ ఉన్నాయి.
* ఈ చట్టం 1937, ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది.
* భారత రాజ్యాంగ నిర్మాతలు 70 శాతం పైగా అంశాలను ఈ చట్టం నుంచి గ్రహించారు. అందుకే ఈ చట్టాన్ని భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ లాంటిదని హస్రత్ మొహాని పేర్కొన్నాడు.
* భారతదేశంలో బాధ్యతాయుతమైన పాలనను అందించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యంగా ప్రకటించారు.

చట్టంలోని ముఖ్యాంశాలు:

అఖిల భారత సమాఖ్య ఏర్పాటు:
* సైమన్ కమిషన్ సూచనలను అనుసరించి మనదేశంలో ఆంగ్లేయులు సమాఖ్య తరహా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమాఖ్యలో 11 రాష్ట్రాలు, 6 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు, సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికార విభజన జరిగింది.
ఎ) కేంద్ర జాబితా: దీనిలో రక్షణ, కరెన్సీ, విదేశీ వ్యవహారాలు, తంతి తపాలా లాంటి జాతీయ ప్రాధాన్యం ఉన్న 59 అంశాలు ఉన్నాయి.
బి) రాష్ట్ర జాబితా: దీనిలో నీటిపారుదల, వ్యవసాయం, విద్య, స్థానిక పాలన లాంటి ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 54 అంశాలు ఉన్నాయి.
సి) ఉమ్మడి జాబితా: దీనిలో వివాహం, విడాకులు, వారసత్వం లాంటి 36 అంశాలు ఉన్నాయి.
పైన పేర్కొన్న 3 జాబితాల్లో లేని అంశాలను అవశిష్టాధికారాలు అంటారు. వీటిని గవర్నర్ జనరల్‌కు బదలాయించారు.
రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ పాలను రద్దు చేసి, కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. కేంద్రంలో పాలనాంశాలను రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ అంశాలుగా విభజించారు.
ఎ) రిజర్వ్‌డ్ జాబితా: దీనిలో ప్రాధాన్యం గల అధికారాలు, ఆదాయమున్న అంశాలు చోటుచేసుకున్నాయి. వీటిపై బ్రిటిష్ గవర్నర్ జనరల్‌కు అధికారం కల్పించారు.
బి) ట్రాన్స్‌ఫర్డ్ జాబితా: అధికారాలు, ఆదాయం లేని; అంతగా ప్రాధాన్యం లేని అంశాలను ఈ జాబితాలో చేర్చారు. దీనిలో బాధ్యతలు అధికంగా ఉంటాయి. వీటిని భారతీయ మంత్రులకు అప్పగించారు.
కేంద్ర శాసనసభ: కేంద్రంలో ద్విసభా విధానాన్ని కొనసాగిస్తూ సభల్లోని సభ్యుల సంఖ్యను పెంచారు.

ఎ) కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్:
  ఎగువసభ అయిన దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 260. దీనిలో మూడో వంతు సభ్యులను మన దేశంలోని స్వదేశీ సంస్థానాల ప్రతినిధులకు కేటాయించారు.

బి) లెజిస్లేటివ్ అసెంబ్లీ:
* దిగువసభ అయిన దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 375.

రాష్ట్రాల్లో ద్విసభా విధానం
* ఈ చట్టం ద్వారా భారత్‌లోని రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
* భారత్‌లోని మొత్తం 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు గాను 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
అవి: 1. అస్సాం
     2. బెంగాల్
     3. బీహార్
     4. ఉత్తర్‌ప్రదేశ్ (యునైటెడ్ ప్రావిన్స్)
     5. మద్రాస్
     6. బొంబాయి

* 1919 చట్టం ద్వారా మనదేశంలోని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1935 చట్టం ద్వారా రద్దుచేశారు.
* రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్రాల్లో రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ జాబితాలను రద్దుచేసి... రాష్ట్ర జాబితాలోని 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు.

ఫెడరల్ కోర్టు:
* ఢిల్లీలో 1935, అక్టోబరు 1న ఫెడరల్ కోర్టును స్థాపించారు. ఇది 1937 నుంచి పని విధానాలను ప్రారంభించింది.
* మనదేశంలో సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టినందున కేంద్రం - రాష్ట్రాలు; దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను ఇది పరిష్కరిస్తుంది.
* దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
* మొదటి ప్రధాన న్యాయమూర్తి - మారిస్ గ్వేయర్.
* ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్‌లోని ప్రీవి కౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
* ఓటు హక్కును విస్తృతపరిచి, జనాభాలో 10 శాతానికి ఓటుహక్కును వర్తింపజేశారు.
* భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా బర్మాను భారతదేశం నుంచి వేరుచేశారు.
* ఒరిస్సా, సింధ్ అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ఇండియాపై బ్రిటిష్ పార్లమెంట్ సర్వాధిపత్యాన్ని పునరుద్ఘాటించారు.
* భారతదేశంలో ఆర్థిక విధానం, రుణ నియంత్రణ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు.
* రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయ సలహాదారుడైన అడ్వకేట్ జనరల్ పదవిని సృష్టించారు.
* కేంద్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ జనరల్ బ్రిటిష్ రాణి పరిశీలన కోసం లండన్‌కు పంపే అధికారాన్ని కల్పించారు.
* సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు.
* భారత రాజ్య కార్యదర్శికి సలహాను ఇచ్చే భారత కౌన్సిల్‌ను రద్దు చేశారు.
* 1937 నుంచి భారత ప్రభుత్వ చట్టం - 1935 అమల్లోకి వచ్చింది. 1937లో కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయి.
* 11 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
* 1939, అక్టోబరులో బ్రిటిష్ వైఖరికి నిరసనగా 8 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి.
* భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా ప్రవేశపెట్టిన ప్రధాన అంశం ప్రాంతీయ స్వపరిపాలన.

1935 చట్టంపై విమర్శలు
''ఇది పొట్టి మనుషులు (పిగ్మీస్) కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం (రాక్షస స్తంభం)" - విన్‌స్టన్ చర్చిల్
''భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం బలవంతంగా రుద్దిన చట్టం" - కె.టి. షా
''మనదేశంలో నూతన బానిసత్వానికి నాంది లాంటిది" - జవహర్‌లాల్‌ నెహ్రూ
''కచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకృతమైంది" - మహ్మద్ అలీ జిన్నా
''ఒక మంచి వాహనానికి చక్కటి బ్రేకులను అమర్చి ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మరచిపోయారు" - జవహర్‌లాల్‌ నెహ్రూ
''భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం" - సుభాష్ చంద్రబోస్

లిన్‌లిత్‌గో ఆగస్టు ప్రతిపాదనలు: 1940
* భారత గవర్నర్ జనరల్, వైస్రాయి అయిన లార్డ్ లిన్‌లిత్‌గో 1940, ఆగస్టు 8న రాజ్యాంగ సంస్కరణలపై చేసిన కొన్ని ప్రతిపాదనలను ఆగస్టు ప్రతిపాదనలు అంటారు.

ముఖ్యాంశాలు:
* రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పించడం అనే విషయాన్ని పరిశీలించడం. భారత రాజ్యాంగాన్ని రూపొందించుకునే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందని మొదటిసారిగా ప్రకటించారు.
* రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం. భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించాలి.
* అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం.
* వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పించి మండలిని విస్తృతపరచడం.
* ఆగస్టు ప్రతిపాదనలను భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు.

క్రిప్స్ ప్రతిపాదనలు: (1942)
    రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్రిటన్ యుద్ధంలో భారతీయ సైన్యాల సహకారం పొందేందుకు క్రిప్స్ ప్రతిపాదనలు అనే పేరుతో బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ తన కేబినెట్ మంత్రి అయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను భారత్‌కు పంపాడు. 1942, మార్చి 22న భారత్‌కు వచ్చిన క్రిప్స్ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు

* భారత ప్రజల ప్రతిపాదన అయిన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవుతుందని ప్రకటించారు.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయుడికి సభ్యత్వం ఇస్తారు.
* రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.
* బ్రిటిష్‌వారు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని పేర్కొంటూ, దానికి బదులుగా భారతీయులు బ్రిటిష్‌వారికి సహకరించాలని అని పేర్కొన్నారు.
* భారతీయులకు అధినివేశ ప్రతిపత్తి (పాక్షిక స్వాతంత్య్రం) కల్పిస్తామని ప్రకటించారు.
* క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకించిన భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రక క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది.
* 1942, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటిస్తూ గాంధీజీ Do or Die నినాదాన్ని ఇచ్చారు.
* క్రిప్స్ ప్రతిపాదనలను మహాత్మాగాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ''దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందు తేది వేసి ఇచ్చిన ఒక చెక్కు లాంటిది" అని వ్యాఖ్యానించారు. (Post - dated cheque drawn on the crashing bank).

సి.ఆర్.ఫార్ములా: 1944
* 1944 మార్చిలో కాంగ్రెస్ తరఫున ముస్లిం లీగ్ సహకారం కోసం, మత సమస్యల పరిష్కారం కోసం, సమష్టి కృషి ద్వారా మాత్రమే స్వాతంత్య్రం సిధ్ధిస్తుంది అనే భావనతో చక్రవర్తుల రాజగోపాలాచారి ఈ ఫార్ములాను రూపొందించారు.
ఈ సూత్రాన్ని రాజగోపాలాచారి తన The way out pamphlet అనే కరపత్రాల ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చారు.

సి.ఆర్.ఫార్ములాలోని ముఖ్యాంశాలు
* భారతదేశం స్వాతంత్య్రం కోరడాన్ని ముస్లిం లీగ్ ఆమోదించాలి. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌కు సహకరించాలి.
* దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత పాకిస్థాన్ ఏర్పాటును కోరుతున్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనీ, మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని సి.ఆర్.ఫార్ములాలో పేర్కొన్నారు.
* ప్రజాభిప్రాయ సేకరణ (Plebiscite) ను చేపట్టే ముందుగానే అన్ని పార్టీలకు దేశ విభజనపై వారి అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కల్పిస్తారు.
* విభజన కారణంగా ప్రజలు తరలిపోవాల్సి వస్తే అది వారి అభీష్టం మేరకే జరగాలి.
* ఒకవేళ విభజన సంభవిస్తే దేశ రక్షణకు, వాణిజ్యానికి, ఇతర ముఖ్య ప్రయోజనాలకు పరస్పర ఒడంబడికలు జరగాలి.
* పాకిస్థాన్ ఏర్పాటును ప్రత్యక్షంగా అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ ముస్లిం లీగ్, దేశ విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ ఫార్ములాను వ్యతిరేకించాయి.

అమేరి - వేవెల్ ప్రణాళిక: 1945
  భారత వ్యవహారాల కార్యదర్శి అమేరి, భారత వైస్రాయి లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌తో చర్చించి, రూపొందించిన ప్రతిపాదనలను అమేరి - వేవెల్ ప్రణాళిక అంటారు.
దీనిలోని ముఖ్యాంశాలు:
* గవర్నర్ జనరల్‌కు వీటో అధికారం ఇచ్చారు.
* దేశ సార్వభౌమ, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ లాంటి అంశాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారాలు ఉంటూ మిగిలిన అంశాలపై భారతీయులకు అధికారాలు కల్పించడం.
* భారతదేశంలో బ్రిటిషర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక హై కమిషనర్‌ను నియమించడం.
* వైస్రాయి కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరించడం.
* వైస్రాయి కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైనికాధికారి పదవిని భారతీయుడితో నింపడం.
* ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు కాంగ్రెస్ నాయకులను జైళ్ల నుంచి విడుదల చేయడం.

సిమ్లా సమావేశం (Simla Conference): 1945
* వేవెల్ ప్రణాళికలోని అంశాలను చర్చించేందుకు వైస్రాయి వేవెల్ 1945, జులైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించాడు.
* కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య సయోధ్య కుదర్చడం కోసం భూలాభాయ్ దేశాయ్ (కాంగ్రెస్), లియాఖత్ అలీఖాన్ (ముస్లిం లీగ్) మధ్య ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* భారత ముస్లింలకు ప్రతినిధిగా ముస్లిం లీగ్‌ను మాత్రమే పరిగణించాలని... లీగ్ సభ్యులు కాని ముస్లింలను రాజ ప్రతినిధి కార్యనిర్వాహక కౌన్సిల్‌లో చేర్చుకోరాదని మహ్మద్ అలీ జిన్నా పట్టు పట్టారు.
* పాకిస్థాన్ ఏర్పాటు గురించి ప్రస్తావన లేదనే కారణంతో ముస్లిం లీగ్, స్వాతంత్య్రం గురించి నిర్మాణాత్మక ప్రతిపాదన లేదనే కారణంతో కాంగ్రెస్ సమావేశం నుంచి నిష్క్రమించాయి.

కేబినెట్ మిషన్ (మంత్రిత్రయ రాయబారం): 1946
   రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. క్లెమెంట్ అట్లీ బ్రిటన్ ప్రధాని అయ్యారు. 1946, మార్చిలో బ్రిటన్ ప్రధాని అట్లీ పార్లమెంటులో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. అందులోని సారాంశం:
1. అల్ప సంఖ్యాకుల హక్కుల పట్ల మాకు గుర్తింపు ఉంది.
2. అల్ప సంఖ్యాకులు నిర్భయంగా జీవించాల
3. అధిక సంఖ్యాకుల పురోగతిని కాదనే అల్పసంఖ్యాక వర్గాన్ని కూడా అనుమతించలేం.

క్లెమెంట్ అట్లీ భారత్‌కు పంపిన మంత్రిత్రయ రాయబారం లోని సభ్యులు:
     1. సర్ పెథిక్ లారెన్స్ (ఛైర్మన్)
     2. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ (సభ్యుడు)
     3. ఎ.వి. అలెగ్జాండర్ (సభ్యుడు)
* కేబినెట్ మిషన్ 1946, మే 16న తన ప్రణాళికను వెలువరించింది.

కేబినెట్ మిషన్‌లోని ముఖ్యాంశాలు:
* భారతీయులు తమను తాము పాలించడం కోసం అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి భారతీయులతో ఒక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు.
* బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర శాసనసభలతో రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఎన్నుకుంటారు.
* స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్తు‌కు తమ ప్రతినిధులను పంపే అవకాశం కల్పించారు.
* ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి.
* కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనాంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది.
* ప్రాంతీయ ప్రభుత్వాలకు శాసన నిర్మాణ శాఖలు ఏర్పాటవుతాయి.
* పాకిస్థాన్ దేశ ఏర్పాటును తిరస్కరించింది.
* అధికార మార్పిడి జరిగే వరకు దేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని 14 మంది సభ్యులతో ఏర్పాటుచేయడం జరుగుతుంది.
* 1946, సెప్టెంబరు 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రారంభంలో సందేహించిన ముస్లిం లీగ్ 1946, అక్టోబరు 29న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది.

1946 నాటి తాత్కాలిక ప్రభుత్వంలోని మంత్రులు - శాఖలు

క్లెమెంట్ అట్లీ ప్రకటన: 1947
  బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ 1947, ఫిబ్రవరి 20న కామన్స్ సభలో మాట్లాడుతూ 1948, జూన్ నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తామని ప్రకటించాడు. దీన్నే అట్లీ ప్రకటన అంటారు.
  ఈ ప్రకటనను మహాత్మాగాంధీ బ్రిటిష్‌వారు జారీచేసిన వాటిలో అత్యుత్తమమైందిగా ప్రశంసించారు.

మౌంట్‌బాటన్ ప్రణాళిక: 1947
* లార్డ్ వేవెల్ స్థానంలో 1947, మార్చి 22న గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్‌బాటన్ నియమితుడయ్యాడు.
* ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య వల్ల దేశంలో చెలరేగిన హింసను, రక్తపాతాన్ని దృష్టిలో ఉంచుకుని మౌంట్ బాటన్ ఈ పథకాన్ని రూపొందించాడు.
* భారతదేశం రెండు డొమినియన్లుగా ఏర్పాటవుతుంది. హిందువులు ఎక్కువగా నివసించేవారు ఇండియన్ యూనియన్‌గా, ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం పాకిస్థాన్‌గా అవతరిస్తాయి.
* స్వదేశీ సంస్థానాలు తమ ఇష్టానుసారం భారత్ లేదా పాకిస్థాన్‌లో చేరవచ్చు.
* అస్సాం భారతదేశ అంతర్భాగంగా ఉండిపోగా బెంగాల్, పంజాబ్‌లను మతప్రాతిపదికపై విభజించారు.
* బెలుచిస్థాన్, వాయవ్య ప్రాంతాలు భారతదేశంలో లేదా పాకిస్థాన్‌లో చేరే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.
* బ్రిటన్ ఆధ్వర్యంలో కామన్వెల్త్ కూటమిలో చేరే విషయంలో భారత్, పాకిస్థాన్‌లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
* మౌంట్‌బాటన్ పథకాన్ని ముస్లిం లీగ్ స్వాగతించగా, భారత జాతీయ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంలో జిన్నా ఒక ప్రకటన చేస్తూ దేశాన్ని సాధ్యమైతే విభజిస్తాం లేకుంటే ధ్వంసం చేస్తాం అని వ్యాఖ్యానించాడు. జిన్నా ప్రకటనతో దేశంలో తీవ్ర హింస చెలరేగి, దేశ విభజన అనివార్యమైంది.
* ఈ సందర్భంలో ఢిల్లీలో జరిగిన మత సంఘర్షణ, హింస, రక్తపాతాలు గాంధీజీని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. మహాత్ముడు బాధాతప్త హృదయంతో దేశ విభజనకు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు.
* సింధు రాష్ట్రం పాకిస్థాన్‌లో విలీనం కావాలని నిర్ణయించారు.
* అస్సాంలోని సేలట్ జిల్లాలో వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా పాకిస్థాన్‌లోనే విలీనం కావాలని అభిప్రాయం వచ్చింది.
* జునాగఢ్‌లో రెఫరెండం నిర్వహించగా భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించారు.
* బెంగాల్ శాసనసభ తూర్పు బెంగాల్‌ను పాకిస్థాన్‌లోనూ, పశ్చిమ బెంగాల్‌ను భారత్‌లోనూ విలీనం చేయాలని తీర్మానించింది.
* మౌంట్ బాటన్ పథకాన్ని డిక్కి బర్డ్ పథకమని అంటారు.

భారత స్వాతంత్య్ర చట్టం: 1947
  ఆంగ్లేయులు భారతదేశ వ్యవహారాలపై రూపొందించిన చివరి చట్టం ఇది. లార్డ్ మౌంట్ బాటన్ సలహామేరకు భారత స్వాతంత్య్ర బిల్లును 1947, జులై 4న బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా జులై 15న బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించింది. 1947, జులై 18న బ్రిటిష్ రాజమకుటం భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించగా 1947, ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
* 1947, ఆగస్టు 14న గురువారం పాకిస్థాన్ ఏర్పడింది.
* 1947, ఆగస్టు 15న శుక్రవారం భారతదేశం స్వాతంత్య్రం పొందింది.
* ఇండియా, పాకిస్థాన్ దేశాల కోసం వేర్వేరు రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటయ్యాయి.
* మౌంట్ బాటన్ భారతదేశానికి, మహమ్మద్ అలీ జిన్నా పాకిస్థాన్‌కు గవర్నర్ జనరల్స్‌గా నియమితులయ్యారు.
* రెండు దేశాల్లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్‌లు తాత్కాలిక పార్లమెంట్లుగా వ్యవహరిస్తాయి.
* సొంత రాజ్యాంగాలను రూపొందించుకునే వరకు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి, పరిపాలన ఉంటుంది.
* రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించడానికి రాడ్ క్లిఫ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది.
* ఈ చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా పేర్కొంటారు.
* క్లెమెంట్ అట్లీ ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో ఉదాత్తమైంది, ఉత్తమమైందిగా అభివర్ణించాడు.
* భారత స్వాతంత్య్రాన్ని దృష్టిలో ఉంచుకుని జవహర్‌లాల్‌ నెహ్రూ భారతజాతిని ఉద్దేశించి ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగాన్ని ద ట్రిస్ట్ విత్ డిస్టినీ (విధితో ఒప్పందం) అంటారు.
* స్వాతంత్య్రం నాటికి దేశంలో 562 సంస్థానాలుండగా, వాటిలో 554 భారత్‌లో విలీనం అయ్యాయి.
* స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దయింది.
* భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దయింది.
* బ్రిటిష్ రాజు లేదా రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది.
* ట్రావెన్‌కోర్ సంస్థానం ఎలాంటి షరతులు విధించకుండా భారత్‌లో విలీనమైంది.
* జునాఘడ్, జమ్మూకశ్మీర్ సంస్థానాలు ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయం) ద్వారా భారత్‌లో విలీనమయ్యాయి. హైదరాబాద్ పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో విలీనమైంది.

వ్యాఖ్యానాలు:
    ''ప్రపంచం ఆదమరచి నిద్రిస్తున్న ఈ అర్ధరాత్రి గంటలు మోగుతున్న ఈ వేళ, భారతజాతి మేల్కొంటోంది. ఈ మేల్కొలుపు ఏనాడో విధితో చేసుకున్న ఒప్పందం" - నెహ్రూ
ఇలా జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన ఈ ఉపన్యాసాన్ని ఆనాడు ఆలిండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

''మన స్వల్పమైన బాధలు, త్యాగాల వల్ల ఈ విజయం లభించినా, ఇది ప్రపంచ శక్తుల సంఘటనల ఫలితం అని కూడా తెలుసుకోవాలి. బ్రిటిష్ పాలకుల ప్రజాస్వామ్య ఆశయాలు, వారి చారిత్రక సాంప్రదాయ సిద్ధి కూడా కొద్దో గొప్పో కారణాలు అయ్యాయని కూడా తెలుసుకోవాలి" - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్

1947, ఆగస్టు 15న ఏర్పడిన స్వతంత్ర భారతదేశ మొదటి మంత్రివర్గం

     నెహ్రూ ప్రజాస్వామిక స్వభావం మొదటి మంత్రిమండలి కూర్పులో ప్రతిబింబిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందని ప్రముఖులను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వారు:
    1. డా.బి.ఆర్. అంబేడ్కర్
    2. సీహెచ్. బాబా
    3. జాన్ ముత్తాయ్
    4. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ
    5. షణ్ముగం షెట్టియార్

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగ పరిణామ క్రమం 

ఈస్టిండియా కంపెనీ 
బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ - I బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం 1600 డిసెంబరు 31 న 'చార్టర్' ద్వారా అనుమతిని జారీ చేసింది. ఈ చార్టర్ కాలపరిమితి 15 సంవత్సరాలు. దీన్ని తర్వాతి కాలంలో పొడిగిస్తూ వచ్చారు.
*  కంపెనీ (ఈస్టిండియా కంపెనీ) బక్సార్ యుద్ధం (1765) లో విజయం సాధించి, 'బెంగాల్ దివానీ అధికారాన్ని' పొందడం ద్వారా ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది కంపెనీ పాలనకు పునాదైంది. 1765 నుంచి 1773 వరకు ద్వంద్వ ప్రభుత్వం కొనసాగింది.
*  భారతదేశంపై బ్రిటిష్ ప్రభుత్వం తన సార్వభౌమాధికారాన్ని రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా ప్రకటించింది. అనేక మార్పులతో కంపెనీపాలన 1858 వరకు కొనసాగింది. 1858 నుంచి 1947 లో భారతదేశం స్వాతంత్య్రం పొందేవరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలన సాగించింది. బ్రిటిష్ పాలనలో భారతీయుల డిమాండ్లు, విన్నపాలు, చర్చలు, విమర్శలు, ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. ఈ చట్టాల క్రమాన్ని భారత రాజ్యాంగ చరిత్రగా చెప్పవచ్చు.
*  భారత రాజ్యాంగ చరిత్రను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి:
    1) ఈస్టిండియా కంపెనీ పాలన (1773 - 1858)
    2) బ్రిటిష్ ప్రభుత్వ పాలన (1858 - 1947)

ఈస్టిండియా కంపెనీ పాలన 
కంపెనీని స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి / చక్రవర్తి సర్వాధికారి. కానీ 1773 నాటికి బ్రిటిష్ పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. దీంతో బ్రిటిష్ పార్లమెంటు ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి, చక్కదిద్దడానికి అనేక చట్టాలు చేసింది. అందులో మొదటిది రెగ్యులేటింగ్ చట్టం 1773.

రెగ్యులేటింగ్ చట్టం 1773
 దీన్ని భారతదేశంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు. దీన్ని బ్రిటిష్ పార్లమెంటులో అప్పటి ప్రధాని 'లార్డ్ నార్త్' ప్రవేశపెట్టాడు. ఇది 1773 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే భారత రాజ్యాంగానికి పునాదైంది. 
ముఖ్యాంశాలు: ఈ చట్టం ఇంగ్లండ్, భారతదేశంలో కంపెనీకి సంబంధించి అనేక మార్పులను చేసింది.
ఇంగ్లండ్‌లో వచ్చిన మార్పులు:
* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ (కంపెనీ పాలక వర్గం) పదవీకాలాన్ని ఒక సంవత్సరం నుంచి 4 సంవత్సరాలకు పెంచారు. ప్రతి సంవత్సరం మొత్తం సభ్యుల్లో 1/4 వ వంతు పదవీ విరమణ చేస్తారు. తిరిగి అంతేమంది ఎన్నికవుతారు.
* కంపెనీ ప్రొప్రైటర్లు (యజమానులు) ఓటు హక్కు అర్హత పొందడానికి కనీసం 6 నెలలకు బదులు సంవత్సర కాలం పాటు, 500 పౌండ్లకు బదులు 1000 పౌండ్లకు మించిన వాటాలున్న వారికి పరిమితం చేశారు.
భారతదేశంలో వచ్చిన మార్పులు:
* బెంగాల్ గవర్నర్ హోదాను బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల నిర్వహణపై బెంగాల్ గవర్నర్ జనరల్‌కు పర్వవేక్షణ అధికారాన్ని కల్పించారు. 
* 'గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి'ని ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. గవర్నర్ జనరల్‌కు విధి నిర్వహణలో సాయపడటం దీని ప్రధాన విధి. కౌన్సిల్‌లో నిర్ణయాలు మెజారిటీ ప్రాతిపదికపై తీసుకుంటారు. గవర్నర్ జనరల్‌కు నిర్ణాయక ఓటు (Casting Vote) ను కల్పించారు.
* కలకత్తాలోని ఫోర్ట్ విలియం (బ్రిటిష్ వర్తక స్థావరం)లో సుప్రీంకోర్టు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇది 1774 లో ఏర్పాటైంది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఉంటారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. సుప్రీంకోర్టు తీర్పులపై 'కింగ్ కౌన్సిల్' (రాజు లేదా రాణి కౌన్సిల్ నిర్ణయాలను పాటించడం) కు అప్పీల్ చేసుకోవచ్చు.
* గవర్నర్ జనరల్, కౌన్సిల్ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తులు, ఇతర ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం చేయడాన్ని, స్థానికుల (భారతీయులు) నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బహుమతులు తీసుకోవడాన్ని నిషేధించింది.
* కంపెనీకి 20 సంవత్సరాల కాలపరిమితికి (పొడిగిస్తూ) చార్టర్ జారీ చేశారు.

పిట్స్ ఇండియా చట్టం 1784 
రెగ్యులేటింగ్ చట్టం 1773 లోని లోపాలను సవరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయడమే ఈ చట్టం ఉద్దేశమని అప్పటి ఇంగ్లండ్ ప్రధాని 'విలియం పిట్' తెలియజేశారు. అతడి పేరు మీద ఈ చట్టం 'పిట్స్ ఇండియా' చట్టంగా ప్రాచుర్యం పొందింది. 
ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి 'బోర్డ్ ఆఫ్ కమిషనర్స్' ఏర్పాటైంది. దీన్నే 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అని కూడా అంటారు. దీనికి 'సెక్రటరీ ఆఫ్ స్టేట్' అధ్యక్షుడు. ఇతడికి నిర్ణాయక ఓటును కల్పించారు. సభ్యుల కాల పరిమితి 4 సంవత్సరాలు.
* ఈస్టిండియా కంపెనీ విధులను వాణిజ్య, రాజకీయ విధులుగా విభజించి, వాణిజ్య విధులను పూర్తిగా 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌'కు, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌'కు అప్పగించారు. భారతదేశంలోని కంపెనీ భూభాగాలు, ఆదాయంపై ఈ బోర్డుకు సంపూర్ణ అధికారాన్ని కల్పించారు.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి ఆదేశాలను పాటించని గవర్నర్లను, ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.
* 1786 లో జరిగిన సవరణ ఫలితంగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్ జనరల్‌కు వచ్చింది. అంతేకాకుండా గవర్నర్ జనరల్‌నే సర్వసైన్యాధ్యక్షుడిని చేశారు. ఈ సవరణ చట్టంతో గవర్నర్ జనరల్‌కు తన కౌన్సిల్ నిర్ణయాలను 'వీటో' చేసే అధికారం వచ్చింది. గవర్నర్ జనరల్ పదవి, అధికారాలు సుస్థిరం, విస్తృతమయ్యాయి.
* గవర్నర్ జనరల్, గవర్నర్ల కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 3 కు తగ్గించారు.

చార్టర్ చట్టం 1793 
ఫ్రాన్స్ పరిణామాలు (ఫ్రెంచి విప్లవం) ఇంగ్లండ్ వాణిజ్యంపై వ్యతిరేక ప్రభావం చూపడంతో విదేశీ వ్యాపారాన్ని, సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కంపెనీ సహకారం అవసరమైంది.
ముఖ్యాంశాలు: కంపెనీ అధీనంలోని ప్రాంతాలు, వాటిపై వచ్చే ఆదాయాన్ని మరో 20 సంవత్సరాలపాటు కంపెనీకే అప్పగించారు.
* స్వదేశీ ఖర్చుల పేరుతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యుల, కార్యాలయ సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చులను కంపెనీ ప్రభుత్వం (భారతదేశం నుంచి వచ్చే రెవెన్యూ) భరించే విధంగా చట్టంలో మార్పు చేశారు. ఇది 1793 నుంచి భారత ప్రభుత్వ చట్టం 1919 అమల్లోకి వచ్చేవరకు కొనసాగింది.
* గవర్నర్ జనరల్ కౌన్సిల్ సమావేశాలకు గవర్నర్ జనరల్ లేని సమయంలో 'వైస్ ప్రెసిడెంట్' అధ్యక్షత వహిస్తాడు. వైస్ ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాన్ని గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.
¤ భారతదేశంలో ఆంతరంగిక పాలనకు తగిన నిబంధనలను తయారు చేసే అధికారాన్ని గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కు ఇచ్చారు. భారతీయుల వ్యక్తిగత ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ జారీచేసే నిబంధనలు శాసనాలతో సమానమైన విలువను కలిగి ఉంటాయి. దీని ఆధారంగానే 'కారన్ వాలీస్ కోడ్' రూపొందింది. దీంతో భారతదేశంలో రాతపూర్వక శాసన నిర్మాణం ప్రారంభమైందని చెప్పవచ్చు.
¤ కంపెనీ ఉద్యోగులకు 'సీనియారిటీ' ప్రాతిపదికపై ప్రమోషన్లను కల్పిస్తారు.

చార్టర్ చట్టం 1813 
భారత రాజ్యాంగ క్రమపరిణామంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా చెప్పొచ్చు.
ముఖ్యాంశాలు: భారతదేశంలో కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాల పాటు పొడిగించారు. కంపెనీ పాలన కొనసాగినప్పటికీ కంపెనీ ప్రాంతాలపై రాణి / చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా ప్రకటించింది.
* కంపెనీకి ఉన్న వ్యాపార గుత్తాధికారాన్ని తొలగించారు. బ్రిటిష్ పౌరులందరికీ భారతదేశంలో స్వేచ్ఛా వ్యాపారాన్ని అనుమతించింది. అయితే కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా తేయాకు, చైనాతో వ్యాపారంలోనూ కంపెనీకి ఉన్న గుత్తాధికారం కొనసాగింది.
* భారతీయులను సంస్కరించడం, విజ్ఞానవంతులను చేయడం కోసం మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించారు. అవి భారతదేశంలో చర్చ్‌లు, ఆసుపత్రులు, విద్యాలయాలను స్థాపించడం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది.
* భారతీయులకు విజ్ఞానశాస్త్రాన్ని పరిచయం చేయడం, ప్రోత్సహించడం కోసం రూ.1,00,000 తో ఒక నిధిని భారతదేశంలో ఏర్పాటు చేశారు.
* పన్నులను విధించడానికి, వాటిని చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.
* కంపెనీ పరిపాలనలో పనిచేసే సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. పౌర ఉద్యోగులకు హేలీబ్యూరి కాలేజ్‌లోను (ఇంగ్లండ్), సైనికోద్యోగులకు ఎడిస్ కోంబ్‌లోని మిలిటరీ సెమినరీలోను శిక్షణను ఏర్పాటు చేశారు. * ఈ రెండింటినీ 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అధీనంలో ఉంచారు.

చార్టర్ చట్టం 1833 
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం కేంద్రీకృత పాలనా వ్యవస్థను ఏర్పాటుచేసింది. కంపెనీ భూభాగాలు బ్రిటిష్ రాణి లేదా చక్రవర్తి వారసులకు చెందుతాయని ప్రకటించింది.  
ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాలు పొడిగించారు. అయితే తేయాకు, చైనాతో ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. 
* కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
* 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' నిర్మాణంలో మార్పు తెచ్చారు. అనేక మంది మంత్రులు పదవిరీత్యా సభ్యులయ్యారు. ఉదాహరణకు - లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కౌన్సిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ మొదలైనవారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్' హోదాను 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 'విలియం బెంటింక్'.
* గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 3 నుంచి 4 కు పెంచారు. నాలుగో సభ్యుడిగా 'లా మెంబరు'ను చేర్చారు. కౌన్సిల్‌లో మొదటి లా మెంబరు లార్డ్ మెకాలే.
* బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను రద్దు చేశారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కే పూర్తి శాసనాధికారం లభించింది. గవర్నర్ జనరల్ అధ్యక్షతనున్న కౌన్సిల్ శాసనాలు 'బ్రిటిష్ - ఇండియా' మొత్తానికి, అందరు వ్యక్తులకు, న్యాయస్థానాలకు వర్తిస్తాయి.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ 'లా కమిషన్‌'ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
* సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతి (open competition) ని ప్రతిపాదించారు. కానీ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' వ్యతిరేకించడంతో అది అమల్లోకి రాలేదు.
* భారత వ్యవహారాల మంత్రిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా చేశారు.
* భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను గవర్నర్ జనరల్ కౌన్సిల్‌పై ఉంచింది.
* యూరోపియన్లకు భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పరచుకోవడానికి అనుమతించారు.

చార్టర్ చట్టం 1853 
బ్రిటిష్ పార్లమెంటు చేసిన చార్టర్ చట్టాల్లో చివరిది. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న, నిర్దిష్ట కాలపరిమితి లేకుండా జారీ చేసిన చట్టం ఇది.
ముఖ్యాంశాలు: గవర్నర్ జనరల్ కౌన్సిల్ విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించి, శాసనాలను రూపొందించడానికి 'ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'ను ఏర్పాటు చేశారు. శాసన నిర్మాణం కోసం 12 మంది సభ్యులు ఉంటారు. ఇది రూపొందించే చట్టాలకు గవర్నర్ జనరల్ ఆమోదం అవసరం. గవర్నర్ జనరల్‌కు వీటో అధికారం ఉంటుంది. 'సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'నే మినీ పార్లమెంటు అంటారు. దీంతో భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థను మొదటిసారిగా పరిచయం చేసినట్లయ్యింది.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ (కేంద్ర శాసన మండలి)లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం 12 మందిలో గవర్నర్ జనరల్, సర్వసైన్యాధ్యక్షుడు, కౌన్సిల్‌లోని నలుగురు సాధారణ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక సాధారణ న్యాయమూర్తి, నలుగురు సభ్యులను మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా నుంచి తీసుకున్నారు.
* బ్రిటిష్ ఇండియాలో సివిల్ సర్వీసు నియామకాలను సార్వజనీన లేదా బహిరంగ పోటీ ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. అంతవరకూ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' నియమించేవారు.
* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సంఖ్యను 24 నుంచి 18 కి తగ్గించారు. వీరిలో ఆరుగురిని నియమించే అధికారం రాణి లేదా చక్రవర్తికి ఇచ్చారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'కు ఉన్న 'గవర్నర్ ఆఫ్ బెంగాల్' అనే హోదాను రద్దు చేశారు.
* భారతదేశంలో వ్యాపార సంస్థగా ప్రారంభమైన ఈస్టిండియా కంపెనీ 1858 నాటికి కేవలం పరిపాలనా సంస్థగానే మిగిలింది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు (లేదా) ప్రథమ స్వాతంత్య్ర పోరాటం తర్వాత రద్దయింది. కంపెనీ స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలనాధికారాలను స్వీకరిస్తూ 1858 నవంబరు 1 న ఒక ప్రకటన జారీ చేసింది.  
 * భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ద్వారా రూపొందించినప్పటికీ ఇది ఒక సుదీర్ఘ చారిత్రక క్రమపరిణామ ఫలితమని చెప్పొచ్చు.
 *  బ్రిటిష్ - ఇండియా ప్రాంతాల పాలన కోసం 1773 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది.
 * ఇవి భారత రాజ్యాంగ రూపకల్పనలో రాజ్యాంగ పరిషత్‌కు ఆధారంగా నిలిచాయి. 

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశం - సమాఖ్య, ఏకకేంద్ర వ్యవస్థల సమ్మేళనం

విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో విస్తరించిన భారతదేశం ఏకీకృతంగా ఎలా ఉంది? కేంద్రం, రాష్ట్రాలకు అధికారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటిని కలిపి ఉంచే శక్తి ఏమిటి? అధికారాల విభజనకు ప్రాతిపదిక ఏది? పాలిటీ అధ్యయనంలో భాగంగా వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులు అవగాహనను పెంచుకోవాలి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సంబంధాలను ఆధారం చేసుకొని రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల నిర్మాణాన్ని సమాఖ్య, ఏకకేంద్రాలుగా పేర్కొంటారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. ఏకకేంద్రంలో పరిపాలన అధికారాలు మొత్తం కేంద్రం వద్ద ఉంటాయి.

సమాఖ్య లక్షణాలు
ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ: మన రాజ్యాంగం ప్రకారం జాతీయస్థాయిలో కేంద్ర, ప్రాంతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యం ఉన్న విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్‌, రైల్వేలు, తంతి తపాలా మొదలైన అంశాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం, ప్రజారోగ్యం, శాంతిభద్రతలు తదితరాలను పర్యవేక్షిస్తాయి.

రాజ్యాంగ ఆధిక్యత: భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి, రాజ్యాంగం ద్వారానే అధికారాలను పొంది, రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తాయి. దేశంలోని వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరించాలి.

లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రారంభ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్‌, 8 షెడ్యూల్స్‌, 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలు, విధులు వాటి నిర్వహణలో పరిమితులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఆర్టికల్‌ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని, ఆర్టికల్‌ 162 రాష్ట్రప్రభుత్వాల అధికార పరిధిని వివరిస్తాయి.

భారత రాజ్య వ్యవస్థ సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగానూ, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగానూ వ్యవహరిస్తుంది. - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్

అధికారాల విభజన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను మూడు రకాలుగా చేసి ఏడో షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఇది సమాఖ్య వ్యవస్థ లక్షణం.
కేంద్ర జాబితా: దీనిలో జాతీయ ప్రాధాన్యం ఉన్న 97 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 100.

రాష్ట్ర జాబితా: దీనిలో ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న 66 అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం వీటి సంఖ్య దాదాపు 61.

ఉమ్మడి జాబితా: దీనిలో జాతీయ, ప్రాంతీయాలకు సంబంధించిన 47 అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 52. ఈ జాబితాల్లో లేని అంశాలను ‘అవశిష్టాధికారాలు’ అంటారు. అవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి.

సమాఖ్య వ్యవస్థ దేశాలు: అమెరికా, రష్యా, స్విట్జర్లాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, మెక్సికో.

ఏకకేంద్ర వ్యవస్థ దేశాలు: శ్రీలంక, బ్రిటన్‌, చైనా, జపాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌.
 
Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు

1. మత స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?
జ: ఆర్టికల్స్‌ 25 - 28

2. ‘భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు’ అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 25

3. ఆర్టికల్‌ 26లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
    1) భారతీయులు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కలిగి ఉన్నారు.
    2) మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
    3) ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై పన్నులు ఉండవు.
    4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

4. మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల నుంచి ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?
జ: ఆర్టికల్‌ 27

5. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో మత బోధనను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తోంది?
జ: ఆర్టికల్‌ 28

6. ఆర్టికల్‌ 25 ప్రకారం హిందువులు అంటే?
     1) హిందువులు       2) జైనులు, బౌద్ధులు       3) సిక్కులు     4) అందరూ
జ: 4 (అందరూ)

7. ఎస్‌.పి. మిట్టల్‌ ‌VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సరికానిది?
జ: ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగం

8. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని రాజ్యాంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?
జ: ఆర్టికల్‌ 29

9. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ చెబుతోంది?
జ: ఆర్టికల్‌ 30

10. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాన్ని గుర్తించండి.
జ: మతపరమైన అల్పసంఖ్యాక వర్గం, సంస్కృతి పరమైన అల్పసంఖ్యాక వర్గం

11. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను గుర్తించేదుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: దేశం

12. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలను నిర్దారించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: రాష్ట్రం

13. ప్రారంభ రాజ్యాంగంలో ఆస్తిహక్కు గురించి ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 31

14. ఆస్తిహక్కుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
జ: దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.

15. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
జ: డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

16. కిందివాటిలో రిట్స్‌కు సంబంధించి సరికానిది?
      1) రిట్‌ అంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం.
      2) ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.
      3) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది.
      4) ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తాయి.
జ: 2 (ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.)

17. ఆర్టికల్‌ 33 ప్రకారం ప్రాథమిక హక్కులు ఎవరికి పూర్తిగా లభించవు?
      1) సైనిక, పారామిలటరీ దళాలు                                      
      2) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు
      3) పోలీసు, ఇతర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు            
      4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

18. ఆర్టికల్‌ 34 ప్రకారం విధించే ఏ శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు?
జ: సైనిక శాసనం

19. ‘మీరు నిర్బంధించిన వ్యక్తిని ప్రయాణ సమయం మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా నా ముందు హాజరు పరచు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం/రిట్‌ ఏది?
జ: హెబియస్‌ కార్పస్‌

20. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ ఎవరైనా అధికారాలు చెలాయిస్తుంటే వారిని నియంత్రించేందుకు న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: కోవారెంటో

21. దిగువ న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్‌?
జ: ప్రొహిబిషన్‌

22. కిందివాటిలో న్యాయస్థానాలు న్యాయస్థానాలపైన జారీ చేసే రిట్‌ ఏది?
      1) సెర్షియోరరీ    2) ప్రొహిబిషన్‌     3) సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌    4) మాండమస్‌
జ: 3 (సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌)

23. ప్రభుత్వోద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: మాండమస్‌

24. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరిపై జారీచేసే అవకాశం ఉంటుంది?
జ: ప్రభుత్వ వ్యక్తులు, ప్రైవేట్‌ వ్యక్తులు

25. హక్కులు, విధులు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి అని అభివర్ణించినవారు?
జ: హెచ్‌.జె. లాస్కి

26. న్యాయస్థానం ఒక పనిని చేయమని లేదా వద్దని ఇచ్చే ఆదేశాన్ని ఏమంటారు?
జ: ఇంజక్షన్‌

27. PIL అంటే?
జ: Public Interest Litigation

28. PIL అనే భావన (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించింది?
జ: అమెరికా

29. మన దేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే భావనకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి?
జ: జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి

30. న్యాయస్థానం కేసును స్వతహాగా అంటే తనకు తానే తీసుకుని విచారించడాన్ని ఏమంటారు?
జ: సుమోటో

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ చరిత్ర

     భారత రాజ్యాంగం - ఒక సమున్నత లక్ష్య సాధనకు చేసిన మేధో సాగర మథనం.. స్వతంత్ర భారతావని ఉజ్వల భవిష్యత్తు స్వప్న సాకారానికి సుందర రూపం.. స్వతంత్ర ఫలాల మాధుర్య ఫలితాలు, భారతీయుల ఆశలు - ఆకాంక్షలకు అక్షర రూపం.. తరతరాల ప్రగతికాముక భవిత నిర్దేశిత ప్రణాళికా సౌధం.. ఇంతటి అద్భుత లిఖిత రాజ్యాంగ నిర్మాణం వెనుక విశేషమైన చరిత్ర ఉంది. భారత ప్రముఖుల అనిర్వచనీయ కృషి ఉంది. వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది. 5 దశలుగా చెప్పుకొనే రాజ్యాంగ నేపథ్య చరిత్రలో మొదటి 3 దశలివి.. క్రీ.శ. 1600 నుంచి 1919 భారత ప్రభుత్వ చట్టం వరకు.. ఉన్న చారిత్రక అంశాలను తెలుసుకుందాం.
     ప్రజాస్వామ్య రాజ్యాల అవతరణతో వ్యక్తుల పాలన కాకుండా ప్రజలకు చట్టబద్ధపాలన అందిచాలన్న సూత్రం ప్రాతిపదికగా ఆధునిక రాజ్యాంగబద్ధ పాలనకు పునాదులు ఏర్పడ్డాయి. రాజనీతి శాస్త్ర పితామహుడిగా భావించే అరిస్టాటిల్ క్రీస్తుపూర్వమే (384-322) రాజ్యాంగం ప్రాధాన్యం, విశిష్టతలను తెలియజెప్పాడు. ఆయన ఆనాడే చెప్పిన మాటలు రాజ్యాంగబద్ధ పాలనకు స్ఫూర్తిగా నిలిచాయి.

భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం
బ్రిటిష్ రాజ్యాంగవేత్త, సర్ ఐవర్ జెన్నింగ్స్ అభిభాషణ ప్రకారం - రాజ్యాంగాలు గతానికి వారసులు, భవిష్యత్తుకు వీలునామాలు. భారత రాజ్యాంగ చరిత్ర పరిణామక్రమాన్ని పరిశీలిస్తే.. భారత రాజ్యాంగం కూడా గత అనుభవాల నుంచి క్రోడీకరించి దేశ భవిష్యత్తు కోసం రూపొందించిన ఒక మహత్తర శాసనపత్రం. భారత రాజ్యాంగ చరిత్రకు విశేష, విశిష్ట నేపథ్యం ఉంది. ఆంగ్లేయులు క్రీ.శ. 1600 సంవత్సరంలో భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి.. ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి చట్టబద్ధ అనుమతి ఇవ్వడంతో - వారి ప్రవేశంతోనే భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైంది. అనంతరం రూపుదిద్దుకున్న అనేక సామాజిక, రాజకీయ పరిణామాలు.. ఉద్యమాలు, సంస్కరణలు.. కాలగమనంలో చేసిన ఎన్నో చట్టాలతో కొనసాగింది. చివరిగా భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమల్లోకి వచ్చే వరకు ఇదంతా భారత రాజ్యాంగ చరిత్రే.

విస్తరణ క్రమం
భారత రాజ్యాంగ విస్తరణ పరిణామ క్రమాన్ని 5 దశలుగా విభజించవచ్చు.
  మొదటి దశ 1600-1765
  రెండో దశ 1765-1858
  మూడో దశ 1858-1919
  నాలుగో దశ 1919-1947
  అయిదో దశ 1947-1950

మొదటి దశ
భారత రాజ్యాంగ విస్తరణ పరిణామ క్రమంలో మొదటి దశ ప్రధానాంశాలివి..
* ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి మొదటి ఎలిజబెత్ మహారాణి 1600, డిసెంబరు 31 చార్టర్ ప్రకారం అనుమతి ఇవ్వడం.
* మొగల్ సామ్రాజ్య విచ్ఛినం, ఔరంగజేబు మరణానంతర పరిస్థితుల్లో.. ఇదే అవకాశంగా ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను 1757 ప్లాసీ యుద్ధంలో ఓడించడంతో భారతదేశంలో ఆంగ్లేయుల పాలనకు తెరలేచింది.

రెండో దశ
రెండో దశలోని ప్రధాన పరిణామాలు..
* 1773 రెగ్యులేటింగ్ చట్టం - భారతదేశానికి సంబంధించి దీన్ని 'మొదటి లిఖిత రాజ్యాంగ చట్టం'గా పేర్కొంటారు. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటిసారిగా రాజకీయ, పరిపాలనా అధికారాలను కట్టబెట్టింది.
* కలకత్తాలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ఏర్పాటైంది. ప్రధాన న్యాయమూర్తిగా ఎలీజా ఇంఫే ను నియమించారు.
* ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల పాటు వ్యాపారం కొనసాగించడానికి అనుమతి.
* బెంగాల్ గవర్నర్ హోదాను 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌'గా మార్పు. 1772, ఏప్రిల్ 13న వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా నియామకం.
* కంపెనీ అధికారుల అసమర్ధ నిర్వహణ, బాధ్యతా రాహిత్యం, అవినీతి కార్యకలాపాల నియంత్రణకు చర్యలు.
* పిట్స్ ఇండియా చట్టం 1784 - నాటి బ్రిటన్ ప్రధాని విలియం పిట్ ప్రతిపాదించిన చట్టం ఇది. రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి చేసిన చట్టం.
* ఈస్ట్ ఇండియా కంపెనీలో మొదటిసారిగా ద్వంద్వ పాలన ప్రవేశ పెట్టారు. కంపెనీ కార్యకలాపాలను వాణిజ్య, రాజకీయ వ్యవహారాలుగా వేరు చేశారు.
* కంపెనీ రాజకీయ, సైనిక, రెవెన్యూ వ్యవహారాలను ఇంగ్లండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌'కు అప్పగించారు.
* బోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ను వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారు.
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రెండు సంస్థలూ కంపెనీ పాలనను నియంత్రించడం వల్ల ఈ చట్టం ద్వంద్వ పాలన విధానానికి నాంది పలికింది.

1813 చార్టర్ చట్టం
* ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాలు పొడిగించారు.
* కంపెనీకి వర్తకంపై ఉన్న గుత్తాధిపత్యం తొలగింపు. భారత్‌లో వ్యాపారం చేసుకోవ డానికి అందరికీ అవకాశం.
* స్థానిక సంస్థలకు పన్నులు విధించడానికి.. పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవడానికి అధికారాలు కల్పించారు.
* భారతదేశంలో మిషనరీలు ప్రవేశించడానికి అనుమతిచ్చారు.

1833 చార్టర్ చట్టం
* ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మరో 20 సంవత్సరాలు పొడిగించారు.
* గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ హోదాను 'భారత గవర్నర్ జనరల్‌'గా మార్చారు. దీంతో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్ భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ అయ్యారు.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి భారతీయ 'లా' కమిషన్‌ను నియమించారు. దానికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
* ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా పేర్కొన్నారు.

1853 చార్టర్ చట్టం - ప్రధానాంశాలు
* బ్రిటిష్ పార్లమెంటు అనుమతి ఉన్నంత వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిర్వహణకు అవకాశం.
* ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటైంది. దాని ద్వారా గవర్నర్ జనరల్‌కి శాసనాలు రూపొందించే అధికారం కల్పించారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు.
* వివిధ 'లా' కమిషన్ల సిఫార్సుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859), భారతీయ శిక్షాస్మృతి (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1861) చట్టాలు రూపొందించారు.
* సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీ ద్వారా నియమించే పద్ధతి ప్రవేశపెట్టారు.

మూడో దశ
మూడో దశలో ప్రధాన పరిణామాలు..
* భారత ప్రభుత్వ చట్టం 1858 - భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు పర్యవసానంగా చేసిన ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమై బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలన ప్రవేశ పెటారు. 1858, నవంబరు 1న బ్రిటిష్ రాణి భారత పరిపాలన అధికారాన్ని చేపట్టింది.
* గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి వైస్రాయ్ కానింగ్. అయితే బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ జనరల్‌గానూ, స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయ్‌గానూ వ్యవహరించేవారు.
* ద్వంద్వ పాలన రద్దయింది.
* భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించారు. మొదటి కార్యదర్శి లార్డ్ స్టాన్లీ.

భారత కౌన్సిల్ చట్టం 1861
ఈ చట్టం ద్వారా భారతీయులకు శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం వచ్చింది.
* 1862లో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో హైకోర్టులు ఏర్పాటయ్యాయి.
* బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు.

భారత కౌన్సిల్ చట్టం 1909
   (మార్లే-మింటో సంస్కరణలు)
భారతదేశంలో నాటి తీవ్రవాద, జాతీయవాదాల్లో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే, భారత్ వైస్రాయ్ మింటో పేర్లతో ఈ చట్టం రూపొందింది.

* కేంద్ర, రాష్ట్ర శాసన మండళ్లలో సభ్యుల సంఖ్య పెంచారు.
* ఈ చట్టం ఎన్నికల వ్యవస్థను ప్రవేశ పెట్టింది.
* మహమ్మదీయులకు, వ్యాపార సంఘాల సభ్యులకు ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించారు.

భారత ప్రభుత్వ చట్టం 1919
(మాంటేగ్ - ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు)
* 1917, ఆగస్టు 20న బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రకటించింది. ఈదిశగా, భారత రాజ్య కార్యదర్శి ఎడ్సిన్ మాంటేగ్, వైస్రాయ్ లార్డ్ ఛేమ్స్‌ఫర్డ్ 1917 నవంబరు భారతీయ నాయకులతో చర్చలు జరిపి బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటుకు సంస్కరణలు ప్రవేశపెట్టారు.
* ఈ చట్టం భారతదేశంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసింది.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య పాలనాంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనే రెండు జాబితాలుగా రూపొందించారు.
* రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలన ప్రవేశ పెట్టారు.
* ఈ చట్టం ద్వారా కేంద్రంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు.
* భారతదేశంలో పరిమితమైన ప్రత్యక్ష ఎన్నికల పద్థతిని ప్రవేశపెట్టారు.
* ఆస్తి, పన్ను చెల్లింపు ప్రతిపాదికలుగా పరిమితమైన ఓటుహక్కు కల్పించారు.
* ఈ సంస్కరణలు భారతీయులను నిరాశ, అసంతృప్తికి గురిచేసినా భారతదేశంలో స్వపరిపాలన దిశగా ప్రముఖమైన ముందంజగా, భారత రాజ్యాంగ చరిత్రలో ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు.

* మన రాజ్యాంగం
* బ్రిటిష్ సవాల్‌కు దీటైన సమాధానం
* మలి రెండు దశల పరిణామక్రమం

సువిశాల భారతావని సుందర భవిష్యత్తుకు మార్గదర్శనం చేసే అద్భుత అక్షర స్వరూప మైన రాజ్యాంగం రూపకల్పన ఓ మహత్తర ప్రక్రియ. రాజ్యాంగ రచనపై భారతీయుల సామర్థ్యాన్ని శంకిస్తూ బ్రిటన్ మంత్రి విసిరిన సవాల్‌కు భారత ప్రముఖులు చెప్పిన దీటైన సమాధానం. మన రాజ్యాంగ సుదీర్ఘ నేపథ్య చరిత్రలో కీలకమైన చివరి రెండు దశల్లో ఈ అద్భుతం సాకారమైంది. 1919 నుంచి 1950 జనవరి 26 దాకా అతిపెద్ద లిఖిత రాజ్యాంగ రూపకల్పన వెనుక చోటు చేసుకున్న పరిణామాలు.. నేతల కృషి.. దూరదృష్టి.. తదితర అంశాలపై అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
క్రీ.శ. 1600 నుంచి ప్రారంభమైన భారత రాజ్యాంగ నేపథ్య చరిత్రకు సంబంధించిన 5 దశల్లో చివరి 2 దశలూ ఎంతో కీలకమైనవి. 1919 నుంచి.. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 వరకు ఉన్న 4, 5 దశల్లోనే ప్రధానమైన అంశాలెన్నో చోటు చేసుకున్నాయి. వీటిలో 1919-1947 మధ్య కాలం నాలుగో దశ కాగా.. 1947-1950 మధ్య కాలం అయిదో దశ..

నాలుగో దశ
నాలుగో దశ ప్రధాన పరిణామాలివి..
సైమన్ కమిషన్-1927: భారత ప్రభుత్వ చట్టం-1919 ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1927 నవంబరులో ఆరుగురు సభ్యులతో కూడిన ఒక కమిషన్‌ను సర్ జాన్ సైమన్ నాయకత్వంలో భారతదేశానికి పంపించింది. ఇందులోని సభ్యులంతా ఆంగ్లేయులే కావడం, ఒక్క భారతీయుడూ లేకపోవడంతో భారతీయులు ఈ కమిషన్‌ని పూర్తిగా వ్యతిరేకించారు.
సైమన్ కమిషన్ 1930లో సమర్పించిన నివేదికలోని ముఖ్యాంశాలు..
* రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన రద్దు.
* సమాఖ్య వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం.
* కమ్యూనల్ ప్రాతినిధ్యానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొనసాగింపు.
* మొదటిసారిగా సమాఖ్య వ్యవస్థకు సూచన.

నెహ్రూ నివేదిక - 1928
కాంగ్రెస్ నాయకులు సైమన్ కమిషన్‌ను బహిష్కరించిన తరుణంలో బ్రిటన్‌లోని భారత వ్యవహారాల మంత్రి లార్డ్ బెర్కెస్ హెడ్ భారతీయుల రాజ్యాంగ రచనా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ 'భారతీయులు.. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచనను స్వయంగా చేసుకోగలరా?' అని విసిరిన సవాల్‌ను స్వీకరించిన నేపథ్యంలో.. 1928, మే 19న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 1928, ఆగస్టు 10న మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 8 మంది సభ్యులతో ఒక ఉపసంఘం ఏర్పాటైంది. ఆ ఉపసంఘం ఇచ్చిన నివేదికనే నెహ్రూ నివేదిక అంటారు.
నెహ్రూ నివేదిక ప్రధానాంశాలు:
* భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం.
* కార్య నిర్వాహక శాఖ శాసనసభకు బాధ్యత వహించడం.
* ప్రాథమిక హక్కుల ప్రస్తావన.

మొదటి రౌండ్ టేబుల్ సమావేశం(1930, నవంబరు 12 - 1931, జనవరి 19)
భారత్‌కు త్వరలో 'స్వతంత్ర ప్రతిపత్తి' కల్పించడం బ్రిటిష్ విధానమని నాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ 1929, అక్టోబరు 31న చేసిన ప్రకటన (దీన్ని దీపావళి ప్రకటన అని అంటారు)కు అనుగుణంగా లండన్‌లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనిలో కాంగ్రెస్ పాల్గొనలేదు. ఈ సమావేశంలో భావి భారత రాజ్యాంగం సమాఖ్యగా ఉండాలా? (లేదా) ఏక కేంద్రంగా ఉండాలా? అన్న అంశంపై చర్చించారు.

గాంధీ-ఇర్విన్ ఒప్పందం (1931, మార్చి 5)
     భారత రాజ్యాంగ సమావేశాలపై జరిగే చర్చలు.. అందుకుగాను నిర్వహించే రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీజీని ఒప్పించాలని బ్రిటిష్ ప్రభుత్వం వైస్రాయ్ ఇర్విన్‌ను ఆదేశించింది. ఈ మేరకు 1931, మార్చి 5న గాంధీ - ఇర్విన్‌ల మధ్య జరగిన సమావేశాన్ని గాంధీ-ఇర్విన్ ఒప్పందం అంటారు.

ఒప్పందంలోని ముఖ్యాంశాలు
* రాజకీయ ఖైదీలను విడుదల చేయడం.
* శాసనోల్లంఘన ఉద్యమాన్ని కాంగ్రెస్ నిలిపివేసి, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం.

రెండో రౌండ్ టేబుల్ సమావేశం (1931, సెప్టెంబరు 7 - డిసెంబరు 7)
* కాంగ్రెస్ తరపున ఈ సమావేశానికి గాంధీజీ హాజరయ్యారు. అన్ని స్వదేశీ సంస్థానాలతో సహా 107 మంది పాల్గొన్నారు.
* సమావేశంలో ముస్లిం వర్గాలకు రెండు కొత్త ప్రావిన్స్ (నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్, సింధ్)లను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటిష్ వారు ప్రకటించడంతో.. గాంధీజీ దాన్ని 'విభజించు, పాలించు' అనే విధానంగా భావించి తీవ్రంగా వ్యతిరేకించారు.

కమ్యూనల్ అవార్డు (1932)
* 1932, ఆగస్టు 4న అప్పటి బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్ డొనాల్డ్ మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికిగాను చేసిన ఒక ప్రతిపాదనను కమ్యూనల్ అవార్డు అంటారు. దాని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ 1932, సెప్టెంబరు 20న పుణెలోని ఎరవాడ కారాగారంలో ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం
(1932, నవంబరు 17 - డిసెంబరు 24)

* మూడో రౌండ్ టేబుల్ సమావేశం లండన్‌లో జరిగింది. కాంగ్రెస్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ సమావేశంలో చేసిన సిఫార్సుల్లో ఎక్కువ అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టంలో చోటు దక్కించుకున్నాయి.
భారత ప్రభుత్వ చట్టం-1935: బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాల్లోకెల్లా దీన్ని ఒక చారిత్రక చట్టంగా పేర్కొనవచ్చు. రాజ్యాంగ సంస్కరణల కోసం బ్రిటిష్‌వారు చేసిన చట్టాల్లో ఇది అతి వివరణాత్మకమైన, సుదీర్ఘమైన చట్టం. ఈ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని ఈ చట్టం నమూనాగా వర్ణిస్తారు. దీన్ని ప్రస్తుత రాజ్యాంగానికి మాతృక లేదా మూలాధారంగా పేర్కొనవచ్చు.

ప్రధానాంశాలు
* అఖిల భారత సమాఖ్య ఏర్పాటు.
* రాష్ట్రాల్లో ఉన్న ద్వంద్వ ప్రభుత్వ విధానం రద్దు. కేంద్రంలో ద్వంద్వ పరిపాలనకు ప్రతిపాదన.
* రాష్ట్రస్థాయిలో ద్విసభాపద్ధతి ప్రవేశ పెట్టడం.
* కేంద్ర శాసనసభల పరిమాణం పెంచడం. కేంద్ర ఎగువసభ అయిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సభ్యత్వ సంఖ్యను 260కి, దిగువసభ అయిన లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యత్వ సంఖ్యను 375కి పెంచడం.
* ఓటుహక్కు విస్తృత పరచడం.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టు (సుప్రీంకోర్టు) ఏర్పాటు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఈ కోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ మౌలిస్ గ్వయిర్.
* మొదటిసారిగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు. ప్రాంతీయ స్వపరిపాలన భావన.
* కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య 3 జాబితాల ప్రకారం అధికార విభజన. అవి 1. కేంద్ర జాబితా - 59 అంశాలు, 2. రాష్ట్ర జాబితా - 54 అంశాలు, 3. ఉమ్మడి జాబితా - 36 అంశాలు

క్రిప్స్ ప్రతిపాదనలు (1942)
     భారత రాజ్యాంగ సమస్యల విషయంలో భారతీయులతో సంప్రదింపులు జరపడానికి బ్రిటిష్ కేబినెట్ మంత్రి సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ భారతదేశానికి వచ్చాడు.
1942, మార్చి 22న క్రిప్స్ చేసిన ప్రతిపాదనలోని ముఖ్యాంశాలివి..
* భారతదేశానికి అవసరమైన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఎన్నికల ద్వారా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు.
* వీలైనంత త్వరలో భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం. క్రిప్స్ ప్రతిపాదనలను గాంధీజీ 'దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీన వేసిన ఒక చెక్కు' అని వ్యాఖ్యానించారు.

కేబినెట్ మిషన్ ప్రణాళిక-1946
బ్రిటిష్ కేబినెట్ మంత్రి సర్ పెథిక్ లారెన్స్ ఛైర్మన్‌గా ఇద్దరు ఇతర కేబినెట్ మంత్రులు సర్ స్టాఫోర్డ్ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్‌లు సభ్యులుగా ఒక బృందం ఏర్పాటైంది. ఆ బృందం భారత్‌లో పర్యటించి భారతదేశ రాజ్యాంగ నిర్మాణం, స్వాతంత్య్రం ఇచ్చే ప్రతిపాదన అంశాలకు సంబంధించి 1946, మే 16న ఒక ప్రణాళికను వెల్లడించింది. దానినే కేబినెట్ మిషన్ ప్రణాళిక అంటారు.
ముఖ్యాంశాలివి..
* బ్రిటిష్ పాలిత భారతదేశం, స్వదేశీ సంస్థానాలు కలిపి ఇండియన్ యూనియన్ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పాటు.
* పరిపాలనా నిర్వహణ కోసం 14 మంది సభ్యులతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు.
* రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు.

భారత స్వాతంత్య్ర చట్టం - 1947
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టానికి ముగింపు పలికిన చట్టం భారత స్వాతంత్య్ర చట్టం-1947. భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు 1947, జులై 18న ఆమోదించింది. ఈ చట్టం 1947, ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమల్లో వచ్చింది.
చట్టంలోని ప్రధాన అంశాలు..
* ఇండియా, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్య్ర దేశాల ఏర్పాటు. ఇరు దేశాలకూ రాజ్యాంగ నిర్మాణానికి రెండు వేర్వేరు రాజ్యాంగ పరిషత్తుల ఏర్పాటు.
* స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం.
* 562 సంస్థానాలకు స్వేచ్ఛ, స్వాత్రంత్య్రాలు కల్పిస్తూ వీటికి ఇండియన్ యూనియన్‌లో గానీ, పాకిస్థాన్ యూనియన్‌లో గానీ కలిసే అవకాశం.

రాజ్యాంగ పరిషత్తు కమిటీలు
రాజ్యాంగ రచనలో వివిధ అంశాలకు సంబంధించి అధ్యయనం చేసేందుకు 22 కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో 12 విషయ నిర్ణాయక కమిటీలు, 10 విధాన నిర్ణాయక కమిటీలు. వీటికి అనుబంధంగా 7 ఉపకమిటీలు, 12 మైనర్ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ కమిటీల్లో అత్యంత ముఖ్యమైన కమిటీ - ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ. 1947, ఆగస్టు 29న ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీకి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధ్యక్షులుగా నియమితులయ్యారు.
* ముసాయిదా కమిటీ రెండు డ్రాఫ్ట్‌లను రూపొందించింది.
* ముసాయిదా 1948, ఫిబ్రవరి 21న ప్రచురితమైంది.
* ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తు 1949, నవంబరు 26న ఆమోదించింది.
* 1950, జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే 1949, నవంబరు 26వ తేదీనే రాజ్యాంగంలోని కొన్ని అంశాలు తక్షణం అమల్లోకి వచ్చాయి. ఇందులో పౌరసత్వం, రాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక లాంటివి ఉన్నాయి.
భారత రాజ్యాంగ పరిషత్తు.. రాజ్యాంగ రచనతోపాటు కొన్ని సాధారణ చట్టాలను కూడా ఆమోదించింది. వాటిలో ముఖ్యమైనవి..
* 1947, జులై 22న రూపొందించిన జాతీయ జెండాకు ఆమోదం.
* భారత రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగు గుర్తింపు.
* 1949, సెప్టెంబరు 14న దేవనాగరి లిపిలో ఉన్న హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా గుర్తింపు.
* 1950, జనవరి 24న జాతీయ గీతం, జాతీయ గేయాలకు ఆమోదం.

అయిదో దశ
భారత రాజ్యాంగ నిర్మాణ చరిత్రలో అయిదో దశ చివరి, కీలకమైన ఘట్టం.. స్వాతంత్య్రం లభించిన వెంటనే దేశ నాయకుల ముందున్న అతిపెద్ద సవాల్. జాతి పునర్నిర్మాణం.. భవిష్యత్తు తరాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేకూర్చడం.. పౌరుల ప్రాథమిక హక్కులను గుర్తిస్తూ వాటి పరిరక్షణకు హామీ కల్పించడం.. లాంటివి రాజ్యాంగ రచనలో ప్రధానాంశాలు. చివరి దశలోని ప్రధానాంశాలివి..
రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్తు) ఏర్పాటు: 1945 సెప్టెంబరులో భారతీయుల కోసం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ మిషన్ ప్రణాళిక 1946 సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైంది. 1946 జులై, ఆగస్టులలో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి.
* రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389.
* వీరిలో 292 మంది బ్రిటిష్ ఇండియా నుంచి (ఎన్నిక), 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి (నామినేట్), నలుగురు సభ్యులను చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన దిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్థాన్ నుంచి తీసుకున్నవారు ఉంటారు.
* రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం 1946, డిసెంబరు 9న దిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌హాలులో నిర్వహించారు.
* డిసెంబరు 11న డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
* అంతర్జాతీయ న్యాయవాది బెనగళ్ నరసింగరావు రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు.
* 1946, డిసెంబరు 13న జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని 1947, జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించారు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ పరిణామ క్రమం

1. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861’కి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ. భారతీయులకు తొలిసారిగా శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.

బి. ఈ చట్టం రూపకల్పన సమయంలో భారతదేశ గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌గా లార్డ్‌ కారన్‌ వాలీస్‌ వ్యవహరించారు.

సి. గవర్నర్‌ జనరల్‌కు ‘ఆర్డినెన్స్‌’ను జారీచేసే అధికారాన్ని కల్పించారు.

డి. ‘పోర్ట్‌ఫోలియో’ విధానానికి చట్టబద్ధత కల్పించారు.

జ: ఎ, సి, డి 

2. రెగ్యులేటింగ్‌ చట్టం, 1773 ద్వారా రద్దుచేసిన ఏ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861 ద్వారా పునరుద్ధరించారు?

జ: బాంబే, మద్రాస్‌

3. ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861 ప్రకారం 1862లో మనదేశంలో మొదటి హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు?

జ: కలకత్తా 

4. కిందివాటిలో సరైనవి ఏవి?

1) 1859లో ‘సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’ను రూపొందించారు.

2) 1860లో ‘ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’ను రూపొందించారు.

3) 1861లో ‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’ను రూపొందించారు.

4)  పైవన్నీ

జ:  పైవన్నీ

5. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892’ ప్రకారం కేంద్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన భారతీయ సభ్యులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.

జ: లాలాలజపతిరాయ్, మోతీలాల్‌ నెహ్రూ

6. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892’కు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ. బడ్జెట్‌పై చర్చించే అవకాశాన్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు అడిగే అధికారాన్ని కౌన్సిల్‌ సభ్యులకు కల్పించారు.

బి. కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 10 మందికి తగ్గకుండా, 16 మందికి మించకుండా ఉండాలని నిర్దేశించారు.

సి. రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 8 మందికి తగ్గకుండా, 20 మందికి మించకుండా ఉండాలని పేర్కొన్నారు.

జ: ఎ, బి, సి

7. మింటో- మార్లే సంస్కరణల చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ. భారత రాజ్య కార్యదర్శిగా లార్డ్‌ మార్లే వ్యవహరించారు.

బి. గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌గా లార్డ్‌ మింటో వ్యవహరించారు.

సి. వైస్రాయ్‌ కార్యనిర్వాహక కౌన్సిల్‌ సభ్యుల సంఖ్యను 15కు పెంచారు.

డి. గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో మొదటి భారతీయుడిగా సత్యేంద్రప్రసాద్‌ సిన్హాకు ప్రాతినిధ్యం లభించింది.

జ: ఎ, బి, డి     

8. ఏ చట్టం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ పేరును ‘ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’గా మార్చారు?

జ:  ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1909

9. భారత్‌లో ‘ప్రత్యేక మత నియోజకవర్గాలను’ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?

జ: ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1909

10. భారత్‌లో ‘మతనియోజకవర్గాల పితామహుడి’గా ఎవరిని పేర్కొంటారు?

జ: లార్డ్‌ మింటో    

11. ‘గదర్‌’ పార్టీని స్థాపించింది ఎవరు?

జ: లాలా హరదయాళ్‌  

12. 1911లో ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి  మార్చారు?

జ: లార్డ్‌ హార్డింజ్‌-II

13. కేంద్ర శాసన వ్యవస్థలోకి ప్రవేశించిన స్వరాజ్య పార్టీ ఆంగ్లేయుల ముందు కింది ఏ డిమాండ్లను ఉంచింది?

ఎ. రాజకీయ ఖైదీలను విడుదల చేయడం.

బి. ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశ పెట్టడం.

సి. సివిల్, డిఫెన్స్‌ సర్వీసుల్లో భారతీయులకే అవకాశం కల్పించడం.

డి. భారతీయులకు స్వపరిపాలనను అందించడం.

జ:  ఎ, సి, డి     

14. 1924లో ఏర్పాటు చేసిన ఏ కమిటీ భారత్‌లో ద్వంద్వపాలనను సమర్థించింది?

జ: అలెగ్జాండర్‌ మడ్డీమాన్‌ కమిటీ

15. 1927లో సైమన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిన అప్పటి బ్రిటన్‌ ప్రధాని ఎవరు?

జ: బాల్డ్విన్‌

16. సైమన్‌ కమిషన్‌ భారత్‌లో మొదటిసారి ఎప్పుడు పర్యటించింది?

జ: 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 మధ్య 

17. బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల (సంస్థానాల) మధ్య సంతృప్తికరమైన ఆర్థిక సంబంధాలను సూచించడానికి 1927లో ఏర్పాటు చేసిన కమిటీ?

జ: బట్లర్‌ కమిటీ

Posted Date : 28-12-2021

  భారత రాజ్యాంగ రచన - స్వభావం

సేకరించి.. మథించి.. సవరించి!

ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను శోధించి, సేకరించి, అందులోని ఆదర్శ విధానాలను, అనుసరణీయ లక్షణాలను అధ్యయనం చేసి, మథించి, అవసరమైన సవరణలు చేసి మన రాజ్యాంగంలో చేర్చారు. స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలను, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలకు నిర్దేశకాలుగా మార్చారు.  దేశ పరిస్థితులకు తగిన పాలనా ఏర్పాట్లను సంస్థాగతంగా సమకూర్చారు. వీటిపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రధాన దేశాల నుంచి గ్రహించిన లక్షణాలు, రాజ్యాంగ నిర్మాణ సభ స్వరూపం, గొప్పతనం గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

1.    కిందివాటిలో సరికానిది?

    1) ముసాయిదా రాజ్యాంగానికి 7,635 సవరణలు ప్రతిపాదించారు. 

     2) ముసాయిదా రాజ్యాంగాన్ని లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ధ్రువీకరించారు.

     3) ముసాయిదా రాజ్యాంగానికి ఎక్కువ సవరణలు ప్రతిపాదించినవారు హెచ్‌.వి.కామత్‌

     4) రాజ్యాంగ సభ చర్చల్లో 7 రోజుల పాటు 24 మంది అమెరికన్లు పాల్గొన్నారు.

2.    కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది?

    1) రాజ్యాంగ సభ 11 సమావేశాలు కలిపి 165 రోజులు జరిగాయి. 

     2) ముసాయిదా రాజ్యాంగంపై 114 రోజులు సమగ్రమైన చర్చ జరిగింది.

     3) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949, నవంబరు 26న (శనివారం) ఆమోదించింది.

     4) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించే సమయంలో గాంధీజీ పాల్గొన్నారు.

3.    మన దేశంలో 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు?

      1) జనవరి 26    2) డిసెంబరు    3) నవంబరు 26    4) ఏప్రిల్‌ 14

4. 1949, నవంబరు 26న ఆమోదించిన రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి రావడానికి ప్రధాన కారణం?

    1) లాహోర్‌లో ఆమోదించిన సంపూర్ణ స్వరాజ్‌ తీర్మానం    

    2) జవహర్‌లాల్‌ నెహ్రూ ఉద్దేశాల తీర్మానం

    3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సూచన

    4) స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో ఆంగ్లేయుల శ్వేతపత్రం

5.    1949, నవంబరు 26న ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన వెంటనే అమల్లోకి వచ్చిన అంశాల్లో లేనిది?

      1) పౌరసత్వం, తాత్కాలిక పార్లమెంటు

      2) ఎన్నికల నిర్వహణ ప్రక్రియ

      3) అత్యవసర పరిస్థితి అధికారాలు

     4) స్వదేశీ సంస్థానాలకు కల్పించిన రక్షణలు

6.    1950, జనవరి 26 (గురువారం) నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి సరికానిది?

    1) ఆర్టికల్స్‌ 395    2) షెడ్యూల్స్‌ 12     3) షెడ్యూల్స్‌ 8    4) భాగాలు 22

7.    రాజ్యాంగ సభ చివరి సమావేశం (12వ) ఎప్పుడు జరిగింది?

     1) 1950, జనవరి 24    2) 1950, జనవరి 26

     3) 1949, నవంబరు 26    4) 1949, జనవరి 26

8.    రాజ్యాంగ సభ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం? 

    1) జాతీయ గీతంగా ‘జనగణమన’ ఎంపిక               

     2) జాతీయ గేయంగా ‘వందేమాతరం’ ఎంపిక

     3) భారతదేశ తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ నియామకం       

      4) 1, 2 సరైనవి

9. రాజ్యాంగ సభ చివరి సమావేశంలో ఎంత మంది ప్రతినిధులు హాజరై రాజ్యాంగ రాతప్రతులపై సంతకాలు చేశారు?

    1) 266      2) 284      3) 299     4) 389

10.  భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యానానికి సంబంధించి సరికానిది?  

      1) భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్‌

      2) భారత రాజ్యాంగాన్ని ఇంద్రుడి వాహనమైన ఐరావతంతో పోల్చవచ్చు - హెచ్‌.వి.కామత్‌

      3) భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత - గాన్‌విల్‌ ఆస్టిన్‌

      4) భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - దామోదర్‌ స్వరూప్‌సేథ్‌

11.   ‘భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగా వ్యవహరిస్తుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

       1) ఐవర్‌ జెన్నింగ్స్‌     

       2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

       3) జవహర్‌లాల్‌ నెహ్రూ  

        4) ప్రమథ్‌ రంజన్‌ ఠాగూర్‌

12.  రాజ్యాంగంలోని ప్రతిపేజీని శాంతినికేతన్‌లోని చిత్రకారుల సహకారంతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాత్మకంగా రూపొందించినవారు?

      1) నందలాల్‌ బోస్‌          2) ప్రేమ్‌బిహారీ నారాయణ్‌ రైజాదా

      3) జితేంద్రనాథ్‌ బెనర్జీ   4) సత్యేంద్రనాథ్‌ ఠాగూర్‌

13.     మన రాజ్యాంగ నిర్మాతలు ‘భారత ప్రభుత్వ చట్టం - 1935 ’ నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది?

      1) అత్యవసర పరిస్థితి అధికారాలు, గవర్నర్‌ వ్యవస్థ    

      2) కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు

      3) స్వేచ్ఛా, వాణిజ్య, వ్యాపార చట్టాలు    

      4) అఖిల భారత సమాఖ్య అనే భావన

14.     రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్‌ నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది? 

       1) పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, శాసన నిర్మాణ ప్రక్రియ

       2) అటార్నీ జనరల్‌ వ్యవస్థ, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వ్యవస్థ 

       3) న్యాయస్థానాలు రిట్స్‌ జారీ చేసే విధానం, చట్టసభల సభ్యుల హక్కులు

      4) దేశాధినేత పేరుమీదుగా పరిపాలన నిర్వహించడం

15.  రాజ్యాంగ నిర్మాతలు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది? 

     1) రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ ఆధిక్యత, ఉపరాష్ట్రపతి వ్యవస్థ

     2) రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం

     3) అంతర్‌రాష్ట్ర వర్తక వాణిజ్యం

     4) న్యాయస్థానాలకు ఉండే న్యాయసమీక్ష అధికారం, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి

16.     రాజ్యాంగ నిర్మాతలు కెనడా దేశ రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరికానిది? 

        1) అవశిష్ట అధికారాలు కేంద్రానికి లభించడం, బలమైన కేంద్ర ప్రభుత్వం

        2) రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు విశిష్ట వ్యక్తుల నియామకం

        3) రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందడం

        4) రాష్ట్రపతి ద్వారా రాష్ట్రాల గవర్నర్‌ల నియామకం

17.     రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి  సరైన జత?  

     a) ఉమ్మడి జాబితా           i) దక్షిణాఫ్రికా

    b) న్యాయమూర్తుల తొలగింపు   ii) జపాన్‌

    c) చట్టం నిర్ధారించిన పద్ధతి    iii) అమెరికా

    d) రాజ్యాంగ సవరణ విధానం   iv) ఆస్ట్రేలియా

     1) a - ii, b - iv, c - i, d - iii
     2) a - iv, b - iii, c - ii, d - i 
     3) a - iv, b - iii, c - i, d - ii
     4) a - iii, b - iv, c - ii, d - i

18.  రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి  సరైన జత? 

    a) ప్రొటెం స్పీకర్‌ నియామకం     i) ఐర్లాండ్‌

    b) ఆదేశిక సూత్రాలు            ii) ఫ్రాన్స్‌

    c) రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం iii) జపాన్‌

    d) జీవించే హక్కు                 iv) దక్షిణాఫ్రికా

    1) a - ii, b - i, c - iv, d - iii
    2) a - iii, b - i, c - iv, d - ii
    3) a - ii, b - i, c - iii, d - iv    
    4) a - ii, b - iii, c - iv, d - i

19. రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి  సరైన జత? 

     a) రాజ్యాంగ ప్రవేశికలోని గణతంత్ర అనే భావన          i) కెనడా

     b) సుప్రీంకోర్టు సలహా రూపక అధికార పరిధి                ii) ఫ్రాన్స్‌

     c) దేశాధినేత పేరు మీదుగా  దేశ పరిపాలన నిర్వహణ  iii) ఆస్ట్రేలియా

     d) పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం     iv) అమెరికా

    1) a - iii, b - i, c - iv, d - ii
    2) a - ii, b - iii, c - iv, d - i
    3) a - ii, b - i, c - iv, d - iii
    4) a - ii, b - i, c - iii, d - iv

20.     కిందివాటిలో భారత రాజ్యాంగం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న లక్షణం?

       1) రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం (Electoral college)

       2) పంచాయతీరాజ్‌ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు

       3) అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు

       4) పైవన్నీ

21.     మన దేశ సాంఘిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ సభ అనుసరించిన ‘యూరో - అమెరికన్‌’ నమూనాలో లేని అంశం?

        1) ఉదార ప్రజాస్వామ్య విధానాలు       

        2) కేంద్రీకృత రాజ్యాంగం

        3) పరోక్ష ఎన్నిక విధానం          

        4) పార్లమెంటు ఆధిక్యత

22.   రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ సర్వసమ్మతి, సమన్వయ పద్ధతులను ఉపయోగించిందని ‘ది ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ కార్నర్‌ స్టోన్‌ ఆఫ్‌ ఏ నేషన్‌’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

        1) గాన్‌విల్‌ ఆస్టిన్‌     2) కె.ఎం.మున్షీ   3) శిఖర్‌ మిశ్రా       4) నానిపాల్కీవాలా

23.   రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ ‘సర్దుబాటు పద్ధతిని’ (Method of Adoption) ఉపయోగించిందని ‘ఇండియన్‌ గవర్నమెంట్‌ అండ్‌ పాలిటిక్స్‌’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

         1) మారిస్‌జోన్స్‌     2) ఐవర్‌ జెన్నింగ్స్‌    3) ఒ.పి.గోయెల్‌     4) అవస్తీ, మహేశ్వరి

24.   ‘ప్రాచీన కాలం నాటి సాంఘిక, ఆర్థిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

       1) జవహర్‌లాల్‌ నెహ్రూ 

       2) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

       3) అనంతశయనం అయ్యంగార్‌  

      4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

సమాధానాలు

1-2; 2-4; 3-3; 4-1; 5-3; 6-2; 7-1; 8-4; 9-2; 10-4; 11-2; 12-1; 13-3; 14-4; 15-3; 16-2; 17-2; 18-1; 19-3; 20-4; 21-3; 22-1; 23-3;  24-1. 

భారత రాజ్యాంగ రచన - స్వభావం - 2

అది ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ! 

భారత రాజ్యాంగ రచన వెనుక ఎందరో మేధావుల అపారమైన కృషి ఉంది. అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘం అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ఎన్నో చర్చలు, జరిపి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఏర్పాటైన వివిధ కమిటీలు విస్తృత పరిశీలన, మేధోమథనంతో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఆధునిక, అభ్యుదయ, పురోగామి అంశాలతో రాజ్యాంగ స్వరూప స్వభావాలను మలిచాయి. ఈ మహాక్రతువు జరిగిన క్రమం, వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖులు, వారి అభిప్రాయాలు, వ్యాఖ్యల గురించి పోటీ పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి.

1. కింద పేర్కొన్న వాటిలో సరికానిది?

  1) రాజ్యాంగ సభకు కార్యదర్శి హెచ్‌.వి.ఆర్‌.అయ్యంగార్‌

  2) రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్‌ సచ్చిదానంద సిన్హా

  3) రాజ్యాంగ సభకు ముఖ్య లేఖకుడు ఎస్‌.ఎన్‌.ముఖర్జీ

  4) రాజ్యాంగ సభకు గౌరవ సలహాదారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ

2.  బెనగళ నరసింగరావు (బి.ఎన్‌.రావు)కు సంబంధించి కిందివాటిలో సరికానిది? 

   1) రాజ్యాంగ సభకు సలహాదారుడిగా వ్యవహరించారు.

   2) చిత్తు రాజ్యాంగ రూపకర్తగా పేరొందారు.

   3) రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

   4) అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు.

3. రాజ్యాంగ రూపకల్పనలో ‘రాజ్యాంగ సభ’ నిర్వహించిన విధులకు సంబంధించి కిందివాటిలో సరైంది? 

  1) 1946, డిసెంబరు 9 నుంచి 1947, ఆగస్టు 15 మధ్య రాజ్యాంగ రచనా విధులను మాత్రమే నిర్వహించింది.  

  2) 1947, ఆగస్టు 15 నుంచి 1949, నవంబరు 26 మధ్య రాజ్యాంగ రచనా విధులతోపాటు దేశపాలనకు అవసరమైన శాసన రూపకల్పన విధులను నిర్వర్తించింది.

  3) 1949, నవంబరు 26 నుంచి 1952, మే 13 మధ్య శాసన విధులను నిర్వర్తిస్తూ దేశానికి తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది. 

  4) పైవన్నీ 

4. రాజ్యాంగ రచన కోసం ‘రాజ్యాంగ సభ’ ఏర్పాటు చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి  అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a)  కేంద్ర రాజ్యాంగ కమిటీ      i) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

b) రాజ్యాంగ సలహా  సంఘం    ii) జవహర్‌లాల్‌ నెహ్రూ

c) రాజ్యాంగ ముసాయిదా  కమిటీ     iii) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

d)  ఆర్థిక అంశాలపై ఏర్పడిన కమిటీ       iv) నళినీ రంజన్‌ సర్కార్‌

   1) a - ii, b - i, c - iii, d - iv       2) a - i, b - ii, c - iii, d - iv

     3) a - iv, b - i, c - iii, d - ii          4) a - ii, b - iv, c - iii, d - i

5. రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు   చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?  

   a) కేంద్ర ప్రభుత్వ  అధికారాల కమిటీ         i) జవహర్‌లాల్‌ నెహ్రూ

   b) భాషా ప్రయుక్త ప్రాంతాలపై ఏర్పడిన కమిటీ    ii) ఎస్‌.కె.థార్‌

    c) సుప్రీంకోర్టుపై ఏర్పడిన కమిటీ     iii) ఎస్‌.వరదాచారి అయ్యర్‌

    d) జాతీయ పతాకంపై ఏర్పడిన కమిటీ iv) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

  1) a - iii, b - i, c - ii, d - iv       2) a - i, b - ii, c - iv, d - iii

    3) a - i, b - ii, c - iii, d - iv      4) a - iv, b - ii, c - iii, d - i

6. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన విధాన నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?
    a) ఆర్డర్‌ ఆఫ్‌ బిజినెస్‌ కమిటీ    i) డాక్టర్‌ బాబూ  రాజేంద్రప్రసాద్‌
    b) సభా కమిటీ               ii) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
    c) క్రెడెన్షియల్‌ కమిటీ         iii) భోగరాజు పట్టాభి సీతారామయ్య
    d) సాంఘిక, ఆర్థిక కమిటీ     iv) కె.ఎం.మున్షీ    

      1) a - iv, b - iii, c - ii, d - i   2) a - iii, b - iv, c - ii, d - i

     3) a - iv, b - iii, c - i, d - ii     4) a - ii, b - iii, c - iv, d - i

7. 1947, జనవరి 24న ఏర్పడిన రాజ్యాంగ సలహా సంఘానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

  1) దీనికి అధ్యక్షుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌.    

  2) ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 54.

  3) ఈ కమిటీని 4 ఉప కమిటీలుగా వర్గీకరించారు.

  4) కమిటీ తన నివేదికను 1949, నవంబరు 26న సమర్పించింది.

8.  రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన వివిధ ఉప కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

  a) ప్రాథమిక హక్కుల ఉప కమిటీ     i) హెచ్‌.సి.ముఖర్జీ

  b) అల్ప సంఖ్యాక వర్గాల ఉప కమిటీ       ii) ఎ.వి.ఠక్కర్‌

  c) ఈశాన్య రాష్ట్రాల  ఉప కమిటీ     iii) జె.బి.కృపలాని

  d) అస్సాం ప్రాంతం మినహాయించి ఇతర   ప్రాంతాలపై ఏర్పడిన ఉప కమిటీ    iv) గోపీనాథ్‌ బార్డోలోయ్‌

   1) a - ii, b - iv, c - i, d - iii                 2) a - iii, b - i, c - iv, d - ii

     3) a - iii, b - i, c - ii, d - iv                4) a - iv, b - ii, c - i, d - iii

9. 1947, ఆగస్టు 29న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా  కమిటీలో సభ్యులు కానివారు? 

    1) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె.ఎం.మున్షీ    

    2) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్, బి.ఎల్‌.మిట్టల్‌

    3) సయ్యద్‌ మహ్మద్‌ సాదుల్లా, డి.పి.ఖైతాన్‌    

    4) కె.టి.షా, హెచ్‌.సి.ముఖర్జీ

10. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ ‘ముసాయిదా రాజ్యాంగాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది? 

   1) 1947, డిసెంబరు 28     2) 1948, నవంబరు 4    

   3) 1948, డిసెంబరు 21     4) 1949, జనవరి 22

11. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలోని అంశాన్ని గుర్తించండి.

    1) షెడ్యూల్స్‌ - 8     2) ఆర్టికల్స్‌ - 315       3) 1, 2        4) భాగాలు - 20 

12. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ను ఆధునిక మనువుగా, రాజ్యాంగ పితామహుడిగా ‘ది కాన్‌స్టిట్యూషనల్‌ గవర్నమెంట్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

    1) గాన్‌విల్‌ ఆస్టిన్‌        2) నానీ పాల్కీవాలా    3) పాల్‌ ఆపిల్‌బీ        4) ఎం.వి.పైలీ 

13. రాజ్యాంగ సభ సమావేశాల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారికి సంబంధించి సరికానిది?

   1) భారత జాతీయ కాంగ్రెస్‌ - డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్‌లాల్‌ నెహ్రూ 

   2) ముస్లింలు - సయ్యద్‌ మహ్మద్‌ సాదుల్లా, మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌

   3) హిందూ మహాసభ - శ్యాంప్రసాద్‌ ముఖర్జీ, ఎం.ఆర్‌.జయకర్‌

   4) అల్పసంఖ్యాక వర్గాలు - కె.టి.షా, కె.ఎం.మున్షీ

14. రాజ్యాంగ సభ సమావేశాల్లో వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులకు సంబంధించి సరైన జత?

   a) పారశీకులు    i) హెచ్‌.సి.ముఖర్జీ

   b) యూరోపియన్లు    ii) హెచ్‌.పి.మోదీ

   c) అల్పసంఖ్యాక వర్గాలు  iii) డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌

   d) అఖిల భారత   కార్మిక వర్గం  iv) ఫ్రాంక్‌ ఆంటోని 

    1) a-iii, b-ii, c-iv, d-i       2) a-iv, b-i, c-iii, d-ii
    3) a-ii, b-iv, c-i, d-iii       4) a-ii, b-iv, c-iii, d-i 

15. కిందివాటిలో సరికానిది? 

   1) ప్రారంభంలో రాజ్యాంగ సభలో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 69 శాతం.

   2) రాజ్యాంగ సభ నుంచి ముస్లింలీగ్‌ వైదొలగడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 82 శాతానికి చేరింది.

   3) రాజ్యాంగ సభ సమావేశాల్లో అఖిల భారత షెడ్యూల్డు కులాల వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

   4) రాజ్యాంగ సభ సమావేశాల్లో జమిందారీ వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు రతన్‌ సింగ్‌. 

16. రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?

   1) 1946 డిసెంబరు 9 నుంచి 14 వరకు

   2) 1946 డిసెంబరు 9 నుంచి 17 వరకు

   3) 1946 డిసెంబరు 9 నుంచి 23 వరకు

   4) 1946 డిసెంబరు 9 నుంచి 31 వరకు 

17. కిందివాటిలో సరికానిది?

   1) రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడు డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌. 

   2) రాజ్యాంగ సభకు శాశ్వత ఉపాధ్యక్షులు హెచ్‌.సి.ముఖర్జీ, వి.టి.కృష్ణమాచారి.

   3) రాజ్యాంగ సభ తొలి సమావేశానికి హాజరైన సభ్యులు 208 మంది.

   4) రాజ్యాంగ సభలో ప్రారంభ ఉపన్యాసం చేసినవారు లార్డ్‌మౌంట్‌ బాటన్‌. 

18. జవహర్‌లాల్‌ నెహ్రూ ‘ఉద్దేశాల తీర్మానం/చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

   1) 1946, డిసెంబరు 11     2) 1946, డిసెంబరు 13    

  3) 1946, డిసెంబరు 23     4) 1946, డిసెంబరు 31 

19. ఉద్దేశాల తీర్మానాన్ని ‘మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ’ అని ఎవరు అభివర్ణించారు?

   1) జవహర్‌లాల్‌ నెహ్రూ          2) మహాత్మా గాంధీ     

   3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌        4) కె.ఎం.మున్షీ 

20. జవహర్‌లాల్‌ నెహ్రూ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన ఉద్దేశాల తీర్మానానికి సంబంధించి సరైంది?

1) ఈ తీర్మానాన్ని రాజ్యాంగ సభ 1947, జనవరి 22న ఆమోదించింది. 

2) భారతదేశం ప్రపంచ శాంతి, మానవాళి సంక్షేమం కోసం కృషి చేస్తుంది. 

3) భారతదేశం సర్వసత్తాక గణతంత్ర దేశంగా అవతరించాలి.

4) పైవన్నీ 

21. ‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగం 1935, భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్‌ కాపీలా ఉంది’ అని ఎవరు విమర్శించారు?

    1) సర్‌ తేజ్‌ బహదూర్‌ సప్రూ      2) మహ్మద్‌ అలీ జిన్నా    

   3) మౌలానా హస్రత్‌ మొహాని      4) దామోదర్‌ స్వరూప్‌ సేథ్‌

సమాధానాలు

1-4; 2-3; 3-4; 4-1; 5-3; 6-1; 7-4; 8-2; 9-4;  10-2; 11-3; 12-4; 13-4; 14-3; 15-4; 16-3;  17-4; 18-2; 19-1; 20-4; 21-3.

పరిపాలనకు పరమ శాసనం

భారత రాజ్యాంగ రచన - స్వభావం - 1

ప్రజాస్వామ్య పాలనకు, అందరికీ ఆమోదనీయమైన, అనుకూలమైన చట్టాల రూపకల్పనకు, పౌర హక్కుల నిర్వచనానికి, సామాజిక న్యాయానికి, సంక్షేమానికి మౌలిక ఆధారం మన రాజ్యాంగం. ఎందరో మహానుభావుల మహోన్నత కృషితో రూపొందింది. దశాబ్దాల కాలపరీక్షలను దాటి ఇప్పటికీ, ఎప్పటికీ  తిరుగులేని పరమ శాసనంగా నిలిచింది. అంతటి అత్యున్నతమైన ఆ రాజ్యాంగ రచన జరిగిన విధానం, దాని స్వభావంపై పోటీ పరీక్షల్లో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నల సరళిపై అభ్యర్థులు తగిన అవగాహన పెంపొందించుకోవడానికి రకరకాల బిట్లను ప్రాక్టీస్‌ చేయాలి. 

 1. రాజ్యాంగానికి సంబంధించి కిందివాటిలో సరైంది?

    ఎ) దేశ పరిపాలనను వివరించే అత్యున్నతమైన శాసనం.

    బి) ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం అమెరికా.

    సి) బ్రిటన్‌ దేశానికి లిఖిత రాజ్యాంగం లేదు.

    డి) ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం భారత్‌.

    1) ఎ, బి, సి  2) బి, సి, డి  3) ఎ, బి, సి, డి   4) ఎ, సి, డి

2. ‘రాజ్యాంగం’ అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించినవారు?

    1) జార్జి వాషింగ్టన్‌      2) అరిస్టాటిల్‌ 

    3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌     4) ఎం.ఎన్‌.రాయ్‌

3. ‘స్వరాజ్‌’ అనేది బ్రిటిష్‌వారు ప్రసాదించే ఉచిత కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ అని 1922, జనవరి 5న గాంధీజీ ఏ పత్రికలో పేర్కొన్నారు?

    1) యంగ్‌ ఇండియా       2) హరిజన్‌ 

    3) వందేమాతరం        4) బెంగాల్‌ గెజిట్‌

4. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేయాలని 1934లో ఆంగ్లేయులను తొలిసారిగా డిమాండ్‌ చేసిన భారతీయుడు?

    1) దాదాభాయ్‌ నౌరోజీ        2) మోతీలాల్‌ నెహ్రూ

    3) మానవేంద్రనాథ్‌ రాయ్‌      4) సుభాష్‌ చంద్రబోస్‌

5. జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని తొలిసారి అధికారికంగా ఆంగ్లేయులను డిమాండ్‌ చేసింది. అది ఎక్కడ జరిగింది?    

1) లాహోర్‌   2) ఫైజ్‌పుర్‌  3) ముజఫరాబాద్‌    4) కలకత్తా 

6. భారతీయులతో కూడిన రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగ రచన జరిగితే మన దేశం ఎదుర్కొంటున్న కుల, మత వర్గాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 1939లో ‘హరిజన్‌’ అనే పత్రికలో ఎవరు పేర్కొన్నారు?

    1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌      2) గోపాలకృష్ణ గోఖలే

    3) బాలగంగాధర్‌ తిలక్‌         4) మహాత్మా గాంధీ

7. ‘భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను, ఇలాంటి దేశంలో అంటరానితనం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపం ఉండరాదు’ అని 1931లో గాంధీజీ ఏ పత్రికలో వ్యాఖ్యానించారు?

    1) హరిజన్‌      2) బాంబే సమాచార్‌  

    3) యంగ్‌ ఇండియా     4) హేరామ్‌

8. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ/రాజ్యాంగ పరిషత్‌’ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆంగ్లేయులు తొలిసారిగా దేని ద్వారా గుర్తించారు?

    1) భారత ప్రభుత్వ చట్టం - 1935

    2) ఆగస్టు ప్రతిపాదనలు - 1940

    3) క్రిప్స్‌ రాయబారం - 1942  

    4) కేబినెట్‌ మిషన్‌ - 1946

9. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తామని ఆంగ్లేయులు తొలిసారి అధికారికంగా ఎప్పుడు ప్రతిపాదించారు?

    1) క్రిప్స్‌ రాయబారం - 1942  

   2) భారత స్వాతంత్య్ర చట్టం - 1947 

    3) వేవెల్‌ ప్రణాళిక - 1945        

    4) రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు (1930 - 1932)

10. మహాత్మా గాంధీ కింద పేర్కొన్న దేన్ని ‘పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌’గా అభివర్ణించి తిరస్కరించారు?

    1) ఆగస్టు ప్రతిపాదనలు - 1940 2) క్రిప్స్‌ రాయబారం - 1942 

    3) మంత్రిత్రయ రాయబారం - 1946     

    4) సిమ్లా సమావేశం - 1944

11. త్వరలోనే రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికైన శాసన సభ్యులు రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకుంటారని 1945, సెప్టెంబరు 19న దిల్లీలోని ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రకటించినవారు?

    1) లార్డ్‌ వేవెల్‌      2) లార్డ్‌ లిన్‌లిత్‌గో 

    3) స్టాఫర్డ్‌ క్రిప్స్‌    4) లార్డ్‌ మౌంట్‌బాటన్‌

12.     బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌ను భారతదేశానికి ఎప్పుడు పంపారు?

    1) 1945, ఆగస్టు 24    2) 1945, మార్చి 24     

    3) 1946, మార్చి 24    4) 1947, జనవరి 24

13.     కిందివారిలో మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌లో లేని సభ్యులు? 

    1) పెథిక్‌ లారెన్స్‌    2) స్టాఫర్డ్‌ క్రిప్స్‌     

    3) బిర్కెన్‌హెడ్‌    4) ఎ.వి.అలెగ్జాండర్‌

14.     రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరికానిది? 

    1) కేబినెట్‌ మిషన్‌ సిఫార్సుల మేరకు 1946లో జరిగాయి. 

    2) ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. 

    3) పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. 

    4) పరిమిత ఓటింగ్‌తో ఎన్నికలు జరిగాయి.

15.     రాజ్యాంగ పరిషత్‌కు నిర్దేశించిన ప్రాతినిధ్యానికి సంబంధించి కిందివాటిలో సరికానిది? 

    1) బ్రిటిష్‌ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది    

    2) స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది

    3) కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నలుగురు    

    4) స్వయం ప్రతిపత్తి ప్రాంతాల నుంచి 9 మంది

16.     రాజ్యాంగ పరిషత్‌/రాజ్యాంగ సభకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి సంబంధించి సరైన జతను గుర్తించండి.

    a) స్వతంత్ర అభ్యర్థులు               i) 3

    b) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌         ii) 73

    c) ముస్లిం లీగ్‌                     iii) 7

    d) యూనియనిస్ట్‌ మహ్మదీయ పార్టీ     iv) 202

    1) a - iii, b - iv, c - ii, d - i       2) a - i, b - iv, c - iii, d - ii

     3) a - i, b - ii, c - iii, d - iv      4) a - ii, b - iv, c - i, d - iii

17.     రాజ్యాంగ సభ ఎన్నికలకు (1946) సంబంధించి కిందివాటిలో సరికానిది?  

    1) రాజ్యాంగ సభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య - 389

    2) ఎస్సీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 26

    3) ఎస్టీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 23

    4) రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళల సంఖ్య - 15 

18. కిందివారిలో రాజ్యాంగ సభకు విశిష్ట వ్యక్తులుగా నామినేట్‌ అయిన వారిలో లేనివారు? 

    1) అనంతశయనం అయ్యంగార్‌    2) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 

    3) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌    4) కె.టి.షా 

19. రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరికానిది? 

    1) రాజ్యాంగ సభకు ఎన్నికైన ఏకైక ముస్లిం మహిళ బేగం ఎయిజాజ్‌ రసూల్‌. 

    2) రాజ్యాంగ సభకు ఎన్నిక కాని ప్రముఖులు మహాత్మా గాంధీ, మహ్మద్‌ అలీ జిన్నా.

    3) రాజ్యాంగ సభలో ప్రతి ప్రావిన్స్‌ నుంచి సుమారు 10 లక్షల మంది జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించారు.  

    4) స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య 289. 

20.     హైదరాబాద్‌ సంస్థానం నుంచి 15 మంది ప్రతినిధులను రాజ్యాంగ సభకు ఎప్పుడు నామినేట్‌ చేశారు? 

    1) 1946 నవంబరు    2) 1947 నవంబరు         3) 1948 నవంబరు         4) 1949 నవంబరు 

21.     రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళలు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.

    a) భారత్‌లో తొలి మహిళా గవర్నరు       i) సరోజిని నాయుడు

    b) భారత్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రి     ii) సుచేతా కృపలానీ 

    c) భారత్‌లో తొలి మహిళా కేబినెట్‌ మంత్రి      iii) విజయలక్ష్మి పండిట్‌

    d) యూఎన్‌ఓ సాధారణ సభకు తొలి మహిళా అధ్యక్షురాలు          iv) రాజకుమారి అమృతకౌర్‌ 

    1) a - ii, b - iv, c - i, d - iii     2) a - i, b - ii, c - iv, d - iii 

    3) a - i, b - iii, c - iv, d - ii     4) a - iv, b - ii, c - i, d - iii 

22.     రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డ్‌కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరించారు?

    1) దుర్గాబాయి దేశ్‌ముఖ్‌     2) అమ్ముస్వామినాథన్‌ 

    3) పూర్ణిమా బెనర్జీ          4) దాక్షాయణి వేలాయుదన్‌

23.     రాజ్యాంగ సభకు ఎన్నికైన ప్రముఖ మహిళ హంసామెహతాకు సంబంధించి కిందివాటిలో సరైంది? 

    1) రాజ్యాంగ సభ సమావేశాల్లో మహిళలకు ప్రాతినిధ్యం వహించారు. 

    2) 1947 జులై 22న రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రతిపాదించి ఎగురవేశారు. 

    3) 1, 2                4) రాజ్యాంగ సభకు రాజీనామా చేసిన ఏకైక మహిళ. 

24. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు ‘హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ గ్రంథాన్ని రాశారు?

    1) భోగరాజు పట్టాభి సీతారామయ్య 2) కల్లూరు సుబ్బారావు 

    3) ఎం.తిరుమలరావు        4) మోటూరు సత్యనారాయణ 

25.     రాజ్యాంగ సభకు ఎన్నికైన ప్రముఖ తెలుగు వ్యక్తులు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. 

    a) టంగుటూరి  ప్రకాశం పంతులు i) కర్నూలు సర్క్యులర్‌ రూపకర్త

    b) నీలం సంజీవరెడ్డి      ii) ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి

    c) కళా వెంకట్రావు       iii) ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు

    d) ఆచార్య ఎన్‌.జి.రంగా   iv) ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి

    1) a - ii, b - iv, c - i, d - iii    2) a - ii, b - i, c - iv, d - iii

     3) a - i, b - iv, c - ii, d - iii    4) a - iii, b - iv, c - i, d - ii

26.     రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభ జరిపిన ప్రయత్నాల్లో కిందివాటిలో సరికానిది?

     1) రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు నిర్వహించిన సమావేశాలు - 11

     2) రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన కమిటీలు - 22

    3) రాజ్యాంగ సభ నిర్వహించిన మొత్తం సమావేశాలు - 13

    4) రాజ్యాంగ రచనకు అయిన వ్యయం - రూ.64 లక్షలు

సమాధానాలు

1-3, 2-2, 3-1, 4-3, 5-2, 6-4, 7-3, 8-2, 9-1, 10-2, 11-1, 12-3, 13-3, 14-2, 15-4, 16-1, 17-3, 18-1, 19-4, 20-3, 21-2, 22-1, 23-3, 24-1, 25-1, 26-3.

Posted Date : 06-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రజాస్వామ్యం - రకాలు

 ప్రజల ఆకాంక్షలకే పట్టం! 

పాలనా వ్యవస్థల్లో అత్యుత్తమంగా నిలిచిన ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, పాలితులు. పరిపాలనా నిర్ణయాలను, చట్టాలను స్వయంగా రూపొందించుకొని అమలు చేసుకుంటూ, తమను తామే పాలించుకుంటారు. అయితే సమాజ స్వరూపాలు, పాటించే విలువల ఆధారంగా ప్రజాస్వామ్యంలోనూ స్వపరిపాలన, పరోక్ష పాలన అనే రకాలున్నాయి. వాటి ఆధారంగానే సార్వభౌమాధికారం, వాస్తవాధికారం చెలాయించే తీరు మారుతుంది. ఈ మౌలికాంశాలను పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి. ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్యాల్లోని కీలక భావనలు, ప్రయోజనాలు, అందుకు అవసరమైన సాధనాలు, పరిస్థితుల గురించి సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి.

ప్రజాస్వామ్యంలో అసమ్మతివాదులు, వ్యతిరేకులు, విరుద్ధ భావాలు ఉన్నవారికి కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియలో సంప్రదింపులు, ఏకాభిప్రాయం, సఖ్యత, రాజీ మొదలైన అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొని పరిపాలన సాగిస్తారు. ఈ ప్రజాస్వామ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..

 1) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం 

2) పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం

ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ప్రజలు ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే ప్రభుత్వ పాలనా విధానమే ‘ప్రత్యక్ష ప్రజాస్వామ్యం’. ఇందులో శాసన సంబంధమైన అధికారాలన్నీ ప్రజలే చెలాయిస్తారు. రాజ్య వ్యవహారాల్లో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రాచీన కాలంలో గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టా, ఏథెన్స్‌లో అనుసరించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని స్విట్జర్లాండ్‌ దేశంలో కొనసాగిస్తున్నారు. ఒక ప్రదేశంలో పరిమిత సంఖ్యలో ప్రజలు నివసించే చిన్న దేశాలకు ఈ విధానం సరైంది. విస్తారమైన భౌగోళిక ప్రదేశం ఉన్న దేశాలు, అధిక జనాభా దేశాలకు అనుకూలం కాదు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు రకాలు  

1) ప్రజాభిప్రాయ సేకరణ(Referendum): ఏదైనా ఒక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రక్రియనే ‘ప్రజాభిప్రాయ సేకరణ’ అంటారు. శాసనసభ అప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించింది. ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల సార్వభౌమాధికారాన్ని బలపరుస్తుంది. మెజార్టీ పార్టీ నియంతృత్వం నుంచి రాజకీయ వ్యవస్థను పరిరక్షిస్తుంది. శాసన నిర్మాణంలో ప్రజలు తరచూ పాల్గొనేందుకు సహాయకారిగా ఉంటూ, శాసనసభ్యుల బాధ్యతను మరింత పెంచుతుంది. ప్రజాబాహుళ్య చట్టాలకు హామీ ఇస్తుంది. అయితే ఈ విధానం శాసనసభ్యుల హోదా, అధికారాలను బలహీనపరుస్తుందని కొందరి అభిప్రాయం. .

2) ప్రజాభిప్రాయ నివేదన: ప్రత్యక్ష ప్రజాస్వామ్య సమర్థకులు ‘ప్రజాభిప్రాయ నివేదన’ ఆవశ్యకతను గుర్తించారు. ఈ విధానం ప్రకారం కొంతమంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా కోరుతూ ఒక అర్జీపై సంతకాలు చేసి శాసనసభకు సమర్పిస్తారు. ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి పంపుతారు. మెజార్టీ ప్రజలు ఆమోదిస్తే, ఆ అంశం చట్టంగా మారి అమల్లోకి వస్తుంది. ప్రజాభిప్రాయ నివేదన ప్రజల్లో అవిధేయత/తిరుగుబాటు వంటి అంశాలను నిరోధించి, ప్రజలు వర్గాలుగా ఏర్పడి చట్టాలను ఆమోదించే ప్రమాదాన్ని తొలగిస్తుంది. ప్రజాసార్వభౌమత్వ భావనకు హామీ ఇస్తుంది.

3) పునరాయనం(Recall): ఈ విధానంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుక్కు పిలిచి, పదవి నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుంది. అంటే సరిగా పనిచేయని ప్రతినిధులను ప్రజలు తొలగించి, ప్రజలే సార్వభౌములుగా వ్యవహరిస్తారు.

4) ప్రజాభిప్రాయ నిర్ణయం(Plebiscite):ప్లెబిసైట్‌ అనే పదం లాటిన్‌ భాషలోని Plebis, Scitum అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. Plebis అంటే ప్రజలు, Scitum అంటే నిర్ణయం లేదా తీర్పు అని అర్థం. ఏదైనా ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోడానికి అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ‘ప్రజాభిప్రాయ నిర్ణయం’. ప్రజానిర్ణయానికి దైనందిన, చట్ట నిర్మాణ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రజా ప్రాముఖ్యత ఉన్న చట్టాన్ని రూపొందించడానికి ఈ విధానం తోడ్పడుతుంది. 1804లో ఫ్రాన్స్‌లో అప్పటికే అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు నెపోలియన్‌ మొదటిసారిగా ఈ విధానాన్ని వినియోగించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం ప్రకారం మొత్తం ప్రజానీకం లేదా ప్రజానీకంలోని ఒక వర్గం వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి పలు దేశాలు ఈ విధానాన్ని వినియోగించాయి.

పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం: ఆధునిక రాజ్యాలు సాధారణంగా జనాభాపరంగా, భౌగోళికంగా పెద్దవిగా ఉంటాయి. ఇలాంటి రాజ్యాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని ఊహించడం సాధ్యం కాదు. ఈ రాజ్యాల్లో ప్రభుత్వ పరిపాలన ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా కొనసాగుతుంది. ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పరోక్షంగా రాజ్యాభీష్టాన్ని రూపొందించి వ్యక్తీకరిస్తారు. సార్వభౌమాధికారం ప్రజలకే చెందుతుందని, ప్రజల ప్రతినిధులు ఆ సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తారనే సూత్రంపై ఆధారపడి పరోక్ష ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడంలో విఫలమైతే, వారిని ఎన్నికల సమయంలో ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించి తొలగిస్తారు. అందువల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు ధర్మకర్తలు (సంరక్షకులు)గా వ్యవహరిస్తూ ప్రజాభిప్రాయానికి విలువ ఇస్తారు.

పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో అధికారాలన్నీ ఒకే కార్యనిర్వాహక అధిపతి వినియోగించడమే కాకుండా, కార్యనిర్వాహక అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి.  

ఉదా: అమెరికా అధ్యక్షుడు

పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వర్గంలో నామమాత్రపు కార్యనిర్వాహక వర్గం, వాస్తవ కార్యనిర్వాహక వర్గం ఉంటాయి. ఇందులో దేశాధినేతకు కేవలం నామమాత్రపు కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు చెలాయిస్తుంది. ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి శాసన వ్యవస్థకు బాధ్యత వహించాలి. 

ఉదా: బ్రిటన్, ఇండియా, జపాన్‌

ప్రజాస్వామ్యం విజయానికి అవసరమైన పరిస్థితులు

* ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి పౌరులకు సరైన విద్య అవసరం. ప్రభుత్వ విధానాలను అంచనా వేయడంలో, సమీక్ష జరపడంలో విద్యావంతులైన పౌరులు కీలక పాత్ర పోషిస్తారు. విద్య అనేది ఓటర్లను చైతన్యపరచి, పలు విషయాలపై అవగాహనకు తోడ్పడి, సమర్థులైన నాయకుల ఎంపికకు తోడ్పడుతుంది.

* బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ప్రతిపక్షం వెలుగులోకి తీసుకొస్తుంది. అధికారపక్షం నియంతృత్వ పోకడలను కట్టడి చేసేందుకు తోడ్పడుతుంది.

* సాంఘిక సమానత్వం అనేది ప్రజాస్వామ్య విజయానికి కీలక అంశం. కులం, మతం, వర్గం, జాతి, లింగం వంటి వివక్షలతో సంబంధం లేకుండా అందరికీ సమానత్వం కల్పించడం వల్ల ప్రజాస్వామ్య పునాదులు బలోపేతం అవుతాయి.

* దేశంలో ఆర్థిక అసమానతలు లేనప్పుడు ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అందుకే పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఆర్థిక అసమానతలు లేని సమాజం అవసరం.

* వివేకవంతమైన నాయకత్వం ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. వివేకవంతులైన పాలకులు తమ పరిపాలనా దక్షత, రాజకీయ పరిజ్ఞానం, సామాజిక అంకితభావం వంటి లక్షణాలతో ప్రజాస్వామ్యాన్ని మహోన్నత స్థాయికి తీసుకెళతారు.

* సైన్యం పెత్తనం లేని దేశాల్లో ప్రజాస్వామ్యం బలపడుతుంది. సైనిక ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

* స్వతంత్ర, నిష్పక్షపాత పత్రికా వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. పత్రికలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కచ్చితంగా, పక్షపాతరహితంగా ప్రజలకు తెలియజేయాలి. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడంలో, తద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయి.

* ప్రజాస్వామ్య విజయం అధికారాల వికేంద్రీకరణపై ఆధారపడి ఉంటుంది. స్థానిక సంస్థల ద్వారా ప్రజలు పాలనలో భాగస్వాములవుతారు. పౌరుల్లో కొందరు స్థానిక సంస్థల నిర్వహణలో తగిన శిక్షణ పొందగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి శిక్షణ ఇతర, ఉన్నత పదవులు చేపట్టేందుకు ఉపకరిస్తుంది.

* ప్రజాస్వామ్యంపై ప్రజలు విశ్వాసం ఉంచాలి. రాజ్యాంగ సూత్రాలు, చట్టబద్ధమైన పరిపాలన, పరస్పర చర్చలపై విశ్వాసం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.

ప్రజాస్వామ్యం-ప్రయోజనాలు:

* ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాల్లో, అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా కొనసాగించవచ్చు.

* ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి.

* వ్యక్తుల స్వేచ్ఛకు హామీ లభిస్తుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.

* ఒకే సమయంలో శాంతి, ప్రగతి ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతాయి.

* ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములుగా ఉంటారు.

* ఎలాంటి యుద్ధాలు, రక్తపాతం లేకుండా, ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాల మార్పు జరుగుతుంది.

* సామాన్యులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కావచ్చు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 01-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో ప్రజాస్వామ్యం - పనితీరు (మొదటి అయిదు లోక్‌సభలు) 

 చీకట్లోకి దూకి.. విశ్వాసంతో సాగి! 

భిన్న మతాలు, సంస్కృతులు,  విభిన్న భాషలు, భావోద్వేగాలతో ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యం సక్రమంగా సాగుతుందా అనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. దశాబ్దాలుగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తూ, సంక్షేమ పాలన అందిస్తూ, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా మన దేశం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్య ప్రస్థానం, స్వాతంత్య్రానంతరం నిర్ణీత కాలవ్యవధుల్లో జరిగిన సాధారణ ఎన్నికల వివరాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. లోక్‌సభల వారీగా దేశ రాజకీయాల్లో జరిగిన మార్పులు, వ్యక్తుల ప్రభావాలు, క్రమానుగతంగా వచ్చిన పాలనా సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలు, ముఖ్యమైన రాజ్యాంగ సవరణలను సంపూర్ణంగా తెలుసుకోవాలి.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతోంది. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం భారతీయులు  ఎంతో ధైర్యసాహసాలు, విశ్వాసంతో కృషి చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం రాజకీయ వ్యవస్థ పరిణామం, పనితీరే అందుకు నిదర్శనం. నిర్ణీత వ్యవధుల్లో ఎన్నికలు నిర్వహించడం, ప్రాతినిధ]్య సంస్థలను ఏర్పాటు చేయడం, రాజకీయ ప్రక్రియలను అనుసరించడం లాంటివన్నీ రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయి. గత ఎనిమిది దశాబ్దాలుగా కులతత్వం, ప్రాంతీయతత్వం, మతతత్వం, రాజకీయాల్లో ధన ప్రవాహం, ప్రజారంగంలో లంచగొండితనం, హింస, ఆశ్రిత పక్షపాతం లాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత ప్రజాస్వామ్యం వాటిని అధిగమించి చక్కగా పనిచేస్తోందని చెప్పవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పడిన భారత ఎన్నికల సంఘం పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేస్తూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దేశంలో 17 సార్లు సాధారణ ఎన్నికలు నిర్వహించడం భారత ప్రజాస్వామ్య సమర్థతకు నిదర్శనం.

మన దేశంలో ప్రజాస్వామ్యానికి, ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ‘లోక్‌సభ’ను పేర్కొనవచ్చు. వివిధ లోక్‌సభలకు జరిగిన ఎన్నికలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 

ఒకటో లోక్‌సభ: మొదటి లోక్‌సభకు 1951-52లో ఎన్నికలు జరిగాయి. 489 స్థానాల కోసం జరిగిన ఈ ఎన్నికల్లో 21 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారు. 46% పోలింగ్‌ నమోదైంది. 22 మంది మహిళలు ఎన్నికయ్యారు. 1952, ఏప్రిల్‌ 17న మొదటి లోక్‌సభ ఏర్పాటైంది. దీని తొలి సమావేశం 1952, మే 13న జరిగింది. రాష్ట్రపతిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉన్నారు. లోక్‌సభ నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌ గణేశ్‌ వాసుదేవ మౌలాంకర్‌ పదవిలో ఉండగానే మరణించడంతో అనంతశయనం అయ్యంగార్‌ స్పీకర్‌గా (1956, మార్చి 8 నుంచి 1957, మే 10) వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా సర్దార్‌ హుకుంసింగ్‌ (1956, మార్చి, 20 నుంచి 1957, ఏప్రిల్, 4) చేశారు.

* మొదటి లోక్‌సభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ - INC) 364 స్థానాలు గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు 41 మంది ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను ‘చీకటిలో ముందుకు దూకడం’గా విమర్శకులు పేర్కొనగా, ‘విశ్వాసంతో కూడిన చర్య’ అని ఆశావహులు అన్నారు. మొదటి లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం, అరగంట చర్చ, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానం మొదలైన కొత్త అంశాలను స్పీకర్‌ గణేశ్‌ వాసుదేవ మౌలాంకర్‌ పరిచయం చేశారు. మొదటి లోక్‌సభను నిర్ణీత పదవీకాలానికి 38 రోజుల ముందే 1957, ఏప్రిల్‌ 4న రద్దు చేశారు.

రెండో లోక్‌సభ: రెండో లోక్‌సభ పదవీకాలం 1957, మే నుంచి 1962, మార్చి వరకు సాగింది. 48% పోలింగ్‌ నమోదైంది. 27 మంది మహిళలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ 371 స్థానాలు, కమ్యూనిస్టులు 27 స్థానాలు గెలుపొందారు. లోక్‌సభ నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌గా అనంతశయనం అయ్యంగార్, డిప్యూటీ స్పీకర్‌గా సర్దార్‌ హుకుంసింగ్‌ వ్యవహరించారు. ఈ సభా కాలంలోనే 1961లో ‘వరకట్న నిషేధ బిల్లు’ ఆమోదం కోసం తొలిసారిగా ‘పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం’ నిర్వహించారు. ముంద్రా కుంభకోణం వెలుగులోకి రావడంతో మంత్రి కృష్ణమాచారి రాజీనామా చేశారు. రాష్ట్రపతిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వ్యవహరించారు. రెండో లోక్‌సభను నిర్ణీత పదవీకాలానికి 40 రోజుల ముందే 1962, మార్చి 31న రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు.

మూడో లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 55% పోలింగ్‌ నమోదైంది. 34 మంది మహిళలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ 361 స్థానాలు, కమ్యూనిస్టులు 29 స్థానాలు గెలుపొందారు. లోక్‌సభ నాయకుడిగా నెహ్రూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌గా సర్దార్‌ హుకుంసింగ్, డిప్యూటీ స్పీకర్‌గా ఎస్‌.వి.కృష్ణమూర్తి వ్యవహరించారు. 1962లో భారత్‌పై చైనా దురాక్రమణకు పాల్పడిన సందర్భంగా నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1963, ఆగస్టులో తొలిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ఆచార్య కృపలానీ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం వీగిపోయింది. 1964, మే 27న ప్రధాని నెహ్రూ మరణించడంతో గుల్జారీలాల్‌ నందా తాత్కాలిక ప్రధానిగా 1964, మే 27 నుంచి 1964, జూన్‌ 9 వరకు వ్యవహరించారు. అనంతరం లాల్‌బహదూర్‌ శాస్త్రి లోక్‌సభ నాయకుడిగా ఎన్నికై 1964, జూన్‌ 9న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సభా కాలంలోనే తొలిసారిగా 1962లో ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించారు. 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది. ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి తాష్కెంట్‌ పర్యటనలో ఉండగా 1966, జనవరి 11న అక్కడే మరణించారు. ఫలితంగా గుల్జారీలాల్‌ నందా తాత్కాలిక ప్రధానిగా 1966, జనవరి 11 నుంచి 1966, జనవరి 24 వరకు వ్యవహరించారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ 1966, జనవరి 24న ప్రధాని పదవి చేపట్టారు. మూడో లోక్‌సభ కాలంలోనే 1964లో కమ్యూనిస్ట్‌ పార్టీలో చీలిక ఏర్పడి CPI (M), CPI గా ఏర్పడ్డాయి. రాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతిగా జాకీర్‌ హుస్సేన్‌ వ్యవహరించారు. మూడో లోక్‌సభను నిర్ణీత పదవీకాలానికి 44 రోజుల ముందే రద్దు చేశారు. ఈ సభా కాలంలోనే 1965లో భారత ఆహార సంస్థ (FCI)ను స్థాపించారు. 1966లో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి వ్యవసాయోత్పత్తుల గణనీయ పెంపుదలకు ప్రయత్నించారు.

నాలుగో లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 61% పోలింగ్‌ నమోదైంది. 31 మంది మహిళలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ 283, జనసంఘ్‌ 35, సీపీఐ 23, సీపీఎం 19 స్థానాలు గెలుపొందాయి. ఈ లోక్‌సభ పదవీకాలం 1967 మార్చి నుంచి 1970 డిసెంబరు వరకు కొనసాగింది. ఒక సంవత్సరం 79 రోజులు ముందుగానే సభను రద్దు చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన నీలం సంజీవరెడ్డి 1969లో తన పదవికి రాజీనామా చేయడంతో, గురుదయాళ్‌ సింగ్‌ థిల్లాన్‌ స్పీకర్‌ పదవి చేపట్టారు. డిప్యూటీ స్పీకర్‌గా కాదిల్‌కర్‌ వ్యవహరించారు. ఇందిరాగాంధీ లోక్‌సభ నాయకురాలుగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1969లో కాంగ్రెస్‌ పార్టీలో చీలిక ఏర్పడి కాంగ్రెస్‌ (ఓ), కాంగ్రెస్‌ (ఆర్‌)లు ఏర్పాటయ్యాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ మొదటిసారిగా మైనార్టీ ప్రభుత్వాన్ని కొనసాగించింది.

నాలుగో లోక్‌సభ కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఈ సమయంలోనే నీలం సంజీవరెడ్డి, వి.వి.గిరి రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. ఎలక్టోరల్‌ కాలేజ్‌’ సభ్యులు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇందిరా గాంధీ పిలుపునివ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ బలపరచిన నీలం సంజీవరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వి.వి.గిరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పుడే ఇందిరాగాంధీ ప్రభుత్వం తొలిసారిగా పలు ప్రైవేటు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. 1969, జులై 19 నుంచి 14 ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వపరం అయ్యాయి. అలాగే ప్రభుత్వం మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఇస్తున్న ‘రాజభరణాలు’ రద్దు చేస్తూ(Abolition of Privy purse) 1971లో సాహసోపేతమైన చర్యలు చేపట్టారు.

అయిదో లోక్‌సభ: ఇది మధ్యంతర ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి లోక్‌సభ. దేశంలో మొదటిసారిగా 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 55% పోలింగ్‌ నమోదవగా, 22 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ అనే నినాదంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ‘ఇందిరాకో హఠావో - భారత్‌కో బచావో’ అనే నినాదంతో ప్రచారం చేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ 352 స్థానాలు గెలవగా, సీపీఐ 23, సీపీఎం 25, భారతీయ జనసంఘ్‌ 22 స్థానాలు గెలిచాయి. లోక్‌సభ నాయకురాలిగా ఇందిరాగాంధీ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లోక్‌నాయక్‌గా ప్రసిద్ధి చెందిన జయప్రకాష్‌ నారాయణ్‌ సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చారు. ఈ లోక్‌సభకు స్పీకర్‌గా గురుదయాళ్‌సింగ్‌ థిల్లాన్‌ వ్యవహరించారు. ఈయన 1975లో రాజీనామా చేయడంతో బలిరాం భగత్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా జి.జి.స్వాల్‌ చేశారు. ఈ లోక్‌సభ కాలంలోనే అత్యధికంగా 19 రాజ్యాంగ సవరణ చట్టాలు చేశారు (24వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి 42వ రాజ్యాంగ సవరణ చట్టం వరకు). ఇందులో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని (1976) మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు. ఆ చట్టం ద్వారా రాజ్యాంగానికి అనేక మార్పుచేర్పులు జరిగాయి. అవి-

* రాజ్యాంగ ప్రవేశికను సవరించి సౌమ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చారు.

* రాజ్యాంగంలో కొత్తగా 10 ప్రాథమిక విధులను పొందుపరిచారు.

* న్యాయస్థానాలకు ఉండే న్యాయ సమీక్షాధికారంపై పరిమితులు విధించారు.

* లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి ఆరేళ్లకు పొడిగించారు.

* ఈ లోక్‌సభ పదవీకాలం 1971 మార్చి నుంచి 1977 జనవరి వరకు కొనసాగింది. అత్యధిక కాలం ఉన్న లోక్‌సభ ఇదే (5 సంవత్సరాల 10 నెలల 6 రోజులు).

అయిదో లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని 1975లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఆయుధంగా మలచుకున్న ప్రతిపక్షాలు ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేపట్టాయి. ఫలితంగా పత్రికలపై ఆంక్షలు, ప్రతిపక్ష రాజకీయ నాయకుల నిర్బంధాలు కొనసాగాయి. ఈ లోక్‌సభ కాలంలో రాష్ట్రపతులుగా వి.వి.గిరి, ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్, బి.డి.జెట్టి వ్యవహరించారు. ఆ సమయంలో గరిష్ఠంగా 482 చట్టాలు రూపొందాయి. అప్పట్లోనే బంగ్లాదేశ్‌ అవతరణ సందర్భంగా భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య యుద్ధం జరగడంతో అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆర్టికల్‌ 352ను ప్రయోగించి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లుబాటు కాదని అలహాబాదు హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పే ఉద్దేశంతో ఇందిరా గాంధీ ప్రభుత్వ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ‘అంతరంగిక అల్లకల్లోలాలు’ నియంత్రణ కోసం 1975, జూన్‌ 26న ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

బంగారు సత్యనారాయణ

Posted Date : 11-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో ప్రజాస్వామ్యం (6 నుంచి 10వ లోక్‌సభలు) 

సంకీర్ణ రాజకీయాల స్వర్ణయుగం! 

స్వాతంత్య్రానంతరం దేశ రాజకీయాల్లో రెండున్నర దశాబ్దాలకు పైగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్‌ పార్టీకి ఆరో లోక్‌సభ ఎన్నికల నుంచి అసలైన పోటీ మొదలైంది. ఈ పరిణామం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు బాటలు పడ్డాయి. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా జనతా పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలు ఆవిర్భవించాయి. సంకీర్ణ రాజకీయాల స్వర్ణయుగం మొదలైంది. ఇదే క్రమంలో వరుసగా ఇద్దరు శక్తిమంతులైన ప్రధానులు హత్యలకు గురవడం అనుకోని పరిణామాలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వాల్లో స్థిరత్వం తగ్గి, అనిశ్చితి కొనసాగినప్పటికీ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధానాల్లో మార్పులు, ప్రగతిశీల సంస్కరణలు వేగంగా అమలయ్యాయి. కఠిన సవాళ్లు ఎదురైనప్పటికీ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది.  లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వాల పనితీరు ఆధారంగా ఈ అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. ఎన్నికల సరళి, ప్రధాన పార్టీలు సాధించిన సీట్లు, ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, చేసిన చట్టాలు, వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి.

ఆరో లోక్‌సభ(1977-79): ఈ లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సోషలిస్ట్‌ పార్టీ, సంస్థా కాంగ్రెస్‌ పార్టీలు విలీనమై ‘జనతా పార్టీ’గా అవతరించి, ఎన్నికల బరిలో నిలిచాయి. ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్‌’ అనే కొత్త పార్టీ జనతా పార్టీకి మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 60%. లోక్‌సభకు ఎన్నికైన మహిళల సంఖ్య కేవలం 19. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ 295 స్థానాలు గెలుపొందగా, భారత జాతీయ కాంగ్రెస్‌ (INC)154 స్థానాలకు పరిమితమైంది. సీపీఐ (ఎం) 22, సీపీఐ 7 స్థానాలు సాధించాయి. కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది.

*
జనతా పార్టీకి చెందిన మొరార్జీ దేశాయ్‌ లోక్‌సభా నాయకుడిగా ఎన్నికై 1977లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేంద్రంలో తొలి సంకీర్ణ, కాంగ్రెసేతర ప్రభుత్వం. 1979లో మొరార్జీ దేశాయ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో చరణ్‌ సింగ్‌ ప్రభుత్వం పాలనలోకి వచ్చింది.ఈయన పార్లమెంటులో అడుగుపెట్టకుండానే 4 నెలల వ్యవధిలోనే పదవికి రాజీనామా చేశారు.

* 6వ లోక్‌సభ పదవీ కాలం 1977 మార్చి నుంచి 1979 ఆగస్టు వరకు కొనసాగింది. స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని చేపట్టిన కొంతకాలానికే రాజీనామా చేయడంతో, కె.ఎస్‌.హెగ్డే స్పీకర్‌గా వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా మురహరి విధులు నిర్వహించారు.

* 1977, నవంబరు 18న ఇందిరా గాంధీ లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురై అరెస్టయ్యారు. 1978, డిసెంబరు 19న ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. బి.డి.జెట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు. 1977, జులై 25న నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఈ లోక్‌సభ కాలంలోనే 1977లో ‘ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం’ రూపొందింది. దాని ప్రకారం లోక్‌సభలో తొలి ప్రధాన ప్రతిపక్షపార్టీ నేతగా వై.బి.చవాన్‌ (భారత జాతీయ కాంగ్రెస్‌  (INC)154 వ్యవహరించారు.

* ఈ లోక్‌సభ కాలంలోనే 1978లో ‘బ్యాంకింగ్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు/ రద్దు’కు సంబంధించిన బిల్లు ఆమోదం కోసం ‘పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం’ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అప్పటి లోక్‌సభ స్పీకర్‌ కె.ఎస్‌.హెగ్డే అధ్యక్షత వహించారు.

* రాజకీయ అనిశ్చితి కారణంగా రెండేళ్ల కాలపరిమితి ఉండగానే 1979, ఆగస్టు 22న 6వ లోక్‌సభ రద్దయింది.. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. దీని ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలోని ఆర్టికల్‌ 31లో పేర్కొన్న ‘ఆస్తి హక్కు’ను ఆ జాబితా నుంచి తొలగించి, ఆర్టికల్‌ 300(ఎ)లో సాధారణ చట్టబద్ధమైన హక్కుగా మార్పు చేశారు.

* ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా ఆరేళ్లకు పెంచిన లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల పదవీకాల పరిమితిని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తిరిగి అయిదేళ్లకు తగ్గించారు.

* కేంద్ర కేబినెట్‌ లిఖిత పూర్వక సలహా మేరకే రాష్ట్రపతి ఆర్టికల్‌ 352ను ప్రయోగించాలని, దానిని ప్రయోగించేందుకు ‘ఆంతరంగిక అల్లకల్లోలాలు’ అనే పదానికి బదులుగా ‘సాయుధ దళాల తిరుగుబాటు’ అనే పదాన్ని పరిగణనలోకి తీసుకోవాలని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు.

* 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించిన ' MISA - Maintenance of Internal Security Act' ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు.

* ఈ లోక్‌సభ కాలంలోనే 1977లో ‘పనికి ఆహార పథకం’, 1978లో ‘నిరంతర ప్రణాళికలు’ ప్రారంభమయ్యాయి.

* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం సిఫార్సుల మేరకు అప్పటి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న బి.డి.జెట్టి ఆర్టికల్‌ 356ను ప్రయోగించి 9 కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. వాటిలో ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, బిహార్, హిమాచల్‌ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి.

* ఈ లోక్‌సభ కాలంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వీతీది వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని అధ్యయనం చేసేందుకు బి.పి.మండల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు అశోక్‌ మెహతా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ రెండంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫార్సు చేసింది.

ఏడో లోక్‌సభ (1980-84): ఈ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 57% పోలింగ్‌ నమోదైంది. 28 మంది మహిళలు ఎన్నికయ్యారు. ‘ఇందిరాకో బులావో - దేశ్‌కో బచావో’ అనే నినాదంతో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను ఆకర్షించి, ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 353, సీపీఐ(ఎం) 37, సీపీఐ 10, జనతా పార్టీ 31 స్థానాలు గెలుపొందాయి. లోక్‌సభ నాయకురాలిగా ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌గా బలరాం జక్కర్, డిప్యూటీ స్పీకర్‌గా జి.లక్ష్మణ్‌ వ్యవహరించారు. ఈ లోక్‌సభ కాలంలో నీలం సంజీవ రెడ్డి, జ్ఞానీ జైల్‌సింగ్‌ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు.

* 1984లో ఆగస్టులో బి.పి.మండల్‌ కమిషన్‌ తన నివేదికను సమర్పించింది. 1983లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసేందుకు రంజిత్‌ సింగ్‌ సర్కారియా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ లోక్‌సభ కాలంలోనే ఇందిరా గాంధీ ప్రభుత్వం 1984, జూన్‌ 3 నుంచి 8 వరకు పంజాబ్‌లోని అమృతసర్‌లో స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ పేరుతో సైనిక చర్య నిర్వహించింది. 1984, అక్టోబరు 31న ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో దిల్లీలో సిక్కు మతస్థులపై భారీగా దాడులు జరిగి అపార ప్రాణనష్టం జరిగింది. ఇందిర అనంతరం రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టారు.

* 7వ లోక్‌సభ పదవీ కాలం 1980 జనవరి నుంచి 1984 డిసెంబరు వరకు కొనసాగింది. ఇది రెండో మధ్యంతర ఎన్నికల ద్వారా ఏర్పడిన లోక్‌సభ. ఈ సభా కాలంలోనే 1983లో దిల్లీలో అలీన దేశాల 7వ శిఖరాగ్ర సదస్సు జరిగింది.

ఎనిమిదో లోక్‌సభ (1984-89): ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధికంగా 414 స్థానాలు సాధించింది. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 30 స్థానాలు గెలిచి లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించింది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ 10, సీపీఐ (ఎం) 22, సీపీఐ 6, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2 స్థానాలు గెలుపొందాయి. నమోదైన పోలింగ్‌ 64%. ఎన్నికైన మహిళలు 44 మంది. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌గా బలరాం జక్కర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎం.తంబిదొరై వ్యవహరించారు. ఈ లోక్‌సభ కాలంలోనే రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంలో రక్షణశాఖా మంత్రిగా ఉన్న వి.పి.సింగ్‌ తన పదవికి రాజీనామా చేసి 1988లో జనతాదళ్‌ పార్టీని స్థాపించారు.

* 61వ రాజ్యాంగ సవరణ చట్టం(1988) ద్వారా రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం వయోజన ఓటు హక్కు అర్హత వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది. 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 ద్వారా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ రూపొందించారు. మనదేశంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 1986లో ‘నూతన జాతీయ విద్యావిధానం’ రూపొందించారు. 

* శ్రీలంకలో శాంతిభద్రతలను పరిరక్షించే ఉద్దేశంతో  "Indian Peace Keeping Force" (IPKF) దళాలను రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు పంపింది. ఈ లోక్‌సభ కాలంలోనే 1987లో ‘ముస్లిం మహిళల వివాహం, విడాకుల చట్టం’ రూపొందింది. స్థానిక సంస్థలపై అధ్యయనం కోసం ఎల్‌.ఎమ్‌.సింఘ్వీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ కమిషన్‌ సిఫార్సుల మేరకు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు, 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ లోక్‌సభ కాలంలోనే రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం బోఫోర్స్, ఫెయిర్‌ పాక్స్‌ కుంభకోణాలకు పాల్పడిందనే ఆరోపణలు రావడంతో 101 మంది ఎంపీలు రాజీనామా చేశారు.

* ఈ సమయంలోనే మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ఈ లోక్‌సభ కాలం 1984, డిసెంబరు నుంచి 1989, నవంబరు వరకు కొనసాగింది. రాజీవ్‌ గాంధీ తన మంత్రిమండలిని అత్యధికంగా 13 సార్లు పునర్‌వ్యవస్థీకరించారు.

* మొదటిసారిగా పార్లమెంటరీ స్థాయీ సంఘాలను ఈ లోక్‌సభ కాలంలోనే ప్రారంభించారు. జ్ఞానీ జైల్‌సింగ్, ఆర్‌.వెంకట్రామన్‌ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు. 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పంపిన ‘పోస్టల్‌ బిల్‌’పై అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌ సింగ్‌ ‘పాకెట్‌ వీటో’ను ప్రయోగించి బిల్లును తన వద్దే ఉంచుకున్నారు.

తొమ్మిదో లోక్‌సభ (1989-91): ఈ ఎన్నికల్లో 62% పోలింగ్‌ నమోదైంది. ఎన్నికైన మహిళల సంఖ్య 27. కాంగ్రెస్‌ 197, జనతాదళ్‌ 143, భారతీయ జనతా పార్టీ 85, సీపీఐ(ఎం) 33, సీపీఐ 12 స్థానాలు గెలుపొందాయి. ఏ రాజకీయ పార్టీకీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ‘హంగ్‌  పార్లమెంటు’ ఏర్పడింది. స్పీకర్‌గా రబీ రే, డిప్యూటీ స్పీకర్‌గా శివరాజ్‌ పాటిల్‌ వ్యవహరించారు. ఈ లోక్‌సభ పదవీకాలం 1989, డిసెంబరు నుంచి 1991, మార్చి వరకు కొనసాగింది. ‘నేషనల్‌ ఫ్రంట్‌’ పేరుతో కూటమిని ఏర్పాటు చేసిన జనతాదళ్‌ పార్టీకి చెందిన వి.పి.సింగ్‌ లోక్‌సభా నాయకుడిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించారు.దీనికి బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మద్దతిచ్చాయి.

* అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రథయాత్ర చేస్తున్న బీజేపీ నేత ఎల్‌.కె.ఆడ్వాణీని అరెస్ట్‌ చేయడంతో వి.పి.సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించింది. అనంతరం లోక్‌సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, వీగిపోవడంతో వి.పి.సింగ్‌ ప్రధాని పదవి కోల్పోయారు. ఆ తర్వాత జనతాదళ్‌ పార్టీకి చెందిన చంద్రశేఖర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అనతికాలంలోనే కూలిపోయింది. ఈ లోక్‌సభ కాలంలోనే వి.పి.సింగ్‌ ప్రభుత్వం 1990లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 263 ప్రకారం ‘అంతర్రాష్ట్ర మండలి’ని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వారికి 27% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బి.పి.మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం దినేష్‌ గోస్వామి కమిటీని ఏర్పాటు చేసింది. 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఈ లోక్‌సభ కాలంలోనే రూపొందింది. 9వ లోక్‌సభ కేవలం 14 నెలల 26 రోజులు కొనసాగి, 1991, మార్చి 13న రద్దయింది.

పదో లోక్‌సభ (1991-96): ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 56%. ఎన్నికైన మహిళలు 39 మంది. కాంగ్రెస్‌ పార్టీ 232 స్థానాలు గెలుపొందగా, బీజేపీ 129, జనతాదళ్‌ 59, సీపీఐ(ఎం) 35, సీపీఐ 14 స్థానాలు గెలిచాయి. ఈ ఎన్నికల ప్రచార సమయంలోనే 1991, మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనూ సభ్యత్వం లేని పి.వి.నరసింహారావు ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత నంద్యాల లోక్‌సభ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. స్పీకర్‌గా శివరాజ్‌ పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా మల్లికార్జునయ్య వ్యవహరించారు. ఈ లోక్‌సభ కాలం 1991, జూన్‌ నుంచి 1996, మే వరకు కొనసాగింది. ఆర్‌.వెంకట్రామన్, శంకర్‌ దయాళ్‌ శర్మ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు. పి.వి.నరసింహారావు తన సమర్థతతో మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు (5 సంవత్సరాలు) నిర్వహించారు.

* పీవీ హయాంలోనే 1991లో నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1993, డిసెంబరు 23న ఎంపీలాడ్స్‌(Member of Parliament Local Area Development Scheme) ను ప్రారంభించారు. ఈ లోక్‌సభ కాలంలోనే 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించారు. పి.వి.నరసింహారావు ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో 8 సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంది. భారతదేశ, విదేశాంగ విధానంలో "LOOK EAST" విధానాన్ని ప్రవేశపెట్టారు. 1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు దుర్ఘటన జరిగింది.

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 19-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో ప్రజాస్వామ్యం - పనితీరు

కూలిపోయి.. కూటమి కట్టి.. కుదురుకొని!

పదకొండో లోక్‌సభ అయిదేళ్లలో ముగ్గురు ప్రధానులు మారారు. పదమూడు నెలలకే పన్నెండో సభ కూలిపోయింది. అత్యంత అస్థిర పరిస్థితుల్లో కొలువుతీరిన పదమూడో సభ రెండు పదులపైగా పార్టీల కూటమితో మొదలై పూర్తికాలం పాలన చేసింది. మళ్లీ అధికారాన్ని దక్కించుకున్న యూపీఏ మరో పదేళ్లు సంకీర్ణాల సహకారంతోనే ప్రభుత్వాన్ని నడిపించింది. తిరిగి గత రెండు విడతలుగా ఎన్‌డీఏ స్థిరమైన సర్కారును నెలకొల్పి కుదురుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని పరిష్కరించుకుంటూ ప్రజాస్వామ్యం విశిష్టతను కాపాడుకోగలిగింది. దేశం కోసం పాలనాపరమైన పలు విధానాలను రూపొందించి అమలు చేసింది. ఆ విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వాటితోపాటు వివిధ లోక్‌సభల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు, మారిన ప్రభుత్వాల ప్రాధాన్యాలు, ముఖ్యమైన చట్టాలు, నిర్ణయాలపై అవగాహన పెంచుకోవాలి.   

11వ లోక్‌సభ:  ఈ ఎన్నికల్లో 58% పోలింగ్‌ నమోదైంది. 40 మంది మహిళలు ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 161 స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సి) 140, జనతాదళ్‌ 46, సీపీఐ 12, సీపీఎం 32, తెలుగుదేశం పార్టీ 16 స్థానాలు పొందాయి. ఈ లోక్‌సభ 1996, మే 15న ఏర్పడి 1997, డిసెంబర్‌ 4న రద్దయింది. అంటే కేవలం 1 సంవత్సరం 6 నెలల 13 రోజులు మాత్రమే మనుగడలో ఉంది. ఈ సభా కాలంలో ముగ్గురు ప్రధానులు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.

* 1996లో బీజేపీ నాయకుడైన అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమవడంతో 13 రోజుల అనంతరం ఆ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.

* హెచ్‌.డి.దేవేగౌడ జనతాదళ్, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ‘యునైటెడ్‌ ఫ్రంట్‌’ పేరుతో కూటమిని ఏర్పాటు చేసి, కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో 1996, జూన్‌ 1న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే దేవేగౌడ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోవడంతో అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఐ.కె.గుజ్రాల్‌ నాయకత్వంలో ‘యునైటెడ్‌ ఫ్రంట్‌’ ప్రభుత్వం 1997, ఏప్రిల్‌లో కొలువుదీరింది. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో 1998, మార్చిలో అధికారాన్ని కోల్పోయింది.

* ఈ లోక్‌సభకు ప్రతిపక్ష పార్టీకి చెందిన పి.ఎ.సంగ్మా స్పీకర్‌గా, సూరజ్‌భాన్‌ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. శంకర్‌దయాళ్‌ శర్మ, కె.ఆర్‌.నారాయణన్‌ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు.

* మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు’ను తొలిసారిగా ఈ సభా కాలంలోనే ప్రవేశపెట్టారు. హెచ్‌.డి.దేవేగౌడ, ఐ.కె.గుజ్రాల్‌ రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవులు నిర్వహించారు. ఐ.కె.గుజ్రాల్‌ భారతదేశ విదేశాంగ విధానంలో నూతనంగా ‘గుజ్రాల్‌ డాక్ట్రిన్‌’ పేరుతో వ్యూహాన్ని ప్రవేశపెట్టారు.

12వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 62% పోలింగ్‌ నమోదైంది. 43 మంది మహిళలు ఎన్నికయ్యారు. బీజేపీ 182, కాంగ్రెస్‌ 141, సీపీఐ 9, సీపీఎం 32, తెలుగుదేశం పార్టీ 12 స్థానాలు సాధించాయి. వాజ్‌పేయీ లోక్‌సభాపక్ష నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 13 నెలలు మాత్రమే ఈ ప్రభుత్వం కొనసాగింది. వాజ్‌పేయీ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం కేవలం ఒక్క ఓటు తేడాతో వీగిపోవడంతో ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.ఏఐఏడీఎంకే  పార్టీ వాజ్‌పేయీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. స్పీకర్‌గా జి.ఎం.సి. బాలయోగి, డిప్యూటీ స్పీకర్‌గా పి.ఎమ్‌.సయీద్‌ వ్యవహరించారు. ఈ సభ కాలం 1998, మార్చి నుండి 1999, ఏప్రిల్‌ వరకు అంటే 13 నెలల 4 రోజులు మాత్రమే కొనసాగింది. వార్షిక బడ్జెట్‌ను సమర్పించే సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్పు చేశారు. కె.ఆర్‌.నారాయణన్‌ రాష్ట్రపతిగా వ్యవహరించారు.

13వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 59% పోలింగ్‌ నమోదైంది. 49 మంది మహిళలు ఎన్నికయ్యారు. బీజేపీ 182, కాంగ్రెస్‌ 114, సీపీఐ 4, సీపీఎం 33, తెలుగుదేశం పార్టీ 29 స్థానాలు గెలుపొందాయి. స్పీకర్‌గా జీఎంసీ బాలయోగి వ్యవహరిస్తూ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. తదుపరి స్పీకర్‌గా మనోహర్‌ జోషి వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా పీఎం సయీద్‌ ఉన్నారు. కె.ఆర్‌.నారాయణన్, ఏపీజే అబ్దుల్‌ కలాం రాష్ట్రపతులుగా చేశారు.

* వాజ్‌పేయీ 21 రాజకీయ పార్టీలతో కూడిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఈ లోక్‌సభ కాలంలోనే దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 2000 సంవత్సరంలో ‘భారత్‌ నిర్మాణ్‌’ అనే కార్యక్రమం చేపట్టారు. 2001, డిసెంబరు 13న పార్లమెంటుపై పాకిస్థాన్‌ ఉగ్రవాదుల దాడి జరిగింది. 2001లో సార్వత్రిక ప్రాథమిక విద్య సాధనకు ‘సర్వశిక్ష అభియాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

* 2000 సంవత్సరంలో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య నేతృత్వంలో ‘రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌’ ఏర్పాటైంది. 2002లో పోటా చట్టం విషయంలో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించారు.

* పాకిస్థాన్‌తో ‘కార్గిల్‌’ యుద్ధం సంభవించింది. ‘భారతదేశం వెలిగిపోతోంది’(Shine India) అనే నినాదం ప్రాచుర్యం పొందింది. మైనార్టీ సంక్షేమంపై అధ్యయనం కోసం రంగనాథ్‌ మిశ్రా కమిటీని ఏర్పాటుచేశారు.

* ఈ లోక్‌సభ కాలంలోనే 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్‌ 21(ఎ)ను చేర్చి ‘ఉచిత ప్రాథమిక విద్య’ను ప్రాథమిక హక్కుగా చేయాలని నిర్దేశించారు. 89వ రాజ్యాంగ సవరణ చట్టం-2004 ద్వారా ‘నేషనల్‌ ఎస్టీ కమిషన్‌’ ఏర్పాటు చేసి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. ఈ లోక్‌సభ  1999, అక్టోబరు నుంచి 2004, ఏప్రిల్‌ వరకు కొనసాగింది.

14వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 58% పోలింగ్‌ నమోదైంది. 45 మంది మహిళలు ఎన్నియ్యారు. కాంగ్రెస్‌ 145, బీజేపీ 138, సీపీఐ 10, సీపీఎం 43, తెలుగుదేశం పార్టీ 5, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) 5 స్థానాలు గెలిచాయి. ఎన్నికల్లో ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌) వినియోగించారు. ప్రొటెం స్పీకర్‌గా పనిచేసిన సోమ్‌నాథ్‌ చటర్జీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా చరణ్‌జిత్‌ సింగ్‌ అతవాలే వ్యవహరించారు. కాంగ్రెస్‌ పార్టీ, ఇతర పార్టీలతో కలిసి ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి’ (యూపీఏ)గా ఏర్పడి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ సభ కాలంలోనే 2005లో గృహహింస చట్టాన్ని రూపొందించారు. 2006, అక్టోబర్‌ 26 నుంచి అమలులోకి వచ్చింది. ‘జాతీయ సమాచార హక్కు చట్టం’ 2005లో రూపొంది అదే ఏడాది అక్టోబర్‌ 12 నుంచి అమల్లోకి వచ్చింది. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం’(MGNREG Act) కూడా 2005లోనే ఆమోదం పొంది, 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. 2005లోనే ‘జాతీయ బాలల హక్కుల చట్టం’ రూపొందించారు. 2007లో ‘జాతీయ బాలల హక్కుల కమిషన్‌’ ఏర్పాటైంది. 2007లో ‘ఆదివాసీ హక్కుల చట్టం’ రూపొందింది.

* సభ 2004, మే నుంచి 2009 మే వరకు సాగింది. ఈ సమయంలో రాష్ట్రపతి (డా.ఏపీజే అబ్దుల్‌ కలాం), ఉపరాష్ట్రపతి (హమీద్‌ అన్సారి), ప్రధానమంత్రి (మన్మోహన్‌ సింగ్‌) ముగ్గురూ మైనార్టీ వర్గానికి చెందినవారే.

* భారతదేశం ఆమెరికాతో ‘123’ అనే ‘పౌర అణు ఒప్పందం’ కుదుర్చుకుంది. దాన్ని పార్లమెంటు ఆమోదించే సందర్భంలో జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి పార్లమెంటు సభ్యులు కొందరు లంచం తీసుకున్నారనే ‘ఓటుకు నోటు’ కుంభకోణం 2008, జులై 22న వెలుగులోకి వచ్చింది.

15వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 58%. ఎన్నికైన మహిళలు 59 మంది. కాంగ్రెస్‌ 206, బీజేపీ 116, తృణమూల్‌ కాంగ్రెస్‌ 19, తెదేపా 6, తెరాస 2 స్థానాలు గెలుపొందాయి. స్పీకర్‌గా మీరాకుమార్‌ (లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్‌), డిప్యూటీ స్పీకర్‌గా కరియా ముండా వ్యవహరించారు. ఆహార భద్రతా చట్టం, లోక్‌పాల్‌ చట్టం, నిర్భయ చట్టం రూపొందాయి. సభ 2009, మే నుంచి 2014 మే వరకు కొనసాగింది. మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి’(UPA) ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రతిభా పాటిల్, ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు. 

* ‘ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యాహక్కు చట్టం 2009’ రూపొందింది. ఈ చట్టం 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం 6-14 సంవత్సరాలు వయసున్న బాలబాలికలకు 1 నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యను ‘ప్రాథమిక హక్కు’గా మార్చారు. 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2012 ద్వారా సహకార సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. ఈ కాలంలో రాష్ట్రపతి, స్పీకర్, అధికార పార్టీ అధ్యక్షురాలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అందరూ మహిళలే కావడం విశేష పరిణామం.

16వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో 66% పోలింగ్‌ నమోదైంది. 62 మంది మహిళలు ఎన్నికయ్యారు. విదీతి కూటమి 336 స్థానాలు గెలుపొందింది. ఈ కూటమిలోని బీజేపీ 282, శివసేన 18, తెలుగుదేశం పార్టీ 16, లోక్‌ జనశక్తి పార్టీ 6, శిరోమణి అకాలీదళ్‌ పార్టీ 4 స్థానాలు గెలుపొందాయి. ఇక UPA కూటమి 60 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఆ కూటమిలోని కాంగ్రెస్‌ 44, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) 6, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) 4 స్థానాలు సాధించాయి. స్పీకర్‌గా సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్‌గా తంబిదొరై వ్యవహరించారు. లోక్‌సభ నాయకుడిగా నరేంద్ర మోదీ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ 2014, మే నుంచి 2019, మే వరకు కొనసాగింది. జాతీయ ప్రణాళిక సంఘం పేరును ‘నీతి ఆయోగ్‌’గా మార్పు చేశారు. ప్రణబ్‌ ముఖర్జీ, రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి పదవులు నిర్వహించారు.

* 2017లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తీసుకొచ్చారు. 2019, జనవరిలో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి  విద్యాసంస్థల్లో 10% రిజర్వేషన్లు నిర్దేశించారు.

17వ లోక్‌సభ: ఈ ఎన్నికల్లో విదీతి కూటమి 353 స్థానాలు సాధించింది. కూటమిలోని బీజేపీ 303, శివసేన 18, జనతాదళ్‌ (యునైటెడ్‌) 16, లోక్‌జనశక్తి పార్టీ 6 స్థానాలు గెలిచాయి. UPA కూటమి 91 స్థానాలు గెలిచింది. ఇందులోని కాంగ్రెస్‌ 52, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) 23, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఇతర పార్టీల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 22, తెరాస 9, తెదేపా 3 స్థానాలు దక్కించుకున్నాయి. ఈ లోక్‌సభ 2019, జూన్‌ 7న ఏర్పడి ప్రస్తుతం కొనసాగుతోంది. స్పీకర్‌గా ఓం ప్రకాష్‌ బిర్లా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ముగియడంతో ద్రౌపది ముర్ము ఆ పదవికి ఎన్నికయ్యారు.

* 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2020 ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి లోక్‌సభ, రాష్ట్రాల విధాన సభల్లో రిజర్వేషన్‌ సదుపాయాన్ని 2020 నుంచి 2030 వరకు పొడిగించారు. ఆర్టికల్‌ 331 ప్రకారం రాష్ట్రపతి లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను, ఆర్టికల్‌ 333 ప్రకారం రాష్ట్ర విధానసభకు గవర్నర్‌ ఒక ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దు చేశారు.

* 105వ రాజ్యాంగ సవరణ చట్టం, 2021 ద్వారా ఓబీసీ బిల్లును చట్టంగా చేశారు. దీని ప్రకారం ఓబీసీ జాబితాను తయారు చేసుకునే విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు.

* జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 అమలును నిలిపివేశారు. 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 26-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగ సవరణ విధానం

ప్రగతి సాధక మార్పు మంచిదే! 

చట్టాలు దేశ ప్రగతికి సాధనాలుగా ఉపయోగపడాలి. ప్రజాస్వామ్య పరిణామాలకు, నిబద్ధతకు ప్రతిబింబాలుగా నిలవాలి. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను పాటిస్తూ సమకాలీన సామాజిక, రాజకీయ గతిశీలతకు అనుగుణంగా ఉండాలి. అభివృద్ధికి అవరోధాలుగా మారకూడదు.  ఈ లక్ష్యంతో అసలు సవరించకపోతే సమస్యలు ఎదురవుతాయి, మారుస్తూ కూర్చుంటే మౌలిక స్వరూపమే మారిపోవచ్చనే ఆందోళనల మధ్య సమర్థ సవరణ విధానాలను భారత రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. పౌరుల హక్కులు, ప్రయోజనాలను కాపాడుతూ స్థిరత్వం, పురోగతి మధ్య సమతౌల్యతను సాధించే విధంగా వాటిని రూపొందించారు. ఈ అంశాలను సంబంధిత ఆర్టికల్స్, సుప్రీంకోర్టు తీర్పులతో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రజల అవసరాలకు ప్రతిస్పందించగలిగినట్లుగా ప్రస్తుతం అనుసరిస్తున్న రాజ్యాంగ సవరణ ప్రక్రియను తీర్చిదిద్దిన తీరును అర్థం చేసుకోవాలి.

‘‘ ఒకవేళ మనం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు లేని విధంగా తయారు చేస్తే, అది జాతి అభివృద్ధిని, ప్రజల జీవన విధానాన్ని అడ్డుకోవడమే అవుతుంది. ప్రపంచం కాలానుగుణ మార్పులకు తగినట్లుగా పరుగు పెడుతుంటే, మనం సంప్రదాయ సమాజంలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఈ రోజు రూపొందించిన ఈ రాజ్యాంగం భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందువల్ల రాజ్యాంగాన్ని సరళంగా, కాలానుగుణంగా సవరించే అవకాశం ఉండాలి. ’’

- జవహర్‌లాల్‌ నెహ్రూ (నాటి రాజ్యాంగ పరిషత్తు చర్చలో) 

ఆధునిక యుగంలో భారత ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా రాజ్యాంగాన్ని సవరించే సర్వాధికారం రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటుకు అప్పగించారు. అందుకోసం సవరణ విధానాలను, ప్రక్రియలను, నియమాలను నిర్దేశించారు.

రాజ్యాంగ వివరణ :  భారత రాజ్యాంగంలోని 20వ భాగంలో ఆర్టికల్‌ 368లో భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని వివరించారు. సంబంధిత బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. వాటిని ఆమోదించే క్రమంలో లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆ బిల్లులు వీగిపోతాయి. రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తే, అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టాలుగా అమల్లోకి వస్తాయి. 

1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం రూపొందాయి. వీటి ద్వారా ఆర్టికల్‌ 368లో మార్పులు, చేర్పులు జరిగాయి.

రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు.

రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా ఆమోదించాలి. ఈ బిల్లుల ఆమోద విషయమై ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.

రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపడం, తిరస్కరించడం కుదరదు. తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.

దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం :  రాజ్యాంగాన్ని సవరించే విధానం కఠినంగా ఉంటే దాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ఉదా: అమెరికా రాజ్యాంగం. అక్కడ రాజ్యాంగాన్ని సవరించాలంటే ఆ దేశ శాసన వ్యవస్థ (కాంగ్రెస్‌) 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు, ఆ దేశంలోని 3/4వ వంతు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి.

 రాజ్యాంగాన్ని సవరించే విధానం సులభంగా ఉంటే అది అదృఢ రాజ్యాంగం. ఉదా: బ్రిటన్‌ రాజ్యాంగం. బ్రిటన్‌ దేశంలో పార్లమెంటు సాధారణ మెజార్టీ పద్ధతి ద్వారా ఎలాంటి అంశాన్నయినా సవరిస్తుంది.  

 రాజ్యాంగ పరిషత్తులో భారత రాజ్యాంగం ఏవిధంగా ఉండాలనే అంశంపై విస్తృతమైన చర్చ జరిగింది. గోపాలస్వామి అయ్యంగార్‌ నేతృత్వంలోని కొంతమంది సభ్యులు దృఢ రాజ్యాంగం ఉండాలంటే, జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని కొంతమంది సభ్యులు అదృఢ రాజ్యాంగం ఉండాలని సూచించారు. చివరకు రాజ్యాంగాన్ని దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనంగా రూపొందించారు.

‣ రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు.

గోల్డెన్‌ మిడిల్‌ పాత్‌ :  మన రాజ్యాంగ సవరణ ప్రక్రియ దక్షిణాఫ్రికా అంత సరళం కాదు. అమెరికా తరహాలో అత్యంత దృఢమైన విధానం కాదు. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని గోల్డెన్‌ మిడిల్‌ పాత్‌ను అనుసరించారు.

 సవరణ విధానం దృఢంగా ఉంటే కాలమాన పరిస్థితులకు వీలుగా మార్పులు కుదరవు. అదృఢంగా ఉంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది.

సవరణ పద్ధతులు : రాజ్యాంగాన్ని ఆర్టికల్‌ 368 ప్రకారం మూడు రకాల పద్ధతుల ద్వారా పార్లమెంటు సవరిస్తుంది.

1) సాధారణ మెజార్టీ పద్ధతి: సాధారణ మెజార్టీ అంటే సభకు హాజరై ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది (50% +) ఆమోదంతో రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించవచ్చు. అవి

ఆర్టికల్‌ 3- రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ

ఆర్టికల్‌ 100 (3)- పార్లమెంటు సమావేశాల నిర్వహణకు కోరంలో మార్పులు, చేర్పులు

ఆర్టికల్‌ 102- పార్లమెంటు సభ్యుల అర్హతలు, అనర్హతలు నిర్ణయించడం.

ఆర్టికల్‌ 105- పార్లమెంటు సభ్యుల సభా హక్కులు.

ఆర్టికల్‌ 106- పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు.

ఆర్టికల్‌ 120- పార్లమెంటులో ఆంగ్ల భాష వినియోగం.

ఆర్టికల్‌ 169- రాష్ట్ర శాసనసభలో విధాన పరిషత్తు ఏర్పాటు/రద్దు.

2వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ ఉన్నత పదవుల జీతభత్యాలు.

5వ, 6వ షెడ్యూళ్లలోని షెడ్యూల్డ్‌ జాతులు, షెడ్యూల్డ్‌ తెగల పరిపాలనాంశాలు.

 3వ షెడ్యూల్‌లోని రాజ్యాంగ ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారం.

 2వ భాగంలోని పౌరసత్వ విషయాలు.

 ఆర్టికల్‌ 82- నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ

 ఆర్టికల్‌ 124 (1)- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య.

 ఆర్టికల్‌ 239 (ఎ)- కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభ, మంత్రిమండలి ఏర్పాటు.

 ఆర్టికల్‌ 343-కేంద్రం అధికార భాషను నిర్ణయించడం.

2) ప్రత్యేక మెజార్టీ పద్ధతి: ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమై, ఓటు వేసిన వారిలో 2/3వ వంతు ఆమోదిస్తే రాజ్యాంగ సమాఖ్య లక్షణాలను సవరించవచ్చు. అవి

రాజ్యాంగం 3వ భాగంలో ఆర్టికల్‌ 12 నుంచి 35 మధ్య ఉన్న ప్రాథమిక హక్కులు.

రాజ్యాంగం 4వ భాగంలో ఆర్టికల్‌ 36 నుంచి 51 మధ్య ఉన్న ఆదేశిక సూత్రాలు.

 రాజ్యాంగ 4(ఎ) భాగంలో ఆర్టికల్‌ 51 (ఎ)లోని ప్రాథమిక విధులు.ః మొదటి, మూడు పద్ధతుల్లో పేర్కొననివి.

3) ప్రత్యేక మెజార్టీ, రాష్ట్రాల ఆమోదం: పార్లమెంటు ఉభయ సభలు వేర్వేరుగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో తీర్మానం ఆమోదించడంతో పాటు దేశంలోని సగానికంటే (1/2వ వంతు) ఎక్కువ రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. ఇది దృఢ రాజ్యాంగ లక్షణం.. ఈ పద్ధతి ద్వారా పలు అంశాలను సవరించే వీలుంది.అవి -

ఆర్టికల్‌ 54 - రాష్ట్రపతి ఎన్నిక

ఆర్టికల్‌ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం

 ఆర్టికల్‌ 73 - కేంద్ర కార్యనిర్వాహక వర్గ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు

 ఆర్టికల్‌ 162 - రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు.

 ఆర్టికల్‌ 241 - కేంద్రపాలిత ప్రాంతాల్లోని హైకోర్టుల అంశాలు.

 ఆర్టికల్‌ 137 - సుప్రీంకోర్టు తీర్పులపై పునఃసమీక్ష.

 11వ భాగంలోని కేంద్ర, రాష్ట్ర సంబంధాలు (శాసన, పరిపాలన సంబంధాలు)

 ఆర్టికల్‌ 131 - సుప్రీంకోర్టు ఒరిజినల్‌ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు.

ఆర్టికల్‌ 368- రాజ్యాంగ సవరణ విధానంలో మార్పులు, చేర్పులు.

 4వ షెడ్యూల్‌లో రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశాలు.

 7వ షెడ్యూల్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన మూడు రకాల అధికారాల విభజన.ః 11వ షెడ్యూల్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన అధికారాలు, విధులు.

 12వ షెడ్యూల్‌లోని పట్టణ, స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సిన అధికారాలు, విధులు.

గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు (1967): ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటు కొత్తగా రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని పేర్కొంది.

 గోలక్‌నాథ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 13, 368లను సవరించారు. ఆర్టికల్‌ 13కి క్లాజు (4)ని చేర్చారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారాన్ని పార్లమెంటుకు అప్పగించారు. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్దేశించారు.

కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (1973): ఈ కేసులో 24వ రాజ్యాంగ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ సవరణపై పార్లమెంటుకు ఉన్న అధికారాలపై హేతుబద్ధమైన పరిమితులను పేర్కొంది. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, అయితే అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలగకుండా జరగాలని చెప్పింది. ఆ సందర్భంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎమ్‌. సిక్రీ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, గణతంత్ర వ్యవస్థ, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అంతర్భాగమని పేర్కొన్నారు. ః ఎస్‌.ఆర్‌. బొమ్మై కేసు (1994)లో సుప్రీంకోర్టు లౌకికవాదం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది.

రాజ్యాంగ సవరణ బిల్లులు వీగిపోతే : రాజ్యాంగ సవరణ బిల్లులు ఏవైనా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదం పొందాలి. ఈ బిల్లులు లోక్‌సభలో వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో సాధారణ మెజార్టీ కూడా సాధించడంలో విఫలమైతే ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాలి.

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

నమూనా ప్రశ్నపత్రాలు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌