• facebook
  • whatsapp
  • telegram

కుల వ్యవస్థను ధిక్కరించి.. మానవత్వాన్ని చాటిచెప్పి!

 


భక్తి - సూఫీ ఉద్యమాలు

 మత సహనాన్ని, ఐకమత్యాన్ని ప్రోత్సహిస్తూ సాగిన సామాజిక సంస్కరణల పోరాటం భక్తి ఉద్యమం. ఏకేశ్వరోపాసనకు, వైయక్తిక భక్తికి ప్రాధాన్యం ఇచ్చింది. కుల ఆధారిత శ్రేణులను తిరస్కరించింది. మతాలు, కులాల సరిహద్దులు దాటి విభిన్న సమూహాల భారతీయ సమాజం ఆవిర్భవించడానికి దోహదపడింది. మధ్యయుగంలో సంభవించిన ఈ పరిణామాల్లో హిందూ ముస్లిం మతాలు పరస్పరం ప్రభావితమై భక్తి, సూఫీ ఉద్యమాలు మొదలయ్యాయి. మత సామరస్యం, సాంఘిక సంస్కరణలు, ఆధ్యాత్మిక భావజాల వ్యాప్తికి ఉపకరించాయి. అదే సమయంలో హిందూ మతంలోని శైవులు, వైష్ణవుల మధ్య విభేదాలు తలెత్తాయి. సామాజిక కట్టుబాట్లను సమూలంగా మార్చిన ఈ ఉద్యమాల లక్షణాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. నాటి భక్తి ఉద్యమకారులు, సూఫీ తత్వవేత్తల విశేషాలు, వారి బోధనలు, గీతాలు, రచనలు, వ్యాఖ్యలు, ప్రాంతాలవారీ సంఘటనలు, అప్పటి ఆలయాల విశేషాల గురించి అవగాహన పెంచుకోవాలి.     ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1.    భక్తి ఉద్యమాన్ని రెండు భాగాలుగా విభజించిన చరిత్రకారుడు?

1) ఆర్‌.ఎస్‌.శర్మ       2) త్రిపాఠి   

3) యూసఫ్‌ హుస్సేన్‌      4) నీలకంఠ శాస్త్రి

 


2.     ‘భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమవడం వల్లే భక్తి ఉద్యమం మొదలైంది’ అని అన్న చరిత్రకారుడు?

1) తారాచంద్‌       2) అహ్మద్‌ నిజామి  

3) ఖురేషి       4) పైవారంతా

 


3.     ‘భక్తి ఉద్యమం భగవద్గీతలోని బోధనల వల్ల ప్రభావితమైంది’ అని అన్న చరిత్రకారుడు?

1) ఆర్‌.జి.భండార్కర్‌       2) ఆర్‌.ఎస్‌.శర్మ 

3) త్రిపాఠి    4) నీలకంఠ శాస్త్రి

 


4.     కిందివాటిలో భక్తి ఉద్యమ లక్షణాలు గుర్తించండి.

ఎ) ముక్తి సాధన కోసం భగవంతుడి కృపను పొందడం.

బి) పవిత్రమైన మనసు, జీవనం, మానవత్వం, భక్తి లాంటివి అనుసరించడం. 

సి) ఏకేశ్వరోపాసన, సుగుణోపాసన, నిర్గుణోపాసనలను బోధించడం.

డి) కులవ్యవస్థను, పూజారుల పెత్తనాన్ని వ్యతిరేకించడం.

1) ఎ, బి, సి           2) ఎ, బి, డి    

3) బి, సి, డి        4) పైవన్నీ 

 


5.     వేద ప్రమాణం అంగీకరించి, అనుసరించినవారు?    

1) బౌద్ధులు     2) జైనులు 

3) బ్రాహ్మణులు     4) పైవారందరూ

 


6.     హిందూ మతం అనే పదం సింధూ నది పేరు మీద వచ్చింది. ఇది ఎప్పటి నుంచి వాడుకలో ఉంది?

1) 1000 ఏళ్ల క్రితం నుంచి  2) క్రీ.శ.1000 నుంచి 

3) క్రీ.పూ.1000 నుంచి      4) క్రీ.శ.2000 నుంచి

 


7.  హిందూ మతంలో కొన్ని ముఖ్య లక్షణాలు ఎప్పటి నుంచి రూపుదిద్దుకున్నాయి?

1) క్రీ.శ.1000       2) క్రీ.శ.500 

3) క్రీ.శ.200           4) క్రీ.శ.700

 


8.     ‘విష్ణువునే పరమాత్మ అని, విశ్వాన్ని సృష్టించాడని, అతిశక్తిమంతుడని, అన్నీ తెలిసినవాడని’ విశ్వసించినవారు?

1) హిందువులు     2) బ్రాహ్మణులు 

3) శైవులు     4) భాగవతులు

 


9.     రాముడు, కృష్ణుడి రూపాలు ఎన్నేళ్లకు పూర్వమే ప్రచారంలో ఉన్నాయి?

1) 2000  2) 1000  3) 5000  4) 4000

 


10. పశ్చాత్తాపం ద్వారా పవిత్రులుగా మారడం, కోరికలను నియంత్రించడం, ధ్యానం చేయడం అనే భావనలను ప్రచారం చేసినవారు?

1) బౌద్ధులు     2) జైనులు 

3) తత్త్వవేత్తలు     4) పైవారంతా

 


11. 2000 ఏళ్ల క్రితం నాటి కృష్ణాలయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారు?

1) మధ్యప్రదేశ్‌ - విదిశ         2) మధ్యప్రదేశ్‌ - బింభేట్కా

3) ఉత్తర్‌ప్రదేశ్‌ - విదిశ    4) ఉత్తర్‌ప్రదేశ్‌ - వారణాసి

 


12. 2000 ఏళ్ల కిందటి ప్రముఖ శైవక్షేత్రం చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఉంది? 

1) శ్రీకాళహస్తి     2) మల్లాం 

3) రేణిగుంట     4) గుడిమల్లాం

 


13. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ బౌద్ధమత స్తూపాలున్న ప్రాంతం?

1) అమరావతి      2) జగ్గయ్యపేట, భట్టిప్రోలు 

3) నాగార్జున కొండ   4) పైవన్నీ 

 


14. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి.    

ఎ) బుద్ధుడి జన్మ వృత్తాంతం గురించి తెలిపే కథలు - జాతక కథలు 

బి) శివుడు/విష్ణువు గురించి తెలిపే కథలు - పురాణాలు

1) ఎ, బి సరైనవి     2) ఎ, బి సరికానివి 

3) ఎ సరైంది     4) బి సరైంది 

 


15. తమిళనాడులో భక్తి ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం? 

1) క్రీ.శ.500      2) క్రీ.శ.550  

3) క్రీ.శ.1000     4) 550 సంవత్సరాల కిందట 

 


16. తమిళనాడులో ప్రారంభమైన భక్తి ఉద్యమం విధానాల్లో సరైనవి?

ఎ) వీరు శివుడు, విష్ణువు ఆరాధకులు.

బి) దేవుడి మీద నమ్మకం లేని బౌద్ధ, జైన మతాలను వ్యతిరేకించారు.

సి) వీరి ప్రధాన ఉద్దేశం దేవుడి సన్నిధానం పొందడమే.

డి) వీరు కుల, మత భేదాలు లేకుండా దేవుడిని పూజించారు.

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, సి       

3) బి, డి         4) ఎ, సి, డి

 


17. క్రీ.శ.1100లో భక్తి ఉద్యమకారులు దేవుడిని స్తుతిస్తూ రాసిన పాటలు ఏ భాషలో ఉన్నాయి?

1) తెలుగు     2) తమిళం 

3) ప్రాకృతం     4) తెలుగు, తమిళం 

 


18. ఆళ్వార్లు మొత్తం 12 మంది. వీరు ఎవరి భక్తులు? 

1) శివుడు     2) విష్ణువు 

3) బుద్ధుడు     4) వర్ధమానుడు

 


19. ఆళ్వార్లు అల్లి పాడిన పద్య మాలికలను ఏమంటారు? 

1) పాశురాలు     2) తేవారం 

3) తిరువాచకం     4) పైవన్నీ 

 


20. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి. 

ఎ) ఆళ్వారుల్లో ప్రముఖులు - పెరియాళ్వారు, నమ్మాళ్వారు

బి) ఆళ్వారుల్లో మహిళ - పెరియాళ్వారు కుమార్తె ఆండాళ్‌

సి) సృష్టి, దాగుడుమూతలు అనే పద్యమాలికలను అల్లింది - నమ్మాళ్వారు 

డి) ఆండాళ్‌ గురించి వివరించే గ్రంథం - ఆముక్త మాల్యద

1) ఎ, బి, డి         2) ఎ, బి, సి     

3) ఎ, బి, సి, డి        4) ఎ, సి, డి

 


21. నాయనార్లు శివభక్తులు. వీరు ఎంతమంది?

1) 12     2) 68    3) 65      4) 36

 


22. కిందివారిలో నాయనార్లను గుర్తించండి.

1) అప్పర్, సంబంధర్‌     2) సుందర్‌ 

3) మాణిక్య వాచకర్‌      4) పైవారంతా

 


23. నాయనార్లలో ప్రముఖ మహిళలు?

1) కరైక్కాలమ్మ      2) ఆండాళ్‌     

3) అరయ్యార్‌       4) కరైక్కాలమ్మ, అరయ్యార్‌ 

 


24. నాయనార్లు శివుడి గురించి పాడిన కీర్తనలు?    

1) తేవారం       2) తిరువాచకం   

3) తేవారం, తిరువాచకం     4) పాశురాలు

 


25. కింది వాక్యాలను పరిశీలించి సమాధానం గుర్తించండి.     

ఎ) ‘భయంలేదు మాకు’ అనే తేవారం కూర్చినవారు - అప్పర్‌ 

బి) ‘పరమశివా, నిను భజియింతుము’ అనే తేవారం కూర్చినవారు - మాణిక్య వాచకర్‌ 

1) ఎ సరికాదు     2) ఎ సరైంది     

3) ఎ, బి సరైనవి     4) ఎ, బి సరికావు

 


26. అత్యంత ప్రభావవంతమైన భక్తి ఉద్యమకారుల్లో ప్రముఖుడు?

1) శంకరాచార్యులు     2) రామానుజాచార్యులు 

3) బసవన్న     4) నింబార్కుడు

 


27. ప్రభావవంతమైన భారతీయ తత్త్వవేత్తల్లో ఒకరైన శంకరాచార్యుల గురించి సరైనవి?

ఎ) ఈయన క్రీ.శ.8వ శతాబ్దంలో కేరళలో జన్మించారు.

బి) బ్రహ్మ మాత్రమే పరమసత్యం అని బోధించారు. 

సి) అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు.

డి) ఈయన ప్రభావం ఉత్తర భారతదేశంలో అధికంగా ఉంది.

1) ఎ, బి, సి, డి         2) ఎ, బి, సి  

3) బి, సి, డి        4) ఎ, సి, డి

 


28. రామానుజాచార్యులు ఏ శతాబ్దానికి చెందినవారు?

1) 10వ    2) 11వ   3) 12వ    4) 13వ  

 


29. కిందివాటిలో రామానుజాచార్యులకు సంబంధించి సరైన అంశాలు-

ఎ) ఈయనపై అళ్వారుల ప్రభావం అధికంగా ఉంది.

బి) ఈయన విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారం చేశారు.

సి) ఈయన గురువు యాదవ్‌ ప్రకాశ్‌. రామానుజాచార్యులు 120 ఏళ్ల వయసులో సమాధి అయ్యారు. 

డి) సంపూర్ణ ఏకేశ్వరోపాసనను ఇతను వ్యతిరేకించారు. నిమ్నకులాల వారికి ఆలయార్చనలో స్థానం కల్పించారు.

1) ఎ, బి, సి, డి       2) ఎ, సి    

3) బి, సి, డి        4) ఎ, బి, సి

 


30. మధుర సమీపంలోని బాజ్రోలో ఆశ్రమం స్థాపించి రాధాకృష్ణుల భక్తిని ప్రచారం చేసిన నింబార్కుడు ఎవరికి సమకాలీనుడు?

1) శంకరాచార్యులు     2) రామానుజాచార్యులు  

3) బసవన్న      4) ఆనందుడు  

 


31. గొప్ప విష్ణుభక్తుడు; బ్రహ్మసూత్రాలు, రుగ్వేదంలోని తొలి భాగాలకు దశోపనిషత్తులు, భగవద్గీతకు భాష్యాలు లాంటి 35 గ్రంథాలను రచించినవారు?

1) మధ్వాచార్యుడు     2) రామానుజాచార్యులు 

3) శంకరాచార్యులు     4) బసవన్న 

 


32. దక్షిణ భారతదేశానికి చెందిన వైష్ణవ మత ప్రచారకుడు, కాశీలో జన్మించి కృష్ణభక్తిని ప్రచారం చేసిన ప్రముఖ భక్తి ఉద్యమకారుడు?

1) వల్లభాచార్యులు     2) రామానుజాచార్యులు 

3) శంకరాచార్యులు     4) బసవన్న

 


33. ఉత్తర భారతదేశానికి చెందిన భక్తి ఉద్యమ ప్రవక్తల్లో మొదటివారు?

1) రామానందుడు     2) వల్లభాచార్యులు 

3) శంకరాచార్యులు     4) బసవన్న 

 


34. గంగానది తీరప్రాంతంలో ప్రచారానికి రామానందుడు ఏ భాషను ఉపయోగించారు?

1) సంస్కృతం    2) హిందీ   

3) ప్రాకృతం     4) తెలుగు

 


35. ‘ఆనంద భాష్యం’ గ్రంథాన్ని ఎవరు రచించారు?

1) వల్లభాచార్యులు          2) రామానందుడు     

3) రామానుజాచార్యులు      4) ఆనందుడు

 


36. స్త్రీలకు వైష్ణవ మతంలో చేరే అవకాశం కల్పించిన వ్యక్తి? 

1) రామానందుడు     2) కబీర్‌ 

3) నింబార్కుడు     4) అప్పర్‌ 

 


37. వీరశైవ భక్తి ఉద్యమాన్ని బసవన్న ఏ శతాబ్దంలో ప్రచారం చేశారు?

1) 10వ   2) 11వ   3) 12వ   4) 13వ 

 


38. బసవన్న వీరశైవాన్ని కర్ణాటకలో ప్రచారం చేసే సమయంలో అతడి సహచరులు? 

1) అల్లమ ప్రభువు     2) అక్క మహాదేవి 

3) కరైక్కాలమ్మ     4) అల్లమ ప్రభువు, అక్క మహాదేవి

 

 


సమాధానాలు

13; 24; 31; 44; 53; 62; 72; 84; 91; 104; 111; 124; 134; 141; 152; 161; 174; 182; 191; 203; 212; 224; 234; 243; 253; 261; 272; 282; 291; 302; 311; 321; 331; 342; 352; 361; 373; 384.

 


 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 06-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌