• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయ ఉద్యమం

బలవంతుల ఆయుధమే సత్యాగ్రహం!

 కాంగ్రెస్‌ స్థాపన అనంతరమే బ్రిటిష్‌ వలస పాలకులపై భారతీయుల తిరుగుబాటు  వ్యవస్థాగత రూపాన్ని సంతరించుకుంది. మితవాద, అతివాద, తీవ్రవాద దశలను దాటి గాంధీజీ నాయకత్వంలో పరిపూర్ణంగా సాగింది. జాతీయోద్యమ కాలంలో జరిగిన ప్రతి పోరాటం దేశ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రెట్టింపు చేసింది. విదేశాల్లోనూ భారతీయుల కోసం పార్టీలు ఏర్పాటై బ్రిటిష్‌ వ్యతిరేక గళాన్ని వినిపించాయి. దాదాభాయ్‌ నౌరోజీ మొదలు గాంధీజీ, నేతాజీ వరకు జాతి నేతలు నడిపించిన పోరాటాలు, అనుసరించిన విధానాలు, వాటి ఫలితాలపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. ప్రాంతీయస్థాయిలో ఆయా పోరాటాలకు నాయకత్వం వహించిన ప్రముఖుల గురించి తెలుసుకోవాలి.

 

1.  భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించి సరైన వాక్యాలు?

ఎ) ఈ సంస్థ స్థాపన 1885లో జరిగింది.

బి) ఈ సంస్థ స్థాపకుడు ఏవో హ్యూమ్‌.

సి) ఈ సంస్థ మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసీ బెనర్జీ.

డి) మొదటి సమావేశంలో పాల్గొన్న మొత్తం సభ్యుల సంఖ్య 72.

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి, డి     4) ఎ, డి


2.     కింది రాజకీయ సంస్థలను వాటి ప్రారంభ కాలం ప్రకారం వరుసలో అమర్చండి.    

ఎ) మద్రాసు నేటివ్‌ అసోసియేషన్‌ 

బి) పూనా సార్వజనీన సభ

సి) ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌

డి) ఇండియన్‌ అసోసియేషన్‌ 

1) ఎ, బి, సి, డి    2) డి, సి, బి, ఎ 

 3) సి, డి, బి, ఎ     4) ఎ, సి, బి, డి


3. కిందివాటిలో దాదాభాయ్‌ నౌరోజీకి సంబంధించి సరికానిది?

ఎ) దాదాభాయ్‌ నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆ పేరు సూచించారు.

బి) ‘ది పావర్టీ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ గ్రంథకర్త నౌరోజీ.

సి) లిబరల్‌ పార్టీ తరఫున ప్రిన్స్‌బరి నియోజక వర్గం నుంచి బ్రిటిష్‌ పార్లమెంటుకు 1895లో ఎన్నికయ్యారు.

డి) డ్రెయిన్‌ సిద్ధాంత పితామహుడు.

1)  ఎ, బి   2) సి   3) ఎ   4) ఎ, డి


4. భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) సమావేశాలకు సంబంధించి కిందివాటిని జతపరచండి. 

సంవత్సరం       అధ్యక్షులు 

1) 1887    ఎ) గాంధీజీ    

2) 1917    బి) సరోజినీ నాయుడు

3) 1924     సి) అనిబిసెంట్‌

4) 1925    డి) బద్రుద్దీన్‌ త్యాబ్జి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి


5.     బాలగంగాధర్‌ తిలక్‌ గురించి సరైనవి గుర్తించండి.

ఎ) 1908లో బర్మాలోని మాండలే జైలుకి వెళ్లారు.

బి) 1893లో గణేష్‌ ఉత్సవాలు ప్రారంభించారు.

సి) ‘ది ఆర్కిటిక్‌ హోం ఇన్‌ ది వేదాస్‌’ అనే గ్రంథం రచించారు.

డి) మహారాష్ట్ర వద్ద సైమన్‌ కమిషన్‌పై తిరుగుబాటు ప్రదర్శన నిర్వహించారు.

1) ఎ, బి, సి, డి         2) బి, సి, డి     

3) ఎ, బి, సి        4) ఎ, సి, డి 

 

6.    కిందివాటిలో తప్పుగా ఉన్నది?

1) బెంగాల్‌ విభజన - 1905

2) సైమన్‌ కమిషన్‌ - 1925

3) గాంధీ - ఇర్విన్‌ ఒప్పందం - 1931

4) క్రిప్స్‌ రాయబారం - 1942


7.     ప్రతిపాదన (A): బ్రిటిష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా అనిబిసెంట్‌ హోంరూల్‌ ఉద్యమాన్ని నడిపారు.

కారణం(R): ఆమె భారతీయులందరినీ ఒకే ఛత్రం కిందకి చేర్చాలని కాంక్షించారు.

1) A,R లు నిజం. A కు R సరైన వివరణ.

2) A,R లు నిజం. A కు R సరైన వివరణ కాదు.

3) A నిజం కానీ, R తప్పు.

4) A తప్పు కానీ, R నిజం.


8. కిందివాటిలో గాంధీ సత్యాగ్రహానికి సంబంధించి సరికానిది-

1) సత్యాగ్రహం అంటే ప్రేమ, అంతరాత్మతో జయించడం.

2) సత్యాగ్రహం బలహీనుల ఆయుధం.

3) సత్యాగ్రహం బలవంతుల ఆయుధం.

4) సత్యాగ్రహం ఉద్దేశం ఏమంటే తనకుతాను ఇబ్బంది పడుతూ ఎదుటివారిని మార్చడం.


9. కిందివాటిలో సరైన జత ఏది?

1) మీరు రక్తాన్ని ఇవ్వండి. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను - గాంధీజీ 

2) సాధించు లేదా మరణించు - సుభాష్‌ చంద్రబోస్‌

3) స్వాతంత్య్రం నా ఊపిరి. నాకు స్వాతంత్య్రం కావాలి - దాదాభాయ్‌ నౌరోజీ

4) స్వాతంత్య్రం నా జన్మహక్కు - లాలాలజపతి రాయ్‌



10. కిందివాటిని జతపరచండి. 

బిరుదులు        వ్యక్తులు 

1) దేశోద్ధారక     ఎ) తిలక్‌

2) దేశబంధు      బి) సి.ఎఫ్‌.ఆండ్రూస్‌

3) దీనబంధు     సి) సి.ఆర్‌.దాస్‌

4) లోకమాన్య      డి) కాశీనాథుని నాగేశ్వరరావు 

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి


11. 1946, ఫిబ్రవరి 18న బొంబాయిలో నౌకాదళ తిరుగుబాటుకు కారణం?

1) పదోన్నతుల కోసం

2) బ్రిటిష్‌ అధికారుల ప్రవర్తన, సరైన ఆహారం ఇవ్వకపోవడం

3) సంఘాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడం

4) అధిక వేతనాల కోసం


12. కిందివాటిని కాలానుక్రమ పద్ధతిలో గుర్తించండి.

ఎ) క్రిప్స్‌ రాయబారం   బి) క్విట్‌ ఇండియా ఉద్యమం

సి) వ్యక్తి సత్యాగ్రహాలు  డి) ఆగస్టు ప్రతిపాదనలు

1) ఎ, బి, సి, డి        2) డి, సి, బి, ఎ    

3) డి, సి, ఎ, బి        4) ఎ, సి, డి, బి


13. ప్రత్యక్ష చర్య దినంగా పాటించిన తేదీ (ముస్లింలీగ్‌)-

1) 1940, ఆగస్టు 16     2) 1942, సెప్టెంబరు 26

 3) 1946, ఆగస్టు 16     4) 1936, అక్టోబరు 26


14. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) సరిహద్దు గాంధీగా పేరొందినవారు - ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌

బి) ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ సైన్యం - ఖుదై ఖద్మత్‌ గార్స్‌

సి) ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ పఠాన్‌ సహకారంతో ఉద్యమం చేశారు

డి) ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ మహ్మద్‌ అలీ జిన్నాను వ్యతిరేకించారు

1) ఎ, బి, డి       2) ఎ, బి, సి, డి 

3) ఎ, సి, డి       4) బి, సి, డి 


15. భారత జాతీయ ఉద్యమానికి సంబంధించి భిన్నమైనవారు?

1) తిలక్‌      2) లాలాలజపతి రాయ్‌

3) గోఖలే      4) బిపిన్‌ చంద్రపాల్‌

 


16. జత పరచండి.

 వ్యక్తులు        పత్రికలు 

1) గోపాలకృష్ణ గోఖలే     ఎ) న్యూ ఇండియా 

2) ముట్నూరి కృష్ణారావు     బి) కేసరి 

3) తిలక్‌               సి) కృష్ణా పత్రిక

4) అనిబిసెంట్‌           డి) సుధారక్‌ 

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     

 2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ        

4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి


17. కిందివాటిలో మితవాదుల లక్ష్యం కానిది (భిన్నమైంది)-

ఎ) ఇంపీరియల్‌ కౌన్సిల్‌లో భారతీయులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

బి) పరిశ్రమలను స్థాపించాలి, సంపద దోపిడీని ఆపాలి.

సి) సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు భారత్‌లో నిర్వహించాలి.

డి) జాతీయ విద్యను ప్రోత్సహించాలి.

1) ఎ, బి    2) సి    3) డి    4) ఎ 

 

18. సైమన్‌ వ్యతిరేక తిరుగుబాటు సమయంలో లాలాలజపతి రాయ్‌పై లాఠీఛార్జి చేసి అతడి మరణానికి కారణమైన వ్యక్తి?

1) హ్యూరోజ్‌     2) నికల్సన్‌ 

3) సాండర్స్‌     4) డయ్యర్‌



19. ఆంధ్రలో వందేమాతర ఉద్యమం ప్రచారం చేసిన బెంగాల్‌ నాయకుడు?

1) నరేంద్రనాథ్‌ బెనర్జీ      2) బిపిన్‌ చంద్రపాల్‌ 

3) అరబింద ఘోష్‌     4) బాలగంగాధర్‌ తిలక్‌


 

20. 1906లో ముస్లింలీగ్‌ పార్టీని ఢాకాలో ఎవరు స్థాపించారు?

1) సలీంముల్లా ఖాన్‌    2) ఆగాఖాన్‌     

3) 1, 2    4) జిన్నా


21. ప్రవచనం (A): 1907లో జాతీయ కాంగ్రెస్‌లో చీలిక సూరత్‌ సమావేశంలో ఏర్పడింది.

ప్రవచనం (B): 1916లో లఖ్‌నవూ సమావేశంలో జాతీయ కాంగ్రెస్‌ సభ్యులు కలిసిపోయారు.

1) ప్రవచనం A,B లు సరైనవి. 

2) ప్రవచనం A,B లు సరికానివి.

3) ప్రవచనం A సరైంది, B సరికాదు.

4) ప్రవచనం A సరికాదు, B సరైంది. 



22. కిందివాటిలో సరైంది గుర్తించండి.

ఎ) గదర్‌ పార్టీని 1913లో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో స్థాపించారు. 

బి) గదర్‌ అంటే తిరుగుబాటు.

సి) గదర్‌ పార్టీ వ్యవస్థాపకుడు లాలా హరిదయాళ్‌.

డి) గదర్‌ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య.

1) ఎ, బి, డి         2) ఎ, బి, సి, డి 

3) బి, సి, డి          4) ఎ, డి 



23. హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్, హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ల స్థాపన జరిగిన సంవత్సరాలు వరుసగా గుర్తించండి.

1) 1928, 1924      2) 1924, 1928

3) 1925, 1928      4) 1924, 1927


24. హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ సభ్యులు పార్లమెంటుపై బాంబు దాడి ఎప్పుడు చేశారు?

1) 1928, మార్చి 8       2) 1929, ఏప్రిల్‌ 9

3) 1929, మార్చి 8       4) 1929, ఏప్రిల్‌ 8


25. ‘జాతీయ కాంగ్రెస్‌ చరిత్ర’ అనే గ్రంథం రాసినవారు?

1) ఏవో హ్యూమ్‌     2) డబ్ల్యూ.సి. బెనర్జీ 

3) పట్టాభి సీతారామయ్య     4) దాదాభాయ్‌ నౌరోజీ


26. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారత్‌కు ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు?

1) 1913   2) 1914  3) 1916  4) 1915



27. సుభాష్‌ చంద్రబోస్‌ గురించి పరిగణించండి.

ఎ) ఇతడు 1938లో హరిపుర, 1939లో త్రిపుర జాతీయ సమావేశాలకు అధ్యక్షుడు.

బి) ఇతడి నినాదం జైహింద్‌.

సి) ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించారు.

డి) ఇతడి రాజకీయ గురువు సి.ఆర్‌.దాస్‌.

1) ఎ, బి, సి        2) ఎ, బి, సి, డి

3) బి, సి, డి        4) బి, డి 


28. సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో న్యాయవాద వృత్తిని వదిలివేసినవారు?        

ఎ) సి.ఆర్‌.దాస్‌    బి) మోతీలాల్‌ నెహ్రూ 

సి) సి.రాజగోపాలచారి    డి) అరుణా అసఫ్‌ అలీ

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి     

3) ఎ, బి, సి, డి       4)  బి, సి, డి

 

 

సమాధానాలు

1-2; 2-4; 3-2; 4-2; 5-3; 6-3; 7-1; 8-2; 9-3; 10-3; 11-2; 12-3; 13-3; 14-2; 15-3; 16-2; 17-2; 18-3; 19-2; 20-3; 21-1; 22-2; 23-2; 24-4; 25-3; 26-4; 27-2; 28-3.

 

 

రచయిత: గద్దె నరసింహారావు

Posted Date : 27-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌