• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ నదీ వ్యవస్థ

1. సింధు నది ఉపనదులు ఏవి?
ఎ) గిల్గిత్, షోక్              బి) ద్రాస్, హుంజ               సి) జీలం, సట్లెజ్              డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

 

2. ఏ నది గతంలో గంగానదికి ఉపనదిగా ఉండి, తర్వాత బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారింది?
జ: తీస్తా

 

3. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం దగ్గర వెలసిన పట్టణం ఏది?
జ: అలహాబాద్

 

4. యమునా నదికి అతి ముఖ్యమైన ఉపనది ఏది?
జ: టాన్స్

 

5. లాహోర్ పట్టణం ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది?
జ: రావి

 

6. భాక్రానంగల్ ప్రాజెక్ట్‌ను ఏ నదిపై నిర్మించారు?
జ: సట్లెజ్

 

7. కిందివాటిలో పగులు లోయలో ప్రవహించే నది?
ఎ) హుగ్లీ               బి) సోన్               సి) కేన్               డి) దామోదర్
జ: డి (దామోదర్)

 

8. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌ను టెన్నిస్ వ్యాలీ అథారిటీ ఆధారంగా నిర్మించారు. ఈ నది ఏ దేశంలో ఉంది?
జ: అమెరికా

 

9. గాంధీ సాగర్ డ్యాం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: మధ్యప్రదేశ్

 

10. ఏ నదికి కర్ణాలి అనే మారు పేరుంది?
జ: ఘాగ్రా

 

11. గంగానది మొత్తం పొడవు ఎంత?
జ: 2525 కి.మీ.

 

12. 'బెంగాల్ దుఃఖదాయిని' అని ఏ నదికి పేరు?
జ: దామోదర్

 

13. అతిపెద్ద నదీ దీవి 'మజూలి' ఏ రాష్ట్రంలో ఉంది?
జ: అసోం

 

14. తెహ్రీ డ్యాం ఏ నదిపై ఉంది?
జ: భాగీరథి

 

15. అయోధ్య పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?
జ: సరయూ

 

16. బనాస్ నది ఏ నదికి ఉపనది?
జ: చంబల్

 

17. సప్తకౌషికి అని ఏ దేనికి పేరు?
జ: కోసి

Posted Date : 24-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌