1. మానవ దేహానికి ప్రాథమిక శక్తి జనకాలుగా పనిచేసే పదార్థాలు ఏవి?
ఎ) విటమిన్లు బి) ఖనిజ లవణాలు సి) కార్బోహైడ్రేట్లు డి) ప్రొటీన్లు
జ: సి
2. ఒకే చక్కెర అణువు ఉండే మోనోశాఖరైడ్లకు ఉదాహరణ?
ఎ) గ్లూకోజ్ బి) మానోజ్ సి) గాలక్టోజ్ డి) పైవన్నీ
జ: డి
3. కిందివాటిలో 5 కర్బన పరమాణువులు ఉన్న రైబోజ్ చక్కెర దేనిలో ఉంటుంది?
ఎ) పాలు బి) కేంద్రకామ్లాలు సి) తేనె డి) పండ్లు
జ: బి
4. క్రీడాకారులు తక్షణ శక్తి కోసం ఏ చక్కెరను తీసుకుంటారు?
ఎ) రైబోజ్ బి) ఫ్రక్టోజ్ సి) గ్లూకోజ్ డి) గాలక్టోజ్
జ: సి
5. కిందివాటిలో ఫ్రక్టోజ్ చక్కెరకు సంబంధించి సరైంది ఏది?
ఎ) ఇది అత్యంత తియ్యనైన చక్కెర
బి) దీనిలో 3 కర్బన పరమాణువులుంటాయి
సి) ఇది రక్తంలో ఉంటుంది డి) ఈ చక్కెర పాలిశాఖరైడ్
జ: ఎ
6. ఆరు కర్బన పరమాణువులు ఉండే చక్కెరలకు ఉదాహరణ ఏది?
ఎ) గ్లూకోజ్ బి) ఫ్రక్టోజ్ సి) మానోజ్ డి) పైవన్నీ
జ: డి
7. సుక్రోజ్ను వాణిజ్యపరంగా దేని నుంచి సంగ్రహిస్తారు?
ఎ) పండ్లు బి) పాలు సి) చెరకు రసం డి) తేనె
జవాబు: సి
8. డైశాఖరైడ్ అయిన మాల్టోజ్ చక్కెర కింది వేటి కలయిక ద్వారా ఏర్పడుతుంది?
ఎ) గ్లూకోజ్ + గ్లూకోజ్ బి) గ్లూకోజ్ + గాలక్టోజ్
సి) గ్లూకోజ్ + ఫ్రక్టోజ్ డి) గ్లూకోజ్ + లాక్టోజ్
జ: ఎ
9. మనం రోజు ఉపయోగించే పంచదారను రసాయనికంగా ఏమంటారు?
ఎ) మాల్టోజ్ బి) రాఫినోజ్ సి) సుక్రోజ్ డి) లాక్టోజ్
జ: సి
10. కిందివాటిలో రాఫినోజ్ చక్కెర వేటిలో ఎక్కువగా ఉంటుంది?
ఎ) పత్తిగింజల పిండి బి) పాలు సి) ధాన్యాలు డి) చెరకు రసం
జవాబు: ఎ
11. ఒకే రకమైన చక్కెర అణువులు ఉండే హోమో పాలిశాఖరైడ్ కార్బోహైడ్రేట్లకు ఉదాహరణ?
ఎ) పిండిపదార్థం బి) గ్త్లెకోజెన్ సి) సెల్యులోజ్ డి) పైవన్నీ
జ: డి