• facebook
  • whatsapp
  • telegram

కంప్యూటర్స్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది మనం అందించే సమాచారాన్ని స్వీకరించి తనలో నిల్వచేసుకుని అడిగిన ఫలితాన్ని తార్కికంగా విశ్లేషణ చేసి శీఘ్రంగా అందిస్తుంది.

  * కంప్యూటర్‌ను 'చార్లెస్ బాబేజ్' కనుక్కున్నారు. కాబట్టి అతడిని కంప్యూటర్ల పితామహుడు అని అంటారు.

  * ఫాదర్ ఆఫ్ మోడ్రన్ కంప్యూటర్ అలెన్ ట్యూరింగ్.

  *  ఆధునిక కంప్యూటర్ అయిన 'ఎలక్ట్రానిక్ డిస్‌క్రీట్ వేరియబుల్ ఆటోమాటిక్ కంప్యూటర్'(EDVAC)ను 1951లో జాన్‌వాన్ న్యూమన్ తయారు చేశారు.

కంప్యూటర్ తరాలు:

i) మొదటి తరం:

   *  ఈ తరానికి చెందిన కంప్యూటర్‌లను 1940 నుంచి 1956 వరకు ఉపయోగించారు.

   *  వీటిలో శూన్యనాళిక డయోడ్ అనే పరికరాన్ని వినియోగించారు.

ఉదా: 

   * యూనివర్సల్ ఆటోమాటిక్ కంప్యూటర్ (UNIVAC)

   * ఎలక్ట్రానిక్స్ ఇంటిగ్రేటర్ అండ్ న్యూమరేటర్ కాలిక్యులేటర్ (ENIVAC). దీన్ని జె.పి. అసర్ట్, జాన్ మోష్లీ నిర్మించారు.

   *  1951లో మొదటిసారిగా అమెరికాలో జనాభా లెక్కలను విశ్లేషించడంలో దీన్ని ఉపయోగించారు.

ii) రెండో తరం:   

  * ఈ కంప్యూటర్‌లను 1956 నుంచి 1963 వరకు ఉపయోగించారు.

  *  శూన్యనాళికల స్థాయిలో చిన్న చిన్న ట్రాన్సిస్టర్లు ప్రవేశపెట్టారు. ఈ ట్రాన్సిస్టర్‌లను అర్థ వాహకాలైన Si, Ge లతో తయారుచేస్తారు.

  *  ట్రాన్సిస్టర్లు క‌నుక్కున్న జాన్‌బర్డీన్, విలియం షాక్లీ, వాల్టర్ బ్రైటెన్‌లకు భౌతికశాస్త్ర విభాగంలో చేసిన కృషికిగానూ 1956లో నోబెల్‌బహుమతి లభించింది.

iii) మూడో తరం

     *  వీటిని 1963 నుంచి 1971 వరకు ఉపయోగించారు.

     *  వీటిలో 'సిలికాన్‌'తో తయారుచేసిన ఇంటిగ్రేటెడ్ చిప్స్‌ను (IC) లను ప్రవేశపెట్టారు.

     * వీటిని జాన్ కిల్బీ, రాబర్ట్ నైస్ కనుక్కున్నారు.

iv) నాలుగో తరం   

     *  వీటిని 1971 నుంచి ఉపయోగిస్తున్నారు.

    * వీటిలో మైక్రో ప్రాసెసర్, మౌస్, ప్రింటర్‌లను ప్రవేశపెట్టారు.

    * మైక్రో ప్రాసెసర్‌ను 'గోర్డన్ మూర్', 'రాబర్ట్ నైస్' కనుక్కున్నారు. దీన్ని కంప్యూటర్ పరికరంగా ఉపయోగిస్తారు.

    * మౌస్(Mouse) ను డగ్లస్ ఎంగిల్ బర్ట్ కనుక్కున్నారు.

    *  ఈ తరానికి చెందిన కంప్యూటర్‌లను మొదటిసారిగా ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మిషిన్) కంపెనీ తర్వాత ఆపిల్ కంపెనీలు నిర్మించి మార్కెట్‌లో ప్రవేశపెట్టాయి.

v) అయిదోతరం

  * వీటిని కృత్రిమ మేథస్సు (Artificial Intelligence) అంటారు. ఈ రకమైన కంప్యూటర్లను నాలెడ్జ్ ఇన్‌ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (KIPS) రూపొందించింది.

 ప్రస్తుతం ఇలాంటి కంప్యూటర్ల అభివృద్ధి కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.

దీని ముఖ్య లక్షణాలు:

    i) ఎక్కువ మెమొరీని నిల్వ చేయడం.

    ii) సిలికాన్ కాకుండా ఇతర మూలకాలతో తయారుకావడం.

    iii) మానవుడి ఆదేశాలకు అనుగుణంగా ప్రతిస్పందనలు ఇవ్వడం.

    iv) తప్పులు జరిగితే తనకు తాను సరిదిద్దుకోవడం.

హార్డ్‌వేర్ (Hardware):

    * కంప్యూటర్ నిర్మాణం గురించి తెలియజేసే దాన్ని హార్డ్‌వేర్ అంటారు. 

 ప్రతి కంప్యూటర్ 3 భాగాలు కలిగి ఉంటుంది.

       i) Input

       ii) CPU

      iii) Output

i) Input (నివేశ సాధనం):    

* కంప్యూటర్‌కు సమాచారాన్ని అందించడాన్ని ఇన్‌పుట్ అంటారు.

ఇన్‌పుట్ పరికరాలు:

     కీ బోర్డ్, సీడీ, డీవీడీ, పెన్‌డ్రైవ్, కేబుల్(ఆప్టికల్ ఫైబర్), ఆప్టికల్ మార్క్ రీడర్ (OMR), మాగ్నటిక్ ఇంక్ క్యారెక్టర్రీడర్(MICR), జాయ్‌స్టిక్స్, మౌస్, స్కానర్.

    * కీ బోర్డ్‌ను 'సర్ క్రిస్టోఫ‌ర్ లాథమ్ షోల్స్' కనుక్కున్నారు.

    *  'లేడి అడాతాలెస్‌'ను మొదటి కంప్యూటర్ ప్రోగ్రాంగా పరిగణిస్తారు.

    * పెన్‌డ్రైవ్‌ను 1999, ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌లోని M-Systems కంపెనీలో పనిచేస్తున్న Amir Ban, Dov Moran , Oran ogdamకనుక్కున్నారు.

  * పెన్‌డ్రైవ్‌ను థంబ్ డ్రైవ్ లేదా ఫ్లాష్‌డ్రైవ్ అని పిలుస్తారు.

కంప్యూటర్ భాషలు:

i) బేసిక్ (BASIC - Beginner's All purpose Symbolic Code)

     * దీన్ని 1946లో జాన్ జార్జ్ కెమ్నీ, థామస్ యుజీన్ కుర్ట్జ్  కనుక్కున్నారు.

ii) కోబాల్(COBAL - Common Business Oriented Language)

iii) ఫర్‌ట్రాన్ (Fortran - Formula Translation)    

   దీన్ని జాన్ బాకస్ 1983లో ఆవిష్కరించారు.

iv) పాస్కల్ (Pascal)   

  దీన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన నిక్లాలస్ విర్త్ రూపొందించారు.

v) C

       * దీన్ని డెన్నిస్ రిచ్చి (బెల్ ల్యాబొరేటరీ - అమెరికా) 1972లో కనుక్కున్నారు.

vi) C++   

 * దీన్ని Bjarne stroustrup, Howard Bromberg, Jean Sammet అనే శాస్త్రవేత్తలు 1983లో ఆవిష్కరించారు.

vii) జావా (Java): దీన్ని జేమ్స్ గోస్లింగ్ 1995లో ఆవిష్కరించారు.    

 * కంప్యూటర్‌కు సమాచారాన్ని అందించడానికి 0, 1 లను ఉపయోగిస్తారు. వీటిని బైనరీ డిజిట్‌లు లేదా బిట్  (BIT) అని పిలుస్తారు.

  1 Byte           

 8 Bits

  1 KB (Kilo Byte)  1024 Bytes
  1 MB (Mega Byte) 1024 KB
  1 GB (Giga Byte) 1024 MB 
  1 TB (Tera Byte) 1024 GB

 

ii. సీపీయూ (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్):

    దీనిలో మూడు భాగాలుంటాయి.

1. Memory Unit: దీన్ని రెండు రకాలుగా విభజించారు.

i) RAM (Random Accessory Memory):

   *  ఇది తాత్కాలికమైంది

ii) ROM (Read Only Memory):

   *  ఇది శాశ్వతమైంది.

2. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్(ALU):

   * దీనిలో సమాచారాన్ని ఈ పరికరం తార్కింగా విశ్లేషణ చేస్తుంది.

3. కంట్రోల్ యూనిట్(CU):

   *  ఇది నియంత్రణ పరికరం.

   *  ఇన్‌పుట్, సీపీయూ, అవుట్‌పుట్ లను సమన్వయం చేస్తుంది.

iii. అవుట్‌పుట్ (నిర్గమ సాధనం)

     కంప్యూటర్ నుంచి ప్రోగ్రాం ప్రకారం ఫలితం పొందడాన్ని అవుట్‌పుట్ అంటారు.

    ఉదా: కంప్యూటర్ మానిటర్ లేదా విజ్వల్ డిస్‌ప్లే యూనిట్  

  * కంప్యూటర్ మానిటర్‌పైన అవుట్‌పుట్(Output) పొందడాన్ని సాఫ్ట్‌కాపీ, ప్రింట్ రూపంలో పేపరుప  పొందడాన్ని హార్డ్ కాపీ అని అంటారు.

  * జిరాక్స్‌ను 1938లో చెస్టర్ కార్ల్‌సన్ కనుక్కున్నారు.

 *  ల్యాప్‌టాప్‌ను Adam Osborne (1981) కనుక్కున్నారు.

కంప్యూటర్ రకాలు  

* ప్రోగ్రాం చేసే సామర్థ్యాన్ని బట్టి కంప్యూటర్‌లు రెండు రకాలు.       

అవి: 1. పర్సనల్ కంప్యూటర్‌లు   2. సూపర్ కంప్యూటర్‌లు

పర్సనల్ కంప్యూటర్స్

   * ఇలాంటి కంప్యూటర్లు సెకను కాలంలో ఒక ప్రోగ్రాంను మాత్రమే చేయగలవు. భారతదేశం రూపొందించిన తొలి పర్సనల్ కంప్యూటర్ సిద్ధార్థ్.

   *  సిద్ధార్థ్‌ను హైదరాబాద్‌లోని ఇసీఐఎల్ సంస్థ రూపొందించింది. మన దేశం రూపొందించిన అతి చిన్న కంప్యూటర్ సింప్యూటర్.

సూపర్ కంప్యూటర్స్   

   *  ఇది ప్రోగ్రాంలను అతివేగంగా చేస్తుంది.

   *   సూపర్ కంప్యూటర్‌ను 'సీమోర్ క్రే' అనే అమెరికా శాస్త్రవేత్త కనుక్కున్నారు.

   *   ఇతడు రూపొందించిన తొలి సూపర్ కంప్యూటర్ CDC (Controls Data Corporation) 6600.

   *   సూపర్ కంప్యూటర్‌లలో అనేక ప్రాసెసర్‌లను సమాంతరంగా కలపడం వల్ల వాటి సామర్థ్యం ఎక్కువగా
      ఉంటుంది.

   *  సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని కొలవడానికి 'FLOPS' (Floating Points per Second) ఉపయోగిస్తారు.

భారతదేశంలో సూపర్ కంప్యూటర్‌లు

i) పరమ్ సూపర్ కంప్యూటర్‌:

 * దీన్ని మహారాష్ట్రలోని 'పూణె'లో ఉన్న 'సెంటర్ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్' (CDAC)
    సంస్థ రూపొందించింది.

 *  దీనిలోని రకాలు

       i) పరమ్ - 8000 (ఇది భారతదేశ తొలి సూపర్ కంప్యూటర్)

      ii) పరమ్ - 8600

      iii) పరమ్ - 9900

      iv) పరమ్ - 10,000

  *  పరమ్ - 10000 సామర్థ్యాన్ని అనంతంగా పెంచి పరమ్ అనంత్ అంటారు. దీన్ని జర్మనీ, రష్యా, సింగపూర్, కెనడాకు ఎగుమతి చేశారు.

 * ప‌ర‌మ్‌యువ‌ - 1 ను 2008 నవంబరులో ఆవిష్కరించారు.

 *   ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ పరమ్ యువ - 2. దీని వేగం సెకనుకు  520 టెరా ఫ్లోప్స్.

 *   భారతదేశంలో 500 టెరా ఫ్లోప్స్ దాటిన ఏకైక సూపర్ కంప్యూటర్ ఇది.

 *  దీన్ని 2013, ఫిబ్రవరి 8న  C - DAC వారు రూపొందించారు.

ప్రాసెసర్ ఫర్ ఏరోడైనమిక్ కంప్యూటేషన్ అండ్ ఎవాల్యూయేషన్ (PACE): దీన్ని తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్' కోసం రూపొందించారు. దీనికి మరొక పేరు అనురాగ్. (ANURAG - Advanced Numerical Research Analytical Group)

 * పేస్‌ను హైదరాబాద్‌లోని డీఆర్‌డీవోలోని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్ ల్యాబరేటరీ రూపొందించింది. దీన్ని రక్షణ రంగంలో ఉపయోగిస్తున్నారు.

 *  2013, ఆగస్టు 26న ధ్రువ - 3 అనే మరొక సూపర్ కంప్యూటర్‌ను రూపొందించింది.

FLOSOLVER: దీన్ని  బెంగళూరులోని 'నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీ' రూపొందించింది. దీన్ని రక్షణ  రంగంలో ఉపయోగిస్తున్నారు.

అనుపమ్ (ANUPAM):

   * అనుప‌మ్‌ను బార్క్ శాస్త్రవేత్తలు రూపొందించి రక్షణ రంగంలో ఉపయోగిస్తున్నారు.  

  * దీన్నిBARC Parallel Processing System అని అంటారు.

దీనిలోని శ్రేణుల్లో ముఖ్యమైనవి

     ANUPAM - Adhya, Xenon

                         Ameya, Pentium

                         Ajeya, Alpha

                        Aruna, Ashva

SAGA - 220: దీన్ని ఇస్రో విభాగం విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC - త్రివేండ్రం) 2011 మేలో నిర్మించింది. దీని సేవలను ఏరోనాటికల్ సైన్స్‌లో ఉపయోగిస్తున్నారు. వ్యయం రూ.14 కోట్లు.

అన్నపూర్ణ (ANNAPURNA): దీన్ని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ రూపొందించింది.

అశోక (ASHOKA): దీన్ని భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీని సేవలను దేశ వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్నారు.

ఆదిత్య (ADITHYA): దీన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ రూపొందించింది. వాతావరణ విశ్లేషణకు ఉపయోగిస్తున్నారు.

విక్రమ్ - 100: దీన్ని అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీలో ప్రొఫెసర్ యు.ఆర్. రావు 2015, జూన్ 26న ఆవిష్కరించారు. అంతరిక్ష పరిశోధనకు ఉపయోగిస్తున్నారు.

ఏక సూపర్ కంప్యూటర్

  * సంస్కృతంలో ఏక అంటే మొదటిది అని అర్థం.

  * పూణెలోని టాటా గ్రూపుకు చెందిన 'కంప్యూటేషనల్ రీసెర్చ్ ల్యాబరేటరీ' (CRL) సంస్థ దీన్ని  రూపొందించింది.

  * ఇది అమెరికాలోని నెవెడాల్ రెనోలో 2007, నవంబరు 7న విడుదల చేసిన అత్యంత వేగవంతమైన టాప్ 500 సూపర్ కంప్యూటర్‌లలో నాలుగో స్థానం పొందింది. ఈ కంప్యూటర్ సుమారు 2010 వరకు 4వ స్థానంలో ఉంది.
 భారత ప్రభుత్వం 4500 కోట్ల రూపాయల అంచనాతో నేషనల్ సూపర్ కంప్యూటర్ గ్రిడ్‌ను 2015 మార్చిలో
 ఆమోదించింది.

 *  సూపర్ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను బెంగళూరులో ఏర్పాటు చేశారు.

VIRGO: దీన్ని ఐఐటీ చెన్నైలో ఏర్పాటు చేశారు.

ప్రపంచంలోని సూపర్ కంప్యూటర్‌లు:

 * 2015 వరకు ప్రపంచంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ తియాన్ హే - 2.

 *  ఇది చైనా నిర్మించిన తియాన్ హే - 1 కంటే 200 రెట్లు అధిక వేగంతో పనిచేస్తుంది.

 *  రెండో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ 'టైటాన్‌'ను అమెరికాలోని 'క్రే' సంస్థ రూపొందించింది.

 *  సీకోయూ లేదా బ్లూజీన్ క్యూ సూపర్ కంప్యూటర్‌ను ఐబీఎం రూపొందించింది.
ఎక్కువ సంఖ్యలో సూపర్ కంప్యూటర్‌లను తయారు చేసిన దేశాలు

i) అమెరికా  266
ii) చైనా   63
iii) జపాన్ 28
iv) యు.కె. 23
v) ఫ్రాన్స్ 22
vi) జర్మనీ 20
 vii) భారత్ 12

 

  * మనదేశంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం సబ్సిడీ ధరలపై అందింస్తున్న చిన్న కంప్యూటర్ 'ఆకాశ్ టాబ్లెట్ PC  I & II'

  *  భారతదేశంలో 1965 నుంచి కంప్యూటర్ల అభివృద్ధి ప్రారంభమైంది.

  *  భారతదేశంలో కంప్యూటర్ల వినియోగానికి రూపకల్పన చేసిన రాష్ట్రం కేరళ. వీటిని 'లక్ష్య' అనే ప్రాజెక్టు ద్వారా ప్రారంభించారు.

  *  కంప్యూటర్ పాలసీని భారత ప్రభుత్వం 1984 నవంబరులో రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో ప్రకటించింది

  * భారతదేశంలో మొదటి కంప్యూటర్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ.

  * భారతదేశంలో మొదటిసారిగా ఇంటర్‌నెట్‌ను అందించిన దినపత్రిక ది హిందూ.

  ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ 'సన్‌వే తైహులైట్'. దీని సామర్థ్యం 124.5 పెటా ఫ్లాప్‌లు.

  * సమాచార ప్రసారానికి, వృద్ధికి కంప్యూటర్లు, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను సమగ్రంగా ఉపయోగించుకోవడాన్ని   'సాంకేతిక సమాచార విజ్ఞానం' (Information Technology) అంటారు.

 *  సమాచారాన్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వేగంగా పంపడానికి కంప్యూటర్స్ తోడ్పడతాయి.

కొన్ని సమాచార పద్ధతులు:

i) నిక్‌నెట్: నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అనే సంస్థ కంప్యూటర్‌లను ఉపయోగించి వివిధ జిల్లాలు, రాష్ట్ర రాజధానులను, దేశ రాజధానితో అనుసంధానం చేసి సమాచార ప్రసారానికి వీలు కల్పించింది.

ii) జిస్టినిక్: (GISTINIC): ఇది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ మరొక వ్యవస్థ. విశ్వవిద్యాలయం కోర్సులు, సరుకుల ధరలు, టూరిస్టుల గురించి సమాచారాన్ని అందిస్తోంది.

iii) ఇండోనెట్(Indonet): సీఎంఎస్ రూపొందించిన ఇండోనెట్‌కు 10 నగరాల్లో కేంద్రాలు ఉన్నాయి. ఇది ఒక సమగ్ర కార్యనిర్వహణా వ్యవస్థ. కానీ దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ సమృద్ధిగా లేదు.

iv) ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్ ఛేంజ్ (EDI): భారతదేశపు మొదటి ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్ ఛేంజ్ సదుపాయాన్ని 1994, ఫిబ్రవరి 11న బొంబాయిలోని విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ (VSNL) ప్రారంభించింది.

v) సెల్యులార్ ఫోన్ (Cellular Phone): ఇది మొబైల్ కమ్యూనికేషన్‌లో ఉపయోగించే పరికరం.

   * దీన్ని నిర్ణీత ప్రదేశంలోనే ఉపయోగించే వీలుంటుంది. సిస్టమ్ కవరేజ్ ఏరియా అంటారు.

   * వీటిని ఎఫ్ఎంసీ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ బాండ్, ఛాన‌ల్‌కు కేటాయిస్తారు.

   *  సెల్యులార్ ఫోన్లను మొబైల్ యూనిట్లలో ఏర్పాటు చేశారు.

ఆపరేటింగ్ సిస్టమ్ (OS)

   * కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో వినియోగదారులను సమన్వయ పరిచే ఒక ప్రోగ్రాం.

   *  కంప్యూటర్‌ను ఆన్ చేసిన హార్డ్‌వేర్ డిస్క్‌లో నుంచి ప్రధాన మెమొరీలోకి ఆపరేటింగ్ సిస్టమ్‌లోడ్ అవుతుంది.

      ఈ ప్రక్రియను 'బూటింగ్' అంటారు.

ఉదా: MS-DOS

         UNIX, LINUX, Windows X-P, Vista, Mac

 * మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు: Android, Black Berry, IOS, Symbain etc.

వరల్డ్ వైడ్ వెబ్ (WWW)

   * దీన్ని కనుక్కున్న శాస్త్రవేత్త టిమ్ బెర్నర్‌లీ

   * దీని ద్వారా ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్‌కు ఇంటర్‌నెట్ ద్వారా సమాచారాన్ని సరఫరా చేస్తారు.

   *  1991, ఆగస్టు 6న తొలి వెబ్‌సైట్‌ను కనుక్కున్నారు.

   * ప్రపంచంలో తొలి వెబ్‌సైట్ info.cern.ch

బ్రౌజర్:

  *  కంప్యూటర్‌ను ఇంటర్‌నెట్‌తో అనుసంధానం చేసేదే బ్రౌజర్.

       ఉదా: Chorme, Mozilla Fire fox, Opera.

 * ప్రపంచంలో తొలి వెబ్ బ్రౌజర్ NET Scape Navigator.

ఇ-కామర్స్:

   *   కంప్యూటర్ నెట్‌వర్క్ ద్వారా సమాచారం; వస్తువుల, సేవల క్రయ విక్రయాలను చేపట్టడమే ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఇ - కామర్స్.

   * వివిధ వ్యవస్థల, వ్యాపారవేత్తల, వినియోగదారుల అవసరాలను తక్కువ వ్యయంతో తీర్చే ఆధునిక సాంకేతిక విధానమిది.

  తక్కువ సమయంలోనే సమాచార వినిమయం, వస్తుసేవల నాణ్యత మెరుగవడం లాంటివి ఇ-కామర్స్ వద్ద సాధ్యమవుతాయి.

విక్రమ్ ఇన్‌మర్‌సత్ భూకేంద్రం:

 * ఈ కేంద్రం భారతదేశంలో మొదటిది. శాటిలైట్ భూకేంద్రాన్ని తీరం నుంచి నౌకకు, నౌక నుంచి తీరానికి టెలిఫోన్, ఫాక్స్ సర్వీసులను ఇన్‌మరత్ ద్వారా కల్పిస్తూ హిందూ మహాసముద్రం, పుణె సమీపంలోని ఆర్వి వద్ద 1992, జులై 11న ఏర్పాటు చేశారు. దీన్ని విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.

ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే:

 * దీని ద్వారా పెద్ద పరిమాణంలో ఆడియో, వీడియో, గ్రాఫిక్ సమాచారాన్ని అతి త్వరగా వివిధ ప్రాంతాలకు పంపడం సాధ్యమవుతుంది. ఇది ఉపగ్రహం, కంప్యూటర్ అండ్ ఆప్టికల్ ఫైబర్‌తో కూడుకున్న వ్యవస్థ.

డిజిటల్ లైబ్రరీలు:

 * ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చేవి డిజిటల్ లైబ్రరీలు.

 * దీని వల్ల వ్యక్తిగత స్థాయిలో సేకరించిన సమాచారాన్ని, గ్రంథాలయాల్లోని గ్రంథాలయ సమాచారాన్ని, శాస్త్రవేత్తల వద్ద ఉండే సమాచారాన్ని ఉమ్మడిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

పర్చ్యువల్ లాబ్స్:

 * ప్రపంచ వ్యాప్త వెబ్ స్టాండర్డ్, స్టాండర్డ్ కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించడం ద్వారా గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ విశ్వవిద్యాలయాల్లో ప్రయోగాలు నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యం అందించడంలో తోడ్పడతాయి.

 * వీటిని 2012, ఫిబ్రవరి 23న ప్రారంభించారు.

WIMAX: (Wireless Inter Ferability Microwave Accecibility)

 * మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో వైర్‌లెస్ సహాయంతో ఇంటర్నెట్, టెలిఫోన్, టెలిగ్రాఫిక్‌తోపాటు అనే   ఇతర సేవలను అందించవచ్చు.

 * ఈ సేవలను మొదటగా మహారాష్ట్రలోని బారామతిలో ప్రారంభించారు.

ఇంటర్‌నెట్:

 * ఈ వ్యవస్థను మొదట అమెరికా అడ్వాన్సుడ్ రీసెర్చ్ ప్రాజెక్టు నెట్‌వర్క్ (ARPANET) అనే పేరుతో తన రక్షణ  అవసరాల కోసం 1960లో ఏర్పాటు చేశారు.

 * పూర్తిస్థాయి ఇంటర్నెట్‌ను అమెరికా శాస్త్రవేత్తలైన వింట్ సెర్ఫ్, రాబర్ట్ ఖాన్ 1969, అక్టోబరు29న  ఆవిష్కరించారు.

 * వింట్ సెర్ఫ్‌ను ఇంటర్‌నెట్ పితామహుడు అంటారు.

 దీని సేవలు 1983, జనవరి 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి.

 * 1973లో తొలిసారిగా ఇంగ్లండ్, నార్వే మధ్య సమాచారం బదిలీ అయ్యింది.

 * ప్రొఫెసర్ టిమ్. బెర్నర్‌లీ 1989, మార్చి 12న వరల్డ్ వైడ్ వెబ్‌ను (www) కనుక్కున్నారు.

 దీని సేవలు 1991, ఆగస్టు 6 నుంచి అందుబాటులోకి వచ్చాయి.

 టిమ్ బెర్నర్‌లీని వరల్డ్ వైడ్ వెబ్ (www) పితామహుడు అని పిలుస్తారు.

 * భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను 'గేట్‌వే ఆఫ్ ఇంటర్నెట్ యాక్సిస్ సర్వీస్' అనే పేరుతో VSNL ద్వారా 1995, ఆగస్టు 10న ప్రారంభించారు.

 * ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.

 * ఇంటర్నెట్ సేవల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా. 

 *  రెండు, మూడు స్థానాల్లో వరుసగా చైనా, భారతదేశం ఉన్నాయి.

ఖండాల పరంగా
     

మొదటి స్థానం   ఆసియా (45%)
రెండో స్థానం   యూరప్ (20%)
మూడో స్థానం ఉత్తర అమెరికా (11.4%)

  

* ఇటీవల గూగుల్ సంస్థ వేగవంతమైన గూగుల్ ఫైబర్ సర్వీస్ ఇంటర్నెట్ ప్రసార పద్ధతిని ప్రవేశపెట్టింది.

*  దీనిలో భాగంగా 1 GB వేగంతో ఇంటర్నెట్ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి.

NETIZEN:

*  ఇంటర్‌నెట్ వినియోగదారులను నెటిజెన్స్ అని పిలుస్తారు.

VIRUS: (Vital Information Resource Under Seize)

*  కంప్యూటర్‌లోని సమాచారాన్ని క్రమరహితంగా చేయడం లేదా కొంత లేదా పూర్తి సమాచారాన్ని తొలగించడం.

*  1986 లో ప్రపంచంలో మొదట వైరస్‌ను పాకిస్థాన్‌లోని 'బాసిత్ అండ్ అంజద్ షారుక్ అల్వి
    కనుక్కున్నారు.

ముఖ్యమైన వైరస్‌లు

    C - Brain

    Smil

    Sunday

    Pingpong

   Acid (1992)

   Creepal

   Kamasutra (2006)

http (hyper text transfer protocal):

   * ఇంటర్నెట్ ద్వారా అత్యధిక సమాచారాన్ని పదాల రూపంలో తెలుసుకోవడాన్ని hyper text tranfer
     protocol అంటారు.

హోమ్‌పేజీ (Home Page):

   *   ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు తన అవసరాల కోసం ఇంటర్నెట్‌లో ఏర్పాటు చేసుకున్న పేజీని
     హోమ్‌పేజీ అంటారు.

Virtual Reality:

 *  ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు తన అవసరాలకోసం కంప్యూటర్‌లో కృత్రిమంగా సృష్టించుకున్న 3 - D ప్రపంచాన్ని "Virtual Reality" అంటారు.

ఇ-మెయిల్(e-mail):

 *  ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని పదాల్లో మరొక కంప్యూటర్‌కు పంపించే పద్ధతిని ఇ-మెయిల్ అంటారు.

 *   రే థామ్స్‌లైన్‌ను ఇ-మెయిల్ పితామహుడు అంటారు.

ట్విటర్ (TWITTER):

*   కేవలం 140 పదాలతో చాలా వేగంగా ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయడం.

*   ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు ఒకేసారి పది ట్వీట్‌లను పంపించవచ్చు.

*   దీన్ని మొదటిసారి జాక్ డోర్‌సే 2006, మార్చి 21న ప్రారంభించారు.

ఫేస్‌బుక్

 *   దీన్ని మార్క్‌జుకర్ బర్గ్ 2004, ఫిబ్రవరి 4న ప్రారంభించారు.

 *   ఇంటర్నెట్‌లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన పూర్తి సమాచారం దీనిలో ఉంటుంది.

బ్లాగ్ (BLOG)

 *  దీని పూర్తి పేరు వెబ్ బ్లాగ్.

 *   ఒక వ్యక్తి దైనందిన చర్యలను ఒక డైరీలా ఇంటర్నెట్‌లో పొందుపరచడాన్ని బ్లాగ్ అంటారు.

 *   దీని ద్వారా వినియోగదారులు ఇంటర్నెట్‌లో ఒక అంశం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు.

హాకింగ్ (HACKING)

 *   ఇంటర్నెట్ వినియోగదారుడి అనుమతి లేకుండా అందులో ఉన్న సమాచారాన్ని దొంగిలించడాన్ని హాకింగ్  అంటారు.

 * ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను హాకర్స్ అంటారు.

సైబర్ క్రైమ్ (CYBER CRIME)

 *  ఇంటర్నెట్‌తోపాటు ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించి నేరం చేసినట్లయితే దాన్ని సైబర్ క్రైమ్ అంటారు.

 *   భారత ప్రభుత్వం 2013, జులైలో జాతీయ సైబర్ రక్షణ పాలసీని ప్రకటించింది.

 *   ఇంటర్నెట్‌లో కనిపించే మ్యాగజైన్‌ను E.Zine అంటారు.

హాంగ్ (HANG)

*  కంప్యూటర్ అకస్మాత్తుగా పనిచేయకపోవడాన్ని హాంగ్ అంటారు.

*  కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని ఫైల్స్‌ను మెమొరీలోకి లోడ్ చేయడాన్ని 'బూటింగ్' అంటారు.

*  కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో వచ్చే దోషాన్ని 'బగ్' అంటారు.

 యూట్యూబ్ ((YOUTUBE)

*  దీన్ని అమెరికాలో స్టీవ్‌చెన్, చాద్ హర్లే, టావెడ్ కరీం 2005, ఫిబ్రవరి 14న ప్రారంభించారు. కానీ 2006, నవంబరు 1న గూగుల్ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది.

గూగుల్ (Google)

        *  లారీపేజ్, సెర్జిబ్రిన్‌లు 1998, సెప్టెంబరు 4న అమెరికాలో ప్రారంభించారు. ప్రస్తుతం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.

       *  Yahoo.comను జెర్రియంగ్, డేవిడ్‌ఫెలో ప్రారంభించారు.

       *  ఆపిల్ సంస్థను 1976, ఏప్రిల్ 1న స్టీవ్‌జాబ్స్ అండ్ స్టీవ్ ఓజ్నయిక్ స్థాపించారు.     

       *  ఇంటర్నెట్‌లో ఉపయోగించే వాయిస్ మెయిల్ (Voice mail) ను గోర్డన్ మాథ్యూస్ కనుక్కున్నారు.

GPS (Global Positioning System)

*  దీన్ని అమెరికా 1978లో ప్రారంభించింది. భూమిపై ఉన్న వస్తువుల స్థితిగతులు దీని సహాయంతో
   తెలుసుకోవచ్చు.

GIS (Geographical Information System)

*  భౌగోళిక ఉపరితలానికి సంబంధించిన అన్ని వివరాలు, లక్షణాల సమాచారాన్ని భద్రపరిచే కంప్యూటర్
    వ్యవస్థనే భౌగోళిక సమాచార వ్యవస్థ (GIS) అంటారు

ఇ - గవర్నెన్స్

*  ప్రభుత్వానికి సంబంధించిన‌ సేవలను, సమాచారాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందజేయడాన్ని ఇ-గవర్నెన్స్ అంటారు.

*  ఇ - గవర్నెన్స్‌ను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

 

  తెలంగాణ మీసేవ
ఆంధ్రప్రదేశ్ మీసేవ
తమిళనాడు రాశి
కర్ణాటక భూమి
 మహారాష్ట్ర వారాణా
కేరళ   అక్షయ
మధ్యప్రదేశ్ జ్ఞానదూత్
 హిమాచల్‌ప్రదేశ్ లోకమిత్ర
రాజస్థాన్ మండి
 ఉత్తర్ ప్రదేశ్  లోక్‌వాణి


   భూ వివరాల కంప్యూటరీకరణ

 ఆంధ్రప్రదేశ్  భూభారతి
కర్ణాటక   భూమి
తమిళనాడు తమిళనాలం
గోవా   ధరణి
చత్తీస్‌గడ్ భుయాన్
రాజస్థాన్ అప్నాకట
గుజరాత్ ఈ-ధార్
మధ్యప్రదేశ్ హిమభూమి


నేషనల్ ఇ-గవర్నెన్స్ ప్రణాళిక

 సాధారణ ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలను అందించే లక్ష్యంతో 2006లో దీన్ని ప్రారంభించారు.

 *   దీనిలో పేర్కొన్న సేవలను మిషన్ మోడ్ ప్రాజెక్ట్సు (MMP) అంటారు.

* దీని అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు స్టేట్ డాటా సెంటర్స్ (SDS).

ఈ కేంద్రాలను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

ఆంధ్రప్రదేశ్ APSWAN
కేరళ, కర్ణాటక సింగిల్ విండో సిస్టమ్
గుజరాత్, తమిళనాడు ఈ-డిస్ట్రిక్స్
మధ్యప్రదేశ్ జ్ఞానదూత్


డిజిటల్ ఇండియా:

* భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్న వివిధ రకాల ఇ-గవర్నెన్స్
      కార్యక్రమాలను ఏకీకృతం చేయడానికి 2015, జులై 1న నరేంద్ర మోదీ ప్రారంభించారు.

*  దీని నినాదం Power to Empower.

*  టెక్నాలజీ రంగంలో భారతదేశాన్ని సాధికారత వైపు తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యం.

*  భారత దేశంలోని 17 నగరాల్లో 40 పరిశోధనా సంస్థలను సూపర్ కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేసి ఏర్పాటు చేసిన జాతీయ గ్రిడ్ కంప్యూటర్ నెట్‌వర్క్ గరుడ.

*  గ్రామీణ భారతానికి సమాచార, సాంకేతిక సేవలను అందించడానికి ఉద్దేశించిన పథకం సైబర్ గ్రామీణ్.

*  భారతీయ పౌరులను దేశపాలన, అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు 2014లో ''Mygov.in"వెబ్‌సైట్ ప్రారంభించారు.

*  ''Mygov.in" వెబ్‌సైట్ నినాదం My Country, My Government, My Voice.

భారతవాణి:

*  2016, మే 26న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు.

*  ఈ వెబ్‌సైట్‌లో 22 భాషల్లో విజ్ఞాన సమాచారాన్ని అందిస్తారు.

*  త్వరలో 100 భాషల్లో విజ్ఞాన సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు.

టెలి కమ్యూనికేషన్స్

*  దేశ ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకమైంది.

*  1850లో తొలి ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్‌ను భారతదేశంలో కలకత్తా, డైమండ్ హార్బర్ మధ్య ప్రారంభించారు.

*     భారత ప్రభుత్వం 2012, మే 31న 'నేషనల్ టెలికాం పాలసీని' ప్రవేశపెట్టింది. ఐటీ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అంగీకారంతో ఈ పాలసీని ప్రవేశపెట్టారు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)

  *  ఈ సంస్థను 1997, ఫిబ్రవరి 20న స్థాపించారు.

  *  ట్రాయ్‌ను 1997 చట్టం ప్రకారం టెలికాం సేవలను క్రమబద్ధీకరించడం . ఇందులో భాగంగా ధరలను నిర్ధారించడానికి లేదా పునఃసమీక్షించడానికి ట్రాయ్‌కు అధికారం ఉంటుంది.

  *  ట్రాయ్ ప్రస్తుత ఛైర్మన్ ఆర్.ఎస్. శర్మ

ఆప్టికల్ ఫైబర్ లేదా దృశాతంతువు

 *  ఇది సులువుగా వంచగల అతి పలుచటి పారదర్శక గాజు తంతువు. ఇది 2 నుంచి 3 మైక్రాన్ల మందం లేదా వ్యాసంతో ఉంటుంది.

 *  దీన్ని నగేంద్ర సింగ్ కఫాని కనుక్కున్నారు.

 *  దృశాతంతువు తరంగ మార్గదర్శిగా లేదా కాంతి గొట్టంలా తంతి రెండు చివరల మధ్య కాంతిని ప్రసారం చేస్తుంది.

రేడియో

 * రేడియోను మార్కొని (ఇటలీ) కనుక్కున్నారు.

 *  దీన్ని నిస్తంత్రి విధానం అంటారు.

 *  మార్కొని వైర్‌లెస్‌ను కూడా కనుక్కున్నారు.

 *  రేడియో అనునాదం (Resonance) అనే పరిక్రియపై ఆధారపడి పనిచేస్తుంది.

 *  1924లో భారతదేశంలో మొదటిసారిగా రేడియో ప్రసారాలు చైన్నై నుంచి ప్రారంభమయ్యాయి.

 *  1927లో బొంబాయి, కలకత్తాలో రేడియో ప్రసారాలను అధికారికంగా ప్రారంభించారు.

 * 1930లో 'ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసు' ప్రారంభమైంది. 1936లో దీన్ని 'ఆల్ ఇండియా రేడియో (AIR)  గా మార్చారు.

 * 1957లో ఆల్ ఇండియా రేడియోను 'ఆకాశవాణిగా' మార్చారు.

 ఆకాశవాణి దేశంలో 24 భాషల్లో ప్రసారాలను అందజేస్తుంది. ఆకాశవాణి ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.

 * 1967లో ఆకాశవాణిలో వాణిజ్య ప్రకటనలను ప్రారంభించారు.

 *  1977లో మొదటి FM రేడియో స్టేషన్‌ను మద్రాసులో ప్రారంభించారు.

 *  2014, అక్టోబరు 3న ఆకాశవాణిలో ప్రధానమంత్రి 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రారంభమైంది.

మన్ కీ బాత్

 *  2014, అక్టోబరు 3న భారత ప్రధాని నరేంద్ర మోదీ విజయదశమి సందర్భంగా 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  * ప్రతినెలలో ఒక ఆదివారం ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

  మొదటి (2014, అక్టోబరు 3) 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అభియాన్, మంగళ్‌యాన్, నైపుణ్య అభివృద్ధి, వికలాంగుల గురించి ప్రసంగించారు.

  * 2015, జనవరి 27న జరిగిన 4వ మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోదీతో కలసి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగించారు. 

 శాటిలైట్ రేడియో / ఉపగ్రహ రేడియో

  ఇది ఒక అనలాగ్, డిజిటల్ రేడియో సిగ్నల్.

  * ఒకటి లేదా అంతకంటే ఎక్కువ శాటిలైట్స్‌ను సంధానించి ఉంచుతుంది. దాని వల్ల ఎక్కువ విస్తీర్ణం ఉన్నభౌగోళిక ప్రదేశంలో FM ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రేడియో స్టేషన్స్ కంటే అధికంగా గ్రహించవచ్చు.

టెలివిజన్ (దూరదర్శన్)

  * టెలివిజన్‌ను 1925లో జె.ఎల్. బయర్డ్ కనుక్కున్నారు. ఇతడు ఇంగ్లండ్ దేశస్థుడు.

  * టెలివిజన్ కాంతి విద్యుత్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

  * 1959, సెప్టెంబరు 15న భారతదేశంలో మొదటిసారిగా టీవీ కార్యక్రమాలు దిల్లీ నుంచి ప్రారంభమయ్యాయి.

  * దూరదర్శన్ నినాదం  సత్యం - శివం - సుందరం.

  1965 నుంచి టీవీలో నిరంతర వార్తా ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

  * 1972లో దూరదర్శన్ ప్రసారాలు బాంబే, అమృత్‌సర్‌కు విస్తరించాయి.

  1976లో దూరదర్శన్ ప్రసారాలను రేడియో కార్యక్రమాల నుంచి వేరుచేశారు.

  * 1982లో భారతదేశంలో తొలిసారిగా కలర్ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఇదే సంవత్సరంలో దూరదర్శన్ కార్యక్రమాలు భారతదేశం అంతటా ప్రారంభమయ్యాయి.

  * దూరదర్శన్‌లో ప్రసారం చేసిన మొదటి ఎక్కువ నిడివి ఉన్న ప్రసారాలు రామాయణం, మహాభారతం.

  1982లో దిల్లీలో జరిగిన ఆసియా క్రీడలు భారతదేశంలో కలర్ టీవీల ద్వారా ప్రసారం చేశారు.

  2000 సంవత్సరంలో తొలిసారిగా భారతదేశంలో ఇందిరా గాంధీ సార్యత్రిక విశ్వవిద్యాలయం, దూరదర్శన్‌లు  కలసి పూర్తి విద్యా కార్యక్రమాల ఛానల్‌ను ప్రారంభించాయి.

  2004, డిసెంబరు 14 నుంచి దూరదర్శన్ ద్వారా పార్లమెంట్ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

  * భారతదేశంలో ఏర్పాటైన తొలి ప్రైవేటు ఛానల్ స్టార్ ప్లస్.

  * భారత దేశంలో తొలిసారిగా 24 గంటల వార్తా ప్రసారాలను అందించిన తొలి ఛానల్ బీబీసీ.

  బీబీసీ అంటే బిట్రిష్ బ్రాడ్ కాస్టింగ్.

ప్రసార భారతి:

  * ఇది చట్టబద్ధమైన సంస్థ.

  * ప్రసార భారతి చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.

  * 1997, నవంబరు 23 నుంచి ఈ సంస్థ పనిచేస్తుంది.

  * ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ప్రసారాలను 'ప్రసార భారతి' ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

  * ప్రసార భారతి బోర్డు ఏడాదిలో కనీసం ఆరుసార్లు సమావేశమవుతుంది. ప్రతి రెండు సమావేశాల మధ్య 3  నెలల కంటే ఎక్కువ విరామం ఉండకూడదు.

   ప్రసార భారతి ప్రధాన కార్యాలయము న్యూ దిల్లీలో ఉంది.

   ప్రసార భారతి ప్రస్తుత ఛైర్మన్ ఎ. సూర్య ప్రకాశ్.

  * ప్రసార భారతి తాత్కాలిక సభ్యురాలిగా నటి 'కాజోల్' ఎంపికయ్యారు.

టెలిఫోన్:

   దీన్ని అలెగ్జాండర్ గ్రాహంబెల్ కనుక్కున్నారు.

   మొదటిసారిగా 1881లో ఇంగ్లండ్‌కు చెందిన ఓరియంటల్ టెలిఫోన్ కంపెనీ భారత దేశంలో టెలిఫోన్ సర్వీసుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.

   *1882, జనవరి 28న కోల్‌కతా, మద్రాస్, ముంబయి, అహ్మదాబాద్‌లలో టెలిఫోన్ ఎక్సేంజీలను ఏర్పాటు చేశారు.

   * 1948లో ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీని ప్రారంభించారు.

   * భారతదేశ టెలిఫోన్ పితామహుడు విలియం ఓ-షాగ్నెస్సీ.

   1986, ఏప్రిల్ 1న భారతదేశంలోని దిల్లీ, ముంబయి నగరాల్లో టెలికాం సర్వీసులను అభివృద్ధి చేయడానికి 'మహానగర్ టెలికాం నిగం లిమిటెడ్' (MTNL)ను ప్రారంభించారు.

   * 1986లో విదేశాల్లో టెలికమ్యూనికేషన్స్ కోసం 'విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్' (VSNL)ను ఏర్పాటు చేశారు.

   భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ను 2000, అక్టోబరు 1న ఏర్పాటు చేశారు.

   బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.

   బీఎస్ఎన్ఎల్ ప్రస్తుత సీఈవో శ్రీ అనుపమ్ శ్రీవాత్సవ.

సెల్ ఫోన్ (Cell Phone):

  తొలి సెల్‌ఫోన్ కంపెనీ ఎరిక్‌సన్.

  మొదటి సెల్యులార్ ఫోన్‌ను 1973, ఏప్రిల్ 3న 'మార్టిన్ కూపర్' కనుక్కున్నారు. ఇతడిని మొబైల్ ఫోన్ పితామహుడు అంటారు.

 విల్‌ఫోన్ పూర్తిపేరు వైర్‌లెస్ ఇన్ లోకల్ లూప్ ఫోన్.

 * సెల్‌టవర్ పరిధి 26 చ.కి.మీ.

 * భారత దేశంలో మొబైల్ ఫోన్ సేవలను 1994లో ప్రారంభించారు.

 * ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ కంపెనీ వోడా ఫోన్.

 ఉక్రెయిన్‌కు చెందిన 'మోటరోలా' ఇంజనీర్ మార్టిన్ కూపర్ తొలిసారిగా 1973, ఏప్రిల్ 3న మొబైల్ ఫోన్‌లో మాట్లాడారు.

 * భారతదేశంలో ప్రభుత్వరంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్.

 * ఫోన్ ఉపయోగించేవారి ఉనికిని స్క్రీన్‌పై చూపెట్టే ఫోన్‌ను తొలిసారి తయారు చేసిన కంపెనీ నోకియా.

 ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్‌లో మూడు రకాల టెక్నాలజీలు వాడుతున్నారు.

1. CDMA:  

* CDMA అంటే 'కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్'.  

* విల్‌ఫోన్‌లో సాధారణంగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు.  

* ఈ టెక్నాలజీని అమెరికాకు చెందిన 'క్వాల్‌కెమ్' అభివృద్ధి పరిచారు.

2. GSM:

   * GSM అంటే 'గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్'.

   ఈ టెక్నాలజీని యూరోపియన్ కంపెనీ అభివృద్ధి పరిచింది.

  మొబైల్ మార్కెట్‌లో 70% మంది ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

  * GSM టెక్నాలజీకి 2017, సెప్టెంబరు 7 నాటికి 30 ఏళ్లు పూర్తి కానున్నాయి.

  3. FDMA

   * FDMA అంటే 'ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్'.

  * ఈ విధానంలో ప్రతి కాల్‌ను ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో ఉంచుతారు. ఇది రేడియో స్టేషన్‌లా పనిచేస్తుంది.

  * ఈ టెక్నాలజీని ప్రత్యేకంగా 'ఎనలాగ్ ట్రాన్స్‌మిషన్‌'కు ఉపయోగిస్తారు.

  * ప్రపంచంలో మొబైల్ ఫోన్లను అధికంగా వినియోగించే దేశం చైనాకాగా, భారత దేశం రెండో స్థానంలో ఉంది.

మొబైల్ ఫోన్‌లు - తరాలు

మొదటి తరం మొబైల్ ఫోన్‌లు: సెల్ ఫోన్ ద్వారా కేవలం ధ్వని రూపంలో సమాచారాన్ని ప్రసారం చేయడం.

రెండో తరం మొబైల్ ఫోన్లు: దీనిలో సెల్‌ఫోన్ ద్వారా ధ్వనితోపాటు డేటాను కూడా ప్రసారం చేయవచ్చు.

   దీనిలో సిమ్ - సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్(SIM) ను ఉపయోగించారు.

   2.5 తరం మొబైల్ ఫోన్లలో GPRS (General Pocket Radio Services) సర్వీసుల ద్వారా ఇంటర్‌నెట్

  సేవలను పొందడం జరిగింది.

మూడో తరం మొబైల్ ఫోన్లు: సెల్‌ఫోన్ల ద్వారా ధ్వని, డాటా, వీడియో కాలింగ్ సదుపాయం ఉంది.

    * 3G SIM - USIM ఉపయోగించారు.

    USIM అంటే Unified Subscriber Identity Module.

నాలుగో తరం మొబైల్ ఫోన్లు: దీనిలో లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ టెక్నాలజీ (LTE) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

    సెకనుకు 100 MB డాటాను ప్రసారం చేయవచ్చు.

    * 4జీ సేవలను ప్రారంభించిన మొదటి దేశం స్వీడన్.

    * భారతదేశంలో 4జీ సేవలను 2012లో కోల్‌కతాలో భారతీ ఎయిర్‌టెల్ సంస్థ ప్రారంభించింది.

అయిదో తరం మొబైల్ ఫోన్లు: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ ZTE కంపెనీ 'గిగాబిట్ ఫోన్' పేరుతో 5వ తరానికి చెందిన ఐటీ ఆధారిత మొబైల్ ఫోన్‌ను ఇంటెల్ కార్పొరేషన్‌తో కలిపి స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ప్రపంచ మొబైల్ కాంగ్రెస్‌లో ప్రదర్శించింది.

   * దీనిలో ఇంటర్‌నెట్ వేగం సెకనుకు 1GB వరకు ఉంటుంది.

   * దీనిలో X16 LTE మోడెమ్ ఉపయోగిస్తారు.

నానో టెక్నాలజీ

   * నానో (nano) అనే గ్రీకు పదానికి అర్థం చిన్న మరగుజ్జు (Dwarf).
       1 nano = 10-9 m

  * నానో టెక్నాలజీని మొదటిసారిగా జపాన్‌కు చెందిన 'నొరియ టొనిగుచ్చి' (1974) ప్రవేశపెట్టారు.

  *  నానో టెక్నాలజీ అనే పదాన్ని రిచర్డ్ ఫెన్‌మన్ (1959) ప్రతిపాదించారు.

  * రిచర్డ్ ఫెన్‌మన్ "There's plenty of room at the bottom" అనే థీసిస్‌లో ప్రచురించి ప్రపంచానికి తెలియజేశారు.

  * స్వతంత్ర అణువులను లాక్కోవడం వల్ల శాస్త్ర పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని 'ఫెన్‌మెన్'
      తెలిపారు.

  * నానో స్కేల్‌ను ఇంజినీరింగ్‌లో వాడటం వల్ల అతి చిన్న యంత్రాలను తయారు చేయవచ్చని చెప్పారు.

  'ఆర్థర్ వాన్ హిప్పల్' అనే శాస్త్రవేత్త నానో టెక్నాలజీలో నాన్ అణువులు నానో ఉపకరణాలను తయారు చేయవచ్చని తెలియజేశారు.

  * నానో టెక్నాలజీలో ఉపయోగించే STM (Scanning Tunneling Microscope - 1981) ను ఐబీఎం సంస్థకు చెందిన గెర్డ్ బిన్నింగ్, హెన్రిచ్ రోవర్ కనుక్కున్నారు. దీనికిగాను వీరికి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి (1986) లభించింది.

 * నానో టెక్నాలజీ పదాన్ని ప్రచారం చేసినవారు 'ఎరిక్ డ్రెక్సోలర్' (1986). (Engines of Creation: Coming Era of Nano technology).

నానో టెక్నాలజీపై పరిశోధన చేసినవారు:
 

 

నానో టెక్నాలజీ ప్రయోజనాలు:

1. ఐటీ, ఎలాక్ట్రానిక్స్

   టీవీ, కంప్యూటర్ పరికరాలు, చిప్‌లు, అతి చిన్న పరిమాణంలో ఎక్కువ సామర్థ్యం ఉన్నవాటిని రూపొందిస్తారు.

     ఉదా: టాబ్లెట్స్

2. అంతరిక్ష రంగంలో నానో పదార్థాలతో తయారైన శాటిలైట్స్ జీవితకాలం, సేవల నాణ్యత పెరుగుతుంది.

3. నానో మెటీరీయల్స్

  * టైటానియం డయోడ్స్ అనే నానో పదార్థంతో తయారైన కాస్మోటిక్స్, UV కిరణాలను ఉద్గారించడం వల్ల ఎలాంటి చర్మ సంబంధ క్యాన్సర్ రాదు.

 * టైటానియం డయోడ్స్‌తో వాహనాల అద్దాలను తయారుచేస్తే దుమ్ము రేణువులు సులభంగా జారిపోవడం జరుగుతుంది.

4. నానో మెడిసిన్

    వైద్య రంగంలో నానో పదార్థాలన్నీ కార్బన్‌తో తయారవుతాయి.

    అల్ట్రా సోనోగ్రఫీ, మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (MRI)లో నానో టెక్నాలజీని ఉపయోగిస్తారు.

     ఆస్తమా, బ్రాంకైటిస్‌లకు నానో మందులు అందుబాటులో ఉన్నాయి.

    భారతదేశంలో క్యాన్సర్ కోసం ఉపయోగించే ప్లాటిటాక్సెల్ స్థానంలో Nanoxel అనే మందును వాడుకలోకి వచ్చింది.

5. నానో మెమ్‌బ్రేన్స్ (నానో పొరలు)

   * నానో పదార్థాలతో తయారయ్యే పొరల వల్ల

     1) నీటిని శుద్ధిచేయడం

     2) లవణాలు, కలుషితాలను తొలగించవచ్చు.

6. నానో రోబోట్స్

   * నానో పదార్థాలతో తయారయ్యే రోబోలను శరీరంలోకి పంపినప్పుడు అవి సులువుగా శరీరంలోకి రవాణా చెంది అసాధారణ కణాల ఉనికిని గుర్తిస్తాయి. ఫలితంగా సులభంగా వైద్య చికిత్స చేయవచ్చు.

 *  ఈ టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించడానికి కారణం 1985లో వచ్చిన కార్బన్ ట్యూబ్‌లు, ఫుల్లరిన్స్.

నానోపదార్థాల లక్షణాలు

  1) అతిసూక్ష్మంగా ఉంటాయి.

  2) అతి తేలికగా ఉంటాయి

  3) అత్యంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

  4) స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటాయి.

  5) అధిక మెమొరీని నిల్వచేయవచ్చు.

  6) అత్యంత వేగవంతమైన ప్రక్రియ నిర్వహించవచ్చు.

   *  బంగారం నానో రేణువులను అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణలో ఉపయోగిస్తారు.

   * వాటర్ ఫిల్టర్, మొబైల్ లాంటి పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.

   వెండి నానో రేణువులను ఉపయోగించి బ్యాక్టీరియాలను చంపే బ్యాండేజ్‌ను 'రాబర్ట్ బర్రెల్' కనుక్కున్నారు.

   బుల్లెట్‌ప్రూఫ్ పరికరాల తయారీలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు.

నానో టెక్నాలజీ - భారతదేశం

  * భారతదేశంలో మొదటగా నానో ప్రాజెక్ట్స్‌ను 2004లో రూపకల్పన చేశారు.

  *  2005లో నానో ఎలక్ట్రానిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

      1) ఐఐటీ, ముంబయి

      2) ఐఐఎస్ఈ, బెంగళూరు

  * 2007లో నానో సిటీ ప్రాజెక్టు మీటింగ్‌ను నిర్వహించారు. దీని ఉద్దేశం దేశంలోని కొన్ని పట్టణాలను ఎన్నుకుని నానోసిటీగా మార్చడం. దీనిలో భాగంగా 'పంచకుల' (హరియాణా)లో నానో సిటీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

  * 2007లో నాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్‌ను చేపట్టారు. దీని ఉద్దేశం భారతదేశాన్ని నానో రంగంలో గ్లోబల్ లీడర్‌గా చేయడం. దీని కాలవ్యవధి 5 సంవత్సరాలు.

  * నానో టెక్నాలజీలో ఉపయోగించే ఫుల్లరిన్‌ను 1985లో రాబర్ట్‌కుల్, క్రోటో, స్మాల్లి కనుక్కున్నారు. వీరు రసాయనశాస్త్రంలో చేసిన కృషికిగానూ 1996లో నోబెల్ బహుమతి పొందారు.

  *  కార్బన్ నానో ట్యూబ్‌లను బకీట్యూబ్‌లు అని కూడా అంటారు.

రోబోటిక్స్ (R0BOTICS)

 * రోబోట్ అనేది ఒక యంత్రం. ఇది మానవుడిని ఆశ్చర్యపరిచే విధంగా ఇచ్చిన పనిని చక్కగా నిర్వర్తిస్తుంది.

రోబోట్‌లో 3 ర‌కాలైన‌ తరాలు ఉన్నాయి

1) మొదటి తరం (సాధారణ రోబోట్‌లు)

   * వీటిని చెవిటి, మూగ, గుడ్డి రోబోట్‌లు అంటారు.

   * ఇవి మమూలు యంత్రాలను కలిగి ఉండి చెప్పిన పనిని సక్రమంగా పూర్తి చేస్తాయి.

   * వీటిని ఆటోమొబైల్ పరిశ్రమలో వెల్డింగ్, స్ప్రే చేయడంలో ఉపయోగిస్తారు.

   * వీటికి గ్రహణ శక్తి లేదు. ఏదైనా తప్పు ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలో తెలియదు.

   *  వస్తు పరికరాల అమరికలో తప్పు ఉంటే ఈ తరహా రోబోట్‌లు గమనించకుండా పనిచేసుకుంటూనే
        ఉంటాయి.

రెండో తరం రోబోట్‌లు

 మొదటి తరం కంటే వీటికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి సాధారణంగా కంప్యూటరీకరించి ఉంటాయి.  

 వీటికి 4o -  6o స్వేచ్ఛ ఉండి, తమ కదలికల్లో నియంత్రణ కలిగి ఉంటాయి.

మూడో తరం రోబోట్‌లు

   ఇవి చాలా సంక్లిష్ట రూపాన్ని కలిగి ఉంటాయి. వస్తువును చూడగలవు, స్పర్శించగలవు.

   *  సెన్సార్లు పంచిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు చేయగలిగే శక్తిని కలిగి ఉంటాయి.

     ఉదా: 1985లో ఎయిర్ ఇండియా జంబోజెట్ విమానం కనిష్క కూలినప్పుడు ఈ రోబోట్ల సహాయంతోనే బ్లాక్ బాక్స్‌ను సముద్రం నుంచి వెలికితీశారు.

రోబోటిక్స్ - ఉపయోగాలు

1) పరిశ్రమలు:

* రోబోట్‌లను పరిశ్రమల్లో  డ్రిల్లింగ్ చేయడం, పరికరాలను వాడటం, విడిభాగాలను లోడ్ చేయడం,పెయింట్ స్ప్రే చేయడం, వెల్డింగ్ చేయడం, పరికరాలను అసెంబుల్ చేయడం, వస్తువులనుపరిశీలించడంలో ఉపయోగిస్తారు.

*  భవిష్యత్తులో రక్షణ రంగంలో మానవుడు లేని ట్యాంకుల నిర్వహణలో రోబోట్‌లను వినియోగించనున్నారు.

*  వైద్య రంగంలో శస్త్ర చికిత్స, నర్సింగ్‌కేర్‌లో ఉపయోగించే పైపుల్లో వచ్చే చీలికలను గుర్తించడానికి  ఉపయోగిస్తారు. మైక్రో సర్జరీలలో ఇప్పటికే రోబోట్‌లను ఉపయోగిస్తున్నారు.

* గనుల్లో 24 గంటలు నడిచే యంత్రాలతోపాటు రోబోట్లను ఉపయోగించి విలవైన వనరులను సమర్థంగా వెలికితీస్తున్నారు.

* సముద్ర గర్భంలో, అంతరిక్ష పరిశోధనా విభాగంలో, అణువిద్యుత్ కేంద్రాల్లో విస్ఫోటక పదర్థాలను గుర్తించడానికి; ఎయిర్‌పోర్ట్‌ల‌లో బాంబులను క‌నుక్కోవ‌డం, తొలగించడంలో; రసాయనశాలలో ప్రయోగాత్మక పనుల్లో ఉపయోగిస్తున్నారు.

రోబోటిక్ టెక్నాలజీ - భారతదేశం

    భారత్‌లోని ఐఐటీలలో, బెంగళూరు ఐఐఎస్సీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీలలో రోబోటిక్ ప్రయోగశాలలు ఉన్నాయి.

  * ముంబయిలోని బాబా అణువిద్యుత్ పరిశోదనా కేంద్రం (BARC) న్యూక్లియర్ వ్యర్థాలను తొలగించడానికి రోబోట్‌లను లను ఉపయోగిస్తుంది.

  టెల్కోలో స్పాట్ వెల్డింగ్ చేయడానికి, KIRLOSKARలో మోటార్లను అసెంబుల్ చేయడంలో, మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌లో స్ప్రే చేయడంలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

   DRDO, DAC, HMT, IIT లు రోబోట్‌లను తయారు చేస్తున్నాయి.

  * బెంగళూరులోని 'సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్'(CAIR) సెన్సర్‌లను కలిగి ఉన్నవస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చే సామర్థ్యం ఉన్న చాతూ రోబోట్ (CHATO ROBOT), నిపుణ (NIPUNA) రోబోట్‌లను తయారు చేసింది.

రోబోటిక్స్

  * 1942లో ఇసాక్ అసిమోల్ రోబోటిక్స్‌కు సబంధించిన మూడు నియమాలను ప్రతిపాదించారు.

  *   1948లో నోబెర్ట్ వైనర్ సైబర్ నెటిక్స్ అనే రోబోటిక్స్ ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించారు.

  *  ఫుల్లీ అటానమస్ రోబోట్ 20వ శతాబ్దం ద్వితీయార్థంలో వచ్చింది. 

 *  మొదటి రోబోట్‌ను 1961లో తయారు చేశారు.

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌