• facebook
  • whatsapp
  • telegram

‘ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు!’

భక్తి - సూఫీ ఉద్యమాలు

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

మధ్యయుగ భారతదేశంలో హిందువులను భక్తి ఉద్యమం, ముస్లింలను సూఫీ ఉద్యమం ప్రభావితం చేశాయి. వీటి పరస్పర ప్రేరణలతో మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించింది. భక్తి ఉద్యమంలో సాధువులు దేవతలను ఆరాధిస్తూ భజనలు చేస్తే, సూఫీ సన్యాసులు భక్తిని ప్రోత్సహించేందుకు ఖవ్వాలీ వంటి సంగీత ప్రక్రియలను ఆచరించారు. ప్రేమ, ఆరాధనలతో భగవంతుడిని చేరుకోవచ్చు అన్నదే రెండు ఉద్యమాల అంతరార్థం.  మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు, వర్ణ భేదాలను ఉద్యమకారులు వ్యతిరేకించారు. సమాజంలో చైతన్యాన్ని, మార్పును తెచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాలను వ్యాప్తి చేసిన ప్రముఖులు, వారి రచనలు, ప్రసిద్ధ బోధనలు, నాటి పరిస్థితుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

1.    ‘ధనవంతులు శివుడికి గుడి కడతారు. పేదవాడిని నేనేం చేస్తాను’ అని అన్నదెవరు?

1) అల్లమ ప్రభువు     2) రామానందుడు

3) బసవన్న     4) నింబార్కుడు


2.     పండరీపురంలో ఉన్న దేవుడు ఎవరు?

1) రాముడు     2) విఠలుడు

3) శివుడు     4) సాయిబాబా


3.     ‘ఇతరుల బాధను అర్థం చేసుకునేవాళ్లే వైష్ణవులు’ అని అన్నదెవరు?

1) నామ్‌దేవ్‌     2) నర్సీ మెహతా 

3) తుకారాం     4) ఏకనాథ్‌


4.     మరాఠీ భాషలో రాసిన భక్తి గేయాలను ఏమంటారు?

1) తేవారం 2) పాశురం 3) అభంగ్‌ 4) పైవన్నీ


5.     ‘విపరీతంగా అసహ్యానికి గురైన వాడిని, దెబ్బలు తిన్నవాడిని చూసి..’ అనే ఈ భక్తి గీతం రచించినవారు?

1) సంత్‌ తుకారాం     2) ఏకనాథ్‌ 

3) నామ్‌దేవ్‌     4) జ్ఞానేశ్వర్‌


6.     ‘మమ్మల్ని నిమ్నకులంలోని వాడిని చేసింది నువ్వే యథార్థానికి’ అని అన్నవారు?

1) చోఖామేళుడు     2) కర్మమేళుడు 

3) నామ్‌దేవ్‌     4) నందనార్‌


7.     ‘ప్రపంచాన్ని వదిలివేసి నిరాకార పరమ సత్యాన్ని ధ్యానించాలి’ అని చెప్పినవారు?

1) సిద్ధులు     2) యోగులు 

3) నాథపంథీలు     4) పైవారంతా


8.     ముస్లిం మార్మిక సాధువులుగా పేరొందినవారు?

1) సున్నీలు     2) షియాలు 

3) సూఫీలు     4) వహబీలు


9.     ఏకేశ్వరోపాసన కచ్చితంగా పాటించాలని, ప్రపంచాన్ని వేరేవిధంగా చూడటానికి హృదయానికి శిక్షణ ఇవ్వొచ్చని విశ్వసించినవారు?

1) సున్నీలు 2) షియాలు 3) సూఫీలు 4) సిద్ధులు


10. కింది జతలను పరిశీలించి సరైనదాన్ని గుర్తించండి.

ఎ) రక్స్‌ - నృత్యం చేయడం

బి) సామా - పాడటం

సి) జిక్ర్‌ - ఒక నామాన్ని/సూత్రాన్ని జపించడం

1) ఎ, బి, సి    2) బి    3) సి    4) బి, సి


11. సూఫీ గురువుల పరంపరను ఏమంటారు?

1) తరీకాను      2) వారసత్వం 

3) సిల్‌సిలా     4) పైవన్నీ


12. కిందివాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి.

సూఫీమత గురువులు ప్రాంతాలు
ఎ) మొయినుద్దీన్‌ చిష్టీ అజ్మీర్‌
బి) కుతుబుద్దీన్‌ భక్తియార్‌ కాకి ఢిల్లీ
సి) బందనవాజ్, గిసుదరాజ్‌ గుల్బర్గా
డి) నిజాముద్దీన్‌ ఔలియా ఢిల్లీ

1) డి సరైంది      2) బి, డి సరైంది

3) ఎ, బి, సి, డి సరైనవి   4) ఏదీకాదు


13. సూఫీ మత గురువులు సమావేశాలు జరిపే ప్రాంతాన్ని ఏమంటారు?

1) ఖాన్‌కాహ్‌     2) ధర్మశాల 

3) ఖాన్‌కాహ్, ధర్మశాల      4) దర్గా


14. సూఫీమత గురువుల సమాధులు ఏ పేరుతో ప్రసిద్ధి చెందాయి? 

1) మసీదు  2) మదర్సా  3) దర్గా  4) పైవన్నీ


15. మహాభాగవతాన్ని రచించిన పోతన నివసించిన బమ్మెర గ్రామం ఏ ప్రాంతానికి సమీపంలో ఉంది?

1) వరంగల్‌     2) నల్గొండ 

3) విజయవాడ     4) హైదరాబాద్‌


16. బమ్మెర పోతన ఏవిధంగా ప్రసిద్ధి చెందారు?

1) గొప్పకవి     2) సహజ కవి 

3) తెలుగు కవి     4) పైవన్నీ


17. తాళ్లపాక అన్నమాచార్యులకు సంబంధించి సరైన వాక్యాలు?

1) ఇతను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు.

2) పదకవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందారు.

3) ఈయన కీర్తనల్లో నైతికత, ధర్మం, నిజాయతీ వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.

4) ఈయన శ్రీ వేంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు రాశాడని అన్నమాచార్య జీవితచరిత్రము ద్వారా తెలుస్తుంది.

1) 1, 2, 3, 4    2) 2, 3, 4    

3) 2, 4    4) 1, 3, 4


18. చైతన్య మహాప్రభు ఏ ప్రాంతానికి చెందినవారు?

1) బిహార్‌     2) ఉత్తర్‌ప్రదేశ్‌ 

3) బెంగాల్‌     4) మధ్యప్రదేశ్‌


19. చైతన్య మహాప్రభు గురించి సరికాని అంశం?

1) ఈయన శైవసాధువు, సంఘసంస్కర్త.

2) భగవద్గీత, భాగవత పురాణాల ఆధారంగా భక్తి ప్రచారం చేశాడు.

3) భక్తితో నాట్యం చేయడాన్ని వ్యాప్తి చేశాడు.

4) హరేకృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారం చేశాడు.

1) 1, 2    2) 2, 4    

3) 1 మాత్రమే    4) 3 మాత్రమే


20. కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవారు? 

1) 15వ శతాబ్దం     2) 16వ శతాబ్దం 

3) 17వ శతాబ్దం     4) 18వ శతాబ్దం


21. కంచర్ల గోపన్నకు సంబంధించి సరికాని వాక్యం?

1) ఈయన శ్రీరాముడి భక్తుడు, కర్ణాటక సంగీతంలో కీర్తనలు రాశాడు.

2) తెలుగు భాషలో ప్రముఖ వాగ్గేయకారుడు.

3) దాశరథి శతకం రచించాడు.

4) దాశరథి శతకంలో 1008 పద్యాలున్నాయి.


22. భగవంతుడిని రామాకృతిలో భావన చేసిన రామచరిత మానస్‌ అనే కావ్యాన్ని రచించినవారు?

1) రామదాసు     2) కంచర్ల గోపన్న 

3) తులసీదాస్‌     4) మీరాబాయి


23. రామచరిత మానస్‌ ఏ భాషలో ఉంది?

1) బెంగాలీ 2) మరాఠి 3) అవధి 4) సంస్కృతం


24. నామ్‌ఘర్‌ అనే భగవన్నామస్మరణ, జపధ్యాన మందిరాలను ఏర్పాటు చేసినవారు?

1) తులసీదాస్‌     2) సూర్‌దాస్‌ 

3) రామదాసు     4) శంకరదేవుడు


25. కిందివారిలో అస్సామీ భాషలో నాటకాలు రాసినవారు?

1) శంకరదేవుడు     2) సూర్‌దాస్‌ 

3) తులసీదాస్‌     4) చైతన్య మహాప్రభు


26. మీరాబాయి ఎవరి శిష్యురాలు?

1) రవిదాసు     2) సూర్‌దాస్‌ 

3) తులసీదాస్‌     4) దాదు దయాళు


27. మీరాబాయి భజన గీతాలు నేటికీ ఏ రాష్ట్రంలో జనబాహుళ్యంలో ఉన్నాయి?

1) రాజస్థాన్‌     2) గుజరాత్‌ 

3) మహారాష్ట్ర     4) 1, 2 


28. మధ్యయుగ కాలంలో ప్రముఖ సంఘ, మత సంస్కర్త అయిన కబీర్‌కు సంబంధించి సరైంది?

1) ఇతను కాశీ/వారణాసి సమీపంలో నివసించారు.

2) ఈయన రామానందుడి శిష్యుడు, విప్లవభావాలు కలిగినవాడు.

3) ఈయన బోధనలు ప్రధాన మత సంప్రదాయాల సంపూర్ణ, తీవ్ర తిరస్కరణలపై ఆధారపడ్డాయి.

4) సంచార భజన బృందగాయకులు పాడుతూ వచ్చే సాఖీల పదాల ద్వారా ఈయన భావనలను మనం తెలుసుకోగలుగుతున్నాం.

1) 1, 2, 3, 4  2) 2, 3, 4  3) 1, 3, 4  4) 2, 4


29. ‘‘అన్ని జీవుల్లోనూ ఉండే ఓ అల్లా-రామ్, దయ ఉంచు నీ దాసులమీద శ్రీ ప్రభు’’ అని తెలిపినవారు?

1) తులసీదాస్‌     2) కబీర్‌ 

3) రామానందుడు     4) గురునానక్‌


30. ‘‘హిందూ, ముస్లిం ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొదటి సంఘ సంస్కర్త కబీర్‌’’ అని అన్న చరిత్రకారుడు ఎవరు?

1) కె.ఎస్‌.లాల్‌     2) ఆర్‌.ఎస్‌.త్రిపాఠి 

3) రోమిల్లా థాఫర్‌    4) ఆర్‌.డి.బెనర్జీ


31. గురునానక్‌ ఎక్కడ జన్మించారు?

1) తాల్వాండి     2) కర్తార్‌పూర్‌ 

3) లాహోర్‌     4) నాసిక్‌


32. కులం, స్త్రీ పురుష భేదంతో నిమిత్తం లేకుండా అనుచరులు కలిసి భోజనం చేసే వంటశాలను ఏమంటారు? 

1) లంగర్‌  2) ధర్మశాల  3) ఖాన్‌కాహ్‌ 4) 1, 2 


33. గురునానక్‌కు సంబంధించిన వాక్యాలను పరిశీలించి సమాధానం గుర్తించండి.

1) నామ్‌ అంటే సరైన ఆరాధన.

2) దాన్‌ అంటే ఇతరుల సంక్షేమం. 

3) ఇస్నాన్‌ అంటే మంచి నడవడిక.

4) సమాజం పట్ల దృఢమైన నిబద్ధతతో క్రియాశీలకమైన జీవనం గడపాలి.

1) 1, 2    2) 2, 3, 4    

3) 1, 2, 3, 4    4) 1, 3, 4


34. గురునానక్‌ జన్మించిన సంవత్సరం?

1) 1469  2) 1494  3) 1538  4) 1479 


35. గురునానక్‌కు జ్ఞానోదయం అయిన సంవత్సరం? 

1) 1469  2) 1494  3) 1538  4) 1479


36. గురునానక్‌ అధ్యయనం చేసిన భాషలు? 

1) పర్షియా 2) హిందీ 3) పంజాబీ 4) పైవన్నీ 


37. గురునానక్‌ బోధనలున్న గ్రంథం? 

1) ఆదిగ్రంథ్‌     2) గురుగ్రంథ సాహెబ్‌

3) 1, 2     4) నానక్‌ గ్రంథ్‌


38. వైష్ణవ ఉద్యమ ప్రచారకుడైన చైతన్యుడు ఏ విధంగా పేరు పొందారు?

1) శ్రీ గౌరంగ     2) శ్రీ విజయ    

3) శ్రీ తనయ     4) శ్రీ ఆళ్వారు


39. చైతన్యుడు బెంగాలీ భాషలో రచించిన పుస్తకం?

1) గీతానందం     2) శిక్షఅస్తక్‌ 

3) శిక్షసమాచార్‌     4) కృష్ణమంత్రం 


40. మీరాబాయి కృష్ణుడిపై రచించిన కీర్తనలు ఏ భాషలో ఉన్నాయి?

1) బ్రిజ్‌ 2) మరాఠీ 3) గుజరాతీ 4) సంస్కృతం


41. తులసీదాస్‌ రచించిన గ్రంథాలు?

1) రామచరిత మానస్‌     2) గీతావళి 

3) వినయ పత్రిక     4) పైవన్నీ


42. రాధాకృష్ణుల భక్తుడు అయిన సూర్‌దాస్‌ ప్రముఖ రచనలు?

1) సుర్‌సరావళి     2) సాహిత్యరత్న 

3) సుర్‌సాగర్‌     4) పైవన్నీ


43. మహాత్మాగాంధీకి ఇష్టమైన ‘‘వైష్ణవ జనతో తేనో కహియే’’ అనే భజనను రచించినవారు? 

1) శంకరదేవుడు     2) తులసీదాసు 

3) నర్సీమెహత     4) చైతన్య మహాప్రభు


44. ‘సూఫీయిజం’ అనే ఆంగ్ల పదం వాడుకలోకి వచ్చిన శతాబ్దం?

1) 16వ శతాబ్దం     2) 17వ శతాబ్దం 

3) 18వ శతాబ్దం     4) 19వ శతాబ్దం


45. భారతదేశంలో ప్రధానమైన సూఫీ మత శాఖ?

1) చిస్తి 2) నక్షాబందీ 3) సుహ్రవర్ది 4) సిల్‌సిలా


46. మొగలుల కాలంలో ఎన్ని సిల్‌సిలాలు ఉన్నట్లు అబుల్‌ ఫజల్‌ తన ఐనీ అక్బరీలో పేర్కొన్నాడు? 

1) 12        2) 1      3) 14     4) 15


47. ఢిల్లీ సుల్తానుల కాలం నుంచి వర్ధిల్లిన సిల్‌సిలా? 

1) సుహ్రవర్ది 2) చిస్తి 3) ఖాద్రీ 4) నక్షాబందీ

 


సమాధానాలు


1-3; 2-2; 3-2; 4-3; 5-1; 6-2; 7-4; 8-3; 9-3; 10-1; 11-3; 12-3; 13-3; 14-3; 15-1; 16-2; 17-1; 18-3; 19-2; 20-3; 21-4; 22-3; 23-3; 24-4; 25-1; 26-1; 27-4; 28-1; 29-2; 30-1; 31-1; 32-4;  33-3; 34-1; 35-2; 36-4; 37-3; 38-1; 39-2; 40-1; 41-4; 42-4; 43-3; 44-4; 45-1; 46-3; 47-1. 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 11-10-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు