• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర కార్యనిర్వాహక శాఖ - అధికారాలు, విధులు (అత్యవసర పరిస్థితులు)

కేంద్ర కార్యనిర్వాహక శాఖ  అధికారాలు, విధులు

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు

 

సాధారణ సందర్భాల్లో సమాఖ్యగా, అత్యవసర సమయాల్లో ఏకకేంద్రంగా మన పరిపాలన వ్యవస్థ వ్యవహరిస్తుంది. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలను పక్కనపెట్టి కేంద్రం విస్తృత అధికారాలను చెలాయిస్తుంది. రాజ్యాంగబద్ధమైన నియంత్రణలను విధిస్తుంది. అందుకోసం కేంద్ర  కార్య నిర్వాహక అధిపతిగా రాష్ట్రపతి మూడు రకాల అత్యవసర పరిస్థితులను  ప్రకటిస్తారు. వాటి అంతిమ లక్ష్యం దేశ భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల సంక్షేమం. ఆ అత్యవసర పరిస్థితులు, వాటిని ప్రకటించే తీరు,  పాటించాల్సిన నియమ నిబంధనలు, సంబంధిత కోర్టు తీర్పులు, జాతీయ నేతల వ్యాఖ్యలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రాష్ట్రపతులుగా  చేసిన వ్యక్తుల విశేషాలు, వారి వ్యక్తిగత, పాలనా విశిష్టతల గురించి తెలుసుకోవాలి.

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1. భారత రాజ్యాంగంలో ‘రాష్ట్రపతి పాలన’ గురించి ఎలా పేర్కొన్నారు?

1) Rule of emergency   2) President Rule

3) Proclamation            4) Dissolved of State Executive


2.    కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1977లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వ కాలంలో 9 కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రద్దు చేశారు.

బి) 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రద్దు చేశారు.

సి) 1977లో ఆర్టికల్‌ 356ను ప్రయోగించిన రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌.

డి) 1980లో ఆర్టికల్‌ 356ను ప్రయోగించిన రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి.

1) ఎ, బి, సి, డి   2) ఎ, బి, సి     3) ఎ, బి, డి      4) బి, సి, డి 3.  రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశం జరగక ముందు కూడా ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది?

1) రామేశ్వర్‌ ప్రసాద్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) జతిన్‌ మిశ్రా  Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) దీపక్‌ బెనర్జీ Vs స్టేట్‌ ఆఫ్‌ పశ్చిమ బెంగాల్‌ కేసు

4) అనిల్‌ ఛటర్జీ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు4.  ఎస్‌.ఆర్‌. బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు సందర్భంగా ఆర్టికల్‌ 356 ప్రయోగానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాన్ని గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి పాలన సహేతుక కారణాలతోనే  ఉందని రుజువు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

బి) రాష్ట్రపతి పాలన న్యాయసమీక్ష పరిధిలోకి రాదు.

సి) కేంద్రంలో నూతన పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రతిపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టికల్‌ 356ను బలవంతంగా ప్రయోగించరాదు.

డి) రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంటు ఆమోదించిన తర్వాత మాత్రమే రాష్ట్ర శాసన సభను రద్దు చేయాలి.

1) ఎ, బి, సి సరైనవి          2) ఎ, బి, సి, డి సరైనవి

3) ఎ, సి, డి సరైనవి         4) ఎ, బి, డి సరైనవి5. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను ‘మృత అధికరణ’ (Dead Article) గా, ‘రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా’ ఎవరు పేర్కొన్నారు?

1) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌       2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

3) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌                 4) మొరార్జీ దేశాయ్‌6.  దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేకపోతే రాష్ట్రపతి ఏ ఆర్టికల్‌ను ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు?

1) ఆర్టికల్‌ 357       2) ఆర్టికల్‌ 358   

3) ఆర్టికల్‌ 359       4) ఆర్టికల్‌ 3607. పార్లమెంటు ఆమోదించిన ఆర్థిక అత్యవసర పరిస్థితి గరిష్ఠంగా ఎంతకాలం వరకు కొనసాగుతుంది?

1) 6 నెలలు                   2) 3 సంవత్సరాలు   

3) 5 సంవత్సరాలు       4) ఎంతకాలమైనా8.  ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో సంభవించే మార్పును గుర్తించండి.

ఎ) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే ఆర్థిక సహాయాన్ని నిలిపేయవచ్చు.

బి) సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల్లో కోత విధించవచ్చు.

సి) రాష్ట్రపతి వేతనంలో కోత విధించవచ్చు.

డి) కేంద్రం కోరితే రాష్ట్రాలు తమ బడ్జెట్‌ కాపీలను తప్పనిసరిగా పంపాలి.

1) ఎ, బి, సి సరైనవి          2) ఎ, బి, సి, డి సరైనవి

3) బి, సి, డి సరైనవి          4) ఎ, బి, డి సరైనవి9.  ‘అత్యవసర పరిస్థితిని ఉపయోగించి నెలకొల్పే శాంతి శ్మశాన ప్రశాంతతను తలపిస్తుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) కె.ఎం.నంబియార్‌                  2) హెచ్‌.వి.కామత్‌

3) టి.టి.కృష్ణమాచారి                  4) కె.టి.షా10. కేంద్రమంత్రిమండలి సలహాలు, సూచనల మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలని జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ కేసు సందర్భంగా 1974లో తీర్పును వెలువరించింది?

1) షంషేర్‌సింగ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) ఎస్‌.ఆర్‌.బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) మహర్షి అవధేష్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) శ్యామ్‌నారాయణ్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు11. ‘రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలికి మిత్రుడు, మార్గదర్శి, తాత్వికుడిగా వ్యవహరిస్తారు’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌       2) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

3) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌     4) జవహర్‌లాల్‌ నెహ్రూ12. రాష్ట్రపతిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1952లో కె.టి.షాపై గెలిచి, రాష్ట్రపతి పదవిని చేపట్టారు.

బి) 1957లో ఎన్‌.ఎన్‌.దాస్‌పై గెలిచి రాష్ట్రపతి పదవిని చేపట్టారు.

సి) రాష్ట్రపతి పదవిని రెండుసార్లు చేపట్టిన ఏకైకవ్యక్తి.

డి) పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి.

1) ఎ, బి, సి, డి      2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి        4) ఎ, బి, డి 13. రాష్ట్రపతిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1962లో భారతరత్న పురస్కారం పొందారు.

బి) 'India wins Freedom' అనే గ్రంథాన్ని రాశారు.

సి) హిందీని జాతీయ భాషగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

డి) 1951లో హిందూకోడ్‌ బిల్లు విషయంలో ఆమోదం తెలపకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు.

1) ఎ, బి, డి           2) ఎ, బి, సి 

3) ఎ, బి, సి, డి         4) ఎ, సి, డి 14. రాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.

బి) విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.

సి) ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.

డి) గవర్నర్‌ పదవిని చేపట్టి, రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి వ్యక్తి.

1) ఎ, బి, సి, డి          2) ఎ, బి, సి

3) ఎ, సి, డి            4) బి, సి, డి 15. రాష్ట్రపతులు, ఎన్నికల్లో వారి ప్రత్యర్థులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ i) నీలం సంజీవరెడ్డి
బి) డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ ii) సి.హెచ్‌.హరిరామ్‌
సి) వి.వి.గిరి iii) టి.చతుర్వేది
డి) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ iv) జస్టిస్‌ కోకా సుబ్బారావు

1) ఎ-ii, బి-iv, సి-i, డి-iii 2) ఎ-ii, బి-iv, సి-iii, డి-i

3) ఎ-iv, బి-ii, సి-i, డి-iii 4) ఎ-iv, బి-i, సి-ii, డి-iii16. రాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) విద్యావేత్త, తత్వవేత్త, దార్శనికుడిగా పేరొందారు

బి) UNESCO ఛైర్మన్‌గా పనిచేశారు.

సి) చైనాతో యుద్ధానంతరం అప్పటి రక్షణమంత్రి వి.కె.కృష్ణమీనన్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.

డి) అమెరికా నుంచి ‘టెంపుల్‌టన్‌’ అవార్డును పొందిన తొలి భారతీయుడు.

1) ఎ, బి, సి            2) ఎ, సి, డి

3) ఎ, బి, డి            4) ఎ, బి, సి, డి 17. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రచించిన గ్రంథాల్లో లేని దాన్ని గుర్తించండి.

1) Hindu view of life

2) An Ideal View of Life 

3) Indian Theories of History

4) Eastern Religion Westrern thought


18. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) 8 దేశాల్లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

బి) ఇతడి జన్మదినమైన సెప్టెంబరు 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

సి) ఆర్టికల్‌ 352ను ప్రయోగించిన తొలి రాష్ట్రపతి.

డి) 1966లో పద్మవిభూషణ్‌ పురస్కారం పొందారు.

1) ఎ, బి, సి          2) ఎ, బి, డి

3) ఎ, బి, సి, డి        4) బి, సి, డి19. కింద పేర్కొన్న వారిలో ఎవరు ఉప రాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేశారు?

1) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌           2) డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌  

3) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌                4) వరాహగిరి వెంకటగిరి20. రాష్ట్రపతులు, వారి పదవీ కాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ 1) 1962-1967
బి) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 2) 1967-1969
సి) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ 3) 1969-1974
డి) వి.వి.గిరి 4) 1974-1977

1) ఎ-2, బి-3, సి-4, డి-1          2) ఎ-2, బి-1, సి-4, డి-3

3) ఎ-1, బి-2, సి-4, డి-3          4) ఎ-4, బి-1, సి-2, డి-3

సమాధానాలు
1-3; 2-3; 3-1; 4-3; 5-2; 6-4; 7-4; 8-4; 9-2; 10-1; 11-1; 12-3; 13-4; 14-2; 15-1; 16-4; 17-3; 18-1; 19-4; 20-2.

 

 

 

అత్యవసరం మూలాలు ఆ చట్టంలోనే!


కేంద్ర కార్యనిర్వాహక శాఖ అధిపతిగా వ్యవహరించే రాష్ట్రపతికి ఉన్న విశేషాధికారాల్లో అత్యవసర పరిస్థితి విధింపు విశిష్టమైనది. దీనిని మూడు సందర్భాల్లో ప్రయోగిస్తారు. ఇప్పటి వరకు ఆ  అధికారాన్ని వినియోగించిన ప్రభుత్వాలు, అప్పట్లో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు, రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు సాధారణ పాలనలో జరిగే మార్పులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై వాటి ప్రభావం తదితర వివరాలను రాజ్యాంగ ఆర్టికల్స్‌ సహా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 1.    మన దేశంలో ఆర్టికల్‌ 352 ప్రకారం తొలిసారి  విధించిన ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ ఎప్పటివరకు కొనసాగింది?

 1) 1966, జనవరి 10   2) 1967, జనవరి 10

 3) 1968, జనవరి 10   4) 1965, నవంబరు 212.   ఆర్టికల్‌ 352 ప్రకారం రెండోసారి విధించిన ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కాలాన్ని గుర్తించండి.

1) 1971, ఏప్రిల్‌ 6 నుంచి 1977, జనవరి 18 వరకు

2) 1971, డిసెంబరు 3 నుంచి 1977, మార్చి 21 వరకు

3) 1971, సెప్టెంబరు 18 నుంచి 1977, నవంబరు 26 వరకు

4) 1971, డిసెంబరు 26 నుంచి 1977, డిసెంబరు 3 వరకు3.  ఆర్టికల్‌ 352 ప్రకారం రెండోసారి ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించిన సందర్భంలో వివిధ పదవులు నిర్వహించిన ప్రముఖులకు సంబంధించి సరైన జవాబు?

ఎ) రాష్ట్రపతిగా డా.వి.వి.గిరి

బి) ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ

 సి) రక్షణ మంత్రిగా డా. బాబూ జగ్జీవన్‌రాం

డి) విదేశాంగ మంత్రిగా హెచ్‌.సి.ముఖర్జీ

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి, డి    4) బి, సి, డి 4.   బంగ్లాదేశ్‌ జాతీయ గీతమైన ‘అమర్‌ సోనార్‌ బంగ్లా’ను ఎవరు రచించారు?

1) ముజఫర్‌ రెహ్మాన్‌     2) షేక్‌ సలీం హసీనా

3) సచిన్‌ సన్యాల్‌       4) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌5.  మన దేశంలో రెండోసారి ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించడానికి  కారణం?

1) భారత్‌పై పాకిస్థాన్‌ దురాక్రమణ

2) బంగ్లాదేశ్‌ అవతరణ సందర్భంగా భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య యుద్ధం

3) పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ దురాక్రమణ

4) భారత విదేశాంగ విధానంలో చైనా జోక్యం చేసుకోవడం


6.  మన దేశంలో మూడోసారి ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించడానికి కారణం?

1) ఆంతరంగిక అల్లకల్లోలాలు

2) భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య యుద్ధం

3) భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య యుద్ధం

4) భారత్‌ - చైనా మధ్య యుద్ధం7.  మన దేశంలో మూడోసారి ఆర్టికల్‌ 352 ప్రకారం విధించిన ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కాలం?

1) 1975, ఫిబ్రవరి 21 నుంచి 1977, జనవరి 16 వరకు

2) 1975, నవంబరు 18 నుంచి 1977, డిసెంబరు 9 వరకు

3) 1975, ఆగస్టు 21 నుంచి 1977, జులై 16 వరకు

4) 1975, జూన్‌ 26 నుంచి 1977, మార్చి 21 వరకు8.  మన దేశంలో 1975లో ఆంతరంగిక కారణాలతో ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించారు. ఈ సందర్భంలో ఉన్న ప్రముఖులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌.

బి) ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ.

సి) రక్షణ శాఖామంత్రిగా ఇందిరా గాంధీ.

డి) హోంశాఖ మంత్రిగా వి.కె.కృష్ణమీనన్‌.

1) ఎ, సి, డి          2) ఎ, బి, డి 

3) ఎ, బి, సి డి       4) ఎ, బి, సి9.   మన దేశంలో ఏ కాలంలో బాహ్య, ఆంతరంగిక కారణాలతో ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కొనసాగింది?

1) 1975 - 1977      2) 1971 - 1977

 3) 1962 - 1971      4) 1971 - 197710. రాయ్‌బరేలి లోక్‌సభ నియోజక వర్గం నుంచి 1971లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లుబాటు కాదని 1975, జూన్‌ 12న ఏ న్యాయస్థానం తీర్పునిచ్చింది?

1) చండీగఢ్‌ హైకోర్టు   2) సుప్రీంకోర్టు 

3) బాంబే హైకోర్టు     4) అలహాబాద్‌ హైకోర్టు11. కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం జరిపిన అక్రమాలపై 1977, మే 28న జె.సి.షా కమిషన్‌ ఏర్పడింది.

బి) కేంద్రంలో 1977, మార్చి 24న జనతా ప్రభుత్వం ఏర్పడింది.

సి) జె.సి.షా కమిషన్‌ తన నివేదికలో ఇందిరా గాంధీని నిర్దోషిగా ప్రకటించింది.

1) ఎ, బి        2) ఎ, బి, సి

3) ఎ, సి         4) బి, సి12. బాహ్య కారణలతో ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కొనసాగుతున్న కాలంలో అంతర్గత కారణాలతో కూడా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనను గుర్తించండి.

1) ఆర్టికల్‌ 352 (9)     2) ఆర్టికల్‌ 352 (11)

3) ఆర్టికల్‌ 352 (13)    4) ఆర్టికల్‌ 353 (8)


 

13. ఆర్టికల్‌ 352 ప్రకారం విధించిన జాతీయ అత్యవసర పరిస్థితిని దేశవ్యాప్తంగా గాని, దేశంలో కొన్ని ప్రాంతాల్లో గాని, ఒక రాష్ట్రంలో గాని, ఒక రాష్ట్రంలోని కొంత భాగంలో గాని విధించవచ్చని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

 1) 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

4) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 197914. ‘హెబియస్‌ కార్పస్‌ కేసు’గా దేన్ని పేర్కొంటారు?

1) అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ జబల్‌పుర్‌ vs శివకాంత్‌ శుక్లా కేసు

2) రంగనాథ్‌ మిశ్రా vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) మేనకా గాంధీ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ vs  ఎస్‌.ఎన్‌.మిశ్రా కేసు15. ప్రతి రాష్ట్రాన్ని విదేశీ దురాక్రమణ, అంతర్గత అల్లకల్లోలాల నుంచి రక్షించి, రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 353      2) ఆర్టికల్‌ 354 

3) ఆర్టికల్‌ 355      4) ఆర్టికల్‌ 35716. ఏదైనా రాష్ట్రంలో ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ‘రాష్ట్రపతి పాలన’ కింది కారణంతో విధిస్తారు?

ఎ) రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం లోపించి, తరచూ ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోవడం

బి) రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, రాజ్యాంగ యంత్రాంగం విఫలం కావడం

సి) కేంద్రం జారీ చేసే పరిపాలనాపరమైన ఆదేశాలను రాష్ట్రం ధిక్కరించడం

డి) రాష్ట్రపతి పాలన విధించాలని సంబంధిత రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవ తీర్మానం

1) ఎ, బి, సి           2) ఎ, సి, డి

3) బి, సి, డి          4) ఎ, బి, సి, డి17. కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఆర్టికల్‌ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను రాష్ట్రపతి జారీ చేస్తారు.

బి) ఆర్టికల్‌ 356 (2) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.

సి) ఆర్టికల్‌ 356 (3) ప్రకారం ‘రాష్ట్రపతి పాలన’ ప్రకటనను పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది.

డి) ఆర్టికల్‌ 356 (4) ప్రకారం ‘రాష్ట్రపతి పాలన’ ప్రకటన ఆమోదం విషయమై పార్లమెంటు ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశం జరుగుతుంది.

 1) ఎ, సి, డి సరైనవి   2) ఎ, బి, సి, డి సరైనవి

3) ఎ, బి, డి సరైనవి   4) ఎ, బి, సి సరైనవి


18.  ‘రాష్ట్రపతి పాలన’ కాలపరిమితికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదిస్తే 6 నెలల వరకు కొనసాగుతుంది.

బి) రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదంతో 6 నెలలకోసారి చొప్పున పొడిగించవచ్చు.

సి) రాష్ట్రపతి పాలనను ఎంతకాలమైనా పొడిగించవచ్చు.

డి) రాష్ట్రపతి పాలనను గరిష్ఠంగా మూడేళ్లు పొడిగించవచ్చు/ కొనసాగించవచ్చు.

 1) ఎ, బి, సి, డి   2) ఎ, బి, డి

3) ఎ, బి, సి     4) బి, సి, డి 19. రాష్ట్రపతి పాలనా కాలంలో ఒక రాష్ట్రంలో సంభవించే మార్పును గుర్తించండి. 

ఎ) రాష్ట్ర మంత్రిమండలి ‘సుప్తచేతనావస్థ’లో ఉంటుంది.

బి) రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారాలను గవర్నర్‌ నిర్వహిస్తారు.

సి) ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర  మంత్రిమండలి వెంటనే రద్దవుతుంది.

డి) రాష్ట్ర శాసనసభను పూర్తిగా రద్దు చేస్తారు లేదా సుప్త చేతనావస్థలో ఉంచుతారు.

 1) ఎ, బి, సి సరైనవి      2) ఎ, సి, డి సరైనవి

3) ఎ, బి, సి, డి సరైనవి   4) బి, సి, డి సరైనవి20. పంజాబ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మూడేళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగించేందుకు ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించారు?

1) 59వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988

2) 68వ రాజ్యాంగ సవరణ చట్టం, 1991

3) 1, 2 సరైనవి 

4) 72వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992

 


21.  రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో సంభవించే మార్పును గుర్తించండి.

ఎ) రాష్ట్ర బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది.

బి) హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులుండవు.

సి) ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు.

డి) రాష్ట్రంలో రాష్ట్రపతికి ప్రతినిధిగా గవర్నర్‌ పరిపాలన నిర్వహిస్తారు.

1) ఎ, బి, డి సరైనవి      2) ఎ, బి, సి సరైనవి

3) ఎ, బి, సి, డి సరైనవి    4) బి, సి, డి సరైనవి22. ‘రాష్ట్రపతి పాలన’ మూలాలు ఎక్కడ ఉన్నాయి?

1) 1773, రెగ్యులేటింగ్‌ చట్టంలోని సెక్షన్, 193

2) 1861, ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టంలోని సెక్షన్, 113

3) 1919, మాంటేగ్‌ ఛెెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టంలోని సెక్షన్‌ 101

4) 1935, భారత ప్రభుత్వ చట్టంలోని సెక్షన్‌ 9323.  కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి పాలన విధించిన తొలి రాష్ట్రం - పంజాబ్‌

 బి) ఒకే నెలలో రెండు సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం - కర్ణాటక

సి) రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో ‘ఆర్డినెన్స్‌’ జారీ చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.

డి) ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రం - తెలంగాణ

1) ఎ, బి, సి, డి           2) ఎ, బి, సి 

 3) ఎ, బి, డి            4) ఎ, సి, డి 

 

సమాధానాలు 

13; 22; 31; 44; 52; 61; 74; 84; 91; 104; 112; 121; 132; 141; 153; 161; 174; 182;  194; 203; 211; 224; 233.  
 

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

 

 

Posted Date : 07-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌