• facebook
  • whatsapp
  • telegram

రాజపుత్రులు - సాంస్కృతిక సేవలు

రాజపుత్రుల కాలంలో ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు సంభవించాయి. ప్రధానంగా భూస్వాములు పుట్టుకొచ్చారు. హిందూమత ప్రాబల్యం ఎక్కువైంది. ఎన్నో కులాలు ఏర్పడ్డాయి. సమాజంలో స్త్రీల పరిస్థితి దిగజారిపోయింది. భారతదేశ చరిత్రలో రాజపుత్ర యుగం విశిష్టమైంది. దేశభక్తి, ధైర్య సాహసాలకు పేరుపొందిన రాజపుత్రులు సమర్థ పాలనను అందించారు. వీరి కాలంలోనే భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. హిందూమతంతో పాటు ఇస్లాం మతాన్నీ ఆదరించారు. భాషా, సాహిత్యాల అభివృద్ధికి; వాస్తు కళారంగాల విస్తరణకు కృషి చేశారు.
 

పరిపాలనా విధానం
 రాజపుత్రుల రాజకీయ వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ ప్రధానమైంది. రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. రాజు సర్వాధికారి. అతడి సార్వభౌమాధికారం దైవదత్తాధికార, సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల మిశ్రమంగా ఉండేది. రాజుకు పాలనలో యువరాజు, పట్టమహిషి, మంత్రి మండలి సహాయపడేవారు. ప్రధాన రాజపురోహితుడు, జ్యోతిష్కుడు మంత్రి మండలిలో సభ్యులుగా ఉండేవారు. భుక్తి లేదా రాష్ట్ర ప్రతినిధులను రాజ ప్రతినిధులుగా పిలిచేవారు. విషయాలకు విషయపతి, గ్రామాలకు గ్రామపతి పాలకులుగా ఉండేవారు. ఉత్తర భారతదేశంలో భూస్వామ్య ప్రభువుల జోక్యం వల్ల గ్రామ స్వపరిపాలన కుంటుపడింది. కానీ ఇదే సమయంలో దక్షిణాదిన చోళుల పాలనలో గ్రామ స్వపరిపాలన చక్కగా సాగింది. రాజు సొంత సైన్యంతో పాటు భూస్వాముల సైన్యమూ రాజ్య విస్తరణలో సహాయపడేది. సైనిక సర్వీసు కేవలం రాజపుత్రులకే పరిమితమై ఉండేది. సైనిక వ్యయం అధికంగా ఉండటం వల్ల ప్రజలపై పన్ను భారం ఎక్కువగా ఉండేది. న్యాయపాలనలోనూ రాజే సర్వాధికారి. భుక్తుల్లో దండనాయకుడు న్యాయాన్ని నిర్ణయించేవాడు. రెవెన్యూ పాలనలో భూస్వాముల ఆధిపత్యం ఉండేది. భూమిశిస్తు నిర్ణయించి, వసూలు చేసే బాధ్యత వీరిదే.

 

సామాజిక వ్యవస్థ
 రాజపుత్ర యుగం నాటి సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు సంభవించాయి. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ జటిలమయ్యాయి. కుమ్మరి, చేనేత, కంసాలి, మంగలి, జాలరి, మేళగాడు లాంటి కులాలు, ఉపకులాలతో పాటు రాజపుత్రులనే కొత్త కులం ఆవిర్భవించింది. కాయస్థ కులం ఈ కాలంలో ఉండేది. అధికంగా శ్రమించే కులాలను అస్పృశ్యులు, అంటరానివారుగా పరిగణించేవారు. భూస్వామ్య ప్రభువులుగా వ్యవహరించే రాణాలు, సామంతులు శక్తిమంతమైన వర్గంగా ఎదిగారు. ఓడిపోయిన రాజులు, స్థానిక అధిపతులు, యుద్ధ నిపుణులు, తెగ నాయకులు ప్రత్యేక భూస్వామ్య వర్గాలుగా ఆవిర్భవించారు. రాజు వీరికి దానం చేసిన భూములను భోగ లేదా జమీ భూములు అనేవారు. ప్రభుత్వ పదవులను వంశ పారంపర్యంగా అనుభవించేవారు. ఆడపిల్ల పుట్టగానే చంపే ఆచారం ఈ యుగంలోనే ప్రారంభమైంది. బహు భార్యత్వం, పరదా పద్ధతి, జౌహార్‌, సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాల వల్ల స్త్రీల పరిస్థితి దయనీయంగా మారింది. స్త్రీలకు భూమి హక్కు ఉండేది కానీ విద్యావకాశాలు చాలా తక్కువ.

 

మత పరిస్థితులు
రాజపుత్ర యుగంలో జైన, బౌద్ధ మతాలు క్షీణించి హిందూమతం అభివృద్ధి చెందింది. శైవ, వైష్ణవ మతాలకు ఆదరణ పెరిగింది. భక్తి ఉద్యమాల ప్రభావంతో త్రిమూర్తుల ఆరాధన ప్రాధాన్యం పొందింది. ఉత్తర భారతదేశంలో శక్తి ఆరాధన (స్త్రీ దేవతల ఆరాధన) మరింత పెరిగింది. హిందువులు స్త్రీ మూర్తిని దుర్గ, కాళీ రూపాల్లో శివుడి అర్ధభాగంగా భావించి పూజించేవారు. అనేక దేవాలయాల నిర్మాణాలు రాజపుత్ర యుగంలో హిందూమతానికి దక్కిన ఆదరణకు సాక్ష్యాలుగా నిలిచాయి.

 

ఆర్థిక పరిస్థితులు
రాజపుత్ర యుగం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థపై ఆధారపడింది. వ్యవసాయం చేయడంలో ప్రత్యక్ష పాత్ర లేనివారు, వ్యవసాయం ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని వారసత్వ హక్కుగా అనుభవించే ఆర్థిక వ్యవస్థనే భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజంగా పేర్కొంటారు. ఈ యుగంలో అదనంగా పంటలు పండించి వాణిజ్యం చేసే ప్రయత్నాలు చేయలేదు. భూస్వామ్య ప్రభువుల ఒత్తిడి వల్ల రైతులు కనీస పంటలు పండించడమే మేలని భావించేవారు. వాణిజ్యం, నాణేల చెలామణి తగ్గిపోయాయి. రోమన్‌, ససానిడ్‌ రాజ్యాలు దెబ్బతినడంతో విదేశాల్లో భారతీయ వస్తువులకు గిరాకీ తగ్గి విదేశీ వాణిజ్యం క్షీణించింది. కోస్తా, బెంగాల్‌ ప్రాంతాల్లోని పట్టణాలు పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సంబంధాలను కొనసాగించాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే వృత్తి పనివారి సంఘాలకు (శ్రేణులు) ప్రాముఖ్యం తగ్గిపోయింది. భూమి ఇచ్చిన రాజు, సేద్యం చేసే రైతు ఇద్దరూ బలహీనపడి భూస్వామ్య ప్రభువులు బలపడ్డారు. భూమిశిస్తు కంటే అధికంగా పన్నులు చెల్లించడం వల్ల రైతులు ఆర్థికమాంద్యంలో కూరుకుపోయారు. దేవాలయ అధికారులూ రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. రాజులు, సామంతులు సైనిక వ్యయంతోపాటు దేవాలయాలు, కోటల నిర్మాణానికి, వాటి అలంకరణకు అధికంగా ఖర్చు చేసేవారు. ఈ విధానాలే అనంతర కాలంలో విదేశీయులు మనపై దాడిచేసి, దోపిడీ చేయడానికి కారణమయ్యాయి.

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సంస్కరణోద్యమాలు

 

    భారత్‌లో 19వ శతాబ్దంలో సమాజోద్ధరణ దిశగా రూపుదాల్చిన అనేక సంస్కరణోద్యమాలు భారతీయుల జీవన విధానంపై విశేష ప్రభావాన్ని చూపాయి. రాజా రామ్మోహన్ రాయ్, వివేకానందుడు, స్వామి దయానంద సరస్వతి, సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ లాంటి ప్రముఖులెందరో ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మూఢ సంప్రదాయాలు, అంధ విశ్వాసాలను రూపుమాపేందుకు వీరంతా కృషి చేశారు. ఫలితంగా భారతీయుల జీవన విధానంలో వచ్చిన మార్పులు తర్వాతి తరాలకు ఎంతో మేలు చేశాయి. నాటి సామాజిక, మత సంస్కరణ ఉద్యమాల చారిత్రక అధ్యయన సమాచారాన్ని చదవండి మరి!
   19వ శతాబ్దంలో ఆధునిక ఆంగ్ల విద్యావ్యాప్తి.. క్రైస్తవ మిషనరీల మత ప్రచారం.. ఐరోపాలో ప్రారంభమైన ఉదార, హేతువాద, మానవతావాద ఉద్యమాలు భారతీయులపై ప్రభావం చూపాయి. ఇవన్నీ తమ సామాజిక, మత వ్యవస్థల గురించి భారతీయులు పునరాలోచించేలా చేశాయి. ఈ ప్రభావంతో తలెత్తిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు భారతీయుల జీవన విధానాన్ని మార్చాయి. వారిలో ఐకమత్యం, దేశభక్తిని పెంపొందించాయి. భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు మొదట బెంగాల్, తర్వాత పశ్చిమ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. భారత్‌లో పునరుజ్జీవన ఉద్యమపితగా రాజా రామ్మోహన్ రాయ్‌ని పేర్కొంటారు.

 

 

 

బ్రహ్మ సమాజం

    బ్రహ్మ సమాజ స్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ 1772లో బెంగాల్‌లోని బర్డ్వాన్ జిల్లా రాధానగర్‌లో జన్మించారు. 1815లో ఆత్మీయసభ అనే సంస్థను స్థాపించారు. భగవంతుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే దీని ఉద్దేశం.
హిందూ మతంలోని అనేక దురాచారాలను రూపుమాపడానికి, సంస్కరించడానికి 1828లో రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆధునిక విద్యావ్యాప్తి, స్త్రీ జనోద్ధరణ కోసం విశేషంగా కృషి చేశారు. బహు భార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలను ఖండించారు. ఆయన కృషి ఫలితంగానే అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1829లో రెగ్యులేషన్ XVII ద్వారా సతీ సహగమనం చట్టవిరుద్ధమని ప్రకటించాడు. బాల్య వివాహాలు, కులవ్యవస్థలోని లోపాలపై పోరాడారు. అంటరానితనాన్ని అప్రజాస్వామ్యం, అమానుషమని పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని ఆయన గట్టిగా కోరారు.
దేవుడికి, ప్రజలకు మధ్యవర్తులుగా ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్న పురోహితుల తరగతిని రాజా రామ్మోహన్ రాయ్ నిరసించారు. రంగు, జాతి, కులాలకు అతీతంగా మానవులందర్నీ ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు. కానీ బ్రిటిష్ పాలన పట్ల మాత్రం కొంత సానుకూల వైఖరితో ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును ప్రశంసించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్య్రంపై పరిమితులు విధించడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉంచడాన్ని వ్యతిరేకించారు. కలకత్తాలో హిందూ కళాశాల స్థాపనకు ప్రయత్నించారు.
రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదును ఇచ్చిన మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ కోరిక మేరకు రాయ్ 1830లో ఇంగ్లండ్ రాజైన నాలుగో విలియం ఆస్థానానికి వెళ్లాడు. బ్రిటిష్‌వారు ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రామ్మోహన్ రాయ్ ద్వారా మొగలు చక్రవర్తి కోరాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన రాయ్ 1833, సెప్టెంబరు 27న బ్రిస్టల్ నగరంలో మృతి చెందారు.

 

'రాజా' అనంతరం..

మహర్షి ద్వారకనాథ్ ఠాగూర్, పండిట్ రామచంద్ర విద్యావాగిష్‌లు రామ్మోహన్ రాయ్ మరణానంతరం పదేళ్లపాటు బ్రహ్మ సమాజాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ద్వారకనాథ్ ఠాగూర్ పెద్ద కుమారుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మసమాజ బాధ్యతలు చేపట్టారు. దేవేంద్రనాథ్ బ్రహ్మ సమాజంలో చేరక ముందు కలకత్తా(1831)లో తత్త్వబోధిని సభను స్థాపించారు. గొప్ప రచయిత, విద్యావేత్త అయిన అక్షయ్‌కుమార్ దత్తా 1840లో తత్త్వబోధిని పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్ మిత్రా, తారాచంద్ చక్రవర్తి, పియరీచంద్ మిత్ర చేరారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి తత్త్వబోధిని అనే మాసపత్రికను బెంగాలీ భాషలో ప్రచురించారు. దేవేంద్రనాథ్ 80 మంది అనుచరులతో 1843 డిసెంబరు 21న బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా చేరారు. అలెగ్జాండర్ డఫ్ భారతీయ సంస్కృతిపై చేసిన దాడిని దేవేంద్రనాథ్ సమర్థంగా తిప్పికొట్టారు. దేవేంద్రనాథ్ రెండేళ్ల(1856-58) పాటు సిమ్లా వెళ్లారు. అక్కడ ఉన్న సమయంలోనే కేశవచంద్రసేన్ (1857లో) బ్రహ్మ సమాజంలో చేరి ఆయన కుడిభుజంగా మారారు. 1859లో యువకులతో కూడిన సంగత్ సభను స్థాపించాడు. దీని ప్రధాన ఉద్దేశం అప్పటి ఆధ్యాత్మిక, సామాజిక సమస్యల గురించి చర్చించడం.
1861లో కేశవచంద్ర సేన్ సంపాదకుడిగా ఇండియన్ మిర్రర్ అనే పక్ష పత్రికను స్థాపించారు. ఇది తర్వాతి కాలంలో భారతదేశంలో ఆంగ్లంలో ప్రచురితమైన మొదటి దినపత్రికగా పేరొందింది. క్షామం, అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో ఆయన సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బ్రహ్మ సమాజాన్ని దేశమంతా విస్తరించడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కృషి ఫలితంగా మద్రాసులో వేద్ సమాజ్, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్‌లు ఏర్పాటయ్యాయి.

 

బ్రహ్మ సమాజంలో చీలికలు

   కేశవచంద్ర సేన్ చేపట్టిన కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలు, పరదా పద్ధతి తొలగింపు లాంటి కార్యక్రమాలు పాతతరం వారికి నచ్చలేదు. దీంతో 1866లో బ్రహ్మ సమాజంలో మొదటి చీలిక ఏర్పడింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ వర్గం 'ఆది బ్రహ్మసమాజ్‌'గా, కేశవచంద్ర సేన్ వర్గం 'బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా (నవ విధాన్)'గా విడిపోయాయి.
1870లో కేశవచంద్ర సేన్ ఇంగ్లండ్ వెళ్లొచ్చాక మరింత ఉత్సాహంతో సాంఘిక సంస్కరణలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 1872లో ప్రభుత్వంతో చర్చించి బ్రహ్మ వివాహ చట్టాన్ని తీసుకురావడం ద్వారా బ్రహ్మ సమాజం నిర్వహించే వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ఆయన ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను స్థాపించారు. పాశ్చాత్య విద్యావ్యాప్తి; స్త్రీల అభ్యున్నతి, విద్యావ్యాప్తి; సామాజిక కార్యక్రమాలకు ఈ సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది.
కేశవచంద్ర సేన్ 1878లో తన కుమార్తెను కూచ్ బిహార్ పాలకుడికి ఇచ్చి వివాహం చేశారు. చట్టబద్ధంగా నిర్ణయించిన కనీస వివాహ వయసు కంటే వధూవరులిద్దరి వయసు తక్కువ. అంతేకాకుండా ఈ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇది పూర్తిగా బ్రహ్మవివాహ చట్టానికి వ్యతిరేకం. దీంతో బ్రహ్మ సమాజంలో మరో చీలిక వచ్చింది. ఆనందమోహన్ బోస్ నాయకత్వంలో సాధారణ బ్రహ్మసమాజాన్ని స్థాపించారు.
దక్షిణ భారతదేశంలో మన్నవ బుచ్చయ్య పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటివారు బ్రహ్మ సమాజ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

 

ఆర్య సమాజం

   ఆర్య సమాజ స్థాప‌కుడు స్వామి దయానంద సరస్వతి. ఆయన అసలు పేరు మూల్‌శంకర్. 1824లో గుజరాత్‌లోని మోర్వి సమీపంలోని టంకారా అనే ప్రదేశంలో జన్మించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో విరజానందుడు అనే అంధ సన్యాసి దగ్గర వేదాలు, ధర్మ శాస్త్రాలు, స్మృతులు అభ్యసించారు. దయానంద సరస్వతి 1875, ఏప్రిల్ 10న బొంబాయిలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. విరజానందుడు హిందూమతంలోని దురాచారాలను తొలగించాలని దయానందుడిని కోరారు. వేదాలకు తిరిగి వెళదాం.. మొత్తం జ్ఞానానికి వేదాలే ఆధారం.. అనేవి వీరి నినాదాలు. తర్వాతి కాలంలో పంజాబ్‌లోని లాహోర్ ఆర్య సమాజ ప్రధాన కేంద్రంగా మారింది. ఆర్య సమాజం సిద్ధాంతాలను పంజాబ్‌లో ప్రచారం చేయడంలో దయానందుడు సఫలీకృతుడయ్యాడు. అలాగే ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా కొంతవరకు ఆర్య సమాజ ప్రభావం వ్యాపించింది.
హిందూ మతంలో విగ్రహారాధన, మూఢ విశ్వాసాలకు కారణమైన పురాణాలను దయానందుడు తిరస్కరించాడు. ఆర్యసమాజం వైదిక మతాన్ని పునరుద్ధరించి, జాతీయతా భావాన్ని పెంపొందించడానికి కృషి చేసింది. పాశ్చాత్య విద్యావిధానం వ్యాప్తికి తోడ్పడింది. బాలబాలికలకు విద్యనందించడానికి ఆర్యసమాజం దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) పాఠశాలలను స్థాపించింది. చాతుర్వర్ణ విధానం జన్మ ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఉండాలని ఈ సమాజం భావించింది. సామాజిక, విద్యా రంగాల్లో స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని కోరింది. అంటరానితనం, కుల వ్యత్యాసాలు, బాల్య వివాహాలను వ్యతిరేకించింది. వితంతు పునర్వివాహాలు, కులాంతర వివాహాలను సమర్థించింది.
ఆర్య సమాజం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు వివాదాస్పదమయ్యాయి. వీటిలో మొదటిది - 1882లో దయానందుడు ప్రారంభించిన గోరక్ష ఉద్యమం. గోరక్షణ కోసం నిధులు సేకరించి, గోవులను వధించకుండా అడ్డుకోవడం లాంటి కార్యకలాపాలను చేపట్టారు. ఇది హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.
రెండోది - ఇతర మతాల్లోకి చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి దయానందుడు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీలు ఎక్కువ సంఖ్యలో హిందువులను, ముఖ్యంగా అణగారిన వర్గాలవారిని క్రైస్తవ మతంలోకి మార్చాయి. వీరిని తిరిగి హిందువులుగా మార్చడానికి చేసిందే శుద్ధి ఉద్యమం.

 

రామకృష్ణ మిషన్, మఠం

    వివేకానందుడు 1897లో పశ్చిమ బెంగాల్‌లోని బేలూరు కేంద్రంగా రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం సమాజసేవ చేయడం. దీనిద్వారా అనేక పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, అనాథ శరణాలయాలను స్థాపించి, పేద ప్రజలకు సహాయం చేశారు. ఆయన 1887లో పశ్చిమబెంగాల్‌లోని బారానగర్‌లో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీనిద్వారా తన గురువైన             రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేశారు. 1898 నుంచి రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలకు బేలూరు ప్రధాన కేంద్రం అయ్యింది.
రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ. ఆయన 1836లో పశ్చిమబెంగాల్, హుగ్లీ జిల్లాలోని కామర్‌పుకుర్ అనే గ్రామంలో జన్మించారు. మానవ సేవే మాధవ సేవ అనేది రామకృష్ణుడి నినాదం. వేదాంత, ఉపనిషత్తుల నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. రామకృష్ణుడికి సూఫీ మత గురువు ఇస్లాం మతదీక్షను అనుగ్రహించారు. కాళీమాత, కృష్ణుడు, బుద్ధుడు, సిక్కు గురువులను ఆయన పూజించేవారు. బైబిల్ పఠనాన్ని వినేవారు.
వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన కలకత్తాలో 1863లో జన్మించారు. మొదటిసారి 1881లో రామకృష్ణ పరమహంసను కలిశారు. భారతదేశం మొత్తం కాలినడకన ప్రయాణించి, ప్రజల వాస్తవ స్థితిగతులను తెలుకున్నారు.
వివేకానందుడు మానవులందరిలో దైవత్వం ఉందని, ప్రతి వ్యక్తిలోనూ శక్తి సామర్థ్యాలున్నాయని, ఎవరినీ తక్కువగా చూడరాదని బోధించారు. అనారోగ్యం కారణంగా అతి చిన్న వయసులోనే (1902) ఆయన మృతి చెందారు.

 

దివ్యజ్ఞాన సమాజం

     రష్యాకు చెందిన హెచ్.పి.బ్లావట్‌స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ 1875లో న్యూయార్క్‌లో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. వీరు 1879లో భారతదేశానికి వచ్చి, 1882లో మద్రాసు సమీపంలోని అడయార్ వద్ద దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు.
ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ లండన్‌లోని దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలిగా చేరారు. ఆమె 1893లో మనదేశానికి వచ్చి, 1907లో ఆల్కాట్ మరణం తర్వాత దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు. విశ్వమానవులందరిలో సోదర భావాన్ని పెంపొందించడం, ప్రాచీన మతాల అధ్యయనాన్ని ప్రోత్సహించడం ఈ సమాజం ప్రధాన లక్ష్యాలు.
హిందూ మతసూత్రాలను బోధించడానికి అనిబిసెంట్ 1898లో వారణాసిలో సెంట్రల్ హిందూ స్కూల్‌ను ప్రారంభించారు. తర్వాతి కాలంలో మదన్‌మోహన్ మాలవీయ కృషి ఫలితంగా ఇది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా (1916) అభివృద్ధి చెందింది.

 

అలీగఢ్ ఉద్యమం

ఉత్తర ప్రదేశ్‌లోని బరేలికి చెందిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. హేతువాదం ప్రాతిపదికగా ఇస్లాం మతాన్ని సమర్థిస్తూనే, ముస్లిం సమాజంలోని బహు భార్యత్వాన్ని, బానిస వ్యవస్థను విమర్శించారు. ముస్లింలకు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో 1875లో అలీగఢ్‌లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. అది 1920లో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది.
 

ముఖ్యాంశాలు

* రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని 1828లో స్థాపించాడు.
మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదు ఇచ్చాడు.
* స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఆయన అసలు పేరు మూల్‌శంకర్.
* వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన 1863లో జన్మించారు. 1881లో రామకృష్ణ పరమహంసను తొలిసారి కలిశారు.
* వివేకానందుడి గురువైన రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ ఆయన 1836లో జన్మించారు.
* వివేకానందుడు రామకృష్ణ మఠం (1887), రామకృష్ణ మిషన్ (1897)లను స్థాపించాడు.
* 1875లో దివ్యజ్ఞాన సమాజాన్ని రష్యాకు చెందిన హెచ్.పి. బ్లావట్‌స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ స్థాపించారు.
ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ 1893లో భారతదేశానికి వచ్చారు. 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు.

 

 

మాదిరి ప్రశ్నలు

 

1. క్రైస్తవ మత ప్రచారకుడైన అలెగ్జాండర్ డఫ్ చేసిన హిందూ మత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టిందెవరు?
ఎ) దేవేంద్రనాథ్ ఠాగూర్ బి) కేశవచంద్ర సేన్ సి) దయానందుడు డి) రామ్మోహన్ రాయ్
జ: (ఎ)

 

2. 'వేదాంత సూత్రాలు' గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వ్యక్తి ఎవరు?
ఎ) వివేకానందుడు బి) వీరేశలింగం సి) దేవేంద్రనాథ్ ఠాగూర్ డి) రాధాకాంత్ దేవ్
జ: (ఎ)

 

3. కామన్వెల్త్ పత్రికను స్థాపించింది ఎవరు?
ఎ) తిలక్ బి) బిపిన్‌చంద్రపాల్ సి) అనిబిసెంట్ డి) గాంధీజీ
జ: (సి)

 

4. శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) రామ్మోహన్ రాయ్ బి) వివేకానందుడు సి) దయానందుడు డి) కేశవచంద్ర సేన్
జ: (సి)

 

5. ఆర్య సమాజ ప్రభావం ఏ రాష్ట్రంపై ఎక్కువ?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) మహారాష్ట్ర సి) పంజాబ్ డి) గుజరాత్
జ: (సి)

 

6. రామకృష్ణ పరమహంస భార్య పేరేమిటి?
ఎ) శారదాప్రియ బి) శారదామణి సి) శ్రీలత డి) హర్షిత
జ: (బి)

 

7. కింది వారిలో పశ్చిమ భారతదేశంలో పునరుజ్జీవన పితగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు?
ఎ) ఎం.జి. రనడే బి) బి.ఎం. మలబారి సి) ఆర్.జి. భండార్కర్ డి) కె.టి. తెలాంగ్
జ: (ఎ)

 

8. ఉత్తర భారతదేశ హిందూ లూథర్‌గా ప్రసిద్ధిచెందిన వ్యక్తి ఎవరు?
ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బి) దయానందుడు సి) రాధాకాంత్ దేవ్ డి) కేశవచంద్ర సేన్
జ: (బి)

 

9. శ్రద్ధానందుడు గురుకుల విద్యాల యాలను ఎక్కడ ప్రారంభించాడు?
ఎ) లాహోర్ బి) బొంబాయి సి) హరిద్వార్ డి) కలకత్తా
జ: (సి)

 

10. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను ఎవరు స్థాపించారు?
ఎ) దయానందుడు బి) వివేకానందుడు సి) కేశవచంద్ర సేన్ డి) రామ్మోహన్ రాయ్
జ: (సి)

 

 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బ్రిటిష్ హయాంలో శిస్తు విధానాలు

 


     బ్రిటిష్ హయాంలో అమలు చేసిన భూమిశిస్తు విధానాలు భారత రైతుల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేశాయి. వ్యవసాయమే ప్రజల ప్రధాన జీవనాధారమైన రోజుల్లో.. ఆంగ్లేయుల శిస్తు విధానాలు గ్రామీణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపాయి. భారత్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 3 రకాల శిస్తు విధానాలు అమలు చేయగా.. కొద్దో గొప్పో రైతులకు భూ యాజమాన్య హక్కులను కల్పించడం మినహా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఏ విధానమూ దోహదపడలేదు. జమీందార్లకు, బ్రిటిషర్లకు మాత్రం సంపద వనరులుగా ఆ విధానాలు మారాయి. బ్రిటిష్ కాలంలోని భూమిశిస్తు విధానాలు, వాటి ప్రభావ ఫలితాలపై అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
    బ్రిటిష్‌వారు రాక ముందు భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితం. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే. వస్త్రాలు, పంచదార, నూనె పరిశ్రమలు వ్యవసాయంపై ఆధారపడి ఉండేవి. బ్రిటిష్ పాలన ప్రారంభమైన 50 సంవత్సరాలకే భూయాజమాన్యం, భూమిశిస్తు మదింపు - వసూలు పద్ధతులు స్వయం సమృద్ధిగా ఉన్న భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి.

 

జమీందారీ / శాశ్వత శిస్తు విధానం

ఈ విధానాన్ని బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి డివిజన్, ఉత్తర కర్ణాటకల్లో అమలు చేశారు. బ్రిటిష్ ఇండియా మొత్తం భూభాగంలో ఈ విధానం 19 శాతం అమలైంది. ఈ పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వం జమీందారులనే ఒక కొత్త తరగతిని సృష్టించి వారిని భూయజమానులుగా ప్రకటించింది. వారు భూమి శిస్తును వసూలు చేసి, అందులో 1/10 నుంచి 1/11వ వంతు తమ వాటాగా తీసుకుని, మిగిలిన మొత్తాన్ని కంపెనీ ప్రభుత్వానికి అందజేయాలి. ఈ విధానంలో జమీందారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూమిశిస్తును నిర్ణయించారు. అయితే జమీందారులు కౌలు రైతుల నుంచి వసూలు చేసే భాటక రేటును మాత్రం నిర్ణయించలేదు. దీన్ని జమీందారుల ఇష్టానికే వదలిపెట్టారు. ఈ నిర్ణయం జమీందారులు రైతులను వీలైనంత ఎక్కువగా దోచుకోవడానికి అవకాశం కల్పించింది. జనాభా, వ్యవసాయ భూమి, ధరలు పెరగడంతో జమీందారుల పరిస్థితి మెరుగుపడింది. కొత్త జమీందారుల్లో ఎక్కువమంది పాత భూయాజమాన్య తరగతికి చెందినవారు కారు. పాత జమీందారులను మోసగించిన సేవకులు, కంపెనీ ప్రభుత్వంతో సంబంధమున్న ఏజెంట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోని గుమస్తాలు, వ్యాపారులు, న్యాయవాదులు లాంటివారంతా జమీందారులుగా మారారు.
ఈ విధానంలో జమీందారులు ప్రభుత్వానికి నిర్ణీత భూమిశిస్తును క్రమం తప్పకుండా చెల్లించాలి. జమీందారులు చెల్లించాల్సిన శిస్తును పెంచే అధికారం ప్రభుత్వానికి లేదు. అలాగే ఈ శిస్తు చెల్లింపులో ఎలాంటి మినహాయింపు లేదా వాయిదా వేయడానికి అవకాశం లేదు. ఈ చర్యలు.. భూస్వాములు బీడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చి ఉత్పత్తిని పెంచడానికి, ప్రభుత్వానికి శాశ్వత ఆదాయాన్ని సమకూర్చడానికి దోహదపడతాయని కారన్ వాలీస్ వాదించాడు. అయితే జమీందారుల వారసత్వ హోదాను అంగీకరించడం ద్వారా వ్యవసాయదారుల ప్రయోజనాలను పూర్తిగా పక్కకు నెట్టేశారు. భూస్వాముల దయాదాక్షిణ్యాలపై రైతులు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కారన్ వాలీస్ అభిప్రాయాలను అతడి సలహాదారులైన జాన్ షోర్, చార్లెస్ గ్రాంట్ లాంటివారు వ్యతిరేకించారు. భూమిశిస్తు మదింపునకు ముందు సమగ్ర సర్వే చేపట్టాలని షోర్ భావించాడు. కారన్ వాలీస్ తర్వాత గవర్నర్ జనరల్ అయిన షోర్ శాశ్వత శిస్తు విధాన మొదటి దశ ఫలితాలకు సాక్షిగా నిలిచాడు. జమీందారులు భూమి నుంచి వచ్చే ఆదాయంలో అధిక భాగం అనుభవించడంతో.. కౌలుదారుల ఆర్థిక పరిస్థితి దిగజారింది. వారు పేదరికంతో సతమతమయ్యారు. సరైన ఎరువులు, విత్తనాలు వాడకపోవడంతో వ్యవసాయం దెబ్బతింది. జాతీయవాదులతోపాటు, బ్రిటిష్ విద్యావేత్తలు జమీందారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ దుస్థితిని, కౌలు రైతుల పేదరికాన్ని గుర్తించారు.

 

రైత్వారీ విధానం

బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన మరో భూమిశిస్తు విధానం రైత్వారీ విధానం. ఈ పద్ధతిని థామస్ మన్రో, కెప్టెన్ రీగ్ మొదట తమిళనాడులో ప్రవేశపెట్టారు. నెమ్మదిగా ఈ విధానం మహారాష్ట్ర, తూర్పు బెంగాల్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కూర్గ్‌లకు విస్తరించింది. ఈ విధానంలో రైతులకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించారు. వారు నేరుగా ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లించాలి. ఈ విధంగా రైతులకు యాజమాన్య హక్కులు లభించాయి. భూమిని కొలిచి ఉత్పత్తిని అంచనా వేయడం, ఉత్పత్తిలో 55 శాతాన్ని ప్రభుత్వ డిమాండ్‌గా నిర్ణయించడం ఈ విధానంలో ప్రధాన లక్షణాలు. ఈ విధానం కూడా క్షేత్రస్థాయిలో రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసింది. రైత్వారీ విధానంలో జమీందారులకు బదులు రైతే భూమి యజమాని అయినప్పటికీ.. రైతు పరిస్థితిని మెరుగుపరచడంలో ఈ విధానం విఫలమైంది. ప్రభుత్వం రైతుల నుంచి శిస్తు రూపంలో అధికంగా వసూలు చేయడంతో భూమి విలువ పడిపోయింది. కఠిన భూమిశిస్తు విధానం వల్ల రైతులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేయడంతో రైతులు అప్పుపై వడ్డీ మాత్రం అతి కష్టం మీద చెల్లించేవారు.
ప్రధాన లక్ష్యాలు: క్రమం తప్పకుండా భూమిశిస్తు వసూలు చేయడం, రైతుల పరిస్థితిని మెరుగుపరచడం అనేవి ప్రధాన లక్ష్యాలు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితి మారలేదు. రైతు భూమిశిస్తు చెల్లించినంత కాలం అతడిని తొలగించడానికి వీల్లేదన్నది ఈ విధానంలోని ఒక నిబంధన. అయితే అధిక భూమిశిస్తును చెల్లించడం రైతుకు ఇబ్బందికరంగా మారింది. థామస్ మన్రో భూమిశిస్తుగా నిర్ణీత మొత్తాన్ని వసూలు చేసి.. అదనంగా వచ్చే ఆదాయం రైతుకే చెందాలని భావించాడు. 1855 తర్వాత రెవెన్యూ అధికారులు భూమిశిస్తును తమ ఇష్టానుసారం నిర్ణయించారు. దీంతో వ్యవసాయ దిగుబడి తగ్గింది. వ్యవసాయదారులు అప్పుల పాలయ్యారు.

 

మహల్వారీ విధానం

జమీందారీ, రైత్వారీ విధానాలు పాలకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో.. వాటి స్థానంలో మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ విధానంలో భూమిశిస్తు మదింపునకు ఆధారం మహల్ లేదా ఎస్టేట్ నుంచి వచ్చే ఉత్పత్తి. ఈ మహల్‌లోని యజమానులంతా సంయుక్తంగా ప్రభుత్వానికి భూమిశిస్తు చెల్లించడానికి బాధ్యత వహించాలి. యజమానుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఎంపిక చేసిన వారి ప్రతినిధులు మహల్ నిర్వహణ, శిస్తు చెల్లింపునకు బాధ్యులుగా ఉంటారు. ఇందులో యాజమాన్య హక్కులు రైతులకు వ్యక్తిగతంగా ఉంటాయి. కానీ ప్రభుత్వానికి శిస్తు చెల్లించే బాధ్యత మాత్రం రైతులందరికీ సంయుక్తంగా ఉంటుంది. గ్రామం మొత్తం ఆ గ్రామపెద్ద ద్వారా భూమి శిస్తును చెల్లిస్తారు. ఈ విధానాన్ని మొదట ఆగ్రా, అవధ్‌లో ప్రవేశపెట్టారు. తర్వాత యునైటెడ్ ప్రావిన్స్‌లోని మిగతా ప్రాంతాలకు విస్తరించారు.
ఈ పద్ధతిలో.. జమీందారీ విధానంలో మాదిరిగా ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం సమకూరుతుంది. అలాగే రైత్వారీ విధానంలో మాదిరిగా రైతుకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి, రైతుకు మధ్య లంబార్దార్ల(మధ్యవర్తులు)ను సృష్టించినా వీరికి బెంగాల్ జమీందారుల్లా పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వలేదు. అయితే అమల్లో ఈ విధానం కూడా పెద్ద రైతులకే మేలు చేసింది. దీంతో భూస్వాములు, రైతుల మధ్య సాంఘిక, ఆర్థిక అసమానతలు పెరిగాయి. రైతుల పరిస్థితి ఆర్థికంగా బాగా దిగజారింది. రైతుల నుంచి శిస్తు ఎక్కువగా వసూలు చేశారు. దీనివల్ల వ్యవసాయం అభివృద్ధి చెందలేదు. ఇది తాత్కాలిక విధానం కావడం వల్ల స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. చివరకు ఈ విధానం గ్రామీణ సమూహాలు విచ్ఛిన్నం కావడానికి కారణమైంది.

 

శిస్తు విధాన ఫలితాలు

ఈ శిస్తు విధానాలు బ్రిటిష్‌వారు సృష్టించిన భూస్వాములకు శిస్తు వసూలు అధికారాన్ని కట్టబెట్టడానికి ఎక్కువ శ్రద్ధ చూపాయి. ఈ భూస్వాములు వ్యవసాయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వీరు విదేశీ పాలకుల ఏజెంట్లుగా వ్యవహరించారు. ప్రభుత్వానికి నిర్ణీత భూమిశిస్తును చెల్లించి రాజకీయంగా రక్షణ లేని, ఆర్థికంగా బలహీనులైన రైతులను దోచుకునే హక్కును పొందారు. నూతన సామాజిక తరగతులకు చెందిన భూస్వాములు, వర్తకులు, వడ్డీ వ్యాపారులకు ప్రాధాన్యం పెరిగింది. బ్రిటిష్ రెవెన్యూ విధానం 19వ శతాబ్దంలో వాణిజ్య పరమైన వ్యవసాయాన్ని పెంపొందించింది. దేశంలో జనాభా క్రమంగా పెరిగింది. దీనివల్ల భూమి మీద ఒత్తిడి పెరిగింది. కుటీర పరిశ్రమలు నాశనం కావడం కూడా దీనికి తోడైంది. బలమైన చట్టాలను ప్రవేశపెట్టడం, న్యాయస్థానాల ఏర్పాటు, కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడటం, బ్రిటిష్ వస్తువుల దిగుమతులు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో బయటి వ్యక్తుల జోక్యం బాగా పెరిగింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వయం సమృద్ధి క్రమంగా కనుమరుగైంది. గ్రామాల్లో అధికారం క్రమంగా గ్రామపెద్దల నుంచి ప్రభుత్వ ఏజెంట్ల చేతిలోకి మారింది. బ్రిటిష్‌వారి నూతన భూమిశిస్తు విధానాలు రైతులు పండించే పంట రకాలపై ప్రభావం చూపాయి. బ్రిటిష్‌వారు రాకముందు రైతులు పండించిన పంటను తమ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత భూమిశిస్తును నగదు రూపంలో చెల్లించాల్సి వచ్చింది. దీంతో రైతులు పంటను మార్కెట్‌లో విక్రయించి, వచ్చిన డబ్బుతో శిస్తు చెల్లించడం ప్రారంభించారు. గ్రామాల్లో రైతులు తమ భూమిలో పండించడానికి అనువైన ఏదో ఒక పంటను ఎన్నుకునేవారు. వీటిలో పత్తి, జనుము, గోధుమ, చెరకు, నూనెగింజలు, నీలిమందు, నల్లమందు మొదలైనవి ప్రధానంగా ఉండేవి. దీంతో భారతీయ రైతు అంతర్జాతీయ పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి దళారులపై ఆధారపడాల్సి వచ్చింది.
 

జమీందారీ విధానం

రాబర్ట్ క్లైవ్ 1765లో బెంగాల్‌లో దివానీ (రెవెన్యూ వసూలు) హక్కును పొందిన తర్వాత.. సంవత్సరానికి ఒకసారి భూమిశిస్తు నిర్ణయించే పద్ధతి అమల్లో ఉండేది. వారన్ హేస్టింగ్స్ దీన్ని 5 సంవత్సరాలకు మార్చాడు. అయితే మళ్లీ సంవత్సరానికి ఒకసారి నిర్ణయించే పద్ధతినే అనుసరించాడు. కారన్ వాలీస్ కాలంలో 1790, ఫిబ్రవరి 10న పది సంవత్సరాలకు ఒకసారి భూమిశిస్తును నిర్ణయించే విధానాన్ని ప్రకటించాడు. మూడేళ్ల తర్వాత ఈ విధానాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారు. తర్వాత దీన్నే 1793, మార్చి 22న 'శాశ్వత శిస్తు నిర్ణయ విధానం'గా ప్రకటించారు. ఈ పద్ధతిని మొదట బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో ప్రవేశపెట్టారు. శాశ్వత శిస్తు నిర్ణయాన్ని జమీందారులతో చేసుకోవడం వల్ల దీనికి 'జమీందారీ విధానం' అనే పేరు వచ్చింది. ఈ విధానంలో ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందారులను భూయజమానులుగా గుర్తించి, భూమిశిస్తు వసూలు చేసే అధికారాన్ని వారికి శాశ్వతంగా కట్టబెట్టింది.

 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బ్రిటిష్ పాలనలో రైతు ఉద్యమాలు

 

      బ్రిటిష్ హయాంలో పరిపాలనా విధానం గ్రామీణ భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. వ్యవసాయ రంగంలో కొత్తగా భూమిశిస్తు విధానాలు వచ్చాయి. దాంతో నూతన సామాజిక తరగతులు ఆవిర్భవించాయి. జమీందార్లు, వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి రైతులు వెళ్లిపోయారు. బ్రిటిష్ పాలన ప్రారంభమైన కొన్ని దశాబ్దాల్లోనే రైతులు అణిచివేతకు, దోపిడీకి గురయ్యారు.
భూమిశిస్తును పెంచడం, వడ్డీ వ్యాపారుల దురాగతాలు, తోటల యజమానుల దోపిడీ లాంటి వాటికి వ్యతిరేకంగా రైతులు నిరసనలు, తిరుగుబాట్లు, ఉద్యమాలు చేపట్టారు. ఇవి ప్రధానంగా భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, విదేశీయులకు వ్యతిరేకంగా జరిగాయి. ఈ ఉద్యమాలు స్థానిక సమస్యల నుంచి ఉద్భవించాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, నాయకత్వ లేమి కారణంగా ఇవి దేశవ్యాప్త ఉద్యమాలుగా అవతరించలేకపోయాయి.

 

ఫకీర్ సన్యాసి తిరుగుబాట్లు

      బిక్షాటనతో జీవించే ఫకీర్లు, సన్యాసులకు బెంగాల్‌లో సంభవించిన తీవ్ర కరవు వల్ల ఆహారం దొరకలేదు. దీంతో సన్యాసులు బలవంతంగా ఆహారాన్ని పొందేందుకు ప్రయత్నించారు. 1770లో సంభవించిన గొప్ప కరవు తర్వాత వారు బెంగాల్‌పై దాడులు చేశారు. వీరితో పేద రైతులు, భూములు కోల్పోయిన భూస్వాములు, ఉద్యోగాలు కోల్పోయిన సైనికులు జత కలిశారు. బ్రిటిష్‌వారు ఈ తిరుగుబాట్లను అణిచివేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ తిరుగుబాటుకు మంజు షా ఫకీర్ నాయకత్వం వహించాడు.
 

సంతాలుల తిరుగుబాటు (1855-56)

    శాంతికాముకులైన సంతాలులు మన్‌భం, బరాభం, హజారీభాగ్, మిడ్నాపూర్, బంకూర ప్రాంతాలకు చెందినవారు. శాశ్వత శిస్తు విధానం వల్ల వీరు తాము సాగుచేస్తున్న భూములను జమీందారులకు అప్పగించాల్సి వచ్చింది. జమీందారులు ఎక్కువ భాటకం డిమాండ్ చేయడంతో వారు తమ పూర్వీకులకు చెందిన ఇళ్లను వదలి రాజ్‌మహల్ కొండల ప్రాంతానికి చేరారు. అక్కడ అడవులను తొలగించి వ్యవసాయ భూమిగా మార్చారు. దీంతో దురాశపరులైన జమీందారులు ఈ భూమిని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నించారు.
   1855 జూన్‌లో సంతాలులు సిద్ధు, కన్హు సోదరుల నాయకత్వంలో తమ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని, సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని నిశ్చయించుకున్నారు. 1856 ఫిబ్రవరిలో బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు నాయకులను అరెస్ట్ చేసి, తిరుగుబాటును క్రూరంగా అణిచివేసింది. సంతాలులకు ప్రత్యేకంగా సంతాల్ పరగణాను ఏర్పాటు చేయడం ద్వారా వారిని తమ దారిలోకి తీసుకొచ్చింది.

 

1857 తిరుగుబాటులో రైతుల పాత్ర

   అవధ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతులు జమీందారుల అణిచివేత విధానాలను పక్కనపెట్టి వారితో కలిసి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ తిరుగుబాటులో క్రియాశీలకంగా పనిచేసిన రైతుల యాజమాన్య హక్కులను రద్దు చేస్తామని అప్పటి గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించడం ద్వారా ఈ తిరుగుబాటులో రైతులు పాల్గొనకుండా చేశారు.
 

నీలిమందు తిరుగుబాటు (1859-60)

   ఐరోపాకు చెందిన నీలిమందు తోటల యజమానులు అంతగా ఆదాయం లేని నీలిమందును కొంత భూమిలో సాగుచేయాలని తూర్పు భారతదేశంలోని రైతులను బలవంతపెట్టారు. ఎదురించిన రైతులను అపహరించడం, అక్రమంగా నిర్బంధించడం, మహిళలు.. పిల్లలపై దాడి చేయడం, పశువులను ఎత్తుకెళ్లడం, పంటలను నాశనం చేయడం లాంటి అకృత్యాలకు పాల్పడ్డారు. చివరగా 1860లో నీలిమందు పండించకూడదని రైతులు నిర్ణయించి, ఉద్యమం చేపట్టారు. నాడియా జిల్లాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అచిర కాలంలోనే బెంగాల్ మొత్తానికి వ్యాపించింది. రైతులు నీలిమందు పరిశ్రమలపై, పోలీసులపై దాడులు చేశారు. రైతులు సమ్మె చేయడమే కాకుండా న్యాయస్థానంలో కేసులు వేయడానికి కావాల్సిన సొమ్మును విరాళాల ద్వారా సేకరించారు. నీలిమందు తోటల యజమానుల ఇళ్లలో పనిచేసేవారిని బలవంతంగా వారికి సేవలందించకుండా చేశారు. నీలిమందు రైతుల ఉద్యమానికి హరీశ్‌చంద్ర ముఖర్జీ (హిందూ పేట్రియాట్ పత్రిక సంపాదకులు) మద్దతు తెలిపారు. దీన్‌బంధు మిత్ర రచించిన 'నీల్‌దర్బణ్‌'లో తోటల యజమానుల అకృత్యాలను చక్కగా వివరించారు. భారతదేశంలో ఇది మొదటి రైతుల సమ్మె. 1867-68లో బిహార్‌లోని చంపారన్‌లో ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది.
 

దక్కను తిరుగుబాట్లు (1874-75)

మహారాష్ట్రలోని పుణె, అహ్మద్‌నగర్ జిల్లాల్లో రైత్వారీ విధానం అమల్లో ఉండేది. ఇక్కడ భూమి శిస్తు ఎక్కువగా ఉండేది. వరుసగా కరవులు సంభవించినా రైతులు భూమిశిస్తును తప్పనిసరిగా చెల్లించాలి. అమెరికాలో అంతర్యుద్ధం కారణంగా 1860-64 మధ్యలో పత్తి రైతులు తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా లాభాలు ఆర్జించారు. అయితే 1864లో అంతర్యుద్ధం ముగియడం, ఐరోపా ఖండం నుంచి పత్తి ఎగుమతులు పునఃప్రారంభమవడంతో భారతదేశంలో పత్తి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా ఇక్కడి రైతులు అప్పు కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చింది. వడ్డీ వ్యాపారులు రుణం కోసం భూములను తాకట్టు పెట్టమని రైతులను బలవంతపెట్టారు. రుణ విముక్తి కోసం వారి మహిళల మానాన్ని ఫణంగా పెట్టాల్సి వచ్చింది.
1874లో మరాఠా రైతులు ఆరు తాలుకాల్లోని 33 ప్రదేశాల్లో తిరుగుబాట్లు చేశారు. ఈ సందర్భంగా రుణానికి సంబంధించిన పత్రాల (బాండ్ల)ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు నిరాకరించినప్పుడు మాత్రమే హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అయితే ఈ తిరుగుబాట్లను పోలీసులు, సైన్యం సహకారంతో అణిచివేశారు. ప్రభుత్వం ఈ తిరుగుబాట్ల స్వభావం, కారణాలను అధ్యయనం చేయడానికి ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగా 1879లో ఒక చట్టం చేసింది. దీని ప్రకారం రైతుల భూముల అన్యాక్రాంతంపై పరిమితులు విధించడమే కాకుండా సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను సవరించింది. రైతులు రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే నిర్బంధించడానికి, జైలుకు పంపడానికి వీల్లేకుండా చట్టం చేసింది.

 

రామోసీల తిరుగుబాటు

     మహారాష్ట్రలోని రామోసీలు మరాఠాల పాలనలో చిన్న స్థాయి పోలీసు ఉద్యోగాలు చేసేవారు. మరాఠా రాజ్య పతనం తర్వాత వారు తిరిగి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అయితే అధిక భూమిశిస్తు వల్ల వారు ఇబ్బందుల పాలయ్యారు. 1822లో చిట్టూర్‌సింగ్ నాయకత్వంలో రామోసీలు తిరుగుబాటు చేసి మరాఠా ప్రాంతాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అనేక కోటలను నాశనం చేశారు. 1825లో వచ్చిన కరవు వల్ల 1826లో డోమాజి నాయకత్వంలో మరోసారి తిరుగుబాటు చేశారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం వారికి భూములు ఇవ్వడమే కాకుండా పోలీసు ఉద్యోగాలను ఇచ్చింది.
    1876-78లో సంభవించిన గొప్ప కరవు వల్ల పశ్చిమ భారతదేశం అతలాకుతలమైంది. దీంతో ఈ ఇబ్బందులన్నింటికీ విదేశీ పాలనే కారణమని భావించిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ప్రభుత్వం ఫాడ్కేను 1880లో అరెస్ట్ చేసింది. అతడు 1883లో జైలులోనే మరణించాడు.

 

పబ్నా తిరుగుబాటు

   1859 చట్టం రైతులకు తాము సాగుచేసే భూమిపై స్వాధీన హక్కులను ఇచ్చింది. తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లోని శాశ్వత శిస్తు విధానం అమల్లో ఉన్న భూభాగాల్లోని జమీందారులు.. రైతులకు స్వాధీన హక్కులు లేకుండా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నించారు. దీంతో తూర్పు బెంగాల్‌లోని అనేక జిల్లాలో రైతులు జమీందారులకు వ్యతిరేకంగా 1870-1885 మధ్యకాలంలో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లకు కేంద్ర బిందువు పబ్నా జిల్లా. ఇక్కడి రైతులు జనపనార పండించి అధిక లాభాలు సంపాదించారు. వారు 1873 మేలో ఒక లీగ్‌గా ఏర్పడి జమీందారుల అన్యాయమైన డిమాండ్లను వ్యతిరేకించారు. కోర్టు ఖర్చుల నిమిత్తం విరాళాలు సేకరించడమే కాకుండా గ్రామాల్లో సమావేశాలను నిర్వహించి పన్నులు చెల్లించవద్దని రైతులను కోరారు. వీరు ప్రధానంగా న్యాయపోరాటాన్ని శాంతియుతంగా చేశారు. ఈ ఉద్యమంలో రెండు ప్రధాన లక్షణాలు..1.కిసాన్ సభ లేదా రాజకీయ పార్టీలు రైతు ఉద్యమాలు చేపట్టక ముందే వీరు ఒక గ్రూపుగా ఏర్పడి జమీందారులకు వ్యతి రేకంగా ఉద్యమించడం. 2.మెజారిటీ జమీందారులు హిందువులైనా, ముస్లిం రైతులతోపాటు హిందూ రైతులు కలిసి జమీందారులకు వ్యతిరేకంగా పోరాడటం. దీనికి ముఖ్య నాయకులు షా చంద్రరాయ్, శంభు పాల్, ఖాది మొల్లా. ఈ ఉద్యమ ఫలితంగా 1885లో ప్రభుత్వం బెంగాల్ కౌలుదారుల చట్టాన్ని చేసింది.
 

పాగల్ పంతి తిరుగుబాటు

    వీరు తూర్పు బెంగాల్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాకు చెందిన హజోంగ్, గరో తెగలకు చెందినవారు. పాగల్ పంతి తిరుగుబాటును ప్రారంభించినవాడు కరమ్ షా. ఇతడి కుమారుడైన టిపు రాజకీయ, మతపరమైన లక్ష్యాలతో ప్రభావితుడై ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. ఇతడు జమీందారులకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటుచేసి, దాడులు చేయడం ద్వారా ధనం సేకరించాడు. 1825 జనవరిలో తన సైన్యంతో జమీందారుల ఇళ్లపై దాడి చేయడంతో, వారు బ్రిటిష్ అధికారుల వద్ద ఆశ్రయం పొందారు. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడానికి టిపు డిమాండ్లను అంగీకరించింది. పాగల్ పంతి తిరుగుబాటు 1825-35 మధ్య కొనసాగింది. చివరికి సైన్యం సాయంతో ప్రభుత్వం దీన్ని అణిచివేసింది.
 

పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టం (1900)

    గ్రామీణ రుణగ్రస్థత, వ్యవసాయ భూమి వ్యసాయేతర తరగతులకు అన్యాక్రాంతం కావడం 19వ శతాబ్దం చివరి భాగంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరిణామం. బెంగాల్, మహారాష్ట్రలలో రైతుల ఉద్యమాలను ఎదుర్కొన్న ప్రభుత్వం పంజాబ్‌లో అలాంటి పరిస్థితి రాకముందే రైతుల సమస్యలను పరిష్కరించాలని భావించింది. వివిధ మతాలకు చెందినవారు పంజాబ్‌లో ఉండటం, సిక్కుల వీరత్వం.. ప్రభుత్వాన్ని ఇలాంటి చర్యలు చేపట్టేలా ప్రేరేపించాయి. 1895లో భారత ప్రభుత్వం వ్యవసాయ భూమి అన్యాక్రాంతం కాకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్‌ను జారీ చేసింది. 1896-97, 1899-1900లలో సంభవించిన తీవ్ర కరవుతో సమస్య మరింత జఠిలమైంది. దీంతో 1900లో పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టాన్ని ప్రయోగాత్మక చర్యగా చేసింది. పంజాబ్‌లో ఈ చట్టం విజయవంతంగా పనిచేస్తే.. దీన్ని దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ చట్టం ద్వారా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర తరగతి వారికి అమ్మడం లేదా తాకట్టు పెట్టడాన్ని నిషేధించింది.
   కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకంజ వేసింది. గాంధీజీ రాకతో రైతుల డిమాండ్లకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రైతులను ఉద్యమంలో భాగస్వాములుగా చేసింది. గాంధీజీ నాయకత్వం వహించిన మొదటి రెండు ఉద్యమాలు రైతుల సమస్యలకు సంబంధించినవే కావడం విశేషం. ఈ రెండూ విజయవంతం కావడంతో అనంతరం గాంధీజీ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక నేతగా ఎదిగారు.

 

చంపారన్ సత్యాగ్రహం

   19వ శతాబ్దంలో బీహార్‌లోని చంపారన్‌లో రైతులు తమ భూమిలో 3/20 భాగం నీలిమందు పండించాలని ఐరోపా తోటల యజమానులు బలవంతపెట్టేవారు. దీన్నే 'తీన్ కథియా విధానం' అని పిలిచేవారు. రాజ్‌కుమార్ శుక్లా అనే రైతు కోరిక మేరకు గాంధీజీ సత్యాగ్రహం చేపట్టారు. జిల్లాను వదిలి వెళ్లాలని ప్రభుత్వం గాంధీజీని ఆదేశించినా ఆయన భయపడలేదు. గాంధీజీ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా ప్రభుత్వం అంగీకరించింది. విచారణలో భాగంగా రాజేంద్రప్రసాద్, జె.బి.కృపలానీ వేలాది మంది రైతుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. దీంతో తీన్ కథియా విధానాన్ని రద్దు చేశారు.
 

ఖేదా సత్యాగ్రహం

   గుజరాత్‌లోని ఖేదా జిల్లాలో పంటలు పండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. దీంతో భూమిశిస్తు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. గాంధీజీ ఇందులాల్ యాజ్ఞిక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకుల సహకారంతో ఖేదా జిల్లాలో పర్యటించి రైతులను భూమిశిస్తు చెల్లించవద్దని కోరారు. గాంధీజీ పోరాటం తర్వాత ప్రభుత్వం ఒక రహస్య ఉత్తర్వు ద్వారా పన్ను చెల్లించే స్తోమత ఉన్నవారి నుంచి మాత్రమే వసూలు చేయమని పేర్కొంది. దీంతో గాంధీజీ 1918లో ఉద్యమాన్ని నిలిపేశారు.
 

బార్డోలి సత్యాగ్రహం (1928)

    గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో బార్డోలి గ్రామం ఉంది. ఇక్కడ గాంధీజీ అనుచరులైన మెహతా సోదరులు కున్‌బిపాటి దార్ కులస్థులతోపాటు అంటరానివారు, కాలివరాజ్ తెగకు చెందినవారి సహాయంతో రైతు ఉద్యమాన్ని కొనసాగించారు. బాంబే ప్రభుత్వం భూమిశిస్తును 22 శాతం పెంచడంతో.. మెహతా సోదరులు భూమిశిస్తు నిలుపుదల ఉద్యమాన్ని చేపట్టాలని వల్లభాయి పటేల్‌ను కోరారు. ఉద్యమంలో భాగంగా కుల సంఘాలు, ఐక్యత, సామాజిక బహిష్కరణ, భజనలులాంటి కార్యక్రమాలను చేపట్టారు. ఉద్యమం ఉద్ధృతం కావడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను రైతులకు ఇవ్వడానికి అంగీకరించింది. మాక్స్‌వెల్-బ్రూమ్‌ఫీల్డ్ విచారణ ఫలితంగా బార్డోలిలో 22 శాతానికి పెంచిన భూమిశిస్తును 6.03 శాతానికి తగ్గించారు.
 

మోప్లా తిరుగుబాటు

    కేరళలోని మలబార్ ప్రాంతంలో మోప్లా ముస్లిం రైతులు హిందూ అగ్రకులాలకు చెందిన నంబూద్రి, నాయర్ భూస్వాములకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. ఖిలాఫత్ ఉద్యమం మోప్లాలకు అండగా నిలిచింది. కాంగ్రెస్, ఖిలాఫత్ ఉద్యమ నాయకులైన మహాదేవన్ నాయర్, గోపాల మీనన్, యాకూబ్ హసన్‌లను అరెస్ట్ చేయడంతో ఉద్యమం హింసాత్మకమైంది. 1921, ఆగస్టు 20న పోలీసులు తిరురైంగాడి మసీదుపై దాడిచేయడంతో మోప్లాలు పోలీస్ స్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలు, భూస్వాముల ఇళ్లను ధ్వంసం చేశారు. వీరు హింసాత్మక చర్యలకు పాల్పడటంతో కాంగ్రెస్ ఉద్యమానికి దూరమైంది. 1921 డిసెంబరు నాటికి అనధికారికంగా 10,000 మంది మోప్లాలు హత్యకు గురయ్యారు.
 

పేదరికంలోకి రైతులు

    ఆ రోజుల్లో దేశ జనాభాలో 3/4వ వంతు మంది వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడేవారు. వలస పాలన కింద వ్యవసాయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 1765లో బెంగాల్‌లో 'దివాని' (భూమి శిస్తు) అధికారాన్ని బ్రిటిషర్లు చేజిక్కించు కోవడంతో వ్యవసాయ విధానంలో సమూల మార్పులు చేశారు. ఇవి వ్యవసాయదారుల అభివృద్ధికి అనుకూలంగా లేకపోవడంతో వారంతా పేదరికానికి గురయ్యారు.
    19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో భారతదేశంలో అనేక కరవులు సంభవించడంతో చాలామంది కార్మికులు, రైతులు ఆకలిచావులకు గురయ్యారు. ఈ కాలంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో 24 చిన్న, పెద్ద కరవులు సంభవించాయి. ఇవి 28.5 మిలియన్ల మంది మరణానికి కారణమయ్యాయి. వీటిలో 1876-78, 1896-97, 1899-1900 ప్రాంతాల్లో సంభవించిన కరవులు ఎక్కువ నష్టానికి కలగజేశాయి.

 

కిసాన్ సభలు

    20వ శతాబ్దంలో రైతు సంస్థలైన కిసాన్ సభలను ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రభుత్వం జమీందార్లకు ప్రోత్సాహకాలను ఇవ్వడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హోమ్‌రూల్ లీగ్‌లో క్రియాశీల సభ్యులైన గౌరి శంకర్ మిశ్రా, ఇంద్ర నారాయణ ద్వివేది.. మదన్‌మోహన్ మాలవ్య సహకారంతో 1918లో కిసాన్ సభలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణుడైన బాబా రామచంద్ర అవధ్‌లో జమీందారులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1920లో రైతు ఉద్యమాలు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగమయ్యాయి. మాలవ్య అవధ్ కిసాన్ సభను ప్రతాప్‌గఢ్‌లో 1920 అక్టోబరులో స్థాపించారు.

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సంఘ సంస్కరణోద్యమాలు

 

స్వాతంత్య్రానికి పూర్వం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలైన బాల్యవివాహాలు, బహుభార్యత్వం, సతీసహగమనం, దేవదాసీ విధానం, అంటరానితనం లాంటివాటిని రూపుమాపడానికి సంఘ సంస్కర్తలు ఎంతో కృషి చేశారు. కొందరు మొగల్, బ్రిటిష్ పాలకులు కూడా ఇలాంటి ఆచారాలకు వ్యతిరేకంగా అనేక చట్టాలు చేశారు.. చర్యలు చేపట్టారు.. అక్బర్ చక్రవర్తి, పీష్వాలు సతీసహగమనంపై ఆంక్షలు విధించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్స్ కారన్ వాలిస్, మింటో, లార్డ్ హేస్టింగ్స్‌లు నాటి ప్రజల సాంఘిక, ఆచార వ్యవహారాల్లో తలదూర్చరాదని భావించినా, సతీసహగమనాన్ని సమాజం నుంచి తొలగించడానికి చర్యలు చేపట్టారు. ఈ దురాచారాన్ని ప్రోత్సహించడాన్ని, గర్భిణులు సతీసహగమనానికి పాల్పడటాన్ని నిషేధించారు. అలాగే 16 సంవత్సరాల లోపు వయసున్న వితంతువులు సతీసహగమనం చేయడాన్ని ఆపడం.. సతీసహగమనానికి సిద్ధం చేస్తున్న సమయాల్లో పోలీసులు హాజరై, బలవంతంగా ఆ దురాచారాన్ని జరపడాన్ని నిరోధించడం.. లాంటి చర్యల ద్వారా కొంత అడ్డుకట్ట వేయగలిగారు.
        రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా 1829లో అప్పటి వైస్రాయి విలియం బెంటింక్ సతీసహగమన నిషేధ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం మొదట్లో బెంగాల్ ప్రెసిడెన్సీకి మాత్రమే వర్తింపజేసినా, కొన్ని మార్పులతో 1830లో బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీల్లో కూడా అమలు చేశారు.  బెంగాలీలు, రాజపుత్రుల్లో ఆడపిల్లలను చిన్నప్పుడే చంపేసే మరో దురాచారం ఉండేది. 1795లో రూపొందించిన బెంగాల్ రెగ్యులేషన్ - XXI చట్టం, 1804లో చేసిన రెగ్యులేషన్ చట్టం - III.. ద్వారా ఈ దురాచారాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించారు. 1870లో రూపొందించిన చట్టం పుట్టిన పిల్లల నమోదును తప్పనిసరి చేసింది. బ్రహ్మసమాజం వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించింది. పండిట్ ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాల కోసం పోరాడారు. ఆయన కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం 1856లో హిందూ వితంతు పునర్‌వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది. విద్యాసాగర్ బాల్యవివాహాలను, బహుభార్యత్వాన్ని వ్యతిరేకించారు. స్త్రీ విద్య కోసం పాటుపడ్డారు.
      మహారాష్ట్రలోని డి.కె.కార్వే, ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు పునర్‌వివాహాల కోసం కృషి చేశారు. ఈ లక్ష్యంతోనే వీరేశలింగం 1878లో 'రాజమండ్రి సాంఘిక సంస్కరణ సంస్థ'ను స్థాపించారు. కార్వే 1899లో పుణెలో వితంతు సదన్‌ను స్థాపించారు. 1916లో భారతదేశంలో మొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించారు. లోకహితవాదిగా ప్రసిద్ధి చెందిన గోపాల హరి దేశ్‌ముఖ్ మహారాష్ట్రలో సంఘ సంస్కరణలకు నడుం కట్టారు.  హదేవ గోవింద రనడే ప్రార్థన సమాజంలో ప్రముఖ సభ్యుడు. రనడే స్ఫూర్తితో గోపాల గణేష్ అగార్కర్ 1884లో పుణెలో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. రనడేను గోపాలకృష్ణ గోఖలే తన గురువుగా పేర్కొన్నారు. గోపాలకృష్ణ గోఖలే 1905లో బొంబాయిలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపింటచారు. మాతృభూమికి సేవ చేయడానికి వీలుగా భారతీయులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
      1872లో రూపొందించిన స్వదేశీ వివాహ చట్టం కనీస వివాహ వయసును బాలికలకు 14 ఏళ్లు, బాలురకు 18 ఏళ్లుగా నిర్ణయించింది. అయితే ఈ చట్టం హిందువులు, ముస్లింలు, ఇతర గుర్తింపు పొందిన మతాలవారికి వర్తించకపోవడంతో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది.
      పార్శీ సంఘ సంస్కర్త బి.ఎం.మలబారి కృషి వల్ల 1891లో ఏజ్ ఆఫ్ కన్సెన్ట్ యాక్ట్‌ను రూపొందించారు. ఈ చట్టం 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలకు వివాహం చేయడాన్ని నిషేధించింది.  1849లో జె.ఇ.డి.బెత్యూన్ కలకత్తాలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ కలకత్తాలో 35 బాలికల పాఠశాలలు స్థాపించారు.
     1833లో బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వాన్ని నిషేధించారు. 1843లో భారతదేశంలో బానిసత్వాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించారు. 1860లో రూపొందించిన పీనల్ కోడ్ బానిస వ్యాపారాన్ని చట్ట విరుద్ధం చేసింది.
    సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో ముఖ్య సభ్యుడైన నారాయణ మల్హర్ జోషి 1911లో సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించారు. సామాన్య ప్రజలకు నాణ్యతతో కూడిన జీవితాన్ని, పనిని అందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ అనేక పాఠశాలలు, గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, బాలుర క్లబ్బులు, స్కౌట్లను స్థాపించింది. ఈ సంస్థలో మరో ముఖ్య సభ్యుడైన హృదయనాథ్ కుంజు అలహాబాద్‌లో 1914లో సేవాసమితి అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. విద్యావ్యాప్తి, సహకారం, పరిశుభ్రత, అణగారిన వర్గాల అభ్యున్నతి, నేరగాళ్లలో మార్పు తీసుకురావడానికి ఈ సంస్థ కృషి చేసింది.
    పాశ్చాత్య విద్యనభ్యసించిన దాదాభాయ్ నౌరోజీ, జె.బి.వాచా, ఎస్.ఎస్.బంగాలి, నౌరోజీ ఫిర్దోంజీ లాంటి పార్శీలు 1851లో 'రహనుమయి మజ్‌దయసనన్ సభ' అనే సంస్థను ప్రారంభించారు. పార్శీల సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం, జొరాస్ట్రియన్ మతాన్ని సంస్కరించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు. వీరు రాస్త్‌గోఫ్తార్ అనే వారపత్రికను నడిపారు.
    రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, జె.ఇ.డి.బెత్యూన్, కందుకూరి వీరేశలింగం, మహదేవ గోవింద రనడే, పడింత రమాబాయి, డి.కె.కార్వే లాంటివారు స్త్రీ విద్య, వారి అభ్యున్నతికి ఎంతో శ్రమించారు. కందుకూరి వీరేశలింగం పంతులు వివేకవర్థిని పత్రికను స్థాపించారు. 1874లో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. 1878లో దేవదాసీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.
మహదేవ గోవింద రనడే, ఆయన భార్య రమాబాయి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. రమాబాయి వితంతువుల కోసం బొంబాయి, పుణె దగ్గర ముక్తి వద్ద శారదా సదన్‌ను ప్రారంభించారు. భారతదేశంలో మొదటిసారిగా వితంతువులకు విద్యను నేర్పించిన ఘనత ఆమెకే దక్కింది. ముస్లింలలో క్వాజా అల్తాఫ్ హుస్సేన్ అలీ, షేక్ మహమ్మద్ అబ్దుల్లా, బేగం రొకియా సఖావత్ హుస్సేన్ ముస్లిం బాలికల విద్య కోసం పాటుపడ్డారు.
    మాతాజీ మహారాణి తపస్వినిగా పేరుగాంచిన గంగాబాయి దక్కన్ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ మహిళ. ఆమె కలకత్తాలో స్థిరపడి 1893లో మహాకాళి పాఠశాలను ప్రారంభించారు.
     మద్రాసు ప్రెసిడెన్సీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మొదటి వితంతువు సిస్టర్ సుబ్బలక్ష్మి. సమాజంలో ఎవరూ పట్టించుకోని బాల వితంతువులను గొప్పవారిగా తీర్చిదిద్దాలని ఆమె భావించారు. మద్రాసు ప్రెసిడెన్సీలో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 22,000 మంది వితంతువుల కోసం వితంతు శరణాలయాలు, బాలికల పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను స్థాపించారు. సుబ్బలక్ష్మి భారత మహిళల సంఘం, అఖిల భారత మహిళల సదస్సుల్లో కీలకపాత్ర పోషించారు. బాల్యవివాహాల నిరోధక బిల్లు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.
   పండిత రమాబాయి 'ఆర్య మహిళా సమాజ్‌'ను స్థాపించారు. పార్శీ మహిళలు స్త్రీ జర్తోస్తి మండల్‌ను; 1910లో అలహాబాద్‌లో సరళాదేవి చౌదరాని భారత్ స్త్రీ మహామండల్‌ను ప్రారంభించారు. ఐర్లాండుకు చెందిన స్త్రీవాద రచయిత్రి, దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలు దొరోతి జన రాజదాస 1915లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించారు. అనిబిసెంట్ దీనికి మొదటి అధ్యక్షురాలయ్యారు. ఈ సంస్థ వయోజన స్త్రీలకు విద్య, దుస్తులు కుట్టడం, ప్రాథమిక చికిత్స లాంటివాటిలో శిక్షణ ఇవ్వడానికి అనేక కేంద్రాలను స్థాపించింది. 1917లో స్త్రీలకు ఓటుహక్కు ఇవ్వాలని కోరుతూ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. స్త్రీ ధర్మ అనే పత్రికను స్థాపించారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఫర్ ఇండియా అనే సంస్థను 1925లో మెహ్రీబాయి టాటా స్థాపించారు.
   మార్గరెట్ కజిన్స్ కృషి ఫలితంగా 1927లో అఖిల భారత మహిళల సదస్సును ఏర్పాటు చేశారు. 1941లో రోష్నీ అనే పత్రికను ప్రారంభించారు. 1927లో మద్రాసు శాసనమండలికి ముత్తులక్ష్మీరెడ్డి తొలి మహిళా శాసన మండలి సభ్యురాలిగా నియమితులయ్యారు. దేశంలో వివిధ మహిళా సంఘాలు స్త్రీలకు ఓటుహక్కు ఇవ్వాలని డిమాండు చేశాయి. 1935 - భారత ప్రభుత్వ చట్టం మహిళలకు పరిమితంగా ఓటుహక్కును కల్పించింది.
పశ్చిమ భారతదేశంలో జ్యోతిరావ్ గోవిందరావ్ ఫూలే నిమ్నజాతుల కోసం పోరాడారు. ఆయన 1827లో పుణెలో జన్మించారు. జ్యోతిరావ్ 'మాలి' అనే కులానికి చెందినవారు. వీరి కుటుంబం పీష్వాలకు పూలు, దండలు సరఫరా చేయడంతో వీరు ఫూలేగా పేరుపొందారు.
   ఒకసారి బ్రాహ్మణ వివాహ ఊరేగింపులో పాల్గొన్న ఫూలేను వారంతా అవమానించారు. ఆయన నిమ్న కులాల స్త్రీల కోసం పాఠశాల నడపడాన్ని వారు వ్యతిరేకించి అడ్డుకోవడంతో పూలే ఆ పాఠశాలను మూసివేయాల్సి వచ్చింది.
ఆగ్రకులాల ఒత్తిడి వల్ల జ్యోతిబా, ఆయన భార్య ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. మతం సాకుతో బ్రాహ్మణులు మిగతా కులాలవారిని అణిచివేశారని, బానిసలుగా మార్చారని జ్యోతిబా అభిప్రాయ పడ్డారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు బలహీనవర్గాల ప్రయోజనాలను పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. నిమ్న, వెనుకబడిన కులాల సంక్షేమం గురించి పట్టించుకోనంతవరకు కాంగ్రెస్‌ను జాతీయపార్టీగా పేర్కొనలేమని స్పష్టంగా చెప్పారు. 1873లో సత్య శోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించారు. సమాజంలో బలహీనవర్గాల వారికి సామాజిక న్యాయాన్ని అందించాలన్నది దీని ప్రధాన లక్ష్యం. ఫూలే 'గులాంగిరీ', 'స్వారజనిక్ సత్యధర్మ పుస్తక్' అనే రెండు గ్రంథాలను రచించారు. అంటరానివారు, బ్రాహ్మణేతర కులాల మధ్య వ్యత్యాసం లేదన్నారు. వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు వారి గ్రంథాల సహాయంతో సామాన్యులను తక్కువ కులానికి చెందినవారిగా ప్రకటించి వారిని దోపిడీ చేశారని జ్యోతిబా భావించారు. ఫూలే అన్ని కులాలకు చెందిన పిల్లలు, స్త్రీల కోసం అనేక పాఠశాలలు, అనాథ శరణాలయాలను స్థాపించారు. 1876లో పుణె మున్సిపల్ కమిటీ సభ్యుడిగా ఫూలే ఎన్నికయ్యారు. 1888లో ఆయన్ని మహాత్మ బిరుదుతో సత్కరించారు. ఆయన చేసిన ఉద్యమ ఫలితంగా 1894లో తమకు సైన్యంలో ఎక్కువ ఉద్యోగాలు, క్షత్రియ హోదాను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. కామన్వెల్త్ పత్రికను ఎవరు స్థాపించారు?
ఎ) తిలక్ బి) బిపిన్ చంద్రపాల్ సి) అనిబిసెంట్ డి) గాంధీజీ
జ: (సి)

 

2. యంగ్ బెంగాల్ ఉద్యమ స్థాపకుడు ఎవరు?
ఎ) ఎం.జి.రనడే బి) ఆనంద మోహన్ బోస్ సి) హెన్రీ వివియన్ డిరోజియో డి) రాధాకాంత్ దేవ్
జ: (సి)

 

3. ధర్మసభ స్థాపకుడు ఎవరు?
ఎ) రాధాకాంత్ దేవ్ బి) ఆత్మారాం పాండురంగ సి) కేశవ చంద్రసేన్ డి) హెచ్.ఎన్.కుంజూ
జ: (ఎ)

 

4. దేవ సమాజం స్థాపకుడు ...
ఎ) కె.శ్రీధరులు నాయుడు బి) శివనారాయణ అగ్నిహోత్రి సి) రాజారామ్మోహన్‌రాయ్ డి) ఎవరూకాదు
జ: (బి)

 

5. కిందివారిలో వితంతు వివాహాల కోసం కృషి చేసినవారు ఎవరు?
ఎ) విలియం బెంటింక్ బి) ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ సి) కారన్ వాలిస్ డి) మింటో
జ: (బి)

 

6. భారతదేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు?
ఎ) అన్నాదురై బి) నందమూరి తారకరామారావు సి) డి.కె.కార్వే డి) జ్యోతిబా ఫూలే
జ: (సి)

 

7. గోపాలకృష్ణ గోఖలే ఎవరిని తన గురువుగా పేర్కొన్నారు?
ఎ) గాంధీజీ బి) గోపాల గణేష్ అగార్కర్ సి) ఎం.జి.రనడే డి) బెత్యూన్
జ: (సి)

 

8. 'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ' స్థాపకుడు ఎవరు?
ఎ) గోపాల హరి దేశ్‌ముఖ్ బి) పండిత రమాబాయి సి) బి.ఎం.మలబారి డి) గోపాలకృష్ణ గోఖలే
జ: (డి)

 

9. రహనుమయ్ మజ్‌దయ్ సనన్ సభతో సంబంధం లేనివారు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ బి) జె.బి.వాచా సి) ఎస్.ఎస్.బంగాలీ డి) హెచ్.ఎన్.కుంజూ
జ: (డి)

 

10. శారదా సదన్ స్థాపకులు ఎవరు?
ఎ) పండిత రమాబాయి బి) గంగాబాయి సి) సిస్టర్ సుబ్బలక్ష్మి డి) మార్గరెట్ కజిన్స్
జ: (ఎ)

 

11. మద్రాసు శాసనమండలిలో మొదటిసారి సభ్యురాలిగా నియమితురాలైన మహిళ ఎవరు?
ఎ) ముత్తులక్ష్మిరెడ్డి బి) సుబ్బలక్ష్మిరెడ్డి సి) శ్రీలతారెడ్డి డి) సమీరారెడ్డి
జ: (ఎ)

 

12. సత్యశోధక సమాజాన్ని ఎవరు స్థాపించారు?
ఎ) జ్యోతిబా ఫూలే బి) డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సి) గాంధీజీ డి) త్యాగరాజ చెట్టియార్
జ: (ఎ)

 

13. 'ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్' మొదటి అధ్యక్షురాలు ఎవరు?
ఎ) దొరోతి జన రాజదాస బి) అనిబిసెంట్ సి) మార్గరెట్ కజిన్స్ డి) లలితా చౌదరి
జ: (బి)

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

యుద్ధాలు

 

    మొగలు సామ్రాజ్య పతన దశలో మరాఠాల రాజ్యం వచ్చింది. తదనంతరం మరాఠాలను అణచివేసి ఆంగ్లేయులు పాలనకు వచ్చారు. శివాజీ, ఆయన వారసుల తర్వాత కూడా మరాఠాల ప్రాబల్యం పీష్వాల పరిపాలనలో కొనసాగింది. అందుకే పీష్వా వంశస్థాపకుడైన బాలాజీ విశ్వనాథ్‌ను 'మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడు' అని పిలిచారు. ఆధునిక భారతదేశ చరిత్రలో మరాఠాల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు పీష్వాల గురించి తెలుసుకోవాలి. వారు తమ పాలన కాలంలో అనేక యుద్ధాలు చేశారు. ఈ పోరాటాలు, ఇతర పరిణామాల ఫలితంగా మరాఠా రాజ్యం ఏవిధంగా అంతరించి ఆంగ్లేయుల సామ్రాజ్యంలో విలీనమైందో అర్ధం చేసుకోవాలి.
 

బాలాజీ విశ్వనాథ్ (1713-20)

    బాలాజీ విశ్వనాథ్ కొంకణస్థ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతడి పూర్వికులు జంజీర రాష్ట్రంలోని శ్రీవర్థన్ ప్రాంతానికి వారసత్వంగా దేశ్‌ముఖ్‌లుగా వ్యవహరించేవారు. బాలాజీ విశ్వనాథ్ చిన్న రెవెన్యూ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1708లో సాహు ఇతడిని సేనాకార్తె పదవిలో, ఆ తర్వాత 1713లో పీష్వాగా నియమించాడు. ఇతడి కాలం నుంచి పీష్వా పదవి వారసత్వంగా మారింది. ఇతడు సాహు, తారాబాయికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో మరాఠా సర్దార్‌లను సాహు వైపు తిప్పుకోవడం ద్వారా... సాహు విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు. బాలాజీ విశ్వనాథ్ 1719లో సయ్యద్ సోదరులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫలితంగా అప్పటి మొగల్ చక్రవర్తి ఫరూక్ సియార్.. సాహును స్వరాజ్యానికి రాజుగా గుర్తించడమే కాకుండా, అతడి కుటుంబ సభ్యులందరినీ మొగలుల చెర నుంచి విడిపించాడు. అలాగే దక్కనులోని 6 మొగల్ రాష్ట్రాల నుంచి చౌత్, సర్దేశ్‌ముఖ్ పన్నులను వసూలు చేసుకునే అధికారం సాహుకు దక్కింది.
 

మొదటి బాజీరావు (1720-40)

బాలాజీ విశ్వనాథ్ పెద్ద కుమారుడైన బాజీరావును 20 సంవత్సరాల వయసులోనే పీష్వాగా నియమించారు. శివాజీ తర్వాత గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను పెంపొందించిన వ్యక్తిగా బాజీరావు ప్రసిద్ధి చెందాడు. ఇతడి కాలంలో మరాఠాల అధికారం తారస్థాయికి చేరుకుంది. ఇతడి కాలంలోనే మరాఠా కూటమికి బీజాలు పడ్డాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అనేక మరాఠా కుటుంబాలు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాయి. వారిలో గైక్వాడ్‌లు (బరోడా), భోంస్లేలు (నాగ్‌పూర్), హోల్కార్లు (ఇండోర్) సింధియాలు (గ్వాలియర్), పీష్వాలు (పుణే) ముఖ్యులు.
జంజీరాకు చెందిన సిద్ధీలను ఓడించిన తర్వాత, ఇతడు పోర్చుగీసు వారి నుంచి బస్సైన్, సాల్‌సెట్టి ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతడు నిజాం ఉల్‌ముల్క్‌ను భోపాల్ వద్ద ఓడించి, అతడితో 'దురాయ్ సరాయ్ సంధి' చేసుకున్నాడు. దీని ద్వారా నిజాం నుంచి మాళ్వా, బుందేల్‌ఖండ్‌లను పొందాడు. ఉత్తర భారతదేశంపై అనేక దండయాత్రలు చేయడం ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచి, భారతదేశంలో మరాఠాల అధికారాన్ని స్థాపించాడు.
* మొగలుల గురించి ప్రస్తావిస్తూ బాజీరావు ఇలా వ్యాఖ్యానించాడు 'ఎండిన చెట్టును కాండం దగ్గర నరికితే, కొమ్మలు వాటంతట అవే పడిపోతాయి'.
బాజీరావు గొప్ప సైనికుడే కాకుండా దౌత్యవేత్త, సామ్రాజ్య స్థాపకుడు. పీష్వాగా ఉన్న 20 సంవత్సరాల్లో నిరంతరం యుద్ధాలు చేస్తూ విజయాలు సాధించాడు. మొగలులతో యుద్ధంలో హిందువులైన రాజపుత్రులు, బుందేలులు, జాట్‌లను తన సహజ మిత్రులుగా గుర్తించి వారి సహకారాన్ని పొందాడు. సవాయ్ జైసింగ్, ఛత్రసాల్‌లతో మైత్రి వల్ల లబ్ది పొందాడు.

 

బాలాజీ బాజీరావు (1740-61)

ఇతడు నానాసాహెబ్‌గా ప్రసిద్ధిగాంచాడు. 20 సంవత్సరాల వయసులోనే పీష్వా అయ్యాడు. 1749లో సాహు మరణం తర్వాత రాజ్య వ్యవహారాలన్నీ ఇతడి ఆధీనంలోకి వచ్చాయి. సాహుకు వారసులు లేకపోవడంతో రాజారాం మనవడైన రామరాజను తన వారసుడిగా ప్రకటించాడు. అయితే బాలాజీ బాజీరావు సతారాలో రామరాజను బంధించాడు. 1752లో మొగల్ చక్రవర్తి అహ్మద్ షా, పీష్వా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం పీష్వా.. మొగల్ సామ్రాజ్యాన్ని అంతర్గత, బాహ్య విరోధుల (అహ్మద్ షా అబ్దాలీ) నుంచి కాపాడాలి. దీనికి ప్రతిగా పీష్వా వాయవ్య రాష్ట్రం నుంచి చౌత్‌ను వసూలు చేసుకోవడంతో పాటు ఆగ్రా, అజ్మీర్ రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ ఒప్పందం వల్ల మరాఠాలు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అహ్మద్ షా అబ్దాలీతో ప్రత్యక్షంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ చేతిలో మరాఠాలు ఓడిపోయారు. ఈ వార్త వినడంతో బాలాజీ బాజీరావు 1761, జూన్ 23న మరణించాడు. ఇతడి తర్వాత మాధవరావు, నారాయణరావు, సవాయ్ మాధవరావు, రెండో బాజీరావు పీష్వాలుగా వ్యవహరించారు.
బాలాజీ బాజీరావు కాలంలో మరాఠా రాజ్యం అత్యున్నత దశకు చేరుకుంది. ఇతడి కాలంలో న్యాయ పరిపాలన మెరుగుపడింది. రెవెన్యూ పరిపాలన పటిష్టమైంది. కలెక్టర్లు ఖాతాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాడు. వర్తకాభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాడు. దేవాలయాల నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చాడు. హోల్కార్లు, సింధియాలు రాజపుత్ర రాజ్యాలపై దాడి చేయడం, రఘునాథరావు జాట్‌లకు చెందిన కోటను ఆక్రమించడంతో హిందూ రాజులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలన్న ఆశయానికి విఘాతం ఏర్పడింది. పీష్వా ఢిల్లీలో రాజకీయ పరిణామాలకు అనవసర ప్రాధాన్యం ఇవ్వడం, పంజాబులో తీసుకున్న నిర్ణయాలతో అహ్మద్‌షా అబ్దాలీతో విరోధం ఏర్పడింది. ఆంగ్లేయుల సైనిక బలాన్ని, రాజకీయ ఉద్దేశాన్ని పీష్వా సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.

 

మూడో పానిపట్టు యుద్ధం

    నాదిర్ షా తర్వాత అహ్మద్ షా అబ్దాలీ ఆప్ఘనిస్థాన్ పాలకుడయ్యాడు. మొగలు సామ్రాజ్యం బలహీనమవడంతో అబ్దాలీ కూడా భారతదేశంపై దాడి చేయాలని భావించాడు. 1758లో రఘునాథరావు అహ్మద్ షా అబ్దాలీ కుమారుడు, ఏజెంట్ అయిన తైమూరును పంజాబ్ నుంచి తరిమేశాడు. మరాఠాలు అదీనా బేగ్‌ఖాన్‌ను పంజాబ్ గవర్నరుగా నియమించారు. ఆప్ఘన్ల నుంచి పంజాబ్‌ను మరాఠాలు ఆక్రమించడం ద్వారా అహ్మద్ షా అబ్దాలీకి సవాలు విసిరారు. 1759 చివరి నాటికి అహ్మద్ షా అబ్దాలీ పెద్ద సైన్యంతో సింధు నదిని దాటి పంజాబ్‌ను ఆక్రమించాడు. అబ్దాలీని ఎదుర్కోలేక మరాఠాలు ఢిల్లీకి పారిపోయారు. ఢిల్లీకి పది మైళ్ల దూరంలోని బరారి ఘాట్ వద్ద 1760లో జరిగిన యుద్ధంలో దత్తాజి సింధియా మరణించాడు. జంకోజి సింధియా, మల్హర్ రావ్ హోల్కార్లు కూడా అబ్దాలీని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. దీంతో అబ్దాలీ ఢిల్లీని ఆక్రమించాడు.
ఉత్తర భారతదేశంలో మరాఠాల అధికారాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశంతో సదాశివరావు భావేను పీష్వా పంపాడు. భావే 1760, ఆగస్టు 22న ఢిల్లీని ఆక్రమించాడు. అబ్దాలీని ఢిల్లీ నుంచి తరిమేయాలని భావే భావించాడు. దీంతో రెండు సేనల మధ్య 1760 నవంబరులో పానిపట్టు వద్ద యుద్ధం జరిగింది. ఇరు సేనలకు ఆహార సరఫరా నిలిచిపోవడంతో శాంతి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇవి ఫలించకపోవడంతో 1761, జనవరి 14న భీకర యుద్ధం జరిగింది. ఇందులో మరాఠాలు ఓడిపోయారు. 75,000 మంది మరాఠాలు మరణించారు. ఈ యుద్ధంలో పీష్వా కుమారుడు విశ్వాస్ రావు, సదాశివరావు భావే కూడా మరణించారు.
* ప్రముఖ చరిత్రకారుడు జె.ఎన్.సర్కార్ ఈ యుద్ధం గురించి ఇలా చెప్పాడు 'మహారాష్ట్రలో కుటుంబ సభ్యులను కోల్పోని కుటుంబం లేదు. చాలా ఇళ్లు కుటుంబ పెద్దను కోల్పోయాయి. ఒక్క దెబ్బతో మొత్తం నాయకుల తరమంతా నాశనమైంది.'

 

మరాఠాల ఓటమికి కారణాలు

అబ్దాలీ సైన్యం 60,000 కాగా మరాఠాల సైన్యం 45,000 మాత్రమే.
పానిపట్టులోని మరాఠా శిబిరంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. సైన్యానికి ఆహారం, గుర్రాలకు గడ్డి దొరకలేదు.
* ఉత్తర భారతదేశంలోని ముస్లిం రాజ్యాలన్నీ అబ్దాలీకి సహాయం చేయగా మరాఠాలు ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. జాట్‌లు, రాజపుత్రులు, సిక్కులు మరాఠాలకు దూరమయ్యారు.
* మరాఠా సైన్యాధికారుల్లో అసూయ వారి ఓటమికి కారణమైంది.
పానిపట్టు యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి.. ఆప్ఘనులతో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న వ్యక్తి కాశి రాజ పండిట్. సదాశివరావు భావే వ్యక్తిత్వంలోని లోపాలను పండిట్ దుయ్యబట్టడమే కాకుండా ఓటమికి భావేనే ప్రధాన కారణమని పేర్కొన్నాడు.

 

ఆంగ్లో-మరాఠా యుద్ధాలు

మరాఠాలు మొగల్ సామ్రాజ్య శిథిలాలపై తమ సామ్రాజ్యాన్ని నిర్మించగా.. ఆంగ్లేయులు మరాఠా సామ్రాజ్య శిథిలాలపై తమ సామ్రాజ్యాన్ని నిర్మించాలని భావించారు. మరాఠాలు ఇతర భారత రాజ్యాల కంటే బలమైన రాజ్యంగా ఏర్పడగా, ఆంగ్లేయులు భారతదేశంలోని ఇతర ఐరోపా వర్తక కంపెనీలపై ఆధిపత్యం సంపాదించడంలో విజయం సాధించారు. 18వ శతాబ్దం చివరి నాటికి మరాఠాలు, ఆంగ్లేయులు ప్రత్యక్ష యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆంగ్లేయ కంపెనీ అధికార బలం ముందు మరాఠా అధికారం కనుమరుగైంది.
 

మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం (1775-82)

   మరాఠా నాయకులైన మాధవరావు, రఘునాథరావు మధ్య అధికారం కోసం జరిగిన పోరును బ్రిటిషర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రఘునాథరావుకు వారి మద్దతు తెలిపారు. ఈ యుద్ధంలో మొదట బ్రిటిషర్లు మరాఠాల చేతిలో ఓడిపోయారు. గొడ్డార్డ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం కలకత్తా నుంచి అహ్మదాబాద్ చేరుకునే క్రమంలో మరాఠాలపై అనేక విజయాలు సాధించింది. ఈ యుద్ధం 1782లో జరిగిన 'సాల్బాయ్ సంధి'తో ముగిసింది. ఈ సంధి ద్వారా యథాతథ స్థితిని కొనసాగించారు. ఫలితంగా బ్రిటిషర్లు మరాఠాలతో 20 సంవత్సరాల పాటు శాంతిని నెలకొల్పారు. మరాఠాల సహాయంతో బ్రిటిషర్లు హైదర్ అలీ నుంచి తమ భూభాగాలను ఆక్రమించుకోగలిగారు.
 

రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం (1803-05)

   మరాఠాల అంతర్గత వ్యవహారంలో వెల్లస్లీ జోక్యం చేసుకోవడం, సైన్య సహకార విధానాన్ని మరాఠాలపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడం ఈ యుద్ధానికి కారణాలు. 18వ శతాబ్దం చివరి నాటికి అనుభవజ్ఞులైన మరాఠా నాయకులు మరణించడం, బ్రిటిషర్ల విజయావకాశాలు మెరుగుపడటం, పీష్వా రెండో బాజీరావు 1802లో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయడం లాంటి పరిణామాలు యుద్ధాన్ని ప్రోత్సహించాయి. సింధియా, భోంస్లేల ఉమ్మడి సైన్యం ఆర్థర్ వెల్లస్లీ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం చేతిలో ఓడిపోయింది. అయితే హోల్కర్లను ఓడించడంలో బ్రిటిషర్లు విఫలమయ్యారు. ఈ యుద్ధంతో కంపెనీ భారతదేశంలో తన అధికారాన్ని పూర్తిస్థాయిలో స్థాపించగలిగింది. ఈ యుద్ధం 1802, డిసెంబరు 31న జరిగిన బస్సైన్ సంధితో ముగిసింది. ఈ సంధి ద్వారా పీష్వా రూ.26 లక్షల ఆదాయాన్నిచ్చే భూభాగాలను కంపెనీకి ఇవ్వడానికి అంగీకరించాడు. అలాగే సూరత్ నగరాన్ని కంపెనీకి అప్పగించాడు. నిజాం భూభాగంలో చౌత్ హక్కును వదులుకున్నాడు.
 

మూడో ఆంగ్లో-మరాఠా యుద్ధం (1817-18)

బ్రిటిషర్లు తమ స్వాతంత్య్రాన్ని హరించడాన్ని మరాఠాలు వ్యతిరేకించడం, మరాఠా సర్దార్‌ల పట్ల బ్రిటిష్ రెసిడెంట్లు కఠినంగా వ్యవహరించడం ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు. ఈ యుద్ధం తర్వాత పీష్వా పదవీచ్యుతుడయ్యాడు. బ్రిటిషర్లు మరాఠా భూభాగాలన్నింటినీ తమ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు. మరాఠా సర్దార్‌లు బ్రిటిషర్ల దయాదాక్షిణ్యాలపై జీవించాల్సి వచ్చింది.
 

 

మాదిరి ప్రశ్నలు

 

1. సాహు, తారాబాయికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో సాహు విజయానికి తోడ్పడిన వ్యక్తి ఎవరు?
ఎ) బాజీరావు బి) బాలాజీ విశ్వనాథ్ సి) రఘునాథరావు డి) మల్హర్ రావ్ హోల్కర్
జ: (బి)

 

2. గైక్వాడ్‌లు ఏ ప్రాంతం కేంద్రంగా పరిపాలించారు?
ఎ) బరోడా బి) నాగపూర్ సి) ఇండోర్ డి) గ్వాలియర్
జ: (ఎ)

 

3. మొదటి బాజీరావు బస్సైన్, సాల్‌సెట్టిలను ఎవరి నుంచి ఆక్రమించాడు?
ఎ) ఆంగ్లేయులు బి) పోర్చుగీసువారు సి) ఫ్రెంచివారు డి) డచ్చివారు
జ: (బి)

 

4. మొదటి బాజీరావు, నిజాం ఉల్ ముల్క్‌ను ఏ యుద్ధంలో ఓడించాడు?
ఎ) హైదరాబాద్ బి) భోపాల్ సి) నాగపూర్ డి) విజయవాడ
జ: (బి)

 

5. నానాసాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన పీష్వా ఎవరు?
ఎ) బాలాజీ బాజీరావు బి) బాలాజీ విశ్వనాథ్ సి) మొదటి బాజీరావు డి) రెండో బాజీరావు
జ: (ఎ)

 

6. 1752లో పీష్వాతో ఒప్పందం కుదుర్చుకున్న మొగలు చక్రవర్తి ఎవరు?
ఎ) మహమ్మద్ షా బి) అహ్మద్ షా సి) బహుదూర్ షా డి) ఔరంగజేబు
జ: (బి)

 

7. చివరి పీష్వా ఎవరు?
ఎ) మాధవరావు బి) నారాయణరావు సి) బాలాజీ బాజీరావు డి) రెండో బాజీరావు
జ: (డి)

 

8. బాలాజీ బాజీరావు ఎప్పుడు మరణించాడు?
ఎ) 1759 బి) 1760 సి) 1761 డి) 1762
జ: (సి)

 

9. నాదిర్ షా తర్వాత ఆఫ్ఘనిస్థాన్ పాలకుడు ఎవరు?
ఎ) తైమూరు బి) అహ్మద్ షా అబ్దాలీ సి) షేర్‌ఖాన్ డి) అదీనా బేగ్ ఖాన్
జ: (బి)

 

10. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాలకు సహకరించింది ఎవరు?
ఎ) జాట్‌లు బి) రాజపుత్రులు సి) సిక్కులు డి) ఎవరూ కాదు
జ: (డి)

 

11. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాల ఓటమికి ప్రధాన కారకుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) కాశీ రాజ పండిట్ బి) సదాశివరావు భావే సి) విశ్వాసరావు డి) మల్హర్ రావు హోల్కర్
జ: (బి)

 

12. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది?
ఎ) సల్బాయ్ బి) దురాయ్ సరాయ్ ) పాల్కేడ్ డి) బస్సైన్
జ: (ఎ)

 

13. పీష్వా రెండో బాజీరావు సైన్య సహకార ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేశాడు?
ఎ) 1800 బి) 1801 సి) 1802 డి) 1803
జ: (సి)

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆధునిక విద్యావ్యాప్తి

 

   ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలుకుని బ్రిటిష్ కాలంలో భారత్‌లో విద్యాభివృద్ధి ఎలా సాగిందన్నది ఆధునిక చరిత్ర ప్రధానాంశాల్లో ఒకటి. 1813 చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏటా లక్ష రూపాయలు కేటాయించడం విద్యారంగంలో కీలక పరిణామం.. అనంతర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం విద్యావ్యాప్తికి వివిధ కమిటీలను నియమించి అనేక మార్పులు తీసుకొచ్చింది. ఆంగ్లవిద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రధానాంశం. స్వాతంత్య్రానంతరం రాధాకృష్ణన్, కొఠారి కమిషన్లు మన దేశంలో విద్యకు వన్నెలద్ది ప్రగతిపథంలో పరుగులు తీసేందుకు బాటలు వేశాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు విద్యారంగ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడం అవసరం.

భారత్‌లో 18వ శతాబ్దం నాటికి హిందూ, ముస్లిం విద్యా కేంద్రాలు కనుమరుగయ్యాయి. స్వదేశీ రాజుల పాలన అంతం కావడంతో విద్యా కేంద్రాలకు నిధుల సమస్య ఎదురైంది. 1784, ఫిబ్రవరి 21న వారన్ హేస్టింగ్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లకు రాసిన ఉత్తరంలో - ఉత్తర భారతదేశం, దక్కనులో విద్యాలయాల దుస్థితిని వివరించారు.
బెంగాల్ 1765లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం కిందకు వచ్చింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఇంగ్లండ్‌లో మాదిరిగా భారతదేశంలోనూ ప్రజలకు విద్యను అందించే బాధ్యత నుంచి వైదొలగాలని నిర్ణయించారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే భారతీయ అధికారుల కోరిక మేరకు విద్యాభివృద్ధి కోసం కొన్ని చర్యలు చేపట్టారు. 1781లో వారన్ హేస్టింగ్స్ పర్షియన్, అరబిక్ భాషల అధ్యయనం కోసం కలకత్తాలో మదరసాను స్థాపించాడు. 1791లో బెనారస్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా పనిచేసిన జొనాథన్ డంకన్ హిందూ చట్టాలు, సాహిత్యం, మతానికి సంబంధించిన అధ్యయనాల కోసం ఒక సంస్కృత కళాశాలను స్థాపించాడు. 1784లో సర్ విలియం జోన్స్ మరో ముప్పైమందితో కలిసి 'ఆసియా' విషయాల అధ్యయనం కోసం 'ఏసియాటిక్ సొసైటీ'ని స్థాపించాడు. అయితే 1829 వరకు ఇందులో భారతీయులకు ప్రవేశం కల్పించలేదు.

 

ఆంగ్ల భాషకే నిధులు
    క్రైస్తవ మిషనరీలు, మానవతావాదులు ఒత్తిడి తేవడంతో భారతదేశంలో ఆధునిక విద్యావ్యాప్తికి ఈస్ట్ ఇండియా కంపెనీ నడుం బిగించింది. 1813 చార్టర్ చట్టం విద్యాభివృద్ధికి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు కేటాయించింది. అయితే ఈ మొత్తాన్ని ఆధునిక పాశ్చాత్య విద్య కోసం ఖర్చు పెట్టాలా? లేదా భారతీయ విద్య కోసం ఖర్చు పెట్టాలా? అనే విషయంపై వాదోపవాదాలు జరిగాయి. ఈ చర్చలో పాల్గొన్న ఆంగ్లేయులు 1835లో ప్రాచ్యవాదులు, పాశ్చాత్యవాదులుగా విడిపోయారు. జేమ్స్ సూదర్‌లాండ్, జాన్ షేక్‌స్పియర్, జేమ్స్ ప్రిన్సెప్, హెన్రీ ప్రిన్సెప్‌లతో కూడిన ప్రాచ్య వర్గం అరబిక్, సంస్కృత భాషలకు ప్రాధాన్యం తగ్గించడం 1813 చట్టస్ఫూర్తికి విరుద్ధమని వాదించింది. డబ్ల్యూ.డబ్ల్యూ.బర్డ్, సి.బి.సౌండర్స్, జె.ఆర్.కాల్విన్, సి.ఇ.ట్రెవెల్యాన్‌లతో కూడిన పాశ్చాత్య వర్గం ఆంగ్ల భాషలో పాశ్చాత్య ఆధునిక విద్యను అందించడాన్ని బలపరిచింది. థామస్ బాబింగ్టన్ మెకాలే పాశ్చాత్యవాదులను సమర్థించారు. చివరికి అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ మెకాలే వాదనతో ఏకీభవించి విద్య కోసం కేటాయించిన నిధులన్నీ ఆంగ్ల భాషాభివృద్ధికే ఖర్చు చేయాలని నిర్ణయించాడు. మెకాలే ప్రతిపాదనను 1835, మార్చి 7న ఆమోదించి ఆంగ్లభాషను భారతదేశ అధికార భాషగా ప్రకటించారు.
1843-53 మధ్యకాలంలో ఉత్తర్‌ప్రదేశ్ (వాయవ్య రాష్ట్రం) లెఫ్టినెంట్ గవర్నరుగా పనిచేసిన జేమ్స్ థామ్సన్ ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టడం ద్వారా గ్రామాల్లో విద్యాభివృద్ధికి ప్రయత్నించాడు. విద్యాశాఖను ఏర్పాటు చేసి, భారతీయ పాఠశాలలను తనిఖీ చేయడం ద్వారా వాటిని అభివృద్ధి చేశాడు.

 

మాగ్నాకార్టా
అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా ఉన్న చార్లెస్ ఉడ్ ఒక తాఖీదును 1854లో రూపొందించాడు. తర్వాత అతడిని భారతదేశ మొదటి రాజ్య కార్యదర్శిగా నియమించారు. ఆ తాఖీదునే భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించి 'మాగ్నాకార్టాగా భావిస్తారు. ప్రజలందరికీ విద్యను అందించడం, స్త్రీ విద్య, ప్రాంతీయ భాషల అభివృద్ధి, లౌకిక విద్యకు ఇది ప్రాధాన్యం ఇచ్చింది. 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఈ తాఖీదును దశలవారీగా అమలు చేశారు. బొంబాయి, మద్రాసు, బెంగాల్, వాయవ్య రాష్ట్రం, పంజాబ్‌లలో 1855లో విద్యాశాఖలను ఏర్పాటు చేశారు. తర్వాత వివిధ విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
 

హంటర్ కమిషన్
డబ్ల్యూ.డబ్ల్యూ.హంటర్ 1882లో అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించింది. 1854 ఉడ్ తాఖీదు తర్వాత భారతదేశంలో జరిగిన విద్యాభివృద్ధిని సమీక్షించడం ఆ కమిషన్ ఏర్పాటు ఉద్దేశం. కమిషన్‌ను అప్పటి వైస్రాయి లార్డ్ రిప్పన్ నియమించాడు. ప్రాథమిక విద్య అభివృద్ధికి సూచనలను, సలహాలను సిఫారసు చేయాల్సిందిగా ఈ కమిషన్‌ను కోరాడు. కొత్తగా ఏర్పాటు చేసిన స్థానిక సంస్థలకు (జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు) ప్రాథమిక విద్య నిర్వహణను అప్పగించాలని ఈ కమిషన్ సూచించింది. ప్రభుత్వం కొన్ని కళాశాలలు, సెకండరీ పాఠశాలలను మాత్రమే నిర్వహించాలని, మిగిలినవాటి నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు వదిలి పెట్టాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులన్నింటినీ ప్రభుత్వం అమలు చేసింది.
 

 

భారత విశ్వవిద్యాలయాల చట్టం

1901 సెప్టెంబరులో లార్డ్ కర్జన్ విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయ ప్రతినిధులతో సిమ్లాలో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాడు. వైస్రాయి కార్యనిర్వాహక మండలిలో లా మెంబరు అయిన థామస్ ర్యాలీగ్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ కమిషన్‌ను నియమించారు.

ఈ కమిషన్ సిఫార్సుల మేరకు 1904లో భారత విశ్వవిద్యాలయాల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని అనుసరించి విశ్వవిద్యాలయాలు బోధన బాధ్యతలను స్వీకరించాయి. అంతవరకు అవి పరీక్షల నిర్వహణకు మాత్రమే పరిమితమయ్యేవి. విశ్వవిద్యాలయ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సిండికేట్లను నియమించారు. ఈ చర్యల వల్ల ఉన్నత విద్య నాణ్యత పెరిగింది. అయితే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నియంత్రణ పెరగడాన్ని జాతీయవాదులు తీవ్రంగా విమర్శించారు. 1910లో కేంద్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేశారు.

 

విద్యావిధానంపై తీర్మానం
   1906లో అభ్యుదయ భావాలు ఉన్న బరోడా రాష్ట్రం నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని పాటించాలని భారతీయ నాయకులు ఒత్తిడి చేశారు. 1910-13 మధ్య కాలంలో గోపాలకృష్ణ గోఖలే విధాన మండలిలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక విద్య బాధ్యతను తీసుకోవాలని గట్టిగా కోరారు. 1913, ఫిబ్రవరి 21న చేసిన తీర్మానం ప్రకారం ప్రభుత్వం నిర్బంధ విద్య సూత్రాన్ని తిరస్కరించింది. అయితే నిరక్షరాస్యతను నిర్మూలించడానికి అంగీకరించింది. అలాగే పేదలకు ఉచిత విద్యను అందించడానికి అన్ని రాష్ట్రాలు సత్వర చర్యలు చేపట్టాలని కోరింది.
 

శాడ్లర్ కమిషన్ (1917-19)
చెమ్స్‌ఫర్డ్ కలకత్తా విశ్వవిద్యాలయ పనితీరును సమీక్షించడానికి శాడ్లర్ కమిషన్‌ను నియమించాడు. ఈ కమిషన్ సెకండరీ విద్య, సెకండరీ విద్యాబోర్డు నియంత్రణలో ఉండాలని, డిగ్రీ కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసింది. అనంతరం 1921 నాటికి భారతదేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య 12కు పెరిగింది. కొత్తగా బెనారస్, మైసూరు, పాట్నా, అలీగఢ్, ఢాకా, లక్నో, ఉస్మానియా విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఇదే సమయంలో గాంధీజీ, లాలాలజపతిరాయ్, అనిబిసెంట్ జాతీయ విద్య ఆవశ్యకతను గుర్తించారు. ప్రస్తుత విద్యావిధానం జాతీయవాద అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయదని వాదించారు. మాతృభూమిపై ప్రేమను పెంపొందించే విద్యావిధానాన్ని రూపొందించాలని అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా కాశీ విద్యాపీఠ్, జామియా మిలియా ఇస్లామియా, బీహార్ విద్యాపీఠ్ లాంటి జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.
 

హార్టాగ్ కమిటీ నివేదిక
1928 మే లో సైమన్ కమిషన్.. సర్ ఫిలిప్ జోసెఫ్ హార్టాగ్ అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ఇండియాలో విద్య మరింతగా అభివృద్ధి చెందేందుకు గల అవకాశాలపై నివేదికను ఇవ్వాలని ఈ కమిటీని కోరింది. కమిటీ తన నివేదికలో - ప్రజలందరికీ విద్య నేర్పించే బాధ్యత ప్రధానంగా రాష్ట్రాలపై ఉంది. సెకండరీ విద్య పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఎక్కువమంది ఉత్తీర్ణులు కాకపోవడం ఇబ్బందికరంగా ఉంది. ప్రాథమిక విద్యావ్యవస్థలో మానవ వనరుల వృథా అధికంగా ఉంది. ఉపాధ్యాయుల జీతాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది - అని పేర్కొంది.
 

'బేసిక్' విద్యా విధానం
భారత ప్రభుత్వ చట్టం-1935 రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. 1937లో ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 7 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పరచింది. 1937లో గాంధీజీ తన 'హరిజన్ పత్రికలో బేసిక్ విద్య ఆవశ్యకతను వివరిస్తూ వరుసగా వ్యాసాలను ప్రచురించారు. 'కార్యక్రమాల ద్వారా నేర్చుకోవడం అనేది బేసిక్ విద్య సూత్రం. జాకీర్ హుస్సేన్ కమిటీ ఈ విధానంపై కసరత్తు చేసి సిలబస్‌ను రూపొందించింది. ఈ విధానంలో చేతితో వస్తువులను చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపాధ్యాయుల జీతం కోసం వినియోగిస్తారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం, కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేయడంతో ఈ విధానాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.
 

సార్జంట్ విద్యాప్రణాళిక
1944లో కేంద్రీయ విద్యా సలహా బోర్డు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. ఆ బోర్డుకు భారత ప్రభుత్వ విద్యా సలహాదారు సర్ జాన్ సార్జెంట్ అధ్యక్షుడు. ఈ ప్రణాళిక ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలని, 6-11 ఏళ్ల వయసు వారికి సార్వత్రిక ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలలు.. సాధారణ విద్య; సాంకేతిక-వృత్తి విద్యను నేర్పేవి అని రెండు రకాలుగా ఉండాలని సిఫార్సు చేసింది. ఇంటర్మీడియట్ కోర్సును తొలగించి ఉన్నత విద్య, కళాశాల విద్యకు చెరో సంవత్సరం కలపాలని పేర్కొంది.
 

కొఠారి కమిషన్ (1964-66)
డాక్టర్ డి.ఎస్.కొఠారి అధ్యక్షతన భారత ప్రభుత్వం 1964 జులైలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అన్ని స్థాయుల్లో విద్యాభివృద్ధికి చేపట్టాల్సిన విధానాలను తెలియజేయాలని కమిషన్‌ను కోరింది.

 

కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు:
* అన్ని స్థాయుల్లో పని అనుభవం, సామాజిక సేవను ప్రవేశపెట్టాలి.
* నైతికవిద్యపై దృష్టి సారించాలి. సామాజిక బాధ్యతను పెంపొందించాలి.
సెకండరీ విద్యలో వృత్తి విద్యను భాగం చేయాలి.
* అత్యున్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిమిత విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి.
పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
వ్యవసాయ విద్య, వ్యవసాయంలో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.

 

రాధాకృష్ణన్ కమిషన్
 

విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి తగిన సూచనలతో ఒక నివేదికను ఇవ్వాలని కోరుతూ.. భారత ప్రభుత్వం 1948 నవంబరులో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 1949 ఆగస్టులో తన నివేదికను సమర్పించింది.
 

నివేదికలోని ప్రధాన విషయాలు
* పన్నెండు సంవత్సరాల విశ్వవిద్యాలయ పూర్వవిద్య.
* విశ్వవిద్యాలయాల పని దినాలు 180 రోజుల కంటే తక్కువ కాకూడదు. (పరీక్షలు జరిగే రోజులు మినహాయించి).
* పరీక్షా ప్రమాణాలను పెంపొందించి.. అన్ని విశ్వవిద్యాలయాల్లో పరీక్షా విధానం ఒకేలా ఉండాలి.
* విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకుల జీతాలు పెంచాలి.
దేశంలో విశ్వవిద్యాలయాల విద్యను పర్యవేక్షించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

 

ముఖ్యాంశాలు
* 1813-53 మధ్య బెంగాల్, బీహార్, మద్రాసు ప్రెసిడెన్సీలలో అనేక పాఠశాలలు, కళాశాలలను స్థాపించారు.
* 1844లో అప్పటి గవర్నర్ జనరల్ హార్డింజ్ ఆంగ్లవిద్యను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాడు.
* 1919లో చేసిన మాంట్‌ఫర్డ్ (మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్) చట్టం ప్రకారం... మొదటిసారిగా విద్య భారతీయుల నియంత్రణలోకి వచ్చింది. ఫలితంగా అన్ని స్థాయుల్లో మునుపెన్నడూ లేని విధంగా విద్య అభివృద్ధి చెందింది.
* డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ సిఫార్సు మేరకు 1953లో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ)ను ఏర్పాటు చేశారు. దీనికి పార్లమెంటు చట్టం ద్వారా 1956లో స్వయం ప్రతిపత్తి కల్పించారు.


 

మాదిరి ప్రశ్నలు
 

 

1. విలియంకోట కళాశాలను ఎవరు స్థాపించారు?
జవాబు: వెల్లస్లీ

 

2. భారతదేశంలో విద్యాభివృద్ధికి లక్ష రూపాయిలు కేటాయించిన చట్టమేది?
జవాబు: 1813 చార్టర్ చట్టం

 

3. సంస్కృత కళాశాలల బలోపేతాన్ని వ్యతిరేకించినవారు ఎవరు?
జవాబు: రాజారామమోహన్‌రాయ్

 

4. కలకత్తాలో హిందూ కళాశాలను ఎప్పుడు స్థాపించారు?
జవాబు: 1817

 

5. వాయవ్య రాష్ట్రంలో ప్రాంతీయ భాషల ద్వారా విద్యాబోధనను ప్రోత్సహించినవారు ఎవరు?
జవాబు: జేమ్స్ థామ్సన్

 

6. బాలికల పాఠశాలల ఏర్పాటుకు కృషిచేసినవారు ఎవరు?
జవాబు: బెత్యూన్

 

7. హంటర్ కమిషన్‌ను ఎవరి కాలంలో నియమించారు?
జవాబు: రిప్పన్

 

 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కర్ణాటక యుద్ధాలు

భారతదేశానికి వర్తకం పేరుతో వచ్చిన డచ్, పోర్చుగీస్ తదితర దేశాలవారు అనేక కారణాలతో నిష్క్రమించినా మిగిలిన రెండు ప్రధాన ఐరోపా వర్తక కంపెనీల (బ్రిటిష్, ఫ్రెంచ్) మధ్య ఆదిపత్య పోరు తారస్థాయికి చేరింది. 1740 తర్వాత మన దేశంలో ఆధిపత్యం కోసం ఫ్రెంచ్, బ్రిటిషర్లు ఎన్నో యుద్ధాలకు కారకులయ్యారు. వీటిలో కర్ణాటక, ప్లాసీ, బక్సార్, మైసూర్ యుద్ధాలు ప్రధానమైనవి. వీటిపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

   భారతదేశపు ఆగ్నేయ తీరంలోని ఆర్కాట్ రాజధానిగా సాదతుల్లా ఖాన్ స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు కర్ణాటక రాజ్యం దక్కన్‌లోని ఒక మొగల్ సుబాగా.. హైదరాబాద్ నిజాం నామమాత్రపు నియంత్రణలో ఉండేది. ఈ ప్రాంతంలో జరిగిన అంతర్యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచివారు చెరో వర్గాన్ని సమర్థించారు. చివరకు బ్రిటిషర్లు ఫ్రెంచివారిపై ఆధిపత్యం సాధించారు.
 

మొదటి కర్ణాటక యుద్ధం (1745-1748)

   ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో బ్రిటిషర్లకు, ఫ్రెంచివారికి మధ్య పోరు మొదలైంది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచి పడవలను స్వాధీనం చేసుకుంది. దానికి ప్రతీకారంగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం మద్రాసును ఆక్రమించింది. తమను ఫ్రెంచివారి నుంచి రక్షించాల్సిందిగా బ్రిటిషర్లు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ను కోరారు. ఈ మేరకు నవాబు చేసిన ఆజ్ఞలను ఫ్రెంచివారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచివారికి, అన్వరుద్దీన్‌కు మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నవాబు ఘోరంగా ఓడిపోయాడు. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగియడంతో భారతదేశంలో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య యుద్ధం కూడా ముగిసింది.
 

రెండో కర్ణాటక యుద్ధం (1749-1754)

   వారసత్వ యుద్ధ సమయంలో ఫ్రెంచివారు హైదరాబాద్‌లో ముజఫర్‌జంగ్‌కు, కర్ణాటకలో చందాసాహెబ్‌కు మద్దతు పలికారు. బ్రిటిషర్లు హైదరాబాద్‌లో నాజర్‌జంగ్‌కు, కర్ణాటకలో అన్వరుద్దీన్‌కు, తర్వాత అతడి కుమారుడు మహమ్మద్ అలీకి మద్దతిచ్చారు. 1749లో ఫ్రెంచివారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్ఠించేలా చేశారు. అయితే బ్రిటిషర్లు రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందాసాహెబ్‌ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహమ్మద్ అలీ వశమైంది.
 

మూడో కర్ణాటక యుద్ధం (1758-1763)

   ఐరోపాలో ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ల మధ్య 1756లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచి గవర్నరు కౌంట్ డి లాలీ బ్రిటిష్ జనరల్ సర్ ఐర్‌కూట్ చేతిలో ఓడిపోయాడు. ఫ్రెంచివారి స్థానంలో బ్రిటిషర్లు నిజాం సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. 1763లో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య సంధి కుదిరింది.
 

బెంగాల్ ఆక్రమణ

   మొగల్ సామ్రాజ్య పతనం తర్వాత ముర్షిద్ కులీఖాన్ బెంగాల్‌లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ముర్షిద్ కులీఖాన్ తర్వాత అతడి అల్లుడు షుజాఉద్దీన్ సింహాసనాన్ని ఆక్రమించాడు. అతడి కుమారుడు సర్ఫరాజ్ పరిపాలనాకాలంలో బీహార్ డిప్యూటీ గవర్నరు అలీవర్దీఖాన్ 1740లో బెంగాల్ నవాబుగా ప్రకటించుకున్నాడు. ఇతడి కాలంలో బెంగాల్‌పై మరాఠాలు అనేక సార్లు దండయాత్రలు చేశారు. 1751లో బెంగాల్ నవాబుకు, మరాఠాలకు మధ్య సంధి కుదిరింది. ఈ సంధి ప్రకారం బెంగాల్ నవాబు మరాఠాలకు సంవత్సరానికి రూ.12 లక్షల చౌత్ చెల్లించడానికి అంగీకరించాడు. అలీవర్దీఖాన్ 1752లో తన మనవడు సిరాజ్-ఉద్-దౌలాను తన వారసుడిగా ప్రకటించాడు. సిరాజ్ సమీప బంధువు షౌకత్ జంగ్, పిన్ని గసితి బేగం, అలీవర్ద్దీఖాన్ సోదరి భర్త, సర్వసైన్యాధ్యక్షుడైన మీర్జాఫర్‌లు బెంగాల్ సింహాసనానికి ప్రధాన పోటీదారులు. వీరిని బలహీనపరచడానికి సిరాజ్ అనేక చర్యలు చేపట్టాడు. గసితి బేగం సంపదను లాక్కున్నాడు. మీర్జాఫర్ స్థానంలో మీర్‌మదన్‌ను సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. షౌకత్ జంగ్ తిరుగుబాటును అణచివేయడమే కాకుండా అతడిని చంపేశాడు.
 

సిరాజ్-ఉద్-దౌలా బ్రిటిషర్లతో వైరం పెంచుకోవడానికి కారణాలు

* చట్టానికి విరుద్ధంగా బ్రిటిషర్లు నవాబు ఆధీనంలోని భూభాగంలో కోటలు నిర్మించడంతోపాటు పెద్ద కందకాన్ని తవ్వడం.
* ఆంగ్లేయులు దస్తక్ / ఉచిత పాసులను అనర్హులకు కేటాయించి దుర్వినియోగం చేయడం ద్వారా నవాబు ఆదాయానికి గండికొట్టడం.
నవాబుకు అవిధేయులు, లంచగొండులైన అధికారులకు ఆంగ్లేయులు రక్షణ కల్పించడం.
* తన పూర్వికుల్లా తాను కూడా బ్రిటిషర్లపై నియంత్రణ కలిగి ఉండాలని భావించడం.

 

ప్లాసీ యుద్ధం
  ప్లాసీ అనేది ముర్షిదాబాద్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. అక్కడ 1757 జూన్ 23న బ్రిటిషర్లకు, నవాబు సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు సిరాజ్-ఉద్-దౌలాను ఓడించాయి. నవాబు సైన్యంలోని అయిదుగురు సేనానుల్లో మీర్ మదన్, మదన్‌లాల్ మాత్రమే యుద్ధం చేశారు. మిగతా ముగ్గురు మీర్జాఫర్, యార్‌లతుఫ్ ఖాన్, రాయ్‌దుర్లబ్‌రామ్ కంపెనీ ఏజెంట్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని ప్రేక్షకపాత్ర వహించారు.

   ప్లాసీ యుద్ధం మొదట బెంగాల్‌లో, చివరికి దేశమంతటా బ్రిటిష్ వారి ఆధిపత్య స్థాపనకు దారితీసింది. భారతదేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరలింపు ప్రారంభమైంది. సిరాజ్-ఉద్-దౌలా స్థానంలో మీర్జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఆ తర్వాత మీర్‌ఖాసిం బెంగాల్ నవాబు అయ్యాడు.
 

బక్సార్ యుద్ధం (1764)
   బక్సార్ యుద్ధం 1764 అక్టోబరు 22న మేజర్ హెక్టర్ మన్రో నాయకత్వంలోని బ్రిటిష్ సేనలకు - మీర్‌ఖాసిం, అవధ్ నవాబు షుజా-ఉద్-దౌలా, మొగలు చక్రవర్తి రెండో షా ఆలం ఉమ్మడి సేనలకు మధ్య జరిగింది. బక్సార్ అనే ఈ ప్రదేశం పాట్నా నగరానికి పశ్చిమంగా 120 కి.మీ.ల దూరంలో ఉంది.

 

కారణాలు

* సార్వభౌమాధికారం కోసం బ్రిటిషర్లు - బెంగాల్ నవాబు మీర్‌ఖాసిం మధ్య పోరు.
* 1717లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను బ్రిటిషర్లు దుర్వినియోగం చేయడం.
* నవాబు బెంగాల్‌లో అంతర్గత వ్యాపారంపై అన్ని రకాల పన్నులను తొలగించడం.
నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం.
   ఈ యుద్ధం భారతీయ పాలకుల ఓటమితో ముగిసింది. మూడు రాజ్యాల సేనల మధ్య సమన్వయం లేకపోవడమే బ్రిటిషర్ల విజయానికి ప్రధాన కారణం.

 

అలహాబాద్ ఒప్పందం

   బక్సార్ యుద్ధం తర్వాత 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో బ్రిటిష్ ఆధిపత్య స్థాపన మొదలైంది. అవధ్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారాడు. మొగలు చక్రవర్తి రెండో షా ఆలం కంపెనీ పెన్షనర్ అయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఔన్నత్యం పెరిగింది.
 

మైసూరు రాజ్యం

   తూర్పు, పశ్చిమ కనుమలకు మధ్య నెలకొన్న మైసూరు రాజ్యాన్ని ఒడయార్ వంశం పరిపాలించేది. క్రీ.శ. 1731-1734 మధ్య సర్వసైన్యాధ్యక్షుడైన దేవరాజ, సర్వాధికారి (ఆర్థికమంత్రి) ననరాజ అనే సోదరులు మైసూరు రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. మరాఠాలు, నిజాం, బ్రిటిషర్లు, ఫ్రెంచివారు మైసూరు రాజ్యంపై వరుస దాడులు ప్రారంభించారు. రెండో కర్ణాటక యుద్ధం సమయంలో ననరాజ తిరుచిరాపల్లిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఆంగ్లేయుల పక్షం వహించాడు. తర్వాత అతడు ఫ్రెంచివారి పక్షాన చేరాడు. మైసూరు రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడైన హైదర్ అలీ తిరుచిరాపల్లి దండయాత్ర సందర్భంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. క్రీ.శ. 1758 తర్వాత మరాఠాలు మైసూరుపై దండెత్తినప్పుడు హైదర్ అలీ ననరాజ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుని మైసూరు పాలకుడయ్యాడు. అయితే ఇది నచ్చని కొంతమంది హైదర్ అలీపై దండెత్తవలసిందిగా మరాఠాలను ఆహ్వానించారు. ఇందులో హైదర్ అలీ ఓడిపోయాడు. మరాఠాలు మూడో పానిపట్టు యుద్ధంలో తలమునకలై ఉన్న సమయంలో హైదర్ అలీ తన అధికారాన్ని మళ్లీ సుస్థిరం చేసుకున్నాడు.
 

'కలకత్తా చీకటి గది' ఉదంతం

   సిరాజ్-ఉద్-దౌలా 1756 జూన్‌లో ఆంగ్లేయుల ఆధీనంలోని కలకత్తాను ఆక్రమించాడు. బెంగాల్ గవర్నరు రోజర్ డ్రేక్, ఇతర అధికారులు కలకత్తా నగరం వదిలి పారిపోయారు. హాల్‌వెల్‌తో సహా అనేక మంది ఐరోపావారు నవాబుకు లొంగిపోయారు. వీరిని ఒక చిన్న గదిలో రాత్రంతా బంధించడంతో తెల్లవారేసరికి 16 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఈ సంఘటనను 'కలకత్తా చీకటి గది' ఉదంతంగా పేర్కొన్నారు. అయితే దీనికి సిరాజ్-ఉద్-దౌలా స్వయంగా బాధ్యుడు కాడు. రాబర్ట్ క్లైవ్ 1757 జనవరి 2న అడ్మిరల్ వాట్సన్ సహాయంతో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటిషర్లకు, నవాబుకు మధ్య అదే ఏడాది ఫిబ్రవరి 9న అలీనగర్ సంధి కుదిరింది. క్లైవ్ మార్చిలో ఫ్రెంచివారికి చెందిన చంద్రనగర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. సిరాజ్-ఉద్-దౌలా ఆస్థానంలోని మీర్జాఫర్, రాయ్‌దుర్లబ్‌రామ్, అమీన్‌చంద్, జగత్‌సేఠ్‌లకు నవాబు వ్యవహార శైలి నచ్చలేదు. వారు అతడిని నవాబు పదవి నుంచి తొలగించాలని కుట్రపన్నారు. అమీన్‌చంద్ ఈ విషయాన్ని బ్రిటిషర్లకు తెలియజేయడంతో వారు సిరాజ్-ఉద్-దౌలాను ఓడించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
 

మైసూరు యుద్ధాలు
 

మొదటి మైసూరు యుద్ధం (1766-1769)
మైసూరు పాలకుడు హైదర్ అలీ బ్రిటిషర్లను కర్ణాటక ప్రాంతంతోపాటు భారతదేశం నుంచి కూడా తరిమివేయాలని భావించాడు. హైదర్ అలీ వల్ల తమ సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లనుందని గ్రహించిన బ్రిటిషర్లు నిజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో బ్రిటిషర్లపై విజయం సాధించిన హైదర్ అలీ మద్రాసుకు 5 కి.మీ.ల మేర దండయాత్ర కొనసాగించాడు. 1769లో జరిగిన మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది.

 

రెండో మైసూరు యుద్ధం (1780-1784)
మరాఠాలు 1771లో హైదర్ అలీపై దాడి చేసినప్పుడు బ్రిటిషర్లు హైదర్ అలీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. అమెరికా స్వాతంత్య్ర యుద్ధం సందర్భంగా ఇంగ్లండ్‌కు, హైదర్ అలీ మిత్రదేశమైన ఫ్రాన్సుకు మధ్య తగాదా తలెత్తింది. హైదర్ అలీ ఆధీనంలోని ఫ్రెంచి భూభాగమైన మహేను బ్రిటిషర్లు ఆక్రమించారు. ఇవే ఈ యుద్ధానికి దారితీసిన కారణాలు. 1780లో జరిగిన యుద్ధంలో కల్నల్ బైలీని హైదర్ అలీ ఓడించాడు. 1781లో పోర్టోనోవో యుద్ధంలో ఐర్ కూట్ చేతిలో పరాజయం పొందాడు. 1782లో కల్నల్ బ్రైట్ వైట్‌ను ఓడించాడు. ఈ యుద్ధం జరుగుతుండగానే హైదర్ అలీ మరణించాడు. దీంతో అతడి కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. ఈ యుద్ధం 1784లో జరిగిన 'మంగళూరు సంధి'తో ముగిసింది.

 

మూడో మైసూరు యుద్ధం (1790-1792)

   అంతర్గత సంస్కరణల ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడం.. టర్కీ, ఫ్రాన్సులకు రాయబారులను పంపడం ద్వారా వారి సహాయం పొందడానికి ప్రయత్నించడం.. బ్రిటిషర్ల మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్ రాజ్య భూభాగాలను ఆక్రమించడం.. ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు. బ్రిటిష్ సైన్యానికి స్వయంగా గవర్నరు జనరల్ కారన్ వాలిస్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాడు. 1792లో జరిగిన శ్రీరంగ పట్టణం సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగం భూభాగాన్ని బ్రిటిషర్లకు ఇవ్వడానికి అంగీకరించాడు. యుద్ధ నష్టపరిహారం కింద రూ. 3.6 కోట్లు చెల్లించడానికి అంగీకరించి రూ. 1.6 కోట్లు వెంటనే చెల్లించాడు.
 

 

నాలుగో మైసూరు యుద్ధం (1799)

   టిప్పు సుల్తాన్ తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, బ్రిటిష్ గవర్నరు జనరల్ వెల్లస్లీ బ్రిటిష్ సామ్రాజ్యానికి టిప్పు సుల్తాన్ నుంచి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించాలనుకోవడం ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణాలు. శ్రీరంగ పట్టణంలో జరిగిన ఈ యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడుతూ 1799 మేలో టిప్పు సుల్తాన్ మరణించాడు. గవర్నరు జనరల్ సోదరుడు సర్ ఆర్ధర్ వెల్లస్లీ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతడే 1815లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ను ఓడించాడు. టిప్పు సుల్తాన్ మరణంతో మైసూరు రాష్ట్రంలోని చాలా భూభాగాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. కొంత భూభాగానికి ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ అనే బాలుడిని రాజుగా చేసి మైసూరు రాజవంశాన్ని పునరుద్ధరించారు.
   హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ గొప్ప పరిపాలకులు. ఇద్దరూ పరమత సహనాన్ని పాటించారు. హైదర్ అలీ ఎప్పుడూ బహిరంగంగా రాజరిక బిరుదులు ధరించలేదు. ఇతడికి, రాజవంశానికి మధ్య సంబంధం మరాఠా చక్రవర్తికి, పీష్వాకు మధ్య సంబంధంలా ఉండేది. అయితే టిప్పు సుల్తాన్ మైసూరు రాజును పదవీచ్యుతుడిని చేసి 1789లో సుల్తాన్ బిరుదు ధరించాడు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌లు తమ నాణేల మీద హిందూ దేవతల బొమ్మలు ముద్రించారు. టిప్పు సుల్తాన్‌కు శృంగేరి పీఠానికి చెందిన జగద్గురు శంకరాచార్యులపై ఎనలేని గౌరవం ఉండేది. శంకరాచార్యులకు దేవాలయ మరమ్మతుల కోసం భారీగా నిధులు ఇచ్చాడు. పరిపాలనలో పాశ్చాత్య పద్ధతులను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాజుగా టిప్పుసుల్తాన్ పేరుగాంచాడు. ఇతడు స్వదేశీ, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. న్యాయ పరిపాలనలో నిష్పాక్షికంగా వ్యవహరించాడు. అధికారుల ఎంపికలో కుల, మత, సాంఘిక తారతమ్యాలు చూపకుండా ప్రతిభకు పట్టం కట్టాడు. సమకాలీన భారతదేశ చరిత్రలో వీరి పరిపాలన అందరిమన్ననలు పొందింది.

 

 

మాదిరి ప్రశ్నలు
 

 

1. కిందివారిలో స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు ఎవరు?
   ఎ) సఫ్దర్ అలీ    బి) దోస్త్ అలీ    సి) సాదతుల్లా ఖాన్    డి) అన్వరుద్దీన్
జ: సి(సాదతుల్లా ఖాన్)

 

2. కర్ణాటక రాజ్య రాజధాని ఏది?
జ: ఆర్కాట్

 

3. హైదర్ అలీ ఏ మైసూరు యుద్ధ సమయంలో మరణించాడు?
జ: రెండో

 

4. ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజ్-ఉద్-దౌలాను బంధించి చంపిన వ్యక్తి ఎవరు?
జ: మీరాన్

 

5. బక్సార్ యుద్ధ వీరుడు ఎవరు?
జ: హెక్టర్ మన్రో

 

6. చీకటి గది ఉదంతం గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరు?
జ: హాల్‌వెల్

 

7. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
జ: రాబర్ట్ క్లైవ్

 

8. టిప్పు సుల్తాన్ ఎప్పుడు మరణించాడు?
జ: 1799

 

9. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జ: మంగళూరు

 

10. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్‌కు, కుట్రదారులకు మధ్య రహస్య ఒప్పందాన్ని కుదిర్చిన వ్యక్తి ఎవరు?
జ: అమీన్‌చంద్

 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కడ‌ప‌టి మొగ‌లుల పాల‌న‌

    భారతదేశ చరిత్రలో మొగల్ సామ్రాజ్యానికి విశిష్ట స్థానం ఉంది. 300 సంవత్సరాల ఢిల్లీ సుల్తానుల పాలనను అంతమొందించడమే కాకుండా భారత ఉపఖండంలో నూతన శకం ఆరంభానికి మొగలులు నాంది పలికారు. సువిశాల సామ్రాజ్యం, పటిష్టమైన సైన్యం, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక ప్రగతిని సాధించడం ద్వారా వీరు భారతీయ సంస్కృతి ఔన్నత్యానికి దోహదపడ్డారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ కడపటి మొగలుల అధికార దాహం, విలాస జీవనం, అసమర్థ పాలనతో సామ్రాజ్యం పతనమైంది.
    ఔరంగజేబు మరణించే నాటికి(క్రీ.శ.1707) మొగల్ సామ్రాజ్య విస్తీర్ణం ఉచ్ఛ స్థితికి చేరుకుంది. 21 రాష్ట్రాలు ఉండేవి. ఔరంగజేబు మరణానంతరం మొగల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. అక్బర్ నుంచి ఔరంగజేబు వరకు నలుగురు గొప్ప మొగలులు 151 సంవత్సరాలు పరిపాలించారు. అయితే మొదటి బహదూర్‌షా నుంచి రెండో షా ఆలం వరకు 11 మంది కడపటి మొగలులు 100 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. అంటే కడపటి మొగలులు ఒక్కొక్కరూ సగటున 10 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలేకపోయారు. వ్యక్తిత్వం, సామ్రాజ్య విస్తీర్ణం తదితర అంశాల్లో ముందుతరం మొగలులకు, కడపటి మొగలులకు పోలికే లేదు.

 

మొదటి బహదూర్‌షా (1707- 1712)
 ఔరంగజేబు మరణానంతరం అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. చివరికి కాబూల్ గవర్నర్‌గా ఉన్న మువజ్జం వారసత్వ యుద్ధంలో నెగ్గి బహదూర్ షా పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు సిక్కుల గురువు గోవింద్‌సింగ్‌ను మొగలుల సర్వీసులోకి తీసుకోవడం ద్వారా సిక్కులు, మొగలులకు మధ్య ఉన్న వైరానికి తెరదించాడు. అయితే తర్వాతి సిక్కు గురువు బందా బహదూర్ మొగలులపై తిరుగుబాటు చేశాడు. బహదూర్‌షా స్వయంగా యుద్ధం చేసినప్పటికీ సిక్కులను అణిచివేయలేక పోయాడు. అదే సమయంలో మొగలుల చెరలో ఉన్న శంభాజీ కొడుకు సాహును చెర నుంచి విడిపించాడు. ఔరంగజేబు విధించిన జిజియా పన్నును రద్దు చేశాడు. మేవార్, మార్వార్ రాజ్యాల స్వాతంత్య్రాన్ని గుర్తించాడు. బుందేలు నాయకుడు ఛత్రసాల్, జాట్‌ల నాయకుడు చూరమాన్‌లను మొగల్ పరిధిలోకి తీసుకోవడం ద్వారా వారితో వైరం తొలగిపోయింది. క్రీ.శ. 1712లో బహదూర్‌షా మరణాంతరం అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. వారు తండ్రి శవానికి దహన క్రియలు చేయడం కూడా మరచి వారసత్వ యుద్ధంలో మునిగిపోయారు. చివరికి పెద్ద కుమారుడు జహందర్‌షా వారసత్వ యుద్ధంలో గెలిచాడు. 10 వారాల తర్వాత బహదూర్‌షాకు వారు అంత్యక్రియలు నిర్వహించారు.

 

జహందర్‌షా (1712 - 1713)
 వారసత్వ యుద్ధంలో జుల్ఫికర్‌ఖాన్ మద్దతుతో జహందర్‌షా విజయం సాధించాడు. ఇతడి కాలంలో జహందర్‌షా భార్య లాల్‌కున్వర్ పారిపాలనా విషయాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఆమె రక్త సంబంధీకులు రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు. మొగలుల పరువు, ప్రతిష్ఠలు దిగజారాయి. ఇతడి కాలంలో తురానీలు, ఇరానీలు, హిందుస్థానీలు అనే మూడు వర్గాలు ఉండేవి. తురానీలు సున్నీ శాఖకు చెందిన వారు కాగా, ఇరానీలు షియా శాఖకు చెందినవారు.

 

ఫరూక్‌సియార్ (1713 - 1719)
 ఇతడు జహందర్ షా సోదరుడి కుమారుడు. సయ్యద్ సోదరుల సహకారంతో సింహాసనాన్ని అధిష్టించాడు. దీనికి ప్రతిఫలంగా చక్రవర్తి సయ్యద్ అబ్దుల్లాఖాన్‌ను వజీర్‌గా, అతడి తమ్ముడు హుస్సేన్ అలీఖాన్‌ను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. ఫరూక్ సియార్ ఉత్తర్వుల మేరకు జుల్ఫికర్ ఖాన్‌ను వధించారు. సయ్యద్ సోదరులు తమ స్థానంలో వేరేవారిని చక్రవర్తి నియమించకుండా ఉండటం కోసం  బంధీలుగా ఉన్న రాకుమారులందరి కళ్లు తీయించారు. తర్వాత చక్రవర్తి, సయ్యద్ సోదరుల మధ్య తగాదా ప్రారంభమైంది. చివరికి ఫరూక్‌సియార్‌ను సయ్యద్ సోదరులు చంపేసి, రఫీ ఉద్దరజత్‌ను చక్రవర్తిగా నియమించారు. అయితే అతడు నాలుగు నెలల్లోనే మరణించాడు. తర్వాత అతడి అన్న రఫీ ఉద్దౌలాను రెండో షాజహాన్ పేరుతో సింహాసనంపై కూర్చోబెట్టారు.

 

మహమ్మద్‌షా (1719 - 1748)

    రెండో షాజహాన్ 1719 సెప్టెంబరులో మరణించాడు. అతడి స్థానంలో రౌషాన్ అక్తర్‌ను మహమ్మద్ షా అనే బిరుదుతో సయ్యద్ సోదరులు సింహాసనంపై కూర్చోబెట్టారు. నిజాం ఉల్ ముల్క్, ఇతిమద్ ఉద్దౌలా, సాదత్‌ఖాన్, మహమ్మద్‌షా తల్లి కూటమిగా ఏర్పడి సయ్యద్ సోదరులను చంపడానికి కుట్ర పన్నారు. 1720లో సయ్యద్ హుస్సేన్ అలీఖాన్, అతడి కుమారుడిని దక్కనులో చంపించారు. నెల తర్వాత అతడి సోదరుడు అబ్దుల్లా ఖాన్‌ను బంధించి విష ప్రయోగంతో హతమార్చారు. సయ్యద్ సోదరుల మరణం తర్వాత మొగల్ సామ్రాజ్య పతనం మరింత వేగవంతమైంది. మహమ్మద్‌షా వయసు సింహాసనాన్ని అధిష్టించేనాటికి 18 సంవత్సరాలు మాత్రమే. ఇతడు నిరంతరం రాజప్రసాదం నాలుగు గోడల మధ్య అంతఃపుర స్త్రీల సాంగత్యంలో గడిపాడు. విలాసాలకు బానిస కావడంతో 'రంగీలాగా పేరుగాంచాడు. ఇతడు మహమ్మద్ అమీన్‌ఖాన్‌ను వజీర్‌గా నియమించాడు. 1721లో అమీన్‌ఖాన్ మరణం తర్వాత నిజాం ఉల్‌ముల్క్‌ను ఆ స్థానంలో నియమించాడు. ఇతడు సంస్కరణల ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని ప్రయత్నించాడు. అయితే చక్రవర్తి ఇతడికి పరోక్షంగా ఇబ్బందులు కల్పించాడు. దీంతో విసిగిపోయిన నిజాం ఉల్‌ముల్క్ వజీర్ పదవిని వదలిపెట్టి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని 1724లో స్థాపించాడు. ముర్షీద్ కులీఖాన్ బెంగాల్‌లో, సాదత్‌ఖాన్ అవధ్‌లో స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. మాల్వా, గుజరాత్‌లు మొగల్ సామ్రాజ్యం నుంచి విడిపోయాయి.

 

నాదిర్షా దండయాత్ర (1738 - 1739)
    ఇరాన్ నెపోలియన్‌గా పేరు పొందిన నాదిర్షా భారతదేశంపై 1738-39లో దండయాత్ర చేశాడు. 1738లో కాబూల్, జలాలాబాద్, పెషావర్‌లను ఆక్రమించాడు. 1739లో లాహోర్ ఇతడి ఆధీనమైంది. నిజాం ఉల్‌ముల్క్, కమీరుద్దీన్, ఖాన్-ఇ-దౌరాన్, సాదత్‌ఖాన్‌లు నాదిర్షాను అడ్డుకున్నారు. ఫిబ్రవరి 1739లో కర్నాల్ వద్ద మొగల్ సైన్యం ఓడిపోయింది. ఈ యుద్ధంలో ఖాన్-ఇ-దౌరాన్ మరణించాడు. సాదత్‌ఖాన్ సలహాతో నాదిర్షా 1739, మార్చి 20న ఢిల్లీపై దండెత్తాడు. రెండు రోజుల తర్వాత నాదిర్షా మరణించాడనే వదంతులు వచ్చాయి. మొగల్ సైనికులు 700 మంది నాదిర్షా సైనికులను చంపారు. దీంతో నాదిర్షా ఆదేశం మేరకు 20,000 మంది భారతీయులను చంపారు. నాదిర్షా ఢిల్లీలో 47 రోజులపాటు ఉండి ప్రతి ఇంటినీ దోచుకున్నాడు. ప్రసిద్ధిగాంచిన నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం నాదిర్షా వశమయ్యాయి.

అహమ్మద్ షా అబ్దాలీ తొలి దండయాత్రలు
1747లో నాదిర్షా మరణానంతరం అతడి సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. అతడి ముఖ్య సైన్యాధ్యక్షుల్లో అబ్దాలీ తెగకు చెందిన అహ్మద్ అఫ్గనిస్థాన్‌కు పాలకుడిగా ప్రకటించుకున్నాడు. కాబూల్, కాందహార్‌లను ఆక్రమించి పెషావర్ చేరుకున్నాడు. తర్వాత సింధు నదిని దాటి లాహోర్, సర్‌హింద్‌లను 1748లో ఆక్రమించాడు. ఇతడి రెండో దండయాత్ర సమయంలో మహమ్మద్‌షా మరణించాడు.

 

అహమ్మద్ షా (1748 - 1754)
మహమ్మద్ షా తర్వాత అతడి కుమారుడు అహమ్మద్ షా చక్రవర్తి అయ్యాడు. ఇతడు మహమ్మద్ షా, ఒక నర్తకికి జన్మించాడు. అహమ్మద్‌షా మద్యపానం, స్త్రీలకు బానిసై పరిపాలననంతా తన తల్లి ఉద్ధంబాయికి అప్పగించాడు. ఈ కాలంలో అవధ్ నవాబు సఫ్దర్‌జంగ్ మొగల్ సామ్రాజ్యానికి వజీరుగా వ్యవహరించేవాడు. అహమ్మద్‌షా తల్లి ఇతడిని 1753లో ఆ పదవి నుంచి తొలగించి ఇతిజం ఉద్దౌలాను వజీర్‌గా నియమించింది. ఇతడు అహమ్మద్ షాను పదవీచ్యుతుడిని చేశాడు. తర్వాత అహ్మద్‌షాను, అతడి తల్లిని బంధించాడు.

అహమ్మద్ షా కాలంలో అహమ్మద్ షా అబ్దాలీ 1749, 1752లో భారతదేశంపై రెండు సార్లు దండెత్తాడు. ఢిల్లీ పతనం కాకుండా ఉండటం కోసం మొగల్ సుల్తాన్ అహ్మద్‌షా పంజాబ్, ముల్తాన్‌లను అహ్మద్‌షా అబ్దాలీకి అప్పగించాడు. ఇతడి కాలంలో మొగలుల కోశాగారం ఖాళీ అయ్యింది.
 

రెండో అలంఘీర్ (1754 - 1759)
అహమ్మద్ షా పదవీచ్యుతుడైన తర్వాత జహందర్ షా మనవడైన అజీజుద్దీన్ రెండో ఆలంఘీర్ బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడి కాలంలో మొగలుల సైనిక, ఆర్థిక వ్యవస్థలు బాగా దిగజారిపోయాయి. సైనికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో వారి తిరుగుబాట్లు సర్వసాధారణమయ్యాయి. ఈ సమయంలో అహమ్మద్‌షా అబ్దాలీ భారతదేశంపై 1755లో నాలుగోసారి దండెత్తాడు. ఆలంఘీర్‌ను తన వజీర్ 1759 నవంబరులో హత్య చేశాడు.

 

రెండో షా ఆలం (1759 - 1806)
ఇతడు రెండో ఆలంఘీర్ కుమారుడు. ఇతడి అసలు పేరు అలీగౌహర్. రెండో షా ఆలం 1759లో సింహాసనాన్ని అధిష్ఠించినా, తన వజీరుకు భయపడి రాజధానిలో నివసించ లేదు. ఇదే సమయంలో అహమ్మద్ షా అబ్దాలీ భారతదేశంపై అయిదోసారి దండెత్తాడు. చివరికి ఇది మూడో పానిపట్ యుద్ధానికి (1761, జనవరి 15) దారితీసింది. ఈ యుద్ధంలో అబ్దాలీ మరాఠాలతో పాటు మొగలులను కూడా  ఓడించాడు. రెండో షా ఆలం బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, అవధ్ నవాబు షుజా ఉద్దౌలాతో కలసి 1764లో 'బక్సార్ యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడి ఓడిపోయాడు. అయితే 1772లో మరాఠాలు రెండో షా ఆలంను ఢిల్లీ సుల్తానుగా ప్రకటించుకున్నారు. అనంతరం నజీబుద్దౌలా 1788లో షాఆలం కళ్లు తీయించాడు. 1803లో బ్రిటిషర్లు ఢిల్లీని ఆక్రమించుకున్నారు. తర్వాత షాఆలం, అతడి వారసులు రెండో అక్బర్, రెండో బహదూర్‌షాలు బ్రిటిషర్ల పెన్షనర్లుగా జీవించారు. షాఆలం 1806లో మరణించాడు.

 

రెండో అక్బర్ (1806 - 1837)ఇతడు సంఘ సంస్కర్త అయిన రామమోహన్‌రాయ్‌కి 'రాజా అనే బిరుదునిచ్చాడు. రామమోహన్‌రాయ్ బ్రిటిషర్లు మొగలు చక్రవర్తికి ఇచ్చే పెన్షన్‌ను పెంచే విధంగా వారితో మాట్లాడటానికి ఇంగ్లండ్ వెళ్లాడు.

 

రెండో బహదూర్ షా (1837 - 1857)
  ఇతడు కడపటి మొగల్ చక్రవర్తుల్లో చివరివాడు. 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఓడిపోయాడు. దీంతో అదే ఏడాది మొగలు చక్రవర్తి పదవిని బ్రిటిషర్లు నిషేధించి బహదూర్ షాను బంధించి, రంగూన్‌కు పంపారు. అతడు అక్కడే 1862లో మరణించాడు.

 

మొగలు సామ్రాజ్య పతనానికి కారణాలు
* ఔరంగజేబు కాలం నాటికి మొగల్ సామ్రాజ్యం నియంత్రించ లేనంతగా విస్తరించింది. ఈ సామ్రాజ్య విస్తరణ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించి యుద్ధాలు చేయడంతో ఖజానా ఖాళీ అయ్యింది.
* ఇతడు పరమత ద్వేషం పాటించడంతో అసంఖ్యాకులైన హిందువులతో వైరాన్ని పెంచుకున్నాడు. దీంతో జాట్లు, సిక్కులు, రాజపుత్రులు, మరాఠాలు తిరుగుబాట్లు చేశారు.
* ఇతడి దక్కను విధానం మొగలు సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమైంది.
ఔరంగజేబు తర్వాత సింహాసనాన్ని అదిష్ఠించిన పాలకులంతా బలహీనులు కావడంతో సమస్యలను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేశారు.
* నాదిర్షా, అహమ్మద్ షా అబ్దాలి దండయాత్రలు మొగల్ సామ్రాజ్య పతనాన్ని వేగవంతం చేశాయి.
వ్యవసాయం, వ్యాపారం కుంటుపడటంతో రైతుల పరిస్థితి దిగజారి వారంతా తిరుగుబాటు చేశారు.
* మొగల్ సైన్యం బలహీన పడటానికి మరో ప్రధాన కారణం మున్సబ్‌దారీ విధానం సక్రమంగా అమలు కాకపోవడం. ఈ విధానంలో అనేక లోపాలుండటంతో సైన్యంలో క్రమశిక్షణ కొరవడింది. సైనికులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడంతో వారు కూడా తిరుగుబాటు చేశారు.
* బ్రిటిషర్ల అధికారం పుంజుకోవడంతో మొగల్ సామ్రాజ్యం పతనమైంది. వీరు సుమారు 100 ఏళ్ల పాటు మొగలులతో పోరాడారు. చివరకు 1857లో సిపాయిల తిరుగుబాటులో మొగలులను పూర్తిగా ఓడించి చక్రవర్తి పదవిని నిషేధించారు.

 

 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కడ‌ప‌టి మొగ‌లుల పాల‌న‌

మాదిరి ప్రశ్నలు
 

1. మొదటి బహదూర్‌షాపై తిరుగుబాటు చేసిన సిక్కుల గురువు ఎవరు?
జ: బందాబహదూర్

 

2. కిందివారిలో ఛత్రసాల్ ఎవరి నాయకుడు?
ఎ) జాట్‌లు బి) రాజపుత్రులు సి) బుందేలులు డి) సిక్కులు
జ: సి(బుందేలులు)

 

3. మొదటి బహదూర్‌షా అసలు పేరు?
జ: మువజ్జం

 

4. జహందర్ షా ఎవరి మద్దతుతో మొగలు చక్రవర్తి అయ్యాడు?
జ: జుల్ఫికర్ ఖాన్

 

5. ఏ మొగల్ చక్రవర్తిని సయ్యద్ సోదరులు హతమార్చారు?
జ: ఫరూక్‌సియార్

 

6. సయ్యద్ సోదరులను ఏ మొగల్ చక్రవర్తి కాలంలో చంపేశారు?
జ: మహమ్మద్ షా

 

7. 'రంగీలా'గా పేరు పొందిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: మహమ్మద్ షా

 

8. ఏ ప్రాంతంలో నిజాం ఉల్ ముల్క్ స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించాడు?
జ: హైదరాబాద్

 

9. కింది వారిలో 'ఇరాన్ నెపోలియన్‌'గా పేరుగాంచింది ఎవరు?
ఎ) అహమ్మద్ షా అబ్దాలీ బి) మొదటి డేరియస్ సి) నాదిర్షా డి) ఇతిమద్ ఉద్దౌలా
జ: సి(నాదిర్షా)

 

10. నాదిర్షాకు, మొగల్ సైన్యానికి మధ్య 1739 ఫిబ్రవరిలో యుద్ధం ఎక్కడ జరిగింది?
జ: కర్నాల్

 

11. అహమ్మద్‌షా అబ్దాలీ ఏ తెగకు చెందినవాడు?
జ: అబ్దాలి

 

12. రెండో అలంఘీర్ అసలు పేరు?
జ: అజీజుద్దీన్

 

13. మూడో పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
జ: 1761

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ 18వ శతాబ్దపు స్థితిగతులు

భారతదేశ చరిత్రలో 18వ శతాబ్దానికి ప్రాధాన్యం ఉంది. అప్పట్లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు ఎలా ఉండేవనేది తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ అంశంపై అడిగే ప్రశ్నలకు సులువుగా జవాబులు గుర్తించవచ్చు. ఆనాటి ఆచార వ్యవహారాలు - కట్టుబాట్లు, విద్యా వ్యవస్థ, గ్రామీణ - పట్టణ ప్రాంతాల పరిస్థితులు, ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులు.. ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం.. తదితర ఆసక్తికరమైన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం.  భారతదేశంలో క్రీ.శ. 18వ శతాబ్దంలో రాజకీయ అస్థిరత నెలకొన్నప్పటికీ కొన్ని మార్పులతో సమాజంలోని సంప్రదాయ లక్షణాలు కొనసాగుతూనే ఉండేవి.
 

సాంఘిక అసమానతలు
సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన చక్రవర్తి, అధికార వర్గం విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. వీరు మద్యం, స్త్రీ, సంగీతానికి బానిసలుగా తయారయ్యారు. దిగువ స్థాయిలో గ్రామీణ పేద వ్యవసాయదారులు, చేతివృత్తులవారు ఉండేవారు. ఈ రెండు వర్గాలకు మధ్యలో చిన్న వ్యాపారులు, దిగువ తరగతి ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లోని చేతి వృత్తులవారు ఉండేవారు. సమకాలీన ఆధారాలు లేకపోవడం, వివిధ ప్రాంతాల్లో ఆదాయం, ధరల్లో వ్యత్యాసం ఉండటంతో ప్రజల జీవన ప్రమాణాన్ని పోల్చడం సాధ్యపడటంలేదు.

ఆ కాలంనాటి హిందూ సమాజంలోని కుల వ్యవస్థ ప్రత్యేకతను సంతరించుకుంది. వివాహం, దుస్తులు, ఆహారం, వృత్తుల ఎంపికలో కుల నియమాలు తప్పక పాటించేవారు. అయితే ఆర్థిక ఒత్తిడులు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన పరిపాలనాపరమైన ఆవిష్కరణల ఫలితంగా కొందరు తమ పూర్వీకుల వృత్తులను విడిచి కొత్త వృత్తులను చేపట్టారు.
 

స్త్రీల జీవనం
స్త్రీలకు ఇళ్లలో గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినా సమానత్వాన్ని మాత్రం ఇవ్వలేకపోయారు. మలబార్, కొన్ని వెనుకబడిన ప్రాంతాలు మినహా మిగతా దేశంలో పితృస్వామిక సమాజం అమల్లో ఉండేది. తండ్రి లేదా పెద్ద కుమారుడ్ని కుటుంబ పెద్దగా వ్యవహరించేవారు. రాజకీయాలు, పరిపాలన విషయాల్లో కొందరు హిందూ, ముస్లిం స్త్రీలు ప్రముఖ పాత్ర వహించినప్పటికీ సాధారణ స్త్రీలకు సమాజంలో సముచిత స్థానం లభించలేదు. స్త్రీలు పరదా విధానాన్ని అవలంబించేవారు. పేద స్త్రీలు మాత్రం ఈ విధానాన్ని పాటించలేదు.

* బాల్యవివాహాలు సర్వసాధారణం. రాజకుమారులు, పెద్ద జమిందార్లు, ధనవంతుల్లో బహు భార్యత్వం ఉండేది. ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌కు చెందిన ధనిక వర్గాల్లో ఈ ఆచారం ఎక్కువ. ధనిక వర్గాల్లో వరకట్నం తీసుకోవడం సంప్రదాయం. వితంతు పునర్వివాహాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగేవి. పీష్వాలు వితంతు పునర్వివాహాలపై 'పట్టం అనే పన్ను విధించేవారు. పీష్వాలు తమ భూభాగంలో సతీసహగమనాన్ని రూపుమాపడంలో కొంత విజయం సాధించారు.
 

రెండు విధాల బానిసత్వం
బానిసలను ఇంటి పని, పొలం పని చేసేవారు.. ఇలా రెండు తరగతులుగా విభజించారు. యజమాని భూమిని అమ్మినప్పుడు ఆ పొలాల్లో పనిచేసే బానిసలు కొత్త యజమాని కింద పనిచేయాల్సి వచ్చేది. భారతదేశంలో బానిసత్వం ఎక్కువగా అమల్లో ఉన్నట్లు ఐరోపాకు చెందిన యాత్రికులు, పరిపాలకులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కరవు, ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను కొంత ధరకు అమ్మేవారు. రాజపుత్రులు, ఖాత్రీలు, కయస్థ కులానికి చెందినవారు తమ ఇళ్లలో బానిస స్త్రీలను వినియోగించుకునేవారు. అమెరికా, ఐరోపా దేశాల్లోని బానిసలతో పోలిస్తే భారతదేశంలో బానిసల పరిస్థితి మెరుగ్గా ఉండేది. బానిసలను కుటుంబానికి చెందిన వారసత్వ సేవకులుగా పరిగణించేవారు. వారికి వివాహం చేసుకునే హక్కు ఉండేది. బానిసల పిల్లలను స్వేచ్ఛా పౌరులుగా గుర్తించేవారు.

ఐరోపావారి రాకతో బానిసత్వం, బానిసల వ్యాపారం కొత్త పుంతలు తొక్కింది. ఐరోపాకు చెందిన వర్తక కంపెనీలు 10 సంవత్సరాల బాలికను 5 నుంచి 15 రూపాయలకు, 16 ఏళ్ల బాలుడిని 16 రూపాయలకు, వయోజనుడైన బానిసను 15 నుంచి 20 రూపాయిలకు.. బెంగాల్, అసోం, బిహార్ మార్కెట్లలో కొని, వారిని ఐరోపా, అమెరికా మార్కెట్లలో అమ్మేవారు. ఐరోపావారు సూరత్, మద్రాసు, కోల్‌కతాల్లో అబిసీనియన్ బానిసలను కొని, ఇంటిపనికి వినియోగించినట్లు తెలుస్తోంది. క్రీ.శ. 1789 లో బానిస రవాణాను నిషేధించారు. అయితే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బానిసత్వం కొనసాగుతోంది.
 

విద్యకు ప్రాధాన్యం
హిందూ, ముస్లింలు విద్య నేర్చుకోవడానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. వీరు విద్యను మతంతో అనుసంధానం చేశారు. నాడియ, బెనారస్(కాశి), తీర్హుట్(మిథిల), ఉత్కల(ఒడిశా)లు సంస్కృత విద్యకు పేరుపొందిన కేంద్రాలు. ఎంతోమంది సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి కాశీకి వచ్చేవారు. అరబిక్, పర్షియన్ భాషల్లో ఉన్నత విద్యా కేంద్రాలను మద్రసాలని పిలిచేవారు. పర్షియన్ రాజభాష కావడంతో హిందూ, ముస్లింలు దీన్ని నేర్చుకునేవారు. ఖురాన్ అధ్యయనం చేయాలనుకునేవారు అరబిక్ భాషలో ప్రావీణ్యం సాధించేవారు.

ప్రాథమిక విద్య ఎక్కువగా విస్తరించింది. హిందువుల ప్రాథమిక విద్యా కేంద్రాలను పాఠశాలలని, ముస్లిం ప్రాథమిక పాఠశాలలను మక్తబ్‌లనీ పిలిచేవారు. పాఠశాలలు, దేవాలయాలు, మసీదులకు అనుబంధంగా ఉండేవి. పాఠశాలలో విద్యార్థులు చదవడం, రాయడం, అంకగణితాలను నేర్చుకునేవారు. సత్యం, నిజాయతీ, తల్లిదండ్రులపై విధేయత, మతం పట్ల విశ్వాసం మొదలైనవి పాఠశాలల్లో నేర్పించే ముఖ్యమైన విషయాలు. ఉన్నత కులాలకు చెందినవారు ఎక్కువగా చదువుకున్నప్పటికీ, తక్కువ కులాలకు చెందినవారి పిల్లలు కూడా పాఠశాలలకు హాజరయ్యేవారు. అయితే బాలికల విద్యకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.
 

కళలు - సాహిత్యం
కళలు, సాహిత్యానికి దిల్లీలో ఆదరణ లేకపోవడంతో కవులు, కళాకారులు కొత్తగా స్థాపించిన రాజ్యాల రాజధానులైన హైదరాబాద్, లఖ్‌నవూ(లక్నో), ముర్షీదాబాద్, జైపూర్ తదితర ప్రాంతాలకు తరలి వెళ్లేవారు. క్రీ.శ. 1784లో లఖ్‌నవూలో అసఫ్ ఉద్దౌలా మొహరం పండుగ జరుపుకోవడానికి వీలుగా గొప్ప ఇమంబరను నిర్మించాడు. ఈ భవన నిర్మాణంలో స్తంభాలు లేకపోవడం విశేషం.

మహారాజ రంజిత్ సింగ్ అమృత్‌సర్‌లోని సిక్కుల దేవాలయాన్ని పునరుద్ధరించాడు. 1725లో ఈ దేవాలయంలోని కింది సగభాగాన్ని పాలరాతితో, పై భాగాన్ని రాగితో నిర్మించి, పలుచటి బంగారంతో తాపడం చేయించాడు. అందుకే దీన్ని స్వర్ణదేవాలయంగా పిలుస్తున్నారు. భరత్‌పూర్ రాజధాని దిగ్‌లో సూరజ్‌మల్ ప్రాసాదం, ఆగ్రాలోని రాజ ప్రాసాదాలకంటే మిన్నగా స్వర్ణదేవాలయ పునర్‌నిర్మాణాన్ని ప్రారంభించినా.. దాన్ని పూర్తి చేయలేదు.
ప్రాంతీయ భాషలైన ఉర్దూ, హిందీ, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, మరాఠీ, తెలుగు, తమిళం అభివృద్ధి చెందాయి. క్రీ.శ. 18వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు ముద్రణ యంత్రాలను స్థాపించాయి. బైబిల్‌ను ప్రాంతీయ భాషల్లో ముద్రించాయి. బెంగాల్‌లో విలియం కేరి, వార్డ్, మార్ష్‌మాన్ లాంటి క్రైస్తవ మిషనరీలు సెరాంపూర్‌లో ముద్రణ యంత్రాన్ని స్థాపించి బెంగాలీ భాషలో బైబిల్‌ను ప్రచురించాయి.

 

ఆర్థిక వ్యవస్థ
క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభంలో భారత ఆర్థిక వ్యవస్థలో గ్రామాలు సొంత పరిపాలనా వ్యవస్థను కలిగి ఉండి, స్వయం సమృద్ధితో ఉండేవి. గ్రామానికి కావాల్సిన అన్ని వస్తువులను స్వయంగా ఉత్పత్తి చేసుకునేవి. ఇవి రాజ్యానికి భూమిశిస్తును చెల్లించేవి. పాలకులు, రాజవంశాలు మారినా గ్రామీణ వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ పరిస్థితులు ఐరోపా పరిశీలకుల దృష్టిని ఆసియా గ్రామీణ వ్యవస్థ వైపు ఆకర్షించాయి. భారతదేశంలో పట్టణ చేతివృత్తులు బాగా అభివృద్ధి చెంది, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లను ఆకర్షించాయి. అప్పట్లో భారతదేశంలోని ఢాకా, అహ్మదాబాద్, మచిలీపట్నం ప్రాంతాలు నూలు ఉత్పత్తులకు; ముర్షిదాబాద్, ఆగ్రా, లాహోర్, గుజరాత్‌లోని పలు ప్రాంతాలు పట్టు వస్త్రాలకు; లాహోర్, ఆగ్రా, కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్నితో చేసిన కార్పెట్లు, శాలువాలు, బంగారు, వెండితో చేసిన ఆభరణాలు, లోహపాత్రలు, ఆయుధాలకు విదేశాల్లో ఎక్కువ గిరాకీ ఉండేది. అంతర్గత, విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందడంతో వర్తక పెట్టుబడిదారీ వ్యవస్థ అమల్లోకి రావడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఉత్తర భారతదేశంలో జగత్‌షేర్‌లు, నగర్‌షేర్‌లు దక్షిణ భారతదేశంలో చెట్టియార్లు ఆవిర్భవించడంతో వర్తక, వాణిజ్యాలు మరింత అభివృద్ధి చెందాయి.

క్రీ.శ. 17, 18 శతాబ్దాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు పెట్టుబడిదారీ వ్యవస్థ త్వరగా అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులను కల్పించాయి. రైతుల నుంచి దోచుకున్న సంపదను భూస్వాములు తమ ఆడంబరాల కోసం వృథా చేసేవారు. ప్రభు వర్గానికి చెందినవారు మరణిస్తే వారి ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పించే చట్టాలు.. ప్రజల్లో సరైన మార్గంలో పొదుపు చేసే అలవాటు లేకపోవడం.. పొదుపు చేసిన సొమ్మును ఉత్పాదన కోసం వినియోగించక పోవడం.. రాజకీయ స్థిరత్వం లేకపోవడం.. అభివృద్ధి కాంక్ష, ముందు చూపులేని రాజ్యం.. ఇవన్నీ అభివృద్ధికి నిరోధకాలుగా ఉన్నాయి. క్రీ.శ. 18వ శతాబ్దంలో ఐరోపా వర్తక సంఘాలు భారతదేశంలో రాజకీయం, ఆర్థిక ఆసక్తితో బలంగా ఉండటం కూడా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు మళ్లడానికి కారణమైంది.
ముఖ్యాంశాలు
సతీసహగమన దురాచారాన్ని ఎక్కువగా బెంగాల్, మధ్య భారతదేశం, రాజస్థాన్‌లలో కొన్ని ఉన్నత కులాలకు చెందినవారు మాత్రమే పాటించేవారు.
బెంగాల్, బిహార్‌లలో సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేసే ఉన్నత విద్యా కేంద్రాలను 'చటుస్పతి అని పిలిచేవారు.
* బెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు కాశీని 'భారతదేశ ఏథెన్స్‌గా వర్ణించాడు.
* అజిమాబాద్(పాట్నా) తూర్పు భారతదేశంలో గొప్ప పర్షియన్ విద్యా కేంద్రంగా ఉండేది.
పింక్ సిటీగా పేరుపొందిన జైపూర్‌ను సవాయి జైసింగ్ నిర్మించాడు. దీంతో సహా అయిదు నగరాల్లో ఖగోళ పరిశీలన కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాడు.
డెన్మార్క్‌కు చెందిన జీజెన్‌బెల్గ్ తమిళ వ్యాకరణాన్ని రచించడంతోపాటు బైబిల్‌ను తమిళంలోకి అనువదించాడు.

 

 

 

Posted Date : 15-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆధునిక భారతదేశ చరిత్ర - ఐరోపా వారి రాక

  క్రీ.శ.18వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపనతో భారతదేశంలో ఆధునిక యుగం ప్రారంభమైనట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. క్రీ.శ.1453లో తురుష్కులు కాన్‌స్టాంట్‌నోపుల్‌ను ఆక్రమించుకున్నారు. ఫలితంగా తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఉన్న ఏకైక భూమార్గం మూసుకుపోయింది. నూతన మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నించిన తొలి ఐరోపా దేశం పోర్చుగల్.
* పోర్చుగల్ రాజు హెన్రీ స్వయంగా సముద్రంపై ప్రయాణించి, సముద్ర మార్గాన్ని భౌగోళిక పటంగా (పోర్టోలనీ) రూపొందించాడు. స్వయంగా నావికా శిక్షణ కేంద్రాన్ని స్థాపించాడు. కాబట్టి హెన్రీని 'ది నావిగేటర్' బిరుదుతో పిలుస్తారు.
* హెన్రీ ఆర్థిక సహాయంతో బార్తోలోమ్యూ డియాస్ (Bartolomeu Dias) తుపానుల అగ్రం/ కేప్ ఆఫ్ స్ట్రామ్స్‌ను కనుక్కున్నాడు.
* తర్వాత హెన్రీ కుమారుడు రెండో జాన్ కేప్ ఆఫ్ స్ట్రామ్స్ వరకూ వెళ్లి, దానికి కేప్ ఆఫ్ గుడ్‌హోప్ అనే పేరు పెట్టాడు.

 

పోర్చుగీసువారు

* 1498, మే 17న వాస్కోడిగామా భారతదేశానికి వచ్చి, కాలికట్ పాలకుడు జామెరిన్‌ను కలిసి వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు.

* వాస్కోడిగామాకు అబ్దుల్ వాజిద్ (అబ్దుల్ అజీజ్) అనే గుజరాత్ నావికుడు సహాయపడ్డాడు.

* ఆధునిక యుగంలో భారతదేశానికి వచ్చిన తొలి ఐరోపా దేశంగా పోర్చుగల్‌ను పేర్కొంటారు.

* కాలికట్‌లో పోర్చుగీసువారు తమ తొలి వర్తక స్థావరాన్ని స్థాపించారు.

* వాస్కోడిగామా రెండోసారి 1502లో భారతదేశానికి వచ్చాడు.

* పోర్చుగల్ దేశ ప్రతినిధిగా/అధికారిగా వచ్చిన కాబ్రల్ కొచ్చిన్, క్రాంగనూర్ ప్రాంతాల్లో వర్తక స్థావరాలను స్థాపించాడు.

* ఆల్బూకర్క్ అనే పోర్చుగీసు గవర్నర్ సొకొట్ర, ఆర్ముజ్, డయ్యూ, మలక్కా, గోవా, మాకోలు రేవులను ఆక్రమించి ''భారతదేశంలో పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాత''గా పేరుగాంచాడు.

* 1510లో ఆల్బూకర్క్ శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకుని బీజపూర్ పాలకుడిని ఓడించి, గోవాను ఆక్రమించాడు.

* భారతదేశంలో పోర్చుగీసువారి ప్రధాన వర్తక స్థావరం గోవా.

 

పోర్చుగీసువారు ఆక్రమించిన వివిధ ప్రాంతాలు
                 

సంవత్సరం ప్రాంతం పేరు
1511 మలక్కా
1515 ఆర్ముజ్
1518  కొలంబో
1534 డయ్యూ
1538 డామన్, నాగపట్నం

                                   

* చిట్టగాంగ్, హుగ్లీ, శాంథోమ్ లాంటి ప్రాంతాల్లో కూడా వర్తక స్థావరాలను స్థాపించారు.
* గోవాకు వెళ్లిన మొదటి క్రైస్తవ మతాచార్యుడు సర్ ఫ్రాన్సిస్ జేవియర్ పోర్చుగీసు వాడే.
* భారతదేశంలో 1556లో తొలి అచ్చు యంత్రాన్ని ప్రవేశ పెట్టింది కూడా పోర్చుగీసువారే.
* పొగాకు, మిరప, మొక్కజొన్న లాంటి పంటలను భారతీయులకు పరిచయం చేసింది పోర్చుగీసువారే.
* 1534లో గుజరాత్ పాలకుడు బహదూర్‌షా నుంచి బొంబాయిని పొందిన పోర్చుగీసువారు 1661లో దాన్ని ఆంగ్లేయులకు అద్దెకు ఇచ్చారు. (ఏడాదికి 10 పౌండ్లు).
* పోర్చుగీసు వారి సహాయంతోనే విజయనగర రాజులు అశ్విక దళాన్ని, గుజరాత్ పాలకులు ఫిరంగి దళాన్ని సమకూర్చుకున్నారు.
* 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై వాణిజ్య ఆధిపత్యాన్ని పొందిన పోర్చుగీసువారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి, క్రమంగా తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు.
* షాజహాన్ 'హుగ్లీ' స్థావరాన్ని, ఔరంగజేబ్ 'చిట్టగాంగ్' స్థావరాన్ని పోర్చుగీసు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
* 1961లో భారత ప్రభుత్వం 'ఆపరేషన్ విజయ్' పేరుతో సైనిక చర్య జరిపి, పోర్చుగీసు వారి నుంచి గోవాను ఆక్రమించుకుంది.
* భారతదేశానికి వచ్చిన తొలి ఐరోపా దేశీయులుగా, భారతదేశం నుంచి వెళ్లిన చివరి ఐరోపా దేశీయులుగా పోర్చుగీసువారు గుర్తింపు పొందారు.

 

డచ్‌వారు (నెదర్లాండ్స్/ హాలెండ్)

* డచ్‌వారు 1602లో 'యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్‌'ను స్థాపించారు.

* 1605లో డచ్‌వారు మచిలీపట్నం వచ్చి, నాటి గోల్కొండ పాలకుడు మహ్మద్ కులీకుతుబ్‌షా సహాయంతో భారతదేశంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

* వీరు పులికాట్ (1610), సూరత్ (1616), భీమునిపట్నం (1641), చిన్సురా (1653); కాశింబజార్, నాగపట్నం, కొచ్చిన్‌ల‌లో వర్తక స్థావరాలను స్థాపించారు.

* భారతదేశంలో డచ్‌వారి తొలి ప్రధాన వర్తక కేంద్రం పులికాట్. కానీ 1690లో వారు తమ ప్రధాన వర్తక కేంద్రాన్ని నాగపట్నానికి మార్చుకున్నారు. (నోట్: భారతదేశంలో డచ్‌వారి ప్రధాన వర్తక కేంద్రం నాగపట్నం అని గుర్తించాలి.)

* 1658లో డచ్‌వారు పోర్చుగీసు వారిని ఓడించి, సింహళాన్ని (శ్రీలంక) ఆక్రమించారు.

* 1623 నాటి అంబోయినా వధ ఆంగ్లేయులకు, డచ్చివారికి మధ్య వైరాన్ని పెంచింది.

* అంబోయినా వధ కాలంలో డచ్ గవర్నర్ హెర్మన్ వాన్‌స్పెల్ట్ (Herman van Speult).

* డచ్‌వారు వాన్‌లిచ్చ్‌టన్ అనే అన్వేషకుడి రాతలు/రచనల వల్ల ప్రభావితమై భారతదేశానికి వచ్చారు.

* చివరికి డచ్‌వారు ఇండోనేషియాను తమ వలస రాజ్యంగా మార్చుకున్నారు.

* సుగంధ ద్రవ్యాల వ్యాపారం నుంచి వస్త్ర వ్యాపారం దిశగా దృష్టి మరల్చిన తొలి ఐరోపా దేశం డచ్ నెదర్లాండ్స్.

 

డేన్‌లు (డెన్మార్క్)

* డెన్మార్క్‌వారు 1616లో తమ తొలి వర్తక స్థావరాన్ని తమిళనాడులోని ట్రాంక్వీబార్‌లో ఏర్పాటు చేసుకున్నారు.
* భారతదేశంలో డేన్‌ల ప్రధాన వర్తక స్థావరం బెంగాల్‌లోని సేరాంపూర్.
* క్రైస్తవ మిషనరీల ద్వారా విద్యా వ్యాప్తికి కృషి చేసిన ప్రధాన ఐరోపా దేశం డెన్మార్క్ (డేన్స్).
* డేన్‌లు 1845లో భారతదేశంలోని తమ వర్తక స్థావరాలన్నింటినీ ఆంగ్లేయులకు అమ్మేసి తమ దేశం వెళ్లిపోయారు.

 

ఆంగ్లేయులు (ఇంగ్లండ్)

* ఫాదర్ స్టీఫెన్స్ అనే క్రైస్తవ మతాచార్యుడు ఎలిజబెత్ రాణి కాలంలో తొలిసారిగా భారతదేశానికి వచ్చాడు (1579).
* ఆంగ్లేయులు 1600లో 'ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ ఇంగ్లండ్‌'ను స్థాపించుకున్నారు.
* ఎలిజబెత్ రాణి రాయల్ చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతిని మంజూరు చేసింది.
* అక్బర్ కాలంలో జాన్‌న్యూబెరి, విలియం రీడ్స్ అనే నగల వ్యాపారులు; జేమ్స్‌స్టోరీ అనే చిత్రకారుడు, రాల్ఫ్‌పిఛ్ అనే రాయబారి భారతదేశాన్ని సందర్శించారు.
* 1599 - 1605 మధ్య జాన్‌మిండెన్ హాల్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో ఉన్నాడు.
* 1608లో విలియం హాకిన్స్ అనే ఆంగ్లేయుడు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించాడు.
* 1611లో 'గ్లోబ్' నౌకలో కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో ఆంగ్లేయులు మచిలీపట్నం వచ్చి మహ్మద్ కులీకుతుబ్‌షా అనుమతి పొందారు (స్థావరం ఏర్పాటు చేయలేదు).
* 1615 - 16 మధ్య సర్ థామస్ రో అనే ఆంగ్లేయుడు జహంగీర్ ఆస్థానానికి వచ్చి, వ్యాపార అనుమతి పొందాడు. ఫలితంగా ఆంగ్లేయులు 1616లో తమ తొలి వర్తక స్థావరాన్ని సూరత్‌లో ప్రారంభించారు.
* ఆంగ్లేయులు 1626లో గోవాలో తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు.
* 1639లో ఫ్రాన్సిస్ డే అనే ఆంగ్ల ప్రతినిధి 2 గ్రామాలను దామెర్ల సోదరుల నుంచి కొనుగోలు చేసి, సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. ఆ ప్రాంతమే చెన్నపట్నంగా ప్రసిద్ధి చెందింది.
* 1633లో ఆంగ్లేయులు రాల్ఫాకార్ట్‌రైట్ కృషి వల్ల ఒరిస్సాలోని హరిహరపురంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేశారు.
* బ్రాడ్‌మన్ అనే ఆంగ్లేయుడి కృషి ఫలితంగా 1651లో హుగ్లీలో ఆంగ్లేయుల వర్తక స్థావరం ఏర్పాటైంది.
* గాబ్రియల్ బౌటన్ అనే ఆంగ్ల వైద్యుడు షాజహాన్ నుంచి పొందిన ప్రాంతంలో జాబ్ చార్నక్ 'పోర్టు విలియం కోట'ను నిర్మించాడు (1699).
* ఆంగ్లేయులు మొగలుల నుంచి సుతనుతి, కాశీఘట్టం, గోవింద్‌పూర్ గ్రామాలను పొంది, వాటిని కలకత్తా నగరంగా అభివృద్ధి చేశారు.
* కడలూరు (తమిళనాడు)లో సెయింట్ డేవిడ్ కోటను నిర్మించారు.
* ఆంగ్లేయులు 1682లో విశాఖపట్నంలో తమ వర్తక స్థావరాన్ని స్థాపించారు.
* 1717లో విలియం హామిల్టన్ అనే ఆంగ్ల వైద్యుడు మొగల్ చక్రవర్తి అయిన ఫరూక్ షియర్ వ్యాధిని నయంచేసి, గోల్డెన్ ఫర్మానా ద్వారా అనేక రాయితీలు పొందాడు.
* జెరాల్డ్ ఆంగియర్ అనే ఆంగ్లేయుడు బొంబాయిని గొప్ప వాణిజ్య కేంద్రంగా మార్చాడు.
* భారతదేశంలో ఆంగ్లేయులు మద్రాస్‌లోని సెయింట్ జార్జికోటను తమ ప్రధాన వర్తక కేంద్రంగా చేసుకున్నారు.

 

ఫ్రెంచివారు (ఫ్రాన్స్)


* 1656లో బెర్నియార్ అనే ఫ్రెంచి యాత్రికుడు ఔరంగజేబ్ రాజ్యాన్ని, ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు గోల్కొండ రాజ్యాన్ని సందర్శించారు.
* ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి కోల్బర్ట్ 1664లో 14వ లూయీ అనుమతితో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు.
* 1668లో ఫ్రాంకోయిస్ కరోన్ అనే వ్యక్తి ఔరంగజేబ్ అనుమతితో సూరత్‌లో తొలి వర్తక స్థావరాన్ని స్థాపించాడు.
* 1669లో ఫ్రెంచివారు మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాన్ని స్థాపించారు.
* ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే అధికారి వాలి కొండాపురం ప్రాంతాన్ని పొంది అక్కడ పుదుచ్చేరి/పాండిచ్చేరి నగరాన్ని నిర్మించాడు.
* భారతదేశంలో ఫ్రెంచివారి ప్రధాన వర్తక స్థావరం పుదుచ్చేరి/పాండిచ్చేరి.
* ఫ్రెంచివారు షయిస్తాఖాన్ నుంచి పొందిన బాలాసోర్, కాశింబజార్, చంద్రనగర్ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలను నిర్మించారు.
* భారతదేశంలో ఫ్రెంచి ప్రతినిధులుగా లె నోయిర్, డ్యూమాస్, డూప్లే లాంటి వ్యక్తులు పనిచేశారు.
* లె నోయిర్ మాహె, యానాం (1729) ప్రాంతాల్లో వర్తక స్థావరాలను స్థాపించాడు.
* డ్యూమాస్ మొగల్ చక్రవర్తి నుంచి 'నవాబ్' అనే బిరుదును పొందాడు.
* డూప్లే భారతదేశంలో ఫ్రెంచి వలస రాజ్య నిర్మాతగా పేరుపొందాడు.
* కానీ ఆంగ్లేయులు కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచివారిని ఓడించి భారతదేశాన్ని ఆక్రమించారు.
* ఫ్రెంచివారి అధీనంలో ఉన్న యానాం, పాండిచ్చేరి ప్రాంతాలను భారత ప్రభుత్వం 1956లో ఆక్రమించుకుంది.

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆధునిక భారతదేశ చరిత్ర - ఐరోపా వారి రాక

మాదిరి ప్రశ్నలు

 

1. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాస్కోడిగామా ఏ దేశానికి చెందినవాడు?
జ‌: పోర్చుగల్

 

2. భారతదేశంలో డచ్‌వారి తొలి వర్తక స్థావరం?
జ‌: మచిలీపట్నం

 

3. అంబోయినా వధ ఏ దేశాల మధ్య జరిగిన సంఘర్షణ?
జ‌: డచ్, ఇంగ్లండ్

 

4. ఆంగ్లేయులు 'సెయింట్ డేవిడ్ కోట'ను ఎక్కడ నిర్మించారు?
జ‌: కడలూరు

 

5. ఫ్రెంచివారికి వ్యాపార అనుమతి ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ‌: ఔరంగజేబ్

 

6. పాండిచ్చేరి నగరాన్ని నిర్మించినవారు?
జ‌: ఫ్రాంకోయిస్ మార్టిన్

 

7. కింది అంశాలను జతపరచండి.
     i) వాన్‌స్పెల్ట్                               a) ఇంగ్లండ్
     ii) విలియమ్ హాకిన్స్                  b) ఫ్రాన్స్
     iii) డి-ఆల్మడా                            c) నెదర్లాండ్స్
     iv) ఫ్రాంకోయిస్ మార్టిన్                d) పోర్చుగల్
జ‌: i-c, ii-a, iii-d, iv-b

 

8. భారతదేశం నుంచి వెళ్లిన చివరి ఐరోపావాసులు?
జ‌: పోర్చుగల్

 

9. నీలి నీటి విధానాన్ని అమలు చేసింది ఎవరు?
జ‌: డి-ఆల్మడా

 

10. భారతదేశంలో మిరప, పొగాకు పంటలను ప్రవేశపెట్టినవారు?
జ‌: పోర్చుగీసులు

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మధ్యయుగం - దక్షిణ భారత రాజ్యాలు

  సంగం యుగంలో తమిళ ప్రాంతంలో ప్రాచీన చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆధిపత్యం వహించాయి. గుప్త యుగంలో తమిళ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. రాజపుత్ర యుగంలో తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలకపాత్ర పోషించారు. క్రీ.శ.9వ శతాబ్దంలో విజయాలయుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

 

నవీన చోళులు
* విజయాలయుడు క్రీ.శ.846లో పల్లవులకు సామంతులుగా ఉన్న ముత్తరాయర్లను ఓడించి, కావేరి డెల్టాపై అధికారాన్ని స్థాపించాడు.
* ఒరైయూర్‌కు చెందిన విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని, నిశుంభసూదిని దేవాలయాన్ని నిర్మించాడు.
* నవీన చోళుల రాజధాని తంజావూరు.
* విజయాలయుడి కుమారుడైన చోళ ఆదిత్యుడు చివరి పల్లవ చక్రవర్తి అపరాజిత వర్మను ఓడించి, పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు.
* మొదటి పరాంతకుడు స్థానిక స్వపరిపాలనకు ఆధారమైన ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించాడు (చోళులు స్థానిక స్వపరిపాలనా పితామహులుగా పేరు పొందారు).
* ఉత్తర మేరూర్ శాసనం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది.
* మొదటి పరాంతకుడు మధురను ఆక్రమించి, మధురైకొండ అనే బిరుదు పొందాడు.
* మొదటి పరాంతకుడి కాలంలోనే రాష్ట్రకూటులతో వైరం ఏర్పడింది. రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడు మొదటి పరాంతకుడిని క్రీ.శ.949 నాటి తక్కోలం యుద్ధంలో ఓడించాడు.
* నవీన చోళ రాజుల్లో మొదటి గొప్ప పాలకుడు మొదటిరాజరాజు (క్రీ.శ.985 - 1014).
* మొదటి రాజరాజు అసలు పేరు అరుమోలి వర్మ. తంజావూరు శాసనం ఇతడి విజయాలను వివరిస్తుంది.
* బృహదీశ్వర ఆలయాన్ని శివుడికి అంకితం చేశారు. ఈ దేవాలయాన్ని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.
* మొదటి రాజరాజు పొలోన్నరావాలో (సింహళం) శివాలయాన్ని నిర్మించాడు.
* తమిళ దేవాలయ వాస్తులో విమానాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ.
* భారతదేశ చరిత్రలో తొలిసారిగా నౌకా దండయాత్ర చేసి విదేశాలను జయించిన తొలి పాలకుడిగా రాజరాజు పేరొందాడు. (బిరుదులు జయంగొండ, చోళమార్తాండ, ముమ్మిడి చోళ)
* ఇతడు సింహళంపై (శ్రీలంక) దండెత్తి ఉత్తర సింహళాన్ని ఆక్రమించాడు.
* మాల్దీవులను ఆక్రమించాడు.
* రాజరాజు తన కుమార్తె కుందవ్వను తూర్పు చాళుక్యరాజైన విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.
* తూర్పు చాళుక్య రాజ్యంపై దాడి చేసిన కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.
* శ్రీ విజయరాజ్య పాలకుడైన శ్రీమార విజయోత్తుంగునకు నాగపట్నంలో చౌఢామణి విహార నిర్మాణానికి అనుమతి ఇచ్చింది మొదటి రాజరాజే
* మొదటి రాజరాజు అనంతరం అతడి కుమారుడు మొదటి రాజేంద్రచోళ అధికారంలోకి వచ్చాడు.
* నవీన చోళుల్లో ప్రసిద్ధిచెందిన చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు (1014 - 1044)
* మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ, కడారంకొండ, పండితచోళ లాంటి బిరుదులను పొందాడు.
* మొదటి రాజేంద్ర చోళుడు తన కుమార్తె అమ్మాంగదేవిని తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు.
* గంగానది వరకు వెళ్లి పాలవంశ రాజు మహీపాలుడిని ఓడించి, ''గంగైకొండ'' అనే బిరుదు పొందాడు.
* నౌకా దండయాత్రలు చేసి శ్రీలంక, శ్రీ విజయ రాజ్యాలను జయించాడు.
* శ్రీ విజయ రాజ్య రాజధాని కడారంను జయించి కడారంకొండ అనే బిరుదును పొందాడు.
* మొదటి రాజేంద్ర చోళుడు 'గంగైకొండ చోళపురం' అనే నూతన రాజధానిని, 1030లో గంగైకొండ చోళపురం దేవాలయాన్ని నిర్మించాడు.
* తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను వివరిస్తాయి.
* మొదటి రాజేంద్ర చోళుడు 1025లో శ్రీ విజయరాజ్య రాజు శైవేంద్రుడిని, 1029లో సింహళ రాజు మహేంద్రుడిని ఓడించాడు.
* సుమత్రా, మలయా, బోర్నియో లాంటి ప్రాంతాలను ఆ రోజుల్లో శ్రీ విజయరాజ్యంగా పిలిచేవారు.
* అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తొలి భారతీయ పాలకుడు మొదటిరాజేంద్రచోళుడు (చైనాకు వాణిజ్య రాయబారులను పంపించాడు.)
* ఎన్నాయిరం వైదిక కళాశాలను నిర్మించింది మొదటి రాజేంద్ర చోళుడు.
* మొదటి రాజేంద్ర చోళుడి అనంతరం అతడి కుమారుడు రాజాధిరాజు ''విజయ రాజేంద్ర' బిరుదుతో రాజ్యపాలన చేశాడు.
* కానీ మొదటి రాజాధిరాజు క్రీ.శ.1052 నాటి కొప్పం యుద్ధంలో మరణించాడు.
* రాజాధిరాజు అనంతరం అతడి సోదరుడు రెండో రాజేంద్రుడు పాలనకు వచ్చాడు.
* రెండో రాజేంద్రుడు క్రీ.శ.1062 నాటి కుడల సంగం యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.
* అనంతరం వచ్చిన పాలకుడు వీర రాజేంద్రుడు, ఇతడి తర్వాత అతడి కుమారుడు అధిరాజేంద్రుడు పాలించాడు.
* రాజరాజ నరేంద్రుడి కుమారుడైన రాజేంద్రుడు ''కులోత్తుంగ చోళుడు'' అనే బిరుదుతో అధిరాజేంద్రుడి అనంతరం చోళరాజ్య పాలన చేపట్టాడు.
* కులోత్తుంగ చోళుడు చివరి తూర్పు చాళుక్య రాజైన ఏడో విజయాదిత్యుడి మరణానంతరం 'చోళ చాళుక్య రాజ్యాల'ను కలిపి పాలన ప్రారంభించాడు.
* విశాఖపట్నం నగరాన్ని నిర్మించింది కులోత్తుంగ చోళుడే.
* కళింగట్టు సరణి గ్రంథాన్ని రాసిన జయంగొండార్ కులోత్తుంగ చోళుడి ఆస్థానంలో ఉండేవాడు.
* మూడో కులోత్తుంగ చోళుడు, మూడో రాజరాజు, నాలుగో రాజేంద్రుడు చివరి చోళ చక్రవర్తులు.

 

పుదుక్కోటి జిల్లాలోని ప్రధాన ఆలయాలు
* చోళుల ప్రారంభ ఆలయాలు పుదుక్కోటి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి.
* విజయాలయ చోళేశ్వరాలయం నార్థమలై
* నాగేశ్వరస్వామి ఆలయం కుంభకోణం
* కురంగనాథ ఆలయం శ్రీనివాస నల్లూరు
* మొదటి రాజరాజు 1009లో తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు.
* చోళుల కాలంనాటి నటరాజ కాంస్య విగ్రహం తమిళనాడులోని చిదంబరంలో ఉంది.
* చోళుల అధికార మతం శైవం. (శివారాధకులు)
* కుంభకోణం సమీపంలోని త్రిభువనంలో కంపహారేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.
* తంజావూరు జిల్లాలోని దారాసురాం వద్ద అయితేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.
* సిబక చింతామణి, శివకాశీ నందమణి, కంబ రామాయణం లాంటి గ్రంథాలు ఈ కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి.
* చోళుల కాలంలో యజ్ఞాల కంటే దానాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.
* అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శంకరాచార్యుడు, విశిష్టాద్వైతాన్ని చెప్పిన రామానుజాచార్యుడు ఈ యుగంలో ప్రాచుర్యం పొందారు.
* కులోత్తుంగ చోళుడి కాలంలో నివసించిన రామానుజాచార్యులు హొయసల రాజ్యానికి వెళ్లి, వైష్ణవ మతాన్ని, విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశారు.
* దక్షిణ భారతదేశ సంస్కృతికి చోళులు ఎనలేని సేవలు అందించారు.

 

చోళుల కాలంలో దానం చేసిన భూములు  - పేర్లు
* బ్రహ్మదేయ  - బ్రాహ్మణులకు దానం చేసిన భూమి
* వెల్లన్ వాగై - బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమి
* దేవమేయ/ తిరునాముత్తక్కని - దేవాలయానికి దానం చేసిన భూమి
* శాలభోగ - పాఠశాలలకు ఇచ్చిన భూమి
* పళ్లిచ్చరిదం - జైన సంస్థలకు దానం చేసిన భూమి.

 

బృహదీశ్వర ఆలయం

  తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని మొదటి రాజరాజు నిర్మించాడు. కళ్యాణి చాళుక్యులను ఓడించి తెచ్చిన ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తమిళ వాస్తురీతిలో నిర్మితమైన బృహదీశ్వర ఆలయం మహోన్నతమైంది. ఈ దేవాలయ గోపురంపై అతి పెద్ద విమానాన్ని నిర్మించారు.

 

పరిపాలనా విశేషాలు

* చోళులు తమ సామ్రాజ్యాన్ని మండలాలు - వలనాడులు - నాడులు - గ్రామాలుగా విభజించారు.
* చోళుల పాలనలో అత్యంత విశిష్టమైంది గ్రామపాలన/ స్థానిక పాలన.
* మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూర్ శాసనం నాటి స్థానిక పాలన విశేషాలను వివరిస్తుంది.
* నాటి గ్రామాలను ''కుర్రం, కొట్టం'' అని కూడా పిలిచేవారు.
* గ్రామాల సముదాయాన్ని 'నాడు' అనేవారు. ప్రతినాడులో సుమారు 50 గ్రామాలు ఉండేవి
* నాడుల పాలన ధనవంతులైన 'వెల్లాలు' అనే రైతుల ఆధీనంలో ఉండేది.
* గ్రామాన్ని కుటుంబాలు / కుడుంబాలు అనే వార్డులుగా విభజించేవారు.
* గ్రామ కమిటీని వరియం / వారియం అనేవారు.
* గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు నిర్ణయించారు.

 

అర్హతలు:
   1. సొంత ఇల్లు కలిగి ఉండాలి.
   2. శిస్తు చెల్లించే సొంత భూమి కలిగి ఉండాలి.
   3. 35 - 70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
   4. వేదాల్లోని అంశాలపై అవగాహన ఉండాలి
   5. నిజాయతీపరుడై ఉండాలి.

 

అనర్హతలు:
   1. గతంలో వరుసగా మూడు సంవత్సరాలు గ్రామకమిటీ సభ్యుడిగా పని చేసి ఉండకూడదు.
   2. గతంలో పని చేసి లెక్కలు చూపనివారై ఉండకూడదు.
* అర్హత ఉన్న వారందరి చీటీలను కుండలో వేసి ఒక బాలుడితో లాటరీ తీసి విజేతలను / కమిటీని ప్రకటిస్తారు.
* ఇలా ఎన్నుకున్న కమిటీని వారియం అంటారు. ప్రతి గ్రామ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు.
* వారియం మళ్లీ ఆరు ఉపకమిటీలుగా విడిపోయి వివిధ అంశాలను పరిశీలిస్తుంది.
* లాటరీద్వారా ఎన్నికైన సభ్యుడిని ఆలుముముక్కల్ అంటారు.
* కుండలో వేసే పేర్ల చీటీలను 'కుడవోలై' అంటారు.
* ఎన్నుకున్న గ్రామకమిటీ సభ్యుల పదవీకాలం సంవత్సరం మాత్రమే
* చోళుల గ్రామపాలనలో ఉర్, సభ, నగరం/ నకరం అనే మూడు సభలు ప్రధాన పాత్ర పోషించేవి.
* రైతు ప్రతినిధులతో కూడిన సభను ఉర్ అనేవారు.
* బ్రాహ్మణ ప్రతినిధులు ఉండేది ''సభ''.
* వ్యాపార/ వాణిజ్య/ వైశ్య ప్రతినిధులతో కూడిన సభను నగరం/ నకరం అనేవారు.
* ఉన్నత అధికారులను ''ఉదంకుట్టమ్'' అని పిలిచేవారు
* గ్రామసభ సాధారణంగా దేవాలయ ప్రాంగణంలో జరిగేది.
* నాటి సైనిక పటలాలను కడియాలు అనేవారు.
* నౌకాదళ అవసరాన్ని గుర్తించిన తొలి భారతీయ పాలకులు చోళులు.
* పట్టణాల్లో ఉండే స్వయం ప్రతిపత్తి పాలనా వ్యవస్థలను 'తాన్‌కుర్రమ్'' అనేవారు.

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్త యుగం - సాంస్కృతిక వికాసం

* భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. హిందూమత పునరుద్ధరణ, భాషా, సాహిత్యాల వికాసం, వాస్తు, కళారంగాలు, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి లాంటి కారణాల వల్ల గుప్త యుగాన్ని స్వర్ణయుగం అంటారు.
* కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేసి, 'ఇండియన్ షేక్‌స్పియర్‌'గా పేరొందాడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, విక్రమోర్వశీయం, మేఘసందేశం, కుమార సంభవం లాంటి రచనలు చేశాడు.
* గుప్తుల కాలంలో అధికార భాష సంస్కృతం.
* వసుబంధు అనే బాస మహాకవి 'స్వప్న వాసవదత్త' అనే గ్రంథాన్ని రాశాడు.
* వాత్సాయనుడు కామసూత్రాలను రచించాడు.
* శూద్రకుడు మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో నాటి పట్టణ జీవితాన్ని వర్ణించాడు.
* విశాఖదత్తుడు దేవీచంద్రగుప్తం, ముద్రా రాక్షసం అనే గ్రంథాలను రచించాడు.
* అమరసింహుడు తొలి సంస్కృత భాషా నిఘంటువుగా పేరొందిన 'అమరకోశం' అనే గ్రంథాన్ని రాశాడు.
* పాలకవ్యుడు హస్తాయుర్వేదం అనే పశు వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.
* కామందకుడు రచించిన నీతిశాస్త్రం గుప్తుల అర్థశాస్త్రంగా పేరొందింది.
* బెంగాల్‌కు చెందిన చంద్రగోమియా 'చంద్ర వ్యాకరణం' గ్రంథాన్ని రాశాడు.
* రామచంద్రుడు అనే కవి 'నాట్య దర్పణం' గ్రంథాన్ని రచించాడు.
* రామాయణాన్ని జైనమతానికి అనుగుణంగా రచించింది విమలుడు.
* దివాకరుడు అనే కవి న్యాయవర్త, సమ్మతి తర్కసూత్ర అనే గ్రంథాలు రాశాడు.
* పాణిని అష్టాధ్యాయి గ్రంథాన్ని, పతంజలి మహాభాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు.
* గుప్తుల కాలంలో ప్రాకృత భాషను శూరసేన (మగధ ప్రాంతం), అర్ధమగధి (బుందేల్‌ఖండ్ ప్రాంతం), మగధి (బిహార్ ప్రాంతం) లాంటి పేర్లతో పిలిచేవారు.
* వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు (వైద్యశాస్త్ర గ్రంథం).
* నవరత్నాలు - కాళిదాసు, శంఖువు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, అమర సింహుడు, వరాహమిహిరుడు, వరరుచి, ధన్వంతరి, క్షహరాటుడు.

 

శాస్త్ర విజ్ఞానం

* గుప్తుల కాలంలో గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి.
* గుప్తుల కాలంనాటి గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట.
* ఆర్యభట్ట రచనలు ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం, లఘు జాతకం. సూర్య సిద్ధాంతం గ్రంథంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణాలు వివరించారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పారు.
* వృత్త పరిధికి, వృత్త వ్యాసానికి సరైన π నిష్పత్తిని 22/7 గా చెప్పింది ఆర్యభట్టు.
* వరాహమిహిరుడు 'బృహత్ సంహిత' అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని గుప్తుల కాలంనాటి విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు.  వరాహమిహిరుడు పంచ సిద్ధాంతిక, బృహత్ జాతక లాంటి ఇతర రచనలు కూడా చేశాడు.
* భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుప్తుల కాలంలోనే చెప్పిన బ్రహ్మగుప్తుడు 'ఇండియన్ న్యూటన్‌'గా పేరొందాడు.  (ఖండఖాద్యక, బ్రహ్మస్ఫుటక సిద్ధాంతం అనేవి ఈయన రచనలు)
* వివిధ మందులు, ఔషధాల తయారీ విధానం గురించి వివరిస్తున్న గ్రంథం 'నవనీతకం'.
* గుప్తుల కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరొందింది ధన్వంతరి.
*  ''శుశృత సంహిత'' అనే శస్త్ర చికిత్స గ్రంథాన్ని శుశృతుడు రచించాడు.
* వజ్జిక అనే రచయిత 'కౌముది మహోత్సవం' అనే గ్రంథాన్ని రాశాడు.
* గుప్తుల కాలంలో శబరుడు అనే వ్యక్తి సాంఖ్య, యోగ లాంటి దర్శనాలపై వ్యాఖ్యలు రాశాడు

 

గుప్తుల కాలంనాటి ప్రసిద్ధ హిందూ దేవాలయాలు

నాచన్ కుటారా - పార్వతీదేవి దేవాలయం
భూమ్రా - శివాలయం, మధ్యప్రదేశ్
దేవఘడ్ - దశావతార దేవాలయం, మధ్యప్రదేశ్
టిగావా - విష్ణు దేవాలయం, మధ్యప్రదేశ్
బిట్టర్‌గావ్ - ఇటుకల దేవాలయం, ఉత్తర్ ప్రదేశ్
* దశావతార దేవాలయ గోడలపై రామాయణ, మహాభారత గాథలను శిల్పాలుగా చెక్కారు.
* ఉదయగిరి గుహాలయం (ఒడిశా) వద్ద వరాహ విగ్రహాన్ని చెక్కారు.
* గ్వాలియర్ సమీపంలోని పవాయి వద్ద నాట్యగత్తె, సంగీతకారిణుల విగ్రహాలు లభించాయి.
* సుల్తాన్‌గంజ్‌లో బుద్ధ విగ్రహం (కంచుతో తయారు చేసింది) ఏడున్నర అడుగుల పొడవుతో లభించింది.
* నలందాలో 18 అడుగుల ఎత్తున్న బుద్ధుడి రాగి విగ్రహం లభించింది.
* వారణాసిలో కార్తికేయ శిల్పాలు లభించాయి.
* గుప్తుల కాలంనాటి ముద్రలు ఎక్కువగా వైశాలిలో లభించాయి.
* గుప్తుల కాలంనాటి బుద్ధుడి శిల్పాలు 'తౌమ బుద్ధులు'గా పేరొందాయి.
* నాటి శిల్పాలను ఎక్కువగా చూనార్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో చెక్కారు.
* సారనాథ్ మ్యూజియంలో బుద్ధ విగ్రహం (సారనాథ్ బుద్ధుడు) యోగిముద్రలో ఉంటుంది.
* అజంతా, బాగ్ గుహల్లో గుప్తుల కాలంనాటి చిత్రలేఖనాలు లభించాయి.
* అజంతా 16వ గుహలోని 'మరణశయ్యపై రాకుమార్తె' చిత్రం గుప్తుల కాలానిదే.
* గుప్తుల శిల్పకళ మహోన్నతి పొందిన హైందవ శిల్పకళ అని విన్సెంట్ స్మిత్ పేర్కొన్నారు.
* 23 అడుగుల 8 అంగుళాల పొడవున్న మెహరౌలీ ఉక్కు స్తంభం (దిల్లీ) ఇప్పటికీ తుప్పుపట్టలేదు.
* బిట్టర్‌గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది'' అని పెర్సీబ్రౌన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.

 

హర్షవర్ధనుడు

* గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు.
* హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. ఇతడి రాజధాని స్థానేశ్వరం.
* హర్షుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు. తల్లి యశోమతి దేవి. సోదరుడు రాజ్యవర్ధనుడు. సోదరి రాజ్యశ్రీ.
* పుష్యభూతి వంశీకుల పాలన గురించి వివరిస్తున్న శాసనాలు మధుబన్, బాన్స్‌ఖేరా.
* మధుబన్ శాసనం ప్రకారం ప్రభాకరవర్ధనుడు పరమభట్టారక, మహారాజాధిరాజు అనే బిరుదులతో పాలించాడని తెలుస్తోంది.
* బాణుడి హర్షచరిత్రలో ప్రభాకరవర్ధనుడు హూణుల హరిణాలకు (జింకలకు) సింహం లాంటి వాడని పేర్కొన్నారు.
* యశోమతీదేవి భర్తతో సతీసహగమనం చేసింది.
* రాజ్యశ్రీని కనోజ్ పాలకుడైన గ్రహవర్మకు ఇచ్చి వివాహం జరిపించారు.
* గ్రహవర్మ, అతడి మిత్రుడు గౌడ శశాంకుడు కుట్రచేసి రాజ్యవర్ధనుడిని చంపారు.
* హర్షుడు అస్సాం/ కామరూప పాలకుడు భాస్కరవర్మ సహాయంతో గ్రహవర్మ, గౌడ శశాంకుడిని ఓడించాడు.
* మాళ్వారాజు దేవగుప్తుడు గ్రహవర్మను చంపి, కనోజ్‌ను ఆక్రమించాడు.
* హర్షుడు సోదరిని రక్షించి, కనోజ్ పాలకురాలిగా నియమించాడు.
* కనోజ్ ప్రజల కోరిక మేరకు హర్షవర్ధనుడు క్రీ.శ.606లో శీలాదిత్య బిరుదుతో స్థానేశ్వరం, కనోజ్‌లను కలిపి
 పట్టాభిషేకం చేసుకున్నాడు.
* హర్షుడి పాలనాకాలం క్రీ.శ.606 - 647
* హర్షుడి కాలంలో హుయాన్‌త్సాంగ్ అనే చైనా యాత్రికుడు అతడి రాజ్యాన్ని సందర్శించాడు.
* హుయాన్‌త్సాంగ్ రచన 'సియుకి'.
* హుయాన్‌త్సాంగ్ యాత్రికుల్లో రాజు (కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్)గా పేరొందాడు.
* హర్షుడి బిరుదులు శీలాదిత్య, రాజపుత్ర.
* హర్షుడిని నర్మదా నది యుద్ధంలో ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి.
* రెండో పులకేశి ఐహోలు శాసనంలో హర్షుడిని సకలోత్తర పథేశ్వరుడు అనే బిరుదుతో ప్రస్తావించడం కనిపిస్తుంది.
* హర్షుడు మహామోక్ష పరిషత్, కనోజ్ పరిషత్తులను నిర్వహించాడు.
* ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తన సంపదనంతా పేదలకు పంచే కార్యక్రమమే 'మహామోక్ష పరిషత్'. దీన్నే 'ప్రయాగ పరిషత్' అంటారు.
* హర్షుడు మొత్తం ఆరు మహామోక్ష పరిషత్‌లు నిర్వహించాడు. 6వ పరిషత్‌కు హుయాన్‌త్సాంగ్ హాజరయ్యాడు.
* హర్షుడు కనోజ్‌లో హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన సర్వమత సమావేశాన్ని నిర్వహించాడు. దీన్నే 'కనోజ్ పరిషత్' అంటారు.
* హర్షుడు తన రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పథక గ్రామాలుగా విభజించాడు.
* వల్లభి రాజ్య రాజు రెండో ధ్రువసేనుడిని హర్షుడు ఓడించినట్లు నౌశాసితామ్ర ఫలకం (శాసనం) తెలియజేస్తోంది.
* యుద్ధభూమిలో చక్రవర్తే సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. చక్రవర్తికి పాలనలో సహాయపడటానికి సచివులు/అమాత్యులు అనే మంత్రులను నియమించేవారు.
* హర్షుడి ప్రధానమంత్రి పేరు 'భండి'.
* యుద్ధమంత్రి - మహాసంధి విగ్రహాధికృత, సైన్యాధికారి - మహాబలాధికృత.
* గజబలాధ్యక్షుడు - కాటుక, విదేశీ కార్యదర్శి - రాజస్థానీయ.
* హర్షుడి కాలంలో రాష్ట్రాలను భుక్తులు అని, జిల్లాలను విషయాలు అని పిలిచారు.
* భుక్తి అధిపతిని ఉపరిక/గోస్త్రీ అని పిలిచేవారు.
* నాడు రహదారులు క్షేమంగా లేవని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.630లో భారతదేశానికి వచ్చి 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. (సి-యు-కి అంటే పశ్చిమ ప్రపంచ ప్రతులు)
* హర్షుడు యుద్ధం, శాంతి కళల్లో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడని ఆర్.సి. మజుందర్ పేర్కొన్నారు.
* నాడు భూమి శిస్తు పంటలో 1/6వ వంతు ఉండేది. భూమి శిస్తును 'ఉద్రంగ' అనేవారు. భూమి శిస్తు కాకుండా మరో 18 రకాల పన్నులు వసూలు చేసేవారు.
* హర్షుడు వివిధ స్థాయుల్లో పన్ను వసూలు కోసం ఆయుక్త, భోజక, ద్రువాధికరణ, గౌల్మిక లాంటి అధికారులను నియమించాడు.
* గ్రామంలో పన్ను వసూలు కోసం అక్షపటలిక, కరణిక్ అనే ఉద్యోగులను నియమించాడు.
* వస్తువు బరువు ఆధారంగా 'తుల్యమేయ' పేరుతో అమ్మకం పన్నును వసూలు చేసేవారు.
* భారతదేశంలో వ్యవసాయ రంగంలో తొలిసారిగా నీటివేగంతో నడిచే తులాయంత్రాలను ప్రవేశపెట్టింది హర్షుడే.
* హర్షుడి కాలంలో మౌఖరీ వంశీయులు వల్లభి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశారు.
* హర్షుడు నలందా విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసినట్లు హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
* హర్షుడి ఆస్థానకవి బాణుడు హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు.
* హర్షుడు సంస్కృత భాషలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శి లాంటి గ్రంథాలు రాశాడు.
* సుభాషిత శతకం - భర్తృహరి, సూర్యశతకం - మయూరుడు. వీరు హర్షుడి ఆస్థానంలో ఉండేవారు.
* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.645లో ఉదిత అనే సహాయకుడితో చైనా చేరాడు.
* గౌడ శశాంకుడు వంగ, మగధ, ఒరిస్సాలను 'మహారాజాధిరాజ' బిరుదుతో పాలించినట్లు గంజాం శాసనం తెలుపుతోంది.
* నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాన్ని 'ధర్మఘంజ్' అనేవారు.
* ధర్మపాల, ఆర్యదేవ, శీలభద్ర లాంటి ఆచార్యులు నలందా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
* స్థిరమతి, గుణమతి లాంటి ఆచార్యులు వల్లభి విశ్వవిద్యాలయంలో పనిచేశారు.

 

వాస్తు, కళారంగాలు

* గుప్తుల కాలంనాటికి నగర, ద్రవిడ శైలులు రూపాంతరం సంతరించుకున్నాయి.
* గుప్తుల వాస్తు నిర్మాణంలో ప్రధానమైనవి గుహాలయాలు, దేవాలయాలు, స్తూపాలు.
* మహారాష్ట్రలోని అజంతా గుహలు, మధ్యప్రదేశ్‌లోని బాగ్ గుహలు గుప్తుల కాలంలోనే అభివృద్ధి చెందాయి.
* గుప్తుల కాలంలో సారనాథ్ (ఉత్తర్ ప్రదేశ్), రత్నగరి (ఒడిశా), మీర్‌పూర్‌ఖాన్ (సింధు) ప్రాంతాల్లో స్తూపాలను నిర్మించారు.
* మధ్యప్రదేశ్‌లోని భూమ్రాలో శివాలయాన్ని నిర్మించారు.

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్త యుగం

  గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. గుప్త రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు లాంటి చక్రవర్తులు గుప్త రాజుల్లో ముఖ్యులు. చివరి గుప్త చక్రవర్తి విష్ణుగుప్తుడి కాలంలో హూణుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం పతనమైంది. గుప్తులకాలం భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా పేరొందింది.
గుప్త యుగానికి ఆధారాలను రెండు రకాలుగా పేర్కొంటారు. అవి:
    1. పురావస్తు ఆధారాలైన శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు.
   2. సాహిత్య ఆధారాలు.

 

శాసనాలు

  మంకువార్ బౌద్ధ శాసనం మొదటి కుమారగుప్తుడిని 'మహారాజ' బిరుదుతో పేర్కొంది. స్కంధగుప్తుడి భిలారి శాసనం హూణులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిపిన దాడులను వివరిస్తుంది. సముద్రగుప్తుడి విజయాలను వివరించే అలహాబాద్ శాసనాన్ని అతడి సేనాని (సంధి విగ్రాహి) హరిసేనుడు వేయించాడు.
* ఎరాన్ శాసనం గుప్తుల కాలంనాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తుంది. సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనం తెలుపుతుంది. ఉదయగిరి శాసనం, మెహరౌలీ (దిల్లీ) ఉక్కు స్తంభ శాసనాలు రెండో చంద్రగుప్తుడి గురించి పేర్కొంటున్నాయి.
* గుప్త యుగానికి సంబంధించి సుమారు 42 శాసనాలు లభిస్తున్నాయి. అందులో 27 శిలాశాసనాలే. మొత్తం 42 శాసనాల్లో 23 శాసనాలు ప్రత్యేక వ్యక్తుల రికార్డులైతే, మిగిలిన 19 శాసనాలు ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు.

 

సాహిత్యం

       మొదటి చంద్రగుప్తుడి కాలంనాటి రాజనీతి గ్రంథమైన నీతిసారాన్ని కామందకుడు రాశాడు. గుప్తుల కాలంనాటి రాజనీతి, పరిపాలనా విషయాలను ఈ గ్రంథం తెలుపుతుంది. క్రీ.శ. నాలుగో శతాబ్దంలో రాసిన 'నారదస్మృతి', 'బృహస్పతి స్మృతి' లాంటి రచనలు గుప్తుల చరిత్రను పేర్కొంటున్నాయి. విశాఖదత్తుడు రచించిన 'దేవీ చంద్రగుప్తం' నాటకం రామగుప్తుడు శక రాజైన బసన చేతిలో పొందిన ఓటమిని తెలుపుతుంది. మొదటి చంద్రగుప్తుడి విజయాలను వజ్జికుడు రచించిన 'కౌముదీ మహోత్సవం' గ్రంథం వివరిస్తుంది. గుప్తయుగం నాటి పట్టణ ప్రజల జీవిత విధానాలను, చారుదత్త, వసంతసేనల మధ్య ఉన్న ప్రేమాయణం గురించి పేర్కొంటుంది. వాయు పురాణంలో గుప్తుల చరిత్రను ఎక్కువగా వివరించారు. ఆర్య మంజుశ్రీ రాసిన 'మూలకల్ప' గ్రంథంలో గుప్తరాజుల ప్రస్తావనను అనేక శ్లోకాల్లో పేర్కొన్నారు. క్రీ.శ.672లో భారతదేశానికి వచ్చిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు చీ-లి-కిటో (శ్రీగుప్తుడు) అనే రాజు నలందా బౌద్ధ విహారంలో కొన్ని గ్రామాలను చైనా వారికి దానం చేసినట్లు తన రచనల్లో పేర్కొన్నాడు. యతి వృషభుడు అనే బౌద్ధ సన్యాసి రాసిన 'తిలస్య పన్నాటి' అనే గ్రంథం గుప్తుల కాలం నాటి బౌద్ధ మత ప్రాచుర్యాన్ని తెలుపుతుంది. రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ నాటి పరిస్థితులను తన ఫో-కువో-కి గ్రంథంలో వివరించాడు.

 

రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 375 - 415)

  ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. 'శకారి', 'సాహసాంక', 'విక్రమాదిత్య' లాంటి బిరుదులు పొందాడు. అన్న రామగుప్తుడిని చంపి, వదిన ధ్రువాదేవిని వివాహం చేసుకుని రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది. ఇతడి కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఫాహియాన్ పాటలీపుత్రంలో మూడు సంవత్సరాలు, తామ్రలిప్తిలో రెండు సంవత్సరాలు నివసించాడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో 'నవ రత్నాలు' అనే కవులు ఉండేవారు. వారిలో కాళిదాసు సుప్రసిద్ధుడు. రెండో చంద్రగుప్తుడు సింహం బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఉజ్జయిని బొమ్మతో నాణేలను ముద్రించి, ఉజ్జయినిని రెండో రాజధానిగా చేసుకుని పాలించాడు. వాకాటక రాజైన రెండో ధ్రువసేనుడికి తన కుమార్తె ప్రభావతీ గుప్తను ఇచ్చి వివాహం జరిపించాడు. రెండో ధ్రువసేనుడి సహాయంతో చివరి శకరాజు రుద్రసింహుడిని చంపి, 'శకారి' అనే బిరుదు పొందాడు. రెండో చంద్రగుప్తుడి సేనానియైన అమరకర దేవుడు బౌద్ధ మతాభిమాని. మంత్రి శబర వీరసేనుడు శైవ మతాభిమాని. దిల్లీలోని మెహరౌలీ ఉక్కు స్తంభాన్ని చేయించింది రెండో చంద్రగుప్తుడే. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు ఇతడే.

 

చివరి గుప్త చక్రవర్తులు

  మొదటి కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే యువరాజైన స్కంధగుప్తుడు హూణుల దండయాత్రను తిప్పికొట్టాడు. కానీ స్కంధగుప్తుడు రాజైన తర్వాత హూణులు గుప్త రాజ్యంపై నిరంతరం దాడులు చేయడం వల్ల కోశాగారం ఖాళీ అయ్యింది. ఇతడు హూణుల చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం పురుగుప్తుడు, రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు లాంటి రాజులు పాలించారు. చివరికి విష్ణుగుప్తుడితో గుప్త వంశం అంతమైంది.

 

పాలనా విశేషాలు

  గుప్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. విషయపతి జిల్లాలకు (విషయాలకు) అధిపతిగా, భుక్తులకు ఉపరిక అధిపతిగా ఉండేవాడు. గ్రామాధిపతిని గ్రామైక అనేవారు. అయిదుమంది సభ్యులున్న నగరసభ విషయపతికి పరిపాలనలో తోడ్పడేది. గ్రామంలో ఉండే సభను పంచ మండలం సభ అనేవారు. చక్రవర్తి మంత్రి పరిషత్తు లేదా మంత్రి మండలి సహాయంతో పరిపాలించడం వల్ల మంత్రి మండలి నాయకుడిని మంత్రి ముఖ్యుడు అనేవారు. నైతిక, ధార్మిక విషయాల్లో పురోహితుడు కీలకపాత్ర పోషించేవాడు. రాష్ట్రాలకు (భుక్తులకు) యువ రాజులను అధిపతులుగా నియమించేవారు. వారిని 'కుమారామాత్య' అనేవారు. వీరు కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవారు. మొత్తంగా గుప్తుల కాలంలో పాలన వికేంద్రీకృత పాలనగా ఉండేది.

 

రెవెన్యూ పాలన

  గుప్తుల కాలంలో 1/6వ వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. పన్నులను నగదు రూపంలో చెల్లించేవారు. ఫాహియాన్ తన రచనల్లో ఎక్కువగా రాచరిక భూముల గురించి ప్రస్తావించాడు. బుద్ధగుప్తుడి పహాడ్‌పూర్ శాసనం భూమిపై ప్రభుత్వానికున్న ప్రత్యేక యాజమాన్యపు హక్కును వివరిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన భూమిని 'క్షేత్రం' అనేవారు. నివాసయోగ్యమైన భూమిని 'వస్తి' , అటవీ భూమిని 'అప్రహత' , పచ్చిక బయళ్లను 'గపధసార' , బంజరు భూములను 'ఖిలం' అని పేర్కొనేవారు.

  భూమి అమ్మకం రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని 'పుస్తపాల' అనేవారు. నాటి ప్రధాన న్యాయమూర్తి 'మహా దండనాయక'. ఆ కాలంలో విధించే శిక్షల గురించి ఫాహియాన్ తన రచనల్లో ప్రస్తావించాడు. మహా సేనాపతి, రణభండారిక లాంటి సైనికాధికారులు యుద్ధ సమయాల్లో ప్రధానపాత్ర పోషించేవారు. ఆ కాలంలో  యుద్ధ ఆయుధాల గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావన ఉంది. ప్రత్యేక యుద్ధమండలి కూడా ఉండేది.  పురోహితుడికి న్యాయ సమీక్ష అధికారం ఉండటం గొప్ప విషయం. మంత్రి మండలికి, చక్రవర్తికి మధ్య సంధాన కర్తగా 'కంచుకి' అనే ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించేవాడు.

 

ఆర్థిక విషయాలు

  గుప్తుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు సమానంగా అభివృద్ధి చెందాయి. నాటి వ్యవసాయ భూముల సర్వే విధానం గురించి ప్రభావతి గుప్త వేయించిన పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. భూముల కొలతలు, సరిహద్దు రాళ్లు వేయడం గురించి 'పహాడ్‌పూర్' శాసనం పేర్కొంటుంది. పుస్తపాల అనే అధికారి జిల్లాలో జరిగే భూ లావాదేవీలను రికార్డు చేసేవాడు. భూదానాలు అధికంగా చేయడంతో గుప్తుల కాలంలో భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఏ విధమైన పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను (అగ్రహారాలు) దానం చేసేవారు. సముద్రగుప్తుడు వేయించిన నలందా, గయ శాసనాల్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను 'ఉక్కకల్ప' మహారాజులుగా పిలిచేవారు. దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను 'దేవాగ్రహారాలు' అనేవారు. ఉక్కకల్ప మహారాజులు పుళిందభట్టు అనే గిరిజన తెగ నాయకుడికి కూడా రెండు గ్రామాలను దానం చేసినట్లు శాసన ఆధారాలు లభించాయి.

రోమ్ దేశంతో ఎక్కువ విదేశీ వాణిజ్యం జరిపేవారు. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బరుకచ్ఛ ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. సార్థవాహులు అనే సంచార వ్యాపారులు నగరాల్లో వ్యాపారం చేసేవారు. అరేబియా, పర్షియా, ఆఫ్గానిస్థాన్ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. ఉప్పును ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది.

 

సాంఘిక, మత పరిస్థితులు

  వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేవి. ఛండాలురు అనే పంచమ వర్ణం ఏర్పడింది. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. అనులోమ, ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ఎక్కువ వర్ణం పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. దీనిపై నిషేధం లేదు. కానీ తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకునే ప్రతిలోమ వివాహాలను ధర్మశాస్త్రాలు నిషేధించాయి. నాటి ఎరాన్ శాసనం ప్రకారం సతీ సహగమనం ఉన్నట్లు తెలుస్తోంది. దేవదాసీ ఆచారం ప్రారంభమైంది. గుప్తుల కాలంలో వైదిక మతం/ హిందూమతాన్ని పునరుద్ధరించారు. రెండో చంద్రగుప్తుడు 'పరమ భాగవత' అనే బిరుదు ధరించాడు. సముద్రగుప్తుడు రాజ చిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. దశావతార సిద్ధాంతం గుప్తుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతం అభివృద్ధి చెందింది. స్కంధగుప్తుడి జునాగఢ్ శాసనంలో బలి చక్రవర్తి, వామనుల కథనాన్ని వివరించారు. మౌఖరీ వంశస్థుడైన అనంతవర్మబారాబర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. విష్ణుదేవుడి నరసింహ అవతారం గురించి అలీనదాన శాసనం వివరిస్తుంది. ఎరాన్‌లో వరాహ విగ్రహం కనిపిస్తుంది. గుప్తుల కాలంలో శైవ, వైష్ణవ, బౌద్ధ మతాలను సమానంగా ఆదరించారు. గుప్త చక్రవర్తులు పరమత సహన విధానాన్ని పాటించారు.

 

రాజకీయ చరిత్ర

  గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. చైనా యాత్రికుడు ఇత్సింగ్ తన రచనల్లో శ్రీ గుప్తుడిని చిలికిత (చీ-లీ-కిటో) మహారాజుగా ప్రస్తావించాడు. శ్రీగుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోద్గజ గుప్తుడు 'మహారాజు' బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ వాస్తవంగా గుప్త రాజ్య స్థాపకుడిగా పేరొందింది మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్ఛవీ గణానికి చెందిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. 'రాజాధిరాజ' బిరుదుతో పాలన చేశాడు. అనంతరం అతడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీ.శ.335 - 375 సంవత్సరాల మధ్య పాటలీపుత్రం రాజధానిగా పరిపాలన చేశాడు. కచ అనే యువరాజుతో వారసత్వ యుద్ధంలో విజయం సాధించి, సముద్రగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది.

  హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. దాని ప్రకారం సముద్రగుప్తుడు మొదటి ఆర్యావర్తన దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండో ఆర్యావర్తన దండయాత్ర చేసి అనేక విజయాలను సాధించాడు. ముఖ్యంగా దక్షిణదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించి, వారిని సామంతులుగా చేసుకున్నాడు. వారిలో కోసలరాజు మహేంద్రుడు, వేంగి రాజు హస్తివర్మ (శాలంకాయన రాజు), కంచి పాలకుడు విష్ణుగోపుడు (పల్లవ రాజు) ముఖ్యమైనవారు.

  ఆంగ్ల చరిత్రకారుడైన వి.ఎ.స్మిత్ సముద్రగుప్తుడిని 'ఇండియన్ నెపోలియన్' అని కీర్తించాడు. 'కవిరాజు', 'అశ్వమేధ యోగి' లాంటి బిరుదులను పొందాడు. మొదటి ఆర్యావర్తన దండయాత్రలో నాగసేనుడిని, రెండో ఆర్యావర్తన దండయాత్రలో గణపతినాగ, అచ్యుతనాగ, లాంటి నవనాగ చక్రవర్తులను ఓడించాడు. కౌశాంబి యుద్ధంలో మొదటి రుద్రసేనుడిని ఓడించి, అశ్వమేధ యాగం చేసి 'అశ్వమేధ యోగి' బిరుదు పొందాడు. ఇంకా అయిదు సరిహద్దు రాజ్యాలను, తొమ్మిది ఆటవిక రాజ్యాలను ఓడించాడు. సింహళరాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. సముద్రగుప్తుడి అనంతరం అతడి పెద్ద కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు, శక రాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నట్లు, రెండో చంద్రగుప్తుడు బసనను, రామగుప్తుడిని చంపి రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది.

 

నాణేలు

  గుప్తుల కాలంలో అధికంగా బంగారు నాణేలను ముద్రించారు. వీరు కుషాణుల నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారు. సముద్ర గుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణేలను ముద్రించాడు. అశ్వమేధ యాగం చేసి, 'అశ్వమేధ యోగి' బిరుదుతో కూడా సముద్రగుప్తుడు బంగారు నాణేలను ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను 'దీనార్', 'కారా', 'సువర్ణ' అని పిలిచేవారు. సముద్రగుప్తుడి నాణేల్లో ఎక్కువగా వెనుక భాగంలో లక్ష్మీదేవి బొమ్మను ముద్రించేవారు. రెండో చంద్రగుప్తుడి నాణేలపై 'మహా రాజాధిరాజ శ్రీచంద్రగుప్త' అనే బిరుదును ముద్రించారు. గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడిని పేర్కొంటారు. ఉజ్జయిని ముద్రతో నాణేలను ముద్రించింది రెండో చంద్రగుప్తుడే. రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపు పరమభాగవత, మహారాజాధిరాజు బిరుదులను, మరో వైపు గరుడి (గద్ద) బొమ్మను ముద్రింపజేసేవాడు. ఏనుగు, నెమలి, అశ్వికుడు లాంటి బొమ్మలతో కుమారగుప్తుడు నాణేలను ముద్రించాడు.

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభం

* మధ్యయుగంలో క్రైస్తవులకు, మహమ్మదీయులకు మధ్య జరిగిన మత యుద్ధాలను 'క్రూసేడులు' అంటారు.
* క్రైస్తవులు, మహమ్మదీయులకు పవిత్ర స్థలాలైన పాలస్తీనా, జెరూసలెం, బెత్లెహం ప్రదేశాలను ఆక్రమించడానికి ఈ యుద్ధాలు జరిగాయి.
* క్రీ.శ.1453లో అప్పటి టర్కీ సుల్తాన్ మహమ్మద్ - II గ్రీకు సంస్కృతికి నిలయమైన కాన్‌స్టాంటినోపుల్ నగరంపై దండెత్తి ఆక్రమించాడు. ఆ సమయంలో గ్రీకు పండితులు తమ సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలతో యూరప్‌ దేశాలకు వెళ్లారు.
* ఈ విద్వాంసులు యూరప్ అంతటా పాఠశాలలు, మఠాలను స్థాపించి ప్రాచీన గ్రీకు సంస్కృతి, సాహిత్యాలను పునరుద్ధరించడానికి వారు తెచ్చిన గ్రంథాలను బోధించారు.
* ఈ ప్రాచీన సంస్కృతి, సాహిత్యాల పునరుద్ధరనను 'సాంస్కృతిక పునరుజ్జీవనం' లేదా 'రినేజాన్సు' అంటారు.
* కాన్‌స్టాంటినోపుల్ పతనం కంటే ముందుగానే ఇటలీ సాహిత్య రంగంలో రినేజాన్సు ప్రారంభమైంది.
* పెట్రార్క్, డాంటే, బాకాషియో లాంటి రచయితలు తమ రచనల ద్వారా వర్జిల్, సిసిరో, లెవీ, హోరాస్ లాంటి ప్రాచీన రచయితల సాహిత్యాన్ని చదవమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా విద్యా విధానాన్ని సంస్కరించవచ్చని సూచించారు.
* రోమన్‌ల ప్రాచీన భాష 'లాటిన్' కూడా ప్రాముఖ్యాన్ని కోల్పోయింది.
* క్రీ.శ.15వ శతాబ్దపు యూరోపియన్ రచయితలు తమ దేశాల్లో ప్రజలు వాడే ప్రాంతీయ భాషలోనే రచనలు చేయడం ప్రారంభించారు. అనేక దేశాల రచయితలు బైబిల్‌ను తమ దేశ భాషల్లోకి అనువదించారు.
* శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడంతో వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం లాంటి రంగాల్లో పరిశోధనలు జరిగాయి.
* అచ్చుయంత్రాన్ని కనుక్కోవడం, పేపరు తయారుచేయడం వల్ల సైన్స్, సాహిత్య రంగాల్లో అభివృద్ధి చెందిన విజ్ఞానాన్ని ప్రజలు చదవగలిగారు.
* వికా దిక్సూచిని కనుక్కోవడం వల్ల సముద్ర ప్రయాణాలు సులభమయ్యాయి.
» కాన్‌స్టాంటినోపుల్ నగరాన్ని తురుష్కులు స్వాధీనం చేసుకున్నారు.
* క్రీ.శ.15వ శతాబ్దం వరకు యూరోపియన్ వర్తకులు కాన్‌స్టాంటినోపుల్ ద్వారా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలతో వర్తకం చేయడానికి ప్రయాణించిన భూమార్గాన్ని తురుష్కులు మూసివేశారు. ఫలితంగా వారు సముద్ర మార్గాలను అన్వేషించి ఆసియా, ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం కొనసాగించారు. అదే సమయంలో వాస్కోడిగామా * సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా అప్పటి యూరోపియన్ ప్రజలు ప్రతి విషయాన్ని ప్రశ్నించి, తర్కించి, పరిశోధించి, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నేర్చుకోవడం ప్రారంభించారు. దీని వల్ల ప్రజల్లో రాజులు దైవాంశ సంభూతులనే భావం ఏర్పడి వారి నిరంకుశాధికారాన్ని ప్రజలు ధిక్కరించారు.
* రాజకీయ, సామాజిక, మత రంగాల్లో వచ్చిన ఈ మార్పులు యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభానికి నాంది పలికాయి.  ఫలితంగా భూస్వామ్య వ్యవస్థ క్షీణించి దాని స్థానంలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది.
* పెట్టుబడిదారీ విధానాన్ని ప్రయివేటు వ్యక్తులు తమ లాభార్జన కోసం ఉత్పత్తి పంపకాలను సొంతం చేసుకునే ఒక ఆర్థిక విధానంగా నిర్వచించారు.

 

పారిశ్రామిక విప్లవం

* విప్లవం అంటే ఏదైనా రంగంలో వచ్చే ఆకస్మికమైన మార్పు.
* పరిశ్రమల్లో ఉపయోగపడే కొత్త యంత్రాలను కనిపెట్టి వాటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని 'పారిశ్రామిక విప్లవం' అని అంటారు. పరిశ్రమల్లో యంత్రాల వాడకం మొదట ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది.
* స్పిన్నింగ్ జెన్నీ అనే కొత్త యంత్రాన్ని వస్త్రాల నేతకు ఉపయోగించడం, ఆవిరి యంత్రాన్ని కనుక్కోవడంతో ఇంగ్లండ్‌లో వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.
* ఇతర పరిశోధనలు అంటే బ్లాస్ట్‌ఫర్నేస్ గనుల్లో ఉపయోగించే రక్షిత దీపం, విద్యుచ్ఛక్తి, టెలిఫోన్, టెలిగ్రాఫ్, రేడియో లాంటివి పారిశ్రామిక విప్లవాన్ని మరింత శక్తిమంతం చేశాయి.

 

సామ్రాజ్యవాదం ఆవిర్భావం

* బ్రిటిష్ సామ్రాజ్యం బర్మాకి కూడా విస్తరించింది. ఆఫ్రికాలోని చాలా భాగంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యూరోపియన్‌ల సామ్రాజ్యవాదం వ్యాపించింది.

 

ప్రపంచంలోని ముఖ్య సంఘటనలు - భారతదేశంపై వాటి ప్రభావం

అమెరికా, ఫ్రాన్స్‌లో విప్లవాలు

* 18వ శతాబ్దపు ద్వితీయార్థంలో వచ్చిన అమెరికా స్వాతంత్య్ర యుద్ధం, ఫ్రెంచి విప్లవం ప్రపంచ చరిత్రలో చెప్పుకోదగినవి.
* బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో 13 వలస రాజ్యాలను స్థాపించింది. ఆ రాజ్యాల్లోని ప్రజలంతా ఇంగ్లండ్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ఇంగ్లండ్‌ ప్రజలు అనుభవించే హక్కులను కల్పించలేదు.
* ఇంగ్లండ్, ఫ్రాన్స్‌కు చెందిన తత్వవేత్తలు తమ రచనల ద్వారా మానవుడికి స్వేచ్ఛగా, ఆనందంగా జీవించే హక్కు ఉందని ఉద్ఘాటించారు.
* బ్రిటిష్ ప్రభుత్వం ఈ హక్కులను తిరస్కరించడం, గుర్తించకపోవడం అమెరికా స్వాతంత్య్ర యుద్ధానికి కారణమైంది. ఫలితంగా అమెరికాలోని ఆంగ్ల వలసలు స్వాతంత్య్రం పొందాయి. క్రీ.శ.1783లో అమెరికా సర్వసత్తాక రాజ్యంగా ఏర్పడింది.
* ఫ్రాన్స్‌లో సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా ఉండేది. వీరంతా అమెరికా స్వాతంత్య్ర యుద్ధం నుంచి స్ఫూర్తిని పొందారు. ఫలితంగా అప్పటి ఫ్రెంచి చక్రవర్తి లూయీ XVIకి వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో తిరుగుబాటు జరిగింది.
* క్రీ.శ.1789, జులై 14న ఫ్రాన్స్‌లో విప్లవం ప్రారంభమైంది. విప్లవకారులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాటం చేశారు. పారిస్‌లోని బాస్టిలు జైలు తలుపులు పగులగొట్టి ఖైదీలందర్నీ విడిపించారు.
* ఫ్రాన్స్‌లో ఏటా ఈ రోజును జాతీయదినంగా జరుపుకుంటారు.
* మానవులంతా పుట్టుకతోనే స్వేచ్ఛా జీవులని, వారు స్వేచ్ఛగానే జీవిస్తారని, వారందరికీ అన్ని హక్కులు సమానమేనని ఈ విప్లవం ప్రకటించింది. ఈ రెండు విప్లవాలు ప్రపంచమంతటా జాతీయ భావాలను బలపడేలా చేశాయి.
* జాతీయభావం అంటే ఒకే భాష మాట్లాడుతూ, ఒకే మతాన్ని పాటించే, ఒకే జాతికి చెందిన ప్రజలు ఒకే ప్రభుత్వం అధీనంలో ఉండాలని కోరుకోవడం.
* 19వ శతాబ్దంలో జర్మన్, ఇటలీలు తమ దేశాల ఏకీకరణ కోసం ఆయా భాషలు మాట్లాడే ప్రజలు ఒకే ప్రభుత్వం కిందకు వచ్చేందుకు పోరాడి సఫలమయ్యారు.

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సాంఘిక సంస్కరణల కోసం మహమ్మదీయుల ఉద్యమాలు

* మహమ్మదీయుల్లోని కులవ్యవస్థ, పరదా పద్ధతి లాంటి దురాచారాలను రూపుమాపడానికి ఉత్తర్ ప్రదేశ్‌లోని బెరైలికి చెందిన సయ్యద్ అహ్మద్ ఖాన్, బెంగాల్‌కు చెందిన షరియతుల్లా కృషిచేశారు.
* షరియతుల్లా ఫైరైజి ఉద్యమానికి నాయకత్వం వహించాడు.
* నవాబ్ అబ్దుల్ లతీఫ్ (1828 - 1893) 'మహమ్మదన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా' అనే సంస్థను 1863లో స్థాపించాడు. ఈ సంస్థ కూడా మహమ్మదీయుల సంస్కరణల కోసం కృషి చేసింది.
* అబ్దుల్ లతీఫ్ హిందూ, మహమ్మదీయుల ఐక్యతకు; మహమ్మదీయల్లో విద్యావ్యాప్తికి కృషిచేశాడు.
* సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ (1817 - 1898) మొగల్ దర్బారుకు చెందిన గొప్ప వంశస్థుడు. ఇతడు 1875లో అలీఘర్‌లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఇది తర్వాతి కాలంలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది.
* మహమ్మదీయుల్లో సాంఘిక జాగృతి కోసం సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో చేసిన ఉద్యమాన్ని 'అలీగఢ్ ఉద్యమం' అంటారు. ఇతడు హిందువులు, ముస్లింలు భారతీయులేనని విభేదాలు ఉండకూడదని బోధించాడు.

 

ఈశ్వర చంద్ర విద్యాసాగర్ (1820 - 1891):

* ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 1820లో బెంగాల్‌లోని ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సంస్కృతాన్ని అభ్యసించిన గొప్పవిద్వాంసుడు. కలకత్తాలోని సంస్కృత కళాశాల ఇతడికి 'విద్యాసాగర్' అనే బిరుదును ఇచ్చి గౌరవించింది. సమాజానికి అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి బెంగాలీ పత్రికల్లో ఉత్తేజపరిచే రచనలు చేశాడు.
* అనేక మంది సంఘ సంస్కర్తలు వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్యకు కృషి చేశారు. వారిలో కందుకూరి వీరేశలింగం (1848 - 1919), నారాయణ గురు (కేరళ) ముఖ్యమైనవారు.

 

సాంస్కృతిక జాగృతీ ప్రభావం:

* యూరోపియన్ విద్వాంసులు భారత సాహిత్యాన్ని ప్రశంసించారు. ఈ విషయంలో విలియం జోన్స్ మార్గదర్శకత్వం వహించి 'ఏషియాటిక్ సొసైటీ'ని స్థాపించాడు.
* విలియం జోన్స్ కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలాన్ని' ఆంగ్లంలోకి అనువదించాడు.
* 19వ శతాబ్దపు విద్వాంసులు మౌర్య చక్రవర్తి అయిన అశోకుడి శాసనాలను అనువదించారు.
* ఏషియాటిక్ సొసైటీ ఈ రచనలన్నింటినీ ముద్రించింది. భారతీయులు ఈ గ్రంథాలను చదివి ప్రాచీన భారతదేశ సంస్కృతిని, నాగరికతను తెలుసుకోగలిగారు.

 

సాహిత్యం, భాష, కళలు:

* మనదేశంలో 19వ శతాబ్దంలోని సాహిత్యం ప్రాచీన సాహిత్యం కంటే భిన్నమైంది.
* ప్రాచీన సాహిత్యం పద్య, శ్లోకాల రూపంలో ఉండేది. 19వ శతాబ్దంలో గద్య రచనలకు ఎక్కువ ప్రాముఖ్యం ఉండేది.
* భరతేందు హరిశ్చంద్ర (1850 - 1885) ఆధునిక హిందీ సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు.
* బంకించంద్ర ఛటోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటివారు బెంగాలీ సాహిత్యంలో మార్గదర్శకులు.
* రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'జనగణమన' స్వతంత్ర భారతదేశానికి జాతీయ గీతం అయ్యింది. ఠాగూర్ సాహిత్య కృషికి 1913లో అత్యున్నత అంతర్జాతీయ నోబెల్ పురస్కారం లభించింది.
* బంకించంద్ర రాసిన 'వందేమాతరం', మహమ్మద్ ఇక్బాల్ రచించిన 'సారేజహాసే అచ్ఛా' గేయాలను ప్రజలు దేశభక్తి ప్రబోధకాలుగా పాడుకుంటున్నారు.
* గురజాడ అప్పారావు - తెలుగు, హరినారాయణ - మరాఠీ, సుబ్రమణ్య భారతి - తమిళం, హేమచంద్ర బారువా - అసోం, ఫకీర్ మోహన్ సేనాపతి - ఒరియా, కె.వి. పుట్టప్ప - కన్నడ; కుమరన్ ఆసన్, వి.కె. నారాయణ మీనన్ - మళయాళం భాషల్లో ప్రసిద్ధ రచయితలు. వీరంతా 19వ, 20వ శతాబ్దపు మొదటి సంవత్సరాల్లో రచనలు చేసి సొంత భాషల్లో సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.
* భారతదేశ గ్రామాల్లోని పేదరికాన్ని ప్రేమ్‌చంద్ తన హిందీ రచనల్లో వర్ణించాడు.
* రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రలేఖనాన్ని శాస్త్రీయంగా అభ్యసించాడు. దీనికోసం బెంగాల్‌లో పాఠశాలను స్థాపించాడు.
* రాజారామ్మోహన్ రాయ్ రామాయణ, మహాభారత గాథలను; అమృతా షేర్గిల్ భారతీయుల నిత్యజీవితాలను, నందలాల్ బోస్ వృత్తి పనుల వారి నిత్యజీవితాలను, ప్రాచీన గాథలను, స్వాతంత్య్రోద్యమంలోని కొన్ని ఘట్టాలను చిత్రాల రూపంలో చూపారు.
పత్రికల అభివృద్ధి, వాటి పాత్ర:
* ది హిందూ, అమృత్‌బజార్, ది మరాఠా, ది ఇండియన్ మిర్రర్, ది స్వదేశ్ మిత్రన్, ది ప్రభాకర్, ది ఇందు ప్రకాశ్ లాంటి పత్రికలు భారత ప్రజలను ఉత్తేజపరచి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేలా చేశాయి.

 

సైన్సు అభివృద్ధి:

* రాజారామ్మోహన్ రాయ్ లాంటివారు ఆంగ్ల విద్యను అభ్యసించాలని, తద్వారా సైన్సు చదవడంతో భారతదేశం అభివృద్ధి చెందుతుందని భావించారు.
* 19వ శతాబ్దపు ఆరంభంలో సైంటిఫిక్ సొసైటీలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా భారతదేశంలో సైన్సు అభివృద్ధి చెందింది.
* మహేందర్‌లాల్ సర్కార్ మొదటి వైద్య విద్యార్థి. ఇతడు 1876లో సైన్సు అభివృద్ధికి 'ఇండియన్ అసోసియేషన్' అనే సంస్థను ఏర్పాటు చేశాడు.
* 20వ శతాబ్దంలో 'ఇండియన్ సైన్సు కాంగ్రెస్ అసోసియేషన్‌'ను స్థాపించారు.
* 1930లో సర్ సి.వి. రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన కృషికిగానూ ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
* శ్రీనివాస రామానుజన్ గణితంలో; మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో ప్రసిద్ధులు.
* విశ్వేశ్వరయ్య హైదరాబాద్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో పని చేసి, దేశానికి విశిష్ట సేవలందించారు. జల విద్యుదుత్పత్తి, ఆనకట్టల నిర్మాణం, పట్టు పరిశ్రమాభివృద్ధికి కృషి చేశారు.
* ప్రఫుల్ల చంద్ర రే, సత్యేంద్రనాథ్ బోస్, జగదీష్ చంద్ర బోస్, డి.ఎన్. వాడియా, బీర్బల్ సహాని, మేఘనాథ్ సాహ లాంటివారు సుప్రసిద్ధ శాస్త్ర విజ్ఞానవేత్తలు.

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పూర్వచారిత్రక యుగం

ప్రాచీనకాలం నుంచి ప్రజలు సంతోషంగా జీవించడానికి చేసిన ప్రయత్నమే చరిత్ర.
* సాధారణంగా భూమి 100 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని భావిస్తున్నారు. భూమిపై మానవుల లాంటి జీవులు, వారి పూర్వీకులు 20 లక్షల సంవత్సరాల నుంచి 30 లక్షల సంవత్సరాల మధ్య కాలంలో నివసించేవారు.
* సుమారు 5 లక్షల సంవత్సరాల నుంచి మానవుడు సాగించిన జీవిత యాత్రను 'ఆదిమ చరిత్ర' అంటారు.
* ఈ పరిణామ క్రమంలో మానవ సాంస్కృతికాభివృద్ధి, చరిత్ర 10 వేల సంవత్సరాల పూర్వం నుంచే ప్రారంభమైంది.
* ప్రపంచ భౌతికాభివృద్ధిని వర్ణించడానికి 80 కి.మీ. కాగితాన్ని ఉపయోగిస్తే దానిలో మానవ పరిణామ ప్రగతి కేవలం 10 సెం.మీ. మాత్రమేనని, ఇది ప్రపంచ వయోపరిణామంలో 10 లక్షల భాగంలో ఒకవంతు అని వర్ణించారు.
* మానవుడు వివిధ కాలాల్లో పరిసరాలను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుని క్రమంగా అభివృద్ధి చెందాడు.

ప్రపంచ మానవ చరిత్రను మూడు విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు
1) పూర్వచారిత్రక యుగం (ఆదిమ చరిత్ర): దీనికి లిఖిత ఆధారాలు లేవు. దీన్ని ప్రీ హిస్టరీ అంటారు.
2) సంధికాలపు చారిత్రక యుగం: దీన్ని ప్రోటోహిస్టరీ అంటారు. ఇది రెండు యుగాల మధ్య కాలం.
3) చారిత్రక యుగం (హిస్టారిక్ పీరియడ్): ఇది రెండు యుగాల మధ్యకాలం. దీనికి లిఖిత ఆధారాలు ఉన్నాయి.
 

చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా అధ్యయనం చేస్తారు.
1) ప్రాచీన యుగం
2) మధ్యయుగం
3) ఆధునిక యుగం
* పూర్వ చారిత్రకయుగాన్ని తెలుసుకోవడానికి లిఖిత ఆధారాలు లేవు. దీని గురించి తెలుసుకోవడానికి 'పురావస్తు శాస్త్రం', 'మానవశాస్త్రం' తోడ్పడతాయి.

 

పురావస్తు శాస్త్రం

  ప్రాచీనకాలంలో మానవుడు నివసించిన ప్రాంతాలు, ఉపయోగించిన పరికరాలు, వస్తువులు, మట్టితో కప్పబడి మరుగునపడ్డాయి. పురాతత్వవేత్తలు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, అక్కడ లభించిన వస్తువులను పరిశీలించి, పరిశోధించి ఆ కాలంనాటి మానవుల జీవిత విశేషాలను తెలుసుకున్నారు. ఈ తవ్వకాలను 'ఉత్ఖాతనం' అని, వీటి గురించి వివరించే శాస్త్రాన్ని 'పురావస్తు శాస్త్రం' అని అంటారు.
* ఈజిప్టులోని పిరమిడ్లు, అప్పటి ప్రాచీన నాగరికత విశేషాలను ఉత్ఖాతనాల వల్ల అధ్యయనం చేశారు.
* భారతదేశంలోని పంజాబ్, సింధు రాష్ట్రాల్లో హరప్పా, మొహంజొదారో తవ్వకాలను అధ్యయనం చేసిన జాన్ మార్షల్ 5000 సంవత్సరాల పూర్వపు సింధులోయ నాగరికత గురించి తెలుసుకున్నారు.
* ఉత్ఖాతనల అధ్యయనం వల్ల సింధు నాగరికత ఈజిప్టు, మెసపటోమియా నాగరికతలకు సమకాలీనమైందని తెలిసింది.
* మన రాష్ట్రంలోని నాగార్జున కొండ ప్రాంతంలో లభించిన ఉత్ఖాతనాలు క్రీ.శ.3వ శతాబ్దం నుంచి ఇక్ష్వాకుల కాలంనాటి నాగరికతను తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి. ఈ విధంగా పురావస్తు శాస్త్రం ప్రాచీన కాలపు రచనకు దోహదపడుతోంది.

 

మానవశాస్త్రం

* మానవశాస్త్రం ప్రాచీన రచనకు ఎంతో తోడ్పడుతోంది. వివిధ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో వేలాది సంవత్సరాల కిందట జీవించిన మానవుల అస్తిపంజరాలు, పుర్రెలు, ఎముకలు, దంతాలు బయటపడ్డాయి.
* భూమి పైపొరల్లో లభించిన శిలాజాలు, గతంలో మానవుడు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ మానవ చరిత్రకు అతివిలువైన సాక్ష్యాధారాలు.
* వీటిలో ఉన్న రేడియో కార్బన్ల నిష్పత్తి కాల నిర్ణయానికి ఉపయోగపడుతోంది. మార్టిమర్‌వీలర్ వీటిని వస్తువులుగా కాకుండా 'ప్రాచీన కాలపు మనుషులు'గా వర్ణించాడు. ఈ విధంగా మానవశాస్త్రం అప్పటి చరిత్ర రచనకు మూలమైంది.

 

భూమిపై ప్రాణకోటి ఆవిర్భావం:

* భూమి సూర్యుడి నుంచి విడిపోయి భూగ్రహంగా ఏర్పడింది. అనేక భౌతిక మార్పులు చెందిన తర్వాత భూమి ప్రాణకోటికి నివాసయోగ్యమైంది.
* భూమి మీద మొదట 'లార్వా', ఆ తర్వాత 'ప్లాజిలెట్ట' జీవులు ఆవిర్భవించాయి. కాలక్రమంగా వృక్షజాతి, జంతుజాలం, చివరిగా మానవుడు ఉద్భవించాడు.
మానవ జీవిత పరిణామ దశలు:
1) ఆస్ట్రోఫిథికస్
2) రామాఫిథికస్
3) హోమో ఎరక్టస్
4) నియన్‌డెర్తల్ నరుడు
ఈ జాతులు మనిషి లాంటి ప్రాణులు. క్రీ.పూ.1,40,000 - 4000కు పూర్వం జీవిస్తుండేవి.
5) హోమోసేపియన్లు ఆధునిక మానవులకు పూర్వీకులు. వీరిని క్రోమాగ్నన్‌లు అని కూడా అంటారు.
* 20 వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన వీరు కొన్ని రకాల పనిముట్లను ఉపయోగించేవారు. గుహ చిత్రాలను గీసేవారు. ఈ చిత్రాలు వారి అనుభవాలను తెలియజేసేవి.
* మానవుడి నాగరికత పరిణామ క్రమం రాతియుగంతో ఆరంభమైంది. ఈ యుగాన్ని 3 దశలుగా విభజించారు.
పాతరాతియుగం
* క్రీ.పూ.2,50,000 - 1000 వరకు (సుమారుగా) ఈ యుగంలో మానవుడు గొడ్డళ్లు, కత్తులు, రాతి పనిముట్లు తయారుచేసుకొని, ఆహారం, ఆత్మరక్షణకు ఉపయోగించేవాడు. గుహల్లో నివసిస్తూ జంతవుల చర్మంతో శరీరాన్ని కప్పుకునేవాడు.
* ఆహారం కోసం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. అనుభవాలను చిత్రాలుగా పెద్ద రాళ్లపై గీసేవాడు.

 

మధ్య శిలాయుగం

* పాతరాతి, కొత్తరాతి యుగానికి మధ్య కాలాన్ని 'మధ్య శిలాయుగం' అంటారు. ఈ యుగంలో వాతావరణం మార్పు చెందడం వల్ల ఆలోచన, విచక్షణా జ్ఞానం పెరిగింది. ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుక్కున్నాడు.
* మధ్య శిలాయుగంలో మానవులు చిన్న సామాజిక వర్గాల్లో నివసించేవారు. ఫలితంగా సాంఘిక సంబంధాలు బలపడటంతో పాటు సాంఘిక నిబంధనలు ఏర్పడ్డాయి.

 

కొత్తరాతియుగం

* ఈ యుగంలో పరికరాలు, పనిముట్ల నాణ్యత పెరిగింది. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకుని వ్యవసాయం, పశుపోషణను ప్రారంభించాడు.
* మట్టి కుండలను కాల్చడం రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టుగా పరిణమించింది. చేనేత కళ ఆరంభమై క్రమంగా భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది. పత్తిపంటను పండించడం వృక్ష శాస్త్ర అభ్యసనానికి దారితీసింది. వస్తుమార్పిడి పద్ధతి వ్యాపార, వాణిజ్యాలకు మార్గదర్శకమైంది.
* ఈ విధంగా ఆధునిక శాస్త్ర విజ్ఞానాల ఆరంభం కొత్తరాతియుగంలోనే జరిగింది. మానవుడు ఆహార సేకరణ, వేటగాడి దశ నుంచి స్థిరజీవన దశకు చేరుకున్నాడు.

 

ఆర్థిక జీవనం

* ఈ కాలంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ ఉండటం వల్ల మిశ్రమ ఆర్థిక విధానం రూపుదిద్దుకుంది. ఆర్థిక జీవన నిర్మాణంలో స్త్రీ, పురుషులు సమాన పాత్రలు పోషించారు.
* 'చక్రాన్ని' ఆవిష్కరించడం వల్ల ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

 

మతవిశ్వాసాలు

* ప్రజలు ఇతర దేవతలతో పాటు భూమిని కూడా పూజించేవారు. పూజారులను దేవతలు, మానవులకు మధ్యవర్తులుగా భావించేవారు. ఆనాటి ప్రజలు పునర్జన్మ ఉంటుందని విశ్వసించేవారు.

 

రాజకీయ జీవనం

* ఈ కాలంలో ప్రజలను శత్రువుల బారి నుంచి కాపాడటం పరిపాలకుల విధి. వారికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని విశ్వసించేవారు.
* ఈ యుగంలో జరిగిన పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రజలకు అన్ని రంగాల్లో ప్రయోగాత్మకమైన అనుభవాలను కలిగించాయి. ఫలితంగా ఇది శాస్త్రీయ విజ్ఞాన ప్రగతికి ఆరంభదశగా రూపొందింది.

 

కాంస్యయుగపు నాగరికత

* సంస్కృతి, నాగరికత అనే పదాలను విభిన్న అర్థాల్లోనే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ పదాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో 'నాగరికత' అంటే సమాజంపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి ప్రభావమని, 'సంస్కృతి' అంటే లలితకళలు, తాత్వికచింతనలు అని భావిస్తున్నారు.
* అందుకే సంస్కృతి మానవులంతా కలిసి ఏర్పాటుచేసిందని, నాగరికత కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన అంశమని తెలిపారు.
* నాగరికత అంటే నగరాల్లో నివసించే సమాజ ప్రగతి. నగరాలు అభివృద్ధి చెందిన చోట నాగరికతలు వెలిశాయని అంటారు.
* పురావస్తు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడినట్లుగా క్రీ.పూ.4000 సంవత్సరాల సమీప దశను 'రాగి తగరపు యుగం' అంటారు. నాగరికతా వ్యాప్తికి మూలమైన లోహయుగపు ప్రగతిలో ఈ యుగాన్ని మొదటి దశగా వర్ణించారు.
* ఈ యుగం రాగి, తగరం వాడుకతో ఆరంభమై కంచు, ఇనుము వాడుకలోకి వచ్చే వరకు కొనసాగింది. దీన్ని మానవ చరిత్రలో ప్రముఖ ఘట్టంగా పేర్కొన్నారు.

 

కాంస్య యుగం

* భాష, రాత సాధనాల ఆవిర్భావంతో మొదలైన నాగరికత నగర సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు మూలమైంది. జనాభా పెరుగుదలతో పరిసరాల గురించి ఏర్పడిన పరిజ్ఞానం వల్ల ఆర్థికాభివృద్ధి జరిగింది. దీన్నే 'నాగరికతా విప్లవం' అంటారు.
* రాయడం, నేర్చుకోవడం తెలిసిన తర్వాతనే పంచాంగం, భూగోళశాస్త్రం లాంటి విజ్ఞానశాస్త్రాలు రూపొందాయి.

 

ప్రాచీన నాగరికతలు

* ప్రాచీన నాగరికతలన్నీ సాధారణంగా నదీ లోయల్లోనే పుట్టాయి. ప్రపంచంలోని ముఖ్య నాగరికతలైన మెసపటోమియా, ఈజిప్టు, సింధు నాగరికతలు నదీ లోయల్లోనే వ్యాపించాయి.
* ఈ నాగరికతలు ఇంచుమించుగా క్రీ.పూ.3000 సంవత్సరాల ప్రాంతంలో ఏర్పడి మానవ జీవితాన్ని వ్యవస్థీకరించడానికి దోహదం చేశాయి. ఈ సమయంలోనే ప్రపంచమంతటా లోహం వాడుకలోకి వచ్చింది.
* ఈ నాగరికతాభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచమంతటా విస్తరించింది.
* అటవీ సంపద, భూమిపై సహజ వనరులు పెరగడం వల్ల ఆదాయం పెరిగింది. దీంతోపాటు విరామ సమయం కూడా పెరగడం వల్ల, ప్రజలు కొత్త భావాలు, ఆవిష్కరణలను ప్రవేశపెట్టగలిగారు. ఈ విధంగా ప్రపంచమంతటా సాంస్కృతికాభివృద్ధి జరిగింది.

 

నదీలోయ నాగరికతలు

* మానవ నాగరికత టైగ్రిస్, యూప్రెటిస్ నదీలోయలైన మెసపటోమియాలో ఆరంభమైంది. ఈజిప్టు, సింధు నాగరికతలు మెసపటోమియాలోని నాగరికత కంటే భిన్నంగా ఉన్నప్పటికీ, అనేక సామాన్యమైన అంశాలు ఉండటం వల్ల ఇవి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేశాయి.
* ప్రపంచంలోని అన్ని దేశాలు, జాతులు సమష్టిగా కృషి చేసినందువల్లే ప్రపంచ నాగరికత అభివృద్ధి చెందింది.
* ఈ యుగంలో మానవుడు సాధించిన సాంస్కృతికాభివృద్ధి ఆధునిక ప్రపంచ నాగరికతలో అంతర్భాగమైంది.
* శాస్త్రీయ, సాంకేతిక, వైజ్ఞానిక పరిశోధనల వల్ల క్రమేపి సమాజంలోని మానవులంతా సమానులే అనే భావన ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్య విధానాలకు మార్గదర్శకమై ఆధునిక యుగానికి నాందిపలికింది.

 

సామాజిక లక్షణాలు

* ఈ యుగంలో వేటగాళ్ల దశ అంతమై వ్యవస్థీకృత జీవనం మొదలైంది. రాత నేర్చుకోవడం వల్ల సమాజంలో స్థిరత్వం ఏర్పడి మానవుడి ఆలోచనలకు ఒక క్రమరూపం ఏర్పడింది. రాతికి బదులు లోహాన్ని ఉపయోగించడం వల్ల వృత్తి నైపుణ్యం పెరిగింది.
* గ్రామాల స్వయంసమృద్ధి అంతరించి పట్టణాలపై ఆధారపడాల్సి వచ్చింది. కొత్తగా కనుక్కున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల పరిశ్రమలు ఏర్పడ్డాయి.
* వ్యవసాయంలో లోహాన్ని ఉపయోగించి మెరుగైన నాగళ్లను వాడటం వల్ల పంటల సాగు విస్తృతమైంది.
* నదీమైదానాల్లో నివసించే ప్రజలు వరదలను నివారించడానికి అడ్డుకట్టలు నిర్మించారు. వరదల సమయంపై అవగాహన ఏర్పడటం వల్ల వ్యవసాయ రుతువులను గుర్తించగలిగారు.
* 'చక్రం' ఉపయోగించడం వల్ల సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

 

రాజకీయ మతజీవనంపై నూతన సాంకేతిక పరిజ్ఞానపు ప్రభావం

* లోహయుగం నాటికి అభివృద్ధి చెందిన మెసపటోమియా, ఇరాన్ ప్రాంతాల వారు ఇతరులపై పెత్తనం చేసేవారు. యుద్ధంలో ఓడిపోయిన వారిని బానిసలుగా చేసుకుని తమ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించేవారు.
* నగర శిథిలాల్లో లభించిన అవశేషాలను పరిశీలించడం వల్ల, ఆ కాలంలో నగరపాలక సంస్థలుండేవని తెలుస్తోంది. వర్తకులు, భూస్వాముల సంబంధాలు వేర్వేరుగా ఉండేవి.
* మెసపటోమియా పట్టణ దేవాలయాలు పరిపాలన కేంద్రాలుగా 'పటెశి' అని పిలవబడే పూజారుల ఆధిపత్యంలో ఉండేవి. సుమేరియా పట్టణాల్లో ఈ కేంద్రాలను 'జిగ్గురాత్' అని పిలిచేవారు. నగరాన్ని రక్షించడం, ఆర్థిక సంపదను సమాజంలోని వివిధ వర్గాలకు పంచడం లాంటివి అప్పటి ప్రభుత్వ పనుల్లో ముఖ్యమైనవి.

 

మత జీవనం

* ఈ యుగంలోనే 'పూజారులు' అనే ప్రత్యేక వర్గం ఏర్పడింది. ముద్రలు, పచ్చబొట్లు మహిమగలవని మానవులు విశ్వసించేవారు. దేవతల చిహ్నాలను ఆయా దేవాలయాల్లో ప్రదర్శించేవారు. ప్రకృతి శక్తులను జయించడానికి మానవుడు చేసిన ప్రయత్నాలన్నీ మత విశ్వాసాల నుంచి గ్రహించినవే.
* 'దేవుడు' నగర జీవనానికి ప్రధానమైనవాడు. పూజారి ద్వారానే ఆయన ప్రజలకు సన్నిహితుడౌతాడు అని నమ్మేవారు. దేవుడికి ఆహార పానీయాలు సమకూర్చడానికే మానవుడు, సుమేరియన్లు సృష్టించబడ్డారని నమ్మేవారు.
* ఈజిప్టు సుమేరియా దేశాల్లో సూర్యుడు ప్రధాన దైవం. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని మానవుడి జనన మరణాలతో పోల్చి చూస్తూ మానవులకు పునర్జన్మ ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసించేవారు.
* సమాధుల్లో లభించిన వస్తువుల ఆధారంగా అప్పటి ప్రజలకు మరణానంతరం మరో జీవితం ఉంటుందనే నమ్మకం ఉండేదని స్పష్టమవుతోంది. నగరానికి బయట శ్మశానం ఉండేదని, అనేక పూజా కార్యక్రమాలతో అంత్యక్రియలు నిర్వహించేవారని తెలుస్తోంది.

 

భాషాకళల విశిష్టత

* ఈజిప్ట్‌లోని పిరమిడ్ల నిర్మాణాలను పరిశీలిస్తే కళాకారుల పనితనంతో పాటు వారిపై మత విశ్వాసాల ప్రభావం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
* రాజుల సమాధుల్లో స్త్రీలను, ధనధాన్యాలను, విలాస వస్తువులను పూడ్చిపెట్టేవారు. ఈ వస్తువులు చనిపోయిన రాజుకు ఉపయోగపడతాయని వారి నమ్మకం. కాంస్య యుగంలో ఆవిష్కృతమైన లిపి ప్రభావం వల్ల గణితం, భూగోళ, వైద్యశాస్త్రాల అభివృద్ధికి మార్గం సుగమమైంది.
* ప్రాచీన కాలంనాటి ఈజిప్షియన్లు కాలాన్ని సంవత్సరాలు, నెలలు, వారాలుగా విభజించి క్యాలెండర్‌ను రూపొందించారు. రోజుకు 24 గంటల కాలమానాన్ని నిర్ణయించారు. వారు పిరమిడ్ల నిర్మాణంలో కచ్చితమైన కొలతలను పాటించారు. ఈ ప్రయోగాలన్నీ తక్షణ అవసరాలకు మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తాయి.
* కాంస్యయుగంలో సాధించిన పరిజ్ఞానం అడవులను పెంచడానికి యుద్ధాల్లో విజయం సాధించడానికి, వ్యాపారం కొనసాగించడానికి ఉపయోగపడింది. వీటిని గమనిస్తే మానవుడు భౌతిక వనరులను, తనకు తన సంతానానికి, సుఖ సంతోషాలను కలిగించడానికి ఉపయోగించేవారు.
* ఆ కాలంనాటి శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన పదాలన్నీ మత విశ్వాసాల నుంచే ఏర్పడ్డాయి.
* కాంస్యయుగంలో వివిధ ప్రాంతాల్లోని మానవులు సాధించిన సాంకేతిక పరిజ్ఞానంలో సామాన్యమైన లక్షణాలు ఉండటం సమైక్య రాజకీయ వ్యవస్థల ఏర్పాటుకు దోహదంచేసింది.

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పూర్వచారిత్రక యుగం

ప్రాచీనకాలం నుంచి ప్రజలు సంతోషంగా జీవించడానికి చేసిన ప్రయత్నమే చరిత్ర.
* సాధారణంగా భూమి 100 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని భావిస్తున్నారు. భూమిపై మానవుల లాంటి జీవులు, వారి పూర్వీకులు 20 లక్షల సంవత్సరాల నుంచి 30 లక్షల సంవత్సరాల మధ్య కాలంలో నివసించేవారు.
* సుమారు 5 లక్షల సంవత్సరాల నుంచి మానవుడు సాగించిన జీవిత యాత్రను 'ఆదిమ చరిత్ర' అంటారు.
* ఈ పరిణామ క్రమంలో మానవ సాంస్కృతికాభివృద్ధి, చరిత్ర 10 వేల సంవత్సరాల పూర్వం నుంచే ప్రారంభమైంది.
* ప్రపంచ భౌతికాభివృద్ధిని వర్ణించడానికి 80 కి.మీ. కాగితాన్ని ఉపయోగిస్తే దానిలో మానవ పరిణామ ప్రగతి కేవలం 10 సెం.మీ. మాత్రమేనని, ఇది ప్రపంచ వయోపరిణామంలో 10 లక్షల భాగంలో ఒకవంతు అని వర్ణించారు.
* మానవుడు వివిధ కాలాల్లో పరిసరాలను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుని క్రమంగా అభివృద్ధి చెందాడు.
ప్రపంచ మానవ చరిత్రను మూడు విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు
1) పూర్వచారిత్రక యుగం (ఆదిమ చరిత్ర): దీనికి లిఖిత ఆధారాలు లేవు. దీన్ని ప్రీ హిస్టరీ అంటారు.
2) సంధికాలపు చారిత్రక యుగం: దీన్ని ప్రోటోహిస్టరీ అంటారు. ఇది రెండు యుగాల మధ్య కాలం.
3) చారిత్రక యుగం (హిస్టారిక్ పీరియడ్): ఇది రెండు యుగాల మధ్యకాలం. దీనికి Prehistoric era
చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా అధ్యయనం చేస్తారు.
1) ప్రాచీన యుగం
2) మధ్యయుగం
3) ఆధునిక యుగం
* పూర్వ చారిత్రకయుగాన్ని తెలుసుకోవడానికి లిఖిత ఆధారాలు లేవు. దీని గురించి తెలుసుకోవడానికి 'పురావస్తు శాస్త్రం', 'మానవశాస్త్రం' తోడ్పడతాయి.

 

పురావస్తు శాస్త్రం

  ప్రాచీనకాలంలో మానవుడు నివసించిన ప్రాంతాలు, ఉపయోగించిన పరికరాలు, వస్తువులు, మట్టితో కప్పబడి మరుగునపడ్డాయి. పురాతత్వవేత్తలు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, అక్కడ లభించిన వస్తువులను పరిశీలించి, పరిశోధించి ఆ కాలంనాటి మానవుల జీవిత విశేషాలను తెలుసుకున్నారు. ఈ తవ్వకాలను 'ఉత్ఖాతనం' అని, వీటి గురించి వివరించే శాస్త్రాన్ని 'పురావస్తు శాస్త్రం' అని అంటారు.
* ఈజిప్టులోని పిరమిడ్లు, అప్పటి ప్రాచీన నాగరికత విశేషాలను ఉత్ఖాతనాల వల్ల అధ్యయనం చేశారు.
* భారతదేశంలోని పంజాబ్, సింధు రాష్ట్రాల్లో హరప్పా, మొహంజొదారో తవ్వకాలను అధ్యయనం చేసిన జాన్ మార్షల్ 5000 సంవత్సరాల పూర్వపు సింధులోయ నాగరికత గురించి తెలుసుకున్నారు.
* ఉత్ఖాతనల అధ్యయనం వల్ల సింధు నాగరికత ఈజిప్టు, మెసపటోమియా నాగరికతలకు సమకాలీనమైందని తెలిసింది.
* మన రాష్ట్రంలోని నాగార్జున కొండ ప్రాంతంలో లభించిన ఉత్ఖాతనాలు క్రీ.శ.3వ శతాబ్దం నుంచి ఇక్ష్వాకుల కాలంనాటి నాగరికతను తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి. ఈ విధంగా పురావస్తు శాస్త్రం ప్రాచీన కాలపు రచనకు దోహదపడుతోంది.

 

మానవశాస్త్రం

* మానవశాస్త్రం ప్రాచీన రచనకు ఎంతో తోడ్పడుతోంది. వివిధ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో వేలాది సంవత్సరాల కిందట జీవించిన మానవుల అస్తిపంజరాలు, పుర్రెలు, ఎముకలు, దంతాలు బయటపడ్డాయి.
* భూమి పైపొరల్లో లభించిన శిలాజాలు, గతంలో మానవుడు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ మానవ చరిత్రకు అతివిలువైన సాక్ష్యాధారాలు.
* వీటిలో ఉన్న రేడియో కార్బన్ల నిష్పత్తి కాల నిర్ణయానికి ఉపయోగపడుతోంది. మార్టిమర్‌వీలర్ వీటిని వస్తువులుగా కాకుండా 'ప్రాచీన కాలపు మనుషులు'గా వర్ణించాడు. ఈ విధంగా మానవశాస్త్రం అప్పటి చరిత్ర రచనకు మూలమైంది.

 

భూమిపై ప్రాణకోటి ఆవిర్భావం:

* భూమి సూర్యుడి నుంచి విడిపోయి భూగ్రహంగా ఏర్పడింది. అనేక భౌతిక మార్పులు చెందిన తర్వాత భూమి ప్రాణకోటికి నివాసయోగ్యమైంది.
* భూమి మీద మొదట 'లార్వా', ఆ తర్వాత 'ప్లాజిలెట్ట' జీవులు ఆవిర్భవించాయి. కాలక్రమంగా వృక్షజాతి, జంతుజాలం, చివరిగా మానవుడు ఉద్భవించాడు.

 

మానవ జీవిత పరిణామ దశలు:
1) ఆస్ట్రోఫిథికస్
2) రామాఫిథికస్
3) హోమో ఎరక్టస్
4) నియన్‌డెర్తల్ నరుడు
ఈ జాతులు మనిషి లాంటి ప్రాణులు. క్రీ.పూ.1,40,000 - 4000కు పూర్వం జీవిస్తుండేవి.
5) హోమోసేపియన్లు ఆధునిక మానవులకు పూర్వీకులు. వీరిని క్రోమాగ్నన్‌లు అని కూడా అంటారు.
* 20 వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన వీరు కొన్ని రకాల పనిముట్లను ఉపయోగించేవారు. గుహ చిత్రాలను గీసేవారు. ఈ చిత్రాలు వారి అనుభవాలను తెలియజేసేవి.
* మానవుడి నాగరికత పరిణామ క్రమం రాతియుగంతో ఆరంభమైంది. ఈ యుగాన్ని 3 దశలుగా విభజించారు.

 

పాతరాతియుగం

క్రీ.పూ.2,50,000 - 1000 వరకు (సుమారుగా) ఈ యుగంలో మానవుడు గొడ్డళ్లు, కత్తులు, రాతి పనిముట్లు తయారుచేసుకొని, ఆహారం, ఆత్మరక్షణకు ఉపయోగించేవాడు. గుహల్లో నివసిస్తూ జంతవుల చర్మంతో శరీరాన్ని కప్పుకునేవాడు.
ఆహారం కోసం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. అనుభవాలను చిత్రాలుగా పెద్ద రాళ్లపై గీసేవాడు.

 

మధ్య శిలాయుగం

పాతరాతి, కొత్తరాతి యుగానికి మధ్య కాలాన్ని 'మధ్య శిలాయుగం' అంటారు. ఈ యుగంలో వాతావరణం మార్పు చెందడం వల్ల ఆలోచన, విచక్షణా జ్ఞానం పెరిగింది. ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుక్కున్నాడు.
మధ్య శిలాయుగంలో మానవులు చిన్న సామాజిక వర్గాల్లో నివసించేవారు. ఫలితంగా సాంఘిక సంబంధాలు బలపడటంతో పాటు సాంఘిక నిబంధనలు ఏర్పడ్డాయి.

 

కొత్తరాతియుగం

ఈ యుగంలో పరికరాలు, పనిముట్ల నాణ్యత పెరిగింది. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకుని వ్యవసాయం, పశుపోషణను ప్రారంభించాడు.
మట్టి కుండలను కాల్చడం రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టుగా పరిణమించింది. చేనేత కళ ఆరంభమై క్రమంగా భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది. పత్తిపంటను పండించడం వృక్ష శాస్త్ర అభ్యసనానికి దారితీసింది. వస్తుమార్పిడి పద్ధతి వ్యాపార, వాణిజ్యాలకు మార్గదర్శకమైంది.
ఈ విధంగా ఆధునిక శాస్త్ర విజ్ఞానాల ఆరంభం కొత్తరాతియుగంలోనే జరిగింది. మానవుడు ఆహార సేకరణ, వేటగాడి దశ నుంచి స్థిరజీవన దశకు చేరుకున్నాడు.

 

ఆర్థిక జీవనం

ఈ కాలంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ ఉండటం వల్ల మిశ్రమ ఆర్థిక విధానం రూపుదిద్దుకుంది. ఆర్థిక జీవన నిర్మాణంలో స్త్రీ, పురుషులు సమాన పాత్రలు పోషించారు.
'చక్రాన్ని' ఆవిష్కరించడం వల్ల ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

 

మతవిశ్వాసాలు

ప్రజలు ఇతర దేవతలతో పాటు భూమిని కూడా పూజించేవారు. పూజారులను దేవతలు, మానవులకు మధ్యవర్తులుగా భావించేవారు. ఆనాటి ప్రజలు పునర్జన్మ ఉంటుందని విశ్వసించేవారు.

 

రాజకీయ జీవనం

ఈ కాలంలో ప్రజలను శత్రువుల బారి నుంచి కాపాడటం పరిపాలకుల విధి. వారికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని విశ్వసించేవారు.
ఈ యుగంలో జరిగిన పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రజలకు అన్ని రంగాల్లో ప్రయోగాత్మకమైన అనుభవాలను కలిగించాయి. ఫలితంగా ఇది శాస్త్రీయ విజ్ఞాన ప్రగతికి ఆరంభదశగా రూపొందింది.

 

కాంస్యయుగపు నాగరికత

సంస్కృతి, నాగరికత అనే పదాలను విభిన్న అర్థాల్లోనే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ పదాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో 'నాగరికత' అంటే సమాజంపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి ప్రభావమని, 'సంస్కృతి' అంటే లలితకళలు, తాత్వికచింతనలు అని భావిస్తున్నారు.
అందుకే సంస్కృతి మానవులంతా కలిసి ఏర్పాటుచేసిందని, నాగరికత కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన అంశమని తెలిపారు.
నాగరికత అంటే నగరాల్లో నివసించే సమాజ ప్రగతి. నగరాలు అభివృద్ధి చెందిన చోట నాగరికతలు వెలిశాయని అంటారు.
పురావస్తు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడినట్లుగా క్రీ.పూ.4000 సంవత్సరాల సమీప దశను 'రాగి తగరపు యుగం' అంటారు. నాగరికతా వ్యాప్తికి మూలమైన లోహయుగపు ప్రగతిలో ఈ యుగాన్ని మొదటి దశగా వర్ణించారు.
ఈ యుగం రాగి, తగరం వాడుకతో ఆరంభమై కంచు, ఇనుము వాడుకలోకి వచ్చే వరకు కొనసాగింది. దీన్ని మానవ చరిత్రలో ప్రముఖ ఘట్టంగా పేర్కొన్నారు.

 

కాంస్య యుగం

భాష, రాత సాధనాల ఆవిర్భావంతో మొదలైన నాగరికత నగర సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు మూలమైంది. జనాభా పెరుగుదలతో పరిసరాల గురించి ఏర్పడిన పరిజ్ఞానం వల్ల ఆర్థికాభివృద్ధి జరిగింది. దీన్నే 'నాగరికతా విప్లవం' అంటారు.
రాయడం, నేర్చుకోవడం తెలిసిన తర్వాతనే పంచాంగం, భూగోళశాస్త్రం లాంటి విజ్ఞానశాస్త్రాలు రూపొందాయి.

 

ప్రాచీన నాగరికతలు

ప్రాచీన నాగరికతలన్నీ సాధారణంగా నదీ లోయల్లోనే పుట్టాయి. ప్రపంచంలోని ముఖ్య నాగరికతలైన మెసపటోమియా, ఈజిప్టు, సింధు నాగరికతలు నదీ లోయల్లోనే వ్యాపించాయి.
ఈ నాగరికతలు ఇంచుమించుగా క్రీ.పూ.3000 సంవత్సరాల ప్రాంతంలో ఏర్పడి మానవ జీవితాన్ని వ్యవస్థీకరించడానికి దోహదం చేశాయి. ఈ సమయంలోనే ప్రపంచమంతటా లోహం వాడుకలోకి వచ్చింది.
ఈ నాగరికతాభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచమంతటా విస్తరించింది.
అటవీ సంపద, భూమిపై సహజ వనరులు పెరగడం వల్ల ఆదాయం పెరిగింది. దీంతోపాటు విరామ సమయం కూడా పెరగడం వల్ల, ప్రజలు కొత్త భావాలు, ఆవిష్కరణలను ప్రవేశపెట్టగలిగారు. ఈ విధంగా ప్రపంచమంతటా సాంస్కృతికాభివృద్ధి జరిగింది.

 

నదీలోయ నాగరికతలు

మానవ నాగరికత టైగ్రిస్, యూప్రెటిస్ నదీలోయలైన మెసపటోమియాలో ఆరంభమైంది. ఈజిప్టు, సింధు నాగరికతలు మెసపటోమియాలోని నాగరికత కంటే భిన్నంగా ఉన్నప్పటికీ, అనేక సామాన్యమైన అంశాలు ఉండటం వల్ల ఇవి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేశాయి.
ప్రపంచంలోని అన్ని దేశాలు, జాతులు సమష్టిగా కృషి చేసినందువల్లే ప్రపంచ నాగరికత అభివృద్ధి చెందింది.
ఈ యుగంలో మానవుడు సాధించిన సాంస్కృతికాభివృద్ధి ఆధునిక ప్రపంచ నాగరికతలో అంతర్భాగమైంది.
శాస్త్రీయ, సాంకేతిక, వైజ్ఞానిక పరిశోధనల వల్ల క్రమేపి సమాజంలోని మానవులంతా సమానులే అనే భావన ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్య విధానాలకు మార్గదర్శకమై ఆధునిక యుగానికి నాందిపలికింది.

 

సామాజిక లక్షణాలు

ఈ యుగంలో వేటగాళ్ల దశ అంతమై వ్యవస్థీకృత జీవనం మొదలైంది. రాత నేర్చుకోవడం వల్ల సమాజంలో స్థిరత్వం ఏర్పడి మానవుడి ఆలోచనలకు ఒక క్రమరూపం ఏర్పడింది. రాతికి బదులు లోహాన్ని ఉపయోగించడం వల్ల వృత్తి నైపుణ్యం పెరిగింది.
గ్రామాల స్వయంసమృద్ధి అంతరించి పట్టణాలపై ఆధారపడాల్సి వచ్చింది. కొత్తగా కనుక్కున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల పరిశ్రమలు ఏర్పడ్డాయి.
వ్యవసాయంలో లోహాన్ని ఉపయోగించి మెరుగైన నాగళ్లను వాడటం వల్ల పంటల సాగు విస్తృతమైంది.
నదీమైదానాల్లో నివసించే ప్రజలు వరదలను నివారించడానికి అడ్డుకట్టలు నిర్మించారు. వరదల సమయంపై అవగాహన ఏర్పడటం వల్ల వ్యవసాయ రుతువులను గుర్తించగలిగారు.
' చక్రం' ఉపయోగించడం వల్ల సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

* లోహయుగం నాటికి అభివృద్ధి చెందిన మెసపటోమియా, ఇరాన్ ప్రాంతాల వారు ఇతరులపై పెత్తనం చేసేవారు. యుద్ధంలో ఓడిపోయిన వారిని బానిసలుగా చేసుకుని తమ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించేవారు.
నగర శిథిలాల్లో లభించిన అవశేషాలను పరిశీలించడం వల్ల, ఆ కాలంలో నగరపాలక సంస్థలుండేవని తెలుస్తోంది. వర్తకులు, భూస్వాముల సంబంధాలు వేర్వేరుగా ఉండేవి.
మెసపటోమియా పట్టణ దేవాలయాలు పరిపాలన కేంద్రాలుగా 'పటెశి' అని పిలవబడే పూజారుల ఆధిపత్యంలో ఉండేవి. సుమేరియా పట్టణాల్లో ఈ కేంద్రాలను 'జిగ్గురాత్' అని పిలిచేవారు. నగరాన్ని రక్షించడం, ఆర్థిక సంపదను సమాజంలోని వివిధ వర్గాలకు పంచడం లాంటివి అప్పటి ప్రభుత్వ పనుల్లో ముఖ్యమైనవి.

 

మత జీవనం

ఈ యుగంలోనే 'పూజారులు' అనే ప్రత్యేక వర్గం ఏర్పడింది. ముద్రలు, పచ్చబొట్లు మహిమగలవని మానవులు విశ్వసించేవారు. దేవతల చిహ్నాలను ఆయా దేవాలయాల్లో ప్రదర్శించేవారు. ప్రకృతి శక్తులను జయించడానికి మానవుడు చేసిన ప్రయత్నాలన్నీ మత విశ్వాసాల నుంచి గ్రహించినవే.
'దేవుడు' నగర జీవనానికి ప్రధానమైనవాడు. పూజారి ద్వారానే ఆయన ప్రజలకు సన్నిహితుడౌతాడు అని నమ్మేవారు. దేవుడికి ఆహార పానీయాలు సమకూర్చడానికే మానవుడు, సుమేరియన్లు సృష్టించబడ్డారని నమ్మేవారు.
ఈజిప్టు సుమేరియా దేశాల్లో సూర్యుడు ప్రధాన దైవం. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని మానవుడి జనన మరణాలతో పోల్చి చూస్తూ మానవులకు పునర్జన్మ ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసించేవారు.
సమాధుల్లో లభించిన వస్తువుల ఆధారంగా అప్పటి ప్రజలకు మరణానంతరం మరో జీవితం ఉంటుందనే నమ్మకం ఉండేదని స్పష్టమవుతోంది. నగరానికి బయట శ్మశానం ఉండేదని, అనేక పూజా కార్యక్రమాలతో అంత్యక్రియలు నిర్వహించేవారని తెలుస్తోంది.

 

భాషాకళల విశిష్టత

ఈజిప్ట్‌లోని పిరమిడ్ల నిర్మాణాలను పరిశీలిస్తే కళాకారుల పనితనంతో పాటు వారిపై మత విశ్వాసాల ప్రభావం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రాజుల సమాధుల్లో స్త్రీలను, ధనధాన్యాలను, విలాస వస్తువులను పూడ్చిపెట్టేవారు. ఈ వస్తువులు చనిపోయిన రాజుకు ఉపయోగపడతాయని వారి నమ్మకం. కాంస్య యుగంలో ఆవిష్కృతమైన లిపి ప్రభావం వల్ల గణితం, భూగోళ, వైద్యశాస్త్రాల అభివృద్ధికి మార్గం సుగమమైంది.
ప్రాచీన కాలంనాటి ఈజిప్షియన్లు కాలాన్ని సంవత్సరాలు, నెలలు, వారాలుగా విభజించి క్యాలెండర్‌ను రూపొందించారు. రోజుకు 24 గంటల కాలమానాన్ని నిర్ణయించారు. వారు పిరమిడ్ల నిర్మాణంలో కచ్చితమైన కొలతలను పాటించారు. ఈ ప్రయోగాలన్నీ తక్షణ అవసరాలకు మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తాయి.
కాంస్యయుగంలో సాధించిన పరిజ్ఞానం అడవులను పెంచడానికి యుద్ధాల్లో విజయం సాధించడానికి, వ్యాపారం కొనసాగించడానికి ఉపయోగపడింది. వీటిని గమనిస్తే మానవుడు భౌతిక వనరులను, తనకు తన సంతానానికి, సుఖ సంతోషాలను కలిగించడానికి ఉపయోగించేవారు.
ఆ కాలంనాటి శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన పదాలన్నీ మత విశ్వాసాల నుంచే ఏర్పడ్డాయి.
కాంస్యయుగంలో వివిధ ప్రాంతాల్లోని మానవులు సాధించిన సాంకేతిక పరిజ్ఞానంలో సామాన్యమైన లక్షణాలు ఉండటం సమైక్య రాజకీయ వ్యవస్థల ఏర్పాటుకు దోహదంచేసింది.

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం

1. భారతదేశంలో ఏర్పడిన తొలి రాజకీయ సంస్థ ఏది?
జ: బెంగాల్ భూస్వాముల సంఘం

 

2. అకడెమిక్ అసోసియేషన్‌ను స్థాపించింది ఎవరు?
జ: హెన్రీ డిరోజియో

 

3. కింది సంస్థలను, వాటి స్థాపక సంవత్సరాలతో జత చేయండి.

I) బెంగాల్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ A) 1870
II) బొంబాయి అసోసియేషన్ B) 1853
III) మద్రాస్ నేటివ్ అసోసియేషన్ C) 1852
IV) పూనా సార్వజనిక సభ D) 1851

జ: I-D, II-C, III-B, IV-A

 

4. లండన్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

5. 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ ఎవరితో కలిసి ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించారు?
జ: ఆనందమోహన్ బోస్

 

6. 1884లో మద్రాస్ మహాజన సభను స్థాపించింది ఎవరు?
జ: సుబ్రహ్మణ్య అయ్యర్

 

7. ఆధునిక జాతీయతాభావ పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు?
జ: స్వామి వివేకానంద

 

8. 'ఇల్బర్ట్ బిల్లు భారతీయులకు నేర్పిన గుణపాఠాన్ని విద్యావంతులైన భారతీయులెవరూ మర్చిపోరు' అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ: థాంప్సన్ గారట్

 

9. 1883లో కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎవరు?
జ: సురేంద్రనాథ్ బెనర్జీ

 

10. భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించి సరికానిది?
జ: కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాక వర్గాల సంస్థగా విలియం వెడ్డర్‌బర్న్ వ్యాఖ్యానించారు.

 

11. తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హజరైన సభ్యుల సంఖ్య?
జ: 72

 

12. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర పుస్తక రచయిత?
జ: భోగరాజు పట్టాభి సీతారామయ్య

 

13. కింది అంశాలను జతపరచండి.

I) జార్జి యూలె A) మద్రాస్
II) బద్రుద్దీన్ త్యాబ్జి B) అలహాబాద్
III) సరోజినీ నాయుడు C) నాగ్‌పుర్
IV) పి. ఆనందాచార్యులు D) కాన్పూర్

జ: I-B, II-A, III-D, IV-C

 

14. 'ఇండియా' అనే పత్రికను ప్రారంభించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

15. 1924లో గాంధీజీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం ఏది?
జ: బెల్గాం

 

16. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నదెవరు?
జ: జె.బి. కృపలానీ

 

17. మితవాద యుగానికి సంబంధించి కిందివాటిలో సరైన అంశం?
జ: రొట్టె కోసం పోరాడిన మితవాదులు రాళ్లు కూడా సంపాదించ లేకపోయారని తిలక్ విమర్శించారు.

 

18. బ్రిటిష్ పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్రగా వ్యాఖ్యానించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

19. వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికను, భారత తంతి సమాచార సంఘాన్ని స్థాపించింది ఎవరు?
జ: ఎ.ఒ. హ్యూమ్

 

20. భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆ పేరు సూచించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

21. బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడిగా పేరొందిన దాదాభాయ్ నౌరోజీ ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు?
జ: సెంట్రల్ ప్రిన్స్‌బరి

 

22. 'స్వదేశీ' అనే పదాన్ని తొలిసారిగా తీర్మానించింది, ప్రతిపాదించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

23. 1892 భారత కౌన్సిళ్ల చట్టాన్ని 'బిక్షగాడి జీవితం లాంటిది' అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ: ఫిరోజ్ షా మెహతా

 

24. 'ఎ నేషన్ ఇన్ మేకింగ్' అనే గ్రంథ రచయిత ఎవరు?
జ: సురేంద్రనాథ్ బెనర్జీ

 

25. మహారాష్ట్ర సోక్రటీస్‌గా బిరుదు పొందిన వ్యక్తి ఎవరు?
జ: గోపాలకృష్ణ గోఖలే

 

26. రాజద్రోహ నేరంపై అరెస్ట్ అయిన తొలి భారతీయుడు ఎవరు?
జ: తిలక్

 

27. 1905 లో 'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ' అనే సంస్థను స్థాపించింది ఎవరు?
జ: గోపాలకృష్ణ గోఖలే

 

28. గోపాలకృష్ణ గోఖలేను 'భారతదేశపు వజ్రం'గా పేర్కొన్నది ఎవరు?
జ: తిలక్

 

29. 1905లో అతివాదం తలెత్తడానికి కారణం కాని అంతర్జాతీయ సంఘటన ఏది?
జ: 1905లో కర్జన్ బెంగాల్ విభజన చేయడం

 

30. 1858 విక్టోరియా మహారాణి ప్రకటనను భారతదేశంలో మానవ హక్కుల మాగ్నా కార్టాగా పేర్కొన్నది ఎవరు?
జ: సురేంద్రనాథ్ బెనర్జీ

 

31. 'దేశ భక్తుల్లో రాజు'గా పేరొందిన జాతీయ నాయకుడు ఎవరు?
జ: తిలక్

 

32. అమెరికా నుంచి హోంరూల్ ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ఎవరు?
జ: లాలాలజపతిరాయ్

 

33. 1906 లో కలకత్తాలో శివాజీ ఉత్సవాలను రాజకీయ పండుగగా నిర్వహించిన వ్యక్తి ఎవరు?
జ: బాలగంగాధర తిలక్

 

34. వందేమాతరం (ఉర్దూ), పీపుల్ (ఆంగ్లం) పత్రికలను నిర్వహించింది ఎవరు?
జ: లాలాలజపతిరాయ్

 

35. భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి 'పైసా ఫండ్' ఏర్పాటు చేసింది ఎవరు?
జ: బాలగంగాధర తిలక్

 

36. మాజినీ (ఇటలీ)ని తన రాజకీయ గురువుగా పేర్కొన్న అతివాద నాయకుడు ఎవరు?
జ: లాలాలజపతిరాయ్

 

37. 'మనపై పడే ప్రతీ దెబ్బ ఆంగ్లేయులు స్వయంగా నిర్మించుకుంటున్న శవపేటికలోకి దిగుతున్న ఒక్కొక్క మేకు' అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ: పంజాబ్ కేసరి

 

38. సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని 1921లో స్థాపించిన నాయకుడు ఎవరు?
జ: లాలాలజపతిరాయ్

 

39. న్యూ ఇండియా అనే ఆంగ్ల వార పత్రికను స్థాపించింది ఎవరు?
జ: బిపిన్ చంద్రపాల్

 

40. పాండిచ్చేరి యోగిగా పేరొందిన అతివాది ఎవరు?
జ: అరవిందో ఘోష్

 

41. వందేమాతర ఉద్యమ కాలంలో 'అమర్‌సోనార్ బంగ్లా' గీతాన్ని రచించింది ఎవరు?
జ: రవీంద్రనాథ్ ఠాగూర్

 

42. ఇండియన్ నేషనలిజం అనే గ్రంథ రచయిత ఎవరు?
జ: బిపిన్ చంద్రపాల్

 

43. వందేమాతర ఉద్యమ కాలంలో నెలకొల్పిన బెంగాల్ జాతీయ కళాశాల తొలి ప్రిన్సిపాల్ ఎవరు?
జ: అరవిందో ఘోష్

 

44. ఏ రోజును జాతీయ సంతాప దినంగా పాటిస్తారు?
జ: 1905, అక్టోబరు 16

 

45. భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1886

 

46. భారత జాతీయ కాంగ్రెస్ తొలి నామం?
జ: ఇండియన్ నేషనల్ యూనియన్

 

47. 1909 నాటి ఆలీపూర్ బాంబు కేసులో అరెస్టయిన అరవిందో ఘోష్‌ను నిర్దోషిగా నిరూపించింది ఎవరు?
జ: చిత్తరంజన్ దాస్

 

48. ది లైఫ్ డివైన్, సావిత్రి గ్రంథాలను రచించింది ఎవరు?
జ: అరవిందుడు

 

49. ఢిల్లీలో స్వదేశీ/ వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు?
జ: సయ్యద్ హైదర్‌రజా

 

50. 1905, జులై 19న బెంగాల్ విభజన జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది
జ: 1905, అక్టోబరు 16

 

51. 1905లో బెనారస్‌లో జరిగిన మొదటి భారత పరిశ్రమల సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
జ: రమేష్‌చంద్ర దత్

 

52. వందేమాతర ఉద్యమానికి సంబంధించి కిందివాటిలో సరైన అంశం ఏది?
ఎ) ఆంధ్రాలో కాకినాడ బాంబు కేసు సంఘటన జరిగింది.
బి) తమిళనాడులో చిదంబరం పిళ్త్లె స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించారు.
సి) ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ ఉద్యమాన్ని ప్రచారం చేశారు.
డి) పి.సి. రే బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్ స్థాపించారు.
జ: బి, సి, డి సరైనవి
 

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అసఫ్‌జాహీ యుగం - నిజాం పాలన

  క్రీ.శ.1724లో నిజాం ఉల్‌ముల్క్ మొగలుల అధికారాన్ని ధిక్కరించి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి వంశీయులు క్రీ.శ.1948 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ కాలాన్నే అసఫ్‌జాహీయుగం లేదా నిజాంల పాలనగా పేర్కొంటారు.

నిజాం ఉల్‌ముల్క్

  ఇతడు నిజాంల మొదటి పాలకుడిగా పేరు పొందారు. అసలు పేరు మీర్ కమ్రుద్దీన్. మొగలుల కొలువులో పని చేస్తున్న సమయంలో ఔరంగజేబ్ 'చిన్ - ఖిలిజ్ - ఖాన్' అనే బిరుదిచ్చాడు. చిన్ - ఖిలిజ్ - ఖాన్ అంటే కుర్రకత్తి వీరుడు అని అర్థం. అనంతరం మొగల్ చక్రవర్తి ఫరూక్‌షియర్ నిజాం ఉల్‌ముల్క్, ఫతేజంగ్ బిరుదులను ప్రదానం చేశాడు. మరో మొగల్ చక్రవర్తి మహ్మద్‌షా ఇతడికి అసఫ్ జా అనే బిరుదు ఇచ్చాడు. నిజాం ఉల్‌ముల్క్ ముబారిజ్‌ఖాన్ సైన్యాలను 1724 నాటి షక్కర్‌ఖేడ యుద్ధంలో ఓడించి, ఔరంగాబాద్ రాజధానిగా అసఫ్‌జాహీ పాలనను ప్రారంభించాడు. తన రాజ్యాన్ని ఆరు సుబాలు (బీరర్, బీదర్, బీజాపూర్, ఖాందేష్, హైదరాబాద్, ఔరంగాబాద్)గా విభజించాడు. షాకిర్ (సంతృప్తుడు) అనే కలం పేరుతో కవితలు రాసేవాడు. 1748, మే 22న బర్దాన్‌పూర్ వద్ద మరణించాడు.

 

నాజర్‌జంగ్

  నిజాం ఉల్‌ముల్క్ మరణానంతరం అతడి కుమారుడు నాజర్‌జంగ్ పాలనాధికారాలు చేపట్టాడు. కానీ నిజాం ఉల్‌ముల్క్ కుమార్తె పుత్రుడు (మనవడు) ముజఫర్‌జంగ్ వారసత్వ పోరులో కర్నూలు నవాబు హిమ్మత్‌ఖాన్‌తో నాజర్‌జంగ్‌ను హత్య చేయించాడు. ఈ పోరులో ఫ్రెంచి వారు ముజఫర్‌జంగ్‌కు సహాయపడగా, ఆంగ్లేయులు నాజర్‌జంగ్ పక్షం వహించారు.

 

ముజఫర్‌జంగ్

ఫ్రెంచివారి సాయంతో పాలకుడైన ముజఫర్‌జంగ్ వారికి మచిలీపట్నం, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో అధికారం కల్పించాడు. తన ఆస్థానంలో ఉండే ఫ్రెంచి అధికారికి హైదర్‌జంగ్ అనే బిరుదు ఇచ్చాడు. డూప్లేను తన ఏడు వేల అశ్వికదళానికి మున్సబ్‌దారుగా నియమించాడు. కానీ కడప, కర్నూలు నవాబు హిమ్మత్‌ఖాన్ చేతిలో కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె వద్ద హత్యకు గురయ్యాడు.

 

సలాబత్‌జంగ్
 

ముజఫర్‌జంగ్ హత్యకు గురవడంతో ఫ్రెంచివారు సలాబత్‌జంగ్‌ను హైదరాబాద్ నిజాంగా నియమించారు. అందుకే సలాబత్ ఫ్రెంచివారికి ఉత్తర సర్కారులను బహుమతిగా ఇచ్చాడు. బుస్సీ నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం సలాబత్‌జంగ్‌కు రక్షణ కల్పించింది. ఇందుకు కొండవీడు, నిజాంపట్నం, నరసాపురం ప్రాంతాలను ఫ్రెంచివారికిచ్చి రూ.24 లక్షలు సైనిక ఖర్చుగా చెల్లించాడు. ఖజానాను గోల్కొండ నుంచి ఔరంగాబాద్‌కు మార్చాడు. మూడో కర్ణాటక యుద్ధ సమయంలో ఫ్రెంచివారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోవడంతో ఇతడు ఆంగ్లేయుల వైపు చేరి వారికి ఉత్తర సర్కారులను అప్పగించాడు. తన సోదరుడైన నిజాం అలీఖాన్‌ను ఖైదు నుంచి విడుదల చేసి, బీదర్ సుబేదారుగా నియమించాడు. కానీ 1761లో నిజాం అలీఖాన్ సలాబత్‌జంగ్‌ను తొలగించి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. దీంతో రెండో నిజాం పాలకుడిగా గుర్తింపు పొందిన నిజాం అలీఖాన్ పాలన ప్రారంభమైంది. (వారసత్వ యుద్ధాల్లో మునిగి తేలిన నాజర్, ముజఫర్, సలాబత్‌జంగ్‌లను మొగల్ చక్రవర్తులు నిజాం పాలకులుగా గుర్తించలేదు.)

 

నిజాం అలీఖాన్
 

నిజాం అలీఖాన్ (రెండో అసఫ్‌జా/ రెండో నిజాం) ఉత్తర సర్కారులపై ఆంగ్లేయుల అధికారాన్ని అంగీకరించలేదు. అయితే ఆంగ్లేయులు దుబాసీ కాండ్రేగుల జోగిపంతులును రాయబారిగా పంపి, 1766 నాటికి ఉత్తర సర్కారులను స్వాధీనం చేసుకున్నారు. మూడో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించి కడప, బళ్లారి, గుత్తి ప్రాంతాలను పొందాడు. కానీ మహారాష్ట్రుల చేతిలో ఓడిపోయి (1767 ఖర్ధా యుద్ధంలో) దౌలతాబాద్ దుర్గాన్ని కోల్పోయాడు. వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి భారతీయ పాలకుడు నిజాం అలీఖాన్ (1798). 1800లో కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురం ప్రాంతాలను ఆంగ్లేయులకు దత్తత ఇచ్చాడు. అందుకే వాటిని దత్త మండలాలుగా పేర్కొంటారు. నిజాం తన రాజాధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. 1788లో గుంటూరు సర్కారును ఆంగ్లేయులకుఇచ్చాడు. కిర్క్‌పాట్రిక్‌ను తన రాజధానిలో బ్రిటిష్ రెసిడెంట్‌గా నియమించాడు.
 రేమండ్ అనే ఫ్రెంచి నిపుణుడి సహాయంతో హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ వద్ద ఆయుధాగారాన్ని నెలకొల్పాడు. నేటి మూసారాంబాగ్‌లో రేమండ్ సమాధి ఉంది. కిర్క్‌పాట్రిక్, ఖైరున్నీసాబేగంల ప్రేమకు చిహ్నంగా నిర్మించిన కట్టడంలోనే ప్రస్తుతం కోఠిలోని మహిళా కళాశాలను నిర్వహిస్తున్నారు.

 

సికిందర్ ఝా

  మూడో నిజాం/అసఫ్ జాగా పేరొందిన పాలకుడు. ఇతడి పాలనా కాలంలోనే రెండో ఆంగ్ల - మరాఠా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నిజాం సైన్యాన్ని బీరర్ గవర్నర్ రాజా మహీపతిరామ్ నడిపాడు. ఆంగ్లేయులు మహీపతి రామ్ స్థానంలో దివాన్ చందూలాల్‌ను పేష్కార్‌గా నియమించారు. సికిందర్ ఝా ప్రధాని మీర్ ఆలం కూడా ఆంగ్ల వ్యతిరేకి. 1811లో రెసిడెంట్‌గా వచ్చిన హెన్రీ రస్సెల్ నాయకత్వంలో దళాన్ని ఏర్పాటు చేశాడు. దీన్నే రస్సెల్ బ్రిగేడ్ లేదా హైదరాబాద్ కంటింజెంట్‌గా పేర్కొన్నారు. విలియం పామర్ అనే వ్యక్తి పామర్ అండ్ కో కంపెనీని స్థాపించాడు. నిజాం ప్రభుత్వం పామర్ కంపెనీ నుంచి 25 శాతానికి అప్పు తీసుకుంది. సికిందర్ ఝా పేరు మీదే నేటి సికింద్రాబాద్‌ను నిర్మించారు. ఇతడి కాలంలోనే మెట్‌కాఫ్ సంస్కరణలను ప్రవేశపెట్టారు.

 

నాసిర్ - ఉద్ - దౌలా

 

  ఇతడు నాలుగో నిజాం/ అసఫ్‌జా గా పేరొందాడు. ఇతడి కాలంలోనే ఆంగ్లేయులు అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందారు. 1829లో నాటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్‌కు వారి సంఖ్యను తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. తన రాజ్యాన్ని 16 జిల్లాలుగా విభజించాడు. హైదరాబాద్ రాజ్యంలో సతీసహగమనాన్ని రద్దు చేశాడు. ఇతడి కాలంలోనే వహాబీ ఉద్యమం జరిగింది. సయ్యద్ అహ్మద్ బ్రైల్వీ సిక్కులకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఈ ఉద్యమం నిజాం కాలంలో ఆంగ్ల వ్యతిరేక ఉద్యమంగా మారింది. నిజాం సోదరుడు ముబారిజ్ - ఉద్ - దౌలా నాయకత్వంలో హైదరాబాద్ రాజ్యంలో ఉద్యమం జరిగింది. కర్నూలు నవాబు గులాం రసూల్‌ఖాన్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1843లో దివాన్ చందూలాల్ రాజీనామా చేయడంతో సిరాజ్ ఉల్‌ముల్క్‌ను ప్రధానిగా నియమించాడు. 1853లో మొదటి సాలార్‌జంగ్‌ను ప్రధానిగా నియమించాడు. నాసిరుద్దౌలా కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది (కానీ తిరుగుబాటును ఎదుర్కొన్నది మాత్రం అఫ్జల్ - ఉద్ - దౌలా). హైదరాబాద్ కంటింజెంట్ ఖర్చుల నిమిత్తం రూ.64 లక్షలు అప్పు చేయడంతో, నిజాం తన రాజ్యంలోని రాయచూర్, ఉస్మాన్‌బాద్, బీరర్ ప్రాంతాలను ఆంగ్లేయులకు స్వాధీనం చేయాల్సి వచ్చింది.

 

అఫ్జల్ - ఉద్ - దౌలా

  1857, మే 18న అయిదో నిజాంగా పాలన చేపట్టాడు. ఇతడి కాలంలోనే 1857, జులై 17న హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. (భారతదేశంలో తిరుగుబాటు ప్రారంభం మే 10, నాటి నిజాం నాసిరుద్దౌలా). మొగల్ చక్రవర్తి పేరు మీద కాకుండా నిజాం పేరు మీద కుత్బా చదవడం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఆంగ్ల రెసిడెన్సీపై తుర్రేబాజ్‌ఖాన్ దాడి చేశాడు. తిరుగుబాటును అణచడంలో ఆంగ్లేయులకు తోడ్పడినందుకు నాటి బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ డేవిడ్‌సన్, సైన్యాధికారి మేజర్ బ్రిగ్స్ నిజాంకు 'స్టార్ ఆఫ్ ఇండియా' బిరుదుతో పాటు రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను తిరిగిచ్చారు. అతడు చెల్లించాల్సిన రూ.50 లక్షల రుణాన్ని రద్దు చేశారు. నిజాం రాజ్య ప్రధానమంత్రి నవాబ్ తురాబ్ అలీఖాన్‌కు 'సాలార్‌జంగ్' అనే బిరుదు ఇచ్చారు. ప్రధాని సాలార్‌జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. 1865లో జిలాబందీ రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు. హాలిసిక్కా అనే నూతన వెండి నాణేన్ని ప్రవేశపెట్టాడు. హైదరాబాద్ - వాడి రైలు మార్గాన్ని నిర్మించాడు.

 

మీర్ మహబూబ్ అలీఖాన్
 

అఫ్జల్ - ఉద్ - దౌలా మరణించే నాటికి ఇతడు రెండున్నర సంవత్సరాల బాలుడు. మీర్జా గాలీబ్ మనవడైన మీర్జా ఆషాబేగ్‌ను ఇతడికి సంరక్షకుడిగా నియమించారు. 1884 నాటికి పూర్తి అధికారాలను స్వీకరించాడు. ఖానున్‌చా - ఇ - ముబారక్ పేరుతో క్యాబినెట్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. చట్టాల నిర్మాణం కోసం 1893లో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. బీరర్‌పై నిజాం సార్వభౌమాధికారాన్ని గుర్తించాడు. హైదరాబాద్ కంటింజెంట్‌ను రద్దు చేసి, బ్రిటిష్ సైన్యంలో విలీనం చేశాడు. 1905లో రాజ్యాన్ని నాలుగు సుబాలుగా విభజించాడు. అవి: వరంగల్, మెదక్, గుల్బర్గా, ఔరంగాబాద్. ఇతడి కాలంలోనే కిషన్‌రావు అనే న్యాయవాది ముల్కీ నిబంధనలను రూపొందించాడు. చాందా రైల్వే పథకం ఆందోళన ఇతడి కాలంలోనే జరిగింది. నిజాం కళాశాల తొలి ప్రిన్సిపల్‌గా అఘోరనాథ చటోపాధ్యాయను నియమించాడు. మీర్ మహబూబ్ అలీఖాన్‌ను ఆంగ్లేయులు నియమించిన తొలి నిజాం నవాబుగా పేర్కొంటారు. మొదటి సాలార్‌జంగ్ మరణంతో మీర్ లాయక్ అలీని (రెండో సాలార్‌జంగ్) ప్రధానిగా నియమించాడు. ఇతడు 1887లో నిజాం కళాశాలను స్థాపించాడు. మూడో సాలార్‌జంగ్‌గా పేరొందిన మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్‌జంగ్ మ్యూజియానికి విదేశాల నుంచి అనేక వస్తువులు తెప్పించాడు.
 1884లో లార్డ్ రిప్పన్ హైదరాబాద్ వచ్చి నిజాంకు సర్వాధికారాలు అప్పగించాడు. అదే సంవత్సరం నిజాం ఉర్దూను రాజభాషగా ప్రవేశపెట్టాడు. మంత్రివర్గం, ద్విసభా విధానం ఏర్పాటు చేశాడు.
 మీర్ మహబూబ్ అలీఖాన్‌కు ఆంగ్లేయులు 'గ్రాండ్ కమాండర్' బిరుదును ప్రదానం చేశారు. ఇతడు 1909లో మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో మూసీ నదిపై వంతెన నిర్మించాడు. ఇతడి కాలంలోనే యంగ్‌మెన్ ఇంప్రూవ్‌మెంట్ అసోసియేషన్‌ను స్థాపించారు. 1882లో థియోసాఫికల్ సొసైటీశాఖ, 1892లో ఆర్యసమాజ శాఖ హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి.

 

మీర్ ఉస్మాన్ అలీఖాన్
 

చివరి, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఇతడి కాలంలో హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. ఉస్మాన్‌సాగర్, నిజాంసాగర్ చెరువులను తవ్వించాడు. న్యాయశాఖను ఇతర శాఖల నుంచి వేరు చేశాడు. 1919లో సర్ అలీ ఇమామ్‌ను ప్రధానిగా నియమించాడు. 1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
 సిర్పూర్ పేపరు మిల్లు, అజంజాహీ దుస్తుల మిల్లు, బోధన్ చక్కెర కర్మాగారం, చార్మినార్ సిగరెట్ కంపెనీ, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీలను స్థాపించాడు. 1932లో అరవముదు అయ్యంగార్ నాయకత్వంలో రాజకీయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశాడు. రజాకార్ల వ్యవస్థను ప్రోత్సహించాడు. తొలిసారి ఆదాయ, వ్యయ పద్దులను పునర్విభజించాడు. 1938లో 85 మంది సభ్యులతో ఒక శాఖను ఏర్పాటు చేసి, అందులో హరిజనులకు కూడా స్థానం కల్పించాడు.
 భద్రాచలం, తిరుపతి దేవాలయాలకు విరాళాలు అందించేవాడు. నాందేడ్‌లో గురుద్వారాను నిర్మించాడు.
 ఆంగ్లేయులకు విశ్వసనీయుడైన మిత్రుడిగా (ఫెయిత్‌ఫుల్ అలై) గుర్తింపు పొందాడు. 1918లో కింగ్‌జార్జ్ నిజాంను 'హిజ్ ఎగ్జాల్టెడ్ హైనస్‌'గా కీర్తించాడు.
 స్టాన్లీ బాలికల ఉన్నత పాఠశాల, జనానా పాఠశాల, శాలిబండ మిడిల్ స్కూల్, హన్మకొండ ప్రభుత్వ మిడిల్ స్కూలు లాంటి విద్యాలయాలను ప్రారంభించాడు. రైల్వేలు, రోడ్డు రవాణా సంస్థలను ఏర్పాటు చేశాడు.
 భారత ప్రభుత్వం 1948లో సెప్టెంబరు 13 17 మధ్య 'ఆపరేషన్ పోలో' పేరుతో సైనిక చర్య జరిపి, హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసింది. 1950, జనవరి 2న హైదరాబాద్ భారత యూనియన్‌లో చేరినట్లు ప్రకటించి, నిజాంను రాజ్‌ప్రముఖ్‌గా నియమించారు.

 

యుగ విశేషాలు

* మొదటి సాలార్‌జంగ్ ప్రధానిగా హైదరాబాద్ రాజ్య అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టాడు.
* 1853 నుంచి 1883 వరకు ముగ్గురు నిజాంల వద్ద ప్రధానిగా మొదటి సాలార్‌జంగ్ పని చేశాడు.
* ఇతడు రాజ్యాన్ని 5 సుబాలు, 17 జిల్లాలుగా విభజించారు.
* సుబా అధిపతిని సుబేదార్, తాలుకా అధిపతిని తహసీల్దార్, జిల్లా అధిపతిని తాలూక్‌దార్ అనేవారు.
* 1864లో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు.
* సదర్ - ఉల్ - మహమ్ పేరుతో పోలీసు, రెవెన్యూ, న్యాయ, విద్య, ఆరోగ్య శాఖలు ఏర్పాటు చేశారు.
* భూమి శిస్తును జమ అని, కౌలును ఇజారా అని పిలిచేవారు.
* అవల్ తాలూక్‌దార్ నేటి జిల్లా కలెక్టర్‌తో సమాన అధికారి. దోయం తాలూక్‌దార్‌ను సబ్‌కలెక్టర్ హోదాతో, సోయం తాలూక్‌దార్‌ను తహసీల్దార్ హోదాతో సమానంగా భావించేవారు.
* పోలీసు సూపరింటెండెంట్‌ను ముహతామీన్ అని, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను అమీన్ అని పిలిచేవారు.
* వసూలు చేసిన శిస్తులో జమీందార్ల వాటాను రుసుం అనేవారు.
* శిస్తు వసూలు అధికారులను బిల్ మక్తదారులు అనేవారు.
* చివరి నిజాం పాలనా కాలంలో కింది పట్టణాల పేర్లను మార్చారు.
* ఎలగండల - కరీంనగర్, మహబూబ్‌నగర్ - పాలమూరు, ఇందూరు - నిజామాబాద్, మానుకోట - మహబూబబాద్, భోన్‌గిరి - భువనగిరి
* హైదరాబాద్ పాఠశాలల్లో డబ్ల్యూ.హెచ్. విల్కిన్‌సన్ అనే విద్యాశాఖ కార్యదర్శి నూతన బోధనా పద్ధతులను ప్రవేశపెట్టాడు.
* 1871లో హైదరాబాద్‌లో తపాలా శాఖను ఏర్పాటు చేశారు.
* 1856లో డాక్టర్ స్మిత్ హైదరాబాద్‌లో వస్తు ప్రదర్శన (పారిశ్రామిక) ఏర్పాటు చేశాడు.
* బ్రిటిష్ రెసిడెంటైన జేమ్స్ పాట్రిక్ ఖైరున్నీసా బేగం అనే ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడు.
* భద్రాచలం రాముడికి తలంబ్రాలు పంపే ఆచారాన్ని నాసిరుద్దౌలా ప్రవేశ పెట్టాడు.
* రాజ్య కేంద్ర ద్రవ్య ముద్రణాలయం హైదరాబాద్‌లో, జిల్లా ద్రవ్య ముద్రణాలయాలు గద్వాల్, నారాయణపేట్‌ల్లో ఏర్పాటు చేశారు.
* కె.ఎం. మున్షీ హైదరాబాద్‌లోని దక్కన్ హౌస్‌లో ఉంటూ 'ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా' అనే గ్రంథాన్ని రచించారు.
* 1918లో ఏర్పడిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1919, ఆగస్టు 28 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బౌద్ధ మతం

* బుద్ధుడి తొలి జీవితం గురించి బౌద్ధ జాతక కథలు వివరిస్తాయి.
* బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు పాళీ భాషలో ఉన్నాయి.
* భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ మతంగా అభివృద్ధి చెందింది.
* వినయ పీటకం బౌద్ధ సంఘ నియమ నిబంధనలను, సుత్త పీటకం బుద్ధుడి బోధనలను, అభిదమ్మ పీటకం బౌద్ధ దమ్మ వేదాంతాన్ని వివరిస్తాయి.
* బౌద్ధ మతానికి చెందిన ముఖ్య నిర్మాణాలు
    1. స్తూపం
    2. చైత్యం
    3. విహారం
* బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.
* బౌద్ధ మతస్తుల పూజా గృహాన్ని చైత్యం అంటారు. ఇది మహాయానులకు చెందింది.
* బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు.
* స్తూప, చైత్య, విహారాలు ఒకే చోట ఉంటే దాన్ని బౌద్ధ ఆరామంగా పేర్కొన్నారు.
* బౌద్ధ ఆరామాలు నాడు ప్రసిద్ధ విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
* భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా నాగార్జున కొండ విశ్వవిద్యాలయం పేరొందింది.
* భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల, ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం నలంద.
* విహార దేశంగా పేరొందిన రాష్ట్రం బిహార్
* గాంధార, అమరావతి శిల్ప కళలు బౌద్ధ మత ప్రేరణతో అభివృద్ధి చెందాయి.
* సాంచీ స్తూపం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ దగ్గర ఉంది.
* సారనాథ్ స్తూపం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
* పిప్రావహని భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం అని పేర్కొంటారు.
* ఆంధ్రదేశం / దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపంగా భట్టిప్రోలు పేరుగాంచింది.
* బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం వల్ల బౌద్ధ మతాన్ని మధ్యేమార్గంగా పేర్కొంటారు.
* బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాన్ని ప్రతీయ - సముత్పాద సిద్ధాంతం అంటారు.
* బుద్ధుడి జననం, జ్ఞానోదయం కలగడం, మహాపరినిర్యాణం పౌర్ణమి రోజునే జరిగాయి.
* బుద్ధుడి మరణం తర్వాత బౌద్ధ మత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)
* మొదటి బౌద్ధ సంగీతి - రాజగృహం - అజాతశత్రువు కాలం - మహాకాశ్యపుడు అధ్యక్షుడు.
* రెండో బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగింది. సబకామి దానికి అధ్యక్షుడు.
* మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. మొగ్గలిపుతతిస్స అధ్యక్షుడు.
* నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కశ్మీర్/ కుందనవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు.
* మాధ్యమిక సాంప్రదాయ వాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రబోధించారు.
* మైత్రేయనాథుడు యోగాచారవాదాన్ని ప్రారంభించాడు.
* మాధ్యమికవాదాన్నే శూన్యవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదాన్ని విజ్ఞానవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదం హీనయానానికి చెందిన వాస్తవిక వాదాన్ని పూర్తిగా తిరస్కరించి, పరమ ఆదర్శవాదాన్ని అంగీకరిస్తుంది.
* ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమితిక శాస్త్ర మహాయానుల పవిత్ర గ్రంథంగా పేరుగాంచింది.
* అసంగుడు, వసుబంధు లాంటి రచయితలు కూడా మహాయాన సంప్రదాయాన్ని అనుసరించారు.
* సూత్రాలంకార గ్రంథాన్ని రాసింది అసంగుడు.
* మహాయానులు సంస్కృత భాషలో ఉన్న సొంత త్రిపీటకాలను అభివృద్ధి చేసుకున్నారు.
* మహాయానులు వైపుల్య సూత్రాలను బుద్ధుడి ప్రకటనలుగా భావించి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* సధర్మపుండరీకం, లలిత విస్తార, వజ్రచేధిక, సుఖవతి లాంటి గ్రంథాలను పవిత్రంగా భావించి, అనుసరించారు.
* బౌద్ధ మతంలో వజ్రయానం అనే మరొక శాఖ తర్వాత కాలంలో ఏర్పడింది.
* ఇంద్రజాలిక శక్తులు పొందడం ద్వారా మోక్షం సాధించడం ఈ వాదం వారి ఆశయం.
* వజ్రయాన శాఖవారు బౌద్ధులు, బోధిసత్వుల భార్యలైన తారలను ప్రధాన దైవాలుగా భావించి పూజించారు.
* వీరు తాంత్రిక పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు (తంత్ర నిర్వహణ ద్వారా మంత్రం వల్లెవేయడం)
* పాల వంశీయులు, సేన వంశీయుల కాలంలో తూర్పు భారతదేశంలో వజ్రయాన శాఖ బాగా విస్తరించింది.
* సరాహుడు రచించిన దోహకోశ వజ్రయానానికి చెందిన ప్రసిద్ధ గ్రంథం.
* కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని ఆచరించాడు.
* గాంధార శిల్పకళ కనిష్కుడి కాలంలో మహాయాన బౌద్ధ మతం ప్రేరణతో అభివృద్ధి చెందింది.
* భాగవతుడు అంటే ఆరాధనీయమైన వారిని ఆరాధించేవ్యక్తి అని అర్థం. చాందోగ్యోపనిషత్తు కృష్ణ వాసుదేవుడిని దేవకీ పుత్రుడిగా పేర్కొంది.
* పాణిని రచన అష్టాధ్యాయిలోను, మెగస్తనీస్ ఇండికా (హెరాక్లెస్) లోను, బెస్‌నగర్ స్తంభ శాసనంలో భాగవత మత ఆరాధన గురించిన ప్రాస్తావన ఉంది.
* బెస్ నగర స్తంభ శాసనాన్ని కాశీపురానికి చెందిన శుంగరాజు భాగభద్రుడు వేయించాడు.
* బెస్ నగర స్తంభ శాసనం గ్రీకు రాయబారి హీలియో డోరస్‌ను భాగవతుడిగా పేర్కొంది.
* గుప్తుల కాలంలో భాగవత మతం అభివృద్ధి చెందింది.
* నాగులు, యక్షులు, గ్రామదేవతల ఆరాధన నుంచి బ్రాహ్మణవాదం అభివృద్ధి చెందింది.
* పంచాయతన పూజా విధానంలో గణేశుడికి అగ్రస్థానం ఇచ్చారు.
* గుప్తయుగానంతరం భాగవత మతాన్ని వైష్ణవ మతంగా పేర్కొన్నారు. అవతార సిద్ధాంతానికి అధిక ప్రాధాన్యం లభించింది.
* భాగవత మతం భగవద్గీత మీద ఆధారపడింది. వైష్ణవానికి క్రమంగా భాగవత పురాణం, విష్ణు పురాణాలు ప్రధాన గ్రంథాలుగా మారాయి.
* క్రీ.శ. 100వ సంవత్సరంలో 'శాండిల్యుడు' పంచరాత్రాలను ప్రబోధించారు. ఇందులో వాసుదేవ కృష్ణుడి కుటుంబం మొత్తాన్ని తాదాత్మ్యీకరించారు.
* కృష్ణుడి సోదరుడు సంకర్షణ, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు, కృష్ణుడి మనువడు అనిరుద్ధుడు.
* విఖాననుడు ప్రబోధించిన వైఖానన సంప్రదాయాన్ని అత్రి, మరీచి, భృగు, కశ్యపుడు అనే మహార్షులు ప్రచారం చేశారు.
* వైఖానన సంస్కార సిద్ధాంతం విష్ణువుకు చెందిన అయిదు రూపాల భావనపై ఆధారపడి ఉంది.
* బ్రహ్మ, పురుషుడు, సత్యం, అచ్యుతం, అనిరుద్ధుడు అనేవి విష్ణువు అయిదు రూపాల భావనలు.
*  తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం, కంచి దేవాలయాలలో సంస్కృత భాషలో పూజలు నిర్వహిస్తున్న పూజారులు వైఖాననశాఖకు చెందినవారే.
* దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తులను ఆళ్వారులు అంటారు. వీరు మొత్తం పన్నెండుమంది.
* నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ వారిలో ముఖ్యమైనవారు.
* ఆళ్వార్‌లలో ఉన్న ఏకైక మహిళ ఆండాళ్.
* ఆండాళ్ అనే తమిళ కవయిత్రి గురించి శ్రీకృష్ణ దేవరాయలు తన 'ఆముక్తమాల్యద' గ్రంథంలో ప్రస్తావించారు.
* ఆళ్వార్లు రాసిన పద్యాలు, పాటలను పాశురాలు లేదా 'ప్రబంధాలు' అంటారు.
* 'తండ్రివి నీవే ఓ పరమాత్మా! అగ్ని, నీరు, ఆకాశం నీ సృష్టేనయ్యా!' అనే పాటను నమ్మాళ్వార్ రాసి పాడారు.
*  'నాకేల ఇవ్వవు నీ దర్శన భాగ్యము? దాగుడు మూతలు ఏల' అని నమ్మాళ్వార్ భగవంతుడిని ప్రశ్నిస్తూ పద్యాలు రాశారు.
* శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు, త్రిమతాచార్యులు/ వైష్ణవాచార్యులుగా పేరొందారు.
* శంకరాచార్యులు 'అద్వైత' మత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. (కేరళలో జన్మించారు, 8వ శతాబ్దం.)
* 'జీవాత్మ, పరమాత్మ ఒకటే. మోక్షసాధనకు జ్ఞానమార్గం అనుసరించడం ఒక్కటే మార్గం' అని శంకరాచార్యులు ప్రబోధించారు.
* రామానుజాచార్యులు క్రీ.శ. 11వ శతాబ్దంలో విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు.
* ' విష్ణువు మీద గాఢమైన భక్తి కలిగి ఉండటమే ముక్తికి ఉన్న ఏకైక మార్గం' అని రామానుజాచార్యులు పేర్కొన్నారు.
* రామానుజాచార్యులపై ఆళ్వార్లు అధిక ప్రభావాన్ని చూపారు.
* భారతదేశంలో భక్తి ఉద్యమ ప్రారంభికుడిగా, నిమ్నకులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించిన తొలి వ్యక్తిగా రామానుజాచార్యులు పేరొందారు.
* రామానుజులు ప్రచారం చేసిన విశిష్టాద్వైతాన్ని 'శ్రీవైష్ణవం' అని పేర్కొంటారు. మధ్వాచార్యులు ద్వైత మతాన్ని, వల్లభాచార్యుడు శుద్ధా ద్వైతాన్ని, నింబార్కుడు ద్వైతాద్వైతాన్ని ప్రచారం చేశారు.
* బౌద్ధమతంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి.
* బౌద్ధమతంలో చేరిన వేశ్యగా ఆమ్రపాలిని పేర్కొంటారు.
* బుద్ధుడు అంగుళీమాలుడు అనే బందిపోటు దొంగను బౌద్ధమతంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (మంగలి) అనే వారిని బౌద్ధ సంఘంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడి తొలి శిష్యుడిగా ఆనందుడిని పేర్కొంటారు.
* బుద్ధుడి ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి.

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఐరోపావారి రాక

 

  చరిత్ర చదువుతున్న కొద్దీ ఆసక్తికరంగా ఉంటుంది. చారిత్రక పరిణామాలన్నీ ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేయడం ద్వారా సులువుగా అర్థం చేసుకోవడంతోపాటు, పరీక్షల్లో మంచి స్కోరింగ్ కూడా సాధించవచ్చు. ఆధునిక భారత దేశ చరిత్రలో అత్యంత ప్రధాన ఘట్టాల్లో ఐరోపావారి రాక ఒకటి. పోర్చుగీసువారు, డచ్చివారు, ఆంగ్లేయులు, ఫ్రెంచివారు... ఈ నలుగురి రాకతో భారతదేశంలో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

  తురుష్కులు క్రీ.శ. 1453లో కాన్‌స్టాంటినోపుల్‌ను ఆక్రమించడంతో పాశ్చాత్యులు తూర్పు దేశాలకు సముద్ర మార్గాన్ని అన్వేషించాల్సి వచ్చింది. పోర్చుగల్‌కు చెందిన ప్రిన్స్ హెన్రీ నూతన సముద్ర మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. అదే దేశానికి చెందిన బార్తులో మ్యుడియాజ్ 1487లో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించి ఆఫ్రికాలోని గుడ్‌హోప్ ఆగ్రం చేరుకున్నాడు.

  వాస్కోడిగామా 1498, మే 21న మలబార్ తీరంలోని కాలికట్ నగరాన్ని చేరుకున్నాడు. ఈ సంఘటన భారతదేశంలో ఐరోపావారికి వర్తక కార్యకలాపాలు విస్తరించడానికి మాత్రమే కాకుండా ఇంగ్లండ్ అధిపత్యానికి కూడా దారితీసింది.

  కాలికట్‌కు చెందిన హిందూ రాజు జమోరిన్ వాస్కోడిగామాను సాదరంగా ఆహ్వానించాడు. కాలికట్ ఆ రోజుల్లో సుసంపన్న రాజ్యంగా ఉండేది. జమోరిన్ అన్ని తరగతుల వర్తకుల పట్ల దయ కలిగి ఉండేవాడు. అందరిపట్ల సహనం చూపిస్తూ వ్యాపార విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. మలబార్ తీరంలోని ఓడరేవులు అన్నింటిలో కొచ్చిన్ ఉత్తమమైంది. ఈ ఓడరేవు మిరియాలను ఉత్పత్తి చేసే జిల్లాలతో అనుసంధానమై ఉండేది. కాలికట్ పాలకుడు జమోరిన్‌కు సామంతుడిగా ఉండేవాడు. వాస్కోడిగామా తూర్పు ఆఫ్రికాకు చెందిన అరబ్బు వర్తకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. వాస్కోడిగామా 1499లో పోర్చుగల్‌కు తిరిగి వెళ్లాడు. వాస్కోడిగామా తర్వాత క్రీ.శ.1500లో అల్యరెజ్ కాబ్రల్ భారతదేశానికి వచ్చాడు. ఇతడు అరబ్బులకు చెందిన నౌకను స్వాధీనం చేసుకుని జమోరిన్‌కు బహుమతిగా ఇచ్చాడు.

  కాబ్రల్ కాలంలో అరబ్బులు పోర్చుగీసు వర్తక స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఇతడికి కన్ననూరు, కొచ్చిన్ పాలకుల మద్దతు లభించింది. 1502లో వాస్కోడిగామా రెండోసారి భారతదేశానికి వచ్చాడు. వాస్కోడిగామా ముస్లింలందరినీ కాలికట్ నుంచి తరిమేయాలని జమోరిన్‌ను డిమాండు చేశాడు. కొచ్చిన్ పోర్చుగీసు వారి మొదటి రాజధాని.

  1505లో ఫ్రాన్సిస్కో డి అల్మైడాను భారతదేశంలో మొదటి పోర్చుగీసు గవర్నరుగా నియమించారు. పోర్చుగీసు వారు దక్షిణభారత దేశంలోని ఓడరేవులపై తమ ఆధిపత్యాన్ని ఉత్తర భారతదేశ ఓడరేవులపైకి విస్తరిస్తారని బీజాపూర్, గోల్కొండ సుల్తానులు భయపడ్డారు. దీంతో ఈజిప్టు, టర్కీ, గుజరాత్ పోర్చుగీసువారికి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అల్మైడా 1508లో జరిగిన చౌల్ యుద్ధంలో ఈజిప్టు, టర్కీ, గుజరాత్ పాలకుల కూటమి చేతిలో ఓడిపోయాడు. ఈ యుద్ధంలో అల్మైడా కుమారుడు కూడా మరణించాడు. అల్మైడా 1509 లో ఈ కూటమిని డయ్యూ యుద్ధంలో ఓడించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు.

  1509లో అల్బూకర్క్‌ను గవర్నర్‌గా నియమించారు. పర్షియన్ సింధుశాఖ ఎర్రసముద్రంపై నియంత్రణ కలిగి ఉండటం, పోర్చుగీసు వారి ప్రధాన స్థావరాన్ని పశ్చిమ తీరం మధ్య భాగంలో ఏర్పాటు చేయడం, మలయ ద్వీపకల్పంలో అరబ్బుల వర్తకాన్ని ధ్వంసం చేయడం అల్బూకర్క్ తన లక్ష్యంగా చేసుకున్నాడు. అల్బూకర్క్ బీజపూర్ సుల్తాన్ అదిల్ షా నుంచి 1510లో గోవాను ఆక్రమించాడు. గోవా మలబార్ తీరంలోని ఓడరేవులకు, గుజరాత్‌కు మధ్యలో ఉంది. కాంబే సింధుశాఖ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఓడరేవుల్లో గోవా ప్రముఖ ఓడరేవుగా ఉంది. అల్బూకర్క్ అల్మైడా లక్ష్యాలను సాధించడంలో కృతకృత్యుడయ్యాడు. ఇతడు భారతదేశంలో స్థిరపడిన పోర్చుగీసువారు భారతీయ స్త్రీలను వివాహమాడేలా ప్రోత్సహించాడు. తన కాలంలో విజయనగర రాజులతో స్నేహ సంబంధాలు కొనసాగించాడు.

  1529లో గవర్నర్‌గా నియమితుడైన నునోడ కన్హాగుజరాత్ సుల్తాన్ బహదూర్‌షా నుంచి డయ్యూను ఆక్రమించాడు. ఇతడి కాలంలో చెన్నై దగ్గర శాన్‌థోమ్, బెంగాల్‌లోని హుగ్లీ వద్ద వర్తక స్థావరాలను ఏర్పాటుచేశారు.

 భారతదేశంలో చివరి గొప్ప పోర్చుగీసు గవర్నరు డికాస్ట్రో. ఇతడి కాలంలో పోర్చుగీసువారి రాజధాని కొచ్చిన్ నుంచి గోవాకు మారింది. ప్రసిద్ధి చెందిన క్రైస్తవమత ప్రచారకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ 1542లో గోవాకు వచ్చాడు.

పోర్చుగీసు వారి పతనం: క్రీ.శ.16వ శతాబ్దం చివరి నాటికి పోర్చుగీసు వారి పతనం ప్రారంభమైంది. వారు భారతదేశంలో వర్తక స్థావరాలను క్రమంగా కోల్పోయారు. క్రీ.శ.1631లో హుగ్లీ మొగలుల వశమైంది. క్రీ.శ.1661లో పోర్చుగల్ రాజు తన సోదరిని వివాహం చేసుకున్న ఇంగ్లండ్ రాజు రెండో చార్లెస్‌కు కట్నం కింద బొంబాయిని ఇచ్చాడు. 1739లో మరాఠాలు సాల్‌శెట్టి, బుస్సైన్‌లను ఆక్రమించారు. చివరికి పోర్చుగీసు వారికి భారతదేశంలో గోవా, డయ్యూ, డామన్ మాత్రమే మిగిలాయి.

 

పోర్చుగీసువారి పతనానికి కారణాలు:

* 1580లో పోర్చుగల్ స్పెయిన్ వశమైంది. స్పెయిన్ రాజు రెండో ఫిలిప్ భారతదేశంలో పోర్చుగీసు భూభాగాలపై శ్రద్ధ వహించలేదు.
* స్పెయిన్ రాజు పోర్చుగల్‌ను ఖరీదైన ఐరోపా యుద్ధాల్లో భాగస్వామిని చేశాడు.
* పోర్చుగల్ చిన్న దేశం కాబట్టి సుదూర వలసలను నిర్వహించడానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చలేకపోయింది. పోర్చుగీసువారు పటిష్టమైన పరిపాలన విధానాన్ని రూపొందించడంలో విఫలమయ్యారు.
* హుగ్లీలోని పోర్చుగీసు వారి స్థావరాన్ని మొగలులు ధ్వంసం చేశారు.
* చిట్టగాంగ్‌ను మొగలులు ఆక్రమించడంతో బెంగాలులో పోర్చుగీసు వారి ప్రాబల్యం అంతమైంది.
* పోర్చుగీసు వారి పరమత ద్వేషం, వారి పరిపాలనలో అవినీతి.
* ఇంగ్లిష్, ఫ్రెంచి, డచ్చి వర్తక కంపెనీల విజృంభణ.

 

డచ్చివారు

  క్రీ.శ.1602లో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ ఏర్పాటైంది. ఈ కంపెనీకి భారత్‌లో వ్యాపారం చేయడానికి, యుద్ధాలు చేయడానికి, భూభాగాలు ఆక్రమించడానికి, సంధి కుదుర్చుకోవడానికి, కోటలు నిర్మించడానికి అనుమతి లభించింది.
డచ్చివారు మొదటి శాశ్వత వర్తక స్థావరాన్ని 1605లో మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. చంద్రగిరి రాజు నుంచి అనుమతి పొంది 1610లో పులికాట్‌లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. 1617 నుంచి పులికాట్ డచ్చివారి ప్రధాన కేంద్రమైంది. తర్వాత బొంబాయి, అహ్మదాబాద్, బుర్హాన్‌పూర్, బ్రోచ్‌లలో స్థావరాలను ఏర్పాటు చేశారు. బెంగాల్‌లో మొదటి డచ్చి స్థావరాన్ని పిప్లిలో స్థాపించారు.
పోర్చుగీసువారిని భారతదేశ సముద్ర వ్యాపారం నుంచి తప్పించిన ఘనత డచ్చివారికే దక్కింది. భారతీయ వస్త్రాల ఎగుమతిని పెంపొందించడంలో డచ్చివారు ప్రముఖ పాత్ర వహించారు. దేవానాంపట్నంలోని డచ్చివారి స్థావరం ఆంగ్లేయుల కాలంలో సెయింట్ డేవిడ్ కోటగా ప్రసిద్ధి చెందింది.

 

పతనానికి కారణాలు

* డచ్చివారికి వ్యతిరేకంగా ఆంగ్లేయుల నౌకాబలం అభివృద్ధి.
* డచ్చివారి కేంద్రీకృత అధికార విధానం.
* డచ్చివారికి భారతదేశంలో ప్రధాన కేంద్రం లేకపోవడం.
* కంపెనీ అధికారుల్లో అవినీతి పెరగడం.
* 1623లో అంబోయినా వద్ద ఆంగ్లేయులపై దురాగతం.

 

స్వాతంత్య్రోద్యమం ప్రత్యేకాంశంగా ఆధునిక భారతదేశ చరిత్ర!

 

ఆంగ్లేయులు

మొదటి ఎలిజబెత్ పాలన చివరి నాటికి భారతదేశంలో వర్తకం చేసుకునేందుకు కంపెనీకి ఎలిజబెత్ 15 ఏళ్లపాటు అనుమతిచ్చింది. దీనికి సంబంధించిన చార్టరును 1600 సంవత్సరం డిసెంబరు 31న జారీ చేశారు. ప్రారంభంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సుగంధద్రవ్యాలు, మిరియాల వ్యాపారంపై దృష్టిపెట్టింది. మొదటి జేమ్స్ కాలంలో విలియం హాకిన్స్ జహంగీర్ ఆస్థానానికి వచ్చి 1608 నుంచి 1611 వరకు అక్కడే ఉన్నాడు. మిడిల్‌టన్ సూరత్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడానికి 1611లో మొదటిసారిగా అనుమతి పొందాడు. సర్ జేమ్స్ థామస్ రో గుజరాత్‌లో కంపెనీ వ్యాపారం చేసుకోవడానికి 1611లో జహంగీర్ నుంచి అనుమతి పొందడంలో సఫలీకృతుడయ్యాడు.
మొగలులతో విరోధం: 1688లో ఎర్రసముద్రంలో మొగలులకు చెందిన కొన్ని నౌకలను సముద్రపు దొంగలు ఆక్రమించారు. దీంతో సూరత్‌లోని మొగల్ గవర్నరు కంపెనీ అధికారి సర్ జాన్ చైల్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఆంగ్లేయులను విరోధులుగా గుర్తించాలని ప్రకటన జారీ చేశాడు. అనేకమంది ఆంగ్లేయులను నిర్బంధించి అవమానించాడు. దీంతో సర్ జాన్ చైల్డ్ మొగలులతో సంధికి అంగీకరించాడు. ఈ సంధి ప్రకారం ఆంగ్లేయులు మొగలులకు చెల్లించాల్సిన బకాయిలను, మొగలులకు జరిగిన నష్టానికి పరిహారాన్ని చెల్లించాలి. సంధి షరతుల్లో భాగంగా జాన్ చైల్డ్ భారతదేశం వదలి వెళ్లాలి.

 

వర్తక స్థావరాల ఏర్పాటు

పశ్చిమ తీరం: ఆంగ్లేయులు 1619 నాటికి ఆగ్రా, అహ్మదాబాద్, బరోడా, బొంబాయిల్లో వర్తక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఇవి సూరత్ నియంత్రణలో ఉండేవి. 1668లో రెండో చార్లెస్ నుంచి బొంబాయిని కంపెనీ లీజుకు తీసుకుంది. గెరాల్డ్ ఆంగియర్ 1669 నుంచి 1677 వరకు మొదటి గవర్నర్‌గా పనిచేశాడు. 1687లో పశ్చిమ తీర ప్రధాన కేంద్రాన్ని సూరత్ నుంచి బొంబాయికి మార్చారు.

ఆగ్నేయ తీరం: మచిలీపట్నంలో పులికాట్ దగ్గర ఆర్మగాంవ్‌లో స్థావరాలను నెలకొల్పారు. 1639లో ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజు నుంచి మద్రాసును కొనుగోలు చేశాక అక్కడ సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. దీని తర్వాత తూర్పు తీర ప్రధాన కేంద్రాన్ని మచిలీపట్నం నుంచి మద్రాసుకు మార్చారు. 1658లో తూర్పు తీరంలోని అన్ని స్థావరాలను (బెంగాల్, బీహార్, ఒరిస్సా) సెయింట్ జార్జ్ కోట ఆధీనంలో ఉంచారు.
తూర్పు ఇండియా: బెంగాల్, ఒరిస్సాలోని హరిహరపూర్, బాలాసోర్, హుగ్లీ, పాట్నా, ఢాకా, ఖాసింబజార్‌లలో స్థావరాలను స్థాపించారు. 1690లో జాబ్ చార్నాక్ సుతనుతి వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. 1689లో సుతనుతి, కాలికట, గోవిందపూర్ గ్రామాల జమిందారీ హక్కులను ఈస్ట్ ఇండియా కంపెనీ పొందింది. తర్వాత ఈ మూడు గ్రామాలను కలిపి కలకత్తా నగరంగా అభివృద్ధి చేశారు. సుతనుతి వద్ద విలియం కోటను నిర్మించారు. 1700లో బెంగాల్, బీహార్, ఒరిస్సాలలోని స్థావరాలను విలియం కోట ఆధీనంలోకి తీసుకువచ్చారు.

 

ఫ్రెంచివారు

  ఫ్రెంచి చక్రవర్తి పద్నాలుగో లూయీ తన మంత్రి కోల్బర్ట్ ప్రోత్సాహంతో 1664లో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు. ఇంగ్లిష్ కంపెనీ ప్రైవేటుది కాగా ఫ్రెంచి కంపెనీ ప్రభుత్వానికి చెందింది. 1667లో సూరత్‌లోని ఫ్రాంకోయిస్ కారన్ మొదటి ఫ్రెంచి వర్తక స్థావరాన్ని స్థాపించాడు. వలికొండాపురం గవర్నరైన షేర్‌ఖాన్ లోడి నుంచి ఫ్రాంకోయిస్ మార్టిన్ పాండిచ్చేరిని పొందాడు. 1690లో బెంగాల్‌లోని చంద్రనగర్‌ను మొగల్ గవర్నరు నుంచి పొందాడు.
ఫ్రాంకోయిస్ మార్టిన్ భారతదేశంలో మొదటి ఫ్రెంచి డైరెక్టర్ జనరల్‌గా నియమితుడయ్యాడు. పాండిచ్చేరిలో లూయిస్ కోటను నిర్మించాడు. క్రీ.శ.1706-1720 మధ్య భారత్‌లో ఫ్రెంచివారి అధికారం క్షీణించింది. దీంతో 1720లో ఫ్రెంచి కంపెనీని పునర్వ్యవస్థీకరించారు. లెనాయిడ్, డ్యూమాస్ క్రీ.శ.1720-1742 మధ్య తిరిగి ఫ్రెంచివారి అధికారాన్ని పునరుద్ధరించారు. వీరు మలబారు తీరంలోని మహే, కోరమాండల్ తీరంలోని యానాం, తమిళనాడులో కరైకాల్‌ను ఆక్రమించారు.
1742లో ఫ్రెంచి గవర్నర్‌గా డూప్లేను నియమించడంతో ప్రారంభమైన ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధాలు ఫ్రెంచివారి ఓటమితో ముగిశాయి.

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఐరోపా వారి రాక

1. కాన్‌స్టంట్‌నోపుల్‌ను తురుష్కులు ఏ సంవత్సరంలో ఆక్రమించారు?
: క్రీ.శ.1453

 

2. నీలి నీటి విధానాన్ని అనుసరించిన పోర్చుగీసు వైస్రాయ్ ఎవరు?
జ: ఫ్రాన్సిస్ డి ఆల్మైడా

 

3. భారతదేశంలో డచ్చివారి మొదటి వర్తక స్థావరం ఏది?
జ: మచిలీపట్నం

 

4. భారతదేశంలో పోర్చుగీసు వారి మొదటి రాజధాని ఏది?
జ: కొచ్చిన్

 

5. భారతదేశంలో స్థిరపడిన పోర్చుగీసు వారు భారతీయ స్త్రీలను వివాహం చేసుకునేలా ప్రోత్సహించిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు?
జ: అల్ఫోన్సో డి అల్బూకర్క్

 

6. జవిలియం హాకిన్స్‌ను జహంగీర్ ఆస్థానానికి రాయబారిగా పంపించిన ఇంగ్లండ్ పాలకుడు ఎవరు?
జ:మొదటి జేమ్స్

 

7. 1542లో గోవాను సందర్శించిన ప్రసిద్ధ క్రైస్తవ మతప్రచారకుడు ఎవరు?
జ: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్

 

8. ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజప్రతినిధి నుంచి మద్రాసును ఏ సంవత్సరంలో పొందాడు?
జ: క్రీ.శ.1639

 

9. ఆంగ్లేయులు సెయింట్ డేవిడ్ కోటను నిర్మించిన ప్రదేశం ఏది?
జ: కడలూరు

 

10. కిందివాటిలో ఫ్రెంచి వర్తక స్థావరం కానిది?
ఎ) సూరత్ బి) యానాం సి) చంద్రనగర్ డి) బొంబాయి
జ: డి (బొంబాయి)

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కర్ణాటక యుద్ధాలు

  భారతదేశంలోని ఆగ్నేయ తీరంలో ఆర్కాట్ రాజధానిగా సాదతుల్లాఖాన్ స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు కర్ణాటక రాజ్యం దక్కన్‌లోని ఒక మొగలు సుభాగా, హైదరాబాద్ నిజాం నామమాత్రపు నియంత్రణలో ఉండేది. ఈ ప్రాంతంలో సంభవించిన అంతర్యుద్ధంలో బ్రిటిష్‌వారు, ఫ్రెంచ్‌వారు చెరో వర్గాన్ని సమర్థించారు. చివరకు బ్రిటిష్‌వారు ఫ్రెంచ్‌వారిపై ఆధిపత్యం సాధించారు.

 

మొదటి కర్ణాటక యుద్ధం (1745-48)

  ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో ఆంగ్లేయులకు, ఫ్రెంచ్‌వారికి మధ్య పోరు మొదలైంది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచ్ పడవలను స్వాధీనం చేసుకుంది. ప్రతిగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచ్ సైన్యం మద్రాసును ఆక్రమించింది.

  ఆంగ్లేయులు తమను ఫ్రెంచ్‌వారి నుంచి రక్షించాల్సిందిగా కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ను కోరారు. అయితే నవాబు ఆజ్ఞలను ఫ్రెంచ్‌వారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచ్‌వారికి, అన్వరుద్దీన్‌కు మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నవాబు ఘోరంగా ఓడిపోయాడు. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతోపాటు భారతదేశంలో ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌వారి మధ్య యుద్ధం కూడా ముగిసింది.

 

రెండో కర్ణాటక యుద్ధం (1749-54)

  వారసత్వ యుద్ధ సమయంలో ఫ్రెంచ్‌వారు హైదరాబాద్‌లో ముజఫర్ జంగ్‌కు, కర్ణాటకలో చందాసాహెబ్‌కు మద్దతు పలికారు. ఆంగ్లేయులు హైదరాబాద్‌లో నాజర్ జంగ్‌కు, కర్ణాటకలో అన్వరుద్దీన్ తర్వాత అతడి కుమారుడు మహ్మద్ అలీకి మద్దతిచ్చారు.

  1749 లో ఫ్రెంచ్‌వారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్టించేలా చేశారు. కానీ ఆంగ్లేయులు రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందాసాహెబ్‌ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహ్మద్ అలీ వశమైంది.

 

మూడో కర్ణాటక యుద్ధం (1758-63)

  ఐరోపాలో 1756 లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760 లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ డి లాలీ ఆంగ్ల జనరల్ ఐర్‌కూట్ చేతిలో ఓడిపోయాడు.

  ఫ్రెంచ్‌వారి స్థానంలో బ్రిటిష్‌వారు నిజాం సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. 1763 లో ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌వారి మధ్య సంధి కుదిరింది.

 

ప్లాసీ యుద్ధం - 1757 (బెంగాల్ ఆక్రమణ)

కారణాలు:

 కంపెనీ అధికారులు దస్తక్/ ఉచిత పాసులను దుర్వినియోగం చేయడం.

యువ నవాబు సిరాజుద్దౌలా తన పూర్వీకుల్లా తాను కూడా ఆంగ్లేయులపై నియంత్రణ కలిగి ఉండాలని భావించడం.

బ్రిటిష్‌వారు నవాబు ఆజ్ఞలకు విరుద్ధంగా కలకత్తాలో కోటలు నిర్మించడం.

ప్లాసీ (పలాసీ) అనేది ముర్షిదాబాద్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ 1757 జూన్ 23 న బ్రిటిష్ సైన్యానికి, నవాబు సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు సిరాజుద్దౌలాను ఓడించాయి. నవాబు సైన్యంలోని అయిదుగురు సేనానుల్లో మీర్‌మదన్, మదన్‌లాల్ మాత్రమే యుద్ధం చేశారు. మిగతా ముగ్గురు - మీర్ జాఫర్, యార్ లుతుఫ్ ఖాన్, రాయ్ దుర్లబ్ కంపెనీ ఏజెంట్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, ప్రేక్షకపాత్ర వహించారు.
 ప్లాసీ యుద్ధం మొదట బెంగాల్‌లో, చివరికి భారతదేశమంతటా బ్రిటిష్ వారి ఆధిపత్య స్థాపనకు దారితీసింది. భారతదేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరలింపు ప్రారంభమైంది.

 

బక్సర్ యుద్ధం (1764)

కారణాలు:

సార్వభౌమాధికారం కోసం ఆంగ్లేయులు, బెంగాల్ నవాబు మీర్ ఖాసిం మధ్య తలెత్తిన పోరు.

1717 లో మొగలులు జారీచేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం.

నవాబు అంతర్గత వ్యాపారంపై అన్ని రకాల పన్నులను తొలగించడం.

నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదకరంగా ప్రవర్తించడం.

బక్సర్ అనే ప్రదేశం పట్నా నగరానికి పశ్చిమంగా 120 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ 1764 అక్టోబరు 22 న మేజర్ హెక్టార్ మన్రో నాయకత్వంలోని బ్రిటిష్ సేనలకు, మీర్ ఖాసిం, అవధ్ నవాబు షూజా ఉద్దౌలా, రెండో షా ఆలం ఉమ్మడి సేనలకు మధ్య యుద్ధం జరిగింది.

ఈ యుద్ధం భారతీయ పాలకుల ఓటమితో ముగిసింది. మూడు రాజ్యాల సేనల మధ్య సమన్వయం లేకపోవడమే బ్రిటిష్‌వారి విజయానికి ప్రధాన కారణం.

 

ఫలితాలు:

*- బెంగాల్, బిహార్, ఒడిశాలలో బ్రిటిష్ ఆధిపత్య స్థాపన.
 అవధ్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారడం.
 మొగల్ చక్రవర్తి రెండో షా ఆలం కంపెనీ పెన్షనర్ అయ్యాడు.
 కంపెనీ ఔన్నత్యం పెరిగింది.

 

మైసూరు యుద్ధాలు

మొదటి మైసూరు యుద్ధం (1766-69): మైసూరు పాలకుడు హైదర్ ఆలీ బ్రిటిష్‌వారిని కర్ణాటక ప్రాంతం నుంచి, చివరకు భారతదేశం నుంచి తరిమివేయాలని భావించాడు. హైదర్ ఆలీ వల్ల తమ సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లనుందని గ్రహించిన బ్రిటిష్‌వారు నిజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో బ్రిటిష్‌వారిపై విజయం సాధించిన హైదర్ ఆలీ మద్రాసుకు 5 కి.మీ దూరం వరకు దండయాత్ర కొనసాగించాడు. 1769 లో జరిగిన మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది.

 

రెండో మైసూరు యుద్ధం (1780 - 84):

మరాఠాలు 1771 లో హైదర్ ఆలీపై దాడి చేసినప్పుడు బ్రిటిష్‌వారు హైదర్ ఆలీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.

అమెరికా స్వాతంత్య్ర యుద్ధం సందర్భంగా ఇంగ్లండ్‌కు, హైదరాలీ మిత్రదేశమైన ఫ్రాన్స్‌కు మధ్య తగాదా తలెత్తింది. హైదర్ ఆలీ ఆధీనంలోని ఫ్రెంచ్ భూభాగమైన మహేను బ్రిటిష్‌వారు ఆక్రమించారు. ఇవే ఈ యుద్ధానికి దారితీసిన కారణాలు.

ఈ యుద్ధంలో 1780 లో కల్నల్ బైలీని హైదర్ ఆలీ ఓడించాడు. 1781 లో పోర్టో నోవో యుద్ధంలో ఐర్‌కూట్ చేతిలో హైదర్ ఆలీ పరాజయం పొందాడు.

1782 లో హైదర్ ఆలీ కల్నల్ బ్రైత్‌వైట్‌ను ఓడించాడు. ఈ యుద్ధం 1784 లో జరిగిన మంగళూరు సంధితో ముగిసింది.

 

మూడో మైసూరు యుద్ధం (1790 - 92):

  అంతర్గత సంస్కరణల ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడం, టర్కీ, ఫ్రాన్స్‌లకు రాయబారులను పంపడం ద్వారా వారి సహాయం పొందడానికి ప్రయత్నించడం, బ్రిటిష్‌వారి మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్ రాజ్య భూభాగాలను టిప్పుసుల్తాన్ ఆక్రమించడం ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు.

  ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి స్వయంగా గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాడు.

  1792 లో జరిగిన శ్రీరంగ పట్టణం సంధితో మూడో మైసూరు యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం టిప్పుసుల్తాన్ తన రాజ్యంలో సగం భూభాగాలను బ్రిటిష్‌వారికి ఇవ్వడానికి అంగీకరించాడు. యుద్ధ నష్టపరిహారం కింద రూ.3.6 కోట్లు చెల్లించడానికి అంగీకరించి, రూ.1.6 కోట్లు వెంటనే చెల్లించాడు.

 

నాలుగో మైసూరు యుద్ధం (1799):

  తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టిప్పు సుల్తాన్ భావించడం, కొత్త బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ టిప్పు సుల్తాన్ నుంచి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించాలని భావించడం ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణాలు.

  ఈ యుద్ధం సందర్భంగా 1799 మేలో శ్రీరంగ పట్టణంలో బ్రిటిష్‌వారితో పోరాడుతూ టిప్పు సుల్తాన్ మరణించాడు. గవర్నర్ జనరల్ సోదరుడు ఆర్థర్ వెల్లస్లీ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతడే 1815 లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌ను ఓడించాడు. మైసూరు రాష్ట్రంలోని చాలా భూభాగాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. కొంత భూభాగానికి వడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ అనే బాలుడిని రాజుగా చేసి, మైసూరు రాజవంశాన్ని పునరుద్ధరించారు.

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కర్ణాటక యుద్ధాలు

1. స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడెవరు?
జ: సాదతుల్లా ఖాన్

 

2. కర్ణాటక రాజ్య రాజధాని ఏది?
: ఆర్కాట్

 

3. హైదర్ ఆలీ ఏ మైసూర్ యుద్ధ సమయంలో మరణించాడు?
జ: రెండో మైసూరు యుద్ధం

 

4. ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజుద్దౌలాను బంధించి, చంపిన వ్యక్తి ఎవరు?
జ: మిరాన్

 

5. బక్సర్ యుద్ధ హీరో ఎవరు?
జ: హెక్టార్ మన్రో

 

6. చీకటిగది ఉదంతంగా పేర్కొనే సంఘటన జరిగిన ప్రదేశం ఏది?
జ: కలకత్తా

 

7. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
జ: రాబర్ట్ క్లైవ్

 

8. పోర్టో నోవో యుద్ధం ఎప్పుడు జరిగింది?
జ: 1781

 

9. టిప్పు సుల్తాన్ మరణించిన సంవత్సరం?
జ: 1799

 

10. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జ: మంగళూరు

 

11. ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైన సంవత్సరం?
జ: 1756

 

12. బక్సర్ యుద్ధంలో పాల్గొనని భారతీయ పాలకుడు ఎవరు?
       ఎ) మీర్ ఖాసిం     బి) షూజా ఉద్దౌలా     సి) రెండో ఆలం షా    డి) అన్వరుద్దీన్
జ: డి) అన్వరుద్దీన్

 

13. వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలీ ఎవరి చేతిలో ఓడిపోయాడు?
జ: సర్ ఐర్‌కుట్

 

14. ప్లాసీ యుద్ధంలో ప్రేక్షకపాత్ర వహించిన సిరాజుద్దౌలా సేనానులు?
ఎ) మీర్ జాఫర్              బి) యార్ లుతుఫ్ ఖాన్             సి) రాయ్ దుర్లబ్             డి) పై ముగ్గురూ
జ: డి (పై ముగ్గురూ)

 

15. బక్సర్ యుద్ధానికి ప్రధాన కారణం?
ఎ) 1717 లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం.
బి) నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం
సి) 1717 లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం, నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం
డి) ఏదీకాదు
జ: 1717 లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం, నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విజయనగర సామ్రాజ్యం (1336 - 1680)

దక్షిణ భారతదేశంలోనే కాకుండా యావత్ భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యానికి ఒక విశిష్ట స్థానముంది. సుమారు మూడు శతాబ్దాల కాలం కొనసాగి, సువిశాలమైన ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలు భారతదేశ చరిత్రలో అతి తక్కువ. దీనివల్లే విజయనగర సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది.

  విజయనగర రాజ్యస్థాపన గురించి చరిత్రకారుల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కర్ణాటక ప్రాంతానికి చెందిన చరిత్రకారుడు సాలెటోర్ విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర, బుక్కరాయలు హొయసల రాజైన మూడో వీరభల్లుడి ఆస్థానంలో ఉండేవారని, ఈ రాజ్యాన్ని మహ్మదీయులు ఆక్రమించిన తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారని పేర్కొన్నాడు. ఈ అభిప్రాయాన్ని నెలటూరి వెంకట రమణయ్య అంగీకరించలేదు.
* హరిహరరాయలు, బుక్కరాయలు అనే సోదరులిద్దరు కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి కాలంలో కీలక పదవుల్లో ఉండేవారు. ప్రతాపరుద్రుడిని మహ్మద్‌బీన్ తుగ్లక్ సైనికులు బందీగా తీసుకువెళ్లిన తర్వాత, ఈ సోదరులిద్దరూ విద్యారణ్యస్వామి ఆశీస్సులతో 1336లో తుంగభద్ర నదిపరీవాహక ప్రాంతంలోని అనెగొందిలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి రాజధాని హంపి. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి అనే నాలుగు రాజ వంశాలు పరిపాలించాయి.
1. సంగమ వంశం 1336 - 1485
2. సాళువ వంశం 1485 - 1505
3. తుళువ వంశం 1505 - 1570
4. అరవీటి వంశం 1570 - 1680

 

సంగమ వంశం

 

మొదటి హరిహరరాయలు (1336 - 56): సోదరుల సహాయంతో సామ్రాజ్యాన్ని తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు విస్తరించాడు. ఇతడి కాలంలోనే 1347లో బహమనీ సామ్రాజ్యం స్థాపితమైంది. దక్షిణ భారతదేశంలో విజయనగర, బహమనీ సామ్రాజ్యాలు స్థాపించిన సమయంలో మహ్మద్‌బీన్ తుగ్లక్ దిల్లీ సుల్తాన్‌గా ఉండేవాడు. బహమనీ సుల్తానుల రాజ్య విస్తరణ కాంక్ష, ఇస్లాం మతాన్ని నిరోధించి, వైదిక మతాన్ని కాపాడాలనే విజయనగర రాజ్య పాలకుల పట్టుదల కారణంగా రెండు సామ్రాజ్యాల మధ్య నిరంతరం ఘర్షణ వాతావరణం కొనసాగింది. దీనికి మొదటి హరిహరరాయల కాలంలో బీజం పడింది. ఇతడి కాలంలో బహమనీ రాజ్యస్థాపకుడు అల్లాఉద్దీన్ హసన్ రెండుసార్లు దండెత్తాడు.

 

మొదటి బుక్కరాయలు (1357 - 77): ఇతని కాలంలో జరిగిన ముఖ్య సంఘటన - మధురా విజయం. మొదటి బుక్కరాయల కుమారుడు కంపరాయలు మధుర సుల్తాన్‌ను ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఈ విజయాన్ని కంపరాయలు భార్య అయిన గంగాదేవి తాను రచించిన 'మధురా విజయం'లో వర్ణించింది.
* మొదటి బుక్కరాయల కాలంలో రాయచూర్ అంతర్వేది గురించి విజయనగర, బహమనీ సామ్రాజ్యాల మధ్య నిరంతరం పోరాటాలు జరిగేవి. బహమనీ సుల్తానులతో యుద్ధం తర్వాత రెడ్డి రాజులతో కూడా యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో బుక్కరాయలు రెడ్డి రాజ్యంలోని అహోబిలం, వినుకొండ ప్రాంతాలను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. మొదటి బుక్కరాయలు మత సహనానికి పెట్టింది పేరు. ఇతడు అల్ప సంఖ్యాకులైన జైనులకు రక్షణ కల్పించాడు. విదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పాడు. 1374లో మింగ్ వంశానికి చెందిన చైనా చక్రవర్తి ఆస్థానానికి రాయబారిని పంపినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ప్రముఖ ఆంధ్ర కవి నాచన సోముడు ఇతడి ఆస్థానంలోనివాడే.

 

రెండో హరిహరరాయలు (1377 - 1404): ఇతడికి రాజాధిరాజు, రాజపరమేశ్వర అనే బిరుదులు ఉన్నాయి. బహమనీ సుల్తాన్ అయిన రెండో మహ్మద్ ఇతడికి సమకాలీనుడు. 1378లో రెండో హరిహరరాయల మంత్రి మాధవుడు గోవా రాజ్యాన్ని జయించి, 'భువనైక వీరుడు' అనే బిరుదు పొందాడు. రెండో హరిహరరాయల కాలంలో సింహళానికి, విజయనగర రాజ్యానికి ఘర్షణ ప్రారంభమైంది. 1398లో బహమనీ రాజైన ఫిరోజ్‌షా విజయనగరంపై దండెత్తి ప్రజలను ఊచకోత కోయడమే కాకుండా విజయనగర సంపదను దోచుకున్నాడు. ఇతడి మరణం తర్వాత సింహాసనం కోసం అంతఃకలహాలు చోటుచేసుకున్నాయి.

 

రెండో బుక్కరాయలు (1404 - 06): సోదరుడైన విరూపాక్షుడిని పదవీభ్రష్టుడిని చేసి సింహాసనాన్ని అధిష్టించాడు. కేవలం రెండేళ్లు మాత్రమే పాలించాడు.

 

మొదటి దేవరాయలు (1406 - 22): ఇతడు ఫిరోజ్ షా చేతిలో ఓడిపోయి తన కుమార్తెను అతడికి ఇచ్చి వివాహం జరిపించాడు. మొదటి దేవరాయలు రెడ్డి రాజులను ఓడించి ఉదయగిరి, మోటుపల్లిని ఆక్రమించాడు. తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టించి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ఇటలీ యాత్రికుడైన నికొలో కాంటే 1420లో ఇతడి కాలంలోనే విజయనగరాన్ని సందర్శించాడు.

 

రెండో దేవరాయలు లేదా ప్రౌఢదేవరాయలు (1426 - 46): సంగమ వంశ రాజుల్లో అగ్రగణ్యుడు. బహమనీ సుల్తానులతో జరుతున్న యుద్ధాల్లో విజయనగర సైన్యం ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించి, వాటిని సవరించడానికి పూనుకున్నాడు. సైన్యంలోని ఆయుధ విభాగాన్ని పటిష్టం చేసి, ముస్లింలను కూడా సైన్యంలో చేర్చుకున్నాడు. వారి కోసం రాజధానిలో మసీదు నిర్మించాడు. సింహాసనం ఎదురుగా ఖురాన్ ప్రతిని ఉంచాడు. ఇతనికి 'గజభేటకార' అనే బిరుదు ఉంది. ఇతడి కాలంలోనే పారశీక రాయబారి అబ్దుల్ రజాక్ (1443) విజయనగరాన్ని దర్శించాడు.
* ప్రౌఢ దేవరాయలు స్వయంగా కవి. సంస్కృతంలో మహానాటక సుధానిధి, వృత్తి అనే గ్రంథాలను రచించాడు. విజయనగర ఆస్థాన కవి అయిన 'డిండిమభట్టు'ను ఓడించిన శ్రీనాథుడికి ప్రౌఢ దేవరాయలు కనకాభిషేకం చేయించాడు. ఇతడి కాలంలోనే ప్రసిద్ధి చెందిన విఠలస్వామి ఆలయం నిర్మితమైంది. ప్రౌఢ దేవరాయల తర్వాత సంగమ వంశ పతనం ప్రారంభమైంది. చివరి సంగమ రాజైన రెండో విరూపాక్షరాయలను పెనుగొండకు చెందిన సాళువ నరసింహుడు వధించడంతో సంగం వంశం అంతరించింది.

 

సాళువ వంశం (1485 - 1505)

 

సాళువ నరసింహరాయలు (1485 - 91): ఇతడు సింహాసనం అధిష్టించిన తర్వాత సామంత రాజులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేసి, విజయనగర సంస్కృతీ సంప్రదాయాలను పదిలపరచాడు. అరబ్బు వర్తకులతో స్నేహం చేసి, వారి నుంచి ఉత్తమ అశ్వాలను సంపాదించి, అశ్విక దళాన్ని అభివృద్ధి చేశాడు.

 

ఇమ్మడి నరసింహరాయలు (1491 - 1505): ఇతడు పేరుకు మాత్రమే రాజు. సర్వాధికారాలను నరసనాయకుడు చెలాయించేవాడు. నరసనాయకుడు సమర్థుడైన సేనాని. శక్తిమంతమైన పాలకుడు. ఉమ్మత్తూర్ నాయకుడి తిరుగుబాటును అణచివేశాడు. శ్రీరంగ పట్టణాన్ని ఆక్రమించాడు. నరసనాయుడు 1503 లో మరణించాడు. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని పునరుద్ధరించాలనే తమ నాయకుడైన సాళువ నరసింహరాయలి కోరికను పూర్తిచేశాడు. దక్షిణ భారతదేశంలో అత్యధిక భాగాన్ని విజయనగర సామ్రాజ్య పరిధిలోకి తీసుకువచ్చాడు. సైనిక శక్తిని పునర్నిర్మించడం ద్వారా తర్వాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు సాధించిన విజయాలకు పునాది వేశాడు. నరసనాయకుడు మరణించిన తర్వాత అతడి పెద్ద కుమారుడు వీర నరసింహరాయలు రాజ ప్రతినిధి అయ్యాడు. ఇతడు క్రీ.శ. 1505 లో పెనుగొండ దుర్గంలో బంధితుడై ఉన్న అసలు రాజు ఇమ్మడి నరసింహరాయలను హత్య చేశాడు. దీంతో సాళువ వంశం అంతరించింది.

 

తుళువ వంశం (1505 - 70)

మైసూరులోని తుళువనాడు వీరి జన్మస్థలం కావడం వల్ల వీరి వంశానికి ఆ పేరు వచ్చింది. తుళువ వంశానికి మూలపురుషుడు తిమ్మరాజు. తుళువ నరసనాయకుడికి ముగ్గురు భార్యలు. పెద్ద భార్య కుమారుడు వీరనరసింహరాయలు. రెండో భార్య నాగాంబ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు, మూడో భార్య కుమారులు శ్రీరంగదేవరాయలు, అచ్యుతదేవరాయలు.

వీర నరసింహరాయలు (1505 - 09): వీర నరసింహరాయలుపై నాటి బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా దండెత్తి రాగా, రాయలి సామంతులు అతడిని ఓడించారు. ఉమ్మత్తూరు, శివసముద్ర రాష్ట్ర పాలకులు తిరుగుబాట్లు చేయగా, వారిని అణిచివేసే యత్నంలో వీర నరసింహరాయలు మరణించాడు. దీంతో అతడి తమ్ముడైన శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు.

 

శ్రీకృష్ణదేవరాయలు (1509 - 29) 

  తుళువ వంశంలోనే కాకుండా విజయనగర చరిత్రలో అద్వితీయుడు, మహోన్నతుడు. ఇతడు అధికారంలోకి వచ్చేనాటికి సామ్రాజ్యం అస్తవ్యస్తంగా ఉంది. తీరాంధ్ర దేశంలో గజపతులు, బీజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ ఆదిల్ షా, గోల్కొండ పాలకుడు కులీకుతుబ్ షా విజయనగర సామ్రాజ్యాన్ని కబళించడానికి పూనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణదేవరాయలు రాజనీతిని ప్రదర్శించాడు. 1510లో పోర్చుగీసు వారితో సంధి చేసుకుని, అశ్విక దళాన్ని పటిష్టం చేశాడు.

* శ్రీకృష్ణదేవరాయలు రాజ్య విస్తరణ కోసం అనేక దిగ్విజయ యాత్రలను కొనసాగించాడు. 1510-11 కాలంలో బహమనీ రాజ్యంపై దండెత్తి, రాయచూర్, ముద్గళ్ ప్రాంతాలను ఆక్రమించాడు. అప్పటికే బహమనీ సామ్రాజ్యం క్షీణించి బీరార్, బీజాపూర్, బీదర్, అహ్మద్‌నగర్, గోల్కొండ అనే అయిదు స్వతంత్య్ర రాజ్యాలుగా విడిపోయింది.
* 1510లో బీదర్‌లో అహ్మద్ బరీద్ అనే సేనాని, సుల్తాన్ మహ్మద్ షాను బంధించి తనను తాను సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడు. దీంతో బీదర్ ప్రజల కోరిక మేరకు శ్రీకృష్ణదేవరాయలు దండెత్తి గుల్బర్గా వరకు వెళ్లి, బరీద్‌ను శిక్షించి, సుల్తాన్‌ను విడిపించి, మహమ్మద్ షా అధికారాన్ని పునరుద్ధరించాడు. దీనికి చిహ్నంగా 'యవనరాజ్య స్థాపనాచార్య' అనే బిరుదు ధరించాడు.
* దక్షిణదేశ దండయాత్రల్లో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు 1512-13లో పెనుగొండ, ఉమ్మత్తూరు, శివసముద్ర దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు. తన ప్రతినిధిగా చిక్కరాయలను నియమించాడు. శ్రీకృష్ణదేవరాయలి తూర్పు దిగ్విజయ యాత్ర 1513లో ఉదయగిరి ఆక్రమణతో ప్రారంభమై, 1519లో ముగిసింది. కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం మొదలైన ప్రాంతాలను వశపరచుకుని గజపతుల రాజధాని కటకాన్ని చేరుకున్నాడు. దీంతో ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తె అన్నపూర్ణాదేవిని ఇచ్చి వివాహం జరిపించి, కృష్ణదేవరాయలితో సంధి చేసుకున్నాడు. రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో నిమగ్నమై ఉండగా, బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్‌షా రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించాడు. శ్రీకృష్ణదేవరాయలు 1520లో బీజాపూర్‌పై దండెత్తి రాయచూర్ యుద్ధంలో ఓడించి, అంతర్వేదిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఇలా శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశానికి తిరుగులేని సార్వభౌముడు అయ్యాడు.
* శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు ఇంజినీర్ల సహాయంతో అనేక చెరువులు, కాలువలు, బావులు తవ్వించి సాగునీటి వసతి కల్పించి వ్యవసాయాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఇతడి కాలంలో విజయనగర ఆస్థానంలో వసంతోత్సవాలు జరిగేవి. రాయల ఆస్థానానికి 'భువన విజయం' అనే పేరుంది. తెలుగు భాషలోని మాధుర్యాన్ని గ్రహించి 'దేశభాషలందు తెలుగు లెస్స' అని వ్యాఖ్యానించాడు. సంస్కృత సారస్వతానికి మిహిరభోజుడు ఎంత సేవ చేశాడో కృష్ణదేవరాయలు తెలుగు భాషకి అంత సేవ చేసి 'ఆంధ్రభోజుడనే' బిరుదు పొందాడు.
* అల్లసాని పెద్దన రాయల ఆస్థాన కవి. శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మతాభిమాని. అద్వైత మతాచార్యుడైన వ్యాసరాయలు ఇతని గురువు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఈయన రచించిన 'ఆముక్తమాల్యద'ను తెలుగు సాహితీ రంగంలో ఉత్తమ శ్రేణి గ్రంథంగా పేర్కొంటారు. ఆముక్తమాల్యదను 'విష్ణుచిత్తీయం' అని కూడా అంటారు. ఈ గ్రంథం కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గురించి తెలియజేస్తుంది.
* శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో భవనాలు, ఆలయ మంటపాలు కట్టించాడు. తిరుపతి, కంచి, శ్రీకాళహస్తి, సింహాచలం, అహోబిలం ఆలయాలకు గోపురాలు, మండపాలను నిర్మించాడు. రాజధానిలో విఠలస్వామి ఆలయాన్ని, హజరా రామస్వామి ఆలయాన్ని నిర్మించాడు. తన తల్లి నాగాంబ జ్ఞాపకార్థం 'నాగలాపురం'' అనే పట్టణాన్ని నిర్మించాడు. ఇతడు 1529లో మరణించాడు.
* శ్రీకృష్ణదేవరాయలి మరణం తర్వాత అచ్యుతదేవరాయలు (1529 - 42) పరిపాలించాడు. 1542 43లలో మొదట వెంకటపతిరాయల పాలన సాగింది. 1543 నుంచి 1570 వరకు సదాశివరాయలు పాలించాడు.

 

రాక్షస - తంగడి యుద్ధం (1565)

భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధాల్లో రాక్షస - తంగడి యుద్ధం ఒకటి. దీన్నే 'బన్నిహట్టి' యుద్ధం అని కూడా పిలుస్తారు. దక్కన్ సుల్తాన్‌లలోని అంతఃకలహాలను అవకాశంగా తీసుకుని రామరాయలు వారి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నాడు. అహ్మద్‌నగర్, గోల్కొండ సుల్తానులకు సహాయంగా బీజాపూర్‌పై దండెత్తాడు. తర్వాత బీజాపూర్‌తో కలిసి అహ్మద్‌నగర్‌ను ధ్వంసం చేశాడు. చివరికి రామరాయల కుట్రను గ్రహించిన సుల్తానులు తమలో విభేదాలను మరచి, ఐక్యమత్యంతో కూటమిగా ఏర్పడి 1565లో విజయనగర సామ్రాజ్యంపై దండెత్తారు. విజయనగరానికి 10 మైళ్ల దూరంలోని రాక్షస - తంగడి అనే గ్రామాల మధ్య ఉన్న మైదానాల్లో ఉభయ పక్షాలు తలపడ్డాయి. యుద్ధ ప్రారంభంలో విజయం అళియ రామరాయలకే దక్కింది. కానీ, ముస్లిం సైన్యాలు 20 మైళ్లు వెనక్కి వెళ్లి విజయనగర సైన్యాలు ఏమరుపాటుగా ఉన్నప్పుడు మెరుపుదాడికి పాల్పడ్డాయి. రామరాయలను అహ్మద్‌నగర్ సుల్తాన్ హుస్సేన్ నిజాంషా అతిక్రూరంగా హతమార్చాడు.

* విజయనగర సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని మైత్రి కుదుర్చుకున్న సుల్తానుల కూటమి మళ్లీ విడిపోయి ఎవరికి వారు విడిగా వ్యవహరించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని 1570 లో విజయనగరాన్ని పాలించిన అరవీటి వంశం (నాలుగోది) పెనుగొండను రాజధానిగా చేసుకుని 1680 వరకు పాలన సాగించింది.

 

అరవీటి వంశం (1570 - 1680)

తిరుమల రాయలు (1570-72): తిరుమల రాయలు తన సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి తన కుమారులను ప్రతినిధులుగా నియమించాడు. ఇతడు తిరుపతి, కంచి, శ్రీరంగంలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించాడు.

మొదటి శ్రీరంగ రాయలు (1572-85): ఇతడి పాలనాకాలంలో అనేక దండయాత్రలు జరిగాయి. 1576 లో బీజాపూర్ అలీషా పెనుగొండను ముట్టడించాడు. 1579 లో గోల్కొండ సుల్తాన్ విజయనగర రాజ్యంపై దండెత్తి అహోబిలాన్ని ఆక్రమించి, అక్కడి నరసింహ ఆలయాన్ని దోచుకున్నాడు. మొదటి శ్రీరంగరాయలికి సంతానం లేనందున చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతడి తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు.

రెండో వెంకటరాయలు (1585-1614): ఇతడు చంద్రగిరిని రాజధానిగా చేసుకున్నాడు. అరవీటి వంశంలో గొప్పరాజు. రెవెన్యూ పాలనను పటిష్టం చేశాడు. ఇతడి పాలనా కాలంలో తూర్పు తీరంలో డచ్చివారు, ఆంగ్లేయులు తమ కర్మాగారాలను నెలకొల్పారు.

మూడో శ్రీరంగరాయలు: ఇతడు ఆఖరి పాలకుడు. ఇతడి మరణంతో అరవీటి వంశంతో పాటు విజయనగర సామ్రాజ్యం కూడా పతనమైంది.

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అక్బర్, జహంగీర్ ప‌రిపాల‌న‌

  అక్బర్ చేపట్టిన ఉదారవాద విధానాలు అతడి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. 1562లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం యుద్ధం జరిగే సమయంలో యుద్ధంలో పాల్గొనని హిందువులు, యుద్ధంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులను ఖైదీలు, బానిసలుగా చేయకూడదని, అలాగే ఇస్లాం మతంలోకి మార్చకూడదని అక్బర్ పేర్కొన్నాడు. 

  అక్బర్ 1563లో యాత్రికుల మీద విధించే పన్నును, 1564లో జిజియా పన్నును నిషేధించాడు. అనువాద శాఖను ప్రారంభించి సంస్కృతం, ఇతర భాషల్లోని గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించేలా చర్యలు చేపట్టాడు. రాజ్యంలోని ఉద్యోగాలకు హిందూ, ముస్లింలు సమానంగా పోటీపడొచ్చని పేర్కొన్నాడు. హిందువుల మనోభావాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. గొడ్డు మాంసం వాడకాన్ని నిషేధించాడు. అలాగే 1583లో కొన్ని ప్రత్యేక రోజుల్లో జంతువులను చంపడాన్ని నిషేధించాడు. హిందువుల ఆదరాభిమానాలు పొందడానికి వారి పండుగల్లో పాల్గొన్నాడు. సాంఘిక సంస్కరణల్లో భాగంగా బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని నియంత్రించడమే కాకుండా వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. అక్బర్ తన రాజపుత్ర భార్యలు హిందూ మతాన్ని అవలంబించడాన్ని సమర్థించాడు.

 

మత విధానం

  అక్బర్ 1562 నుంచి 18 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది అజ్‌మేర్ (అజ్మీర్)లోని షేక్ మెయినుద్దీన్ చిష్టి దర్గాను సందర్శించాడు. అతని రాజపుత్ర భార్యలు, హిందూ అధికారులైన తోడర్‌మల్, బీర్బల్, మాన్‌సింగ్, ఫైజి, అబుల్ ఫజల్ లాంటి పండితులు; 16వ శతాబ్దం నాటి భక్తి ఉద్యమం... అక్బర్ తన మత భావాలను మార్చుకోవడానికి దోహదపడ్డాయి.

  అక్బర్‌కి వేదాంతం, ఆధ్యాత్మిక విషయాలపై ఉన్న అభిమానం 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా ప్రారంభించడానికి దోహదం చేసింది. ఇక్కడ ప్రతి గురువారం సాయంత్రం మతపరమైన చర్చ జరిగేది. ఇందులో మొదట్లో ముస్లింలు మాత్రమే పాల్గొనేవారు. 1578లో అన్ని మతాల వారు పాల్గొనడానికి అవకాశం కల్పించారు. 1579లో అక్బర్ ముస్లిం ప్రజలను ప్రభావితం చేసే అన్ని మతపరమైన విషయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని భావించాడు. ఇది షేక్ ముబారక్ ఒక ప్రకటన లేదా మజహర్ రూపొందించడానికి దారితీసింది. ఈ ప్రకటనపై అయిదుగురు ఉలేమాలు సంతకాలు చేశారు. దీనిద్వారా మతపరమైన విషయాల్లో ఉలేమాల బదులు చక్రవర్తి అధికారం స్థిరపడిపోయింది. అక్బర్ వివిధ మత ప్రవక్తలతో చర్చించిన తర్వాత 1582లో దీన్-ఇ-ఇలాహిని స్థాపించాడు. దీని ప్రధాన ఉద్దేశం సుల్-ఇ-కుల్ లేదా సార్వత్రిక సామరస్య భావనను పెంపొందించడం.

 

పరిపాలనాపరమైన విధానాలు

  సామ్రాజ్య మనుగడకు బలమైన రాజకీయ వ్యవస్థ, సమర్థవంతమైన పరిపాలనా విధానం అవసరమని అక్బర్ భావించాడు. పరిపాలనా రంగంలో నిరంతరం అనేక ప్రయోగాలు చేశాడు. అక్బర్ తన సామ్రాజ్యంలో పర్షియన్ భాషను అధికార భాషగా ప్రకటించాడు. సామ్రాజ్యం మొత్తంలో ఒకే పరిపాలన విధానం, నాణేలు, ఒకే రకమైన తూనికలు, కొలతలు అమలయ్యేలా చర్యలు చేపట్టాడు. అక్బరు తన రెవెన్యూ మంత్రి తోడర్‌మల్ పర్యవేక్షణలో 1582లో రెవెన్యూ విధానంలో సమూలమైన మార్పులు చేశాడు.

* అక్బర్ తోడర్‌మల్ బందోబస్తు లేదా జబ్తి అనే రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంతకు ముందు 1575 - 76లో తన సామ్రాజ్యాన్ని 12 సుబాలుగా విభజించాడు. దక్కన్ ఆక్రమణ తర్వాత ఈ సుబాల సంఖ్య 15 కు చేరింది. ప్రతి సుబాను సర్కార్‌లుగా, ప్రతి సర్కారును పరగణా లేదా మహల్‌గా విభజించాడు.
సుబాలన్నింటిలో ఒకేవిధమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1573 - 74లో గుజరాత్ ఆక్రమణ తర్వాత అధికారులను వేర్వేరు హోదాలు లేదా మున్సబ్‌లుగా వర్గీకరించాడు. ఇది మున్సబ్‌దారీ విధానం రూపొందడానికి దారితీసింది. అక్బర్ ప్రవేశపెట్టిన పరిపాలనా విధానం చిన్న మార్పులతో మొగలు సామ్రాజ్యం పతనమయ్యే వరకు కొనసాగడం అక్బర్ గొప్పదనానికి నిదర్శనం.
* 1602లో అక్బర్ పెద్ద కుమారుడు సలీం తిరుగుబాటు చేశాడు. దీంతో అక్బర్ తన చివరి రోజులను ఇబ్బందికరంగా గడపాల్సి వచ్చింది. మొగల్ ఆస్థానంలో ఒక వర్గం సలీం చక్రవర్తి కావాలని భావించగా, మరో వర్గం సలీం కుమారుడు ఖుస్రూ చక్రవర్తి కావాలని కోరుకున్నారు. అక్బర్ కూడా ఖుస్రూని చక్రవర్తిగా చేయడానికే సుముఖత చూపాడు. 1605లో తన మరణానికి కొద్ది రోజుల ముందు అక్బర్ స్వయంగా సలీంను చక్రవర్తిగా ప్రకటించాడు. దీంతో సలీం 'జహంగీర్' బిరుదుతో సింహాసనం అధిష్టించాడు.

 

జహంగీర్ (1605-27)

  జహంగీర్ చక్రవర్తి కాగానే ప్రజా సంక్షేమం కోసం, ఉత్తమ పరిపాలన అందించడానికి 12 శాసనాలు ప్రకటించాడు. ఈ శాసనాల ద్వారా అక్బర్ ఉదారవాద విధానాలను కొనసాగించాలని జహంగీర్ భావించినా ఆచరణలో మాత్రం విఫలమయ్యాడు. 1606లో జహంగీర్ కుమారుడు ఖుస్రూ లాహోర్‌లో తిరుగుబాటు చేశాడు. ఇది జహంగీర్‌కు పెద్ద ఎదురుదెబ్బ. తానే స్వయంగా ఈ తిరుగుబాటును అణిచివేశాడు. ఖుస్రూను బంధించి కళ్లు పీకించాడు. సిక్కుల అయిదో గురువైన అర్జున్‌సింగ్ తరన్ తరన్ అనే ప్రదేశంలో ఖుస్రూకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా పూర్తి మద్దతు తెలిపాడు. దీంతో జహంగీర్ అతడిపై అపరాధ రుసుం విధించాడు. దీన్ని చెల్లించడానికి నిరాకరించిన అర్జున్‌సింగ్‌కి జహంగీర్ మరణ శిక్ష విధించాడు. ఇది సిక్కులకు, మొగలులకు మధ్య వైరానికి దారితీసింది. తర్వాత 1622లో సోదరుడు ఖుర్రం చేతిలో ఖుస్రూ హత్యకు గురయ్యాడు.

 

మేవాడ్‌పై దండయాత్రలు

  జహంగీర్ మేవాడ్ రాజైన రాణా ప్రతాప్‌సింగ్ కుమారుడు రాణా అమర్‌సింగ్‌పై మొదటి సైనిక దండయాత్ర చేశాడు. మేవాడ్‌పై 1606, 1608, 1609 లలో జరిపిన దండయాత్రలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. 1613 - 14లో ఖుర్రం ఆధ్వర్యంలో మేవాడ్‌పై జరిపిన దండయాత్ర ఫలించింది. 1615లో అమర్‌సింగ్ మొగలులతో సంధికి అంగీకరించాడు. దీంతో సుదీర్ఘకాలంగా మొగలులకు, మేవాడ్ రాజ్యానికి మధ్య జరిగిన పోరాటం ముగిసింది.

* నర్మదా నదికి దక్షిణంగా ఉన్న భూభాగాలను ఆక్రమించాలనే అక్బర్ ఆశయాన్ని కొనసాగించాలని జహంగీర్ భావించాడు. మొదటగా అహ్మద్‌నగర్ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించాలనుకున్నాడు. అయితే జహంగీర్ చక్రవర్తి అయ్యేనాటికి నిజాం షాహి రాజ్య ప్రధానమంత్రి మాలిక్ అంబర్ కృషి వల్ల అహ్మద్‌నగర్ పరిస్థితి బాగా మెరుగుపడింది.
* 1608 నుంచి జహంగీర్ అహ్మద్‌నగర్‌పై అనేకసార్లు దండెత్తి, లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా మొగలులు కొంత భూభాగాన్ని కూడా ఆక్రమించలేకపోయారు. పర్షియా కాందహార్‌ను ఆక్రమించడం జహంగీర్ వైఫల్యాల్లో అతి పెద్దదిగా పేర్కొనవచ్చు. పర్షియాకు చెందిన షా అబ్బాస్ మొగలులతో పైకి స్నేహం నటిస్తూ, 1622లో కాందహార్‌ను ఆక్రమించాడు. మొగలులు కాందహార్‌ను కోల్పోవడంతో మధ్య ఆసియాలో వారి ప్రతిష్ట బాగా దెబ్బతింది. ఇదే సమయంలో నూర్జహాన్‌కు, షాజహాన్‌కు మధ్య విభేదాలు ఏర్పడటంతో కాందహార్‌ను తిరిగి ఆక్రమించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.

 

నూర్జహాన్ ప్రభావం..

  పర్షియాకు చెందిన మీర్జా గియాస్ బేగ్ కుమార్తె మెహరున్నీసాను జహంగీర్ వివాహమాడటం సమకాలీన సంఘటనలపై తీవ్ర ప్రభావం చూపింది. మెహరున్నీసా మొదటి భర్త షేర్ ఆఫ్గన్ మరణించిన నాలుగేళ్ల అనంతరం జహంగీర్ మెహరున్నీసాను 1611లో వివాహం చేసుకున్నాడు. ఆమెకు మొదట నూర్‌మహల్ (రాజ ప్రాసాదానికి వెలుగు) అనే బిరుదు, తర్వాత నూర్జహాన్ (ప్రపంచానికి వెలుగు) అనే బిరుదు ఇచ్చాడు. 1613లో ఆమెకు 'పాదుషా బేగం' హోదా కల్పించాడు. ఆమె పేరుతో నాణేలు కూడా ముద్రించారు.

* నూర్జహాన్ ప్రభావంతో ఆమె తండ్రికి 'ఇతిమద్ ఉద్దౌలా', సోదరుడికి 'అసఫ్‌ఖాన్' అనే బిరుదులు లభించాయి. జహంగీర్‌తో ఆమె వివాహమైన ఏడాదికే అసఫ్‌ఖాన్ కుమారై ముంతాజ్ మహల్‌గా పేరుగాంచిన అర్జుమండ్ బాను బేగంను జహంగీర్ కుమారుల్లో సమర్థుడైన ఖుర్రంకు ఇచ్చి వివాహం జరిపించారు. దీంతో నూర్జహాన్, ఇతిమద్ ఉద్దౌలా, అసఫ్‌ఖాన్, ఖుర్రంల మధ్య బంధం బలపడింది. ఈ నలుగురితో కూడిన నూర్జహాన్ బృందం పదేళ్లపాటు రాజ్యాన్ని పాలించింది. 1620లో నూర్జహాన్, షేర్ ఆఫ్గన్‌లకు జన్మించిన లాడ్లీ బేగంను జహంగీర్ చిన్న కుమారుడైన షహర్యార్‌కు ఇచ్చి పెళ్లి చేయడంతో ఈ నలుగురి మధ్య సఖ్యత దెబ్బతింది. నూర్జహాన్ తన అల్లుడు షహర్యార్‌ను సింహాసనానికి వారసుడిగా చేయాలని భావించగా, అసఫ్‌ఖాన్ తన అల్లుడు ఖుర్రంను బలపరిచాడు. దీంతో పరిపాలన వ్యవస్థ దెబ్బతింది. కాందహార్‌ను తిరిగి ఆక్రమించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఖుర్రం ఖుస్రూను వధించడం, మహబత్‌ఖాన్ తిరుగుబాటు మొదలైన సంఘటనలన్నీ దీని పర్యవసానంగా జరిగినవే.
* ఇంగ్లండ్ రాజు మొదటి జేమ్స్ ఆస్థానం నుంచి వచ్చిన కెప్టెన్ హాకిన్స్, సర్ థామస్ రో అనే రాయబారులు జహంగీర్ కాలంలో జరిగిన సంఘటనలను చక్కగా వర్ణించారు. వీరిద్దరు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి ఆంగ్లేయులు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అతడి అనుమతి పొందడానికి ప్రయత్నించారు. థామస్ రో కృషి ఫలితంగా సూరత్, ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్‌లలో ఆంగ్లేయులు తమ వర్తక స్థావరాలను నెలకొల్పారు.

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అక్బర్, జహంగీర్ ప‌రిపాల‌న‌

1. బాబర్ తన స్వీయ చరిత్ర 'బాబరునామా'ను ఏ భాషలో రచించాడు?
జ: తుర్కి

 

2. దిల్లీని తిరిగి ఆక్రమించి, రెండోసారి పట్టాభిషేకం జరుపుకున్న హుమయూన్ ఎంతకాలం పరిపాలించాడు?
జ: ఆరు నెలలు

 

3. అక్బర్ జిజియా పన్నును ఎప్పుడు నిషేధించాడు?
జ: 1564

 

4. బాల్య వివాహాలను, సతీసహగమనాన్ని నియంత్రించడానికి ప్రయత్నించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: అక్బర్

 

5. మేవాడ్ రాజ్యం మొగలుల వశం కావడానికి ప్రధాన కారకుడు ఎవరు?
జ: ఖుర్రం

 

6. అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరు?
జ: రాజా తోడర్‌మల్

 

7. జహంగీర్‌పై ఖుస్రూ తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిన సిక్కు గురువు ఎవరు?
జ: అర్జున్‌సింగ్

 

8. మేవాడ్ రాజు మొగలులతో ఏ సంవత్సరంలో సంధి చేసుకున్నాడు?
జ: 1615

 

9. మొగలులు ఎవరి కాలంలో కాందహార్‌ను కోల్పోయారు?
జ: జహంగీర్

 

10. నూర్జహాన్ అసలు పేరు?
జ: మెహరున్నీసా

 

11. జహంగీర్ ఆస్థానానికి తొలిసారిగా రాయబారులను పంపించిన ఇంగ్లండ్ రాజు ఎవరు?
జ: మొదటి జేమ్స్

 

12. ఎవరి కృషి ఫలితంగా ఆంగ్లేయులు సూరత్, ఆగ్రా, అహ్మదాబాద్‌లలో వర్తక స్థావరాలను స్థాపించారు?
జ: సర్ థామస్ రో

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సింధు నాగ‌రిక‌త‌ లేదా హర‌ప్పా నాగ‌రిక‌త‌

  క్రీస్తు పూర్వం దాదాపు 2500 సంవత్సరాల కిందట సింధు నది ప్రాంతంలో విలసిల్లిన నాగరికతే సింధు నాగరికత. 1921-22 సంవత్సరాల్లో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన ఈ సింధు నాగరికత యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. యూరప్, అమెరికా ప్రజలకు నాగలి, చక్రం గురించి తెలియకముందే భారతీయులు వాటిని ఫలప్రదంగా వినియోగించారంటే ఆశ్చర్యమే. ఈ సుసంపన్న నాగరికత భారతదేశంలోని వాయవ్య ప్రాంతంలో వెలిసింది. ఈ నాగరికత కాంస్య యుగానికి చెందింది.

 

సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత

  హరప్పా సంస్కృతి అత్యంత ప్రాచీన నాగరికతలైన ఈజిప్ట్, మెసపటోమియా నాగరికతలతో పోల్చదగింది. హరప్పా సంస్కృతిలోని ముఖ్యాంశాలైన పట్టణ నిర్మాణం, దానిలో వారు అవలంబించిన శాస్త్రీయ పద్ధతులు, ఆర్థిక విషయాలు, మతం, ఆచారాలు, మానసిక ఆనందం కోసం వారు ప్రోత్సహించిన కళలను పరిశీలిస్తే ఆ సంస్కృతి విశిష్టత మనకు అర్థమవుతుంది.

 

ముఖ్యమైన ప్రాంతాలు

  సింధు నాగరికత దాదాపు 1000 ప్రాంతాల్లో విస్తరించింది. ఈ నాగరికత క్రీ.పూ.3000 - క్రీ.పూ.1500 మధ్య కాలం నాటిది. సింధు నాగరికత ఉత్తరాన రూపర్ (పంజాబ్) నుంచి దక్షిణాన భగత్రావ్ (గుజరాత్) వరకు సుమారు 1100 కి.మీ. వ్యాపించి ఉండేది. పశ్చిమాన సుత్కాజెండర్ (పాకిస్థాన్ సరిహద్దు) నుంచి తూర్పున అలంగీర్‌పూర్ (ఉత్తర్ ప్రదేశ్) వరకు దాదాపు 1600 కి.మీ. విస్తరించింది.
సింధు నాగరికత కాలంలో బయటపడిన ప్రధాన నగరాలు, వాటి ఉనికి 

1. హరప్పా: పశ్చిమ పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్)

2. మొహంజోదారో: సింధ్ - లార్కానా జిల్లా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది.)

3. చాన్హుదారో: సింధ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)

4. సుత్కాజెండర్: పాకిస్థాన్ - ఇరాన్ సరిహద్దుల్లోని బెలూచిస్థాన్‌లో ఉంది.

5. రూపర్: పంజాబ్ (భారతదేశం)

6. బన్వాలీ: హరియాణాలోని హిస్సార్ జిల్లాలో ఉంది.

7. కాలిబంగన్: రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఉంది.

8. లోథాల్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది.

9. అలంగీర్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌కు సమీపంలో ఉంది.

10. రంగపూర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది.

11. సుర్కోటుడా: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉంది.

12. ధోలవీర: ఇది ప్రస్తుతం గుజరాత్‌లో ఉంది.

 

సింధు నాగరికత లక్షణాలు

నగర జీవనం 

  సింధు నాగరికత ముఖ్య లక్షణం పట్టణ ప్రణాళిక. ప్రతి పట్టణాన్ని దీర్ఘ చతురస్రాకారంలో సమాంతరంగా, అడ్డంగా ఏర్పరిచిన వీధులతో నిర్మించారు. కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు జరిపేవారు. ఇటుక పరిమాణం సమానంగా ఉండటం ఈ నాగరికతలోని మరో విశిష్టత. అంతస్తులున్న భవనాలు, ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, ఇంటిలోపల స్నానపు గదుల నిర్మాణం, వీధుల్లోని మురుగు కాల్వలను కలిపే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం విశేషం.

 

ఆర్థిక వ్యవస్థ

  సింధు నాగరికత అత్యున్నత దశకు చేరడానికి ప్రధాన కారణం వ్యవసాయం. ప్రధానమైన పంటలు గోధుమ, బార్లీ. లోథాల్, రంగపూర్‌లలో మాత్రం వరి పండించినట్లు ఆధారాలున్నాయి.
* ప్రధానమైన పంటలను రబీ (శీతాకాలం) పంటలుగా, ఇతర పంటలను ఖరీఫ్ (వేసవికాలం) పంటలుగా సాగు చేసేవారు. ప్రపంచంలో మొదటిసారిగా పత్తి పండించిన ఘనత సింధు ప్రజలకే దక్కుతుంది.
* సింధు నాగరికత కాలంలో వృత్తి విద్యలు కూడా అమల్లో ఉన్నాయి. కాంస్యకారులు, స్వర్ణకారులు, ముద్రలు తయారు చేసేవారు, నేతపనివారు, పడవలను నిర్మించేవారు; టెర్రకోటా, దంతపు బొమ్మలు తయారు చేసేవారు తదితరులు ఉండేవారు.

 

వర్తక వాణిజ్యాలు

  దేశీయ, విదేశీ వర్తకాలు కూడా ఎక్కువగా ఉండేవి. రాజస్థాన్, మహారాష్ట్ర, సౌరాష్ట్ర, దక్షిణ భారతదేశం, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ ప్రాంతాల్లో దేశీయ వర్తకం ఎక్కువగా జరిగేది. విదేశీ వాణిజ్యం ఎక్కువగా మెసపటోమియా, మధ్య ఆసియా, అఫ్గనిస్థాన్, పర్షియా, బహ్రెయిన్ మొదలైన దేశాలతో కొనసాగేది. ఎగుమతుల్లో ప్రధానమైనవి - నూలు వస్త్రాలు, ఆహార ధాన్యాలు.

 

రాజకీయ వ్యవస్థ

  సింధూ నాగరికత పాలనా వ్యవస్థపై చరిత్రకారులకు ఏకాభిప్రాయం కుదరలేదు. డి.డి.కోశాంబి అభిప్రాయం ప్రకారం పట్టణాలను పురోహిత వర్గం పాలించి ఉండాలి. అయితే, ఎక్కువమంది చరిత్రకారులు సింధు నాగరికత కాలంలో పట్టణాలను ఐశ్వర్యవంతులైన వ్యాపారులు పాలించి ఉంటారని భావించారు.
సామాజిక జీవనం: ముఖ్యంగా సమాజంలో నాలుగు వర్గాల ప్రజలు ఉండేవారు. 1) వైద్యులు, పురోహితులు, జ్యోతిష్యులు    2) యుద్ధవీరులు    3) చేతివృత్తులవారు, కళాకారులు     4) శారీరక శ్రమ చేసేవారు.

 

కళా స్వరూపాలు

  సింధు నాగరికత విశిష్టత నాటి కళా స్వరూపాల్లో ప్రతిబింబిస్తుంది. సింధు నాగరికత కాలంలోని ప్రజలు అపారమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి ముద్రికలు, కుండలు, బంకమట్టి బొమ్మలు, తమదైన లిపిని రూపొందించారు.
* ముద్రికలు కళా స్వరూపాల్లో అందమైనవి. వీటిని 'స్టియటైట్' అనే సున్నపురాయితో తయారు చేసేవారు. దాదాపు 2000 ముద్రికలను కనుక్కున్నారు. వీటిలో ఎక్కువగా 'మూపురంలేని ఎద్దు' కనిపిస్తుంది. వీరి లిపిని బొమ్మల లిపిగా పరిగణించారు.

 

మతవిశ్వాసాలు

  కుండల మీద చిత్రించిన బొమ్మలు, ముద్రలు, రాతి విగ్రహాలను బట్టి సింధు ప్రజల మత విశ్వాసాల గురించి తెలుసుకోవచ్చు. వీరి ప్రధాన దేవత అమ్మతల్లి. అలాగే శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. వృక్షాలను, లింగాన్ని కూడా పూజించినట్లు ఆధారాలు లభించాయి. స్నానాన్ని పవిత్ర కార్యంగా భావించేవారు. మూపురం లేని ఎద్దును పూజించేవారు. రాగి చెట్టును పవిత్రమైందిగా భావించేవారు.

 

సింధు నాగరికత పతనం

  సింధు నాగరికత పతనం గురించి కూడా చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్రీ.పూ.1700 నాటికి వరదల కారణంగా హరప్పా నాగరికత పతనమైంది. ఉపరితలానికి 50 నుంచి 80 అడుగుల ఎత్తులో కూడా కొన్నిచోట్ల ఇసుక మేటలు కనిపించాయి. కాబట్టి భారీ వరద సంభవించి నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉండొచ్చని చరిత్రకారుల ఊహ. అలాగే సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంతో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడ్డారనేది మరో అభిప్రాయం.
* పక్కనున్న ఎడారి విస్తరించడంతో ఇక్కడి భూములు బీడు భూములుగా మారి, సారం కోల్పోయి ఉంటాయని, ఆర్యుల దాడిలో ఈ నాగరికత నాశనమై ఉంటుందని మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం.

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సింధు నాగ‌రిక‌త‌ లేదా హర‌ప్పా నాగ‌రిక‌త‌

1. ఇరాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న హరప్పా నగరం ఏది?
జ: సుత్కాజెండర్

 

2. ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన నాగరికత ఏది?
జ: సింధు నాగరికత

 

3. గుర్రం అవశేషాలు బయటపడిన సింధు ప్రాంతం ఏది?
జ: సుర్కోటుడా

 

4. ఏ సింధు నాగరికతా ప్రాంతంలో ఒంటె ఆనవాళ్లు లభ్యమయ్యాయి?
జ: కాలిబంగన్

 

5. సింధు నాగరికతలో వరి పంటకి సంబంధించిన ఆధారాలు ఏ నగరాల్లో లభించాయి?
జ: లోథాల్, రంగపూర్

 

6. సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణమైన లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: గుజరాత్

 

7. ఉపఖండంలో మొదటిసారిగా స్థిర వ్యవసాయం జరిగిన ఆనవాళ్లు వెలుగు చూసిన ప్రాంతం ఏది?
జ: మెహర్‌ఘర్

 

8. లోథాల్, చాన్హుదారో పట్టణాలు ఏ పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచాయి?
జ: పూసల పరిశ్రమ

 

9. 'అమ్మతల్లి' ఆరాధకులైన సింధు ప్రజలు ఏ పురుష దేవుడిని పూజించేవారు?
జ: పశుపతి

 

10. సింధు ప్రజలు ముద్రికలను (Seals) దేనితో తయారు చేశారు?
జ: స్టియటైట్

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

దిల్లీ సుల్తానులు

1. దిల్లీ సుల్తాన్ రాజ్య స్థాపకుడు ఎవరు?
జ: కుతుబుద్దీన్ ఐబక్

 

2. కుతుబుద్దీన్ మొదటి రాజధాని ఏది?
జ: లాహోర్

 

3. దిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పాలించిన మొదటి వంశానికి చెందినవారిలో ఇల్బారి తెగకు చెందని వ్యక్తి ఎవరు?
జ: కుతుబుద్దీన్ ఐబక్

 

4. లాహోర్‌లో చౌగాన్ ఆట ఆడుతూ మరణించిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: కుతుబుద్దీన్ ఐబక్

 

5. కుతుబుద్దీన్ ఐబక్ ఏ సూఫీ మత గురువు పేరుమీదుగా కుతుబ్‌మీనార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు?
జ: కుతుబుద్దీన్ బక్తియార్ కకి

 

6. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత దిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన వ్యక్తి ఎవరు?
జ: ఆరామ్ షా

 

7. దిల్లీ సుల్తాన్ రాజ్య నిజమైన స్థాపకుడిగా పేరుపొందింది ఎవరు?
జ: ఇల్‌టుట్‌మిష్

 

8. ఇల్‌టుట్‌మిష్ ప్రవేశపెట్టిన వెండి నాణేలను ఏమంటారు?
జ: టంకా

 

9. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఏకైక ముస్లిం పాలకురాలు ఎవరు?
జ: రజియా

 

10. రజియా కాలంలో ఉన్నత స్థానాన్ని పొందిన జలాలుద్దీన్ యాకూత్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?
జ: అబిసీనియా

 

11. రజియాపై తిరుగుబాటు చేసిన అల్తునియా ఏ రాష్ట్ర గవర్నర్?
జ: భటిండా

 

12. ఏ విదేశీ యాత్రికుడి రచనలు దిల్లీ సుల్తాన్ల చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడలేదు?
జ: అబ్దుల్ రజాక్

 

13. దివాని అరిజ్ అనే సైనిక శాఖను ఏర్పాటుచేసిన సుల్తాన్ ఎవరు?
జ: బాల్బన్

 

14. ప్రజాభీష్టం మేరకు దిల్లీ సుల్తాన్ అయిన వ్యక్తి ఎవరు?
జ: రజియా

 

15. నసీరుద్దీన్ మహమ్మద్ నుంచి ఉలుగ్‌ఖాన్ బిరుదు పొందిన వ్యక్తి ఎవరు?
జ: బాల్బన్

 

16. ఇరాన్ నాయకుడు అఫ్రసియాబ్ సంతతికి చెందిన వ్యక్తిగా ఏ దిల్లీ సుల్తాన్‌ను పేర్కొంటారు?
జ: బాల్బన్

 

17. మొదటిసారిగా భారతదేశంలో పర్షియన్ నూతన సంవత్సర వేడుకలను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు?
జ: బాల్బన్

 

18. మంగోలుల దాడిలో మరణించిన బాల్బన్ కుమారుడు ఎవరు?
జ: మహమ్మద్

 

19. పక్షవాతంతో మరణించిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: కైకుబాద్

 

20. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు?
జ: జలాలుద్దీన్ ఖిల్జీ

 

21. అల్లావుద్దీన్ ఖిల్జీ మొదటి దండయాత్ర ఏ ప్రాంతంపై జరిగింది?
జ: గుజరాత్

 

22. అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో ఓటమి పొందిన మేవాడ్ రాజు ఎవరు?
జ: రతన్ సింగ్

 

23. గుజరాత్ ఆక్రమణ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరిని గుజరాత్ గవర్నర్‌గా నియమించాడు?
జ: అల్ప్ ఖాన్

 

24. పద్మవత్ గ్రంథ రచయిత ఎవరు?
జ: మాలిక్ మహమ్మద్ జయసి

 

25. క్రీ.శ.1305లో మాల్వాను ఆక్రమించిన అల్లావుద్దీన్ సేనాని ఎవరు?
జ: ఐన్-ఉల్-ముల్క్ ముల్తాని

 

26. మాలిక్ కఫూర్ చేతిలో ఓటమి పొందిన కాకతీయరాజు ఎవరు?
జ:  రెండో ప్రతాపరుద్రదేవుడు

 

27. ఘియాజుద్దీన్ తుగ్లక్ అసలు పేరు ఏమిటి?
జ: ఘాజి మాలిక్

 

28. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు?
జ: భాగ

 

29. జౌహార్ పద్ధతి గురించి తన రచనలో పేర్కొన్నది ఎవరు?
జ: అమీర్ ఖుస్రూ

 

30. పన్ను బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయడానికి అల్లావుద్దీన్ ఏర్పాటుచేసిన నూతన శాఖ ఏది?
జ: దివాని ముస్తక్‌రాజ్

 

31. గుర్రాలకు ముద్రలు వేసే విధానాన్ని ప్రవేశపెట్టిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: అల్లావుద్దీన్ ఖిల్జీ

 

32. మార్కెట్ల నియంత్రణ కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ నియమించిన అధికారిని ఏమని పిలిచేవారు?
జ: షెహ్న-ఇ-మండి

 

33. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ సంవత్సరంలో మరణించాడు?
జ: 1316

 

34. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో గుర్రాల వ్యాపారం ఎవరి ఆధీనంలో ఉండేది?
జ: ఆఫ్ఘన్లు

 

35. తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు?
జ: ఘియాజుద్దీన్ తుగ్లక్

 

36. తుగ్లక్‌లు ఏయే తెగలకు చెందినవారు?
జ: కరౌనా టర్క్

 

37. తుగ్లకాబాద్‌ను నిర్మించిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: ఘియాజుద్దీన్ తుగ్లక్

 

38. మహమ్మద్‌బీన్ తుగ్లక్ అసలు పేరు ఏమిటి?
జ: జునాఖాన్

 

39. అజ్‌మేర్ (అజ్మీర్)లోని మొయినుద్దీన్ చిష్టీ సమాధిని సందర్శించిన మొదటి దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: మహమ్మద్ తుగ్లక్

 

40. మహమ్మద్‌బీన్ తుగ్లక్ తన రాజధానిని దిల్లీ నుంచి ఎక్కడకు మార్చాడు?
జ: దౌలతాబాద్

 

41. 'ప్రతి హిందువు ఇల్లూ టంకశాలగా మారింది' అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు?
జ: జియావుద్దీన్ బరానీ

 

42. 'చావ్' అనే కాగితపు కరెన్సీని ప్రవేశపెట్టిన మంగోల్ పాలకుడు ఎవరు?
జ: కుబ్లాయ్ ఖాన్

 

43. దిల్లీ సుల్తాన్‌ల కాలంలో వ్యవసాయ శాఖను ఏమని పిలిచేవారు?
జ: దివాన్-ఇ-కోహి

 

44. కిందివాటిలో మహమ్మద్‌బీన్ తుగ్లక్ కాలంలో ఏర్పాటు చేయని రాజ్యం ఏది?
  ఎ) విజయనగర సామ్రాజ్యం   బి) బహమనీ రాజ్యం   సి) మదురై సుల్తాన్ రాజ్యం   డి) కాకతీయ సామ్రాజ్యం
జ: డి(కాకతీయ సామ్రాజ్యం)

 

45. మహమ్మద్‌బీన్ తుగ్లక్ మరణించిన థట్టా ఏ రాష్ట్రంలో ఉంది?
జ: సింధ్

 

46. బ్రాహ్మణుల నుంచి కూడా జిజియా పన్ను వసూలు చేసిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: ఫిరోజ్ షా తుగ్లక్

 

47. వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక కాలువలు తవ్వించిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: ఫిరోజ్ షా తుగ్లక్

 

48. సివిల్, సైనిక పోస్టులను వారసత్వ పద్ధతిలో ఇచ్చిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: ఫిరోజ్ షా తుగ్లక్

 

49. తైమూరు దండయాత్ర సమయంలో దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: నసీరుద్దీన్ మహమ్మద్

 

50. మధ్యయుగ చరిత్రలో బాగా చదువుకున్న ముస్లిం పాలకుడిగా పేరుపొందింది ఎవరు?
జ: మహమ్మద్‌బీన్ తుగ్లక్

 

51. రెండో అలెగ్జాండర్‌గా పేరుపొందిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: అల్లావుద్దీన్ ఖిల్జీ

 

52. ఏ దక్షిణ భారత రాజ్యం దిల్లీ సుల్తాన్ రాజ్యంలో కలవలేదు?
జ: హోయసాలుల రాజ్యం

 

53. సైన్యంలో అత్యున్నత పదవిని అలంకరించిన వ్యక్తిని ఏమని పిలిచేవారు?
జ: ఖాన్

 

54. భూమిశిస్తుగా 50 శాతం ఉత్పత్తిని వసూలు చేసిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: అల్లావుద్దీన్ ఖిల్జీ

 

55. ఖలీఫా అధికారాన్ని గుర్తించడానికి అంగీకరించని సుల్తాన్ ఎవరు?
జ: కుతుబుద్దీన్ ముబారక్

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

1857 సిపాయిల తిరుగుబాటు

  ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టం. ఈ తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక కారణాలుగా విభజించవచ్చు.

 

రాజకీయ కారణాలు

  భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఆంగ్లేయులు అనేక పద్ధతులు అనుసరించారు. యుద్ధాలు, సైన్య సహకార పద్ధతి, పరిపాలన సరిగా లేదనే నెపంతో సామ్రాజ్యాన్ని విస్తరించారు. డల్హౌసీ మరో అడుగు ముందుకువేసి రాజ్యసంక్రమణం సిద్ధాంతం ద్వారా అయోధ్య, సతారా, నాగ్‌పూర్, ఝూన్సీ మొదలైన సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. పీష్వా దత్తకుమారుడైన నానాసాహెబ్‌కు భరణాన్ని నిరాకరించాడు. కర్ణాటక, తంజావూర్, తిరువాన్కూర్ రాజుల బిరుదులు రద్దు చేశాడు. మొగలు చక్రవర్తి నివాసాన్ని ఎర్రకోట నుంచి కుతుబ్‌మీనార్‌కు దగ్గరగా మార్చాలని, బహదూర్ షా తర్వాత మొగల్ చక్రవర్తి బిరుదును రద్దు చేయాలని ప్రతిపాదించాడు. దీంతో స్వదేశీ రాజుల్లో భవిష్యత్తు గురించి ఆందోళన మొదలైంది. ఆంగ్లేయుల జాతి వివక్ష, వారు తమ పట్ల చూపిన నిరాదరణ ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. ఇలాంటి వారంతా 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు.

 

ఆర్థిక కారణాలు

  రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల అనేక రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమై ఆయా రాజ్యాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, గాయకులు, కవులు, విద్వాంసులు నిరుద్యోగులై సిపాయిలుగా మారారు. వీరంతా పని లేక, తినడానికి తిండి లేక అలమటించారు. కంపెనీ ప్రభుత్వం భారతదేశంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను నిర్లక్ష్యం చేసింది. కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. క్షీణించిన ఆర్థిక పరిస్థితి తిరుగుబాటుకు పురికొల్పింది.

 

సాంఘిక కారణాలు

  1829లో విలియం బెంటింక్ సతీసహగమనం నిషేధ చట్టం చేశాడు. లార్డ్ డల్హౌసీ 1856లో వితంతు పునర్వివాహ చట్టం చేశాడు. 1856లో మతం మార్చుకున్న వారికి ఆస్తి హక్తులను పరిరక్షిస్తూ భారతీయ వారసత్వ చట్టం వచ్చింది. బాల్యవివాహాల నిషేధ చట్టం లాంటి సంస్కరణలు తమ సనాతన ధర్మానికి విరుద్ధమని హిందువులు అభిప్రాయపడ్డారు. 1853లో లార్డ్ డల్హౌసీ రైల్వే, తంతి తపాల లాంటి ఆధునికీకరణ విధానాలు ప్రజల్లో సంచలనాన్ని సృష్టించాయి. తమ ఆచారబద్ధమైన జీవన విధానాన్ని నాశనం చేయడానికి బ్రిటిష్‌వారు ఈ ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెట్టారని కొందరు భావించారు. ప్రభుత్వం చట్టాల ద్వారా తమ మతధర్మాలను నాశనం చేస్తోందని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.

 

మత కారణాలు

  క్రైస్తవులైన ఆంగ్లేయులు హిందువులందరినీ క్రైస్తవ మతంలోకి మారుస్తారనే అనుమానం ప్రజల్లో ఏర్పడింది. క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. 1853 ఛార్టర్ చట్టంలో క్రైస్తవ మిషనరీలకు సౌకర్యాలు కల్పించటం, ఇంగ్లిష్ విద్యావ్యాప్తికి నిధులను కేటాయించడం లాంటివి ప్రజల్లో ఆందోళన కలిగించాయి. మత మార్పిడులను ప్రోత్సహించి భారతదేశాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చడానికి బిట్రిష్‌వారు ప్రయత్నిస్తున్నారనే భావన భారతీయుల్లో ఏర్పడింది. దీంతో ప్రజలు కంపెనీ పాలన పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారు.

 

సైనిక కారణాలు

  ఈస్టిండియా కంపెనీలో రెండు రకాల సైనికులున్నారు. బతుకు తెరువు కోసం కంపెనీలో సైనిక ఉద్యోగులుగా చేరిన భారతీయులను సిపాయిలు అని పిలిచేవారు. ఆంగ్లేయులను సైనికులుగా పిలిచేవారు. వీరిద్దరి మధ్య హోదాలు, జీతభత్యాల్లో చాలా తేడా ఉండేది. సిపాయి, సైనికుల నిష్పత్తి 4 : 1 గా ఉండేది. 1856లో లార్డ్ కానింగ్ సామాన్య సేవా నియుక్త చట్టం (జనరల్ సర్వీసెస్ ఎన్‌లిస్ట్‌మెంట్ యాక్ట్) ప్రవేశపెట్టి సిపాయిలు ఏ ప్రాంతానికైనా వెళ్లి యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సముద్ర ప్రయాణం నిషేధం. కులం, మతాన్ని సూచించే చిహ్నాలను తీసివేయాలనే ఉత్తర్వులు సిపాయిలను మరింత భయాందోళనకు గురిచేశాయి.

* కొన్నేళ్లుగా తీవ్ర అసంతృప్తికి లోనైన సిపాయిలు 1849, 1850, 1852లో తమ నిరసనలను తిరుగుబాట్ల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి ఈ అసంతృప్తి తారస్థాయికి చేరుకుంది.

* మొదటి అఫ్గన్ యుద్ధంలో, సిక్కు యుద్ధాల్లో ఆంగ్లేయులకు సంభవించిన ఓటమి చూసి వారు అజేయులు అనే భావం పోయింది. కలిసి పోరాడితే ఆంగ్లేయులను ఓడించడం కష్టమేమీ కాదని సిపాయిలు భావించారు.

 

తక్షణ కారణం

  ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం 1856లో ఎన్‌ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టింది. వీటిలో ఉపయోగించే తూటాల చివరి భాగాన్ని సైనికులు నోటితో కొరికి తుపాకిలో అమర్చాల్సి ఉండేది. ఆ తూటాలకు ఆవు, పంది కొవ్వు పూసినట్లు ప్రచారం జరిగింది. ఆవు హిందువులకు పవిత్రమైంది. ముస్లింలు పందిని అపవిత్రంగా భావిస్తారు. దీంతో ఆంగ్లేయులు తమ మతాలను బుద్ధిపూర్వకంగా కించపరచడానికే ఈ పని చేశారని సిపాయిలు విశ్వసించారు.

 

తిరుగుబాటు ప్రారంభం

  1857 ఫిబ్రవరి 26న బరాక్‌పూర్‌లోని 19వ పటాలం సైనిక కవాతులో పాల్గొనలేదు. 1857 మార్చి 29న బారక్‌పూర్‌లోని 34వ పటాలానికి చెందిన మంగళ్ పాండే అనే సిపాయి తూటాలను వాడటానికి నిరాకరించాడు. లెఫ్టినెంట్ బాగ్ అనే ఆంగ్లేయ సైనిక అధికారిని కాల్చిచంపాడు. దీంతో మంగళ్ పాండేని ఉరితీశారు. సిపాయిలు కొత్త రకం తూటాలను ఉపయోగించడానికి నిరాకరించడంతో అధికారులు వారందరినీ శిక్షించారు. ఆరుగురిని సైనిక న్యాయస్థానంలో విచారించి 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు.

* 1857 మే 10న మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ఆనాటి బిట్రిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. సిపాయిలు దిల్లీ చేరుకుని చివరి మొగల్ చక్రవర్తి రెండో బహదూర్ షాను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. సిపాయిలు వీరోచితంగా పోరాడినా తిరుగుబాటు విఫలమైంది.
 

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

1857 సిపాయిల తిరుగుబాటు

1. డల్హౌసీ ప్రవేశ పెట్టిన విధానం ఏది?
జ: రాజ్యసంక్రమణ విధానం

 

2. 1856లో సామాన్య సేవా నియుక్త చట్టం చేసింది ఎవరు?
జ: కానింగ్

 

3. ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించిన ఆంగ్లేయ సేనాని ఎవరు?
జ: సర్ హ్యురోజ్

 

4. మొదటి భారత రాజ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు?
: ఛార్లెస్ ఉడ్

 

5. నానాసాహెబ్ అసలు పేరేంటి?
జ: దోండుపంత్

 

6. భారతదేశంలో మొదటి వైస్రాయిగా నియమితుడైన వ్యక్తి?
జ: కానింగ్

 

7. 1857 తిరుగుబాటుకు కారణం/ కారణాలు...?
     1) రాజ్య సంక్రమణ సిద్ధాంతం           2) ఆంగ్లేయుల భూమి శిస్తు విధానం
     3) ఆంగ్లేయుల ఆర్థిక విధానాలు      4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)

 

8. క్రైస్తవ మిషనరీలను భారతదేశంలోకి ఎప్పుడు అనుమతించారు?
జ:1813

 

9. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏది?
జ: ఎన్‌ఫీల్డ్ తుపాకులు

 

10. 1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు చేసిన మొదటి వ్యక్తి?
జ: మంగళ్‌పాండే

 

11. 1857 తిరుగుబాటు ఎక్కడ మొదలైంది?
జ: మీరట్

 

12. 1857 తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1857 మే 10

 

13. 1858లో భారతదేశ పరిపాలనను స్వీకరించిన బ్రిటిష్ రాణి?
జ: మొదటి విక్టోరియా

 

14. రెండో బహదూర్ షా ఎప్పుడు మరణించాడు?
జ: 1862

 

15. 1856లో వితంతు పునర్వివాహ చట్టం తీసుకు వచ్చింది ఎవరు?
జ: లార్డ్ డల్హౌసీ

 

16. 1857 తిరుగుబాటు ప్రధాన ఫలితం ఏది?
     1) ఈస్టిండియా కంపెనీ పాలన రద్దు      2) బ్రిటిష్ ప్రభుత్వం భారతపాలన చేపట్టింది
     3) భారతీయులపట్ల బ్రిటిష్ విధానాలు, దృక్పథాలు మారాయి      4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తెలంగాణ పర్యటక రంగం

  పర్యటక రంగం ఇటీవల కాలంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) వినూత్నమైన కార్యకలాపాలతో దేశీయ, విదేశీ పర్యటకులను సైతం ఆకర్షిస్తోంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం లభించడమే కాకుండా అంతర్జాతీయ సదవగాహన ఏర్పడేందుకు తోడ్పడుతుంది. దేశీయంగా పర్యటక, సాంస్కృతిక యాత్రలవల్ల జాతీయ ఐకమత్యం పెంపొందుతుంది.

  తెలంగాణ అతి ప్రాచీన చరిత్ర ఉన్న రాష్ట్రం. వైదికతత్వం, జైన, బౌద్ధ మతాలకు కేంద్రంగా కూడా ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. రాష్ట్రమంతటా వందలాది యాత్రాస్థలాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా రిసార్ట్స్, ఇకో టూరిజం (Eco-Tourism) ద్వారా జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, జూ పార్కులు, పక్షుల సంరక్షణా కేంద్రాలు ఉన్నాయి. నదులు, సరస్సులపై పడవ ప్రయాణాలను ప్రోత్సహిస్తోంది. అందుకే నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ మ్యాగజీన్ ప్రచురించిన 'ప్రపంచంలో చూడాల్సిన 20 ప్రదేశాలు 2015' జాబితాలో హైదరాబాద్ రెండో ర్యాంకును సాధించింది.

 

చారిత్రక ప్రదేశాలు:

  తెలంగాణ పర్యటక శాఖ రాష్ట్రంలోని అనేక చారిత్రక స్థలాలను కాలానుగుణంగా పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. ఇందులో ముఖ్యమైనవి: నిజాం ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన ధ్వని, కాంతి ప్రదర్శన, తారామతి బారాదరి, చార్మినార్ విద్యుద్దీపాలంకరణ, కుతుబ్‌షాహీ సమాధులు మొదలైనవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుతుబ్‌షాహీ సమాధులను పర్యటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం, అగాఖాన్ ట్రస్ట్‌ల సహాయాన్ని తీసుకుంటోంది.

 

మతసంబంధమైన ప్రదేశాలు:

  తెలంగాణ రాష్ట్రంలో అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి: హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్ ఒడ్డున ఉన్న చిలుకూరు బాలాజీ మందిరం; సీతారామచంద్రస్వామి ఆలయం, భద్రాచలం - ఖమ్మం జిల్లా; సరస్వతి ఆలయం, బాసర - ఆదిలాబాద్ జిల్లా; లక్ష్మీనరసింహస్వామి మందిరం, యాదగిరిగుట్ట - నల్గొండ జిల్లా; వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి మందిరం; హనుమాన్ మందిరం - కొండగట్టు; నరసింహస్వామి ఆలయం, ధర్మపురి - కరీంనగర్ జిల్లా. రామప్ప దేవాలయం, పాలంపేట - వరంగల్ జిల్లా; అలంపూర్ జోగులాంబ మందిరం - మహబూబ్‌నగర్ జిల్లా; హైదరాబాద్‌లోని మక్కా మసీదు; బిర్లా మందిర్; మెదక్ చర్చ్ మొదలైనవి.

* ఈ మతపరమైన ప్రదేశాలే కాకుండా భిన్నమైన సాంస్కృతిక సంపద కూడా తెలంగాణలో ఉంది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ....

బోనాలు: తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా అభివర్ణించింది. బోనాలు పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి మందిరం, లాల్‌దర్వాజలోని మైసమ్మ మందిరాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు.

బతుకమ్మ జాతర: ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ. ఈ పండుగ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.పది కోట్లు మంజూరు చేస్తోంది.

సమ్మక్క-సారలమ్మ జాతర: ఈ జాతరనే మేడారం జాతర అని కూడా అంటారు. ఈ పండుగను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు. కుంభమేళా తర్వాత అంతటి జనసందోహం ఈ జాతరకు వస్తుందని ఒక అంచనా. 2014 లో సుమారు కోటి మందికి పైగా ఈ జాతరకు హాజరయ్యారు.

 

గ్రామీణ పర్యటక కేంద్రాలు

  హస్తకళలలో తెలంగాణది అందెవేసిన చేయి. ఇక్కడి హస్తకళా సామగ్రికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. భారత ప్రభుత్వం గుర్తించిన కొన్ని అతి ముఖ్యమైన ప్రాజెక్టులు:

* పోచంపల్లి గ్రామీణ పర్యటక ప్రాజెక్టు - నల్గొండ
* నిర్మల్ గ్రామీణ పర్యటక ప్రాజెక్టు - ఆదిలాబాద్
* చెరియాల్ గ్రామీణ పర్యటక ప్రాజెక్టు - వరంగల్
* పెంబర్తి గ్రామీణ పర్యటక ప్రాజెక్టు - వరంగల్
ఇకో టూరిజం: రాష్ట్రంలో అనేక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, అడవులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రకృతి అందాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అడవులు, లేక్ రిసార్ట్స్‌లలో ఇకోటూరిజం ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. వీటిలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు:
* అలీసాగర్ జింకల పార్కు - నిజామాబాద్
* ఏటూరు నాగారం వన్యమృగ సంరక్షణ కేంద్రం - వరంగల్
* పాకాల్ వన్యమృగ రక్షణ కేంద్రం - వరంగల్
* కవ్వాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - ఆదిలాబాద్
* జన్నారం వన్యమృగ సంరక్షణ కేంద్రం - ఆదిలాబాద్
* శివరాం వన్యమృగ సంరక్షణ కేంద్రం - ఆదిలాబాద్
* భీముని పాదం జలపాతం - వరంగల్
* మంజీర పక్షుల సంరక్షణ కేంద్రం - సంగారెడ్డి
* పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - మెదక్
* షామీర్‌పేట్ జింకల పార్కు - హైదరాబాదు
* మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు - హైదరాబాద్
* కుంతల జలపాతం - ఆదిలాబాద్
* ఎత్తిపోతల జలపాతం - నల్గొండ

 

వారసత్వ పర్యటక ప్రదేశాలు:

  తెలంగాణలో వారసత్వ సంపదకు చిహ్నాలైన అనేక రాచకోటలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి తెలంగాణ ప్రభుత్వం, అటవీశాఖ, పర్యటక శాఖల ఆధ్వర్యంలో ఉన్నాయి.

* వీటిలో కొన్ని ముఖ్యమైనవి: గోల్కొండ కోట, మెదక్ కోట, ఖమ్మం ఖిల్లా, నిజామాబాద్ కోట, ఎలగందుల కోట, కరీంనగర్ కోట, భువనగిరి కోట, వరంగల్ కోట మొదలైనవి.
* ప్రపంచస్థాయి వసతులు కలిగిన తెలంగాణ కళాభారతి (హైదరాబాద్), కాళోజీ కళాకేంద్రాలను (వరంగల్) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* కళలను ప్రోత్సహించడానికి రాచకొండ (నల్గొండ - రంగారెడ్డి జిల్లా)లో 2000 ఎకరాల్లో మెగా సినిమా సిటీని ఏర్పాటు చేయనున్నారు.

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తెలంగాణ పర్యటక రంగం

1. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ కళాకేంద్రాన్ని ఎక్కడ నిర్మించనుంది?
జ: వరంగల్

 

2. ఏటూరు నాగారం వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
జ: వరంగల్

 

3. సమ్మక్క, సారలమ్మ జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు?
జ: ప్రతి రెండు సంవత్సరాలకు

 

4. హైదరాబాద్‌లోని 'లాల్ దర్వాజ' దేనికి ప్రసిద్ధి?
జ: మైసమ్మ మందిరం

 

5. కరీంనగర్‌లోని ధర్మపురి ఆలయం ఏ దేవుడు/ దేవతకి ప్రసిద్ధి?
జ: నరసింహస్వామి

 

6. కుతుబ్‌షాహీ సమాధులను పర్యటక ప్రదేశంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని ఎవరు అందిస్తున్నారు?
జ: అగాఖాన్ ట్రస్ట్

 

7. నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ మ్యాగజీన్ ప్రచురించిన 'ప్రపంచంలో చూడాల్సిన 20 ప్రదేశాలు 2015' జాబితాలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
జ: 2

 

8. జన్నారం వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
జ: ఆదిలాబాద్

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సంగం యుగం

1. సంగం యుగం నాటి కవి, పండితులను పోషించిన రాజవంశం ఏది?
జ: పాండ్య

 

2. 'సంగం' గురించి మొదట ప్రస్తావించింది ఎవరు?
జ: తిరునావుక్కరసు

 

3. సంగం అంటే...?
జ: కవి పండిత పరిషత్

 

4. మొదటి సంగాన్ని ఎక్కడ నిర్వహించారు?
జ: తెన్‌మదురై

 

5. రెండో సంగానికి సంబంధించి లభిస్తున్న ఏకైక గ్రంథం ఏది?
జ: తొల్కప్పియర్

 

6. కిందివాటిలో సంగం సాహిత్యంలో భాగం కానిది?
ఎ) ఎట్టుతొగై       బి) పత్తుప్పాట్టు       సి) పదినెన్ కీల్‌కనక్కు       డి) మత్తవిలాస ప్రహసనం
జ: డి (మత్తవిలాస ప్రహసనం)

 

7. తొల్కప్పియం గ్రంథం ఏ విషయానికి సంబంధించింది?
జ: వ్యాకరణం

 

8. మధురైక్కంజి గ్రంథ రచయిత ఎవరు?
జ: మంగుడి మరుదన్

 

9. సంగం యుగం నాటి 'కురింజి' విభాగం దేనికి సంబంధించింది?
జ: కొండలు

 

10. కురల్ గ్రంథ రచయిత ఎవరు?
జ: తిరువళ్లువార్

 

11. తమిళ భూమికి చెందిన బైబిల్‌గా ప్రసిద్ధిచెందిన గ్రంథం ఏది?
జ: తిరుక్కురల్

 

12. శిలప్పధికారం గ్రంథ రచయిత ఎవరు?
జ: ఇలంగో అడిగల్

 

13. సంగం యుగం నాటి లలితకళల అభివృద్ధి గురించి తెలిపే గ్రంథం ఏది?
జ: మణిమేఖలై

 

14. దక్షిణ భారత రాజ్యాల్లో మెగస్తనీస్ పేర్కొన్న మొదటి రాజ్యం ఎవరిది?
జ: పాండ్యులు

 

15. తమిళ రాజ్యాల గురించి ప్రస్తావించిన మొదట శాసనం ఏది?
జ: అశోకుని శాసనాలు

 

16. నక్కీరర్ ఎవరి ఆస్థాన కవి?
జ: నెడుం జెళియన్

 

17. సంగం యుగం నాటి చోళుల రాజధాని?
జ: ఉరయూర్

 

18. సంగం యుగం నాటి చోళుల్లో ప్రసిద్ధుడు?
జ: కరికాలుడు

 

19. చేర రాజుల రాజధాని ఏది?
జ: వంజి

 

20. చేర రాజుల్లో గొప్పవాడు ఎవరు?
జ: సెంగుట్టువాన్

 

21. చోళుల భూభాగాన్ని ఏమని పిలిచేవారు?
జ: తొండై మండలం

 

22. కొర్కై (Korkai) ఎవరి ఓడ రేవు?
జ: పాండ్యులు

 

23. చోళుల రాజ చిహ్నం ఏది?
జ: పులి

 

24. సంగం యుగంలో రాజు పుట్టినరోజు సంబరాలను ఏమని పిలిచేవారు?
జ: పెరునాల్

 

25. రాజ్యాన్ని ఎలా విభజించారు?
జ: మండలం

 

26. తీర ప్రాంత పట్టణాన్ని ఏమని పిలిచేవారు?
జ: పట్టిణం

 

27. సంగం యుగంలో రథాలను లాగేందుకు ఉపయోగించిన జంతువులు ఏవి?
ఎ) ఎద్దులు       బి) గుర్రాలు       సి) ఎ, బి       డి) ఏనుగులు
జ: సి (ఎద్దులు, గుర్రాలు)

 

28. సైనికుల శరీరాన్ని కాపాడటానికి ఏ జంతువు చర్మంతో తయారుచేసిన కవచాన్ని వాడేవారు?
జ: పులి

 

29. యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం పాతే రాళ్లను ఏమని పిలిచేవారు?
జ: వీరక్కల్

 

30. సంగం యుగంలో కిందివాటిలో క్రూరమైన నేరం కానిది?
జ: పన్నులు చెల్లించకపోవడం

 

31. సంగం యుగంలో రైతులను ఏమని పిలిచేవారు?
జ: వెల్లాలర్

 

32. సంగం యుగంనాటి ముఖ్య దేవత?
జ: మురుగన్

 

33. కిందివాటిలో మురుగన్‌కు మరో పేరు కానిది?
ఎ) కార్తికేయ       బి) సుబ్రమణ్యం       సి) స్కంద       డి) భాస్కర
జ: డి (భాస్కర)

 

34. సంగం కాలంలో కృష్ణుడిని పూజించిన వర్గం?
జ: గొర్రెల కాపరులు

 

35. ఉరయూర్ ఏ వ్యాపారానికి ప్రసిద్ధిగాంచింది?
జ: నూలు వస్త్రాలు

 

36. సంగం యుగంనాటి తమిళులు ఏ దేశంతో విదేశీ వ్యాపారం నిర్వహించలేదు?
జ: చైనా

 

37. సంగం యుగంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన గ్రీకు, రోమన్ వర్తకులను తమిళ సాహిత్యంలో ఏమని పేర్కొన్నారు?
జ: యవనులు

 

38. సంగం సాహిత్యంలో గొప్ప పురాణ గ్రంథం కానిది?
జ: పత్తుప్పాట్టు

 

39. సంగం యుగం చివరి కాలంలో చేర రాజులతో నిరంతరం యుద్ధాలు చేసిన రాజవంశం ఏది?
జ: పాండ్య

 

40. సంగం యుగంనాటి గూఢచారులను ఏమని పిలిచేవారు?
జ: ఒర్రర్

 

41. మండలాన్ని ఎలా విభజించారు?
జ: నాడు

 

42. చోళరాజు కరికాలుడు కావేరి నదిపై నిర్మించిన ఆనకట్ట వల్ల నీటిపారుదల సౌకర్యం పొందిన ప్రాంతం ఏది?
జ: దక్షిణ తంజావూర్

 

43. సంగం యుగ కాలంలో రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసిన జంతువు/ పక్షి ఏది?
జ: నెమలి

 

44. క్రీ.పూ.20లో రోమన్ చక్రవర్తి అగస్టస్ ఆస్థానానికి రాయబారిని పంపిన తమిళ రాజు ఏ రాజ్యానికి చెందినవాడు?
జ: పాండ్య

 

45. కిందివాటిలో ప్రధానంగా దిగుమతి చేసుకున్నది?
ఎ) బంగారం, వెండి       బి) కుండలు       సి) మద్యం       డి) వస్త్రాలు
జ: ఎ (బంగారం, వెండి)

 

46. కన్నగి విగ్రహాన్ని రూపొందించడానికి హిమాలయాల నుంచి రాయిని తీసుకువచ్చినట్లుగా ఏ చేర రాజు గురించి చెబుతారు?
జ: సెంగుట్టవాన్

 

47. రోమన్లు ఏ విషయంలో భారతీయ జీవనాన్ని, సంస్కృతిని పెద్దగా ప్రభావితం చేయలేదు?
జ: అలంకరణ

 

48. కింది సంగం యుగం నాటి గ్రంథాల్లో బౌద్ధ మతం గురించి గొప్పగా పేర్కొన్నది?
ఎ) మణిమేఖలై       బి) శిలప్పధికారం       సి) కురల్       డి) తొల్కప్పియం
జ: ఎ (మణిమేఖలై)

 

49. పుహార్‌లో ఏ దేవుని గౌరవార్థం గొప్ప పండుగను నిర్వహించినట్లు సంగం పురాణాల్లో పేర్కొన్నారు?
జ: ఇంద్రుడు

 

50. ఎక్కడ నిర్వహించిన పురావస్తు తవ్వకాలు దక్షిణ భారతదేశంతో రోమన్‌ల వ్యాపారం గురించి తెలియజేయడం లేదు?
జ: పల్లవనేశ్వరం

 

51. పుహార్‌లోని మత్స్యకారుల జీవితం గురించి తెలియజేసే గ్రంథం ఏది?
జ: పట్టినప్పాలై

 

52. సంగం యుగం నాటి ప్రధాన ఎగుమతుల్లో ఒకటి కానిది?
జ: ఉల్లిపాయలు

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సిక్కు మతం

సిక్కు మత స్థాపకుడు గురు నానక్. ఈయన పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉన్న తల్వండి అనే గ్రామంలో జన్మించాడు. పంజాబ్ గవర్నర్ వద్ద గణాంక అధికారిగా పనిచేశాడు. ఏ వ్యక్తికైనా ఒక ఆధ్యాత్మిక గురువు లేకపోతే పరిపూర్ణత లభించదని పేర్కొన్నాడు. భగవంతుడు ఒక్కడే, అతడు నిరాకారుడు అని బోధించాడు.

  గురు నానక్ శీలానికి, నిర్మలత్వానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఇతడి బోధనలు ఆదిగ్రంథ్ అనే సంకలనంగా వెలువడ్డాయి. గురు నానక్ కబీర్‌కు సమకాలీకుడు.
* నానక్ భార్య పేరు సులాఖని. ఇతడి కుమారులు శ్రీచంద్, లక్ష్మీచంద్.
* గురు నానక్ కార్యకలాపాలకు పంజాబ్ కేంద్రమైంది. పర్షియా, హిందీ, పంజాబీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. హిందూ, ముస్లింల ఐక్యతను ప్రచారం చేసిన గురునానక్ పేద ప్రజల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు.
* పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో 1538 లో గురు నానక్ మరణించాడు. ఇతడి శిష్యులు 'సిక్కులు' అయ్యారు.

గురు అంగద్: నానక్ తన వారసుడిగా గురు అంగద్ పేరును ప్రకటించాడు. గురు అంగద్ సిక్కు ప్రవచనాల కోసం గురుముఖిని మాధ్యమంగా ఎన్నుకున్నాడు. లంగర్ అనే వంటశాలను ఏర్పాటు చేశాడు. గురు నానక్ జీవిత చరిత్రను రచించాడు. సిక్కుల్లో క్రమశిక్షణను ప్రవేశపెట్టాడు.

గురు అమర్‌దాస్: సిక్కుల మూడో గురువు గురు అమర్‌దాస్. ఇతడు సిక్కు మతవ్యాప్తి కోసం 22 ఆధ్యాత్మిక సూత్రాలను ప్రవేశపెట్టాడు. మొగలు చక్రవర్తి హుమయూన్‌కు ఇతడి ఆశీస్సులు లభించాయి.

గురు రామ్‌దాస్: సిక్కుల నాలుగో గురువు గురు రామ్‌దాస్. మొగలు చక్రవర్తి అక్బర్‌కు ఈయన పట్ల అమితమైన గౌరవ భావం ఉండేది. అక్బర్ చక్రవర్తి స్వర్ణ దేవాలయ నిర్మాణానికి భూమిని దానం చేశాడు. సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణదేవాలయం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఉంది.

గురు అర్జున్ సింగ్: సిక్కుల అయిదో గురువు గురు అర్జున్‌సింగ్. ఇతడు ఆదిగ్రంథ్‌ను సంకలనం చేశాడు (సిక్కుల పవిత్ర గ్రంథం). అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయాన్ని నిర్మించాడు. ప్రతి సిక్కు తన సంపాదనలో  వ వంతు సిక్కు గురువులకు ఇవ్వాలని పేర్కొన్నాడు. మొగలు చక్రవర్తి జహంగీర్ చేతిలో హత్యకు గురయ్యాడు.

గురు హర్‌గోవింద్: సిక్కుల ఆరో గురువు హర్‌గోవింద్. ఇతడు షాజహాన్‌పై తిరుగుబాటు చేశాడు.

గురు హర్‌రాయ్: ఇతడు సిక్కుల ఏడో గురువు. షాజహాన్ కుమారుడైన దారాషుకు, ఔరంగజేబుకు వ్యతిరేకంగా పనిచేశాడు.

గురు హర్‌కిషన్: ఇతడు సిక్కుల ఎనిమిదో గురువు. ఔరంగజేబు సమకాలీకుడు. మశూచి వ్యాధితో బాధపడుతూ ఔరంగజేబు ఆస్థానంలో మరణించాడు.

గురు తేజ్‌బహదూర్: ఇతడు సిక్కుల తొమ్మిదో గురువు. బిహార్, అసోం ప్రాంతాలకు సిక్కు మతాన్ని వ్యాపింపజేశాడు. మొగలు చక్రవర్తి ఔరంగజేబు చేతిలో హత్యకు గురయ్యాడు.

 

గురు గోవింద్‌సింగ్

  ఇతడు సిక్కుల పదో గురువు. గురు గోవింద్‌సింగ్ తన ప్రధాన కేంద్రాన్ని కర్తార్‌పూర్ నుంచి పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహెబ్‌కు మార్చాడు.
* ఇతడు సిక్కుల్లో సమానత్వం అనే ఖల్సాను సాధించాడు (సోదర భావం).
* సిక్కు మతస్థులందరూ తమ శరీరాలపై 'క' అక్షరంతో కూడిన అయిదు వస్తువులను ధరించాలని ఆదేశించాడు. అవి 1) కంఘా (దువ్వెన), 2) కచ్ (లోపలి వస్త్రం), 3) కర్డ్ (కంకణం), 4) కేశ్ (జుట్టు), 5) కృపాణ్ (ఖడ్గం). వీటితోపాటు ప్రతి సిక్కు మతస్థుడు తన పేరు చివర సింగ్ అనే పదాన్ని చేర్చాలి.
* గురు గోవింద్‌సింగ్ తన తర్వాత 'ఆదిగ్రంథ్‌'ను గురువుగా భావించమని సిక్కులను ఆదేశించాడు. తన సైనిక వారసుడిగా బందాను ఎంపిక చేశాడు.
* సిక్కుల 12 రాజ్యాలను మిజిల్స్ అంటారు. సిక్కు మత రక్షకులమని చెప్పే వారిని అకాలీలు అంటారు.

 

రంజిత్‌సింగ్ (1782 - 1839): రంజిత్‌సింగ్ తండ్రి మహాసింగ్, తల్లి రాజ్‌కౌర్. ఇతడి మొదటి పేరు బుధ్‌సింగ్. ఇతడు లాహోర్‌లో ఆయుధ కర్మాగారాన్ని నిర్మించాడు. 1809లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ మింటోతో అమృత్‌సర్ సంధి కుదుర్చుకున్నాడు.

 

ఆంగ్లో - సిక్కు యుద్ధాలు

మొదటి ఆంగ్లో - సిక్కు యుద్ధం (1845-1846): ఈ యుద్ధ కాలంలో దిలీప్‌సింగ్‌తో సింహాసనాన్ని అధిష్టింపజేసి, అతడి తల్లి రాణి జిందాన్ కౌర్ పరిపాలనా బాధ్యతలను స్వీకరించింది. ఈ యుద్ధం లాహోర్ సంధితో (1846 మార్చి 9) ముగిసింది.

రెండో ఆంగ్లో - సిక్కు యుద్ధం (1848-1849): ఈ యుద్ధంలో ముల్తాన్ గవర్నర్ మూల్‌రాజ్, లాహోర్‌లో చత్తర్‌సింగ్ తిరుగుబాటు చేశారు. నాటి గవర్నర్ జనరల్ డల్హౌసీ సిక్కులను ఓడించాడు.

సిక్కు మత గురువులు సమకాలీన మొగలు చక్రవర్తులు
1. గురు నానక్ (1469 - 1538) బాబరు
2. గురు అంగద్ (1538 - 1552) హుమయూన్
3. గురు అమర్‌దాస్ (1552 - 1574) హుమయూన్, అక్బర్
4. గురు రామ్‌దాస్ (1574 - 1581) అక్బర్
5. గురు అర్జున్‌సింగ్ (1581 - 1606) అక్బర్, జహంగీర్
6. గురు హర్‌గోవింద్ (1606 - 1645) జహంగీర్, షాజహాన్
7. గురు హర్‌రాయ్ (1645 - 1661) షాజహాన్, ఔరంగజేబు
8. గురు హర్‌కిషన్ (1661 - 1664) ఔరంగజేబు
9. గురు తేజ్ బహదూర్ (1664 - 1675) ఔరంగజేబు
10. గురు గోవింద్‌సింగ్ (1675 - 1708) ఔరంగజేబు, బహదూర్ షా
* బందా బహదూర్ (1708 - 1715)
(సిక్కు మత గురువు కాదు)
బహదూర్ షా, జహందర్ షా ఫరూక్ సియార్

 

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సిక్కు మతం

1. సిక్కు మత స్థాపకుడు ఎవరు?
జ: గురు నానక్

 

2. ఏ వ్యక్తికైనా ఒక ఆధ్యాత్మిక గురువు లేకపోతే పరిపూర్ణత లభించదని పేర్కొన్నది ఎవరు?
జ: గురు నానక్

 

3. గురు నానక్ వారసుడు ఎవరు?
: గురు అంగద్

 

4. లంగర్ వంటశాలను ఏర్పాటు చేసింది ఎవరు?
జ: గురు అంగద్

 

5. గురు అమర్‌దాస్ ఆశీస్సులను అందుకున్న మొగలు చక్రవర్తి ఎవరు?
జ: హుమయూన్

 

6. సిక్కుల పవిత్ర గ్రంథం ఏది?
జ: ఆదిగ్రంథ్

 

7. సిక్కులకు స్వర్ణ దేవాలయ నిర్మాణం కోసం భూమిని దానం చేసిన మొగలు చక్రవర్తి ఎవరు?
జ: అక్బర్

 

8. 22 ఆధ్యాత్మిక సూత్రాలను ప్రవేశపెట్టిన సిక్కు గురువు ఎవరు?
జ: గురు అమర్‌దాస్

 

9. ప్రతి సిక్కు మతస్థుడు తన సంపాదనలో  వ వంతు సిక్కు గురువులకు ఇవ్వాలని పేర్కొన్నది ఎవరు?
జ: గురు అర్జున్‌సింగ్

 

10. మొగలు చక్రవర్తి జహంగీర్ ఏ సిక్కు గురువును చంపాడు?
జ: గురు అర్జున్‌సింగ్

 

11. సిక్కుల తొమ్మిదో గురువు ఎవరు?
జ: గురు తేజ్‌బహదూర్

 

12. ఆదిగ్రంథ్‌ను తమ గురువుగా భావించమని సిక్కులను ఆదేశించింది ఎవరు?
జ: గురు గోవింద్‌సింగ్

 

13. సిక్కు మతస్థులందరూ తమ శరీరాలపై 'క' అనే అక్షరంతో కూడిన 5 వస్తువులను ధరించాలని ఆదేశించింది ఎవరు?
జ: గురు గోవింద్‌సింగ్

 

14. మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
జ: 1845 - 46

 

15. అమృత్‌సర్ సంధి ఏ సంవత్సరంలో జరిగింది?
జ: 1809

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మహారాష్ట్రులు - శివాజీ

1. శివాజీ క్రీ.శ.1627 లో ఏ దుర్గంలో జన్మించాడు?
జ: శివనేర్ దుర్గం

 

2. శివాజీ సంరక్షకుడు ఎవరు?
జ: దాదాజీ కొండదేవ్

 

3. దశబోధ గ్రంథ రచయిత ఎవరు?
జ: రామదాసు

 

4. శివాజీ ఏ దుర్గంపై తొలి దండయాత్ర చేశాడు?
జ: తోరణ దుర్గం

 

5. మరాఠీ భాష ద్వారా మహారాష్ట్రులను ఏకం చేసిందెవరు?
1) తుకారాం వామన్ పండిత్             2) ఏక్‌నాథ్
3) నామ్‌దేవ్, సమర్థ రామదాసు       4) పైవారందరూ
జ: 4(పైవారందరూ)

 

6. బీజాపూర్ సుల్తాన్ రెండో అలీ ఆదిల్ షా సేనానిని శివాజీ చంపాడు. అతడి పేరేంటి?
జ: అఫ్జల్‌ఖాన్

 

7. శివాజీ ఆధ్యాత్మిక మత గురువు?
జ: సమర్థ రామదాసు

 

8. శివాజీ ఏ మొగలుల నగరాన్ని దోచుకున్నాడు?
జ: సూరత్

 

9. 1665 లో ఔరంగజేబు సేనాని రాజా జైసింగ్‌తో శివాజీ చేసుకున్న ఒప్పందం ఏది?
జ: పురంధర్ సంధి

 

10. క్రీ.శ. 1674 లో శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం జరుపుకున్న ప్రదేశం?
జ: రాయ్‌గఢ్

 

11. శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయుడు ఎవరు?
జ: ఆక్సెన్‌డెన్

 

12. శివాజీ రాజధాని ఏది?
జ: రాయ్‌గఢ్

 

13. 1676 లో గోల్కొండ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది?
జ: శివాజీ - హసన్ తానీషా

 

14. షయిస్తఖాన్ ఎవరు?
జ: మొగల్ సేనాని

 

15. శివాజీ సమకాలీకుడైన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: ఔరంగజేబు

 

16. పండరీపురంలోని ప్రసిద్ధ విఠలస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన బీజాపూర్ సేనాని ఎవరు?
జ: అఫ్జల్‌ఖాన్

 

17. శివాజీ పట్టాభిషేకం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
జ: గార్గభట్

 

18. శివాజీ మంత్రిమండలి పేరేంటి?
జ: అష్ట ప్రధానులు

 

19. శివాజీ పరిపాలనకు ఆధారం?
జ: ధర్మశాస్త్రాలు

 

20. శివాజీ వసూలు చేసిన భూమి శిస్తు ఎంత?
జ: 2/5 వంతు

 

21. పీష్వా అంటే ...?
: ప్రధానమంత్రి

 

22. అధిక భూమి శిస్తు వసూలు చేసిన మధ్యయుగ పాలకుడు ఎవరు?
జ: శివాజీ

 

23. శివాజీ రాజ్యానికి ఏమని పేరు?
జ: స్వరాజ్యం

 

24. చౌత్ (1/4), సర్దేశ్‌ముఖ్ (1/10) పన్నులను శివాజీ ఎవరి నుంచి వసూలు చేశాడు?
జ: రాజ్యంలో లేని ప్రాంతాల నుంచి

 

25. అష్ట ప్రధానుల్లో విదేశాంగశాఖ మంత్రి?
జ: సుమంత్

 

26. క్రీ.శ.17 వ శతాబ్దంలో మహారాష్ట్ర రాజ్య నిర్మాత?
జ: శివాజీ

 

27. క్రీ.శ. 17 వ శతాబ్దంలో మొగలులకు, దక్కన్ సుల్తాన్‌లకు మధ్య స్థాపితమైన గొప్ప రాజ్యం?
జ: మహారాష్ట్ర రాజ్యం

 

28. శివాజీ తండ్రి నుంచి వారసత్వంగా పొందిన జాగీరు ఏది?
జ: పుణె

 

29. శివాజీ ఏ కొండజాతికి నాయకత్వం వహించాడు?
జ: మావళి

 

30. శివాజీ తన రాజ్యాన్ని ఎన్ని రకాలుగా విభజించాడు?
జ: 5

 

31. భూమిని సర్వే చేయడానికి శివాజీ ఉపయోగించిన కొలబద్ద ఏది?
జ: కథి

 

32. శివాజీ నౌకాదళాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు?
జ: కొలాబ

 

33. శివాజీ కాలంలో రెవెన్యూ సంస్కరణలను ప్రవేశపెట్టింది?
జ: అన్నా జిత్తు

 

34. శివాజీకి రాజా అనే బిరుదునిచ్చిన మొగలు చక్రవర్తి ఎవరు?
జ: ఔరంగజేబు

 

35. శివాజీ గ్రామ పాలనకు నియమించిన అధికారులు ఎవరు?
జ: పటేల్, కులకర్ణి

 

36. రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను ఏది?
జ: సర్దేశ్‌ముఖి

 

37. 'శివాజీ మహారాష్ట్రులకు వెలుగు - మొగలుల పాలిట సింహస్వప్నం' అని పేర్కొన్నది ఎవరు?
జ: టి.వి. సర్కార్

 

38. శివాజీ ఏ సంవత్సరంలో మరణించాడు?
జ: 1680 ఏప్రిల్ 4

 

39. శివాజీ కుమారుడు ఎవరు?
జ: శంభాజీ

 

40. 'హైందవ ధర్మోద్ధారక, హిందుత్వ రక్షకుడు' అని ఎవరినంటారు?
జ: శివాజీ

 

41. శంభాజీని సంగమేశ్వర్ యుద్ధంలో ఓడించిన మొగలు సేనాని ఎవరు?
జ: ముకారిబ్ ఖాన్

 

42. సాహుకి విద్య బోధించిన ఔరంగజేబు కుమార్తె?
జ: జెబురున్నీసా

 

43. తారాబాయి ఎవరి భార్య?
జ: రాజారామ్

 

44. 1713 లో పీష్వా పదవిని ఏర్పాటు చేసింది?
జ: సాహు

 

45. మొదటి పీష్వా...
జ: బాలాజీ విశ్వనాథ్

 

46. మహారాష్ట్ర సామ్రాజ్య రెండో స్థాపకుడు ఎవరు?
జ: బాలాజీ విశ్వనాథ్

 

47. పీష్వాలందరిలో గొప్పవాడు?
జ: మొదటి బాజీరావు

 

48. హిందూ పద్‌పద్ షాహీ సిద్ధాంతాన్ని పేర్కొన్నది ఎవరు?
జ: బాలాజీ విశ్వనాథ్

 

49. నానాసాహెబ్‌గా ప్రసిద్ధిగాంచిన పీష్వా ఎవరు?
జ: బాలాజీ బాజీరావు

 

50. 1761 లో మూడో పానిపట్టు యుద్ధం ఏ పీష్వా కాలంలో జరిగింది?
జ: బాలాజీ బాజీరావు

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సింధు నాగరికత

  క్రీ.శ. 1921 లో జరిగిన ఒక సంఘటన భారతదేశ చరిత్రనే కాకుండా పురావస్తు శాస్త్ర గతిని కూడా మార్చేసింది. రాయ్‌బహద్దూర్ దయారాం సహాని 1921 లో ప్రసిద్ధ హరప్పా నగరాన్ని సింధునదికి ఉపనది అయిన రావి నది ఒడ్డున కనుక్కున్నారు. 1922 లో ఆర్.డి. బెనర్జీ సింధునది కుడి ఒడ్డున ఉన్న మొహంజోదారోను కనుక్కున్నాడు.
సింధు నాగరికతకు పురావస్తు శాస్త్రజ్ఞులు వివిధ పేర్లను ప్రతిపాదించారు. క్రీ.పూ. 3000 నాటి సుమేరియా నాగరికతతో హరప్పా నాగరికతకు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా దీన్ని మొదట ఇండో-సుమేరియా నాగరికతగా పిలిచారు. ఇది సింధు నది లోయలో అభివృద్ధి చెందడం వల్ల దీన్ని సింధు నాగరికత అని కూడా అంటారు. సర్ జాన్ మార్షల్ దీన్ని హరప్పా నాగరికత (లేదా) సంస్కృతిగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఏ ప్రదేశంలో ఒక నాగరికతను మొదట కనుక్కుంటారో దాని ఆధారంగా ఆ సంస్కృతికి పేరు పెట్టడం పురావస్తు శాస్త్ర సంప్రదాయం. అనేక సింధు లోయ ప్రదేశాలు హక్ర - ఘగ్గర్ నదీ ప్రాంతంలో కనుక్కోవడం వల్ల దీన్ని సరస్వతి సింధు నాగరికత అని పిలుస్తున్నారు.

* కాలం: వేద సాహిత్యం ప్రకారం క్రీ.పూ. 2000 సంవత్సరానికి ముందు భారతదేశ చరిత్ర, సంస్కృతి ఉన్నట్లు ఆధారాలు లేవు. అయితే, మొహంజోదారో, హరప్పా, చాన్హుదారో, ఇతర సింధులోయ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల ఆధారంగా క్రీ.పూ. 3200 ఏళ్లనాటి సంస్కృతి వెలుగులోకి వచ్చింది. సుమేరియా, అక్కడ్, బాబిలోనియా, ఈజిప్టు, అస్సీరియా లాంటి గొప్ప ప్రాచీన నాగరికతలకు ఏమాత్రం తీసిపోని నాగరికత హరప్పా ప్రాంతంలో ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. రేడియో కార్బన్ డేటింగ్ విధానం ద్వారా క్రీ.పూ. 2500 - 1750 మధ్య ఈ నాగరికత పరిణితి చెందే దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

* భౌగోళిక వ్యాప్తి: ఈ నాగరికత ప్రస్తుత పాకిస్థాన్, వాయవ్య భారతదేశంలో ఉండేది. ఇది ఉత్తరాన జమ్మూలోని మాండ నుంచి దక్షిణాన దైమాబాద్ వరకు, తూర్పున పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని అలంఘీర్‌పూర్ నుంచి పశ్చిమాన బెలూచిస్థాన్‌లోని సుత్కాజెండర్ వరకు విస్తరించింది. పాకిస్థాన్‌లోని హరప్పా, మొహంజోదారో, చాన్హుదారో, భారత్‌లో గుజరాత్‌లోని లోథల్, రంగపూర్, సుర్కోటుడా, రాజస్థాన్‌లోని కాలిబంగన్, హరియాణాలోని బన్వాలి, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని అలంఘీర్‌పూర్‌లు ఈ నాగరికతకు చెందిన ప్రధాన నగరాలు. దీనికి సంబంధించి తాజాగా కనుక్కున్న ప్రదేశం గుజరాత్‌లోని ధోలవీరా. డాక్టర్ జగపతిజోషి, డాక్టర్ ఆర్.ఎస్. బిస్త్‌లు ఈ ప్రదేశంలో నిర్వహించిన తవ్వకాల్లో ప్రముఖ పాత్ర వహించారు. ఇది సింధులోయ నాగరికతకు సంబంధించిన అతిపెద్ద ప్రదేశం. హరప్పా సంస్కృతి 1.3 మిలియన్ చ.కి.మీ.ల మేర వ్యాపించి, క్రీ.పూ. 3000 - 2000 మధ్య విలసిల్లింది. ప్రపంచ నాగరికతల్లో ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించిన నాగరికతగా ఇది ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.

 

సామాజిక జీవనం

  హరప్పా ప్రజల సామాజిక జీవనం గురించి తెలుసుకోవడానికి ఉన్న ప్రధాన ఆధారం అక్కడి తవ్వకాల్లో లభించిన వస్తువులే. వీటికి సంబంధించిన శాసనాలు కానీ, లిఖిత ఆధారాలు కానీ లేవు. హరప్పా ప్రజల లిపి బొమ్మల లిపి. దాన్ని చదివి, అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరి సామాజిక జీవితానికి సంబంధించిన ప్రధాన లక్షణాలను కింది విధంగా వివరించవచ్చు.

* హరప్పా సంస్కృతి నాటి సమాజాన్ని ఆర్థిక హోదాను బట్టి విభజించినట్లు తెలుస్తోంది. హరప్పా నగరాలను అనేక భాగాలుగా విభజించడమే దీనికి నిదర్శనం. హరప్పా సమాజం మాతృస్వామిక సమాజమని సర్ జాన్ మార్షల్ అభిప్రాయం. ఇతడు రెండు కారణాల వల్ల ఈ అభిప్రాయానికి వచ్చాడు.
a) హరప్పా నగరాల్లో లభించిన బంకమట్టితో చేసిన బొమ్మల్లో పురుషుల కంటే స్త్రీల బొమ్మలు అధిక సంఖ్యలో ఉండటం.
b) హరప్పా ప్రజలు అమ్మతల్లిని పూజించడానికి ఎక్కువ ఇష్టాన్ని చూపించడం. దీంతోపాటు బంకమట్టితో చేసిన అమ్మతల్లి బొమ్మలు ఎక్కువ సంఖ్యలో లభించడం.

* హరప్పా ప్రజల సామాజిక జీవనంలో మరో ప్రధాన లక్షణం జంతువులను మచ్చిక చేసుకోవడం. హరప్పా ప్రజలు ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, ఒంటెలు మొదలైన జంతువులను మచ్చిక చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వ్యవసాయం, గృహ అవసరాలు, వేట మొదలైనవి హరప్పా ప్రజలు జంతువులను మచ్చిక చేసుకునేలా చేసి ఉండొచ్చు. హరప్పా ప్రజలకు గుర్రం గురించి తెలుసు. బంకమట్టితో చేసిన గుర్రపు నమూనాలు, గుర్రానికి చెందిన అవశేషాలు మొహంజోదారో, లోథల్, సుర్కోటుడాల్లో లభించాయి. అయితే హరప్పా ప్రజలు గుర్రాన్ని ఎక్కువగా ఉపయోగించలేదు. సమకాలీన సుమేరియన్లు హరప్పా ప్రజలు మచ్చిక చేసుకున్న జంతువులనే మచ్చిక చేసుకున్నారు. అయితే గుజరాత్‌లోని హరప్పా ప్రజలు వరిని పండించారు. ఏనుగులను మచ్చిక చేసుకున్నారు. కానీ, సుమేరియన్లకు వీటి గురించి తెలియదు.

దుస్తులు, కేశాలంకరణ, ఆభరణాలు: హరప్పా సంస్కృతికి చెందిన స్త్రీ, పురుషులు దుస్తులు, కేశాలంకరణ పట్ల ఎక్కువ ఇష్టం ప్రదర్శించారు. నూలు, ఉన్నితో చేసిన దుస్తులను వాడేవారు. మొహంజోదారోలో కనుక్కున్న బంకమట్టితో చేసిన బొమ్మ ఆధారంగా హరప్పా ప్రజలకు అల్లికలు, కుట్ల గురించి అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. హరప్పా స్త్రీలు అలంకారప్రియులు. ఆ కాలంనాటి ప్రజలు కొయ్య, దంతాలతో చేసిన దువ్వెనలు, గాజులు, వివిధ ఆభరణాలను ఉపయోగించేవారు. బంకమట్టితో చేసిన బొమ్మల ఆధారంగా స్త్రీలు చేతినిండా గాజులు ధరించినట్లు తెలుస్తోంది. అందాన్ని ఇనుమడింపజేసేలా కేశాల మధ్యలో దువ్వెనలు, పువ్వులు పెట్టుకునేవారు. పురుషులకు గడ్డం క్షవరం చేసుకోవడం గురించి తెలుసు.

స్నానపు అలవాట్లు: హరప్పా నగరంలో చాలావరకు స్నానపు ఘట్టాలను ఏర్పాటు చేశారు. మొహంజోదారోలో ప్రసిద్ధి చెందిన గొప్ప స్నాన వాటిక ఉండేది. స్నానపు గదులు ఇంటి మూలలో లేదా వరండాలో ఉండేవి. ఇది హరప్పా ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల ఉన్న అవగాహనకు నిదర్శనం.

ఆహారం: హరప్పా ప్రజలు శాకాహారం, మాంసాహారం తినేవారు. కోడి, చేప, మాంసం, గోధుమలు, వరి మొదలైనవి వారి ఆహారంలో ప్రధానమైనవి.

వినోదాలు: హరప్పా ప్రజలకు ఇంట్లో ఆడుకునే ఆటలైన నృత్యం, జూదం గురించి తెలుసు. అయితే వారికి రథపు పందాలు, వేట గురించి తెలియదు.
* పై లక్షణాలను బట్టి హరప్పా ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో జీవించినట్లు తెలుస్తోంది. ఉన్నతవర్గాల వారు విలాసవంతమైన జీవితాన్ని, సామాన్య ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. హరప్పా సమాజంలో అసమానతలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

 

ఆర్థిక వ్యవస్థ

  హరప్పా ప్రజలది వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ. వీరు వ్యవసాయం కోసం సారవంతమైన వరద మైదానాలను ఉపయోగించేవారు. వీరికి భూమి దున్నడం తెలుసు. దీనికోసం కొయ్యతో చేసిన నాగలిని ఉపయోగించేవారు. కాలిబంగన్‌లో కనుక్కున్న నాగలితో దున్నిన చాళ్లు, బన్వాలిలో లభించిన బంకమట్టితో చేసిన నాగలి నమూనా ఇందుకు నిదర్శనం. హరప్పా ప్రజలు కాలువల ద్వారా పంటలకు నీటి పారుదల సౌకర్యం కల్పించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సింధు హరివాణం సారవంతంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రతి సంవత్సరం సింధునది వరదలకు గురికావడమే. హరప్పా ప్రజలు వరదనీటి మట్టం తగ్గుముఖం పట్టిన తర్వాత నవంబరు నెలలో విత్తనాలు వేసి, వరదలు రావడానికి ముందే ఏప్రిల్‌లో గోధుమ, బార్లీ పంటల నూర్పిడి పూర్తిచేసేవారు.

  సింధు హరివాణంలో గోధుమ, బార్లీ, పత్తి మొదలైన పంటలను, గుజరాత్, కథియవార్ ప్రాంతాల్లో వరిని పండించేవారు. హరప్పా ప్రజలు ప్రపంచంలోని మొదటిసారి వరి, పత్తి పంటలను పండించారు. గ్రీకులు క్రీ.పూ. 4 వ శతాబ్దంలో పత్తి పంటను పరిశీలించి, దానికి సింధునది పేరు మీదుగా సిండాన్ అనే పేరు పెట్టారు. లోథల్, కాలిబంగన్‌లలో జరిపిన తవ్వకాలు వరి వాడకం గురించి తెలియజేస్తున్నాయి. ధాన్యాగారాల ఏర్పాటు హరప్పా ప్రజల ప్రధాన లక్షణం. ఆహార ధాన్యాలను సులభంగా రవాణా చేయడానికి ధాన్యాగారాలను నదీ తీరాల్లో ఏర్పాటు చేసేవారు. అనేక హరప్పా నగరాల్లో ధాన్యాగారాలు ఉండటం హరప్పా ప్రజలు వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడటాన్ని తెలియజేస్తోంది.

 

వ్యాపారం

   హరప్పా నగరాల్లో అవసరమైన ముడిపదార్థాలు లభించనందువల్ల హరప్పా ప్రజలు భారత ఉపఖండం లోపల, ఉపఖండం బయట వర్తక సంబంధాలను నెలకొల్పారు. అంతేగాక, హరప్పా ప్రజలు తాము తయారుచేసిన వస్తువులను అమ్ముకోవడానికి కూడా వర్తక సంబంధాలు అవసరమయ్యాయి.

* ఉపఖండం లోపల వర్తకం: ఉపఖండం లోపల వర్తకం అంటే హరప్పా నగరాల మధ్య అంతర్గత వ్యాపారమే కాకుండా ఇరుగు పొరుగున ఉన్న దక్కను, దక్షిణ భారతదేశం మొదలైన ప్రదేశాలతో జరిపిన వ్యాపారం అని అర్థం. హరప్పా ప్రజలు వివిధ రకాలైన లోహాలు, విలువైన రాళ్లను వేర్వేరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. వీరు దక్షిణ భారతదేశం, అఫ్గనిస్థాన్, ఇరాన్ నుంచి బంగారం, రాజస్థాన్‌లోని ఖేత్రి గనుల నుంచి రాగి, బిహార్ నుంచి తగరం, దక్షిణ భారతదేశం, సౌరాష్ట్ర, రాజస్థాన్, దక్కనుల నుంచి విలువైన రాళ్లను దిగుమతి చేసుకునేవారు.

* రవాణా సౌకర్యాలు, వ్యాపార స్వభావం: హరప్పా కాలంనాటి ఓడరేవులు లోథల్, సుర్కోటుడా, సుక్తాజెండర్. వీరు పశ్చిమ ఆసియా దేశాలతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారం సాగించేవారు. ఎస్.ఆర్. రావు లోథల్‌లో జరిపిన తవ్వకాల్లో ప్రాచీన ఓడరేవు బయటపడింది. ఇది హరప్పా ప్రజలకు చెందిన గొప్ప సంపన్నమైన ఓడరేవై ఉండొచ్చని పరిశోధకుల అభిప్రాయం.

* మొహంజోదారోలో బయటపడిన ముద్రికలపై ఓడబొమ్మలు అంతర్జాతీయ వ్యాపారాన్ని, వ్యాపారం కోసం పడవల వాడకాన్ని తెలియజేస్తున్నాయి. హరప్పా ప్రజలకు లోహపు నాణేల వాడకం గురించి తెలియదు. బహుశా ముద్రికలను వ్యాపార చిహ్నాలుగా వాడి ఉండొచ్చు. హరప్పా ప్రజల వ్యాపారం వస్తుమార్పిడి ద్వారా జరిగింది. వారు ఉత్పత్తి చేసిన వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసి లోహాలు, ముడిసరకులను దిగుమతి చేసుకునేవారు. రవాణా కోసం పడవలు, ఎడ్లబండ్లను వినియోగించేవారు. వీరికి బలమైన చక్రాలతో కూడిన బండ్ల వాడకం గురించి తెలుసు. దీని ఆధారంగా హరప్పా ప్రజలకు కావలసినంత వ్యవసాయ మిగులు ఉండేదని, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయని, లాభదాయకమైన అంతర్గత, అంతర్జాతీయ వ్యాపారం జరిగేదని తెలుస్తోంది. వీరి కాలంలో దిగుమతుల కంటే, ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండేది.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసనోల్లంఘన ఉద్యమం (1930 - 34)

  జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929 లో లాహోర్‌లో జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించారు. 1929 డిసెంబరు 31 అర్ధరాత్రి రావి నది ఒడ్డున ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాల మధ్య కొత్తగా ఆమోదించిన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. 1930 జనవరి 26 న అన్నిచోట్లా మొదటి స్వాతంత్య్ర దినంగా పాటించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.
గాంధీజీ తన 11 డిమాండ్లను 1930 జనవరి 31 లోగా ఆమోదించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గాంధీజీ చేసిన 11 డిమాండ్‌లు ....
1. భూమిశిస్తు 50 శాతం తగ్గించాలి.
2. ఉప్పుపై పన్ను నిషేధించాలి.
3. తీర ప్రాంత షిప్పింగ్‌ను భారతీయులకు కేటాయించాలి.
4. రూపాయి - స్టెర్లింగ్ మారకం నిష్పత్తి తగ్గించాలి.
5. స్వదేశంలోని దుస్తుల పరిశ్రమను రక్షించాలి.
6. సైనిక ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
7. పౌర పరిపాలన ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
8. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి.
9. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
10. కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖలో మార్పులు చేయాలి.
11. ఆయుధాల చట్టంలో మార్పు తీసుకురావడం ద్వారా పౌరుల స్వీయరక్షణకు ఆయుధాలను కలిగి ఉండటానికి అనుమతించాలి.

* ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలని గాంధీజీని కోరింది. 1930 మార్చి 2 న గాంధీజీ తన కార్యాచరణ ప్రణాళికను వైస్రాయి ఇర్విన్‌కు తెలియజేశారు. మార్చి 12 న గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది సభ్యులతో అరేబియా తీరంలోని దండి యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 240 మైళ్లు నడిచి 1930 ఏప్రిల్ 6 న దండి తీరం నుంచి పిడికెడు ఉప్పును తీసుకురావడం ద్వారా ఉప్పు చట్టాన్ని అతిక్రమించారు. దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలకు, పాలనకు భారత ప్రజలు వ్యతిరేకమని చాటి చెప్పారు. దండి యాత్ర, దాని పురోగతి, ప్రజలపై దాని ప్రభావం గురించి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితమయ్యాయి. గాంధీజీ పిలుపు మేరకు గుజరాత్‌లోని 300 మంది గ్రామాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.

* ఉప్పు సామాన్య మానవుడి భోజనంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఉప్పు అమ్మకం ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. గాంధీజీ మాటల్లో 'గాలి, నీరు తర్వాత బహుశా ఉప్పు జీవితంలో ప్రధాన అవసరం'. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించడానికి ఉప్పును ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణం.

 

ఉద్యమ వ్యాప్తి

తమిళనాడు: సి. రాజగోపాలాచారి (తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు పాదయాత్ర చేశారు.)
మలబార్: కె. కేలప్పన్ (కాలికట్ నుంచి పొయన్నూర్ వరకు పాదయాత్ర చేశారు).
పెషావర్: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (ఖుదై ఖిద్మత్ గార్స్ దళం ఏర్పాటు చేశారు. ఈయన బిరుదులు - బాద్షాఖాన్, సరిహద్దు గాంధీ). ఇతడు ఎర్రచొక్కా దళాన్ని ఏర్పాటు చేశాడు.
* ఈశాన్య భారతదేశంలో మణిపూర్ ప్రజలు రాణి గైడిన్ ల్యూ, ఆమె నాగా అనుచరులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

 

ప్రజల భాగస్వామ్యం

* ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని గాంధీజీ స్త్రీలను ప్రత్యేకంగా కోరారు. స్త్రీలతోపాటు యువకులు, విద్యార్థులు విదేశీ దుస్తులు, మద్యపాన బహిష్కరణలో ప్రధాన పాత్ర పోషించారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో పోలిస్తే ఈ ఉద్యమంలో ముస్లింలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ ప్రావిన్స్, మహారాష్ట్ర, కర్ణాటకలో షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ముంబయి, కోల్‌కతా, మద్రాసు, షోలాపూర్‌లో కార్మికులు పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, గుజరాత్‌లో రైతులు భాగస్వాములయ్యారు. బిహార్, దిల్లీ, లఖ్‌నవూలో ముస్లిం నేత పనివారు పాల్గొన్నారు. ఢాకాలో ముస్లిం నాయకులు, బలహీనవర్గాల వారు ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
* ఉప్పు సత్యాగ్రహం భారతదేశంపై అధిక ప్రభావాన్ని చూపింది. గుజరాత్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం దశలవారీగా భారతదేశమంతా విస్తరించింది. ప్రజలు ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతోపాటు విదేశీ వస్తువులను బహిష్కరించడం, మద్యం అమ్మే షాపులను మూయించడం, విదేశీ బట్టలను దహనం చేయడం, పన్నుల చెల్లింపు నిరాకరణ, అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను, విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించడం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు.

 

ఉద్యమంలోని వివిధ దశలు:

మొదటి దశ (1930 మార్చి - సెప్టెంబరు):  ఈ దశలో పట్టణాల్లో బూర్జువా వర్గం, గ్రామాల్లో రైతులు కీలకపాత్ర పోషించారు.
రెండో దశ (1930 అక్టోబరు - 1931 మార్చి): ఇందులో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం తగ్గింది. వీరు ప్రభుత్వం కాంగ్రెస్ మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. వీరి కృషి ఫలితంగా 1931 మార్చిలో గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగింది.
మూడో దశ (1932 జనవరి - 1934 ఏప్రిల్): ఈ దశలో ప్రభుత్వం అణచివేత విధానాన్ని అనుసరించింది. శాసనోల్లంఘన ఉద్యమం ఉధృతం కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూలను నిర్బంధించింది. ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రంపై కూడా పరిమితులను విధించింది. భూమిశిస్తు చెల్లించని వేలాదిమంది రైతుల భూములను, వారి ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 1931 నాటికి సుమారు 24,000 మందిని అరెస్టు చేశారు.

 

రౌండ్ టేబుల్ సమావేశాలు


* మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్‌లో 1930 నవంబరు 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగింది. ఈ సమావేశానికి మూడు బ్రిటిష్ రాజకీయ పక్షాలకు చెందిన 16 మంది ప్రతినిధులు, స్వదేశీ సంస్థానాల నుంచి 16 మంది, బ్రిటిష్ ఇండియా నుంచి 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. శాసనోల్లంఘన ఉద్యమం కొనసాగుతుండటంతో కాంగ్రెస్ ఈ సమావేశంలో పాల్గొనలేదు.

* ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫీ, జిన్నా, ఆగాఖాన్ హిందూ మహాసభకు చెందిన మూంజీ, జయకర్, ఇండియన్ లిబరల్ ఫెడరేషన్‌కు చెందిన తేజ్‌బహదూర్ సప్రూ, సి.వై. చింతామణి, శ్రీనివాస శాస్త్రి, అణగారిన కులాలకు ప్రాతినిథ్యం వహించిన డాక్టర్ అంబేడ్కర్ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు.

* ఈ సమావేశంలో ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిథ్యం ఇవ్వాలని, తాను ప్రతిపాదించిన 14 సూత్రాలను ఆమోదించాలని మహమ్మద్ అలీ జిన్నా డిమాండు చేశారు. డా|| అంబేడ్కర్ షెడ్యూల్డ్ కులాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండు చేశారు.

* కాంగ్రెస్ ప్రతినిధులు లేకుండా భారతదేశ రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన చర్చ జరపడం వృథా అని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు.

గాంధీ - ఇర్విన్ ఒప్పందం (1931 మార్చి 5): గాంధీజీ అప్పటి వైస్రాయి ఇర్విన్‌తో సమావేశమయ్యేలా తేజ్‌బహదూర్ సప్రూ, వి.ఎస్. శాస్త్రి, యం.ఆర్. జయకర్ మధ్యవర్తిత్వం చేశారు. దాని ఫలితంగా మార్చి 5, 1931 న గాంధీ - ఇర్విన్ ఒప్పందం జరిగింది.

ముఖ్యాంశాలు: శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేశారు. కాంగ్రెస్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి అంగీకరించింది. ఉద్యమం సందర్భంగా అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. సముద్రతీరం నుంచి నిర్ణీత దూరంలో నివసించే ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉప్పు తయారు చేసుకోవచ్చని తెలిపింది. అయితే కాంగ్రెస్‌లోని యువనాయకులు ముఖ్యంగా సుభాష్‌చంద్ర బోస్, జవహర్‌లాల్ నెహ్రూతోపాటు ఇతర నాయకులు ఉద్యమం ఆపివేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

రెండో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1931 సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధిగా గాంధీజీ ఒక్కరే హాజరయ్యారు. ముస్లింలతోపాటు షెడ్యూల్డ్ కులాలు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను డిమాండ్ చేశారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ రెండు ముస్లిం మైనారిటీ రాష్ట్రాలను (వాయవ్య సరిహద్దు రాష్ట్రం, సింధ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.

కమ్యూనల్ అవార్డు - 1932: 1932 ఆగస్టు 16 న మెక్‌డొనాల్డ్ రాష్ట్ర చట్టసభల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం గురించి బ్రిటిష్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశాడు. దీన్నే కమ్యూనల్ అవార్డు లేదా మెక్‌డొనాల్డ్ అవార్డు అంటారు. దీని ద్వారా ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారికి వేర్వేరు నియోజకవర్గాలను కేటాయించారు.

* షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ మిగిలిన సాధారణ నియోజకవర్గాల్లో ఓటువేసే అధికారాన్ని కూడా కల్పించారు. అయితే షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించి, 1932 సెప్టెంబరు 20 న ఎరవాడ జైలులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. మదన్‌మోహన్ మాలవీయ కృషితో గాంధీజీ, అంబేడ్కర్ మధ్య 1932 సెప్టెంబరు 25 న పుణెలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హిందువులందరికీ సాధారణ నియోజకవర్గాలు కొనసాగుతాయి. కమ్యూనల్ అవార్డులో పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ కులాలకు 71 సీట్లకు బదులు 148 సీట్లు కేటాయించారు.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1932 నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. ఇందులో 46 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లోని చర్చల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాని ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టం రూపొందింది.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసనోల్లంఘన ఉద్యమం (1930 - 34)

1. 1929 లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
సమాధానం: జవహర్‌లాల్ నెహ్రూ

 

2. గాంధీజీ దండి యాత్రను ఏ రోజున ప్రారంభించారు?
సమాధానం: మార్చి 12, 1930

 

3. తమిళనాడులో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు?
సమాధానం: సి. రాజగోపాలాచారి

 

4. ఈశాన్య రాష్ట్రాల్లో శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
సమాధానం: రాణి గైడిన్ ల్యూ

 

5. ఖుదై ఖిద్మత్ గార్స్ దళాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
సమాధానం: ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్

 

6. ఢాకాలో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏయే వర్గాలు పాల్గొన్నాయి?
సమాధానం: ముస్లిం నాయకులు, బలహీనవర్గాలు

 

7. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నాయకుడు ఎవరు?
సమాధానం: తేజ్ బహదూర్ సప్రూ

 

8. గాంధీ - ఇర్విన్ ఒప్పందంలో భాగంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి?
సమాధానం: సుభాష్‌చంద్ర బోస్

 

9. కమ్యూనల్ అవార్డును ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని ఎవరు?
సమాధానం: మెక్ డొనాల్డ్

 

10. గాంధీజీ, అంబేడ్కర్ మధ్య పుణె ఒప్పందం జరగడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు?
సమాధానం: మదన్ మోహన్ మాలవీయ

 

11. గాంధీజీకి మహాత్మా అనే బిరుదును ఇచ్చింది ఎవరు?
సమాధానం: రవీంద్రనాథ్ ఠాగూర్

 

12. దండి సత్యాగ్రహంతో సంబంధం ఉన్న దండి గ్రామం గుజరాత్‌లోని ఏ జిల్లాలో ఉంది?
సమాధానం: నౌసారి

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విష్ణుకుండినులు

  శాతవాహన సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాల్లో విష్ణుకుండిన వంశం ముఖ్యమైంది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉండి వారి తర్వాత కళింగతో సహా మొత్తం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశం విష్ణుకుండినులది. క్రీ.శ. 5, 6 శతాబ్దాల దక్షిణాపథ చరిత్రలో విష్ణుకుండినుల సామ్రాజ్యం ప్రముఖ పాత్ర వహించినదని శ్రీరామశర్మ లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు.విష్ణుకుండినుల చరిత్రను తెలుసుకోవడానికి వారు వేయించిన శాసనాలు, సాహిత్యం, గ్రంథాలు, దేవాలయాలు, గుహాలయాలు, దుర్గాలు, నాణేలు, శిల్పసంపద మొదలైనవి ఉపయోగపడుతున్నాయి. వీరి చరిత్ర రచనలో శాసనాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

* ఈవూరు తామ్రశాసనం
* రామతీర్థ తామ్రశాసనం
* చిక్కుళ్ల తామ్రశాసనం
* తుండి తామ్రశాసనం
* ఇంద్రపాల నగర తామ్రశాసనం
* పొలమూరు తామ్రశాసనం
* ఖానాపూర్ తామ్రశాసనం
* వేల్పూరు శిలాశాసనం
* చైతన్యపురి శిలాశాసనం
* విష్ణుకుండిన రాజులు దక్షిణాపథపతి, శ్రీపర్వతస్వామి పాదానుధ్యాతస్య, త్రికూటవులయాధిపతి అనే బిరుదులను ధరించినట్లు వారి శాసనాల ద్వారా తెలుస్తుంది.

మహారాజేంద్రవర్మ: విష్ణుకుండిన వంశస్థాపకుడు మహారాజేంద్రవర్మ. ఇతడు తొలుత అచ్చంపేట తాలూకాలోని 'అమరాబాద్' రాజధానిగా పరిపాలనను ప్రారంభించాడు. తర్వాత ఏలేశ్వరం, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, కీసర, ఇంద్రపాలనగరం ప్రాంతాలను ఆక్రమించి, ఇంద్రపురి రాజధానిగా రాజ్య విస్తరణను కొనసాగించాడు.

మొదటి మాధవవర్మ: మహారాజేంద్రవర్మ కుమారుడు మొదటి మాధవవర్మ. ఇతడు అమరాబాద్, కీసర, భువనగిరి ప్రాంతాలతోపాటు మహబూబ్‌నగర్, కొల్లాపూర్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను తన అధికారంలోకి తెచ్చుకున్నాడు.

గోవిందవర్మ I: మొదటి మాధవవర్మ కుమారుడే మొదటి గోవిందవర్మ. ఇతడు ఇంద్రపాల నగర తామ్ర శాసనాన్ని వేయించాడు. గోవిందవర్మ యుద్ధ విజేత, పరిపాలనాదక్షుడు. బౌద్ధమతాభిమాని. కృష్ణా - గోదావరి నదుల మధ్యనున్న భూభాగాలను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. కృష్ణానదికి దక్షిణాన ఉన్న గుంటూరు ప్రాంతాన్ని సైతం జయించాడు.

* ఇతను పృథ్విమూలుడి కుమార్తె అయిన మహాదేవిని వివాహం చేసుకున్నాడు. అతడి సహాయంతో శాలంకాయనులను ఓడించి వారి రాజ్యాన్ని ఆక్రమించాడు. మహాదేవి ఇంద్రపురిలో బౌద్ధభిక్షువులకు మహా విహారాన్ని నిర్మించింది. ఆ విహారానికి గోవిందవర్మ 'పేణ్కపర' గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. (ఆ పేణ్కపర నల్గొండ జిల్లా మోత్కూరు తాలూకాలోని పనకబండ గ్రామం). హైదరాబాద్‌లోని చైతన్యపురిలో మూసీతీరంలో లభించిన ప్రాకృత శాసనం ఇతడి పేరుమీద వెలసిన విహారాన్ని గురించి తెలుపుతుంది. గోవిందరాజ విహారం, చైత్యాలయాలు శిథిలంకాగా శాసనం మాత్రమే మిగిలిన ఆధారం.
* గోవిందవర్మ కాలంలో ఇంద్రపురి పరమమహాదేవి విహారం, చైతన్యపురి గోవిందరాజ విహారం, ఫణిగిరి, గాజులబండ, తిరుమలగిరి, జగ్గయ్యపేట, నేలకొండపల్లి, వర్థమానుకోట ప్రాంతాల్లో బౌద్ధారామ విహారాలు, చైత్యాలయాలు, స్తూపాలు ప్రసిద్ధి చెందినవి. ప్రస్తుతం అవి శిథిలరూపంలో ఉన్నాయి.

II మాధవవర్మ: I గోవిందవర్మ కుమారుడు II వ మాధవవర్మ. ఇతడు వైదికమత నిరతుడు. అగ్నిస్టోమ, వాజపేయ, అశ్వమేథ, రాజసూయ యాగాలు, వేయి క్రతువులను నిర్వహించాడు. శాలంకాయన, ఆనందగోత్రిక, పల్లవ దక్షిణదేశంలో ఉన్న రాజ్యాలను, వాకాటక చక్రవర్తి అయిన రెండో పృథ్విసేనుడిని ఓడించాడు. ఇతడు రాజధానిని ఇంద్రపాల నగరం నుంచి పశ్చిమ గోదావరిలోని దెందులూరుకు మార్చాడు.

వవర్మ: II వ మాధవవర్మ జ్యేష్ఠపుత్రుడు. ఇతడి పరిపాలన విశేషాలు ఏవీ తెలియడంలేదు. కొద్దికాలం మాత్రమే పాలించినట్లు భావించవచ్చు.

III మాధవవర్మ: ఇతడు దేవవర్మ కుమారుడు. వీరి రాజధాని గుంటూరులోని అమరావతి. ఇతడికి 'త్రికూటమలాయాధిపతి' అనే బిరుదు ఉంది. తూర్పున మలయ పర్వతాలు, పశ్చిమాన త్రికూట పర్వతం ఇతడి రాజ్య సరిహద్దులని డా|| నేలటూరి వెంకటరమణయ్య అభిప్రాయం. ఇతడు వేయించిన 'ఈవూరు తామ్రశాసనం' ఇంద్రశర్మ, అగ్నిశర్మ అనే బ్రాహ్మణులకు 'మ్రోతుకలి' గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్లు తెలుపుతుంది.

ఇంద్రభట్టారకవర్మ: ఇతడు I విక్రమేంద్రవర్మ కుమారుడు. ఇతడు దానాలు చేయడమేకాకుండా ఎక్కువ ఘటి స్థానాలను నెలకొల్పాడు. కీసర సమీపంలో ఉన్న ఘటకేశ్వరం ఇంద్రభట్టారకవర్మ నెలకొల్పిన ఘటిక స్థానమే.

విక్రమేంద్ర భట్టారకవర్మ: ఇతడు క్రీ.శ. 566 లో వేయించిన 'తుమ్మలగూడెం' శాసనంలో I వ గోవిందవర్మ నుంచి ఇంద్రభట్టారకవర్మ వరకు వరుసక్రమం స్పష్టంగా ప్రస్తావించాడు.
¤ ఇతడు పృథ్విమూలరాజు సహాయంతో పల్లవులను ఓడించాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఇంద్రపురికి వచ్చి గతంలో గోవిందవర్మ తన భార్యపేరిట నిర్మించిన మహాదేవి విహారానికి 'ఇఱుణ్డెరో' గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఇతడి బిరుదు ఉత్తమాశ్రయుడు.
¤ విక్రమేంద్ర భట్టారకవర్మ తర్వాత గోవిందవర్మ II రాజ్యాన్ని పాలించాడు. ఇతడి గురించి పెద్దగా విశేషాలేమీ అందుబాటులో లేవు. ఇతడి తర్వాత ఇతడి కుమారుడయిన నాలుగో మాధవవర్మ సింహాసనాన్ని అధిష్ఠించాడు.

నాలుగో మాధవవర్మ: ఇతడు జనాశ్రయ బిరుదాంకితుడు. న్యాయ, ధర్మాచరణ నిరతుడు, భక్తిపరుడు, ప్రజారంజకంగా పాలించడం వల్ల ప్రజలు ఇతడి మాటను వేదవాక్కుగా భావించేవారు. మాధవవర్మ న్యాయపాలన గొప్పది. న్యాయం చేయడంలో తన కుమారుడిని సైతం శిక్షించడానికి వెనుకాడనివాడు. నాలుగో మాధవవర్మ దుర్గామల్లీశ్వరుల భక్తుడు.
మంచన భట్టారకుడు: ఇతడు చాళుక్యులతో పోరాటం సాగించినప్పటికీ జయసింహవల్లభుని చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతడితో విష్ణుకుండిన రాజ్యం అంతరించింది.

 

పరిపాలన విధానం 

  విష్ణుకుండినులు పరిపాలనా సౌకర్యార్థం తమ రాజ్యాలను రాష్ట్రాలు, విషయాలుగా విభజించారు. రాష్ట్రానికి అధిపతి 'రాష్ట్రికుడు', విషయానికి అధిపతి విషయాధిపతి. వీరు రాజు ఆజ్ఞలకు లోబడి పాలన సాగిస్తారు. మంత్రులు, సామంతులు సామ్రాజ్యపాలనలో రాజుకు సహకరించేవారు.

* విష్ణుకుండిన ప్రభువులు తమ వంశాభివృద్ధికి దేవాలయాలు నిర్మించేవారు, వేద పండితులకు, విప్రులకు భూములు, అగ్రహారాలను దానమిచ్చేవారు. విజయయాత్రకు బయలుదేరినప్పుడు, యుద్ధవిజయానంతరం, సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో బ్రాహ్మణులకు భూ, సువర్ణ, అగ్రహారాలను దానం చేసేవారు.
న్యాయపాలన: విష్ణుకుండినుల కాలంలో న్యాయం, ధర్మం... ధనిక, పేద, కుల, మత, వర్గ వివక్ష లేకుండా అందరికీ సమానంగా ఉండేది. నాలుగో మాధవవర్మ విజయవాడ రాజధానిగా పాలిస్తున్న కాలంలో న్యాయాధికారి అయిన ప్రాడ్వివాక్కుల తీర్పును అనుసరించి తన కుమారుడికి మరణదండనను విధించాడు. ఈ విషయం తాను వేయించిన పాలమూరు శాసనంలో నాలుగో మాధవవర్మ పేర్కొన్నాడు.

 

మత పరిస్థితులు 

  విష్ణుకుండినుల కాలంలో వైదిక మతం ఉచ్ఛస్థితిలో ఉంది. ఈ వంశీయులు వైదిక మతాన్ని ఆదరించి యజ్ఞయాగాలు నిర్వహించారు. విష్ణుకుండిన రాజులు వైదిక మతవ్యాప్తికి అనేక దేవాలయాలను నిర్మించారు. కీసరలో ఉన్న కీసర రామలింగేశ్వరాలయం విష్ణుకుండినుల నాటిదే. ఇక్కడ విష్ణుకుండినులనాటి కట్టడాలు, దేవాలయాలు, దుర్గాలు, నాణేలు లభించాయి. మాధవవర్మ ఇక్కడ కొన్ని యజ్ఞాలు చేసినట్లు ఆధారాలున్నాయి. దేవాలయ స్తంభాల అడుగుభాగంలో పూలకుండి, దాని నుంచి పుష్పాలు బయటకు వచ్చే విధంగా చెక్కారు. మండపాల అడుగుభాగంలో గోడలపై పంజా ఎత్తి లంఘించడానికి సిద్ధంగా ఉన్న సింహాల ప్రతిమలున్నాయి. వీరి శాసనాలపై కేసరి ముద్ర కనిపిస్తుంది.

బైరవ కొండ: నల్లమల కొండల్లోని ఒక కొండ చరియను బైరవకొండ అంటారు. ఇందులో ఎనిమిది గుహాలయాలున్నాయి. దీనిలోని శిల్ప సంపద అద్భుతమైంది. శిలాస్తంభాలు, ఆజానుబాహులు, భయంకర ముఖాలు, జటాధారులైన ద్వారపాలకుల విగ్రహాలు ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా నిలబడి ఉంటాయి.
* బెజవాడ - ఇంద్రకీలాద్రి పర్వతంపై అక్కన్న - మాదన్న గుహాలయాలున్నాయి. విజయవాడ సమీపంలో మొగల్రాజపుర గుహాలయాల్లో శివతాండవ సంబంధిత గుహాలయం ముఖ్యమైంది.
* జైన - బౌద్ధ మతాలు వీరి కాలంలో క్షీణదశలో ఉండేవి. I గోవిందవర్మ బౌద్ధమతాభిమాని అయినప్పటికీ బౌద్ధమత క్షీణదశ ప్రారంభమయ్యింది. విజయవాడలోని ఉండవల్లి బౌద్ధ గుహాలయం - హిందూ దేవాలయంగా మారింది. (అనంతశయన పద్మనాభస్వామి విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించారు), మొగల్రాజపురం బౌద్ధగుహాలయంలో - శివున్ని పార్వతీ సమేతంగా అర్ధనారీశ్వర రూపంలో మలిచారు. ఇది సుందరమైన శిల్పం. బౌద్ధంలో వజ్రాయన శాఖ ఏర్పడటం వల్ల బౌద్ధం పూర్తిగా ప్రజాదరణను కోల్పోయింది.

 

వాణిజ్యం

  విష్ణుకుండినుల కాలంలో వర్తక వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు విరివిగా కొనసాగాయి. వీరి నాణేలు నల్గొండ, కీసర, గుంటూరు, కోస్తా తీరాల్లో లభించాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కళింగ మొదలైన రాజ్యాల్లో కూడా వీరి నాణేలు లభ్యమయ్యాయి. వీరి నాణేల్లో పంజాఎత్తి లంఘించే సింహపు బొమ్మ కింద వేలాడేదీపాలు ఉంటాయి. 

* నల్గొండలోని దొండపాడు ప్రాంతంలో వేలసంఖ్యలో ఈ నాణేలు లభించాయి. వీరు బర్మా, కంబోడియా, చైనా, జపాన్, సిలోన్, సుమిత్ర, జావా, మలయ, ఈజిప్ట్, గ్రీకు, రోమ్ మొదలైన దేశాలతో వర్తక వ్యాపారాలు కొనసాగించారు. 2 వ మాధవవర్మ త్రిసముద్రాధిపతి అనే బిరుదాంకితుడు.
సాహిత్యం 

* విష్ణుకుండినులు ప్రాకృత భాషను ఆదరించి, తర్వాత సంస్కృతాన్ని రాజభాషగా స్వీకరించారు. తెలుగు వ్యవహార భాషగా ఉండేది. నాలుగో మాధవవర్మ 'జనాశ్రయ చంధోవిచ్ఛిత్తి' అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. 
* బౌద్ధ పండితులలో 'దశబలబలి' అనే పండితుడు సర్వశాస్త్ర పారంగతుడని గోవిందవర్మ ఇంద్రపాల నగర శాసనం తెలుపుతుంది. విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన చిక్కుళ్ల శాసనంలో 'విజయరాజ్య సంవత్సరంబుళ్' అనే తెలుగు పదం ఉంది.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విష్ణుకుండినులు

1. విష్ణుకుండినుల వంశ స్థాపకుడు ఎవరు?
జ: ఇంద్ర వర్మ

 

2. విష్ణుకుండినుల రాజభాష ఏది?
జ: సంస్కృతం

 

3. విష్ణుకుండినుల్లో గొప్పవాడు ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

4. వి.పి.కృష్ణశాస్త్రి ప్రకారం... విష్ణుకుండినుల రాజధాని నగరం ఏది?
జ: కీసర

 

5. రామతీర్థ శాసనాన్ని వేయించిన విష్ణుకుండినుల రాజు ఎవరు?
జ: ఇంద్ర వర్మ

 

6. విష్ణుకుండినులు ఎవరి భక్తులు?
జ: శ్రీ పర్వత స్వామి

 

7. ప్రియపుత్రుడు అనే బిరుదు ఎవరిది?
జ: ఇంద్ర వర్మ

 

8. ఇంద్రపురం/ ఇంద్రపాలపురాన్ని నిర్మించింది ఎవరు?
జ: ఇంద్ర వర్మ

 

9. పి.వి.పరబ్రహ్మశాస్త్రి ప్రకారం.. విష్ణుకుండినుల రాజధాని ఏది?
జ: ఇంద్రపాల నగరం

 

10. విక్రమాశ్రయ అనే బిరుదు ఎవరిది?
జ: గోవింద వర్మ

 

11. గోవింద వర్మ పట్టమహిషి పేరు ఏమిటి?
జ: మహాదేవి

 

12. రాజధానిని ఇంద్రపాలపురం నుంచి అమరావతికి మార్చింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

13. ఉండవల్లి గుహలలో పూర్ణకుంభాన్ని చెక్కించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

14. కీసరగుట్టలో రామలింగేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

15. ఇంద్రపాలపురంలో బౌద్ధ బిక్షువులకు మహావిహారాన్ని నిర్మించింది ఎవరు?
జ: మహాదేవి

 

16. మహాదేవి ఏ మతాభిమాని?
జ: బౌద్ధ

 

17. కిందివాటిలో విష్ణుకుండినుల రాజచిహ్నం ఏది?
1) పంజా ఎత్తిన పులి                                      2) పరిగెత్తే గుర్రం            
3) పరిగెత్తే ఏనుగు                                          4) పంజా ఎత్తిన సింహం
జ: 4 (పంజా ఎత్తిన సింహం)

 

18. రాజసూయ, అశ్వమేథ, నరమేథ యాగాలు చేసిన విష్ణుకుండినుల రాజు ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

19. కిందివారిలో మహాకవి అనే బిరుదు పొందిన రాజును గుర్తించండి.
1) మంచన భట్టారక వర్మ                                 2) నాలుగో మాధవ వర్మ
3) విక్రమేంద్ర వర్మ                                           4) ఇంద్ర భట్టారక వర్మ
జ: 3 (విక్రమేంద్ర వర్మ)   

 

20. విష్ణుకుండినుల నాణేలపై ఏయే చిహ్నాలు ఉండేవి?
1) శంఖువు - గరుడ                                      2) శంఖువు - ఎద్దు
3) శంఖువు - సింహం                                    4) శంఖువు - ఓడ
జ: 3 (శంఖువు - సింహం)

 

21. మహాదేవి నిర్మించిన విహారానికి విక్రమేంద్ర వర్మ ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు?
జ: ఇరుందెర

 

22. మొదటి ఈపూరు శాసనంను వేయించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

23. తెలుగులో తొలి వాక్యం ఏది?
జ: విజయరాజ్య సంవత్సరంబుల్

 

24. బ్రాహ్మణులకు తుండి గ్రామాన్ని దానం చేసిన విష్ణుకుండినుల రాజు ఎవరు?
జ: విక్రమేంద్ర భట్టారక వర్మ

 

25. కీసరగుట్ట సమీపంలోని ఘటకేశ్వర్ ఘటికా స్థానాన్ని స్థాపించింది ఎవరు?
జ: ఇంద్ర భట్టారక వర్మ

 

26. గోవింద వర్మ ఏ గ్రామాన్ని బౌద్ధ విహారానికి దానంగా ఇచ్చాడు?
జ: పెన్కపుర

 

27. అమరేశ్వరం, రామేశ్వరం మల్లిఖార్జున ఆలయాలను నిర్మించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

28. జనాశ్రయ అనే బిరుదు పొందిన రాజు ఎవరు?
జ: నాలుగో మాధవ వర్మ

 

29. ఏ తామ్ర శాసనంలో 'విజయరాజ్య సంవత్సరంబుల్' అనే తెలుగు వాక్యం ఉంది?
జ: చిక్కుళ్ల తామ్ర శాసనం

 

30. జనాశ్రయ చంధోవిచ్ఛితి గ్రంథ రచయిత ఎవరు?
జ: గుణ స్వామి

 

31. రాజధాని నగరాన్ని అమరావతి నుంచి దెందులూరుకు మార్చింది ఎవరు?
జ: విక్రమేంద్ర భట్టారక వర్మ

 

32. ఘటికలు అంటే ఏమిటి?
జ: విద్యా కేంద్రాలు

 

33. ఇంద్రపాల నగరం ఏ జిల్లాలో ఉంది?
జ: నల్గొండ

 

34. గుల్మికుడు అని ఎవరిని అంటారు?
జ: సైనిక రాజ ప్రతినిధిని

 

35. ఉండవల్లి గుహలు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నాయి?
జ: కృష్ణా

 

36. హస్తికోశుడు అని ఎవరిని అనేవారు?
జ: గజదళాధిపతిని

 

37. విషయాల అధిపతులను ఏమనేవారు?
జ: అధికార పురుషులు - మహోత్తరులు

 

38. విష్ణుకుండినుల కాలంలో ఉపనిషత్తులను అధ్యయనం చేసింది ఎవరు?
జ: భావశర్మ

 

39. విష్ణుకుండినుల కాలంలో గొప్ప బౌద్ధ క్షేత్రం ఏది?
జ: బొజ్జన్న కొండ

 

40. పండిన పంటలో రాజ్యభాగాన్ని నిర్ణయించే అధికారిని ఏమని పిలిచేవారు?
జ: పలదారుడు

 

41. విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు ఎవరు?
జ: మంచన భట్టారక వర్మ

 

42. కిందివారిలో విష్ణుకుండినుల కాలంనాటి బౌద్ధ పండితుడిని గుర్తించండి.
1) బహు బలబల                                         2) దశ బలబల              
3) మేఘ బలబల                                         4) మహా బలబల
జ: 2 (దశ బలబల)

 

43. విష్ణుకుండినుల పరిపాలనను తెలియజేసే శాసనం ఏది?
జ: తుమ్మలగూడెం శాసనం

 

44. ఉండవల్లి గుహల్లో ఎన్ని అంతస్తులు ఉన్నాయి?
జ: 4 అంతస్తులు

 

45. విష్ణుకుండినుల కాలం నాటి ప్రసిద్ధ ఘటిక ఏది?
జ: ఘటకేశ్వర్
 

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శివాజీ పరిపాలనా విధానం

  శివాజీ మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన పూనా జాగీరు అధిపతిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. శివాజీ ఆత్మస్థైర్యం, పట్టుదల, ధైర్యసాహసాలతో తన అధికారాన్ని పెంపొందించుకున్నాడు. చివరకు స్వరాజ్యం పేరుతో మహారాష్ట్రుల కోసం సొంత రాజ్యాన్ని స్థాపించాడు. మరాఠా రాజ్య ప్రధాన లక్ష్యం హిందూ ధర్మ పరిరక్షణ.

  శివాజీకి 1674 లో రాయ్‌గఢ్‌లో ఛత్రపతిగా పట్టాభిషేకం జరిగింది. ఇతడు కేంద్రీకృత పరిపాలనను ప్రవేశపెట్టాడు. ఇతడు ప్రవేశపెట్టిన పరిపాలనా వ్యవస్థ స్వరాజ్యానికే పరిమితమైంది. ఇతడి రాజ్యంలో వంశపారంపర్య, నిరంకుశ రాజరికం అమలులో ఉన్నప్పటికీ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పాలించాడు. శివాజీ ధర్మశాస్త్రాలకు అనుగుణంగా పరిపాలించి, ప్రజల మన్ననలను పొందాడు. శివాజీకి పరిపాలనలో సహాయపడడానికి ఎనిమిదిమంది మంత్రులతో కూడిన అష్ట ప్రధానులు ఉండేవారు. అయితే మంత్రి మండలి సలహాలను తప్పకుండా పాటించాలనే నిబంధన లేదు.

 

అష్ట ప్రధానుల విధులు

i) పీష్వా లేదా ముఖ్య ప్రధాన్ - ప్రధానమంత్రి: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల పనితీరును పర్యవేక్షించడం.
ii) అమాత్యుడు లేదా మజుందార్ - ఆర్థిక మంత్రి: ఆదాయ, వ్యయాల పట్టికను తయారు చేయడం.
iii) మంత్రి లేదా వకియానావిస్ - హోంమంత్రి: శాంతిభద్రతలను పరిరక్షించడం.
iv) సుమంత లేదా గబీర్: విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించడం.
v) సచివుడు లేదా సుర్‌నావిస్: అంతరంగిక వ్యవహారాల మంత్రి.
vi) పండిత్‌రావ్ లేదా దానాధ్యక్షుడు: దానధర్మాలు, విద్యాపోషణ, ధార్మిక సంస్థల నిర్వహణ.
vii) సేనాపతి లేదా సర్ ఇ నౌబత్ - ముఖ్య సేనాధిపతి: సైన్యాన్ని సమీకరించడం, యుద్ధంలో సైన్యాన్ని నడిపించడం.
viii) న్యాయాధీశ్ - ప్రధాన న్యాయమూర్తి: సివిల్, క్రిమినల్, సైనిక, రెవెన్యూ కేసులలో తీర్పులు ఇవ్వడం.

* పండిత్‌రావు, న్యాయాధీశ్‌లు తప్ప మిగిలిన మంత్రులు అవసరమైన సమయంలో యుద్ధంలో పాల్గొనాలి. శివాజీ కాలంనాటి మరాఠా పరిపాలనా విధానంలో పౌర, సైనిక శాఖల మధ్య వ్యత్యాసం ఉండేది కాదు. ఇది శివాజీ పాలనలో ప్రధాన లోపం. 

* తన శాఖాపరమైన బాధ్యతలను నిర్వహించడంలో ప్రతి మంత్రికి సహాయ పడటానికి 8 మంది సహాయకులు ఉండేవారు. వారు దివాన్, మజుందార్, ఫత్నిస్, సబ్నిస్ లేదా దఫ్తార్‌దార్, కార్ఖానీస్, చిట్నిస్, జందార్, పొట్నిస్ - వీరందరినీ రాజే స్వయంగా నియమించేవాడు. రాజ్యంలో పద్దెనిమిది శాఖలు ఉండేవి. వీటిని మంత్రులు రాజు సలహామేరకు పర్యవేక్షించేవారు.

 

రాష్ట్ర, స్థానిక పరిపాలన:

  శివాజీ తన స్వరాజ్యాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించి, వాటిని వైస్రాయిల ఆధీనంలో ఉంచాడు. రాష్ట్రాలను కొన్ని జిల్లాలతో కూడిన ప్రాంతాలుగా విభజించి, వాటిని ముఖ్య దేశాధికారి ఆధీనంలో ఉంచాడు. ప్రాంతాలను తరఫ్‌లుగా విభజించి, వాటిని హవాల్దార్ లేదా తరఫ్‌దార్ ఆధీనంలో ఉంచాడు. తరఫ్‌లను గ్రామాలుగా విభజించాడు. గ్రామాలకు అధిపతి పాటిల్. ఇతడికి సహాయపడటానికి ఒక పంచాయతీ ఉండేది. పట్టణాలకు అధిపతి కొత్వాల్. ఈ పరిపాలన విధానం కొద్ది మార్పులతో మరాఠా యుగం అంతా కొనసాగింది.

 

రెవెన్యూ విధానం: 

  అహ్మద్‌నగర్ రాజ్యంలో మాలిక్ అంబర్ అనుసరించిన రెవెన్యూ విధానాన్నే శివాజీ అనుసరించాడు. స్వరాజ్యంలోని రాష్ట్రాలను శిస్తు వసూలుకోసం ప్రాంతాలుగా విభజించాడు. ఒక ప్రాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలు ఉండేవి. సాహు కాలంలో ఈ ప్రాంతాల సంఖ్య 37 గా ఉండేది. జిల్లాల్లో వారసత్వ రెవెన్యూ అధికారులైన పాటిల్, కులకర్ణి, దేశ్‌ముఖ్, దేశ్‌పాండేల వ్యవస్థను శివాజీ రద్దు చేశాడు. శిస్తు వసూలు చేసే బాధ్యతను తాను స్వయంగా నియమించిన అధికారులకు అప్పగించాడు. ప్రాంతానికి బాధ్యుడైన అధికారిని సుబేదార్, కర్కూన్ లేదా ముఖ్య దేశాధికారి అని పిలిచేవారు. కొన్ని సందర్భాల్లో అనేక ప్రాంతాల పర్యవేక్షణ కోసం సర్ సుబేదార్‌లను నియమించేవారు.
* భూమిని కతి అనే కొలబద్దతో సర్వే చేసి, భూమికి సంబంధించిన రికార్డులను జాగ్రత్తగా నిర్వహించేవారు. భూమిశిస్తు పండిన పంటలో 30% గా నిర్ణయించారు. ఇతర పనులన్నీ రద్దుచేసిన తర్వాత దాన్ని 40% కు పెంచారు. రైతులు భూమి శిస్తును ధన రూపంలో లేదా ధాన్య రూపంలో చెల్లించే అవకాశం ఉండేది. తాను ఎంత శిస్తు చెల్లించాలో రైతుకు ముందే తెలుసు కాబట్టి చెల్లింపులకు సంబంధించి రైతుల్లో సందిగ్ధత ఉండేది కాదు. 
* శివాజీ వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించాడు. కరవు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ధాన్యం, విత్తనాల కొనుగోలుకు అవసరమైన ధనాన్ని ప్రభుత్వమే ఇచ్చి, వారి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి కంతుల వారీగా తిరిగి చెల్లించమని కోరేవాడు.

 

చౌత్, సర్దేశ్‌ముఖి: 

  మరాఠాల శిస్తు విధానంలో చౌత్, సర్దేశ్‌ముఖిలు రెండు ముఖ్యమైన పన్నులు. రనడే అభిప్రాయంలో చౌత్ అనేది ఇతరుల దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు వారు చెల్లించే సైనిక పన్ను. ఇది మొత్తం రెవెన్యూలో 1/4 వ వంతుగా ఉండేది.
* సర్దేశ్‌ముఖి అనేది మహారాష్ట్ర వారసత్వ సర్దేశ్‌ముఖ్ హోదాలో శివాజీ ప్రజల నుంచి అదనంగా వసూలు చేసిన 10% పన్ను. చౌత్, సర్దేశ్‌ముఖి అనే రెండు పన్నులను శివాజీ తన స్వరాజ్య వెలుపలి భూభాగాల నుంచి వసూలు చేసినట్టు తెలుస్తుంది.

 

న్యాయ పాలన: 

  శివాజీ కాలంలో న్యాయపాలన నిష్పక్షపాతంగా ఉండేది. మధ్యవర్తిత్వం ద్వారా కొన్ని కేసులను పరిష్కరించేవారు. గ్రామాల్లో న్యాయ పరిపాలనను గ్రామ పంచాయతీల ద్వారా నిర్వహించేవారు. 
* గ్రామ పంచాయతీల్లో అన్ని కులాలు, వృత్తులవారికి ప్రాతినిధ్యం ఉండేది. ఆచారాలు, సాంప్రదాయాల ఆధారంగా తీర్పులు ఇచ్చేవారు. అనాగరికమైన శీల పరీక్ష (trail by ordeal) అమల్లో ఉండేది. రాజకీయ ఖైదీలను చాలా క్రూరంగా శిక్షించేవారు. మిగతా కేసుల్లో శిక్షలు సాధారణంగా ఉండేవి. మరణశిక్ష అమల్లో లేదు.

 

సంక్షేమ కార్యక్రమాలు 

  శివాజీ ప్రజల స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాడు.

వాటిలో ముఖ్యమైనవి...
* రోడ్లను నిర్మించి, బావులను తవ్వించాడు. ప్రజల సంక్షేమం కోసం వంతెనలు నిర్మించాడు.
* బలవంతపు పెళ్లిళ్లు చట్టబద్ధమైనవి కావని పేర్కొన్నాడు.
* వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు.
* వరకట్నం, పెళ్లి సమయంలో ఎక్కువ మొత్తంలో ధనాన్ని వసూలు చేయడాన్ని నిషేధించాడు.
* మద్యపాన నిషేధాన్ని అమలు చేశాడు.
* వడ్డీ వ్యాపారులు తక్కువ వడ్డీ వసూలు చేసేలా చర్యలు తీసుకున్నాడు.
* వెట్టిచాకిరిని నిషేధించాడు.
 ఈ విధంగా శివాజీ మహారాష్ట్ర చరిత్రలో గొప్ప పాలకుడిగా, మధ్యయుగ భారతదేశ చరిత్రలో గొప్ప పాలకుల్లో ఒకడిగా స్థానం సంపాదించాడు. శివాజీ గొప్ప యుద్ధ వీరుడిగా, మంచి పరిపాలనాదక్షుడిగా పేరుపొందాడు. 

 

సైనిక వ్యవస్థ

  శివాజీ సైనిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాడు. అశ్వక దళానికి అధిపతిగా సర్-ఇ-నౌబత్ వ్యవహరించేవాడు. 

* అశ్వక దళాన్ని రెండు భాగాలుగా విభజించారు. 1) బర్గిస్, 2) సిలాదార్లు. మొదటి రకం సైనికులకు కావలసిన ఆయుధాలు, జీతం ప్రభుత్వమే చెల్లించేది. రెండో రకం సైనికులకు కావలసిన ఆయుధాలను వారే సమకూర్చుకోవాలి. అయితే సర్వీసుకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఒక నిర్ణయించిన మొత్తాన్ని వారికి చెల్లిస్తుంది.
* శివాజీ సైన్యంలో 1260 ఏనుగులు, 1500 ఒంటెలు ఉండేవి. వీటిని సైనికులకు కావలసిన వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. సరకులు, ఆయుధాల రవాణా శివాజీ ప్రత్యక్ష నియంత్రణలో జరిగేది. శివాజీ సైన్యంలో ఫిరంగి దళం కూడా ఉండేది. శివాజీ కొలాబ కేంద్రంగా శక్తిమంతమైన నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు. కోటల నిర్వహణలో కూడా శివాజీ ప్రత్యేక శ్రద్ధ వహించాడు.

 

సైనిక వ్యవస్థలో ముఖ్య అంశాలు:
* శివాజీ గొరిల్లా యుద్ధ విద్యలను అనుసరించాడు. మరాఠా ప్రాంతం భౌగోళిక పరిస్థితులు దీనికి తోడ్పడ్డాయి. అఫ్జల్‌ఖాన్, షయిస్తఖాన్‌పై విజయాన్ని సాధించడానికి గొరిల్లా యుద్ధం శివాజీకి ఎంతగానో ఉపయోగపడింది.
* ఎలాంటి తారతమ్యం చూపకుండా హిందు, ముస్లింలకు సైన్యంలో ఉద్యోగాలు కల్పించాడు.
* సైనికులకు జీతాలు ధన రూపంలో చెల్లించాడు. జాగీర్దారీ విధానాన్ని రద్దు చేశాడు.
* సైనిక శిబిరంలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చాడు. స్త్రీలు, స్త్రీ సేవకులు, నాట్యగత్తెలు, సంగీత విద్యాంసులను యుద్ధ సమయాల్లో సైనిక శిబిరంలోకి అనుమతించేవారు కాదు. శత్రురాజ్యాల స్త్రీలకు, పిల్లలకు శివాజీ రక్షణ కల్పించాడు.
* శివాజీ స్వరాజ్య స్థాపన ద్వారా స్వాతంత్య్రం, జాతీయత అనే సందేశాన్ని భారతదేశంలో ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేశాడు. శివాజీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అతడి సమానత్వ భావనలు, పోరాట పటిమ, పరిపాలన సంస్కరణలు అతడికి ఎంతో కీర్తిని సంపాదించి పెట్టాయి.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శివాజీ పరిపాలనా విధానం

1. శివాజీ ఎవరిని తన గురువుగా పరిగణించాడు?
జ: సమర్థ రామదాసు

 

2. గొరిల్లా యుద్ధ విధానాన్ని మరాఠాలు ఎవరి నుంచి గ్రహించారు?
జ: మాలిక్ అంబర్

 

3. కిందివారిలో శివాజీపై ఎక్కువ ప్రభావం చూపిన వ్యక్తి ఎవరు?
ఎ) షాజీ భోన్‌స్లే         బి) జిజాబాయి        సి) దాదాజీ కొండదేవ్         డి) జాదవరావ్
జ: బి (జిజాబాయి)

 

4. కింది అష్ట ప్రధానుల్లో సుర్‌నావిస్ లేదా చిట్నిస్‌గా ఎవరిని పిలుస్తారు?
ఎ) సుమంత్         బి) పండితరావ్        సి) సచివ్         డి) అమాత్య
జ: సి (సచివ్)

 

5. మరాఠా భూభాగంలో భూమిని కొలవడానికి వాడిన యూనిట్ ఏది?
జ: కతి

 

6. శివాజీ నౌకాదళ కేంద్రం ఎక్కడ ఉండేది?
జ: కొలాబ

 

7. కిందివారిలో శివాజీ వధించిన బీజపూర్ సేనానిని గుర్తించండి.
ఎ) అఫ్జల్‌ ఖాన్         బి) షయిస్త ఖాన్        సి) జై సింగ్         డి) కున్వర్‌ సింగ్
జ: ఎ (అఫ్జల్‌ ఖాన్)

 

8. శివాజీ మొగలులతో పురంధర్‌ సంధిని ఏ సంవత్సరంలో కుదుర్చుకున్నాడు?
జ: 1665

 

9. 1674 లో శివాజీ పట్టాభిషేకం ఎక్కడ జరిగింది?
జ: రాయ్‌గఢ్

 

10. కాల్బలంలో తొమ్మిది మంది సైనికులతో కూడిన యూనిట్‌కు అధిపతి ఎవరు?
జ: నాయక్

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పూర్వ చారిత్రక యుగం

  పరిణామ క్రమంలో మానవ సాంస్కృతికాభివృద్ధి చరిత్ర 10 వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. మొత్తం ప్రపంచం భౌతికాభివృద్ధిని వర్ణించడానికి 80 కి.మీ. కాగితాన్ని ఉపయోగిస్తే, దానిపై మానవ పరిణామ ప్రగతి కేవలం 10 సెం.మీ. మాత్రమే ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. ఇది ప్రపంచ వయోపరిణామంలోని 10 లక్షల విభాగంలో ఒకటిగా వర్ణించారు. ప్రపంచ మానవ చరిత్రను మూడు విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు.
1. పూర్వ చారిత్రక యుగం (ఆదిమ చరిత్ర): పూర్వ చారిత్రక యుగానికి లిఖిత ఆధారాలు లేవు. దీన్ని ప్రిహిస్టరీ
అంటారు.

2. సంధి కాలపు చారిత్రక యుగం: దీన్ని ప్రోటో హిస్టరీ అంటారు. ఇది రెండు యుగాల మధ్యకాలం.

3. చారిత్రక యుగం (హిస్టారిక్ కాలం): దీనికి లిఖిత ఆధారాలున్నాయి.
* పూర్వ చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి లిఖిత ఆధారాలు లేవు. అయితే పురావస్తు, మానవ శాస్త్రాలు దీన్ని గురించి తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి.
* చారిత్రక యుగాన్ని ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం అని 3 విభాగాలుగా అధ్యయనం చేస్తారు. ఈ విభజన మానవ చరిత్రకు కూడా వర్తిస్తుంది.
* ప్రాచీన కాలంలో మానవుడు నివసించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపడాన్ని 'ఉత్ఖాతనం' అంటారు. తవ్వకాలను గురించి తెలిపే శాస్త్రాన్ని పురావస్తుశాస్త్రం అంటారు. ఉదా: ఈజిప్ట్‌లో పిరమిడ్ల ఉత్ఖాతనాలు అక్కడి ప్రాచీన నాగరికతా విశేషాలు తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి.
* సింధు, ఈజిప్ట్, మెసపటోమియా నాగరికతలు ఒకే కాలానికి చెందుతాయి. (సమకాలీనమైనవి)
* నాగార్జునకొండ ప్రాంతంలో లభించిన ఉత్ఖాతనాలు క్రీ.శ 3వ శతాబ్దం నుంచి ఇక్ష్వాకుల కాలం నాటి నాగరికతను తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి.

 

మానవశాస్త్రం

  ఇది ప్రాచీన చరిత్ర రచనకు బాగా తోడ్పడుతుంది. వివిధ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో వేలాది సంవత్సరాల కిందట జీవించిన మానవుల అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలు, దంతాలు బయటపడ్డాయి. భూమి పైపొరల్లో లభించిన శిలాజాలు, ప్రాచీన కాలం నాటి మానవులు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ మానవ చరిత్రకు అతివిలువైన సాక్ష్యాధారాలు. రేడియో కార్బన్ల నిష్పత్తి కాల నిర్ణయానికి తోడ్పడుతుంది.

 

భూమిపై ప్రాణికోటి ఆవిర్భావం:
ప్రపంచంలోని ప్రాణులన్నీ భూమిపైనే జీవిస్తాయి. భూమి సూర్యగోళం నుంచి విడిపోయి భూగ్రహంగా ఏర్పడింది. దీనిపై ఆవిర్భవించిన మొదటి ప్రాణి లార్వా. ఆ తర్వాతిది 'ప్లాజిలెట్టా'. కాలక్రమంగా వృక్ష, జంతుజాలం, చివరగా మానవుడు ఆవిర్భవించాడు.

 

మానవ జీవిత పరిణామ దశలు:

  మానవ జీవితంలో ఆస్ట్రోపిథికస్, రామాపిథికస్, హోమోఎరక్టస్, నియోన్‌డెర్తల్ అనే పరిణామ దశలున్నాయి. మనిషిని పోలిన ఈ ప్రాణులు క్రీ.పూ. 1,40,000 - 4000 కు పూర్వం జీవించి ఉండేవి.
* హోమోసెపియన్స్ అనే తెగవారు ఆధునిక మానవుడికి సమీప పూర్వీకులు. వీరిని క్రోమాగ్నన్లు అని కూడా పిలుస్తారు. వీరు 20 వేల సంవత్సరాల పూర్వం ఉండేవారు. వీరు గీసిన గుహచిత్రాలు వారి అనుభవాలను తెలియజేసేవి. మానవుడి నాగరికత పరిణామ క్రమం రాతియుగంతో ఆరంభమైంది.
* రాతియుగాన్ని 3 దశలుగా విభజించారు. అవి: పాతరాతి యుగం, మధ్యశిలా యుగం, కొత్తరాతి యుగం.

 

పాతరాతి యుగం

  పాతరాతి యుగం (క్రీ.పూ. 2,50,000 - 10,000)లో మానవుడి ముఖ్య వృత్తి ఆహార సేకరణ. రాతితో పనిముట్లు తయారు చేశాడు. ఈ యుగాన్ని ఆంగ్లంలో పాలియోలిథిక్ యుగం అంటారు. పాలియో అంటే పాత, లిథిక్ అంటే రాయి అని అర్థం. ఈ యుగంలో మానవుడు గుహల్లో నివసించేవాడు. జంతువుల చర్మాలతో శరీరాన్ని కప్పుకునేవాడు. దేశ దిమ్మరిగా జీవిస్తూ ఉండేవాడు. తన అనుభవాలను బొమ్మల రూపంలో చిత్రించేవాడు.

* ఈ యుగానికి చెందిన ప్రదేశాలు మధ్యప్రదేశ్‌లోని బింబేల్కా, పంజాబ్‌లోని సోన్‌నది లోయ, ఉత్తర్ ప్రదేశ్‌లోని భేలాని ప్రాంతాల్లో వెలుగుచూశాయి.

 

మధ్యశిలా యుగం

  పాతరాతి యుగానికి, కొత్తరాతి యుగానికి మధ్య ఉన్న కాలాన్ని మధ్యశిలా యుగం (క్రీ.పూ. 8000 - 6000) అంటారు. ఈ యుగంలో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగింది. ఆలోచన, విచక్షణాజ్ఞానం పెరిగాయి. మానవుడు నిప్పును ఉపయోగించడం తెలుసుకున్నాడు. ఈ కాలానికి చెందిన మానవులు చిన్న సామాజిక వర్గాల్లో నివసించారు. ఫలితంగా సాంఘిక సంబంధాలు బలపడ్డాయి. సాంఘిక నిబంధనలు ఏర్పడ్డాయి. ఆంగ్లంలో ఈ యుగాన్ని మియోలిథిక్ యుగం అంటారు. మియో అంటే మధ్య, లిథిక్ అంటే రాయి అని అర్థం.
* ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి లోయ, బిహార్‌లో బిర్బార్‌పూర్ మొదలైన ప్రాంతాల్లో ఈ కాలానికి చెందిన అవశేషాలు బయటపడ్డాయి.

 

కొత్త రాతి యుగం

  కొత్తరాతి యుగాన్నే (క్రీ.పూ. 6000 - 1000) 'నవీన యుగం' అంటారు. దీన్నే ఆంగ్లంలో నియోలిథిక్ యుగం అంటారు. నియో అంటే కొత్త, లిథిక్ అంటే రాయి అని అర్థం. ఈ యుగంలో పరికరాలు, పనిముట్ల నాణ్యత పెరిగింది. మానవులు ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. వ్యవసాయం, పశుపోషణ చేపట్టారు. చక్రాన్ని కనుక్కున్నారు. మట్టి కుండలను కాల్చడం ఆరంభించారు. ఇది రసాయనిక శాస్త్ర అధ్యయానికి తొలిమెట్టు. చేనేత కళ ఆరంభం, పత్తి పంటను పండించడం భౌతిక, వృక్షశాస్త్రాల అభ్యాసానికి దారితీశాయి. వస్తుమార్పిడి పద్ధతి వ్యాపార వాణిజ్యాలకు మార్గదర్శకమైంది. చక్రం ఆవిష్కరణ వల్ల ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. పూజారులను దేవతలు, మానవులకు మధ్యవర్తులుగా భావించేవారు. నవీన శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్లు టెక్కలి కోట, మస్కి, సింగనకల్లు, ఉట్నూరు మొదలైన ప్రాంతాల్లో లభించాయి.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పూర్వ చారిత్రక యుగం

మాదిరి ప్రశ్నలు

 

1. పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించిన సంపద ఏది?

జ: సుఖమయ జీవనం

 

2. అనాది నుంచి ప్రజలు సుఖంగా జీవించడానికి చేసిన కృషిని వివరించేదే...
జ: చరిత్ర

 

3. తరతరాలుగా మానవులు సాగించిన సమష్టి కృషిని ఏమంటారు?
జ: చరిత్ర

 

4. భూమి ఏర్పడి సుమారుగా ఎన్ని కోట్ల సంవత్సరాలై ఉంటుందని భావిస్తున్నారు?
జ: 100

 

5. సుమారు 5 లక్షల సంవత్సరాల నుంచి మానవుడు సాగించిన జీవిత యాత్రను ఏమంటారు?
జ: ఆదిమ చరిత్ర

 

6. లిఖితపూర్వక ఆధారాలు లేని యుగాన్ని ఏమంటారు?
జ: పూర్వ చారిత్రక యుగం

 

7. ప్రోటో హిస్టరీ అని ఏ యుగాన్ని అంటారు?
జ: సంధికాల చారిత్రక యుగం

 

8. పూర్వ చారిత్రక యుగ చరిత్రను తెలుసుకోవడానికి తోడ్పడిన వాటిలో ముఖ్యమైంది ఏది?
జ: పురావస్తు, మానవశాస్త్రాలు

 

9. పిరమిడ్లు ఏ దేశంలో ఉన్నాయి?
జ: ఈజిప్ట్

 

10. సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలేవి?
జ: మెసపటోమియా, ఈజిప్ట్

 

11. నాగార్జున కొండ ప్రాంతాల్లో లభించిన ఉత్ఖాతనాలు ఎవరి కాలం నాటి విశేషాలను తెలుసుకోవడానికి దోహదపడుతున్నాయి?
జ: ఇక్ష్వాకులు

 

12. ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే శాస్త్రమేది?
జ: సమాజశాస్త్రం

 

13. పంజాబ్, సింధు రాష్ట్రాల్లో హరప్పా, మెహంజోదారో తవ్వకాలను అధ్యయనం చేసింది ఎవరు?
జ: జాన్ మార్షల్

 

14. భూమిపై ఏర్పడిన మొదటి ప్రాణి ఏది?
జ: లార్వా

 

15. మానవ జీవిత పరిణామంలో మూడో దశ ఏది?
జ: హోమోఎరక్టస్

 

16. ఆధునిక మానవుడికి సమీప పూర్వీకులు ఎవరు?
జ: ఆస్ట్రోఫిథికస్

 

17. గుహ చిత్రాలు ఎవరి అనుభవాలను తెలియజేస్తాయి?
జ: హోమోసెపియన్స్

 

18. మానవ నాగరికత పరిణామక్రమం ఏ యుగంలో ఆరంభమైంది?
జ: రాతి యుగం

 

19. ఏ యుగంలో మానవుడు తన అనుభవాలను బొమ్మల రూపంలో చిత్రించాడు?
జ: పాతరాతి యుగం

 

20. మానవుడి ఆలోచన, విచక్షణా జ్ఞానం ఏ యుగంలో పెరిగాయి?
జ: మధ్యరాతి యుగం

 

21. మానవుడు నిప్పును ఉపయోగించడం ఏ యుగంలో తెలుసుకున్నాడు?
జ: మధ్యశిలా యుగం

 

22. మానవుడు సామాజిక వర్గాల్లో నివసించడం, సాంఘిక సంబంధాలను ఏర్పరచుకోవడాన్ని ఏ యుగంలో గమనించవచ్చు?
జ: మధ్య శిలా యుగం

 

23. మానవుడు మట్టి కుండలను కాల్చడం ఏ శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టుగా పరిణమించింది?
జ: రసాయనశాస్త్రం

 

24. చేనేత కళల ప్రారంభం ఏ శాస్త్ర అభ్యాసానికి పునాది వేసింది?
జ: భౌతికశాస్త్రం

 

25. ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది?
జ: చక్రం ఆవిష్కరణ

 

26. రాగి, తగర యుగ కాలం ఏది?
జ: క్రీ.పూ. 4000

 

27. సంస్కృతి అంటే ఏమిటి?
జ: లలిత కళలు, తాత్విక చింతన

 

28. నాగరికత అంటే ఏమిటి?
జ: సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి

 

29. మానవులంతా సమష్టిగా సాధించింది?
జ: సంస్కృతి

 

30. మానవ నాగరికతారంభం ఏది?
జ: మెసపటోమియా నాగరికత

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మతోద్యమాలు - జైన మతం

ప్రపంచ చరిత్రతోపాటు భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 6వ శతాబ్దానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ శతాబ్దంలో 62 మతాలు ఆవిర్భవించాయి. చైనాలో కన్‌ప్యూషియస్ - కన్‌ఫ్యూషియనిజం, లౌజె - టావోయిజం, పర్షియాలో జొరాస్టర్ - జొరాస్ట్రియనిజం లాంటి మతాలతోపాటు భారతదేశంలో అజీవక, జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి.

 

మతాల ఆవిర్భవానికి కారణాలు:
* క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి వైదిక మతం ఆడంబరంగా మారి, అర్థం లేని అనంతమైన యజ్ఞ, యాగాది క్రతువులతో నిండి పోయింది.
* బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువైంది.
* యజ్ఞ యాగాదులు అధిక వ్యయ ప్రయాసలతో కూడి ఉండటం మొదలైనవి జైన, బౌద్ధ మతాల ఆవిర్భవానికి కారణమయ్యాయి. మోక్ష మార్గాన్ని కనుక్కోవడానికి, వర్ణ వ్యవస్థ, అసమానతలను తొలగించడానికి జైన, బౌద్ధ మతాలు కృషి చేశాయి.

 

అజీవకులు:

  మక్కలి గోసల దీని ప్రచారకుడు. ఇతడు 'ఏదీ మానవుడి చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది' అని ప్రచారం చేశాడు. ఇతడు ఆత్మ ముందే నిర్ణయించి ఉన్న పునర్జన్మల్లో చేరుతూ ఉంటుందని పేర్కొన్నాడు. మక్కలి గోసల గురువు - పురాణ కశ్యపుడు. అజిత కంబలి, పకుద కత్యాయన అజీవక మత బోధకులు.

 

జైన మతం 

  ద్వాదశ అంగాలు, ఉపాంగాలు, జైనకల్ప సూత్రాలు, వాస్తు శిల్పాలు జైన మతాన్ని గురించి వివరిస్తున్నాయి. జైన మత గురువులను తీర్థంకరులు అంటారు. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వారి పేర్లు - చిహ్నాలు:

 

తీర్థంకరులు చిహ్నాలు
1. వృషభనాథుడు ఎద్దు
2. అజిత ఏనుగు
3. సంభావ గుర్రం
4. అభినందన కోతి
5. సుమతీనాథ్ కొంగ
6. పద్మప్రభ ఎర్రగులాబీ
7. సుపర్శ్వ స్వస్తిక్
8. చంద్రప్రభ చంద్రుడు
9. సువిధ డాల్ఫిన్
10. శీతల కుచం
11. శ్రేయంశ నీటి ఏనుగు
12. వసుపూజ్య గేదె
13. విమలనాథ్ అడవి పంది
14. అనంతనాథుడు రాబందు
15. ధర్మ ఉడుము
16. శాంతి (హస్తిన రాజు) దుప్పి
17. కుంతు మేక
18. అర చేప
19. మల్లి (మిథిల రాజు కూతురు) కూజా
20. సువ్రత తాబేలు
21. నామ/ నేమినాథుడు నీలి గులాబీ
22. అరిష్టనేమి శంఖం
23. పార్శ్వ పాము
24. మహావీర సింహం

* జైనమతాన్ని స్థాపించింది వృషభనాథుడు. క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఈ మతాన్ని వెలుగులోకి తెచ్చిన మహావీరుడు జైనమతానికి నిజమైన స్థాపకుడిగా పేరుగాంచాడు.

 

వర్థమానుడు

  వర్థమానుడు క్రీ.పూ. 540లో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు జ్ఞాత్రిక క్షత్రియశాఖకు చెందిన సిద్ధార్థుడు, త్రిశాలి (వైశాలి ప్రభువైన చేతకుని సోదరి). వర్థమానుడి భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని/ అనోజ. 30 ఏళ్లు నిండక ముందే జీవిత సుఖాలను వదిలి, ఇంటిని విడిచి సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసి, రిజుపాలక నదీతీరాన జ్ఞానోదయం పొందాడు.

* వర్థమానుడు మక్కలి గోసల దగ్గర శిష్యరికం చేశాడు. కేవలిన్, నిర్గుందుడు, మహావీరుడు అనే బిరుదులను పొందాడు.
* వర్థమాన మహావీరుడు క్రీ.పూ. 468లో తన 72వ ఏట పావాపురిలో హస్తిపాలుడు అనే రాజగృహంలో మరణించాడు.
* జైన మత సిద్ధాంతాలు: వర్థమాన మహావీరుడు తన పూర్వీకుల జైన సిద్ధాంతాలకు రూపకల్పన చేసి తన బోధనల ద్వారా జైనమతాన్ని త్వరితగతిన వ్యాప్తిలోకి తీసుకువచ్చాడు.
* త్రిరత్నాలు: జైనుల పరమ లక్ష్యం సిద్ధశీల సంప్రాప్తి. సిద్ధశీల అంటే జనన మరణాల నుంచి ఆత్మకు విముక్తి సాధించడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వర్థమాన మహావీరుడు మూడు సూత్రాలను పేర్కొన్నాడు. అవి. 1. సరైన విశ్వాసం 2. సరైన జ్ఞానం 3. సరైన శీలం.
* జైన మత సమావేశాలు: జైన మత సమావేశాలను పరిషత్తులు అంటారు.
* మొదటి జైన పరిషత్: క్రీ.పూ. 300లో చంద్రగుప్త మౌర్యుడి కాలంలో జరిగింది. ప్రదేశం - పాటలీపుత్రం. నేతృత్వం వహించింది - భద్రబాహుడు, స్థూల భద్రుడు.
* రెండో జైన పరిషత్: క్రీ.శ. 6వ శతాబ్దంలో దేవార్థ క్షమశ్రయ అధ్యక్షతన వల్లభిలో జరిగింది.
* క్రీ.శ. 12వ శతాబ్దంలో హేమచంద్రుడి అధ్యక్షతన వల్లభ, మధురలో జైన పరిషత్‌లు జరిగాయి.

 

పంచ వ్రతాలు

1. జీవహింస చేయకూడదు

2. అసత్యం పలకకూడదు

3. దొంగతనం చేయకూడదు

4. ఆస్తి కలిగి ఉండకూడదు (అపరిగ్రహ)

5. బ్రహ్మచర్యం పాటించాలి. (5వ సూత్రాన్ని వర్థమాన మహావీరుడు చేర్చాడు)

* అహింసా సిద్ధాంతం: జైన మతం సమానతా సిద్ధాంతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అన్ని జీవులను సమంగా చూడాలని బోధించింది. జైనం ప్రకారం స్పష్టిలోని చరాచరాలన్నింటిలో జీవం ఉంటుంది. జీవం ఉన్న ఏ పదార్థాన్నీ హింసించకూడదనే నియమం పాటించేవారు. జైన మతస్థులు తమ బోధనల కోసం ప్రాకృత భాషను ఉపయోగించారు.

* జైన మత గ్రంథాలు: హేమచంద్రుని పరిశిష్ట పర్వం, త్రిసష్టసకల పురుష చరిత్ర, భద్రబాహుని కల్పసూత్రాలు, కొండ కుందాచారి సమయ సారం, తిరుతక్క దేవర్ జీవక చింతామణి మొదలైనవి.

* సల్లేఖనం: సల్లేఖన దీక్ష ద్వారా ఎవరైనా మోక్షం పొందవచ్చు. సల్లేఖనం అంటే కఠోర ఉపవాస దీక్ష. ఈ దీక్ష మానవుని ఆత్మను ప్రక్షాళనం చేసి, పునర్జన్మ లేని స్థానానికి చేరుస్తుందని విశ్వసించేవారు.

* జైనమత వ్యాప్తి: మహావీరుని వ్యక్తిత్వం, ఆకర్షణ శక్తి వల్ల తొలిదశలో జైనం నలుదిశలా వ్యాపించింది. మగధ పాలకులు జైన మతాన్ని అభిమానించి, పోషించారు. చంద్రగుప్త మౌర్యుడు, కళింగ ఖారవేలుడు, చాళుక్యులు, గాంగులు, కాదంబులు, రాష్ట్రకూటులు జైనమతాన్ని ఆదరించారు. కాలక్రమేణా జైనమతం ఆంధ్ర, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, మాళ్వా, గుజరాత్ ప్రాంతాలకు వ్యాపించింది. జైన మతంలో వర్తకులు ఎక్కువగా చేరారు.

* వాస్తు నిర్మాణం: రాజగిర్, గిరినార్, మౌంట్ అబు, మధుర, బుందేల్‌ఖండ్‌లలోని జైన దేవాలయాలు జైనుల వాస్తు నిర్మాణ కౌశలాన్ని ప్రతిబింబిస్తాయి. భువనేశ్వర్‌లోని చంద్రగిరి గుహల్లో కూర్చున్నట్లున్న జైన చిత్రం, సత్గవలో మలచిన జైన బొమ్మలు జైనమత శిల్పకళకు నిదర్శనాలు. 'అబూ' శిఖరం మీద నిర్మించిన దిల్వారా ఆలయం సుందరమైన శిల్ప సంపదకు నిలయం.

* జైన పండితులు: భద్రబాహు, హేమచంద్రుడు, కొండ కుందాచారి, పంప కవి, తిరుతక్క దేవర్ మొదలైనవారు జైన పండితులుగా ప్రసిద్ధి చెందారు.

* జైన గుహలు: శ్రావణ బెళగొళలోని బాహుబలి విగ్రహం, ఎల్లోరా, ఉదయగిరి మొదలైనవి.

 

జైనమత క్షీణత

  మహావీరుని తర్వాత కొంతకాలానికి జైనమతం శ్వేతాంబర (తెల్లని వస్త్రం ధరించేవారు), దిగంబర అనే రెండు భాగాలుగా చీలిపోయింది. అదేసమయంలో వైదిక మతంలో ప్రతి సంస్కరణోద్యమం బయలుదేరడం, తర్వాతి కాలంలో రాజుల ఆదరణ లేకపోవడం వల్ల జైన మతం త్వరలోనే క్షీణించింది.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మహారాష్ట్రుల విజృంభణ

  క్రీ.శ. 17 వ శతాబ్దం ద్వితీయార్ధంలో మరాఠా రాజ్య ఆవిర్భావం, 18 వ శతాబ్దంలో వారి పతనం, 19 వ శతాబ్దం మొదట్లో వారి రాజ్యం పూర్తిగా అదృశ్యమవడం మొదలైన అంశాలను భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పొచ్చు. మరాఠాల రాజ్య పాలన, అప్పటి పరిస్థితులు, శివాజీ ఛత్రపతిగా మారడం మొదలైన విషయాలను గురించి తెలుసుకుందాం.
  మరాఠాల విజృంభణకు దోహదం చేసిన అంశాలను కింది విధంగా వివరించవచ్చు.

* భౌగోళిక పరిస్థితులు: మహారాష్ట్ర భౌగోళిక రూపురేఖలు మరాఠాల వ్యక్తిత్వం, చరిత్రపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఇది మరాఠాలకు కావలసిన రక్షణ కల్పించింది.

* మరాఠాలు నివసిస్తున్న ప్రాంతం దట్టమైన అడవులు, కొండలు, లోతైన లోయలతో కూడిన పీఠభూమి ప్రాంతం. వీటితోపాటు ఇక్కడ తక్కువ వర్షపాతం, వ్యవసాయ వనరుల కొరత మరాఠాలను విలాసాలకు, సోమరితనానికి దూరంగా ఉండేటట్లు చేసింది. అలాగే వారిలో స్వయంసమృద్ధి, ధైర్యసాహసాలు, నిరాడంబరత, సాంఘిక సమానత్వం, మనిషిని మనిషిగా గౌరవించడం అనే సుగుణాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడింది.

* సారవంతమైన భూమి లేకపోవడంతో మరాఠాలు జీవనోపాధి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టించి పని చేయాల్సి వచ్చేది.

* అక్కడున్న కొండలు వారికి గిరి దుర్గాలుగా ఉపయోగపడ్డాయి.

* మరాఠా ప్రాంతం కొండలు, లోతైన లోయలు, దట్టమైన అడవులతో కూడి ఉండటం వారి శత్రువుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, గొరిల్లా యుద్ధతంత్రం ద్వారా శత్రువులను ఇబ్బంది పెట్టడానికి దోహదం చేసింది.

* భక్తి ఉద్యమం: మహారాష్ట్రలోని భక్తి ఉద్యమకారులైన తుకారాం నామ్‌దేవ్, వామన పండిత్, ఏక్‌నాథ్ మొదలైనవారు దేవుడిపై భక్తి, దేవుడి ముందు మానవులంతా సమానులేనని బోధించారు. మరాఠా భాష, మాండలికంలో రచించిన పాటలు మరాఠాల్లో ఐకమత్యాన్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించాయి.

* రాజకీయ, సైనిక పాలనలో అనుభవం: బహమని రాజ్యం అంతరించడంతో దక్కనులోని అహ్మద్‌నగర్, బీదర్, బీరార్, బీజపూర్, గోల్కొండల్లో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ రాజ్యాల్లో మరాఠాలు రాజకీయ, సైనిక విభాగాల్లో పనిచేసి, అనుభవాన్ని గడించారు. దక్కను సుల్తానులు మరాఠా సర్దారులను పరిపాలనలోని వివిధ విభాగాల్లో నియమించారు.

 

శివాజీ ...

* మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని అలంకరించిన కొద్దిమంది వ్యక్తుల్లో శివాజీ ఒకడు. ఇతడు కొత్త మరాఠా రాజ్యం 'స్వరాజ్యం' స్థాపనకు కారకుడు. శివాజీ జున్నార్ దగ్గరలోని శివనేర్ దుర్గంలో 1627 లో జన్మించాడు. షాజీభోంస్లే, జిజాబాయి ఇతడి తల్లిదండ్రులు. ఇతడు తల్లివైపు నుంచి యాదవ వంశానికి, తండ్రివైపు నుంచి మేవాడ్‌ను పాలించిన శిషోదయ వంశానికి చెందినవాడు.
షాజీ అహ్మద్‌నగర్‌ను పాలించిన నిజాంషాహీ పాలకుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పని చేశాడు. మొగలులు అహ్మద్‌నగర్‌ను ఆక్రమించిన తర్వాత షాజీ బీజపూర్ రాజ్యానికి వచ్చాడు. ఈ కాలంలో షాజీ తన మొదటి భార్య జిజాబాయిని, కొడుకు శివాజీని నిర్లక్ష్యం చేశాడు. కర్ణాటక ప్రాంతంలో ఒక జాగీరును ఏర్పాటు చేశాడు. శివాజీ, అతడి తల్లి పూనా జాగీర్‌లో ఉండేవారు.

* శివాజీ చిన్నతనం నుంచే గొప్ప ధైర్యసాహసాలు కలిగి ఉండేవాడు. జిజాబాయితోపాటు పూనా జాగీరు పాలకుడు దాదాజీ కొండదేవ్ శివాజీ బాల్య జీవితంలో ఒక కీలక పాత్ర పోషించాడు. ఇతడు శివాజీకి పరిపాలన, యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చాడు. శివాజీ తన మత గురువైన సమర్థ రామదాసు నుంచి స్ఫూర్తి పొందాడు. ఇతడు 'కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవని' శివాజీకి బోధించాడు.

* శివాజీ మావళీల సహాయంతో ఒక శక్తిమంతమైన సంచార సైన్యాన్ని రూపొందించాడు. దక్కను సుల్తానుల బలహీనత, ఉత్తర భారతదేశంలో మొగలుల నిరంతర దండయాత్రలు శివాజీ తన బలాన్ని పెంచుకోవడానికి అవకాశం కల్పించాయి. పూనా దగ్గరలోని తోరణ, కొండనే, రాయఘడ్ గిరి దుర్గాలను శివాజీ ఆక్రమించుకున్నాడు. దాదాజీ కొండదేవ్ మరణం తర్వాత శివాజీ పూనా జాగీరుకు యజమాని అయ్యాడు. జావళి కోట ఆక్రమణతో 1646 లో శివాజీ తన నిజమైన దండయాత్రల పర్వాన్ని ప్రారంభించాడు.

 

పురంధర్ సంధి

  ఔరంగజేబు దక్కను వైస్రాయిగా ఉన్న షయిస్తఖాన్‌ను బెంగాల్ వైస్రాయిగా పంపాడు. అంబర్‌కు చెందిన రాజా జైసింగ్‌ను శివాజీని నియంత్రించేందుకు పంపాడు. జైసింగ్ తన తెలివితేటలతో శివాజీ రాజ్యాన్ని అన్నివైపుల నుంచి శత్రువులు దాడిచేసేలా ఏర్పాట్లు చేశాడు. పురంధర్ కోటను ముట్టడించాడు. మొగలులు శివాజీ రాజధాని రాయఘడ్‌ను దిగ్భందం చేశారు. వేరే గత్యంతరం లేక శివాజీ జైసింగ్‌తో 1665 లో పురందర్ సంధిని కుదుర్చుకున్నాడు.

సంధి షరతులు: శివాజీ తన ఆధీనంలోని 35 కోటల్లో 23 కోటలతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లోని సంవత్సరానికి 4 లక్షల హన్నుల ఆదాయం వచ్చే భూభాగాన్ని మొగలులకు ఇవ్వడానికి అంగీకరించాడు.

* దీనికి బదులుగా సంవత్సరానికి 4 లక్షల హన్నుల ఆదాయం వచ్చే బీజపూర్ - కొంకణ్ ప్రాంతంలోని భూభాగాన్ని, బాలాఘాట్ ప్రాంతంలో సంవత్సరానికి 4 లక్షల హన్నుల ఆదాయం వచ్చే భూభాగాన్ని మొగలులు శివాజీకి ఇచ్చారు. దీనికోసం శివాజీ కంతులవారీగా 40 లక్షల హన్నులు మొగలులకు చెల్లించాలి.

* శివాజీ కుమారుడు శంభాజీ ఔరంగజేబు కొలువులో మున్సబుదార్‌గా చేరడానికి అంగీకారం కుదిరింది.

* ఈ సంధి షరతుల్లో అంతర్భాగంగా శివాజీ మొగలు దర్బార్‌ను సందర్శించడానికి అంగీకరించాడు. రాజా జైసింగ్ మొగలు దర్బార్‌లో ఏవిధమైన అగౌరవం జరగదని ఔరంగజేబుకు సిఫారసు చేసి, దక్కను వైస్రాయిగా నియమించేటట్లు చూస్తానని శివాజీకి హామీ ఇచ్చాడు. శివాజీ ఔరంగజేబు దర్బార్ వైభవాన్ని, మొగలుల బలాబలాలను స్వయంగా చూడాలని భావించి ఈ షరతుకు ఒప్పుకున్నాడని ప్రొ సర్దేశాయి పేర్కొన్నాడు.

* శివాజీ తన కుమారుడు శంభాజీతోపాటు క్రీ.శ. 1666 మే 9 న మొగలు దర్బార్‌ను సందర్శించాడు. అయితే దర్బార్‌లో చక్రవర్తి శివాజీకి తగిన గౌరవం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన శివాజీ చక్రవర్తిని దూషించాడు. ఔరంగజేబు శివాజీని అరెస్టు చేసి ఆగ్రా కోటలో నిర్బంధించాడు. తగిన సలహాకోసం రాజా జైసింగ్‌కు లేఖ రాశాడు. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేలోపే శివాజీ నిర్బంధం నుంచి తప్పించుకున్నాడు.

* శివాజీ క్రీ.శ. 1666 నుంచి క్రీ.శ. 1669 మధ్య 3 ఏళ్లపాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. తర్వాత మొగలులతో వైరాన్ని పునరుద్ధరించి సూరత్‌పై రెండోసారి దాడిచేసి 66 లక్షల రూపాయల విలువగల సంపదను దోచుకున్నాడు. పురంధర్ సంధి షరతుల ప్రకారం మొగలులకు ఇచ్చిన 23 కోటలను వారి నుంచి తిరిగి ఆక్రమించుకున్నాడు. మొగలు సామ్రాజ్యంలోని వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఆప్ఘనుల తిరుగుబాటు శివాజీ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి బాగా దోహదపడింది. దక్కనులోని మొగలు సైన్యంలోని కొంత భాగాన్ని వాయవ్య సరిహద్దు రాష్ట్రానికి తరలించారు. దీంతో శివాజీ బీరార్, ఖాందేష్‌లను మొగలుల నుంచి, పన్హాలా, సతారాలను బీజపూర్ సుల్తాన్ నుంచి ఆక్రమించుకున్నాడు.

* శివాజీ అధికారం తారస్థాయికి చేరింది. క్రీ.శ. 1674 జూన్ 16 న రాయఘడ్ దుర్గంలో శివాజీ పట్టాభిషేక మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శివాజీ ఛత్రపతి బిరుదును స్వీకరించాడు. ప్రముఖ విద్వాంసుడు, కాశీ పండితుడైన గార్గభట్టు అధ్యక్షతన ఎనిమిది మంది పురోహితుల సమక్షంలో ఈ పట్టాభిషేకం జరిగింది. శివాజీ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇతర మరాఠా సర్దారులతో వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నాడు.

 

శివాజీ దక్షిణదేశ దండయాత్రలు

  మొగలులు వాయవ్య భాగంలో తిరుగుబాట్లతో సతమతమవడం శివాజీకి కలిసొచ్చింది. ఇది శివాజీ దక్షిణ భారతదేశంపై తన దృష్టిని సారించడానికి తోడ్పడింది. శివాజీ గోల్కొండ సుల్తాను అబ్దుల్ హసన్ సహాయంతో బీజపూర్, కర్ణాటకలపై దండయాత్ర చేశాడు. కర్ణాటకలో సంపాదించే సంపదను రెండు రాజ్యాలు పంచుకునే నిబంధన ప్రకారం అబ్దుల్ హసన్ శివాజీకి సైనిక సహకారం అందించాడు. శివాజీ కర్ణాటకను దోచుకుని, తర్వాత తన సోదరుడు వెంకోజీ ఆధీనంలోని జింజీ, వెల్లూరులను ఆక్రమించాడు.

* ఈ దండయాత్రలో భారీగా సంపదను దోచుకున్న శివాజీ, ఈ సంపదను గోల్కొండ సుల్తానుతో పంచుకోవడానికి నిరాకరించాడు. దీంతో వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దక్షిణ భారతదేశ దండయాత్ర శివాజీ జీవితంలో చివరిది. శివాజీ 1680 లో మరణించాడు. ఈ దండయాత్ర తన స్వరాజ్యం ఆర్థికపరిస్థితిని మెరుగుపరచుకోవడానికే చేపట్టాడు. శివాజీ రాజ్యం పశ్చిమతీరంలో కల్యాణ్ నుంచి గోవా వరకు విస్తరించింది. దక్షిణాన బెల్గాం నుంచి తుంగభద్రా నదీతీరం వరకు, మద్రాసు రాష్ట్రంలోని వెల్లూరు, జింజీ వరకు విస్తరించింది.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వరాజ్య పార్టీ స్థాపన

  గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని అసంతృప్తికి గురి చేసింది. 1922 మార్చిలో గాంధీజీ అరెస్ట్ తర్వాత జాతీయ నాయకుల్లో నిరాశ, నిస్పృహ చోటు చేసుకున్నాయి. ఈ సంధికాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాల విషయమై కాంగ్రెస్ నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలు చివరకు కాంగ్రెస్ చీలిపోవడానికి దారితీశాయి.

  చిత్తరంజన్‌దాస్, మోతీలాల్ నెహ్రూ, హకీం అజ్మల్‌ఖాన్, అలీ సోదరులు తదితరుల నాయకత్వంలోని ఒక వర్గం శాసన మండళ్ల బహిష్కరణకు స్వస్తి పలకాలని నిశ్చయించుకుంది. తద్వారా జాతీయవాదులు మండళ్లలోకి ప్రవేశించి వాటిలో ప్రభుత్వ బలహీనతలను ఎత్తిచూపే అవకాశం ఉంటుందని భావించాడు. ఈ వర్గాన్ని 'స్వరాజ్యవాదులు', 'మార్పు కోరుకునే వర్గం'గా పేర్కొంటారు.

* వల్లభాయ్ పటేల్, రాజేంద్రప్రసాద్, సి. రాజగోపాలాచారి, ఎం.ఎ. అన్సారీ నాయకత్వంలోని మరో వర్గాన్ని 'మార్పు కోరని వర్గం'గా పేర్కొంటారు. వీరు శాసన మండళ్లలోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకించారు. ఈ వర్గం నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని, బహిష్కరణ, సహాయ నిరాకరణ కార్యక్రమాలను కొనసాగించాలని భావించింది.

* అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మోతీలాల్ నెహ్రూ, డాక్టర్ ఎం.ఎ. అన్సారీ, జమ్నాలాల్ బజాజ్, సి. రాజగోపాలాచారిలతో కూడిన ఒక ఉపసంఘాన్ని నియమించింది. దేశంలో పర్యటించి శాసనోల్లంఘన ఉద్యమంపై ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడం ఈ ఉపసంఘ కర్తవ్యం. ఈ ఉపసంఘం సిఫారసులు గాంధీజీ విధేయులకు, గాంధీజీ వ్యతిరేకవర్గానికి మధ్య భేదాభిప్రాయాలకు దారితీశాయి.

* 1922 డిసెంబరులో గయలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్యవాదులు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. దీంతో చిత్తరంజన్‌దాస్, మోతీలాల్‌నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శి పదవులకు రాజీనామా చేశారు. 1923 జనవరి 1 న కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ఈ పార్టీకి చిత్తరంజన్‌దాస్ అధ్యక్షుడిగా, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా వ్యవహరించారు. స్వరాజ్యవాదులు శాసన మండళ్లలో తమ బలాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. ప్రజల్లో ఉత్సాహం నింపడానికి ఎన్నికలే ప్రధాన సాధనమని వీరు భావించారు.

* 1923 ఫిబ్రవరిలోనే మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఈ రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య విభేదాలను తగ్గించడానికి యత్నించారు. చివరకు 1923 మేలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 'స్వరాజ్య పార్టీ' ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమోదం తెలిపింది.

* 1925 నాటికి గాంధీజీ కూడా ఈ విషయంలో మెతక వైఖరి ప్రదర్శించి, స్వరాజ్య పార్టీని కాంగ్రెస్ రాజకీయ విభాగంగా అంగీకరించారు.

 

కార్యక్రమాలు

  1923 నవంబరులో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వరాజ్యపార్టీ మితవాదులను, ఉదారవాదులను ఓడించింది. కేంద్ర శాసనసభలో 101 సీట్లకు 42 గెలుచుకుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సెంట్రల్ ప్రావిన్స్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించి, బెంగాల్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బొంబాయి, యునైటెడ్ ప్రావిన్స్, అస్సాంలలో తగిన సీట్లు గెలుచుకుంది.

* ప్రధాన డిమాండ్లు: రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, పౌర, సైనిక సర్వీసుల్లో భారతీయులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా వ్యతిరేకించింది.

* విజయాలు: 1924 లో కేంద్ర శాసనసభలో ఆర్థిక బిల్లును వ్యతిరేకించింది. స్వరాజ్యపార్టీ నాయకులను శాంత పరిచేందుకు 1924 లో తొమ్మిదిమంది సభ్యులతో కూడిన సంస్కరణల విచార సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడు సర్ అలెగ్జాండర్ ముద్దిమాన్. దీన్నే ముద్దిమాన్ సంఘం అనే పేరుతో కూడా పిలుస్తారు.

* 1919 మాంటేగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల పనితీరును అధ్యయనం చేయడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. భారతీయులకు  నష్టం  కలిగించేలా  ప్రభుత్వం 1928 లో ప్రవేశపెట్టిన   ప్రజా రక్షణ బిల్లు  చట్టం  కాకుండా చూడటం స్వరాజ్యపార్టీ సాధించిన మరో విజయం.

* ఉప్పు మీద పన్ను తగ్గించడం, కార్మికుల పరిస్థితులు మెరుగయ్యేలా చర్యలు చేపట్టడం, బెంగాల్‌లో కొన్ని చట్టాలను వెనక్కు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, సెంట్రల్ ప్రావిన్స్‌లో మంత్రులు రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చి ద్వంద్వ ప్రభుత్వం పనిచేయకుండా చూడటం, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవకుండా దూరంగా ఉండటం, ప్రభుత్వ విధానాలను బాహాటంగా విమర్శించడం స్వరాజ్యవాదుల ఇతర విజయాలు.

* 1925 లో చిత్తరంజన్‌దాస్ మరణం తర్వాత స్వరాజ్యపార్టీ బలహీనపడింది. లాలా లజపతిరాయ్, మదన్ మోహన్ మాలవీయ, ఎన్.సి. కేల్కర్ హిందువులకు మేలు చేకూరాలంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించి, పదవులు స్వీకరించాలని భావించారు. ఈ వర్గం మోతీలాల్ నెహ్రూపై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసింది.

* 1926 లో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్యపార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో కేంద్ర శాసనసభలో 40 సీట్లు, మద్రాసు రాష్ట్ర శాసన మండలిలో సగం సీట్లు సాధించినా, మిగతా రాష్ట్రాల్లో పరాజయాన్ని చవి చూసింది.

* 1929 లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశం పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అనుకూలంగా స్వరాజ్యపార్టీ శాసనసభలను బహిష్కరించి, చివరకు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమైంది.

 

ప్రాధాన్యం

  బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా ఉంటూ నిరాశ, నిస్పృహలో ఉన్న సాధారణ ప్రజానీకంలో ఉత్సాహం నింపడానికి ప్రయత్నం చేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని మొదట ప్రతిపాదించింది స్వరాజ్యపార్టీనే. సైమన్ కమిషన్ నియామకం దీని కృషి ఫలితమే. శాసన మండళ్లలో ప్రభుత్వ నిరంకుశ వైఖరిని బహిర్గతం చేయడంలో విజయం సాధించింది. వీరి ప్రయత్నాల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం చివరకు ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి, రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి అంగీకరించింది.

 

సైమన్ కమిషన్ 

  బ్రిటిష్ ప్రభుత్వం 1927 నవంబరు 8 న సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భారతీయులకు స్థానం లేకపోవడంతో ఈ కమిషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు.

* మద్రాసులో 1927 డిసెంబరులో ఎం.ఎ. అన్సారీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సైమన్ కమిషన్‌ను అన్ని దశలు, అన్ని రూపాల్లో బహిష్కరించాలని నిర్ణయించారు. ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్, ముస్లిం లీగ్, హిందూ మహాసభ మొదలైన రాజకీయ పార్టీలు కూడా సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని తీర్మానించాయి.
* అయితే ముస్లింలలో ఒక వర్గం, ఐరోపావారు, ఆంగ్లో-ఇండియన్లు, అణగారిన వర్గాలు ఈ కమిషన్‌ను స్వాగతించాయి. సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3 న బొంబాయిలో అడుగుపెట్టింది. ఆ రోజున దేశవ్యాప్త హర్తాళ్ పాటించారు. కమిషన్ కలకత్తా, లక్నో, పూనా, విజయవాడ, లాహోర్‌లలో పర్యటించింది. నల్లజెండాల ప్రదర్శన, 'సైమన్ వెనక్కి వెళ్లు' (సైమన్ గో బ్యాక్) నినాదాలతో నిరసన తెలిపారు.

* లక్నోలో జవహర్‌లాల్ నెహ్రూ, జి.బి. పంత్‌లపై లాఠీఛార్జ్ జరిగింది. 1928 అక్టోబరులో లాహోర్‌లో లాలా లజపతిరాయ్‌ని పోలీసులు తీవ్రంగా కొట్టారు. గాయాలపాలైన ఆయన చివరకు అదే ఏడాది నవంబరు 17 న మరణించారు. దీనికి ప్రతీకారంగా శాండర్స్ అనే పోలీసు అధికారిని భగత్‌సింగ్ కాల్చి చంపాడు.

* సైమన్ కమిషన్ 1930, మేలో నివేదిక సమర్పించింది. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ రద్దు, ప్రాతినిధ్య ప్రభుత్వ ఏర్పాటు ముఖ్యమైన ప్రతిపాదనలు. సైమన్ కమిషన్ నివేదికపై లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించారు. ఈ చర్చల ఆధారంగా 1935 చట్టాన్ని రూపొందించారు. అయితే ముస్లిం లీగ్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీలు సైమన్ నివేదికను వ్యతిరేకించాయి. భారతీయులను సంతృప్తిపరచడానికి అప్పటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ 1929 అక్టోబరు 31 న (దీపావళి) భవిష్యత్తులో భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. దీన్నే దీపావళి ప్రకటనగా పేర్కొంటారు. 

 

బట్లర్ కమిటీ

  సైమన్ కమిషన్‌తోపాటు బ్రిటిష్ ప్రభుత్వం 1927 లో మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులు హార్‌కోర్ట్ బట్లర్, హోల్డ్స్ వర్త్, ఎస్.సి. పీల్. స్వదేశీ సంస్థానాలు, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి మార్గాలను సూచించడమే దీని ప్రధాన బాధ్యత. ఈ సంఘానికి అధికారికంగా పెట్టిన పేరు - భారత రాజ్యాల సంఘం. ఈ సంఘం 16 స్వదేశీ సంస్థానాలను సందర్శించి, 1929 లో బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.

* నెహ్రూ నివేదిక (1928): నాటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించగలరా అని భారతీయులకు సవాలు విసిరారు. దీనికి జవాబుగా 1928 ఫిబ్రవరిలో దిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
* 1928 లో బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. కలకత్తాలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముందు నెహ్రూ నివేదికను ఉంచారు. దీనిపై మహ్మద్ అలీ జిన్నా, ఎం.ఆర్. జయకర్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

* జిన్నా 14 సూత్రాలు (1929): దిల్లీలో 1929 మార్చిలో జరిగిన ముస్లింలీగ్ సమావేశంలో మహ్మద్ అలీ జిన్నా పద్నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. నెహ్రూ నివేదికను తోసిపుచ్చారు. పద్నాలుగు సూత్రాలను అమలు చేయకుండా భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఏ ప్రణాళికా ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని ప్రకటించారు.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వరాజ్య పార్టీ స్థాపన

1. 1922 లో గయలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు?
జ: చిత్తరంజన్‌దాస్

 

2. కిందివారిలో మార్పు కోరని వర్గానికి చెందనివారు?
     ఎ) వల్లభాయ్ పటేల్      బి) ఎం.ఎ. అన్సారీ     సి) రాజగోపాలాచారి      డి) విఠల్‌భాయ్ పటేల్
జ: డి (విఠల్‌భాయ్ పటేల్)

 

3. స్వరాజ్య పార్టీకి కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి?
జ: మోతీలాల్ నెహ్రూ

 

4. స్వరాజ్యపార్టీ కృషితో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?
: అలెగ్జాండర్ ముద్దిమాన్

 

5. సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి?
జ: బిర్కెన్ హెడ్

 

6. స్వదేశీ సంస్థానాలతో సంబంధాలను మెరుగు పరచుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంఘం?
: బట్లర్

 

7. సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు?
జ: బాల్డ్విన్

 

8. ప్రజారక్షణ బిల్లు చట్టం కాకుండా అడ్డుకున్న పార్టీ?
జ: స్వరాజ్య

 

9. నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగం కానిది?
జ: కుటీర పరిశ్రమలు

 

10. సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలనే నిర్ణయాన్ని ఏ కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్నారు?
జ: మద్రాసు

 

11. సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో భారతదేశంలో పర్యటించింది?
జ: 1928

 

12. లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా శాండర్స్ అనే పోలీసు అధికారిని చంపింది?
జ: భగత్‌సింగ్

 

13. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించమని సవాలు విసిరిన వ్యక్తి?
జ: బిర్కెన్ హెడ్

 

14. నెహ్రూ నివేదికపై జిన్నాతో తీవ్రంగా విభేదించింది?
జ: ఎం.ఆర్. జయకర్
 

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన

  భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు అనేక రాజకీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. అయితే వీటిలో ప్రధానమైంది 1876లో కలకత్తాలో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్. ఇది సివిల్ సర్వీస్ వ్యవస్థలో సంస్కరణలు, కౌలుదారుల హక్కుల రక్షణ, తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల హక్కులు మొదలైన విషయాలపై పోరాడింది. బెంగాల్‌లోని గ్రామాలు, పట్టణాల్లో, బెంగాల్ రాష్ట్రం బయట అనేక నగరాల్లో శాఖలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్త సంస్థగా ఎదగడానికి 1883, 1885లో రెండు జాతీయ సమావేశాలను కూడా నిర్వహించింది.

 

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన

  భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందున్న సంస్థలన్నీ ఏదో ఒక ప్రయోజనం కోసం ఏర్పడినవే. అవన్నీ ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై, స్థానిక సమస్యల పట్ల దృష్టి సారించాయి. అయితే జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను కొందరు జాతీయ నాయకులు గుర్తించారు. దీంతో దూరదృష్టి కలిగిన రాజకీయవేత్తలు దేశవ్యాప్త సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు.

* పదవీ విరమణ పొందిన ఆంగ్లేయ ఉద్యోగి ఎ.ఒ. హ్యూమ్ అలాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు వారంతా ఆయనకు తమ సహకారాన్ని అందించారు. 1883 లో కలకత్తా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లకు రాసిన బహిరంగ లేఖలో హ్యూమ్ అఖిల భారత రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నారు.
* 1885 లో భారత జాతీయ యూనియన్ అనే సంస్థను ఏర్పాటు చేసి మూడు ప్రెసిడెన్సీలలో పర్యటించాడు. అదే ఏడాది డిసెంబరులో పూనాలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే పూనాలో కలరా వ్యాధి వ్యాపించడంతో సమావేశ వేదికను బొంబాయిలోని తేజ్‌పాల్ సంస్కృత పాఠశాలకు మార్చాల్సి వచ్చింది.
* దాదాబాయి నౌరోజీ సూచన మేరకు 'భారత జాతీయ యూనియన్‌'లో యూనియన్‌ను తొలగించి దాని స్థానంలో కాంగ్రెస్‌ను చేర్చారు.
* కాంగ్రెస్ మొదటి సమావేశం డిసెంబరు 28 న బొంబాయిలో ఉమేశ్‌చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి సమావేశానికి బెంగాల్ నాయకులను దూరంగా ఉంచారు.
* కాంగ్రెస్ రెండో సమావేశం 1886 లో కలకత్తాలో జరిగింది. 436 మంది ప్రతినిధులు హాజరైన ఈ సభకు దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించారు.
* మూడో సమావేశం 1887 లో మద్రాసులో జరిగింది. దీనికి బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షత వహించారు. నాలుగో సమావేశం 1888 లో అలహాబాద్‌లో జరిగింది. దీనికి జార్జి యూల్ అధ్యక్షత వహించి, ఆ బాధ్యత చేపట్టిన తొలి విదేశీయుడయ్యారు.
* భారత జాతీయ ఉద్యమం మూడు దశల్లో సాగింది.
1. మితవాద యుగం (క్రీ.శ. 1885 - 1905)
2. అతివాద యుగం (క్రీ.శ. 1905 - 1919)
3. గాంధీయుగం (క్రీ.శ. 1919 - 1947)

 

మితవాద యుగం

  కాంగ్రెస్ మొదట్లో ప్రభుత్వ విధానాలను, చర్యలను విమర్శిస్తూ, సంస్కరణలు చేపట్టాలని కోరుతూ తీర్మానాలు చేసింది. ఏటా బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయతను ప్రకటించింది. కాంగ్రెస్ చేపట్టిన మితవాద చర్యల వల్ల ఈ కాలాన్ని మితవాద యుగంగా పిలిచారు. కాంగ్రెస్ పట్ల బ్రిటిష్ ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించింది. అయితే ప్రభుత్వం కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా భావించింది. దీంతో 19 వ శతాబ్దం చివరి నాటికి కాంగ్రెస్ డిమాండ్లలో, పోరాట విధానాల్లో మార్పు వచ్చింది.

* ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో మితవాద జాతీయ నాయకులు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లోలాగా భారతదేశంలో కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే స్వపరిపాలనకు అనుమతించాలని కోరారు. మొదటిసారిగా 1905 లో గోపాలకృష్ణ గోఖలే, 1906 లో దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్ తరపున ఈ డిమాండ్ చేశారు.

మితవాద నాయకుల్లో ముఖ్యులు: దాదాబాయి నౌరోజీ, మహదేవ గోవింద రనడే, సురేంద్రనాధ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్‌త్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే, దీన్ షా వాచా, రాస్ బిహారి ఘోష్, ఆనందమోహన్ బోస్, రమేష్ చంద్రదత్, కె.టి. తెలాంగ్, ఎ.సి. మజుందార్, సుబ్రమణ్య అయ్యర్, ఆనందాచార్యులు, విలియం వెడ్డర్ బర్న్, హెన్రీ కాటన్ మొదలైనవారు.

 

ప్రధానమైన డిమాండ్లు:
* భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తూ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌ను విస్తరించడం
* ఉప్పు మీద పన్నును, రక్షణ బడ్జెట్‌ను తగ్గించడం
* భారత వస్త్ర పరిశ్రమను తిరిగి అభివృద్ధి చేయడం
* ఆంగ్లేయ అధికారుల స్థానంలో భారతీయ అధికారులను నియమించడం
* భారతీయ పత్రికలకు తగినంత స్వేచ్ఛ ఇవ్వడం
* పోలీసు శాఖలో సంస్కరణలను ప్రవేశపెట్టడం
* భూస్వాముల అరాచకాల నుంచి రైతులకు రక్షణ కల్పించడం
* పోటీ పరీక్షలను భారతదేశంలోనూ నిర్వహించడం
* కరవు కాటకాలు సంభవించినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం
* రైతులకు రుణ సౌకర్యాలు కల్పించడం
* న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయడం
* మన దేశం నుంచి ఇంగ్లండ్‌కి సంపద తరలింపును ఆపడం
* భారతదేశంలో సాంకేతిక, పారిశ్రామిక విద్యను అభివృద్ధి చేయడం, మొదలైనవి.

 

మితవాదుల విధానాలు

  మితవాదుల విధానాలను రాజ్యాంగబద్ధమైన పోరాటంగా పేర్కొనవచ్చు. వారు సమావేశాలు నిర్వహించడం, ప్రసంగాలు, తీర్మానాలు చేయడానికే పరిమితమయ్యారు. చాలా అరుదుగా మాత్రమే విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం లాంటి కార్యక్రమాలను చేపట్టారు. వారు తమ రాజకీయ కార్యకలాపాలను విద్యావంతులకే పరిమితం చేసి సామాన్య ప్రజలు జాతీయ ఉద్యమంలో పాలుపంచుకోవడానికి అవకాశం కల్పించలేదు. మితవాద నాయకులు రాజకీయ హక్కులు, స్వయంపాలనను క్రమంగా సాధించాలనుకున్నారే గానీ వెంటనే కావాలని కోరలేదు.

 

విజయాలు

* ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించడం
* జాతి, మత, కుల, ప్రాంతీయ సంకుచిత భావాలను తొలగించి ప్రజాస్వామ్య, జాతీయ భావాలను ప్రచారం చేయడం.
* బ్రిటిష్ సామ్రాజ్యవాద విధానాలతో భారతదేశ సంపదను దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడం. ఉదా: దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించిన సంపద తరలింపు సిద్ధాంతం.
* భవిష్యత్తులో భారత జాతీయ ఉద్యమం మరింత ఉద్ధృతం కావడానికి అవసరమైన గట్టి పునాదులు నిర్మించడం.
* బ్రిటిష్ ప్రభుత్వం 1892 లో భారత కౌన్సిళ్ల చట్టాన్ని రూపొందించడం.
* 1892 తర్వాత 'కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించం' అనే నినాదాన్ని తేవడం.
* 1878 లో చేసిన ఆయుధాల చట్టాన్ని సవరించడం.
* సైన్యంలో భారతీయులను ఉన్నత పదవుల్లో నియమించడం.

 

అపజయాలు

* సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయకపోవడం.
* చాలాకాలం వరకు బ్రిటిష్‌వారి నిజమైన స్వభావాన్ని గ్రహించలేకపోవడం.
* రాజ్యాంగబద్ధమైన పోరాటం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం పొందకపోవటం.
* కాంగ్రెస్ సభ్యత్వం ప్రధానంగా జర్నలిస్టులు, విద్యావేత్తలు, సంస్కరణవాదులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారులకే పరిమితం కావడం.
* 1892 - 1909 మధ్య కాలంలో కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధుల్లో 90% మంది హిందువులే ఉండటం.
* బ్రిటిష్ వారి 'విభజించి పాలించు విధానం', అలీగఢ్ ఉద్యమ నాయకులు ముస్లింలను కాంగ్రెస్‌కు దూరంగా ఉండమని కోరడంతో వారు కాంగ్రెస్‌లో ఎక్కువగా చేరకపోవడం.

 

కాంగ్రెస్ పట్ల బ్రిటిష్ ప్రభుత్వ వైఖరి...

పదవీ విరమణ చేసిన ఆంగ్లేయ ఉద్యోగి ఎ.ఒ. హ్యూమ్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించడానికే కాంగ్రెస్‌ను స్థాపించాడనే విమర్శ ఉంది. అప్పటి వైస్రాయ్ డఫ్రిన్ 1886 లో కాంగ్రెస్ సదస్సుకు హాజరైన ప్రతినిధుల కోసం గొప్ప విందు ఏర్పాటుచేశాడు. అలాగే 1887 లో కాంగ్రెస్ మూడో సమావేశం సందర్భంగా మద్రాసు గవర్నర్ కాంగ్రెస్ ప్రతినిధులకు విందు ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి ఇచ్చారు.
* అయితే కాంగ్రెస్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఈ సంబంధాలు, సహకారం తాత్కాలికమే. క్రమేణా ప్రభుత్వం కాంగ్రెస్‌కు సహకరించడానికి బదులు కాంగ్రెస్ పట్ల అనుమానాన్ని పెంచుకుంది. కాంగ్రెస్ బలం పెరగడం, కాంగ్రెస్ సభ్యులు ప్రజలకు రాజకీయ శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వాన్ని విమర్శించడం దీనికి ప్రధాన కారణాలు.
* గవర్నర్ జనరల్ మొదలు ప్రభుత్వ అధికారులంతా జాతీయ నాయకులను అవిధేయులైన బాబులు, కుట్రపూరితమైన బ్రాహ్మణులు, క్రూరమైన ప్రతినాయకులుగా వర్ణించారు.
* 1890 లో బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులు కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడంపై ఆంక్షలు విధించింది. సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, రాజా శివప్రసాద్, ప్రభుత్వానికి విధేయులైన మరికొంతమందిని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించేలా ప్రోత్సహించింది.
* కాంగ్రెస్‌ను హిందూ సంస్థగా చిత్రించి, 1906 లో ముస్లింలీగ్‌ను ప్రారంభించేలా ముస్లింలను రెచ్చగొట్టింది. దీంతోపాటు ప్రభుత్వం అణిచివేత విధానాలను చేపట్టింది.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన

మాదిరి ప్రశ్నలు

 

1. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకుడు కానిదెవరు?

ఎ) ఆనందాచార్యులు         బి) ఫిరోజ్ షా మెహతా            సి) కె.టి. తెలాంగ్            డి) బద్రుద్దీన్ త్యాబ్జీ
జ: ఆనందాచార్యులు

 

2. భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆ పేరును ప్రతిపాదించింది ఎవరు?
జ: దాదాబాయి నౌరోజీ

 

3. జాతీయతా భావాలను ప్రచారం చేయడం నేరమని చట్టం రూపొందించిన సంవత్సరం?
జ: 1898

 

4. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు భారత వైస్రాయి ఎవరు?
జ: లార్డ్ డఫ్రిన్

 

5. 1885 లో కాంగ్రెస్ మొదటి సమావేశం బొంబాయిలోని ఏ ప్రదేశంలో జరిగింది?
జ: తేజ్‌పాల్ సంస్కృత పాఠశాల

 

6. ముస్లింలీగ్‌ను ఎప్పుడు స్థాపించారు?
జ: 1906

 

7. భారత జాతీయ కాంగ్రెస్ రెండో సమావేశం జరిగిన ప్రదేశం?
జ: కలకత్తా

 

8. కిందివారిలో మితవాద నాయకుడు కానిదెవరు?
ఎ) ఫిరోజ్ షా మెహతా                 బి) తిలక్                 సి) ఆనందమోహన్ బోస్                 డి) ఎస్.ఎన్. బెనర్జీ
జ: తిలక్

 

9. కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య?
జ: 72

 

10. మొదటిసారి కాంగ్రెస్ తరపున స్వపరిపాలన కోసం డిమాండ్ చేసిన వ్యక్తి?
జ: గోపాలకృష్ణ గోఖలే

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గాంధీ యుగం

  భారతదేశ చరిత్రలో క్రీ.శ. 1919-47 మధ్యకాలాన్ని గాంధీ యుగంగా పిలుస్తారు. ఈ కాలంలో గాంధీజీ భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టి తనదైన ముద్రవేశారు.

  గాంధీజీ 1934లో కాంగ్రెస్‌ను వీడినా, మరణించే వరకు కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిగా నిలిచారు. 1940లో కొంతకాలం కాంగ్రెస్‌కు నాయకత్వం వహించినా మరుసటి సంవత్సరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. క్రీ.శ. 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చినప్పటికీ, ఉద్యమాన్ని ప్రారంభించేలోపు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని జైల్లో పెట్టింది.

  భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో కీలక భూమిక పోషించి జాతిపితగా ప్రసిద్ధికెక్కిన గాంధీజీ గుజరాత్‌లోని కథియవార్ సంస్థానంలో పోర్‌బందర్ అనే గ్రామంలో అక్టోబరు 2, 1869లో జన్మించారు. గాంధీజీ తండ్రి కరమ్ చంద్ పోర్‌బందర్, రాజ్‌కోట్‌లలో దివాన్ (మంత్రి)గా పనిచేసేవారు. గాంధీజీ తల్లి పుత్లీబాయి. గాంధీజీకి 12 ఏళ్ల వయసులో కస్తూర్బాతో వివాహం జరిగింది. గాంధీజీ ఇంగ్లండులో బారిస్టరు చదువు పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు.
1893లో దాదా అబ్దుల్లా అనే వ్యక్తి తరపున న్యాయవాదిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ శ్వేత జాతీయుల దురహంకారం వల్ల భారతీయులు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి చలించిపోయారు. గాంధీజీ శ్వేతజాతి ప్రభుత్వంపై పోరాడటానికి సత్యాగ్రహమనే కొత్త ఆయుధాన్ని ఉపయోగించారు. గాంధీజీపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో ప్రముఖులు... థోరూ, లియో టాల్‌స్టాయ్, జాన్ రస్కిన్. గాంధీజీ డర్బన్‌లో ఫీనిక్స్ ఫామ్‌ను ఏర్పాటు చేశారు. 1903లో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ప్రారంభించారు. 1910లో సత్యాగ్రహంలో పాల్గొనే కుటుంబాలకు అండగా ఉండటానికి టాల్‌స్టాయ్ ఫామ్‌ను ప్రారంభించారు. 1914 వరకు దక్షిణాఫ్రికాలో ఉండి, 1915 జనవరిలో భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన వారికి సేవ చేయడానికి ఇంగ్లండులో అంబులెన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని కైజర్ ఇ హింద్ అనే బంగారు పతకంతో సత్కరించింది.

 

ఉద్యమాల పరంపర

  దక్షిణాఫ్రికాలో గాంధీ ప్రయత్నాల గురించి విద్యావంతులకేగాక, సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. దేశంలో సామాన్య ప్రజల పరిస్థితిని తెలుసుకోవడానికి తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటి సభ్యుడిగా భారతదేశమంతటా పర్యటించారు. బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న సమయంలో హోమ్‌రూల్ ఉద్యమం చేయడం మంచిది కాదని భావించారు. జాతీయవాదుల లక్ష్యాలను సాధించడానికి అహింసాయుత సత్యాగ్రహమే సరైన విధానమని పేర్కొన్నారు. 1917-18 మధ్యకాలంలో మూడు పోరాటాల్లో పాల్గొన్నారు.

* చంపారన్ సత్యాగ్రహం: బిహార్‌లోని చంపారన్‌లో నీలిమందు రైతులను కష్టాల నుంచి గట్టెక్కించడానికి 1917లో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. గాంధీజీ సభ్యుడిగా ప్రభుత్వం ఒక విచారణ కమిటీని నియమించింది. విచారణ కమిటీ సిఫార్సుల మేరకు రైతులకు వ్యతిరేకంగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేశారు. ఇది భారతదేశంలో గాంధీజీకి మొదటి రాజకీయ విజయం.

* అహ్మదాబాద్ మిల్లు సమ్మె: ప్లేగు బోనస్ నిలుపుదలకు సంబంధించి మిల్లు యజమానులకు, కార్మికులకు మధ్య గొడవ జరిగింది. దీంతో గాంధీజీ అహ్మదాబాద్ వస్త్ర కార్మికుల సంఘాన్ని స్థాపించి, 1918లో నిరాహార దీక్ష చేపట్టారు. చివరకు మిల్లు యాజమాన్యం కార్మికుల వేతనం 35 శాతం పెంచడానికి అంగీకరించింది.

* ఖేదా సత్యాగ్రహం: గుజరాత్‌లోని ఖేదాలో 1918లో కరవు సంభవించింది. రెవెన్యూ కోడ్ ప్రకారం సాధారణ ఉత్పత్తిలో 1/4వ వంతు కంటే తక్కువైతే రైతులు భూమి శిస్తు నుంచి మినహాయింపునకు అర్హులు. అయితే అధికారులు పన్ను చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. గాంధీజీ సత్యాగ్రహం చేపట్టడంతో రైతులను భూమి శిస్తు చెల్లింపు నుంచి మినహాయించారు. ఈ సత్యాగ్రహం సందర్భంగా సర్దార్ పటేల్, ఇందూలాల్ యాజ్ఞక్ లాంటి యువనాయకులు గాంధీజీకి అనుచరులుగా మారారు.

* పై మూడు పోరాటాలలో విజయం సాధించడం ద్వారా గాంధీజీ సామాన్య ప్రజల నమ్మకాన్ని, గౌరవాన్ని పొందగలిగారు. అలాగే వారి బలాలు, బలహీనతలను అర్థం చేసుకోగలిగారు.

 

రౌలత్ చట్టం - 1919

  మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జాతీయవాదులు రాజ్యాంగపరమైన సంస్కరణల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని రూపొందించింది. దీన్ని వారు అవమానకరంగా భావించారు. విప్లవాత్మక నేరాల చట్టాన్ని ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రూపొందించింది. ఈ చట్టాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి సర్ సిడ్నీ రౌలత్ నాయకత్వం వహించడం వల్ల ఈ చట్టం రౌలత్ చట్టంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని భారతీయులు నల్ల చట్టంగా పరిగణించి 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.

* జలియన్‌వాలాబాగ్ దురంతం: నిషేధ ఆజ్ఞల గురించి తెలియని సమీప గ్రామాల్లోని ప్రజలు 1919 ఏప్రిల్ 13 బైశాఖి పండగ రోజున సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్‌ల అరెస్ట్‌కు నిరసనగా అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ (పార్కు) లో సమావేశమయ్యారు. జనరల్ డయ్యర్ పైశాచిక ప్రవర్తనవల్ల జరిగిన పోలీసు కాల్పుల్లో సుమారు 400 మంది మృతి చెందారు. దీనికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్‌హుడ్ బిరుదును త్యజించారు. హింసాత్మక పరిస్థితుల పట్ల అప్రమత్తమైన గాంధీజీ ఏప్రిల్ 18, 1919న ఉద్యమాన్ని ఉపసంహరించారు.

* సహాయ నిరాకరణ ఉద్యమం: గాంధీజీ 1919-22 మధ్య ఖిలాఫత్, సహాయ నిరాకరణ ఉద్యమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రెండు ఉద్యమాలు ప్రారంభించడానికి కారణాలు వేరైనా, అహింసాయుత సహాయ నిరాకరణ అనే ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఖిలాఫత్ ఉద్యమానికి, భారత రాజకీయాలకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఇదే తక్షణ కారణం కావడం విశేషం.

* 1919 నవంబరులో ఢిల్లీలో జరిగిన అఖిల భారత ఖిలాఫత్ సమావేశంలో బ్రిటిష్ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చారు. గాంధీజీ ఖిలాఫత్ సమస్యపై సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ప్రారంభించాలని భావించినా, మతపరమైన సమస్యపై ముస్లిం నాయకులతో పొత్తుకలిగి ఉండటాన్ని తిలక్ తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు గాంధీజీ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆమోదాన్ని పొందడంలో సఫలీకృతులయ్యారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరుస్తూ గాంధీజీ 1920 ఆగస్టు 31న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. 

* కాంగ్రెస్ సెప్టెంబరు 1920లో కోల్‌కతాలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి అంగీకరించింది. 1920 డిసెంబరులో జరిగిన నాగ్‌పుర్ సమావేశంలో కాంగ్రెస్ ఈ ఉద్యమానికి ఆమోదముద్ర వేసింది. ఇదే సమావేశంలో కాంగ్రెస్ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించింది. స్వరాజ్య సాధనే తన లక్ష్యమని పునరుద్ఘాటించింది.

 

ఉద్యమ లక్ష్యాలు, కార్యక్రమాలు

లక్ష్యాలు: రౌలత్ చట్టాన్ని రద్దు చేసి, జలియన్ వాలాబాగ్ దురంతంపై బ్రిటిష్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేయాలి.

* బ్రిటిష్ ప్రభుత్వం టర్కీ పట్ల ఉదార వైఖరిని అవలంబించాలి. టర్కీ సుల్తానుకు ఖలీఫా పదవిని తిరిగి కట్టబెట్టాలి. 

* స్వరాజ్య డిమాండును అంగీకరించాలి.

నకారాత్మక కార్యక్రమాలు: బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, గౌరవ పదవులను భారతీయులు వెనక్కి ఇచ్చివేయాలి.

¤ ప్రభుత్వ దర్బారుకు, అధికార ఉత్సవాలకు ఆహ్వానాలను తిరస్కరించాలి.

¤ ప్రభుత్వ నియంత్రణలోని పాఠశాలలు, కళాశాలలను విద్యార్ధులు బహిష్కరించాలి.

¤ బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించాలి.

¤ మెసపటోమియాలో పనిచేయడానికి అన్నివర్గాల వారు తిరస్కరించాలి. ¤ రాష్ట్ర, కేంద్ర శాసన సభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించాలి. ¤ విదేశీ వస్తువులను బహిష్కరించాలి. ¤ స్థానిక సంస్థలలోని నామినేటెడ్ స్థానాలకు భారతీయులు రాజీనామా చేయాలి.

 

సకారాత్మక కార్యక్రమాలు:

* ఆచార్య నరేంద్రదేవ్, చిత్తరంజన్ దాస్, లాలా లజపతిరాయ్, జాకీర్ హుస్సేన్, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుల ఆధ్వర్యంలో జాతీయ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.

* తిలక్ స్వరాజ్య నిధికి ఆరునెలలలోగా కోటి రూపాయలు విరాళంగా సేకరించారు.

* స్వదేశీ పరిశ్రమల అభివృద్ధికి ప్రయత్నాలు జరిగాయి. 1921 జులైలో అలీ సోదరులు బ్రిటిష్ సైన్యం నుంచి ముస్లింలు వైదొలగాలని పిలుపునిచ్చారు.

* హిందూ - ముస్లింల మధ్య సఖ్యతను పెంపొందించడం, స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడం, అంటరానితనాన్ని నిర్మూలించడం.

* దేశంలోని విశిష్ట వ్యక్తులు లాభదాయకమైన న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ స్వాతంత్య్రానికి చిహ్నంగా మారింది.

* వేల్స్ యువరాజు పర్యటనను బహిష్కరించాలని నిర్ణయించారు. బొంబాయిలో నవంబరు 17, 1921న అతని పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో రైతులు ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లించడం ఆపేశారు.

* 1921 మే లో గాంధీజీ, వైస్రాయి లార్డ్ రీడింగ్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 1922 ఫిబ్రవరి 1న గాంధీజీ బార్డోలి నుంచి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

చౌరీచౌరా సంఘటన

* ఉద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో 1922 ఫిబ్రవరి 5న ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చౌరీచౌరా గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామం గోరఖ్‌పూర్ నుంచి 35 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను స్టేషనులో బంధించి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవదహనమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమాన్ని నిలిపేశారు.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విజయనగర రాజుల సాంస్కృతిక సేవ

  క్రీ.శ. 14వ శతాబ్దం ప్రథమార్థంలో స్థాపితమైన విజయనగర సామ్రాజ్యం క్రీ.శ. 16 శతాబ్దం నాటికి అత్యున్నత దశకు చేరుకుని, 17వ శతాబ్దానికి అంతమైంది. విజయనగర రాజులు సామాజిక, ఆర్థిక సుస్థిరతను పెంపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మత సామరస్యం, విద్య, సాహిత్యం, కళలు, చిత్రలేఖనం, వాస్తు శాస్త్రం అభివృద్ధికి కృషి చేశారు. భారతదేశ చరిత్రలో హిందూ సాంస్కృతిక వికాసంలో చివరిదశగా విజయనగర యుగాన్ని పేర్కొనవచ్చు.

  విజయనగర కాలంలోనూ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే చతుర్వర్ణ విధానమే కొనసాగింది. విజయనగర రాజులు వర్ణవ్యవస్థను పరిరక్షించడానికి తమ వంతు కృషి చేశారు. అయితే బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాన మంత్రులు, రాజగురువులు, దండ నాయకులుగా వారిని నియమించేవారు. సాళువ తిమ్మరుసు, అతని కొడుకు కృష్ణదేవరాయల ప్రధానమంత్రి, సైన్యాధ్యక్షులుగా వ్యవహరించారు. సమాజంలో ఉన్నత కులాలకు చెందిన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సామరస్యంతో జీవించేవారు.

* స్త్రీల స్థాయి: విజయనగర కాలంలో స్త్రీలు సమాజంలో గొప్పస్థానాన్ని ఆక్రమించారు. వారు సామాజిక, రాజకీయ, మత జీవితంలో ప్రధానపాత్ర పోషించారు. విజయనగర కాలంలో స్త్రీలు జ్యోతిష్కులు, గణాంక అధికారులు, చరిత్రకారులు, సంగీత విద్వాంసులు, న్యాయమూర్తులు, రాజప్రసాద రక్షకులుగా పనిచేసినట్లు నూనిజ్ పేర్కొన్నాడు. రాజులు, ఉన్నతోద్యోగులు బహుభార్యత్వాన్ని ఆచరించినట్లు నికోలో డి కాంటె పేర్కొన్నాడు. ఈ కాలంలో బాల్యవివాహాలు సాధారణం.
పెళ్లి సమయంలో భారీగా వరకట్నం తీసుకునేవారు. సతీసహగమనం కూడా సర్వసాధారణం. అయితే ఇది ఉన్నత వర్గాల స్త్రీలకు మాత్రమే పరిమితమైంది. రాజు మరణించినప్పుడు అతని భార్యలు సతీసహగమనం చేయడాన్ని గౌరవంగా భావించేవారు. స్త్రీలు రాజకీయ, సాహిత్యరంగాల్లో పాలుపంచుకున్నారు. కొంతమంది రాణులు కవయిత్రులుగా ప్రసిద్ధి చెందారు. గంగాదేవి, తిరుమలదేవి దీనికి నిదర్శనం.

* నగర జీవనం: విజయనగరంలో రాజులు, ఉన్నతోద్యోగుల విలాసవంతమైన జీవనం గురించి అబ్దుల్ రజాక్ చక్కగా వర్ణించాడు. విజయనగరం లాంటి నగరాన్ని భూమి మీద ఇంతవరకు చూడలేదని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు.
* వినోదాలు: విజయనగర రాజులు, ఉన్నతోద్యోగులు శాంతి సమయాల్లో అనేక పండుగలను జరుపుకుంటూ, వినోదాల్లో పాల్గొనేవారు. నికోలో డి కాంటె, అబ్దుల్ రజాక్ రాజులు, ఉన్నతోద్యోగులు అట్టహాసంగా జరుపుకొనే కొన్ని పండుగల గురించి ప్రస్తావించారు. వాటిలో ప్రధానమైంది - మహార్ణవమి పండుగ. ఈ పండుగను సాధారణంగా తొమ్మిది రోజులపాటు జరుపుకునేవారు. ఈ పండుగ గురించి అబ్దుల్ రజాక్ ఇలా పేర్కొన్నాడు. ''విజయనగర రాజు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రభువులు, ఉన్నతోద్యోగులు విజయనగరంలో సమావేశం కావలసిందిగా ఆదేశించేవాడు".

* నికోలో డి కాంటె అభిప్రాయం ప్రకారం విజయనగర ప్రజలు జరుపుకునే మరో పండుగ దీపావళి. ఈ పండుగ సందర్భంగా అనేక నూనె దీపాలు రాత్రింబవళ్లు వెలుగుతూ ఉండేవి.

* విజయనగర ప్రజలు జరుపుకునే మరో పండుగ వసంతోత్సవం. ఈ పండుగ సందర్భంగా ప్రజలు వీధుల్లో వెళ్లేవారిపై (రాజు, రాణితో సహా) పసుపు నీళ్లు చల్లేవారు. ఈ ఉత్సవాల సందర్భంగా సామాన్య ప్రజలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నువ్వుల నూనె తాగి ఆ నూనె చెమట రూపంలో బయటకు వచ్చేవరకు మట్టితో కూడిన బరువులు ఎత్తి, కత్తితో వ్యాయామం చేసేవాడని తర్వాత కుస్తీ పోటీలో పాల్గొని, స్నానానికి ముందు గుర్రపు స్వారీ చేసేవాడని పోర్చుగీసు యాత్రికుడు డోమింగో పేస్ పేర్కొన్నాడు.

* బలులు: విజయనగర కాలంలో భారీగా బలులు ఇచ్చేవారు. కొన్ని పండుగల సందర్భంగా నిర్వహించే జంతు బలులను రాజు స్వయంగా వీక్షించేవాడని, మహార్ణవమి పండుగ చివరి రోజున 250 దున్నపోతులు, 450 గొర్రెలను బలి ఇచ్చేవారని పేస్ పేర్కొన్నాడు.

* మానవులను బలి ఇచ్చే దురాచారం విజయనగర కాలంలో సాధారణం. చెరువులు, రిజర్వాయర్లు, దేవాలయాల ప్రారంభోత్సవం సమయంలో యుద్ధ ఖైదీలను బలి ఇచ్చేవారు.

 

మతం

  విజయనగర రాజులు మతసామరస్యాన్ని పాటించారు. కృష్ణదేవరాయలు శైవులు, వైష్ణవులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీల పట్ల ఆదరణ చూపాడని బార్బోసా పేర్కొన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మతాభిమాని. హంపిలో ప్రసిద్ధి చెందిన విఠలస్వామి దేవాలయం, హజారరామ దేవాలయాలను నిర్మించాడు.

* అచ్యుతదేవరాయలు కూడా విష్ణుభక్తుడే. అయితే కంచి, లేపాక్షిలలోని శివాలయాలకు ఇతడు భారీగా దానధర్మాలు చేశాడు. రామరాయలు కూడా పరమత సహనాన్ని పాటించాడు. ముస్లిం ప్రజలు, సైనికులు విధేయపూర్వకంగా తనని కలవడానికి వచ్చినప్పుడు రామరాయలు ఖురాన్ ప్రతిని తన ముందు ఉంచేవాడు.

 

ఆర్థిక పరిస్థితులు

  విదేశీ యాత్రికుల రచనలను బట్టి విజయనగర కాలంలో ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు తెలుస్తోంది. విజయనగర రాజుల వద్ద లెక్కకు మించిన సంపద ఉండేదని, విజయనగరంలోని ప్రజలు విలువైన రాళ్ల వ్యాపారం చేసేవారని, అక్కడ వస్తువులు ఎక్కువ సంఖ్యలో, చౌకగా లభించేవని డోమింగో పేస్ పేర్కొన్నాడు.

* తళ్లికోట యుద్ధంలో విజయనగర రాజు ఓటమి తర్వాత జరిగిన రెండు సంఘటనలను బట్టి విజయనగర రాజుల వెలకట్టలేని సంపదను అర్థం చేసుకోవచ్చు. మొదటిది - రామరాయల కొడుకు తిరుమలరాయలు విజయనగరంలోకి ప్రవేశించి, సదాశివరాయల ఖజానాలోని మొత్తం సంపదను 1550 ఏనుగులపై ఎక్కించి పెనుగొండకు తరలించాడు. రెండవది- యుద్ధం తర్వాత విజయనగరాన్ని ధ్వంసం చేసిన ముస్లింలు 10 కోట్ల స్టెర్లింగ్‌ల విలువైన బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లతోపాటు, విలువైన రాళ్లతో చేసిన రాజ సింహానాన్ని 550 ఏనుగులపై తరలించారని రాబర్ట్ సెవెల్ 'ఎ ఫర్‌గాటెన్ ఎంపైర్' (A forgotten Empire) అనే గ్రంథంలో పేర్కొన్నారు.

 

వర్తక వాణిజ్యాలు

  అభివృద్ధి చెందిన వర్తక, వాణిజ్యాలు విజయనగర కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్షణం. ఈ వ్యాపారం భూమార్గం, తీర ప్రాంతాలు, సముద్ర మార్గాల ద్వారా జరిగేది. విజయనగర సామ్రాజ్యంలో కాలికట్, కొచ్చిన్, భట్కల్, మంగుళూరు మొదలైనవి ప్రధాన ఓడరేవులు. కోరమాండల్, మలబార్ తీరాలను వర్తక వాణిజ్యాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ వ్యాపారం పోర్చుగీసు, అరబ్ వ్యాపారుల ద్వారా జరిగేది.

  హిందూ మహాసముద్రంలోని దీవులు- మలయ, బర్మా, చైనా, అబీసీనియా, దక్షిణాఫ్రికా, పర్షియా లాంటి దేశాలతో విజయనగర ప్రజలకు వర్తక సంబంధాలు ఉండేవి. విజయనగర సామ్రాజ్యం నుంచి వస్త్రాలు, ఇనుము, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, బియ్యం లాంటివి ఎగుమతయ్యేవి. గుర్రాలు, ఏనుగులు, పగడాలు, పాదరసం, చైనా పట్టు మొదలైనవి ప్రధాన దిగుమతులు.

 

సాహిత్యం

  విజయనగర రాజులు తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళ కవులను ఆదరించారు. కొంతమంది చక్రవర్తులు, రాణులు సాహిత్యరంగంలో ప్రసిద్ధి చెందారు.

 

సంస్కృతం

  విజయనగర కాలం నాటి తొలి రోజుల్లో ముఖ్యంగా మొదటి బుక్కరాయల కాలంలో శయనుడి ఆధ్వర్యంలో అనేకమంది పండితులు ఉండేవారు. వారు నాలుగు వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలపై వ్యాఖ్యానాలు రచించారు. దేవరాయలు 15వ శతాబ్దంలో శ్రీరంగంలో రచించిన 'నిఘంటు వ్యాఖ్య' అనే గ్రంథం ప్రముఖమైంది. రామాయణం, మహాభారతంపై వ్యాఖ్యానాలు రచించిన గోవిందరాజ (ఇతడు కాంచీపురం వాస్తవ్యుడు) శ్రీకృష్ణదేవరాయలు, రామరాయలకు సమకాలీకుడు.

* మొదటి బుక్కరాయల రెండో కుమారుడు కుమార కంపన విజయాలను అతడి రాణి గంగాదేవి తన 'మధురా విజయం'లో వివరించింది. అచ్యుత దేవరాయల ఆస్థానకవి రాజనాథుడు 'సాళువాభ్యుదయం, భాగవత చంపూ, అచ్యుతాభ్యుదయం' అనే గ్రంథాలు రచించాడు.

అచ్యుతాభ్యుదయంలో అచ్యుత దేవరాయల పాలన గురించిన వర్ణన ఉంటుంది. తిరుమలాంబ రచించిన వరదాంబిక పరిణయం అనే చారిత్రక గ్రంథంలో వరదాంబికతో అచ్యుతరాయల వివాహాన్ని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృత, తెలుగు భాషల్లో గొప్ప కవి, పండితుడు. ఇతడు సంస్కృతంలో రచించిన జాంబవతి కల్యాణం అనే నాటకం ప్రసిద్ధి చెందింది.

 

కన్నడం

  విజయనగర కాలం నాటి లింగాయత్ సాహిత్యంలో సంస్కర్తలు, భక్తుల కథలు ప్రధానమైనవి. క్రీ.శ. 1369లో భీమకవి రచించిన బసవ పురాణం ఇందులో ముఖ్యమైంది. బసవేశ్వరుని జీవితం గురించి రచించిన మరో గ్రంథం మాల బసవరాజ చరిత. దీన్ని సింగిరాజు క్రీ.శ. 1500లో రచించాడు. దీనికే మరోపేరు సింగిరాజు పురాణం. ఇందులో బసవేశ్వరుని 84 అద్భుతాల గురించి పేర్కొన్నారు.

* రెండో దేవరాయల ఆస్థానంలోని చామరసుడు 'ప్రభు లింగతాల' అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని దేవరాయలకు చదివి వినిపించగా దేవరాయలు దీన్ని తెలుగు, తమిళంలోకి అనువదించేలా చర్యలు తీసుకున్నాడు. చామరసుడు రాజు సమక్షంలో వైష్ణవులతో వాగ్వాదాలు చేసేవాడు. కన్నడ భారతాన్ని రచించిన కుమార వ్యాసుడు చామరసుడికి ప్రధాన పోటీదారుడు. క్రీ.1584లో విరూపాక్ష పండితుడు చెన్న బసవ పురాణాన్ని రచించాడు.

* శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి వైష్ణవ ఉద్యమం కన్నడ సాహిత్యం మీద గొప్ప ప్రభావం చూపింది. మహాభారతంలోని మొదటి పది పర్వాలను నరసప్ప కన్నడంలోకి అనువదించాడు. మిగిలిన పర్వాలను క్రీ.శ. 1510లో తిమ్మన్న కృష్ణరాయల పేరు మీదుగా కృష్ణరాయభారతం అనే పేరుతో అనువదించాడు. కృష్ణదేవరాయలు, అచ్యుత రాయల ఆస్థానంలోని చటు విఠలనాథుడు భాగవతాన్ని కన్నడంలోకి అనువదించాడు.

 

తెలుగు

  తెలుగు సాహిత్య చరిత్రలో రాయల యుగాన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు. ఇంగ్లండ్‌లో ఎలిజబెత్ యుగంతో, గ్రీసులో పెరిక్లస్ యుగంతో రాయల కాలాన్ని పోల్చవచ్చు. రాయల ఆస్థానానికి భువన విజయం అనే పేరుంది. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలనే ఎనిమిది మంది కవులుండేవారు. కృష్ణదేవరాయలు 'దేశభాషలందు తెలుగు లెస్స' అని పేర్కొన్నాడు. ఈ కాలాన్ని ప్రబంధ యుగంగా పిలుస్తారు.

* అష్టదిగ్గజాల్లో మనుచరిత్రను రచించిన అల్లసాని పెద్దన సాటిలేని మేటికవిగా ప్రసిద్ధి చెందాడు. మనుచరిత్రకే స్వారోచిష మనుసంభవం అనే పేరు కూడా ఉంది. కృష్ణదేవరాయలు పెద్దనకు 'ఆంధ్ర కవితా పితామహుడు' అనే బిరుదునిచ్చి సత్కరించాడు. పెద్దన మనుచరిత్రను కృష్ణదేవరాయలకు అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా రాయలు పెద్దన కాలికి గండపెండేరాన్ని తొడిగి, పెద్దన ఎక్కిన పల్లకీని స్వయంగా మోశాడు. కోకట గ్రామాన్ని పెద్దనకు దానంగా ఇచ్చాడు.

* నంది తిమ్మన పారిజాతాపహరణం అనే గ్రంథాన్ని రచించి రాయలకు అంకితమిచ్చాడు. భట్టుమూర్తికి రామరాజ భూషణుడు అనే పేరు కూడా ఉంది. ఇతని గ్రంథాల్లో ముఖ్యమైంది వసుచరిత్ర. ఇందులో రాకుమారుడు వసు, రాకుమారి గిరికల వివాహం గురించి పేర్కొన్నారు.

* ధూర్జటి 'కాళహస్తి మాహాత్మ్యం', అతని కుమారుడు కుమార ధూర్జటి 'కృష్ణదేవరాయ విజయం' రచించారు. కృష్ణదేవరాయ విజయంలో చక్రవర్తి యుద్ధ విజయాల గురించి పేర్కొన్నారు. పింగళి సూరన రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం గ్రంథాలను రచించాడు. సూరన తన రచనల్లో ఉత్తమమైందిగా ప్రభావతీ ప్రద్యుమ్నాన్ని పేర్కొన్నాడు. ఈ గ్రంథం దైత్యరాజును శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు ఓడించిన తీరును, దైత్యరాజు కుమార్తె ప్రభావతితో ప్రద్యుమ్నుడి వివాహాన్ని వివరిస్తుంది.

తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మాహాత్మ్యం అనే గ్రంథాలను రచించాడు. మాదయగారి మల్లన 'రాజశేఖర చరితం' అనే గ్రంథాన్ని, అయ్యలరాజు రామభద్రుడు 'రామాభ్యుదయం' అనే గ్రంథాన్ని రచించారు.

* శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, పండితుడు. ఇతడు తెలుగులో ఆముక్తమాల్యద లేదా విష్ణుచిత్తీయం అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని తెలుగు సాహిత్యంలో అయిదు గొప్ప కావ్యాల్లో ఒకటిగా పేర్కొంటారు. ఇది తెలుగు సాహిత్యంపై వైష్ణవ మత ప్రభావం ప్రారంభమవడాన్ని సూచిస్తుంది. ఇది ఆళ్వార్ విష్ణుచిత్తుడి జీవితం గురించి, అతడి వైష్ణవ తత్వాన్ని గురించి వివరిస్తుంది.

* మొల్ల రామాయణం రచించిన కవయిత్రి మొల్ల ఈ కాలానికి చెందిందే. ప్రజాకవి, గొప్ప సామ్యవాది అయిన వేమన ఈ కాలం వాడే. వేమన సామాజిక దురాచారాలైన కులవ్యవస్థ, విగ్రహారాధన మొదలైన వాటిని తన పద్యాల ద్వారా విమర్శించాడు.

 

వాస్తు కళలు, చిత్రలేఖనం

  విజయనగర కాలంలో వాస్తు కళలు, చిత్రలేఖనం బాగా అభివృద్ధి చెందాయి. విజయనగర రాజుల తొలి రాజధాని హంపిలోని అవశేషాలు గొప్ప కట్టడాలకు నిదర్శనం. రాజులతోపాటు రాణులు, ఉన్నతోద్యోగులు, భవన నిర్మాణ కార్యకలాపాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. హంపిలోని విఠల, పంపావతి, విరూపాక్ష, హజారరామ ఆలయాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మితమయ్యాయి. లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం, సోంపాలెంలోని చెన్నకేశవ దేవాలయం, యెల్లూరులోని జలకంఠేశ్వర దేవాలయం, చిదంబరంలోని పార్వతి దేవాలయం, కంచిలోని వరదరాజ, ఏకాంబర నాథ దేవాలయాలు ద్రావిడ, విజయనగర వాస్తు శైలికి ఉదాహరణలు.
* లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలోని చిత్రలేఖనం నాటి సామాజిక జీవితానికి అద్దం పడుతోంది. ఇందులో శిరోజాల అలంకరణలు, దుస్తులు, ఆభరణాలు, సంగీత వాయిద్యాలు, గొడుగులు, ఆటలు మొదలైన అంశాలను చక్కగా చిత్రించారు.

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహనులు

మౌర్య సామ్రాజ్య పతనానంతరం శాతవాహనులు విదేశీ దాడులను అరికట్టి సామ్రాజ్యాన్ని స్థాపించారు.
* క్రీ.పూ. 225 నుంచి క్రీ.శ. 225 వరకు పరిపాలించారు.
* వీరి కాలం వివాదాస్పదమైంది.
* వీరికే శాతవాహనులు అనీ, శాలివాహనులు అనే పేర్లున్నాయి.
* హేమచంద్రుడు అనే వ్యాకరణవేత్త వీరిని శాలివాహనులు అని పేర్కొన్నాడు.
* వీరు జారీ చేసిన 34 శాసనాల ద్వారా కొంతవరకు వీరి చరిత్రను తెలుసుకోవచ్చు.

 

34 శాసనాలలో ముఖ్యమైనవి

1. కృష్ణుడి నాసిక్ శాసనం
2. గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం
3. గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనం
4. రుషభదత్తుడి నాసిక్ శాసనం
5. నాగానిక నానేఘాట్ శాసనం
6. యజ్ఞశ్రీ చినగంజాం శాసనం
7. విజయశ్రీ నాగార్జునకొండ శాసనం
8. రెండో పులోమావి కార్లే, నాసిక్, ధరణీకోట శాసనాలు
9. మూడో పులోమావి మ్యాకదోని శాసనం
10. ఖారవేలుడి హతిగుంఫా శాసనం
11. గుంటుపల్లి శాసనాలు
* శాసనాలన్నీ ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి.
* శాసనాలను బట్టి ఉత్తరాన మధ్యప్రదేశ్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు వీరి సామ్రాజ్యం విస్తరించి ఉందని తెలుస్తోంది.
* వీరు ఆంధ్రులే అని ఆర్.జి.భండార్కర్, మారేమండ రామారావు, డాక్టర్ ఎల్.డి.బార్నెట్, పి.వి.పరబ్రహ్మ శాస్త్రి, ఇ.జె.రాప్సన్, డాక్టర్ స్మిత్, బర్జెస్, గొర్తి వెంకట్రావు తదితరులు పేర్కొన్నారు.
* శాతవాహనులు ఆంధ్రులు కారని పేర్కొన్నవారిలో పి.టి.శ్రీనివాస అయ్యంగార్, డాక్టర్ మిరాషి, సుక్తాంకర్, డి.సి.సర్కార్, కె.గోపాలాచారి, జోగేల్కర్, పులాస్కర్, హెచ్.సి.రాయచౌదరి, జయస్వాల్, వి.యస్.భట్లే తదితరులు ఉన్నారు.
* మత్స్య, వాయు, విష్ణు, బ్రహ్మాండ పురాణాలు, హాలుడి గాథాసప్తశతి, గుణాఢ్యుడి బృహత్కథ, కుతూహలుడి లీలావతి పరిణయం, సోమదేవుడి కథాసరిత్సాగరం, వాత్సాయన కామసూత్రాలు, బౌద్ధ, జైన గ్రంథాలు, ప్లినీ, టాలమీ రచనలు, అజ్ఞాత నావికుడు రాసిన 'పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ' మొదలైనవి శాతవాహనుల చరిత్రకు ఆధార గ్రంథాలు.

 

శాతవాహన పాలకులు

1. శ్రీముఖుడు

* ఆంధ్ర శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు.
* ఇతడికే శ్రీముఖ, సిముక, సింధుక, చిముక అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి.
* పురాణాలు శ్రీముఖుడినే ఆంధ్ర రాజ్య స్థాపకుడిగా వర్ణించాయి.
* జైన మత పోషకుడిగా, జైన దేవాలయాలను కట్టించినట్లు జైన సాహిత్యం ద్వారా తెలుస్తోంది.
* మొదట జైన మతాభిమానిగా ఉన్నప్పటికీ, తర్వాత వైదిక మతం స్వీకిరించినట్లు తెలుస్తోంది.
* శ్రీముఖుడు అశోకుడి సమకాలికుడు.
* పశ్చిమ దక్కన్ ప్రాంతాన్ని జయించి, 'రాఠికులు' అనే స్థానిక తెగను అధిగమించి, వారితో వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నాడు.
* ఇతడి కుమారుడు శాతకర్ణి.
* మహారథి త్రాణకైరో కుమార్తె నాగానికతో శాతకర్ణికి వివాహం జరిపించాడు.
* శ్రీముఖుడు 23 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు.
* ఈయన జారీ చేసిన నాణేలు కరీంనగర్ జిల్లా కోటిలింగాల, ధూళికట్ట, సంగారెడ్డి, కొండాపురం, మహారాష్ట్రలోని అకోలా, జున్నార్, నెవాసా అనే ప్రాంతాల్లోనూ కర్ణాటకలోని సన్నతి వద్ద లభించాయి.

 

2. కృష్ణ

* శ్రీముఖుడి తర్వాత ఇతడి తమ్ముడు కృష్ణ అధికారంలోకి వచ్చాడు.
* ఇతడి మరో పేరు కన్హ.
* ఈయన రాజ్యాన్ని పశ్చిమాన నాసిక్ వరకు విస్తరింపజేశాడు.
* శాతకర్ణి భార్య నాగానిక నానేఘాట్ చిత్రాల్ని చెక్కించింది.
* నాగానిక నానేఘాట్‌లో తన తండ్రి, శాతకర్ణి, శ్రీముఖ, తన సంతాన చిత్రాన్ని చెక్కించింది. కానీ కృష్ణ చిత్రాన్ని చెక్కించకపోవడం వల్ల ఇతను సింహాసనాన్ని అక్రమంగా వశం చేసుకున్నాడని చరిత్రకారుల అభిప్రాయం.
* శ్రీముఖుడు చనిపోయే నాటికి శాతకర్ణి చిన్నవాడిగా ఉండటం వల్ల ఇతడు సింహాసనాన్ని అధిష్ఠించి ఉండవచ్చని కొందరి అభిప్రాయం.
* మగధలో పుష్యమిత్ర శుంగుడు, కళింగలో ఖారవేలుడు ఈయన కాలంలో అధికారంలో ఉన్నారు.

 

3. శాతకర్ణి

* శాతకర్ణి భార్య నాగానిక మరో పేరు నాయనిక.
* ఈమె రాచకార్యాల్లో పాల్గొంది.
* నాగానిక నానేఘాట్ శాసనాన్ని వేయించింది.
* పశ్చిమ మాల్వా, అనుప లేదా నర్మదా నదీ లోయ ప్రాంతాన్ని, విదర్భను శాతకర్ణి జయించాడు. ఈ విజయాలకు చిహ్నంగా అశ్వమేథ యాగాన్ని, రాజసూయ యాగాన్ని నిర్వహించినట్లు నానేఘాట్ శాసనం వల్ల తెలుస్తోంది.
* ఇతడికి 'దక్షణాపతి', 'అప్రతిహతఃచక్ర' అనే బిరుదులు ఉన్నాయి.
* ఖారవేలుడి హతిగుంఫా శాసనంలో ఇతడిని పేర్కొనడం జరిగింది.
* ఈయన కుమారుడు వేదశ్రీ చిన్నవాడు కావడం వల్ల ప్రభుత్వ వ్యవహారాలను వేదశ్రీ పేరుపై నాగానిక నిర్వహించింది.
* వేదశ్రీ యుక్తవయసుకు రాకముందే మరణించడం వల్ల వేదశ్రీ కుమారుడు సతిశ్రీ రాజ్యానికి వచ్చాడు
* మత్స్యపురాణం శాతకర్ణిని 'మల్లకర్ణి' అని పేర్కొంది.

 

4. రెండో శాతకర్ణి

* మగధ రాజధాని పాటలీపుత్రాన్ని, విదుష, కళింగ రాజ్యాలను ఆక్రమించాడు.
* ఇతడు ఖారవేలుడి చేతిలో ఓడిపోయినట్లు తెలుస్తోంది.
* ఖారవేలుడి మరణం తర్వాతనే కళింగను జయించాడు.

 

5. అపీలకుడు

* లంబోదర పుత్రుడైన అపీలకుడి నాణెం చత్తీస్‌గఢ్‌లో లభించింది.
* ఈ నాణెంపై 'శివశ్రీ అపీలక అని ఉంది.
* ఈయన కాలంలోనే ఉత్తర జిల్లాలను కోల్పోయారు.

 

6. కుంతల శాతకర్ణి

* ఇతడు మొదట నిరక్షరాస్యుడే అయినా సంస్కృతం నేర్చుకున్నాడు.
* ఈయన మంత్రుల్లో ఒకరైన శర్వవర్మ సంస్కృతంలో 'కాతంత్ర వ్యాకరణం' రచించాడు.
* ఇతడు సంస్కృత భాషాభిమాని అవడం వల్ల మరో మంత్రి అయిన గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో రచించిన బృహత్కథను నాశనం చేయించాడని చరిత్రకారులు చెబుతుంటారు.
* బృహత్కథలోని భాగమే 'కథా సరిత్సాగరం' అని చరిత్రకారుల అభిప్రాయం.
* ఈయన హయాంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజభాష అయింది.
* రాజశేఖరుడి కావ్యమీమాంస, గుణాఢ్యుడి బృహత్కథ, వాత్సాయన కామసూత్రాల్లో ఈయన ప్రస్తావన ఉంది.
* ఇతడి శృంగార కార్యకలాపాల్లో భార్య మలయవతి చనిపోయినట్లు వాత్సాయనుడు తెలియజేశాడు.
* తాను జారీ చేసిన నాణేలపై పాటలీపుత్ర చిహ్నాన్ని ముద్రించాడు.

 

7. హాలుడు

* శాతవాహన రాజుల్లో హాలుడు 17వ రాజు.
* సప్త గోదావరి - భీమా నదుల ఒడ్డున శ్రీలంక రాజకుమార్తె లీలావతిని వివాహమాడాడు. ఈ విషయాన్ని కుతూహలుడి 'లీలావతి పరిణయం' అనే గ్రంథం తెలియజేస్తోంది.
* కవులకు, పండితులకు ఆశ్రయం కల్పించడం వల్ల 'కవి వత్సలుడు' అనే బిరుదు వచ్చింది.
* రాజశేఖరుడి కావ్య మీమాంస, వాత్సాయనుడి కామసూత్రాల్లో ఇతడి ప్రస్తావన ఉంది.
* 700 శృంగార కథలను మహారాష్ట్రీ ప్రాకృతంలో 'గాథా సప్తశతి' అనే పేరుతో సంకలనం చేశాడు.

 

8. గౌతమీపుత్ర శాతకర్ణి

* శివస్వాతి, గౌతమీ బాలశ్రీ కుమారుడు గౌతమీపుత్ర శాతకర్ణి.
* గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది.
* దీనిలో గౌతమీపుత్ర శాతకర్ణి వ్యక్తిత్వం, సాధించిన విజయాలు ఉన్నాయి.
* ఇతడికి ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన మర్దన, త్రిసముద్రతోయ పీతవాహన, ఏకశూర అనే బిరుదులు ఉన్నాయి.
* శాతవాహనులు తమ పేర్లతో పాటు తల్లి పేరును జతపరచుకునే సంప్రదాయం ఇతడితోనే మొదలైంది.
* న‌హ‌పానుడి క్షాత్రప వంశాన్ని సమూలంగా నాశనం చేశాడు.
* న‌హ‌పానుడి నాణేలు మహారాష్ట్రలోని జోగల్‌తంబి వద్ద అత్యధికంగా లభించాయి.
* న‌హ‌పానుడిని జయించిన సందర్భంగా సగం నాణేలపై తన బొమ్మను ముద్రించుకున్నాడు.
* హిందూ మతాభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు.
* ఇతడితో పాటు రాణి అయిన వాసిష్ఠి ధర్మోద్ధరణకు విశేషంగా కృషి చేసింది.
* శాక్య రాజు రుద్రదామనుడు ఇతడిని ఓడించి కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.
* దక్కన్ ప్రాంతాన్నే కాక మాళవ, సౌరాష్ట్రలను; రాజస్థాన్‌లోని కొంత భాగాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి పాలించాడని నాసిక్ శాసనం తెలుపుతోంది.
* గౌతమీపుత్ర శాతకర్ణి సైతం శకుల నుంచి కొన్ని ప్రాంతాలను గెలుచుకున్నప్పటికీ వాటిని తిరిగి వారికే ఇచ్చేసినట్లు రుద్రదామనుడు జారీచేసిన జునాగఢ్ శాసనం వల్ల తెలుస్తోంది.

 

9. వాసిష్ఠీపుత్ర పులోమావి

* వాసిష్ఠీపుత్ర పులోమావి గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత రాజ్యాధికారం చేపట్టాడు.
* ఈయన కాలంలో వాయవ్య ప్రాంతం నుంచి శకుల ఒత్తిడి ఎక్కువైనప్పటికీ పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పటికీ కృష్ణానది ముఖద్వారం చుట్టుపక్కల అధికారాన్ని స్థాపించారు.
* ఈయన అమరావతి శాసనాన్ని వేయించాడు.
* ఇతడినే వాసిష్ఠీపుత్ర రెండో పులోమావి అని కూడా అంటారు.
* ఇతడి కాలంలోనే ఈయన తల్లి గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది.
* నాసిక్ శాసనంలో ఇతడిని 'దక్షిణ పథేశ్వరుడు'గా పేర్కొన్నారు.
* ఈయన కాలంలోనే అమరావతి స్థూపాన్ని నిర్మించారు.
* ఈయన ధాన్యకటకాన్ని (అమరావతి) రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
* ఈయన జారీ చేసిన శాసనాలు నాసిక్‌లో నాలుగు, కార్లేలో రెండు, అమరావతిలో ఒకటి, ధరణికోటలో ఒకటి మొత్తం ఎనిమిది లభించాయి.
* ఆంధ్ర ప్రాంతంలో ఈయన నాణేలు విరివిగా లభించాయి.

 

10. గౌతమీపుత్ర శివశ్రీ శాతకర్ణి

* ఇతడు గౌతమీపుత్ర శాతకర్ణి రెండో కుమారుడు.
* ఇతడికి 'క్షత్రప' అనే బిరుదు ఉంది.
* ఇతడు రుద్రదాముడి కుమార్తెను వివాహమాడాడని రుద్రదాముడు వేయించిన జునాగఢ్ శాసనం ద్వారా తెలుస్తోంది.
* జునాగఢ్ శాసనం సంస్కృతంలో వేసిన మొదటి శాసనం.
* ఇతని తర్వాత శివస్కంధుడు రాజ్యానికి వచ్చాడు.

 

11. గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి

* ప్రసిద్ధి చెందిన శాతవాహన రాజుల్లో చివరివాడు గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి.
* ఈయన ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు.
* అమరావతి స్థూపాన్ని విస్తృతపరచడమే కాకుండా దాని చుట్టూ ఇనుప కంచెను నిర్మింపజేశాడు.
* రుద్రదామనుడు మరణం తర్వాత ఉజ్జయినిలో అల్లకల్లోలాలు చెలరేగాయి. వీటిని ఆసరాగా తీసుకుని ఉజ్జయినిపై దండెత్తి గెలుపొందాడు.
* హర్షవర్ధనుడి చరిత్రను రాసిన బాణభట్టు ఇతడిని 'త్రిసముద్రాధిపతి'గా పేర్కొన్నాడు.
* మత్స్యపురాణం సంకలనం ఇతడి కాలంలోనే ప్రారంభమైంది.
* శ్రీపర్వతానికి మరో పేరు నాగార్జునకొండ. ఈ కొండపై నాగార్జునుడి కోసం పారావతి విహారాన్ని నిర్మించాడు. ఈ విహారాన్నే మహావిహారం అని కూడా అంటారు.
* రోమ్‌తో ఎక్కువగా వర్తకం జరిపాడు.
* తెరచాప లేదా లంగరు ఓసిన ఓడ చిహ్నంతో నాణేలను ముద్రించాడు.
* శక రాజులైన జీవదామనుడికి, రుద్రదామనుడికి మధ్య ఉన్న కలహాలే ఇతడి విజయానికి మూలకారణం.
* ఈయనకు, ఆచార్య నాగార్జునుడికి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలే 'సుహృల్లేఖ' గ్రంథమైంది.
* విజయశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతం దగ్గర 'విజయపురి' అనే పట్టణాన్ని నిర్మించింది.

 

మూడో పులోమావి

* శాతవాహనుల్లో చివరి పాలకుడు.
* బళ్లారిలో మ్యాకదోని శాసనాన్ని వేయించాడు.
* ఇతడి సేనాధిపతుల్లో ఒకరైన శ్రీశాంతమాలుడు ఇతడిపై తిరుగుబాటు చేయడం వల్ల బళ్లారికి వెళ్లినట్లు తెలుస్తోంది.
* శాతవాహనుల తర్వాత వారి సామంతులైన అభీరులు, చుటునాగులు, ఇక్ష్వాకులు, పల్లవులు స్వతంత్ర రాజ్యాలను స్థాపించుకున్నారు.

 

శాతవాహనులు - ఇతర అంశాలు

* ఆంధ్రులకు 30 నగరాలు, లక్ష కాల్బలం, రెండు వేల అశ్వదళం, వెయ్యి ఏనుగులు ఉన్నట్లు మెగస్తనీస్ 'ఇండికా' అనే గ్రంథంలో పేర్కొన్నాడు.
* శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృతమైంది కాదు. మైసూరులో చుటు వంశీయులు, ఇక్ష్వాకులు, కొన్ని ప్రాంతాలలో మహారథి, మహాభోజ అనే బిరుదులు ధరించిన సామంతులు వీరి ఆధీనంలో ఉండేవారు.
* దేశాన్ని మనం రాష్ట్రాలుగా విభజించుకున్నట్లు వారు తమ రాజ్యాన్ని ఆహారాలుగా విభజించుకున్నారు.
* ఈ ఆహారాలకు ఉదా: సోపారాహార, గోవర్ధనాహార, శాతవాహనాహార, మామలాహార.
* ఆహారాలకు పాలనాధిపతులు అమాత్యులు.
* ముఖ్యంగా ఇద్దరు అమాత్యులు రాజు కింద పనిచేస్తుండేవారు.
వారు: 1) రాజామాత్యుడు 2) మహామాత్రుడు.
రాజామాత్యుడు: రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహాలిస్తాడు.
మహామాత్రుడు: ప్రత్యేకమైన కార్యం కోసం నియమించిన అధికారి. అయిదు రకాలైన ఉన్నతోద్యోగి బృందం ఇతడి కింద పనిచేస్తుంది.
(1) మహాసేనాధిపతి
(2) భండాగారికుడు
(3) లేఖకుడు
(4) హిరణ్యకుడు
(5) అక్షపటకులు లేదా నిబంధకారులు.

1) మహాసేనాధిపతి సైన్య వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటాడు.
2) భండాగారికుడు వస్తువులను, ఆహార ధాన్యాన్ని భద్రపరుస్తాడు.
3) లేఖకుడు రాజపత్రాలను, రాజ శాసనాలను రచించడమే కాకుండా రాజుకు ఆంతరంగిక కార్యదర్శిగా వ్యవహరిస్తాడు.
4) హిరణ్యాక్షుడు ద్రవ్య రూపమైన ఆదాయాన్ని భద్రపరుస్తాడు.
5) అక్షపటకులు లేదా నిబంధకారులు రాజ్య వ్యవహారాలను, రాజు ఇచ్చే ఆజ్ఞలను పత్రాలలో రాసి భద్రపరుస్తారు.

 

గ్రామం:

* పాలనకు గ్రామమే ప్రాతిపదిక.

* 'గ్రామిక' లేదా 'గ్రామణి' గ్రామానికి పాలనాధికారి.

 

నిగమం

* నిగమం అంటే పట్టణం.
* పట్టణాల్లో నిగమ సభ అనే పౌరసభ ఉండేది.
* భారుకచ (బ్రోచ్), సోపార, కన్హేరి, కళ్యాణి, పైథాన్, తగర, జున్నార్, కార్లే, గోవర్ధన, ధనకటక మొదలైన పట్టణాల పేర్లు తరచూ శాసనాల్లో కనిపిస్తాయి.
* రైతుల ఇళ్లల్లో గహపతి కుటుంబ పెద్ద.
* కుల పెద్దను కూడా గహపతి అన్నారు.
* గహపతులు కూడా నిగమ సభల్లో సభ్యులే.

 

అలంకరణలు:

* పువ్వులపై ప్రీతి ఎక్కువ.
* సుగంధ ద్రవ్యాలను ఎక్కువ వాడేవారు.
* స్త్రీలు కాళ్లకు కడియాలు పెట్టుకోవడమనేది అతి సాధారణ విషయం.
* కర్ణాభరణాలు, గాజులు, కంకణాలు, హారాలను ధరించడంలో స్త్రీ, పురుష వివక్ష లేదు.
* పురుషులు నడుము నుంచి మోకాళ్ల వరకు వస్త్రాలను ధరించేవారు.
* స్త్రీలు నడుము నుంచి మోకాళ్ల వరకు ధరించిన వస్త్రంలోని కొంత భాగాన్ని వక్ష స్థలానికి కప్పుకునేవారు.

 

శిస్తు

* పంటలో వ వంతును శిస్తుగా వసూలు చేసేవారు.
* పంటలో రాజు భాగాన్ని 'దేయమేయం' అనేవారు.
* శిస్తును ధాన్య రూపంలో కానీ ద్రవ్యరూపంలో కానీ స్వీకరించేవారు.
* రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు.
* రైతులకు భూమిపై హక్కు ఉండేది.

 

చేతి వృత్తులు

* శాసనాల్లో పలు చేతివృత్తులవారు కనిపిస్తారు.
1) వధకులు (వడ్రంగులు)
2) సేలవధకులు (శిల్పులు)
3) గధికులు (సుగంధ ద్రవ్యాలను తయారుచేసేవారు)
4) సువర్ణకారులు (కంసాలులు)
5) పసకరులు (మేదరివారు)
6) కులారులు (కుమ్మరులు)
7) తెసకారులు (మెరుగుపెట్టేవారు)
8) కాసకారులు (కంచుపనివారు)
9) కోలికులు (సాలెవారు)
10) తిలపిష్టకులు (నూనె తయారుచేసేవారు)
11) కమారులు (కమ్మరులు)
12) చంకుకారులు (చర్మకారులు)

* ఒక్కో వృత్తి చేపట్టేవారు ఒక్కో సంఘంగా ఏర్పడ్డారు.
* ఈ సంఘాన్నే శ్రేణి అంటారు. శ్రేణికి అధిపతి శ్రేష్ఠి.
* ఈ శ్రేణులు అవలంబించాల్సిన నియమ నిబంధనలను 'శ్రేణి ధర్మం అంటారు.
* శ్రేణిలోని సభ్యులే ఈ శ్రేణి ధర్మాన్ని తయారు చేసుకునేవారు.
* ఈ శ్రేణి ధర్మానికి రాజ్య గుర్తింపు ఉండేది.
* ఈ వృత్తి సంఘాలే తర్వాత కులాలుగా రూపొందాయి.

 

నాణేలు:
* శాతవాహనులు తమ నాణేలను వెండి, బంగారం, సీసం, తగరం, రాగి, ఫోటిన్ మొదలైన లోహాలతో తయారు చేసేవారు.
* వెండి నాణేలను కార్షపణం అంటారు.
* బంగారు నాణేన్ని సువర్ణం అంటారు.
* 35 కార్షపణాలు ఒక సువర్ణంతో సమానం.
* ఈ నాణేలపై చైత్యం, ఏనుగు, సింహం, వృషభం, విల్లు, ఉజ్జయిని చిహ్నం ఉండేవి.
* ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో రాసేవారు.

 

సైన్యం:
* తాత్కాలిక సైనిక శిబిరాన్ని 'సంధవారం' అంటారు.
* శాశ్వత సైనిక శిబిరాన్ని 'కటకం' అంటారు.

 

ఎగుమతులు:

* దంతాలు, నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, నూలు దారం రోమ్‌కు ఎగుమతి అయ్యేవి.

 

దిగుమతులు:

* మద్యం, రాగి, వెండి, బంగారం, గాజు రోమ్ నుంచి దిగుమతి అయ్యేవి.

 

రేవు పట్టణాలు:

* పశ్చిమాన బరుకచ్ఛం, సోపార, కళ్యాణ; తూర్పున కోడూరు, మైసోలి, ఘంటసాల, మోటుపల్లి, కోరంగి.
ప్రయాణ సాధనాలు:
* నదులలో నౌకల ద్వారా ప్రయాణించేవారు.
* ఎడ్ల బళ్లు, పల్లకీల్లో ప్రయాణాలు సాగేవి.

 

పంటలు:
చెరకు, నువ్వులు, ఉల్లి, అల్లం, పత్తి, రాగులు, కంది, పెసర, ఆముదాలు, కొబ్బరి.

 

విదేశీ ద్రవ్యం:
* రోమ్ దేశం శాతవాహనులకు ఎక్కువగా చెల్లింపులను బంగారం రూపంలో జరిపేది. అందువల్ల బంగారం విపరీతంగా వచ్చి పడేది.
* సంవత్సరానికి 11 వేల స్టెర్లింగుల బంగారం శాతవాహనులకు తరలిపోతోందని ప్లినీ వాపోయాడు.

 

స్త్రీ స్వేచ్ఛ:
* స్త్రీకి అధిక స్వేచ్ఛ ఉండేది.
* సంఘంలో గౌరవ మర్యాదలను పొందేవారు.
* ఎక్కువ విద్యను అభ్యసించేవారు.
* దానధర్మాలు విరివిగా చేశారు.
* ఆస్తి హక్కు ఉంది.
* పాలనా వ్యవహారాల్లో సైతం పాలుపంచుకునేవారు.

 

విదేశీ రచయితలు - రచనలు

I) టాలమీ - గైడ్ టు జాగ్రఫీ
II) మెగస్తనీస్ - ఇండికా
III) ప్లినీ - నేచురల్ హిస్టరీ
IV) పేరు లభ్యం కాని నావికుడు - పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ
V) హుయాన్‌త్సాంగ్ - సీయూకీ

 

క్రతువులు:
* రాజులు అశ్వమేథ, రాజసూయ యాగాల్నే కాకుండా అగ్న్యాధేయ, అనారంభనీయ, భగళాదశరాత్ర, గర్గత్రిరాత్రి, గవామయన, శతాతిరాత్ర మొదలైన క్రతువులను నిర్వహించేవారు.

 

ప్రార్థనా గీతాలు:

* ఇంద్ర, శంకర్షణ, వాసుదేవ, చంద్ర, సూర్య, యమ, వరుణ, కుబేరుల ప్రార్థనా గీతాలను ఆలపించేవారు.
* గాథాసప్తశతి శివస్తోత్రంతో మొదలవుతుంది.
* గౌరి, సరస్వతుల గురించి స్తోత్రాలు ఉన్నాయి.

 

ఆచార్య నాగార్జునుడు:

* ఇతడి కాలం, జన్మస్థానం, మత ప్రచారాల గురించి వాదోపవాదాలు ఉన్నాయి.
* ఈయన బౌద్ధ సన్యాసి.
* మహాయాన సిద్ధాంత ప్రవక్త.
* ఈయన రచించిన 25 గ్రంథాలు చైనా అనువాదాల్లో లభ్యమవుతున్నాయి.
* ఈయన తన గ్రంథాలన్నింటినీ సంస్కృతంలోనే రచించాడు.

 

ముఖ్య గ్రంథాలు:

1. సుహృల్లేఖ
2. శూన్యసప్తతి
3. ప్రజ్ఞాపారమిత శాస్త్ర
4. మూల మాధ్యమిక శాస్త్ర
5. ద్వాదశనికాయ శాస్త్ర
6. రసరత్నాకరం

 

1. గుణాఢ్యుడు - బృహత్కథ
2. హాలుడు - గాథాసప్తశతి
3. శర్వవర్మ - కాతంత్ర వ్యాకరణం
4. కుతూహలుడు - లీలావతి పరిణయం
5. వాత్సాయనుడు - కామసూత్రాలు

* సంస్కృతంలో రచనలు శాతవాహనుల కాలంలోనే ప్రారంభమయ్యాయి.
* ఆరు నెలల కాలంలో శర్వవర్మ తన రాజుకు సంస్కృతంలో వ్యాకరణం నేర్పాలని కాతంత్ర వ్యాకరణాన్ని రచించాడని చెబుతారు. ఈ గ్రంథాన్ని ఇప్పటికీ బంగ్లాదేశ్‌లోనూ, కాశ్మీరులోనూ చలామణిలో ఉంది.
* సోమదేవుడి కథా సరిత్సాగరం, బుద్ధస్వామి రచించిన బుద్ధ కథా శ్లోక సంగ్రహ, క్షేమేంద్రుడి బృహత్కథా మంజరి బృహత్కథ‌ రూపాంతరాలే.

 

బృహత్కథ గురించి రచయితల అభిప్రాయం

1. బృహత్కథలోని కథలన్నీ సంస్కృత కథల నుంచి ఎరువు తెచ్చుకున్న పీలికలతో కుట్టిన గుడ్డల వలే కనబడుతున్నాయని తిలకమంజరి గ్రంథకర్త ధనపాలుడి అభిప్రాయం.
2. వాల్మీకి, వ్యాస మహర్షులకు ఇచ్చిన స్థానాన్నే గోవర్థనుడు గుణాఢ్యుడికి ఇచ్చాడు.
3. నాటక రచయితలకు రామాయణం ఎలాంటి గనో బృహత్కథ కూడా అలాంటి గనియేనని దశరూప గ్రంథకర్త సెలవిచ్చాడు.
4. కథా సరిత్సాగరం, బృహత్కథా మంజరి, బుద్ధ కథా శ్లోక సంగ్రహ ఈ మూడు గ్రంథాలను ఉపయోగించి అసలు బృహత్కథను పునరుద్ధరించవచ్చునని ఆచార్య పెలిక్స్ లకోట్ అన్నారు.
* గాథాసప్తశతిలో అత్త, పాడి, పొట్ట, పిల్ల, పత్తి అనే తెలుగు పదాలు ఉన్నాయి.

 

బంగారు గనులు:
వొందపల్లి, కొల్లార్, హత్తి, మాస్కీలలో బంగారు గనులు ఉండేవి.

 

బౌద్ధమతంలో శాఖలు:

1. భదయనీయ
2. మహా సాంఘిక
3. పూర్వ శైల
4. అపర శైల

నాసిక్‌లో భదయనీయ శాఖకు చెందినవారు, కార్లేలో మహా సాంఘిక శాఖకు చెందినవారు, నాగార్జునకొండపై పూర్వ శైల, అపర శైల శాఖలకు చెందినవారు ఉండేవారు.

బౌద్ధుల కట్టడాల్లో 3 భాగాలున్నాయి.
1. స్థూపం
2. విహారం
3. చైత్య గృహం

1. స్థూపం: బుద్ధుడి అస్తికలపై నిర్మించింది స్థూపం. భట్టిప్రోలు, అమరావతి, ఘంటసాల స్థూపాలకు ఉదాహరణలు.
1797లో శిథిలావస్థలో ఉన్న అమరావతి స్థూపాన్ని కల్నల్ మెకంజీ కనుక్కున్నారు. ఈ స్థూప భాగాల్లో ఎక్కువ భాగాన్ని లండన్‌కు, మిగిలిన భాగాన్ని మద్రాస్‌కు తరలించారు.

2. విహారం: బౌద్ధ భిక్షువుల నివాస స్థానాలే విహారాలు. ఇలాంటి విహారాలు భూమిపైన, కొండల పైన నిర్మించారు. కొండలను తొలచి చేసిన విహారాలు, ఇటుకలతో కట్టిన విహారాలు ఉన్నాయి.
* కోరుకొండ, గుంటుపల్లి, కొండాపురం, విజయవాడ, సంఘరంలలో గుహ విహారాలు ఉన్నాయి.
* అమరావతి, నాగార్జున కొండలలో ఇటుకలతో నిర్మించిన విహారాలు ఉన్నాయి.

3. చైత్య గృహం:
బౌద్ధులు ప్రార్థన కోసం వినియోగించే గృహాలే చైత్య గృహాలు.
* పశ్చిమాన నాసిక్, కార్లే, కన్హేరి, జెడ్సాలో ఉన్నాయి.
* చేజెర్ల, గుంటుపల్లి, శాలిహుండం, రామతీర్థం, విజయవాడ, నాగార్జునకొండ మొదలైన చోట్ల ఇటుకలతో నిర్మించిన చైత్య గృహాలు ఉన్నాయి.
* తెలుగునాట అత్యంత ప్రాచీనమైనది గుంటుపల్లి చైత్యం.

 

ఫణిగిరి:
నల్గొండ జిల్లాలో సూర్యాపేట నుంచి 35 కి.మీ. దూరంలో బౌద్ధ క్షేత్రం ఉంది. ఇక్కడ అనేక బౌద్ధ స్థూపాలు బయల్పడ్డాయి.

 

గాజులబండ:
ఫణిగిరికి 4 కి.మీ. దూరంలో గాజులబండ ఉంది. ఇక్కడ కూడా అనేక బౌద్ధ స్థూపాలున్నాయి.

 

దూళికట్ట:
కరీంనగర్ జిల్లాలోని దూళికట్ట గ్రామంలో మహాస్థూపం, చైత్యాలు, నాణేలు బయల్పడ్డాయి.
మహా చైత్యకులు 5 వస్తువులను ఆరాధిస్తారు.
1) చైత్యం
2) పద్మం
3) బోధి వృక్షం
4) సింహాసనం
5) బుద్ధుడి పాదాలు.
* 1892లో కలకత్తాలో ధర్మపాలుడు 'మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా' అనే సంస్థను స్థాపించాడు.
* ఇతడు 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి బౌద్ధ మతం తరఫున హాజరయ్యాడు.

 

బౌద్ధ మతానికి రాజాదరణ:
1. భదయనేయ శాఖకు చెందిన భిక్షువులకు గౌతమీ బాలశ్రీ ఒక గుహను తొలపించింది.
2. తెకెరసి కొండపై ఉండే భిక్షువులకు గౌతమీపుత్ర శాతకర్ణి 200 నివర్తనాల స్థలాన్ని ఇచ్చాడు.
3. రెండో పులోమావి మహాసాంఘిక శాఖకు ఒక గ్రామం ఇచ్చాడు.
4. తిరనిహూ కొండపై ఉండే భిక్షువులకు గౌతమీ బాలశ్రీ, గౌతమీ పుత్ర శాతకర్ణి ఇద్దరూ కలిసి 100 నివర్తనాల స్థలాన్ని దానమిచ్చారు.
5. కన్హుడు అనే రాజు నాసిక్ వద్ద ఒక గుహను తొలపించాడు. బౌద్ధుల రక్షణ కోసం 'మహామాత్ర అనే ఉద్యోగిని నియమించాడు.
6. నాగానిక నానేఘాట్‌లో ఒక గుహను తొలపించడమే కాకుండా అక్కడ ఒక శాసనాన్ని వేయించింది.
7. యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడికి శ్రీపర్వతంపై ఒక విహారాన్ని నిర్మించాడు.
* భారతదేశంలో భూమిని దానం చేసిన తొలి రాజ వంశం శాతవాహనుల వంశమే.
* ప్రజలు సైతం బౌద్ధ భిక్షువుల అవసరాలను తీర్చడంలో ఆసక్తిని కనబరిచారు.
* బౌద్ధ భిక్షువులకు కొత్త వస్త్రాలు ఇవ్వడం అనేది ఆ రోజుల్లో ఆచారంగా ఉండేది. ఈ వస్త్రదానం కోసం శ్రేణుల వద్ద ప్రజలు ధనాన్ని పెట్టుబడిగా పెట్టి సంవత్సరానికి వచ్చే వడ్డీతో వస్త్రాలను కొనేవారు.

 

జైనం:
* శాతవాహనులు మొదట జైన మతస్థులు.
* కరీంనగర్ జిల్లాలోని 'మునులగుట్ట' జైన స్థావరమే.
* మునులగుట్టలో సిముఖుడి నాణేలు లభ్యమయ్యాయి.
* నల్గొండ జిల్లాలోని కొలనుపాక ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్న ఏకైక జైన స్థావరం.
* కొలనుపాకలో ఒకటిన్నర మీటర్ల మహావీరుడు విగ్రహం ఉంది.

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

నెపోలియ‌న్ ఉన్నతి - ప‌త‌నం

  నెపోలియన్ బోనపార్టీ ఐరోపా చరిత్రను సుమారు రెండు దశాబ్దాలపాటు శాసించాడు. స్థిరమైన రాజకీయ వ్యవస్థను, సమర్థ పాలననూ అందించిన నెపోలియన్ ఐరోపా ఖండం మీద ఫ్రెంచ్ పతాకాన్ని ఎగరేశాడు. 'నేను విప్లవం కన్నబిడ్డను, నా దేశం నశించే పరిస్థితుల్లో నేను జన్మించాను. ఫ్రెంచ్ కిరీటం నేలపై పడి ఉండగా నేను నా కత్తితో దాన్ని పైకెత్తాను' అంటూ ధీరత్వాన్ని ప్రకటించుకున్న నెపోలియన్‌కు సంబంధించిన మరికొన్ని అంశాలను పరిశీలిద్దాం.

  నెపోలియన్ బోనపార్టీ 1769 ఆగస్టు 15 న కార్సికా దీవిలోని అజాషియా పట్టణంలో జన్మించాడు. ఇతడి తల్లిదండ్రులు కార్లో బోనపార్టీ, లెటిజియారమోలినో. ఫ్రెంచ్‌వారు జెనీవా నుంచి కార్సికాను కొనుక్కోవడం వల్ల నెపోలియన్ ఫ్రెంచ్ పౌరుడయ్యాడు. నెపోలియన్‌కు చరిత్ర, భూగోళ, రాజనీతి, గణిత, తత్వశాస్త్రాల అధ్యయనంపై ఆసక్తి ఎక్కువ. ఇతడిపై రూసో ప్రభావం అధికంగా ఉండేది. 'రూసో లేకపోయినట్లయితే నెపోలియన్ ఉండేవాడు కాదు', 'నాకు పుస్తకాలు తప్ప మరే స్నేహితుడు లేడు' అని నెపోలియన్ పేర్కొన్నాడు. ఇతడు గొప్ప సైనిక విజేత, పరిపాలనాదక్షుడు.

* 1799 నుంచి 1815 వరకూ సాగిన నెపోలియన్ కాలాన్ని రెండు దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో (1799 - 1804) ప్రథమ కన్సల్‌గా వ్యవహరించిన నెపోలియన్ రెండో దశలో (1804 - 15) చక్రవర్తిగా అధికారం చెలాయించాడు.

 

పాలనా సంస్కరణలు

  నెపోలియన్ యుద్ధ విజయాలు అశాశ్వతాలు కావచ్చునేమోగానీ అతడి స్వదేశీ సంస్కరణలు ఫ్రాన్స్‌లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఈ దశలో ఫ్రాన్స్‌కు కావాల్సింది సమానత్వమేగానీ, స్వేచ్ఛకాదని నెపోలియన్ ప్రగాఢంగా విశ్వసించాడు. అతడి దృష్టిలో సామాజిక వ్యవస్థలో ప్రభుత్వం సౌరకుటుంబంలో సూర్యుడి లాంటిది.

* ఫ్రాన్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులను ఎంచుకునే పద్ధతికి స్వస్తి పలికాడు. డిపార్ట్‌మెంట్లుగా పిలిచే రాష్ట్రాలపై అధికారులుగా ప్రిఫెక్ట్‌లనూ, వాటి అంతర్భాగాలైన అరెంటైజ్‌మెంట్లపై సబ్‌ప్రిఫెక్ట్‌లనూ, అయిదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలకు మేయర్లను నియమించాడు. వీరిని తొలగించే అధికారం తనవద్దే ఉంచుకున్నాడు.

ఆర్థిక సంస్కరణలు - జాతీయ బ్యాంకు:

  డైరెక్టరీ పతనానికి ఆర్థిక పతనమే కారణమని నెపోలియన్ గుర్తించాడు. పకడ్బందీగా పన్నులు వసూలు చేసి, లంచగొండి అధికారులను కఠినంగా శిక్షించాడు. నెపోలియన్ ఆర్థిక సంస్కరణల్లో ప్రముఖంగా పేర్కొనేది 'జాతీయ బ్యాంకు' స్థాపన. 1800 లో స్థాపించిన ఈ బ్యాంకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖంగా నిలిచి, నేటికి కొనసాగుతోంది. విలువ కోల్పోయిన కాగిత ద్రవ్యం 'అస్సినా'ను రద్దుచేసి, నాణేల రూపంలో నూతన ద్రవ్యాన్ని ముద్రించాడు. ఇండియా, చైనా దేశాలతో వ్యాపార సంబంధాలను విస్తృతపరిచాడు. భారతదేశంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు.

 

పోప్‌తో రాజీ - కంకార్డేట్:

  మతం ప్రాధాన్యాన్ని గుర్తించిన నెపోలియన్ ప్రజలకు మతం ఉండాలిగానీ, అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని భావించాడు. మతం లేని రాజ్యం దిక్సూచి లేని నౌకలాంటిదని ప్రకటించాడు. పోప్ ఏడో పయస్‌తో 1801 లో కంకార్డేట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. నెపోలియన్ సూచించిన ఫ్రెంచ్ మతాధికారులనే పోప్ నియమించేటట్లు ఒప్పందం కుదిరింది. కేథలిక్‌ను అధికార మతంగా గుర్తించాడు.

 

న్యాయ సంస్కరణలు - నెపోలియన్ స్మృతి:

  వివిధ న్యాయ స్మృతులను క్రోడీకరించి దేశమంతటికీ అనువర్తించే విధంగా ఒకే న్యాయ స్మృతిని రూపొందించాడు. ప్రథమ కాన్సల్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నెపోలియన్ ఒక న్యాయ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘం న్యాయ స్మృతులను అయిదు భాగాలుగా క్రోడీకరించింది. వీటిలో సాంఘిక సమానత్వం, మత సహనం, భూస్వామ్య వ్యతిరేకత, బహిరంగ నేర విచారణ, న్యాయం ముందు సమానత్వం, జ్యూరీ తీర్పు లాంటి అంశాలున్నాయి. ఇతడి న్యాయ స్మృతి మొదటి అధునిక న్యాయ స్మృతిగా ప్రసిద్ధిపొంది, ఇతర రాజ్యాలకూ మార్గదర్శకమైంది. నెపోలియన్‌ను ప్రజలు 'రెండో జస్టీనియన్‌'గా ప్రస్తుతించారు.
విద్యా సంస్కరణలు: ఫ్రాన్స్ దేశమంతా అనుసరించే ఒకే జాతీయ విద్యావిధానానికి రూపకల్పన చేశాడు. ప్యారిస్‌లో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. దీనికి అనుబంధంగా 17 శాఖలను ఏర్పాటు చేసి, విద్యావ్యవస్థను ఇవి పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నాడు.

* ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, వృత్తి విద్యా పాఠశాలలను స్థాపించాడు. నెపోలియన్ మహిళా విద్య పట్ల శ్రద్ధ చూపాడు. ధర్మశీలురుగా, ఆదర్శ గృహిణులుగా తీర్చిదిద్దడమే మహిళా విద్య లక్ష్యంగా ప్రకటించాడు.
ప్రజాహిత కార్యక్రమాలు: వ్యవసాయ అభివృద్ధి కోసం పంట కాల్వలను తవ్వించాడు. నదులపై వంతెనలు నిర్మించాడు. ఆస్టర్లిట్జ్‌లోని జీనా వద్ద నిర్మించిన వంతెనలు ప్రసిద్ధమైనవి. నెపోలియన్ నిర్మించిన విశాల రహదారులు అతడి పాలనాదక్షతకు నిదర్శనం. పురాతన రాజభవానాలైన ఫౌంటెన్ బ్లూ, ట్విలరీని పునర్నిర్మించి జేగీయమానం చేశాడు. యుద్ధ విజయాల ద్వారా సాధించిన ప్రాచీన కళాఖండాలతో ప్యారిస్‌ను తీర్చిదిద్దాడు.
చక్రవర్తిగా నెపోలియన్: 1804 నుంచి 1815 వరకు నెపోలియన్ చక్రవర్తిగా పాలించిన కాలమంతా యుద్ధాలతోనే గడిచింది. ఇంగ్లండ్ మినహా ఐరోపా ఖండాన్నంతటినీ జయించి, మహాసామ్రాజ్య నిర్మాతగా, ఐరోపా సార్వభౌముడిగా ఖ్యాతి పొందాడు.

 

మూడో రాజ్య కూటమి

  ఇంగ్లండ్ 1804 లో ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా మూడో రాజ్య కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో ఇంగ్లండ్‌తోపాటు ఆస్ట్రియా, రష్యా, నేపుల్స్, స్వీడన్ చేరాయి. ప్రష్యా తటస్థంగా ఉంది. ఫ్రాన్స్‌తో స్పెయిన్ జతకట్టింది. నెపోలియన్ 1805 లో ఉల్మ్ యుద్ధంలో, ఆస్టర్లిట్జ్ యుద్ధంలోనూ ఆస్ట్రియాను ఓడించి, దాని రాజధాని వియన్నాను ఆక్రమించాడు.

* బ్రిటన్‌తో ట్రఫాల్గర్ వద్ద జరిగిన నౌకా యుద్ధంలో ఓటమి పాలయ్యాడు. ఆస్ట్రియా ప్రెస్ బర్గ్ సంధి చేసుకుని, ఇటలీ రాజ్యాలైన వెనిస్, టైరోర్‌ను ఫ్రాన్స్‌కు ఇచ్చింది. ఆస్ట్రియా చక్రవర్తికి ఉన్న పవిత్ర రోమన్ చక్రవర్తి బిరుదును నెపోలియన్ రద్దు చేశాడు. దీంతో వెయ్యేళ్ల పవిత్ర రోమన్ సామ్రాజ్యం (800 - 1805) అంతమైంది.

ఐరోపా సార్వభౌమత్వం: మూడో రాజ్య కూటమి విచ్ఛిన్నం కావడంతో నెపోలియన్ ఐరోపా సార్వభౌముడిగా అవతరించాడు. ఐరోపా రాజకీయ పటాన్ని పూర్తిగా మార్చేసి, తన బంధువులు, సేనానులను ఆయా రాజ్యాల్లో నియమించాడు.

* రైన్ పరివాహక ప్రాంతంలోని 16 జర్మన్ రాజ్యాలను రైన్ సమాఖ్యగా ఏర్పాటు చేసి, వాటికి సంరక్షకుడు తానే అని ప్రకటించుకున్నాడు. ప్రష్యా, ఆస్ట్రియా నుంచి గ్రహించిన భూభాగాలతో వార్సా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

* ఐరోపాపై నెపోలియన్ విజయ పతాకం రెపరెపలాడింది. ఆక్రమిత ప్రాంతాల్లో భూస్వామ్య వ్యవస్థనూ, వెట్టిచాకిరినీ రద్దు చేశాడు. వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వాన్ని అందించాడు. చర్చి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా నెపోలియన్ విప్లవ ఫలాలను ఐరోపా అంతటా పంచిపెట్టాడు.

 

భూఖండ విధానం

  ఇంగ్లండ్‌ను ఓడించడానికి నెపోలియన్ అనుసరించిన విధానమే భూఖండ విధానం. ఇంగ్లండ్ సైనిక శక్తికి దోహదం చేస్తున్న అంశం వాణిజ్యమేనని గుర్తించిన నెపోలియన్, వ్యాపారాన్ని ధ్వంసం చేస్తే ఆ రాజ్యం దాసోహమవుతుందని భావించాడు. బ్రిటిష్ వ్యాపారాన్ని దెబ్బతీయడమంటే బ్రిటిష్ గుండెలపై ఎగిరి తన్నడమే అని వ్యాఖ్యానించాడు. దీనికి భూఖండ విధానమనే నూతన పద్ధతిని అనుసరించాడు.

* 1806 లో బెర్లిన్, 1807 లో మిలాన్, 1810 లో ప్లాటెన్‌బా నుంచి జారీ చేసిన ఆదేశాల ద్వారా ఈ విధానాన్ని ప్రకటించాడు. ఐరోపా రాజ్యాలు బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాన్ని నిలిపేయాలని, ఇంగ్లండ్ నౌకలను ఫ్రెంచ్ ఓడరేవుల్లో, ఫ్రాన్స్ మిత్రదేశాల ఓడరేవుల్లో నిలపకూడదని నెపోలియన్ ఆజ్ఞాపించాడు.

* ప్రతిచర్యగా ఇంగ్లండ్ 'ఆర్డర్స్ ఇన్ కౌన్సిల్' శాసనాలను జారీ చేసింది. భూఖండ విధానాన్ని అమలుపరచడంలో నెపోలియన్ కఠిన వైఖరిని అనుసరించాడు. కానీ, పారిశ్రామిక విప్లవం, భారత్, ఈజిప్ట్ లాంటి దేశాలతో వ్యాపారం వల్ల ఇంగ్లండ్ అప్పటికే అభివృద్ధి సాధించడంతో ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కోగలిగింది.

 

పోప్ నిర్బంధం

  పోప్ ఏడో పయస్ తన అధీన ప్రాంతాల్లో భూఖండ విధానాన్ని అమలుపరచడానికి నిరాకరించడంతో నెపోలియన్ అతడిని బంధించి, ఆ భూములను ఫ్రెంచ్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. దీంతో రోమన్ కేథలిక్‌లలో నెపోలియన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ద్వీపకల్ప యుద్ధంతో నెపోలియన్ పతనం ప్రారంభమైంది.

* ఇతడు ఆస్ట్రియా రాకుమార్తె మేరియా లూసియాను వివాహం చేసుకున్నాడు. ప్రాచీన రాజవంశమైన హాప్సీబర్గ్‌లతో వివాహ బంధం ఏర్పరచుకోవడం నెపోలియన్ ప్రతిష్టను పెంచింది.
* మేరియా లూసియా, నెపోలియన్ దంపతులకు జన్మించిన కుమారుడే రెండో నెపోలియన్.
* స్పెయిన్ సమస్య తనను తినేసిన రాచపుండని నెపోలియన్ వ్యాఖ్యానించాడు.
నెపోలియన్ పతనం - నాలుగో రాజ్య కూటమి: నెపోలియన్‌కు వ్యతిరేకంగా 1813 లో నాలుగో కూటమి
ఏర్పడింది. ఈ కూటమిలో ప్రధాన సభ్య దేశాలు: ప్రష్యా, రష్యా, స్వీడన్, ఇంగ్లండ్, ఆస్ట్రియా.

 

లీప్‌జిగ్ యుద్ధం

  మిత్ర కూటమి సైన్యాలు 1813 అక్టోబరు 16 - 19 మధ్య లీప్‌జిగ్ యుద్ధంలో నెపోలియన్‌ను ఓడించాయి. దీన్నే రాజ్యాల యుద్ధం (బ్యాటిల్ ఆఫ్ నేషన్స్) అంటారు. ఈ యుద్ధంలో మిత్ర సైన్యాలకు ఆస్ట్రియాకు చెందిన మెటర్నిక్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో నెపోలియన్ పరాజయం పాలై, ఎల్బో దీవికి ప్రవాసం వెళ్లాడు. క్రీ.శ. 1789 లో నెపోలియన్ ఈజిప్ట్ పై దండయాత్ర చేశాడు. ఈ యుద్ధంలో నెపోలియన్ బ్రిటిష్ నౌకాదళాధిపతి నెల్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

వాటర్లూ యుద్ధం: ఎల్బో దీవి నుంచి తప్పించుకున్న నెపోలియన్ ఫ్రాన్స్ చేరుకున్నాడు. మిత్రకూటమి సైన్యాలు 'డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్' నాయకత్వంలో 1815 జూన్ 18 న జరిగిన చరిత్రాత్మక వాటర్లూ యుద్ధంలో నెపోలియన్‌ను ఓడించాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఐరోపాకు 6000 మైళ్ల దూరంలో ఉన్న సెయింట్ హెలీనాలోని రాకీ దీవికి అతడిని బందీగా పంపించాయి. నెపోలియన్ కేన్సర్ వ్యాధి బారినపడి 1821 మే 5న తన 52వ ఏట మరణించాడు.

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

నెపోలియ‌న్ ఉన్నతి - ప‌త‌నం

1. నెపోలియన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసిన తత్వవేత్త ఎవరు?
జ‌: రూసో

 

2. 'నాకు పుస్తకాలు తప్ప మరే స్నేహితుడు లేడు' అని పేర్కొన్నది ఎవరు?
జ‌: నెపోలియన్

 

3. 1798 లో ఈజిప్ట్ దండయాత్రలో నెపోలియన్‌ను ఓడించిన ఆంగ్ల సైనికాధికారి ఎవరు?
జ‌: నెల్సన్

 

4. 'నా దేశం నశించే పరిస్థితుల్లో నేను జన్మించాను' అని అన్నది ఎవరు?
జ‌: నెపోలియన్

 

5. మతం లేని రాజ్యం దిక్సూచి లేని నౌకలాంటిదని పేర్కొన్నది ఎవరు?
జ‌: నెపోలియన్

 

6. 'నేను విప్లవం కన్నబిడ్డను' అని చెప్పుకున్నది ఎవరు?
జ‌: నెపోలియన్

 

7. 'నన్ను తినేసిన రాచపుండు' అని నెపోలియన్ ఏ యుద్ధాన్ని పేర్కొన్నాడు?
జ‌: ద్వీపకల్ప (స్పెయిన్) యుద్ధం

 

8. బ్యాటిల్ ఆఫ్ నేషన్స్ ఎప్పుడు జరిగింది?
జ‌: 1813

 

9. నెపోలియన్ చిట్టచివరి యుద్ధం ఏది?
జ‌: వాటర్లూ యుద్ధం

 

10. నెపోలియన్ మరణించిన ప్రదేశం ఏది?
జ‌: రాకీ

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహనుల పరిపాలన - సామాజిక పరిస్థితులు

  మౌర్య సామ్రాజ్య విచ్ఛిన్నంతో దక్షిణాపథంలో శాతవాహనులు, చోళ, చేర, పాండ్య రాజులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకున్నారు. శాతవాహనుల పరిపాలనకు పూర్వమే దక్షిణాపథం రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిందని అజ్ఞాత గ్రీకు నావికుడు రాసిన ''పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ", మెగస్తనీస్ ఇండికా గ్రంథాలను బట్టి తెలుస్తోంది. చారిత్రక యుగ ఆవిర్భావం నుంచి దక్షిణాన వివిధ వంశాలు పాలన సాగించాయని గ్రీకు రచనలు, అశోకుడి శాసనాలు తెలుపుతున్నాయి.

  శాతవాహనులు మౌర్యుల పాలన విధానాన్నే అనుసరించారని రామ్‌శరణ్ శర్మ అనే చరిత్రకారుడి అభిప్రాయం. ఎందుకంటే - మౌర్యులు, శాతవాహనులు ఇద్దరి భాషా ప్రాకృతమే. మౌర్యులకు సామంతులు శాతవాహనులు. శాతవాహనుల కాలంలో కూడా మైసూర్‌లో చుటునాగులు, నాగార్జున కొండలో ఇక్ష్వాకులు, నాసిక్‌లో అభీరులు మొదలైన సామంత రాజ్యాలు ఉన్నాయి.

  కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మౌర్యులు, శాతవాహనుల పాలనకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. వారిద్దరి పరిపాలనలో అనేక తేడాలున్నాయి.. మౌర్యులది కేంద్రీకృత పాలనా వ్యవస్థ కానీ శాతవాహనులది వికేంద్రీకృత పాలనా వ్యవస్థ.
రాజు ఆధీనంలో ఉన్న భూమిని మౌర్యుల కాలంలో 'రాజ్యక్షేత్ర' అని, శాతవాహనుల కాలంలో 'రాజకంఖేట' అని పిలిచేవారు. మౌర్యుల కాలంలో చాలామంది ఉద్యోగులతో కూడిన బృంద వ్యవస్థ ఉండేది. శాతవాహనుల కాలంలో ఇది తక్కువ. మౌర్యుల కాలంలో గనుల శాఖ, ఉప్పు శాఖ ఉండేవి. కానీ శాతవాహనుల కాలంలో ప్రత్యేక శాఖలనేవి లేవు. అందుకే చరిత్రకారులు మౌర్యులకు - శాతవాహనులకు పరిపాలనలో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.

 

పరిపాలన విభాగాల పేరు - అధికారి
* ఆహారాలు (రాష్ట్రాలు) - అమాత్య
* నిగమాలు (పట్టణాలు) - నాగరికుడు
* గ్రామం - గుళ్మిక (గ్రామాధికారి)

 

మూడో పులోమావి వేయించిన 'మ్యాకదోని' శాసనంలో కింది ఆహారాల ప్రస్తావన కనిపిస్తుంది.
* శాతవాహనీహార - కర్ణాటకలోని బళ్లారి ప్రాంతం
* గోవర్ధనహార - మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం
* మమాలహార - పూనాలోని సతారా
* సోమారహార - మహారాష్ట్రలోని రేసామారక రేవు పట్టణ సమీప ప్రాంతం
* కపూరచార - గుజరాత్ ప్రాంతం మొదలైనవి.

   కుబేరకుని భట్టిప్రోలు శాసనం, మెగస్తనీస్ ఇండికా గ్రంథాల ఆధారంగా నాడు పట్టణ పాలన (నిగమాలు) ఉండేదని తెలుస్తోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యజమానులైన 'గహపతులు' నిగమాలలో సభ్యులుగా వ్యవహరించేవారు.

 

ఉద్యోగి బృంద వ్యవస్థ

* అమాత్య - ఆహారాలుగా పిలిచే రాష్ట్రానికి అధికారి
* లేఖక్ - రాజు అంతరంగిక అధికారి
* అక్షపటలక - రికార్డులను భద్రపరిచే అధికారి
* రాయబారి - దూత
* భాండాగారికుడు - ధాన్యరూపంలో వసూలైన శిస్తును భద్రపరిచే అధికారి
* హేరణిక - ధన రూపంలో వసూలైన శిస్తును భద్రపరిచే అధికారి
* రజ్జు - కొలమానం (తాడు)
* రజ్జుగాహక - శిస్తు వసూలు చేసే అధికారి
* స్కందవారం - తాత్కాలిక సైన్యం (సైనిక శిబిరం)
* కటకం - ఆయుధాగారం (శాశ్వత సైన్యం)

  శాతవాహుల కాలంలో సైనిక వ్యవస్థ ఉండేదని మెగస్తనీస్ 'ఇండికా' గ్రంథం, అమరావతి శిల్పాల ఆధారంగా తెలుస్తోంది.

 

సాంఘిక పరిస్థితులు

  నాటి సాంఘిక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి హాలుని గాథాసప్తసతి (ప్రధాన ఆధారం), గుణాడ్యుని బృహత్కథ, గ్రీకు అజ్ఞాత నావికుడి ''పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ", అమరావతి శిల్పాలు మొదలైన ఆధారాలు తోడ్పడుతున్నాయి.

* పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో 'కుల పురుష పరంపరాగత విపుల రాజ్యం' అనే ప్రస్తావన కనిపిస్తుంది.
* రాజులను దైవాంశ సంభూతులుగా భావించేవారు. గౌతమీ బాలశ్రీ తన నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణిని రామ-కేశవులతో పోల్చింది.
* ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నట్లు హాలుని గాథాసప్తశతి, విధికుడు అనే చర్మకారుని అమరావతి/ ధాన్యకటక శాసనం తెలుపుతున్నాయి. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేవు. శ్రేణుల వ్యవస్థ ఉండేది.

 

వర్ణ వ్యవస్థ లేదనటానికి కారణాలు:

1) దక్షిణాంధ్ర దేశంలో మొదటిసారిగా శాతవాహనుల కాలంలోనే జైన-బౌద్ధమతాలు ఆవిష్కృతమయ్యాయి.
2) బ్రాహ్మణులైన శాతవాహనులకు, క్షత్రియులైన శకులకు మధ్య వైవాహిక సంబంధాలున్నాయి. వీరికి జన్మించిన సంతానానికి పెట్టిన 'శక శాతకర్ణి', 'ఛత్రపర్ణి శాతకర్ణి' అనే పేర్లు వంశ విలీనాన్ని సూచిస్తున్నాయి.
3) శాసనాల్లో ఇంద్రదత్త, ధమ్మదేవ అనే గ్రీకుల పేర్లను ప్రస్తావించారు.
4) నహపాణుడి కుమార్తె దక్షమిత్ర, అల్లుడు ఋషభదత్తుడు శాతవాహన రాజులకు బహుమానాలు పంపి 'బ్రాహ్మణ క్షత్రియులుగా' పేరుగాంచారు. ఋషభదత్తుడి 'నాసిక్ శాసనం' అతడు కొలికుల శ్రేణి వారికి 2000 కర్షఫణాలు (వెండి నాణేలు) అప్పుగా ఇచ్చి వారి వద్ద 12% వడ్డీ వసూలు చేసి, ఆ వడ్డీనే బౌద్ధ భిక్షువులకు దానం ఇచ్చినట్లు తెలియజేస్తోంది.
5) 'విధికుడు' అనే చర్మకారుడి ఇంటిలో వివిధ వృత్తుల వారు ఉండేవారని, ధాన్యకటక బౌద్ధ స్తూపానికి పూర్ణకుంభం విరాళంగా ఇచ్చినట్లు ధాన్యకటక శాసనంలో ఉంది.
* నాడు ఉన్నత వర్గాల స్త్రీలకు మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండేవి. బాల్య వివాహాలు లేవు.
 * బహుభార్యత్వం ఉన్నత వర్గాల్లో మాత్రమే కనిపిస్తుంది.
 * వితంతు పునర్వివాహాలు లేవు. ఎక్కడైనా వితంతు పునర్వివాహం జరిగితే 'పునర్భు వివాహం' అని పిలిచేవారు.
* స్త్రీ బానిస వ్యవస్థ ఉండేది.
 * అనులోమ, విలోమ వివాహాలు జరిగేవి. స్త్రీలకు ఎరుపు, ఊదారంగు వస్త్రాలన్నా, మల్లెపూలన్నా ఇష్టం.
* స్త్రీ బానిసలను, విలాస వస్తువులను వర్తక వ్యాపారులు గుజరాత్‌లోని 'భరుకచ్ఛ' రేవు పట్టణానికి తీసుకువెళ్లే వారు. అందమైన స్త్రీలను, పాటలు పాడే యువ కళాకారులను రాజులు బహుమానంగా స్వీకరించారని 'పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్‌సీ'లో పేర్కొన్నారు.
* నాటి స్త్రీలు 64 కళల్లో ఆరితేరినవారు. అపస్తంభుని న్యాయస్మృతి ప్రకారం స్త్రీకి వ్యక్తిగత ఆస్తిహక్కు ఉండేదని తెలుస్తోంది.

 

వినోదాలు

  కోడి పందేలు, ఎడ్ల పందేలు, జంట నృత్యాలు (కార్లే, కొండానే గుహల్లో) నాటి వినోద కార్యక్రమాలు. హోలి పండుగ రోజు స్త్రీలు, పురుషులు మత్తు పానీయాలు సేవించి, బురద చల్లుకునేవారు.

 

శ్రేణులు

'విశవట్టి శాసనం' శ్రేణుల గురించి వివరిస్తుంది.

¤ హాలికులు - వ్యవసాయదారులు
¤ కొలికులు - నేతపనివారు
¤ తిలపిసకలు - నూనెగానుగలు తయారు చేసేవారు
¤ మాలకార - పూల వ్యాపారులు
¤ ధంజుక - ధాన్యపు వ్యాపారులు
¤ కులారా - కుమ్మరి వృత్తివారు
¤ కమర - కమ్మరి వృత్తివారు
¤ సేలవథికులు - శిల్పకారులు
 ¤ వథికులు - వడ్రంగులు
¤ గంధరులు - సుగంధ పరిమళాలు తయారు చేసేవారు
¤ ఛస్మక - చేపలు పట్టేవారు
¤ పసకరులు - మేదరివారు
 యజ్ఞాని అనే పండితుడు కుమ్మరి వృత్తివారిని శిల్పకారులతో పోల్చాడు. కర్ణాటకలోని మస్కి, మెదక్‌లోని కొండాపూర్, మహారాష్ట్రలోని పైఠాన్ మొదలైన ప్రాంతాల్లో లభ్యమైన మృణ్మయ శకలాలను పరిశీలిస్తే వారు శిల్పకారులకు ఏమాత్రం తీసిపోరని పేర్కొన్నాడు.

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహనుల పరిపాలన - సామాజిక పరిస్థితులు

1. ఆంధ్రను ఏలిన ప్రప్రథమ రాజవంశం ఏది?
జ: శాతవాహనులు

 

2. 'పితుండనగరం' ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఉంది?
జ: మచిలీపట్నం దగ్గర

 

3. 'సాంచి స్తూపానికి' దక్షిణ తోరణం నిర్మించిన రాజు?
జ: రెండో శాతకర్ణి

 

4. శాతవాహనుల రెండో రాజధాని ఏది?
జ: ధాన్యకటకం

 

5. 'దక్షిణాపథపతి' బిరుదున్న రాజెవరు?
జ: మొదటి శాతకర్ణి

 

6. బౌద్ధమత మార్టిన్ లూథర్ అని ఎవరికి పేరు?
జ: నాగార్జునుడు

 

7. శకక్షహరాట వంశంలో సుప్రసిద్ధుడు ఎవరు?
జ: నహపాణుడు

 

8. కిందివాటిలో నాణేలు - బొమ్మలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.
      ఎ) ఏనుగు బొమ్మ - శ్రీముఖుడు                         బి) ఉజ్జయిని బొమ్మ - మొదటి శాతకర్ణి
      సి) తెరచాప ఓడ బొమ్మ - యజ్ఞశ్రీ                       డి) పైవన్నీ సరైనవే
జ: డి (పైవన్నీ సరైనవే)

 

9. జోగల్‌తంబి పునర్ముద్రించిన నాణేలు ఏవి?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి

 

10. శ్రీముఖుడిని వాయుపురాణంలో ఏ విధంగా పేర్కొన్నారు?
జ: సింధకుడు

 

11. ఒక రాష్ట్రం, ఒక గ్రామం, ఒక సైనికుని ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నాయి?
జ: మ్యాకదోని

 

12. కిందివాటిలో శాతవాహనులకు సంబంధించనిదేది?
        ఎ) రాజులు దైవాంశ సంభూతులు                              బి) సామంత రాజులు మహారథి, మహాభోజ
        సి) రాజు ఆధీనంలో ఉన్న భూమి - రాజకంఖేట          డి) ఆహారాల అధికారి నాగరికుడు
జ: డి (ఆహారాల అధికారి నాగరికుడు)

 

13. గుణాఢ్యుని 'బృహత్కథ' ఏ సంస్కృత గ్రంథం నుంచి తర్జుమా చేశారు?
        ఎ) క్షేమేంద్రుడు - బృహత్కథమంజరి             బి) సోమదేవసూరి - కథా సరిత్సాగరం
        సి) ఉద్యోతనుడు - లీలావతి పరిణయం           డి) ఎ, బి
జ: డి(క్షేమేంద్రుడు - బృహత్కథమంజరి, సోమదేవసూరి - కథా సరిత్సాగరం)

 

14. శాతవాహనుల కాలం నాటి 'జలక్రీడ' ఏది?
జ: మమ్మోండస్తాండయా

 

15. ఆచార్య నాగార్జునుడి జన్మస్థలం ఏది?
జ: వేదలి

 

16. స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించిన మొదటి ఆంధ్ర రాజులెవరు?
జ: శాతవాహనులు

 

17. 'రజ్జు గాహక' అంటే...
జ: శిస్తు వసూలు చేసే అధికారి

 

18. 'భిక్షురాజుగా' ప్రసిద్ధి చెందిన రాజెవరు?
జ: ఖారవేలుడు

 

19. ''సత్యవచనదాన నిరతయా" అనే ప్రసక్తి కిందివారిలో ఎవరిని ఉద్దేశించింది?
జ: గౌతమీ బాలశ్రీ

 

20. 'భదయనేల' అంటే...
జ: బౌద్ధశాఖ

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కుషాణులు

  భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాల్ల్లో కుషాణులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమేకాకుండా భాష, సాహిత్యం, కళలు మొదలైనవాటిని బాగా ఆదరించారు. కుషాణుల్లో ప్రముఖుడు కనిష్కుడు. ఇతడిని రెండో అశోకుడిగా పేర్కొంటారు. కనిష్కుడి పాలన, కుషాణుల వంశం విశేషాల గురించి తెలుసుకుందాం.

  మౌర్య వంశ పతనానంతరం భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాలన్నింటిలో ప్రముఖమైంది కుషాణుల వంశం. వీరిని 'తాకారియన్లు' అని కూడా అంటారు. వీరు యూచి తెగకు చెందినవారు. మధ్య ఆసియా ఉత్తర భాగంలో చైనాకు దగ్గరగా ఉన్న గడ్డిమైదానాలకు చెందిన సంచార జాతిగా వీరిని పేర్కొంటారు. వీరు సింధూ మైదానంలోని దక్షిణ భాగంలో, గంగా మైదానంలోని ఎక్కువ ప్రాంతాల్లో తమ అధికారాన్ని నెలకొల్పారు. వీరి సామ్రాజ్యం ఆక్సస్‌నది నుంచి గంగానది వరకు, మధ్య ఆసియాలోని ఖోరసాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వరకు విస్తరించి ఉండేది.
 మధ్య ఆసియాలో ఎక్కువ భాగం, నేటి రష్యా, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో కొన్ని భాగాలు, పాకిస్థాన్, ఉత్తర భారతదేశం మొత్తం.. ఇలా అనేక ప్రాంతాలను కుషాణులు ఒకే పరిపాలన కిందికి తెచ్చారు. అందుకే వీరి పాలనలో వివిధజాతులు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఒకరితో ఒకరు కలిసి జీవించేవారు. దీని ఫలితంగా ఒక కొత్త సంస్కృతి ఉద్భవించింది.

  కుషాణులు ఎక్కడ జన్మించారు అనేదానిపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
'రాజుల పేర్లను బట్టి కుషాణులు ఇరాన్ ప్రాంతవాసులు'. - ఎఫ్.డబ్ల్యూ. థామస్
'కుషాణుల శరీర నిర్మాణాన్ని బట్టి టర్కీస్థాన్‌కు చెందినవారు'. - కల్హనుడు
'వీరు చైనీస్ తుర్కిస్థాన్ ప్రాంతానికి చెందినవారు'.- స్టెన్‌కోన్

మధ్య ఆసియాలోని తొలి కుషాణ నివాస స్థలమైన 'ఖల్చయాన్‌'లో వీరి ఇతిహాస వాక్యాలున్న నాణేలు బయటపడ్డాయి. ఇవి ఖరోష్ఠి, బ్రహ్మీ లిపుల్లో ఉన్నాయి. వీటి ఆధారంగా వీరు సాంస్కృతిక, వ్యాపార కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని,ప్రాకృతం మాట్లాడిన సమూహాలు భారత ఉపఖండం అవతల జీవించి ఉండవచ్చని చెప్పవచ్చు.

 

కుషాణ వంశస్థాపన

  కుషాణుల్లో రెండు రాజవంశాలు కనిపిస్తాయి. మొదటిది 'కాడ్‌ఫిసెస్', రెండోది 'కనిష్క'. కుషాణ రాజ్యస్థాపకుడు కుజుల కాడ్‌ఫిసెస్. ఇతడు యూచిలోని అయిదు తెగలకు చెందిన వారిని ఏకం చేయడమే కాకుండా హిందూకుష్ పర్వతాలు దాటి కాబూల్, కశ్మీర్‌లో తన అధికారాన్ని స్థాపించాడని చైనీస్ ఆధారాన్ని బట్టి తెలుస్తుంది.

 ఇతడి తర్వాత 'విమా కాడ్‌ఫిసెస్' రాజయ్యాడు. ఇతడు బంగారు నాణేలు ముద్రించాడు. నాణేలపై శివుడి ప్రతిమ ఉంటుంది. పాశుపత శైవాన్ని అభిమానించాడు.

 

కనిష్కుడు

* విమా కాడ్‌ఫిసెస్ తర్వాత కనిష్కుడు అధికారంలోకి వచ్చాడు. ఇతడు కుషాణుల్లో అత్యంత ప్రముఖుడు. ఇతడి పరిపాలనలో కుషాణ వంశం అత్యున్నత స్థితికి చేరుకుంది. కనిష్కుడు సమకాలీన ప్రపంచంలో గొప్పశక్తిగా ఎదిగాడు.

* భారతదేశంలో ఇతడి అధికారం దక్షిణాన సాంచి, తూర్పున బెనారస్ వరకు విస్తరించింది.ఇతడు మధ్య ఆసియాలో కూడా విశాలమైన రాజ్యభాగాల్ని స్వాధీనం చేసుకున్నాడు.ఇతడి రాజధాని పురుషపురం (నేటి పెషావర్). మధురలో లభించిన కుషాణుల నాణేలు, శాసనాలు, నిర్మాణాలు, శిల్పాలను బట్టి ఆ నగరం కుషాణులకు రెండో రాజధానిగా ఉండేదని భావిస్తున్నారు.

* కనిష్కుడు రాజ్యాధికారాన్ని చేపట్టిన సంవత్సరం గురించి చరిత్రకారుల్లో వాదోపవాదాలున్నాయి. కానీ క్రీ.శ. 78 వ సంవత్సరంలో రాజై ఉండొచ్చన్నది దాదాపు అందరూ అంగీకరించిన విషయం.

* కనిష్కుడి బిరుదులు దేవపుత్ర, సీజర్, రెండో అశోకుడు. 'దేవపుత్ర' అనే బిరుదు చైనీయ ప్రభావంతోనో లేదా రోమ్‌లో ప్రచారంలో ఉన్న 'దివ ఫిలియస్' అనే బిరుదు ప్రభావంతోనో వచ్చి ఉండవచ్చు.

* మరణానంతరం కూడా తమకు దైవత్వం ఆపాదించుకునేందుకు వీరు తాము నిర్మించిన సమాధులకు 'దేవకుల' అని పేరు పెట్టేవారు. ఇలాంటి బిరుదులు భారతదేశంలో అరుదుగా ఉండేవి. కుషాణులు తాము భారతదేశానికి వలస వచ్చామన్న సంగతి మరిచిపోకుండా, పరాయిచోట తమ గౌరవాన్ని పెంచుకోవడానికే ఈ పద్ధతిని ఎంచుకుని ఉంటారన్నది చరిత్రకారుల భావన.

* కనిష్కుడు పరిపాలనాదక్షుడు. యుద్ధ విజేత, బౌద్ధమతాభిమాని. ఇతడికి సంబంధించిన శాసనాలు అలహాబాద్, సారనాథ్, మధుర, భాగల్‌పూర్, రావల్పిండి ప్రాంతాల్లో బయటపడ్డాయి.

* చైనా చరిత్రకారుల కథనాల ప్రకారం కనిష్కుడు 'హాన్' వంశానికి చెందిన రాకుమారిని వివాహమాడతానని అడిగాడనీ, అందువల్లనే 'హాన్' వంశానికి చెందిన 'హా-ట్సీ' చక్రవర్తి సేనాని పాం-చా-వో చేతిలో ఓడిపోయాడని ప్రచారంలో ఉంది.

* మధ్య ఆసియాలోని సిల్క్‌రూట్‌కు ప్రధాన కేంద్రాలైన 'కాష్‌ఘల్, యార్కండ్, ఖోటాన్' ప్రాంతాలను కనిష్కుడు జయించినట్లు తెలుస్తుంది. ఇతడు మధ్య ఆసియా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు.

* కనిష్కుడు అనగానే బౌద్ధమతంతో (మహాయాన) అతడికి ఉన్న సంబంధం గుర్తుకు వస్తుంది. కశ్మీర్‌లోని కుందనవనంలో నాలుగో బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు.దీనికి వసుమిత్రుడిని అధ్యక్షుడిగా, అశ్వఘోషుడిని ఉపాధ్యక్షుడిగా నియమించాడు.

* కనిష్కుడు ఈ సభను బౌద్ధమత సిద్ధాంతాలకు, అధ్యయనానికి సంబంధించిన విషయాల గురించి చర్చించడానికి ఏర్పాటు చేశాడు. కానీ ఈ సమావేశంలో బౌద్ధమతం హీనయాన, మహాయాన అనే రెండు ప్రధాన శాఖలుగా విడిపోయింది.

* ఇతడు 'కస్యవమాతంగ' నేతృత్వంలో మహాయాన బౌద్ధ మిషన్‌ను చైనాకు పంపాడు. అంతేకాకుండా ఆసియాకు కూడా మత ప్రచారకులను పంపించాడు. పెషావర్‌లో బుద్ధుడి ఒక అవశేషంపై ఇతడు అనేక అంతస్తుల కట్టడాన్ని నిర్మించాడు.

* క్రీ.శ. 7వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ ఈ స్తూపాన్ని గురించి విపులంగా వర్ణించాడు. 11వ శతాబ్దిలో 'ఆల్‌బెరూని'కూడా దీన్ని గురించి తెలిపాడు. పెషావర్‌లో జరిపిన తవ్వకాల్లో ఈ స్తూప పథకం, విహారాలు కట్టిన స్థలాలు, కొన్ని శిల్పాలు, బుద్ధుడి అవశేషాలను ఉంచిన పాత్రలు బయటపడ్డాయి.

 

నాణేలు..

  భారతదేశ చరిత్రలో అత్యధిక సంఖ్యలో బంగారు నాణేలను ముద్రించింది కుషాణులు. ఈ నాణేల్లోని బంగారం గుప్తులకాలం నాటి బంగారం కంటే ఎక్కువ నాణ్యమైంది.
 వీరి నాణేలపై భాష - పారశీకం. కుజుల కాడ్‌ఫిసెస్ నాణేలపై బుద్ధ ప్రతిమ, విమా కాడ్‌ఫిసెస్ నాణేలపై శివుడు-నంది ప్రతిమ, కనిష్కుడి నాణేలపై బౌద్ధ చిహ్నాలు కనిపిస్తాయి. కానీ బౌద్ధ, భారతీయ దేవతా చిహ్నాలు లేని నాణేలే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.
 కనిష్కుడి వ్యక్తిగత ఆరాధ్య దేవతలు హెరాక్లిస్, హీలియస్, సెలీనా, మద్రనాన, మిరో మొదలైనవారు. ఇది తన సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో భిన్న సంస్కృతులు, మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి ఇతడు పాటించిన మత విధానంగా చెప్పవచ్చు.

 

కళలు..

  కనిష్కుడు గొప్ప కళాపోషకుడు, సాహిత్యాభిమాని. ఇతడి ఆస్థాన కవులు వసుమిత్రుడు, అశ్వఘోషుడు, చరకుడు & ఆచార్య నాగార్జునుడు మొదలైనవారు.
 వసుమిత్రుడు - సంస్కృతంలో మహా విభాషశాస్త్రాన్ని, అశ్వఘోషుడు - బుద్ధచరిత (భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంస్కృత కావ్యం), సౌందర్య నందనం, శారిపుత్ర ప్రకరణం అనే సంస్కృత నాటకాలు రచించారు. (మధ్య ఆసియాలోని ఖోటాన్ ప్రాంతంలోని తవ్వకాల్లో బయటపడిన నాటకం - శారిపుత్ర ప్రకరణం). చరకుడు - 'చరక సంహిత' అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు.
 ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ రూపశిల్పి. ఇతడు సుహృల్లేఖ, రసవాదం, శూన్యవాదం, మాధ్యమిక వాదం, ప్రాజ్ఞపారమిత శాస్త్రం, ద్వాదశనికాయ శాస్త్రం, రత్నావళి రాజుపరికథ మొదలైన సంస్కృత గ్రంథాలు రచించాడు. ఇతడి బిరుదులు - ఇండియన్ ఐన్‌స్టీన్, రెండో తథాగతుడు, ఇండియన్ మార్టిన్ లూథర్, ఆంధ్ర బౌద్ధ సారస్వత అరిస్టాటిల్ మొదలైనవి.

 

కనిష్కుడి వారసులు

  కనిష్కుడి తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టింది హవిష్కుడు. ఇతడు క్రీ.శ. 230 వరకూ తన పరిపాలనను కొనసాగించాడు. ఇతడి బిరుదులు మహారాజ, రాజాధిరాజ, దేవపుత్ర.
 హవిష్కుడి తదనంతరం రెండో కనిష్కుడు రాజయ్యాడు. ఇతడి బిరుదు 'కైజర్'.
 కుషాణు వంశంలో చివరివాడు 'వాసుదేవుడు'. శివ, అంబ, ఉమేశ్వరుల ప్రతిమలు ఇతడి నాణేలపై కనిపిస్తాయి. వాసుదేవుడి కాలంలోనే కుషాణుల ప్రత్యేకత క్షీణించింది. అయితే వీరు భారతదేశంలోనే స్థిరపడి ఉండొచ్చని వాసుదేవుడి పేరు సూచిస్తోంది.

 

శిల్పకళ..

  కుషాణుల కాలంలో వాయవ్య భారతదేశంలో 'గాంధార శిల్పకళారీతి', తూర్పు భారతదేశంలో 'మధుర శిల్పకళారీతి' ఆవిర్భవించాయి.

 

గాంధార శిల్ప శైలి

* గ్రీకు-భారతీయ- రోమ్ శిల్పకళల సమ్మేళనమే గాంధార శిల్ప శైలి.
 ఇందులో బుద్ధుడిని తెల్లని చలువ రాయితో మలిచారు.
* ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గాంధార శైలి ఆప్ఘనిస్థాన్‌లోని బీమారన్ దగ్గరున్న 'తఖ్-ఇ-బామి' వద్ద లభించింది.
* ఈ శైలిలో ఉన్న బుద్ధ విగ్రహాలు భారతదేశంలోని కశ్మీర్, విదిశ, అమరావతి మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి.
* ఈ శైలిలో బుద్ధుడు గ్రీకుల యుద్ధదేవుడిని తలపిస్తాడు. గ్రీకుల యుద్ధ దేవుడు ఒలంపస్.
* రోమన్ల కండలు తిరిగిన శరీరం, రింగురింగుల పొడవాటి వెంట్రుకలు, పలుచని వస్త్రాలు మొదలైనవి ఈ శైలిలో ఎక్కువగా కనిపిస్తాయి.
* విగ్రహాలు గడ్డాలు, మీసాలు పెంచుకుని భారతీయ యోగుల మాదిరిగా కనిపించడం దీని ప్రత్యేకత.
* ఈ శిల్పకళ సౌందర్యానికి ప్రాముఖ్యం ఇచ్చింది కానీ ఆధ్యాత్మికతకు ఇవ్వలేదు.

 

మధుర శిల్ప శైలి

* మధుర శైలిలో బుద్ధుడిని ఎర్రని ఇసుకరాయితో మలిచారు.
* ఇది భారతదేశంలోనే మొట్టమొదటి శిల్పశైలి.
* ఇందులో బుద్ధుడు ధ్యానస్థితిలో ఉన్నట్లుగా రూపొందించారు.
* హిందూమతంలో భాగంగా శివుడిని పార్వతీ సమేతుడిగా, అర్ధనారీశ్వర రూపంలో తయారు చేశారు.
* ఈ శైలిలో జైన మతంలోని పార్శ్వనాథుడిని కూడా మలిచారు. ప్రస్తుతం ఈ ప్రతిమ లక్నో మ్యూజియంలో ఉంది.
* స్త్రీ ప్రతిమలైన సాలభంజికలు, యక్షణి మొదలైన వాటిని కూడా మలిచారు.
* ఈ శైలి పరమత సహనానికి నిదర్శనం.
* భారతీయులకు కోటు, బూటు, టోపీని పరిచయం చేసినవారు కుషాణులు. కనిష్కుడి శిథిల విగ్రహం మధురకు సమీపంలోని తిక్రితి లోయలో లభించింది.

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కుషాణులు

1. ఆయుర్వేద పితామహుడు ఎవరు?
జ: చరకుడు

 

2. బేసానగర్ వద్ద వాసుదేవ దేవాలయంలో హీలియోడోరస్ ఎత్తించిన గరుఢద్వజం ఏ ఇండో-గ్రీకు రాజుకాలం నాటిది?
జ: ఆంటియోల్సిడస్

 

3. కిందివాటిలో ఏ బౌద్ధమత శాఖ 'బుద్ధుడి అవశేషాలను సన్యాసంతో పూజించడం వల్ల మోక్షం పొందవచ్చు, బుద్ధుడు మరోసారి జన్మించడు' అనే అభిప్రాయాలు కలిగి ఉంది?
    ఎ) హీనయాన                   బి) మహాయాన               సి) వజ్రయాన                 డి) సహజయాన
జ: ఎ (హీనయాన)

 

4. 'మాతృదేవత ఉమ' పేరుమీద నాణేలను ముద్రించింది?
జ: కుషాణులు

 

5. కనిష్కుడి కాలంలోని బౌద్ధగ్రంథాలను ఏ భాషలో రచించారు?
జ: సంస్కృతం

 

6. కనిష్కుడి శాసనాలు ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయి?
ఎ) భాగల్‌పూర్                 బి) రావల్పిండి                   సి) మథుర                  డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

 

7. విమా కాడ్‌ఫిసెస్ నాణేలపై ఎవరి ప్రతిమ ఉంటుంది?
జ: నంది

 

8. కనిష్కుడి వ్యక్తిగత ఆరాధ్య దేవత ఎవరు?
ఎ) బుద్ధుడు                       బి) హీలియస్                సి) సెలీనా                    డి) బి, సి
జ: డి (హీలియస్, సెలీనా)

 

9. 'గాంధార శిల్పకళారీతి' ఏ ప్రాంతానికి చెందిన కళ?
జ: వాయవ్య భారతదేశం

 

10. రెండో తథాగతుడు ఎవరు?
జ: ఆచార్య నాగార్జునుడు

 

11. రెండో కనిష్కుడి బిరుదు ఏమిటి?
జ: కైజర్

 

12. కనిష్కుడి శిథిల విగ్రహం ఎక్కడ లభించింది?
జ: మథుర

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్తులు

1. గుప్త వంశ స్థాపకుడెవరు?
జ: శ్రీగుప్తుడు

 

2. ఘటోత్కచుని పేరు మొదటిసారిగా ఏ శాసనంలో కనిపిస్తుంది?
జ: అలహాబాద్ స్తంభ శాసనం

 

3. శ్రీగుప్తుడు చైనా బౌద్ధ సన్యాసుల కోసం మృగశిఖావనం దగ్గర ఒక దేవాలయాన్ని నిర్మించినట్లు పేర్కొన్న చైనా యాత్రికుడెవరు?
జ: ఇత్సింగ్

 

4. మొదటి చంద్రగుప్తుడు ఏ లిచ్ఛవీ రాకుమార్తెను వివాహమాడాడు?
జ: కుమారదేవి

 

5. మహారాజాధిరాజ బిరుదు ధరించిన మొదటి గుప్తరాజెవరు?
జ: మొదటి చంద్రగుప్తుడు

 

6. చరిత్రకారుడు అల్టేకర్ అభిప్రాయం ప్రకారం గుప్తులు ఏ కులానికి చెందినవారు?
జ: వైశ్యులు

 

7. గుప్తుల చరిత్రను తెలుసుకోవడానికి పెద్దగా ఉపయోగపడని పురాణం?
ఎ) మ‌త్స్య              బి) వాయు              సి) విష్ణు             డి) బ్రహ్మాండ‌
జ: బ్రహ్మాండ

 

8. మహాయాన బౌద్ధశాఖకు చెందిన ఏ గ్రంథం గుప్తుల చరిత్రను అధ్యయనం చేయడానికి ఉపకరిస్తుంది?
జ: ఆర్యమంజుశ్రీ మూలకల్ప

 

9. గుప్తుల శకం ప్రారంభమైన సంవత్సరం ఏది?
జ: క్రీ.శ.320

 

10. వి.ఎ.స్మిత్ ఏ గుప్త చక్రవర్తిని 'ఇండియన్ నెపోలియన్‌'గా కీర్తించాడు?
జ: సముద్రగుప్తుడు

 

11. అలహాబాద్ స్తంభశాసనం ఎవరి విజయాల గురించి తెలియజేస్తుంది?
జ: సముద్రగుప్తుడు

 

12. అలహాబాద్ స్తంభ శాసనాన్ని వేయించింది ఎవరు?
జ: హరిసేనుడు

 

13. సముద్రగుప్తుని చేతిలో ఓడిపోయిన వేంగి రాజెవరు?
జ: హస్తివర్మ

 

14. సముద్రగుప్తుడి చేతిలో ఓడిపోయిన వ్యాఘ్రరాజు ఏ ప్రాంతపు రాజు?
జ: మహాకాంతార

 

15. సముద్రగుప్తుడి చేతిలో ఓడిపోయిన ఆర్యావర్తన రాజు?
జ: రుద్రదేవుడు

 

16. సముద్రగుప్తుని బిరుదు ఏది?
జ: కవిరాజ

 

17. బోధ్‌గయలో బౌద్ధ ఆరామాన్ని నిర్మించడానికి శ్రీలంక రాజుకు అనుమతిచ్చిన గుప్త చక్రవర్తి ఎవరు?
జ: సముద్రగుప్తుడు

 

18. సముద్రగుప్తుని తర్వాత రాజైన రామగుప్తుని గురించి పేర్కొనే గ్రంథం ఏది?
జ: దేవీచంద్రగుప్తం

 

19. 'శకారి' అనే బిరుదు ఏ గుప్త చక్రవర్తిది?
జ: రెండో చంద్రగుప్తుడు

 

20. నవరత్నాలు ఎవరి ఆస్థానంలోని వారు?
జ: రెండో చంద్రగుప్తుడు

 

21. రెండో చంద్రగుప్తుని రెండో రాజధాని ఏది?
జ: ఉజ్జయిని

 

22. 'మహేంద్రాదిత్య' బిరుదు ధరించిన గుప్త చక్రవర్తి ఎవరు?
జ: కుమారగుప్తుడు

 

23. అశ్వమేధయాగం చేసిన గుప్త చక్రవరి ఎవరు?
జ: సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు

 

24. గుప్తుల కాలంలో రాజుకు, మంత్రివర్గానికి మధ్య ఏజెంట్‌గా వ్యవహరించింది ఎవరు?
జ: కంచుకి

 

25. గుప్తుల కాలంలో పుస్తపాలుని విధి ఏమిటి?
జ: రికార్డులు భద్రపరచడంలో సహాయం చేయడం

 

26. గ్రామంలో రెవెన్యూ, వ్యయాల రికార్డులు నిర్వహించడం ఎవరి విధి?
జ: గోప

 

27. గుప్త సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు?
జ: భుక్తి

 

28. భుక్తి అధిపతిని ఏమని పిలిచేవారు?
జ: ఉపరిక మహారాజ

 

29. ఏ గుప్త చక్రవర్తి కాలంలో హూణుల దండయాత్రలు అధికమయ్యాయి?
ఎ) గ్వాలియ‌ర్                  బి)  మ‌ధుర              సి) బ‌రేలి                       డి) దిల్లీ
జ: స్కందగుప్తుడు

 

30. నాగ కుటుంబానికి చెందినవారు పాలించని ప్రాంతం?
జ: దిల్లీ

 

31. మాఘ రాజులు ఏ ప్రాంతాన్ని పాలించారు?
జ: రేవ, కౌశాంబి

 

32. శాతవాహనుల పతనానంతరం విదర్భ, దక్షిణ కొంకణ్‌ను పాలించిందెవరు?
జ: వాకాటకులు

 

33. వాకాటక వంశ స్థాపకుడు ఎవరు?
జ: వింద్యశక్తి

 

34. వాకాటకులకు సంబంధించిన సమాచారం అందించే తొలి శాసనం ఎక్కడ లభించింది?
జ: అమరావతి

 

35. శాతవాహనుల తర్వాత మధ్య భారతదేశం, గుజరాత్, కొంకణ్ ప్రాంతాలను పాలించిన రాజవంశం?
జ: అభీరులు

 

36. దిగువ గోదావరి, కృష్ణ మధ్య ప్రాంతాన్ని పాలించిన రాజవంశం ఏది?
జ: శాలంకాయనులు

 

37. శాలంకాయనుల రాజధాని?
జ: వేంగి

 

38. శాలంకాయనులు పూజించిన దైవం?
జ: చిత్రరథస్వామి

 

39. కాళిదాసు రచనల్లో మొదటిది?
జ: రుతుసంహారం

 

40. మృచ్ఛకటికం రచయిత ఎవరు?
జ: శూద్రకుడు

 

41. విశాఖదత్తుని గ్రంథం ఏది?
జ: ముద్రారాక్షసం, దేవీచంద్రగుప్తం

 

42. శర్వవర్మన్ రచించిన గ్రంథం ఏది?
జ: కాతంత్రం

 

43. గణితాన్ని ఒక స్వతంత్ర విషయంగా (శాస్త్రం) మొదట పరిగణించిన వ్యక్తి?
జ: ఆర్యభట్ట

 

44. రెండో చంద్రగుప్తుని గురించి తెలిపే ముఖ్యమైన శాసనం?
జ: మెహరౌలీ ఇనుపస్తంభ శాసనం

 

45. ఉజ్జయినిలోని ఏ దేవాలయం గురించి కాళిదాసు తన మేఘదూతంలో పేర్కొన్నాడు?
జ: మహాకాల

 

46. ఏ కాలంలో ఏ పంట వేయాలో పేర్కొన్న గొప్ప శాస్త్రజ్ఞుడు?
జ: వరాహమిహిరుడు

 

47. పట్టు వ్యాపారాన్ని వర్తక శ్రేణులు నిర్వహించేవని ఏ శాసనం ప్రకారం తెలుస్తోంది?
జ: మందసోర్ శాసనం

 

48. కదంబ వంశ స్థాపకుడు ఎవరు?
జ: మయూరశర్మన్

 

49. దశకుమార చరితం రచయిత ఎవరు?
జ: దండిన్

 

50. భాసుడు రచించిన గ్రంథం ఏది?
జ: స్వప్నవాసవదత్త

 

51. కామసూత్ర గ్రంథ రచయిత ఎవరు?
జ: వాత్సాయనుడు

 

52. గుప్తుల కాలం నాటి దశావతార దేవాలయం ఎక్కడ ఉంది?
జ: దియోగర్

 

53. హగమనం గురించి కాళిదాసు ఏ 3. సతీసగ్రంథంలో పేర్కొన్నాడు?
జ: కుమార సంభవం

 

54. కిందివాటిలో రెండో చంద్రగుప్తునికి సంబంధంలేని/ వర్తించని పేరు?
ఎ) దేవేంద్ర               బి) దేవగుప్త               సి) దేవరాజ               డి) దేవశ్రీ
జ: ఎ (దేవేంద్ర)

 

55. సామ్రాట్ అనే విశిష్టమైన బిరుదు ధరించిన రాజెవరు?
జ: ప్రవరసేనుడు

 

56. కిందివాటిలో కాళిదాసు రచన కానిది?
ఎ) రుతుసంహారం          బి) మేఘదూతం          సి) కుమార సంభవం          డి) దశకుమార చరితం
జ: డి (దశకుమార చరితం)

 

57. కాలచూరి వంశ స్థాపకుడు ఎవరు?
జ: కృష్ణరాజ

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సహాయ నిరాకరణ ఉద్యమం

భారత జాతి ధిక్కారం!

 

ఆ ఉద్యమంలో భారత జాతి చాటిన ధిక్కారం ఆంగ్లేయులను ఆశ్చర్యానికి గురిచేసింది. విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ ఉద్ధృతంగా జరిగిన పోరు దేశాన్ని మరింత బలంగా ఏకం చేసింది. జాతీయవాదులందరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది. స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. హిందూ, ముస్లింల మధ్య ఐక్యత వెల్లివిరిసింది. అన్నింటికీ మించి మొదటిసారి గాంధీజీ సారథ్యంలో సాగిన సహాయ నిరాకరణ సమరం, అహింసా మార్గంలో పోరాటాల శక్తిని నిరూపించింది. కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాలు అందులో భాగమయ్యాయి.

 

 

భారతదేశ స్వాతంత్య్ర సమర చరిత్రలో గాంధీజీ నాయకత్వంలో నిర్వహించిన ‘సహాయ నిరాకరణ ఉద్యమం (1920 - 22)’ అత్యంత స్ఫూర్తిదాయక ఘట్టం. మన జాతి ఉవ్వెత్తున ఉద్యమించి, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వణుకు పుట్టించిన ప్రజా పోరాటం. 


జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ: 1919లో ఆంగ్లేయులు చేసిన భారత ప్రభుత్వ చట్టం - 1919 ప్రజలకు నిరాశను మిగిల్చింది. అదే సమయంలో దేశంలో వ్యాపిస్తున్న తీవ్ర వ్యతిరేకతను కఠినంగా అణచి వేసేందుకు తెచ్చిన రౌలత్‌ చట్టంపైనా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. పౌర హక్కులను హరించే సైతాన్‌ చట్టంగా గాంధీజీ దానిని అభివర్ణించారు. ప్రజలంతా చైతన్యవంతులై రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పుడే దేశం విముక్తి పొందుతుందని పిలుపునిచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 6న రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం జరిగింది. హర్తాళ్లు, సమ్మెలు ఉద్ధృతంగా సాగాయి. హిందూ-ముస్లిం ఐక్యత పరిఢవిల్లింది. విదేశీ పాలన పట్ల ప్రజల్లో విముఖత వ్యక్తమైంది. 


ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. ప్రజలపై దమనకాండకు దిగింది. పంజాబ్‌ ప్రాంతం కల్లోలంగా మారింది. ప్రజా నాయకులైన డాక్టర్‌ సైౖఫుద్దీన్‌ కిచ్లూ, డాక్టర్‌ సత్యపాల్‌ల అరెస్ట్‌కు నిరసనగా అమృత్‌సర్‌ జలియన్‌వాలా బాగ్‌ మైదానంలో ఏప్రిల్‌ 13న సమావేశమైన నిరాయుధ జనసమూహంపై, సైనికాధికారి డయ్యర్‌ తన సైనికదళాలతో కాల్పులు జరిపించాడు. వందలాది మంది మరణించగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ దారుణంతో దేశ వ్యాప్తంగా భయానక వాతావరణం ఏర్పడింది. నాగరీకులమని ప్రకటించుకునే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల వికృత హింసా ధోరణి ప్రపంచానికి బహిర్గతమైంది. భారతీయ రచయితలూ, మేధావులు, మానవతావాదులు ప్రభుత్వం ఇచ్చిన గౌరవ బిరుదులూ, హోదాలను త్యాగం చేసి, సామాన్య ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఆ తీవ్ర నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం విచారణ కోసం హంటర్‌ కమిషన్‌ను నియమించింది. అది నామమాత్రంగా పని చేసి డయ్యర్‌ను ఆరోపణల నుంచి విముక్తుడిని చేసింది. కాంగ్రెస్‌ నియమించిన గాంధీ, మోతీలాల్‌ నెహ్రూ, చిత్తరంజన్‌ దాస్, జయకర్, అబ్బాస్‌ త్యాబ్జిలతో కూడిన విచారణ సంఘం సాక్ష్యాధారాలను పరిశీలించి, హింసాకాండకు డయ్యర్‌ పూర్తి బాధ్యుడని తేల్చింది. పంజాబ్‌ మారణకాండ దేశప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది.

 

ఖిలాఫత్‌ సమస్య: భారత దేశంలోని ముస్లింలు టర్కీ (ప్రస్తుత తుర్కియే) దేశాధినేత సుల్తాన్‌ను తమ మత గురువుగా (ఖలీఫా) గౌరవిస్తారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ, జర్మనీ పక్షాన చేరి, మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వ్యతిరేకంగా పోరాడి ఓడింది. మిత్ర రాజ్యాలు టర్కీ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా, ఖలీఫా పదవి రద్దు చేయడానికి నిశ్చయించాయి. ఈ పరిస్థితుల్లో  టర్కీ సామ్రాజ్యానికి, ఖలీఫా వైభవానికి భంగం కలిగించవద్దని బ్రిటిష్‌ ప్రభుత్వానికి భారతీయ ముస్లింలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మౌలానా మొహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ సోదరుల నాయకత్వంలో ఖిలాఫత్‌ కమిటీ ఏర్పడింది. హకీమ్‌ అఫ్జల్‌ఖాన్, హస్రత్‌ మొహాని, మౌలానా ఆజాద్‌ లాంటివారు ఈ కమిటీలో సభ్యులు. ఖలీఫా స్థానాన్ని భంగపరిస్తే దేశవ్యాప్తంగా ఉద్యమించాలని కమిటీ నిర్ణయించింది. 1920లో మిత్ర రాజ్యాలు టర్కీపై విధించిన షరతుల్లో ఖలీఫా పదవి పునరుద్ద్ధరణ ప్రస్తావన లేదు. దాంతో మన దేశంలోని ముస్లింలు ఖిలాఫత్‌ ఉద్యమానికి సిద్ధమయ్యారు.  


1920, మే 28న బొంబాయిలో జరిగిన సమావేశంలో గాంధీజీ సూచనతో సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ఖిలాఫత్‌ కమిటీ ఆమోదించింది. జూన్‌ మొదటి వారంలో అలహాబాదులో జరిగిన హిందూ-ముస్లింల సమావేశంలో ఆ పోరాటానికి హిందువుల సహకారాన్ని కోరుతూ కమిటీ విజ్ఞప్తి చేసింది. హిందూ-ముస్లింలను ఏకం చేయడానికి ఖిలాఫత్‌ ఉద్యమం ఒక సువర్ణావకాశమని గాంధీజీ, ఇతర కాంగ్రెస్‌ నాయకులూ భావించారు. 1920, జూన్‌లో అలహాబాదులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఖిలాఫత్‌ సహాయ నిరాకరణ ఉద్యమం జరపాలని నిర్ణయించి, ఇందుకు సారథ్యం వహించాలని గాంధీజీని కోరారు. ఈ ఉద్యమం 1920, ఆగస్టులో ప్రారంభమైంది. 1920, సెప్టెంబరులో కలకత్తాలో లాలా లజపతిరాయ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశంలో స్వరాజ్య సాధనకు సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని నిర్ణయించారు. అదే ఏడాది డిసెంబరులో సి.విజయరాఘవాచారి అధ్యక్షతన నాగ్‌పుర్‌ వార్షిక సమావేశంలో కాంగ్రెస్‌ ఆ నిర్ణయాన్ని ఆమోదించింది.

 

సహాయ నిరాకరణ ఉద్యమ కార్యక్రమం: బహిష్కరణలు, స్వదేశీ నినాదం, జాతీయ విద్య ఈ ఉద్యమంలో ప్రధాన అంశాలు. బహిష్కరణ అంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు, విదేశీ వస్తువులను బహిష్కరించడం. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, గౌరవ పదవులను వదులుకోవడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వైదొలగడం. కేంద్ర రాష్ట్ర శాసన సభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం ఉద్యమంలో భాగం. జాతీయ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడం, వివాదాల  పరిష్కారం కోసం పంచాయతీల పేరుతో న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం. స్వదేశీ భావనను పెంపొందిస్తూ, ఖాదీ తయారీకి చేతులతో నూలు వడకడం. హిందూ ముస్లిం ఐక్యత, అంటరానితనం నిర్మూలన వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టడం. అహింసను సంపూర్ణంగా అమలు చేయాలని గాంధీజీ ఉద్బోధించారు. ఒక సంవత్సరంలో స్వరాజ్యం సిద్ధిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.


లక్ష్యాలు: పంజాబ్‌ దురాగతాలకు బ్రిటిష్‌ ప్రభుత్వం  క్షమాపణ చెప్పడం, స్వరాజ్యం, టర్కీ సుల్తాన్‌ పూర్వస్థితిని పునరుద్ధరించడం ఉద్యమ డిమాండ్లు.

 

ఉద్యమ గతి: 1921 - 22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ప్రజల్లో అమితమైన ఉత్సాహం వ్యక్తమైంది. విదేశీ వస్త్రాల బహిష్కరణ విజయవంతమైంది. వాటిని కుప్పలుగా పోసి వీధుల్లో తగలబెట్టారు. విదేశీ వస్త్ర దిగుమతులు పడిపోయాయి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించారు. అనేకమంది ప్రసిద్ధ న్యాయవాదులైన ఎంఆర్‌ జయకర్, ప్రకాశం పంతులు, సీఆర్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ, సైఫుద్దీన్‌ కిచ్లూ, వల్లభాయ్‌ పటేల్, రాజగోపాలచారి, అసఫ్‌ అలీ తదితరులు  తమ ప్రాక్టీస్‌లను వదులుకున్నారు. విదేశీ కోర్టులను బహిష్కరించారు. భారతదేశ సందర్శనకు వస్తున్న వేల్స్‌ రాకుమారుడి పర్యటనను ఉద్యమకారులు బహిష్కరించారు. మద్యపానాన్ని నిషేధించాలంటూ కల్లు దుకాణాల ముందు ఉద్ధృతంగా ధర్నాలు చేశారు. దాంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. తిలక్‌ స్వరాజ్య నిధి సేకరణ రూ.కోటి లక్ష్యాన్ని దాటింది. జాతీయోద్యమానికి ఖాదీ ఒక యూనిఫామ్‌గా మారిపోయింది. గాంధీజీ పిలుపుతో కార్యకర్తలు స్వచ్ఛందంగా జైళ్లకు వెళ్లడానికీ సిద్ధమయ్యారు. ఖిలాఫత్‌ నాయకులైన అలీ సోదరులతో కలిసి గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. తీవ్రరూపం దాల్సిన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఉద్యమకారులను విచక్షణారహితంగా అరెస్ట్‌ చేసింది. ఈ ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలో చీరాల - పేరాల సత్యాగ్రహం, పల్నాడులో అటవీ సత్యాగ్రహం, పెదనందిపాడులో పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగాయి.

 

చౌరీ చౌరా సంఘటన (1922): సహాయ నిరాకరణోద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో, 1922, ఫిబ్రవరి 5న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో చోటుచేసుకున్న ఒక  సంఘటన ఉద్యమాన్ని అకస్మాత్తుగా నిలిపేసేందుకు కారణమైంది. 

ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. కోపోద్రిక్తులైన ప్రజలు, పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఆ హింసాత్మక ఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని వెంటనే ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యను నాటి కాంగ్రెస్‌ నాయకులు చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ 1922, ఫిబ్రవరి 12న బార్డోలీలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ గాంధీజీ నిర్ణయాన్ని ఆమోదించింది. ఉద్యమం నిలిచిపోయింది. ప్రభుత్వం గాంధీజీపై దేశద్రోహం నేరం మోపి అరెస్టు చేసింది. టర్కీలో ముస్తఫా కెమల్‌ పాషా ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగి, సుల్తాన్‌ను పదవీచ్యుతుడిని చేయడంతో ఖిలాఫత్‌ ఉద్యమం కూడా ఆగిపోయింది.


సహాయ నిరాకరణ ఉద్యమ ఫలితాలు: ఈ ఉద్యమం లక్ష్యంగా పెట్టుకున్న డిమాండ్లను సాధించలేకపోయినప్పటికీ, కొన్ని మంచి ఫలితాలను అందించింది. అప్పటి వరకు భిన్న వర్గాల ప్రజలు తమ ప్రయోజనాల కోసం బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలు సాగించారు. కానీ గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం  జాతీయోద్యమంగా మారింది. దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమనే ప్రజల కృత నిశ్చయం సంపూర్ణంగా వ్యక్తమైంది. హిందూ ముస్లిం ఐక్యతను సాధించింది. జాతీయవాద భావం, జాతీయోద్యమం దేశంలోని మారుమూల ప్రాంతాలకూ వ్యాపించాయి. తర్వాత దశలో జరిగిన శాసనోల్లంఘన, క్విట్‌ ఇండియా లాంటి ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. ప్రజల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యశక్తిని ఎదిరించగలమనే ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. 

ర‌చ‌యిత‌:  వి.వి.ఎస్‌.రామావ‌తారం

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సమరశీల భావాలు - సాయుధ పోరాటాలు

ఆయుధాలు చేపట్టి.. ఆంగ్లేయులను అదరగొట్టి!

  జాతీయోద్యమ కాలంలో భారతీయులపై ఆంగ్లేయుల అరాచకాలు, అతి క్రూరమైన అణచివేతలు అధికమయ్యాయి. మన వాళ్లకు కనీస హక్కులు  లేకుండా పోయాయి. స్వేచ్ఛ ఉండేది కాదు. పరిష్కారాల కోసం మితవాదులు చేసిన పోరాటాలతో ఆశించిన ప్రయోజనాలు అందలేదు. ఆ దశలో ఉద్యమకారుల్లో అసహనం ప్రబలింది. అది సాయుధ పోరాటంగా మారింది. దేశ, విదేశాల్లో ఎంతోమంది వీరులు నిరంకుశ పాలనపై అసమాన ధైర్య సాహసాలతో అనేక రకాలుగా తిరుగుబాటు సమరాన్ని సాగించారు. కొందరు దుర్మార్గులైన ఇంగ్లిష్‌ అధికారులను తుదముట్టించారు. దొరికిపోయినవారు జైళ్లలో చిత్రహింసలు అనుభవించారు. ప్రాణాలు కోల్పోయారు. కానీ స్వాతంత్రోద్యమ గతిని మార్చి చరిత్రలో అమరవీరులై చిరస్థాయిగా నిలిచిపోయారు. 

 

  భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో విప్లవవాదులకు విశిష్ట స్థానం ఉంది. తరతరాలుగా బ్రిటిష్‌ ప్రభుత్వ వలసవాద విధానాలు భారత జాతిని ఆర్థికంగా కుంగదీశాయి. నిరుద్యోగం, ఆకలి, అనారోగ్యం దేశమంతా విలయతాండవం చేశాయి. దీనికితోడు ఆంగ్లేయుల జాత్యహంకార ధోరణి, దురుసుతనం, భారత జాతీయోద్యమాన్ని మొగ్గ దశలోనే అణచివేసేందుకు ప్రయత్నించిన తీరు కొందరు ఉద్యమకారుల్లో ద్వేషభావాన్ని పెంచాయి. కాంగ్రెస్‌ మితవాదులు సాగిస్తున్న రాజకీయ కార్యకలాపాలు, ఫలితాలు సాధించలేని వారి పోరాటశైలి పట్ల ఈ వర్గం విసుగు చెందింది. బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం కూడా దేశంలో విప్లవభావం పెరిగేందుకు దోహదపడింది. అమెరికా స్వాతంత్య్ర పోరాటం, ఇటలీ ఏకీకరణ, ఫ్రెంచ్‌ విప్లవం, చిన్న దేశమైన జపాన్‌ అతిపెద్దదైన రష్యాపై విజయం సాధించడం వంటి అంతర్జాతీయ సంఘటనలు విప్లవ భావజాలానికి ఉత్ప్రేరకాలుగా నిలిచాయి. బ్రిటిషర్ల బలప్రయోగ వ్యూహాలను అదే రీతిలో ఎదుర్కొంటేనే వారిని దేశం నుంచి సాగనంపడం సాధ్యమని సమరశీల నేతలు భావించారు. 

 

విధానాలు

విప్లవవాదులు లేదా సమరశీల జాతీయవాదులు అచంచల దేశభక్తులు. తొలి దశలో భారతదేశంలో, దేశం వెలుపలా రహస్య విప్లవ సంఘాలు, పత్రికలు స్థాపించి సదస్సులు,  సమావేశాలు నిర్వహించి, పుస్తకాలు ప్రచురించి విప్లవభావాలను ప్రచారం చేశారు. ఐరిష్‌ ఉగ్రవాదులు, రష్యన్‌ నిహిలిస్ట్‌ల నుంచి స్ఫూర్తి పొందారు. భారతీయుల పట్ల క్రూర విధానాలను అవలంబించిన ఇంగ్లిష్‌ అధికారుల హత్యలకు సిద్ధమయ్యారు. ఆంగ్లేయులను వ్యతిరేకించే దేశాల సహాయంతో సైనిక కుట్రలు చేశారు. తమ కార్యక్రమాలకు అవసరమైన నిధులు, ఆయుధాల కోసం పోలీసుస్టేషన్లు, ప్రభుత్వ ఆయుధగారాలపై దాడులకు పాల్పడ్డారు.

  బెంగాల్‌ విభజనకు ముందే విప్లవ సంఘాల స్థాపన ఉన్నప్పటికీ, బెంగాల్‌ విభజనతో ఉగ్రజాతీయవాదం పెరిగింది. బెంగాల్, మహారాష్ట్ర ప్రాంతాలు విప్లవ సంఘాల కార్యకలాపాలకు అడ్డాగా (కేంద్రంగా) మారాయి. ఈ సంస్థల్లో బరీంద్రకుమార్‌ ఘోష్, జతీంద్రనాథ్‌ బెనర్జీలు కలిసి స్థాపించిన ‘కలకత్తా అనుశీలన సమితి’, పుళిందాస్‌ స్థాపించిన ‘ఢాకా అనుశీలన సమితి’ ప్రధానమైనవి. ఇవి ఉనికిలో ఉన్నంతకాలం కేవలం మన దేశంలోని ఇతర విప్లవ సంస్థలతో పాటు ఇతర దేశాల్లోని సంస్థలతోనూ సంబంధాలను కొనసాగించేవి. సమరశీల, విప్లవవాద సిద్ధాంతాల ప్రచారంలో అవి ముందంజలో ఉండేవి.

  1905 బెంగాల్‌ విభజన తర్వాత దేశంలో అనేక తీవ్రవాద సంస్థలు పత్రికలను స్థాపించి తమ భావజాలాన్ని వ్యాప్తి చేశాయి. అలాంటి వాటిలో బెంగాల్‌లోని సంధ్య, యుగాంతర్, కాల్‌ ముఖ్యమైనవి. 1899లో సావర్కర్‌ సోదరులు మహారాష్ట్రలో ‘మిత్రమేళా’ పేరుతో రహస్య సంఘాన్ని స్థాపించారు. తర్వాత కాలంలో ఈ సంస్థ గణేష్‌ సావర్కర్‌ స్థాపించిన ‘అభినవ్‌ భారత్‌’తో కలిసి పశ్చిమ భారతంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాద కార్యక్రమాలను నిర్వహించింది. 1905లో అశ్వినీకుమార్‌ దత్త స్థాపించిన ‘స్వదేశీ బాంధవ్‌ సమితి’ బెంగాల్‌ విభజన ఉద్యమకాలంలో విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించింది. ఇలా అనేక విప్లవ సంఘాలు దేశమంతా ఏర్పాటయ్యాయి. పంజాబ్‌లో పలు రహస్య సంఘాలు అజిత్‌ సింగ్‌ నాయకత్వంలో చురుగ్గా పనిచేశాయి. తమిళ ప్రాంతంలో చిదంబరం పిళ్లై, సుబ్రమణ్య శివ తదితరులు బ్రిటిష్‌ వ్యతిరేక విప్లవ ఉద్యమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 1924లో సచింద్రనాథ్‌ సన్యాల్, జేజి ముఖర్జీ నేతృత్వంలో ‘హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’ సంస్థ ఏర్పడింది. ఆగ్రా, అలహాబాద్, బెనారస్, కాన్పుర్, లఖ్నవూల్లో శాఖలను ఏర్పాటు చేసింది. బ్రిటిషర్లపై ప్రయోగించడానికి కలకత్తాలో బాంబుల తయారీని ప్రారంభించింది. 1928లో చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఈ సంస్థ పేరును ‘హిందూస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’గా మార్చారు. 

  విప్లవ కార్యక్రమాల నిర్వహణకు విదేశాల్లో కూడా సంఘాలు/సంస్థలను భారతీయులు స్థాపించారు. అలాంటి వారిలో శ్యామ్‌జీ కృష్ణవర్మ, వి.డి.సావర్కర్, లాలా హర్‌దయాళ్‌ ముఖ్యులు. బ్రిటిష్‌ పాలకుల సొంతగడ్డ లండన్‌లోనే ఇండియా హౌస్‌ను శ్యామ్‌జీ కృష్ణవర్మ స్థాపించారు. ది ఇండియన్‌ సోషియాలజిస్ట్‌ పత్రికనూ స్థాపించారు. వీర్‌ సావర్కర్‌ కూడా లండన్‌లోనే తన తోటి భారతీయ విద్యార్థులను ప్రేరేపించి ఆంగ్లేయుల వ్యతిరేక పోరాటానికి ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన గ్రంథం ‘ఫస్ట్‌ వార్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌’ 1857 సిపాయిల తిరుగుబాటు స్వభావాన్ని విశ్లేషిస్తుంది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను అండమాన్‌లోని సెల్యూలర్‌ జైలులో నిర్బంధించి చిత్రహింసలు పెట్టింది. యూరప్‌లో భారత స్వాతంత్య్ర కాంక్షను ప్రచారం చేసిన వీర వనిత భికాజీ రుస్తుం కామా.

  అమెరికాలోని శాన్‌ప్రాన్సిస్కోలో 1913లో ‘గదర్‌ పార్టీ’ ఆవిర్భవించింది. లాలా హర్‌దయాళ్, భాయ్‌ పరమానంద, సోహన్‌ సింగ్, మహమ్మద్‌ ఇక్బాల్, భగవాన్‌ సింగ్, కర్తార్‌ సింగ్, అబ్దుల్‌ హఫీజ్, మహమ్మద్‌ బర్కతుల్లా తదితర పంజాబీయులు ఇందులో కీలక సభ్యులు. ఆయుధాలను సేకరించి, యువతకు శిక్షణ ఇచ్చి, ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేయడం ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం. పంజాబ్, తూర్పు ఆసియా దేశాల్లో గణనీయంగా అనుచరులను సిద్ధం చేసింది. బెంగాల్‌లో రాస్‌ బిహారీ బోస్‌ ఈ సంస్థ నాయకుడు. అయితే ఈ రహస్యాలను తెలుసుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం వారిని క్రూరంగా అణచివేసింది. వీరేంద్రనాథ్‌ చటోపాధ్యాయ్, భూపేంద్రనాథ్‌ దత్త తదితరులు 1915లో ‘బెర్లిన్‌ కమిటీ’ని స్థాపించి బ్రిటిషర్ల అకృత్యాలను ఐరోపా దేశాల్లో ఎండగడుతూ, సాయుధ పోరాటానికి కార్యకర్తలను తయారుచేశారు. 1915లో మహేంద్ర ప్రతాప్, బర్కతుల్లా తదితరులు కాబూల్‌లో ‘ప్రొవిజనల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఫ్రీ ఇండియా’ను నెలకొల్పారు.

  ఆంగ్లేయుల సామ్రాజ్యవాద దాష్టీకాలకు, సాయుధ పోరాటంతో జవాబు చెప్పి, వారిని దేశం నుంచి తరిమికొట్టడం ఈ విప్లవకారుల ప్రధాన లక్ష్యం. భారతీయుల పట్ల క్రూరంగా వ్యవహరించిన బ్రిటిష్‌ అధికారులను హత్య చేయడం వంటి కార్యక్రమాలను చాపేకర్‌ సోదరులైన దామోదర్‌ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్‌ ప్రారంభించారు. వీరు పుణెలో ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్రిటిష్‌ అధికారులైన రాండ్, ఆయన మిలిటరీ సహాయకుడు లెఫ్టినెంట్‌ ఐరెస్ట్‌ను 1897లో కాల్చి చంపారు.  పరమక్రూరుడిగా పేరు పొందిన బెంగాల్‌ లఫ్టినెంట్‌ గవర్నర్‌ ఫుల్లర్‌ హత్యకు 1907లో ‘అనుశీలన సమితి’ కార్యకర్తలు చేసిన ప్రయత్నం విఫలమైంది. 1908లో ముజఫర్‌పుర్‌ న్యాయమూర్తి కింగ్స్‌ ఫోర్డ్‌ ప్రయాణిస్తున్న వాహనంపై ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి బాంబు విసిరారు. 1912లో అప్పటి రాజప్రతినిధి లార్డ్‌ హార్డింజ్‌ దిల్లీలో ఏనుగుపై ఊరేగింపుగా వస్తుండగా రాస్‌ బిహారి బోస్, సచింద్ర సన్యాల్‌లు బాంబు విసిరారు. కానీ హార్డింజ్‌ త్రుటిలో తప్పించుకున్నాడు.

  సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లో జరిగిన ‘సైమన్‌ గో బ్యాక్‌’ ఉద్యమానికి లాలా లజపతి రాయ్‌ నాయకత్వం వహించారు. పోలీస్‌ అధికారి సాండర్స్‌ కొట్టిన లాఠీ దెబ్బలకు లజపతి రాయ్‌ మరణించారు. ఇందుకు ప్రతిగా భగత్‌సింగ్, ఆజాద్, రాజ్‌గురులు 1928లో సాండర్స్‌ను హత్య చేశారు.

  నిధులు, ఆయుధాల కోసం 1920 నాటికి పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ ఆయుధ గిడ్డంగులపై స్వాతంత్రోద్యమ విప్లవకారులు చేసిన దాడులు వెయ్యికి పైగా ఉండవచ్చని అంచనా. ఆంధ్రాలో విశాఖ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోలీస్‌స్టేషన్లకు ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి చేసేవాడు. బాంబులు తయారు చేస్తున్నారనే కారణంతో కలకత్తాలో 1908లో అనేకమంది విప్లవకారులను ప్రభుత్వం అరెస్టు చేసింది. దీనినే అలీపూర్‌ కుట్ర కేసు అంటారు. 1925లో కకోరి రైలు దోపిడీ కేసులో రాంప్రసాద్‌ బిస్మిల్, రోషన్‌ సింగ్, రాజేంద్ర లాహిరి, అష్ఫాక్‌ ఉల్లాలను ఉరి తీశారు. 1930లో సూర్యసేన్‌ నాయకత్వంలో చిట్టగాంగ్‌ విప్లవకారులు ప్రభుత్వ ఆయుధగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భగత్‌ సింగ్, బి.కె.దత్‌లు ‘అప్రజాస్వామిక’ ప్రజా రక్షణ బిల్లును నిరసిస్తూ కేంద్ర శాసనసభలోకి బాంబులు విసిరారు. దాంతో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు 1931, మార్చి 23న లాహోర్  సెంట్ర‌ల్ జైలులో ఉరిశిక్ష విధించారు.

  ఒకవైపు గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్‌ అహింసాయుత రాజ్యాంగబద్ధ రాజకీయ పోరాటం చేస్తుంటే, మరోవైపు జరుగుతున్న విప్లవ సాయుధ పోరాటాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వేలమందికి జీవిత ఖైదు, మరణ శిక్షలు విధించినప్పటికీ విప్లవ యోధుల్లో ధైర్యం సడలలేదు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడానికి వారు అవలంబించిన విధానాలకు పెద్దగా ప్రజామోదం లేనప్పటికీ, స్వాతంత్రోద్యమ గతిని మార్చడంలో గణనీయమైన పాత్ర పోషించారు. అచంచల దేశభక్తి, దేశం కోసం మరణానికి కూడా భయపడని మనోధైర్యం, త్యాగాలు, స్వతంత్ర పోరాట చరిత్రలో వారికి విశిష్ట స్థానం కల్పించాయి.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 16-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసన ఉల్లంఘన ఉద్యమం - 2

విముక్తి కాంక్ష‌ను ర‌గిలించిన పోరాటం!

 

  అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, ఆస్తుల స్వాధీనాలు, అన్యాయమైన ఆంక్షలు, అమానుష కాల్పుల మధ్య అత్యంత కఠినంగా ఆ ఉద్యమాన్ని అణచి వేయాలని ఆంగ్లేయుల ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ప్రబలమైన ప్రజల జాతీయవాద శక్తికి తల వంచాల్సి వచ్చింది. తప్పనిసరిగా ఒప్పందం కుదుర్చుకొని, సమావేశాలకు మహాత్ముడిని స్వాగతించాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే శాసనోల్లంఘన ఉద్యమం. తర్వాతి దశలో పలు కారణాలతో బలహీన పడినప్పటికీ, పరాయి పాలన నుంచి విముక్తి పొంది తీరాలనే కాంక్షను బలంగా ప్రజల్లో రగిలించింది. పోరాటాల కష్టాలను తట్టుకొని నిలబడగలిగే సహనాన్ని వారికి సమకూర్చింది. ఈ పరిణామాలను, వాటి ఫలితాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

 

  శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించే ముందు గాంధీజీ బ్రిటిష్‌ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. ప్రజాక్షేమం దృష్ట్యా 11 కనీస చర్యలను ప్రకటించి, ప్రభుత్వం వాటికి సమ్మతించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అప్పటి వైస్రాయ్‌ (రాజప్రతినిధి) ఆ డిమాండ్లలో వేటికీ స్పందించకపోవడంతో శాసనోల్లంఘనకు ఉపక్రమించారు. ఉప్పుపై పన్ను శాసనాన్ని తొలుత ఉల్లంఘించాలని నిర్ణయించారు. 1930, మార్చి 12న 78 మంది సుశిక్షితులైన అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరిన గాంధీజీ గుజరాత్‌ పశ్చిమ తీరంలోని దండి గ్రామానికి ఏప్రిల్‌ 6న చేరుకున్నారు. అక్కడ ఉప్పు తయారు చేయడంతో ఉద్యమం ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక యాత్రలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎర్నేని సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గాంధీజీ దండి యాత్రకు దారి పొడవునా జనసందోహం జయజయధ్వానాలతో మద్దతు తెలిపారు. ప్రజల్లో స్వాతంత్య్ర దీక్ష వెల్లివిరిసింది. 

 

  ఉద్యమంలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలను గాంధీÅజీ నిర్దేశించారు. అవన్నీ అహింసా పద్ధతిలోనే జరగాలన్నారు. ఉద్యమంలో ప్రధాన అంశం ఉప్పు సత్యాగ్రహం, చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారుచేయడం. అలాగే విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం, ఖద్దరు ధరించడం, హిందూ-ముస్లిం ఐక్యత, పన్నుల చెల్లింపు నిరాకరణ, అంటరానితనం నిర్మూలనను పాటించాలని సూచించారు. ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసి పుణేలోని ఎరవాడ జైలులో నిర్బంధించింది. ఆ తర్వాత ఉద్యమానికి అబ్బాస్‌ థ్యాబ్జి, సరోజినీ నాయుడు వరుసగా నాయకత్వం వహించారు. సరోజినీ నాయుడు నాయకత్వంలో మే 21న సత్యాగ్రహులు ప్రభుత్వ ఉప్పు డిపోపై దాడి చేశారు.

 

ఉద్యమ వ్యాప్తి: శాసనోల్లంఘన ఉద్యమం దేశమంతా త్వరగా వ్యాపించింది. విద్యార్థులు, కార్మికులు, శ్రామికులు, రైతులు ముఖ్యంగా మహిళలు విశేషంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతిచోటా హర్తాళ్లు, విదేశీ వస్త్ర బహిష్కరణ, పన్నుల నిరాకరణ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. చక్రవర్తి రాజగోపాలాచారి తంజావూర్‌ తీరంలో తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు; మలబారు తీరంలో కెల్లప్పస్‌ కాలికట్‌ నుంచి పయన్నూర్‌ వరకు సత్యాగ్రహులతో పాదయాత్ర చేసి, ఉప్పు తయారుచేసి శాసనాన్ని ఉల్లంఘించారు. వాయవ్య ప్రాంతంలో సరిహద్దు గాంధీగా పేరు పొందిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ ‘ఖుదాయి కిద్‌మత్‌గార్‌’ అనే ప్రతిఘటన సంస్థను స్థాపించి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సంస్థ సభ్యులను ప్రజలు ‘రెడ్‌ షర్ట్స్‌’ అనేవారు. నాగాలాండ్‌కు చెందిన రాణి గైడెన్‌ అనే ధీర వనిత 13 ఏళ్ల ప్రాయంలోనే గాంధీజీ పిలుపునకు స్పందించి, విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి కారాగార శిక్ష అనుభవించింది.

 

ఆంధ్రాలో ఉద్యమం: ఆంధ్ర ప్రాంతంలో శాసనోల్లంఘన ఉద్యమ బాధ్యతలను కాంగ్రెస్‌ కొండా వెంకటప్పయ్యకు అప్పగించింది. ఆయన ప్రతి జిల్లాలో నాయకుడిని నియమించి, శిబిరం ఏర్పాటు చేసి, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యమం నిర్వహించారు. కృష్ణా జిల్లాలో అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య; గుంటూరు జిల్లాలో కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీబాయమ్మ; గోదావరి జిల్లాల్లో బులుసు సాంబమూర్తి, విశాఖ జిల్లాలో తెన్నేటి విశ్వనాథం, నెల్లూరు జిల్లాలో బెజవాడ గోపాలరెడ్డి, రాయలసీమలో కల్లూరి సుబ్బారావు, మద్రాసు నగరంలో టంగుటూరి ప్రకాశం, కాశీనాథుని నాగేశ్వరరావు తదితర నాయకులు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేశారు.

 

ప్రభుత్వ వైఖరి: ఉద్యమకారుల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. లాఠీఛార్జీలు, అక్రమ నిర్బంధాలు, ఉద్యమకారుల ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, నిరాయుధులైన ఉద్యమకారులపై కాల్పులు నిత్యకృత్యం అయ్యాయి. కాంగ్రెస్‌ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించారు. జాతీయవాద పత్రికలపై ఆంక్షలు విధించారు. 1930 చివరి నాటికి దేశవ్యాప్తంగా లక్షల మంది నిర్బంధంలో ఉన్నారు.

 

రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు: ఈలోగా బ్రిటన్‌లో సైమన్‌ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. భవిష్యత్తులో చేపట్టబోయే రాజ్యాంగ సంస్కరణల గురించి భారత నాయకులతో చర్చించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం లండన్‌లో మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేసింది. 1930, నవంబరు 12న నాటి బ్రిటిష్‌ చక్రవర్తి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. బ్రిటిష్‌ పార్టీల నుంచి 16 మంది, భారత రాష్ట్రాల నుంచి 16 మంది, బ్రిటిష్‌ ఇండియా నుంచి 57 మంది వివిధ రాజకీయ పక్షాలకు/సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్‌ బహిష్కరించింది. దాంతో రాజకీయ సంస్కరణల విషయంలో ఈ సమావేశం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఫలితంగా బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. భారతదేశంలో అత్యధిక ప్రజాబాహుళ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్‌ పాల్గొనని ఆ సమావేశం నిష్ప్రయోజనమని భావించింది. 1931, జనవరి 19న సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేసింది.

 

గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక: కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం గ్రహించింది. తేజ్‌బహదూర్‌ సప్రూ, డాక్టర్‌ ఎం.ఆర్‌.జయకర్‌ల మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాలకు రాజీ కుదిరింది. దీని ఫలితంగా గాంధీతో సహా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులందరినీ విడుదల చేశారు. 1931, మార్చి 5న వైస్రాయ్‌ ఇర్విన్, గాంధీజీ మధ్య ఒప్పందం కుదిరింది.

 

ముఖ్యాంశాలు: * హింసకు బాధ్యులైన వారిని తప్ప, మిగతా రాజకీయ ఖైదీలను విడుదల చేస్తారు. జప్తు చేసిన వారి ఆస్తులు పునరుద్ధరిస్తారు. 

 

* సారాయి, నల్లమందు, విదేశీ వస్త్ర దుకాణాల ముందు ప్రశాంతంగా పికెటింగ్‌కు, నిబంధనలకు లోబడి ఉప్పు తయారీకి అనుమతిస్తారు. 

 

* కాంగ్రెస్‌ కూడా తన వంతుగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనేందుకు అంగీకరించింది. 1931, మార్చిలో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశం దీన్ని ఆమోదించింది.

 

రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం: 1931, సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు 1 వరకు జరిగింది. కాంగ్రెస్‌ ప్రతినిధిగా మహాత్మాగాంధీ పాల్గొన్నారు. జాతీయవాదుల ప్రధాన డిమాండ్లను, తక్షణ అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్‌ స్టేటస్‌) ఇచ్చే అంశాన్ని ఈ సమావేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వం విస్మరించి అజెండాను పక్కదారి పట్టించింది. భారతదేశ రాజకీయ సంస్కరణల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని గ్రహించిన గాంధీ స్వదేశానికి తిరిగివచ్చారు. వచ్చీ రావడంతోనే రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిష్ప్రయోజనమైందని ప్రకటించారు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని పునరుద్ధరించారు.

 

మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం: ఇది 1932, నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనడం వల్ల సాధించేదేమి ఉండదని భావించి కాంగ్రెస్‌పార్టీ దీన్ని బహిష్కరించింది.  

 

  ఇంతలో భారత వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ స్థానంలో లార్డ్‌ వెల్లింగ్టన్‌ నియమితులయ్యారు. ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.  ఉద్యమకారులను అణచివేసేందుకు పోలీసులు హింసాత్మక చర్యలకు దిగారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, మతతత్వ రాజకీయాలు, కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఐకమత్య లోపం, ప్రభుత్వ అణచివేత విధానాలతో ఉద్యమం బలహీనమైంది. కాంగ్రెస్‌ ఈ ఉద్యమాన్ని 1933, మేలో నిలిపేసింది. 1934లో అధికారికంగా ఉపసంహరించుకుంది.

 

ఉద్యమ ఫలితాలు: సంపూర్ణ స్వరాజ్య సాధనే లక్ష్యంగా సాగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. భారతీయులు పరాయి పాలనను, వలసవాదుల చట్టాలను భరించే స్థితిలో ఏమాత్రం లేరని చాటింది. వాటి నుంచి విముక్తి పొందాలనే దృఢ సంకల్పానికి ప్రతిరూపమే శాసనోల్లంఘన ఉద్యమం. స్వరాజ్య భావన, పోరాట స్వభావం ప్రజల్లో నాటుకుపోయింది. సమాజంలోని అనేక వర్గాలతో పాటు, రైతులు, వ్యాపారులు, పెద్దఎత్తున మహిళలు, యువకులు పాల్గొని ఉద్యమ సామాజిక పరిధిని విస్తృతం చేశారు. ఉద్యమకారులు కేవలం బ్రిటిష్‌ చట్టాలకు సహాయ నిరాకరణ మాత్రమే కాకుండా, బ్రిటిష్‌ చట్టాలను ఉల్లంఘించి తమ స్వరాజ్య కాంక్షను విస్పష్టం చేశారు. ఈ ఉద్యమం బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, స్థానిక కుటీర పరిశ్రమలకు చేయూతనిచ్చింది. రాజకీయ పోరాటాల్లో బాధలు తట్టుకునే శక్తిని, సహనాన్ని భారతీయులకు అలవాటు చేసింది. తర్వాతి రోజుల్లో క్విట్‌ ఇండియా లాంటి ఉద్యమాలకు వారిని సిద్ధం చేసింది.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 14-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పల్లవులు


* కె.పి.జైశ్వాల్‌ అనే చరిత్రకారుడు ‘‘ఉత్తర భారతదేశానికి గుప్తులు ఎలాగో, దక్షిణ భారతదేశానికి పల్లవులు అలాంటివారు’’ అని వ్యాఖ్యానించారు.


చారిత్రక ఆధారాలు

*వివిధ శాసనాలు, సాహిత్యాలు పల్లవుల చరిత్రకు ముఖ్య ఆధారాలుగా ఉన్నాయి.

* మొదటి మహేంద్రవర్మ తిరుచిరాపల్లి, మందగపట్టు, కుడుమియామలై శాసనాలు; మొదటి నరసింహవర్మ బాదామి శాసనం; నందివర్మ ఉదియేందిర శాసనం, మంచికల్లు, మైదవోలు శాసనాలు వీటిలో ముఖ్యమైనవి. 

* ఇవేకాకుండా పల్లవులకు సమకాలికులైన బాదామి చాళుక్యరాజు రెండో పులకేశి వేయించిన ఐహోల్‌ శాసనం; గాంగ వంశీయుల శాసనాలు కూడా పల్లవుల చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.

*పల్లవ మహేంద్రవర్మ రచించిన ‘మత్తవిలాస ప్రహసనం’; దండి ‘దశకుమార చరిత్ర’, ‘కావ్యదర్శనం’; భారవి కిరాతార్జునీయం వీరి చరిత్రను తెలుపుతున్నాయి. 

*తమిళంలో ఆళ్వార్లు, నాయనార్లు రచించిన గ్రంథాలు (దేవారం); తిరునాళ్వార్‌ రచించిన ‘కురళ్‌’; సింహళ బౌద్ధగ్రంథాలైన దీపవంశం, మహావంశం; హుయాన్‌త్సాంగ్‌ సి-యు-కి గ్రంథాలు పల్లవుల చరిత్రకు ప్రధాన ఆధారాలు. 

* పల్లవుల కట్టడాలు, నాణేలు, శిల్పాలు మొదలైనవి పురావస్తు ఆధారాలుగా ఉన్నాయి. కంచి, మహాబలిపురంలోని కట్టడాలు, వైకుంఠ పెరుమాళ్‌ దేవాలయంలో నిర్మించిన శిల్పాలు పల్లవుల కాలం నాటి వాస్తు, శిల్పకళను తెలుపుతున్నాయి.


పుట్టుపూర్వోత్తరాలు

పల్లవుల పుట్టుపూర్వోత్తరాల గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. 

* ‘‘పల్లవుల వంశోత్పత్తి భారతదేశ చరిత్రలోని నిగూఢ రహస్యాల్లో ఒకటి’’ - వి.ఎ.స్మిత్‌

*‘‘పర్షియా నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన పార్థియన్లే పల్లవులు’’ 

                                                                                                                                                                                                                                                                                                                                                                  - లూయీరైస్, డూబ్రె, వెంకయ్య 

*‘‘అశోకుడి శాసనాల్లో పేర్కొన్న పాలర్లు లేదా పుళిందులే పల్లవులు’’ - సత్యనాథ్‌ అయ్యర్‌ 

* ‘‘పల్లవులు వాకాటక వంశ శాఖకి చెందినవారు’’ - కె.పి.జైశ్వాల్‌ 

*‘‘పల్లవ పదం తొండై పదానికి సంస్కృతీకరణ. వీరు తొండైమండలానికి చెందినవారు’’ 

                                                                                                                                                                                                                                                                                                                                                                     - కృష్ణస్వామి అయ్యంగార్‌

*సింహళ బౌద్ధగ్రంథం ‘మహావంశం’లో కృష్ణానదీ తీరంలో ‘పల్లవబోగ్గ’ అనే ప్రదేశం గురించి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పల్నాడు. ఇక్కడే తొలి పల్లవ శాసనాలైన మంచికల్లు, మైదవోలు లభించాయి. కాబట్టి పల్లవులు ఆంధ్రులని కొంతమంది చరిత్రకారుల వాదన.

*మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పల్లవులు మొదట పల్నాడులో నివసించారు. తర్వాత తొండైమండలం (తమిళనాడు)కి వలస వెళ్లి అక్కడ నాగవంశీయులతో వైవాహిక సంబంధాలు ఏర్పర్చుకుని స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించారు. 

*‘మణిమేఖలై’ అనే తమిళ కావ్యంలోని కథ ఆధారంగా చోళ-నాగ వంశానికి జన్మించిన వారు పల్లవులని తమిళనాడుకి చెందిన చరిత్రకారులు పేర్కొన్నారు. 

* పురాణాలు ఆంధ్రులను, పల్లవులను కలిపి పేర్కొన్నాయి.

* రాజశేఖర కవి రచించిన ‘భువనకోశం’లో వాయవ్య సరిహద్దుల్లో పహ్లవులు, దక్షిణాన పల్లవులు ఉన్నట్లు ఉంది.

*పల్లవ రాజవంశం ఒక్కటే అయినప్పటికీ చరిత్రకారులు దీన్ని నాలుగు వర్గాలుగా విభజించారు. 

1. ప్రాకృత శాసన పల్లవులు       2. సంస్కృత శాసన పల్లవులు 

3. మహా పల్లవులు                 4. కడపటి పల్లవులు

* వీరిలో మొదటి రెండు వర్గాలను ప్రాచీన పల్లవులని, మిగిలిన వారిని నవీన పల్లవులు లేదా బృహత్‌ పల్లవులని పేర్కొన్నారు.

నవీన పల్లవులు

* వీరినే మహా పల్లవులు లేదా బృహత్‌ పల్లవులు అంటారు. వీరు క్రీ.శ. 575 నుంచి క్రీ.శ.897 మధ్య రాజ్యాన్ని పాలించారు. నవీన పల్లవుల వంశానికి మూల పురుషుడు సింహ విష్ణువు.


సింహ విష్ణువు  

*ఇతడు క్రీ.శ. 575 నుంచి క్రీ.శ.600 వరకు రాజ్యపాలన చేశాడు.

*ఇతడు చోళ మండలాన్ని జయించి, తన రాజ్యాన్ని కావేరి నది వరకు విస్తరింపజేశాడు. 

*కలభ్ర, చోళ, పాండ్య, కేరళ రాజ్యాలను ఓడించాడు. ‘కంచి’లో పల్లవ రాజ్యాన్ని బలోపేతం చేశాడు. 

*ఇతడి ఆస్థానంలో ‘భారవి’ అనే కవి ఉండేవాడు. భారవి ‘కిరాతార్జునీయం’ అనే గ్రంథాన్ని రచించాడు. 

* ఇతడికి ‘అవని సింహ’ అనే బిరుదు ఉంది.

మొదటి మహేంద్రవర్మ

* ఇతడు క్రీ.శ. 600 నుంచి క్రీ.శ. 630 వరకు రాజ్యపాలన చేశాడు

* సింహ విష్ణువు కుమారుడు ‘మొదటి మహేంద్రవర్మ’. ఇతడు మొదట జైన మతాభిమాని. ‘అప్పార్‌’ బోధనల వల్ల శైవమతాన్ని స్వీకరించారు. 

* పల్లవ రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణా నది వరకు విస్తరించి బాదామి చాళుక్యులు, పాండ్యులతో వైరాన్ని ప్రారంభించాడు. 

*మొదటి మహేంద్రవర్మ పాండ్యులను ఓడించి కావేరి నదీ ప్రాంతంలోని డెల్టా భూములను ఆక్రమించాడు. 

* క్రీ.శ. 630లో రెండో పులకేశి ఇతడిపై దండెత్తాడు. దీన్ని ‘పుల్లలూరు యుద్ధం’గా పేర్కొంటారు. ఈ యుద్ధంలో పులకేశి మహేంద్రవర్మను ఓడించి, పల్లవ రాజ్యంలోని ఉత్తర ప్రాంతాలను ఆక్రమించాడు.  ఈ యుద్ధం జరిగిన కొద్దికాలానికే మహేంద్రవర్మ మరణించాడు. 

ఇతర విశేషాలు

* మహేంద్రవర్మ సంగీత విద్వాంసుడు, చిత్రకారుడు. వాస్తు, శిల్పానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 

*మహేంద్రవర్మ ‘మత్తవిలాస ప్రహసనం’ అనే గ్రంథాన్ని రచించాడు. ‘రుద్రాచార్యుడి’ దగ్గర సంగీతం నేర్చుకున్నాడు.

*పుదుక్కొట సమీపంలోని కుడుమియామలైలో ఇతడు శిలాశాసనం వేయించాడు. ఇందులో  గోడపై చెక్కిన గణపతి విగ్రహంతోపాటు వీణపై సాధన చేయడానికి అవసరమైన సంగీత పాఠాలు ఉన్నాయి. 

* ఇతడు ‘భగవదజ్జుక’ అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. 

* మహేంద్రవాడి, మామండూర్, దళవానూర్‌లో చెరువులు తవ్వించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. 

* మహేంద్రవర్మ దక్షిణ భారతదేశంలో ద్రావిడ వాస్తు శిల్పకళారీతులకు నాంది పలికాడు. 

* ఇతడి కాలంలోనే కొండలను తొలిచి ఆలయాలు నిర్మించే పద్ధతి ప్రారంభమైంది. ఇటుక, కలప, లోహాలతో సంబంధం లేకుండా ఆలయాలు నిర్మించేవారు. తిరుచిరాపల్లి, చెంగల్పట్టు, మల్లవరం, మామండూర్, దళవానూర్‌లోని గుహాలయాలు ఇతడి కాలంనాటివే. 

* సిత్తన్న వాస గుహల్లోని వర్ణచిత్రాలు ఇతడి కాలానికి చెందినవే. 

* ఇతడికి విచిత్ర చిత్రుడు, చిత్రకార పులి, గుణభర, అవనీ భాజన, సత్యసంధి, పరమ మహేశ్వర అనే బిరుదులు ఉన్నాయి.


మొదటి నరసింహవర్మ

*ఇతడు క్రీ.శ. 630 నుంచి క్రీ.శ.668 వరకు రాజ్యపాలన చేశాడు.

*ఇతడు మొదటి మహేంద్రవర్మ కుమారుడు. నరసింహవర్మ తన తండ్రిని ఓడించిన రెండో పులకేశిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అతడిపై దండెత్తి ‘మణిమంగళ యుద్ధం’లో ఓడించి, వధించాడు. బాదామి, వాతాపిలను నాశనం చేశాడు.

*ఈ యుద్ధంలో సింహళరాజు ‘మారవర్మ’ నరసింహవర్మకు సహాయం చేశాడు.

*ఈ విజయాలకు చిహ్నంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ అనే బిరుదులు పొందాడు.

* నరసింహవర్మ సేనాని ‘చిరుతొండ పరంజ్యోతి’.


ఇతర విశేషాలు

*మొదటి నరసింహవర్మ తన తండ్రి ప్రారంభించిన వాస్తు, శిల్ప కళారీతులను కొనసాగించాడు.

* తండ్రి పేరు మీద సముద్ర తీరాన ‘మామల్లపురం’ లేదా ‘మహాబలిపురం’ అనే రేవు పట్టణాన్ని నిర్మించాడు. ఇది విదేశీ వ్యాపారానికి, సముద్రయానానికి ఉపయోగపడింది.

*చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ ‘కంచి’ని దర్శించి, దీని గురించి తన రచనల్లో వర్ణించాడు. మామల్లపురం కంచికి 10 కి.మీ. దూరంలో ఉందని, కంచిలో 100 బౌద్ధారామాలు, 10 వేల మంది బౌద్ధ బిక్షువులు, 80కి పైగా హిందూ దేవాలయాలు ఉన్నట్లు పేర్కొన్నాడు.

* ఏకశిలా నిర్మితమైన ఏడు రాతి రథాలను (seven pagodas) నరసింహవర్మ మహాబలిపురంలోనే నిర్మించాడు.

*ఇతడి చివరి దశలో రెండో పులకేశి కుమారుడైన మొదటి విక్రమాదిత్యుడు పల్లవ రాజ్యంపై దండెత్తి, నరసింహవర్మను ఓడించి చాళుక్య ప్రాంతాలను తిరిగి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ యుద్ధంలో విక్రమాదిత్యుడికి గంగ దుర్వినీతుడు సాయం చేశాడు.

* నలందా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పనిచేసిన ‘ధర్మపాలుడు’ కంచి నగరానికి చెందినవాడని కొంతమంది చరిత్రకారుల భావన.

ప్రాచీన పల్లవులు

*ప్రాచీన పల్లవుల గురించి తెలుసుకోవడానికి 20 శాసనాలు ఉన్నాయి. వీటిలో నాలుగు శాసనాలు ప్రాకృతంలో, మిగిలినవి సంస్కృతంలో ఉన్నాయి. అయితే ప్రాచీన పల్లవుల గురించి పూర్తి సమాచారం ఇంకా లభ్యం కాలేదు.

* ప్రాచీన పల్లవ వంశానికి మూల పురుషుడు ‘వీరకూర్చవర్మ’ (క్రీ.శ. 285310). ఇతడు నాగరాజు కుమార్తెను వివాహం చేసుకుని ఇక్ష్వాకులను జయించాడు. వీరకూర్చవర్మ కంచిని రాజధానిగా చేసుకుని పాలించాడు.

*వీరకూర్చవర్మ తర్వాత అతడి కుమారుడు శివస్కందవర్మ (క్రీ.శ. 310335) రాజ్యపాలన చేశాడు. ఇతడు వాజపేయ, అశ్వమేధ యాగాలు చేశాడు. ఇతడికి ‘ధర్మమహారాజాధిరాజు’ అనే బిరుదు ఉంది. ఇతడు ప్రాచీన పల్లవుల్లో గొప్పవాడు.

*శివస్కందవర్మ తర్వాత త్రిలోచన పల్లవుడు రాజ్యపాలన చేశాడు. ఇతడు శ్రీశైల పర్వతానికి చుట్టుపక్కల ఉన్న అడవులను నరికించి, వాటిని నివాసయోగ్యంగా మార్చాడు. అక్కడ బ్రాహ్మణులకు అగ్రహారాలు నిర్మించాడు. త్రిలోచనుడి కాలంలో కరికాల చోళుడు తొండైమండలంపై దాడిచేసి ఇతడ్ని ఓడించి, బానిసగా చేసుకున్నాడని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.

త్రిలోచనుడి తర్వాత మొదటి కుమార విష్ణువు, బుద్ధవర్మ, రెండో కుమార విష్ణువు, మొదటి సింహవర్మ, స్కందవర్మ, నందివర్మ రాజ్యాన్ని పాలించారు.

* ప్రాచీన పల్లవుల్లో చివరివాడు ‘నందివర్మ’. ఇతడి కాలంలో ‘కలభ్రులు’ దండెత్తి దక్షిణ భారతదేశాన్ని జయించారు. వీరి గురించి పూర్తి సమాచారం లేదు. నందివర్మతో ప్రాచీన పల్లవ వంశం అంతమైంది.

 

Posted Date : 15-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయవాద రాజకీయాలు

స్వరాజ్య కాంక్షను రగిలించిన రాజకీయం!

 


  త్యాగాలతో కూడిన భారతీయుల పోరాటాలు, నిజాయతీ నిండిన రాజకీయాలు తెల్లవారిని ఆలోచనలో పడేశాయి. వారిలోని ఉదారత్వాన్ని మేల్కొలిపాయి. తదనంతర కాలంలో దేశంలో పాలనకు మూలమైన ఒక చట్టాన్ని చేయడానికి ప్రేరణగా మారాయి. ఆ కొత్త చట్టం కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతగా ప్రభావం చూపలేకపోయిన ముస్లింలీగ్‌ అవకాశవాద చర్యలతో ఆంగ్లేయుల వైపు చేరింది. బలవంతంగా భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగిన బ్రిటన్‌ నియంతృత్వ పోకడలను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా నిరసించారు. మంత్రి పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. వైఖరి మార్చుకున్న వైస్రాయ్, ముస్లిం లీగ్‌ వైపు మొగ్గు చూపి ప్రత్యేక దేశ విభజన డిమాండ్లను ప్రోత్సహించాడు. సంగ్రామ కాలంలో సంభవించిన పరిణామాలతో రగిలిన స్వాతంత్య్రకాంక్ష తర్వాతి దశ జాతీయోద్యమంపై అత్యంత ప్రభావాన్ని ప్రదర్శించింది.

 


  గాంధీజీ నాయకత్వంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత జాతి చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. మనవాళ్ల ప్రగాఢ స్వాతంత్య్రాభిలాషను విభిన్న నిరసనలతో ప్రదర్శించింది. స్వాతంత్య్రం కోసం భారతీయులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని లోకానికి తెలియజేసింది ఈ క్రమంలో బ్రిటిషర్లలో కొంత ఉదారవాద చైతన్యం వచ్చింది. శాసనోల్లంఘన ఉద్యమం, నైతిక విలువలతో కూడిన గాంధీజీ రాజకీయాల వల్ల ఆంగ్లేయ ప్రభుత్వంలోనూ కొంత మార్పును తీసుకొచ్చింది. అయినా రాజ్యాంగ సంస్కరణల విషయమై ప్రతిష్టంభన ఏర్పడింది. ఇంతలో సైమన్‌ కమిషన్‌ నివేదిక, మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో వచ్చిన సూచనలు కలిపి 1933లో ఒక శ్వేతపత్రంగా వెలువడ్డాయి. ఈ సూత్రాలను పరిశీలించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడానికి లార్డ్‌ లిన్‌లిత్‌గో నాయకత్వంలో పార్లమెంట్‌ జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటిష్‌ పార్లమెంట్‌ ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. స్వాతంత్య్రం వచ్చే వరకు ఆ చట్టంలోని అంశాలే భారతదేశ పాలనకు ప్రాతిపదికలయ్యాయి. ఆ తర్వాత అవే రాజ్యాంగ రచనకు మార్గదర్శకాలుగా మారాయి.

 


భారత ప్రభుత్వ చట్టం-1935 ముఖ్యాంశాలు: * ఈ చట్టం అఖిల భారత సమాఖ్య (ఫెడరల్‌) వ్యవస్థను ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య నిర్దిష్ట అధికార విభజన చేసింది. దీని ద్వారా ప్రభుత్వ అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించి అవశిష్ట అధికారాలను వైస్రాయ్‌-గవర్నర్‌ జనరల్‌కు కట్టబెట్టింది.

 


* కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్ర శాసనసభ (సెంట్రల్‌ లెజిస్లేచర్‌), రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రాల శాసనసభలు (ప్రొవిన్షియల్‌ లెజిస్లేచర్‌) చట్టాలను చేస్తాయి. ఇక ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర శాసనసభలు చట్టాలను చేయవచ్చు. ఈ విధంగా రూపొందించిన కేంద్ర, రాష్ట్రాల చట్టాల మధ్య వైరుధ్యం ఉంటే కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది. 

 


* కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక ఫెడరల్‌ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల శాసనసభలను ద్విశాసన సభలుగా రూపొందించింది. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్‌ల నియంత్రణలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని (అటానమీ) కల్పించింది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. 

 


* భారత ప్రభుత్వ చట్టం-1858 ద్వారా భారత రాజ్య కార్యదర్శికి సలహాలను ఇవ్వడానికి లండన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా కౌన్సిల్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ చట్టానికి జాతీయోద్యమ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. 

 


* భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగంలోని అనేక అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించింది. 

 


భారత ప్రభుత్వ చట్టం-1935 కింద ఎన్నికలు: బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాల్లో ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ వివరణాత్మకమైంది, సుదీర్ఘమైంది. 1937, ఏప్రిల్‌ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కానీ ఈ చట్టంలోని సమాఖ్య వ్యవస్థ ఆచరణలోకి రాలేదు. రాష్ట్రాలకు సంబంధించిన భాగం మాత్రమే అమలైంది. ఈ చట్టం ప్రకారం 1937లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ముస్లింలీగ్‌ అతికష్టం మీద ఇతర పార్టీల సహాయంతో రెండు రాష్ట్రాల్లో గెలిచింది. అధిక సంఖ్యాక ప్రజలు కాంగ్రెస్‌ను బలపరుస్తున్నారని తేటతెల్లం కావడం ఆ పార్టీకి మింగుడు పడలేదు.* ఈ చట్టంలో పొందుపరిచిన అత్యంత ముఖ్యమైన అంశం ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తి’. దీని ద్వారానే మొదటిసారిగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పాలనాంశాలన్నింటినీ మంత్రుల అధికార పరిధిలోకి బదిలీ చేశారు. రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణ చాలా వరకు తగ్గింది. గవర్నర్లను రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన అధిపతులుగా పరిగణించారు. బొంబాయి, మద్రాసు, సెంట్రల్‌ ప్రావిన్స్, ఒరిస్సా, యునైటెడ్‌ ప్రావిన్స్, బిహార్, వాయవ్య సరిహద్దు రాష్ట్రం, అస్సాంలలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు కొలువుతీరాయి. ఈ ప్రభుత్వాలు తమకున్న పరిధిలో ప్రజల స్థితిగతులు మార్చడానికి, పౌర హక్కులు కల్పించడానికి కృషి చేశాయి. పత్రికలపై ఆంక్షల తొలగింపు, కొన్ని సంస్థలపై బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన బహిష్కరణలను ఎత్తివేయడంతో పాటు రాజకీయ ఖైదీలను విడుదల చేశాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించి ప్రజానుకూల శాసనాలను తీసుకొచ్చాయి. ఖాదీని ప్రోత్సహిస్తూ హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టాయి. పారిశ్రామికవేత్తలు, కార్మికుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పాయి. మంత్రులు వేతనాలు, ఖర్చులను తగ్గించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు నిజాయతీతో వ్యవహరించిన కాంగ్రెస్‌ మంత్రివర్గాలు ప్రజాసేవలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి.

 


రెండో ప్రపంచ యుద్ధం

 
  జర్మనీ నియంత హిట్లర్‌ రాజ్య విస్తరణ కాంక్షతో పోలెండ్‌పై యుద్ధం ప్రకటించడంతో 1939, సెప్టెంబరులో రెండో ప్రపంచ సంగ్రామం మొదలైంది. బ్రిటన్, ఫ్రాన్స్‌లు పోలెండ్‌కు మద్దతుగా జర్మనీతో తలపడాల్సి వచ్చింది. జర్మనీ, ఇటలీ, జపాన్‌ ఒక వైపు; బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా మరో వైపు యుద్ధానికి దిగాయి.  మన జాతీయ నాయకులు, కేంద్ర శాసనసభ సభ్యులెవరినీ సంప్రదించకుండానే బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి దింపింది. నాజీ, ఫాసిస్ట్‌ వంటి ప్రపంచ నియంతృత్వ శక్తులతో పోరాటానికి కాంగ్రెస్‌ నాయకులు సుముఖంగానే ఉన్నప్పటికీ, భారతదేశంలో బ్రిటన్‌ అవలంబిస్తున్న పద్ధతుల పట్ల విముఖత చూపారు. దేశంలో రాజ్యాంగబద్ధ అసెంబ్లీ, కేంద్రంలో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు వంటి కనీస షరతులను ఆమోదిస్తేనే బ్రిటన్‌ యుద్ధ ప్రయత్నాలకు సహకరిస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనలను రాజప్రతినిధి లిన్‌లిత్‌గో తోసిపుచ్చాడు. ఈ ఏకపక్ష ధోరణికి నిరసనగా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. మరోవైపు మహమ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలోని ఇండియన్‌ ముస్లింలీగ్‌ మాత్రం బ్రిటిష్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపింది. 1939, డిసెంబరు 22ను ముస్లింలీగ్‌ ‘విమోచన దినం’గా నిర్వహించింది.

 


ప్రత్యేక పాకిస్థాన్‌ డిమాండ్‌ 


  రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రాజీనామా చేయడంతో వైస్రాయ్‌ వైఖరిలో మార్పు వచ్చింది. ముస్లిం లీగ్‌ వైపు మొగ్గు చూపుతూ, దాని డిమాండ్లను బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రారంభించింది. దాంతో కాంగ్రెస్‌కు బద్ధ శత్రువుగా ముస్లింలీగ్‌ మారింది. 1940, మార్చిలో లాహోర్‌లో జరిగిన ముస్లింలీగ్‌ సమావేశంలో హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులు అనే ఒక అశాస్త్రీయ సిద్ధాంతాన్ని జిన్నా ప్రచారం చేశాడు. ఈ సమావేశంలోనే ముస్లింలీగ్‌ మొదటిసారిగా ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం ‘పాకిస్థాన్‌’ కావాలని తీర్మానం జరిగింది. యుద్ధ కాలంలో భారతదేశ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. రెండో ప్రపంచ సంగ్రామం హోరుగా సాగుతున్న సమయంలోనే, ఐరోపా వలస రాజ్యాల్లో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికి ప్రజా పోరాటాలు పుంజుకున్నాయి. ఆ విధంగా రెండో ప్రపంచ యుద్ధం భారతదేశంలో తదుపరి స్వాతంత్య్ర పోరాట గతిని అనూహ్యంగా మార్చేసింది.

 


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం
 

Posted Date : 08-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారత రాజకీయాలు ఆగస్టు ఆఫర్‌ (1940), క్రిప్స్‌ మిషన్‌ (1942)

 దిగివచ్చిన తెల్లదొరలు!

 


బ్రిటిష్‌ సామ్రాజ్య ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిన రెండో ప్రపంచ యుద్ధం భారతీయులకు మంచి అవకాశాన్ని అందించింది. ముప్పు ముంచుకు రావడంతో మన నాయకుల మద్దతు కోసం తెల్లవారు దిగివచ్చారు. రాజ్యాంగాన్ని స్వయంగా రాసుకునే హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వయం ప్రతిపత్తికి ఒప్పుకున్నారు. కానీ పూర్తి అధికారాలను బదిలీ చేయడానికి అంతగా ఇష్టపడని ఆంగ్లేయులు చేసిన ప్రతిపాదనలు, రాయబారాలు ఆఖరికి విఫలమయ్యాయి. కానీ ఈ పరిణామాలన్నీ ప్రజల్లో జాతీయ భావం, స్వరాజ్య సంకల్పం మరింత పటిష్ఠమయ్యేందుకు దోహదపడ్డాయి. మరో మహోద్యమానికి అందరూ సంసిద్ధులయ్యేందుకు సాయపడ్డాయి.

 

జర్మనీ నాజీ నియంత హిట్లర్‌ సామ్రాజ్యకాంక్ష రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. జర్మనీ, జపాన్, ఇటలీ, హంగేరీ, రొమేనియా, బల్గేరియా లాంటి దేశాలు అక్ష రాజ్య కూటమిగా; బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాలు మిత్ర రాజ్య కూటమిగా యుద్ధంలో హోరాహోరీగా తలపడ్డాయి. జాతీయ కాంగ్రెస్‌తో లేదా కేంద్ర శాసనసభకు ఎంపికైన సభ్యులతో కనీసం సంప్రదించకుండా యుద్ధంలో బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం భాగస్వామి కావడాన్ని భారతీయులు వ్యతిరేకించారు. తదనంతర పరిణామాల్లో బ్రిటన్‌ యుద్ధ చర్యలను వ్యతిరేకిస్తూ, బ్రిటిష్‌ ఇండియా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాజీనామాలు చేశాయి. ఐరోపా, ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి భారతీయుల సహాయ సహకారాలు అత్యంత అవసరమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లండ్‌ క్లిష్ట పరిస్థితిని గమనించిన భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. యుద్ధ లక్ష్యాలను బ్రిటన్‌ స్పష్టంగా ప్రకటించాలని, కేంద్రంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం తొలుత ఉదాసీనంగా ఉన్నప్పటికీ, తర్వాత పరిస్థితులు మారిపోవడంతో భారతీయుల సహకారం కోసం నాటి వైస్రాయ్‌ లార్డ్‌ లిన్‌లిత్‌ గో ద్వారా 1940, ఆగస్టు 8న ఒక ప్రకటన చేయించింది. దీనినే ఆగస్టు ప్రతిపాదన (ఆగస్టు ఆఫర్‌) అంటారు.


ఆగస్టు ప్రతిపాదన ముఖ్యాంశాలు: * జాతి జీవన పోరాటంలో నిమగ్నమై ఉన్న సమయంలో రాజ్యాంగ సమస్యలు పరిష్కారం కావని, యుద్ధానంతరం భారతీయులు తమ ఆశయాలు, ఆశలకు అనుగుణంగా రాజ్యాంగ రచన చేసుకునే విధంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

* అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలకు భంగం కలిగించే లేదా వారు అంగీకరించని అంశాలతో కూడిన ఏ రాజ్యాంగమైనా బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఆమోదనీయం కాదని ప్రకటించారు. 

* యుద్ధానంతరం భారతదేశానికి డొమినియన్‌ ప్రతిపత్తి కల్పిస్తూ ఒక బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

* యుద్ధ సమయంలో తాత్కాలిక చర్యగా రాజప్రతినిధి (వైస్రాయ్‌) కార్యనిర్వహణ మండలిలో భారతీయ ప్రతినిధులకు అవకాశం కల్పిస్తారు.
* యుద్ధకాలంలో బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల ప్రతినిధులతో కూడిన ఒక యుద్ధ సలహా మండలి ఏర్పాటవుతుంది.


ఆగస్టు ప్రతిపాదన విశిష్టత: మొదటిసారిగా భారతీయులకు తమ రాజ్యాంగాన్ని రాసుకునే హక్కు కల్పించింది. కానీ ఈ ప్రతిపాదనలు భారతీయుల ప్రధాన డిమాండ్‌ అయిన స్వయంపాలనను నెరవేర్చలేదు. అల్పసంఖ్యాక వర్గాల పట్ల శ్రద్ధ పేరుతో, భారతీయులకు అధికార బదిలీ నిలుపుదల చేసే అంతరార్థం వ్యక్తమైంది. ఈ ప్రతిపాదనలు అధిక సంఖ్యాక భారతీయులకు ఆశాభంగం కలిగించాయి. దాంతో వైస్రాయ్‌ ప్రతిపాదనలను జాతీయ కాంగ్రెస్‌ తిరస్కరించింది.


రెండో ప్రపంచ యుద్ధ పురోగతి: ఐరోపా యుద్ధరంగంలో హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ కూటమి రెచ్చిపోయింది. పశ్చిమ దేశాల్లో అనూహ్య విజయాలు సాధించింది. ఫ్రాన్స్‌ ఉత్తర, ఆగ్నేయ ప్రాంతాలను ఆక్రమించింది. రష్యాపై దాడి చేసింది. తూర్పు యూరప్‌ రాజ్యాలు హిట్లర్‌కు లొంగిపోయాయి. ఆసియా యుద్ధరంగంలో జపాన్‌ వీరవిహారం చేసింది. ఆగ్నేయాసియాలోని బ్రిటన్‌ వలస రాజ్యాలైన ఫిలిప్పీన్స్, ఇండోచైనా, ఇండొనేసియా, మలేసియాలను ఒక్కొక్కటిగా జపాన్‌ సైన్యం ఆక్రమించి, బర్మాలోకి ప్రవేశించింది. యుద్ధం దాదాపు భారతదేశపు ముంగిట్లోకి వచ్చేసింది. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యానికి అంతిమ ఘడియలు సమీపించాయని ఆందోళన కలిగించింది. పెర్ల్‌ హార్బర్‌ దీవుల్లో అమెరికా నౌకా శ్రేణిపై జపాన్‌ మెరుపుదాడి చేసింది. ఈ పరిణామాలు బ్రిటన్, దాని మిత్ర రాజ్యాలకు మింగుడు పడలేదు. జపాన్‌ సేనల విజృంభణను నిలువరించేందుకు భారతీయుల సహకారం అవసరమని అమెరికా, రష్యా భావించాయి. దాంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్‌ భారతదేశంలో రాజకీయ సంస్కరణల కోసం బ్రిటిష్‌ ప్రధాని చర్చిల్‌పై ఒత్తిడి తెచ్చాడు. బ్రిటిష్‌ ఇండియా అభివృద్ధి నిరోధక రాజకీయాలకు విన్‌స్టన్‌ చర్చిల్‌ మద్దతు, ప్రోత్సాహం ఉండేవి. కానీ యుద్ధకాలం నాటి స్థితి భిన్నంగా ఉంది. భారత్‌లో ప్రజాభిప్రాయాన్ని తమకు అనువుగా మలుచుకోవడానికి బ్రిటిషర్లు కొన్ని సానుకూల చర్యలు చేపట్టక తప్పలేదు. అందులో భాగమే సర్‌ స్టాఫోర్డ్‌ క్రిప్స్‌ రాయబారం (1942).


క్రిప్స్‌ మిషన్‌: భారత నాయకులతో సంప్రదింపులు జరపడానికి బ్రిటన్‌ ప్రభుత్వం క్రిప్స్‌ను రాయబారిగా పంపింది. 1942, మార్చిలో అతడు సంప్రదింపులు ప్రారంభించాడు. కాంగ్రెస్‌ తరఫున జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు.


క్రిప్స్‌ ప్రతిపాదనలు: * యుద్ధానంతరం భారతదేశానికి డొమినియన్‌ ప్రతిపత్తి కల్పిస్తారు. భారత్‌కు కామన్‌వెల్త్‌ నుంచి వైదొలిగే హక్కు కూడా ఉంటుంది.

* యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగం రూపొందించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది. 

* కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి సిద్ధపడని రాష్ట్రాలు లేదా రాష్ట్రం వేరే యూనియన్‌గా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. స్వదేశీ సంస్థానాలకు కూడా కొత్త రాజ్యాంగానికి కట్టుబడి ఉండటానికి, లేకపోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. 

* బ్రిటిష్‌ ప్రభుత్వం పూర్తి అధికారాన్ని బదిలీ చేయడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను చర్చించడానికి రాజ్యాంగ పరిషత్తు, బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక  ఒప్పందం కుదుర్చుకోవాలి.

* నూతన రాజ్యాంగం సిద్ధమయ్యే లోపు తాత్కాలికంగా దేశ రక్షణ విషయాలపై బ్రిటిష్‌ ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. వైస్రాయ్‌ అధికారాలు యథాతథంగా ఉంటాయి.


క్రిప్స్‌ ప్రతిపాదనల్లో డొమినియన్‌ ప్రతిపత్తి కల్పించి భారత యూనియన్‌ ఏర్పాటు చేయడం, కామన్‌వెల్త్‌ నుంచి విడిపోయే హక్కు ఉండటం మంచి విషయాలే. కానీ భారత యూనియన్‌ నుంచి బ్రిటిష్‌ రాష్ట్రాలు, స్వదేశీ సంస్థానాలు విడిపోయే అవకాశం ఇవ్వడం ప్రమాదకర అంశం. వివిధ భారతీయ ప్రతినిధుల ప్రాతినిధ్యంతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకావాలని, దాని రాజ్యాంగబద్ధ అధిపతిగా మాత్రమే రాజప్రతినిధి ఉండాలనేది భారతీయుల కోరిక. అందుకే కాంగ్రెస్‌ ఈ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.  ప్రత్యేక పాకిస్థాన్‌ గురించి స్పష్టత లేదంటూ ముస్లింలీగ్‌ కూడా వ్యతిరేకించింది. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా వివిధ కారణాలతో అసంతృప్తిని వెల్లడించాయి. క్రిప్స్‌ ప్రతిపాదనలను ‘పతనం అవుతున్న బ్యాంకు పేరిట అనంతర తేదీతో ఇచ్చిన బ్యాంకు చెక్కు వంటిది’ అని గాంధీ విమర్శించారు. భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయడానికి బ్రిటిషర్లలో ఉన్న తీవ్ర అయిష్టతే క్రిప్స్‌ ప్రతిపాదనలు, అతడి రాయబారం విఫలమవడానికి ప్రధాన కారణం.


రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1940 ఆగస్టు ప్రతిపాదనలు, 1942 క్రిప్స్‌ ప్రతిపాదనలు విఫలం కావడంతో భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి, నైరాశ్యం ఆవహించాయి. ఇంతలోనే ప్రపంచ యుద్ధం భారతదేశం గుమ్మం వరకు చేరింది. భారతీయులు తమకు శత్రువులు కాదని, అక్కడున్న ఆంగ్లేయులే తమ లక్ష్యమని జపాన్‌ స్పష్టం చేసింది. ఇలాంటి స్థితిలో మన దేశానికి యుద్ధ ప్రమాదం తప్పించాలంటే బ్రిటిషర్లు భారత్‌ నుంచి వెళ్లిపోవాలని గాంధీజీ తన ‘హరిజన్‌’ పత్రికలో రాశారు. భారత జాతీయోద్యమంలో మరో చారిత్రాత్మక ఘట్టం ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమానికి నాంది పలికారు.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 20-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

క్విట్‌ ఇండియా ఉద్యమం (1942)

ప్రజలే సారథులై.. పోరాట యోధులై!


 

రెండో ప్రపంచ యుద్ధం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. అది తప్పిపోవాలంటే ఆంగ్లేయులు దేశాన్ని వదిలి వెళ్లాలని గాంధీజీ డిమాండ్‌ చేశారు. అప్పటికే ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ‘విజయమో.. వీర స్వర్గమో’ అంటూ మహాత్ముడు ఇచ్చిన పిలుపుతో మరింత విజృంభించారు. అప్రమత్తమైన బ్రిటిష్‌ ప్రభుత్వం నేతలందరినీ అరెస్టు చేసింది. అయినా జనంలో రగిలే అసంతృప్తి జ్వాలలు ఆరలేదు, అదుపులోకి రాలేదు. నింôకుశ నిర్బంధాలను ధిక్కరించి, నాయకత్వం లేకపోయినా ప్రజలే సారథులై, పోరాట యోధులై పెద్ద ఎత్తున ఉద్యమించారు. క్విట్‌ ఇండియా నినాదం దేశమంతా మారుమోగింది. అణచివేతకు ప్రభుత్వం ప్రజలపై దమనకాండను సాగించింది. తిరగబడిన ఉద్యమకారులు సర్కారు ఆస్తులను ధ్వంసం చేశారు. యుద్ధం ఆగిపోవడంతో ఉద్యమం ఉద్ధృతి తగ్గింది. కానీ సంపూర్ణ స్వాతంత్య్రమే భారతీయుల ఉక్కు సంకల్పమనే వాస్తవం తెల్లవారి తలకెక్కింది. 

 

దేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో క్విట్‌ ఇండియా ఉద్యమం జాతికి స్ఫూర్తినిచ్చిన మహోజ్వల ఘట్టం. 1942, ఆగస్టులో గాంధీ ఈ ఉద్యమానికి పిలుపునివ్వడానికి అనేక పరిస్థితులు ప్రేరేపించాయి. తక్షణం అధికార బదిలీ జరగాలనే కాంగ్రెస్‌ డిమాండ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నిరాకరించింది. రాజకీయ సంస్కరణల కోసం భారత నాయకులతో సంప్రదింపులు సాగించిన అనంతరం క్రిప్స్‌ చేసిన ప్రతిపాదనలు భారతీయులను మెప్పించలేకపోయాయి. క్రిప్స్‌ రాయబారం విఫలమైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దేశంలో ఆహార పదార్థాల కృత్రిమ కొరత ఏర్పడింది. ధరలు ఆకాశాన్నంటాయి. కష్టకాలంలో ప్రభుత్వం వహించిన నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజాజీవితం దుర్భరంగా మారింది. మరోవైపు యుద్ధంలో అక్షరాజ్య కూటమి తరఫున జపాన్‌ సైన్యం ఆసియా ఖండంలో విజృంభించింది. ఆంగ్లేయులను మలయా, సింగపూర్, బర్మాల నుంచి తరిమేసి బంగాళాఖాతంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జపాన్‌ సైన్యం భారత్‌ పొరుగు దేశమైన అప్పటి బర్మాలోకి ప్రవేశించింది. ఆ యుద్ధాగ్ని జ్వాలలు భారతదేశాన్నీ తాక వచ్చనే భయం ప్రజల్లో వ్యాపించింది.

 

1942లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను, ప్రజల ఆగ్రహావేశాలను గాంధీ గ్రహించారు. భారతదేశం సురక్షితంగా ఉండాలంటే బ్రిటిషర్లు ఈ దేశాన్ని వదిలివెళ్లడం ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వానికి తన ‘హరిజన’ పత్రిక ద్వారా సూచించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 1942, జులై 14న వార్దాలో సమావేశమై ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చించి ‘క్విట్‌ ఇండియా’ తీర్మానాన్ని ఆమోదించింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై ఆ తీర్మానాన్ని ధ్రువీకరించింది. అహింసాయుతంగా, గాంధీ నాయకత్వంలో పోరాడాల్సిందిగా ఈ తీర్మానం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ప్రభుత్వం దమననీతికి పాల్పడి ఉద్యమ నాయకులను అరెస్ట్‌ చేస్తే, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రగాఢంగా కోరుకునే ప్రతి భారతీయుడు ఉద్యమస్ఫూర్తితో స్వయంగా కార్యక్రమం రూపొందించుకోవాలని కోరింది.


   బొంబాయిలోని గోవలియ ట్యాంక్‌ మైదానంలో (క్రాంతి మైదానం) ఆగస్టు 8న గాంధీజీ ఉపన్యసిస్తూ స్వాతంత్య్రానికి తక్కువైంది ఏదీ అంగీకరించడం కుదరదని స్పష్టం చేశారు. దానికోసం ఒక మంత్రం ఉపదేశించారు. అదే ‘విజయమో.. వీరస్వర్గమో’ (డూ ఆర్‌ డై), దేశాన్ని విముక్తి చేయడమో లేదా ఆ ప్రయత్నంలో మరణించడమో ఏదో ఒకటి జరగాలని ఉద్వేగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటిష్‌ ప్రభుత్వ ఆజ్ఞలను అహింసాయుతంగా ధిక్కరించాలని చెప్పారు. అయితే ఈ ఉద్యమ నిర్వహణ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అప్పటికి ఇంకా ఖరారు చేయలేదు. క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఫార్వర్డ్‌ బ్లాక్, జయప్రకాష్‌ నారాయణ్, అచ్యుత్‌ పట్వార్దన్, రామ్‌ మనోహర్‌ లోహియా మొదలైనవారు స్థాపించిన కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ వంటి రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఇండియన్‌ ముస్లింలీగ్, కమ్యూనిస్ట్‌ పార్టీ ఉద్యమంలో పాల్గొనలేదు. తర్వాత ముస్లింలీగ్‌ ‘డివైడ్‌ అండ్‌ క్విట్‌’ అని డిమాండ్‌ చేసింది.


ప్రభుత్వ చర్య: బొంబాయిలో కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా తీర్మానం చేసిన వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్‌ని నిషేధించింది. అదే రోజు రాత్రి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులపై విరుచుకుపడి 24 గంటల్లోనే దాదాపుగా అందరినీ నిర్బంధించింది. గాంధీజీతో పాటు కస్తూరిబా గాంధీని అరెస్ట్‌ చేసి పూనాలోని ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో నిర్బంధించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా ఆజాద్, పట్టాభి సీతారామయ్య, ఆచార్య కృపలానీ మొదలైనవారు అహ్మద్‌నగర్‌ కోటలో బందీలయ్యారు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పట్నాలో అరెస్టయ్యారు.


ప్రజా ప్రతిఘటన: 1942, ఆగస్టు 9 నాటికి దాదాపు నాయకులంతా అరెస్టయ్యారు. అప్పటికే బ్రిటిషర్ల నిరంకుశ, అణచివేత విధానాలతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. నిక్షిప్తంగా ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఉద్యమ నాయకులను ప్రభుత్వం నిర్బంధించినా, ప్రజలే ఉద్యమాన్ని నిర్వహించారు. అందుకే క్విట్‌ ఇండియా గొప్ప ప్రజా ఉద్యమంగా మారింది. అయితే ప్రజల ముందు ఒక స్పష్టమైన అజెండా లేదు. గాంధీ జైలులో నిర్బంధంలో ఉండటంతో ఎలాంటి మార్గదర్శకత్వం చేయలేకపోయారు. తొలి దశలో చాలాచోట్ల నిరసనలు, హర్తాళ్లు, శాంతియుత సమావేశాలు నిర్వహించారు. దిల్లీ, బొంబాయి, కాన్పుర్, లఖ్‌నవూ, నాగ్‌పుర్, బెంగళూరు, మద్రాసు, అహ్మదాబాద్‌ లాంటి ప్రముఖ నగరాలు, పట్టణాల్లో మహిళలు, విద్యార్థులు, కార్మికులు, మధ్యతరగతి వారు, చేతివృత్తులవారు క్విట్‌ ఇండియా నినాదంతో నిరసన ప్రదర్శనలు చేశారు. పోలీసులతో, సైన్యంతో ఘర్షణకు దిగారు. ఉద్యమానికి బొంబాయి కేంద్రంగా మారింది. దేశంలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా ఉక్కు కార్మికులు జాతీయ ప్రభుత్వం ఏర్పడే వరకు విధుల్లో చేరేది లేదంటూ సమ్మె చేశారు. ప్రజాజీవనం స్తంభించింది. క్విట్‌ ఇండియా ఒక్కటే ఉద్యమకారులందరి డిమాండ్‌గా మారింది.


ప్రభుత్వ చర్య - ప్రతిచర్య: ప్రభుత్వం ఈ ప్రజా ఉద్యమాన్ని బలప్రయోగంతో అణచివేయాలని నిశ్చయించింది. అరెస్టులు, జరిమానాలు, ప్రజల వ్యక్తిగత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, లాఠీఛార్జీలు, నిరాయుధులపై కాల్పులు జరపడం ఈ ఉద్యమకాలంలో నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ దమనకాండ ప్రజల ఆగ్రహావేశాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. హింసకు ప్రతిహింసను సృష్టించింది. ఉద్యమం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. విద్యార్థులు విద్యాసంస్థలను బహిష్కరించారు. కార్మికులు, స్త్రీలు, చేతివృత్తులవారు రోడ్డుపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ప్రభుత్వ ఆస్తులు వారి లక్ష్యమయ్యాయి. టెలిగ్రాఫ్‌ లైన్‌లు తెగిపడ్డాయి. రైల్వే లైన్‌లు ధ్వంసమయ్యాయి. పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు తగలబడ్డాయి. ఉద్యమకారులకు కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ నాయకులు అరుణా అసఫ్‌ అలీ, అచ్యుత్‌ పట్వార్దన్, జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితరులు తెరచాటు సహాయం అందించారు. విప్లవభావాలతో ఉన్న నాయకులు మిడ్నపూర్‌లోని తామ్రలుక్, మహారాష్ట్రలోని సతారా, ఒరిస్సాలోని తాల్చేరు లాంటి చోట్ల రహస్య పోటీ ప్రభుత్వాలను ఏర్పాటుచేశారు. ఉద్యమం ప్రారంభమైన మూడు నెలల్లో బ్రిటిష్‌ ప్రభుత్వం క్రూర విధానాలతో అణగదొక్కింది. యథావిధిగా సమాజంలోని ఉన్నత వర్గాలు, అధికార గణం ప్రభుత్వానికి విధేయులుగా మిగిలారు. ప్రభుత్వ హింసాకాండ తారస్థాయికి చేరింది. అధికారిక లెక్కల ప్రకారం 10 వేల మందికి పైగా కాల్పుల్లో మరణించగా, 60 వేలకు పైగా అరెస్టయ్యారు. ఈ ఉద్యమంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ప్రభుత్వం గాంధీని నిందించింది. దీంతో ఆయన తన ఆత్మశుద్ధికి 21 రోజులు నిరాహార దీక్ష చేశారు. తర్వాత గాంధీజీ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. యుద్ధంలో మిత్ర రాజ్యాల విజయం వల్ల ఉద్యమం ఉద్ధృతి తగ్గింది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి మూలకారణమైన రెండో ప్రపంచ యుద్ధం, దాని ప్రధాన కారకుడైన హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో పరిసమాప్తమైంది.

 

ఉద్యమ ప్రాముఖ్యం: ఉద్యమ ప్రారంభంలోనే ప్రముఖ నాయకులంతా అరెస్ట్‌ అయినప్పటికీ ప్రజలే ఉద్యమానికి నాయకత్వం వహించి దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమేనని ప్రభుత్వానికి చాటారు. ఈ మహా ప్రజాఉద్యమాన్ని ప్రభుత్వం నిరంకుశ విధానాలతో అణచివేసినప్పటికీ, ప్రజల్లో గొప్ప రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. కాంగ్రెస్‌ విధానాల పట్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసం ఏర్పడింది. చిరకాలంగా ప్రభుత్వ ఎజెండాగా ఉన్న ‘డొమినియన్‌ ప్రతిపత్తి’ ఆగస్టు ఉద్యమంలో ఆహుతైంది. ప్రజల నినాదమైన సంపూర్ణ స్వాతంత్య్రం తప్ప మరేదీ అంగీకారం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. ఉవ్వెత్తున ఎగసిన తిరుగుబాటు పాలకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది.స్వాతంత్య్రాన్ని భారతదేశ గుమ్మంలోకి తీసుకొచ్చింది.

 

నోట్‌: క్విట్‌ ఇండియా నినాదాన్ని మొదటిసారి రూపొందించినవారు యూసుఫ్‌ మెహర్‌ అలీ. ఈయన 1942 నాటి బొంబాయి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 04-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బోస్‌ ప్రత్యక్ష పోరాటం (సుభాష్‌ చంద్రబోస్‌ - భారత జాతీయ సైన్యం)

 సాహసవీరుడి స్వతంత్ర సమరం!

నేతాజీ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతుంది. జాతి మొత్తం పులకిస్తుంది. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరి, ఆయన నిర్ణయాలతోనే నిర్మొహమాటంగా విభేదించి బోస్‌ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి, స్వతంత్ర భారతావని ఒక్కటే మనకు స్వర్గమని చాటి, ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకొని ఆంగ్లేయులతో యద్ధం చేశాడు. ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. ఎనిమిది దేశాల గుర్తింపు పొందిన సమాంతర భారత ప్రభుత్వాన్ని స్థాపించాడు. దేశ స్వాతంత్య్ర సమరాన్ని అంతర్జాతీయ వేదికలకు చేర్చి, బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేశాడు. ఆయన సాహసాలు, తెగింపు, త్యాగాలు దేశ ప్రజల్లో స్వాతంత్య్రకాంక్షను తీవ్రంగా రగిలించాయి. ప్రతి పోటీ పరీక్షలో ప్రశ్నలుగా వచ్చే ఈ అధ్యాయంపై అభ్యర్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 

పరాయి పాలనలో మగ్గుతున్న భారతమాత దాస్యశృంఖలాలను తెంచడానికి సాయుధ పోరాటమే ఉత్తమ మార్గమని సిద్ధాంతీకరించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌. విజయసాధన కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తియుక్తులను, సర్వస్వాన్ని ఫణంగా పెట్టిన త్యాగశీలి. ఉన్నత విద్యావంతుడైన బోస్, చిత్తరంజన్‌ దాస్‌ స్థాపించిన బెంగాల్‌ జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా, కలకత్తా నగర మేయర్‌గా విధులు నిర్వర్తించాడు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చాడు.

సుభాష్‌ చంద్రబోస్‌ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైన చిత్తరంజన్‌ దాస్‌ ప్రభావితం చేశారు. 1921లో బ్రిటన్‌ వేల్స్‌ రాకుమారుడి భారతదేశ పర్యటనను నిరసిస్తూ బోస్‌ ప్రదర్శనలు నిర్వహించాడు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నిర్భయంగా వ్యవహరించేవాడు. చౌరిచౌరాలో జరిగిన ఒక హింసాయుత సంఘటన నేపథ్యంలో గాంధీజీ 1922, ఫిబ్రవరి 5న ఉద్ధృతంగా సాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపేశారు. ఆ నిర్ణయాన్ని బోస్‌ తప్పుబట్టాడు. ఉద్యమాన్ని నిలిపేయడాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించాడు. ఆ తర్వాత చిత్తరంజన్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ స్వరాజ్య పార్టీ (1922) స్థాపన, దాని నిర్వహణలో సహాయం అందించాడు. 1935 భారత ప్రభుత్వ చట్టం పట్ల కూడా విముఖత వ్యక్తం చేశాడు. అలాంటి చర్యలను ఆమోదిస్తే స్వాతంత్య్ర పోరాట స్వభావంలో ఏ అభివృద్ధి ఉండదని స్పష్టం చేశాడు.

1938లో భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన (ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు) గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో ఉన్న హరిపురా గ్రామంలో జరిగింది. అందులో ఆయన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని లోపభూయిష్టమైన ఫెడరల్‌ వ్యవస్థతో పాటు ఇంకా అనేక అంశాలను విమర్శించాడు. స్వదేశీ సంస్థానాలతో సహా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్ర సాధనే లక్ష్యమని ఆ సమావేశం ఉద్ఘాటించింది. 1939లో నేటి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పుర్‌ జిల్లా త్రిపురిలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశ అధ్యక్ష పదవికి బోస్‌ పోటీ చేశాడు. గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్యపై విజయం సాధించి, కాంగ్రెస్‌లో తన పలుకుబడి నిరూపించుకున్నాడు. తర్వాత గాంధీజీతో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించాడు. అది కాంగ్రెస్‌లోనే అంతర్భాగంగా పనిచేస్తుందని ప్రకటించాడు. 1940లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ మహాసభ నాగ్‌పుర్‌లో జరిగింది. 

రెండో ప్రపంచ యుద్ధం: 1939 చివర్లో యుద్ధం ప్రారంభమైంది. గాంధీజీ బోధించిన అహింసాయుత విధానాల పట్ల కొంతమంది నాయకుల్లో భ్రమలు తొలగిపోవడం మొదలైంది. స్వాతంత్య్ర సాధనకు సాయుధ పోరాటమే మార్గమని, అవసరమైతే విదేశీ సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. వారిలో సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు. యుద్ధకాలంలో ఆయన దేశమంతా పర్యటించాడు. గాంధీజీ అహింసా విధానం, నెహ్రూ మిత్ర రాజ్యాల కూటమి అనుకూల విధాన భావనలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని, వలసవాద విధానాలను బహిరంగంగా విమర్శించాడు. యుద్ధ ప్రక్రియలో బ్రిటిషర్లకు, భారతీయులు సహకరించకూడదని సూచించాడు. దేశప్రజలకు తీవ్రవాద సిద్ధాంతాలు నూరిపోస్తున్నాడనే నెపంతో 1940లో ప్రభుత్వం బోస్‌ను అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత విడుదల చేసి గృహనిర్బంధంలో ఉంచింది. స్వాతంత్య్ర పిపాసకుడైన బోస్‌ 1941లో గృహనిర్బంధం నుంచి చాకచక్యంగా తప్పించుకొని పెషావర్, కాబూల్‌ మీదుగా జర్మన్‌ నగరం బెర్లిన్‌ చేరాడు. రెండో ప్రపంచయుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ వ్యతిరేకులైన హిట్లర్, రిబ్బన్‌ ట్రాప్‌ లాంటి జర్మన్‌ నాయకులతో సంప్రదింపులు జరిపి సహాయం కోరాడు. బెర్లిన్‌ రేడియో ద్వారా భారతీయులకు సందేశం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. జర్మనీ నుంచి ఆశించినంత సహాయం లభించకపోవడంతో అక్కడి నుంచి జపాన్‌ చేరాడు.


జపాన్‌లో బోస్‌: అగ్రరాజ్య కూటమిలో సభ్య దేశమైన జపాన్, జర్మనీ పక్షాన ఆగ్నేయాసియాలో రెండో ప్రపంచ యుద్ధంలో వీరవిహారం చేసింది. ఆ దేశ సేనల ధాటికి బ్రిటిష్‌ వలస రాజ్య సైన్యాలు విలవిలలాడాయి. జపాన్‌ సైన్యం మలయాలో బ్రిటిష్‌ సైన్యాన్ని ఓడించింది. భారత బ్రిటిష్‌ సైన్యాధికారి కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ జపాన్‌ సైన్యానికి తలవంచాడు. అతడితో పాటు లొంగిపోయిన భారత-బ్రిటిష్‌ సైనికులు యుద్ధఖైదీలయ్యారు. ఈ భారతీయ యుద్ధఖైదీలు సహా కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ను ఒప్పించి, అతడి నేతృత్వంలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి 1942లో ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని జపాన్‌ సైనికాధికారులు ఏర్పాటు చేశారు. భారతీయ విప్లవ పోరాట నాయకుడు రాస్‌ బిహారీ బోస్‌ అప్పటికే జపాన్‌ నగరం టోక్యోలో ఉన్నాడు. జపనీయుల మద్దతుతో సైన్యాన్ని సిద్ధం చేయడంలో సాయం చేశాడు. ‘ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌’ను స్థాపించి, దానికి నాయకత్వం వహించాల్సిందిగా రాస్‌ బిహారీని కోరారు. ఆగ్నేయాసియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా మాతృదేశ దాస్య విముక్తి కోసం ఆయనకు మద్దతు తెలిపారు. అన్నివిధాలుగా ఆగ్నేయాసియా తన కార్యకలాపాలకు అనువుగా ఉందని రాస్‌ బిహారీ భావించాడు. భారత జాతీయ సేన, జపాన్‌ ప్రభుత్వాల ద్వారా భారత స్వాతంత్య్ర పోరాటానికి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు సాధించే బాధ్యత తీసుకున్నాడు. ఆ సమయంలో జపాన్‌కు చేరిన సుభాష్‌ చంద్రబోస్, అక్కడి ప్రధాని టోజో, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు. టోజో ప్రోత్సాహం లభించింది. ఇదంతా సొంత వ్యక్తిత్వం, అంతర్జాతీయంగా తన సిద్ధాంతాలకు ఉన్న గౌరవంతోనే నేతాజీ సాధించారు.


భారత జాతీయ సైన్యం: సుభాష్‌ చంద్రబోస్‌కు జపాన్‌ ప్రోత్సాహం లభించడంతో ఆయన 1943, జులైలో రాస్‌ బిహారీ బోస్‌ నుంచి భారత స్వాతంత్య్ర సమితి (ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌) బాధ్యతలను, కెప్టెన్‌ మోహన్‌ సింగ్‌ నుంచి భారత జాతీయ సైన్యం బాధ్యతలను (ఐఎన్‌ఏ) స్వీకరించాడు. ఆ తర్వాత ఐఎన్‌ఏ పేరును ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’గా మార్చాడు. ఈ సైన్యంలోకి ఆగ్నేయాసియాలోని భారతీయులు, మలయా, సింగపూర్, బర్మాలో బందీలుగా ఉన్న భారతీయ సైనికులు చేరారు. భారత జాతీయ సైన్యాన్ని అయిదు రెజిమెంట్లుగా విభజించారు. వాటికి గాంధీ రెజిమెంట్, నెహ్రూ రెజిమెంట్, ఆజాద్‌ రెజిమెంట్, ఝాన్సీ రెజిమెంట్, బోస్‌ రెజిమెంట్‌ అని పేర్లు పెట్టారు. ఝాన్సీ రెజిమెంట్‌కు లక్ష్మీ సెహగల్‌ నాయకత్వం వహించారు. ఆ సైన్యానికి బోస్‌ కఠినమైన శిక్షణ ఇచ్చాడు. ‘నాకు రక్తపు బొట్టు ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని ఉద్రేకపూర్వకంగా ప్రజలను జాతిపోరాటంలో ఉత్తేజితులను చేశాడు.

సుభాస్‌ చంద్రబోస్‌ 1943, అక్టోబరు 21న సింగపూర్‌లో ‘ఆజాద్‌ హింద్‌’ తాత్కాలిక ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటును ప్రకటించాడు. ప్రభుత్వాధినేతగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆర్థికమంత్రిగా ఎ.సి.ఛటర్జీ, ప్రచార సారథిగా ఎస్‌.ఎ.అయ్యర్‌ వ్యవహరించారు. సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా ఎనిమిది దేశాలు అధికారికంగా గుర్తించాయి. ఆ దేశాలన్నీ ఎక్కువగా రెండో ప్రపంచ యుద్ధంలో అక్ష రాజ్య కూటమికి చెందినవే. అప్పటికే తమ అధీనంలో ఉన్న అండమాన్‌ నికోబార్‌ దీవులను బోస్‌ ప్రవాస ప్రభుత్వానికి జపాన్‌ బదిలీ చేసింది. బోస్‌ వాటికి షహీద్‌ దీవులు (అండమాన్‌), స్వరాజ్య దీవులు (నికోబార్‌) అని నామకరణం చేశాడు. తర్వాత నేతాజీ మాతృదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించాడు. సైన్యాన్ని బర్మా వైపు నడిపించాôడు. తన ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని, లీగ్‌ను, భారత జాతీయ సేన కమాండ్‌ను రంగూన్‌కు (బర్మా) తరలించాడు. జపాన్‌ సైనికులతో పాటు బోస్‌ సేన భారతదేశ ఈశాన్య ప్రాంతాలవైపు దూసుకొచ్చింది. మౌడాక్, కోహిమాలను స్వాధీనం చేసుకుంది. కోహిమాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. జపాన్‌ సైన్యం, భారత జాతీయ సైన్యం అప్రతిహతంగా ముందుకు సాగుతున్న సమయంలో ప్రతికూల వాతావరణంతో ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌కు ఎదురైన వ్యతిరేక ఫలితాల ప్రభావం భారత జాతీయ సైన్యంపై పడింది. సైనిక సామగ్రి, మందుగుండు, ఆయుధాలు, నిధులు, ఆహారం సరఫరా నిలిచిపోయాయి. ఇంఫాల్‌ వద్ద భారత జాతీయ సైన్యం ఓటమి చవిచూసింది. 1945లో బోస్‌ జపాన్‌ విమానంలో పైగాస్, ఫార్మోసా మీదుగా టోక్యో బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు జపాన్‌ రేడియో ప్రకటించింది. మహావీరుడిని కోల్పోయిన భారత జాతి దుఃఖసాగరంలో మునిగిపోయింది. సుభాస్‌ చంద్రబోస్‌ రచనల్లో ఒకటి ఇండియన్‌ స్ట్రగుల్‌. అసంపూర్ణంగా ఉన్న ఆయన ఆత్మకథ ‘యాన్‌ ఇండియన్‌ పిలిగ్రిమ్‌’. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో భారత జాతీయ సేనకు ప్రత్యేక స్థానం ఉంది.  దేశ స్వాతంత్య్ర సమస్యను బ్రిటిష్‌ ఇండియా పరిధి దాటించి అంతర్జాతీయ వేదిక మీదకు భారత జాతీయ సేన విజయవంతంగా తీసుకెళ్లింది. భారతదేశ స్వాతంత్య్రాన్ని, బోస్‌ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా ఎనిమిది దేశాలు అధికారికంగా గుర్తించడం గొప్ప పరిణామం. దీనివల్ల బ్రిటిషర్లపై ఒత్తిడి పెరిగింది. భారతదేశ జాతీయసేన మత సామరస్యానికి, భారత జాతి సహజీవనానికి ప్రతీక. భారత జాతీయ సైనికుల వీరోచిత కార్యకలాపాలు, ధైర్యసాహసాలు, త్యాగనిరతి, దేశప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాయి. బ్రిటిష్‌ సైన్యంలోని భారతీయుల వైఖరిలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. దేశ స్వాతంత్య్ర సాధన వేగవంతమైంది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 18-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రైతులు, గిరిజనుల తిరుగుబాట్లు            

ఆధునిక భారతదేశ చరిత్ర

ఆంగ్లేయులపై తిరగబడిన అన్నదాతలు.. అడవి బిడ్డలు!

ఆంగ్లేయులు అడుగు పెట్టడంతోనే భారతదేశంలో అలజడులు మొదలయ్యాయి. సుభిక్షంగా, స్వయంసమృద్ధితో సాగిపోతున్న సమాజం చిన్నాభిన్నమైంది. అరాచక భూమి శిస్తు విధానాలతో అన్నదాతలు అల్లాడిపోయారు. అడవుల్లోకి చొరబడి వనరులు కొల్లగొట్టడంతో గిరిజనుల జీవన విధానం, విశ్వాసాలకు విఘాతం కలిగింది. అడవి బిడ్డలపై వలస పాలకుల అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. దీంతో సంప్రదాయ విధానాల్లో జీవనం సాగించే రైతులు, తెగల ప్రజల్లో విప్లవాత్మక ధోరణులు పెరిగి తిరుబాట్లకు దారితీసింది. బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేసిన ఆ పోరాటాల వివరాలు, నాయకత్వం వహించిన యోధుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


1. రైతులు, గిరిజనుల తిరుగుబాటుకు కారణాలు?

1) రాజకీయ కారణాలు      2) ఆర్థిక కారణాలు    3) గిరిజనుల అసంతృప్తి     4) పైవన్నీ

జవాబు: పైవన్నీ


2. ప్రకటన-A: భారతదేశ రాజులు వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. 

ప్రకటన-B: ఈస్టిండియా కంపెనీ వారు వ్యవసాయ భూములపై నిర్దాక్షిణ్యంగా శిస్తు వసూలు చేశారు.

జవాబు: ప్రకటన A, B లు సరైనవి



3.  ప్రకటన-A: వలస పాలనలో చేతివృత్తులవారు జీవనోపాధి కోల్పోయారు. 

 కారణం- R: ఇంగ్లండ్‌లోని పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులు భారతదేశానికి దిగుమతి చేసుకోవడం.

జవాబు: ప్రకటన A కి కారణం R సరైన వివరణ.


4.  కిందివాటిని జతపరచండి.

రాష్ట్రాలు   -    గిరిజన తెగలు 

1) మహారాష్ట్ర     ఎ) కోలి

2) గుజరాత్‌      బి) నాయక్‌ 

3) ఒడిశా        సి) ఖోండ్‌ 

4) బిహార్‌      డి) సంతాలీలు

జవాబు: 1-ఎ; 2-బి; 3-సి; 4-డి


5.  బ్రిటిష్‌వారు చేసిన అటవీ చట్టాలకు సంబంధించి సరికానిది?

జవాబు: గిరిజనుల ఆదాయం పెంచాయి.


6.     నరబలి, శిశుహత్య అనాదిగా ఉన్న గిరిజన జాతి?

జవాబు: ఖోండ్‌ 


7.  బిహార్‌లోని సంతాలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?

జవాబు: 1855-56  


 


8.     తమల్‌ గిరిజన తెగ ఉన్న ప్రాంతం?

జవాబు:  ఛోటానాగ్‌పుర్‌    


9.     1857 తిరుగుబాటు సమయంలో పలమౌ, రాంచీ, హజారీ బాగ్‌ వద్ద ఉన్న ‘చిరో’ తెగ గిరిజనులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు?

జవాబు: పితాంబర్‌

10. ‘బిల్‌’ గిరిజన తిరుగుబాటుకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) ఇది 1817 - 19 మధ్య జరిగింది.

బి) ఈ తిరుగుబాటు మార్కోస్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌ కాలంలో జరిగింది.

సి) పశ్చిమ కనుమల్లోని ఖాందేశ్‌ ప్రాంతంలో ఉంటారు. 

డి) వీరికి సహాయం చేసినవారు పీష్వా రెండో బాజీరావు.

జవాబు: ఎ, బి, సి, డి 


11. రమోసే తెగ వారు చిత్తూర్‌ సింగ్‌ నాయకత్వంలో ఎప్పుడు తిరుగుబాటు చేశారు?

జవాబు: 1822 


12. రమోసే తెగవారు ప్రధానంగా దాడులు చేసిన ప్రాంతం?

జవాబు: సతారా 


13. కోల్‌ గిరిజనులు తిరుగుబాటు చేసిన సంవత్సరం?

జవాబు: 1831 - 32   


14. సిర్దార్‌ అంటే

జవాబు:  గిరిజన నాయకుడు  

 


15. కోల్‌ తిరుగుబాటు ఏ ప్రాంతం కేంద్రంగా జరిగింది?

జవాబు: రాంచీ    


16. కిందివాటిలో భిన్నమైంది?

 జవాబు: బెవార్‌ 


17. 1845లో బ్రిటిష్‌వారు స్థాపించిన ‘మెరియా ఏజెన్సీ’ ప్రధాన ఉద్దేశం?


జవాబు: నరబలులు, ఆడ శిశువుల హత్యలను అరికట్టడం


18. సంతాల్‌ తిరుగుబాటు ఏ గవర్నర్‌ జనరల్‌ చివరి కాలంలో జరిగింది?

జవాబు: లార్డ్‌ డల్హౌసీ


19. సంతాల్‌ తిరుగుబాటుకు నాయకుడు?

1) సిధు    2) కన్హూ    3) 1, 2   4) బిర్సా

జవాబు:  1, 2  


20. కోల్‌ తిరుగుబాటుకు సంబంధించి సరైంది?

ఎ) ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.

బి) ఈ తిరుగుబాటుకు నాయకుడు బుద్ధో భగత్‌.

జవాబు: బి మాత్రమే   


 

21. అహోమ్‌ తిరుగుబాటుకు ప్రధాన కారణం?

జవాబు: అస్సాంలో బ్రిటిష్‌ వారు అవలంబించిన వ్యవసాయ విధానాలు


22. విశాఖపట్నంలో గిరిజన తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?

జవాబు: 1832  


23. విశాఖపట్నం గిరిజన తిరుగుబాటును పరిగణించి సరైనవి గుర్తించండి.    

ఎ) ఈ తిరుగుబాటు కాశీపురం, పాయకరావుపేట, పాలకొండ జమీందారీలలో జరిగింది.

బి) తిరుగుబాటు అణచివేయడానికి నియమితుడైన అధికారి జార్జి రుస్సెల్‌.

సి) 1839లో ప్రభుత్వం XXIV చట్టం చేసింది.

డి) గిరిజనులు పితూరీల రూపంలో తిరుగుబాట్లు చేశారు.

జవాబు: ఎ, బి, సి, డి 


24. ప్రకటన-A: 1917లో మద్రాసు ప్రభుత్వం ది ఏజెన్సీ ట్రాక్ట్స్‌ ఇంటరెస్ట్‌ అండ్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ను రూపొందించింది.

ప్రకటన-B ఈ చట్టం గిరిజనుల భూములను గిరిజనేతరులకు ఇవ్వడం అనే సంప్రదాయాన్ని రద్దు చేసింది.

జవాబు:  ప్రకటన A, B లు సరైనవి   


25. గోండు ఉద్యమానికి సంబంధించి సరైనవి?

ఎ) దీని నాయకుడు కొమురం భీం.

బి) దీని నినాదం జల్, జంగిల్, జమీన్‌.

సి) ఈ తిరుగుబాటు తంత్రం గెరిల్లా పోరాటం.

జవాబు: ఎ, బి, సి   


26. ఖాసీ జయంతియా కొండల్లో బ్రిటిష్‌ వారు వేసే రోడ్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు?

జవాబు: ఖాసీ 


27. కుకీ తిరుగుబాటు జరిగిన ప్రాంతం?

జవాబు: మణిపుర్‌  

 

28. రంప ఏజెన్సీ అధిపతి మన్సబ్‌దార్‌కు సహాయపడినవారు?

జవాబు: ముత్తాదార్లు   


29. 1835లో మరణించిన రంప మన్సబ్‌దారు?

జవాబు:రామ భూపతిదేవ్‌  


30. రంపా తిరుగుబాటును అణచివేసేందుకు వచ్చిన రెవెన్యూ బోర్డు సభ్యుడు?

జవాబు: సల్లెవన్‌  

 


31. గిరిజనులు మాహువా చెట్ల పూలను దేనికి ఉపయోగిస్తారు?

1) తినడానికి    2) మద్యం తయారీకి      3) 1, 2      4) అలంకరణకు

జవాబు: 1, 2  


32. కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) ఒడిశాలోని ఖోండ్‌లు సామూహిక వేటకు వెళతారు. 

బి) మధ్యప్రదేశ్‌లోని బైగాలు ఉత్తమ వేటగాళ్లు.

జవాబు: ఎ, బి సరైనవి


33. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

ఎ) పంజాబ్‌ - వాన్‌ గుజ్జర్లు - ఆవులను మేపేవారు 

బి) కులూ - గద్దీలు - గొర్రెలు మేపేవారు

సి) కశ్మీర్‌ - బకర్వాలాలు - మేకల కాపరులు

డి) ఆంధ్రప్రదేశ్‌ - లంబాడీలు - పందులను పోషిస్తారు

జవాబు: డి మాత్రమే   


34. గిరిజన పంట కాలాలను జతపరచండి.

1) జేత్‌     ఎ) కుత్కి పక్వానికి వస్తుంది 

2) కార్తిక్‌    బి) కొత్త బెవార్‌లకు వెళ్లేవారు

3) కౌర్‌     సి) విత్తడం ప్రారంభిస్తారు

4) మాగ్‌    డి) బీన్స్‌ పక్వానికి వస్తుంది

జవాబు:  1-సి; 2-ఎ; 3-డి; 4-బి


35. నైషి తెగ గిరిజనులు ఉన్న ప్రాంతం?

జవాబు: అరుణాచల్‌ ప్రదేశ్‌ 


36. బిర్సా ముండా ఎప్పుడు మరణించారు?

జవాబు: 1900 


37. బిర్సా ముండాకు సంబంధించి సరికానిది?

జవాబు: బిర్సాను 1897లో అరెస్ట్‌ చేశారు.

 

38. గడ్కరి తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జవాబు:  కొల్హాపుర్‌


39. ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియా మిలిటెంట్‌ నేషనలిజమ్‌’ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు: వాసుదేవ బల్వంత్‌ పాడ్కే 


40. భూగాన్‌ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది?

జవాబు: ఒరిస్సా 


41. ఖాసిస్‌ తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జవాబు: మేఘాలయ


42. బాలగంగాధర్‌ తిలక్‌ గురువు ఎవరు?

జవాబు: వాసుదేవ బల్వంత్‌ పాడ్కే


43. భిల్లుల తిరుగుబాటుకు (1818 - 36) నాయ‌క‌త్వం వ‌హించిన‌వారు?

జవాబు: సేవారం

 

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చోళులు

భారతదేశ చరిత్ర

 


దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల్లో చోళులు ప్రముఖులు. వీరు క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు తమిళ రాజ్యాన్ని పాలించారు. చోళ రాజ్య స్థాపకుడు విజయాలయ చోళుడు. ఈ సామ్రాజ్యం రాజరాజ, రాజేంద్ర చోళుల కాలంలో గొప్పగా విరాజిల్లింది. వీరు అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి పటిష్ట పాలనను అందించారు. చోళులు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారు. స్థానిక స్వపరిపాలనా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేశారు.

చారిత్రక నేపథ్యం

చోళుల గురించిన ప్రస్తావన మొదటగా ‘సంగం యుగ’ సాహిత్యంలో కనిపిస్తుంది. అయితే ప్రాచీనకాలంలోనే మహాభారతం, అశోకుడి శిలాశాసనాలు, మెగస్తనీస్‌ రచనల్లో వీరి గురించి ఉంది.

బౌద్ధ గ్రంథాలైన మహావంశం, దీపవంశం; టాలమీ రచనలు; ‘పెరిప్లస్‌-ఆఫ్‌-ది-ఎరిత్రియన్‌-సి’ గ్రంథాల్లో చోళుల ప్రస్తావన ఉంది. 

క్రీ.శ.1వ శతాబ్దం నుంచే చోళులు రాజకీయంగా అనేక మంది రాజుల వద్ద సేనాధిపతులుగా పనిచేశారు. క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి ‘కరికాల చోళుడు’ ప్రాచీన చోళసామ్రాజ్యాన్ని స్థాపించి, గొప్ప వీరుడిగా పేరొందాడు. 

ఇతడు ‘వెన్ని’ యుద్ధంలో చేర-పాండ్య కూటమిపై గెలిచాడు. తర్వాత సింహళ రాజును ఓడించి, 1200 మందిని యుద్ధ ఖైదీలుగా బంధించాడు. వారితో కావేరీ నదిపై ఆనకట్టలు కట్టించాడు.

ఇతడి తర్వాత ‘నెడుమికిల్లి’ రాజయ్యాడు. ఇతడి కాలంలో కలభ్రులు, సముద్రపు దొంగలు, పల్లవులు, కేరళీయులు, పాండ్యులు చోళ రాజధానిపై దాడి చేశారు. దీంతో ప్రాచీన చోళసామ్రాజ్యం పతనమైంది. 

క్రీ.శ. 9వ శతాబ్దంలో విజయాలయ చోళుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీంతో చోళ పాలన పునరుద్ధరణ జరిగింది.

రాజకీయ చరిత్ర

విజయాలయ చోళుడు

క్రీ.శ. 850 నుంచి క్రీ.శ. 870 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు మొదట్లో పల్లవులకు సామంతుడిగా ఉన్నాడు.

విజయాలయుడు క్రీ.శ. 850లో పాండ్య సామంతుడు ‘ముత్తరయార్‌’ను ఓడించి, తంజావూరును ఆక్రమించాడు. అక్కడ ‘విసంభసూధిని’ అనే దేవాలయాన్ని కట్టించాడు.

ఆ సమయంలో పల్లవులు, పాండ్యుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. దీన్ని అవకాశంగా చేసుకున్న విజయాలయ చోళుడు తంజావూరును రాజధానిగా చేసుకుని స్వతంత్ర చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

మొదటి ఆదిత్య చోళుడు 

క్రీ.శ. 870 నుంచి క్రీ.శ. 907 వరకు రాజ్యపాలన చేశాడు. 

పల్లవరాజు నందివర్మ మరణించాక అతడి కుమారులైన నృపతుంగవర్మ, అపరాజితవర్మ మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. దీనికి ‘శ్రీపురంజియం’ యుద్ధం అని పేరు. ఇందులో ఆదిత్య చోళుడు అపరాజితవర్మకు సహాయం చేయగా, నృపతుంగవర్మకు పాండ్యరాజు వరగుణవర్మ సాయం చేశాడు.

ఆదిత్య చోళుడు వరగుణవర్మను ఓడించి అపరాజితవర్మ విజయానికి సాయం చేశాడు. దీంతో అతడు తంజావూరు పరిసర ప్రాంతాలను పొందాడు. తర్వాత ఆదిత్య చోళుడు అపరాజితవర్మను ఓడించి కంచిని ఆక్రమించి, తన రాజ్యంలో కలుపుకున్నాడు. 

పాండ్యుల నుంచి కోయంబత్తూరు, సేలంను ఆక్రమించాడు. ఇతడు రాతితో ఎత్తయిన శివాలయాలు నిర్మించాడు.

పరాంతక చోళుడు 

క్రీ.శ. 907 నుంచి క్రీ.శ. 955 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు మొదటి ఆదిత్య చోళుడి కుమారుడు. 

క్రీ.శ. 910లో పాండ్యరాజు మారవర్మ రెండో రాజసింహుడ్ని ఓడించి, మధురైను స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఇతడికి ‘మధురై కొండ’ అనే బిరుదు వచ్చింది.

ఇతడి కాలంలో రాష్ట్రకూటులతో వైరం ప్రారంభమైంది. రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడు పశ్చిమ గాంగుల సాయంతో పరాంతకుడిపై దండెత్తాడు. పరాంతక చోళుడు వారిని ‘పల్లాల యుద్ధం’లో ఓడించాడు. దీనికి గుర్తుగా ఇతడు చిదంబరంలోని నటరాజ దేవాలయ పైకప్పుకి బంగారుపూత పూయించాడు. 

క్రీ.పూ. 949లో మూడో కృష్ణుడు తక్కోళం యుద్ధంలో పరాంతకుడ్ని ఓడించాడు. ఇతడి జైత్రయాత్ర రామేశ్వరô వరకు సాగింది. అక్కడ మూడో కృష్ణుడు విజయస్తంభం వేయించాడు.

పరాంతకుడు మరణించాక (క్రీ.శ. 955-985 చోళ సామ్రాజ్యం బలహీనమైంది. 

పరాంతకుడి తర్వాత గండరాదిత్య, అరింజయ, రెండో పరాంతక, రెండో ఆదిత్య ఉత్తమ చోళులు రాజ్యపాలన చేశారు. 

ఉత్తమ చోళుడి కుమారుడు రాజరాజ - 1 కాలంలో చోళ సామ్రాజ్యం మళ్లీ శక్తిమంతమైంది. ఉత్తమ చోళుడికి మరో పేరు సుందర చోళుడు.

మొదటి రాజేంద్ర చోళుడు

క్రీ.శ. 1014 నుంచి క్రీ.శ. 1044 వరకు రాజ్యపాలన చేశాడు. యువరాజుగా ఉన్నప్పుడే చాళుక్యులపై విజయం సాధించాడు. 

కల్యాణి చాళుక్యులను అనేకసార్లు ఓడించి, వేంగి రాజ్యంపై చోళప్రాబల్యం పెంచాడు. 

క్రీ.శ.1018లో సింహళరాజు అయిదో మహేంద్రుడ్ని ఓడించాడు. క్రీ.శ. 1019లో పాండ్య, చేర రాజ్యాలపై దండెత్తి జయించాడు.

వేంగిరాజు రాజరాజ నరేంద్రుడికి తన కుమార్తె ‘అమ్మంగదేవి’ని ఇచ్చి వివాహం చేశాడు. యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయిన రాజరాజనరేంద్రుడికి తిరిగి వేంగి సింహాసనాన్ని అప్పగించాడు.

బెంగాల్‌ పాలకుడు ‘మహిపాలుడ్ని’ ఓడించి ‘గంగైకొండన్‌’ అనే బిరుదు పొందాడు. 

వ్యాపారాభివృద్ధి కోసం మలయా, సుమిత్రాలను పాలిస్తున్న శైలేంద్ర వంశీయుడు శ్రీవిజయోత్తమవర్మను ఓడించాడు. క్రీ.శ. 1025లో అతని రాజధాని ‘కడారం’ను ఆక్రమించి, ‘కడారం కొండ’ అనే బిరుదు పొందాడు. 

క్రీ.శ. 1041లో శ్రీలంకను ఆక్రమించాడు. దీంతో ఇతడికి బంగాళాఖాతం, హిందూ, అరేబియా సముద్రాలపై ఆధిపత్యం దక్కింది. ‘త్రి సముద్రాధీశ్వర’ అనే బిరుదు పొందాడు.

రాజేంద్ర చోళుడు ‘గంగైకొండ చోళపురం’ అనే కొత్త పట్టణాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. అక్కడే గొప్ప తటాకాన్ని నిర్మించాడు. వేద, వ్యాకరణ, న్యాయ మీమాంస శాస్త్రాల బోధనకు 14 మంది ఉపాధ్యాయులను నియమించాడు. 

నౌకాబలాన్ని అభివృద్ధి చేసి, చైనాకు వ్యాపారాభివృద్ధి కోసం రాయబారులను పంపాడు. 

ముడికొండ (కేరళ, పాండ్య, సింహళ రాజులను జయించినవాడు), గంగైకొండ (గంగాపరీవవాహ ప్రాంతాన్ని జయించినవాడు), కడారకొండ (శ్రీవిజయరాజ్య రాజధాని ‘కడారం’ విజేత) అనే బిరుదులు ఇతడి విజయాలను సూచిస్తున్నాయి. 

ఇతడికి రాజాధిరాజు ఖి, రెండో రాజేంద్రుడు, వీర రాజేంద్రుడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.

రాజాధిరాజు - I

క్రీ.శ. 1044 నుంచి క్రీ.శ. 1052 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి కాలం మొత్తం యుద్ధాలతో గడిచింది.

ఇతడు వేంగిపై దండెత్తి, పశ్చిమ చాళుక్యరాజు విక్రమాదిత్యుడ్ని ‘ధాన్యకటక’ యుద్ధంలో ఓడించి, ‘కొల్లిపాక’ను ధ్వంసం చేశాడు. 

చాళుక్య సామంతులను ఓడించి, ‘కంపిలి’పై అధికారం చెలాయించాడు. యాతగిరి (యాగ్గిరి) ప్రాంతంలో తన విజయాలకు చిహ్నంగా ‘పులిగుర్తుతో’ స్తంభాన్ని వేయించాడు. 

కల్యాణి పట్టణాన్ని ఆక్రమించి ‘విజయరాజేంద్ర’ అనే బిరుదు పొందాడు. ఇక్కడి నుంచే ‘ద్వారపాలక’ ప్రతిమను తెచ్చి తంజావూరులోని ‘ధారాసురం’ దేవాలయంలో నెలకొల్పినట్లు తమిళ శాసనంలో ఉంది. 

ఈ సమయంలో మధుర, సింహళంలో తిరుగుబాట్లు చెలరేగగా, వాటిని అణచివేశాడు. క్రీ.శ. 1052లో చాళుక్యులతో జరిగిన ‘కొప్పం యుద్ధం’లో మరణించాడు.

రెండో రాజేంద్ర చోళుడు 

క్రీ.శ. 1052 నుంచి క్రీ.శ.1064 వరకు రాజ్యపాలన చేశాడు. కొప్పం యుద్ధంలో రాజాధిరాజు మరణించినప్పటికీ, రాజేంద్ర చోళుడు యుద్ధం కొనసాగించి, విజయం సాధించాడు. 

ఇతడికి యుద్ధ భూమిలోనే పట్టాభిషేకం జరిగింది. ఇతడు ‘కొల్లాపురం’లో విజయస్తంభం వేయించాడు. 

క్రీ.శ. 1062లో ‘కూడలి సంగం’ యుద్ధంలో చాళుక్య సేనలను పూర్తిగా ఓడించాడు.

చివరి చోళ రాజులు

రెండో రాజేంద్ర చోళుడి తర్వాత రాజ్యపాలన చేసిన వారిని కడపటి చోళరాజులు అని పేర్కొంటారు.

రెండో రాజేంద్రుడి తర్వాత వీరరాజేంద్ర 

క్రీ.శ.1064-70, ఆదిరాజేంద్ర (క్రీ.శ. 1070), కులోత్తుంగ చోళుడు (క్రీ.శ. 1070-1120) పాలించారు. కులోత్తుంగ చోళుడి తల్లిదండ్రులు రాజరాజ నరేంద్రుడు, అమ్మంగదేవి.

చోళ వంశంలో చివరివాడు మూడో రాజేంద్రచోళుడు. ఇతడు క్రీ.శ. 1256-70 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు కాకతీయ రాజైన గణపతిదేవుడ్ని ఓడించాడు. 

పాండ్యరాజు కులశేఖర కాలంలో చోళ సామ్రాజ్యం పాండ్యరాజ్యంలో విలీనమైంది. దీంతో చోళుల పాలన అంతమైంది.

రాజరాజ చోళుడు - 

క్రీ.శ. 985 నుంచి క్రీ.శ. 1014 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి పాలనాకాలంలో చోళ సామ్రాజ్య కీర్తిప్రతిష్ఠలు పెరిగాయి. 

రాజరాజ చోళుడు గొప్పయోధుడు. ఇతడు మొదట పాండ్య, కేరళ, సింహళ రాజ్యాలపై దాడిచేశాడు. రెండోసారి పాండ్య, కేరళ రాజులను కండలూర్, విలినమ్‌ యుద్ధాల్లో ఓడించాడు. 

ఇతడు నౌకాదళాన్ని అభివృద్ధి చేశాడు. సింహళరాజు అయిదో మహేంద్రను ఓడించి, అనురాధాపురాన్ని కొల్లగొట్టాడు. సింహళంలో తాను ఆక్రమించిన భూభాగానికి ‘పోలోన్నరువ’ను రాజధానిగా చేశాడు. 

క్రీ.శ. 991లో గాంగవాడి, నోళంబవాడి, తడిగైపవాడి, మైసూరును జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు.

తూర్పు చాళుక్యులను ఓడించి, వేంగిని  ఆక్రమించిన తెలుగు జటాచోడ భీముడ్ని 

క్రీ.శ. 1000లో ఓడించాడు. శక్తివర్మకు వేంగి సింహాసనాన్ని అప్పగించాడు. శక్తివర్మ తమ్ముడు విమలాదిత్యుడికి తన కుమార్తె కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. దీంతో చోళ, చాళుక్య రాజ్యాల మధ్య మైత్రి బలపడింది.

కల్యాణి చాళుక్య రాజు సత్యాశ్రయుడు క్రీ.శ. 1006లో వేంగిపై దండెత్తాడు. ఆ యుద్ధంలో రాజరాజ చోళుడి కుమారుడు రాజేంద్ర చోళుడు సత్యాశ్రయుడ్ని ఓడించాడు. 

క్రీ.శ.1003లో చాళుక్య తైలపుడ్ని ఓడించి, కట్టవాడిని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. 

వేంగిని ఆక్రమించాలనుకున్న కళింగ గాంగులను రాజరాజు ఓడించాడు. ఇతడు తన నౌకాబలంతో మాల్దీవులను జయించాడు.

ఇతర విషయాలు.. 

రాజరాజ చోళుడు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమేకాక, ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించాడు. రాజ్యంలోని భూములను సర్వే చేయించి, గ్రామపాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 

రాజరాజ శివభక్తుడు. ఇతడికి ‘శివపాదశేఖర’ అనే బిరుదు ఉంది. ఇతర బిరుదులు:‘జయంగోడ’, ‘చోళమార్తాండ’, ‘ముమ్మడిచోళ’, ‘కేరళాంతక’.

ఇతడ్ని మొదట్లో ‘రాజకేసరి అరుమోళివర్మన్‌’ అనే పేరుతో పిలిచేవారు. 

ఇతడు క్రీ.శ. 1010లో తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. దీన్నే ‘రాజరాజేశ్వరాలయం’ అంటారు. 

శ్రీవిజయ రాజ్యానికి చెందిన శైలేంద్ర వంశ రాజు శ్రీమార విజయోత్తుంగవర్మ ఇతడి స్నేహితుడు. ఇతడి కోరిక మేరకు రాజరాజ నాగపట్నంలో బౌద్ధవిహార నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. క్రీ.శ 1006లో ఆ విహారానికి ‘అనైమాంగలం’ అనే గ్రామాన్ని దానం చేశాడు.

మాదిరి ప్రశ్నలు

1. ‘సౌత్‌ ఇండియన్‌ నెపోలియన్‌’ అని ఎవరిని అంటారు?

1)రాజరాజ - I   2)రాజేంద్ర చోళుడు   3) రాజరాజ - II    4) నరేంద్ర చోళుడు

2. ‘ఇండియన్‌ నెపోలియన్‌’ అనే బిరుదు ఎవరిది?

1)సముద్రగుప్త   2)రెండో చంద్రగుప్త  3)కుమారగుప్త   4)స్కందగుప్త

3. ‘గంగైకొండ’ అనే బిరుదు ఎవరిది?

1)రాజరాజ    2)అనంత చోళుడు 3)రాజాధిరాజ    4)రాజేంద్ర చోళుడు

4. ఉత్తర మేరూర్‌ శాసనం ఎవరి పాలనా విధానాన్ని తెలుపుతుంది?

1)చోళులు    2)చాళుక్యులు 3)మౌర్యులు    4)రాష్ట్రకూటులు

5. ‘గంగైకొండ చోళపురం’ అనే నగరాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన చోళరాజు ఎవరు?

1)రాజేంద్రచోళ - I  2)మొదటి రాజరాజు   3)మొదటి పరాంతక      4)ఆదిత్య చోళుడు

సమాధానాలు

1-2  2-1  3-4  4-1  5-1

 

Posted Date : 21-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

‘భూమండలంపై భగవంతుడి నీడ!’

ఢిల్లీ సుల్తానుల యుగం

మధ్యయుగంలో సుమారు నాలుగు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తానులు సంప్రదాయ షరియాను అనుసరిస్తూ, పరిపాలనలో ఎన్నో మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంతర్గత కలహాల మధ్యనే హిందూ రాజ్యాలపై నిరంతరం దాడులు, దోపిడీలు కొనసాగించారు. భారతావనిపై మంగోలుల దండయాత్రలను సమర్థంగా నిలువరించారు. వీరి పాలనలో చోటుచేసుకున్న పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రాజ్యాధికారం చేపట్టిన మొదటి మహిళగా, ముస్లిం పాలకురాలిగా చరిత్రలో నిలిచిపోయిన రజియా సుల్తానా, నిరంకుశుడిగా ముద్రపడిన బాల్బన్, మార్కెటింగ్‌ సంస్కరణలకు ఆద్యుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ, దేశంలో ముస్లిం పాలనకు పటిష్ఠ పునాదులేసిన ఇల్‌-టుట్‌-మిష్‌Ã తదితరుల గురించి వివరంగా తెలుసుకోవాలి.

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


 

1.    ‘భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారం నెలకొల్పింది ఇల్‌-టుట్‌-మిష్‌’ అని అన్నది?

1) ఈశ్వర ప్రసాద్‌         2) ఆర్‌.పి.త్రిపాఠి  

3) నీలకంఠ శాస్త్రి          4) ఆర్‌.డి.బెనర్జీ


2.    1217 నాటికి ఇల్‌-టుట్‌-మిష్‌ అధికారం విస్తరించిన ప్రాంతాలు?

1) ఢిల్లీ                                     2) ముల్తాన్, సింధ్‌

3) ఉచ్, గ్యాలియర్, మాళ్వా     4) పైవన్నీ


3. 1229లో భారతదేశపు తొలి ముస్లిం సుల్తాన్‌గా మిష్‌ను గుర్తించిన ఖలీఫా?

1) ఖలీఫా వాలిద్‌                       2) ఖలీఫా ఉమ్మయ్యద్‌    

3) ఖలీఫా-అల్‌-మస్తాన్‌-బిల్హ      4) ఖలీఫా మహమ్మద్‌


4.     ‘ఢిల్లీలో వాస్తవంగా ముస్లిం రాజ్యాధికారాన్ని స్థాపించింది ఇల్‌-టుట్‌-మిష్‌’ అని అన్నది?

1) ఆర్‌.ఎస్‌.శర్మ           2) ఆర్‌.పి.త్రిపాఠి  

3) ఈశ్వర ప్రసాద్‌         4) ఆర్‌.డి.బెనర్జీ


5.     మంగోల్‌ నాయకుడు చంఘీజ్‌ఖాన్‌ ప్రమాదాన్ని చాకచక్యంగా తప్పించుకున్న ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌        2) ఇల్‌టుట్‌మిష్‌  

3) ఐబక్‌            4) అల్లావుద్దీన్‌ 


6.     కుతుబ్‌ మినార్‌ నిర్మాణం ప్రారంభించిన, పూర్తిచేసినవారు వరుసగా?

1) బాల్బన్‌-ఇల్‌ టుట్‌ మిష్‌       2) ఐబక్‌-ఇల్‌ టుట్‌ మిష్‌

3) ఐబక్‌ - రజియా సుల్తానా       4) ఐబక్‌ - అల్లావుద్దీన్‌


7.     ‘చిహల్‌ గని’ అనే 40 మంది సర్దారుల ముఠా ఎవరి కాలంలో ఏర్పడింది?

1) కుతుబుద్దీన్‌             2) ఇల్‌టుట్‌మిష్‌  

3) రజియా సుల్తానా      4) బాల్బన్‌


8.     తాజుద్దీన్, మెన్హజ్‌- ఉస్‌ - సిరాజ్‌లు ఏ ఢిల్లీ సుల్తాన్‌ పోషణలో ఉన్నారు?

1) ఐబక్‌                       2) ఇల్‌టుట్‌మిష్‌  

3) రజియా సుల్తానా     4) బాల్బన్‌


9.     ఇల్‌టుట్‌మిష్‌ ముద్రించి వాడుకలోకి తెచ్చిన నాణేలు?

1) వెండి టంకా               2) రాగి జిటాల్‌ 

3) బంగారు శతమానం     4) 1, 2


10. ‘ఇల్‌టుట్‌మిష్‌ భారతదేశంలో బానిస వంశ అధికారాన్ని వాస్తవంగా నెలకొల్పిన సుల్తాన్‌’ అని అన్నది?

1) ఈశ్వరీ ప్రసాద్‌       2) ఆర్‌.ఎస్‌.శర్మ   

3) ఆర్‌.పి.త్రిపాఠి      4) ఆర్‌.డి.బెనర్జీ


11. భారతదేశ చరిత్రలో మొదటి మహిళా పాలకురాలు?

1) రుద్రమదేవి             2) మనుబాయి   

3) రజియా సుల్తానా      4) ఇందిరా గాంధీ


12. రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన సంవత్సరం?

1) 1236      2) 1326     3) 1623     4) 1240


13. రజియా సుల్తానా పరిపాలనను వ్యతిరేకించినవారు?

1) చిహాల్‌గనీలు       2) సర్దారులు   

3) సయ్యద్‌లు       4) ఖలీఫాలు


14. రజియా సుల్తానా అధికారం అంతం చేయడానికి ప్రయత్నించినవారు?

1) లాహోర్‌ రాష్ట్ర పాలకుడు మాలిక్‌-అల్లాఉద్దీన్‌-జైనీ

2) ముల్తాన్‌ రాష్ట్ర గవర్నర్‌ మాలిక్‌-ఇజాఉద్దీన్‌-క్రన్జన్‌

3) హాన్సీ రాష్ట్ర పాలకుడు మాలిక్‌-సఫీ-ఉద్దీన్‌          4) పైవారంతా.


15. రజియా సుల్తానా పారిపోయిన ప్రాంతం?

1) ఢిల్లీ    2) లాహోర్‌     3) భటిండా      4) ముల్తాన్‌


16. బాల్బన్‌ పరిపాలనా కాలం?

1) 1226 - 1287      2) 1266 - 1287  

3) 1266 - 1278      4) 1267 - 1287


17. బాల్బన్‌ మధ్య ఆసియాలోని ఏ తెగకు చెందినవాడు?    

1) మంగోల్‌     2) ఖురేషి     3) ఇల్బారీ    4) మొగల్‌


18. ‘చిహాల్‌గనీ ముఠా’లో కీలకపాత్ర పోషించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌            2) ఆలం షా  

3) బహరాం షా       4) పైవారంతా


19. 1260లో ఢిల్లీపై మంగోల్‌ దాడులను తిప్పికొట్టింది?    

1) బాల్బన్‌            2) ఆలం షా   

3) బహరాం షా       4) పైవారంతా


20. ఘియాజుద్దీన్‌ బాల్బన్‌కు సంబంధించిన సరైన వాక్యాలు?

ఎ) 1230లో సామాన్య నీరు మోసే కూలీగా జీవితం ప్రారంభించాడు.

బి) 1233 నాటికి మిష్‌ ప్రోత్సాహంతో ఖాస్‌దార్‌ పదవి పొంది రజియా కాలంలో అమీర్‌ - ఇ- షికార్‌ హోదా పొందాడు.

సి) బానిస వంశ రాజు అయిన నాసిరుద్దీన్‌ కుమార్తెను వివాహం చేసుకున్నాడు.

డి) నాసిరుద్దీన్‌ కాలంలో నాయబ్‌-ఇ-మమాలిక్‌ (ఉపప్రధాని)గా పనిచేశాడు.

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, సి  

3) బి, సి                  4) బి, సి, డి


21. చిహల్‌గని ముఠాతో ప్రముఖ నాయకుడిగా వ్యవహరించి తను రాజు అయిన తరువాత చిహల్‌గని వ్యవస్థను నిర్మూలించినవారు?

1) ఆమీర్‌ ఖాన్‌            2) నాసిరుద్దీన్‌ 

3) బాల్బన్‌                  4) షేర్‌ఖాన్‌


22. ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించిన బానిస రాజు?

1) ఇల్‌-టుట్‌-మిష్‌           2) బాల్బన్‌    

3) ఐబక్‌                           4) రజియా సుల్తానా


23. ‘నియాబత్‌-ఇ-ఖుదాయి (కింగ్‌ ఈజ్‌ ది వైస్‌ రిజెన్సీ ఆఫ్‌ గాడ్‌ ఆన్‌ ఎర్త్‌) ‘‘రాజు భూమండలంపై భగవంతుని నీడ’ అని అభిప్రాయపడినవారు?

1) ఇల్‌టుట్‌మిష్‌            2) బాల్బన్‌  

3) ఐబక్‌                          4) రజియా సుల్తానా 


24. బాల్బన్‌ తన కుమారుడు బుగ్రాఖాన్‌కు రాజరికానికి సంబంధించి ఏమని బోధించాడు?

1) రాజరికం దైవదత్తం            2) రాజరికం నిరంకుశత్వానికి ప్రతిబింబం  

3) రాజరికం ప్రజాదీవెన          4) రాజరికం అంటే రాజ్యంపై అధికారం


25. బాల్బన్‌ రాజదర్బారులో ఆచరణలో ఉంచిన పర్షియా సుల్తానుల విధానం?

1) జమిన్‌బోస్‌                2) పాయిబోస్‌  

3) 1, 2                            4) రాజును చూసిన వెంటనే ధనం ఇవ్వడం.


26. బహిరంగ ప్రదేశాల్లో నవ్వని ఢిల్లీ సుల్తాన్‌?

1) అల్లావుద్దీన్‌                2) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌    

3) బాల్బన్‌                      4) ఐబక్‌ 


27. చెలామణిలో ఉన్న నాణేలపై ఖలీఫా పేరు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌                   2) మహ్మద్‌ బీన్‌ ఖాసీమ్‌ 

3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ      4) ఐబక్‌


28. బానిస వంశంలో చివరి రాజు?

1) కైకుబాద్‌             2) మహ్మద్‌   

3) బాల్బన్‌              4) జలాలుద్దీన్‌


29. బాల్బన్‌ కాలంలో జలాలుద్దీన్‌ ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశాడు?

1) బెంగాల్‌     2) సమారా     3) అవద్‌    4) ఉజ్జయిని


30. జలాలుద్దీన్‌ ఖిల్జీ అధికారుల్లో ప్రముఖులు?

1) మాలిక్‌ ఫక్రుద్దీన్‌          2) ఖ్వాజా ఖతర్‌ 

3) గర్షాన్స్‌ మాలిక్‌             4) పైవారంతా


31. అల్లావుద్దీన్‌-ఖిల్జీ దేవగిరిపై దాడి చేసిన సంవత్సరం?

1) 1260       2) 1270       3)1280      4) 1290


32. మార్కెటింగ్‌ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌                     2) అల్లావుద్దీన్‌ ఖిల్జీ   

3) ఇల్‌-టుట్‌-మిష్‌         4) ఐబక్‌


33. 1297లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్‌పై దాడికి వీరిని పంపారు?

1) ఉల్గూఖాన్‌              2) నస్రత్‌ఖాన్‌   

3) 1, 2                       4) జాఫర్‌ మఖాన్‌


34. 1297లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్‌పై దాడి చేసే సమయంలో ఆ ప్రాంత పాలకుడు, వంశం వరుసగా?

1) కర్ణదేవుడు-వాఘేల             2) కర్ణదేవుడు-చహమాను

3) భీమదేవుడు-వాఘేల           4) భీమదేవుడు- చహమాను

 

35. అల్లావుద్దీన్‌ ఖిల్జీకి సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) 1298లో ఉల్గూఖాన్, నస్రత్‌ ఖాన్‌ నేతృత్వంలోని సైన్యం రణతంబోర్‌ ప్రాంతంపై దాడి చేసింది.

బి) ఈ యుద్ధంలో అల్లావుద్దీన్‌ విజయం సాధించాడు. ఉల్గూఖాన్, రాణాహం వీరుడు మరణించారు.

సి) 1303లో అల్లావుద్దీన్‌ మేవాడ్‌ రాజు రాణా రతన్‌ సింగ్‌పై దాడి చేశాడు.

డి) సుమారు 7 నెలల తర్వాత ఖిల్జీ చిత్తోడ్‌ను ఆక్రమించాడు.

1) ఎ, బి, సి, డి          2) బి, సి, డి    3) ఎ, బి         4) ఎ, బి, సి


36. అల్లావుద్దీన్‌ ఖిల్జీ చిత్తోడ్‌ అనే ప్రాంతానికి పెట్టిన పేరు?

1) ఖిజరాబాద్‌            2) పద్మపురం  

3) దౌలతాబాద్‌         4) ఖిల్జిపుర్‌


37. అల్లావుద్దీన్‌ ఖిల్జీకి సమకాలీనులు అయిన దక్షిణ భారతదేశ రాజులు కానివారు?

1) దేవగిరి - యాదవులు    2) ద్వార సముద్రం - హోయసాలులు

3) మధురై - పాండ్యులు        4) విజయనగరం - విజయనగర రాజులు


38. దక్షిణ భారతదేశ దండయాత్రలకు నేతృత్వం వహించిన అల్లావుద్దీన్‌ ప్రతినిధి?

    1) ఉల్గూఖాన్‌      2) నస్రత్‌ఖాన్‌ 

    3) మాలిక్‌ కపూర్‌     4) జాఫర్‌ మఖాన్‌


39. కిందివాటిలో ఖిల్జీకి సంబంధించి సరైనవి?

    ఎ) 1313లో దేవగిరి రాజ్యంపై దాడి చేసి రామచంద్ర దేవుని ఓడించాడు.

    బి) 1308లో రెండో ప్రతాపరుద్రుడు ఓడి ఖిల్జీకి కప్పం చెల్లించడానికి అంగీకరించారు.

    సి) హోయసాల రాజు అయిన మూడో వీర బల్లాలుడు ఓటమిపాలై ఖిల్జీకి కప్పం చెల్లించాడు.

    డి) పాండ్య రాజ్యంలో జరిగిన అంతర్యుద్దంలో  పాల్గొన్నారు.

    1) బి, డి                        2) బి, సి, డి   

    3) ఎ, బి, సి, డి             4) ఎ, బి, సి


40. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాజ్య సరిహద్దులను జత చేయండి.

   

1) ఉత్తరం ఎ) ముల్తాన్‌
2) దక్షిణం బి) ద్వార సముద్రం
 3) తూర్పు సి) సోనార్‌గర్‌ 
4) పశ్చిమం డి) థట్టా

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి    4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


41. అల్లావుద్దీన్‌ ఖిల్జీ పరిపాలనా సంస్కరణలకు సంబంధం లేనిది?

ఎ) సంపన్న సర్దారుల జాగీర్లను రద్దు చేశాడు

బి) హిందువులపై ఆంక్షలు తొలగించాడు

సి) మద్యం, మత్తు పదార్థాలు నిషేధించాడు

డి) సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు

1) బి, సి    2) సి    3) బి     4) బి, డి 



సమాధానాలు

12; 24; 33; 41; 52; 62; 72; 82; 94; 101; 113; 121; 131; 144; 153; 162; 173; 181; 191; 201; 213; 222; 232; 242; 253; 263; 271; 281; 292; 304; 314; 322; 333; 341; 351; 361; 374; 383; 393; 401; 413. 

 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...
 

Posted Date : 11-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సత్యాన్ని తెలుసుకోవడమే సరైన దృష్టి!

బౌద్ధమతం
 

ప్రాచీనకాలంలో భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తూర్పు ఆసియా అంతటా విస్తరించిన బౌద్ధమతం విశిష్టమైనది. బుద్ధుడు బోధించిన ధర్మసూత్రాలే బౌద్ధమతానికి మూలాధారం. మానవత్వం, యథార్థవాదాల కలయిక అయిన బౌద్ధం మానవులంతా సమానమేనని, చేసే పనుల్లో మంచి చెడుల ఆధారంగానే ఒకరి స్థానం నిర్ణయమవుతుందని చాటి చెప్పింది. బుద్ధుడి చరిత్రను, జననం నుంచి నిర్యాణం వరకు ముఖ్య సంఘటనలన్నింటినీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. మన దేశంలో బౌద్ధమత ఆనవాళ్లు, మత వ్యాప్తికి కృషి చేసిన వ్యక్తుల గురించి అవగాహన పెంచుకోవాలి.

 

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1. శుద్ధోదనుడి వంశం, అతడి రాజధానిని గుర్తించండి.

1) జ్ఞాత్రిక - కపిలవస్తు     2) శాక్య - కపిలవస్తు 

3) శాక్య - వైశాలి     4) జ్ఞాత్రిక - వైశాలి

 

2. గౌతమ బుద్ధుడు మొదటిసారిగా బోధన చేసిన ప్రాంతం?

1) సారనాథ్‌ - బుద్ధగయ  2) నేపాల్‌ - మృగదావనం

3) సాంచి - జింకలవనం 4) సారనాథ్‌ - మృగదావనం

 

3. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు.

బి) బుద్ధుడు క్రీ.పూ.483లో లుంబిని వనంలో జన్మించాడు.

సి) బుద్ధుడి తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి.

డి) మాయాదేవి కోలీయ వంశానికి చెందిన అంజనుడి కుమార్తె.

1) ఎ, బి, సి, డి       2) బి, సి, డి     

3) ఎ, సి, డి          4) ఎ, బి, డి 

 

4. ‘శుద్ధోదనుడు, మాయాదేవిలకు జన్మించిన బాలుడు (సిద్ధార్థుడు) గొప్పయోగి అవుతాడు’ అని చెప్పిన జోతిష్యుడు-

1) అసిత         2) ఉపగుప్తుడు 

3) నాగార్జునుడు     4) మహాకాత్సాయునుడు

 

5. బుద్ధుడు క్రీ.పూ. 483లో కుశీనగరంలో మరణించాడు. ఆయనకు అప్పుడు ఎన్నేళ్లు?

1) 60    2) 75     3) 85     4) 80 

 

6. కిందివాటిలో సరికానిది?

1) సిద్ధార్థుడు జన్మించిన ఏడు రోజులకు మాయాదేవి క్షయ వ్యాధితో మరణించింది.

2) సిద్ధార్థుడిని పెంచిన తల్లి గౌతమీ ప్రజాపతి.

3) సిద్ధార్థుడికి 29 ఏళ్ల వయసులో యశోధర అనే కన్యతో వివాహమైంది.

4) సిద్ధార్థుడు, యశోధరల కుమారుడు రాహులుడు.

 

 

7. కిందివాటిని పరిశీలించి సమాధానం గుర్తించండి.

ఎ) మహాభినిష్క్రమణం - 29 ఏళ్ల వయసులో బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లిపోవడం

బి) ధర్మచక్రపరివర్తనం - బుద్ధుడి మొదటి బోధన

1) ఎ, బి రెండూ సరైనవి     2) ఎ సరైంది, బి సరికాదు

3) ఎ సరికాదు, బి సరైంది 4) ఎ, బి రెండూ సరికానివి

 

8. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానం గుర్తించండి.

ఎ) అలారకరామ - సిద్ధార్థుడికి యోగ విద్యలు నేర్పాడు.

బి) ఉద్దకరామపుత్ర - సిద్ధార్థుడికి ప్రవచనాలు బోధించాడు.

1) ఎ సరైంది, బి సరికాదు    2) ఎ, బి లు సరైనవి

3) ఎ, బి లు సరికావు     4) ఎ సరికాదు, బి సరైంది

 

9. బుద్ధుడికి ఉన్న మరో పేరు-

1) అంగీరసుడు         2) తథాగతుడు    

3) శాక్యముని          4) పైవన్నీ

 

10. కిందివారిలో బౌద్ధమతంలో చేరిన ప్రముఖులు, వారి వృత్తులను జత చేయండి.

1) ఉపాలి ఎ) వేశ్య
2) ఆమ్రపాళి బి) వైశ్యుడు
3) అంగుళీమాల సి) నిమ్నకులం (మంగళి)
4) అనాథ పిండకుడు డి) గజదొంగ, హంతకుడు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ     4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

 

11. బుద్ధుడి బోధనలైన ఆర్య సత్యాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) ప్రపంచమంతా దుఃఖమయం    

బి) దుఃఖానికి కారణం కోరికలు

సి) కోరికలను జయించాలి 

డి) అష్టాంగ మార్గం అనుసరించాలి

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి, డి 

3) ఎ, సి          4) ఎ, బి, సి

 

12. బౌద్ధమతంలోని త్రిపీఠకాల్లో లేనిది-

1) వినయ పీఠిక        2) సుత్త పీఠిక

3) అభిదమ్మ పీఠిక      4) ధర్మ పీఠిక

 

13. కింది సంఘటనలు, చిహ్నాలను జతపరచండి.

1) సిద్ధార్థుడి పుట్టుక ఎ) కమలం 
2) బుద్ధుడి మొదటి బోధన బి) చక్రం
3) బుద్ధుడి జ్ఞానోదయం సి) బోధి వృక్షం
4) బుద్ధుడి మరణం డి) స్తూపం

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి 4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

 

14. కిందివాటిని జతచేయండి.

1) సరైన దృష్టి ఎ) సత్యాన్ని తెలుసుకోవడం
2) సరైన ఉద్దేశం బి) మనసును చెడు నుంచి విడిపించడం
3) సరైన ప్రసంగం సి) ఇతరులను బాధ పెట్టకపోవడం
4) సరైన క్రియ డి) ఇతరుల మంచి కోసం పనిచేయడం

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి       2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి   4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

 

15. కిందివాటిని జతచేయండి.

1) సరైన జీవితం ఎ) జీవితాన్ని గౌరవించడం
2) సరైన కృషి బి) చెడును ఎదిరించడం
3) సరైన ఏకాగ్రత సి) ధ్యాన సాధన
4) సరైన బుద్ధి డి) ఆలోచనలు నియంత్రించడం

1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి       2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి   4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

 

16. బౌద్ధమతానికి చెందిన త్రిరత్నాల్లో లేనిది?

1) బుద్ధుడు 2) జ్ఞానం 3) ధర్మం  4) సంఘం

 

17. బౌద్ధమతంలో బోధనలు ప్రధానంగా ఏ భాషలో ఉన్నాయి?    

1) పాళి  2) సంస్కృతం  3) మగది  4) అవధి

 

18. కిందివాటిని పరిశీలించి, సరైన సమాధానం గుర్తించండి.

ఎ) వినయ పీఠిక - ఉపాలి

బి) సుత్త పీఠిక - ఆనందుడు

సి) అభిదమ్మ పీఠిక - మొగలి పుత్తతిస్సా

1) ఎ, బి, సి        2) ఎ, బి    

3) ఎ మాత్రమే      4) ఏదీకాదు 

 

19. కిందివాటిలో సుత్త పీఠికలో భాగం కానిది-

1) మధ్యమ నికాయ     2) సంయుక్త నికాయ

3) అంగత్త నికాయ     4) కౌశిక నికాయ

 

20. కిందివాటిని జతపరచండి.

బౌద్ధ సమావేశాలు అధ్యక్షులు
1) ఒకటో సమావేశం ఎ) మహాకశ్యప
2) రెండో సమావేశం బి) వసుమిత్రుడు
3) మూడో సమావేశం సి) తిస్సా
4) నాలుగో సమావేశం డి) సబాకామి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి       2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి   4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి

 

21. కిందివాటిలో మహాయాన బౌద్ధమతానికి సంబంధించి సరైంది?

ఎ) మహాసాంఘిక మహాయానంగా మారింది.

బి) వీరు బుద్ధుడిని దేవుడిగా, అవతార పురుషుడిగా భావిస్తారు.

సి) మహాయాన సిద్ధాంతకర్త ఆచార్య నాగార్జునుడు.

డి) వీరు సంస్కృత భాష ద్వారా ప్రచారం చేశారు.

1) ఎ, బి, సి, డి       2) ఎ, సి, డి    

3) ఎ, బి, డి        4) ఎ, డి

 

22. కిందివాటిలో హీనయాన బౌద్ధానికి సంబంధించి సరైనవి?

ఎ) వీరు బుద్ధుడిని గురువుగా ఆరాధిస్తారు.

బి) వీరి బోధనలు ప్రాకృత భాషలో ఉన్నాయి. 

సి) సిద్ధార్థుడే బుద్ధుడి ఆఖరి జన్మ అని నమ్ముతారు.

డి) క్రతువులను నిరాకరిస్తారు.

1) ఎ, బి       2) ఎ, బి, సి, డి  

3) ఎ, సి, డి     4) ఎ, బి, డి 

 

23. కిందివాటిని జతచేయండి.

1) స్తూపం ఎ) అస్తికలపై నిర్మించిన స్తూపాలు
2) ధాతుగర్భిత స్తూపం బి) సన్యాసుల వస్తువులపై నిర్మించేవి
3) పారిభోజక స్తూపం సి) అర్ధచంద్రాకార నిర్మాణం
4) ఉద్దేశిక స్తూపం డి) ఎలాంటి వస్తువులు లేకుండా నిర్మించేవి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి       2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ   4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి

 

24. ప్రపంచంలో అతి పెద్ద స్తూపం?

1) సాంచి       2) సారనాథ్‌   

3) బోరోబుదుర్‌       4) అమరావతి

 

25. బుద్ధుడి జన్మవృత్తాంతం గురించి తెలిపే కథలు?

1) పురాణాలు       2) ధర్మసూత్రాలు   

3) జాతక కథలు       4) ఇతిహాసాలు

 

26. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానం గుర్తించండి.

ఎ) అమరావతి స్తూపాలను కనుక్కున్నది కల్నల్‌ మెకంజీ.

బి) అమరావతి స్తూప శిథిలాలు కొన్ని లండన్‌లో, మరికొన్ని మద్రాసులో ఉన్నాయి.

సి) అజంతా, ఎల్లోరా శిల్పాలకు ప్రేరణ బౌద్ధమతం.

డి) అమరావతి స్తూపంలో నలగిరి ఏనుగును బుద్ధుడు శాంతపరిచినట్లు ఉంది

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి, డి   

3) ఎ, సి, డి       4) ఎ, సి 

 

27. బౌద్ధమత ఆచరణకు సంబంధించి కిందివారిలో భిన్నమైనవారు?

1) అశోకుడు        2) బిందుసారుడు   

3) అజాత శత్రువు       4) కాలాశోకుడు

 

28. కిందివాటిలో ఆచార్య నాగార్జునుడికి సంబంధించి సరైనవి?

ఎ) విదర్భలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.

బి) ఇతడిని రెండో తథాగతుడు, ఇండియన్‌ ఐన్‌స్టీన్‌ అంటారు.

సి) మాధ]్యమిక వాదం, శూన్యవాదం బోధించాడు.

డి) ఇతడి గ్రంథాల్లో ప్రముఖమైనవి సుహృలేఖ, రసరత్నాకర.

1) ఎ, డి          2) ఎ, సి, డి    

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, సి 

 

29. నాలుగో బౌద్ధ సమావేశం నిర్వహించినవాడు కనిష్కుడు. అయితే దీనికి ఉపాధ్యక్షులు ఎవరు?

1) నాగార్జునాచార్య        2) అశ్వఘోషుడు   

3) వసుమిత్రుడు       4) 1, 2

 


సమాధానాలు

1-2; 2-4; 3-3; 4-1; 5-4; 6-3; 7-1; 8-2; 9-4; 10-2; 11-2; 12-4; 13-1; 14-1; 15-2; 16-2; 17-1; 18-1; 19-4; 20-3; 21-1; 22-2; 23-2; 24-3; 25-3; 26-2; 27-2; 28-3; 29-4. 

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 27-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తొలి సమాజంలో ఆ కానుకలపై హక్కులు ఆడవారికే!

తొలి సమాజం - మతోద్యమాలు

 

భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే సనాతన సంస్కృతి వర్ధిల్లి హిందూ మతం విస్తరించింది. అనంతరం అభ్యుదయభావాలతో కూడిన బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించాయి. పురాతన ధర్మంలోని లోపాలను, వర్ణం, మత ఆధారిత వివక్షలను ప్రశ్నించాయి. ఈ పరిణామ క్రమాన్ని, సమాజంలో వచ్చిన మార్పులను అభ్యర్థులు తెలుసుకోవాలి. గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుల జీవిత విశేషాలు, వారి బోధనలు, మతవ్యాప్తి పద్ధతులు, సంబంధిత ప్రాంతాల గురించి సమగ్ర అవగాహన పెంచుకోవాలి.

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1. సత్యాన్వేషణకు స్థిరనివాసం లేకుండా ఒక గ్రామం నుంచి మరొక గ్రామం; ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉండేవారిని ఏమంటారు?

1) పరివ్రాజకులు        2) భిక్షువులు    

3) తిరిగేవాళ్లు       4) పైవారందరూ


2. కిందివారిలో పరివ్రాజకులు కానివారు?

1) మక్కలి గోసల        2) అజిత కేశకంబలి

3) కౌటిల్యుడు        4) గౌతమ బుద్ధుడు


3. ‘పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచన ఎలా’ .... అని అన్వేషణ చేసినవారు?

1) వర్ధమాన మహావీరుడు    2) అజిత కేశకంబలి

3) బుద్ధుడు             4) గోసల


4. ‘పాపాల నుంచి విముక్తిని పొందడానికి శరీరాన్ని కఠోర శ్రమకు గురిచేయాలి’ అని చెప్పినవారు-

1) వర్ధమాన మహావీరుడు     2) కంబలి     

3) బుద్ధుడు         4) గోసల


5. ‘ప్రపంచమంతా దుఃఖమయం.. దుఃఖాన్ని జయించడం ఎలా’ అని అన్నదెవరు?

1) వర్ధమాన మహావీరుడు   2) అజిత కేశకంబలి

3) గౌతమ బుద్ధుడు         4) మక్కలి గోసల


6. గౌతమ బుద్ధుడు ప్రబోధించిన మార్గం?

1) ప్రారంభ మార్గం        2) మధ్యేమార్గం

3) అంతిమ మార్గం        4) బోధనలు


7. బుద్ధుడి అనుచరులు అతడి బోధనలను ఏ పేరుతో సంకలనం చేశారు?

1) గ్రంథాలు       2) బోధనలు  

3) త్రిపీఠకాలు       4) పంచవ్రతాలు


8. క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఆర్యులు ఏ ప్రాంతమంతటా విస్తరించారు?

1) మధ్య భారతదేశం   2) ఉత్తర భారతదేశం

3) దక్షిణ భారతదేశం   4) నైరుతి భారతదేశం


9. క్రీ.పూ.6వ శతాబ్దంలో 60 మత శాఖలు ఉన్నాయని పేర్కొన్న చరిత్రకారులు?

1) ఆర్‌.డి.బెనర్జీ      2) సర్‌ జాన్‌ మార్షల్‌

3) నీలకంఠ శాస్త్రి      4) రోమిల్లా థాపర్‌


10. పురుష సూక్తంలో ప్రజాపతి దేహం నుంచి నాలుగు వర్ణాలు ఆవిర్భవించినట్లు ఉంది. వాటిలో తప్పుగా జత చేసింది? 

1) బ్రాహ్మణులు తల    2) క్షత్రియులు దేహం

3) వైశ్యులు పొట్ట 4) శూద్రులు పాదాలు


11. గోత్రం అనే పదం ఏ కులం నుంచి పుట్టింది?    

1) బ్రాహ్మణ  2) క్షత్రియ  3) వైశ్య  4) శూద్ర


12. గోత్రం అనే పదం ఏ జంతువుకు సంబంధించింది?

1) ఆవు   2) ఎద్దు   3) పులి   4) పాము


13. మనుస్మృతిలో ఎన్ని రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి?    

1) 7     2) 8      3) 6      4) 4


14. కిందివాటిలో తొలి సమాజ కాలానికి సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం?

ఎ) రక్త సంబంధీకులను వివాహం చేసుకునే ఆచారం ఉండేది కాదు.

బి) కులం కుటుంబాలను, వంశం పుట్టుకను తెలియజేస్తుంది.

సి) పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉండేది.

డి) కన్యాదానం చేయడం ఆచారంగా ఉండేది.

1) బి మాత్రమే       2) ఎ మాత్రమే

3) బి, డి         4) ఎ, డి


15. బహు భార్యత్వం ఉండటాన్ని ఏమంటారు?

1) పాలిగమీ       2) పాలియాండ్రి

3) ఎండోగమీ       4) ఎక్సోగమీ


16. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) తొలి సమాజ కాలంలో పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయమవుతుంది.

బి) తొలి సమాజ కాలంలో వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్‌ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి.

సి) శూద్రులు ద్విజులకు బానిసలుగా, కూలీలుగా ఉండేవారు.

డి) తొలి సమాజాల కాలంలో వర్ణ ధర్మాలను బట్టి గౌరవం, పదవులు ఉండేవి కావు

1) ఎ, బి, సి, డి      2) బి, సి, డి   

3) ఎ, బి, సి       4) ఎ, సి, డి


17. తొలి సమాజ కాలంలో వ్యవసాయదారులుగా పురోగమించిన వర్ణం? 

1) వైశ్యులు       2) శూద్రులు   

3) క్షత్రియులు       4) బ్రాహ్మణులు


18. తొలి సమాజ కాలంలో పురుషులు, స్త్రీలు ఎన్ని పద్ధతుల్లో ఆస్తిని కలిగి ఉండేవారు (వరుసగా)?

1) 6 - 7   2) 7 - 6   3) 8 - 7   4) 8 - 6


19. తొలి సమాజ కాలంలో వివాహ సందర్భంలో స్త్రీకి ఇచ్చే కానుకలపై ఎవరికి హక్కు ఉండేది?    

1) భర్తకు              2) స్త్రీకి మాత్రమే 

3) భార్యాభర్తలిద్దరికీ       4) స్త్రీ తల్లిదండ్రులకు


20. స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు?

1) ఎండోగమీ       2) పాలియాండ్రి  

3) పాలిగమీ       4) ఎక్సోగమీ


21. బౌద్ధమత గ్రంథాల ప్రకారం క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఎన్ని మతాలుండేవి?

1) 60     2) 62     3) 63    4) 363


22. ‘ఏదీ మానవుడి చేతిలో లేదు జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని చెప్పినవారు?

1) బుద్ధుడు         2) వర్ధమాన మహావీరుడు   

3) మక్కలి గోసల     4) ఆరుణి


23. పురాణ కశ్యపుడు ఏ వ్యక్తికి గురువు?

1) మక్కలి గోసల       2) వర్ధమానుడు   

3) బుద్ధుడు       4) ఉద్దాలక


24. కర్మ సిద్ధాంతాలను నమ్మని మతం?

1) హిందూ       2) ఇస్లాం   

3) అజీవక        4) బౌద్ధ, జైన


25. లోకాయుతులు లేదా చార్వాకుల మత శాఖ స్థాపకుడు?

1) బృహస్పతి       2) అజిత కేశకంబలి 

3) పకుద కాత్యాయన       4) గౌతముడు


26. ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించిన మతం-

1) బౌద్ధమతం       2) జైనమతం       

3) చార్వకమతం       4) హిందూమతం


27. లోకాయుత మత ప్రధాన ప్రచారకుడు

1) చార్వాకుడు       2) బృహస్పతి   

3) గోసల       4) అజితకేశ కంబలి


28. లోకాయుతులు చెప్పిన వాస్తవిక భౌతిక వాదం ఏ శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది?

1) భూగోళశాస్త్రం       2) గణితశాస్త్రం   

3) సామాన్య విజ్ఞానశాస్త్రం    4) పౌరశాస్త్రం


29. రుగ్వేద శ్లోకాల్లో ప్రస్తావించిన జైనమత తీర్థంకరులు?

1) వృషభనాథుడు, వర్ధమానుడు       2) వర్ధమానుడు, పార్శ్వనాథుడు

3) వృషభనాథుడు, అరిష్టనేమి   4) అరిష్టనేమి, వర్ధమానుడు


30. కిందివాటిని జతపరచండి.

1) ఒకటో తీర్థంకరుడు ఎ) వర్ధమాన మహావీరుడు
2) రెండో తీర్థంకరుడు బి) అరిష్టనేమి
3) 23వ తీర్థంకరుడు సి) వృషభనాథుడు
4) 24వ తీర్థంకరుడు డి) పార్శ్వనాథుడు
  ఇ) అజితనాథుడు

1) 1-సి, 2-ఇ, 3-డి, 4-ఎ     2) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ

3) 1-ఇ, 2-బి, 3-డి, 4-ఎ     4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ


31. కిందివాటిలో సరికానిది?

ఎ) వర్ధమాన మహావీరుడు క్రీ.పూ.450లో జన్మించాడు.

బి)  వర్ధమాన మహావీరుడు కుంద గ్రామంలో జన్మించాడు.

సి) వర్ధమాన మహావీరుడి తండ్రి సిద్ధార్థుడు.

డి) వర్ధమాన మహావీరుడి వంశం జ్ఞాత్రిక.

1) ఎ, సి      2) ఎ, డి   

3) ఎ మాత్రమే       4) సి మాత్రమే


32. మహావీరుడు ఇంటి నుంచి వెళ్లే సమయానికి అతడి వయసు ఎన్నేళ్లు?

1) 29     2) 40    3) 30    4) 39 


33. వర్ధమాన మహావీరుడు ఎన్నేళ్లు తపస్సు చేశాడు?

1) 29     2) 10    3) 12    4) 7


34. వర్ధమాన మహావీరుడు 42 ఏళ్ల వయసులో కైవల్యాన్ని పొందిన ప్రాంతం?

1) కుందగ్రామం - వేపవృక్షం     2) జృంభిక గ్రామం - సాలవృక్షం

3) కుశీనగరం - మర్రివృక్షం 4) పావపురి - రావివృక్షం


35. వర్ధమాన మహావీరుడి (జైనమతం) పంచ వ్రతాల్లో లేనిది?

1) అస్తేయా, అపరిగ్రహ     2) జీవహింస చేయరాదు 

3) అసత్యం ఆడరాదు     4) బ్రహ్మచర్యం పాటించరాదు


36. జైన మతానికి చెందిన త్రిరత్నాల్లో లేనిది?

1) సరైన క్రియ     2) సరైన నమ్మకం 

3) సరైన జ్ఞానం     4) సరైన శీలం


37. మహావీరుడు ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించాడు. దీన్ని ఏమంటారు?

1) మధ్యేమార్గం     2) సామ్యవాదం 

3) స్వాదవాదం     4) తపస్సు


38. మహావీరుడి శిష్యుల సంఖ్య?

1) 9     2) 10     3) 11     4) 12


39. మహావీరుడి శిష్యులను ‘గాంధారులు’ అని అంటారు. వారిలో ముఖ్యమైనవాడు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) సధాకర శాస్త్రి 

3) తులసీదాస్‌     4) ఆర్య సుధారామన్‌


40. వర్ధమాన మహావీరుడి తర్వాత జైన మతం కింది ఏ విధంగా విడిపోయింది?

1) తీర్థంకరులు - దిగంబరులు     2) శ్వేతంబరులు - గాంధారులు

3) శ్వేతంబరులు - దిగంబరులు     4) శ్వేతంబరులు - తీర్థంకరులు


41. ‘సృష్టిలో ఉన్న ప్రతివాటికి ఆత్మ ఉంటుంది’ అని బోధించిన మతం-    

1) బౌద్ధం  2) హిందూ  3) జైనం  4) అజవిక


42. జైనమత సమావేశాలు జరిగిన ప్రాంతాలు, వాటి అధ్యక్షులను పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి.

ఎ) ఒకటో సమావేశం - పాటలీపుత్రం - స్థూల భద్ర

బి) రెండో సమావేశం - వల్లభి - దేవార్ధి క్షమాశ్రమణ

1) ఎ సరైంది, బి సరికాదు         2) బి సరైంది, ఎ సరికాదు

3) ఎ, బిలు రెండూ సరైనవి     4) ఎ, బిలు రెండూ సరికావు


43. జైనమత ప్రచారానికి సహాయం చేసిన మగధ రాజు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) ఆరో బిందుసారుడు

3) అజాత శత్రువు     4) మహాపద్మనందుడు


44. జైనమతాన్ని పోషించిన ప్రముఖ రాజవంశీయులు?

1) కళింగ, గాంగులు  2) కదంబులు, చాళుక్యులు 

3) రాష్ట్ర కూటులు    4) పైవారందరూ


45. జైనమతంలో చేరిన సామాజిక వర్గం?

1) వ్యవసాయదారులు     2) వ్యాపారులు 

3) దళితులు     4) క్షత్రియులు



సమాధానాలు

1-4; 2-3; 3-1; 4-1; 5-3; 6-2; 7-3; 8-2, 9-4; 10-3; 11-1; 12-1; 13-2; 14-1; 15-2; 16-1; 17-2; 18-2, 19-2; 20-4; 21-2; 22-3; 23-1; 24-3; 25-1; 26-3; 27-1; 28-3, 29-1; 30-1; 31-3; 32-3; 33-3; 34-2; 35-4; 36-1; 37-3; 38-3, 39-4; 40-3; 41-3; 42-3; 43-1; 44-4; 45-2.
 

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 03-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

‘ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు!’

భక్తి - సూఫీ ఉద్యమాలు

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

మధ్యయుగ భారతదేశంలో హిందువులను భక్తి ఉద్యమం, ముస్లింలను సూఫీ ఉద్యమం ప్రభావితం చేశాయి. వీటి పరస్పర ప్రేరణలతో మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించింది. భక్తి ఉద్యమంలో సాధువులు దేవతలను ఆరాధిస్తూ భజనలు చేస్తే, సూఫీ సన్యాసులు భక్తిని ప్రోత్సహించేందుకు ఖవ్వాలీ వంటి సంగీత ప్రక్రియలను ఆచరించారు. ప్రేమ, ఆరాధనలతో భగవంతుడిని చేరుకోవచ్చు అన్నదే రెండు ఉద్యమాల అంతరార్థం.  మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు, వర్ణ భేదాలను ఉద్యమకారులు వ్యతిరేకించారు. సమాజంలో చైతన్యాన్ని, మార్పును తెచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాలను వ్యాప్తి చేసిన ప్రముఖులు, వారి రచనలు, ప్రసిద్ధ బోధనలు, నాటి పరిస్థితుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

1.    ‘ధనవంతులు శివుడికి గుడి కడతారు. పేదవాడిని నేనేం చేస్తాను’ అని అన్నదెవరు?

1) అల్లమ ప్రభువు     2) రామానందుడు

3) బసవన్న     4) నింబార్కుడు


2.     పండరీపురంలో ఉన్న దేవుడు ఎవరు?

1) రాముడు     2) విఠలుడు

3) శివుడు     4) సాయిబాబా


3.     ‘ఇతరుల బాధను అర్థం చేసుకునేవాళ్లే వైష్ణవులు’ అని అన్నదెవరు?

1) నామ్‌దేవ్‌     2) నర్సీ మెహతా 

3) తుకారాం     4) ఏకనాథ్‌


4.     మరాఠీ భాషలో రాసిన భక్తి గేయాలను ఏమంటారు?

1) తేవారం 2) పాశురం 3) అభంగ్‌ 4) పైవన్నీ


5.     ‘విపరీతంగా అసహ్యానికి గురైన వాడిని, దెబ్బలు తిన్నవాడిని చూసి..’ అనే ఈ భక్తి గీతం రచించినవారు?

1) సంత్‌ తుకారాం     2) ఏకనాథ్‌ 

3) నామ్‌దేవ్‌     4) జ్ఞానేశ్వర్‌


6.     ‘మమ్మల్ని నిమ్నకులంలోని వాడిని చేసింది నువ్వే యథార్థానికి’ అని అన్నవారు?

1) చోఖామేళుడు     2) కర్మమేళుడు 

3) నామ్‌దేవ్‌     4) నందనార్‌


7.     ‘ప్రపంచాన్ని వదిలివేసి నిరాకార పరమ సత్యాన్ని ధ్యానించాలి’ అని చెప్పినవారు?

1) సిద్ధులు     2) యోగులు 

3) నాథపంథీలు     4) పైవారంతా


8.     ముస్లిం మార్మిక సాధువులుగా పేరొందినవారు?

1) సున్నీలు     2) షియాలు 

3) సూఫీలు     4) వహబీలు


9.     ఏకేశ్వరోపాసన కచ్చితంగా పాటించాలని, ప్రపంచాన్ని వేరేవిధంగా చూడటానికి హృదయానికి శిక్షణ ఇవ్వొచ్చని విశ్వసించినవారు?

1) సున్నీలు 2) షియాలు 3) సూఫీలు 4) సిద్ధులు


10. కింది జతలను పరిశీలించి సరైనదాన్ని గుర్తించండి.

ఎ) రక్స్‌ - నృత్యం చేయడం

బి) సామా - పాడటం

సి) జిక్ర్‌ - ఒక నామాన్ని/సూత్రాన్ని జపించడం

1) ఎ, బి, సి    2) బి    3) సి    4) బి, సి


11. సూఫీ గురువుల పరంపరను ఏమంటారు?

1) తరీకాను      2) వారసత్వం 

3) సిల్‌సిలా     4) పైవన్నీ


12. కిందివాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి.

సూఫీమత గురువులు ప్రాంతాలు
ఎ) మొయినుద్దీన్‌ చిష్టీ అజ్మీర్‌
బి) కుతుబుద్దీన్‌ భక్తియార్‌ కాకి ఢిల్లీ
సి) బందనవాజ్, గిసుదరాజ్‌ గుల్బర్గా
డి) నిజాముద్దీన్‌ ఔలియా ఢిల్లీ

1) డి సరైంది      2) బి, డి సరైంది

3) ఎ, బి, సి, డి సరైనవి   4) ఏదీకాదు


13. సూఫీ మత గురువులు సమావేశాలు జరిపే ప్రాంతాన్ని ఏమంటారు?

1) ఖాన్‌కాహ్‌     2) ధర్మశాల 

3) ఖాన్‌కాహ్, ధర్మశాల      4) దర్గా


14. సూఫీమత గురువుల సమాధులు ఏ పేరుతో ప్రసిద్ధి చెందాయి? 

1) మసీదు  2) మదర్సా  3) దర్గా  4) పైవన్నీ


15. మహాభాగవతాన్ని రచించిన పోతన నివసించిన బమ్మెర గ్రామం ఏ ప్రాంతానికి సమీపంలో ఉంది?

1) వరంగల్‌     2) నల్గొండ 

3) విజయవాడ     4) హైదరాబాద్‌


16. బమ్మెర పోతన ఏవిధంగా ప్రసిద్ధి చెందారు?

1) గొప్పకవి     2) సహజ కవి 

3) తెలుగు కవి     4) పైవన్నీ


17. తాళ్లపాక అన్నమాచార్యులకు సంబంధించి సరైన వాక్యాలు?

1) ఇతను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు.

2) పదకవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందారు.

3) ఈయన కీర్తనల్లో నైతికత, ధర్మం, నిజాయతీ వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.

4) ఈయన శ్రీ వేంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు రాశాడని అన్నమాచార్య జీవితచరిత్రము ద్వారా తెలుస్తుంది.

1) 1, 2, 3, 4    2) 2, 3, 4    

3) 2, 4    4) 1, 3, 4


18. చైతన్య మహాప్రభు ఏ ప్రాంతానికి చెందినవారు?

1) బిహార్‌     2) ఉత్తర్‌ప్రదేశ్‌ 

3) బెంగాల్‌     4) మధ్యప్రదేశ్‌


19. చైతన్య మహాప్రభు గురించి సరికాని అంశం?

1) ఈయన శైవసాధువు, సంఘసంస్కర్త.

2) భగవద్గీత, భాగవత పురాణాల ఆధారంగా భక్తి ప్రచారం చేశాడు.

3) భక్తితో నాట్యం చేయడాన్ని వ్యాప్తి చేశాడు.

4) హరేకృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారం చేశాడు.

1) 1, 2    2) 2, 4    

3) 1 మాత్రమే    4) 3 మాత్రమే


20. కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవారు? 

1) 15వ శతాబ్దం     2) 16వ శతాబ్దం 

3) 17వ శతాబ్దం     4) 18వ శతాబ్దం


21. కంచర్ల గోపన్నకు సంబంధించి సరికాని వాక్యం?

1) ఈయన శ్రీరాముడి భక్తుడు, కర్ణాటక సంగీతంలో కీర్తనలు రాశాడు.

2) తెలుగు భాషలో ప్రముఖ వాగ్గేయకారుడు.

3) దాశరథి శతకం రచించాడు.

4) దాశరథి శతకంలో 1008 పద్యాలున్నాయి.


22. భగవంతుడిని రామాకృతిలో భావన చేసిన రామచరిత మానస్‌ అనే కావ్యాన్ని రచించినవారు?

1) రామదాసు     2) కంచర్ల గోపన్న 

3) తులసీదాస్‌     4) మీరాబాయి


23. రామచరిత మానస్‌ ఏ భాషలో ఉంది?

1) బెంగాలీ 2) మరాఠి 3) అవధి 4) సంస్కృతం


24. నామ్‌ఘర్‌ అనే భగవన్నామస్మరణ, జపధ్యాన మందిరాలను ఏర్పాటు చేసినవారు?

1) తులసీదాస్‌     2) సూర్‌దాస్‌ 

3) రామదాసు     4) శంకరదేవుడు


25. కిందివారిలో అస్సామీ భాషలో నాటకాలు రాసినవారు?

1) శంకరదేవుడు     2) సూర్‌దాస్‌ 

3) తులసీదాస్‌     4) చైతన్య మహాప్రభు


26. మీరాబాయి ఎవరి శిష్యురాలు?

1) రవిదాసు     2) సూర్‌దాస్‌ 

3) తులసీదాస్‌     4) దాదు దయాళు


27. మీరాబాయి భజన గీతాలు నేటికీ ఏ రాష్ట్రంలో జనబాహుళ్యంలో ఉన్నాయి?

1) రాజస్థాన్‌     2) గుజరాత్‌ 

3) మహారాష్ట్ర     4) 1, 2 


28. మధ్యయుగ కాలంలో ప్రముఖ సంఘ, మత సంస్కర్త అయిన కబీర్‌కు సంబంధించి సరైంది?

1) ఇతను కాశీ/వారణాసి సమీపంలో నివసించారు.

2) ఈయన రామానందుడి శిష్యుడు, విప్లవభావాలు కలిగినవాడు.

3) ఈయన బోధనలు ప్రధాన మత సంప్రదాయాల సంపూర్ణ, తీవ్ర తిరస్కరణలపై ఆధారపడ్డాయి.

4) సంచార భజన బృందగాయకులు పాడుతూ వచ్చే సాఖీల పదాల ద్వారా ఈయన భావనలను మనం తెలుసుకోగలుగుతున్నాం.

1) 1, 2, 3, 4  2) 2, 3, 4  3) 1, 3, 4  4) 2, 4


29. ‘‘అన్ని జీవుల్లోనూ ఉండే ఓ అల్లా-రామ్, దయ ఉంచు నీ దాసులమీద శ్రీ ప్రభు’’ అని తెలిపినవారు?

1) తులసీదాస్‌     2) కబీర్‌ 

3) రామానందుడు     4) గురునానక్‌


30. ‘‘హిందూ, ముస్లిం ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొదటి సంఘ సంస్కర్త కబీర్‌’’ అని అన్న చరిత్రకారుడు ఎవరు?

1) కె.ఎస్‌.లాల్‌     2) ఆర్‌.ఎస్‌.త్రిపాఠి 

3) రోమిల్లా థాఫర్‌    4) ఆర్‌.డి.బెనర్జీ


31. గురునానక్‌ ఎక్కడ జన్మించారు?

1) తాల్వాండి     2) కర్తార్‌పూర్‌ 

3) లాహోర్‌     4) నాసిక్‌


32. కులం, స్త్రీ పురుష భేదంతో నిమిత్తం లేకుండా అనుచరులు కలిసి భోజనం చేసే వంటశాలను ఏమంటారు? 

1) లంగర్‌  2) ధర్మశాల  3) ఖాన్‌కాహ్‌ 4) 1, 2 


33. గురునానక్‌కు సంబంధించిన వాక్యాలను పరిశీలించి సమాధానం గుర్తించండి.

1) నామ్‌ అంటే సరైన ఆరాధన.

2) దాన్‌ అంటే ఇతరుల సంక్షేమం. 

3) ఇస్నాన్‌ అంటే మంచి నడవడిక.

4) సమాజం పట్ల దృఢమైన నిబద్ధతతో క్రియాశీలకమైన జీవనం గడపాలి.

1) 1, 2    2) 2, 3, 4    

3) 1, 2, 3, 4    4) 1, 3, 4


34. గురునానక్‌ జన్మించిన సంవత్సరం?

1) 1469  2) 1494  3) 1538  4) 1479 


35. గురునానక్‌కు జ్ఞానోదయం అయిన సంవత్సరం? 

1) 1469  2) 1494  3) 1538  4) 1479


36. గురునానక్‌ అధ్యయనం చేసిన భాషలు? 

1) పర్షియా 2) హిందీ 3) పంజాబీ 4) పైవన్నీ 


37. గురునానక్‌ బోధనలున్న గ్రంథం? 

1) ఆదిగ్రంథ్‌     2) గురుగ్రంథ సాహెబ్‌

3) 1, 2     4) నానక్‌ గ్రంథ్‌


38. వైష్ణవ ఉద్యమ ప్రచారకుడైన చైతన్యుడు ఏ విధంగా పేరు పొందారు?

1) శ్రీ గౌరంగ     2) శ్రీ విజయ    

3) శ్రీ తనయ     4) శ్రీ ఆళ్వారు


39. చైతన్యుడు బెంగాలీ భాషలో రచించిన పుస్తకం?

1) గీతానందం     2) శిక్షఅస్తక్‌ 

3) శిక్షసమాచార్‌     4) కృష్ణమంత్రం 


40. మీరాబాయి కృష్ణుడిపై రచించిన కీర్తనలు ఏ భాషలో ఉన్నాయి?

1) బ్రిజ్‌ 2) మరాఠీ 3) గుజరాతీ 4) సంస్కృతం


41. తులసీదాస్‌ రచించిన గ్రంథాలు?

1) రామచరిత మానస్‌     2) గీతావళి 

3) వినయ పత్రిక     4) పైవన్నీ


42. రాధాకృష్ణుల భక్తుడు అయిన సూర్‌దాస్‌ ప్రముఖ రచనలు?

1) సుర్‌సరావళి     2) సాహిత్యరత్న 

3) సుర్‌సాగర్‌     4) పైవన్నీ


43. మహాత్మాగాంధీకి ఇష్టమైన ‘‘వైష్ణవ జనతో తేనో కహియే’’ అనే భజనను రచించినవారు? 

1) శంకరదేవుడు     2) తులసీదాసు 

3) నర్సీమెహత     4) చైతన్య మహాప్రభు


44. ‘సూఫీయిజం’ అనే ఆంగ్ల పదం వాడుకలోకి వచ్చిన శతాబ్దం?

1) 16వ శతాబ్దం     2) 17వ శతాబ్దం 

3) 18వ శతాబ్దం     4) 19వ శతాబ్దం


45. భారతదేశంలో ప్రధానమైన సూఫీ మత శాఖ?

1) చిస్తి 2) నక్షాబందీ 3) సుహ్రవర్ది 4) సిల్‌సిలా


46. మొగలుల కాలంలో ఎన్ని సిల్‌సిలాలు ఉన్నట్లు అబుల్‌ ఫజల్‌ తన ఐనీ అక్బరీలో పేర్కొన్నాడు? 

1) 12        2) 1      3) 14     4) 15


47. ఢిల్లీ సుల్తానుల కాలం నుంచి వర్ధిల్లిన సిల్‌సిలా? 

1) సుహ్రవర్ది 2) చిస్తి 3) ఖాద్రీ 4) నక్షాబందీ

 


సమాధానాలు


1-3; 2-2; 3-2; 4-3; 5-1; 6-2; 7-4; 8-3; 9-3; 10-1; 11-3; 12-3; 13-3; 14-3; 15-1; 16-2; 17-1; 18-3; 19-2; 20-3; 21-4; 22-3; 23-3; 24-4; 25-1; 26-1; 27-4; 28-1; 29-2; 30-1; 31-1; 32-4;  33-3; 34-1; 35-2; 36-4; 37-3; 38-1; 39-2; 40-1; 41-4; 42-4; 43-3; 44-4; 45-1; 46-3; 47-1. 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 12-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చంద్రగిరి పర్వతాల్లో బాహుబలి!

జైన మతం

 


భారతదేశంలో పుట్టిన జైన మతం ఎంతో విశిష్టమైంది. అనుసరించే వారికి విప్లవాత్మక జీవన విధానాన్ని పరిచయం చేసింది. అహింసే పరమ ధర్మమని ప్రపంచానికి చాటి చెప్పింది. నైతిక, ఆధ్యాత్మిక శాంతికి బాటలు వేసింది. ప్రారంభంలో ఒక వెలుగు వెలిగినప్పటికీ మత విధానాల్లోని కఠిన నియమాలు, ఆచరణ సాధ్యం కాని అహింస కారణంగా ప్రజాదరణకు నోచుకోలేదు. చివరికి మైనారిటీ మతంగా మిగిలిపోయింది. మనుషుల సహజ ఆలోచనా ధోరణిని, ప్రాపంచిక దృక్పథాన్ని సమూలంగా మార్చగలిగే ఈ మతం ఆవిర్భావం, ఆచరణ విధానాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. జైనుల ఆరాధ్యనీయులు, వారి జీవిత విశేషాలు, మత గ్రంథాలు, పవిత్ర స్థలాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.     వర్ధమాన మహావీరుడు ఒక

1) బ్రాహ్మణుడు    2) క్షత్రియుడు  

3) వైశ్యుడు      4) శూద్రుడు


2.     కిందివాటిలో సరికానిది?

1) జైనమతం భారతదేశంలో మొదటి ప్రాచీన మతం.

2) జైనమత గురువులను తీర్థంకరులు అంటారు.

3) తీర్థాంకరులు అంటే జీవనస్రవంతిని దాటడానికి వారధి నిర్మించేవారు.

4) మొత్తం తీర్థంకరులు 24 మంది.


3.     కిందివాక్యాల్లో రిషభనాథుడి గురించి సరైనవి.

ఎ) మొదటి తీర్థంకరుడు, ఇతడి ప్రస్తావన రుగ్వేదంలో ఉంది.

బి) దక్షిణ భారతదేశంలోని అస్మక అనే ప్రాంతానికి చెందినవారు.

సి) ఇతడి చిహ్నం - వృషభం.

డి) ఇతడి కుమారులు భరతుడు, బాహుబలి; కుమారై బ్రాహ్మీ.

1) ఎ, బి, సి, డి      2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి      4) ఎ, డి


4.     కిందివాటిలో పార్శ్వనాథుడికి సంబంధించి సరైనవి.

ఎ) 23వ తీర్థంకరుడు.

బి) వర్ధమాన మహావీరుడి కంటే 250 సంవత్సరాలు పూర్వం జీవించాడు.

సి) ఇతడి చిహ్నం - సర్పం.

డి) కాశీరాజు అశ్వసేన, వామల దేవి కుమారుడు.

1) ఎ, బి, సి      2) ఎ, బి, సి, డి  

3) బి, డి      4) ఎ, సి, డి


5.     వర్ధమాన మహావీరుడికి సంబంధించి సరైనవి?

ఎ) ఇతడు 24వ తీర్థంకరుడు.

బి) వైశాలీ సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు.

సి) వర్థమానుడు జ్ఞాత్రిక వంశానికి చెందిన క్షత్రియుడు.

డి) తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల.

1) ఎ, బి       2) ఎ, బి, సి, డి  

3) ఎ, బి, డి      4) బి, సి, డి


6.     వర్ధమాన మహావీరుడు 42 ఏళ్ల వయసులో జ్ఞానోదయం పొందిన ప్రాంతం, నది వరుసగా?

1) జృంభిక - రుజపాలిక      2) జృంభిక - నర్మదా నది

3) జృంభిక - కుశి నది       4) వైశాలి - రుజపాలిక


7.     వర్ధమాన మహావీరుడి బిరుదులు, వాటి అర్థాల్లో సరికానిది?

1) జిన ఎ) కోరికలు జయించినవాడు
2) మహావీరుడు బి) ఇంద్రియాలపై నియంత్రణ ఉన్నవాడు
3) నిర్గందుడు సి) బంధాలు లేనివాడు
4) కేవలి డి) సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి  4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి


8.     కిందివాటిలో పంచవ్రతాల్లో లేనిది?

1) అహింస      2) బ్రహ్మచర్యం  

3) తపస్సు      4) అపరిగ్రహం


9.     జైనమత పంచవ్రతాల్లో వర్ధమానుడు చేర్చింది?

1) అస్తేయ      2) అపరిగ్రహం 

3) బ్రహ్మచర్యం       4) సత్యం


10. వర్ధమాన మహావీరుడి దృష్టిలో ‘ఆత్మకర్మ నుంచి విముక్తి పొందే స్థితి’ అంటే ఏమిటి?

1) కేవల (కైవల్య) స్థితి      2) గొప్ప స్థితి  

3) ఆనంద స్థితి      4) పైవన్నీ 


11. కిందివాటిలో త్రిరత్నాల్లో లేనిది?

1) సమ్యక్‌ క్రియ       2) సమ్యక్‌ జ్ఞానం

3) సమ్యక్‌ దృష్టి        4) సమ్యక్‌ విశ్వాసం


12. కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) సల్లేఖన వ్రతం: ఆహార పానీయాలు తీసుకోకుండా కఠిన ఉపవాస దీక్ష ద్వారా మరణం

బి) ప్రయోగ పద్ధతి: ప్రవహించే నీటిలో మునిగి మరణం

1) ఎ, బి సరైనవి  2) ఎ సరైంది, బి సరికాదు

3) ఎ, బి సరికావు      4) ఎ సరికాదు, బి సరైంది


13.    జైనమత గ్రంథాలను ఏమంటారు? అవి ఏ భాషలో ఉన్నాయి?

       గ్రంథం             భాష
1) అంగాలు - అర్థమాగధ 2) అంగాలు - హిందీ
3) త్రిరత్నాలు - అర్థమాగధ 4) త్రిరత్నాలు - హిందీ

 
14. కిందివారిలో దిగంబరులు, శ్వేతాంబరుల నాయకులు వరుసగా?

1) స్థూలబాహు - భద్రబాహు      2) భద్రబాహు - స్థూలబాహు

3) స్థూలబాహు - చంద్రగుప్తుడు     4) భద్రబాహు - చంద్రగుప్తుడు


15. జైనమత సమావేశాలు, అవి జరిగిన ప్రాంతాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) మొదటి సమావేశం క్రీ.పూ. 3వ శతాబ్దంలో పాటలీపుత్రలో జరిగింది.

బి) రెండో సమావేశం క్రీ.శ. 5/6వ శతాబ్దంలో వల్లభి గుజరాత్‌లో జరిగింది.

1) ఎ, బి సరైనవి      2) ఎ, బి సరికావు

3) ఎ సరైంది, బి సరికాదు   4) ఎ సరికాదు, బి సరైంది


16. కిందివాటిలో సరైనవి?

ఎ) గోమఠేశ్వరుడు అంటే బాహుబలి.

బి) ఇది ఏకశిల విగ్రహం.

సి) ఈ విగ్రహం కర్ణాటకలోని శ్రావణ బెళగోళ వద్ద ఉంది.

డి) ఈ విగ్రహం ఎత్తు 57 అడుగులు.

1) ఎ, సి       2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి      4) ఎ, బి, సి, డి


17.    గోమఠేశ్వరుడి విగ్రహం ఏ పర్వతాల్లో ఉంది?

1) ఆరావళి పర్వతాలు      2) చంద్రగిరి పర్వతాలు

3) కైలాస పర్వతాలు       4) వారాహి పర్వతాలు


18. జైనులు పూజించే స్త్రీ దేవతా విగ్రహం, అది ఉన్న ప్రదేశం?

1) విద్యాదేవిన్‌ - శ్రావణ బెళగోళ     2) సరస్వతి - బాసర

3) విద్యాదేవిన్‌ - దిల్వారా ఆలయం     4) సరస్వతి - కొలనుపాక


19. దిల్వారా దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌      2) రాజస్థాన్‌  

3) మధ్యప్రదేశ్‌      4) మహారాష్ట్ర


20. దిల్వారా అనే జైన ఆలయం ఉన్న కొండలు?

1) చంద్రగిరి కొండలు  2) మౌంట్‌ అబూ కొండలు

3) బ్రహ్మగిరి కొండలు  4) కైలాసగిరి కొండలు


21. పరిశిష్ట పర్యన్‌ అనే గ్రంథం ఎవరు రచించారు?

1) స్థూలబాహు      2) భద్రబాహు  

3) హేమచంద్ర      4) సుదర్శన్‌


22. జైన అశోకుడిగా పేరు పొందిన రాజు?

1) అశోకుడు       2) సంప్రతి   

3) చంద్రగుప్తుడు      4) ఖారవేలుడు


23. ఒడిశాలోని ఉదయగిరి, ఖండగిరి/స్కంధగిరి వద్ద జైన క్షేత్రాలు నిర్మించిన రాజు?

1) రుద్రదమనుడు      2) చాముండరాయ

3) ఖారవేలుడు       4) చంద్రగుప్తుడు


24. జైనమతంలోని శ్వేతంబరులు, దిగంబరుల గురించి ప్రస్తావించిన చైనా యాత్రికుడు?

1) పాహియాన్‌      2) హుయాన్‌త్సాంగ్‌

3) 1, 2       4) కన్ఫ్యూషియస్‌


25. పంచవత్రాల్లో ‘అపరిగ్రహం’ అంటే ఏమిటి?

1) ఆస్తిని దొంగిలించకూడదు.  

2) అవసరానికి మించి ఆస్తి కలిగి ఉండకూడదు.

3) 1, 2  4) ఆస్తిని జైన గుడికి అప్పగించాలి.


26. జైనమత మొదటి సమావేశానికి అధ్యక్షుడు?

1) స్థూలబాహు      2) భద్రబాహు

3) దేవరధి       4) వర్ధమానుడు


27. కిందివాటిలో అజీవక మతం గురించి సరైనవి?

ఎ) దీని స్థాపకుడు గోశాల మక్కరిపుత్ర.

బి) దీనికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు.

సి) ఇతడి సిద్ధాంతం ‘ఉద్బేదవాదం’.

డి) బిందుసారుడు ఈ మతాన్ని స్వీకరించారు.

1) ఎ, సి, డి      2) ఎ, బి, సి, డి  

3) ఎ, బి, డి      4) ఎ, డి


28. చార్వక మతస్థాపకుడు?

1) అజిత కేశకంబలి      2) మక్కలి గోశాల

3) వర్ధమానుడు       4) బృహస్పతి


29. జైనకల్ప సూత్రం రచించినవారు?

1) స్థూలబాహు      2) బాహుబలి    

3) భద్రబాహు       4) భరతుడు


30. జైనుల ప్రథమ తీర్థంకరుడు రిషభనాథుడు ఎక్కడ నిర్యాణం చెందాడు?

1) శ్రావణ బెళగోళ  2) కైలాస శిఖర పర్వతం

3) సారనాథ్‌      4) గయ


31. రిషభనాథుడి గురించి ఇతిహాసం, పురాణాల్లో ఏ అవతారం అని పేర్కొన్నారు? 

1) బ్రహ్మ   2) శివ   3) విష్ణు   4) ప్రజాపతి


32. జైనమత గ్రంథాల ప్రకారం 24 మంది తీర్థంకరుల కులం?

1) బ్రాహ్మణులు      2) క్షత్రియులు  

3) శూద్రులు      4) వైశ్యులు


33. పార్శ్వనాథుడు జైనమతంలో చేర్చిన సిద్ధాంతం/ సిద్ధాంతాలు?

1) అహింస, సత్యం       2) అపరిగ్రహం   

3) అస్తేయం      4) పైవన్నీ


34. రిషభనాథుడు, వర్ధమాన మహావీరుల చిహ్నాలు వరుసగా?

1) సింహం, పాము      2) పాము, సింహం  

3) ఎద్దు, సింహం      4) సింహం, ఎద్దు


35. సాద్వాదం అంటే?

1) హిందూమత వేదాంతం 2) జైనమత వేదాంతం

3) బౌద్ధమత వేదాంతం      4) క్రైస్తవమత వేదాంతం


36. అనేకాంతవాదం అంటే?

1) జైనమతంలోని నాలుగు సిద్ధాంతాలు 

2) జైనమతంలోని రెండు సిద్ధాంతాలు

3) బౌద్ధమతంలోని మూడు సిద్ధాంతాలు

4) జైనమతంలోని అయిదు సిద్ధాంతాలు


37. ఏ రాష్ట్రకూట రాజు సల్లేఖన వ్రతం చేసి మరణించారు?

1) దంతిదుర్గుడు       2) అమోఘవర్షుడు  

3) నాలుగో ఇంద్రుడు      4) రెండో కృష్ణుడు


38. రాజస్థాన్, గుజరాత్‌లలో ఎక్కువగా ఉన్న మతం?

1) జైనం  2) బౌద్ధం  3) అజీవకం  4) క్రైస్తవం


39. సల్లేఖన వ్రతం ఏ మతానికి చెందింది?

1) హిందూ  2) జైన   3) బౌద్ధ  4) చార్వాక


40. జైన మతస్థులు వాసుదేవుడికి దగ్గరి చుట్టంగా ఎవరిని భావిస్తారు?

 1) రిషభనాథుడు 2) అరిష్టనేమి 3) పార్శ్వనాథుడు      4) మహావీరుడు

 


సమాధానాలు

1-2, 2-1; 3-1; 4-2; 5-2; 6-1; 7-1; 8-3; 9-3; 10-1; 11-3; 12-1; 13-1; 14-2; 15-1; 16-4; 17-2; 18-3; 19-2; 20-2; 21-3; 22-2; 23-3; 24-2; 25-2; 26-1; 27-2; 28-1; 29-3; 30-2; 31-3; 32-2; 33-4; 34-3; 35-2; 36-2; 37-3; 38-1; 39-2; 40-3.

 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


గ‌ద్దె న‌ర‌సింహారావు

Posted Date : 26-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 బ్రిటిష్‌ ఇండియాలో విద్యా విధానం

 సనాతన విద్యకు సంస్కరణలు! 

బ్రిటిష్‌ వలస పాలనలో భారతీయ విద్యావ్యవస్థ సనాతనం నుంచి ఆధునికతను సంతరించుకుంది. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు, సమాజ నియమాలు, చట్టాలను అర్థం చేసుకోవడానికి బ్రిటిషర్లు విద్యాసంస్థలను, ఆంగ్ల బోధనను ఇక్కడ ప్రారంభించారు. యూనివర్సిటీలను నెలకొల్పారు. దాంతో సరికొత్త భారత మేధావి వర్గం పుట్టుకొచ్చింది. వారు  సామ్రాజ్యవాద పోకడలను, ఆర్థిక దోపిడీని అర్థం చేసుకున్నారు. ఆంగ్లేయుల అరాచకాలను ఎదిరించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని మన వాళ్లలో పెంపొందించేందుకు కృషి చేశారు.  అప్పట్లో ఏర్పాటు చేసిన విద్యా విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ పరిణామక్రమంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.  భారతీయుల విద్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం ఏ మేరకు బాధ్యత తీసుకుంది, ఎప్పుడెప్పుడు ఎలాంటి సంస్కరణలను అమలు చేసిందో తెలుసుకోవాలి. 


భారతదేశంలో బ్రిటిష్‌ పరిపాలన ప్రారంభానికి ముందు విద్య సంప్రదాయ విధానంలో ఉండేది. విద్యాకేంద్రాలుగా హిందువులకు గురుకులాలు, దేవాలయాలు వ్యవహరిస్తే, ముస్లింలకు పర్షియన్‌ మదర్సాలు ఉండేవి. ఈ విద్యాసంస్థలు, మదర్సాలు ఎక్కువగా రాజ కుటుంబీకులు/వారి ఉన్నత ఉద్యోగులు/సుల్తానులు, జమీందారులు, కులీన కుటుంబాల పోషణలో ఉండేవి. హిందూ విద్యాసంస్థల్లో పురాణ ఇతిహాసాలు, ప్రాచీన సాహిత్యం, ఖగోళం, గణితం, వైద్యం, తత్వం లాంటివి పాఠ్యాంశాలుగా ఉండేవి. మత/నైతిక విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చేవారు. బ్రాహ్మణులు ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు.


18వ శతాబ్దం చివరినాటికి ఈ సంప్రదాయ విద్యావిధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించడం ప్రారంభించడంతో  స్వదేశీ సంస్థానాలు బలహీనపడ్డాయి. వాటి ప్రభావం వారి ఉద్యోగ బృందం మీద కూడా పడింది. విద్యావ్యవస్థలకు పోషణ కరవైంది. బ్రిటన్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం తో ఇంగ్లండ్‌కు కేవలం ముడిసరకులు సరఫరా చేసే వలసప్రాంతంగా మన దేశం మారింది.తమ ఫ్యాక్టరీల్లో తయారుచేసిన వస్తువులకు మంచి విపణిగా ఈ దేశాన్ని బ్రిటిషర్లు  మార్చడంతో ఇక్కడి కుటీర పరిశ్రమలకు ఆదరణ కరవైంది. దీంతో దేశంలో వృత్తివిద్యలు కూడా దెబ్బతిన్నాయి. స్థూలంగా చెప్పాలంటే దేశీయ విద్యావ్యవస్థ విదేశీయుల పాలనలో క్షీణించింది.


బక్సర్‌ (1764) యుద్ధం తర్వాత బెంగాల్‌ రాజ్యాధికారం ఆంగ్లేయుల హస్తగతమైంది. కొంతమంది బ్రిటిష్‌ అధికారులు, యూరోపియన్, క్రైస్తవ మిషనరీల ప్రసక్తి తప్ప తొలిదశలో భారతదేశంలో విద్య కోసం చేసిన కృషి గురించి సరైన వివరాలు అందుబాటులో లేవు. వారెన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు (1772-85) 1781లో కలకత్తాలో ముస్లింల కోసం ఒక మదర్సా స్థాపించారు. 1782లో జోనాథన్‌ డంకన్‌ కలకత్తాలో ఒక సంస్కృత పాఠశాల నెలకొల్పారు. హేస్టింగ్స్, అతడి తోటి అధికారులు హాల్‌హెడ్, జోనాథన్‌ డంకన్‌ ప్రాచ్య విద్య పట్ల మక్కువ చూపారు. ఈ దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తెలుసుకోవడం కూడా అవసరమని భావించారు. ఆ ప్రయత్నంలో హాల్‌హెడ్‌ మనుస్మృతిని జెంటూలాస్‌ అనే పేరుతో అనువాదం చేశాడు. మరుగున పడిన భారతీయ సంస్కృతిని వెలికితీయడానికి అప్పటి కంపెనీ న్యాయాధికారి విలియం జోన్స్‌ 1784లో రాయల్‌ ఆసియాటిక్‌ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంను జోన్స్, మరొక కంపెనీ అధికారి చార్లెస్‌ విల్కిన్స్‌ భగవద్గీతను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. తర్వాత అనేక ప్రసిద్ధ ప్రాచీన సంస్కృత గ్రంథాలను కంపెనీ సేవలో భారతదేశానికి వచ్చిన పలువురు ఆంగ్లేయులు ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. లార్డ్‌ వెల్లస్లీ పరిపాలనా కాలంలో కలకత్తాలోని విలియమ్స్‌ కోటలో కంపెనీ అధికారులకు పరిపాలనలో తర్ఫీదు ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో భారతీయ సంస్కృతి, న్యాయం, భౌగోళిక శాస్త్రం, తత్వం కూడా బోధించేవారు. బ్రిటిషర్లు తమ పాలన కోసమే ఈ దేశ సంస్కృతిని అధ్యయనం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దాని వల్ల భారతదేశ సాంస్కృతిక వైభవం వెలుగులోకి వచ్చింది. ఈ దశలో బెంగాల్‌లోని కొన్ని యూరోపియన్‌ క్రైస్తవ మిషనరీలు కూడా మనదేశంలో విద్యాభివృద్ధికి తోడ్పడ్డాయి. విలియం క్యారీకి చెందిన బాప్టిస్ట్‌ మిషన్‌ బెంగాల్‌లో అనేక చోట్ల ప్రాథమిక పాఠశాలలను స్థాపించింది. పోర్చుగీసు వారు అచ్చు యంత్రాన్ని మనకు పరిచయం చేశారు. క్రైస్తవ మిషనరీలు బైబిల్‌ను ప్రాంతీయ భాషల్లోకి అచ్చువేయడం ద్వారా భారతదేశంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ వాడకం విస్తృతమైంది. రాజా రామ్మోహన్‌ రాయ్, రాధాకాంత్‌ దేవ్, డేవిడ్‌ హేర్‌ లాంటి వారి కృషి వల్ల కొన్ని విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. 1817లో రాజా రామ్మోహన్‌ సహాయంతో, డేవిడ్‌ హేర్‌ కలకత్తాలో ఆంగ్లో వేదిక్‌ స్కూల్‌ స్థాపించాడు. రామ్మోహన్‌ రాయ్‌ వేదాంత కళాశాలను ఏర్పాటు చేశాడు.


కంపెనీ పాలనలో స్పష్టమైన విద్యా విధానం 1813 చార్టర్‌ చట్టంతో ప్రారంభమైంది. ఈ చట్టం భారతదేశంలో విద్యాభివృద్ధికి రూ.లక్ష కేటాయించాలని సూచించింది. కానీ ఆ మొత్తం ప్రాచ్య విద్య కోసమా లేదా పాశ్చాత్య విద్యాభివృద్ధి కోసమా అనే వాదనలు తలెత్తాయి. దాంతో ఈ నిధిని చాలా కాలం ఉపయోగించలేదు. వాదనలు విలియం బెంటింక్‌ కాలం (1828-35) వరకు నడిచాయి. బెంటింక్‌ చొరవతో అతడి కార్యనిర్వాహకవర్గ న్యాయ సభ్యుడు లార్డ్‌ మెకాలే ఆ పీటముడిని విప్పాడు. అతడి సూచన మేరకు బెంటింక్‌ 1835లో భారతీయ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమంలో సాహిత్యం, లెక్కలు, సైన్స్, తర్కం, తత్వం లాంటి పాశ్చాత్య విషయాలను బోధించాలని నిర్ణయం తీసుకున్నారు. భారతీయుల విద్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం విద్యారంగంలో ఒక చారిత్రక సంఘటన.

లార్డ్‌ డల్హౌసీ పదవీ కాలంలో భారతదేశంలో విద్యాభివృద్ధికి తగిన సూచనలు చేయడానికి ప్రభుత్వం సర్‌ చార్లెస్‌ ఉడ్‌ను నియమించింది. ఆయన సూచనలను ‘ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854’ అంటారు.

అందులోని ముఖ్యాంశాలు:

* ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖ ఏర్పాటు

* ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం

* ప్రాంతీయ భాషల్లో బోధన

* విద్యను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, యూనివర్సిటీ విద్యాలయాలుగా విభజించడం; మద్రాసు, బొంబాయి, కలకత్తాలలో విశ్వవిద్యాలయాల స్థాపన

* ఉపాధ్యాయ శిక్షణ

* బాలికా విద్యకు ప్రోత్సాహం

* విద్యారంగంలో ఔత్సాహికులకు ప్రభుత్వ ప్రోత్సాహం లాంటి అంశాలతో ఉడ్స్‌ డిస్పాచ్‌ ఆధునిక విద్యావ్యవస్థకు పటిష్ఠమైన పునాది వేసింది.


ఉడ్స్‌ డిస్పాచ్‌ తర్వాత చెప్పుకోదగిన విద్యారంగ సంస్కరణలు లార్డ్‌ రిప్పన్‌ గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా ఉన్నప్పుడు జరిగాయి. ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854 సూచించిన విధానాలు, వాటి అమలు తీరును పరిశీలించడానికి విలియం హంటర్‌ కమిషన్‌ (1882)ను లార్డ్‌ రిప్పన్‌ నియమించాడు. ఇది బ్రిటిష్‌ ఇండియాలో విద్యా విధానాన్ని సమీక్షించడానికి నియమించిన మొదటి కమిషన్‌.


హంటర్‌ నివేదిక ముఖ్యాంశాలు:  

* ప్రాథమిక, మాధ్యమిక విద్యను విస్తరించాలని, దాని నిర్వహణ బాధ్యత కొత్తగా ఏర్పడిన స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించింది.

* మతాలకు అతీతంగా లౌకిక బోధన జరగాలని పేర్కొంది. ప్రభుత్వేతర సంస్థలు విద్యాసంస్థలను స్థాపించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని, మాధ్యమిక విద్యతో పాటు వృత్తి విద్య నేర్పించాలని, స్త్రీ విద్యకు ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది.


రిప్పన్‌ తర్వాత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జన్‌ పదవీకాలంలో థామోస్‌ రాలి కమిషన్‌ (1902)ను నియమించాడు. దీనినే విశ్వవిద్యాలయాల కమిషన్‌ అంటారు. విశ్వవిద్యాలయాల పాలనా వ్యవహారాలను సమీక్షించడానికి దీన్ని నియమించారు. ఈ కమిషన్‌ సూచనల ప్రాతిపదికగా 1904 విశ్వవిద్యాలయాల చట్టం రూపొందింది. దాని ప్రకారం విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులను ప్రభుత్వమే నియమిస్తుంది. సెనెట్‌లో ఎన్నుకున్న సభ్యుల సంఖ్య తగ్గి, అధికార సభ్యుల సంఖ్య పెరిగింది. ఈ చట్టం కారణంగా విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ పెత్తనం పెరిగింది.


విద్యా సంస్కరణల్లో మరొక మైలురాయి హార్టోగ్‌ కమిటీ నియామకం. ఈ కమిటీని లార్డ్‌ ఇర్విన్‌ (1926-31) గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు నియమించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని సూచించింది. 1934లో నియమించిన సప్రూ కమిటీ వృత్తి విద్య ఆవశ్యకతను గుర్తించి ప్రాముఖ్యం ఇవ్వమని సూచించింది. 1944లో లార్డ్‌ వేవెల్‌ పదవీ కాలంలో సార్జెంట్‌ కమిటీని నియమించారు.

ఆధునిక భారతదేశంలో 20వ శతాబ్ద ప్రథమార్ధానికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ విశ్వభారతితో సహా అలీగఢ్, ఉస్మానియా, ఆంధ్ర, ఢాకా, లఖ్‌నవూ, దిల్లీ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించారు. 1916లో ఆచార్య డి.కె.కార్వే పూనాలో స్త్రీలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. అనేక వృత్తిపరమైన అంటే వైద్య, న్యాయ వ్యవసాయ, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పాటై బ్రిటిష్‌ ఇండియా ప్రజల విద్యాభివృద్ధికి ఎంతో కృషిచేశాయి.


ఆధునిక విద్యనభ్యసించిన విద్యావంతులు బ్రిటిషర్ల పాలన నిజ స్వరూపాన్ని గుర్తించగలిగారు. ఈ దేశ ఆర్థిక వెనుకబాటుకు పరాయి పాలనే కారణమని, వారి వివక్షా పూరిత విధానాలు, నిరంతర ఆర్థిక దోపిడీని ఆకళింపు చేసుకున్నారు. సామ్రాజ్యవాద శక్తులను ఎదిరించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని భారతీయులకు ఈ ఆధునిక విద్యే అందించిందనడంలో ఎంత మాత్రం సందేహం అవసరం లేదు. 

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

 

Posted Date : 28-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 బ్రిటిష్‌ ఇండియాలో విద్యా విధానం

 సనాతన విద్యకు సంస్కరణలు! 

బ్రిటిష్‌ వలస పాలనలో భారతీయ విద్యావ్యవస్థ సనాతనం నుంచి ఆధునికతను సంతరించుకుంది. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు, సమాజ నియమాలు, చట్టాలను అర్థం చేసుకోవడానికి బ్రిటిషర్లు విద్యాసంస్థలను, ఆంగ్ల బోధనను ఇక్కడ ప్రారంభించారు. యూనివర్సిటీలను నెలకొల్పారు. దాంతో సరికొత్త భారత మేధావి వర్గం పుట్టుకొచ్చింది. వారు  సామ్రాజ్యవాద పోకడలను, ఆర్థిక దోపిడీని అర్థం చేసుకున్నారు. ఆంగ్లేయుల అరాచకాలను ఎదిరించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని మన వాళ్లలో పెంపొందించేందుకు కృషి చేశారు.  అప్పట్లో ఏర్పాటు చేసిన విద్యా విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ పరిణామక్రమంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.  భారతీయుల విద్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం ఏ మేరకు బాధ్యత తీసుకుంది, ఎప్పుడెప్పుడు ఎలాంటి సంస్కరణలను అమలు చేసిందో తెలుసుకోవాలి. 


భారతదేశంలో బ్రిటిష్‌ పరిపాలన ప్రారంభానికి ముందు విద్య సంప్రదాయ విధానంలో ఉండేది. విద్యాకేంద్రాలుగా హిందువులకు గురుకులాలు, దేవాలయాలు వ్యవహరిస్తే, ముస్లింలకు పర్షియన్‌ మదర్సాలు ఉండేవి. ఈ విద్యాసంస్థలు, మదర్సాలు ఎక్కువగా రాజ కుటుంబీకులు/వారి ఉన్నత ఉద్యోగులు/సుల్తానులు, జమీందారులు, కులీన కుటుంబాల పోషణలో ఉండేవి. హిందూ విద్యాసంస్థల్లో పురాణ ఇతిహాసాలు, ప్రాచీన సాహిత్యం, ఖగోళం, గణితం, వైద్యం, తత్వం లాంటివి పాఠ్యాంశాలుగా ఉండేవి. మత/నైతిక విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చేవారు. బ్రాహ్మణులు ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు.


18వ శతాబ్దం చివరినాటికి ఈ సంప్రదాయ విద్యావిధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించడం ప్రారంభించడంతో  స్వదేశీ సంస్థానాలు బలహీనపడ్డాయి. వాటి ప్రభావం వారి ఉద్యోగ బృందం మీద కూడా పడింది. విద్యావ్యవస్థలకు పోషణ కరవైంది. బ్రిటన్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం తో ఇంగ్లండ్‌కు కేవలం ముడిసరకులు సరఫరా చేసే వలసప్రాంతంగా మన దేశం మారింది.తమ ఫ్యాక్టరీల్లో తయారుచేసిన వస్తువులకు మంచి విపణిగా ఈ దేశాన్ని బ్రిటిషర్లు  మార్చడంతో ఇక్కడి కుటీర పరిశ్రమలకు ఆదరణ కరవైంది. దీంతో దేశంలో వృత్తివిద్యలు కూడా దెబ్బతిన్నాయి. స్థూలంగా చెప్పాలంటే దేశీయ విద్యావ్యవస్థ విదేశీయుల పాలనలో క్షీణించింది.


బక్సర్‌ (1764) యుద్ధం తర్వాత బెంగాల్‌ రాజ్యాధికారం ఆంగ్లేయుల హస్తగతమైంది. కొంతమంది బ్రిటిష్‌ అధికారులు, యూరోపియన్, క్రైస్తవ మిషనరీల ప్రసక్తి తప్ప తొలిదశలో భారతదేశంలో విద్య కోసం చేసిన కృషి గురించి సరైన వివరాలు అందుబాటులో లేవు. వారెన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు (1772-85) 1781లో కలకత్తాలో ముస్లింల కోసం ఒక మదర్సా స్థాపించారు. 1782లో జోనాథన్‌ డంకన్‌ కలకత్తాలో ఒక సంస్కృత పాఠశాల నెలకొల్పారు. హేస్టింగ్స్, అతడి తోటి అధికారులు హాల్‌హెడ్, జోనాథన్‌ డంకన్‌ ప్రాచ్య విద్య పట్ల మక్కువ చూపారు. ఈ దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తెలుసుకోవడం కూడా అవసరమని భావించారు. ఆ ప్రయత్నంలో హాల్‌హెడ్‌ మనుస్మృతిని జెంటూలాస్‌ అనే పేరుతో అనువాదం చేశాడు. మరుగున పడిన భారతీయ సంస్కృతిని వెలికితీయడానికి అప్పటి కంపెనీ న్యాయాధికారి విలియం జోన్స్‌ 1784లో రాయల్‌ ఆసియాటిక్‌ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంను జోన్స్, మరొక కంపెనీ అధికారి చార్లెస్‌ విల్కిన్స్‌ భగవద్గీతను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. తర్వాత అనేక ప్రసిద్ధ ప్రాచీన సంస్కృత గ్రంథాలను కంపెనీ సేవలో భారతదేశానికి వచ్చిన పలువురు ఆంగ్లేయులు ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. లార్డ్‌ వెల్లస్లీ పరిపాలనా కాలంలో కలకత్తాలోని విలియమ్స్‌ కోటలో కంపెనీ అధికారులకు పరిపాలనలో తర్ఫీదు ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో భారతీయ సంస్కృతి, న్యాయం, భౌగోళిక శాస్త్రం, తత్వం కూడా బోధించేవారు. బ్రిటిషర్లు తమ పాలన కోసమే ఈ దేశ సంస్కృతిని అధ్యయనం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దాని వల్ల భారతదేశ సాంస్కృతిక వైభవం వెలుగులోకి వచ్చింది. ఈ దశలో బెంగాల్‌లోని కొన్ని యూరోపియన్‌ క్రైస్తవ మిషనరీలు కూడా మనదేశంలో విద్యాభివృద్ధికి తోడ్పడ్డాయి. విలియం క్యారీకి చెందిన బాప్టిస్ట్‌ మిషన్‌ బెంగాల్‌లో అనేక చోట్ల ప్రాథమిక పాఠశాలలను స్థాపించింది. పోర్చుగీసు వారు అచ్చు యంత్రాన్ని మనకు పరిచయం చేశారు. క్రైస్తవ మిషనరీలు బైబిల్‌ను ప్రాంతీయ భాషల్లోకి అచ్చువేయడం ద్వారా భారతదేశంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ వాడకం విస్తృతమైంది. రాజా రామ్మోహన్‌ రాయ్, రాధాకాంత్‌ దేవ్, డేవిడ్‌ హేర్‌ లాంటి వారి కృషి వల్ల కొన్ని విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. 1817లో రాజా రామ్మోహన్‌ సహాయంతో, డేవిడ్‌ హేర్‌ కలకత్తాలో ఆంగ్లో వేదిక్‌ స్కూల్‌ స్థాపించాడు. రామ్మోహన్‌ రాయ్‌ వేదాంత కళాశాలను ఏర్పాటు చేశాడు.


కంపెనీ పాలనలో స్పష్టమైన విద్యా విధానం 1813 చార్టర్‌ చట్టంతో ప్రారంభమైంది. ఈ చట్టం భారతదేశంలో విద్యాభివృద్ధికి రూ.లక్ష కేటాయించాలని సూచించింది. కానీ ఆ మొత్తం ప్రాచ్య విద్య కోసమా లేదా పాశ్చాత్య విద్యాభివృద్ధి కోసమా అనే వాదనలు తలెత్తాయి. దాంతో ఈ నిధిని చాలా కాలం ఉపయోగించలేదు. వాదనలు విలియం బెంటింక్‌ కాలం (1828-35) వరకు నడిచాయి. బెంటింక్‌ చొరవతో అతడి కార్యనిర్వాహకవర్గ న్యాయ సభ్యుడు లార్డ్‌ మెకాలే ఆ పీటముడిని విప్పాడు. అతడి సూచన మేరకు బెంటింక్‌ 1835లో భారతీయ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమంలో సాహిత్యం, లెక్కలు, సైన్స్, తర్కం, తత్వం లాంటి పాశ్చాత్య విషయాలను బోధించాలని నిర్ణయం తీసుకున్నారు. భారతీయుల విద్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం విద్యారంగంలో ఒక చారిత్రక సంఘటన.

లార్డ్‌ డల్హౌసీ పదవీ కాలంలో భారతదేశంలో విద్యాభివృద్ధికి తగిన సూచనలు చేయడానికి ప్రభుత్వం సర్‌ చార్లెస్‌ ఉడ్‌ను నియమించింది. ఆయన సూచనలను ‘ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854’ అంటారు.

అందులోని ముఖ్యాంశాలు:

* ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖ ఏర్పాటు

* ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం

* ప్రాంతీయ భాషల్లో బోధన

* విద్యను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, యూనివర్సిటీ విద్యాలయాలుగా విభజించడం; మద్రాసు, బొంబాయి, కలకత్తాలలో విశ్వవిద్యాలయాల స్థాపన

* ఉపాధ్యాయ శిక్షణ

* బాలికా విద్యకు ప్రోత్సాహం

* విద్యారంగంలో ఔత్సాహికులకు ప్రభుత్వ ప్రోత్సాహం లాంటి అంశాలతో ఉడ్స్‌ డిస్పాచ్‌ ఆధునిక విద్యావ్యవస్థకు పటిష్ఠమైన పునాది వేసింది.


ఉడ్స్‌ డిస్పాచ్‌ తర్వాత చెప్పుకోదగిన విద్యారంగ సంస్కరణలు లార్డ్‌ రిప్పన్‌ గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా ఉన్నప్పుడు జరిగాయి. ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854 సూచించిన విధానాలు, వాటి అమలు తీరును పరిశీలించడానికి విలియం హంటర్‌ కమిషన్‌ (1882)ను లార్డ్‌ రిప్పన్‌ నియమించాడు. ఇది బ్రిటిష్‌ ఇండియాలో విద్యా విధానాన్ని సమీక్షించడానికి నియమించిన మొదటి కమిషన్‌.


హంటర్‌ నివేదిక ముఖ్యాంశాలు:  

* ప్రాథమిక, మాధ్యమిక విద్యను విస్తరించాలని, దాని నిర్వహణ బాధ్యత కొత్తగా ఏర్పడిన స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించింది.

* మతాలకు అతీతంగా లౌకిక బోధన జరగాలని పేర్కొంది. ప్రభుత్వేతర సంస్థలు విద్యాసంస్థలను స్థాపించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని, మాధ్యమిక విద్యతో పాటు వృత్తి విద్య నేర్పించాలని, స్త్రీ విద్యకు ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది.


రిప్పన్‌ తర్వాత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జన్‌ పదవీకాలంలో థామోస్‌ రాలి కమిషన్‌ (1902)ను నియమించాడు. దీనినే విశ్వవిద్యాలయాల కమిషన్‌ అంటారు. విశ్వవిద్యాలయాల పాలనా వ్యవహారాలను సమీక్షించడానికి దీన్ని నియమించారు. ఈ కమిషన్‌ సూచనల ప్రాతిపదికగా 1904 విశ్వవిద్యాలయాల చట్టం రూపొందింది. దాని ప్రకారం విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులను ప్రభుత్వమే నియమిస్తుంది. సెనెట్‌లో ఎన్నుకున్న సభ్యుల సంఖ్య తగ్గి, అధికార సభ్యుల సంఖ్య పెరిగింది. ఈ చట్టం కారణంగా విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ పెత్తనం పెరిగింది.


విద్యా సంస్కరణల్లో మరొక మైలురాయి హార్టోగ్‌ కమిటీ నియామకం. ఈ కమిటీని లార్డ్‌ ఇర్విన్‌ (1926-31) గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు నియమించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని సూచించింది. 1934లో నియమించిన సప్రూ కమిటీ వృత్తి విద్య ఆవశ్యకతను గుర్తించి ప్రాముఖ్యం ఇవ్వమని సూచించింది. 1944లో లార్డ్‌ వేవెల్‌ పదవీ కాలంలో సార్జెంట్‌ కమిటీని నియమించారు.

ఆధునిక భారతదేశంలో 20వ శతాబ్ద ప్రథమార్ధానికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ విశ్వభారతితో సహా అలీగఢ్, ఉస్మానియా, ఆంధ్ర, ఢాకా, లఖ్‌నవూ, దిల్లీ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించారు. 1916లో ఆచార్య డి.కె.కార్వే పూనాలో స్త్రీలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. అనేక వృత్తిపరమైన అంటే వైద్య, న్యాయ వ్యవసాయ, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పాటై బ్రిటిష్‌ ఇండియా ప్రజల విద్యాభివృద్ధికి ఎంతో కృషిచేశాయి.


ఆధునిక విద్యనభ్యసించిన విద్యావంతులు బ్రిటిషర్ల పాలన నిజ స్వరూపాన్ని గుర్తించగలిగారు. ఈ దేశ ఆర్థిక వెనుకబాటుకు పరాయి పాలనే కారణమని, వారి వివక్షా పూరిత విధానాలు, నిరంతర ఆర్థిక దోపిడీని ఆకళింపు చేసుకున్నారు. సామ్రాజ్యవాద శక్తులను ఎదిరించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని భారతీయులకు ఈ ఆధునిక విద్యే అందించిందనడంలో ఎంత మాత్రం సందేహం అవసరం లేదు. 

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

 

Posted Date : 28-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బానిసలు కనిపించని మహాజనపదం!

మగధ సామ్రాజ్యం

 

 

ప్రాచీన భారతదేశంలోని మహాజనపదాల్లో ప్రముఖ రాజ్యం మగధ. పాటలీపుత్రం రాజధానిగా మౌర్యులు, గుప్తుల పాలనలో శక్తిమంతమైన సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. వ్యవసాయం, వాణిజ్యం, సైనిక రంగాల్లో ప్రగతితో అత్యంత సంపన్న ప్రాంతంగా దేశ వైభవాన్ని నలుదిశల్లో చాటింది. బౌద్ధ, జైన మతాల వ్యాప్తికి కేంద్ర స్థానంగా నిలిచిన మగధ విశేషాలన్నీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా పరాక్రమంలో అజేయంగా, ప్రజాసంక్షేమంలో ఆదర్శంగా నిలిచిన మౌర్యుల గురించి పోటీ పరీక్షార్థులు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మౌర్య సామ్రాజ్యం ఆవిర్భావం, విస్తరణ తీరు, నాటి పాలనా విధానాలు, అశోకుడి ఔన్నత్యం, శాశ్వతంగా నిలిచిపోయిన అతడి కీర్తి తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.    కిందివాటిలో చంద్రగుప్త మౌర్యుడు నంద రాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా ఉన్న గ్రంథం?

1) కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’         2) విశాఖదత్తుడి ‘ముద్రారాక్షసం’

3) పతంజలి ‘మహాభాష్యం’   4) మాడలీన్‌ ‘స్లేడ్‌’


2.     మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించి సరైనవి?

ఎ) క్రీ.పూ.321లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

బి) ఈయన మొరియా తెగకు చెందినవాడు.

సి) జైన, బౌద్ధ మత గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియులు.

డి) పురాణాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడిది శూద్రవంశం.

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి, డి   

3) ఎ, బి, సి       4) ఎ, డి


3.     కింద ఇచ్చిన రచయితలు, గ్రంథాలను జతపరచండి.

1) ప్లీనీ ఎ) ఇండికా
2) ప్లూటార్క్‌ బి) ది లైన్స్‌  
3) టాలమీ సి) నేచురల్‌ హిస్టరీ
4) మెగస్తనీస్‌ డి) జాగ్రఫీ

1) 1-ఎ 2-బి, 3-సి, 4-డి      2) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి      4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి


4.     కిందివాటిలో అశోకుడి గురించి తెలుసుకోవడానికి ఆధారమైన స్వదేశీ గ్రంథాలు, వాటి రచయితలను జతపరచండి.

    రచయితలు       గ్రంథాలు
1) విశాఖదత్తుడు ఎ) రాజతరంగిణి
2) హేమచంద్ర బి) పరిశిష్ట పర్వన్‌
3) సోమదేవుడు సి) ముద్రారాక్షసం
4) కల్హణుడు డి) కథాకవితాసాగరం

1) 1-ఎ 2-బి, 3-సి, 4-డి    2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి

3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ    4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి


5.     కౌటిల్యుడి అర్థశాస్త్రానికి సంబంధించి సరైనవి ఏవి?

ఎ) కౌటిల్యుడిని చాణుక్యుడు, విష్ణుగుప్తుడు అని అంటారు.

బి) సంస్కృతంలో రాసిన అర్థశాస్త్రం 1905లో తంజావూర్‌ వద్ద దొరికింది. దీన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు ఆర్‌.శ్యామశాస్త్రి.

సి) అర్థశాస్త్రం అనే గ్రంథంలో 15 అధికరణలు, 180 ప్రకరణలు ఉన్నాయి.

డి) మౌర్యుల కాలంలోని ధర్మస్థేయ అనే పౌర న్యాయస్థానం; కంఠక శోధన అనే క్రిమినల్‌ న్యాయస్థానాల గురించి దీనిలో ఉంది.

1) ఎ, బి, సి        2) ఎ, బి, సి, డి

3) ఎ, బి, డి       4) ఎ, సి, డి


6. ఇండికా గ్రంథానికి సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి.    

ఎ) గ్రీకు దేశానికి చెందిన సెల్యూకస్‌ నికేటర్‌ రాయబారి అయిన మెగస్తనీస్‌ ఈ గ్రంథాన్ని రచించారు.

బి) ప్రస్తుతం ఈ గ్రంథం అందుబాటులో లేదు.

సి) ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడి సైనిక వ్యవస్థ గురించి ఉంది.

డి) మెగస్తనీస్‌ ప్రకారం మగధలో బానిస వ్యవస్థ లేదు.

1) ఎ, బి, సి, డి 2) ఎ, సి  3) ఎ, సి, డి 4) ఎ, బి, డి 


7. జునాగఢ్‌ శాసనం ఎవరు వేయించారు?

1) అశోకుడు       2) చంద్రగుప్త మౌర్యుడు   

3) రుద్రదమనుడు     4) బిందుసారుడు


8.     చంద్రగుప్త మౌర్యుడికి సెల్యూకస్‌ నికేటర్‌తో జరిగిన యుద్ధంతో సంబంధం లేనిది?

1) వీరి మధ్య క్రీ.పూ.305లో యుద్ధం జరిగింది.

2) వీరి మధ్య క్రీ.పూ.303లో సంధి జరిగింది.

3) సెల్యూకస్‌ నికేటర్‌ రాయబారిగా మెగస్తనీస్‌ పాటలీపుత్రంలో చాలాకాలం ఉన్నాడు.

4) చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్‌ నికేటర్‌కు 5000 ఏనుగులు ఇచ్చాడు.


9.     సంగమ సాహిత్యం అంటే?

1) చోళ సాహిత్యం       2) పాండ్య సాహిత్యం   

3) చేర సాహిత్యం      4) పైవన్నీ


10. బిందుసారుడి గురించి సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) బిందుసారుడిని ‘అమిత్రఘాత’ అంటారు.

బి) బిందుసారుడు అజీవక మతం ఆచరించాడు.

సి) ఈయనకు సిరియా రాజు ఒకటో యాంటి యోకస్‌తో సంబంధాలు ఉండేవి.

డి) సిరియా రాజు రాయబారి డైమోకస్‌ మౌర్యుల ఆస్థానంలో ఉండేవాడు.

1) ఎ, బి, డి      2) ఎ, బి, సి, డి

3) బి, సి       4) ఏదీకాదు


11. బిందుసారుడి కాలంలో అతడి ఆస్థానంలో ఉన్న సిరియా రాయబారి?

1) స్ట్రాబో 2) హెరిడోటస్‌     3) డైమోకస్‌    4) ప్లీనీ


12. బిందుసారుడి కాలంలో తక్షశిల వద్ద జరిగిన తిరుగుబాటును అణచివేయడానికి వెళ్లిన యువరాజు?

1) సుశిమా       2) మహేంద్ర   

3) అశోకుడు       4) బృహద్రదుడు


13. కిందివాటిలో అశోకుడికి సంబంధించి సరైనవి?

ఎ) అశోకుడి పేరును శాసనాల్లో దేవానాంప్రియ, ప్రియదర్శి అని పేర్కొన్నారు.

బి) ఈయన పేరుతో ఉన్న శాసనం కర్ణాటకలోని మస్కి వద్ద ఉంది.

సి) టిబెట్‌ చరిత్రకారుడు తారానాథ్‌ ప్రకారం అశోకుడు ఒక వైశ్య స్త్రీకి జన్మించాడు.

డి) అశోకుడు అంటే శోకించలేనివాడు అని అర్థం.

1) ఎ, డి       2) ఎ, బి, సి, డి    

3) బి, సి, డి       4) ఎ, బి, సి 


14. ‘చార్లెమేన్, కాన్‌స్టాంటన్‌ గురించి తెలిసిన వారి కంటే అశోకుడి గురించి తెలిసిన వారే ఎక్కువ’ అని ఎవరు అన్నారు?

1) ప్లీనీ        2) హెచ్‌.జి.వెల్స్‌  

3) టాలమీ      4) ప్లూటార్క్‌


15. కిందివాటిలో కళింగ యుద్ధానికి సంబంధించి సరైనవి గుర్తించండి.

ఎ) కళింగ అంటే నేటి ఒడిశా ప్రాంతం.

బి) 13వ శిలాశాసనం ఈ యుద్ధం గురించి తెలుపుతుంది.

సి) అశోకుడు రాజైన ఎనిమిదేళ్లకు ఈ యుద్ధం చేశాడు.

డి) కళింగ యుద్ధంలో మృతులు 1,00,000 మందికి పైగా కాగా, బంధీలైనవారు 1,50,000 మంది.

1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి 3) ఎ, సి 4) బి, డి 


16. అశోకుడి ధర్మ సూత్రాల్లో లేనిది?

ఎ) తల్లిదండ్రుల పట్ల విధేయత ఉండాలి.    బి) పెద్దలను గౌరవించాలి.

సి) ఇతర మతాలను దూషించరాదు.    డి) విగ్రహారాధన చేయవచ్చు.

1) సి, డి 2) సి మాత్రమే  3) డి మాత్రమే 4) ఎ, డి


17. ధర్మప్రచారం, శాసనాల్లోని అంశాలను చదివి వినిపించడానికి అశోకుడు ఎవరిని నియమించాడు?

1) అమాత్యులు           2) ధర్మాధ్యక్షులు

3) ధర్మమహామాత్రులు      4) పైవారందరూ


18. అశోకుడికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

ఎ) కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతం స్వీకరించాడు.

బి) ఈయన బౌద్ధమతాన్ని ఈజిప్ట్, శ్రీలంక, గ్రీసు, సిరియా దేశాల్లో వ్యాప్తి చేశాడు.

సి) అశోకుడి తరఫున బౌద్ధమత ప్రచారం చేసినవారు మహేంద్ర, సంఘమిత్ర.

డి) అశోకుడిని ప్రభావితం చేసిన బౌద్ధమత సన్యాసి ఆచార్య నాగార్జునుడు.

1) ఎ, బి       2) డి మాత్రమే   

3) బి, డి       4) ఎ మాత్రమే


19. మౌర్యుల తర్వాత మగధలో స్థాపించిన రాజవంశం, స్థాపకుడు? 

1) కాణ్వా - సుశర్మ       2) శుంగ - పుష్య మిత్ర 

3) పుష్యభూతి - హర్షవర్ధన     4) గుప్త - గుప్తుడు


20. అశోకుడి ఏ శాసనాలు సంగమ యుగం గురించి వివరిస్తాయి?

1) 2, 13  2) 2, 14     3) 1, 6      4) 7, 8


21. మగధ సామ్రాజ్య పరిపాలనకు సంబంధించి సరికానిది?

ఎ) మగధకు ప్రధాన రాజధాని పాటలీపుత్రం.

బి) పాటలీపుత్రం, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను చక్రవర్తి ప్రత్యక్షంగా పరిపాలించేవారు.

సి) మగధలో నాలుగు ప్రాదేశిక రాజధానులున్నాయి. అవి తక్షశిల, తోసలి, సువర్ణగిరి, ఉజ్జయిని.

డి) ప్రాదేశిక రాజధానులను పరిపాలించేవారు సామంతులు.

1) ఎ, బి, సి  2) డి   3) బి, డి   4) ఎ, డి 


22. మగధలో గ్రామాల వర్గీకరణను జతపరచండి.

1) సీత ఎ) సైనికులను పంపించే గ్రామాలు
2) ఆయుధేయ బి) రాజుకు, ప్రభుత్వానికి చెందిన భూములున్న గ్రామం
3) పరిహారిక సి) పన్ను మినహాయింపు ఇచ్చిన గ్రామాలు
4) కుప్య డి) ముడి పదార్థాలను సరఫరా చేసే గ్రామాలు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి

3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి      4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి


23. అశోకుడి ఏ శిలాశాసనం బోస్రో -ఫెడాన్‌ పద్ధతిలో రాసి ఉంది?

1) ఎర్రగుడి మైనర్‌ రాక్‌ ఈడిక్ట్‌     2) లంపక రాక్‌ ఈడిక్ట్‌ 

3) షాబజోగిరి రాక్‌ ఈడిక్ట్‌    4) మాన్‌షేరా రాక్‌ ఈడిక్ట్‌


24. మెగస్తనీస్‌ తన గ్రంథంలో తెలియజేసిన పెద్దరాచబాట ఏ ప్రాంతాలను కలుపుతుంది?

1) ఇండస్‌ - పాటలీపుత్రం            2) పాటలీపుత్రం - ప్రయాగ 

3) ప్రయాగ - ఉజ్జయిని 4) పాటలీపుత్రం - తక్షశిల 


25. అశోకుడి స్తంభ శాసనంలో అతిదీర్ఘమైనది?

1) 7వ    2) 6వ    3) 5వ    4) 4వ 


26. ఇండికా గ్రంథం ప్రకారం మగధ సామ్రాజ్యంలోని కులాలు ఎన్ని?

1) 4     2) 5     3) 6     4) 7


27. మౌర్యుల కాలంలో రాజు గుత్తాధిపత్యం కింద లేని అంశం?

1) గనులు, అడవులు           2) చేపల పరిశ్రమ

3) మద్యం, జలరవాణా     4) వధశాలలు, జూద గృహాలు


28. అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు?

1) శాసనాల ద్వారా      2) ప్రాకృతం ఉపయోగించడం ద్వారా

3) విదేశాలకు భిక్షువులను పంపడం ద్వారా     4) పైవన్నీ

 


సమాధానాలు


1-2; 2-2; 3-2; 4-3; 5-2; 6-1; 7-3; 8-4; 9-4; 10-2; 11-3; 12-3; 13-2; 14-2; 15-1; 16-3; 17-3; 18-2; 19-2; 20-1; 21-2; 22-2; 23-1; 24-4; 25-1; 26-4; 27-4; 28-4. 


రచయిత: గద్దె నరసింహారావు 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 28-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గజనీ మహమ్మద్‌ దండయాత్రలు

గజనీ మహమ్మద్‌ లక్ష్యాలు 


 భారతదేశంలో విగ్రహారాధనను నిర్మూలించి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం.


 ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించడం. అపార ధనాన్ని కొల్లగొట్టడం.


దండయాత్రలు (క్రీ.శ. 1000- 1026) 


 క్రీ.శ. 1000లో కైబర్‌ కనుమలోని కొన్ని కోటలు, పట్టణాలను ఆక్రమించాడు.


 క్రీ.శ. 1001లో భారత్‌లోకి ప్రవేశించి పెషావర్‌ పాలకుడైన జయపాలుడ్ని ఓడించి, బందీగా చేసుకున్నాడు. ఇతడ్ని విడుదల చేయడానికి పెద్ద మొత్తం వసూలు చేశాడు.


 క్రీ.శ. 1003లో భాటియా రాజ్యంపై దాడి చేసి, ‘బిజయ్‌ రాయ్‌’ని ఓడించి, అనేకమందిని ఇస్లాంలోకి మార్చాడు.


 క్రీ.శ. 1006లో సింధూ నదిని దాటి ముల్తాన్‌పై దాడి చేసి, ఫతేదావూద్‌ను బంధించి రాజ్యాన్ని ఆక్రమించాడు. దీనికి శుక్రపాలుడ్ని రాజుగా చేశాడు. శుక్రపాలుడ్ని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, అతడి పేరును నవాపాషాగా మార్చాడు.


 మహమ్మద్‌ గజనీకి వెళ్లాక ‘నవాపాషా’ ఇస్లాంను విడిచిపెట్టాడు. దీంతో గజనీ క్రీ.శ.1007లో నవాపాషాపై దండెత్తి, ఓడించి జీవితఖైదు విధించాడు.


 తర్వాత గజనీ దృష్టి హింద్‌ షాహీపై పడింది. ఆనందపాలుడు గజనీని ఎదుర్కొనేందుకు ఉజ్జయిని, గ్వాలియర్, కలంజర్, కనౌజ్, ఢిల్లీ పాలకులతో కలిసి ఒక సమాఖ్యను ఏర్పరిచాడు. క్రీ.శ. 1008లో మహమ్మద్‌ వీరందరిని ‘రోహింద్‌’ యుద్ధంలో ఓడించాడు. నాగర్‌కోట, నారాయణపూర్‌లను దోచుకున్నాడు. 


 క్రీ.శ. 1009లో నాగర్‌కోటను ఆక్రమించాడు.


 క్రీ.శ. 1010లో రెండోసారి ముల్తాన్‌పై దాడి చేశాడు.


 ఆనందపాలుడు తన రాజధానిని వైహిద్‌ నుంచి నందనంకు మార్చాడు. ఇతడి తర్వాత త్రిలోచనపాలుడు రాజయ్యాడు. ఇతడు బుందేల్‌ఖండ్‌ పాలకుడు చందేల వంశానికి చెందిన విద్యాధరుడితో కలిసి గజనీపై దండయాత్రలు సాగించాడు. గజనీ క్రీ.శ. 1014లో త్రిలోచనపాలుడ్ని ఓడించి, నందనాన్ని ఆక్రమించాడు. దీంతో హింద్‌ షాహీ వంశం అంతమైంది.


 క్రీ.శ. 1014లో గజనీ స్థానేశ్వరంపై దాడి చేశాడు. చక్రస్వామి దేవాలయాన్ని దోచుకుని, ధ్వంసం చేశాడు. క్రీ.శ. 1015, 1021లో కశ్మీర్‌పై దాడులు చేశాడు.


 క్రీ.శ. 1018లో కృష్ణుడి జన్మస్థలంగా పిలిచే మధుర నగరాన్ని ధ్వంసం చేశాడు. అక్కడి నంచి అపార సంపదను దోచుకున్నాడు.


 మధుర నుంచి గజనీ కనౌజ్‌ వైపు వెళ్లాడు. రాజ్యపాలుడ్ని ఓడించి, ఆ నగరాన్ని నాశనం చేసి, అపార సంపద దోచుకున్నాడు.


 బుందేల్‌ఖండ్‌ పాలకుడైన విద్యాధరుడుకి రాజ్యపాలకుడికి మధ్య వైరం ఉండేది. గజనీ కనౌజ్‌ను దోచుకున్నాక, విద్యాధరుడు రాజ్యపాలుడిపై దండెత్తి అతడ్ని చంపాడు. 


 మహమ్మద్‌ గజనీ విద్యాధరుడిపై దాడిచేసినా విజయం సాధించలేదు. గజనీ ఓడించలేకపోయిన ఏకైక రాజపుత్రుడు విద్యాధరుడే.


 క్రీ.శ. 1019లో గజనీ కలంజర్‌ పాలకుడు గోండు


రాజుపై దండెత్తి అపార సంపదను దోచుకున్నాడు. క్రీ.శ. 1021-22లో మళ్లీ దండెత్తగా సంధి చేసుకుని ధనం అప్పగించాడు.


 క్రీ.శ. 1026లో గుజరాత్‌లోని సోమనాథ్‌ దేవాలయంపై గజనీ దాడి చేశాడు. అన్హిల్‌వాడ పాలకుడైన సోలంకి వంశానికి చెందిన భీమదేవుడ్ని ఓడించి దేవాలయాన్ని దోచుకున్నారు. మళ్లీ క్రీ.శ.1027లో సింధ్‌లోని జాట్‌లను ఓడించి, సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకుని అపార ధనరాశులతో గజనీకి వెళ్లాడు. 


 గజనీ మహమ్మద్‌  క్రీ.శ.1030లో మరణించాడు.


గజనీ మహమ్మద్‌ ఘనత 


 ఇతడ్ని ప్రపంచ నాయకుల్లో ఒకడిగా చరిత్రకారులు పేర్కొన్నారు. 


 కేవలం దండయాత్రలే కాకుండా సాహిత్య, కళాపోషణకు ఇతడు ప్రాధాన్యం ఇచ్చాడు. 


 ఇతడు భారతదేశంలో తన శక్తినంతా విధ్వంసక చర్యలకే వినియోగించాడు. ఇక్కడ దోచుకున్న సంపదతో గజనీని ఎంతో అభివృద్ధి చేశాడు. 


 మహమ్మద్‌ తర్వాత ఖుస్రూ మాలిక్‌ చివరి రాజయ్యాడు. మొమిజోద్దీన్‌ మహమ్మద్‌-బీన్‌-సమ్‌ (షిహబుద్దీన్‌ మహమ్మద్‌ ఘోరీ) ఖుస్రూను వధించి రాజయ్యాడు.


క్రీ.శ. 1000లో భారతదేశంలోని రాజకీయ పరిస్థితులు


 గజనీ మహమ్మద్‌ భారతదేశంపై దండెత్తే నాటికి దేశం అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. 


 అరబ్‌ దేశానికి ముల్తాన్, హింద్‌ షాహీ సరిహద్దు రాజ్యాలు. ముల్తాన్‌ పాలకుడు ఫతేదావూద్‌. 


 షాహీ రాజ్యం పంజాబ్‌లో జీలం నది వరకు విస్తరించింది. దీని రాజధాని వైహిద్‌ లేదా ఉద్భందాపూర్‌. దీన్ని ఆనందపాలుడు పాలించేవాడు. ఇతడు రాజపుత్రుడు. 


 కశ్మీర్‌ సంగ్రామ రాజు అధీనంలో ఉండేది. కనౌజ్‌ను పార్థియన్‌ రాజు రాజ్యపాలుడు పాలించేవాడు.


 బెంగాల్‌ను పాల వంశానికి చెందిన మహిపాలుడు పాలించేవాడు. రాజస్థాన్‌లోని మాళ్వాకు భోజుడు రాజు. ఇతడి రాజధాని ఉజ్జయిని. 


 గుజరాత్‌ను సోలంకి వంశానికి చెందిన భీమదేవుడు పాలించేవాడు. ఇతడి రాజధాని అన్హిల్‌వాడ. 


 బుందేల్‌ఖండ్‌ చందేల వంశ రాజు విద్యాధరుడి అధీనంలో ఉండేది. 


 దక్షిణ భారతదేశాన్ని చోళ పాలకుడు రాజేంద్ర గంగైకొండ చోళుడు పాలించేవాడు. ఇతడి రాజధాని తంజావూరు. ఇతడు ఉత్తర భారతదేశంపై ఎక్కువగా దృష్టిసారించలేదు.


మహమ్మద్‌ గజనీ (క్రీ.శ. 978 - 1030) 


 సుబక్తజిన్‌ తర్వాత అతడి కుమారుడు మహమ్మద్‌ రాజయ్యాడు. 


 ఖలీఫా ఖాదిర్‌ బిలాబ్‌ ఇతడికి యామిన్‌ ఉద్దౌలా, అమన్‌ ఉల్‌మిల్లత్‌ అనే బిరుదులు ఇచ్చాడు. 


 మహమ్మద్‌ చేసిన దండయాత్రలన్నింటినీ అతడి ఆస్థాన చరిత్రకారుడు ‘ఉద్బి’ రికార్డు చేశాడు. ఇతడు భారతదేశంపై పవిత్ర యుద్ధం (జిహాద్‌) చేసి విగ్రహారాధనను నాశనం చేసి, అపార ధనాన్ని దోచుకున్నట్లు ఉద్బి పేర్కొన్నాడు. 


 మహమ్మద్‌ భారతదేశంపై 12 సార్లు 17 దండయాత్రలు చేసినట్లు ఉద్బి చెప్పగా, ఇతడు భారత్‌పై 17 యుద్ధాలు చేసినట్లు సర్‌ హెన్రీ ఎలియట్‌ తెలిపారు. 


 ఖలీఫా ఖాదిర్‌ ప్రోత్సాహంతో ఇతడు ఏటా భారతదేశంపై దండెత్తాడు.


దండయాత్ర ఫలితాలు


 హింద్‌ షాహీ వంశం పతనమైంది. పంజాబ్, ముల్తాన్‌ గజనీ రాజ్యభాగాలయ్యాయి. ప్రతీహార రాజ్యం కూడా కనుమరుగైంది.


 ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ నగరాలన్నీ నిర్వీర్యమయ్యాయి. పవిత్ర దేవాలయాలైన మధుర, కనౌజ్, సోమనాథ్, నాగర్‌కోట నాశనమయ్యాయి. దోచుకున్న సంపదనంతా మహమ్మద్‌ తన రాజ్య అభివృద్ధికి వెచ్చించాడు. అక్కడ అందమైన వనాలు, సమాధులు, కళాశాలలు, మసీదులు నిర్మించాడు. అల్‌బెరూనీ, ఉన్సూరి, పుక్రి, ఉద్బి, ఫిర్దౌసి లాంటి గొప్ప కవులు గజనీ ఆస్థానాన్ని ఆశ్రయించారు. ఫిర్దౌసి ‘షానామా’ అనే గ్రంథాన్ని రచించాడు. గజనీ సామ్రాజ్యం ఇరాక్, కాస్పియన్‌ సముద్రాల నుంచి గంగానది వరకు విస్తరించింది. 


 భారతదేశంలో తురుష్కుల రాజ్యస్థాపనకు గజనీ కారణమయ్యాడు. 


 ఇతడి దండయాత్రలన్నీ భారతదేశాన్ని దోచుకోవడమే లక్ష్యంగా జరిగాయి తప్ప సామ్రాజ్య స్థాపన దిశగా సాగలేదు. మత మార్పిడికి పాల్పడ్డాడు కానీ ఇస్లాం మతవ్యాప్తికి కృషి చేయలేదు. పంజాబ్, ముల్తాన్‌లను ఆక్రమించి తురుష్కుల పాలనకు నాంది పలికాడు.


 ఈ దాడుల తర్వాత కూడా భారతదేశ రాజులు సైనిక శక్తిని పెంచుకోలేదు.


 భారతదేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. భారతీయ శిల్పకళకు నష్టం వాటిల్లింది.


గజనీ రాజ్యం


 తురుష్కులు ఇస్లాంను స్వీకరించి, ఆ మత వ్యాప్తిని చేపట్టారు. 10వ శతాబ్దంలో ఖలీఫాల ప్రాబల్యం తగ్గాక, తురుష్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. 


 గజనీ కేంద్రంగా క్రీ.శ.962లో అలప్తజిన్‌ తురుష్క సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అతడి వారసుడు సుబక్తజిన్‌. 


 సుబక్తజిన్, హింద్‌ షాహీ రాజ్య పాలకుడు ఆనందపాలుడికి మధ్య వివాదాలు ఉండేవి. 


 సుబక్తజిన్‌ రాజపుత్రుల నుంచి పెషావర్‌ను ఆక్రమించుకున్నాడు. ఇతడికి ‘మిర్‌-ఉల్‌-అయాని’ అనే బిరుదు ఉంది.


రచయిత

డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 30-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌