• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు - రాజ్యాంగ సవరణ చట్టాలు

ప్రాథమిక హక్కులు - రాజ్యాంగ సవరణ చట్టాలు
భారతదేశంలో వివిధ వర్గాల వారికి సంక్షేమ ఫలాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశికసూత్రాలను అమలు చేస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం, వీటిని న్యాయస్థానాలు రద్దు చేయడం సర్వసాధారణమైంది. కోర్టుల తీర్పులను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌ ద్వారా రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించింది. వాటిలో కీలకమైనవి..


1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951
కామేశ్వరిసింగ్‌  vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు 1951లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1951, జూన్‌ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు...
* సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆర్టికల్‌ 15కు క్లాజు (4) ను చేర్చింది. దీనివల్ల కొన్ని ప్రత్యేక అధికారాలను ప్రభుత్వం పొందింది.
* ఆర్టికల్‌ 19ని సవరించి ఆర్టికల్‌ 19(6)కి వివరణ ఇస్తూ, రాజ్యపర వాణిజ్యం, జాతీయీకరణపై ప్రభుత్వానికి ఉన్న హక్కును ధ్రువీకరించింది.
* ఆర్టికల్‌ 31ని సవరించి, ఆర్టికల్స్  31(A), 31(B)లను కొత్తగా చేర్చి, వాటిని IXవ షెడ్యూల్‌లో పొందుపరచి, భూసంస్కరణలు, జమీందారీ విధానం రద్దుకు నిర్దిష్ట రూపాన్ని ఇచ్చారు. IXవ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలపై న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేకుండా చేశారు.


4వ రాజ్యాంగ సవరణ చట్టం, 1955
* బేలాబెనర్జీ కేసులో ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు ప్రభుత్వం వారికి చెల్లించే నష్టపరిహారం న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని అధిగమించేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1955లో 4వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1955, ఏప్రిల్‌ 27 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని సవరించి ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు, అందుకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం గురించి న్యాయస్థానంలో సవాలు చేయకూడదు అని నిర్దేశించింది. అంటే ఈ చట్టాలకు న్యాయసమీక్ష నుంచి రక్షణ లభిస్తుంది.

 

16వ రాజ్యాంగ సవరణ చట్టం, 1963
* 1963లో అప్పటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 16వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1963, అక్టోబరు 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19ని సవరించి, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతల సంరక్షణ కోసం భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి కల్పించారు.
* భారతదేశ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికయ్యే వ్యక్తులు దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతామనే మాటలతో చేయాల్సిన ప్రమాణపత్రాన్ని పొందుపరిచారు.


17వ రాజ్యాంగ సవరణ చట్టం, 1964
* జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1964లో 17వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1964, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు..
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌  31(A)ని సవరించి ప్రజాశ్రేయస్సు కోసం రైతుల నుంచి వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నిర్దేశించారు.


24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
* గోలక్‌నాథ్‌ vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో (1967) సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని పేర్కొంది. ఈ తీర్పును అధిగమించేందుకు 1971లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1971, నవంబరు 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 13, 368లను సవరించారు. ఆర్టికల్‌ 13కి క్లాజు (4)ని చేర్చారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంట్‌కు కల్పించారు. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్దేశించారు.


25వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 25వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1972, ఏప్రిల్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని సవరించి ఈ చట్టాన్ని రాజ్యాంగానికి చేర్చారు.
* ప్రజాప్రయోజనాల రీత్యా ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నపుడు  తగినంత ‘నష్ట పరిహారం’ ఇవ్వలేదనే కారణంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు.
* ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంట్‌ రూపొందించే శాసనాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు.
* ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు ‘నష్టపరిహారం’ నిర్ణయంపై చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు కల్పించారు. అయితే వాటిని రాష్ట్రపతి ఆమోదించాలి.
* అల్పసంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని నిర్దేశించారు.


42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని ‘మినీ రాజ్యాంగం’గా పేర్కొంటారు. ఇందులోని అనేక అంశాలు 1977, జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనిలోని ముఖ్యాంశాలు...
* ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆర్టికల్స్‌ 31, 31(C) లను సవరించారు.
* ఆర్టికల్స్‌ 31(D), 32(A)లను ప్రాథమిక హక్కులకు చేర్చారు.
* ఆదేశిక సూత్రాలను అమలుచేస్తున్న సందర్భంలో అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆదేశిక సూత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని నిర్దేశించారు. దీని ద్వారా ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలకు ఆధిపత్యాన్ని కల్పించారు. న్యాయస్థానాలకు ఉన్న ‘న్యాయసమీక్ష’ అధికారాన్ని తొలగించారు.


43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977
* 1977లో అప్పటి మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 43వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1978, ఏప్రిల్‌ 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్‌ 31(D), 32(A) లను రాజ్యాంగం నుంచి తొలగించారు.
* న్యాయస్థానాలకు ‘న్యాయసమీక్ష’ అధికారాన్ని పునరుద్ధరించారు.


44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978
* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇందులోని అనేక అంశాలు 1979, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు...
* ఆర్టికల్,  19(1)(f) ను స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు నుంచి తొలగించారు.
* ఆస్తిహక్కును వివరించే ఆర్టికల్‌ 31ని తొలగించారు.
* ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి, దీన్ని ఆర్టికల్‌  300(A) లో సాధారణ చట్టబద్ధమైన హక్కుగా పేర్కొన్నారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22ను సవరించి, నివారక నిర్బంధానికి సంబంధించి కొన్ని రక్షణలు కల్పించారు. అవి:
1. సలహాసంఘం అనుమతి లేకుండా నివారక నిర్బంధంలో ఉంచిన వ్యక్తి అత్యధిక నిర్బంధ కాలాన్ని 3 నెలల నుంచి 2 నెలలకు తగ్గించారు. 
2. సలహాసంఘంలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తిని మాత్రమే అధ్యక్ష పదవిలో నియమించాలి. సభ్యులుగా పదవిలో ఉన్న లేదా పదవీవిరమణ చేసిన జడ్జిలు ఉండొచ్చు.
3. పార్లమెంట్‌ రూపొందించిన చట్టంలో పేర్కొన్న కాలం కంటే, ఏ వ్యక్తినీ ఎక్కువ రోజులు నిర్బంధించకూడదు. ఎవరైనా వ్యక్తిని 2 నెలలకు మించి నివారక నిర్బంధ చట్టం ప్రకారం అరెస్టు చేయాలనుకుంటే సలహాసంఘం అనుమతి తప్పనిసరి.


77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995
* పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1995లో 77వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1995, జూన్‌ 17 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 16ను సవరించి, ఆర్టికల్‌ 16(4)  ను రాజ్యాంగానికి చేర్చి ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు.


86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002
* 2002లో అప్పటి అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 2002 డిసెంబరు 12 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 21ని సవరించి, 21(A) చేర్చారు. దీని ద్వారా 6 - 14 సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలందరికీ ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు’ను నిర్దేశించారు.


93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2005లో 93వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 2006 జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ప్రకారం ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 15ని సవరించి, ఆర్టికల్‌ 15(5)ను కొత్తగా చేర్చారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) అన్ని విద్యాసంస్థల ప్రవేశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించారు.

 

97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2011లో 97వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 2012 జనవరి 12 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19ని సవరించి, ఆర్టికల్‌ 19(1)(C) లో “Co-operative societies”  అనే పదాన్ని చేర్చి, సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధతను కల్పించారు.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు

బిట్లు

1. మత స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?

జ: ఆర్టికల్స్‌ 25 - 28
 

2. ‘భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు’ అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 25

 

3. ఆర్టికల్‌ 26లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
1) భారతీయులు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కలిగి ఉన్నారు.
2) మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
3) ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై పన్నులు ఉండవు.
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

4. మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల నుంచి ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?
జ: ఆర్టికల్‌ 27

 

5. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో మత బోధనను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తోంది?
జ: ఆర్టికల్‌ 28

 

6. ఆర్టికల్‌ 25 ప్రకారం హిందువులు అంటే?
1) హిందువులు                    2) జైనులు, బౌద్ధులు
3) సిక్కులు                        4) అందరూ
జ: 4 (అందరూ)

 

7. ఎస్‌.పి. మిట్టల్‌ ‌VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సరికానిది?
జ: ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగం

 

8. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని రాజ్యాంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?
జ: ఆర్టికల్‌ 29

 

9. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ చెబుతోంది?
జ: ఆర్టికల్‌ 30

 

10. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాన్ని గుర్తించండి.
జ: మతపరమైన అల్పసంఖ్యాక వర్గం, సంస్కృతి పరమైన అల్పసంఖ్యాక వర్గం

 

11. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను గుర్తించేదుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: దేశం

 

12. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలను నిర్దారించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: రాష్ట్రం

 

13. ప్రారంభ రాజ్యాంగంలో ఆస్తిహక్కు గురించి ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 31

 

14. ఆస్తిహక్కుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
జ: దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.

 

15. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
జ: డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

 

16. కిందివాటిలో రిట్స్‌కు సంబంధించి సరికానిది?
1) రిట్‌ అంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం.
2) ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.
3) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది.
4) ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తాయి.
జ: 2 (ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.)

 

17. ఆర్టికల్‌ 33 ప్రకారం ప్రాథమిక హక్కులు ఎవరికి పూర్తిగా లభించవు?
1) సైనిక, పారామిలటరీ దళాలు                                      2) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు
3) పోలీసు, ఇతర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు            4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

18. ఆర్టికల్‌ 34 ప్రకారం విధించే ఏ శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు?
జ: సైనిక శాసనం

 

19. ‘మీరు నిర్బంధించిన వ్యక్తిని ప్రయాణ సమయం మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా నా ముందు హాజరు పరచు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం/రిట్‌ ఏది?
జ: హెబియస్‌ కార్పస్‌

 

20. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ ఎవరైనా అధికారాలు చెలాయిస్తుంటే వారిని నియంత్రించేందుకు న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: కోవారెంటో

 

21. దిగువ న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్‌?
జ: ప్రొహిబిషన్‌

 

22. కిందివాటిలో న్యాయస్థానాలు న్యాయస్థానాలపైన జారీ చేసే రిట్‌ ఏది?
1) సెర్షియోరరీ                               2) ప్రొహిబిషన్‌
3) సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌               4) మాండమస్‌
జ: 3 (సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌)

 

23. ప్రభుత్వోద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: మాండమస్‌

 

24. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరిపై జారీచేసే అవకాశం ఉంటుంది?
జ: ప్రభుత్వ వ్యక్తులు, ప్రైవేట్‌ వ్యక్తులు

 

25. హక్కులు, విధులు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి అని అభివర్ణించినవారు?
జ: హెచ్‌.జె. లాస్కి

 

26. న్యాయస్థానం ఒక పనిని చేయమని లేదా వద్దని ఇచ్చే ఆదేశాన్ని ఏమంటారు?
జ: ఇంజక్షన్‌

 

27. PIL అంటే?
జ: Public Interest Litigation

 

28. PIL అనే భావన (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించింది?
జ: అమెరికా

 

29. మన దేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే భావనకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి?
జ: జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి

 

30. న్యాయస్థానం కేసును స్వతహాగా అంటే తనకు తానే తీసుకుని విచారించడాన్ని ఏమంటారు?
జ: సుమోటో

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆదేశిక సూత్రాలు

మాదిరి ప్రశ్నలు

1. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది?

జ: గోలక్‌నాథ్ కేసు
 

2. రాజ్యాంగ మౌలిక స్వభావం గురించి సుప్రీం కోర్టు ఏ కేసులో ప్రస్తావించింది?
జ: కేశవానంద భారతి కేసు

 

3. '31 C' ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించారు?
జ: 25

 

4. స్త్రీలకు ప్రసూతి వైద్య సదుపాయాలు కల్పించాలని చెబుతోన్న అధికరణం ఏది?
జ: 42

 

5. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది?
జ: పంచాయతీరాజ్ వ్యవస్థ

 

6. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న 40వ అధికరణం దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు?
జ: గాంధేయవాద నియమం

 

7. నిరుద్యోగులు, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకోవడానికి ప్రయత్నించాలని ఏ అధికరణం చెబుతోంది?
జ: 41

 

8. కార్మికుల కనీస వేతన చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1948

 

9. కుటీర పరిశ్రమలు ఏ జాబితాకు చెందినవి?
జ: రాష్ట్ర జాబితా

 

10. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు వేసిన మహిళ?
జ: షయారా బానో

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిత నియమాలు

నమూనా ప్రశ్నలు

1. భారత రాజ్యాంగంలో ‘ఆదేశిక సూత్రాలను’ ఏ భాగంలో, ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్నారు?

1) ఖిజువ భాగం - ఆర్టికల్‌ 35 నుంచి 50
2) ఖిజువ భాగం - ఆర్టికల్‌ 36 నుంచి 51 
3) ఖిఖిఖివ భాగం - ఆర్టికల్‌ 14 నుంచి 35
4) జువ భాగం - ఆర్టికల్‌ 36 నుంచి 52


2. ‘రాజ్యం మనిషికి ఉత్తమ జీవనాన్ని ప్రసాదించడానికి ఏర్పడింది, అందుకే అది కొనసాగుతుంది’ అని వ్యాఖ్యానించింది?

1) రూస్కో పౌండ్‌     2) జెర్మీ బెంథామ్    ‌  3) అబ్రహం లింకన్‌     4) అరిస్టాటిల్‌


3. 1935 నాటి భారత ప్రభుత్వ చట్టంలో ఆదేశిక సూత్రాలను ఎలా పేర్కొన్నారు?

1) Instruments Of Indicaters
2) Instruments Of Social Policy
3) Instruments Of Instructions
4) Directive Principles Of Social Policy


4. కింది వాటిలో ఆదేశిక సూత్రాల లక్షణాన్ని గుర్తించండి.

1) వీటికి న్యాయస్థానాల సంరక్షణ లేదు.
2) ఇవి రాజ్యాంగ ప్రవేశికలోని ఆశయాలకు ఆచరణ రూపాన్నిస్తాయి.
3) ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడతాయి.
4) పైవన్నీ


5. ‘శ్రేయో రాజ్యస్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశిక సూత్రాలు కరదీపికలుగా పనిచేస్తాయని’ అన్నది ఎవరు?

1) ఎం.సి.సెతల్‌వాడ్‌       2) కె.టి.షా     3) నసీరుద్దిన్‌ మహ్మద్‌      4)  ఎస్‌.కె.మిశ్రా


6. పేదలకు, వెనకబడిన వర్గాల వారికి ‘ఉచిత న్యాయ సహాయం’ అందించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

1) ఆర్టికల్‌ 38(A)    2) ఆర్టికల్‌ 41(A)      3) ఆర్టికల్‌ 39(A)       4) ఆర్టికల్‌ 43(B)


7. మాతా శిశుసంక్షేమం, స్త్రీలకు మెరుగైన ప్రసూతి సౌకర్యాల కల్పనను ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

1) ఆర్టికల్‌ 41      2) ఆర్టికల్‌ 42       3) ఆర్టికల్‌ 43       4) ఆర్టికల్‌ 46


8. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 41(A       2( ఆర్టికల్‌ 42(A)       3) ఆర్టికల్‌ 43(A)       4) ఆర్టికల్‌ 44(A)


9. ఆదేశిక సూత్రాలను వాటి స్వభావం ఆధారంగా సామ్యవాద, గాంధేయ, ఉదారవాద నియమాలుగా వర్గీకరించినవారు?

1) కె.టి.షా    2)  ఎం.పి.శర్మ     3) ప్రొఫెసర్‌ ఆనంద్‌శర్మ      4) ప్రొఫెసర్‌ నసీరుద్దిన్‌ మహ్మద్‌


10. భారతదేశంలో ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు ఆదేశిక సూత్రాలు తోడ్పడతాయని ఎవరు వ్యాఖ్యానించారు?

1) అనంతశయనం అయ్యంగార్‌ 
2) గోపాలకృష్ణ గోఖలే
3) డా.బాబూ రాజేంద్రప్రసాద్‌ 
4) డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌


11. వ్యవసాయం, పాడి పరిశ్రమలను శాస్త్రీయ పద్దతిలో నిర్వహించడం ద్వారా గణనీయమైన ఉత్పత్తిని సాధించాలని, ‘గోవధ’ను నిషేధించాలని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 46       2) ఆర్టికల్‌ 47      3) ఆర్టికల్‌ 48       4) ఆర్టికల్‌ 49


12. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి, స్థానిక స్వపరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

1) ఆర్టికల్‌ 39       2) ఆర్టికల్‌ 40      3) ఆర్టికల్‌ 41       4) ఆర్టికల్‌ 42


సమాధానాలు: 1-2;  2-4;  3-3;  4-4;  5-1;   6-3;  7-2;  8-3;   9-2;  10-4; 11-3;  12-2.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆదేశిక సూత్రాలు

         సాధారణంగా ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య విభేదం ఏర్పడితే ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని 37వ అధికరణం పేర్కొంటోంది. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదని కూడా ఈ అధికరణం ద్వారా స్పష్టం అవుతుంది. చంపకం దొరైరాజన్ కేసులో, కేరళ విద్యా బిల్లు కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని ధ్రువపరిచింది.
     కాలానుగుణంగా ప్రభుత్వ పరిధి పెరగడంతో 1970వ దశకంలో ప్రజా సంక్షేమ చట్టాల అమలుకు కొన్ని ప్రాథమిక హక్కులు ఆటంకంగా మారాయి. దీంతో పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు చేసింది. దీనికి న్యాయవ్యవస్థ విముఖత చూపింది.
* 1970 నుంచి ఆదేశిక సూత్రాల స్వభావాన్ని, దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఇటు కార్యనిర్వాహక వర్గం, అటు న్యాయవ్యవస్థల దృక్పథాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు ఆదేశిక సూత్రాల అమలు విషయమై ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది.
* 1970వ దశకంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సామ్యవాద విధానాల అమలు పట్ల మొగ్గు చూపించింది. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు అప్పటి సామ్యవాద USSR ఇచ్చిన మద్దతు వల్ల, కాంగ్రెస్‌లో వచ్చిన అంతర్గత చీలిక వల్ల ఇందిరాగాంధీ సామ్యవాదం వైపు మొగ్గు చూపినట్లు అర్థమవుతుంది. 1971లో చేసిన 25వ రాజ్యాంగ సవరణ ద్వారా 31 (c) అనే అధికరణాన్ని జోడించారు. 
* ఈ అధికరణం ఆదేశిక సూత్రాల్లోని 39 (b) (సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న సహజ వనరులపై రాజ్యానికి యాజమాన్య నియంత్రణ ఉండాలి. సమాజంలో అందరికీ వాటిని సమానంగా పంపిణీ చేయాలి), 39(c) (ఉత్పత్తి పరికరాలు, సంపద కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఆర్థిక విధాన రూపకల్పన) అమలుకు ప్రాథమిక హక్కుల్లోని 14, 19, 31వ అధికరణాలు అడ్డు తగిలితే వాటిని న్యాయసమీక్ష నుంచి మినహాయించాలని పేర్కొంటోంది.
* అయితే ఇది అంతకు ముందు గోలక్ నాథ్ కేసులో (1967) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అతిక్రమిస్తూ చేసిన రాజ్యాంగ సవరణగా మనకు కనిపిస్తుంది. గోలక్‌నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి 25వ రాజ్యాంగ సవరణ ద్వారా కార్యనిర్వాహక వర్గానికి, న్యాయస్థానానికి మధ్య ఒక రకమైన సంకట పరిస్థితి నెలకొంది. అయితే సుప్రీం కోర్టు కేశవానంద భారతి కేసు (1973)లో తీర్పు సందర్భంగా - రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందని అయితే రాజ్యాంగానికి 'ఒక మౌలిక స్వభావం' ఉందని, దాన్ని దెబ్బతీసే ఎలాంటి రాజ్యాంగ సవరణ చెల్లదని పేర్కొంది. పైన పేర్కొన్న మౌలిక స్వభావంలో న్యాయ సమీక్ష కూడా ఒక లక్షణమని కోర్టు స్పష్టం చేసింది. క్లుప్తంగా చెప్పాలంటే కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఉద్దేశం - 25వ రాజ్యాంగ సవరణ (39 (b), (c) లలోని సామ్యవాద ఆదర్శాలను చట్టం ద్వారా అమలు చేయడానికి ప్రాథమిక హక్కుల్లోని 14, 19, 31 అధికరణాలు అడ్డుపడినా ప్రభుత్వం అమలు చేసుకోవచ్చు)  హేతుబద్ధమైందే, కానీ పై విషయంలో కోర్టులకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. 
* కేశవానంద భారతి కేసులో పేర్కొన్న అంశాలను పక్కనబెట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ సవరణ ప్రకారం కేవలం 39(b), (c) కాకుండా ఏ ఆదేశిక సూత్రాల అమలు కోసమైనా చట్టాలు చేసినప్పుడు అవి ప్రాథమిక హక్కుల్లోని 14, 19 అధికరణాలకు విరుద్ధంగా ఉన్నా అవి ఆమోదయోగ్యమైనవే. అయితే మినర్వా మిల్స్ కేసులో సుప్రీం కోర్టు 42వ రాజ్యాంగ సవరణలో ఆదేశిక సూత్రాలకు ఇచ్చిన ఆధిపత్యాన్ని కొట్టివేసింది.
* ఫలితంగా 39 b, c అధికరణాల అమలు కోసం (ఒకవేళ అవి ప్రాథమిక హక్కుల్లోని 14, 19 అధికరణాలతో సంఘర్షించినా) చట్టాలను రూపొందించుకోవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే వీటిపై న్యాయస్థానాలకు న్యాయసమీక్షాధికారం ఉంటుంది.
* 1980వ దశకంలో, ఆ తర్వాత ఆదేశిక సూత్రాల స్వభావం పట్ల న్యాయస్థానాల దృక్పథంలో గణనీయమైన మార్పు కనిపిస్తూ వస్తోంది. న్యాయస్థానాలు ఇప్పుడు వ్యక్తి హక్కులకు (ప్రాథమిక హక్కులు) ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో సామాజిక హక్కులకు (ఆదేశిక సూత్రాలు) కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తున్నాయి. ఆదేశిక సూత్రాలను అమలు చేయమని న్యాయస్థానాలు, ప్రభుత్వాలకు పదేపదే చెబుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి పౌరస్మృతి (44వ అధికరణం), మద్యపాన నిషేధం (47వ అధికరణం) అమలు చేయమని న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి.
* 39వ అధికరణానికి అదనంగా 'A' భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. దీని ప్రకారం న్యాయవ్యవస్థ పేదవర్గాల ప్రయోజనాలను కాపాడి, సామాజిక న్యాయాన్ని సమకూర్చేలా వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. 

40వ అధికరణం 
ఈ అధికరణం ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్థలను నెలకొల్పి స్వపరిపాలనా విధానంలో గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలి. ఇది మహాత్మాగాంధీ ఆశయం. ప్రతి గ్రామం ఒక చిన్న గణతంత్రంగా (Little Republic) ఎదగాలని ఆయన భావించేవారు. స్వరాజ్యం గ్రామ స్వరాజ్యంగా మారితేనే దేశం బాగుంటుందనేది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన అభీష్టాన్ని ఆదేశిక సూత్రాల్లో జోడించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత కల్పించారు. తద్వారా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పి, గ్రామ పంచాయతీలకు, మండలాలకు, జిల్లా యంత్రాంగానికి అనేక విధులను కేటాయించారు.


41వ అధికరణం
నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం, అంగవైకల్యం లాంటి అశక్తతతో బాధపడేవారికి తగిన ఉద్యోగ, విద్యా సదుపాయాలను కల్పించేందుకు తమ ఆర్థిక పరిస్థితికి లోబడి ప్రభుత్వాలు కృషి చేయాలి.
* ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మంజూరు చేస్తున్న పింఛన్లు, విద్యార్థులకు అందిస్తున్న ఉపకారవేతనాలు ఈ కోవకే చెందుతాయి. 

42వ అధికరణం 
రాజ్యం కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులను కల్పించడం (Human conditions of work), స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించడం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం అనేక చట్టాలను చేపట్టాయి.
* గర్భిణులకు ఉచిత వైద్యపరీక్షలు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు ఈ కోవకు చెందినవే.
* 1961లో ప్రసూతి రక్షణ చట్టాన్ని రూపొందించారు.

43వ అధికరణం
వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు హేతుబద్ధమైన, గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వేతనాలు చెల్లింపునకు సంబంధించి అవసరమైన శాసనాలను రూపొందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. వారికి తగినంత విరామ సమయం, సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించాలి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘ ప్రాతిపదికపై లేదా వ్యక్తి ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల సంఖ్యను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.
* కార్మికుల కోసం కనీస వేతన చట్టాన్ని (1948) రూపొందించారు.
* గ్రామీణ అభివృద్ధి కోసం సమాజ వికాస పథకాన్ని (1952) ప్రవేశపెట్టారు. 
* కుటీర పరిశ్రమలు రాష్ట్ర జాబితాకు చెందినప్పటికీ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, చేనేత మగ్గాల బోర్డు, కాయిర్ బోర్డును ఏర్పాటు చేశారు.
* 42వ రాజ్యాంగ సవరణ ద్వారా '43 (A)' ను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం పరిశ్రమల నిర్వహణలో కార్మికులను భాగస్వాములను చేసే చట్టాలను రూపొందించాలి.

44వ అధికరణం
* భారతదేశంలో పౌరులందరికీ ఒకే విధమైన ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.
* ఆదేశిక సూత్రాల్లో అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన అంశమిది.
* వివాహం, విడాకులు, ఆస్తి పంపకాల విషయంలో న్యాయస్థానాలు ప్రస్తుతం మన చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి.
* ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తే మన చట్టాల (Personal Law) స్థానంలో దేశంలో అందరికీ ఒకే చట్టం అమల్లోకి వస్తుంది.
* మైనారిటీ (ముస్లిం, క్రిస్టియన్) మత పెద్దలు ఇందుకు సుముఖంగా లేరు.
* రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశాల్లో (Constituent Assembly debates) డా.బి.ఆర్.అంబేడ్కర్ ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా తమ వాదనలను వినిపించారు. తర్వాతి కాలంలో దేశ న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లును రూపొందించారు. లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించినా రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆమోదం తెలపకపోవడంతో అంబేడ్కర్ తన పదవికి రాజీనామా చేశారు. 
* ఎస్.ఆర్.బొమ్మై కేసులో (1994) సుప్రీం కోర్టు ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.
* అంతకుముందు 1985లో షాబానో కేసులో సి.ఆర్.పి.సి. ప్రకారం విడాకులు పొందిన తన భర్త నుంచి భరణం (ధరావత్తు) పొందాలన్న షాబానో వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. అయితే ఈ తీర్పును నీరుగారుస్తూ అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పార్లమెంట్‌లో Muslim Women (Protection of Rights on Divorce) 1986 చట్టాన్ని తీసుకొచ్చింది.
బీ శారదా ముద్గల్ కేసులో పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది.
* ప్రస్తుత పరిస్థితి: మూడు సార్లు 'తలాక్' చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ షయారా బానో పెట్టుకున్న అభ్యర్థన సుప్రీంకోర్టు ముందు పరిశీలనలో ఉంది.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథ‌మిక విధులు

ప్రాథమిక విధులు రాజ్యం, సమాజం, ఇతర వ్యక్తుల పట్ల వ్యక్తికి ఉండే బాధ్యతలను తెలియజేస్తాయి. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-A నిబంధనలో వీటిని చేర్చారు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల ఆధారంగా 42 వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను చేర్చారు. 86 వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 ద్వారా మరో ప్రాథమిక విధిని చేర్చడంతో, వీటి సంఖ్య 11 కు చేరింది. జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ (1998) సిఫారసుల మేరకు 'జనవరి 3 ను ప్రాథమిక విధుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
* 51-(A) (a): రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి. రాజ్యాంగ సంస్థలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించాలి.
(b): స్వాతంత్య్రోద్యమాన్ని ఉత్తేజపరచిన ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి, అనుసరించాలి.
(c): దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యత, సమగ్రతలను గౌరవించాలి, కాపాడాలి.
(d): దేశ రక్షణకు, జాతీయ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
(e): భారత ప్రజల మధ్య సోదరభావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలి. మతం, భాష, ప్రాంతీయ, వర్గ విభేదాలకు అతీతంగా ఉండాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను విడనాడాలి.
(f): మన వారసత్వ సమష్టి సంస్కృతి (భిన్నత్వంలో ఏకత్వం) గొప్పతనాన్ని గౌరవించాలి, కాపాడాలి.
(g): అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులను కాపాడాలి, ఇతర జీవుల పట్ల దయ ఉండాలి.
(h): శాస్త్రీయ, మానవతా దృక్పథం, పరిశీలనా దృక్పథం, సంస్కరణ దృక్పథల పట్ల సానుకూలతను పెంపొందించుకోవాలి.
(i): ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి, హింసను విడనాడాలి.
(j): అన్ని రంగాలలో వ్యక్తిగత, సమష్టి కార్యకలాపాల ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి.
(k): 6 - 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల విద్యార్జనకు తగిన అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సంరక్షకులకు ఉంటుంది.
* అయితే ప్రాథమిక విధులు న్యాయ అర్హమైనవి కావు. అందువల్ల వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
* క్లుప్తంగా చెప్పాలంటే... ఆదేశ సూత్రాలు ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు, ప్రాథమిక విధులు ప్రజలకు నిర్దేశించిన బాధ్యతలు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆదేశిక సూత్రాలు అమ‌లు తీరు   

మాదిరి ప్రశ్నలు
1. భారతీయ పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?
1) ఆర్టికల్‌ 43        2) ఆర్టికల్‌ 44 
3) ఆర్టికల్‌ 45        4) ఆర్టికల్‌ 46

2. మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం?
1) గోవా                  2) కేరళ 
3) హిమాచల్‌ప్రదేశ్‌    4) మణిపూర్‌

3. 1985లో ఏ కేసు సందర్భంగా ముస్లిం మహిళకు విడాకుల అనంతరం భర్త మనోవర్తిని చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?
1) సరళా ముద్గల్‌        2) మహర్షి అవధేష్‌ 
3) షాబానో                 4) షకీలా భాను

4. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేసి, న్యాయ వ్యవస్థకు స్వయంప్రతిపత్తి కల్పించాలని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?
1) ఆర్టికల్‌ 45        2) ఆర్టికల్‌ 48 
3) ఆర్టికల్‌ 49        4) ఆర్టికల్‌ 50

5. హిందీని జాతీయ భాషగా అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాజ్యాంగంలోని శ్రీజుఖిఖివ భాగంలో ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?
1) ఆర్టికల్‌ 350        2) ఆర్టికల్‌ 351 
3) ఆర్టికల్‌ 349        4) ఆర్టికల్‌ 350(A)

6. ఆదేశిక సూత్రాల అమలుకు భారత ప్రభుత్వం రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది?
1) 1956 - ఎల్‌ఐసీ జాతీయీకరణ  
2) 1957 - సంపదపై పన్ను చట్టం 
3) 1958 - బహుమతిపై పన్ను చట్టం 
4) 1963 - ఆదాయ పన్ను చట్టం

7. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని ఎప్పుడు నెలకొల్పారు?

1) 1985  2) 1986  3) 1987  4) 1989

8. ‘‘ప్రజల ఓటుపై ఆధారపడే ఏ ప్రభుత్వమైనా తన విధాన రూపకల్పనలో ఆదేశిక సూత్రాలను విస్మరించలేదు. ఒకవేళ ఏ ప్రభుత్వమైనా వాటిని విస్మరిస్తే ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు తప్పనిసరిగా సమాధానం చెప్సాలి ఉంటుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) కె.టి.షా           2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
3) కె.ఎం.మున్షీ     4) జవహర్‌లాల్‌ నెహ్రూ

9. ఏ సంవత్సరంలో నేర విచారణ స్మృతి చట్టాల్లో మార్పులు చేసి, జిల్లా కలెక్టర్‌ న్యాయాధికారాలను న్యాయశాఖకు బదిలీ చేయడం ద్వారా కార్యనిర్వాహకశాఖ నుంచి న్యాయశాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించారు?
1) 1973    2) 1976   3) 1978   4) 1981

10. 1954లో ఏ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గోవధ నిషేధ చట్టాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది?
1) యూపీ  2) మహారాష్ట్ర   3) బిహార్‌   4) కేరళ


సమాధానాలు  
 1-2  2-1  3-3  4-4  5-2  6-4  7-3  8-2  9-1  10-3

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆదేశిక సూత్రాల అమలు తీరు

ఉదారవాద నియమాలు (liberal principles) :
ఆధునిక భారతదేశ నిర్మాణానికి ప్రవేశపెట్టాల్సిన నూతన విధానాలు, సంస్కరణలను ఉదారవాద నియమాల్లో భాగంగా ఆర్టికల్స్‌ 44, 45, 50, 51లో పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 44: భారతదేశంలో నివసించే పౌరులందరికీ  (హిందూ, ముస్లిం, క్రైస్తవ మొదలైనవారు) ఒకే రకమైన ఉమ్మడి పౌరస్మృతిని (Common Civil Code) ఏర్పాటు చేయాలి. మన దేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం గోవా.

సరళా ముద్గల్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు(1995)
పౌరులకు ఒకే విధమైన ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు తీసుకున్న చర్యల గురించి  అఫిడవిట్‌ను సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టికల్‌ 44 ప్రకారం వివాహాలు, వారసత్వ విధానం లౌకిక స్వభావాన్ని కలిగి ఉన్నాయని, అందువల్ల వాటిని చట్టం ద్వారా క్రమబద్ధీకరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసుపై అప్పీల్‌ విచారణ జరిపిన సుప్రీంకోర్ట్‌ కేంద్ర ప్రభుత్వానికి తాము ఇచ్చిన ఆదేశం కేవలం సలహా పూర్వకమైందని(Obiter dicta) పేర్కొంది.

షాబానో కేసు: 1985
ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ముస్లిం మహిళకు విడాకుల అనంతరం భర్త మనోవర్తి చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పును అధిగమించేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ముస్లిం మహిళల వివాహం, విడాకుల చట్టాన్ని రూపొందించింది.

మహర్షి అవధేష్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: (1994)
ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ‘మాండమస్‌ రిట్‌’ను జారీ చేయడం సాధ్యంకాదని పేర్కొంది.

ఆర్టికల్‌ 45: 14 ఏళ్లలోపు బాలబాలికలందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యను ఆర్టికల్‌ 21(A)లో ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు’గా మార్చారు. ప్రస్తుతం ఆర్టికల్‌ 45లో 6 సంవత్సరాల లోపున్న బాలబాలికలు పూర్వ ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ పొందే వెసులుబాటు కల్పించారు.

ఆర్టికల్‌ 50: కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేసి, న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి.

ఆర్టికల్‌ 51: అంతర్జాతీయ శాంతి సంరక్షణకు భారతదేశం కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించాలి. ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలి. ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ న్యాయసూత్రాలు, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలి. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ప్రతి భారతీయుడు ప్రపంచ శాంతికి కృషి చేయాలి.

రాజ్యాంగంలోని IVవ భాగం కాకుండా - ఇతర భాగాల్లోని ఆదేశిక సూత్రాలు
XVIవ భాగం - ఆర్టికల్‌ 335: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.
XVIవ భాగం ఆర్టికల్‌ 339: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఆదేశాలను రాష్ట్రాలు  తప్పనిసరిగా పాటించాలి.
XVIIవ భాగం - ఆర్టికల్‌ 350(A): మాతృభాషలో విద్యాబోధనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయవచ్చు.
XVIIవ భాగం - ఆర్టికల్‌ 350(B): భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల హక్కుల పరిరక్షణకు రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు.
XVIIవ భాగం - ఆర్టికల్‌ 351: హిందీని జాతీయ భాషగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
1973లో కేశవానంద భారతి జు( స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించిన 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సమర్థించడం ద్వారా ఆదేశిక సూత్రాల ప్రాధాన్యాన్ని గుర్తించింది.

* మినర్వామిల్స్ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1980
ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేస్తూ కింది అంశాలను వివరించింది.
* ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పరం విరుద్ధమైనవి కావు.
* ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు భారత ప్రజాస్వామ్యానికి రథ చక్రాల్లాంటివి.
* ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సంఘర్షణ మొదలైతే ప్రాథమిక హక్కులే ఆధిక్యాన్ని కలిగిఉంటాయి.
* ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు అనుబంధంగా ఉంటాయి.
* ఆదేశిక సూత్రాల విషయంలో ఆర్టికల్‌ 39(b), ఆర్టికల్‌ 39(c)ల అమలు కోసం చేసే చట్టాలకు మాత్రమే న్యాయసంరక్షణ ఉంటుంది.

ఆదేశిక సూత్రాల అమలు - ఆటంకాలు
* మన దేశంలో వీటిని అమలు చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు లేవు.
* దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత.
* బ్రిటిష్‌ వలస పాలనలో దేశ సహజ వనరుల నిర్వీర్యం. 
* తగిన రాజకీయ సంకల్పం లేకపోవడం, న్యాయవ్యవస్థ క్రియాశీలత.

ప్రముఖుల వ్యాఖ్యానాలు
నీ ఆదేశిక సూత్రాలను చిత్తశుద్ధితో అమలు చేస్తే అనతి కాలంలోనే భారతదేశం ‘భూతల స్వర్గంగా’ అవతరిస్తుంది - ఎం.సి. చాగ్లా
నీ  రాజ్యాంగంలోని IVవ భాగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలను ప్రజలకు బాధ్యత వహించే ఏ ప్రభుత్వం కూడా తేలికగా తీసుకోలేదు - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ 
నీ ‘ప్రజల ఓటుపై ఆధారపడే ఏ ప్రభుత్వమైనా తన విధాన రూపకల్పనలో ఆదేశిక సూత్రాలను విస్మరించలేదు. ఒకవేళ ఏ ప్రభుత్వమైనా వాటిని విస్మరిస్తే ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు తప్పనిసరిగా సమాధానం చెపాల్సి ఉంటుంది’. - డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌  
నీ ఆదేశిక సూత్రాలు పవిత్ర ఆశయాలు - ఐవర్‌ జెన్నింగ్స్‌

ప్రభుత్వాల కృషి
* 1950లో జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, 1951 నుంచి పంచవర్ష ప్రణాళికల అమలు ద్వారా దేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, సంక్షేమ ఫలాలను పేదలకు అందేలా కృషి చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015, జనవరి 1 నుంచి ‘జాతీయ ప్రణాళికా సంఘం’ పేరును ‘నీతి ఆయోగ్‌’గా అమల్లోకి తీసుకొచ్చింది.
* సంపద కేంద్రీకరణను నివారించేందుకు 1969లో ‘ఏకస్వామ్య నిరోధక చట్టం’ రూపొందించారు. 1956లో ఎల్‌ఐసీని జాతీయం చేశారు. 1969లో 14, 1980లో 6 ప్రయివేట్‌ వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. 
* 1970లో మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఇచ్చే రాజభరణాలను రద్దు చేశారు. 1957లో సంపదపై పన్ను చట్టం; 1958లో బహుమతిపై పన్ను చట్టం; 1958లో జాతీయ పురాతన కట్టడాల, శిల్పసంపద పరిరక్షణ చట్టం; 1961లో ఆదాయపు పన్ను చట్టం; ప్రసూతి సెలవుల చట్టం; 1976లో స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం లాంటి చట్టాలను రూపొందించారు.
* 1982లో మహిళా సాధికారత సాధనకు DWACRA(development women and children in rural area) పథకాన్ని ప్రారంభించారు.
* 986లో శాస్త్రీయ విద్యను అందించేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రారంభించారు. 
* 1987లో సార్వత్రిక ప్రాథమిక విద్య సాధనకు నల్లబల్ల పథకం OBB - oparation black board, 1988లో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు జాతీయ అక్షరాస్యత మిషన్‌(National litaracy mission)ను, 1989లో గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధికి జవహార్‌ రోజ్‌గార్‌ యోజన(JRY) పథకాన్ని ప్రారంభించారు.
* 1987లో పేద ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని నెలకొల్పారు.
* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు; 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా కల్పించారు.
* 1995లో వృద్ధాప్య పింఛన్‌ చట్టాన్ని రూపొందించారు. పేదవర్గాల వారికి ఉపాధిని కల్పించే లక్ష్యంతో 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2001లో సార్వత్రిక ప్రాథమిక విద్య సాధనకు ‘సర్వశిక్షా అభియాన్(SSA), 2009లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని రూపొందించారు.
* 1954లో ఆంధ్రరాష్ట్రంలో, 1994లో ఆంధ్రప్రదేశ్‌లో మద్యాన్ని నిషేధించారు. 1954లో గోవధను నిషేధిస్తూ బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని మహ్మద్‌ హనీఫ్‌ ఖురేషి VS స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది. 
* 1973లో నేర విచారణ స్మృతి (Criminal procedure Code) చట్టాల్లో మార్పులు చేసి జిల్లా కలెక్టర్‌కు ఉన్న న్యాయాధికారాలను పూర్తిగా న్యాయశాఖకు బదిలీ చేయడం ద్వారా కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు - ల‌క్ష‌ణాలు  

నమూనా ప్రశ్నలు
1. కింద పేర్కొన్న ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కేవలం భారతీయ పౌరులకు మాత్రమే లభిస్తాయి?
    1) ఆర్టికల్స్‌ 15, 16   2) ఆర్టికల్స్‌ 19, 29, 30       3) ఆర్టికల్స్‌ 14, 20    4) 1, 2

2. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానిది?
    1) ప్రాథమిక హక్కులకు న్యాయస్థానాల సంరక్షణ ఉంటుంది.
    2) ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి, అంటే అపరిమితమైనవి.
    3) జాతీయ అత్యవసరస్థితి కాలంలో వీటిని తాత్కాలికంగా నిలిపివేయచ్చు.
    4) జాతీయ అత్యవసరస్థితి కాలంలో వీటిని పూర్తిగా రద్దు చేయలేం.

3. ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు భారత పౌరులతో పాటు భారత భూభాగంలో నివసిస్తున్న విదేశీయులకు సైతం లభిస్తాయి?
    1) ఆర్టికల్స్‌ 14, 20, 21
    2) ఆర్టికల్స్‌ 22, 23, 24, 25 
    3) ఆర్టికల్స్‌ 26, 27, 28           4) పైవన్నీ

4. ప్రాథమిక హక్కులు, సాధారణ హక్కులకు మధ్య వ్యత్యాసాలకు సంబంధించి సరికానిది?
    1) ప్రాథమిక హక్కులను పౌరులు వదులుకునే వీల్లేదు. సాధారణ హక్కులను వదులుకోవచ్చు.
    2) ప్రభుత్వ అధికారంపై ప్రాథమిక హక్కులు పరిమితులు విధిస్తాయి. సాధారణ హక్కులు ప్రభుత్వ అధికారానికి లోబడి ఉంటాయి.
    3) ప్రాథమిక హక్కులను రాజ్యాంగ ప్రవేశికలో, సాధారణ హక్కులను రాజ్యాంగ షెడ్యూల్స్‌లో వివరించారు.
    4) ప్రాథమిక హక్కులను రద్దుచేసే వీల్లేదు. సాధారణ హక్కులు రద్దు చేయవచ్చు.

5. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య వ్యత్యాసాలకు సంబంధించి సరైంది?
    1) ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని మూడో భాగంలో, ఆదేశిక సూత్రాలను నాలుగో భాగంలో వివరించారు.
    2) ప్రాథమిక హక్కులను సోవియట్‌ రష్యా నుంచి, ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్‌ నుంచి గ్రహించారు. 
    3) ప్రాథమిక హక్కులను ఆర్టికల్స్‌ 12 నుంచి 35 మధ్య, ఆదేశిక సూత్రాలను ఆర్టికల్స్‌ 36 నుంచి 51 మధ్య పేర్కొన్నారు.
    4) 1, 3

6. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానిది?
    1) వ్యక్తి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను సాధించేందుకు తోడ్పడతాయి.
    2) వీటితో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు. 
    3) వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు. 
    4) ఇవి సర్వకాల, సర్వ వ్యవస్థల్లో అందుబాటులో ఉంటాయి.

7. ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైంది? 
    1) సమాజ సమష్టి ప్రయోజనాలను సాధించేందుకు ఉద్దేశించినవి.
    2) ఇవి ప్రభుత్వాల ఆర్థికస్తోమతను అనుసరించి అందుబాటులో ఉంటాయి.
    3) ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తెలుపుతాయి. 
    4) పైవన్నీ

8. ‘ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలు స్వారీ చేయలేవు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
    1) శంకరీ ప్రసాద్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా  
    2) చంపకం దొరైరాజన్ vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ 
    3) ఎస్‌ఆర్‌ బొమ్మై vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా 
    4) ఇందిరా సహాని  vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా

సమాధానాలు :  1-4,  2-2,  3-4,  4-3,  5-4, 6-3,  7-4,  8-2

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు - ల‌క్ష‌ణాలు

సంప్రదాయమైవి, ఆధునికమైనవి: స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు, మతస్వాతంత్య్రపు హక్కు లాంటి సంప్రదాయ హక్కులతో పాటు ఆధునిక హక్కులైన సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, విద్యా, సాంస్కృతిక హక్కులు సైతం ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగాలుగా కొనసాగుతున్నాయి.

సార్వత్రికం కావు:  ఆర్టికల్స్‌ 15, 16, 19, 29, 30లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. భారత్‌లో నివసించే విదేశీయులకు వర్తించవు.
* ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు సాయుధ దళాల సిబ్బందికి లభించదు. 
* ఆర్టికల్స్‌ 14, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు భారత ప్రజలతోపాటు భారత భూభాగంలో ఉన్న విదేశీయులకు కూడా వర్తిస్తాయి.

న్యాయ సంరక్షణ:  పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కుల రక్షణ, అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు రిట్లు జారీచేస్తాయి.

నిరపేక్షమైనవి కావు: ప్రాథమిక హక్కులు అపరిమితమైనవికావు. దేశ సమగ్రత, సుస్థిరత దృష్ట్యా ప్రభుత్వం వీటిపై చట్టబద్ధమైన పరిమితులు విధించవచ్చు.

ప్రభుత్వ అధికారంపై పరిమితులు: ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించకూడదు. వీటికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి శాసనాలు రూపొందించడానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు రూపొందించే చట్టాల కన్నా ప్రాథమిక హక్కులు ఉన్నతమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయకూడదో ప్రాథమిక హక్కులు పేర్కొంటాయి.

రద్దుకు అవకాశం లేనివి, కానీ సస్పెండ్‌ చేయొచ్చు: భారత రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్స్‌ 20, 21లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహాయించి మిగిలిన వాటిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేయొచ్చు. కానీ పూర్తిగా రద్దుచేసే వీల్లేదు.

అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల సంరక్షణ: దేశంలోని మెజారిటీ వర్గాల ఆధిపత్యం నుంచి అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడటం, జాతి సమగ్రతను సంరక్షించడం, వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంలో ప్రాథమిక హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి. 
ఉదా: విద్యా, సాంస్కృతిక హక్కు ద్వారా అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు రక్షణ కల్పించడం.

పౌరుల సమగ్రాభివృద్ధి సాధనాలు: పౌరులు గౌరవప్రదంగా జీవించడానికి, వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధి, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు హామీఇవ్వడం ద్వారా ప్రాథమిక హక్కులు పౌరుల సమగ్రాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.


వివరణ
*  1951లో చంపకం దొరైరాజన్‌ vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కుల మీద ఆదేశిక సూత్రాలు స్వారీ చేయలేవు అని పేర్కొంది.
* 1973 లో కేశవానంద భారతి vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఇస్తూ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర పోషకాలని ప్రకటించింది.
* 1980 లో మినర్వామిల్స్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నించింది.
* 1976 లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించింది.

ప్రాథమిక హక్కులు, సాధారణ హక్కులకు మధ్య భేదాలు

ప్రాథమిక హక్కులు
* ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటికి రాజ్యాంగం నుంచి హామీ లభిస్తుంది. ఇవి ప్రభుత్వ అధికారంపై పరిమితులు విధిస్తాయి.
* దేశ పౌరులు వీటిని వదులుకునే వీలులేదు.
* ప్రాథమిక హక్కుల సంరక్షణ, అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టును, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులను ఆశ్రయించవచ్చు.
* రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్స్‌ 20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహాయించి, ఇతర ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* ప్రాథమిక హక్కులు సాధారణ హక్కుల కంటే ఉన్నతమైన ఆధిక్యత, స్వభావం కలిగి ఉన్నాయి.

సాధారణ హక్కులు
* సాధారణ హక్కులు పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల ద్వారా రూపొందుతాయి. వీటికి హామీ ఉంటుంది. ఈ హక్కులు ప్రభుత్వానికి అదనపు అధికారాలు కల్పిస్తాయి.
* సాధారణ హక్కులను పౌరులు తమ ఇష్టానుసారం వదులుకోవచ్చు.
* సాధారణ హక్కుల అమలు కోసం పౌరులు కేవలం పరిమిత న్యాయస్థానాలను మాత్రమే ఆశ్రయించవచ్చు.
* వీటిని ఎలాంటి పరిస్థితిలోనైనా తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా, రద్దు చేసే వీలు కూడా ఉంటుంది. 
* సాధారణ హక్కులు ప్రాథమిక హక్కులకు లోబడి ఉంటాయి.

ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య భేదాలు
ప్రాథమిక హక్కులు
* వీటిని రాజ్యాంగంలోని మూడో భాగంలో పేర్కొన్నారు.
* ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 12 నుంచి 35 మధ్య పొందుపరిచి ఉన్నాయి.
* వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* వీటికి న్యాయ సంరక్షణ ఉంది.
* ఇవి సర్వకాల, సర్వ వ్యవస్థల్లో అందుబాటులో ఉంటాయి.
* ఇవి వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను సాధించేందుకు ఉద్దేశించినవి.
* వీటి ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు.
* ఇవి రాజ్యాంగ లక్ష్యాలను సాధించేందుకు సాధనాలుగా ఉపకరిస్తాయి.
* వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. 
* వీటిని జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* ప్రాథమిక హక్కులు వ్యక్తిగతమైనవి.
* వీటిని అమలు చేసే బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది.
* ఇవి నకారాత్మక దృక్పథం కలిగినవి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడని పనులను తెలియజేస్తాయి.
* వీటికి ఆజ్ఞాపించే స్వభావం ఉంది.

ఆదేశిక సూత్రాలు
* వీటిని రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పేర్కొన్నారు.
* వీటిని రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 36 నుంచి 51 మధ్య వివరించారు.
* ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
* ప్రభుత్వాల ఆర్థికస్తోమతను అనుసరించి అందుబాటులో ఉంటాయి.
* సమాజ సమష్టి ప్రయోజనాలు సాధించేందుకు ఉద్దేశించినవి.
* వీటి ద్వారా సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు.
* ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ లక్ష్యాలను తెలుపుతాయి.
* వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
* ఇవి ఎప్పుడూ అమల్లోనే ఉంటాయి.
* ఇవి సామాజికపరమైనవి.
* వీటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.
* ఇవి సకారాత్మక దృక్పథాన్ని కలిగిఉంటాయి.
* ఆదేశిక సూత్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తెలుపుతాయి.
* ఇవి కేవలం సూచనప్రాయమైనవి.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథ‌మిక విధులు

1. ఉమ్మడి పౌరస్మృతిని ఆదేశ సూత్రాలలో చేర్చడంలో రాజ్యాంగ నిర్మాతల ఆశయం ఏమిటి?
జ‌: జాతీయ సమైక్యత, సమగ్రత

 

2. మాతా, శిశు సంరక్షణ రాజ్య కర్తవ్యం అని తెలిపే నిబంధన ఏది?
జ‌: నిబంధన 42

 

3. నిబంధన 39 (d) కిందివాటిలో ఏ విషయాన్ని తెలియజేస్తుంది?
  ఎ) సమాన పనికి అసమాన వేతనం
  బి) శారీరక, మానసిక శ్రమకు సమాన వేతనం
  సి) స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం
  డి) ఎ, బి సరైనవి
జ‌: సి (స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం)

 

4. ఆదేశ సూత్రాలు న్యాయార్హమైనవి కావు అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
జ‌: నిబంధన 37

 

5. కిందివాటిలో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చని నిబంధన ఏది?
ఎ) 38 (2)   బి) 39 (f)    సి) 39 (e)     డి) 39 (A)
జ‌: సి (39 (e))

 

6. గ్రామ పంచాయతీలను స్వయంపాలనా సంస్థలుగా తీర్చిదిద్దాలని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
జ‌: నిబంధన 40

 

7. కిందివాటిలో ప్రాథమిక హక్కులపై ఆదేశ సూత్రాలకు ఆధిక్యం కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
  ఎ) 40 వ రాజ్యాంగ సవరణ చట్టం
  బి) 44 వ రాజ్యాంగ సవరణ చట్టం
  సి) 43 వ రాజ్యాంగ సవరణ చట్టం
  డి) 42 వ రాజ్యాంగ సవరణ చట్టం
జ‌: డి ( 42 వ రాజ్యాంగ సవరణ చట్టం)

 

8. కిందివాటిలో 43 వ రాజ్యాంగ నిబంధనలో లేని అంశం ఏది?
  ఎ) కార్మికులకు కనీస వేతనం
  బి) కార్మికుల జీవన ప్రమాణాలు
  సి) కార్మికుల కుటుంబాలకు ఉన్నత విద్య
  డి) తగిన విరామం
జ‌: సి (కార్మికుల కుటుంబాలకు ఉన్నత విద్య)

 

9. ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం ఏది?
జ‌: గోవా

 

10. మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి చట్టాలు చేయాలని తెలిపే నిబంధన ఏది?
జ‌: నిబంధన 47

 

11. నిబంధన 49 ప్రకారం కింద పేర్కొన్న వాటిలో వేటిని సంరక్షించాలి?
  ఎ) ప్రభుత్వ ఆస్తులు     బి) చారిత్రక కట్టడాలు
  సి) చారిత్రక స్థలాలు      డి) చారిత్రక కట్టడాలు, చారిత్రక స్థలాలు సరైనవి
జ‌: డి (చారిత్రక కట్టడాలు, చారిత్రక స్థలాలు సరైనవి)

 

12. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించాలని తెలిపే నిబంధన ఏది?
జ‌: నిబంధన 51 (d)

 

13. ఆదేశ సూత్రాలను భారత ప్రభుత్వ చట్టం - 1935 లోని ''ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌"తో పోల్చిన రాజ్యాంగవేత్త ఎవరు?
జ‌: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్

 

14. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ నిబంధన 45 ని సవరించారు?
జ‌: 86 వ రాజ్యాంగ సవరణ చట్టం

 

15. కిందివాటిలో ఆదేశ సూత్రాలలో లేని అంశం ఏది?
   ఎ) ఉమ్మడి పౌరస్మృతి
   బి) స్త్రీ, పురుషులకు జీవనోపాధి
   సి) లౌకిక విధానం
   డి) సంపద వికేంద్రీకరణ
జ‌: సి (లౌకిక విధానం)

 

16. ప్రాథమిక విధుల దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తున్నారు?
జ‌: జనవరి 3

 

17. రాజ్యాంగంలోని 51 (A) a నిబంధనలో లేని అంశం ఏది?
    ఎ) రాజ్యాంగాన్ని గౌరవించాలి          బి) జాతీయ గీతాన్ని గౌరవించాలి
    సి) జాతీయ పతాకాన్ని గౌరవించాలి     డి) తల్లిదండ్రులను గౌరవించాలి
జ‌: డి (తల్లిదండ్రులను గౌరవించాలి)

 

18. ప్రాథమిక విధులపై 1998 లో నియమించిన కమిటీ ఏది?
జ‌: జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ

 

19. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన మేధాశక్తితో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి దేశ క్షిపణి కార్యకలాపాలకు ఎనలేని కృషి చేశారు. ఇది ఏ ప్రాథమిక విధిని సూచిస్తుంది?
జ‌: 51 - (A)J

 

20. ప్రాథమిక విధులను మొదటిసారిగా రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు?
జ‌: 1976

ర‌చ‌యిత‌: డాక్టర్ ఎం. భాస్కర రాజు

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిత నియమాలు

ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలేనని, వాటిని శ్రేయో రాజ్యాలుగా పేర్కొనవచ్చని రూస్కో పౌండ్‌ అభిప్రాయపడ్డారు. రాజ్యం అనేది అత్యధిక ప్రజల సంతోషం కోసం పాటుపడాలని ఉపయోగితావాద సిద్ధాంతకర్త జెర్మీ బెంథామ్‌ పేర్కొన్నారు. రాజ్యం మానవుడికి ఉత్తమ జీవనాన్ని ప్రసాదించేందుకు ఏర్పడిందని, అందుకే అది కొనసాగుతుందని రాజనీతిశాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్‌ అభిప్రాయపడ్డారు. క్రీ.శ.18వ శతాబ్దంలో స్కాండినేవియన్‌ దేశాల్లో సంక్షేమ రాజ్య స్థాపనకు సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థను అమలు చేశారు. స్పెయిన్‌ రాజ్యాంగంలో డైరెక్టివ్‌ ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ సోషల్‌ పాలసీ అనే పేరుతో తొలిసారిగా ఆదేశిక సూత్రాలను చేర్చారు. ఐర్లాండ్‌ 1937లో స్పెయిన్‌ నుంచి ఆదేశిక సూత్రాలను గ్రహించింది. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఆదేశిక సూత్రాలను Instruments Of Instructions గా పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను చేర్చడంలో 1928 నాటి ‘నెహ్రూ రిపోర్ట్‌’, 1931 నాటి భారత జాతీయ కాంగ్రెస్‌ కరాచీ తీర్మానం, 1945 నాటి సర్‌ తేజ్‌ బహదూర్‌ సప్రూ నేతృత్వంలోని కమిటీ నివేదికలు తోడ్పడ్డాయి. సప్రూ నేతృత్వంలోని బృందం సిఫార్సుల మేరకు సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యంగా ఐర్లాండ్‌ నుంచి స్ఫూర్తి పొందిన రాజ్యాంగ నిర్మాతలు ‘ఆదేశిక సూత్రాలను’ రాజ్యాంగంలో పొందుపరిచారు.

లక్షణాలు
* ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల న్యాయసంరక్షణ లేదు. స్వతహాగా అమల్లోకి రావు.
* వీటి అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాలి. ఇవి స్వభావరీత్యా సలహా సంబంధమైనవి.
* ప్రభుత్వాల పనితీరుకు వీటిని కొలమానంగా పరిగణిస్తారు.
* ప్రభుత్వ ఆర్థిక వనరుల లభ్యతను అనుసరించి ఇవి అమలవుతాయి.
* ప్రభుత్వ విధులు, బాధ్యతలను తెలుపుతాయి.
* రాజ్య కార్యకలాపాల పరిధిని విస్తృతపరుస్తాయి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా ఉంటాయి.
* రాజ్యాంగ ప్రవేశికలోని ఆశయాలకు ఆచరణ రూపాన్నిస్తాయి.
* ప్రాథమిక హక్కులకు పోషకాలుగా ఉండి, వాటిలోని వెలితిని పూరిస్తాయి.
* దేశంలో ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామ్య స్థాపనకు ఉపయోగపడతాయి.

రాజ్యాంగ వివరణ
ఆదేశిక సూత్రాలు/నిర్దేశిక నియమాలను రాజ్యాంగంలోని ఖిజువ భాగంలో, ఆర్టికల్‌ 36 నుంచి 51 మధ్య వివరించారు. వీటి స్వభావం ఆధారంగా ప్రొఫెసర్‌ ఎం.పి.శర్మ వీటిని 3 రకాలుగా వర్గీకరించారు. అవి:
1. సామ్యవాద నియమాలు: ఆర్టికల్స్‌ 38, 39, 41, 42, 43

2. గాంధేయవాద నియమాలు: ఆర్టికల్స్‌ 40, 46, 47, 48, 49
3. ఉదారవాద నియమాలు: ఆర్టికల్స్‌ 44, 45, 50, 51

ఆర్టికల్‌ 36: ‘రాజ్యం’ నిర్వచనాన్ని వివరిస్తుంది. ఆదేశిక సూత్రాల అమల్లో భాగస్వాములయ్యే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, ఇతర అధికార సంస్థలన్నీ ‘రాజ్యం’ నిర్వచనంలో అంతర్భాగమే.

ఆర్టికల్‌ 37: ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల రక్షణ లేదు. పౌరులు ఆదేశిక సూత్రాల అమలు కోసం కోర్టులను ఆశ్రయించకూడదు. ఆదేశిక సూత్రాల అమలు కోసం న్యాయస్థానాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయరాదు.

సామ్యవాద నియమాలు
సామ్యవాద ఆదర్శాల ప్రాతిపదికపై శ్రేయోరాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 38, 39, 41, 42, 43లలో వీటిని వివరించారు. అవి: 
ఆర్టికల్‌ 38: భారత పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.

ఆర్టికల్‌ 38(A): 1978లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వ హయాంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని చేర్చారు. ఈ ఆర్టికల్‌ ప్రకారం విభిన్న ప్రాంతాల్లో, వివిధ వృత్తుల్లో కొనసాగుతున్న పౌరుల మధ్య ఆదాయ అసమానతలను తగ్గించేదుకు ప్రభుత్వం కృషి చేయాలి.

ఆర్టికల్‌ 39: జాతీయ సంపదను, సహజ వనరులను దేశ ప్రజల సమష్టి ప్రయోజనానికి వినియోగించాలి.

ఆర్టికల్‌ 39(a): దేశ ప్రజలందరికీ తగిన జీవన సదుపాయాలు కల్పించాలి.

ఆర్టికల్‌ 39(b): దేశ సమగ్రాభివృద్ధి కోసం దేశంలోని భౌతిక వనరుల యాజమాన్యం, నియంత్రణను సక్రమంగా నిర్వహించి, వినియోగించాలి.

ఆర్టికల్‌ 39(c): దేశ సంపద, ఆర్థిక వనరులు, ఇతర ఉత్పత్తి సాధనాలు కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి.

ఆర్టికల్‌ 39(d): స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.

ఆర్టికల్‌ 39(e): కార్మికులు వారి శారీరక సామర్థ్యానికి మించి పనులు చేయకుండా నియంత్రించాలి. 

ఆర్టికల్‌ 39(f): ఈ ఆర్టికల్‌ను ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది. దీని ప్రకారం బాలలు స్వేచ్ఛాయుత, గౌరవప్రదమైన వాతావరణంలో వికాసం చెందేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలి. వారు ఎలాంటి పీడనానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలి.

ఆర్టికల్‌ 39(A): ఈ ఆర్టికల్‌ను 1976లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆదేశిక సూత్రాల్లో చేర్చింది. దీని ప్రకారం పేదలు, బడుగు, బలహీన వర్గాల వారు ‘ఉచిత న్యాయ సహాయాన్ని’ పొందుతారు.
 

ఆర్టికల్‌ 41: ప్రభుత్వం తనకున్న ఆర్థిక పరిమితులకు లోబడి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుద్యోగులకు పింఛన్‌ సదుపాయం కల్పించాలి. పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి ఉపాధి అవకాశాలు అందేలా చేయాలి.

ఆర్టికల్‌ 42: కార్మికులు పనిచేసేందుకు తగిన పరిస్థితులు, న్యాయమైన పనిగంటలు కల్పించాలి. మాతా, శిశు సంక్షేమానికి కృషి చేయాలి. స్త్రీలకు మెరుగైన ప్రసూతి సౌకర్యాలు అందించాలి.
 

ఆర్టికల్‌ 43: గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తులు, సహకార సంస్థలు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం అందించాలి.
 

ఆర్టికల్‌ 43(A): 1976లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగానికి చేర్చింది. దీని ప్రకారం పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.


గాంధేయవాద నియమాలు 
గాంధీజీ కలలు కన్న స్వరాజ్య స్థాపనకు, ప్రజాస్వామ్య పాలనా వికేంద్రీకరణకు తోడ్పడే అంశాలే గాంధేయవాద నియమాలు. వీటిని రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 40, 46, 47, 48, 49 లలో వివరించారు. 

ఆర్టికల్‌ 40: గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక స్వపరిపాలనను పటిష్ఠంచేసి, పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి. గ్రామస్వరాజ్య సాధనకు కృషిచేయాలి.

ఆర్టికల్‌ 46: విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఈ వర్గాల వారు సాంఘిక దోపిడీకి గురికాకుండా కృషి చేయాలి.

ఆర్టికల్‌ 47: ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే మద్యపానం, మత్తు పానీయాలను నిషేధించాలి. పోషకాహారాన్ని అందించడం ద్వారా ప్రజారోగ్య స్థాయిని పెంపొందించాలి.

ఆర్టికల్‌ 48: వ్యవసాయం, పాడి పరిశ్రమలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా గణనీయమైన ఉత్పత్తులను సాధించాలి. ‘గోవధ’ను నిషేధించాలి.

ఆర్టికల్‌ 48(A): ఈ ఆర్టికల్‌ను ఇందిరా గాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది. దీని ప్రకారం పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల అభివృద్ధికి కృషిచేయాలి.

ఆర్టికల్‌ 49: భారతీయుల ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వానికి చిహ్నంగా నిలిచే పురాతన కట్టడాలు, శిల్ప సంపదను పరిరక్షించాలి.

ప్రముఖుల వ్యాఖ్యానాలు
*‘ఆదేశిక సూత్రాలు మనదేశంలో ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడతాయి.’    - డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

* ‘ఆదేశిక సూత్రాలు శ్రేయోరాజ్య స్థాపనలో నిమగ్నమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరదీపికలుగా పనిచేస్తాయి’     -ఎం.సి.సెతల్‌వాడ్‌

* ‘ఆదేశిక సూత్రాలు నూతన సంవత్సర తీర్మానాలు. అవి ఆరోజే ఉల్లంఘనకు గురవుతాయి’     - నసీరుద్దిన్‌ మహ్మద్

* ‘ఆదేశిక సూత్రాలు బ్యాంకులు తమ వద్ద ఉండే డబ్బు సౌకర్యాన్ని అనుసరించి ఇచ్చే చెక్కుల వంటివి.’    - కె.టి.షా

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు

ఆస్తిహక్కు 
ఆర్టికల్‌ 31: దీని ప్రకారం భారతీయులకు ఆస్తిని సంపాదించడానికి, అనుభవించడానికి హక్కు ఉంది. 

* 1978లో మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది. దీన్ని రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్‌ 300(A) లో ‘చట్టబద్ధమైన హక్కు’గా నిర్దేశించింది. ఇది 1979, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్‌ 31(A): 1951లో అప్పటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా  ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగానికి చేర్చింది.
దీని ప్రకారం, భూసంస్కరణల అమలు కోసం పార్లమెంట్‌ లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన శాసనాలను ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయకూడదు. ఈ ఆర్టికల్‌ ప్రకారం ప్రజాప్రయోజనాల రీత్యా ప్రైవేట్‌ ఆస్తులను ప్రభుత్వం జాతీయం చేయవచ్చు.

ఆర్టికల్‌ 31(B):  ఈ ఆర్టికల్‌ను జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చింది. దీని ప్రకారం, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలను న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణంతో రద్దు చేయడానికి వీల్లేదు. అంటే కోర్టులకు ఈ అంశాలపై న్యాయసమీక్ష చేసే అధికారం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే భూసంస్కరణల చట్టాలకు పూర్తి రక్షణ కల్పించారు.

ఆర్టికల్‌ 31(C): 1971లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చింది. దీని ప్రకారం ప్రైవేట్‌ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించడం కోసం ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలకు న్యాయ సంరక్షణ ఉంటుంది. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్‌ 39(b), ఆర్టికల్‌ 39(c) అమలుకోసం రూపొందించిన శాసనాలు ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్స్‌ 14, 19 లకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఆర్టికల్‌ 31(c) ప్రకారం చెల్లుతాయి.

రాజ్యాంగ పరిహారపు హక్కు 
ఆర్టికల్‌ 32: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఈ హక్కును రాజ్యాంగానికి ‘ఆత్మ, హృదయం’ లాంటిది అని పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టులకు అప్పగించింది. ప్రభుత్వాల నియంతృత్వ విధానాలు, అధికార దుర్వినియోగం నుంచి ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించడానికి  ఈ హక్కును రాజ్యాంగంలో చేర్చారు.

ఆర్టికల్‌ 32(1): దీని ప్రకారం ఎవరైనా పౌరుడు తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని భావిస్తే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
ఆర్టికల్‌ 32(2): ప్రాథమిక హక్కుల సంరక్షణకు ఉన్నత న్యాయస్థానం 5 రకాల రిట్లు జారీ చేస్తుంది. 
‘రిట్‌’ అంటే ఉన్నత న్యాయస్థానం జారీచేసే, తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం. ఈ భావనను మనం ఇంగ్లండ్‌ నుంచి గ్రహించాం.
ఆర్టికల్‌ 32(3): ‘రిట్స్‌’ జారీచేసే అధికారాన్ని ఇతర న్యాయస్థానాలకు కూడా కల్పిస్తూ పార్లమెంట్‌ చట్టాన్ని రూపొందించవచ్చు.
ఆర్టికల్‌ 32(4): చట్టబద్ధంగా తప్ప ఇతర పద్ధతుల ద్వారా ‘రిట్స్‌’ జారీచేసే అధికారాలపై ఎలాంటి పరిమితులు విధించకూడదు. జాతీయ అత్యవసర పరిస్థితి, మార్షల్‌లా విధించిన సందర్భంలో రిట్స్‌పై పరిమితులు విధించవచ్చు.

ఇంజంక్షన్‌ (కోర్ట్‌ నిషేధాజ్ఞ):  ఒక వ్యక్తిని ఏదైనా పని చేయమని లేదా చేయొద్దని న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వునే ‘ఇంజంక్షన్‌’ అంటారు. ఆస్తికి సంబంధించిన సివిల్‌ వివాదాల్లో యథాతథస్థితిని కాపాడటం కోసం దీన్ని జారీ చేస్తారు. సరి చేయడానికి వీలుకాని నష్టాన్ని నిలిపేయడమే ఇంజంక్షన్‌ ప్రధాన ఉద్దేశం. దీన్ని ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలపై కూడా జారీ చేస్తారు.

అమికస్‌ క్యూరీ: బాధితుడు న్యాయస్థానం ముందు హాజరై తన వాదనను వినిపించుకునే స్థితిలో లేనప్పుడు, అతడి తరపున వాదించడం కోసం న్యాయస్థానం నియమించే వ్యక్తి లేక అధికారిని ‘అమికస్‌ క్యూరీ’ అంటారు. 

ఆర్టికల్‌ 33: శాంతి భద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, కేంద్ర సాయుధ దళాల ఉద్యోగులకు, రహస్య, గూఢచార సంస్థల్లో పనిచేసేవారికి, రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన విచారణ సంస్థల సిబ్బందికి ప్రాథమిక హక్కులు పూర్తిగా లభించవు. ఇందుకు అవసరమైన చట్టాలను పార్లమెంట్‌ పూర్తిస్థాయిలో రూపొందిస్తుంది.
ఆర్టికల్‌ 34:  ఏదైనా ప్రాంతంలో గొడవలు జరిగినప్పుడు శాంతిభద్రతల పరిరక్షణకు, అక్కడ సాధారణ పరిస్థితిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సైనిక శాసనాన్ని విధిస్తే అక్కడ నివసించే ప్రజలకు ‘ప్రాథమిక హక్కులు’ పూర్తిగా లభించవు. ఇందుకు అవసరమైన శాసనాలను పార్లమెంట్‌ రూపొందిస్తుంది.
ఆర్టికల్‌ 35: ఆర్టికల్‌ 33 లో పేర్కొన్న వర్గాలకు, ఆర్టికల్‌ 34 ద్వారా సైనిక శాసనం విధించిన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, ఆర్టికల్‌ 371లో పేర్కొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల వారి హక్కుల కోసం పార్లమెంట్‌ విశిష్టమైన చట్టాలను రూపొందించవచ్చు.

అవి: 

1. The Air Force Act, 1950

2. The Navy Force Act, 1950

3. The Armed Force Act, 1950

4. The Police Force Act, 1966

* భారతదేశంలో పర్యటించే విదేశీయులకు ఆర్టికల్‌ 15, 16, 19, 29, 30లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు వర్తించవు.
* ప్రాథమిక హక్కులపై రాజ్యాంగంలో పేర్కొన్న అనేక పరిమితులు వల్ల నార్మన్‌ డీఫార్మర్‌ వీటి గురించి కింది విధంగా వ్యాఖ్యానించారు. ‘భారత రాజ్యాంగం ఒక చేతితో హక్కులను ప్రసాదించి, వాటిపై అనేక పరిమితులు విధించడం ద్వారా మరో చేతితో వెనకకు తీసుకున్నట్లుగా ఉంది’.
* మినర్వామిల్స్‌ ్ర( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1980: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొన్నప్పటికీ, వాటికి భంగం కలిగే విధంగా హక్కులను సవరించకూడదు అని పేర్కొంది.

రిట్స్‌ 
ప్రాథమిక హక్కుల సంరక్షణకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ను జారీ చేస్తాయి. అవి:

1. హెబియస్‌ కార్పస్ (బందీ ప్రత్యక్ష):  నిర్బంధంలో ఉన్న వ్యక్తిని ప్రయాణ సమయాన్ని మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా కోర్టు ముందు హాజరుపర్చమని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశమే ‘హెబియస్‌ కార్పస్‌’. ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేయడం చట్టబద్ధమా? కాదా? అని నిర్ణయించేందుకు న్యాయస్థానం ఈ రిట్‌ను జారీ చేస్తుంది. దీన్ని ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులపై కూడా జారీ చేయొచ్చు. ఇది అతిపురాతనమైన రిట్‌.
* పార్లమెంట్‌ ధిక్కారం, శాసనసభా ధిక్కారం, కోర్టు ధిక్కారం, క్రిమినల్‌ నేరం కింద అరెస్ట్‌ అయినవారికి, నివారక నిర్బంధ చట్టం ప్రకారం అదుపులోకి తీసకున్నవారికి ఈ రిట్‌ వర్తించదు.

2. మాండమస్(అత్యున్నత ఆదేశం): మాండమస్‌ అంటే ’We Command‘ అని అర్థం. ఎవరైనా ప్రభుత్వ అధికారికి లేదా ప్రభుత్వ అధికార సంస్థకు మీ విద్యుక్త ధర్మాన్ని (Publice Duty) సక్రమంగా నెరవేర్చండి అని ఉన్నత న్యాయస్థానం జారీచేసే ఆదేశం మాండమస్‌. తమ అధికార పరిధిలో ఉన్న విధులను నిర్వర్తించడానికి నిరాకరించిన ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ సంస్థలకు ఈ రిట్‌ జారీ చేస్తారు.
* ఈ రిట్‌ను రాష్ట్రపతి, గవర్నర్లు, విదేశీయులు, ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు.

3. ప్రొహిబిషన్‌ (నిషేధిస్తూ జారీ చేసే ఆదేశం): ఏదైనా దిగువస్థాయి న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం దాన్ని ఆపేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే ఆదేశమే ‘ప్రొహిబిషన్‌’. దిగువ న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించకుండా నిరోధించడమే ఈ ‘రిట్‌’ ఉద్దేశం. ఏదైనా నిర్దిష్ట కేసులో తీర్పు ఇవ్వకుండా దిగువ న్యాయస్థానం లేదా ట్రైబ్యునల్‌ను ఈ రిట్‌ నియంత్రిస్తుంది.
* మాండమస్‌ రిట్‌ ఒక పని చేయాలని ఆదేశిస్తే, ప్రొహిబిషన్‌ రిట్‌ ఒక పని చేయకూడదని నిర్దేశిస్తుంది.

4. సెర్షియోరరి: ఈ రిట్‌ను ‘ప్రొహిబిషన్‌ రిట్‌’తో కలిపి జారీ చేస్తారు. దిగువ న్యాయస్థానం లేదా ట్రైబ్యునల్‌ ఆపేసిన కేసు విచారణను ఉన్నత న్యాయస్థానానికి లేదా పక్క కోర్టుకు బదిలీ చేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే ఆదేశమే ‘సెర్షియోరరి రిట్‌’. ఉదా: గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన ‘బెస్ట్‌ బేకరీ కేసు’ను జహీరాషేక్‌ విన్నపం మేరకు ముంబయి కోర్టుకు బదిలీ చేశారు. ప్రొహిబిషన్, సెర్షియోరరి రిట్స్‌ను జ్యుడీషియల్‌ రిట్స్‌ అంటారు.

5. కోవారంటో  (ఏ అధికారంతో): ఒక వ్యక్తికి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అధికారాలు లేకపోయినప్పటికీ అధికారాలను చెలాయిస్తుంటే అతడు ఏ అధికారంతో ఆ పని చేస్తున్నాడు? అని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీచేసే ఆదేశమే ‘కోవారంటో రిట్‌’. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని నివారించడానికి న్యాయస్థానం దీన్ని జారీ చేస్తుంది. 
* దీని ప్రకారం, వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా, కలగకపోయినా అర్హతలేని వ్యక్తి అధికారం చేపట్టినప్పుడు దాన్ని నియంత్రించడానికి సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా కోవారంటో రిట్‌ను జారీచేయాల్సిందిగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఇండియన్‌ పాలిటీ

మహిళా సంక్షేమం


1. మనదేశంలో 1953లో ఏర్పాటు చేసిన ‘కేంద్ర] సాంఘిక సంక్షేమ మండలి’కి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు?


1)విజయలక్ష) దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌


3) సరోజినీ నాయుడు


4) పూర్ణిమా శ్రీవాణి


2. కింది వాటిలో కేంద్ర] సాంఘిక సంక్షేమ మండలి నిర్వహించే విధులకు సంబంధించి సరైంది?


ఎ) సాంఘిక సంక్షేమ సంస్థలు లేనిచోట నూతనంగా వాటిని ఏర్పాటు చేయడం


బి) ఈ సంస్థల అవసరాలపై సర్వే నిర్వహించడం


సి) కేంద్రం, రాష్ట్రాల్లో వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేయడం

డి) మహిళా సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచే సంస్థలకు ఆర్థిక సహాయం అందించడం


1) ఎ, బి, సి    2) ఎ, సి, డి 


3) ఎ, బి, డి     4) పైవన్నీ


3. రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన రక్షణకు సంబంధించి సరైంది?


ఎ) ఆర్టికల్, 15(3) - మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడం చట్టరీత్యా సమంజసం


బి) ఆర్టికల్, 39 (డి) - స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం


సి) ఆర్టికల్, 243  స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్‌ చేయడం


డి) ఆర్టికల్, 51 (ఎ)(ఇ) - మహిళల గౌరవానికి భంగం కలిగించరాదు


1) ఎ, బి, డి     2) ఎ, సి, డి 


3) ఎ, బి, సి     4) పైవన్నీ

4. హిందూ వివాహ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?


1) 1954     ) 1957        4) 1959


5. పురుషులతో సమానంగా స్త్రీలకు వారసత్వ హక్కును కల్పిస్తున్న హిందూ వారసత్వ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?


1) 1952        2) 1953 


3) 1954        4) 1956

6. హిందూ దత్తత, పోషణ చట్టం, 1956కి సంబంధించి కింది వాటిలో సరైంది?


ఎ) భార్య ఒప్పుకుంటేనే బాలుడు లేదా బాలికను దత్తత తీసుకునే వీలుంటుంది


బి) హిందూ స్త్రీ పోషణ బాధ్యత ఆమె భర్తదే


సి) భర్తకు ఆస్తి ఉన్నా, లేకున్నా పోషించే బాధ్యత అతనిదే


డి) భర్త ఆస్తి నుంచి ఖర్చులు పొందే హక్కు భార్యకు ఉంటుంది


1) ఎ, బి, సి     2) ఎ, సి, డి 


3) ఎ, బి, డి     4) పైవన్నీ

7. హిందూ మైనర్ల, సంరక్షకుల చట్టం, 1956 ప్రకారం వివాహం కాని బాలబాలికలకు సంరక్షకులుగా

 

ఎ) మొదట తండ్రి, తరువాత తల్లి 


2) మొదట తల్లి, తరువాత తండ్రి 


3) తల్లిదండ్రులు సమానంగా 


4) పిల్లల అభీష్టం మేరకు


8. కింది వాటిలో ప్రసూతి సౌకర్యాల చట్టానికి సంబంధించి సరైంది?


ఎ) దీన్ని 1961లో రూపొందించారు


బి) ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే స్త్రీలకు ప్రసూతి సౌక్యరాలు కల్పిస్తారు


సి) గర్భం దాల్చిన స్త్రీలకు ప్రసవానికి ముందు, తరువాత వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తారు


డి) ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాల అభీష్టానికి ఇచ్చారు


1) ఎ, సి, డి     2) ఎ, బి, డి 


3) ఎ, బి, సి     4) పైవన్నీ

 

9. కింది వాటిని జతపరచండి.


    జాబితా - తి            జాబితా - తీ


ఎ) వరకట్న నిషేధ చట్టం    i. 1971


బి) గర్భవిచ్ఛిత్తి చట్టం         ii. 1984


సి) మహిళలు, బాలల అక్రమ iii. 1961


  వ్యాపార నిరోధక చట్టం 


డి) కుటుంబ కోర్టుల చట్టం    i1956


1) ఎ-i, బి-ii, సి-iii, డి-i  


2) ఎ-iii, బి-i, సి-i  డి-ii


3) ఎ-iii, బి-ii, సి-i  డి-i  


4) ఎ-i  బి-ii, సి-i, డి-iii

10. కింది వాటిలో ఏ సంఘటన 1987లో సతీసహగమన నిరోధక చట్టం రూపకల్పనకు కారణమైంది?


1) రూప్‌కన్వర్‌ సతీసహగమనం         


2) అనితాదేశాయ్‌ సతీసహగమనం 


3) పూర్ణిమా మిశ్రా సతీసహగమనం   


4) రాజేశ్వరి బెనర్జీ సతీసహగమనం

 

11. కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?


1) 2005, అక్టోబరు 3 


2) 2006, అక్టోబరు 3  


3) 2006, అక్టోబరు 26 


4) 2005, అక్టోబరు 26

12. మహిళలు పనిచేసే కార్యాలయాలు/పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా వెలువరించింది?


1) ఎస్‌.ఆర్‌. బొమ్మై జు( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు vs1994)


2) విశాక జు( స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేసు vs1997)


3)నందినీ శతపతి జ vs1995)


4) మినర్వా మిల్స్‌ జు( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు vs 1980)


13. కింది వాటిలో నేర న్యాయ (సవరణ) చట్టం, 2013కి సంబంధిoచి సరైంది?

ఎ) ఈ బిల్లు 2013, మార్చి 19న లోక్‌సభ ఆమోదం పొందింది


బి) 2013, మార్చి 21న రాజ్యసభ ఆమోదం పొందింది 


సి) 2013, ఏప్రిల్‌ 2న రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారింది


డి) ఈ చట్టమే నిర్భయ చట్టంగా పేరొందింది. 


1) ఎ, బి, సి     2) ఎ, సి, డి 


3) ఎ, బి, డి     4) పైవన్నీ

14. మహిళలకు చట్టసభల్లో 1/3 వంతు స్థానాలు రిజర్వ్‌ చేయడానికి ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రయత్నించి విఫలమయ్యారు?

1) 107వ        2) 108వ     3) 109వ         4) 110వ 


15.POCSO ACT  అంటే ఏమిటి?


1) Protection Children Social Offences Act

2) Protection of Children from Sexual Offences Act

3) Prevention of Children Social Offences Act

4) Previlage of Children from Sexual Offences Act 

16. కింది వాటిలో బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టానికి (POCSO ACT) సంబంధించి సరైంది?


ఎ) 18 ఏళ్లలోపు ఉన్న బాలబాలికలకు ఈ చట్టం ద్వారా లైంగిక వేధింపుల నుంచి రక్షణ లభిస్తుంది


బి) బాలుడు/బాలికను రాత్రిపూట పోలీసు స్టేషన్‌లో ఉంచరాదు


సి) ఈ చట్టాన్ని 2012లో రూపొందించారు


డి) ఈ చట్టాన్ని 2014లో సుప్రీంకోర్టు రద్దు చేసింది


1) ఎ, బి, సి    2) ఎ, సి, డి 


3) ఎ, బి, డి     4) పైవన్నీ


17. బేటీ బచావో - బేటీ పడావో పథకాన్ని 2015, జనవరి 22న ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు?


1) పానిపట్‌ - హరియాణా    

2) సేలం - తమిళనాడు

3) పూరీ - ఒడిశా  

4) వికారాబాద్‌-తెలంగాణ

 

సమాధానాలు


1-2   2-4    3-4   4-2   5-4   6-4    7-1   8-3  9-2  10-1   11-3

12-2   13-4   14-2    15-2    16-1   17-1

మరికొన్ని...


1. గ్రామీణ మహిళల సామాజిక, ఆర్థిక హోదాను పెంచే ఉద్దేశంతో మహిళా సమృద్ధి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?


1) 1991, ఆగస్టు 2  


2) 1992, సెప్టెంబరు 2 


3) 1993, అక్టోబరు 2     


4) 1992, నవంబరు 16


2. డ్వాక్రా (DWCRA) పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?


1) 1967        2) 1971 


3) 1974         4) 1982 


3. మహిళా సాధికారత జాతీయ మిషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు?


1) 2010, మార్చి 8 


2) 2012, మార్చి 8     


3) 2013, మార్చి 8    


4) 2014, మార్చి 8

4. కష్టాల్లో ఉన్న మహిళలు, అత్యాచార బాధితులు తదితరులకు ఆత్మస్థైర్యం కల్పించేందుకు కుటుంబ కౌన్సిల్‌ కేంద్రాలు ఎప్పుడు స్థాపించారు?


1) 1979        2)1981 


3) 1984        4) 1987


5. ఆడపిల్లల ఆర్థిక స్వావలంబన కోసం 2015, జనవరి 22న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం ఏది?


1) సుకన్య సమృద్ధి యోజన


2) ఆరోగ్యలక్ష్మి


3) ఆసరా           4) కళ్యాణలక్ష్మి


6. పాఠశాల విద్య కొనసాగించే విద్యార్థినులు సులభంగా సాంకేతిక విద్యారంగంలోకి ప్రవేశించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది?


1) సరళ్‌        2) విదూత్‌


3)ఉడాన్‌        4) వెన్నెల


7. ‘మహిళా సాధికారతే భారతదేశ సాధికారత’ అనే నినాదంతో కేవలం మహిళలతోనే నిర్వహించే ‘భారతీయ మహిళా బ్యాంక్‌’ను 2013, నవంబరు 19న అప్పటి భారత ప్రధానమంత్రి డా.మన్మోహన్‌సింగ్‌ ఎక్కడ ప్రారంభించారు?


1) దిల్లీ        2) మీరట్‌ 


3) ముంబయి    4) చెన్నై'

8. కింది వాటిలో జాతీయ మహిళా కమిషన్‌కు సంబంధించి సరైంది? 


ఎ) జాతీయ మహిళా కమిషన్‌ చట్టం 1990, ఆగస్టు 30న రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందింది.


బి) 1992, జనవరి 31న జాతీయ మహిళా కమిషన్‌ ఏర్పడింది


సి) ఈ కమిషన్‌ ఒక చట్టబద్ధమైన సంస్థ


డి) దీని చైర్మన్‌ పదవీకాలం మూడేళ్లు.


1) ఎ, బి, సి         2) ఎ, సి, డి 


3) ఎ, బి, డి         4) పైవన్నీ


సమాధానాలు

 

1-3   2-4    3-1   4-3   5-1    6-3   7-3   8-4

 


 


 

 


 


 

 


 

 

 


 

 

 

 

 


 

 

 

Posted Date : 08-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పౌర స్వేచ్ఛకు పరిపూర్ణ హామీ!

ప్రాథమిక హక్కులు

 

 

మన దేశంలో పౌర స్వేచ్ఛకు పరిపూర్ణ హామీని ప్రాథమిక హక్కులు కల్పిస్తున్నాయి. రాజ్యాంగంలోని మూడో భాగంలో పొందుపరిచిన ఈ హక్కులకు ప్రజాస్వామ్యంలో అమిత ప్రాధాన్యం ఉంది. వ్యక్తి సర్వతోముఖాభివృద్ధి, సమ సమాజ నిర్మాణానికి దోహదపడే ఆ హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలను ఆశ్రయించి రక్షణ పొందవచ్చు. ప్రతి పౌరుడూ విధిగా తెలుసుకోవాల్సిన ఈ అంశంపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు జారీ చేసే రిట్స్, ప్రభుత్వాలు చేసిన రాజ్యాంగ సవరణ చట్టాలు, అల్పసంఖ్యాక వర్గాల వారికి ఉన్న ప్రత్యేక వెసులుబాట్ల గురించి తెలుసుకోవాలి.


1.    కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌.

బి) బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలో భారత ప్రధాని పి.వి.నరసింహారావు.

సి) బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎస్‌.ఆనంద్‌.

డి) బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలో భారత రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ.

1) ఎ, బి, డి       2) ఎ, బి, సి   

3) ఎ, సి, డి        4) ఎ, బి, సి, డి


2.     మన దేశంలో ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1992 నుంచి ‘నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ కమ్యూనల్‌ హార్మోని’ ప్రదానం చేస్తున్నారు?

1) కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ    2) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ

3) కేంద్ర సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ  4) కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ


3.     వివిధ మతఘర్షణల అనంతరం వాటిపై విచారణ కోసం ఏర్పడిన కమిషన్‌లకు సంబంధించి సరికానిది?

1) 1993 - ముంబై అల్లర్లు, జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ కమిషన్‌

2) 1992 - బాబ్రీ మసీదు విధ్వంసం, జస్టిస్‌ లిబర్హాన్‌ కమిషన్‌

3) 2002 - గోద్రా అల్లర్లు, జస్టిస్‌ నానావతి కమిషన్‌

4) 1984 - సిక్కులపై దాడులు, జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ కమిషన్‌


4.     కింద పేర్కొన్న వాటిలో సరైంది?

ఎ) అల్పసంఖ్యాక వర్గాల వారికి తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కు ఉందని ఆర్టికల్‌ 29 పేర్కొంటుంది.

బి) అల్పసంఖ్యాక వర్గాల వారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థల్ని నెలకొల్పవచ్చని ఆర్టికల్‌ 30 పేర్కొంటుంది.

సి) మనదేశంలో చట్టబద్ధంగా మత, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు ఉన్నారు.

డి) రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాల గురించి నిర్వచించారు.

1) ఎ, బి, సి       2) ఎ, బి, సి, డి   

3) ఎ, సి, డి       4) ఎ, బి, డి


5.     కింద పేర్కొన్న అంశాల్లో సరికాని దాన్ని గుర్తించండి.

1) మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారిని నిర్ధారించేందుకు ‘దేశాన్ని’ యూనిట్‌గా తీసుకుంటున్నారు.

2) భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారిని నిర్ధారించేందుకు ‘రాష్ట్రాన్ని’ యూనిట్‌గా తీసుకుంటున్నారు.

3) మనదేశంలో హిందువులు మినహా మిగతా మతాల వారంతా మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలవారే.

4) మన రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడేవారు భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలవారు.


6.     భాషాపరమైన మైనార్టీలు తమ ప్రాథమిక విద్యను మాతృభాషలో కొనసాగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏ ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రపతి పభుత్వాన్ని ఆదేశించగలరు?

1) ఆర్టికల్, 350(A)     2) ఆర్టికల్, 351(A)

3) ఆర్టికల్, 352(A)    4) ఆర్టికల్, 353(A)


7.     మైనార్టీ విద్యాసంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునే సందర్భం గురించి సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా స్పష్టత ఇచ్చింది?

1) జగ్జీత్‌ సింగ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా

2) రేణుమిశ్రా Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌

3) టీఎమ్‌ఎ పాయ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక

4) సత్యజిత్‌రే Vs స్టేట్‌ ఆఫ్‌ పశ్చిమ బెంగాల్‌


8.     సంరక్షించిన చట్టాలుగా sSavings of Certain Lawsz పేర్కొన్న వాటిలో లేని దాన్ని గుర్తించండి.

1) ఆర్టికల్, 31(A)     2) ఆర్టికల్, 32(B) 

3) ఆర్టికల్, 31(C)     4) ఆర్టికల్, 31(D) 


9.     ఆస్తి హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఆస్తి హక్కు గురించి ఆర్టికల్‌ 31 వివరిస్తుంది.

బి) ఆర్టికల్‌ 31 ప్రకారం భారతీయులు ఆస్తిని  సంపాదించుకోవచ్చు, అనుభవించవచ్చు, అన్యాక్రాంతం చేయవచ్చు.

సి) ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

డి) ఆస్తి హక్కును మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది.

1) ఎ, బి, సి         2) ఎ, బి, సి, డి

3) ఎ, సి, డి         4) ఎ, బి, డి


10. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఆర్టికల్‌ 31(A) ను 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి చేర్చారు.

బి) ఆర్టికల్‌ 31(B) ను 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి చేర్చారు.    

సి) ఆర్టికల్‌ 31(C)ను 1971లో 25వ రాజ్యాంగ చట్టం ద్వారా రాజ్యాంగానికి చేర్చారు.

డి) ఆర్టికల్‌ 31(D)ను 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి చేర్చారు.

1) ఎ, బి, సి, డి      2) ఎ, సి, డి

3) ఎ, బి, సి       4) ఎ, బి, డి


11.     చట్టపరమైన సీలింగ్‌ పరిమితులతో ఉండి, స్వయంగా సేద్యం చేసుకునే వ్యక్తి భూమిని రాజ్యం తీసుకున్నప్పుడు అతడికి మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

1) 17వ రాజ్యాంగ సవరణ చట్టం, 1964

2) 18వ రాజ్యాంగ సవరణ చట్టం, 1966

3) 19వ రాజ్యాంగ సవరణ చట్టం, 1966

4) 21వ రాజ్యాంగ సవరణ చట్టం, 1967


12. రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించి  కిందివాటిలో సరైంది?

ఎ) రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 దీని గురించి వివరిస్తుంది.

బి) ఈ హక్కు రాజ్యాంగానికి ఆత్మలాంటిదని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

సి) దీన్ని రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తిగా తొలగించవచ్చు.

డి) ఈ హక్కును హక్కులకే హక్కుగా పేర్కొనవచ్చు.

1) ఎ, బి, సి        2) ఎ, బి, సి, డి    

3) ఎ, బి, డి        4) ఎ, సి, డి


13. కిందివాటిలో ఆర్టికల్‌ 32కు సంబంధించి సరైంది? 

ఎ) ఆర్టికల్‌ 32(1) - హక్కులు కోల్పోయిన పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు

బి) ఆర్టికల్‌ 32(2) - ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు అయిదు రకాల రిట్స్‌ జారీ చేస్తుంది

సి) ఆర్టికల్‌ 32(3) - దిగువ స్థాయి న్యాయస్థానాలకు రిట్స్‌ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తూ  పార్లమెంటు చట్టాన్ని రూపొందించగలదు

డి) ఆర్టికల్‌ 32(4) - రాజ్యాంగం సూచించిన పద్ధతిలో మినహా ఇతర పద్ధతుల ద్వారా రాజ్యాంగ పరిహారపు హక్కును సస్పెండ్‌ చేయరాదు.

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి 

3) ఎ, సి, డి    4) ఎ, బి, సి, డి 


14. కిందివాటిలో రిట్స్‌కు సంబంధించి సరైంది?

ఎ) రిట్‌ అంటే ఆజ్ఞ/ఆదేశం అని అర్థం.

బి) ఇంగ్లండ్‌లో రిట్స్‌ను ప్రొరొగేటివ్‌గా పేర్కొంటారు.

సి) ఇంగ్లండ్‌ పార్లమెంటు రిట్స్‌ను జారీ చేస్తుంది.

డి) ఇంగ్లండ్‌లో హైకోర్ట్‌లు రిట్స్‌ను జారీ చేస్తాయి.

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి   

3) ఎ, బి, సి, డి     4) ఎ, సి, డి,


15. మన రాజ్యాంగం అమల్లోకి రాకముందు రిట్స్‌ జారీ చేసే అధికారం ఏ హైకోర్టుకు ఉండేది?

1) బాంబే, కలకత్తా, మద్రాస్‌ హైకోర్టులు       2) బాంబే, అలహాబాద్, నాగ్‌పుర్‌ హైకోర్టులు

3) కలకత్తా, శ్రీనగర్, అహ్మదాబాద్‌ హైకోర్టులు    4) మద్రాస్, బాంబే, భోపాల్‌ హైకోర్టులు


16. ప్రాథమిక హక్కుల రక్షణ కోసం న్యాయస్థానాలు జారీ చేసే రిట్స్‌కు సంబంధించి సరికానిది?

1) హెబియస్‌ కార్పస్, మాండమస్‌  2) ప్రొహిబిషన్, సెర్షియోరరి

3) కోవారెంటో          4) అల్ట్రావైర్స్‌


17. హెబియస్‌ కార్పస్‌ రిట్‌కు సంబంధించి సరికానిది?

1) దీన్ని ఉదారమైన రిట్‌గా పేర్కొంటారు.

2) దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షక సాధనంగా పేర్కొంటారు.

3) హెబియస్‌ కార్పస్‌ అనేది లాటిన్‌ భాష నుంచి వచ్చింది.

4) ఈ రిట్‌ను ప్రైవేట్‌ వ్యక్తులపై జారీ చేయరాదు.


18. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయరాదు?

1) రాష్ట్రపతి    2) రాష్ట్రాల గవర్నర్‌లు 

3) విదేశీయులు    4) పైవారందరిపై 


19. హెబియస్‌ కార్పస్‌ రిట్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) వ్యక్తి అరెస్ట్‌ లేదా నిర్బంధం చట్టబద్ధమైందా, కాదా అని న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి.

బి) ఈ రిట్‌ను ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేస్తారు.

సి) దీన్ని ప్రైవేట్‌ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేస్తారు.

డి) కోర్టు ద్వారా నేరారోపణ నిర్ధారణ జరిగిన వ్యక్తి విషయంలో ఈ రిట్‌ను జారీ చేస్తారు.

1) ఎ, బి, సి       2) ఎ, బి, సి, డి   

3) ఎ, బి, డి       4) ఎ, సి, డి 


20. ‘నీవు నిర్బంధించిన వ్యక్తిని మొత్తం శరీరంతో  సహా 24 గంటల్లోపు నా ముందు హాజరుపరచు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమంటారు?

1) కోవారెంటో       2) మాండమస్‌   

3) హెబియస్‌ కార్పస్‌       4) సెర్షియోరరి


21. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఏ సందర్భంలో జారీ చేయడానికి వీలుకాదు? 

ఎ) చట్టబద్ధత ఉన్న నిర్బంధం విషయంలో

బి) శాసన లేదా కోర్టు ధిక్కరణ విషయంలో

సి) కోర్టు ఆజ్ఞ ప్రకారం నిర్బంధించిన వ్యక్తి విషయంలో

డి) కోర్టు అధికార పరిధిలో లేని నిర్బంధం విషయంలో

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి

3) ఎ, బి, సి, డి       4) ఎ, సి, డి 


22. భారతీయులకు నిర్బంధ విద్యాహక్కు కల్పించాలని 1911లో ఆంగ్లేయులను డిమాండ్‌ చేసిన భారతీయుడెవరు?

1) దాదాభాయ్‌ నౌరోజీ    2) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌

3) సుభాష్‌ చంద్రబోస్‌    4) గోపాలకృష్ణ గోఖలే


23. కింద పేర్కొన్న అంశాల్లో సరైంది?

ఎ) 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘విద్య’ను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు.

బి) ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కును అమలు చేసిన 135వ దేశం భారత్‌.

సి) విద్యాహక్కు గీతాన్ని రచించినవారు జావేద్‌ అక్తర్‌.

డి) విద్యాహక్కు గీతం పల్లవి ‘టన్‌టన్‌టన్‌ సునో ఘంటీ బజే స్కూల్‌కి’.

1) ఎ, బి, సి            2) ఎ, బి, సి, డి

3) ఎ, బి, డి           4) ఎ, సి, డి


24. ‘వ్యక్తి స్వేచ్ఛ కంటే దేశ సార్వభౌమాధికారం గొప్పది’ అని పేర్కొంటూ నిర్బంధ చట్టాలను ఎవరు సమర్థించారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌        2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) మహాత్మా గాంధీ            4) మోతీలాల్‌ నెహ్రూ


25. ఆర్టికల్‌ 23 ప్రకారం కిందివాటిలో దేన్ని నిషేధించారు?

1) జోగిని, దేవదాసీ, మాతంగి లాంటి సాంఘిక దురాచారాలు

2) బానిసత్వం, వెట్టిచాకిరీ, ప్రతిఫలం చెల్లించకుండా నిర్బంధంగా పనిచేయించడం

3) మానవ అక్రమ రవాణా      4) పైవన్నీ


26. 14 ఏళ్ల వయసులోపు బాలబాలికలను ప్రమాదకరమైన పరిశ్రమల్లో నియమించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

1) ఆర్టికల్‌  22        2) ఆర్టికల్‌ 23

3) ఆర్టికల్‌ 24       4) ఆర్టికల్‌ 25

 


సమాధానాలు

1-1; 2-2; 3-4; 4-1; 5-4; 6-1; 7-3, 8-4; 9-2; 10-1; 11-1; 12-3; 13-4; 14-2; 15-1; 16-4; 17-4; 18-4; 19-1, 20-3; 21-3. 22-4, 23-2, 24-1, 25-4, 26-3.
 

=============================================================================================

బలవంతపు మతమార్పిడిపై నిషేధం సమంజసమే!


భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేందుకు కావాల్సిన హక్కులన్నీ ఇచ్చింది. చట్టం ముందు అంతా సమానమేనని నిర్దేశించింది. అయితే పిల్లలు, మహిళలు, అల్పసంఖ్యాక వర్గాలు, భాషాపరమైన మైనార్టీలకు ప్రత్యేక రక్షణలు కల్పించింది. ఇందుకనుగుణంగా ప్రభుత్వాలు చేసిన చట్టాలు, రాజ్యాంగ సవరణల  గురించి  పోటీపరీక్షార్థులు తెలుసుకోవాలి. అలాగే పౌరులకు ఉన్న హక్కులు అపరిమితమైనవి కాదు. వాటిపై సందర్భానుసారంగా సహేతుక  నిర్బంధాలు, పరిమితులూ ఉంటాయి. దేశంలో మత స్వాతంత్య్రానికి భంగం కలిగించిన, మతపరమైన ఉద్రిక్తతలు రేపిన సంఘటనలు, వాటిపై  ఏర్పాటైన కమిషన్లు, సంబంధిత చట్టాలు, ముఖ్యమైన కేసుల గురించి అవగాహన పెంచుకోవాలి. 

 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

1.    స్త్రీలు, బాలికలతో బలవంతంగా అవమానకరమైన పనులు చేయించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

1) ఆర్టికల్‌ 23       2) ఆర్టికల్‌ 24

3) ఆర్టికల్‌ 25      4) ఆర్టికల్‌ 26

 

2.     కింద పేర్కొన్న అంశాల్లో సరైంది?

a) గనుల చట్టం i) 1961
b) కర్మాగారాల చట్టం ii) 1948
c) వరకట్న నిషేధ చట్టం  iii) 1976
d) కనీస వేతనాల చట్టం  iv) 1952

1) a-iv, b-ii, c-i, d-iii   2) a-iv, b-ii, c-iii, d-i

3) a-ii, b-iv, c-i, d-iii    4) a-iv, b-iii, c-i, d-ii

 

3.     వివిధ చట్టాలు, అవి రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి సరైన జత?

ఎ) ఫ్యామిలీ కోర్టుల చట్టం i) 1955
బి) హిందూ వివాహ చట్టం ii) 1986
సి) గృహహింస నిరోధక చట్టం iii) 1984
డి) బాలకార్మిక నిషేధ చట్టం iv) 2005

 1) ఎ-iii,  బి-i,  సి-iv,  డి-ii     2) ఎ-ii,  బి-iv,  సి-i,  డి-iii 

3  ఎ-iii,  బి-i,  సి-ii,  డి-iv    4) ఎ-iv,  బి-ii,  సి-i,  డి-iii

 

4.     వివిధ చట్టాలు, అవి రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి సరైంది?

ఎ) ప్లాంటేషన్‌ కార్మికుల చట్టం - 1951   బి) మనుషుల అక్రమ వ్యాపార నిషేధ చట్టం - 1956

సి) ప్రసూతి సౌకర్యాల చట్టం - 1961    బి) బాల కార్మికుల హక్కుల రక్షణ చట్టం - 2005

1) ఎ, బి, సి        2) ఎ, సి, డి

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, డి

 

5.     వివిధ చట్టాలు, అవి రూపొందిన సంవత్సరాలకు సంబంధించి సరికానిది?

1) వెట్టిచాకిరీ నిషేధ చట్టం - 1976

2) స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లింపు చట్టం - 1976

3) హిందూ దత్త స్వీకార నిర్వహణ చట్టం - 1956

4) బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం - 2001

 

6.     మానవుల అక్రమ రవాణా నియంత్రణకు భారత ప్రభుత్వం ‘ఉజ్వల’ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది?

1) 2005   2) 2006   3) 2007  4) 2010

 

7.     POCSO అంటే?

1) ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌

2) ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌

3) ప్రివెన్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌హుడ్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌

4) ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫియర్‌లెస్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌

 

8.     పాఠశాలల్లో విద్యార్థులను శిక్షించడం పీడనం కిందకు వస్తుందని 2004లో తీర్పు ఇచ్చిన న్యాయస్థానం ఏది?

1) సుప్రీంకోర్టు     2) అలహాబాద్‌ హైకోర్టు

3) దిల్లీ హైకోర్టు     4) బాంబే హైకోర్టు

 

9.    జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) ఈ కమిషన్‌ 2007లో ఏర్పాటైంది.

బి) ఇది పార్లమెంటు ఏర్పాటుచేసిన చట్టబద్ధమైన సంస్థ.

సి) దీనిలో ఒక ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఉంటారు.

డి) ఈ కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌ శాంతా సిన్హా.

1) ఎ, సి, డి      2) ఎ, బి, సి, డి  

3) ఎ, బి, సి      4) ఎ, బి, డి

 

10. నిర్భయ చట్టం (నేర న్యాయ సవరణ చట్టం) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 2013, ఫిబ్రవరి 3    2) 2013, అక్టోబరు 16

3) 2013, డిసెంబరు 16    4) 2014, ఫిబ్రవరి 3

 

11. నిర్భయ చట్టం ప్రకారం నేరంగా పరిగణించే అంశాన్ని గుర్తించండి.

ఎ) 18 ఏళ్లలోపు బాలికలతో వారి అనుమతి ప్రకారం లైంగిక చర్య జరపడం.

బి) 18 ఏళ్లలోపు బాలికలతో వారి అనుమతి లేకుండా లైంగిక చర్య జరపడం.

సి) సామూహిక అత్యాచారాలకు పాల్పడిన వారికి 20 ఏళ్ల జైలుశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష.

డి) మహిళలను వెంటబడి వేధించడం.

1) ఎ, బి, సి       2) ఎ, బి, సి, డి   

3) ఎ, సి, డి       4) ఎ, బి, డి 

 

12. ఏ కమిషన్‌ సిఫార్సుల మేరకు నిర్భయ చట్టాన్ని రూపొందించారు?

1) ఎ.ఎస్‌.ఆనంద్‌ కమిషన్ 2) రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌

3) జె.ఎస్‌.వర్మ కమిషన్‌   4) ఎస్‌.హెచ్‌.కపాడియా కమిషన్‌

 

13. సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎట్‌ వర్క్‌ ప్లేస్‌ చట్టం - 2013కు సంబంధించి సరైంది?

ఎ) ఈ చట్టాన్ని రూపొందించడానికి విశాఖ స్వచ్ఛంద సంస్థ VS ఆఫ్‌ రాజస్థాన్‌ కేసు స్ఫూర్తినిచ్చింది.

బి) దీని ప్రకారం పనిచేసే ప్రదేశాల్లో ‘లోకల్‌ కంప్లయింట్స్‌ కమిటీ’ (LCC) ని ఏర్పాటు చేయాలి.

సి) దీని ప్రకారం పనిచేసే ప్రదేశాల్లో ‘ఇంటర్నల్‌ కంప్లయింట్స్‌ కమిటీ’ (ICC)ని ఏర్పాటు చేయాలి.

డి) వేధింపులకు సంబంధించి 3 నెలల్లోపు బాధితులు ఫిర్యాదు చేయాలి.

1) ఎ, బి, సి, డి       2) ఎ, బి, డి   

3) ఎ, బి, సి        4) ఎ, సి, డి

 

14. బాలకార్మికుల హక్కుల సంరక్షణపై అధ్యయనం కోసం 2004లో ఎవరి అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు?

1) ఇంద్రజిత్‌ గుప్తా     2) ప్రణబ్‌ ముఖర్జీ

3) అశుతోష్‌ బంధోపాధ్యాయ  4) ఎం.ఎస్‌.గురుపాద స్వామి

 

15. 14 ఏళ్లలోపు బాలబాలికలను పనుల కోసం నియమించుకున్న యజమానులపై కేసు నమోదు చేసి రూ.20,000 చొప్పున జరిమానా విధించి, ఆ సొమ్ముతో బాలకార్మిక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

1) ఎం.సి.మెహతా Vs స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు కేసు

2) నవీన్‌ జిందాల్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) కిసాన్‌ ముక్తిమోర్చా Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) అరుంధతీ రాయ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు

 

16. మత స్వాతంత్య్రపు హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) ఆర్టికల్‌ 25(1) - ప్రతి భారతీయుడు తన అంతరాత్మకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.

బి) ఆర్టికల్‌ 25(2)(A) - మత సంబంధిత ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను కొనసాగించే అంశంపై ప్రభుత్వం పరిమితులు విధిస్తూ చట్టాలు రూపొందించవచ్చు.

సి) ఆర్టికల్‌ 25(2)(B) - హిందూ మత సంబంధమైన తరగతులు అంటే జైనులు, సిక్కులు, బౌద్ధులు.

డి) సిక్కులు తమ మత సంప్రదాయంలో భాగంగా కృపాణ్‌ను ధరించవచ్చు.

1) ఎ, బి, సి           2) ఎ, సి, డి   

3) ఎ, బి, సి, డి            4) ఎ, బి, డి

 

17. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరైంది?

ఎ) భారతీయులు మత ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు.

బి) భారతీయులు మత కార్యకలాపాలను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు.

సి) భారతీయులు మత సంస్థలకు సంబంధించిన స్థిర, చరాస్తులను నిర్వహించుకోవచ్చు.

డి) దేశ శ్రేయస్సు రీత్యా మత స్వాతంత్య్రంపై ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు.

1) ఎ, బి, సి, డి         2) ఎ, సి, డి

3) ఎ, బి, డి         4) ఎ, బి, సి

 

18. మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

1) ఆర్టికల్‌ 25        2) ఆర్టికల్‌ 26    

3) ఆర్టికల్‌ 27       4) ఆర్టికల్‌ 28

 

19. కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది?

1) ఆర్టికల్‌ 28(1) - ప్రభుత్వ విద్యాసంస్థల్లో మత బోధన నిషేధం.

2) ఆర్టికల్‌ 28(2) - స్వచ్ఛంద, ధర్మాదాయ ట్రస్టుల ఆధ్యర్యంలో నిర్వహించే విద్యాసంస్థల్లో మత బోధన చేయవచ్చు.

3) బలవంతపు మత మార్పిడులు నిషేధిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం ఒడిశా (1967).

4) ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేసుకునేందుకు కలకత్తా హైకోర్టు అనుమతించింది.

 

20. బలవంతపు మతమార్పిడులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు రూపొందించడం సమంజసమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది?

1) ఎస్‌.పి.మిట్టల్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) స్టానిలెస్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ కేసు

3) ఇస్మాయిల్‌ జాదూ Vs స్టేట్‌ ఆఫ్‌ ఒడిశా కేసు

4) డేనియల్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

 

21. వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల శంకుస్థాపనల సమయంలో ప్రభుత్వాలు కొనసాగించే ఆచారాలు లౌకికవాదానికి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది?

1) భారత నాస్తిక సమాజం Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసు

2) రతీనాం Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు

3) అఖిల యూనియన్‌ ఆఫ్‌ దేవాస్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) ఇక్బాల్‌ సింగ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

 

22. బక్రీద్‌కి ఆవును వధించడం ఇస్లాం ఆచారం కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25s2z(A) కింద దాన్ని నిషేధించడం సమంజసమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

1) అజీజ్‌ బాషా Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) మహ్మద్‌ ఇమాం Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) మహ్మాద్‌ హనీఫ్‌ ఖురేషి Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసు

4) కామన్‌కాజ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

 

23. కింద పేర్కొన్న వాటిలో సరైంది.

ఎ) 1984లో దిల్లీలో సిక్కులపై దాడులు జరిగాయి.

బి) 1925లో శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ ఏర్పడింది.

సి) 1985లో భారత్‌ - శ్రీలంక దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది.

డి) 1961లో జాతీయ సమగ్రతా మండలి ఏర్పడింది.

1) ఎ, బి, సి, డి     2) ఎ, బి, డి  

 3) ఎ, బి, సి             4) ఎ, సి, డి

 

24. నానావతి కమిషన్‌ దర్యాప్తు ప్రకారం ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఘర్షణల్లో ఎంతమంది మరణించారు?

1) 2,733  2) 3,733  3) 4,666  4) 3,999

 

 

సమాధానాలు

1-1; 2-1; 3-1; 4-3; 5-4; 6-3; 7-1; 8-3; 9-2; 10-1; 11-2; 12-3; 13-1; 14-4; 15-1; 16-3; 17-1; 18-3; 19-4; 20-2; 21-1; 22-3; 23-2; 24-1.

 


 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

=============================================================================================

 

నదులకూ ఉంటుంది జీవించే హక్కు!

 

ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛకు, గౌరవప్రద జీవనానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచాలు ప్రాథమిక హక్కులు. ప్రత్యేక సందర్భాల్లో వీటిపై సహేతుక ఆంక్షలను విధిస్తుంటారు. మరి కొన్నిసార్లు శాంతిభద్రతలు, దేశ సమగ్రత పేరుతో ప్రభుత్వాలు కఠినమైన, నిర్బంధ చట్టాలను చేస్తుంటాయి.  అవి రాజ్యాంగ మౌలిక లక్షణాలకు విరుద్ధంగా ఉంటే కోర్టులు అడ్డుకుంటాయి. ప్రాథమిక హక్కుల అమలులో ఎదురయ్యే ఈ వ్యవస్థాగత సంఘర్షణను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఆ మౌలిక హక్కుల ఉద్దేశాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న చట్టాలు, వాటిని హరించే విధంగా వచ్చే నిర్బంధ విధానాలు, అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు ఆక్షేపణలు, సంబంధిత కేసుల గురించి సమగ్ర అవగాహన పెంచుకోవాలి.

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.    ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం-2009లోని అంశాలకు సంబంధించి సరైంది?

ఎ) ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 5 తరగతులు

బి) ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతులు

సి) 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారందరూ అర్హులు

డి) ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1 : 30

1) ఎ, బి, సి, డి    2) బి, సి, డి

3) ఎ, బి, డి       4) ఎ, సి, డి


2.     ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం అన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఎంత శాతం సీట్లు తప్పనిసరిగా కేటాయించాలి?

1) 10%   2) 15%  3) 20%  4) 25%


3.     అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్‌ 21(A)ను చేర్చారు?

1) 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001      2) 85వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001

3) 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002     4) 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003


4.     రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరైంది?

ఎ) కారణం లేకుండా వ్యక్తులను అరెస్ట్‌ చేయరాదు.

బి) అరెస్ట్‌ అయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలి.

సి) అరెస్ట్‌ అయిన వ్యక్తి న్యాయవాదిని సంప్రదించడానికి అవకాశం కల్పించాలి.

డి) పీడీ చట్టం ప్రకారం అరెస్ట్‌ అయిన వారికి దానికి కారణాన్ని తెలియజేయాలి.

1) ఎ, బి, సి        2) ఎ, బి, డి

3) ఎ, బి, సి, డి      4) ఎ, సి, డి


5.     కిందివాటిలో పీడీ చట్టాలకు సంబంధించి సరైంది?

ఎ) పీడీ చట్టాలకు సంబంధించిన శాసనాలను రూపొందించే సర్వాధికారం భారత పార్లమెంటుకు ఉంటుంది.

బి) పీడీ చట్టం ప్రకారం అరెస్ట్‌ అయిన వారికి కారణాన్ని తెలియజేయాల్సిన అవసరం లేదు.

సి) ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ అంటే ఒక వ్యక్తి నేరం చేస్తాడన్న అనుమానంతో ముందే నిర్బంధంలోకి తీసుకోవడం.

డి) పునిటివ్‌ డిటెన్షన్‌ చట్టం అంటే నేరం నిరూపితమైన తర్వాత సంబంధిత వ్యక్తిని నిర్బంధించడం.

1) ఎ, బి, సి, డి      2) ఎ, బి, సి  

3) ఎ, బి, డి         4) ఎ, సి, డి


6.     మోహినీ జైన్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసు (1992)లో సుప్రీంకోర్టు వెలువరించిన అంశాలకు సంబంధించి సరైంది?

ఎ) ఆర్టికల్‌ 21 ప్రకారం అన్ని స్థాయుల్లో విద్యార్జన హక్కు ప్రాథమిక హక్కుగా లభించాలి.

బి) విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం క్యాపిటేషన్‌ ఫీజును వసూలు చేయడం రాజ్యాంగ విరుద్ధం.

సి) విద్యాసంస్థల్లో ప్రవేశాల సమయంలో క్యాపిటేషన్‌ ఫీజును వసూలు చేయవచ్చు.

డి) విద్యార్జన హక్కును పౌరులకు నిరాకరించడం అంటే ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించడమే.

1) ఎ, బి, సి        2) ఎ, బి, డి   

3) ఎ, సి, డి        4) ఎ, బి, సి, డి 


7.     14 ఏళ్ల వరకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా అందించాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

ఎ) ఉన్ని కృష్ణన్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసు 

బి) అశోక్‌ కుమార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు

సి) మేధాపాట్కర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ కేసు

డి) అరుణా మిశ్రా Vs స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసు


8.     ఆత్మహత్య చేసుకోవడం ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?

1) జ్ఞానకౌర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు (1996)

2) దులావ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు (1996)

3) 1, 2

4) రతీనాం నాగభూషణ్‌ పట్నాయక్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1994)


9.     గంగా, యమునా నదులకు జీవించే హక్కు ఉందని 2017లో ఏ కోర్టు ప్రకటించింది?

1) ఉత్తరాఖండ్‌ హైకోర్టు  2) అలహాబాద్‌ హైకోర్టు 

3) దిల్లీ హైకోర్టు       4) హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు


10. ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా ముస్లిం భర్త తన భార్యకు విడాకులు ఇవ్వడం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు 2017లో ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

1) షకీలా భాను Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) సైరా భాను Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) బేగం అర్జాయత్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) సరళా ముద్గల్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు


11. మహిళలందరినీ వారి వయసుతో సంబంధం లేకుండా శబరిమలై ఆలయంలోకి అనుమతించాలని 2018లో సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

1) పుట్టుస్వామి Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) రమాదేవి Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు

3) ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు

4) పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు


12. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీలోని సెక్షన్‌ 377 రాజ్యాంగ విరుద్ధమని, వివాహేతర సంబంధం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

1) జోసెఫ్‌ షైన్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) వినోద్‌ బెనర్జీ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) రంజన్‌ సిన్హా Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) షంషేర్‌ సింగ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు


13. 1950లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ కాలంలో రూపొందించిన ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ (నివారక నిర్బంధ చట్టం)ను ఏ ప్రధాని కాలంలో రద్దు చేశారు?

1) 1969, ఇందిరాగాంధీ       2) 1977, మొరార్జీ దేశాయ్‌ 

3) 1985, రాజీవ్‌ గాంధీ       4) 1989, వి.పి.సింగ్‌


14. కింద పేర్కొన్న చట్టాలకు సంబంధించి సరైంది?

ఎ) మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (MISA) 

బి) టెరరిస్ట్స్‌ అండ్‌ డిస్క్రిప్టివ్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ (TADA)

సి) అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ (UAPA)

డి) ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజమ్‌ యాక్ట్‌ (POTA) 

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి, డి    4) ఎ, బి, డి 


15. COFEPOSA అంటే?

1) కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్మగ్లింగ్‌ యాక్టివిటీస్‌ యాక్ట్‌

2) కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్మాల్‌ యాఆక్టివిటీస్‌ యాక్ట్‌

3) కన్నింగ్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్మగ్లింగ్‌ యాక్టివిటీస్‌ యాక్ట్‌

4) కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్మగ్లింగ్‌ యాక్టివిటీస్‌ యాక్ట్‌


16. కిందివాటిలో వివిధ చట్టాలు, అవి రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి సరైంది?

a) అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌        i) 1971

b) మేంటెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌   ii) 1968

c) టెరరిస్ట్స్‌ అండ్‌ డిస్క్రిప్టివ్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌    iii) 1985

d) COFEPOSA                         iv) 1974

1) a-ii, b-iv, c-iii, d-i       2) a-ii, b-i, c-iii, d-iv

3) a-i, b-ii, c-iii, d-iv       4) a-iii, b-iv, c-i, d-ii


17. కిందివాటిలో TADA చట్టానికి సంబంధించి సరైంది?

ఎ) ఈ చట్టాన్ని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించారు.

బి) ఇది 1985, మే 23 నుంచి అమల్లోకి వచ్చింది.

సి) ఈ చట్టాన్ని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.

డి) దీన్ని పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1995లో రద్దు చేసింది.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి

3) ఎ, బి, డి    4) ఎ, బి, సి, డి 


18. ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజమ్‌ యాక్ట్‌ (POTA) చట్టాన్ని 2002లో అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం రూపొందించగా ఏ ప్రధాని కాలంలో రద్దు చేశారు?

1) ఐ.కె.గుజ్రాల్, 2007        

2) డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్, 2004

3) హెచ్‌.డి.దేవేగౌడ, 2011   

4) నరేంద్ర మోదీ, 2016


19. ESMA చట్టానికి సంబంధించి సరైంది?

ఎ) ESMA అంటే ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మేంటెనెన్స్‌ యాక్ట్‌.

బి) ఈ చట్టం 1968లో ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందింది.

సి) ఇది 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో నిర్దిష్ట రూపాన్ని పొందింది.

డి) ఈ చట్టాన్ని 1995లో పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో రద్దు చేశారు.

1) ఎ, బి, సి             2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి, డి        4) ఎ, బి, డి 


20. నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌కు సంబంధించి సరైంది?    

ఎ) ఈ చట్టాన్ని 1980లో ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించారు. 

బి) దీని ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్, పోలీస్‌ కమిషనర్‌ నిరోధక ఆజ్ఞలను జారీ చేయగలరు.

సి) ఈ చట్టం ప్రకారం జారీ చేసే నిరోధక ఆజ్ఞలు 12 రోజులు అమల్లో ఉంటాయి.

డి) దీని ప్రకారం జారీ చేసే నిరోధక ఆజ్ఞలను 12 రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలి.

1) ఎ, సి, డి         2) ఎ, బి, సి   

3) ఎ, బి, డి         4) ఎ, బి, సి, డి 


21. వివిధ కార్యాలయాలు/కర్మాగారాల్లో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా వెలువరించింది?

1) విశాఖ స్వచ్ఛంద సంస్థ Vs స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేసు, 1997

2) కరణ్‌ సింగ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు, 1963

3) కామన్‌ కాజ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 2018

4) పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1998



సమాధానాలు

1-2; 2-4; 3-3; 4-1; 5-1; 6-2; 7-1; 8-3; 9-1;  10-2; 11-3; 12-1; 13-1; 14-3; 15-1; 16-2; 17-4; 18-2; 19-1; 20-4; 21-1.

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 02-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కార్మికుల సంక్షేమం - చట్టాలు

కార్మికుల ఆవశ్యకత


ఏ దేశ ప్రగతినైనా నిర్దేశించే సత్తా కార్మిక వర్గానికి ఉంటుంది. దేశ విధానకర్తలు కార్మిక సంక్షేమాన్ని విస్మరించలేరు. కార్మికులకు సౌకర్యవంతమైన పనిగంటలు, పని వాతావరణం, వేతనాలు అందిస్తే వారు దేశ ప్రగతికి మరింత తోడ్పాటు అందిస్తారు. 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక కార్మికులు ఉన్న దేశంగా భారత్‌ అవతరిస్తుందని అంచనా.


రాజ్యాంగంలో - ప్రస్తావన


భారత రాజ్యాంగంలోని IV వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిక నియమాల్లో కార్మిక సంక్షేమం గురించి పేర్కొన్నారు.


* ఆర్టికల్‌ 39 (D): స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.


ఆర్టికల్‌ 39 (E): కార్మికులు వారి శారీరక దారుఢ్యానికి మించి పనిచేయకుండా చూడాలి.


* ఆర్టికల్‌ 42: కార్మికులకు పని ప్రదేశాల్లో గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించాలి. స్త్రీ కార్మికులకు తగిన ప్రసూతి సౌకర్యాలు అందించాలి.


* ఆర్టికల్‌ 43: కార్మికులకు కనీస వేతనం అందించాలి. కార్మికులకు విరామం, విశ్రాంతి, మానసిక వికాసాన్ని కల్పించేందుకు ప్రయత్నించాలి.


* ఆర్టికల్‌ 43(A): పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.


కార్మిక సంక్షేమ పథకాలు

అటల్‌ పెన్షన్‌ యోజన

* ఈ పథకాన్ని  కేంద్రం 2015లో ప్రారంభించింది. అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం దీని లక్ష్యం. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ దీన్ని నిర్వహిస్తోంది. ఏదైనా బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా కలిగి, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. కనీసం 20 ఏళ్లు ఈ పథకంలో కొనసాగాలి. 


60 ఏళ్లు నిండాక వారు డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.5000 వరకు నెలవారీ పెన్షన్‌ లభిస్తుంది.


ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన


* ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు. ఇది జీవిత బీమా పథకం. వార్షిక ప్రీమియం రూ.330. రూ.2 లక్షల బీమా కవరేజీ ఉంటుంది. బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా ఉండి, 18 సం. నుంచి 50 సం.లోపు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. దీన్ని ఏటా రెన్యువల్‌ చేసుకోవాలి. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్నవారు ఈ పథకంలో చేరితే, 55 సం.లు వచ్చేవరకు వార్షిక ప్రీమియం చెల్లిస్తే, బీమా సదుపాయం లభిస్తుంది.


స్వావలంబన్‌


దీన్ని 2010లో ప్రారంభించారు. అసంఘటిత రంగంలోని కార్మికుల్లో పొదుపు అలవాటును పెంపొందించడం దీని లక్ష్యం. ఈ పథకంలో చేరిన ప్రతి కార్మికుడికి కేంద్ర ప్రభుత్వం రూ. 1000 చొప్పున తన వాటాగా చెల్లిస్తుంది.


ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన


ఇది వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. 2015లో ప్రారంభించారు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. బ్యాంక్‌లో పొదుపు ఖాతా కలిగి, 18 - 70 ఏళ్ల మధ్య వయసు వారు దీనికి అర్హులు. 


పాలసీదారు ఏదైనా ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.2 లక్షల పరిహారం నామినీకి లభిస్తుంది.


అసంఘటిత రంగ వాటా పెరుగుదల


మనదేశ ఉపాధిరంగంలో అసంఘటిత రంగ కార్మికుల వాటా 1977-78 నాటికి 92.2 శాతంగా ఉంది. అప్పటికి ఇంకా ప్రపంచీకరణ ప్రభావం మొదలుకాలేదు. National Commission for Enterprises in the Unorganised Sector - NCEUS అధ్యయనం ప్రకారం, వ్యక్తులు లేదా కుటుంబాల యాజమాన్యంలో లేదా భాగస్వామ్యంలో ఉండి, ఉత్పత్తి, అమ్మకాల్లో నిమగ్నమై పదికంటే తక్కువ మందితో పనిచేసే సంస్థలన్నీ అసంఘటిత సంస్థలే.


E-Shram Card

అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రతను కల్పించడంతోపాటు సంఘటిత రంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం 'E-Shram Portale’ను ప్రారంభించింది. దీని ద్వారా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వారికి అందిస్తారు. దీని కోసం కార్మికులకు (E-Shram Cards)ను ఇస్తారు. 


ప్రయోజనాలు: - దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందొచ్చు.


* ప్రతి కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. పూర్తి అంగవైకల్యానికి గురైతే రూ.2 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం అందిస్తారు.


అసంఘటిత రంగంలో పనిచేసే 16 - 59 ఏళ్ల వయసు వారు E-Shram Card కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఉచితం. 


ఈ కార్డుదారులకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన, స్వయం ఉపాధి కోసం జాతీయ పెన్షన్‌ పథకం, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రజాపంపిణీ వ్యవస్థ, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి ప్రయోజనాలు పొందొచ్చు.


కార్మిక చట్టాలు


కర్మాగారాల చట్టం, 1948


ఈ చట్టం ప్రకారం, సంస్థ ప్రతి 150 మంది కార్మికులకు ఒక ప్రథమ చికిత్స పేటిక (బాక్స్‌)ను, 500 మందికి మించి కార్మికులు ఉంటే, అంబులెన్స్‌ సౌకర్యాన్ని కల్పించాలి. 


కార్మికులకు విశ్రాంతి గదులు, భోజనశాలను ఏర్పాటు చేయాలి. 500 కంటే ఎక్కువ కార్మికులు ఉంటే వారి యోగక్షేమాల పర్యవేక్షణకు ఒక సంక్షేమ అధికారిని నియమించాలి. 30 మందికి మించి మహిళా కార్మికులు పనిచేస్తుంటే శిశు సంరక్షణా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. 250 మందికి మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ కల్పించాలి.
 

ప్లాంటేషన్‌ కార్మికుల చట్టం, 1951

ఈ చట్టం ప్రకారం, 300 లేదా అంతకంటే ఎక్కువ కార్మికులు పనిచేస్తుంటే, వారి సంక్షేమ పర్యవేక్షణకు ఒక సంక్షేమ అధికారిని నియమించాలి. కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య, వినోద సౌకర్యాలను కల్పించాలి. మహిళా కార్మికులకు ‘ప్రసూతి భత్యాన్ని’ ఇవ్వాలి. 150 మంది లేదా అంతకు మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ కల్పించాలి.


గనుల చట్టం, 1952


ఈ చట్టం ప్రకారం, గనుల్లో పనికోసం బాలబాలికలను కార్మికులుగా నియమించకూడదు. 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మహిళా కార్మికులు ఉంటే తప్పనిసరిగా ‘శిశు సంరక్షణా కార్యాలయాన్ని’ ఏర్పాటు చేయాలి. 500 లేదా అంతకు మించి కార్మికులు ఉంటే వారికి భోజనశాల, విశ్రాంతి గదుల సౌకర్యాన్ని కల్పించాలి. 250 మంది లేదా అంతకు మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ అందించాలి. 150 మంది కార్మికులు ఉంటే వారికి ప్రథమ చికిత్స పేటికలు అందుబాటులో ఉంచాలి.


బోనస్‌ చెల్లింపు చట్టం, 1965


యాజమాన్యం కార్మికులకు వేతనాలతో పాటు అదనంగా చెల్లించే ఆర్థిక ప్రయోజనమే ‘బోనస్‌’. దీని ద్వారా కార్మికులకు అదనపు ఆర్థిక ప్రతిఫలం లభిస్తుంది. సంస్థ లాభ-నష్టాలతో సంబంధం లేకుండా బోనస్‌ను చెల్లించాలి. పరిశ్రమలు, కంపెనీల యాజమాన్యంపై బోనస్‌ చెల్లించాల్సిన చట్టపరమైన బాధ్యత ఉంది. ప్రతి యజమాని తన సంస్థలో పనిచేసే కార్మికుడికి సంవత్సరంలో తను సంపాదించుకునే వేతనంలో 8.33% ఆర్థిక వనరును కనీస బోనస్‌గా చెల్లించాలి.


అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1979


ఈ చట్టం ప్రకారం, వివిధ రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికులకు చట్టపరమైన రక్షణ, సదుపాయాలను కల్పించాలి. కార్మికులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలి. వారికి సరైన పని పరిస్థితులను, నివాస వసతి కల్పించాలి.


మోటార్‌ రవాణా కార్మిక చట్టం, 1961


ఈ చట్టం ప్రకారం, రవాణా వాహనంలో తప్పనిసరిగా ప్రథమ చికిత్స పెట్టెను (First Aid Box) ను ఉంచాలి.


ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన


దీన్ని 2015లో ప్రారంభించారు. దీని ద్వారా 20కి పైగా కేంద్ర మంత్రిత్వశాఖలు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ, కార్మికులను ఉన్నత స్థితిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. 


నూతన వ్యాపారాలను ప్రారంభించడాన్ని మరింత సులభతరం చేస్తూ భారత్‌లో తయారీ, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌ అభియాన్‌ లాంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా కార్మికులకు వివిధ రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. 


స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, ముద్ర లాంటి పథకాలతో కార్మికుల్లో సృజనాత్మక ఆలోచనాధోరణులను పెంపొందించి, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.


బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, 1986


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 24 ప్రకారం మన దేశంలో బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు. దీని ద్వారా 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలను కర్మాగారాల్లో, గనుల్లో పనుల కోసం నియమించకూడదని నిర్దేశించారు.


బాల కార్మిక నిషేధ చట్టం, 1986 ప్రకారం బాలలు అంటే 14 ఏళ్లలోపు వయసువారు. 


ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం 13 వృత్తులు, 57 ప్రక్రియల్లో  పనుల కోసం పిల్లలను ఉపయోగించడం నేరం.


ఈ చట్టంలోని సెక్షన్‌ 3లో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించి ఏ వ్యక్తి అయినా బాలలను పనుల కోసం ఉపయోగిస్తే సంబంధిత వ్యక్తికి 3 నెలలకు తక్కువ కాకుండా ఒక సంవత్సరం వరకు జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు.


బాల కార్మిక వ్యవస్థ నిషేధ సవరణ చట్టం, 2016


కేంద్ర ప్రభుత్వం బాల కార్మికుల నిషేధ సవరణ చట్టాన్ని 2016లో రూపొందించింది. ఇందులోని అంశాలు 2016, సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం, 18 ఏళ్లలోపు కౌమార దశలో ఉన్న పిల్లలను ప్రమాదకర పనుల్లో నియమిస్తే సంబంధిత యజమానులకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారు.


ఈ చట్టం ప్రకారం, కార్మిక - ఉపాధి మంత్రిత్వశాఖ జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్‌ (NCLP) పథకాన్ని అమలుచేస్తోంది. ఇందులో ప్రతి జిల్లాకు ఒక సొసైటీ ఉంటుంది. వీటిని జిల్లా ప్రాజెక్ట్‌ సొసైటీలు అంటారు. ఇవి బాల కార్మికులకు పునరావాసం కల్పిస్తాయి. వీటికి జిల్లా మెజిస్ట్రేట్‌ అధ్యక్షత వహిస్తారు.


రచయిత 

బంగారు సత్యనారాయణ విషయ నిపుణులు 

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రజాస్వామ్యం - అర్థవివరణ

 ప్రజలే పాలకులు.. పాలితులు! 

ప్రస్తుత ప్రపంచంలో అత్యధికులు ఆమోదించి, ఆచరిస్తున్న ప్రభుత్వ ఏర్పాటు విధానమే ప్రజాస్వామ్యం. ఈ భావనే ఆధునిక, నైతిక, ఆదర్శవంతమైన, మహోన్నత జీవనశైలిగా మారింది. అందరూ సమానం, అందరికీ స్వాతంత్య్రం అనేవి ఇందులో ప్రధాన నియమాలు. ఇక్కడ పాలకులు, పాలితులు ప్రజలే. నిర్ణయాధికారం వారికే ఉంటుంది. ప్రజాస్వామ్యం ఆవిర్భావం, అర్థ వివరణ, మూలాలు, మౌలిక లక్షణాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన అవసరం. స్వేచ్ఛ, మానవ హక్కులకు ప్రాధాన్యం కోణంలో ఇతర పాలనా విధానాలకంటే ప్రజాస్వామ్యం ఎందుకు మెరుగైనదో స్పష్టమైన అవగాహనతో ఉండాలి.


ప్రజాస్వామ్యంలో అధికసంఖ్యాక ప్రజలకు అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది. ఇది రాజకీయ ఆదర్శాలు, ఆర్థిక విధానాలు, సామాజిక వాడుకలు, నైతిక నియమాలతో కూడిన ప్రభుత్వ సముదాయం. ఆధునిక ప్రభుత్వాలను 1) ప్రజాస్వామ్యం 2) నియంతృత్వం అని రెండు ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజల స్వాతంత్య్రం, సమానత్వం, న్యాయాలకు హామీ ఉంటుంది.


ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో 'Democracy' అంటారు. ఇది 'Demos, 'Kratos' అనే రెండు గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది. 'Demos' అంటే ప్రజలు, 'Kratos' అంటే అధికారం/పాలన అని అర్థం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు అధికారం ఉండటం. గ్రీకు పౌరులు మొదటిసారిగా నగర రాజ్యానికి సంబంధించిన వివిధ చట్టాలపై ప్రత్యక్షంగా ఓటు వేశారు. ప్రజాస్వామ్య ఆవిర్భావం అనేది ప్రథమంగా ఏథెన్స్‌ (గ్రీసు) అసెంబ్లీతో ముడిపడి ఉంది.


ప్రజాస్వామ్యం-వివిధ దృక్కోణాలు: ప్రజాస్వామ్యాన్ని పలు దృక్కోణాల్లో పేర్కొనవచ్చు. రాజకీయ కోణంలో ప్రజాస్వామ్యమంటే ప్రభుత్వంలో ప్రతిఒక్కరికీ భాగస్వామ్యం కల్పించడంగా భావించవచ్చు. ఆర్థిక కోణంలో ప్రజాస్వామ్యమంటే దోపిడీని నిషేధించడం. సాంఘిక కోణంలో ప్రజాస్వామ్యమనేది వ్యక్తుల మధ్య కులం, వర్ణం, పుట్టుక, మతం, భాష లాంటి అంశాల ప్రాతిపదికపై అన్ని వివక్షలను నిర్మూలించడం.

 

ప్రముఖుల అభిప్రాయాలు

* ‘ప్రతిఒక్కరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.’ - జె.ఆర్‌.సీలీ

* ‘ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం.’ - అబ్రహాం లింకన్‌

* ‘ప్రజాస్వామ్యం అనేది వక్రబుద్ధి ఉండే అనేకుల పాలన.’ - అరిస్టాటిల్‌

* ‘పాలనా అధికారం సమాజంలో ఏ ఒక్క ప్రత్యేక వర్గానికి కాకుండా అన్ని వర్గాలకు చెంది ఉండే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.’ - లార్డ్‌ బ్రైస్‌

 

 

ప్రజాస్వామ్యం వికాసం: సాంస్కృతిక పునరుజ్జీవనం, మత సంస్కరణలనేవి వర్తమాన పాశ్చాత్య దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థకు అవకాశం కల్పించాయి. ఇంగ్లండ్‌లో 1215లో వెలువడిన Magna carta' (హక్కుల ప్రకటన) ద్వారా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను వివరించారు. ఇంగ్లండ్‌లో సంభవించిన 'Glorious Revolution' (మహావిప్లవం) పాలకుల అపరిమిత అధికారాలను తగ్గించింది. అమెరికా స్వాతంత్య్ర పోరాటం, ఫ్రెంచ్‌ విప్లవం మానవ హక్కులకు ప్రాధాన్యాన్ని ఇస్తూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి భావాల వ్యాప్తికి తోడ్పడ్డాయి.


* 17వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో ప్రజాస్వామ్య సంస్థలు పనిచేయడం ప్రారంభించాయి. నిరపేక్ష రాచరికాలు పతనమైన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వ భావాల గురించి జాన్‌లాక్, రూసో, థామస్‌ పెయిన్‌ లాంటి మేధావులు తమ రచనల్లో పేర్కొన్నారు.


​​*1970 దశకంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 1980 దశకం ద్వితీయార్ధంలో యూరప్‌లోని దక్షిణ, మధ్య, ప్రాచ్య దేశాల్లో ప్రాతినిధ్య అంశాలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని అనుసరించారు.


* లాటిన్‌ అమెరికా, ఆగ్నేయాసియా, తైవాన్, దక్షిణ కొరియా, ఆఫ్రికన్‌ దేశాలైన లెబనాన్, పాలస్తీనా లాంటివి 1900, 2000 దశకాల్లో ఉదారవాద ప్రజాస్వామ్యం వైపు పయనించాయి.


* ‘ఫ్రీడమ్‌ హౌజ్‌’ అనే సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 1900 సంవత్సరం నాటికి వయోజన ఓటు హక్కును ఇచ్చిన దేశం ఒక్కటీ లేదు. కానీ 2000 నాటికి ప్రపంచంలోని 192 రాజ్యాల్లో 120 రాజ్యాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించాయని ఆ సంస్థ విశ్లేషించింది.


ప్రజాస్వామ్యం-లక్షణాలు


ఎన్నికలు: రాజ్యాంగ సూత్రాల ప్రకారం ప్రజాస్వామ్యం నిర్ణీత సమయంలో ఎన్నికల నిర్వహణకు వీలు కల్పిస్తుంది. ప్రజాస్వామ్యం, ఎన్నికలు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. అర్హత ఉన్న వయోజన పౌరులు వివిధ ప్రాతినిధ్య సంస్థలకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న పౌరులు దాన్ని సువర్ణావకాశంగా పరిగణించి స్వార్థబుద్ధి, సంకుచిత మనస్తత్వం ఉన్న నాయకులను తిరస్కరించి, సమర్థత, నిజాయతీ ఉండే వారిని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకుంటారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఓటును వజ్రాయుధంగా మలచుకుంటారు.


ప్రజల భాగస్వామ్యం: ప్రజాస్వామ్యంలో పాలకులు, పాలితులు ప్రజలే. ప్రజాస్వామ్యం అనేది ప్రజలు నిర్వహించే ప్రభుత్వం. ఓటర్లతో పాటు వారి ప్రతినిధులు ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తారు. చట్టసభల్లో ప్రజల సంక్షేమం కోసం అత్యున్నత శాసనాలను రూపొందిస్తారు.


జవాబుదారీతనం: ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉంటుంది. ప్రభుత్వం తక్షణమే శాసన వ్యవస్థకు, అంతిమంగా ఓటర్లకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికారాన్ని చేపట్టిన వ్యక్తులు అధికార బాధ్యతలను ఎంతో జాగ్రత్తగా, సంయమనం, విశ్వసనీయతతో నిర్వహిస్తారు. ప్రజల విశ్వాసం ఉన్నంత వరకు ప్రభుత్వం కొనసాగుతుంది. లేకపోతే ప్రజల ఆగ్రహం, అసహనాలకు గురై పతనమవుతుంది.


వ్యక్తి హుందాతనం: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం వ్యక్తుల హుందాతనాన్ని గౌరవిస్తుంది. సుదూర ప్రాంతాలు, మారుమూల ప్రదేశాల్లో నివసించే సామాన్య వ్యక్తులు కూడా తమ అభిప్రాయాల వ్యక్తీకరణలో ప్రత్యేకమైన అవకాశాలను పొందగలుగుతారు. వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాధాన్యం ఇస్తారు.


ప్రజల నియంత్రణ: ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవహారాల్లో ప్రజల నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలను నియంత్రించడంలో అనేక విధానాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను వెలువరిస్తారు. ప్రభుత్వం అనుసరించే అభిలషణీయ, సంక్షేమ ఆధారిత కార్యక్రమాలకు వారు మద్దతు ఇస్తారు. అదే సమయంలో రాజ్యాంగ విరుద్ధమైన శాసన చర్యలను ఎలాంటి సంకోచం లేకుండా వ్యతిరేకిస్తారు. ప్రజాభీష్టాన్ని విస్మరించే లేదా అతిక్రమించే నాయకులను అధికారానికి దూరంగా పెడతారు.


సమానత్వం: ప్రజాస్వామ్యం సమానత్వ భావనలపై ఆధారపడి కొనసాగుతుంది. ప్రజాస్వామ్య ముఖ్య నిబంధనే సమానత్వం. ప్రజలకు కుల, మత, జాతి, లింగ, ప్రాంత, అక్షరాస్య, నిరక్షరాస్య, ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తారు. ఓటు హక్కు, విద్యను పొందే హక్కు, ప్రభుత్వ పథకాలను పొందే హక్కు అర్హులందరికీ సమానంగా కల్పిస్తారు.


ప్రాథమిక స్వేచ్ఛ: ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాథమిక స్వేచ్ఛ ఉంటుంది. పౌర, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాల్లో ఈ స్వేచ్ఛను పొందుతారు. రాజ్యాంగంలో ప్రాథమిక స్వేచ్ఛను పొందుపరచడం ద్వారా ప్రజలు దాన్ని అనుభవించేందుకు తగిన హామీ ఉంటుంది.


స్వతంత్య్ర న్యాయవ్యవస్థ: ప్రజాస్వామ్యంలో మరో కీలక లక్షణం స్వతంత్య్ర న్యాయవ్యవస్థ. అమెరికా, ఇండియా లాంటి దేశాల్లో న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తితో అవసరమైన సందర్భాల్లో ‘న్యాయ సమీక్ష’ను వినియోగిస్తుంది. దీనిద్వారా రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను న్యాయవ్యవస్థ రద్దు చేస్తుంది. ప్రజల స్వేచ్ఛ సంరక్షణకు న్యాయవ్యవస్థ కాపలాదారు (వాచ్‌ డాగ్‌) పాత్ర పోషిస్తుంది.


రిట్స్‌ జారీ: ప్రజల ప్రాథమిక స్వేచ్ఛా సంరక్షణకు న్యాయవ్యవస్థ రిట్స్‌ను జారీ చేస్తుంది. భారతదేశంలో సుప్రీంకోర్టు ఆర్టికల్‌-32 ప్రకారం, హైకోర్టులు ఆర్టికల్‌-226 ప్రకారం అయిదు రకాల రిట్స్‌ జారీ చేస్తాయి. అవి 

1) హెబియస్‌ కార్పస్‌  

2) మాండమస్‌ 

3) ప్రొహిబిషన్‌  

4) సెర్షియోరరి  

5) కోవారెంటో

* ఆర్టికల్‌ 39(ఎ) ప్రకారం భారతదేశంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని పొందే హక్కుంది.


స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ:  ప్రజాస్వామ్యంలో నిర్ణీత పదవీ కాలానికి ప్రజాప్రతినిధుల ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల సంఘం ఇందులో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఎన్నికలను స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.


ఉదా: ఆర్టికల్, 324 ప్రకారం ఏర్పడిన భారత ఎన్నికల సంఘం.


రాజకీయ పార్టీలు: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకపాత్ర వహిస్తూ, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవి ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి. ప్రజల అభిమానాన్ని పొందడానికి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తాయి. తద్వారా తమ పార్టీ అధికారం చేపడితే ప్రజలకు ఏంచేయబోతున్నాయో హామీలు ఇస్తాయి. అధిక మెజార్టీ పొందిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

 


ప్రజాస్వామ్యం - ప్రాధాన్యం


ప్రజాస్వామ్యంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. ఎందుకంటే సామాన్యుల్లో అతి సామాన్యులు, పేదల్లో నిరుపేదలు కూడా ఉన్నత పదవుల్లోని పాలకులు, అధికారుల గౌరవాన్ని అందుకుంటారు. ఉన్నత స్థానాల్లో అధికారం చెలాయించే రాజకీయ నేతలు, పరిపాలనా అధిపతులు, శాసనసభ్యులు అందరూ సామాన్య పౌరుల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ప్రజాస్వామ్యం వివక్ష లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తుంది.


* ప్రబలమైన రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక ఒత్తిళ్లు ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం శాంతియుత, రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలను అందిస్తుంది.


* ప్రజాస్వామ్యంలో అసమ్మతివాదులు, వ్యతిరేకులు, విరుద్ధభావాలున్న వారికి కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియలో సంప్రదింపులు, సఖ్యత, రాజీ, ఏకాభిప్రాయం లాంటివి కీలకంగా ఉంటాయి.

 

 


రచయిత: బంగారు సత్యనారాయణ


 

 

Posted Date : 22-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రజాస్వామ్యం - రకాలు

 ప్రజల ఆకాంక్షలకే పట్టం! 

పాలనా వ్యవస్థల్లో అత్యుత్తమంగా నిలిచిన ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, పాలితులు. పరిపాలనా నిర్ణయాలను, చట్టాలను స్వయంగా రూపొందించుకొని అమలు చేసుకుంటూ, తమను తామే పాలించుకుంటారు. అయితే సమాజ స్వరూపాలు, పాటించే విలువల ఆధారంగా ప్రజాస్వామ్యంలోనూ స్వపరిపాలన, పరోక్ష పాలన అనే రకాలున్నాయి. వాటి ఆధారంగానే సార్వభౌమాధికారం, వాస్తవాధికారం చెలాయించే తీరు మారుతుంది. ఈ మౌలికాంశాలను పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి. ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్యాల్లోని కీలక భావనలు, ప్రయోజనాలు, అందుకు అవసరమైన సాధనాలు, పరిస్థితుల గురించి సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి.

ప్రజాస్వామ్యంలో అసమ్మతివాదులు, వ్యతిరేకులు, విరుద్ధ భావాలు ఉన్నవారికి కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియలో సంప్రదింపులు, ఏకాభిప్రాయం, సఖ్యత, రాజీ మొదలైన అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొని పరిపాలన సాగిస్తారు. ఈ ప్రజాస్వామ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..

 1) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం 

2) పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం


ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: ప్రజలు ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే ప్రభుత్వ పాలనా విధానమే ‘ప్రత్యక్ష ప్రజాస్వామ్యం’. ఇందులో శాసన సంబంధమైన అధికారాలన్నీ ప్రజలే చెలాయిస్తారు. రాజ్య వ్యవహారాల్లో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రాచీన కాలంలో గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టా, ఏథెన్స్‌లో అనుసరించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని స్విట్జర్లాండ్‌ దేశంలో కొనసాగిస్తున్నారు. ఒక ప్రదేశంలో పరిమిత సంఖ్యలో ప్రజలు నివసించే చిన్న దేశాలకు ఈ విధానం సరైంది. విస్తారమైన భౌగోళిక ప్రదేశం ఉన్న దేశాలు, అధిక జనాభా దేశాలకు అనుకూలం కాదు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు రకాలు  


1) ప్రజాభిప్రాయ సేకరణ(Referendum): ఏదైనా ఒక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రక్రియనే ‘ప్రజాభిప్రాయ సేకరణ’ అంటారు. శాసనసభ అప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించింది. ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల సార్వభౌమాధికారాన్ని బలపరుస్తుంది. మెజార్టీ పార్టీ నియంతృత్వం నుంచి రాజకీయ వ్యవస్థను పరిరక్షిస్తుంది. శాసన నిర్మాణంలో ప్రజలు తరచూ పాల్గొనేందుకు సహాయకారిగా ఉంటూ, శాసనసభ్యుల బాధ్యతను మరింత పెంచుతుంది. ప్రజాబాహుళ్య చట్టాలకు హామీ ఇస్తుంది. అయితే ఈ విధానం శాసనసభ్యుల హోదా, అధికారాలను బలహీనపరుస్తుందని కొందరి అభిప్రాయం. .


2) ప్రజాభిప్రాయ నివేదన: ప్రత్యక్ష ప్రజాస్వామ్య సమర్థకులు ‘ప్రజాభిప్రాయ నివేదన’ ఆవశ్యకతను గుర్తించారు. ఈ విధానం ప్రకారం కొంతమంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా కోరుతూ ఒక అర్జీపై సంతకాలు చేసి శాసనసభకు సమర్పిస్తారు. ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి పంపుతారు. మెజార్టీ ప్రజలు ఆమోదిస్తే, ఆ అంశం చట్టంగా మారి అమల్లోకి వస్తుంది. ప్రజాభిప్రాయ నివేదన ప్రజల్లో అవిధేయత/తిరుగుబాటు వంటి అంశాలను నిరోధించి, ప్రజలు వర్గాలుగా ఏర్పడి చట్టాలను ఆమోదించే ప్రమాదాన్ని తొలగిస్తుంది. ప్రజాసార్వభౌమత్వ భావనకు హామీ ఇస్తుంది.


3) పునరాయనం(Recall): ఈ విధానంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుక్కు పిలిచి, పదవి నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుంది. అంటే సరిగా పనిచేయని ప్రతినిధులను ప్రజలు తొలగించి, ప్రజలే సార్వభౌములుగా వ్యవహరిస్తారు.


4) ప్రజాభిప్రాయ నిర్ణయం(Plebiscite):ప్లెబిసైట్‌ అనే పదం లాటిన్‌ భాషలోని Plebis, Scitum అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. Plebis అంటే ప్రజలు, Scitum అంటే నిర్ణయం లేదా తీర్పు అని అర్థం. ఏదైనా ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోడానికి అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ‘ప్రజాభిప్రాయ నిర్ణయం’. ప్రజానిర్ణయానికి దైనందిన, చట్ట నిర్మాణ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రజా ప్రాముఖ్యత ఉన్న చట్టాన్ని రూపొందించడానికి ఈ విధానం తోడ్పడుతుంది. 1804లో ఫ్రాన్స్‌లో అప్పటికే అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు నెపోలియన్‌ మొదటిసారిగా ఈ విధానాన్ని వినియోగించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం ప్రకారం మొత్తం ప్రజానీకం లేదా ప్రజానీకంలోని ఒక వర్గం వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి పలు దేశాలు ఈ విధానాన్ని వినియోగించాయి.


పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం: ఆధునిక రాజ్యాలు సాధారణంగా జనాభాపరంగా, భౌగోళికంగా పెద్దవిగా ఉంటాయి. ఇలాంటి రాజ్యాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని ఊహించడం సాధ్యం కాదు. ఈ రాజ్యాల్లో ప్రభుత్వ పరిపాలన ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా కొనసాగుతుంది. ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పరోక్షంగా రాజ్యాభీష్టాన్ని రూపొందించి వ్యక్తీకరిస్తారు. సార్వభౌమాధికారం ప్రజలకే చెందుతుందని, ప్రజల ప్రతినిధులు ఆ సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తారనే సూత్రంపై ఆధారపడి పరోక్ష ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడంలో విఫలమైతే, వారిని ఎన్నికల సమయంలో ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించి తొలగిస్తారు. అందువల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు ధర్మకర్తలు (సంరక్షకులు)గా వ్యవహరిస్తూ ప్రజాభిప్రాయానికి విలువ ఇస్తారు.


పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా అని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో అధికారాలన్నీ ఒకే కార్యనిర్వాహక అధిపతి వినియోగించడమే కాకుండా, కార్యనిర్వాహక అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి.  


ఉదా: అమెరికా అధ్యక్షుడు


పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వర్గంలో నామమాత్రపు కార్యనిర్వాహక వర్గం, వాస్తవ కార్యనిర్వాహక వర్గం ఉంటాయి. ఇందులో దేశాధినేతకు కేవలం నామమాత్రపు కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు చెలాయిస్తుంది. ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి శాసన వ్యవస్థకు బాధ్యత వహించాలి. 


ఉదా: బ్రిటన్, ఇండియా, జపాన్‌

 

ప్రజాస్వామ్యం విజయానికి అవసరమైన పరిస్థితులు


* ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి పౌరులకు సరైన విద్య అవసరం. ప్రభుత్వ విధానాలను అంచనా వేయడంలో, సమీక్ష జరపడంలో విద్యావంతులైన పౌరులు కీలక పాత్ర పోషిస్తారు. విద్య అనేది ఓటర్లను చైతన్యపరచి, పలు విషయాలపై అవగాహనకు తోడ్పడి, సమర్థులైన నాయకుల ఎంపికకు తోడ్పడుతుంది.


* బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ప్రతిపక్షం వెలుగులోకి తీసుకొస్తుంది. అధికారపక్షం నియంతృత్వ పోకడలను కట్టడి చేసేందుకు తోడ్పడుతుంది.


* సాంఘిక సమానత్వం అనేది ప్రజాస్వామ్య విజయానికి కీలక అంశం. కులం, మతం, వర్గం, జాతి, లింగం వంటి వివక్షలతో సంబంధం లేకుండా అందరికీ సమానత్వం కల్పించడం వల్ల ప్రజాస్వామ్య పునాదులు బలోపేతం అవుతాయి.


* దేశంలో ఆర్థిక అసమానతలు లేనప్పుడు ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అందుకే పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఆర్థిక అసమానతలు లేని సమాజం అవసరం.


* వివేకవంతమైన నాయకత్వం ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. వివేకవంతులైన పాలకులు తమ పరిపాలనా దక్షత, రాజకీయ పరిజ్ఞానం, సామాజిక అంకితభావం వంటి లక్షణాలతో ప్రజాస్వామ్యాన్ని మహోన్నత స్థాయికి తీసుకెళతారు.


* సైన్యం పెత్తనం లేని దేశాల్లో ప్రజాస్వామ్యం బలపడుతుంది. సైనిక ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.


* స్వతంత్ర, నిష్పక్షపాత పత్రికా వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. పత్రికలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కచ్చితంగా, పక్షపాతరహితంగా ప్రజలకు తెలియజేయాలి. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడంలో, తద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయి.


* ప్రజాస్వామ్య విజయం అధికారాల వికేంద్రీకరణపై ఆధారపడి ఉంటుంది. స్థానిక సంస్థల ద్వారా ప్రజలు పాలనలో భాగస్వాములవుతారు. పౌరుల్లో కొందరు స్థానిక సంస్థల నిర్వహణలో తగిన శిక్షణ పొందగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి శిక్షణ ఇతర, ఉన్నత పదవులు చేపట్టేందుకు ఉపకరిస్తుంది.


* ప్రజాస్వామ్యంపై ప్రజలు విశ్వాసం ఉంచాలి. రాజ్యాంగ సూత్రాలు, చట్టబద్ధమైన పరిపాలన, పరస్పర చర్చలపై విశ్వాసం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.


ప్రజాస్వామ్యం-ప్రయోజనాలు:


* ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ సమయాల్లో, అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా కొనసాగించవచ్చు.


* ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నిక, ప్రజల నియంత్రణ, ప్రజలకు బాధ్యత అనే ప్రజాస్వామ్య సూత్రాలు గోచరిస్తాయి.


* వ్యక్తుల స్వేచ్ఛకు హామీ లభిస్తుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.


* ఒకే సమయంలో శాంతి, ప్రగతి ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతాయి.


* ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములుగా ఉంటారు.


* ఎలాంటి యుద్ధాలు, రక్తపాతం లేకుండా, ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాల మార్పు జరుగుతుంది.


* సామాన్యులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కావచ్చు.

 

 

రచయిత: బంగారు సత్యనారాయణ

 

 

Posted Date : 01-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ వివరణ

భారతీయుడు ఎప్పటికీ  భారతీయుడే!

 


ఒక వ్యక్తిని దేశ పౌరుడిగా చట్టబద్ధంగా గుర్తించడాన్నే పౌరసత్వం అంటారు. ఆధునిక రాజ్యాల అవతరణలో పౌరసత్వ భావనకు ప్రాధాన్యం పెరిగింది. పౌరసత్వం ఉన్నవారు దేశంలోని అన్నిరకాలైన హక్కులు, పదవులు పొందేందుకు అర్హులవుతారు. భారత రాజ్యాంగంలో వివరించిన పౌరసత్వ నిబంధనలు, పార్లమెంటు రూపొందించిన పౌరసత్వ చట్టాలు, పౌరసత్వాన్ని పొందే పద్ధతులు, కోల్పోయే సందర్భాలపై పోటీ పరీక్షార్థులు తగిన అవగాహన పెంపొందించుకోవాలి. 

మొదటిసారిగా పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యం ఇచ్చినవారు గ్రీకులు.  పరిపాలించేందుకు, పరిపాలనలో భాగమయ్యేందుకు అర్హత ఉన్నవారే పౌరులు. ఒక దేశంలోని ప్రజలను పౌరులు, విదేశీయులు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. రాజకీయ హక్కులు ఉండే వారిని పౌరులు అంటారు. రాజకీయ హక్కులు అంటే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి. పౌరులకు దేశంలో సంపూర్ణ పౌర స్థాయి ఉంటేనే, ఆ దేశంలో కల్పించే అన్ని రకాల హక్కులు పొందేందుకు అర్హత ఉంటుంది. దేశంలో ఉండే విదేశీయులకు ఆ విధమైన రాజకీయ హక్కులు లభించవు.

భారత రాజ్యాంగంలోని రెండో భాగంలో ఆర్టికల్‌ 5 నుంచి 11 మధ్య పౌరసత్వం గురించి పేర్కొన్నారు. పౌరసత్వం అంశం కేంద్ర జాబితాలో ఉంది. దేశం పరిపాలనాపరమైన సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం సాధించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు పౌరులందరికీ ఏక పౌరసత్వాన్ని నిర్దేశించారు. దీనిప్రకారం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులందరికీ ఏక పౌరసత్వం (భారత పౌరసత్వం) ఉంటుంది. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై చట్టాలను రూపొందించే సర్వాధికారం పార్లమెంటుకే ఉంటుంది. ఏక పౌరసత్వ భావనను బ్రిటన్‌ నుంచి గ్రహించారు.

ఆర్టికల్‌ 5: భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. భారత పౌరులుగా ఎవరిని పరిగణిస్తారనే అంశాన్ని వివరించింది. ] 1950, జనవరి 26 కంటే ముందు భారత్‌లో జన్మించి, శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతిఒక్కరికి భారత పౌరసత్వం లభిస్తుంది. ] 1950, జనవరి 26 కంటే ముందు ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ అతడి తల్లి/తండ్రికి అప్పటికే భారత పౌరసత్వం ఉంటే అలాంటి వ్యక్తికి కూడా భారత పౌరసత్వం లభిస్తుంది. (1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం తల్లిదండ్రులిద్దరికీ భారత పౌరసత్వం ఉండాలి) ] 1950, జనవరి 26 కంటే ముందు ఒక వ్యక్తి భారత్‌లో 5 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసిగా ఉంటే ఆ వ్యక్తికి భారత పౌరసత్వం లభిస్తుంది.

ఆర్టికల్‌ 6: దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన వారి పౌరసత్వాన్ని గురించి ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. దీనిప్రకారం 1948, జులై 19 నాటికి పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చి సంబంధిత కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. ఆ విధంగా పౌరసత్వం పొందేవారు ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’ ప్రకారం భారత పౌరులుగా నమోదై ఉండాలి.

ఆర్టికల్‌ 7: ‘1947, మార్చి 1 తర్వాత భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు వలస వెళ్లి అక్కడ ఉండలేక 1948, జులై 19 నాటికి తిరిగి వచ్చిన వారి పౌరసత్వం’ గురించి వివరిస్తుంది. ఆ విధంగా భారత్‌కు తిరిగి వచ్చినవారు సంబంధిత కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకుని, భారతదేశంలో కనీసం ఆరు నెలల పాటు స్థిర నివాసం ఉంటే భారత పౌరసత్వాన్ని పొందొచ్చు. 


ఆర్టికల్‌ 8: భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, వారికి విదేశాల్లో కలిగే సంతానానికి కూడా భారత పౌరసత్వం కల్పించవచ్చు. ఇందుకోసం తల్లిదండ్రులు తమ సంతానం పేర్లను ఒక సంవత్సరంలోగా రాయబార కార్యాలయంలో నమోదు చేయించాలి.

ఆర్టికల్‌ 9: భారత పౌరులకు ఏక పౌరసత్వం మాత్రమే ఉంటుంది. ఎవరైనా భారత పౌరులు విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే వారు భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.


ఆర్టికల్‌ 10: భారత పౌరసత్వానికి  శాశ్వతత్వం ఉంటుంది. అంటే భారతీయుడు ఎప్పటికీ భారతీయుడుగానే కొనసాగుతాడు.


ఆర్టికల్‌ 11: భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై సమగ్ర వివరణ లేదు. పౌరసత్వానికి సంబంధించిన అంశాలు, దాన్ని పొందే పద్ధతులు, కోల్పోయే సందర్భాలపై చట్టాలు రూపొందించే బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటుకే వదిలిపెట్టారు.


భారత  పౌరసత్వ చట్టం-1955

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 11 ప్రకారం పార్లమెంటు 1955లో భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. కొన్ని నియమాల ఆధారంగా ఈ చట్టం రూపొందింది. అవి- 1) జన్మస్థలం ఆధారంగా పౌరసత్వం 2) రక్త సంబంధం/వారసత్వం ఆధారంగా పౌరసత్వం ఈ చట్టం ప్రకారం ఐదు పద్ధతుల్లో భారత పౌరసత్వం పొందొచ్చు.

1) జన్మతః పౌరసత్వం: 1950, జనవరి 26 తర్వాత భారతదేశంలో జన్మించిన, స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారంతా భారత పౌరసత్వాన్ని పొందుతారు. తర్వాత కాలంలో కొన్ని మార్పులు చేర్పులు  జరిగాయి. నీ 1950, జనవరి 26 నుంచి 1987, జూన్‌ 30 మధ్య భారత దేశంలో జన్మించిన వ్యక్తి అతడి తల్లిదండ్రుల జాతీయతతో సంబంధం లేకుండా భారత పౌరుడు అవుతాడు. నీ 1987, జులై 1న గాని, ఆ తర్వాత గాని భారత్‌లో జన్మించిన వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరికి భారత పౌరసత్వం ఉంటే ఆ వ్యక్తి కూడా భారత పౌరుడవుతాడు.

పరిమితులు: మన దేశంలోని విదేశీ రాయబార కార్యాలయ ఉద్యోగులకు జన్మించిన పిల్లలు, మన దేశానికి విహార యాత్ర కోసం వచ్చిన విదేశీ దంపతులకు జన్మించిన పిల్లలు, మనదేశంలో ఉన్న శత్రుదేశాల దంపతులకు జన్మించిన పిల్లలు భారత పౌరసత్వానికి అర్హులు కారు.

2) వారసత్వ రీత్యా పౌరసత్వం: 1950, జనవరి 26 తర్వాత ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ, ఆ వ్యక్తి తల్లి/తండ్రికి భారత పౌరసత్వం ఉంటే విదేశాల్లో జన్మించిన ఆ వ్యక్తికి కూడా భారత పౌరసత్వం పొందేందుకు అర్హత ఉంటుంది.


3) నమోదు ద్వారా పౌరసత్వం: విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు ‘భారత పౌరసత్వ చట్టం, 1955’లోని సెక్షన్‌ 5(1)(a)లో పేర్కొన్నట్లు పౌరసత్వం పొందొచ్చు. భారత పౌరుడిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ అదే  చట్టంలోని సెక్షన్‌ 5(1)(c) ప్రకారం భారత పౌరసత్వాన్ని పొందొచ్చు. నోట్‌: దరఖాస్తుదారులు భారత పౌరులను వివాహం చేసుకున్న విదేశీ వ్యక్తి అయితే దరఖాస్తు చేసుకున్న రోజు నాటికి ముందే 12 నెలల పాటు భారత్‌లో నివాసం ఉండాలి. ఆ 12 నెలలకు ముందు గడిచిన 8 సంవత్సరాల్లో కనీసం ఆరేళ్లు భారత్‌లో నివసించి ఉండాలి. అంటే వారు భారతదేశంలో కచ్చితంగా 7 సంవత్సరాలు (12 నెలలు + 6 సంవత్సరాలు) స్థిరనివాసం ఉండాలి.

4) సహజీకృతం ద్వారా పౌరసత్వం: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువతో ఉన్న విదేశీయులు ‘భారత పౌరసత్వ చట్టం-1955’లోని సెక్షన్‌ 6(1) ప్రకారం ఇక్కడి పౌరసత్వాన్ని పొందొచ్చు. అందుకు కొన్ని అర్హతలు ఉండాలి. నీ కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. మంచి వ్యక్తిత్వం ఉండాలి. నీ అంతకుముందు ఉన్న విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు అఫిడవిట్‌ సమర్పించాలి.నీ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లోని భాషల్లో ఏదైనా ఒక భారతీయ భాషలో తగిన ప్రావీణ్యం ఉండాలి.నీ భారతదేశంలో 5 సంవత్సరాల పాటు శాశ్వత స్థిరనివాసం ఉండాలి. 

ఉదా: యుగొస్లేవియా దేశస్థురాలైన మదర్‌ థెరిసా భారత పౌరసత్వం పొందారు.


5) ఒక భూభాగం శాశ్వతంగా భారత్‌లో కలిసిపోవడం ద్వారా పౌరసత్వం:  1950, జనవరి 26 తర్వాత ఒక కొత్త ప్రాంతం/భూభాగం/రాష్ట్రం/దేశం భారత్‌లో శాశ్వతంగా కలిసిపోతే ఆ భూభాగంలోని ప్రజలందరికీ భారత పౌరసత్వం లభిస్తుంది. 

ఉదా: 1954లో ఫ్రెంచ్‌ వారి నుంచి పుదుచ్చేరి, 1961లో పోర్చుగీసు వారి నుంచి గోవా, 1975లో చోగ్యాల్‌ రాచరికం నుంచి సిక్కిం భారత్‌లో విలీనమయ్యాయి. ఆ భూభాగాల్లోని ప్రజలందరికీ భారత పౌరసత్వం లభించింది.


పౌరసత్వం రద్దు /కోల్పోయే పద్ధతులు

పార్లమెంటు 1955లో రూపొందించిన చట్టం ప్రకారం 3 రకాల పద్ధతుల్లో భారత పౌరసత్వం రద్దవుతుంది.

1) పరిత్యాగం: ఎవరైనా భారత పౌరుడు/పౌరురాలు విదేశీ పౌరసత్వాన్ని పొందాలనుకుంటే, భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవచ్చు లేదా రద్దు చేయించుకోవచ్చు.

2) రద్దు చేయడం: ఎవరైనా భారత పౌరుడు తన భారత పౌరసత్వాన్ని త్యజించకుండా, విదేశీ పౌరసత్వం పొందితే ఇక్కడి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు.

3) అనివార్య రద్దు: ఎవరైనా వ్యక్తి భారత పౌరసత్వాన్ని అక్రమంగా లేదా మోసపూరితంగా పొందినా, భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, భారతదేశ సంస్కృతిని అవమానించినట్లు ధ్రువీకరణ జరిగినా వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు. 

 


 

 

 

 

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 17-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పౌరసత్వ సవరణ చట్టాలు 

పౌర ప్రమాణాలకు శాసన చట్రాలు!

పౌరసత్వం అంటే ఒక గుర్తింపు, హక్కు, అనేక ప్రయోజనాలను అందించే అర్హత. జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యాన్ని కలిగిన ఈ పౌరసత్వ స్థితిని నిర్ణయించడానికి, అందించడానికి, రద్దు చేయడానికి భారత ప్రభుత్వం పలు ప్రమాణాలను పాటిస్తుంది. అందుకోసం అనేక చట్టాలను రూపొందిస్తుంది. అవసరమైనప్పుడు మార్పులుచేర్పులు, సవరణలు చేస్తుంటుంది. కోట్లమంది జీవితాలను ప్రభావితం చేసే ఆ శాసన చట్రాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు ద్వంద్వ పౌరసత్వం, జాతీయ జనాభా పట్టిక తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.

 

భారత పార్లమెంటు దేశ పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందిస్తుంది. అవసరమైనప్పుడు సవరణలు చేస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయ మూలాలు ఉండి, ఇతర దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులను దేశ ప్రగతిలో భాగస్వాములను చేయడానికి ‘ద్వంద్వ పౌరసత్వం’ కల్పించే చట్టాన్ని కూడా చేసింది. 


భారత పౌరసత్వ సవరణ చట్టం-1986:  రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో 1986లో పార్లమెంటు పౌరసత్వ చట్టాన్ని సవరించింది. విదేశీయులు అక్రమంగా ఇక్కడి పౌరసత్వాన్ని పొందకుండా నియంత్రించేందుకు 1955లో రూపొందించిన భారత పౌరసత్వ చట్టాన్ని సవరించింది.


ముఖ్యాంశాలు: 

* నమోదు ద్వారా భారత పౌరసత్వాన్ని పొందాలంటే ఈ చట్టం ప్రకారం సంబంధిత వ్యక్తి భారతదేశంలో 5 సంవత్సరాలు శాశ్వత స్థిరనివాసం ఉండాలని నిర్దేశించారు.

* ఈ చట్టం ద్వారా ‘మహిళలు’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘వ్యక్తులు’ అనే పదాన్ని చేర్చారు. 

1955 నాటి భారత పౌరసత్వ చట్టంలో భారతీయుడిని వివాహమాడిన విదేశీ ‘మహిళ’ అని పేర్కొన్నారు

* సహజ సిద్ధంగా భారత పౌరసత్వాన్ని పొందాలనుకునే విదేశీయులు ఈ చట్టం ప్రకారం భారతదేశంలో 10 సంవత్సరాలు శాశ్వత స్థిరనివాసం ఉండాలని నిర్దేశించారు. 

*1955 నాటి భారత పౌరసత్వ చట్టంలో 5 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసం అని పేర్కొన్నారు).


భారత పౌరసత్వ సవరణ చట్టం-2003:  ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ సిఫార్సుల మేరకు దేశప్రగతిలో ప్రవాస భారతీయులను భాగస్వాములను చేసే లక్ష్యంతో అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో పార్లమెంటు 2003లో ‘భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని’ రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ)కు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు. దీని ఫలితంగా, వారు విదేశీ పౌరసత్వంతో పాటు భారతీయ పౌరసత్వాన్ని కూడా పొందారు. ఈ చట్టం ప్రకారం 2004లో 16 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు మనదేశం భారతీయ పౌరసత్వాన్ని (ద్వంద్వ పౌరసత్వం) కల్పించింది. అవి.. అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, స్వీడన్, గ్రీస్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, సైప్రస్, ఇటలీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్‌. 


ప్రవాస భారతీయ దివస్‌:

  * గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాద వృత్తిని వదిలి, దేశ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని 2003 నుంచి జనవరి 9ని ‘ప్రవాస భారతీయ దివస్‌’గా పాటిస్తున్నారు. 

* 2006, జనవరి 9న నిర్వహించిన ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను మినహాయించి, మిగిలిన అన్ని దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరూ ద్వంద్వ పౌరసత్వాన్ని పొందేందుకు అవకాశం కల్పించారు. 


ద్వంద్వ పౌరసత్వం-ప్రయోజనాలు-పరిమితులు:

* ద్వంద్వ పౌర    సత్వాన్ని పొందిన ప్రవాస భారతీయులు భారతదేశంలో ఆస్తులను సంపాదించుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు. భారతీయ   పాస్‌పోర్టును పొందవచ్చు. విద్య, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతీయులతో సమానమైన అవకాశాలు ఉంటాయి. అయితే ప్రవాస భారతీయులు ఎన్నికల్లో పోటీ చేయడానికి, రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టడానికి అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భారతీయులతో సమానంగా అవకాశాలు పొందే హక్కు లేదు. 

* 2010, జనవరి 1 నుంచి ప్రవాస భారతీయులకు మనదేశంలో ఓటు హక్కు కల్పించారు.

* ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖను 2004లో ఏర్పాటు చేశారు.


ద్వంద్వ పౌరసత్వాన్ని పొందే పద్ధతులు:


1) భారతీయ సంతతి వ్యక్తుల పథకం (పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌): 

* 1999, మార్చిలో భారత ప్రభుత్వం ‘పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌’ (పీఐఓ) కార్డు పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. దీనిని 2002, సెప్టెంబరు 15న పునః సమీక్షించి కొత్త పీఐఓ కార్డు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 

* పీఐఓ కార్డు పొందడానికి ప్రవాస భారతీయులు అర్హులు. పెద్దలు రూ.15,000, 18 ఏళ్ల లోపు పిల్లలు రూ.7,500 చెల్లించాలి. ఈ కార్డు కాలపరిమితి 15 ఏళ్లు. దీన్ని 6 నెలలకోసారి పునరుద్ధరించుకోవాలి.

* బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్, చైనా, నేపాల్, పాకిస్థాన్‌లలోని ప్రవాస భారతీయులకు పీఐఓ కార్డులు మంజూరు చేయరు.

* పీఐఓ కార్డు పొందినవారికి మనదేశంలో వ్యాపార, వాణిజ్య హక్కులు; విద్య, స్థిర నివాసానికి సంబంధించిన హక్కులు ఉంటాయి. కానీ రాజకీయ హక్కులు లభించవు. 


2) ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా పథకం (ఓసీఐ):

* 2003 భారత పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ‘ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా పథకం’ (ఓసీఐ) కార్డులను ప్రవేశపెట్టారు.2004 నుంచి పీఐఓ కార్డుల స్థానంలో ఓసీఐ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.

* ఈ కార్డును పొందినవారు భారతదేశాన్ని సందర్శించడానికి ‘వీసా’ పొందాల్సిన అవసరం లేదు.

* 5 సంవత్సరాలు ఓసీఐగా కొనసాగిన ప్రవాస భారతీయులు భారతదేశంలో 2 సంవత్సరాలు సాధారణ జీవితాన్ని గడిపితే భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు.

*1950, జనవరి 26 తర్వాత భారతదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లినవారికి ఓసీఐ కార్డు ఇస్తారు. 


భారత పౌరసత్వ సవరణ చట్టం-2015: 

* 2015, మార్చి 10న రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం ‘భారత పౌరసత్వ సవరణ చట్టం-2015’ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం పౌరసత్వ చట్టం 1955లోని 7A, 7B, 7C, 7D సెక్షన్లలో మార్పులు చేశారు. 


భారత పౌరసత్వ సవరణ చట్టం-2019:

* భారత పౌరసత్వ చట్టాన్ని సవరించేందుకు 2019, డిసెంబరు 12న పార్లమెంటు ‘పౌరసత్వ సవరణ బిల్లు’ను ఆమోదించింది. తర్వాత అది సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సీఏఏ)గా అమల్లోకి వచ్చింది.

* ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి శరణు కోరివచ్చే ముస్లిమేతరులైన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు భారత పౌరసత్వం పొందేందుకు అర్హులవుతారు. 2014, డిసెంబరు 31 కంటే ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారికే ఈ అవకాశం ఉంటుంది.

* పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వలసవచ్చిన ముస్లింలకు ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం భారత పౌరసత్వం లభించదు.

* అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయలను మినహాయించారు.


జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌):

* దేశంలోని ప్రతి పౌరుడి వివరాలను సేకరించి ‘జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)’ను రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని ప్రకారం ప్రజల డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్‌ వివరాలను సేకరిస్తారు. ప్రభుత్వం 2010లో ఎన్‌పీఆర్‌ కోసం ప్రజల వివరాలను సేకరించింది. 2011 జనాభా గణాంకాల్లో ఈ ప్రక్రియను చేపట్టారు.

* 2010లో ‘జాతీయ జనాభా పట్టిక’ రూపకల్పనలో భాగంగా 15 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. 2020-21లో జాతీయ జనాభా పట్టిక రూపకల్పనలో భాగంగా 21 అంశాలతో కూడిన వివరాలను నమోదు చేశారు.

* 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం పౌరుల నమోదు, జాతీయ గుర్తింపు కార్డుల జారీ కోసం దేశంలో పౌరులు ఎవరైనా ఒక ప్రాంతంలో 6 నెలల కంటే ఎక్కువ కాలం నివాసం ఉంటే వారంతా తప్పనిసరిగా ‘జాతీయ జనాభా పట్టిక’లో పేరు నమోదు చేయించుకోవాలని నిర్దేశించారు. 


జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ):

* 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరులుగా అర్హత సాధించిన వారి సమగ్ర సమాచారాన్ని ఎన్‌ఆర్‌సీలో నమోదు చేస్తారు. ఎన్‌ఆర్‌సీ అనేది ఒక చట్టబద్ధమైన భారతీయ పౌరుల అధికారిక రికార్డు.

* 1951లో జరిగిన భారత జనాభా గణాంకాల సేకరణ తర్వాత మొదటిసారిగా ఎన్‌ఆర్‌సీ రూపొందింది.

* అస్సాంలో ఎన్‌ఆర్‌సీని రూపొందించడం తప్పనిసరని భారత పౌరసత్వ సవరణ చట్టం - 2003లో పేర్కొన్నారు.

* అస్సాం రాష్ట్రంలో చేపట్టిన నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ తుది జాబితా 2019, ఆగస్టు 31న విడుదలైంది. దాని ప్రకారం అస్సాం పౌరుల్లో 19 లక్షల మందికి ఎన్‌ఆర్‌సీలో చోటుదక్కలేదు. వారిని ఇకపై విదేశీయులుగా గుర్తిస్తారు. 


అస్సాం ఒప్పందం-1985: 

* 1971, మార్చి 24 తర్వాత అస్సాంకి వచ్చిన విదేశీయులను మతంతో సంబంధం లేకుండా బయటకు పంపాలని 1985లో జరిగిన ‘అస్సాం ఒప్పందం’లో పేర్కొన్నారు.

* ఈ ఒప్పందాన్ని కొత్త పౌరసత్వ సవరణబిల్లు ఉల్లంఘిస్తోందని నిరసనలు చెలరేగాయి. 


సుప్రీంకోర్టు తీర్పు:

డేవిడ్‌ జాన్‌ హాప్‌కిన్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు-1997: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ విదేశీయులకు పౌరసత్వాన్ని ఇచ్చే విషయంలో భారతదేశం విచక్షణాధికారాన్ని కలిగి ఉంటుందని, విదేశీయులు మనదేశ పౌరసత్వాన్ని పొందడమనేది ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదని పేర్కొంది.


 

రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 22-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌