• facebook
  • whatsapp
  • telegram

స్థానిక స్వపరిపాలనా సంస్థలు

 సమాజ వికాస ప్రయోగం - 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు
* స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలే స్థానిక ప్రభుత్వాలు. వీటినే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ (Democracy Decentralisation) అంటారు.
* భారత రాజ్యాంగంలోని 40వ నిబంధన పంచాయతీ రాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది.
* 'గ్రామ స్వరాజ్యమే రామ రాజ్యం' - గాంధీజీ
* 'దేశ వనరులన్నింటిలో గ్రామీణ వనరులు అతి ముఖ్యమైనవి' - జవహర్‌లాల్ నెహ్రూ
* కేంద్ర ప్రభుత్వం ఎల్.ఎమ్. సింఘ్వీ కమిటీ సూచనల మేరకే పంచాయతీ రాజ్, నగరపాలక సంస్థలకు 73, 74 రాజ్యాంగ సవరణల (1992) ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది.

చారిత్రక నేపథ్యం
* రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉంది.
* కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామ కూటమి అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించాడు.
* గ్రామాధికారిని గ్రామణి అని, పది గ్రామాలకు అధిపతిని దశగ్రామణి అని పిలిచేవారు.
* మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలోని మున్సిపల్ ప్రభుత్వం గురించి ప్రస్తావించాడు.
* చోళుల పరిపాలనా వ్యవస్థను 'ఉత్తర మేరూర్' శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనాన్ని వేయించిన చోళ చక్రవర్తి మొదటి పరాంతక చోళుడు. ఉత్తర మేరూర్ అనేది తమిళనాడులోని ఒక గ్రామం. చోళులు తాటాకులను బ్యాలెట్ పత్రాలుగా, కుండలను బాక్సులుగా ఉపయోగించేవారని ఈ శాసనం తెలియజేస్తుంది.
* గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ సమస్యల పరిష్కారానికి అయిదుగురు సభ్యులతో కూడిన 'పంచాస్' అనే ఒక మండలి ఉండేది. పంచాస్ అనే పదం తర్వాతి కాలంలో పంచాయతీగా మారిందని ప్రతీతి.
* ఢిల్లీ సుల్తానుల కాలంలో గ్రామస్థాయిలో పంచాయతీలు ఉండేవి. భూమిని కొలిచి, దాని ఆధారంగా శిస్తు విధించే విధానాన్ని షేర్షా ప్రారంభించాడు.
* మొగలుల కాలంలో పట్టణ పాలనకు కొత్వాల్ అనే అధికారిని నియమించేవారు. కొత్వాల్‌కు, సహాయంగా మున్సబ్ అనే అధికారి ఉండేవాడు.

బ్రిటిష్ కాలంలో స్థానిక సంస్థలు
* రెండో జేమ్స్ చక్రవర్తి జారీ చేసిన చార్టర్ (1687) ద్వారా పన్నుల వసూలు కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ను స్థాపించింది. పన్ను విధింపును ప్రజలు వ్యతిరేకించడంతో 1726లో కార్పొరేషన్ స్థానంలో 'మేయర్ కోర్టుల'ను ఏర్పాటుచేశారు.
* బ్రిటిష్‌వారు జిల్లాను ఒక పరిపాలనా యూనిట్‌గా తీసుకొని 1772, మే 11న కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టారు. దీన్ని వారన్‌హేస్టింగ్స్ గవర్నర్ జనరల్‌గా ఉన్న సమయంలో చేపట్టారు.
* 1793లో మద్రాసు, కలకత్తా, బొంబాయి పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించారు.
* భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన చార్లెస్ మెట్‌కాఫ్ (1835 − 1836) గ్రామీణ సమాజాలను
'లిటిల్ రిపబ్లిక్స్‌'గా అభివర్ణించాడు.
* 1870లో భారతదేశంలో మొదటిసారిగా వైస్రాయ్ లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.
* లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక, పాలనా పరమైన అధికారాలను బదలాయిస్తూ 1882, మే 18న ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు దీన్ని 'మాగ్నాకార్టా'గా వర్ణించారు. అందుకే లార్డ్ రిప్పన్‌ను స్థానిక స్వపరిపాలన పితామహుడు (The father of local self government) అంటారు.
* 1882 - 1884 స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం రిప్పన్ మూడంచెల పాలనను సూచించాడు. అవి:
     * కిందిస్థాయిలో గ్రామ పంచాయతీలు
     * మధ్యస్థాయిలో − తాలుకా బోర్డులు
     * పైస్థాయిలో − జిల్లా బోర్డులు
* వీటికి మౌలిక స్వరూపాన్ని కల్పిస్తూ, అభివృద్ధి చేయడం వల్ల లార్డ్ రిప్పన్‌ను స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పేర్కొంటారు.
* స్థానిక ప్రభుత్వాలకు తొలిసారిగా 1884లో మద్రాసు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి.

రాయల్ కమిషన్ (1907)
* స్థానిక సంస్థల పనితీరును సమీక్షించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం చార్లెస్ హబ్ హౌస్ నేతృత్వంలో రాయల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ 1909లో నివేదికను సమర్పిస్తూ స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండాలని సూచించింది.
* 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు. అవి:
     * జిల్లా బోర్డులు − 207
     * తాలుకా బోర్డులు − 584
* 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించారు.

స్వాతంత్రోద్యమ కాలంలో సమాజ వికాస కార్యక్రమాలు
1) గుర్గావ్ ప్రయోగం (1920)
* 1920లో పంజాబ్‌లోని గుర్గావ్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన ఎఫ్.ఐ. బ్రేయన్ గ్రామీణాభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు. వ్యవసాయ ఉత్పత్తి, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం; అభివృద్ధి ఫలాలను వ్యవస్థీకరించడం, ఉత్సవాలు, వివాహాలకు అయ్యే ఖర్చును తగ్గించి సమాజ అభివృద్ధికి తోడ్పడటం లాంటివి ఈ ప్రయోగం ముఖ్య లక్ష్యాలు. ఈ ఉద్యమ ప్రాముఖ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1935 − 36లో కోటి రూపాయలను దీనికి కేటాయించింది.

2) మార్తాండం ప్రయోగం (1921)
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మార్తాండం అనే ప్రాంతంలో అమెరికన్ వ్యవసాయ నిపుణుడు స్పెన్సర్ హచ్ నేతృత్వంలో 70 గ్రామాలను ఎంపిక చేసి YMCA (Young Mens Christian Association) సహకారంతో గ్రామీణ ప్రజల జీవితాల్లో కీలకపాత్ర పోషించే మౌలికాంశాలపై శిక్షణ ఇస్తూ తద్వారా ప్రజలను చైతన్యపరచడానికి ఈ ప్రయోగం చేశారు.

3) శ్రీనికేతన్ ప్రయోగం (1921)
* విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలోని శాంతినికేతన్‌లో విద్యా బోధనలో భాగంగా సమాజ వికాసానికి కృషి చేశాడు. 1921లో 'ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడం' అనే అంశంతో ఒక ప్రయోగాన్ని చేశాడు. దీని ద్వారా చిన్నతరహా కుటుంబ పరిశ్రమల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తూ వయోజన విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

4) బరోడా ప్రయోగం (1932)
* బరోడా సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన వి.టి. కృష్ణమాచారి ఈ ప్రయోగాన్ని నిర్వహించాడు. రోడ్లు వేయడం, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమాభివృద్ధి మొదలైన రంగాల్లో గ్రామీణ యువతను చైతన్యవంతుల్ని చేసి స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాడు.

5) సేవాగ్రామ్ ప్రయోగం (1933)
* మహారాష్ట్రలోని వార్ధాలో ప్రయోగాత్మకంగా సేవాగ్రామ్‌ను స్థాపించారు. ఈ సంస్థ సర్వోదయ, నవోదయ సిద్ధాంతాలను అనుసరిస్తుంది. ఆచార్య వినోబాభావే, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఈ సిద్ధాంతాలకు ఆకర్షితులై అనేక సమాజ వికాస కార్యక్రమాలను నిర్వహించారు.


6) ఫిర్కా ప్రయోగం (1946)
¤ 1946లో అప్పటి మద్రాసు సీఎం టంగుటూరి ప్రకాశం తాలుకాలను ఫిర్కాలుగా విభజించి, వాటి అభివృద్ధికి కొన్ని ప్రయోగాలను చేశాడు. వీటినే ఫిర్కా ప్రయోగాలు అంటారు. 1952లో సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను బ్లాకుల్లో విలీనం చేశారు.

7) ఇటావా ప్రయోగం (1948)
* ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న మహేవా ప్రాంతంలో ఆల్బర్ట్ మేయర్ అనే విదేశీ ఇంజినీర్ సహాయంతో 97 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా పౌర సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నించారు. కళారూపాల ద్వారా సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలను; వ్యవసాయం, చేనేత, పాడి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ ప్రదేశ్ ప్రభుత్వం కృషిచేస్తుంది.

8) నీలోఖేరి ప్రయోగం (1948)
* ఈ ప్రయోగం ద్వారా హరియణాలోని కర్నాల్ జిల్లాలో ఉన్న నీలోఖేరి అనే ప్రాంతంలో భారత విభజన సందర్భంగా నిరాశ్రయులైన దాదాపు 7 వేల మందికి పునరావాసం కల్పించారు. స్వయంశక్తితో అభివృద్ధి చెందేలా ఎస్.కె. డే నాయకత్వంలో వ్యవసాయ పనిముట్ల తయారీ, ఇంజినీరింగ్ వర్క్స్ మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చారు.

స్వాతంత్య్రం తర్వాత సమాజ వికాస కార్యక్రమాలు
 స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితిలో ఉంది.
* భారత ప్రభుత్వం సమగ్ర గ్రామీణాభివృద్ధి ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించాలని Grow more food అనే నినాదంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని (Community Development Programme − CDP) ఏర్పాటుచేసింది.
* ఈ కార్యక్రమాన్ని మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1952, అక్టోబరు 2న ఏర్పాటుచేశారు.
* CDP ఛైర్మన్ వి.టి. కృష్ణమాచారి.
* అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో CDPని ప్రారంభించారు.
* కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అనే భావనను అమెరికా నుంచి స్వీకరించారు.
* ఈ పథకం అమలుకు నాటి అమెరికా రాయబారి చెస్టర్ బౌల్స్ ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా 50 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించాడు. 1971 నాటికి ఈ ఫౌండేషన్ భారత్‌కు దాదాపు 104 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.

CDP ముఖ్యాంశాలు:
 దేశాన్ని కొన్ని బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో దాదాపు 100 గ్రామాలను చేర్చారు. దీన్ని మొదట 55 బ్లాకులతో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తర్వాత 5011 బ్లాకులకు విస్తరించారు. 70 వేల జనాభాకు ఒక బ్లాకు చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి బ్లాకుకు ఒక బ్లాకు డెవలప్‌మెంట్ అధికారి (BDO)ని నియమించారు. ఇతడు బ్లాకు స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణాధికారి.
* వ్యవసాయం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం, గృహవసతి, గ్రామీణ కుటీర పరిశ్రమలు, సాంఘిక సంక్షేమం, గ్రామీణ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* CDP కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి గ్రామ సేవక్ అనే అధికారి ఉండేవాడు.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extention Service Scheme - NESS):
* జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని 1953, అక్టోబరు 2న ఏర్పాటుచేశారు.
* ఈ కార్యక్రమాన్ని మిగిలిన 1700 బ్లాకుల్లో ఏర్పాటుచేశారు.
* CDP, NESS రెండు కార్యక్రమాల ఉద్దేశం, లక్ష్యం ఒకటే. వీటికి కేంద్ర ప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది.
* NESS ఛైర్మన్ వి.టి. కృష్ణమాచారి.
* CDP కార్యక్రమాన్ని 3 సంవత్సరాల కాలపరిమితికి, NESS ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేశారు.

CDP, NESS కింద పనిచేసే పాలనా విభాగాలు:
1. కేంద్ర స్థాయి: కేంద్ర సమాజ అభివృద్ధి శాఖ, సహకార మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. కేంద్ర క్యాబినేట్ వీటి విధానాలను రూపొందిస్తుంది.
2. రాష్ట్రస్థాయి: రాష్ట్ర అభివృద్ధి మండలి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. దీనిలో రాష్ట్ర సమాజ అభివృద్ధి మంత్రి సభ్యుడిగా, అభివృద్ధి కమిషనర్ కార్యదర్శిగా (సెక్రటరీ), కమిషనర్ కార్యనిర్వాహణాధికారిగా ఉంటారు.
3. జిల్లాస్థాయి: జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తాడు.
4. బ్లాకుస్థాయి: గ్రామాలను కొన్ని బ్లాకులుగా విభజిస్తారు. ఇది BDO పర్యవేక్షణలో ఉంటుంది.
5. గ్రామస్థాయి: విలేజ్ లెవల్ వర్కర్స్‌ని నియమిస్తారు.

CDP, NESS కి సంబంధించిన వ్యాఖ్యానాలు:
* 'సుశిక్తుడైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం' - ఎస్.కె. డే (NESS, CDP కేంద్ర అడ్మినిస్ట్రేటర్)
* 'నిశ్శబ్ద విప్లవం' - జవహర్‌లాల్ నెహ్రూ
* ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, ప్రజల భాగస్వామ్యం లేకపోవడం వల్ల CDP, NESS కార్యక్రమాలు విఫలమయ్యాయి.
* ప్రజల భాగస్వామ్యం 'ఆర్థిక వికేంద్రీకరణ' పేరుతో కేంద్ర ప్రభుత్వం మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బల్వంత్‌రాయ్ గోపాల్ మెహతా కమిటీని నియమించింది.

బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
* కేంద్రప్రభుత్వం 1957, జనవరి 16న బల్వంత్‌రాయ్ మెహతా కమిటీని నియమించింది. ఇది 1957, నవంబరు 24న తన నివేదికను సమర్పించింది. జాతీయాభివృద్ధి మండలి (NDC) 1958, జనవరిలో ఈ కమిటీ సిఫారసులను ఆమోదించింది.

ముఖ్యమైన సిఫారసులు:
* మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
     » గ్రామ స్థాయిలో − గ్రామ పంచాయతీ
     » మండల స్థాయిలో − పంచాయతీ సమితి
     » జిల్లా స్థాయిలో − జిల్లా పరిషత్
* ఈ మూడంచెల మధ్య పరోక్ష ఎన్నికల ద్వారా అంతర్గత సంబంధం ఉండాలని సూచించింది.
* ఎన్నికలను గ్రామస్థాయిలో ప్రత్యక్షంగా, జిల్లా పరిషత్‌కు పరోక్షంగా నిర్వహించాలి. పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలు జరగాలి.
* జిల్లా పరిషత్‌కు కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక, జిల్లా పరిషత్‌కు పర్యవేక్షణ అధికారాలను ఇవ్వాలి.
* మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను మొదటిసారిగా రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా సికార్ గ్రామంలో 1959, అక్టోబరు 2న జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో 1959, అక్టోబరు 11న మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ (ప్రస్తుతం తెలంగాణ), తర్వాత 1959, నవంబరు 1న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ప్రారంభించారు.
* రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను తమిళనాడులో ఏర్పాటుచేశారు.
* నాలుగంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం పశ్చిమ్ బంగ.

పంచాయతీ రాజ్ వ్యవస్థ వర్తించని రాష్ట్రాలు
1) నాగాలాండ్
2) మేఘాలయ
3) జమ్మూ కశ్మీర్ (గూర్ఖా అటానమస్ ప్రాంతాలు)
4) పశ్చిమ్ బంగ (కొండ ప్రాంతాలు)
5) అరుణాచల్‌ప్రదేశ్
6) న్యూదిల్లీ

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్థానిక స్వపరిపాలనా సంస్థలు

మాదిరి ప్రశ్నలు

1. జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని (NESS) ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1953

2. స్థానిక ప్రభుత్వాలు ఏ జాబితాలో ఉంటాయి?
జ: రాష్ట్ర జాబితా

3. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎక్కడ ఏర్పాటుచేశారు?
జ: మద్రాసు

4. స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానం?
జ: మేయో తీర్మానం

5. స్థానిక స్వపరిపాలనను ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించారు?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935

6. కిందివాటిని జతపరచండి.

     1) సామాజిక అభివృద్ధి పథకం 

            ఎ) 1959, అక్టోబరు 2

     2) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం             బి) 1993, ఏప్రిల్ 24
     3) పంచాయతీ రాజ్ వ్యవస్థ            సి) 1952, అక్టోబరు 2
     4) నూతన పంచాయతీ రాజ్ వ్యవస్థ           డి) 1953, అక్టోబరు 2

జ: 1-సి, 2-డి, 3-ఎ, 4-బి

7. కిందివాటిలో పంచాయతీ రాజ్ వ్యవస్థ వర్తించని రాష్ట్రం?
1) కేరళ          2) అసోం          3) నాగాలాండ్        4) త్రిపుర
జ: 3 (నాగాలాండ్)

8. పంచాయతీ రాజ్ సంస్థలకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసిన కమిటీ?
జ: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ

9. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన గ్రామ పంచాయతీల ఏర్పాటును సూచిస్తుంది?
జ: 40వ ప్రకరణ

10. మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ
జ: గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? (గ్రూప్ 4, 1996)
జ: పంచాయతీలు

2. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ చేసిన సిఫారసు? (గ్రూప్ 4, 1998)
జ: గ్రామ పంచాయతీలను సృష్టించడం

3. భారత స్థానిక స్వపరిపాలనా పితామహుడు (వీఆర్‌వో, 2014)
జ: లార్డ్ రిప్పన్

4. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు? (వీఆర్‌వో, 2014)
జ: 73వ

5. పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో ఉన్న అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉంటుంది. అయితే కిందివాటిలో దీనిలో భాగం కానిది? (గ్రూప్ 2, 2016 టీఎస్‌పీఎస్సీ)
జ: అగ్నిమాపక సేవలు

6. భారత్‌లో మొదటిసారి పంచాయతీ రాజ్ సంస్థలను ఎప్పుడు ప్రారంభించారు? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: 1959, అక్టోబరు 2

7. అశోక్ మెహతా కమిటీ కిందివాటిలో దేన్ని సిఫారసు చేసింది? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: రెండంచెల వ్యవస్థ

8. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో ఎన్ని విషయాలను తెలియజేశారు? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: 29

9. సాముదాయక అభివృద్ధి కార్యక్రమ అధ్యయనం కోసం నియమించిన కమిటీ? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ

10. స్వతంత్ర భారతదేశంలో సాముదాయక అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించినవారు? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: ఎస్.కె. డే

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు   

1. పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపల్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించింది?
1) 74వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 
2) 75వ రాజ్యాంగ సవరణ చట్టం - 1993
3) 76వ రాజ్యాంగ సవరణ చట్టం - 1993
4) 77వ రాజ్యాంగ సవరణ చట్టం - 1994

2. పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైంది?
1) రాజ్యాంగంలోని IX(A) భాగంలో పేర్కొన్నారు.
2) ఆర్టికల్స్‌  243(P) నుంచి 243ZG మధ్య వివరించారు.
3) 1993, జూన్‌ 1 నుంచి అమలైంది. 
4) పైవన్నీ సరైనవే

3. భారత్‌లో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను 1964లో ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ఢిల్లీ            2) మద్రాస్‌ 
3) కాన్పూర్‌     4) కలకత్తా

4. 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం పట్టణ ప్రభుత్వాలకు బదిలీ చేయాల్సిన ఎన్ని రకాల అధికారాలు, విధులను రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో పేర్కొన్నారు?
1) 15   2) 18   3) 21    4) 29

5. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243ZD లో పేర్కొన్న ‘జిల్లా ప్రణాళికా కమిటీ’కి సంబంధించి (ఆంధ్రప్రదేశ్‌లో) సరికానిది ఏది?
1) జిల్లా ప్రణాళికా కమిటీకి ఛైర్మన్‌గా రాష్ట్రమంత్రి, మెంబర్‌ సెక్రటరీగా జిల్లా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. 
2) జిల్లా ప్రణాళికా కమిటీకి ఛైర్‌పర్సన్‌గా జిల్లా పరిషత్‌ ఛైర్మన్, మెంబర్‌ సెక్రటరీగా జిల్లా కలెక్టర్‌ వ్యవహరిస్తారు.
3) జిల్లా ప్రణాళికా కమిటీకి ఎన్నికయ్యే సభ్యులు: 24 మంది 
4) జిల్లా ప్రణాళికా కమిటీలో మొత్తం సభ్యులు: 30 మంది  

6. 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)లో పేర్కొన్న వివిధ ఆర్టికల్స్‌ - వాటికి సంబంధించిన అంశాల వివరణలను గుర్తించండి.
a) ఆర్టికల్‌ 243(R)          i) మున్సిపల్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు
b) ఆర్టికల్‌ 243(S)          ii) పదవీకాలం/ కాలపరిమితి
c) ఆర్టికల్‌ 243(T)          iii) అధ్యక్షులు, సభ్యుల ఎన్నిక విధానం
d) ఆర్టికల్‌ 243(V)         iv) వార్డు కమిటీల ఏర్పాటు

1) a-iii, b-iv, c-i, d-ii 
2) a-iv, b-iii, c-i, d-ii
3) a-iii, b-iv, c-ii, d-i
4) a-ii, b-iv, c-i, d-iii

7. మున్సిపల్‌ వ్యవస్థలో కనీస, గరిష్ఠ వార్డులు/ డివిజన్లకు సంబంధించి సరికానిది?
1) మున్సిపాలిటీలో కనీస వార్డులు: 23, గరిష్ఠ వార్డులు: 50
2) మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కనీస డివిజన్ల సంఖ్య: 50, గరిష్ఠ డివిజన్ల సంఖ్య: 100 
3) మెట్రోపాలిటన్‌ మహానగరంలో కనీస డివిజన్ల సంఖ్య: 100, గరిష్ఠ డివిజన్ల సంఖ్య: 200
4) కంటోన్మెంట్‌ బోర్డులో కనీస డివిజన్ల సంఖ్య: 200, గరిష్ఠ డివిజన్ల సంఖ్య: 3008. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(S) ప్రకారం మున్సిపల్‌ వ్యవస్థల్లో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన జనాభా?
1) 50,000         2) 1,00,000 
3) 2,00,000      4) 3,00,000

9. మున్సిపల్‌ వ్యవస్థలో సభ్యులు, అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి సరైంది ఏది? 
1) మున్సిపాలిటీలో వార్డు సభ్యుడైన ‘కౌన్సిలర్‌’ ఎన్నిక ప్రత్యక్షం.
2) మున్సిపాలిటీ ఛైర్మన్‌ను కౌన్సిలర్లు పరోక్షంగా ఎన్నుకుంటారు.
3) మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డివిజన్‌ సభ్యుడైన ‘కార్పొరేటర్‌’ ఎన్నిక ప్రత్యక్షం. కార్పొరేటర్లు తమలో ఒకరిని ‘మేయర్‌’ గా పరోక్ష విధానంలో ఎన్నుకుంటారు.
4) పైవన్నీ 

10. 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) లో పేర్కొన్న వివిధ ఆర్టికల్స్‌లోని అంశాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
a) ఆర్టికల్‌ 243(V)           i) మున్సిపల్‌ వ్యవస్థల అధికారాలు - విధులు 
  
b) ఆర్టికల్‌ 243(W)          ii) మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 
అర్హతలు, అనర్హతలు
c) 
ఆర్టికల్‌ 243(X)           iii) రాష్ట్ర ఆర్థిక సంఘం
d) ఆర్టికల్‌ 243(Y)           iv) మున్సిపల్‌ వ్యవస్థలో
 పన్నులు - ఇతర ఆర్థిక వనరులు

1)  a-ii, b-i, c-iv, d-iii
2) a-iii, b-i, c-iv, d-ii
3) a-ii, b-i, c-iii, d-iv 
4) a-i, b-ii, c-iii, d-iv 

11. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(ZE) లో పేర్కొన్న ‘మెట్రోపాలిటన్‌ ప్రణాళికా సంఘానికి’ సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
1) ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య: 24
2) దీనికి ఛైర్మన్‌గా మేయర్, మెంబర్‌ సెక్రటరీగా మెట్రోపాలిటన్‌ నగర కమిషనర్‌ వ్యవహరిస్తారు.
3) రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నలుగురు సభ్యులు నామినేట్‌ అవుతారు.
4) పైవన్నీ 

12. 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం పట్టణ, నగరపాలిక సంస్థల ఎన్నికల్లో వివిధ వర్గాల వారికి కేటాయించాల్సిన రిజర్వేషన్లకు సంబంధించి సరికానిది?
1) ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలి
2) బీసీ వర్గాల వారికి 1/4వ వంతు స్థానాలు రిజర్వు చేయాలి.
3) మహిళలకు 1/3వ వంతు స్థానాలు రిజర్వు చేయాలి.
4) ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కేటాయించిన మొత్తం స్థానాల్లో సంబంధిత వర్గాల మహిళలకు 1/3వ వంతు స్థానాలు రిజర్వు చేయాలి.

13. పట్టణ, నగరపాలిక వ్యవస్థల వర్గీకరణకు సంబంధించి సరికానిది? 
1) నగర పంచాయతీలో జనాభా 20,000 నుంచి  40,000
2) మున్సిపాలిటీలో జనాభా 40 వేలు - 3 లక్షలు
3) మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జనాభా 3 లక్షల పైన
4) మెట్రోపాలిటన్‌ మహానగరంలో జనాభా 5 లక్షలు

14. విశాఖపట్టణం నగర మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన యశస్విని, శ్రీలేఖ అనే మహిళల కనీస వయసును గుర్తించండి?
1) 21 సంవత్సరాలు - 18 సంవత్సరాలు    2) 25 సంవత్సరాలు - 21 సంవత్సరాలు
3) 21 సంవత్సరాలు - 21 సంవత్సరాలు     4) 30 సంవత్సరాలు - 25 సంవత్సరాలు

15. దేశంలోని మున్సిపల్‌ వ్యవస్థలు తమ మొత్తం ఆదాయ వనరుల్లో స్థానిక పన్నుల వసూలు ద్వారా ఎంత వంతు  సమకూర్చుకుంటున్నాయి?
1) 1/2వ వంతు   2) 1/3వ వంతు   
3) 2/3వ వంతు    4) 4/5వ వంతు

16. పట్టణ, నగరపాలక సంస్థలకు కళ్లు, చెవులు, చేతులుగా వేటిని పరిగణిస్తారు?
1) స్థాయీ సంఘాలు 
2) సర్వసభ్య సమావేశాలు 
3) వార్డు కమిటీలు  
4) మెట్రోపాలిటన్‌ ప్రణాళికా కమిటీలు

17. పట్టణ, నగరపాలక సంస్థలను వాటి పదవీకాలం కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేస్తే ఎంతకాలంలోపు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి?
1) 3 నెలలు     2) 4 నెలలు 
3) 6 నెలలు     4) 12 నెలలు

18. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243ZF ప్రకారం 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) అమల్లోకి వచ్చినప్పటికీ, అంతకు ముందే ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పూర్వ శాసనాలు ఎప్పటి వరకు కొనసాగుతాయని నిర్దేశించారు?
1) 1993, డిసెంబరు 31   
2) 1994, జనవరి 31 
3) 1993, ఏప్రిల్‌ 30    
4) 1994, మే 31

19. పట్టణ, నగరపాలక సంస్థల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటు హక్కును కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పుడు చట్టం చేసింది?
1) 2009     2) 2010   3) 2011  4) 2012

20. భారత్‌లోని స్థానిక సంస్థలు తమ మొత్తం పన్నుల ఆదాయంలో ఆక్ట్రాయ్‌ పన్ను ద్వారా ఎంత వంతు సమకూర్చుకుంటున్నాయి?
1) 1/2వ వంతు      2) 1/3వ వంతు 
3) 1/4వ వంతు      4) 2/3వ వంతు

21. పట్టణ, నగరపాలక సంస్థల అకౌంటింగ్, ఆడిటింగ్‌ల గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?
1) ఆర్టికల్‌ 243(Z)
2) ఆర్టికల్‌ 243(ZA)
3) ఆర్టికల్‌ 243(ZB)  4) పైవన్నీ

22. మున్సిపల్, పట్టణ వ్యవస్థలకు ఎన్నికలు నిర్వహించేది?
1) కేంద్ర ఎన్నికల సంఘం 
2) రాష్ట్ర ఎన్నికల సంఘం 
3) ప్రాంతీయ ఎన్నికల సంఘం 
4) పార్లమెంట్‌/ రాష్ట్ర శాసనసభ

23. రాష్ట్రంలోని మున్సిపల్, పట్టణ వ్యవస్థల ఎన్నికల వివాదాలను విచారించేది?
1) జిల్లా మున్సిఫ్‌ కోర్టులు  
2) జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులు  
3) జిల్లా సెషన్స్‌ కోర్టులు     
4) హైకోర్టు

24. సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో పౌర సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన కంటోన్మెంట్‌ బోర్డుల ఏర్పాటుకు ఏ సంవత్సరంలో కంటోన్మెంట్‌ బోర్డు చట్టాన్ని రూపొందించారు?
1) 1914      2)1924  
3) 1954      4) 1964

25. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బహుళసభ్య వార్డు కమిటీలను సుప్రీంకోర్టు సమర్థించింది?
1) గుజరాత్‌           2) తమిళనాడు 
3) హరియాణా        4) కేరళ

26. పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యాన్ని నివారించేందుకు, వివాదాల పరిష్కారానికి ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?
1) ఆర్టికల్‌ 243(ZG)
2) ఆర్టికల్‌ 243(ZB)
3) ఆర్టికల్‌ 243(ZA)
4)ఆర్టికల్‌ 243(ZC)

27. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ చట్టాన్ని తొలిసారిగా ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 1956      2) 1961  
3) 1965      4) 1971

28. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ వ్యవస్థల సమావేశాల నిర్వహణకు ఉండాల్సిన కోరం?
1) 1/2  2) 1/3  3) 2/3  4) 1/4

29. ‘ఒక్కరి కోసం అందరం - అందరి కోసం ఒక్కరు’ అనేది ఎవరి నినాదం?
1) సహకార సంఘాలు  
2) స్థాయీ సంఘాలు  
3) సర్వసభ్య సమావేశాలు   
4) కోరం తీర్మానం

30. భారతదేశంలో 1726లో ఏర్పాటైన మున్సిపల్‌ కార్పొరేషన్‌ను గుర్తించండి.
1) బాంబే       2) కలకత్తా   
3) 1, 2         4) నాగ్‌పుర్‌ 

31. మొగల్‌ చక్రవర్తుల కాలంలో పట్టణ పాలన/శాంతి భద్రతల అధికారిగా ఎవరు వ్యవహరించేవారు?
1) కొత్వాల్‌       2) మున్సబ్‌  
3) చౌకీదార్‌       4) సుబేదార్‌

32. భారతదేశంలో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో ‘పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ’ను మొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1985 2) 1986 3) 1987 4) 1988

33. డా.మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రత కల్పించింది?
1) 95వ రాజ్యాంగ సవరణ చట్టం - 2010
2) 96వ రాజ్యాంగ సవరణ చట్టం - 2011
3) 97వ రాజ్యాంగ సవరణ చట్టం - 2012 
4) 98వ రాజ్యాంగ సవరణ చట్టం - 2013


 సమాధానాలు : 
1-1, 2-4, 3-1,  4-2, 5-1, 6-1, 7-4, 8-4, 9-4, 10-1, 11-4, 12-2, 13-4, 14-3, 15-3, 16-1, 17-3, 18-4, 19-1, 20-3,  21-1, 22-2,  23-3, 24-2, 25-1, 26-1, 27-3, 28-2, 29-1, 30-3, 31-1, 32-1, 33-3.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్థానిక స్వ‌ప‌రిపాల‌న   

1.  స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రాధాన్యాన్ని గుర్తించండి.
    1) ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి.
    2) స్థానిక సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను కనుక్కుంటాయి.
   3) స్థానిక పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ పరిపాలనా వికేంద్రీకరణకు తోడ్పడతాయి.
   4) పైవన్నీ 

2. 1952 అక్టోబరు 2న ప్రారంభమైన సమాజ అభివృద్ధి కార్యక్రమానికి(community development programme) సంబంధించిన అంశాన్ని గుర్తించండి.
    1)  దీన్ని వి.టి.కృష్ణమాచారి కమిటీ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ప్రారంభించింది.
    2) దీన్ని 50 జిల్లాల్లో 55 బ్లాకుల్లో ప్రారంభించారు.
    3) దేశప్రగతిలో గ్రామీణ ప్రజలకు భాగస్వామ్యం కల్పించి, వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమానికి కృషి చేయడం దీని లక్ష్యం.
    4) పైవన్నీ

3. భారతదేశంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాల రూపకర్తగా ఎవరిని పేర్కొంటారు?
    1) కె.టి.షా               2) ఎస్‌.కె.డే
   3) కె.ఎం.మున్షీ          4) రాజేంద్రసింగ్‌

4. భారతదేశంలో సహకార విధానాలను విస్తృతం చేసి, గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో National extension servies scheem(NEES) ను ఎప్పుడు ప్రారంభించారు?
    1) 1953, అక్టోబరు 2    2) 1954, అక్టోబరు 2
    3)1955, అక్టోబరు 3     4) 1956, జనవరి 26

5. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీచేయాలని, స్థానిక సంస్థల పదవీకాలం 4 సంవత్సరాలు ఉండాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది?
   1) అశోక్‌ మెహతా కమిటీ 
   2) బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ
   3) దంత్‌వాలా కమిటీ    
   4) ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ

6. 1978లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వకాలంలో ఏర్పాటైన ‘దంత్‌వాలా కమిటీ’ చేసిన సిఫార్సును గుర్తించండి.
    1) గ్రామ పంచాయతీ సర్పంచులను ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకోవాలి.
    2) జిల్లా ప్రణాళికా రూపకల్పనలో జిల్లా కలెక్టర్‌ కీలకపాత్ర పోషించాలి.
    3) ప్రణాళికా వికేంద్రీకరణలో ''BLOCK'' ను యూనిట్‌గా తీసుకోవాలి.
    4) పైవన్నీ 

7. ‘జిల్లా ప్రణాళికా బోర్డుల’ను ఏర్పాటు చేయాలని ఇందిరాగాంధీ ప్రభుత్వకాలంలో ఏర్పాటైన ఏ కమిటీ సిఫార్సు చేసింది?
    1) సీహెచ్‌.హనుమంతరావు కమిటీ    
    2) ఆర్‌.ఎస్‌.సర్కారియా కమిటీ
    3) కె.ఎం.భాటియా కమిటీ    
    4) నారీమన్‌ కమిటీ

8. 1985లో ‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన- పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాన్ని అధ్యయనం చేసిన జి.వి.కె.రావు కమిటీ చేసిన సిఫార్సులను గుర్తించండి.
    1) జిల్లా పరిషత్‌కు జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరించాలి.
    2) ‘బ్లాక్‌’ వ్యవస్థను రద్దు చేయాలి.
    3) బ్లాక్‌ అభివృద్ధి అధికారి Block Development Officer - BDO  పదవిని రద్దు చేసి, జిల్లా అభివృద్ధి అధికారి District Development officer - DDO అనే పదవిని ఏర్పాటు చేయాలి.
    4) పైవన్నీ

9. ప్రాచీన భారత గ్రామీణ సమాజాలను లిటిల్‌ రిపబ్లిక్స్‌ (little republics) గా అభివర్ణించినవారు?
   1) లార్డ్‌ మేయో           2) చార్లెస్‌ మెట్‌కాఫ్‌
   3) రాగ్నర్‌ నర్క్స్‌         4) దంత్‌వాలా

10. భారత్‌లో పన్నులు వసూలు చేసే లక్ష్యంతో 1687 లో మొదటి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
    1) మద్రాస్‌             2) బొంబాయి 
    3) కలకత్తా             4) భీమునిపట్నం

11. చోళుల గ్రామీణ పాలనను వివరించేది?
    1) రాజేంద్రచోళుని - రాజశాసనం 
    2) మొదటి పరాంతకుని - ఉత్తర మేరూర్‌ శాసనం
    3) గౌతమీ బాలశ్రీ - నాసిక్‌ శాసనం
    4) అశోకుని - ఎర్రగుడి శాసనం

12. అన్ని ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేసే లక్ష్యంతో మద్రాస్‌లో 1946లో ‘ఫిర్కా’ విధానానికి శ్రీకారం చుట్టిన అప్పటి మద్రాస్‌ ముఖ్యమంత్రి?
    1) సి.రాజగోపాలచారి    2) ముత్తు మణియన్‌
    3) టంగుటూరి ప్రకాశం  4) శ్రీరంగ మణియప్పన్‌

13. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్‌ చేస్తున్న స్థానాలు?
    1) 1/2వ వంతు     2) 1/3వ వంతు  
    3) 2/3వ వంతు     4) 1/4వ వంతు

14. కిందివాటిలో గ్రామపంచాయతీ కార్యదర్శి అధికార - విధిని గుర్తించండి.
    1) నిర్ణీత సమయంలో గ్రామపంచాయతీ సమావేశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం
    2) గ్రామపంచాయతీలో జనన, మరణ రికార్డుల నిర్వహణ
    3) మండలస్థాయిలో జరిగే సమావేశాలకు హాజరుకావడం, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి నుంచి పరిపాలనా పరమైన సమాచారం పొందడం 
    4) పైవన్నీ

15. గ్రామపంచాయతీ ఆవశ్యక విధి (తప్పనిసరి)ని గుర్తించండి.
    1) డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, నిర్వహణ
    2) ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, నిర్వహణ
    3) రక్షిత తాగునీటి సరఫరా, మంచినీటి బావులు, చెరువుల ఏర్పాటు 
    4) పైవన్నీ

16. మండల పరిషత్‌ వివిధ పదవుల ఎన్నికకు సంబంధించి సరికానిది?
    1) ఎంపీటీసీ ఎన్నిక - ప్రత్యక్షంగా ఓటర్లే ఎన్నుకోవడం
    2) ఎంపీపీ ఎన్నిక - పరోక్షంగా
    3) వైస్‌ ఎంపీపీ ఎన్నిక - పరోక్షంగా
    4) ఎంపీటీసీ ఎన్నిక - పరోక్షంగా

17. ప్రస్తుతం మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆయా ఎన్నికలకు సంబంధించి సరైంది?
    1) గ్రామపంచాయతీ ఎన్నికలు - పార్టీ రహితం
    2) మండల పరిషత్‌ ఎన్నికలు - రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా
    3) జిల్లా పరిషత్‌ ఎన్నికలు - రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా 
    4) పైవన్నీ 

18. మండల పరిషత్‌ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు ఎవరు?
    1) మండల పరిషత్‌ పరిధిలోని గ్రామ పంచాయతీల సర్పంచులు 
    2) మండల పరిషత్‌ నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యుడు 
    3) మండల వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌
    4) పైవారందరూ

19. మండల పరిషత్‌ అధికార, విధిని గుర్తించండి.
    1) ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, పర్యవేక్షణ
    2) మహిళా శిశు సంక్షేమ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ
    3) సహకార పరపతి సంఘాలు, నీటిపారుదల సొసైటీలు, వ్యవసాయ సొసైటీల ఏర్పాటు
    4) పైవన్నీ

20. వివిధ రాష్ట్రాల్లో మండల పరిషత్‌కు గల పేర్లకు సంబంధించి సరికానిది?
    1) పశ్చిమ్‌ బెంగాల్‌ - క్షేత్ర పంచాయతీ
    2)  అరుణాచల్‌ ప్రదేశ్‌ - అంచల్‌ కమిటీ
    3) మధ్యప్రదేశ్‌ - జనపద పంచాయతీ
    4) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - మండల పరిషత్‌

21. జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాలకు సంబంధించి సరైంది?
    1) జిల్లా పరిషత్‌లో స్థాయీ సంఘాల సంఖ్య  7
    2) స్థాయీ సంఘాల సమావేశాలు 2 నెలలకు ఒకసారి జరగాలి
    3) స్థాయీ సంఘాల సమావేశాల నిర్వహణకు ఉండాల్సిన కోరం 1/3వ వంతు 
    4) పైవన్నీ

22. ‘జిల్లా కలెక్టర్‌’ పదవికి సంబంధించి సరైంది?
   1) 1772, మే 11న ఏర్పాటైంది
    2) వారన్‌ హేస్టింగ్స్‌ కాలంలో ఈ పదవి సృష్టించారు
    3) భూమి శిస్తును వసూలు చేసే లక్ష్యంతో ఈ పదవిని సృష్టించారు. 
    4) పైవన్నీ 

23. జిల్లా పరిషత్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.
    1) జడ్పీటీసీ సభ్యుల ఎన్నిక - ప్రత్యక్షం
    2) జడ్పీ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నిక - పరోక్షం
    3) జడ్పీటీసీ పదవికి పోటీ చేయాలంటే కనీస వయసు 21 సంవత్సరాలు
    4) పైవన్నీ సరైనవే

24. జిల్లా పరిషత్‌కు మెంబర్‌ సెక్రటరీగా ఎవరు వ్యవహరిస్తారు?
    1) జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌  
    2) జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి 
    3) జిల్లా కలెక్టర్‌     4) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి

25. జిల్లా పరిషత్‌ అధికార, విధిని గుర్తించండి.
    1) జిల్లాలోని మండల పరిషత్‌ల పనితీరును పర్యవేక్షించడం
    2) మండల పరిషత్‌ల విజ్ఞప్తిపై ఉమ్మడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం
    3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను మండల పరిషత్‌లకు పంపిణీ చేయడం 
    4) పైవన్నీ 

26. జిల్లా కలెక్టర్‌ కార్యనిర్వాహక, మెజిస్ట్రేట్‌ అధికారాన్ని గుర్తించండి.
    1) శాంతి భద్రతల నిర్వహణ, జైళ్లమీద అజమాయిషీ
    2) అల్లర్లు సంభవించినపుడు కర్ఫ్యూ, 144 సెక్షన్‌ విధింపు
    3) సినిమా హాళ్ల నిర్మాణానికి ‘అభ్యంతరాలు లేవని సర్టిఫికెట్‌’(NOC) జారీ చేయడం
    4) పైవన్నీ 

27. గ్రామసభను ఏర్పాటు చేయమని ఎంతమంది గ్రామసభ సభ్యులు రాతపూర్వకంగా సర్పంచిని కోరాల్సి ఉంటుంది?
    1) 5% లేదా 25 మంది 
    2) 10% లేదా 50 మంది 
    3) 15% లేదా 75 మంది 
    4) 20% లేదా 100 మంది

28. గ్రామ పంచాయతీ పరిధిలో అనాథలు మరణించినా, జంతువులు మృతి చెందినా దహన లేదా ఖనన సంస్కారాలను ఎవరు నిర్వహించాలి?
    1) పంచాయతీ కార్యదర్శి     2) గ్రామ పోలీస్‌
    3) గ్రామ పంచాయతీ పెద్ద    4) మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి

29. స్థానిక సంస్థలకు బకాయిపడిన పన్నులు, పన్నేతరాలు మొదలైన వాటిని వసూలు చేసేందుకు అధికారాన్ని కల్పించే చట్టం ఏది?
    1) మద్రాస్‌ ప్రెసిడెన్సీ చట్టం, 1813 
    2) ఏపీ పంచాయతీ చట్టం, 1994
    3) స్థానిక సంస్థల చట్టం, 1901 
    4) రాయల్‌ కమిషన్‌ చట్టం, 1907

30. నీరు, భూమి, వృక్షాల చట్టం (WALTA) ప్రకారం గ్రామ ఆవాసంలో మంచినీటి సరఫరా నిమిత్తం ఎంతమందికి ఒక గొట్టపు బావిని ఏర్పాటు చేయవచ్చు?
    1) 150     2) 300     3) 350    4) 450

31. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 ప్రకారం మూలధనం విలువపై ఇంటిపన్నుగా విధించడానికి నిర్ణయించిన కనిష్ఠ, గరిష్ఠ విలువ ఎంత?
    1) 2%  5%        2) 5%  8%   
    3) 5%  10%     4) 10%  20% 

32. గ్రామ పంచాయతీ సాధారణ నిధి నుంచి సంక్షేమ కార్యక్రమాలకు ఎంత శాతం కేటాయించాలి?
    1) 5%    2) 15%     3) 25%   4) 50%

33. అశోక్‌ మెహతా కమిటీ సిఫార్సు చేసిన రెండంచెల పంచాయతీరాజ్‌ విధానంలోని అంచెలు ఏవి?
    1) గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌    
    2) గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్‌
    3) మండల పరిషత్, జిల్లా పరిషత్‌ 
    4) గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి

34. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగో ‘ఆర్థిక సంఘానికి’ అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు?
    1) ఎం.ఎల్‌.కాంతారావు    2) ఎం.లక్ష్మణరావు
    3) కె.కుటుంబరావు         4) ఎన్‌.త్రినాథరావు

35. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ గ్రామ పంచాయతీల్లో లేని దాన్ని గుర్తించండి.
    1) అమ్మపేట            2) జేగురుపాడు
    3) పాండురంగాపురం  4) రామచంద్రాపురం

సమాధానాలు : 1-4, 2-4,  3-2,  4-1, 5-1, 6-4, 7-1, 8-4, 9-2, 10-1,11-2, 12-3, 13-1, 14-4, 15-4, 16-4, 17-4, 18-4,19-4, 20-1, 21-4, 22-4, 23-4, 24-3, 25-4, 26-4, 27-2, 28-1, 29-2, 30-1, 31-3,  32-2, 33-3, 34-1, 35-1.  

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

73వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చ‌ట్టం 

1. 1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఎల్‌.ఎం.సింఘ్వీ కమిషన్‌ సిఫార్సులను గుర్తించండి.
    1) స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించడం.
    2) స్థానిక సంస్థల ఎన్నికల వివాదాలను పరిష్కరించేందుకు ‘ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల’ ఏర్పాటు.
    3) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ‘రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని’ ఏర్పాటు చేయడం.
    4) పైవన్నీ

2. పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించారు. ఈ చట్టానికి ఆమోదముద్ర వేసిన అప్పటి భారత రాష్ట్రపతి?
   1) శంకర్‌దయాళ్‌ శర్మ
   2) కె.ఆర్‌.నారాయణన్‌
   3) ఆర్‌.వెంకట్రామన్‌    
   4) ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌
3. పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) మన దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి  వచ్చింది?
    1) 1992, ఏప్రిల్‌ 14
    2) 1993, ఏప్రిల్‌ 14
    3) 1993, ఏప్రిల్‌ 24
    4) 1992, ఏప్రిల్‌ 24

4. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(A)లో పేర్కొన్న ‘గ్రామసభ’లో సభ్యులుగా ఎవరుంటారు?
   1) గ్రామ పంచాయతీ పరిధిలో నమోదైన ఓటర్లు  
   2) గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు
   3) గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దలు       
   4) గ్రామ పంచాయతీ సర్పంచి, ఉపసర్పంచి, వార్డు సభ్యులు 

5. కిందివాటిలో గ్రామసభకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి.
    1) గ్రామ పంచాయతీకి శాసనసభలా వ్యవహరిస్తుంది.
    2) వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.
    3) గ్రామసభ సమావేశాన్ని సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయంలోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు.
    4) పైవన్నీ 

6. 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి రెండుసార్లు తప్పనిసరిగా ఏయే తేదీల్లో నిర్వహించాలి? 
    1) ఏప్రిల్‌ 14, అక్టోబరు 2   
    2) ఏప్రిల్‌ 14, అక్టోబరు 3
    3) నవంబరు 14, ఏప్రిల్‌ 24  
    4) జనవరి 14, జులై 14

7. ఏ రోజున జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
    1) అక్టోబరు 2          2) నవంబరు 14
    3) ఏప్రిల్‌ 24           4) డిసెంబరు 23

8. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(C)లో నిర్దేశించిన పంచాయతీరాజ్‌ పదవుల ఎన్నికకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
    1) గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నిక ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిర్వహించవచ్చు.
    2) పంచాయతీ సమితి (మాధ్యమిక స్థాయి) అధ్యక్షుడి ఎన్నిక పరోక్షంగా నిర్వహించాలి.
    3) జిల్లా పరిషత్‌ (ఉన్నత స్థాయి) అధ్యక్షుడి ఎన్నిక పరోక్షంగా నిర్వహించాలి.
    4) పైవన్నీ 

9. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(D)లో నిర్దేశించిన పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో వివిధ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లకు సంబంధించి సరికానిది?
    1) ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి.
    2) మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలి.
    3) మైనారిటీ వర్గాల వారికి రిజర్వేషన్లు పేర్కొనలేదు.
    4) బీసీ వర్గాల వారికి 1/3వ వంతు రిజర్వేషన్లు కేటాయించాలి.

10. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% స్థానాలు రిజర్వ్‌ చేస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం?
    1) ఆంధ్రప్రదేశ్‌           2) తెలంగాణ  
    3) బిహార్‌                4) కేరళ

11. 73వ రాజ్యాంగ సవరణ చట్ట(199)లో పేర్కొన్న ఆర్టికల్స్, వాటిలో పొందుపరచిన అంశాలకు సంబంధించి సరైంది?
  a) ఆర్టికల్‌ 243(E)       i) పంచాయతీరాజ్‌ అధికారాలు - విధులు
  b) ఆర్టికల్‌ 243(F)       ii) పదవీ కాలం 
  c) ఆర్టికల్ 243(G)     iii) అర్హతలు, అనర్హతలు
  d) ఆర్టికల్‌  243(H)    iv) ఆర్థిక వనరులు, పన్నులు
   1)a-ii, b-iii, c-i, d-iv
   2) a-iii, b-ii, c-i, d-iv
   3) a-ii, b-i, c-iii, d- iv
   4) a-ii, b-iii, c-iv, d-i

12. కిందివాటిలో స్థానిక సంస్థల పదవీ కాలానికి సంబంధించి సరైంది?
    1) స్థానిక సంస్థల పదవీకాలం సాధారణంగా ఐదు సంవత్సరాలు.
    2) పదవీకాలం కంటే ముందే స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు.
    3) పదవీకాలం కంటే ముందే రద్దయిన స్థానిక సంస్థలకు ఆరు నెలల్లో తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి.    
    4) పైవన్నీ 

13. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(f) ప్రకారం పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు ఎంత?
    1) 18 ఏళ్లు          2) 21 ఏళ్లు 
    3) 25 ఏళ్లు          4) పేర్కొనలేదు

14. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(g) ప్రకారం పంచాయతీరాజ్‌ వ్యవస్థకు ఎన్ని రకాల అధికారాలు, విధులను రాష్ట్రాలు బదిలీ చేయాలని నిర్దేశించారు?
    1) 19   2) 18    3) 29   4) 21 

15. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(j) ప్రకారం రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్‌ సంస్థల ఖర్చులు, ఖాతాల తనిఖీలో కీలకపాత్ర వహించేది?
    1) రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్‌    
    2) రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌
    3) రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి     
    4) రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్

16. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(k) ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సరైంది?
    1) రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది.
    2) రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమించినప్పటికీ, తొలగించే అధికారం లేదు.
    3) రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగానే తొలగించాలి.
    4) పైవన్నీ 

17. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేంద్ర ఎన్నికల కమిషన్‌ లాగానే రాజ్యాంగ ప్రతిపత్తిని కలిగి ఉందని, స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయ్యే సందర్భంలో వాటి పదవీకాలం ముగియకుండానే ముందస్తు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది?
   1) రణదీప్‌సింగ్‌  vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌                   2) అశోక్‌కుమార్‌  vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
   3) కిషన్‌ సింగ్‌ థోమర్‌ vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌        4) ఆనంద్‌శర్మ vs స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌

18. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 243(i) ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ ఎన్నేళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు?
    1) 4    2) 5     3) 6     4) 7 

19. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(m) ప్రకారం 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) నుంచి మినహాయించిన రాష్ట్రాల్లో లేనిదాన్ని గుర్తించండి.    
  1) నాగాలాండ్‌        2) మేఘాలయ    
  3) మిజోరం            4) అసోం

20. షెడ్యూల్డ్, గిరిజన ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలు చేసేందుకు అవసరమైన సిఫార్సుల అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిటీ?
    1) రాగ్యా నాయక్‌ కమిటీ    
    2) దిలీప్‌సింగ్‌ భూరియా కమిటీ
    3) రామేశ్వర్‌ ఠాకూర్‌ కమిటీ    
    4) త్రిభువన్‌ మిశ్రా కమిటీ
21. మన దేశంలో PESA (Panchayat raj extension to scheduled areas) చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
    1) 1995, జనవరి 13
    2) 1996, డిసెంబరు 24
    3) 1997, అక్టోబరు 2    
    4) 1999, జనవరి 29

22. PESA చట్టంలోని ముఖ్యాంశాన్ని గుర్తించండి?
    1) పేదరిక నిర్మూలన, ఇతర కార్యక్రమాలకు లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేసే అధికారం గ్రామసభకు ఉండాలి.
    2) గ్రామసభ ఆమోదం ద్వారానే సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించిన ప్రణాళికలు, పథకాలను అమలు చేయాలి.
    3) గిరిజన ప్రాంతాల్లో గ్రామసభ ప్రాధాన్యత తగ్గించాలి.
    4) 1, 2 

23. గ్రామ పంచాయతీకి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.
    1) గ్రామ పంచాయతీలో కనీస వార్డుల సంఖ్య: 5
    2) గ్రామ పంచాయతీలో గరిష్ఠ వార్డుల సంఖ్య: 21
    3) గ్రామ పంచాయతీ సమావేశాలు సర్పంచి అధ్యక్షతన గత సమావేశ నివేదికతో ప్రారంభమవుతాయి.
    4) పైవన్నీ 

24. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘గ్రామ పంచాయతీ కార్యదర్శి’ పదవిని ఎప్పుడు సృష్టించారు?
    1) 2002, జనవరి 1 
    2) 2004, జనవరి 1
    3) 2005, జనవరి 1    
    4) 2012, జనవరి 1

25. గ్రామ పంచాయతీ కార్యదర్శి అధికారాలు, విధులను గుర్తించండి.
    1) గ్రామ పంచాయతీ ఆస్తులను పరిరక్షించడం
    2) సర్పంచి ఆదేశంతో గ్రామ పంచాయతీ తీర్మానాల అమలు
    3) సర్పంచి, వార్డు సభ్యులతో చర్చించి గ్రామ పంచాయతీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించడం
    4) పైవన్నీ 

26. కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడానికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?
    1) National institute of rural development
    2) Indra gandi national open university 
    3) United nations educational scintific and cultural organisation 
    4) Dr. br ambedkar open university

27. దేశంలో జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
    1) 2004 2) 2007 3) 2009 4) 2010

28. కింది వాటిలో సరికానిది?
    1) గ్రామ పంచాయతీల ఏర్పాటును ఆర్టికల్‌ 40 నిర్దేశిస్తుంది. 
    2) భారత్‌లో స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడు లార్డ్‌ రిప్పన్‌
    3) National institute of rural developmet ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
    4) భారత్‌లో గ్రామీణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం - మౌర్యులు

29. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసి గ్రామ పరిపాలన అధికారుల వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టింది?
    1) 1983           2) 1984   
    3) 1985            4) 1986

30. ‘ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌’ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
    1) 1993, మే 30   2) 1994, మే 30       3) 1995, మే 30   4) 1996, మే 30

31. కిందివారిలో ఎవరిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించే అవకాశం లేదు?
    1) సర్పంచి                            2) ఉపసర్పంచి  
    3) మండల పరిషత్‌ అధ్యక్షుడు  4) పైవారంతా 

32. కిందివాటిలో ఏ రాష్ట్రం పంచాయతీరాజ్‌ సంస్థలకు మొత్తం 29 రకాల అధికారాలు, విధులను బదిలీ చేసింది?
    1) కేరళ, కర్ణాటక    
    2) తమిళనాడు, పశ్చిమ్‌ బంగ
    3) రాజస్థాన్, సిక్కిం       4) పైవన్నీ

సమాధానాలు 
1-4, 2-1, 3-3, 4-1, 5-4, 6-2, 7-3, 8-4, 9-4, 10-3, 11-1,12-4, 13-2, 14-3, 15-2,16-4, 17-3, 18-2, 19-4, 20-2, 21-2, 22-4, 23-4, 24-1, 25-4, 26-2, 27-1, 28-4, 29-3, 30-2, 31-1, 32-4.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు 

1. భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని గ్రామసభల సంవత్సరంగా ప్రకటించింది?

1) 20072008           2) 20082009          3) 20092010          4) 20102011


2. ఎంతమంది గ్రామసభ సభ్యులు కోరితే సర్పంచ్‌ గ్రామసభను ఏర్పాటు చేస్తారు?

1) కనీసం 50 లేదా 10% మంది సభ్యులు 
2) కనీసం 40 లేదా 12% మంది సభ్యులు 
3) కనీసం 30 లేదా 19% మంది సభ్యులు 
4) కనీసం 20 లేదా 20% మంది సభ్యులు


3. 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రకారం గ్రామసభ సమావేశాలను తప్పనిసరిగా సంవత్సరానికి రెండుసార్లు ఏ తేదీల్లో నిర్వహించాలి?

1) ఏప్రిల్‌ 14, అక్టోబరు 2         2) ఏప్రిల్‌ 14, అక్టోబరు 3 
3) జనవరి 2, జులై 1           4) ఏప్రిల్‌ 14, జులై 1


4. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఏ అంచెకు మినహాయింపు ఉంటుంది?

1) మొదటి అంచె - గ్రామ పంచాయతీ సమితి     2) రెండో అంచె - గ్రామ సమితి 
3) మూడో అంచె - జిల్లా పరిషత్‌         4) 1, 3


5. గ్రామ పంచాయతీ ఎవరికి సమష్టి బాధ్యత వహించాలి?

1) సర్పంచ్‌        2) మండల పరిషత్‌        3) జిల్లా పరిషత్‌         4) గ్రామసభ


6. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి సరికానిది?

1) వార్డు సభ్యుల ఎన్నిక - ప్రత్యక్షం     2) సర్పంచ్‌ ఎన్నిక - ప్రత్యక్షం 
3) ఉపసర్పంచ్‌ ఎన్నిక - పరోక్షం     4) ఉపసర్పంచ్‌ ఎన్నిక - ప్రత్యక్షం


7.  73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు నిర్దేశించిన స్థానాలు?

1) 1/3వ వంతు        2) 2/3వ వంతు         3) 1/2వ వంతు        4) 1/4వ వంతు


8. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ ఎన్నికల వివాదాలను ప్రత్యేక ట్రైబ్యునల్‌ హోదాలో ఎవరు విచారిస్తారు?

1) లోకాయుక్త         2) లోక్‌ అదాలత్‌         3) జిల్లా మున్సిఫ్‌ కోర్టు        4) సెషన్స్‌ కోర్టు


9. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం?

1) కేరళ        2) బిహార్‌        3) కర్ణాటక        4) రాజస్థాన్‌


10. ఒక గ్రామ పంచాయతీకి ఎన్నికవ్వాలంటే మహిళలకు ఉండాల్సిన కనీస వయసు?

1) 18 సంవత్సరాలు             2) 21 సంవత్సరాలు 
3) 25 సంవత్సరాలు             4) 30 సంవత్సరాలు


11. ఏ తేదీ తర్వాత వివాహమైనవారికి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు?

1)  1995 మే 30        2) 1994 మే 30       3) 1993 మే 30        4) 1992 మే 30


12. ఆర్టికల్‌ 243(I)  ప్రకారం అయిదేళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?

1) కేంద్ర ఆర్థిక సంఘం      2) ముఖ్యమంత్రి       3) రిజర్వ్‌ బ్యాంకు        4) గవర్నర్‌


13. 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992లోని అంశాలను కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపచేయాలా లేదా అనే విషయాన్ని ఎవరు ప్రకటిస్తారు?

1) కేంద్ర ఎన్నికల సంఘం         2) సుప్రీంకోర్టు 
3) లెఫ్టినెంట్‌ గవర్నర్లు             4) రాష్ట్రపతి


14.  73వ రాజ్యాంగ సవరణ చట్టం(1992) 1993 ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చిన్పటికీ ఆర్టికల్‌ 243్బవ్శి ప్రకారం వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పూర్వ శాసనాలు ఎంతకాలం కొనసాగుతాయి?

1) 3 నెలలు          2) 6 నెలలు         3) ఒక సంవత్సరం        4) 3 సంవత్సరాలు


15. 1993 ఏప్రిల్‌లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం?

1) కర్ణాటక        2) రాజస్థాన్‌       3) ఆంధ్రప్రదేశ్‌       4) కేరళ


16. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు 1993 ఏప్రిల్‌ 20న ఏ రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది?

1) ఆర్‌. వెంకట్రామన్‌            2) శంకర్‌దయాళ్‌ శర్మ
3) కేఆర్‌ నారాయణన్‌            4) జ్ఞానీ జైల్‌సింగ్‌


17.  పంచాయతీరాజ్‌ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో నిర్దేశించారు?

1) ఖిశ్రీవ భాగం       2) శ్రీవ భాగం        3) శ్రీఖివ భాగం        4) శ్రీఖిఖివ భాగం


18. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడిగా పేరొందినవారు?

1) లార్డ్‌ మేయో        2) లార్డ్‌ డఫ్రిన్‌        3) లార్డ్‌ రిప్పన్‌       4) లార్డ్‌ మన్రో


19. మనదేశంలో చోళుల గ్రామీణ పాలన గురించి వివరించే శాసనం?

1) ఉత్తర మేరూరు శాసనం        2) రుమ్మిందై శాసనం
3) గిర్నార్‌ శాసనం               4) ఎర్రగుడి శాసనం


20. ప్రాచీన భారత గ్రామీణ సమాజాలను ‘లిటిల్‌ రిపబ్లిక్స్‌’గా అభివర్ణించినవారు?

1) లార్డ్‌ కర్జన్‌         2) లార్డ్‌ రిప్పన్‌         3) చార్లెస్‌ మెట్‌కఫ్‌         4) చార్లెస్‌ హాబ్‌ హౌస్‌


21. 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైన ప్రధాని?

1) వి.పి.సింగ్‌        2) రాజీవ్‌ గాంధీ        3) చంద్రశేఖర్‌       4) పి.వి.నరసింహారావు


22. 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం నియమించిన ఏ కమిషన్‌ స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించాలని సిఫార్సు చేసింది?

1) జీవీకే రావు        2) ఎల్‌ఎం సింఘ్వీ         3) దంతెవాలా         4) సీహెచ్‌ హనుమంతరావు


23. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహించాలని నిర్దేశించారు?

1) 2007           2) 2008          3) 2009          4) 2012


24. కిందివాటిలో గ్రామసభకు సంబంధించి సరైంది?

1) గ్రామపంచాయతీ వార్షిక నివేదికలను పరిశీలించడం
2) వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక
3) గ్రామస్థాయిలో శాసనసభలా వ్యవహరించడం
4) పైవన్నీ 


25. మన గ్రామసభను పోలిన వ్యవస్థ ‘ల్యాండ్స్‌ గెమెండ్‌’ పేరుతో ఏ దేశంలో అమల్లో ఉంది?

1) అమెరికా         2) స్విట్జర్లాండ్‌        3) జర్మనీ         4) శ్రీలంక
 

26. పట్టణ, నగర ప్రభుత్వాల వర్గీకరణకు సంబంధించి సరికానిది?

1) నగర పంచాయతీ - జనాభా 20,000 నుంచి 40,000 
2) మున్సిపల్‌ కౌన్సిల్‌ - జనాభా 40,000 నుంచి 3 లక్షలు
3) మున్సిపల్‌ కార్పొరేషన్‌ - జనాభా 50,000 నుంచి 3 లక్షలు
4) మున్సిపల్‌ కార్పొరేషన్‌ - జనాభా 3 లక్షల పైన


27. ఒక మహిళ నగర మేయర్‌గా ఎన్నికవ్వాలంటే ఉండాల్సిన కనీస వయసు?

1) 35 సంవత్సరాలు      2) 30 సంవత్సరాలు     3) 21 సంవత్సరాలు      4) 18 సంవత్సరాలు 


28. ఆర్టికల్‌ 243(W) ప్రకారం పట్టణ, నగరపాలక సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధుల్లో లేనిది?

1) రహదారులు, వంతెనలు 
2) నగర పేదరిక నిర్మూలన పథకాల అమలు
3) ఆదాయపు పన్ను వసూలు 
4) పరిశ్రమలు, గృహాలకు నీటివసతి


29. మన దేశంలోని మున్సిపల్‌ సంస్థలు వాటి మొత్తం ఆదాయ వనరుల్లో స్థానిక పన్నుల ద్వారా ఎంత శాతం ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి?

1) 1/3వ వంతు        2) 2/3వ వంతు        3) 1/4వ వంతు          4) 1/2వ వంతు


30. మన దేశంలోని స్థానిక సంస్థలు వాటి మొత్తం ఆదాయంలో 1/4వ వంతును ఏ పన్ను ద్వారా సమకూర్చుకుంటున్నాయి?

1) ఇంటిపన్ను       2) ఆక్ట్రాయ్‌ పన్ను       3) ప్రకటనలపై పన్ను         4) వినోదపు పన్ను


31.  రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో జిల్లా ప్రణాళికా బోర్డుల ఏర్పాటును నిర్దేశించారు?

1) ఆర్టికల్‌ 243(Z)         2) ఆర్టికల్‌ 243(ZA)
3) ఆర్టికల్‌ 243(ZD)    4) ఆర్టికల్‌ 243(ZF)


32. జిల్లా ప్రణాళికా బోర్డుకు సంబంధించి సరికానిది?

1) దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 30
2) దీనికి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 24 
3) నామినేట్‌ అయ్యే సభ్యుల సంఖ్య 6 
4) నామినేట్‌ అయ్యే సభ్యుల సంఖ్య 4


33. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా ప్రణాళికా బోర్డుకు మెంబర్‌ సెక్రటరీగా ఎవరు వ్యవహరిస్తున్నారు?

1) జిల్లా కలెక్టర్‌         2) జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి 
3) రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి         4) జిల్లా ట్రెజరీ అధికారి


34. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో మెట్రో పాలిటన్‌ ప్రణాళికా సంఘం ఏర్పాటును నిర్దేశించారు?

1) ఆర్టికల్‌ 243(W)             2) ఆర్టికల్‌ 243(ZC)
3) ఆర్టికల్‌ 243(ZE)           4) ఆర్టికల్‌ 243(ZF)


35.  మెట్రో పాలిటన్‌ ప్రణాళికా సంఘానికి సంబంధించి సరికానిది?

1) దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 24      2) దీనికి ఎన్నుకునే సభ్యుల సంఖ్య 22
3) నామినేట్‌ అయ్యే సభ్యుల సంఖ్య 4      4) ఎన్నుకునే సభ్యుల సంఖ్య 18


36. మెట్రో పాలిటన్‌ ప్రణాళికా సంఘానికి ఎవరు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు?

1) మెట్రో పాలిటన్‌ నగర మేయర్‌       2) మెట్రో పాలిటన్‌ నగర కమిషనర్‌     
3) రాష్ట్ర ఆర్థిక మంత్రి          4) రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి


37. మన దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను 1964లో ఎక్కడ నెలకొల్పారు?

1) కలకత్తా            2) మద్రాస్‌              3) బాంబే                4) ఢిల్లీ


38. 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న పూర్వ శాసనాలు ఎప్పటివరకు కొనసాగుతాయి?

1)  1993 మే 1      2) 1994 మే 31        3) 1994 ఏప్రిల్‌ 23       4) 1993 డిసెంబరు 31


39. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల వివాదాలను ఎవరు విచారిస్తారు?

1) జిల్లా సెషన్స్‌ కోర్టులు      2) జిల్లా మున్సిఫ్‌ కోర్టులు 
3) హైకోర్టు             4) ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు 


40.  పట్టణ, నగరపాలక సంస్థలకు ‘కళ్లు, చెవులు, చేతులుగా’ వేటిని పరిగణిస్తారు?

1) సర్వసభ్య సమావేశాలు      2) కౌన్సిలర్లు 
3) కార్పొరేటర్లు         4) స్థాయీ సంఘాలు


సమాధానాలు:  1-3; 2-1; 3-2; 4-2; 5-4; 6-4; 7-1; 8-3; 9-2; 10-2; 11-1; 12-4; 13-4; 14-3; 15-1; 16-2; 17-1; 18-3; 19-1; 20-3; 21-2; 22-2; 23-3; 24-4; 25-2; 26-3; 27-3; 28-3; 29-2; 30-2; 31-3; 32-3; 33-1; 34-3; 35-2; 36-1; 37-4; 38-2; 39-1; 40-4. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో - స్థానిక స్వపరిపాలన - అభివృద్ధి క్రమం

ప్రజల చేతికే పాలనాపగ్గాలు!


ఒక పంచాయతీలో పరిశుభ్రతను ప్రధాని ప్రత్యక్షంగా పర్యవేక్షించడం సాధ్యం కాదు. మారుమూల పల్లెకు మంచినీటిని అందించే బాధ్యతను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించలేరు. వేల గ్రామాల్లో విద్యుత్తు, రహదారుల వంటి సౌకర్యాల కల్పన, నిర్వహణ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు కుదిరేపని కాదు. అందుకే ఆ బాధ్యతలన్నింటినీ స్థానిక ప్రజలకే ఇచ్చేశారు. తమను తామే పాలించుకునే రాజ్యాంగబద్ధ అధికారాన్ని అప్పగించేశారు. ఈ పరిణామాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 


స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి, వాటిని సమర్థంగా అమలు చేయాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. అందుకోసం ఏర్పాటైనవే స్థానిక స్వపరిపాలన సంస్థలు. వీటి ద్వారా పాలనాపగ్గాలు ప్రజల చేతుల్లోనే ఉంటాయి. 

 

స్థానిక సంస్థల ఆవశ్యకత

* ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి.

* పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాయి.

* స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తాయి.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తాయి.

* ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి.

 

అభివృద్ధి క్రమం

ప్రాచీన భారతదేశంలో: * రుగ్వేదంలో ‘సభ’, ‘సమితి’ అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా ప్రజాసంక్షేమ పాలన నిర్వహించేవారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వాటిని పరిపాలనాపరమైన ‘కవలలు’గా పేర్కొన్నారు. ఇవి గ్రామస్థాయిలో అనేక పరిపాలన, రాజకీయపరమైన విధులను నిర్వర్తించేవి.

* ఆది కావ్యంగా పేరుపొందిన ‘రామాయణం’లో ‘జనపదం’ అనే పేరును అనేక గ్రామాల సమాఖ్యగా అభివర్ణించారు.

* మహాభారతంలోని ‘శాంతి పర్వం’ ప్రకారం గ్రామీణ పరిపాలనను ‘గ్రామసంఘాలు’ నిర్వహించేవి.

* శుక్రాచార్యుడు రచించిన ‘నీతిశాస్త్రం’ గ్రంథంలో ‘గ్రామాల కామన్వెల్త్‌’ గురించి పేర్కొన్నారు.

* ‘బౌద్ధం విలసిల్లిన కాలంలోనే భారత్‌లో స్థానిక పాలన వర్ధిల్లింది’ అని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

* కౌటిల్యుడు తన ‘అర్థశాస్త్రం’ గ్రంథంలో మౌర్యుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరించారు. ఈ గ్రంథంలో గ్రామ పరిపాలన అధికారిని ‘గ్రామణి’ అని, పది గ్రామాల పరిపాలనా అధికారిని ‘దశ గ్రామణి’గా పేర్కొన్నారు.

* మన దేశంలో గ్రామీణ పాలనకు ప్రణాళికాబద్ధమైన పునాదులు వేసి, అభివృద్ధి వైపు అడుగులు వేయించారు చోళులు. చోళరాజైన మొదటి పరాంతకుడు వేయించిన ‘ఉత్తర మెరూర్‌’ శాసనం ప్రకారం చోళులు కుండలకు రంధ్రం చేసి వాటిని బ్యాలెట్‌ బాక్సులుగా, రంగులు వేసిన తాటి ఆకులను బ్యాలెట్‌ పత్రాలుగా ఉపయోగించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించేవారు.

* చోళుల పాలనా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ సమస్యల పరిష్కారం కోసం ‘పంచాస్‌’ అనే అయిదుగురు సభ్యులతో ఒక మండలి ఉండేది. ‘పంచాస్‌’ పదమే ‘పంచాయతీ’గా పరిణామం చెందింది.

మధ్యయుగంలో: * క్రీ.శ.712లో మహ్మద్‌ బిన్‌ ఖాసిం ‘సింధు’ ప్రాంతాన్ని జయించడం, భారత్‌పై తరచూ మహ్మదీయుల దండయాత్రలు జరగడం వంటి పరిణామాలతో ఇక్కడి స్థానిక స్వపరిపాలనకు విఘాతం కలిగింది.

* దిల్లీ సుల్తాన్‌ల పరిపాలనా కాలంలో గ్రామీణ ప్రాంతాల పాలనకు ‘పంచాయతీలు’ ఉండేవి. కానీ అవి పూర్తిస్థాయిలో స్వయంప్రతిపత్తితో కొనసాగలేదు.

* షేర్షా పాలనా కాలంలో భూమిని కొలిచి దాని ఆధారంగా శిస్తు విధించే విధానం, గ్రామీణ స్థానిక సంస్థల పరిపాలన కొనసాగేవి.

* మొగలుల హయాంలో స్థానిక పాలనకు సంబంధించిన అన్ని నిర్ణయాలను ‘పంచాయతీలు’ తీసుకునేవి. వీరి పాలనా కాలంలో పట్టణ పాలనాధికారి ‘కొత్వాల్‌’. అతడికి సహకరించేందుకు ‘మున్సబ్‌’ అనే అధికారి ఉండేవారు.

* ఆంగ్లేయులు, పోర్చుగీసువారు, ఫ్రెంచివారు, డచ్‌వారు వర్తకం కోసం భారత్‌లోకి ప్రవేశించడం, వారి మధ్య జరిగిన ఘర్షణలు, వారు భారతీయులతో చేసిన యుద్ధాలు తదితరాలన్నీ భారత్‌లో స్థానిక స్వపరిపాలనపై తీవ్రమైన దుష్ప్రభావం చూపాయి.

ఆంగ్లేయుల పాలనా కాలంలో: * ఈస్టిండియా కంపెనీ పరిపాలనా కాలంలో ప్రజల నుంచి పన్నుల వసూళ్లే లక్ష్యంగా 1687లో మద్రాసులో తొలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటైంది. పన్నుల విధింపును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో 1726లో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదులుగా ‘మేయర్‌’ కోర్టులను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కోర్టులు పాలనా వ్యవహారాల కంటే న్యాయ సంబంధ విధులకే ప్రాధాన్యం ఇచ్చేవి.

* 1772లో వారన్‌ హేస్టింగ్స్‌ కాలంలో ‘జిల్లా’ను ఒక పరిపాలనా యూనిట్‌గా చేసుకుని, భూమిశిస్తు వసూలు లక్ష్యంగా ‘జిల్లా కలెక్టర్‌’ పదవిని ప్రవేశపెట్టారు.

* 1793 నాటి చార్టర్‌ చట్టం ప్రకారం బొంబాయి, మద్రాసు, కలకత్తా పట్టణాల్లోని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు చట్టబద్ధత కల్పించారు.

* 1813 నాటి చార్టర్‌ చట్టం ప్రకారం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు.

* 1861 నాటి ‘ఇండియన్‌ కౌన్సిల్‌’ చట్టం ప్రకారం స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించారు.

* 1870లో లార్డ్‌ మేయో ప్రవేశపెట్టిన ‘ఆర్థిక వికేంద్రీకరణ’ విధానం, మన దేశంలో పరిపాలనా వికేంద్రీకరణకు పునాదిగా నిలిచింది.

* చార్లెస్‌ మెట్‌కాఫ్‌ భారతదేశ గ్రామీణ సమాజాలను ‘లిటిల్‌ రిపబ్లిక్స్‌’గా అభివర్ణించారు.

 

లార్డ్‌ రిప్పన్‌ చొరవ

* 1882, మే 18న లార్డ్‌ రిప్పన్‌ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఒక తీర్మానాన్ని వెలువరిస్తూ ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను వాటికి బదిలీ చేశారు. ఈ తీర్మానాన్ని భారతదేశ స్థానిక స్వపరిపాలన చరిత్రలో ‘మాగ్నా కార్టా’గా అభివర్ణిస్తారు. దాని ద్వారా భారత్‌లోని స్థానిక స్వపరిపాలనకు ఒక నిర్దిష్ట రూపం వచ్చింది. అందుకే లార్డ్‌ రిప్పన్‌ను ‘భారత్‌లో స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడు’గా పేర్కొంటారు.

రిప్పన్‌ తీర్మానం ప్రకారం స్థానిక సంస్థలను వర్గీకరించారు. అవి 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీలు 2) మధ్య స్థాయి - తాలుకా బోర్డులు 3) ఉన్నత స్థాయి - జిల్లా బోర్డులు.

స్థానిక సంస్థలకు సంబంధించి బెంగాల్‌ మున్సిపాలిటీల చట్టం - 1884, బెంగాల్‌ స్థానిక ప్రభుత్వాల చట్టం - 1885, బెంగాల్‌ స్థానిక గ్రామీణ స్వయంపాలన చట్టం - 1919 లాంటివి కీలకమైనవి.

 

రాయల్‌ కమిషన్‌ (1907)

భారత్‌లో స్థానిక స్వపరిపాలనా సంస్థల పనితీరును సమీక్షించి, తగిన సిఫార్సులు చేయడానికి 1907లో చార్లెస్‌ హబ్‌హౌస్‌ అధ్యక్షతన ‘రాయల్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ 1909లో నివేదిక సమర్పించింది. ఇందులోని అంశాలు:

- ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచాలి. మూడు స్థాయుల్లో ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి.

- ప్రాథమిక విద్య (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) బాధ్యతను పురపాలక సంఘాల (మున్సిపాలిటీ)కు అప్పగించాలి.

- ప్రతి గ్రామానికీ ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి.

- జనాభా ఆధారంగా పురపాలక సంస్థలను ఏర్పాటు చేయాలి.

- పరిపాలనా వికేంద్రీకరణను పటిష్టంగా అమలుచేయాలి.

 

మింటో - మార్లే సంస్కరణలు (1909)

రాయల్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా 1909లో మింటో - మార్లే సంస్కరణల చట్టంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. 

 

మాంటేగ్‌-ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం (1919)

* ఈ చట్టం ద్వారా కేంద్ర జాబితాలోని ‘స్థానిక స్వపరిపాలన’ను రాష్ట్ర జాబితాలోకి మార్చారు.

* స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు లభించింది.

* 1919 నాటికి మన దేశంలోని జిల్లా బోర్డుల సంఖ్య 207. తాలుకా బోర్డుల సంఖ్య 584.

 

భారత ప్రభుత్వ చట్టం-1935

* ఈ చట్టం ద్వారా మన దేశంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ‘స్వయంప్రతిపత్తి’ కల్పించారు. వాటి పాలన మంత్రుల పరిధిలోకి వచ్చింది. ఈ సంస్థలకు సభ్యులు ‘నామినేట్‌’ అయ్యే విధానాన్ని రద్దు చేశారు. ‘జిల్లా బోర్డు’లో రాష్ట్రాలకు పూర్తిస్థాయి స్వాతంత్య్రం కల్పించడంతో స్థానిక స్వపరిపాలన సంస్థల స్వావలంబన సాధ్యమైంది.

* భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం 1937లో రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమవడం, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయడంతో స్థానిక స్వపరిపాలనా సంస్థల పరిస్థితి అయోమయంగా మారింది.

 

స్వాతంత్య్రానంతరం

1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రూపకల్పన సమయంలో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పరిపాలన వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రాధాన్యాన్ని వివరిస్తూ శ్రీమన్నారాయణ్‌ అగర్వాల్‌ ‘గాంధీ ప్లాన్‌’ను ప్రతిపాదించారు.

 

గాంధీజీ - ఆలోచనలు

* గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని గాంధీజీ పేర్కొన్నారు. భారతదేశ ప్రగతికి గ్రామాలు పట్టుగొమ్మలని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంపొందించాలని ఆయన అన్నారు. * ప్రాచీన భారతంలో ప్రతి గ్రామం స్వయంసమృద్ధితో, చిన్న చిన్న రిపబ్లిక్‌లుగా కొనసాగేవన్నారు.

 

ప్రారంభ రాజ్యాంగంలో 

* 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం IVవ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో (ఆర్టికల్‌ 40) గ్రామ పంచాయతీల ఏర్పాటును పేర్కొన్నారు. వీటి ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం సాధ్యమవుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.

* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను పేర్కొన్నారు. దీనిలో స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటుచేసే బాధ్యతను రాష్ట్ర జాబితాలో చేర్చారు.

 

పీవీ హయాంలో రాజ్యాంగ హోదా


* పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా ‘పంచాయతీరాజ్‌ వ్యవస్థ’కు రాజ్యాంగ భద్రత కల్పించారు. ఈ చట్టంతో రాజ్యాంగానికి IXవ భాగం చేర్చి, దానిలో ఆర్టికల్స్‌ 243, 243(A) నుంచి 243(O) వరకు పంచాయతీరాజ్‌/గ్రామీణ స్థానిక స్వపరిపాలనా సంస్థల విధివిధానాలను పేర్కొన్నారు.

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను చేర్చి, దానిలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను వివరించారు.

* పి.వి.నరసింహారావు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించింది. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగానికి IX(A) భాగాన్ని చేర్చి దానిలో ఆర్టికల్, 243(P) నుంచి  243(ZG) వరకు పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థల పరిపాలనను వివరించారు.

* 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా రాజ్యాంగానికి కొత్తగా 12వ షెడ్యూల్‌ను చేర్చి, అందులో పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను నిర్దేశించారు.

రచయిత: బంగారు సత్యనారాయణ

 

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సామాజిక వికాస ప్రయోగాలు

పల్లెసీమల్లో నవోదయం!


పల్లె సీమల్లో ప్రగతి వెలుగులు నింపి, గ్రామీణుల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో శతాబ్దంపైగా సామాజిక వికాస ప్రయోగాలు సాగుతున్నాయి. సమాజంలో సమానత్వాన్ని, చైతన్యాన్ని పెంపొందించి, స్వయం సమృద్ధిని సాధించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం వ్యక్తులు, సంస్థలు మొదలు ప్రభుత్వాల వరకు ఎందరో కృషి చేశారు. అనేక విధానాలు, పథకాలను అమలు చేశారు. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

   

గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యమే ధ్యేయంగా స్వాతంత్య్రానికి పూర్వం పలువురు వ్యక్తుల ఆధ్వర్యంలో అవి జరిగాయి. స్వాతంత్య్రానంతరం అదే తరహాలో ఉపాధి, ఇల్లు, ఇతర మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి.

 

సుందర్బన్స్‌ ప్రయోగం(1903): పశ్చిమ బెంగాల్‌లోని ‘సుందర్బన్స్‌’ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 1903లో ‘డేనియల్‌ హామిల్టన్‌’ శ్రీకారం చుట్టారు. గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించారు.

 

గుర్గావ్‌ ప్రయోగం (1920): 1920లో పంజాబ్‌లోని ‘గుర్గావ్‌’ జిల్లాలో ఎఫ్‌.ఐ.బ్రేయన్‌ అనే డిప్యూటీ కమిషనర్‌ గ్రామీణ అభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. 1933 నుంచి ‘గుర్గావ్‌ గ్రామీణాభివృద్ధి ఉద్యమం’ విస్తృతంగా కొనసాగింది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1935-36లో రూ.కోటి కేటాయించి ప్రోత్సహించింది.

కీలకాంశాలు: 1) అభివృద్ధి పథకాలను వ్యవస్థీకరించడం. 2) వివాహం, ఉత్సవం, విందు, వినోదాల్లో జరిగే ధనవ్యయాన్ని తగ్గించి సమాజ అభివృద్ధికి వినియోగించడం. 3) వ్యవసాయోత్పత్తిని, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం. 4) మహిళా విద్య, గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం.

 

మార్తాండం ప్రయోగం(1921): తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మార్తాండం ప్రాంతంలో అమెరికన్‌ వ్యవసాయ రంగ నిపుణుడు ‘స్పెన్సర్‌ హాచ్‌’ దీనికి ఆద్యుడు. సుమారు 70 గ్రామాలకు చెందిన ప్రజల సమగ్రాభివృద్ధి కోసం వైఎంసీఏ (యంగ్‌ మెన్స్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌)ను ఏర్పాటు చేసి, ఈ ప్రయోగం నిర్వహించారు. 

కీలకాంశాలు: 1) అభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. 2) గ్రామీణ పునర్నిర్మాణం. 3) మౌలిక రంగాల్లో ప్రజలకు తర్ఫీదునివ్వడం. 4) అధునిక సాగు పద్ధతులను అవలంబించడం. 5) పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం.

 

శ్రీనికేతన్‌ ప్రయోగం (1922): విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కలకత్తాలోని శాంతినికేతన్‌లో దీన్ని ప్రారంభించారు. సామాజిక వికాస ప్రయోగాల్లో ఆత్మగౌరవాన్ని కీలకాంశంగా తీసుకున్నారు.

కీలకాంశాలు: 1) చిన్నతరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ. 2) ఆత్మగౌరవంతో స్వయంసమృద్ధి సాధించడం. 3) వయోజన విద్య, ప్రజల ఆరోగ్య సంరక్షణ.

 

బరోడా ప్రయోగం (1932):  బరోడా సంస్థానంలో ‘దివాన్‌’గా పనిచేసిన వి.టి.కృష్ణమాచారి 1932లో సమాజ అభివృద్ధి సాధనలో భాగంగా ఈ ప్రయోగం చేపట్టారు.

కీలకాంశాలు: 1) గ్రామీణ యువతీ యువకులను చైతన్యపరచి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం. 2) రోడ్ల నిర్మాణం, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం ద్వారా సమాజ ప్రగతికి కృషి చేయడం.

 

సేవాగ్రామ్‌ ప్రయోగం(1933):  మహారాష్ట్రలోని ‘వార్ధా’ ప్రాంతంలో మహాత్మాగాంధీ 1933లో దీన్ని ప్రారంభించారు. ఆచార్య వినోబా భావే, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితరులు విస్తృతపరిచారు.

కీలకాంశాలు: 1) సర్వోదయ, నవోదయ సిద్ధాంతాల ఆధారంగా సమాజాన్ని నిర్మించడం. 2) ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు కృషి చేయడం.3) ప్రాతిపదిక విద్య (Basic Education)లో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజల స్వయంసమృద్ధికి పాటుపడటం.

 

ఫిర్కా ప్రయోగం (1946): టంగుటూరి ప్రకాశం మద్రాస్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో ‘ఫిర్కా’ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

కీలకాంశాలు: 1) తాలుకాలను ఫిర్కాలుగా విభజించి వాటి సమగ్రాభివృద్ధికి కృషి చేయడం. 2) వెనుకబాటుతనం ఆధారంగా ఫిర్కాలను ఎంపిక చేయడం. 3) కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ. 4) సహకార సంస్థల ఏర్పాటు. 5) అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం.

* 1952లో భారత ప్రభుత్వం ‘సమాజ అభివృద్ధి పథకం’ (Community Development Programme - CDP) ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను ‘బ్లాకు’ల్లో విలీనం చేశారు.

 

ఇటావా ప్రయోగం(1948): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా ‘మహేవా’ ప్రాంతంలో ఆల్బర్ట్‌ మేయర్‌ దీన్ని ప్రారంభించారు. సుమారు 97 గ్రామాలను ఎంపిక చేసుకుని పౌర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నించారు.

కీలకాంశాలు: 1) కళారూపాలతో ప్రజల్లో సామాజిక చైతన్యం పెంచడం. 2) వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేనేత పరిశ్రమలకు ప్రోత్సాహం. 3) పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కృషి.

 

నీలోఖరి ప్రయోగం (1948):  హరియాణాలోని కర్నాల్‌ జిల్లా ‘నీలోఖరి’ ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. దేశ విభజన సందర్భంగా నిరాశ్రయులైన సుమారు 7 వేల మందికి పునరావాసం కల్పించడం ఈ ప్రయోగం లక్ష్యం. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖుడు సురేంద్ర కుమార్‌ డే (ఎస్‌కే డే). 

కీలకాంశాలు: 1) స్వయంశక్తితో అభివృద్ధి చెందే విధంగా ప్రజలను ప్రోత్సహించడం. 2) వ్యవసాయ పనిముట్ల తయారీ, ఇంజినీరింగ్‌ వర్క్స్‌లో శిక్షణ ఇవ్వడం. 3) గృహ వసతి, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడం.

 

గ్రో మోర్‌ ఫుడ్‌ కాంపెయిన్‌ (1942): క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో బెంగాల్‌లో కరవు, తుపానుల ఫలితంగా ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచే విధంగా బ్రిటిషర్లు 'Grow More Food Campaign'ను 1942లో ప్రారంభించారు. కానీ ఆశించిన ఫలితాలివ్వలేదు.

* 1947, ఆగస్ట్‌ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి దేశం తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ‘గ్రో మోర్‌ ఫుడ్‌’ లక్ష్యంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది.

* మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో భాగంగా గ్రామీణాభివృద్ధిపై వి.టి.కృష్ణమాచారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. దాని సిఫారసుల మేరకు దేశంలో ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 బ్లాకుల్లో (సమితులు) 1952, అక్టోబరు 2న ‘సమాజ అభివృద్ధి కార్యక్రమం’ (CDP) ప్రారంభించారు.

 

సమాజ అభివృద్ధి కార్యక్రమం (1952): అమెరికాలో అమలైన ‘బ్లాక్‌’ (Block) ను అభివృద్ధికి నమూనాగా తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహకారం అందించింది. అప్పటి అమెరికా రాయబారి చెస్టర్‌ బౌల్స్‌ ద్వారా 5 మిలియన్‌ డాలర్లు సమకూర్చింది. 1971 నాటికి ఫోర్డ్‌ ఫౌండేషన్‌ అందించిన ఆర్థిక సహకారం సుమారు 104 మిలియన్‌ డాలర్లు.


ఎంపిక చేసిన అంశాలు: 1) పేదరికం, నిరుద్యోగం నిర్మూలన. 2) గ్రామీణ సమాచార వ్యవస్థ, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు. 3) ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, సాంఘిక సంక్షేమం. 4) వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, గృహవసతి.


సీడీపీ లక్ష్యాలు: 1) ప్రజలు సంఘటితమై తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడం. 2) వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమం సాధించడం. 3) దేశ ప్రగతిలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేయడం.


కీలకాంశాలు:  1) ఈ పథకాన్ని మొదటిసారిగా ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 బ్లాకుల్లో ప్రారంభించారు. ప్రతి బ్లాకులో సుమారు 100 గ్రామాలు, 70 వేల జనాభా ఉంటుంది.  2) ప్రతి బ్లాకుకు కార్యనిర్వహణాధికారిగా బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వ్యవహరిస్తారు. 3) సీడీపీని ప్రచారం చేయడానికి గ్రామస్థాయిలో ‘గ్రామ్‌సేవక్‌’ అనే అధికారిని నియమించారు. 4) ప్రజలు స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 5) సీడీపీ తర్వాత కాలంలో 5011 బ్లాకులకు విస్తరించింది.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం: సీడీపీకి కొనసాగింపుగా దేశంలోని 1700 బ్లాకుల్లో ‘జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extension Service Scheme n- NESS)’ ను 1953, అక్టోబరు 2న ప్రారంభించారు. సీడీపీని మూడేళ్ల కాలపరిమితితో రూపొందించగా, ‘ఎన్‌ఈఎస్‌ఎస్‌’ను శాశ్వత ప్రాతిపదికన చేపట్టారు.

* ఎన్‌ఈఎస్‌ఎస్‌ ద్వారా వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, విద్యా రంగాలు అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

 

వివిధ స్థాయుల్లో అమలు:

కేంద్ర స్థాయి: సమాజ అభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో అమలవుతుంది.

రాష్ట్ర స్థాయి: ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే ‘రాష్ట్ర అభివృద్ధి సంఘం’ పర్యవేక్షణలో అమలవుతుంది.

జిల్లా స్థాయి: కలెక్టర్‌ పర్యవేక్షణలో అమలవుతుంది.

బ్లాకు స్థాయి: బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో అమలవుతుంది.

గ్రామ స్థాయి: విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌ (వీఎల్‌డబ్ల్యూ) పథకం అమలుకు కృషి చేస్తారు.

* సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్‌.కె.డే వ్యవహరించారు. ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం ‘సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం వంటిది’ అని ఆయన పేర్కొన్నారు.

* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం భారతదేశంలో ‘ఒక నిశ్శబ్ద విప్లవం’ వంటిదని జవహర్‌లాల్‌ నెహ్రూ అభివర్ణించారు.

* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం అమలులో గ్రామస్థాయిలో కీలకపాత్ర పోషించేది విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌.  వీరికి అన్ని రంగాల్లోనూ శిక్షణ ఇచ్చేవారు. అందుకే వీరిని మల్టీపర్పస్‌ వర్కర్స్‌గానూ పిలిచేవారు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 14-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్థానిక స్వపరిపాలన: వివిధ కమిటీలు - సిఫారసులు

ప్రజలే పాలకులై.. స్థానిక నాయకులై!


ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు స్థానిక సంస్థలు అత్యంత కీలకమని అనేక కమిటీలు పేర్కొంటున్నాయి. అవసరమైన అధికారాలు, విధులు, నిధులు సమకూరిస్తే ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష వేదికలైన గ్రామాల్లో సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందని చెబుతున్నాయి. దాంతోపాటు అధికార వికేంద్రీకరణకు అనేక సూచనలు చేశాయి. ఆ కమిటీలు, అవి చేసిన సిఫారసుల గురించి పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

 

 

బల్వంతరాయ్‌ మెహతా కమిటీ (1957): సమాజ అభివృద్ధి పథకం (సీడీపీ), జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (ఎన్‌ఈఎస్‌ఎస్‌) పథకాల పనితీరుపై అధ్యయనం చేసేందుకు 1957, జనవరి 16న బల్వంతరాయ్‌ మెహతా కమిటీని జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ‘ప్రజాస్వామ్య వికేంద్రీకరణ - ప్రజల భాగస్వామ్యం’ అనే మౌలికాంశాలతో మూడంచెల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేస్తూ 1957, నవంబరు 24న ఒక నివేదిక సమర్పించింది. 1958, జనవరిలో ఎన్‌డీసీ దాన్ని ఆమోదించింది.

సిఫారసులు: *మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ 2) బ్లాకు/మధ్య స్థాయి - పంచాయతీ సమితి 3) ఉన్నత/జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌.

* గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు.

* బ్లాకు/మధ్యస్థాయి సభ్యులను వివిధ గ్రామ పంచాయతీల సభ్యులు ఎన్నుకోవాలి.

* జిల్లా/ఉన్నత స్థాయిలో సభ్యులను బ్లాకు స్థాయి సభ్యులు ఎన్నుకోవాలి. 

* స్థానిక సంస్థలకు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రాతిపదికపై ఎన్నికలు.

* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలు, జిల్లా పరిషత్‌కు సలహా, పర్యవేక్షక అధికారాలు.  

* స్థానిక సంస్థలకు అయిదేళ్లకోసారి క్రమం తప్పకుండా ఎన్నికలు.

* జిల్లా పరిషత్‌కు ఛైర్మన్‌గా కలెక్టర్‌.

* భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి.

* స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, అధికారాలను కల్పించాలి.

మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం రాజస్థాన్‌. 1959, అక్టోబరు 2న రాజస్థాన్‌లోని నాగోర్‌ జిల్లా సికార్‌ ప్రాంతంలో తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ విధానాన్ని ప్రారంభించారు. ‘‘నేడు ప్రారంభిస్తున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తాయి. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. భవిష్యత్తు నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి’’ అని ఆ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

* మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1959, నవంబరు 1న ‘శంషాబాద్‌’ గ్రామంలో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దాన్ని ప్రారంభించారు.

 

అశోక్‌ మెహతా కమిటీ (1977): స్థానిక స్వపరిపాలనను మరింత పటిష్ఠపరిచేందుకు, అవసరమైన విధానాలను అధ్యయనం చేసేందుకు జనతా ప్రభుత్వం 1977, డిసెంబరు 12న అశోక్‌ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో నంబూద్రిపాద్, ఎం.జి.రామచంద్రన్‌ సభ్యులు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ విధానాలను అధ్యయనం చేసిన ఈ కమిటీ 1978, ఆగస్టు 21న 132 సిఫారసులతో నివేదిక సమర్పించింది.

సిఫారసులు: * రెండంచెల పంచాయతీరాజ్‌ విధానం. 1) బ్లాకు స్థాయి - మండల పరిషత్‌ 2) జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌

* మండల పరిషత్‌ అతికీలకమైన అంచెగా కొనసాగాలి. దీనిలో 15,000-20,000 వరకు జనాభా ఉండాలి.

* గ్రామ పంచాయతీలను రద్దు చేసి, వాటి స్థానంలో ‘గ్రామ కమిటీ’లను ఏర్పాటు చేయాలి.

* అభివృద్ధి పథకాల అమలు విషయంలో గ్రామ పంచాయతీని యూనిట్‌గా కాకుండా సబ్‌ యూనిట్‌గా ఏర్పాటు చేయాలి.  

* స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనాలి. స్థానిక సంస్థల పదవీ కాలం నాలుగేళ్లు.

* పంచాయతీరాజ్‌ వ్యవస్థల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ మంత్రి నియామకం.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. షెడ్యూల్డు కులాలు, తెగ (ఎస్సీ, ఎస్టీ)లకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు.

* బలమైన కారణం లేకుండా స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకూడదు. ఒకవేళ రద్దు చేస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.

* మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరగాలి. జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక మాత్రం పరోక్షంగానే ఉండాలి.

* స్థానిక సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి, స్వతంత్రంగా నిధులు సమకూర్చుకునే అవకాశం కల్పించాలి.

* స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు స్వయంప్రతిపత్తి ఉన్న ఎన్నికల కమిషన్‌ ఉండాలి.

* అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన ‘న్యాయ పంచాయతీ సంస్థల’ను ఏర్పాటుచేసి, వాటిని గ్రామ పంచాయతీల నుంచి వేరు చేయాలి.

* సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఖర్చు చేసిన విధానంపై సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) ఉండాలి.

* ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను మండల పరిషత్‌లు కల్పించాలి.

‘‘స్థానిక స్వపరిపాలనా సంస్థలు విఫలమైన భగవంతుడు కాదు, వాటికి సరైన నిధులు, విధులు సమకూరిస్తే విజయవంతంగా పనిచేస్తాయి’’ అని అశోక్‌ మెహతా కమిటీ పేర్కొంది. ఈ కమిటీ సిఫారసులను 1979లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించారు. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం పతనం కావడంతో మొత్తం సిఫారసులు అమల్లోకి రాలేదు. కొన్ని రాష్ట్రాలు మార్పులు, చేర్పులతో కొన్నింటిని అమలు చేశాయి.

* మండల పరిషత్‌ వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక. 1985, అక్టోబరు 2న అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

* మండల పరిషత్‌ వ్యవస్థను అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1986, జనవరి 13న నాటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు  ప్రారంభించారు.

 

దంతెవాలా కమిటీ (1978): ‘బ్లాకు’ స్థాయి ప్రణాళికీకరణపై అధ్యయనం కోసం దంతెవాలా కమిటీని 1978లో జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * ‘బ్లాకు’ను ఒక యూనిట్‌గా తీసుకుని ప్రణాళికా రచన చేయాలి.

* మాధ్యమిక స్థాయిలో ‘బ్లాకు’ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలి.

* జిల్లా స్థాయి ప్రణాళికా రూపకల్పనలో కలెక్టర్‌దే కీలకపాత్ర.

* గ్రామస్థాయిలో సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక.

 

సీహెచ్‌ హనుమంతరావు కమిటీ (1984): ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ‘జిల్లా స్థాయి’ ప్రణాళికీకరణపై అధ్యయనం చేసేందుకు 1984లో సీహెచ్‌ హనుమంతరావు కమిటీని ఏర్పాటు చేశారు.

సిఫారసులు: * జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలి.

* జిల్లా ప్రణాళికా సంఘానికి కలెక్టర్‌ లేదా మంత్రి అధ్యక్షత వహించాలి.

* జిల్లా స్థాయిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సమన్వయకర్త కలెక్టర్‌.

 

జి.వి.కె.రావు కమిటీ (1985): రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో ప్రణాళికా సంఘం ‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాలను అధ్యయనం చేసేందుకు 1985లో జి.వి.కె.రావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * బ్లాకు వ్యవస్థ, బీడీఓ పదవుల రద్దు.

* జిల్లా అభివృద్ధి అధికారి (డీడీఓ) పదవి ఏర్పాటు.

* జిల్లా స్థాయి యూనిట్‌లకు ప్రణాళిక విధుల బదిలీ.

* జిల్లా స్థాయిలో నైష్పత్తిక ప్రాతినిధ్యంతో కూడిన ఉప కమిటీల ఏర్పాటు.

* స్థానిక సంస్థలకు నిర్ణీత పదవీకాలం ప్రకారం ఎన్నికలు.

‘‘భారతదేశంలో ఉద్యోగస్వామ్యం కారణంగా పరిపాలనా స్ఫూర్తి దెబ్బతింటోంది. ఇది పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలహీనపరచింది. దీంతో ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్న వ్యవస్థగా కాకుండా, వేర్లు లేని వ్యవస్థగా మారింది’’ అని జి.వి.కె.రావు కమిటీ ఆక్షేపించింది.

 

ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీ (1986):  ‘ప్రజాస్వామ్యం, అభివృద్ధి సాధనకు పంచాయతీరాజ్‌ సంస్థల పునర్నిర్మాణం’ అనే అంశంపై అధ్యయనం చేయడానికి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలి. 

* గ్రామీణ పరిపాలనలో ‘గ్రామసభ’కు ప్రాధాన్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా గుర్తింపు ఇవ్వాలి.

* కొన్ని గ్రామాల సమూహాన్ని కలిపి న్యాయ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికల వివాదాల పరిష్కారం కోసం న్యాయ ట్రైబ్యునల్స్‌ ఉండాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు క్రమం తప్పకుండా, సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకోసం స్వయంప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను, అధికారాలను, విధులను కేటాయించాలి. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

 

పి.కె.తుంగన్‌ కమిటీ (1988):  స్థానిక స్వపరిపాలనను పటిష్ఠ పరిచేందుకు అవసరమైన సిఫారసులు చేసేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1988లో అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పి.కె.తుంగన్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా, దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

* జిల్లా పరిషత్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) గా కలెక్టర్‌ ఉండాలి.

* స్థానిక సంస్థల పదవీకాలం నిర్దిష్టంగా అయిదేళ్లు.

* జనాభా ఆధారంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలి.

* జిల్లా ప్రణాళికా అభివృద్ధికి ఏజెన్సీగా జిల్లా పరిషత్‌ ఉండాలి.

 

వి.ఎన్‌.గాడ్గిల్‌ కమిటీ (1988): రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో స్థానిక స్వపరిపాలనపై అధ్యయనం కోసం 1988లో వి.ఎన్‌.గాడ్గిల్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది.

సిఫారసులు: * స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలి. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.


రచయిత: బంగారు సత్యనారాయణ 
 

Posted Date : 11-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పంచాయతీరాజ్‌ వ్యవస్థ - రాజ్యాంగ భద్రత

సుపరిపాలనకు.. సుస్థిర ప్రగతికి!

 

పాలనలో ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములను చేసే లక్ష్యంతో, గ్రామాలకు సాధికారతను సమకూర్చే ఉద్దేశంతో, అధికార వికేంద్రీకరణ ప్రధానంగా ఒక విశిష్ట వ్యవస్థ ఆవిర్భవించింది. దానికి రాజ్యాంగ భద్రతను కల్పించారు. పాలకుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు, పల్లె సీమల్లో సుస్థిరాభివృద్ధిని, సుపరిపాలనను నెలకొల్పేందుకు ఆ వ్యవస్థ దోహదపడుతోంది. ఇండియన్‌ పాలిటీ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు దాని పూర్వాపరాలు, రాజ్యాంగ సవరణ చట్టంతో అందులో వచ్చిన మార్పుల వివరాలను తెలుసుకోవాలి. 

 

 

స్థానిక స్వపరిపాలనా సంస్థలు సమర్థంగా పనిచేయాలంటే వాటికి రాజ్యాంగ భద్రత అవసరం. రాజ్యాంగం ద్వారా నిర్దిష్ట నియమాలను రూపొందించి, తగిన అధికారాలు, విధులు, ఆర్థిక వనరులను అందిస్తే గ్రామాల పాలన సక్రమంగా సాగుతుంది. గ్రామీణుల ఆకాంక్షలు నెరవేరతాయి. ఈ మహోన్నత లక్ష్య సాధన దిశలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు విశేష కృషి జరిగింది.

 

గాంధీజీ భావనలు

గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని, భారతదేశ ప్రగతికి గ్రామాలే పట్టుగొమ్మలని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంపొందించాలని గాంధీజీ సూచించారు. ప్రాచీన భారత దేశంలో ప్రతి గ్రామం స్వయంసమృద్ధితో, చిన్న చిన్న ‘రిపబ్లిక్‌’ల తరహాలో వర్ధిల్లేవని పేర్కొన్నారు.

* గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని, స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రాధాన్యాన్ని వివరిస్తూ శ్రీమన్నారాయణ్‌ అగర్వాల్‌ ‘గాంధీ ప్లాన్‌’ను ప్రతిపాదించారు.

* 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగం నాలుగో భాగంలోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 40 ‘గ్రామ పంచాయతీల’ ఏర్పాటును పేర్కొంటుంది. వీటిద్వారా పరిపాలనా వికేంద్రీకరణ జరిగి, ప్రజల భాగస్వామ్యం పెంపొందుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.

* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను పొందుపరిచారు. స్థానిక స్వపరిపాలనా సంస్థల ఏర్పాటు బాధ్యతను రాష్ట్ర జాబితాలో చేర్చారు.

 

రాజ్యాంగ భద్రత ప్రయత్నాలు

ఎల్‌.ఎం.సింఘ్వీ, పి.కె.తుంగన్‌ కమిటీల సిఫార్సు మేరకు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును లోక్‌సభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించింది. కానీ రాజ్యసభలో బిల్లు వీగిపోవడంతో చట్టరూపం దాల్చలేదు. * విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ (వీపీ సింగ్‌) ప్రభుత్వ కాలంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు 70వ రాజ్యాంగ సవరణ బిల్లును 1990, సెప్టెంబరు 7న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కానీ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో బిల్లు వీగిపోయింది.

పీవీ హయాంలో సాకారం:  పీవీ నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 1992, డిసెంబరు 22న ఈ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. దీనికి దేశంలో 17 రాష్ట్రాల శాసనసభలు కూడా అంగీకారం తెలిపాయి. ఈ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ 1993, ఏప్రిల్‌ 20న ఆమోదముద్ర వేయడంతో 73వ రాజ్యాంగ సవరణ, చట్టం (1992)గా మారి 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ‘ఏప్రిల్‌ 24’ను ఏటా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

 

73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992

పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం- 1992 ద్వారా రాజ్యాంగంలో రెండు ప్రధాన మార్పులు జరిగాయి.1) రాజ్యాంగానికి 9వ భాగాన్ని చేర్చారు. అందులో ఆర్టికల్స్‌ 243, 243(A) నుంచి 243(O) వరకు (మొత్తం 16 ఆర్టికల్స్‌) పంచాయతీరాజ్‌ వ్యవస్థ విధివిధానాలను సమగ్రంగా నిర్దేశించారు. 2) రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను చేర్చి పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 243: పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సంబంధించిన నిర్వచనాల గురించి వివరిస్తాయి. వీటిని సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా వెలువరిస్తారు. 

ఆర్టికల్‌ 243 (ఎ)- గ్రామసభ: గ్రామ పంచాయతీ పరిధిలోని రిజిస్టరైన ఓటర్లందరూ ‘గ్రామసభ’లో సభ్యులవుతారు. గ్రామసభ సమావేశాలకు సర్పంచి అధ్యక్షత వహిస్తారు. సర్పంచి అందుబాటులో లేకపోతే ఉపసర్పంచి అధ్యక్షత వహిస్తారు. గ్రామసభ సమావేశాలను సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం లోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు.

* గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్‌ 14, అక్టోబరు 3) తప్పనిసరిగా నిర్వహించాలి. అందులో విఫలమైతే ‘సర్పంచి’ తన పదవిని కోల్పోతారు. అలా పదవి కోల్పోయిన వ్యక్తికి సంవత్సరం పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు ఉండదు.* గ్రామసభ సభ్యుల్లో కనీసం 50 మంది లేదా కనీసం 10 శాతం మంది గ్రామసభ ఏర్పాటు చేయాలని లిఖితపూర్వకంగా కోరితే ‘సర్పంచి’ తప్పనిసరిగా సమావేశం ఏర్పాటు చేయాలి. * భారత ప్రభుత్వం 2009-10 సంవత్సరాన్ని గ్రామసభల సంవత్సరంగా ప్రకటించి దేశవ్యాప్తంగా గ్రామసభల ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది.

గ్రామసభ - అధికారాలు, విధులు: * గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్షిక నివేదికలను పరిశీలిస్తుంది.

* గ్రామ పంచాయతీకి శాసనసభలా వ్యవహరిస్తుంది.

* ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా నిలుస్తుంది.

* వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.

* గ్రామ పంచాయతీ గ్రామసభకు సమష్టి బాధ్యత వహిస్తుంది.

* మన గ్రామసభను పోలిన వ్యవస్థ స్విట్జర్లాండ్‌లోనూ ఉంది. దాని పేరు ‘ల్యాండ్స్‌ గెమెండ్‌’

 

ఆర్టికల్‌ 243(బి)(1)- పంచాయతీ రాజ్‌ వ్యవస్థాపన:  దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ 2) మధ్య/ బ్లాకు స్థాయి - పంచాయతీ సమితి 3) ఉన్నత స్థాయి - జిల్లా పరిషత్తు.

ఆర్టికల్‌ 243(బి)(2):  ఇరవై లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో మాధ్యమిక/బ్లాక్‌ స్థాయిలో పంచాయతీ సమితుల ఏర్పాటు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆర్టికల్‌ 243(సి):- సభ్యుల, అధ్యక్షుల ఎన్నిక విధానం: * మూడు స్థాయిల్లో (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తు) సభ్యులను ఓటర్లు ప్రత్యక్షంగా రహస్య ఓటింగుతో ఎన్నుకుంటారు. * గ్రామ పంచాయతీ (దిగువ స్థాయి) అధ్యక్ష/ సర్పంచి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్వహించుకోవచ్చు. ఎలా నిర్వహించాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్దేశిస్తుంది. * పంచాయతీ సమితి/బ్లాకు (మాధ్యమిక స్థాయి), జిల్లా పరిషత్తు (ఉన్నత స్థాయి) అధ్యక్షుల ఎన్నిక విధానం పరోక్షంగా ఉండాలి. * గ్రామ పంచాయతీ అధ్యక్షులు/ సర్పంచులు మాధ్యమిక వ్యవస్థలో సభ్యులుగా కొనసాగుతారు. * మాధ్యమిక వ్యవస్థ లేని రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ అధ్యక్షులు/సర్పంచులు ‘జిల్లా పరిషత్తు’లో సభ్యులుగా కొనసాగుతారు. * మాధ్యమిక వ్యవస్థ (పంచాయతీ సమితి) ఉన్న రాష్ట్రాల్లో మాధ్యమిక వ్యవస్థ/బ్లాకు కు చెందిన అధ్యక్షులు జిల్లా పరిషత్తులో సభ్యులుగా కొనసాగుతారు. * లోక్‌సభ సభ్యులు, విధానసభ సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలోని మాధ్యమిక వ్యవస్థ, జిల్లా పరిషత్తుల్లో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా కొనసాగవచ్చు.* రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు తాము ఓటరుగా నమోదైన జిల్లాలోని జిల్లా పరిషత్తు, మాధ్యమిక వ్యవస్థలలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా కొనసాగవచ్చు.

ఆర్టికల్‌ 243(డి)- రిజర్వేషన్లు: * పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. వారికి ఇచ్చిన రిజర్వేషన్లలో ఆయా వర్గాల మహిళలకు 1/3వ వంతు స్థానాలు రిజర్వ్‌ చేయాలి.

* పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 1/3వ వంతు స్థానాలను రిజర్వు చేయాలి.

* పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం - బిహార్‌

* కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2022, మార్చి 31 నాటికి మన దేశంలో 21 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లున్నాయి. 

* స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 110వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఇప్పటివరకు ఆమోదించలేదు.

 

సుప్రీంకోర్టు తీర్పు: అబ్దుల్‌ అజీజ్‌ అసాద్‌ జు( స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రపదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మహిళలకు స్థానికసంస్థల ఎన్నికల్లో 1/3వ వంతు స్థానాలను రిజర్వ్‌ చేయడం అనేది ‘రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు’ అనే నిబంధనకు వ్యతిరేకం కాదు అని పేర్కొంది.

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల వారికి (ఓబీసీ) రిజర్వేషన్లు నిర్దేశించలేదు. ఈ వర్గాల వారికి ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభల అభీష్టానికి వదిలిపెట్టారు.

* ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 ప్రకారం స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ వర్గాలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్‌ చేశారు.

* తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018 ప్రకారం స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ వర్గాలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్‌ చేశారు.

* అరుణాచల్‌ ప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) జనాభా లేని కారణంగా ఆ రాష్ట్ర స్థానికసంస్థల ఎన్నికల్లో ఎస్సీ వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేశారు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 18-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992

అధికార వికేంద్రీకరణకు రాజముద్ర! 

  ఒక మారుమూల ఊరికి నీరు కావాలి. పక్క గ్రామానికి వెళ్లేందుకు పక్కా రోడ్డు అవసరం. విస్తరించిన పల్లెకు విద్యుత్తు లైను వేయాలి. విద్య, వైద్యాలకు సంబంధించి ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి చేర్చాలి. ఇలాంటి వాటి కోసం పార్లమెంటు నుంచి ప్రత్యక్ష పాలన సాగించడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే పంచాయతీ రాజ్‌ వంటి స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్థానిక సమస్యలను స్థానికులే గుర్తించి, స్థానికంగా నిధులు సమీకరించి, ప్రణాళికలు రూపొందించి, అమలు చేసి పరిష్కరిస్తారు. ఇదంతా సక్రమంగా సాగేందుకు, అధికార వికేంద్రీకరణకు వీలు కల్పిస్తూ కొన్ని ప్రత్యేక సవరణ చట్టాలను చేసి రాజ్యాంగ భద్రత కల్పించారు. వాటిపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

  

కేంద్రంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టంతో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత ఏర్పడింది. ఆ చట్టాన్ని సమర్థంగా అమలుచేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం వదిలిపెట్టింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్నికల సంఘాన్ని, నిధుల పంపకానికి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. 

ఈ చట్టం వల్ల రాజ్యాంగంలో రెండు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటిది రాజ్యాంగానికి తొమ్మిదో భాగాన్ని చేర్చారు. అందులో ఆర్టికల్‌ 243, 243 (A) నుంచి 243 (O) వరకు మొత్తం 16 ఆర్టికల్స్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ విధి విధానాలను వివరించారు. రెండో మార్పు పదకొండో షెడ్యూల్‌ను చేర్చడం. అందులో పంచాయతీ రాజ్‌కు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు. ఈ చట్టం 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది.

 

ఆర్టికల్‌ 243 (E): పదవీకాలం: * పంచాయతీ సంస్థల పదవీ కాలం అవి ఏర్పడిన తేదీ నుంచి అయిదేళ్లు. అయితే పదవీకాలం కంటే ముందే పంచాయతీ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. ఆ విధంగా రద్దు చేస్తే ఆరు నెలల్లోగా తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి.

* పంచాయతీ సంస్థల సభ్యుల పదవులకు ఖాళీ ఏర్పడినప్పుడు వాటి భర్తీ కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన సభ్యులు మిగిలిన పదవీకాలం వరకు మాత్రమే కొనసాగుతారు. కానీ పంచాయతీ సంస్థ మొత్తానికి ఎన్నికలు ఆలస్యంగా జరిగితే మాత్రం పూర్తి కాలం అధికారంలో కొనసాగుతారు.

 

ఆర్టికల్‌ (E) : అర్హతలు, అనర్హతలు: * పంచాయతీ సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంబంధిత స్థానిక సంస్థలోని ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి. * 21 ఏళ్లు నిండి ఉండాలి.* దివాలా తీసి ఉండకూడదు.* 1995, మే 30 తర్వాత వివాహమైన దంపతులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదు.* ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన దేశ ప్రయోజనాల రీత్యా సమంజసమేనని ‘మహ్మద్‌ షరీఫ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హరియాణా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

 

ఆర్టికల్‌ 243 (G): పంచాయతీ సంస్థల అధికారాలు, విధులు: పంచాయతీరాజ్‌ సంస్థలు స్వయంసమృద్ధి సాధించి సమర్థంగా పనిచేయాలంటే వాటికి నిర్దిష్టమైన అధికారాలు, విధులు కల్పించాలి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను నిర్దేశించారు. ఆ విధంగా విధులను పంచాయతీరాజ్‌ సంస్థలకు బదిలీ చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (6+1): 1) కేరళ   2) కర్ణాటక   3) తమిళనాడు  4) రాజస్థాన్‌  5) సిక్కిం   6) పశ్చిమ బెంగాల్‌   7) డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలి.

 

ఆర్టికల్‌ 243 (H): రాష్ట్ర శాసన సభ రూపొందించే చట్టం ఆధారంగా పంచాయతీ సంస్థలు పన్నులు విధించి వసూలు చేస్తాయి.

 

పంచాయతీరాజ్‌ సంస్థలకు ఆదాయ వనరులు: * కేంద్ర ప్రభుత్వం అందించే సహాయక గ్రాంట్లు * రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే నిధులు, రాష్ట్రాల పన్నుల్లో వాటా * స్థానిక సంస్థలకు కింది పన్నుల ద్వారా ఆర్థిక వనరులు లభిస్తాయి.అవి  ఇంటిపన్ను, నీటిపన్ను, ఆస్తుల బదిలీపై పన్ను, దుకాణాలపై పన్ను, ప్రకటనలపై పన్ను, సంతలు, మార్కెట్ల నుంచి లభించే ఆదాయం, జరిమానాలు, విరాళాలు, స్థిరాస్తులను అద్దెకు ఇవ్వడం ద్వారా లభించే ఆదాయం, వృత్తిపన్ను, మూలధనం నుంచి వచ్చే ఆదాయం. 

 

ఆర్టికల్‌ 243 (I): రాష్ట్ర ఆర్థిక సంఘం: పంచాయతీరాజ్‌ సంస్థలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవసరమైన విధానాల అధ్యయనం, సిఫార్సులు చేయడంలో ‘రాష్ట్ర ఆర్థిక సంఘం’ కీలక భూమిక పోషిస్తుంది. ఈ సంఘాన్ని గవర్నర్‌ అయిదు సంవత్సరాలకోసారి ఏర్పాటు చేస్తారు.

 

విధులు: * రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు మంజూరు చేయాల్సిన నిధులు, రాష్ట్ర పన్నుల్లో వాటా గురించి సిఫార్సు చేస్తుంది.

* పంచాయతీ సంస్థలు వసూలు చేసుకునేందుకు అవకాశం ఉన్న పన్నులు, ఇతర సుంకాలను నిర్ధారించి సిఫార్సు చేస్తుంది.

* కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక వనరుల కోసం కేంద్ర ఆర్థిక సంఘానికి గవర్నర్‌ ద్వారా నివేదికలు సమర్పిస్తుంది.

* రాష్ట్ర ఆర్థిక సంఘం వార్షిక నివేదికను గవర్నర్‌కు నివేదిస్తుంది. గవర్నర్‌ ఆ నివేదికను రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తారు.

* రాష్ట్ర ఆర్థిక సంఘం నిర్మాణం, సభ్యుల నియామకం, వారి అర్హతలకు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.

 

ఆర్టికల్‌ 243 (J): అకౌంట్స్, ఆడిటింగ్‌: * పంచాయతీ సంస్థలకు వివిధ మార్గాల ద్వారా లభించిన నిధులు, వాటిని ఖర్చు చేసిన విధానాలపై ఆడిట్‌ నిర్వహించాలి. ఈ ఆడిట్‌ విధానం ఎలా ఉండాలనేది రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్దేశిస్తుంది. * రాష్ట్ర స్థాయిలో పంచాయతీ సంస్థల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేయడంలో ‘రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌’ కీలకపాత్ర పోషిస్తారు. * ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పంచాయతీ సంస్థల్లో 3 రకాల ‘ఆడిట్‌’ విధానాలను నిర్వహిస్తున్నారు. అవి 1) లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ 2) డిపార్ట్‌మెంటల్‌ ఆడిట్‌ 3) జనరల్‌ ఫండ్‌ ఆడిట్‌.

 

ఆర్టికల్‌ 243 (K): రాష్ట్ర ఎన్నికల సంఘం: * పంచాయతీ సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు స్వయంప్రతిపత్తి ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరం.* రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్‌ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమిస్తారు. * రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కాలపరిమితి, ఉద్యోగ నిబంధనలను రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలోని నిబంధనలకు లోబడి గవర్నర్‌ నిర్ణయిస్తారు.* రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విధానం హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిని పోలి ఉంటుంది. అనగా రాష్ట్రపతి తొలగిస్తారు.

 

విధులు:  * పంచాయతీ సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా రూపకల్పన.* పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ. * గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించడం. * పంచాయతీ సమితి/ మండల పరిషత్‌ స్థాయిలో ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఎంపీటీసీ పదవులకు ఎన్నికల నిర్వహణ. * జిల్లా పరిషత్‌ స్థాయిలో జడ్పీ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, జడ్పీటీసీ పదవులకు ఎన్నికల నిర్వహణ.

 

సుప్రీంకోర్టు తీర్పు- కిషన్‌ సింగ్‌ థోమర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు:  ‘‘ఆర్టికల్‌ 243 ్బర్శీ ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పాటైన కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగా రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది. అందువల్ల స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయ్యే సందర్భంలో, స్వయం ప్రతిపత్తితో పనిచేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

 

ఆర్టికల్‌ 243 (L): కేంద్రపాలిత ప్రాంతాలకు అన్వయింపు: * 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992లోని అంశాలను కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలా, వద్దా అనే విషయాన్ని రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటిస్తారు.* శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరిలో ప్రభుత్వాలు అక్కడి స్థానిక సంస్థలకు సంబంధించిన చట్టాలను రూపొందించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు లోబడే అవి కొనసాగుతాయి.

 

ఆర్టికల్‌ 243 (M): మినహాయించిన ప్రాంతాలు:  * 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయించారు. ఆర్టికల్‌ 244 (1)లో పేర్కొన్న ‘షెడ్యూల్డు  ప్రాంతాలు’, ఆర్టికల్‌ 244 (2) లో పేర్కొన్న ‘ఆదివాసీ ప్రాంతాల’ను ఈ చట్టం నుంచి మినహాయించారు. వాటిలో * నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ పరిధిలో ఉన్న ప్రాంతాలు. * మణిపుర్‌లోని కొండ ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్‌ ప్రాంతంలోని ‘గూర్ఖాహిల్‌ కౌన్సిల్‌’ ఉన్నాయి.

 

ఆర్టికల్‌ 243 (N): పూర్వ శాసనాల కొనసాగింపు: * 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) అమల్లోకి వచ్చినప్పటికీ ఆ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి అంటే 1993, ఏప్రిల్‌ 24 నుంచి ఒక సంవత్సరం వరకు అంటే 1994, ఏప్రిల్‌ 23 వరకు వివిధ రాష్ట్రాల్లో అప్పటికే అమల్లో ఉన్న పూర్వశాసనాలు కొనసాగుతాయి.* ఈ సంవత్సర కాలం గడువు ముగియక ముందే 73వ రాజ్యాంగ సవరణ (1992) లోని మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత శాసనాలను రూపొందించుకోవాలి. .

 

ఆర్టికల్‌ 243 (O): ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల ఏర్పాటు: * 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారాల కోసం నియోజకవర్గాల ఏర్పాటు, నియోజకవర్గాల రిజర్వేషన్లు మొదలైన వాటికి సంబంధించి వివాదాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన అనంతరం ఎన్నికలను సవాలు చేస్తూ న్యాయస్థానాల్లో కేసులు వేయకూడదు. * పంచాయతీ ఎన్నికల వివాదాలను విచారించడానికి అన్ని రాష్ట్రాలు ‘ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్స్‌’ ఏర్పాటు చేయాలి. * ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల వివాదాలను ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్‌ హోదాలో జిల్లా మున్సిఫ్‌ కోర్టులు విచారిస్తున్నాయి.

 

పెసా(PESA)చట్టం: గిరిజన ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమలుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసేందుకు పార్లమెంటు సభ్యుడైన ‘దిలీప్‌ సింగ్‌ భూరియా’ అధ్యక్షతన 1994, జూన్‌లో భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భూరియా కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ‘గిరిజన ప్రాంతాల్లో స్థానిక/పంచాయతీరాజ్‌ విధానం అమలు చట్టం’ (Panchayatraj Extension to Scheduled Areas Act) రూపొందించింది. ఈ చట్టం 1996, డిసెంబరు 24 నుంచి అమల్లోకి వచ్చింది.

 

పెసా చట్టం - 1996 ముఖ్యాంశాలు:  * ప్రతి గిరిజన గ్రామ పంచాయతీకి ఎన్నికైన గ్రామసభ ఉండాలి. ఈ సభ గిరిజన సంప్రదాయాలను పరిరక్షించాలి.* ప్రభుత్వ పథకాలను పొందేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఎంపికచేసే అధికారం గ్రామసభకు ఉండాలి. * గ్రామసభ అమోదముద్ర ద్వారానే సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించిన ప్రణాళికలను, పథకాలను అమలు చేయాలి.* గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకానికి, వేలంపాట ద్వారా ఖనిజ సంపద వినియోగానికి లైసెన్సులు మంజూరు చేసే అధికారం గ్రామసభ, గ్రామ పంచాయతీలకు ఉంటుంది.* వివిధ ప్రణాళికలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను గ్రామసభ నుంచి గ్రామ పంచాయతీ పొందాలి.* గ్రామసభ, గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాలను చట్టబద్ధమైనవిగా పరిగణించాలి. పెసా చట్టం ప్రకాకం గ్రామసభ కీలకపాత్ర వహిస్తుంది. * పంచాయతీ సంస్థలోని అన్ని స్థాయుల్లో అధ్యక్ష పదవులను షెడ్యూల్డు తెగల వారికే కేటాయించాలి.

 

రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 26-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్థానిక స్వపరిపాలన సంస్థలు

కరణాలు పోయి.. కార్యదర్శులు వచ్చి!

  భారత ప్రజాస్వామ్యాన్ని పునాదుల నుంచి బలోపేతం చేస్తున్నది స్థానిక స్వపరిపాలన వ్యవస్థే. ఇందులో మొదటి, కీలక అంచె అయిన గ్రామ పంచాయతీల పరిపాలనకు అమిత ప్రాధాన్యం ఉంది. బ్రిటిష్‌ హయాంలో కరణం, మునసబుల పేరిట పెత్తందారీ వ్యవస్థ అమలులో ఉండగా, స్వాతంత్య్రానంతరం మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ రూపొంది విజయవంతంగా కొనసాగుతోంది. కరణాల వ్యవస్థ పోయి, గ్రామ కార్యదర్శుల పాలన వచ్చింది. ఆధునిక కాలంలో స్థానిక పాలనా వ్యవస్థ పరిణామక్రమం గురించి పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ స్థాయిల్లోని స్థానిక స్వపరిపాలనా సంస్థల నిర్మాణం, అధికారాలు, విధులు, పాలకవర్గం ఎన్నిక విధానాలను తెలుసుకోవాలి.

  

  స్థానిక స్వపరిపాలన సంస్థల ద్వారా స్థానిక సమస్యలకు సత్వర పరిష్కార మార్గం లభిస్తుంది. ప్రజలకు స్థానిక పాలనలో భాగస్వామ్యం లభిస్తుంది.

 

వర్గీకరణ: స్థానిక స్వపరిపాలనా సంస్థలు రెండు రకాలు. 

1) గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు 

2) పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు.

 

గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు: ఇవి మూడు స్థాయుల్లో ఉంటాయి. 

1) గ్రామ పంచాయతీ 

2) మండల పరిషత్‌ 

3) జిల్లా పరిషత్‌

 

గ్రామ పంచాయతీ

 

మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో దిగువ స్థాయిలో ఉండే అత్యంత కీలక వ్యవస్థ గ్రామ పంచాయతీ. 

* 1802లో ఆంగ్లేయుల పాలనా కాలంలో రూపొందించిన రెగ్యులేషన్‌ చట్టంలోని సీరియల్‌ నెంబరు 29 ద్వారా మన దేశంలో పంచాయతీ విధానం ప్రారంభమైంది. దీని ఫలితంగానే కరణం వ్యవస్థ వచ్చింది. 

* 1816లో రూపొందించిన రెగ్యులేషన్‌ నియమాల ఫలితంగా గ్రామపెద్ద ‘గ్రామ మునసబు’గా అవతరించాడు. 

* లార్డ్‌ రిప్పన్‌ పాలనా కాలంలో 1884లో రూపొందించిన స్థానిక బోర్డుల చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ సంఘాల ఏర్పాటుకు కృషి జరిగింది. 

* 1884 నాటి స్థానిక బోర్డుల చట్టంలోని అంశాలను తగ్గించేందుకు 1915లో మద్రాసు ప్రభుత్వం సంకల్పించింది. 

* 1915లో మద్రాసు ప్రభుత్వం ‘ఇన్‌ఫార్మల్‌ పంచాయతీ’లను ఏర్పాటు చేసింది. ఈ పంచాయతీలు గ్రామీణ పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరా, సాగు నీటిపారుదల లాంటి పనులు నిర్వహించేవి.

 

మద్రాసు పంచాయతీల చట్టం - 1920:  * పంచాయతీల తనిఖీ కోసం రిజిస్ట్రార్‌ జనరల్‌ నియమితులవుతారు.

* పురుషులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు.

* ఓటుహక్కు పురుషులకు మాత్రమే లభిస్తుంది.

* ప్రత్యక్ష పద్ధతి ద్వారా పంచాయతీ సభ్యుల ఎన్నిక జరగాలి.

* పంచాయతీలకు ఇతర పన్నులు విధించే అధికారం ఉంది.

 

మద్రాసు స్థానిక బోర్డుల చట్టం - 1930: * దీని ప్రకారం 1920 నాటి మద్రాసు పంచాయతీల చట్టాన్ని రద్దు చేశారు.

* పంచాయతీలు స్థానిక బోర్డుల చట్టంలో అంతర్భాగమయ్యాయి.

* పంచాయతీలపై పర్యవేక్షణ, నిర్వహణాపరమైన అధికారాలను స్థానిక బోర్డులకు అప్పగించారు.

* తాలుకా బోర్డుల రద్దు అనంతరం పంచాయతీలపై అధికారాన్ని జిల్లా బోర్డులకు అప్పగించారు.

 

మద్రాసు పంచాయతీ చట్టం-1946: * సాధారణ పాలన నిర్వహణ కోసం రెవెన్యూ బోర్డులను ఏర్పాటు చేశారు.

* మేజర్‌ పంచాయతీల పరిపాలనకు సంబంధించిన అంశాలను పూర్తి కాలం పనిచేసే అధికారులకు, మైనర్‌ పంచాయతీల పరిపాలనకు సంబంధించిన అంశాలను పార్ట్‌ టైం అధికారులకు అప్పగించారు.

* పంచాయతీలకు సంబంధించిన కీలక అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్ల నియంత్రణలో ఉంచారు.

 

మద్రాసులో కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు- 1946: మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్ఠ పరిచేందుకు కీలక విధానాలను ప్రకటించింది. అవి: * పంచాయతీల నియంత్రణ, నిర్వహణ అధికారాన్ని ఇన్‌స్పెక్టర్ల పరిధిలోకి తీసుకొచ్చారు.

* ప్రత్యేక పరిస్థితుల్లో మినహా పంచాయతీలపై కలెక్టర్లకు పరిమిత అధికారం ఉంటుంది.

 

మద్రాసు పంచాయతీల చట్టం-1950: * ఈ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఒక నిర్దిష్ట రూపం వచ్చింది. 

* 1950 తర్వాత జరిగిన అన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధుల ఎన్నిక ప్రక్రియను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష ఓటింగ్‌ ద్వారా ఎన్నుకునే విధానం ప్రారంభమైంది.

 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్మాణం

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1959లో ‘ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం’ రూపొందింది.

* 1983లో అధికారం చేపట్టిన ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం మునసబ్, కరణం వ్యవస్థను రద్దు చేసింది.

* 1986లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం పంచాయతీరాజ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించింది. దీనిద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘మండల పరిషత్‌’ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

* చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002, జనవరి 1 నుంచి గ్రామ కార్యదర్శి వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1959 నుంచి 1986 వరకు మూడంచెల పంచాయతీరాజ్‌ విధానం 

1) దిగువ స్థాయిలో - గ్రామ పంచాయతీ 

2) మధ్య స్థాయిలో - పంచాయతీ సమితి 

3) ఉన్నత స్థాయిలో - జిల్లా పరిషత్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1986 నుంచి 1994 వరకు మూడంచెల పంచాయతీరాజ్‌ విధానం: 1) దిగువ స్థాయిలో - గ్రామ పంచాయతీ 2) మధ్య స్థాయిలో - మండల ప్రజా పరిషత్‌ 3) ఉన్నత స్థాయిలో - జిల్లా ప్రజా పరిషత్‌.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో ఏర్పాటైన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం: దీని ప్రకారం మూడంచెల పంచాయతీ రాజ్‌ విధానం వచ్చింది. 1) దిగువ స్థాయిలో - గ్రామ పంచాయతీ 2) మధ్య స్థాయిలో - మండల పరిషత్‌ 3) ఉన్నత స్థాయిలో - జిల్లా పరిషత్‌.

 

తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం - 2018: తెలంగాణ రాష్ట్రంలో 2018, ఏప్రిల్‌ 18 నుంచి తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని మొత్తం సెక్షన్లు 297. ఈ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఉన్న అన్ని స్థాయుల్లోని పదవులకు ఇదివరకు ఉన్న ఎన్నిక విధానమే కొనసాగుతుంది.

* తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం - 2018లోని సెక్షన్‌ 3 గ్రామసభ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం ప్రతి రెండు నెలలకోసారి గ్రామ సభ సమావేశాలను  నిర్వహించాలి.

* గ్రామ సభ సమావేశాలకు సర్పంచి అధ్యక్షత వహిస్తారు. గ్రామ పంచాయతీలో ముగ్గురు కో-ఆప్షన్‌ సభ్యులు ఉంటారు. వీరు 1) పదవీవిరమణ ఉద్యోగి లేదా గ్రామ అభివృద్ధిలో కీలకంగా పనిచేసిన సీనియర్‌ సిటిజన్‌ 2) గ్రామ సమాఖ్య అధ్యక్షులు 3) గ్రామ పంచాయతీ అభివృద్ధికి విరాళం అందించిన దాత.

 

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ (సవరణ) చట్టం-2020: ఈ చట్టం ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి. అవి: 

* సర్పంచులు తప్పనిసరిగా స్థానికంగా నివసించాలి. 

* గ్రామ సభ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించకపోతే సర్పంచి పదవిని కోల్పోతారు. 

* పంచాయతీ ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ లాంటి అనైతిక చర్యలకు పాల్పడితే సదరు వ్యక్తులు గెలిచినప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగేందుకు అర్హులు కారు. * పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 14 రోజుల్లో పూర్తిచేయాలి.

* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి, ఓటర్లను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభాలకు గురి చేయడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం లాంటి అభియోగాలు ధ్రువీకరణ అయితే అతడు ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తారు.

* నాన్‌-షెడ్యూల్‌ ఏరియాలో 100% గిరిజన జనాభా ఉన్న గిరిజన గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నీ గిరిజనులకే రిజర్వు చేశారు.

* ప్రకృతి వైపరీత్యాలు లేదా నీటి కొరత విషయంలో సర్పంచిలకు నిర్ణయాధికారం ఇచ్చారు.

* గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం లాంటి అంశాల్లో సర్పంచ్‌కు మరిన్ని అధికారాలు కల్పించారు.

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ నిర్మాణం:  సాధారణంగా 300 మంది జనాభా ఉన్న గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తున్నారు. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో పంచాయతీ పరిధిలో ఉండే 18 ఏళ్లు నిండిన వయోజన ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.

* జనాభా తక్కువ ఉన్న కొన్ని గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేస్తారు.

* గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలోని పరిపాలనా విభాగం. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు.

 

వార్డుల విభజన: ప్రతి గ్రామ పంచాయతీని పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా ఆధారంగా వార్డులుగా విభజిస్తారు. కనీస వార్డుల సంఖ్య 5 కాగా, గరిష్ఠ వార్డుల సంఖ్య 21.

 

గ్రామ పంచాయతీ - ఎన్నిక విధానం: * ఆర్టికల్, 243(K) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది.

* గ్రామ ఓటర్ల జాబితాలో పేరు నమోదైన వారు మాత్రమే ఓటు వేసేందుకు, పోటీ చేసేందుకు అర్హులు.

* ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లను వినియోగించుకుంటారు. ఒక ఓటును వార్డు సభ్యుడిని, రెండో ఓటును సర్పంచిని ఎన్నుకోవడానికి వినియోగిస్తారు.

 

పోటీకి అర్హతలు: * గ్రామ ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలి. 

* 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

* దివాళాతీసి ఉండకూడదు.* అస్పృశ్యత నేర నిషేధ చట్టం ప్రకారం శిక్షకు గురై ఉండకూడదు.

 

రిజర్వేషన్లు: ఆర్టికల్‌ 243(D): * గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఈ రిజర్వేషన్లలో ఈ వర్గాల మహిళలకు 1/3వ వంతు స్థానాలు రిజర్వ్‌ చేశారు.

* ఓబీసీ (వెనుకబడిన వర్గాల) వారికి 34% రిజర్వేషన్లు కల్పించారు.

* మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 50% నిర్దేశించారు.

 

పదవీకాలం: * గ్రామ పంచాయతీ మొదటి సమావేశం ప్రారంభమైన తేదీ నుంచి అయిదేళ్లు పదవీకాలం కొనసాగుతుంది. 

* గ్రామ పంచాయతీని పదవీకాలం కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.

 

సమావేశాలు: * గ్రామ పంచాయతీ సమావేశాలు సర్పంచి అధ్యక్షతన నెలకోసారి జరుగుతాయి. గత సమావేశపు నివేదికతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి.

* గత నెలలో జరిగిన పనులు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సర్పంచి వివరిస్తారు.

* మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు/సభ్యురాలు (ఎంపీటీసీ) తన ప్రాదేశిక పరిధిలోని గ్రామ పంచాయతీల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు. వీరు సమావేశాల చర్చల్లో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో ఓటు హక్కు ఉండదు.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 04-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గ్రామ పంచాయతీ - అధికారాలు, విధులు

స్వయంపాలనలో పల్లె ప్రగతి!

 

  పక్క పట్టణానికి పల్లెని కలిపే రోడ్డు, ఇంటికి దగ్గర్లో పాఠశాల, చిన్న చిన్న అనారోగ్యాలకు వైద్యశాల, దృఢమైన యువత కోసం వ్యాయామశాల, ప్రభుత్వ పథకాల ప్రత్యక్ష అమలు, క్షేత్రస్థాయిలో అన్ని రకాల గణాంకాల సేకరణ, మార్కెట్లకు ఏర్పాట్లు, ప్రకటనలకు అనుమతుల వంటి ఎన్నో రకాల స్థానిక పాలనా నిర్ణయాలను గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మొదటిది, ముఖ్యమైనది అయిన ఈ గ్రామ పంచాయతీ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తున్న వ్యవస్థాగత నిర్మాణం. గ్రామీణ ప్రగతికి అదే పునాది. ప్రాథమిక పాలనా సంస్థగా, రాజకీయ వేదికగా నిలిచే ఈ పంచాయతీల అధికారాలు, విధుల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్రమైన అవగాహన ఉండాలి.

 

  మూడంచెల పంచాయతీరాజ్‌ విధానంలో మొదటి అంచె ‘గ్రామ పంచాయతీ’. దీనికి సర్పంచ్‌ రాజకీయ అధిపతి. సర్పంచ్‌కు పరిపాలనలో సహకరించేందుకు ‘పంచాయతీ కార్యదర్శి’ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరిద్దరి సమన్వయంతో గ్రామ పంచాయతీ తన అధికారాలు, విధులు నిర్వహిస్తుంది.

 

సర్పంచ్‌:  సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతి ద్వారా రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని జలగం వెంగళరావు కమిటీ, నరసింహం కమిటీ, దంత్‌వాలా కమిటీలు సిఫార్సు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1981 నుంచి సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో, రహస్య ఓటింగ్‌ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సర్పంచ్‌ పదవికి ఇదే తరహాలో ఎన్నిక జరుగుతోంది. గ్రామ పంచాయతీ పరిధిలోని 18 సంవత్సరాలు నిండి, నమోదైన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు.

 

అధికారాలు, విధులు: * గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. 

* పంచాయతీ ప్రథమ పౌరులుగా వ్యవహరిస్తారు.

* పంచాయతీ స్థాయిలో రాజకీయ అధిపతిగా ఉంటారు.

* పంచాయతీకి సంబంధించిన రికార్డులు తనిఖీ చేస్తారు.

* పంచాయతీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి సమాచారం కోరవచ్చు.

* పంచాయతీ వార్షిక ఖాతాలను ఏటా క్రమం తప్పకుండా ఆడిట్‌ చేయించాలి.

* పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనాపరమైన నియంత్రణ కలిగి ఉంటారు. 

* పంచాయతీ చేసిన తీర్మానాల అమలుకు కృషి చేస్తారు.

* తన పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మొదలైన కార్యాలయాలను సందర్శించి, పనితీరును పరిశీలిస్తారు.

* గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దృష్టికి తీసుకెళ్తారు.

 

తొలగింపు: సర్పంచ్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ప్రభుత్వ చర్యలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగిస్తుంది. ఇలా పదవి కోల్పోయిన వారు రెండేళ్ల వరకు సంబంధిత పదవులకు తిరిగి పోటీ చేసే అవకాశం ఉండదు. 

* సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వీల్లేదు. దీనికి కారణం ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో సర్పంచ్‌ని ఎన్నుకోవడం.

* సర్పంచ్‌ పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం కంటే ముందే తన పదవికి రాజీనామా చేయవచ్చు.

* సర్పంచ్‌ తన రాజీనామాను పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి. అది వీలు కానప్పుడు డీపీఓకి ఇవ్వాలి.

* ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో సర్పంచ్‌ గ్రామ సభ సమావేశాలను నిర్వహించడంలో విఫలమైతే పదవి కోల్పోతారు. ఆ విధంగా పదవి కోల్పోయినవారు ఏడాది పాటు సంబంధిత పదవులకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదు. 

 

ఉపసర్పంచ్‌: పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అదే రోజు లేదా మ‌రుస‌టి రోజు ఉప సర్పంచ్‌ పదవికి ఎన్నిక జరుగుతుంది. వార్డు సభ్యుల నుంచి ఒకరిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు చేతులు పైకి ఎత్తి ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఉపసర్పంచ్‌ ఎన్నిక విధానం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరోక్షంగానే ఉంటుంది. సర్పంచ్‌ అందుబాటులో లేని సమయంలో ఉపసర్పంచ్‌ గ్రామ సభ, గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఉపసర్పంచ్‌ పదవీకాలం అయిదేళ్లు. పదవీ కాలం కంటే ముందే రాజీనామా చేయవచ్చు. రాజీనామా పత్రాన్ని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కి సమర్పించాలి. ఎంపీడీఓ అందుబాటులో లేకపోతే డివిజినల్‌ పంచాయతీ ఆఫీసర్‌ (డీఎల్‌పీఓ)కి ఇవ్వాలి.

 

అవిశ్వాస తీర్మానం: * సర్పంచ్, వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా ఉపసర్పంచ్‌ను తొలగించవచ్చు.

* ఏపీలో ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే పదవి చేపట్టిన తేదీ నుంచి నాలుగేళ్ల తర్వాతే సాధ్యం. అంటే పదవీకాలంలో ఒక్కసారి మాత్రమే ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. తెలంగాణలో పదవి చేపట్టిన తేదీ నుంచి 2 సంవత్సరాల అనంతరం ఈ తీర్మానాన్ని ప్రయోగించవచ్చు.

* మొత్తం సభ్యుల్లో 2/3 వంతు ఆమోదం తెలిపితే, ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం అమలవుతుంది.

* అనంతరం ఉపసర్పంచ్‌ను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ పదవి నుంచి తొలగిస్తారు.

* సస్పెండ్‌ అయిన వార్డు సభ్యులు కూడా అవిశ్వాస తీర్మానంలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

* ఏదైనా కారణం వల్ల ఉపసర్పంచ్‌ పదవికి ఖాళీ ఏర్పడితే 30 రోజుల్లోపు ఉపఎన్నిక ద్వారా ఆ ఖాళీని భర్తీ చేయాలి.

* సర్పంచ్, ఉప సర్పంచ్‌ పదవులు రెండూ ఏకకాలంలో ఖాళీ అయితే వార్డు సభ్యుల్లో ఒకరిని సర్పంచ్‌గా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నియమిస్తారు.

* గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయి.

 

పంచాయతీ కార్యదర్శి: సర్పంచ్‌కు పరిపాలనా వ్యవహారాలలో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి. ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే మేజర్‌ గ్రామ పంచాయతీలో అయితే కార్యనిర్వహణాధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో జనవరి 1, 2002న గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని సృష్టించారు.

 

అధికారాలు - విధులు: * పంచాయతీ పరిపాలనలో సర్పంచ్‌కు సహకరించడం. 

* పంచాయతీ తీర్మానాలు, కమిటీల తీర్మానాలు అమలు.

* సర్పంచ్‌ ఆదేశంతో గ్రామ పంచాయతీ సమావేశాల ఏర్పాటు.

* పంచాయతీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనడం. 

* పంచాయతీ ఆస్తులు, భూములు పరిరక్షించడం. 

* పంచాయతీలో పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేయడం.

* సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి పంచాయతీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించడం. 

* జనన, మరణాల నమోదు, రికార్డుల నిర్వహణ.

* పంచాయతీలో పనిచేసే ఉద్యోగులపై నియంత్రణ.

* నిధులు దుర్వినియోగం కాకుండా నియంత్రించడం.

* మండల స్థాయిలో జరిగే సమావేశాలకు హాజరుకావడం.

* మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) నుంచి పాలనకు సంబంధించిన సమాచారం పొందడం.

 

పంచాయతీ అధికారాలు - విధులు

 

గ్రామ పంచాయతీ అధికారాలు, విధులు రెండు రకాలుగా ఉంటాయి. అవి 

1) ఆవశ్యక విధులు (తప్పనిసరిగా నిర్వహించేవి) 

2) వివేచనాత్మక విధులు (ఆర్థిక వనరుల లభ్యత ఆధారంగా నిర్వహించేవి)

 

ఆవశ్యక విధులు: * ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, నిర్వహణ 

* కంపోస్టు ఎరువుల తయారీ 

* బందెలదొడ్ల ఏర్పాటు, నిర్వహణ 

* పంచాయతీ స్థాయిలో ఆర్థిక వనరుల సమీకరణ 

* కలరా, మలేరియా, డయేరియా లాంటి అంటువ్యాధుల నివారణ 

* శ్మశానవాటికల నిర్మాణం, నిర్వహణ 

* మంచినీటి బావులు, చెరువుల ఏర్పాటు, నిర్వహణ, రక్షిత తాగునీటి సరఫరా 

* పంచాయతీ పరిధిలోని వీధులు, బజార్లలో చెత్త తొలగింపు 

* డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, నిర్వహణ 

* వీధిదీపాల ఏర్పాటు 

* గ్రామ పంచాయతీ పరిధిలో భవనాలు, వంతెనలు, కట్టడాల నిర్మాణం

 

వివేచనాత్మక విధులు: * రోడ్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం.

* వైద్యశాలల నిర్మాణం, నిర్వహణ 

* ఆటస్థలాలు, వ్యాయామశాలల నిర్మాణం, నిర్వహణ 

* వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు సహాయ కార్యక్రమాలు. 

* గ్రంథాలయాలు, ఇతర పఠన మందిరాల నిర్మాణం, నిర్వహణ 

* ప్రయాణికులకు ధర్మశాలలు, విశ్రాంతి గృహాల నిర్మాణం, నిర్వహణ 

* పూర్వప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య అభివృద్ధికి కృషి 

* కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ 

* గ్రామ ప్రజల నైతిక, సాంఘిక, భౌతిక సంక్షేమం పెంపొందించడం 

* కమతాల ఏకీకరణ, భూసంస్కరణల అమలు 

* పబ్లిక్‌ మార్కెట్ల ఏర్పాటు, నిర్వహణ 

* ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం 

* నిరుద్యోగ గణాంకాల తయారీ 

* ప్రసూతి, శిశుసంక్షేమ పథకాల ఏర్పాటు, నిర్వహణ 

* గ్రామ నివేశన స్థలాల విస్తరణ 

* వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రదర్శనల నిర్వహణ 

* సహకార సంఘాల ఏర్పాటు, అభివృద్ధి 

* పశువుల కొట్టాల ఏర్పాటు, నిర్వహణ 

* కుక్కలు, పందుల సంచారాన్ని నియంత్రించడం 

* గిడ్డంగులు, ధాన్యాగారాల ఏర్పాటు, నిర్వహణ 

* మెరుగైన వ్యవసాయ పద్ధతుల అభివృద్ధి 

* సామాజిక సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి 

* మద్యపానం, మత్తుపదార్థాల సేవనం నియంత్రణ 

* అస్పృశ్యత నివారణకు కృషి 

* సంతలు, జాతరలు, ఉత్సవాల నిర్వహణ

 

ఇతర విధులు: * పంచాయతీ పరిధిలో దురాక్రమణల తొలగింపు. 

* రోడ్లపై ఆటంకాలు, గుంతల తవ్వకం నియంత్రించడం. 

* ఇళ్ల నిర్మాణానికి అనుమతుల మంజూరు 

* పబ్లిక్‌ రోడ్లపై విక్రయాల నిషేధం.

* అనుమతులు లేని ప్రకటనలు తొలగించడం. 

* ప్రైవేట్‌ మార్కెట్లు, సెల్‌టవర్ల ఏర్పాటుకు అనుమతుల మంజూరు. 

* పంచాయతీ నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాల విధింపు. 

* వివిధ యంత్రాల వల్ల కలిగే శబ్దాలు నియంత్రించడం. 

* అనుమతి లేకుండా రోడ్లపై చెట్లు నాటడం లేదా కొట్టివేయడాన్ని నియంత్రించడం.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 11-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మండల పరిషత్‌

 సంక్షేమ పాలనకు సమన్వయ వేదిక!

 

 

మండల స్థాయిలో నిర్వహించాల్సిన అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి చర్చించి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటైన పంచాయతీరాజ్‌ సంస్థే మండల పరిషత్‌. స్థానిక స్వపరిపాలనలో ఇది కీలక అంచె. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలులో గ్రామాల మధ్య సమన్వయానికి కృషి చేస్తుంది. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో దిగువ, ఎగువ సంస్థలైన పంచాయతీలు, జిల్లా పరిషత్‌కు అనుసంధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. మండల పరిషత్‌ నిర్మాణం, సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికతో పాటు మండల పాలన జరిగే విధానాన్ని పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

 

మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో రెండో అంచె మండల పరిషత్‌. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీకి మధ్య ఉన్న ‘మాధ్యమిక వ్యవస్థ’ ఇది.

నేపథ్యం: 1978లో పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం చేసిన అశోక్‌ మెహతా కమిటీ రెండంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫార్సు చేసింది. అవి మండల పరిషత్, జిల్లా పరిషత్‌. దీనిలో మండల పరిషత్‌ అత్యంత కీలకమైన అంచె.

* మండల పరిషత్‌ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక (1985, అక్టోబరు 2).

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం 1986లో ‘ఏపీ మండల పరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం’ రూపొందించింది. అది 1987, జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అప్పటికే రాష్ట్రంలో అమలులో ఉన్న 330 పంచాయతీ సమితులను రద్దు చేసి వాటి స్థానంలో 1104 మండల పరిషత్‌లు ఏర్పాటు చేశారు.

 

వివరణ: ప్రతి జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ మండలాలుగా విభజిస్తారు. మండలానికి సంబంధించిన పరిపాలనా విభాగమే మండల పరిషత్‌.  ప్రతి మండల పరిషత్‌లో సుమారు 35 వేల నుంచి 50 వేల జనాభా, 25 నుంచి 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి.

 

ఎంపీటీసీ: 

* ప్రతి మండల పరిషత్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా ఆధారంగా మండల ప్రాదేశిక నియోజకవర్గంగా (ఎంపీటీసీ) విభజిస్తారు.

* ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ సభ్యుడు/సభ్యురాలిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.

* ప్రతి ఎంపీటీసీ సభ్యుడు/సభ్యురాలు సుమారు 3,500 మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు.

* మండల పరిషత్‌లో ఉండాల్సిన కనీస ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 7, గరిష్ఠ సంఖ్య 23.

* మండల పరిషత్‌కు మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని కో ఆప్టెడ్‌ సభ్యుడిగా (ఎంపీటీసీ) నామినేట్‌ చేస్తారు.

* ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి ఆ మండల పరిషత్‌లోని ఏ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయవచ్చు. కానీ ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి వేరే మండల పరిషత్‌ నుంచి పోటీ చేయకూడదు.

 

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక: ఎంపీటీసీ సభ్యులు తమలో నుంచి ఒకరిని మండల పరిషత్‌కు అధ్యక్షుడిగా (ఎంపీపీ), మరొకరిని ఉపాధ్యక్షుడిగా (వైస్‌ ఎంపీపీ) పరోక్ష పద్ధతిలో చేతులు ఎత్తడం ద్వారా ఎన్నుకుంటారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి.

రిజర్వేషన్లు: 

* ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు నిర్దేశించాలి. వారికి కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గం మహిళలకు 1/3వ వంతు కల్పించాలి.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

* వెనుకబడిన వర్గాల వారికి ఎంత శాతం రిజర్వేషన్లు ఉండాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభలు రూపొందించే చట్టాల ఆధారంగా నిర్ణయిస్తారు.

* ప్రస్తుతం రాష్ట్రంలో ఓబీసీ వర్గాల వారికి 34 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

ఎన్నికలు: 

* ఆర్టికల్‌ 243(కె) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది.

* ఎంపీటీసీ ఎన్నికల బ్యాలట్‌ పత్రం రంగు - గులాబీ.

అర్హతలు-అనర్హతలు:

 * ఎంపీటీసీగా పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

* సంబంధిత మండల పరిషత్‌ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి.

* దివాలా తీసి ఉండకూడదు.

* స్థానిక సంస్థలకు బకాయిపడిన వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.

* 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన దంపతులు పోటీకి అనర్హులు.

కాలపరిమితి: 

మండల పరిషత్‌ కాలపరిమితి 5 సంవత్సరాలు. 

* ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల కాలపరిమితి 5 సంవత్సరాలు. 
* ఏదైనా కారణంతో ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ స్థానాలకు ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోపు ఉపఎన్నికలు నిర్వహించి, సంబంధిత ఖాళీలను భర్తీ చేయాలి.

రాజీనామా: ఎంపీటీసీలు, కో-ఆప్టెడ్‌ సభ్యుడు, మండల అధ్యక్షుడు (ఎంపీపీ), మండల ఉపాధ్యక్షుడు (వైస్‌ ఎంపీపీ) తమ రాజీనామాలను జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (జడ్పీ సీఈఓ)కి సమర్పించాలి.

 

మండల పరిషత్‌ నిర్మాణం, సభ్యులు:

* మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీలు)

* మండల పరిషత్‌ పరిధిలోని శాసనసభ్యుడు (ఎమ్మెల్యే)

* మండల పరిషత్‌ పరిధిలోని లోక్‌సభ సభ్యుడు (ఎంపీ)

* మండల ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు (ఎంపీ)

* మండల ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్న శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)


మండల పరిషత్‌ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు:

1) జిల్లా కలెక్టర్‌

2) మండల పరిషత్‌ నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యుడు

3) మండల వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌

4) మండల పరిషత్‌ పరిధిలోని సర్పంచ్‌లు.

 

మండల పరిషత్‌ - అధికారాలు - విధులు:

* గ్రామ పంచాయతీల సాధారణ విధుల నియంత్రణ

* పశు సంపద అభివృద్ధి, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం

* వ్యవసాయోత్పత్తుల గణనీయ పెంపుదలకు కృషి

* ప్రజల సహకారంతో వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాల అమలు

* మండల పరిషత్‌ నిధులతో వివిధ రకాల ట్రస్టులను నిర్వహించడం

* రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన గణాంకాలను సమర్పించడం

* గ్రామీణ పారిశుద్ధ్య వసతుల పెంపుదలకు కృషి

* వైద్య, ఆరోగ్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం

* మండల పరిషత్‌ పరిధిలో రవాణా సౌకర్యాల అభివృద్ధికి కృషి

* స్వయంసహాయక పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు

* ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, పర్యవేక్షణ

* అగ్నిప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాల నిర్వహణ

* సమాచార కేంద్రాలు, రైతు కేంద్రాలు, గ్రంథాలయాల ఏర్పాటు

* సహకార రంగ పటిష్టతకు కృషి

* సహకార పరపతి సంఘాలు, నీటిపారుదల సొసైటీలు, వ్యవసాయ సొసైటీల ఏర్పాటు

* మహిళా, శిశు సంక్షేమ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ

* వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ

* అంటరానితనం నిర్మూలన, సాంఘిక దురాచారాల నిర్మూలనకు కృషి

* సాంఘిక సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు పథకాలు అమలు పరచడం

మండల పరిషత్‌ అధ్యక్షుడు-అధికారాలు-విధులు

* మండల పరిషత్‌ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం.

* ఈయన మండల పరిషత్‌కు ప్రథమ పౌరుడు, రాజకీయ అధిపతి.

* మండల పరిషత్‌ రికార్డుల తనిఖీ, పర్యవేక్షణకు సంపూర్ణ అధికారం ఉంటుంది.

* మండల పరిషత్‌ తీర్మానాల అమలులో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)పై నియంత్రణ ఉంటుంది.

* ప్రజాసంక్షేమం దృష్ట్యా అత్యవసర పనులు చేపట్టాలని ఎంపీడీఓను ఆదేశిస్తారు.

 

మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు-అధికారాలు-విధులు:

* అధ్యక్షుడు మండల పరిషత్‌కు హాజరుకానప్పుడు ఆ బాధ్యతలను నిర్వహించడం.

* మండలాధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు నూతన అధ్యక్షుడు ఎన్నికయ్యేంత వరకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం.

* అధ్యక్షుడు లిఖితపూర్వకంగా బదిలీ చేసిన అధికార విధులు నిర్వహించడం.

 

అవిశ్వాస తీర్మానం, తొలగింపు:  

* ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎంపీటీసీ సభ్యులు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా అవిశ్వాస తీర్మానంతో తొలగించొచ్చు.

* మండల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది. ఇలా వైదొలిగినవారు రెండేళ్ల వరకు తిరిగి ఆ పదవులకు పోటీ చేయలేరు.

 

మండల పరిషత్‌ - ఆర్థిక వనరులు:

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు.

* భూమి శిస్తు, వినోదపు పన్ను.

* ఖాదీ బోర్డు, గ్రామీణ కుటీర పరిశ్రమల బోర్డు మొదలైన సంస్థలు సమకూర్చే గ్రాంట్లు.

* సాముదాయక అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం నుంచి లభించే గ్రాంట్లు.

* మండల పరిషత్‌ విధించే ఫీజులు, సెస్సులు.

* గ్రామ పంచాయతీల నుంచి మండల పరిషత్‌ వసూలు చేసే మొత్తం.

* మండల పరిషత్‌లోని జనాభా సంఖ్య లెక్కన ఒక్కో వ్యక్తికి రూ.5 చొప్పున వార్షిక గ్రాంటుని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.

* జిల్లా పరిషత్‌ ఆదాయం నుంచి మండల పరిషత్‌కు లభించే వాటా.

* మండల పరిషత్‌ విధించే పన్నులు, సర్‌ఛార్జీలు.

* వివిధ వర్గాల నుంచి లభించే విరాళాలు.

* మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)

* ఎంపీడీఓ మండల పరిషత్‌కు పరిపాలనా అధిపతి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గ్రూప్‌-1 స్థాయి అధికారి.

* మండల పరిషత్‌కు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

* మండల పరిషత్‌ తీర్మానాలను అమలు చేస్తారు.

* రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వుల అమలు కోసం కృషి చేస్తారు.

* నెలకోసారి మండల పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.

* మండలంలోని గ్రామ పంచాయతీలపై పర్యవేక్షణాధికారాలు ఉంటాయి.

* మండలాధ్యక్షుడిని సంప్రదించి మండల పరిషత్, మండల మహాసభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు.

* మండల పరిషత్‌లోని ఉద్యోగులపై పర్యవేక్షణ, నియంత్రణాధికారాలు కలిగి ఉంటారు.

* మండల పరిషత్‌ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. కానీ తీర్మానాల విషయంలో ఓటు హక్కు ఉండదు.

* మండల పరిషత్‌ చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోపు మరో సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే ఎంపీడీవోపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 17-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జిల్లా పరిషత్‌

 వృద్ధి పథంలో.. వ్యూహ రచనలో! 

 

  స్థానిక స్వపరిపాలన వ్యవస్థలో కిందిస్థాయిలో పంచాయతీలు ఉంటే, ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్‌లు ఉంటాయి. మండల పరిషత్‌లను తద్వారా పంచాయతీలను సమన్వయ పరుస్తూ అభివృద్ధి కార్యక్రమాల వ్యూహాలను రూపొందించి, అమలు చేస్తుంటాయి. సంక్షేమ పాలన అందించడంలో స్థానికులను భాగస్వాములను చేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుంటాయి. చిన్న నీటిపారుదల, గ్రామీణ పరిశ్రమలు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, పాఠశాలల నిర్వహణ తదితర కీలక బాధ్యతలు జెడ్పీ పరిధిలోనే ఉంటాయి. అధికార వికేంద్రీకరణ, సమ్మిళిత వృద్ధి సాధన లక్ష్యంగా జవాబుదారీతనం, పారదర్శకత ప్రధానంగా కార్యకలాపాలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ నిర్మాణం, ఎన్నికలు, అధికారాలు, విధులు, అది ఏర్పాటు చేసే స్థాయీ సంఘాల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి.

 

  మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ‘జిల్లా పరిషత్‌’ ఉన్నత స్థాయి పరిపాలనా విభాగం. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల సమగ్రాభివృద్ధికి అవసరమైన వ్యూహాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తుంది.

 

జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు: జిల్లాలోని ‘ప్రతి మండల పరిషత్‌’ను ‘జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం’ (జడ్పీటీసీ)గా పరిగణిస్తారు. ఒక జిల్లాలో ఎన్ని మండల పరిషత్‌లుంటే అన్ని ‘జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు’గా పరిగణిస్తారు. ‘జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల (జడ్పీటీసీ)ను ఓటర్లు ప్రత్యక్షంగా, రహస్య ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు.

 

అర్హతలు, అనర్హతలు: * 21 ఏళ్లు నిండి ఉండాలి. * జిల్లా పరిషత్‌ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. * దివాళా తీసి ఉండకూడదు.* 1995, మే 30 తర్వాత వివాహమైన దంపతులకు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండకూడదు.

 

రిజర్వేషన్లు: * ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఈ వర్గాలకు రిజర్వు చేసిన స్థానాల్లో ఆ వర్గాల మహిళలకు 1/3వ వంతు రిజర్వు చేయాలి.* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారు. ఈ రాష్ట్రాల్లో ఓబీసీ వర్గాల వారికి 34% స్థానాలు రిజర్వు చేశారు.

 

ఎన్నికలు: * ఆర్టికల్‌ 243(కె) ప్రకారం ఏర్పడిన ‘రాష్ట్ర ఎన్నికల సంఘం’ జిల్లా పరిషత్‌కు ఎన్నికలు నిర్వహిస్తుంది. జడ్పీటీసీ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి. జిల్లా పరిషత్‌లో అల్పసంఖ్యాక వర్గాల వారికి (మైనారిటీస్‌) తగిన ప్రాతినిధ్యం లేకపోతే ఆ వర్గం నుంచి ఇద్దరు సభ్యులను ‘కో-ఆప్టెడ్‌ మెంబర్స్‌’గా జిల్లా పరిషత్‌కు నామినేట్‌ చేస్తారు.

 

జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నిక, పదవీకాలం: * జిల్లా పరిషత్‌కు ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు తమలో నుంచి ఒకరిని జిల్లా పరిషత్‌కు ఛైర్మన్‌గా, మరొకరిని వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. * జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ సభ్యుల పదవీకాలం అయిదేళ్లు. పదవీకాలం కంటే ముందే ఏదైనా పదవికి ఖాళీ ఏర్పడితే ఆరు నెలల్లోగా ఎన్నిక ద్వారా భర్తీ చేయాలి.

 

తొలగింపు:  జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌లను నిర్దిష్ట కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది.* అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడినట్లు ధ్రువీకరణ జరిగినప్పుడు.* రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించినట్లు ధ్రువీకరణ జరిగినప్పుడు.* పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా తమకు సంక్రమించిన అధికార విధులను నిర్వహించడంలో అనేకసార్లు విఫలమైనప్పుడు.

 

అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగింపు:  * జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌లను తొలగించే అవిశ్వాస తీర్మానంపై 2/3వ వంతు జడ్పీటీసీ సభ్యులు సంతకాలు చేసి ఆ నోటీసును జడ్పీ సీఈఓకి అందజేయాలి. * జిల్లా పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసి ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ పదవులు కోల్పోతారు.

 

జిల్లా పరిషత్‌లోని సభ్యులు: * జిల్లాలోని మొత్తం శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) * జిల్లాలోని మొత్తం లోక్‌సభ సభ్యులు (ఎంపీలు) * జిల్లాలో ఓటరుగా నమోదైన శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) * జిల్లాలో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు (ఎంపీలు).

 

శాశ్వత ఆహ్వానితులు:  * కలెక్టర్‌ * జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ * జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ * జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ * జిల్లాలోని మండల పరిషత్‌ల అధ్యక్షులు.  వీరంతా జిల్లా పరిషత్‌ సమావేశాలు, చర్చల్లో పాల్గొనవచ్చు. కానీ, ఏదైనా తీర్మానంపై ఓటింగ్‌ జరిగినప్పుడు ఓటుహక్కు మాత్రం ఉండదు.

 

స్థాయీ సంఘాలు: ప్రతి జిల్లా పరిషత్‌ కార్యకలాపాల నిర్వహణ కోసం ఏడు స్థాయీ సంఘాలు ఉంటాయి. అవి 

 

1) ప్రణాళిక, ఆర్థిక స్థాయీ సంఘం 

 

2) గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం 

 

3) వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘం 

 

4) సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం 

 

5) విద్య, వైద్య స్థాయీ సంఘం 

 

6) స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం

 

 7) అభివృద్ధి పనుల స్థాయీ సంఘం. వీటిలో జడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారు. స్థాయీ సంఘాల సమావేశాలు రెండు నెలలకోసారి జరుగుతాయి. ఇందుకు ఉండాల్సిన కోరం 1/3వ వంతు. 

* వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘానికి జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

* కనీసం రెండు స్థాయీ సంఘాలకు అధ్యక్షులుగా మహిళలు ఉంటారు.

* మిగిలిన నాలుగు స్థాయీ సంఘాలకు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

* స్థాయీ సంఘాలు జిల్లా పరిషత్‌ పనులను, కార్యక్రమాలను రంగాల వారీగా వర్గీకరించి, వాటి పనితీరును అధ్యయనం చేస్తాయి. వివిధ అభివృద్ధి పథకాల అమలుతీరును సమీక్షించి, పర్యవేక్షించి, అవసరమైన సూచనలు, సలహాలను జిల్లా పరిషత్‌కు ఇస్తాయి. ఈ సూచనలను జిల్లా పరిషత్‌ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. స్థాయీ సంఘాల సమావేశాలకు కలెక్టర్‌ హాజరుకావచ్చు. 

 

జిల్లా పరిషత్‌ అధికారాలు - విధులు: * జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన.* జిల్లాలోని మండల పరిషత్‌ల పనితీరును సమీక్షించడం. * జిల్లాకు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను రూపొందించి, ఆమోదించడం. * మండలాల వారీగా రూపొందించిన ప్రణాళిక కార్యక్రమాలను సమన్వయపరచి క్రమబద్ధీకరించడం. * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను అమలుచేయడం. * ప్రాథమికోన్నత పాఠశాలలు, వృత్తి విద్యాసంస్థలను నిర్వహించడం. * వయోజన విద్యా కార్యక్రమాల నిర్వహణ. * జీవ వైవిధ్య కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం. * స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించిన గణాంక సమాచారాన్ని ప్రచురించడం. * రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మండల పరిషత్‌ నిధులపై ‘లెవీ’ విధించడం. * గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ మధ్య వనరుల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం. * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను మండల పరిషత్‌లకు పంపిణీ చేయడం. * క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మత సామరస్యం సాధనకు కృషి చేయడం. * పార్కులు, ఆటస్థలాలు, స్టేడియంల నిర్మాణం, నిర్వహణ. * ఉపాధిహామీ పనులను మండల పరిషత్‌లకు కేటాయించడం, పర్యవేక్షించడం.

 

ఆదాయ వనరులు:  జిల్లా పరిషత్‌కు విస్తృతమైన ఆదాయ వనరులుంటాయి. అవి 

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు, అఖిలభారత సంస్థలు మంజూరు చేసే నిధులు. 

* జిల్లా పరిషత్‌ ఆధీనంలోని ఎండోమెంట్స్, ట్రస్టుల ఆదాయం. 

* కుటీర, చిన్నతరహా పరిశ్రమల నుంచి వసూలయ్యే పన్నులు. 

* భూమి సెస్సు, ఫీజులు, పన్నులు. 

* రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు, ఫీజుల్లో వాటా. 

* ఇసుక క్వారీలకు సంబంధించిన సీనరేజీ ఫీజు. 

* జిల్లా పరిషత్‌ స్థిరాస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం.

* ఉపాధిహామీ పథకం ద్వారా వచ్చే నిధులు. 

* వివిధ వర్గాల వారు ఇచ్చే విరాళాలు. 

* జిల్లా పరిషత్‌కు లభించే ఆదాయ వనరులన్నింటినీ ‘జిల్లా పరిషత్‌ నిధి’గా పరిగణిస్తారు. ఈ నిధిని సమీపంలోని ‘ప్రభుత్వ ట్రెజరీ’లో జమ చేయాల్సి ఉంటుంది.

 

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ - అధికారాలు, విధులు: * జిల్లా పరిషత్‌ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం. * జిల్లా పరిషత్‌ ఆమోదించిన తీర్మానాల అమలు కోసం ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)కి ఆదేశాలు జారీ చేయడం.* జిల్లా పరిషత్‌ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల రికార్డులను తనిఖీ చేయడం.

 

* జిల్లా పరిషత్‌ సమావేశాలను ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించడం.* వివిధ స్థాయీ సంఘాల నివేదికలపై సమీక్ష జరపడం, వాటి అమలు కోసం అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం.* హోదారీత్యా జిల్లా విద్యా కమిటీ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా గ్రామీణ ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన మిషన్‌కు  అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

 

జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి: * జిల్లా పరిషత్‌ పరిపాలనలో సహకరించేందుకు ముఖ్య కార్యనిర్వహణాధికారి (జడ్పీ సీఈఓ)ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. సీఈఓ జీతభత్యాలు, పింఛన్లు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.* జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ను సంప్రదించి జిల్లా పరిషత్‌ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తారు. * జిల్లా పరిషత్, స్థాయీ సంఘాల సమావేశాలకు సంబంధించిన రికార్డులను భద్రపరుస్తారు. * జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందగలరు.* జిల్లా పరిషత్‌ ఆమోదించిన తీర్మానాల అమలు కోసం కృషి చేస్తారు. జిల్లా పరిషత్‌ చేపట్టే వివిధ అభివృద్ధి పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తారు.* జిల్లా పరిషత్, మండల పరిషత్‌ సమావేశాల్లో పాల్గొనవచ్చు. కానీ ఏదైనా తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించినప్పుడు ఓటు హక్కు ఉండదు.* జిల్లా పరిషత్‌ అధికార పరిధిలోని కార్యాలయ సిబ్బంది, అకౌంట్స్‌ వ్యవహారాలపై నియంత్రణ కలిగి ఉంటారు.* జిల్లా పరిషత్‌ పరిధిలోని వివిధ కార్యాలయాలు, పథకాల అమలు తీరును తనిఖీ చేస్తారు.* జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘం సూచనల మేరకు మండల పరిషత్‌ పరిధిలోని పనులు, పథకాలు, సంస్థలను తనిఖీ చేస్తారు. 

 

* జిల్లా పరిషత్‌కు సంబంధించిన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వానికి నివేదిస్తారు.* జిల్లా పరిషత్‌ చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోపు మరో సమావేశాన్ని నిర్వహించకపోతే రాష్ట్ర ప్రభుత్వం జడ్పీ సీఈఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 24-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా

పట్టణ పాలనకు పట్టాభిషేకం!

 

   పట్టణాలు, నగరాల్లో పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలు కీలక భూమిక పోషిస్తాయి. అందుకే అవి రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తూనే పాలనా వ్యవహారాల్లో ఆర్థికంగా, రాజకీయంగా స్వతంత్రంగా వ్యవహరించగలగాలి. అధికార వికేంద్రీకరణకు ప్రతిరూపాలుగా నిలిచేందుకు అవసరమైన సంస్థాగత నిర్మాణం వాటికి ఉండాలి. ఈ లక్ష్యాలు 74వ రాజ్యాంగ సవరణ చట్టంతో నెరవేరాయి. ఆ చట్టం పట్టణ స్థానిక స్వపరిపాలనా వ్యవస్థకు రాజ్యాంగ గుర్తింపును ఇచ్చింది. పట్టణ ప్రభుత్వాలు విజయవంతంగా పనిచేసేందుకు దోహదపడింది. ఈ మౌలికాంశాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్రమైన అవగాహన ఉండాలి. 

 

  ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు ఉన్నప్పుడు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించింది. ఇది 1993, జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దాని ద్వారా రాజ్యాంగానికి ఖిశ్బ్రీత్శి అనే కొత్త భాగాన్ని చేర్చారు. ఇందులో ఆర్టికల్‌ 243్బశ్శి నుంచి  243్బ్ట్రబ్శి వరకు మొత్తం 18 రకాల ఆర్టికల్స్‌లో పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల పరిపాలనా విధానాన్ని వివరించారు.

 

ఆర్టికల్‌ 243(P): పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన నిర్వచనాలు.

 

మున్సిపల్‌ ఏరియా: గవర్నర్‌ నోటిఫై చేసిన ఒక మున్సిపాలిటీలోని ప్రాదేశిక ప్రాంతం అని అర్థం.

 

మున్సిపాలిటీ: ఆర్టికల్‌ 243్బశ్శీ ప్రకారం ఏర్పాటైన పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.

 

వార్డు కమిటీ: ఆర్టికల్‌ 243్బళ్శీ ప్రకారం ఏర్పాటైన కమిటీ అని అర్థం.

 

మెట్రోపాలిటన్‌ ప్రాంతం: పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరం.


జిల్లా: ఒక రాష్ట్రంలోని జిల్లా.


జనాభా: చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి నోటిఫై అయిన సందర్భంలో నిర్ధారించిన జనాభా. (ప్రస్తుతం 2011 జనాభా గణాంకాలను ఆధారంగా పరిగణిస్తున్నారు.)


ఆర్టికల్‌ 243(Q): పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థాపన: దేశంలో మూడు రకాల పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల ఏర్పాటును నిర్దేశించారు.


1) నగర పంచాయతీ: గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతూ, వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తారు. దీని జనాభా 20,000-40,000.


2) మున్సిపాలిటీ: 40 వేల నుంచి 3 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాలను మున్సిపాలిటీ/మున్సిపల్‌ కౌన్సిల్‌గా ఏర్పాటు చేస్తారు.


3) మున్సిపల్‌ కార్పొరేషన్‌: 3 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను మున్సిపల్‌ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాన్ని మెట్రోపాలిటన్‌ మహానగరంగా పేర్కొంటారు.

 

ఆర్టికల్‌ 243(R): మున్సిపల్‌ వ్యవస్థల సభ్యులు, అధ్యక్షుల ఎన్నిక విధానం: నగర పంచాయతీలోని వార్డు సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిల్‌లోని కౌన్సిలర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్, మెట్రోపాలిటన్‌ మహానగరాల్లోని కార్పొరేటర్లు ఓటర్ల ద్వారా ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్‌ పద్ధతిలో ఎన్నికవుతారు.

 

* మున్సిపల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్, డిప్యూటీ మేయర్, మెట్రోపాలిటన్‌ మహానగర మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది.

 

* నగర పంచాయతీ అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్వహించవచ్చు. ఏ విధంగా నిర్వహించాలనేది రాష్ట్ర శాసనసభ రూపొందించే చట్టం నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

 

* లోక్‌సభ సభ్యులు, శాసనసభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల పరిధిలోని పట్టణ, నగరపాలక సంస్థల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.

 

* రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు వారు ఏ పట్టణ/నగరపాలక సంస్థలో ఓటరుగా నమోదై ఉంటారో ఆ సంస్థల్లో పదవిరీత్యా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.

 

* ఎక్స్‌ అఫీషియో సభ్యులకు పట్టణ, నగరపాలక సంస్థల్లో తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో ఓటు హక్కు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయవచ్చు.

 

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎక్స్‌ అఫీషియో సభ్యులకు పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటు హక్కు కల్పించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ విధానం కొనసాగుతోంది.

 

ఆర్టికల్‌ 243(S): వార్డు కమిటీల ఏర్పాటు:  పట్టణ, నగరపాలక సంస్థలను పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులు/డివిజన్లుగా విభజిస్తారు. 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపల్‌ సంస్థల్లో వార్డు/డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ వార్డులు/డివిజన్లు కలిసి వార్డు కమిటీ లేదా డివిజన్‌ కమిటీగా ఏర్పాటైనప్పుడు వాటిలోని సభ్యులు తమలో నుంచి ఒకరిని వార్డు/డివిజన్‌ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఈ వార్డు/డివిజన్‌ కమిటీలు కార్పొరేటర్లకు పరిపాలనకు సంబంధించిన అంశాలపై సూచనలు ఇస్తాయి. గుజరాత్‌లో ఏర్పాటుచేసిన బహుళ సభ్య వార్డు కమిటీలను సుప్రీంకోర్టు సమర్థించింది.

 

ఆర్టికల్‌ 243(T): రిజర్వేషన్లు:  పట్టణ, నగరపాలక సంస్థలకు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి, వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. వీరికి నిర్దేశించిన రిజర్వేషన్లలో 1/3వ వంతు స్థానాలను ఈ వర్గాల మహిళలకు కేటాయించాలి. మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 1/3వ వంతు ఇవ్వాలి. వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలిపెట్టారు. మైనార్టీ వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం లేకపోతే మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఇద్దరిని, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ముగ్గురిని కో-ఆప్టెడ్‌ సభ్యులుగా నామినేట్‌ చేయవచ్చు.

 

ఆర్టికల్‌ 243(U): పదవీకాలం: పట్టణ, నగరపాలక సంస్థల పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం ముగియక ముందే వీటిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. ఈ విధంగా రద్దయిన వాటికి తప్పనిసరిగా 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. అన్ని స్థాయుల్లోనూ సభ్యులు, అధ్యక్షుల పదవీ కాలం 5 సంవత్సరాలు.

 

ఆర్టికల్‌ 243(V): అర్హతలు, అనర్హతలు: 21 సంవత్సరాలు నిండి ఉండాలి. సంబంధిత స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి. 1995, మే 30 తర్వాత వివాహమైన దంపతులకు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండకూడదు. దివాళాతీసి ఉండకూడదు.


ఆర్టికల్‌ 243(W): అధికారాలు - విధులు:  74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ, నగర పాలక సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో పొందుపరిచారు. 

 

ఆర్టికల్‌ 243(X): ఆర్థిక వనరులు, పన్నులు:  రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు పట్టణ, నగరపాలక సంస్థలు పన్నులు విధించి, వసూలు చేసుకోవచ్చు. మున్సిపల్‌ సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 2/3వ వంతు స్థానిక పన్నుల ద్వారానే సమకూర్చుకుంటాయి. స్థానిక స్వపరిపాలన సంస్థల పన్నుల ఆదాయంలో 1/4వ వంతు ఆక్ట్రాయ్‌ పన్ను ద్వారానే సమకూర్చుకుంటాయి.

 

పన్నులు: ఇంటి పన్ను, తాగునీటి పన్ను, వినోదపు పన్ను, మార్కెట్లు, సంతలపై పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, ప్రకటనలపై పన్ను, విరాళాలు, జరిమానాలు, సెల్‌ఫోన్‌ టవర్లపై లభించే ఆదాయం, ఆస్తుల బదిలీపై పన్ను, భవన నిర్మాణ అనుమతులపై పన్ను.


ఆర్టికల్‌ 243(Y): రాష్ట్ర ఆర్థిక సంఘం: ఆర్టికల్‌ 243్బఖ్శి లో పేర్కొన్న రాష్ట్ర ఆర్థిక సంఘం ఆర్టికల్‌ 243్బ్త్శ్ర కు కూడా వర్తిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ, స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులను మంజూరు చేస్తుంది. అదనపు ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తుంది. గవర్నర్‌ ద్వారా కేంద్ర ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు పంపుతుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికను గవర్నర్‌కు సమర్పించగా, గవర్నర్‌ సంబంధిత నివేదికను శాసనసభకు సమర్పిస్తారు.

 

ఆర్టికల్‌ 243(Z): అకౌంటింగ్‌ అండ్‌ ఆడిటింగ్‌:  పట్టణ, నగరపాలక సంస్థల ఖాతాల నిర్వహణ, ఆడిటింగ్‌కు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ ఒక శాసనం ద్వారా రూపొందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని స్థానిక సంస్థల ఆడిట్‌లను రాష్ట్ర ఆడిట్‌ సంచాలకుడు నిర్వహిస్తారు.

 

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రకాల ఆడిట్‌ను నిర్వహిస్తున్నారు. అవి 1) లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ 2) డిపార్ట్‌మెంటల్‌ ఆడిట్‌ 3) జనరల్‌ ఫండ్‌ ఆడిట్‌

 

ఆర్టికల్‌ 243(ZA): రాష్ట్ర ఎన్నికల సంఘం: ఆర్టికల్‌ 243్బర్శీ ద్వారా ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్టికల్‌ 243్బ్ట్రత్శి కు కూడా వర్తిస్తుంది. ఇది పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. మున్సిపల్‌ వ్యవస్థలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమిస్తారు. తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికే ఉంటుంది.

 

ఆర్టికల్‌ 243(ZB): కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు: 


  74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992లోని అంశాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలా, లేదా అనేది రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా నిర్ణయిస్తారు. కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణ స్థానిక పాలనపై కేంద్ర హోంశాఖ నియంత్రణ కలిగి ఉంటుంది. శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి ప్రత్యేక చట్టాలను రూపొందించుకోవచ్చు. అయితే ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి.

 

ఆర్టికల్‌ 243(ZC): మినహాయించిన ప్రాంతాలు: 74వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయించారు. అవి * ఆర్టికల్‌ 244(1) లో పేర్కొన్న షెడ్యూల్డ్‌ ప్రాంతాలు * ఆర్టికల్‌ 244(2) లో పేర్కొన్న ఆదివాసీ ప్రాంతాలు * నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ప్రాంతాలు. మణిపుర్‌లోని కొండప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్‌ ప్రాంతంలోని గూర్ఖాహిల్‌ కౌన్సిల్‌ ప్రాంతం.

 

ఆర్టికల్‌ 243(ZD): జిల్లా ప్రణాళికా బోర్డు: జిల్లాలోని గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను జిల్లా ప్రణాళికా బోర్డు రూపొందిస్తుంది. ఈ బోర్డుకు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ రూపొందిస్తుంది.

 

* జిల్లా ప్రణాళికా బోర్డులోని మొత్తం సభ్యుల్లో 4/5వ వంతు మందికి తక్కువ కాకుండా సంబంధిత జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికయ్యే సభ్యుల్లో మున్సిపాలిటీలు, పంచాయతీలకు చెందినవారు ఎంతమంది ఉండాలనేది ఆ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంత జనాభా నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది.

 

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా ప్రణాళికా బోర్డుకు ఎక్స్‌ అఫీషియో ఛైర్మన్‌గా జిల్లా పరిషత్‌ ఛైర్మన్, మెంబర్‌ సెక్రటరీగా కలెక్టర్‌ వ్యవహరిస్తున్నారు.

 

* జిల్లా ప్రణాళికా బోర్డులో మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో 24 మంది సభ్యులు ఎన్నికవుతారు. నలుగురు నామినేట్‌ అవుతారు. మిగిలినవారు కలెక్టర్, జడ్పీ ఛైర్మన్‌.

 

* జిల్లా ప్రణాళికా బోర్డు రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను బోర్డు ఛైర్మన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు.


ఆర్టికల్‌ 243(ZE): మెట్రోపాలిటన్‌ ప్రణాళికా సంఘం: మెట్రోపాలిటన్‌ మహానగరాల సమగ్ర అభివృద్ధికి మెట్రోపాలిటన్‌ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటుచేయాలి. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 24. వీరిలో 18 మంది ఎన్నిక ద్వారా, 4 మంది నామినేషన్‌ విధానం ద్వారా వస్తారు. ఛైర్మన్‌గా మెట్రోపాలిటన్‌ మహానగర మేయర్, మెంబర్‌ సెక్రటరీగా మున్సిపల్‌ కమిషనర్‌ వ్యవహరిస్తారు. మెట్రోపాలిటన్‌ ప్రణాళికా సంఘం తన నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు సమర్పిస్తుంది. మరో నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపుతుంది. 1964లో మన దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను దిల్లీలో ఏర్పాటుచేశారు.

 

ఆర్టికల్‌ 243 (ZF): పూర్వ శాసనాల కొనసాగింపు: 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) 1993, జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు అంటే 1994, మే 31 వరకు వివిధ రాష్ట్రాల్లో అప్పటికే అమల్లో ఉన్న పూర్వశాసనాలు కొనసాగుతాయి.

 

* 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992లోని మౌలికాంశాలకు భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చట్టాలు రూపొందించి, అమలు చేసుకోవచ్చు.

 

ఆర్టికల్‌ 243(ZG): ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల ఏర్పాటు: పట్టణ, నగరపాలక సంస్థలకు జరిగే ఎన్నికల సంబంధిత వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. దిగువ న్యాయస్థానాలు రాష్ట్ర జాబితాలో ఉండటంతో ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్లను ఏర్పాటుచేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది.

 

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థలో జరిగే ఎన్నికల వివాదాల పరిష్కార బాధ్యతలను జిల్లా సెషన్స్‌ కోర్టులకు అప్పగించారు.

 

* జిల్లా సెషన్స్‌ కోర్టులు ఎన్నికల వివాదాలను విచారించే సందర్భంలో సాధారణ న్యాయస్థానాలుగా కాకుండా ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల హోదాలో విచారిస్తాయి.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 15-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు

పౌర సేవలకు ప్రత్యేక వ్యవస్థలు!

 

  పట్టణాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి, పౌరులకు అవసరమైన సేవలను అందించడానికి, సదుపాయాలను కల్పించడానికి ప్రత్యేక స్వపరి పాలనా సంస్థలు ఉన్నాయి. అవి సమర్థ పాలనతో సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తాయి. తద్వారా దేశాభివృద్ధికి దోహదపడతాయి. రాజ్యాంగ హోదాను కలిగి, ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తున్న ఆ పట్టణ స్థానిక పరిపాలన సంస్థల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 

 


  భారతదేశంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న పౌరులకు పౌర సదుపాయాలను కల్పించేందుకు మున్సిపల్‌ వ్యవస్థలు కృషి చేస్తున్నాయి. వీటికి పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు. దేశంలో మూడంచెల పట్టణ స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు.

 


నగర పంచాయతీ: ఒక గ్రామం పట్టణంగా అభివృద్ధి చెందుతుంటే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తుంది. అక్కడ జనాభా 20 వేల నుంచి 40 వేల వరకు ఉంటుంది. జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 400పైన నమోదవుతుంది. నివసిస్తున్న వారిలో 75% పైగా పురుషులు వ్యవసాయేతర పనులు చేస్తుంటారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నగర పంచాయతీని పరిపాలన సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఆ వార్డు సభ్యులను ఓటర్లు  ప్రత్యక్ష పద్ధతిలో రహస్య ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు. వార్డు సభ్యుల్లో ఎన్నికైనవారు పదిమంది, నామినేటెడ్‌ ముగ్గురు ఉంటారు.


* వార్డు సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. నగర పంచాయతీకి రాజకీయ అధిపతిగా, ప్రథమ పౌరుడిగా అధ్యక్షుడు వ్యవహరిస్తారు. ఈ అధ్యక్ష, ఉపాధ్యక్షులను అవిశ్వాస తీర్మానం ద్వారా వార్డు సభ్యులు తొలగించవచ్చు.


* స్థానిక లోక్‌సభ సభ్యుడు (ఎంపీ), శాసనసభ్యుడు (ఎమ్మెల్యే), నగర పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉన్న రాజ్య సభ సభ్యుడు (ఎంపీ), శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) నగర పంచాయతీ సమావేశాలకు హోదా రీత్యా సభ్యులుగా హాజరవుతారు. ఇక్కడి పరిపాలన కమిటీల ద్వారా జరుగుతుంది.

 


కార్యనిర్వహణాధికారి: నగర పంచాయతీ పాలనలో అధ్యక్షుడికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఉంటారు. తీర్మానాల అమలు, బడ్జెట్‌ రూపకల్పనలో ఈ అధికారి కీలకపాత్ర పోషిస్తారు.

 


పురపాలక సంఘం: నగర పాలక సంస్థ (మున్సిపల్‌ కార్పొరేషన్‌)కు దిగువన, నగర పంచాయతీకి ఎగువన ఏర్పాటయ్యే పట్టణ స్థానిక సంస్థే పురపాలక సంఘం (మున్సిపాలిటీ). దీని పరిధిలో జనాభా 40 వేలకుపైన, 3 లక్షల్లోపు ఉంటుంది. మున్సిపాలిటీని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఆ వార్డుల నుంచి ఓటర్లు రహస్య ఓటింగ్‌తో కౌన్సిలర్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని కో-ఆప్టెడ్‌ సభ్యుడిగా నామినేట్‌ చేస్తారు. కౌన్సిలర్లు తమలో నుంచి ఒకరిని పురపాలక సంఘానికి ఛైర్మన్‌గా, మరొకరిని వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. అవసరమైనప్పుడు ఆ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌లను అవిశ్వాస తీర్మానం ద్వారా కౌన్సిలర్లు తొలగించవచ్చు. 


* పురపాలక సంస్థలను వాటి వార్షికాదాయం ఆధారంగా అయిదు రకాలుగా వర్గీకరించారు. 1) గ్రేడ్‌ - 3 మున్సిపాలిటీ రూ.2 కోట్ల లోపు 2) గ్రేడ్‌ - 2 మున్సిపాలిటీ కోట్ల నుంచి రూ.4 కోట్లు 3) గ్రేడ్‌ - 1 మున్సిపాలిటీ రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లు 4) స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్లు 5) సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ రూ.8 కోట్ల పైన.


* ‘ఆంధ్రప్రదేశ్‌ పురపాలక సంఘాల చట్టం 1965’ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏపీలో పురపాలక సంఘాలు 77 ఉన్నాయి. 


* ‘తెలంగాణ పురపాలక సంస్థల చట్టం 2019’ ప్రకారం  తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు (పురపాలక సంస్థలు) కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని పురపాలక సంఘాలు 128.

 


పురపాలక సంస్థ ఛైర్మన్‌:  ఈ ఛైర్మన్‌ మున్సిపాలిటీకి రాజకీయ అధిపతిగా, ప్రథమ పౌరుడిగా వ్యవహరిస్తారు. సమావేశాలకు, కొన్ని స్థాయీ సంఘాలకు అధ్యక్షత వహిస్తారు.

 


మున్సిపల్‌ కమిషనర్‌: రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉద్యోగి. పురపాలక సంస్థ చేసిన తీర్మానాలను అమలు చేస్తారు. రికార్డులు నిర్వహిస్తారు. సిబ్బంది, ఆస్తులపై కమిషనర్‌కి పర్యవేక్షణాధికారం ఉంటుంది.

 


నగర పాలక సంస్థ: రాష్ట్రంలోని పెద్ద పట్టణాలను నగరపాలక సంస్థలు (మున్సిపల్‌ కార్పొరేషన్‌లు)గా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చట్టం చేయవచ్చు. జనాభా 3 లక్షల కంటే ఎక్కువ ఉండే నగరాలను ‘మున్సిపల్‌ కార్పొరేషన్‌’గా ప్రకటిస్తారు. మన దేశంలో మొదటి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను 1687లో మద్రాసులో ఏర్పాటు చేశారు.


* హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1950 ప్రకారం, 1950లో హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలు వేర్వేరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లుగా మారాయి.హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955 ప్రకారం 1960, ఆగస్టు 3న హైదరాబాద్, సికింద్రాబాద్‌ కార్పొరేషన్లను విలీనం చేసి ఒకే మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. 


* ప్రస్తుతం తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్‌లో 16 మున్సిపల్‌ కార్పొరేషన్‌లు ఉన్నాయి. 


* పరిపాలనా సౌలభ్యం కోసం నగర పాలక సంస్థను డివిజన్లుగా విభజిస్తారు. వాటిలోని ఓటర్లు రహస్య ఓటింగ్‌ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో కార్పొరేటర్లను ఎన్నుకుంటారు. 


* మైనార్టీ వర్గాలకు చెందిన ఇద్దరిని ‘కో-ఆప్టెడ్‌’ సభ్యులుగా నామినేట్‌ చేస్తారు. 

 


మేయర్, డిప్యూటీ మేయర్‌: కార్పొరేటర్లు తమలో ఒకరిని మేయర్‌గా, మరొకరిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకుంటారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రాజకీయ అధిపతిగా, ప్రథమ పౌరుడిగా మేయర్‌ వ్యవహరిస్తారు, సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

 


మున్సిపల్‌ కార్పొరేషన్‌-కమిషనర్‌: సీనియర్‌ ఐఏఎస్‌ క్యాడర్‌ వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పదవిలో నియమిస్తుంది. నగరపాలక సంస్థకు పరిపాలనాపరమైన అధిపతిగా కమిషనర్‌ వ్యవహరిస్తారు.కార్పొరేషన్‌ సమావేశాల అజెండాను రూపొందిస్తారు. తీర్మానాల అమలుకు కృషి చేస్తారు.


* పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం అయిదేళ్లు.

 


స్థాయీ సంఘాలు (స్టాండింగ్‌ కమిటీలు): పట్టణ స్థానిక సంస్థలకు స్థాయీ సంఘాలను ‘కళ్లు, చెవులు, చేతులు’గా పేర్కొంటారు. వీటిలో సంబంధిత సంస్థల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సభ్యులుగా ఉంటారు. ఇవి వార్షిక బడ్జెట్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తాయి. అధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని, రికార్డులను పొందుతాయి. 

 


స్థాయీ సంఘాలు - రకాలు: పురపాలక సంస్థలు పరిపాలనను సమర్థంగా నిర్వహించడానికి 6 రకాల స్థాయీ సంఘాలు సహకరిస్తాయి. * ఆర్థిక అంశాల స్థాయీ సంఘం * విద్యకు సంబంధించిన స్థాయీ సంఘం * వైద్య ఆరోగ్య స్థాయీ సంఘం * మహిళా సంక్షేమ స్థాయీ సంఘం * వెనుకబడిన వర్గాల సంక్షేమ స్థాయీ సంఘం * పన్నుల

 


స్థాయీ సంఘం

 


కంటోన్మెంట్‌ బోర్డు: సైనిక స్థావరాలున్న ప్రాంతాల్లో ప్రజలకు పౌర సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డులను ఏర్పాటుచేస్తారు. వీటికి సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. మన దేశంలో ఆంగ్లేయుల పాలనా కాలంలో 1924లో ‘కంటోన్మెంట్‌ బోర్డ్‌ యాక్ట్‌’ను తొలిసారిగా చేశారు. ఈ చట్టాన్ని 2006లో సవరించారు. ప్రస్తుతం మనదేశంలోని కంటోన్మెంట్‌ బోర్డుల సంఖ్య 62. వీటిలో ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు. ఏడుగురు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటారు. సంబంధిత ప్రాంత మిలిటరీ కమాండింగ్‌ ఆఫీసర్‌ ఈ బోర్డుకు హోదా రీత్యా అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. కార్యనిర్వాహక అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో కంటోన్మెంట్‌ బోర్డు ఉంది.

 


నోటిఫైడ్‌ ఏరియా కమిటీలు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, మున్సిపల్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులు లేని చోట ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా నోటిఫైడ్‌ ఏరియా కమిటీలను ఏర్పాటు చేస్తుంది. దీనిలోని సభ్యులందరినీ నామినేట్‌ చేస్తుంది. ఎన్నికైన సభ్యులు ఉండరు. ఇవి చట్టబద్ధమైన సంస్థలు కావు.

 


టౌన్‌ ఏరియా కమిటీలు: చిన్న చిన్న పట్టణాల్లో ప్రజలకు పౌర సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ‘టౌన్‌ ఏరియా కమిటీ’లను ఏర్పాటు చేస్తారు. ఇవి ‘సెమీ మున్సిపల్‌ అథారిటీ’ పద్ధతిలో ఉంటాయి. వీటిలో పూర్తిగా ఎన్నికైన లేదా నామినేట్‌ చేసిన లేదా కొంతమంది ఎన్నికైన లేదా నామినేట్‌ అయిన సభ్యులుంటారు. ఇవి చట్టబద్ధమైన సంస్థలు.

 


పోర్ట్‌ ట్రస్టు: నౌకాశ్రయాల పరిరక్షణ, నిర్వహణతోపాటు అందులోని ఉద్యోగులు, కార్మికులకు పౌరసదుపాయాలు కల్పించడానికి చట్టం ద్వారా పోర్టు ట్రస్టులను పార్లమెంటు  ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఎన్నికైన, నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు. వీటికి ఛైర్మన్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. మేజర్‌ పోర్ట్‌ చట్టం-2021 ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 13 పోర్ట్‌ ట్రస్టులు ఉన్నాయి.

 


ప్రత్యేక ప్రయోజన సంస్థలు: పట్టణాల్లో బహుళ ప్రయోజనాల కోసం వివిధ అంశాలపై రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేస్తుంది. ఇవి స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో కలిసి పనిచేస్తాయి. ఒక్కోసారి స్వతంత్రంగానూ విధులు నిర్వహిస్తాయి. వీటి అధిపతులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.


ఉదా: పట్టణాభివృద్ధి సంస్థలు, హౌసింగ్‌ బోర్డులు, ఎలక్ట్రికల్‌ సప్లయ్‌ బోర్డులు.

 


రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 29-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌