• facebook
  • whatsapp
  • telegram

ప్రవచనాలు - తీర్మానాలు

 

పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌కు చెందిన 'విశ్లేషణా సామర్థ్యం' అనే విభాగంలో లాజికల్ రీజనింగ్‌కు సంబంధించిన 'ప్రవచనాలు-తీర్మానాలు' అనే అంశంపై ప్రశ్నలు అడుగుతారు.

ఈ అంశంలో భాగంగా కొన్ని ప్రవచనాలు (ప్రకటనలు) వాటికింద తీర్మానాలు ఇస్తారు. ప్రతి ప్రకటనలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల మధ్య నిర్ణీత సంబంధం ఉంటుంది. ఇందులో అభ్యర్థి మొదట ఇచ్చిన ప్రవచనాలను అర్థం చేసుకుని, వాటికి తగిన విధంగా వెన్‌చిత్రాలను నిర్మించి, ఆ చిత్రాలకు అనుగుణంగా 'తీర్మానాలు' అనుసరిస్తున్నాయో, లేదో గుర్తించాలి. ఇచ్చిన ప్రవచనాలను మొదటి తీర్మానం మాత్రమే అనుసరిస్తే సమాధానం (ఎ) గానూ, రెండో తీర్మానం మాత్రమే అనుసరిస్తే సమాధానం (బి) గానూ, రెండూ అనుసరిస్తే సమాధానం (సి) గానూ, రెండూ అనుసరించకపోతే సమాధానం (డి) గాను గుర్తించాలి. అయితే కొన్నిసార్లు ఈ ఆప్షన్‌లను మార్చి ప్రశ్నపత్రంలో అడగొచ్చు. కాబట్టి పై ఆప్షన్‌లను ప్రశ్నపత్రంలో జాగ్రత్తగా పరిశీలించి, సమాధానాలు గుర్తించాలి.

1. ప్రవచనాలు:
అన్ని గాజులూ ఎర్రటి వస్తువులు.
అన్ని ఎర్రటి వస్తువులూ పెన్సిళ్లు.
తీర్మానాలు:
1) అన్ని గాజులూ పెన్సిళ్లు.
2) కొన్ని పెన్సిళ్లు గాజులు.
సమాధానం: (సి)
వివరణ:  
 

ఇచ్చిన ప్రవచనాలను బట్టి పై వెన్ చిత్రాన్ని నిర్మించవచ్చు. ఈ వెన్ చిత్రం ఆధారంగా ఇచ్చిన రెండు తీర్మానాలు, ప్రవచనాలను అనుసరిస్తున్నాయి. గాజులన్నీ ఎర్రటి వస్తువులు అయినప్పుడు, ఆ ఎర్రటి వస్తువులన్నీ పెన్సిళ్లు అయినప్పుడు, గాజులన్నీ పెన్సిళ్లు అవుతాయి. గాజులన్నీ పెన్సిళ్లు అయినప్పుడు కొన్ని పెన్సిళ్లు తప్పకుండా గాజులు అవుతాయి. కాబట్టి సరైన సమాధానం (సి) అవుతుంది.

 

2. ప్రవచనాలు:
ఏ పేపరూ పెన్సిల్ కాదు.
కొన్ని పేపర్లు క్లిప్పులు.
తీర్మానాలు:
1) ఏ క్లిప్పూ పెన్సిల్ కాదు.
2) కొన్ని పెన్సిళ్లు పేపర్లు.
సమాధానం: (డి)
వివరణ: ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా వెన్‌చిత్రాన్ని కింది విధంగా రూపొందించవచ్చు.

పై వెన్‌చిత్రం ఆధారంగా తీర్మానాలు 1, 2 ఇచ్చిన ప్రవచనాలను అనుసరించవు. కాబట్టి సరైన సమాధానం (డి) అవుతుంది.

 

3. ప్రవచనాలు:
అన్ని పిల్లులూ కుక్కలు.
కొన్ని కుక్కలు ఎలుకలు.
తీర్మానాలు:
1) కొన్ని ఎలుకలు కుక్కలు.
2) కొన్ని కుక్కలు ఎలుకలు.
సమాధానం: (సి)
వివరణ: ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా రెండు రకాల వెన్‌చిత్రాలను రూపొందించవచ్చు.

పై వెన్‌చిత్రాల ఆధారంగా తీర్మానాలు 1, 2 ఇచ్చిన ప్రవచనాలను అనుసరిస్తున్నాయి. కాబట్టి సరైన సమాధానం (సి) అవుతుంది.

 

4. ప్రవచనాలు:
ఏ పువ్వూ మొక్క కాదు.
ఏ మొక్కా చెట్టు కాదు.
తీర్మానాలు:
1) ఏ చెట్టూ పువ్వు కాదు.
2) ఏ పువ్వూ చెట్టు కాదు.
సమాధానం: (డి)
వివరణ: ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా రెండు రకాల వెన్‌చిత్రాలను రూపొందించవచ్చు.

పై వెన్‌చిత్రాలను అనుసరించి, రెండు తీర్మానాలు ప్రవచానాలను అనుసరించవు. ఎందుకంటే తీర్మానాల్లో చెట్లు, పువ్వులకు మధ్య సంబంధాన్ని ప్రస్తావించలేదు. కాబట్టి సరైన సమాధానం (డి) అవుతుంది.

5. ప్రవచనాలు:
అన్ని తలుపులూ కిటికీలు.
కొన్ని కిటికీలు కుర్చీలు.
తీర్మానాలు:
1) అన్ని తలుపులూ కుర్చీలు.
2) కొన్ని కుర్చీలు తలుపులు.
సమాధానం: (బి)
వివరణ: ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా కింది వెన్ చిత్రాన్ని రూపొందించవచ్చు.

పై వెన్‌చిత్రం, తీర్మానం 1 ప్రకారం అన్ని తలుపులూ కుర్చీలు అనేది అసత్యం. తీర్మానం 2 ప్రకారం కొన్ని కుర్చీలు తలుపులు అనేది సత్యం. కాబట్టి సరైన సమాధానం (బి) అవుతుంది.

 

6. ప్రవచనాలు:
కొన్ని పిల్లులు పులులు.
అన్ని పులులూ సింహాలు.
తీర్మానాలు:
1) కొన్ని పిల్లులు సింహాలు.
2) కొన్ని సింహాలు పులులు.
సమాధానం: (ఎ)
వివరణ: ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా వెన్‌చిత్రాన్ని కింది విధంగా రూపొందించవచ్చు.

పై వెన్‌చిత్రం ఆధారంగా 'కొన్ని పిల్లులు సింహాలు' (తీర్మానం 1) అనే తీర్మానం ఇచ్చిన ప్రవచనాలను అనుసరిస్తోంది. రెండో తీర్మానం అనుసరించడం లేదు. కాబట్టి సరైన సమాధానం (ఎ) అవుతుంది.

 

7. ప్రవచనాలు:
ఏ శాస్త్రజ్ఞుడూ ఉపాధ్యాయడు కాదు.
కొంతమంది ఉపాధ్యాయులు పరిశోధకులు.
తీర్మానాలు:
1) కొంతమంది శాస్త్రజ్ఞులు పరిశోధకులు కారు.
2) కొంతమంది పరిశోధకులు శాస్త్రజ్ఞులు కారు.
సమాధానం: (బి)
వివరణ: ఇచ్చిన ప్రవచనాల నుంచి వెన్‌చిత్రాన్ని కింది విధంగా రూపొందించవచ్చు.

తీర్మానం-1 ఆధారంగా కొంతమంది శాస్త్రజ్ఞులు పరిశోధకులు కారు అనేది చెప్పలేం. కాబట్టి తీర్మానం-1 సరైంది కాదు. ఉపాధ్యాయుల్లో కొంతమంది పరిశోధకులు అని చెప్పారు. కాబట్టి కొంతమంది పరిశోధకులు శాస్త్రజ్ఞులు కారు అని చెప్పిన తీర్మానం-2 ప్రవచనాన్ని సంతృప్తి పరుస్తుంది. కాబట్టి సరైన సమాధానం (బి) అవుతుంది.

 

8. ప్రవచనాలు:
కొందరు గాయకులు చెట్లు.
కొన్ని మేకలు చెట్లు.
తీర్మానాలు:
1) కొందరు గాయకులు చెట్లు.
2) కొన్ని చెట్లు మేకలు.
సమాధానం: (బి)
వివరణ: ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా కింది వెన్‌చిత్రాన్ని నిర్మించవచ్చు.

పై వెన్‌చిత్రం నుంచి తీర్మానం 2 'కొన్ని చెట్లు మేకలు' సరైంది. కాబట్టి సమాధానం (బి) అవుతుంది.

 

9. ప్రవచనాలు:
అన్ని రేడియోలూ ఎలక్ట్రిక్ వస్తువులు.
అన్ని టేబుల్ దీపాలూ ఎలక్ట్రిక్ వస్తువులు.
తీర్మానాలు:
1) కొన్ని రేడియోలు టేబుల్ దీపాలు.
2) కొన్ని టేబుల్ దీపాలు రేడియోలు.
సమాధానం: (డి)
వివరణ: ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా కింది విధంగా వెన్‌చిత్రాలను నిర్మించవచ్చు.

వెన్‌చిత్రం (I) నుంచి తీర్మానాలు 1, 2 సరైనవి.
వెన్‌చిత్రం (II) నుంచి తీర్మానాలు 1, 2 సరైనవి కావు. కాబట్టి ఏ తీర్మానం సరైందికాదు. సమాధానం (డి) అవుతుంది.

 

10. ప్రవచనాలు:
కొన్ని కోళ్లు ఆవులు.
అన్ని ఆవులూ గుర్రాలు.
తీర్మానాలు:
1) కొన్ని గుర్రాలు కోళ్లు.
2) కొన్ని కోళ్లు గుర్రాలు.
సమాధానం: (సి)
వివరణ: ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా కింది విధంగా వెన్‌చిత్రాలను నిర్మించవచ్చు.

పై వెన్‌చిత్రాల ఆధారంగా తీర్మానం 1, 2 సరైనవి. కాబట్టి సమాధానం (సి) అవుతుంది.

 

మాదిరి ప్రశ్నలు


గమనిక: ఇచ్చిన ప్రవచనాలను మొదటి తీర్మానం మాత్రమే అనుసరిస్తే సమాధానం (ఎ) గానూ, రెండో తీర్మానం మాత్రమే అనుసరిస్తే సమాధానం (బి) గానూ, రెండూ అనుసరిస్తే సమాధానం (సి) గానూ, రెండూ అనుసరించకపోతే సమాధానం (డి)గా గుర్తించాలి.


1. ప్రవచనాలు:
కొందరు సైనికులు ధైర్యవంతులు.
కొందరు సైనికులు తెలివైనవారు.
తీర్మానాలు:
1) కొందరు సైనికులు ధైర్యవంతులు లేదా తెలివైనవారు.
2) కొందరు సైనికలు ధైర్యవంతులు గానీ తెలివైనవారు గానీ కాదు.
సమాధానం: (డి)

 

2. ప్రవచనాలు:
ఏ మ్యాగజీన్ టోపీ కాదు.
అన్ని టోపీలూ కెమెరాలు.
తీర్మానాలు:
1) ఏ కెమెరా మ్యాగజీన్ కాదు.
2) కొన్ని టోపీలు మ్యాగజీన్‌లు.
సమాధానం: (డి)

 

3. ప్రవచనాలు:
కొన్ని కాకులు చిరుతలు.
ఏ నక్కా కాకి కాదు.
తీర్మానాలు:
1) కొన్ని చిరుతలు కాకులు.
2) కొన్ని చిరుతలు నక్కలు కాదు.
సమాధానం: (బి)

 

4. ప్రవచనాలు:
కొన్ని పెన్నులు టేబుళ్లు.
ఏ టేబులూ కుర్చీ కాదు.
తీర్మానాలు:
1) కొన్ని టేబుళ్లు పెన్నులు.
2) ఏ పెన్నూ కుర్చీ కాదు.
సమాధానం: (ఎ)

 

5. ప్రవచనాలు:
అన్ని పక్షులూ కాకులు.
అన్ని చిలుకలూ పిచ్చుకలు.
తీర్మానాలు:
1) అన్ని పక్షులూ చిలుకలు.
2) అన్ని కాకులూ పిచ్చుకలు.
సమాధానం: (డి)

 

6. ప్రవచనాలు:
అన్ని గడియారాలూ పంకాలు.
కొన్ని పంకాలు గోడలు.
తీర్మానాలు:
1) కొన్ని గడియారాలు గోడలు.
2) కొన్ని గడియారాలు గోడలు కాదు.
సమాధానం: (సి)

Posted Date : 16-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌